US Elections 2024
-
డెమోక్రాట్లకు విరాళాలు ఇవ్వండి: ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తాజాగా ఆయన ప్రత్యర్థి పార్టీ డెమోక్రట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు డెమొక్రాట్లకు విరాళాలు అందించాలని తన పార్టీ మద్దతుదారులను విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియాతో స్పందిస్తూ.. ఎన్నికల్ల నేపథ్యంలో డెమోక్రాట్ల తగినంత డబ్బు మిగిలి ఉండకపోవచ్చని అన్నారు. డెమోక్రటి పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ ప్రచారం 20 అమెకన్ మిలియన్ల అప్పులో ఉందని పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.‘‘2020 అధ్యక్ష ఎన్నికల్లో ధీటుగా పోరాడి, రికార్డు స్థాయిలో డబ్బును సేకరించిన డెమొక్రాట్ల వద్ద డబ్బు మిగలకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వారు అప్పు ఇచ్చినవారు, ఇతరులచే నలిగిపోతున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి( డెమోక్రాట్లు) సహాయం చేయడానికి మేం ఏం చేయగలమో ఆలోచన చేస్తున్నాం. ఒక పార్టీగా అవసరమైన ఐక్యత కోసం నేను డెమోక్రాట్లకు విరాళాలు ఇవ్వాలని కోరుతాను. ఇక.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మన పార్టీ డబ్బులో మాకు చాలా వరకూ మిగిలే ఉంది’’ అని అన్నారు.BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024 డెమోక్రటిక్ పార్టీని ప్రస్తుతం రుణం ఇచ్చినవారు, ఇతరులు ఒత్తిడి చేస్తున్నారని పొలిటికో కాలిఫోర్నియా బ్యూరో చీఫ్ క్రిస్టోఫర్ కాడెలాగో అన్నారు. ‘‘ కనీసం 20 అమెరికన్ మిలియన్ల డాలర్ల అప్పుతో కమలా హారిస్ ప్రచారం ముగిసింది. హారిస్ 1 అమెరికన్ బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. అయితే.. అక్టోబర్ 16 నాటికి బ్యాంక్‌లో 118 అమెరికన్ మిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు’’అని అన్నారు.మరోవైపు.. ఫెడరల్ ఎలక్షన్ కమీషన్ గణాంకాల ప్రకారం.. కమలా హారిస్ ప్రచారం కోసం 2.3 అమెరికన్ బిలియన్ల డాలర్లను సేకరించి 1.9 అమెరికన్ బిలియన్లను ఖర్చు చేశారు. డొనాల్డ్ ట్రంప్ 1.8 అమెరికన్ బిలియన్ డాలర్లను సేకరించగా.. 1.6 అమెరికన్ బిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు వెల్లడించింది.చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా.. -
ట్రంప్ పాలనలో మస్క్‌కు కీలక పాత్ర..!
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్ కూడా చేరినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.జెలెన్స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పేషీలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే -
ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట..! అధ్యక్షుడిగా ఎన్నికైనందునే..
