వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు అన్ని క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.
వాషింగ్టన్ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్‌లైన్‌లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్‌పై కేసు విచారణ డెడ్‌లైన్‌లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్‌కు సంబంధించి హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్ కుమార్తె
Comments
Please login to add a commentAdd a comment