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు అన్ని క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. వాషింగ్టన్ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్లైన్లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్‌పై కేసు విచారణ డెడ్లైన్లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్‌కు సంబంధించి హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్ కుమార్తె -
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్‌తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్‌గా సూజీ వైల్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్‌హౌస్‌లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు. ఎవరీ సూజీ వైల్స్?సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎ ఫ్ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్‌హౌస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది. రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్‌గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్‌మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్‌హౌస్‌కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: ముంచింది బైడెనే.. -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ట్రంప్ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్ ఆలయంలో పూజలు, సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్‌కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for himIn a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024 తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’
ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత దౌత్యం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి....ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్‌కు ఉందని భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి. ...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.చదవండి: Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా? -
ట్రంప్ గెలుపు.. స్పందించిన ఇరాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్.. కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా గతంలో పాటించిన తప్పుడు విధానాలను సమీక్షించే ఒక అవకాశంగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును చూస్తామని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై మీడియాతో మాట్లాడారు. ‘‘ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవీకాలంలో ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. గతంలో అమెరికా ప్రభుత్వాల విధానాలు మాకు చాలా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం.. గత ప్రభుత్వాల తప్పుడు విధానాలను సమీక్షించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఆ విధానాలను సరిదిద్దే అవకాశం ఇప్పడు రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’’ అని తెలిపారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌ను బుధవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించేందుకు ముందు ఇరాన్.. అమెరికా ఎన్నికలను అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. ‘‘యునైటెడ్ స్టేట్స్ , ఇరాన్ విధానాలు స్థిరంగా ఉన్నాయి.ఎవరు అమెరికాకు అధ్యక్షుడు అవుతారన్నది ముఖ్యం కాదు. ప్రజల జీవనోపాధిలో ఎలాంటి మార్పు రాకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ అన్నారు.ఇక.. ఇరాన్, అమెరికా 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ప్రత్యర్థులుగా మారాయి. ఇరుదేశాల మధ్య 2017 నుంచి 2021 వరకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ట్రంప్ ఏకపక్షంగా 2015 ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా.. బాగ్దాద్ విమానాశ్రయంపై వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ ఖాసేమ్ సులేమానిని హతమార్చింది. చదవండి: అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్ -
ట్రంప్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
అగ్రరాజ్యాధిపతిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో భారత్‌లోని కొన్ని ప్రముఖ నగరాల్లో పర్యటించారు. ఎక్కువగా మాంసాహారమే ఇష్టపడే ట్రంప్ మన దేశంలోని ప్రధాన నగరాల్లోని శాకాహార రెసిపీలను చాలా ఇష్టంగా ఆస్వాదించారు. ఆయన ఇష్టంగా తిన్న వంటకాలేంటో చూద్దామా..!.ట్రంప్ తన భారత పర్యటనలో గుజరాత్, ఢిల్లీ, ఆగ్రాతో సహా మూడు ముఖ్యమైన నగరాలను సందర్శించారు. కూరగాయలంటేనే ఇష్టపడని ట్రంప్ కాశ్మీరీ కెహ్వా, నారింజతో చేసే పన్నాకోటా, బ్రోకలి, మొక్కజొన్న సమోసా, ఖామన్, నిమ్మ కొత్తిమీరతో చేసిన షోర్బా, పాలక్ చాట్, సాల్మన్ టిక్కా, ఆలూ టిక్కీ, అంజీర్ మలై కోఫ్తా, మష్రూమ్ కర్రీ తదితరాలను ఆస్వాదించారు. అలాగే మేతి కుల్చా, నాన్, తందూరీ రోటీలను ట్రై చేశారు. ఇక నాన్‌వెజ్‌లో మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టంగా ఆరగించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే మన భారతీయ ఆతిథ్య సంప్రదాయానికి అనుగుణంగా భోజనం చివర్లో అందించే కాజు బర్ఫీ, హాజెల్‌నట్ యాపిల్, రబ్దీతో కూడిన మాల్పువా, ఫ్రూట్ సలాడ్స్‌ని కూడా ఇష్టంగా తిన్నారు ట్రంప్. ముఖ్యంగా మన దేశంలో యూఎస్ ప్రతినిధులకు తప్పనిసరిగా అందించే డార్జిలింగ్ టీ, ఇంగ్లీష్ టీ, లెమన్ టీ అస్సాం టీ వంటి వాటిని కూడా ఆస్వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాగైన మనదేశంలోని వంటకాలు ఎప్పుడు కూరగాయల వైపు చూడని వాళ్లని కూడా ఓ సారి తిని చూద్దాం అనేలా నోరూరిస్తాయి కదూ..!(చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
ట్రంప్ మా నాన్న.. తెరపైకి పాక్ యువతి
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024ఇది కూడా చదవండి: ‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. -
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమోఘ విజయం సాధించారు. యావత్ ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే కేంద్రీకృతమైన నేపధ్యంలో.. ట్రంప్ విజయం తరువాత అన్ని దేశాలు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నాయి. అలాగే ప్రపంచంలోని పలు వార్తా పత్రికలు ట్రంప్ విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. ‘డాన్ తిరిగొచ్చాడు’ అంటూ ఒక వార్తా పత్రిక పతాక శీర్షికన ట్రంప్ పునరాగమనాన్ని స్వాగతించింది. డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచమంతా ఆయన పునరాగమనానికి శుభాకాంక్షలు చెబుతోంది.అన్ని దేశాల్లోని వార్తాపత్రికల మొదటి పేజీల్లోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం పతాక శీర్షికన నిలిచింది.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.హనోయిలో వియత్నామీస్ వార్తాపత్రికలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందనలను ప్రచురించారు.మెల్బోర్న్ వార్తాపత్రికల మొదటి పేజీలోనూ నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంపై వార్త ప్రచురించారు.డొనాల్డ్ ట్రంప్ భారతీయ వార్తాపత్రికల మొదటి పేజీలలో చోటు దక్కించుకున్నారు.డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయానికి ప్రతిస్పందనలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా, అమెరికా ప్రజలు మరోసారి ట్రంప్‌కు పట్టంకట్టారు.అమెరికాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ మాయాజాలం ఫలించింది.ట్రంప్ చారిత్రాత్మక పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు -
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు! (ఫొటోలు)
-
US Vice President: వాన్స్ తెలుగువారి అల్లుడే!
నిడదవోలు/ఉయ్యూరు: అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నివడంపై వడ్లూరు వాస్తవ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. ఉష కారణంగా వడ్లూరు గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోందని గ్రామ మాజీ సర్పంచ్ పి.శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తంచేశారు. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోరి్నయాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. వాన్స్‌తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. రిపబ్లికన్ నేతకు భార్యగా ఉన్న ఉషా దశాబ్దకాలం క్రితం 2014లో డెమొక్రటిక్ పార్టీకి మద్దతు తెలపడం విశేషం. సాయిపురం వాసుల్లో ఆనందం వాన్స్ విజయం సాధించటంతో తెలుగు ప్రజల్లో సంబరం వెల్లివిరిసింది. ప్రత్యేకించి ఉషా పూరీ్వకుల మరో గ్రామమైన సాయిపురం వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం స్థానికులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఆయన భార్య ఉషకు ఏపీలోని వడ్లూరు గ్రామంతో అనుబంధం -
US Election2024: ఆరుగురు భారతీయుల విజయకేతనం
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. ప్రస్తుత కాంగ్రెస్‌లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా.. ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వర్జీనియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.అమీ బెరా.. డెమొక్రాట్ అభ్యర్థిగా కాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమీ బెరా విజయం సాధించారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్టీన్ బిష్ను ఆయన ఓడించారు. యూఎస్ ప్రతినిధుల సభలో ఆయన సీనియర్ భారతీయ అమెరికన్. 2012లో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించిన బెరా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహించారు. యూఎస్ ప్రతినిధుల సభకు చేరిన మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 1957లో కాలిఫోరి్నయా 29వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కాలు పెట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా దలీప్ సింగ్ సౌంద్ చరిత్ర సృష్టించిన 50 ఏళ్ల తరువాత అమీ బెరా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. మొదట స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. తరువాత పర్యాయాల్లో ఆధిక్యాన్ని కొనసాగించారు. థానేదార్ రెండోసారి.. మిషిగన్‌లోని పదమూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ రెండోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాను అందించిన సేవలు, శ్రామికులు, యూనియన్ల పక్షాన నిలబడటం, అబార్షన్ హక్కుల కోసం పోరాటం తన విజయానికి కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన యూనియన్లు, గ్రూపులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రాజ్యాంగ హక్కులకోసం తాను పోరాడతానని హామీ ఇచ్చారు. రోఖన్నా.. 2016 నుంచికాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ ప్రతినిధి రో ఖన్నా మూడోసారి ఎన్నికయ్యారు. డెమొక్రాట్లకు బలమైన పట్టున్న 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అనితా చెన్ను సునాయాసంగా ఓడించారు. 2016లో మైక్ హోండాను ఓడించి ఖన్నా తొలిసారి అమెరికా సభకు ఎన్నికయ్యారు. ఖన్నా హౌస్ ఆర్మ్డ్ సరీ్వసెస్ కమిటీలో, పర్యవేక్షణ, జవాబుదారీ కమిటీల్లో పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన సిలికాన్ వ్యాలీలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న డిస్ట్రిక్ట్.. 1990 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటగా ఉంది. ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రిక్‌పై దాదా పు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి విజయం సాధించారు. 2016లో తొలిసారి కాంగ్రెస్‌కు ఎన్నికైన ఆయన.. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న న్యాయవాది అయిన కృష్ణమూర్తి.. మాజీ డిప్యూటీ స్టేట్ కోశాధికారితో సహా రాష్ట్రం తరఫున అనేక పదవులు నిర్వహించారు. ప్రమీలా జయపాల్వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్ మరోసారి గెలుపొందారు. మలయాళీ అయిన జయపాల్ నాయర్ రిపబ్లికన్ అభ్యర్థి డాన్ అలెగ్జాండర్‌ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. జయపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్లామ్–డంక్ లిబరల్ సీటు. ఇది డెమొక్రాట్లకు బలమైన జిల్లా. గెలుపు అనంత రం ఎక్స్ వేదికగా మద్దతు దారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘వాషింగ్టన్ 7వ జిల్లా కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది. అందరితో కలిసి పురోగతి కోసం పనిచేయడానికి, అవకాశాల కోసం పోరాటం కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను. నాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వక కృతజ్ఞతలు’అని ఆమె పేర్కొన్నారు. సుహాస్ సుబ్రమణ్యం రికార్డు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం. ఇప్పటివరకు వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా ఉన్న సుబ్రమణ్యం.. వర్జీనియానుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. డెమొక్రటిక్‌లకు కంచుకోట అయిన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసి రిపబ్లికన్ పారీ్టకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించారు. ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లతో కూడిన కాంగ్రెస్‌లో ఆయన సమోసా కాకస్‌లో చేరారు. సుబ్రమణ్యం తండ్రిది బెంగళూరు. తండ్రిది చెన్నై. తాత మిలటరీలో పనిచేయడంతో తండ్రి ఎక్కువకాలం సికింద్రాబాద్‌లో గడిపారు. బెంగళూరులోని మెడికల్ కాలేజీలో చదువుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకుని 70వ దశకంలో అమెరికాకు వలస వచ్చారు. తమ కొడుకు యూఎస్ కాంగ్రెస్‌లో ఉంటారని ఊహించి ఉండదు. సుహాస్ భార్య మిరాండాది వర్జీనియా. ఇద్దరు కుమార్తెలు. ‘ఈ జిల్లాకు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా’ అని సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే ‘నా పేరెంట్స్ కొన్ని విలువలు నేర్పారు. నా భారతీయ మూలాలు కోల్పోకూడదన్నది అందులో ఒకటి. అందుకే వేసవిలో ఇండియాకు వెళ్తుంటా. ఇప్పటికీ అక్కడ నాకు కుటుంబం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించడం నాకు చాలా ముఖ్యం. నా నేపథ్యం, నా వారసత్వం గురించి గర్వంగా చెప్పుకుంటా’అని చెప్పే సుబ్రమణ్యం.. భారత్–అమెరికా మధ్య బలమైన బంధం ఉండాలని కోరుకుంటున్నారు. -
అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.వాషింగ్టన్లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్‌ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్‌ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్‌గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు. 2005లో ఇరాక్‌లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్‌గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్‌కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్‌ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్‌కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్‌కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్‌్క, డేవిడ్ ఓ సాక్స్‌లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్‌కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
ట్రంప్ విజయంపై కమలా హారిస్, జోబైడెన్ తొలి స్పందన..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించారు.డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్ల తొలి ప్రకటనలు మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్ పేర్కొన్నారు.అధికార మార్పిడిలో ట్రంప్‌కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఒక ప్రకటనలో కమలా హారిస్ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్‌గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్‌ను కలుసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్‌పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్‌ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్‌గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్‌ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్‌్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్‌్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్‌కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్‌లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్‌ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్‌్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్‌ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్‌ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్‌కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్‌ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు.