Criminal Cases
-
నిర్ణయాధికారం పార్లమెంట్‌దే
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని పేర్కొంది. దీనితో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. రాజకీయ నేతలు ఏవైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపితమైతే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారిపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులపై జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆరేళ్లపాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. అయితే, దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా? లేక ఆరేళ్లపాటు నిషేధం విధించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్‌కే ఉందని వెల్లడించింది. -
79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు పార్టిల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో 555 మందికి(79.39 శాతం) కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికే డిపాజిట్లు దక్కాయి. మిగతా వారంతా తెల్లమొహం వేయాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్(యునైటెడ్), లోక్‌జనశక్తి పార్టి(రామ్‌విలాస్) అభ్యర్థులంతా డిపాజిట్లు నిలబెట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఒక్కచోటే డిపాజిట్ దక్కింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద రూ.10,000 డిపాజిట్ చేయాలి. దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోలై చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో అభ్యరి్థకి ఆరింట ఒక వంతు ఓట్లు లభిస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. లేకపోతే డిపాజిట్ కోల్పోయినట్లే. అంటే ప్రతి ఆరు ఓట్లలో కనీసం ఒక్క చోటు వచ్చి ఉండాలి. 10 శాతం తగ్గిన ఆప్ ఓట్ల శాతం దేశ రాజధానిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. పదేళ్లలో 13 శాతం పెరగడం విశేషం. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 10 శాతం పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గగా, ఆప్ పరాజయం పాలైంది. కానీ, రెండు పార్టిలు సాధించిన ఓట్ల మధ్య తేడా కేవలం 2 శాతమే. ఈసారి పోలైన మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 45.56 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ బలం కూడా స్వల్పంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 6.34 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. అంటే కాంగ్రెస్ ఓట్లు 2 శాతానికి పైగానే పెరిగాయి. నేర చరితులు 31 మంది దేశ రాజధాని ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది, 44% మంది నేర చరితులున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్రమైన అభియోగాలున్నా యి. 2020 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో నేర చరితులు 43 మంది, అంటే 61% మంది కాగా వీరిలో తీవ్రమైన నేరారోపణలున్న వా రు 37 మంది. ఈ సంఖ్య తాజా అసెంబ్లీ ఎ న్నికల్లో తగ్గింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్), ఢిల్లీ ఎ లక్షన్ వాచ్ సంస్థలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అఫిడవిట్లను విశ్లేషించి ఆదివారం ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన 48 మందిలో 16 మంది అంటే 33% మందిపై క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన 22 మందిలో 15 మంది, 68% నేరచరితులున్నారు. మరోవైపు మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు బిలియనీర్లు కాగా షాకుర్బస్తీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన కర్నయిల్ సింగ్ రూ.259 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో రూ.248 కోట్లతో రాజౌరి గార్డెన్స్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా, రూ.115 కోట్లతో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు. అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ రూ.74 కోట్లతో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొత్తం 70 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,542 కోట్లుగా ఉంది. వీరిలో 45 మంది, 64% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, 23 మంది, 33% మంది 5వ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేగాక 41– 60 ఏళ్ల మధ్య వయసు్కలైన ఎమ్మెల్యేలు 47 మంది (67% కాగా 14 మంది అంటే 20% మంది వయస్సు 61– 80 ఏళ్ల మధ్య ఉంది. రాజిందర్ నగర్ నుంచి గెలిచిన 31 ఏళ్ల ఉమంగ్ బజాజ్ పిన్న వయసు్కడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అదేవిధంగా, సిట్టింగుల్లో 22 మంది మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. 38 శాతం మంది పట్టభద్రులు ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్నికయ్యారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఈ సంస్ధ ఇందుకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. మొత్తం 70 మంది శాసనసభ్యులకుగాను ఈ దఫా కేవలం ఐదుగురు మాత్రమే, అంటే 7 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపింది. వీరిలో నలుగురు బీజేపీ నుంచి, ఒకే ఒక్కరు ఆతిశీ ఆప్ నుంచి గెలిచారంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో 8 మంది మహిళలు ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేసింది. అదేవిధంగా, గత అసెంబ్లీలో 34 శాతం మంది పట్టభద్రులుండగా ఈసారి వీరి సంఖ్య 38 శాతానికి పెరిగింది. పీజీ, అంతకంటే ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య 26 శాతంగానే ఉందని వివరించింది. కొత్త శాసనసభ్యుల్లో 61 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా పేర్కొన్నారంది. గత అసెంబ్లీలో 29% మంది వ్యాపారాన్ని వృత్తిగా పేర్కొనగా ఈ దఫా వీరి సంఖ్య ఏకంగా 49 శాతానికి పెరిగిందనిఆ నివేదిక తెలిపింది. సభ్యుల సరాసరి వయస్సు 52 ఏళ్లుగా పేర్కొంది. కొత్త ఎమ్మెల్యేల్లో 25–40 ఏళ్ల మధ్య ఉన్న వారు 13% కాగా, గత అసెంబ్లీలో వీరు 23 శాతంగా ఉన్నారని విశ్లేషించింది. 70 ఏళ్లు పైబడిన వారి వాటా 4శాతమని తెలిపింది. -
తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టులో 18 లక్షలకుపైగా క్రిమినల్ కేసులు పోగుబడటంతో ఆ కేసుల కొండ కరిగించేందుకు హైకోర్టులకు సుప్రీంకోర్టు అదనపు అధికారాలిచ్చింది. సొంతంగా తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులను నియమించుకునేందుకు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు లేదా మూడేళ్ల కాలానికి జడ్జీల నియామకానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుల్లో ఇలా అదనపు జడ్జీల నియాకంపై 2021 ఏప్రిల్ 20వ తేదీన విధించిన షరతుల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘‘హైకోర్టుల వారీగా ఆ కోర్టులో అనుమ తించిన సామర్థ్యంలో 10 శాతానికి మించి తా త్కాలిక జడ్జీలను తీసుకోవద్దు. ఇద్దరు లేదా ఐదుగురు జడ్జీలను తీసుకోండి. సిట్టింగ్ జడ్జి సూ చించిన ధర్మాసనంలో కొత్త జడ్జీలు కూర్చోవాలి. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వినాలి. డివిజన్ బెంచ్‌లో భాగ స్వాములుగా ఉన్నాసరే శాశ్వత జడ్జీలతోపాటు కాకుండా విడిగా కూర్చుని కేసులను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. షరతులను విధిస్తూ గతంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ఏ బోబ్డే ఆ తీర్పు చెప్పారు. రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలను కేవలం ఒక్కసారి మాత్రమే రెండు లేదా మూడేళ్ల కాలానికి తాత్కాలిక జడ్జీగా నియమించుకోవచ్చని ఆయన తీర్పు చెప్పడం తెల్సిందే. నేషనల్ జుడీషియల్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హైకోర్టులో 62 లక్షల కుపైగా కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం గతంలో హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్లను అవసరమైతే తిరిగి తాత్కాలిక జడ్జీలుగా నియమించవచ్చు. అయితే ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం అత్యంత అరుదుగా వినియోగించుకుందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?న్యాయ సంస్థల గురించిషికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు. -
బిగ్‌బాస్ ఫైనల్‌కు భారీ భద్రత
బంజారాహిల్స్: ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడగా అప్పటి బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటుచేయాలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ పాయింట్లను బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. వారంక్రితం యూసుఫ్‌గూడ స్టేడియంలో జరిగిన పుష్ప–2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా నిర్వాహకులు 60 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో 15 మొబైల్ ఫోన్లు, రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. చోరులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ సందర్భంగా కూడా చుట్టూ 53 కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. -
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్‌లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్‌కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్‌ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్‌ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్‌కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్‌ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
మూసీ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్‌లోని న్యూ మారుతీనగర్వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది. అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్‌కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు సూచనలివీ... – ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి. – మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. – పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలి. – మూసీలోని ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్‌లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్‌లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి. – మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు. – సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. – తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు… హామీలు ఎగ్గొట్టే ప్రయత్నాలు
-
ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట..! అధ్యక్షుడిగా ఎన్నికైనందునే..
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు అన్ని క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. వాషింగ్టన్ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్లైన్లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్‌పై కేసు విచారణ డెడ్లైన్లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్‌కు సంబంధించి హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్ కుమార్తె -
క్రిమినల్ కేసులున్నా.. టీటీడీ బోర్డులో చోటా!?
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను బోర్డులో నియమించారని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్లోనే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.ఎస్సీ, ఎస్టీలపై దాడులు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీలమైన రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడం, మైనార్టీలపై దాడులకు తెగబడటం.. ఇలా నిత్యం వివాదాలు, అరాచకాలతో ఎదిగిన మల్లెల రాజశేఖర్‌ను అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. రాజశేఖర్ వరుసగా నేరాలకు పాల్పడుతున్నారని, అతని వైఖరిలో మార్పులేనందున అతనిపై రౌడీషీటు తెరవాలని ఓర్వకల్లు ఎస్ఐ డీఎస్పీకి సిఫార్సు చేశారు. దీంతో గత ప్రభుత్వంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు.మల్లెల రాజశేఖర్‌పై ఉన్న ముఖ్యమైన కేసులు..1 హుస్సేనాపురంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో పాటు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ఓర్వకల్లు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.2 హుస్సేనాపురంలోనే గడివేముల బస్టాండ్ సమీపంలో 15–3–2014న రాళ్లు, కట్టెలతో కొందరిపై దాడిచేసి చంపేందుకు తెగబడ్డారు.3 2019 మార్చి 4వ తేది మహాశివరాత్రి అర్థరాత్రి సమయంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.4 2019 సార్వత్రిక ఎన్నికల వేళ మల్లెల రాజశేఖర్, అతని అనుచరులు స్థానిక సమస్యలను లేవనెత్తిన దళితుల ముఖంపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.5 గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో మల్లెల రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడిచేసి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. దీంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.బ్రాహ్మణులకు చోటులేకపోవడం అన్యాయంమల్లెల రాజశేఖర్‌పై మాత్రమే కాదు.. టీటీడీ బోర్డులోని సభ్యులలో చాలామందికి నేరచరిత్ర ఉంది. ప్రతీ ఆలయంలో ఇద్దరు బ్రాహ్మణులను బోర్డులో నియమిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, టీటీడీ బోర్డులో ఒక్క బ్రాహ్మణుడు లేకపోవడం అన్యాయం. ఇది బ్రాహ్మణులను కించపరచడమే. నేరస్తులను బోర్డులో నియమించడం హిందువులను అవమానించడమే. – మనోహర్‌రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు -
ట్రంప్ అధ్యక్షుడైతే.. మరి కేసుల సంగతి!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎందుకంటే.. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ట్రంప్‌కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్ దొరికితే.. ఆయనపై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్ ట్రంప్ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!. -
కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు
-
విమర్శలు చేస్తే.. క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు. ఈ సందర్భంగా.. ‘‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.జర్నలిస్టులు రాసిన ప్రచురించిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి.. సదరు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని సుప్రీం సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని పేర్కొంది. సాధారణ పరిపాలనలోని కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ మంజూరు చేసింది.చదవండి: బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి -
ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం
ముంగేర్: బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్‌లో పంకజ్ యాదవ్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్‌యాదవ్ కింద పడిపోయారు. స్థానికులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్‌యాదవ్ ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అన్నిప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ముంగేర్ ఘటన బాధాకరమని, దోషులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత -
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్‌మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్‌కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్‌భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్‌ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
KIMS చైర్మన్ పై క్రిమినల్ కేసు
-
వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..
సెంకడ్హ్యాండ్లో వెహికిల్ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్ఎస్) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్‌చేసి ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి.తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. వెహికిల్ టైప్ ఎలాంటిదో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్ఓసీ వస్తుంది.ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..? -
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు కొత్త టెన్షన్!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉచ్చు బిగుస్తోంది. షేక్ హసీనాను తమ దేశం రప్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఆమె వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. తాజాగా షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది.కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల కారణంగా షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పట్లో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆమెను తిరిగి బంగ్లాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు తాత్కాలిక ప్రభుత్వం సైతం ఇదే పనిలో బిజీగా ఉంది. అయితే, హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.ఇక, హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి. దీంతో, నేరాలు, కేసుల విషయంలో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు.. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ కామెంట్స్ కూడా చేశాడు.ఇది కూడా చదవండి: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌పై మరో కేసు -
సిన్వర్‌పై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.చర్చలకు విఘాతం! అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు. -
ఇదెక్కడి బుల్డోజర్ న్యాయం?
సాక్షి, న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన∙అతడి ఇల్లు కూల్చేస్తారా? అని నిలదీసింది. పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్ న్యాయం సరికాదని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ‘నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతన్ని దోషిగా న్యాయస్థానం తేలి్చనా.. ఇల్లు కూల్చడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పలు రాష్ట్రాల్లో ఇళ్ల కూలి్చవేతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనా«థన్ల ధర్మాసనం విచారించింది. ‘‘ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఇల్లు ఎందుకు కూల్చివేయాలి. దోషి అయినప్పటికీ ఇల్లు కూలి్చవేయలేం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను కోర్టు రక్షించదని, అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు అందజేయాలని ఇరుపక్షాలను ధర్మాసనం కోరింది. ఆయా ప్రతిపాదనలు సీనియర్ న్యాయవాది నచికేత జోషికి సమరి్పంచాలని, వాటిని క్రోడీకరించి కోర్టుకు అందజేయాలని సూచించింది. నిందితుల స్థిరాస్తుల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపింది. రోడ్లను ఆక్రమిస్తే గుడులైనా వదలం.. ఏదైనా నేరంలో ప్రమేయం ఉన్నంత మాత్రాన.. అతని స్థిరాస్తి కూల్చివేతకు అది భూమిక కాబోదని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. మున్సిపల్ నిబంధనలను లేదా అక్కడి ప్రాధికార సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తేనే.. కూలి్చవేతలు ఉంటాయని అందులో స్పష్టం చేశామని యూపీ తరఫున హాజరైన మెహతా తెలిపారు. యజమాని క్రిమినల్ కేసుల్లో నిందితుడనే కారణంతో ఏ స్థిరాస్తిని కూలి్చవేయబోమన్నారు. ‘మీరు ఇదే వాదనకు కట్టుబడి ఉన్నామంటే.. మేము దీన్ని రికార్డు చేసుకుంటాం. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేస్తాం. రహదారులపై ఎలాంటి ఆక్రమ నిర్మాణాన్ని, ఆక్రమణలనూ మేము రక్షించబోవడం లేదు. రహదారులపై గుడులున్నా వదిలిపెట్టబోం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘కూ లి్చవేతలు చట్టానికి లోబడి ఉండాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి జరగడమే చూస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది. -
నిందితుల ఇళ్లు కూల్చడమేంటి? : సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.ఢిల్లీ జహంగీర్‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది. -
అధికారులపై కేసులు షురూ!
సాక్షి, హైదరాబాద్: నాలాలు, చెరువుల్లో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువు, ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో ఆరుగురు అధికారులపై కమిషనర్ కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తుల నష్టం, నివారణ చట్టం (పీపీపీఏ)–1984, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.పోలీసుశాఖ తరహాలో హైడ్రా విశ్లేషణ..హైడ్రా ఒకవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూలుస్తూనే.. మరోవైపు ఆయా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీసు శాఖ తరహాలో సమగ్ర పరిశీలన చేపట్టింది. దరఖాస్తు దశ నుంచి అనుమతుల వరకు నిర్మాణదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను క్షుణ్నంగా పరిశీలించింది. నిర్మాణదారులతో కుమ్మక్కైన అధికారులు సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకుంటున్నట్టు గుర్తించింది. కొన్ని విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగులు అభ్యంతరం తెలిపినా కొందరు పైస్థాయి అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు తేల్చింది. సదరు అధికారుల పేర్లు, వివరాలు, తప్పిదాలకు ఆధారాలను, సాంకేతిక అంశాలను సేకరించాక.. బాధ్యులపై సంబంధిత పోలీసు కమిషనర్లకు ఫిర్యాదు చేస్తోంది.అధికారుల అరెస్టులు ఉంటాయా?ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదైన అధికారులను అరెస్టు చేస్తారా? లేదా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ తరహా కేసులలో అరెస్టుల విషయంలో.. సంబంధిత విచారణాధికారి (ఐఓ)దే అంతిమ నిర్ణయమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. నిందితులు విచారణకు రాకుండా తప్పుంచుకుంటారని, పరారవుతారని, అజ్ఞాతంలోకి వెళ్లిపోవచ్చని విచారణాధికారి భావిస్తే.. సెక్షన్ 409 కింద అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తారని తెలిపారు. లేకపోతే అధికారులకు నోటీసులు జారీ చేసి, విచారణ కొనసాగిస్తుంటారని వివరించారు.త్వరలో మరికొందరిపైనా కేసులుహైడ్రా దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో.. త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చిట్టా బయటకొస్తుందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే మరికొందరు అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటివరకు 10 వేల మంది ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యా యి.గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని సీనియర్ ఇంజనీర్లపైనా హైడ్రా విచారణ జరపనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఒక ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయగా.. మరికొందరిపై చర్యలు ఉంటాయని సమాచారం. మరోవైపు గండిపేట జలాశయం సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యల కోసం హైడ్రా సంబంధిత విభాగానికి సిఫార్సు చేసింది. కేసులు నమోదైన అధికారులు వీళ్లే..» రామకృష్ణారావు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్» సుధాంశు, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్» పూల్ సింగ్ చౌహాన్, బాచుపల్లి ఎమ్మార్వో» శ్రీనివాసులు, మేడ్చల్–మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ » సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్» రాజ్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ -
మోస్ట్ వాంటెడ్ కిలాడీ మన ఎల్లో మీడియా ఆడపడుచు
-
మహిళలపై నేరం.. క్షమించరాని పాపం
జల్గావ్: మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల జోలికి రావొద్దని మృగాళ్లను హెచ్చరించారు. పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతాలో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు.మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం ‘లఖ్పతి దీదీ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది మహిళల కోసం రూ.2,500 కోట్ల రివాలి్వంగ్ ఫండ్ విడుదల చేశారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మోదీ ఇంకా ఏమన్నారంటే...మహిళల భద్రత అందరి బాధ్యత ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను కాపాడుకోవాలి. వారి భద్రత దేశానికి ప్రాధాన్యతాంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్లినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరీమణులు, తల్లులు పడుతున్న బాధలు, ఆవేదన నాకు తెలుసు. మహిళలపై నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించేవారిని సైతం విడిచిపెట్టొద్దు. అది ఆసుపత్రి గానీ, పాఠశాల గానీ, ప్రభుత్వ ఆఫీసు గానీ, పోలీసు స్టేషన్ గానీ.. ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మహిళల జీవితాలను, గౌరవాన్ని కాపాడడం మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం, ప్రభుత్వాల బాధ్యత.పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల రుణాలు గత పదేళ్ల పరిపాలనలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. పథకాలు అమలు చేశాం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 2014 వరకూ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పటి ప్రభుత్వాలు ఇచి్చన రుణాలు రూ.25,000 కోట్ల కంటే తక్కువే. కానీ, మేమొచ్చాక గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం. సఖి మండల్ కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. లఖ్పతి దీదీ పథకంతో మహిళల ఆదాయం పెరగడంతోపాటు భవిష్యత్తు తరాల సాధికారత సాధ్యమవుతుంది. మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.ఇందులో మహిళామణుల పాత్ర చాలా కీలకం. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యంతో దేశం ముందంజ వేస్తోంది. ప్రతి ఇంట్లో, పత్రి కుటుంబంలో సౌభాగ్యానికి మహిళలే గ్యారంటీ. కానీ, మహిళలకు సాయపడడానికి గ్యారంటీ ఇచ్చేవాళ్లు లేరు. మహిళల పేరిట ఆస్తులేవీ లేకపోతే వారికి బ్యాంకుల నుంచి రుణాలు రావడం కష్టమే. చిన్న వ్యాపారం చేసుకుందామన్నా రుణం దొరకడం లేదు. ఒక సోదరుడిగా, బిడ్డగా మహిళల కష్టాలను అర్థం చేసుకున్నా. వారి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా.రెండు నెలల్లో 11 లక్షల మంది లఖ్పతి దీదీలు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాం. మహిళల పేరిట జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. ముద్ర పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందుతున్నాయి. ఈ పథకంలో 70 శాతం మంది లబి్ధదారులు మహిళలే. ఈ పథకం వద్దని, రుణాలు తిరిగిరావని కొందరు వాదించారు. అయినప్పటికీ మహిళల పట్ల, వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తుండడం సంతోషం కలిగిస్తోంది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాం. 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఎన్నికల సమయంలో మాటిచ్చా.మహిళాస్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నవారంతా లక్షాధికారులైనట్లే. గత పదేళ్లలో కోటి మంది లఖ్పతి దీదీలను తయారు చేశాం. కేవలం రెండు నెలల్లో కొత్తగా 11 లక్షల మంది లఖ్పతి దీదీలు అయ్యారు. వీరిలో లక్ష మంది మహారాష్ట్ర మహిళలే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మహారాష్ట్ర ఒక షైనింగ్ స్టార్’’ అని మోదీ కొనియాడారు. -
17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరచరితులు!
సాక్షి, న్యూఢిల్లీ: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేరచరితులని, వీరిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 17 మంది నేరచరితులతో టీడీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశాయి. మనదేశంలో 755 మంది సిట్టింగ్ ఎంపీలు, 3,938 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపాయి. ఈ మేరకు దేశంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 ఎన్నికల అఫిడవిట్‌ల్లో 4,693ను విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశాయి.16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై కేసులు 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం మహిళలపై నేరాలను రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. రెండో స్థానంలో 21 మందితో ఆంధ్రప్రదేశ్ ఉంది. 17 మందితో ఒడిశా మూడో స్థానంలో నిలిచింది. కాగా తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఐదుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో మొత్తం 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 16 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు కాగా, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు..1) చింతమనేని ప్రభాకర్, దెందులూరు 2) చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట 3) చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం 4) నంద్యాల వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు 5) ఎస్.సవిత, పెనుకొండ 6) జి.భానుప్రకాశ్, నగరి 7) కందికుంట వెంకటప్రసాద్, కదిరి 8) బోనెల విజయచంద్ర, పార్వతీపురం 9) పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ 10) ప్రత్తిపాటి పుల్లారావు, చిలకలూరిపేట 11) కృష్ణచైతన్య రెడ్డి, కమలాపురం 12) తంగిరాల సౌమ్య, నందిగామ 13) సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి 14) వంగలపూడి అనిత, పాయకరావుపేట 15) బండారు సత్యానందరావు, కొత్తపేట 16) ఎం.ఎస్.రాజు, మడకశిర 17) బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 1) పంతం నానాజీ, కాకినాడ రూరల్ 2) కందుల దుర్గేశ్, నిడదవోలు -
కేసు ఉన్నా.. ఉద్యోగం తొలగించరాదు
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఓ ఉద్యోగిని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని.. దీనిని అధికారులు విస్మరించకూడదని గుర్తు చేసింది. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటం ఆ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఉద్యోగంలోంచి తీసేయాలంటే.. ముందుగా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం అధికారుల బాధ్యత అని తెలిపింది. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఉద్యోగం నుంచి తొలగించేంత భారీ శిక్ష విధించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి శిక్ష రద్దవుతుందని తేల్చి చెప్పింది. అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఏసీబీ కేసు నెపంతో నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఇదీ కేసుపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కె.ధనలక్ష్మి 1998లో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుకు ఆమెను ఎంపిక చేశారు. కాగా.. 2008 డిసెంబర్ 11న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 14న అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ ఆమె 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధనలక్ష్మిని అంగన్వాడీ వర్కర్‌గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ధనలక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీవ్రంగా స్పందించడంతో విధిలేని పరిస్థితుల్లో 2010లో ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. తమపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారన్న ఉద్దేశంతో అధికారులు ధనలక్ష్మిని ఏసీబీ కేసును సాకుగా చూపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2011లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు కావాలనే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఈ విషయం నిరూపణ కావడంతో 2016లో ఏసీబీ కోర్టు ధనలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి.. కేసు కొట్టేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ధనలక్ష్మిని నాలుగు వారాల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె అన్ని రకాల సర్వీసు ప్రయోజనాలకు అర్హురాలని, చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని సూచించారు. -
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
నేర చట్టాలు సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఈ) స్థానంలో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లోని వివిధ సెక్షన్ల కిందే దేశంలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి ఎఫ్ఐఆర్ చార్మినార్‌లో నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కొత్త చట్టాల్లోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.కొత్త రకాల నేరాలకు చోటు.. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యల గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పెళ్లి పేరుతో మహిళలను లోబరుచుకొని మోసగించడం, చిన్నారులపై సామూహిక అత్యాచారాలు, మూక దాడుల వంటి నేరాలకు ఐపీసీలో ప్రత్యేక సెక్షన్లు లేవు. ఆ లోటును భారతీయ న్యాయ సంహితలో భర్తీ చేశారు. సత్వర న్యాయం కోసం ప్రతి అంశంలో గడువు నిర్దేశిస్తూ బీఎన్ఎస్ఎస్లో 45 సెక్షన్లు చేర్చారు. అరెస్టు, తనిఖీ, సీజ్, దర్యాప్తులో పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి 20కిపైగా కొత్త సెక్షన్లు ప్రవేశపెట్టారు.కొత్త నేర చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్ల గురించి కుప్లంగా.. ఈ–ఎఫ్ఐఆర్సెక్షన్ 173 (1) బీఎన్ఎస్ఎస్ ప్రకారం.. నేరం జరిగిన చోటు నుంచే కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఈ–ఎఫ్ఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అది ప్రజల హక్కు. అనంతరం పోలీసుల నుంచి జాప్యం లేకుండా సెక్షన్ 173 (2) ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని పొందవచ్చు. సెక్షన్ 193 (3) (2) ప్రకారం 90 రోజుల్లోగా కేసు దర్యాప్తు పురోగతిని బాధితులకు విధిగా తెలియజేయాలి. మరణశిక్షే.. తప్పుడు హామీతో మహిళను లోబరుచుకొని లైంగిక అవసరాలు తీర్చుకుంటే సెక్షన్ 69 కింద కఠిన నేరంగా పరిగణిస్తారు. బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే సెక్షన్ 70 (2) ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 176 (1) ప్రకారం బాధితుల ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి తీసుకోవాలి. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సెక్షన్ 184 (1) ప్రకారం ఆమె అనుమతి తప్పనిసరి. సెక్షన్ 184 (6) కింద వారంలోగా వైద్య పరీక్షల నివేదికను సంబంధిత వైద్యుడు దర్యాప్తు అధికారి ద్వారా కోర్టుకు అందజేయాలి. డిజిటల్ రికార్డులు... ఎల్రక్టానిక్, డిజిటల్ రికార్డులను కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణిస్తారు. సెక్షన్ 2 (1) (డీ) ప్రకారం డాక్యుమెంట్ నిర్వచనాన్ని పొడిగించి అందులో వీటిని భాగం చేశారు. సెక్షన్ 61 కింద ఇతర డాక్యుమెంట్లతో సమానంగా డిజిటల్ డాక్యుమెంట్లను పరిగణిస్తారు. సెక్షన్ 62, 63 ప్రకారం కోర్టులో ఎల్రక్టానిక్ రికార్డులకు ఆమోదం ఉంటుంది. ఈ–బయాన్.. సెక్షన్ 530 కింద కోర్టుల్లో బాధితుల నుంచి ఎల్రక్టానిక్ స్టేట్మెంట్ తీసుకొనేందుకు అనుమతి. ఆన్లైన్ ద్వారా సాక్షులు, నిందితుల హాజరు.(బీఎస్ఏలోని సెక్షన్ 2 కూడా ఇదే అంశాన్ని చెబుతోంది) గడువు నిర్దేశం.. సెక్షన్ 251: తొలి విచారణ చేపట్టిన 60 రోజుల్లోగా అభియోగాలను నమోదు చేయాలి. సెక్షన్ 346: క్రిమినల్ కేసుల విచారణలో రెండు వాయిదాలకు మించి వేయడానికి వీలులేదు. సెక్షన్ 258: క్రిమినల్ కోర్టుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు వెల్లడించాలి.పర్యవేక్షణ.. సెక్షన్ 20: కేసుల విచారణ వేగవంతం, అప్పీల్ దాఖలుపై అభిప్రాయాలను జిల్లా డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షిస్తుంటాయి. అండర్ ట్రయల్స్ విడుదల... సెక్షన్ 479: నిందితులు చేసిన నేరంలో మూడింట ఒక వంతు జైలులో ఉంటే వారి విడుదలకు అనుమతి. అయితే వారికి అదే తొలి నేరమై ఉండాలి.తనిఖీల వీడియో రికార్డు.. సెక్షన్ 105: పోలీసులు తనిఖీలు, సీజ్‌లు చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ తప్పనిసరి. సెక్షన్ 35 (7): కేసులో మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉండి.. అనారోగ్యంతో బాధపడతున్నా లేదా 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి అరెస్టుకు డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 76: ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి. ఉగ్రవాదానికి నిర్వచనం.. బీఎన్ఎస్ సెక్షన్ 113: దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత, ఆర్థిక భద్రతకు ముప్పవాటిల్లే చర్యలు చేపడితే ఉగ్రవాదంగా పరిగణిస్తారు. ఆన్‌లైన్‌లోనూ సమన్లు.. నిందితులు లేదా ప్రతివాదులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ లాంటి ఎల్రక్టానిక్ మాధ్యమాల ద్వారా కూడా సమన్లు జారీ చేయొచ్చు. దీంతో తమకు సమన్లు అందలేదని వారు తప్పించుకొనే వీలుండదు. చైన్ స్నాచింగ్.. గతంలో చైన్ స్నాచింగ్ లాంటి వాటికి ప్రత్యేక శిక్షలు లేవు. భారతీయ న్యాయ సంహితలో స్నాచింగ్‌ను కూడా నేరంగా పేర్కొన్నారు. స్నాచింగ్‌కు పాల్పడిన వారిని నేరస్తులుగా గుర్తిస్తారు. దేశద్రోహం.. భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్పు చేశారు. కులం, మతంతో పాటు మరే ఇతర కారణంతోనైనా సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే యావజ్జీవ శిక్ష పడనుంది. -
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్‌బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్‌పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్‌తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్‌సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్‌ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్‌ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్‌పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్‌ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
తొలి రెండు విడతల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల మూడో విడతలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళలు 123 మందే (9 శాతం) ఉన్నారు. ఇక ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఇద్దరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) డేటా వెల్లడించింది. వీరిలో13 శాతం మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్ర కేసులున్నాయి. మొత్తం 38 మంది అభ్యర్థులు మహిళలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివసేన (ఉద్ధశ్) అభ్యర్థుల్లో ఏకంగా 80 శాతం, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థుల్లో 67 శాతం, ఎస్పీ అభ్యర్థుల్లో 50 శాతం, జేడీ(యూ)లో 33 శాతం, తృణమూల్ కాంగ్రెస్‌లో మందిపై క్రిమినల్ కేసులుండటం విశేషం! బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 26, ఆర్జేడీ నుంచి ముగ్గురిపై కేసులున్నాయి. అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులున్నప్పుడు ప్రకటించే రెడ్ అలర్ట్‌ను 43 నియోజకవర్గాల్లో జారీ చేశారు. మూడో వంతు కోటీశ్వరులే మొత్తం అభ్యర్థుల్లో 392 మంది కోటీశ్వరులేనని వారు దాఖలు చేసిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయి. దక్షిణ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవీ శ్రీనివాస్ డెంపో రూ.1,361 కోట్ల ఆస్తులతో టాప్‌లో ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్ గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా రూ.424 కోట్లు, మహారాష్ట్రలో కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఛత్రపతి సాహు మహారాజ్ రూ.342 కోట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. మూడో దశలో 82 మంది బీజేపీ అభ్యర్థుల్లో 77 మంది; 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లోనూ ఏకంగా 60 మంది కోటీశ్వరులే. జేడీ(యూ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఐదుగురు అభ్యర్థులు తమకెలాంటి ఆస్తులూ లేవని పేర్కొనడం విశేషం. సగం మంది ఇంటర్ లోపే అభ్యర్థుల్లో 639 మంది విద్యార్హత ఆరో తరగతి నుంచి ఇంటర్ లోపే! 19 మందైతే ఏమీ చదువుకోలేదు. 56 మంది ఐదో తరగతి లోపే చదివారు. 591 మందికి డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. 44 మంది డిప్లొమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
ఢిల్లీ: దేశంలో ఇప్పటికే రెండు దశల్లో ఓటింగ్ ప్రక్తియ పూర్తయింది. మే 7న మూడోదశ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెలలో జరగనున్న ఈ ఎన్నికల్లో 1352 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇందులో 9 శాతం మహిళా అభ్యర్థులు, మిగిలినవారు పురుష అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది.మే 7న మొత్తం 12 రాష్ట్రాల్లో 94 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇందులో పోటీ చేస్తున్న మొత్తం 1352 మంది అభ్యర్థులలో 244 లేదా 18 శాతం మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని 'అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR) ఇటీవల వెల్లడించిన డేటాలో పేర్కొంది.ఏడీఆర్ నివేదికలో వెల్లడైన 172 మంది అభ్యర్థులలో కూడా సుమారు 13 శాతం మందిపైన తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఏడుమంది దోషులుగా తేలారని, ఐదుగురు హత్యానేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 38 మంది అభ్యర్థులు మహిళలపై హింసకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 17 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగ కేసులు ఉన్నాయి. -
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పచ్చ పార్టీ దొంగలు...భలే కేసులురా బాబు...!
-
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్‌యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్‌కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్‌నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్‌పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్‌మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్‌పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్‌పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్‌కుమార్‌తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్‌కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్‌లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్‌లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం
-
పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు
-
పవన్ కల్యాణ్‌కు షాక్.. క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు డైరెక్షన్‌తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్‌బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, జూలై మూడో తేదీన ఏలూరులో జరిగిన వారాహియాత్రలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
రూ. 9675,67,35,596
సాక్షి, హైదరాబాద్: రూ. పదుల కోట్లు.. రూ. వందల కోట్లు కూడా కాదు... రూ. 9675,67,35,596! భాగ్యనగరంలో వైట్ కాలర్ కేటుగాళ్లు బాధితుల నుంచి ఈ ఏడాది కొల్లగొట్టిన సొమ్ము విలువ ఇది!! హైదరాబాద్ నగర పోలీసు విభాగం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023కుగాను విడుదల చేసిన వివిధ నేరాల వార్షిక నివేదికలో వైట్ కాలర్ నేరాల కేసులకు సంబంధించి ఈ ఆశ్చర్యకర గణాంకాలున్నాయి. బుధవారం వరకు నమోదైన కేసులు, లెక్కల ప్రకారం చూస్తే నేరాల్లో ప్రజలు కోల్పోయిన మొత్తం రూ. 9714,05,44,337గా ఉంది. ఇందులో వైట్ కాలర్ అఫెండర్స్‌గా పిలిచే మోసగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు స్వాహా చేసిన మొత్తం రూ. 9675,67,35,596 (99.6 శాతం)గా తేలింది. కారణాలు అనేకం... శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ... ఇదీ వైట్‌కాలర్ నేరగాళ్ల తీరు. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం అవసరం. టార్గెట్‌ను ఎంచుకోవడం, రెక్కీ చేయడం, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరంలో సఫలీకృతం అవుతాడనే నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో చేయడానికి ముందో, చేస్తూనో చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ విజయవంతంగా నేరం చేసినా కొల్లగొట్టే సొత్తు విలువ తక్కువే. దీంతో వైట్‌కాలర్ నేరగాళ్లు ఎదుటి వ్యక్తినో, వ్యక్తుల్నో లేదా సంస్థనో పక్కాగా నమ్మించి మోసగించే పంథాకు తెరతీస్తున్నారు. ఈ తరహా నేరాల్లో ‘ప్రతిఫలం’ రూ. కోట్లలో ఉంటుండటంతో వైట్‌కాలర్ నేరగాళ్లు ఓపక్క నేరుగా, మరోపక్క ఆన్లైన్ ద్వారా అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోయాయి. చిక్కడం అరుదే.... సైబర్ నేరాలతోపాటు కొన్ని రకాలైన మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, కొన్నిసార్లు స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు. రిజిస్టర్ అయినా సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు.. నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టులేక కొలిక్కిరావట్లేదు. సైబర్ నేరాల్లో 30 శాతం కూడా కేసులు నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో కూడా కొలిక్కి వస్తున్నవి 10 శాతానికి మించట్లేదు. శిక్షలు తక్కువే.. వైట్‌కాలర్ నేరాల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల సహకారం లభించట్లేదు. కేసు నమోదు, దర్యాప్తు పూర్తై కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. కోల్పోయిన మొత్తంలో 50–60 శాతం తిరిగి వస్తే చాలనే ధోరణితో ఉంటున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏటా జరుగుతున్న నేరాల్లో బాధితులు కోల్పోతున్న సొమ్ములో 95 శాతానికిపైగా మోసగాళ్ల వద్దకు చేరుతోంది. -
కేసుల్లేని మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలోని 12 మంది అమాత్యుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో తీవ్రమైన క్రిమినల్ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రుల అఫిడవిట్ల «ఆధారంగా వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్ సంస్థ శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. రేవంత్ తర్వాత ఉత్తమ్, పొన్నం పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎౖMð్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సీతక్క మినహా అందరూ కోటేశ్వరులే మంత్రివర్గంలోని సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఏడీఆర్ విశ్లేíÙంచిన 12 మంది మంత్రుల ఆస్తుల లెక్క చూస్తే.. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా....అప్పుల జాబితా లోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్‌లో ఉన్నారు. ఆస్తుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.30.04 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు. -
కొత్త ఎమ్మెల్యేల్లో 82 మందిపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 85 మందికి సీట్లు కేటాయించగా వారిలో 51 మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నా రు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన 79 మందిలో ఏడుగురు, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన 57 మందిలో 19 మంది, ఏఐఎంఐఎం కేటాయించిన ఐదుగురిలో నలుగురు గెలిచా రు. కాగా సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరా వుపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఈ సంస్థలు బుధవారం ఒక నివేదికను విడుదల చేశాయి. ఆస్తుల్లో అగ్రస్థానంలో వివేక్ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి గెలిచిన 119 మందిలో 114 (96%) మంది కోటీశ్వరులు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 60 (94%) మంది, బీఆర్ఎస్ నుంచి 38 (97%) మంది, బీజేపీ నుంచి 8 (100%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు (100%), సీపీఐకి చెందిన ఒకరు (100%) తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న ట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వివేకానంద్ (కాంగ్రెస్) తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి ప్రథమ స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రూ.433+ కోట్లతో పాలే రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.58+ కోట్లు, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తార క రామారావు రూ.53+ కోట్లు, సీఎల్పీ నాయకుడు, టీపీసీ సీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్ల ఆస్తులు ప్రకటించారు. రూ.24+ లక్షలతో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచా రు. రూ.28+ లక్షలతో దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్, రూ.56+లక్షలతో అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణలు తదుపరి స్థానా ల్లో ఉన్నారు. 2023లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 38.88 కోట్లు కాగా.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.15.71 కోట్లు కావడం గమనార్హం. అప్పుల్లో దానం టాప్ మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తమకు రూ. కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని ప్రకటించారు. రూ.49+ కోట్ల అప్పుతో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రథమ స్థానంలో నిలిచారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (రూ.43+ కోట్లు), చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ (రూ.41+ కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 96 మంది ఎమ్మెల్యేల వయసు 51 పైనే తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 23 (19%) మంది ఎమ్మెల్యేల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండగా, 96 మంది (81%) ఎమ్మెల్యేలు 51–80 సంవత్సరాల మధ్య వయస్సుతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేగా బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి (74) నిలిచారు. అత్యంత పిన్న వయస్కులైన ఎమ్మెల్యేలుగా పాలకుర్తి నుంచి గెలుపొందిన యశస్విని (26), మెదక్ నుంచి గెలిచిన మైనంపల్లి రోహిత్ (26) నిలిచారు. కాగా కొత్త అసెంబ్లీలో 109 మంది పురుషులు, 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. -
2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో హైకోర్టు లేదా దిగువ కోర్టులి2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన స్టేలు 6 నెలల తర్వాత ప్రత్యేకంగా పొడిగింపు ఆదేశాలివ్వకుంటే వాటంతటవే రద్దవుతాయంటూ 2018లో ఇ2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 ప్రకారం సంక్రమించిన అధికారాలను 2018 నాటి తీర్పుతో హైకోర్టులు కోల్పోయాయంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. అప్పటి తీర్పుపై సమీక్షను రాజ్యాంగధర్మాసనానికి అప్పగిస్తామని తెలిపింది. -
పెరిగిన నేర చరితులు!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నేర చరితులు పెరిగారు. నేర చరిత్ర, పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ రాజకీయ పార్టీలు అది పాటించక పోవడం గమనార్హం. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2018 ఎన్నికలలో 1,777 మంది అభ్యర్థులకు గాను 21 శాతం (368) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండగా, ఈ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారు 521 మంది ఉన్నారని ఏడీఆర్ వివరించింది. 353 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు (5 ఏళ్లు అంతకు మించి శిక్షపడే కేసులు) ఉండగా, ఈ సంఖ్య 2018లో 321గా ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారిపై పెండింగ్ కేసులు, విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, వయసులు, మహిళలు, పురుషుల సంఖ్య వంటి వివరాలతో నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాకేశ్ దుబ్బుడు, వై.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఎక్కువ.. అన్ని ప్రధాన పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు (14% నుంచి 72% వరకు) ఇచ్చాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 85 (72%) మంది, బీజేపీ నుంచి 79 (71%) మంది, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి 57 (48%) మంది, బీఎస్పీ నుంచి 40 (37%) మంది, సీపీఐ(ఎం) నుంచి 12 (63%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు (56%), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 10 (24%) మంది క్రిమినల్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. కోటీశ్వరులూ పెరిగారు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతంమంది కోటీశ్వరులు కాగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 41.48% ఉన్నారు. ఇక ముగ్గురుకు మించి అభ్యర్థులపై క్రిమినల్ కేసు లు ఉన్నట్లయితే అటువంటి నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా గుర్తించారు. 2018లో రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు 78 ఉండ గా, ప్రస్తుత (2023) ఎన్నికల్లో ఇవి 96కు పెరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే సీట్ల సంఖ్య పెరిగే అవ కాశం ఉంటుందని అంచనా వేసినా అది జరగ లేదు. అన్ని పార్టీల్లో కలిపి పోటీలో ఉన్న (2,290 మంది) అభ్యర్థుల్లో 10% మంది మా త్రమే మహిళా అభ్యర్థులు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలదే హవా ప్రదాన పార్టీలన్నీ సంపన్న అభ్యర్థులకే అత్యధికంగా సీట్లు కేటాయించాయి. 2,290 మంది అభ్యర్థులలో 580 (25%) మంది కోటీశ్వరులు ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన 114 (96%) మంది, కాంగ్రెస్‌కు చెందిన 111 (94%) మంది, బీజేపీకి చెందిన 93 (84%)మంది రూ. కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించారు. 25 మంది తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. అస్తుల్లో వివేక్ ఫస్ట్ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానంద్ తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి తొలి స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, రూ.433 కోట్లతో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ తన సంపద రూ.58+ కోట్లుగా, ఈటల, కేటీఆర్‌లు రూ.53+ కోట్లుగా, రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్లుగా ప్రకటించారు. కాగా, 979 (43%) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, 1,143 (50%) మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. -
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
నేరగాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేధ
న్యూఢిల్లీ: నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకుని డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలను సృష్టిస్తుండటంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికపరమైన నైపుణ్యాన్ని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్లో తనను కలుసుకున్న ఐపీఎస్–2022 బ్యాచ్ అధికారులనుద్దేశించి ఆమె మాట్లాడారు. సైబర్ నేరాలు, నేరాలు, డ్రగ్స్ మాఫియా, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి పలు సవాళ్లను పోలీసు బలగాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ‘నూతన సాంకేతిక, సోషల్ మీడియా ప్రభావంతో పరిస్థితుల్లో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకున్నారు. దీంతో, డీప్–ఫేక్ వంటి సమస్యలు నేడు మన ముందున్నాయి’అని ముర్ము చెప్పారు. నేరగాళ్లపై పైచేయి సాధించాలంటే పోలీసు అధికారులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. -
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్‌లు
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు(బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తిచేయడానికి కచి్చతమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమనల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి, హైకోర్టు వెబ్సైట్లో పొందుపర్చాలని తెలియజేసింది. తీవ్రమైన నేరాల విషయంలో విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలను పాల్పడినట్లు అభియోగాలు నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై విచారణ జరుపుతున్నామని స్ప ష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్‌కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ట్రంప్ అరెస్ట్.. మగ్‌షాట్‌తో చరిత్ర సృష్టించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్న నేపథ్యంలో స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. నిబంధనల ప్రకారం పోలీసులు ట్రంప్‌ను అరెస్ట చేసి జైలులోకి తీసుకెళ్లారు. ట్రంప్‌కు జైలు అధికారులు P01135809, ఖైదీ నెంబర్ కేటాయిచారు. పోలీసు రికార్డుల కోసం కెమెరా ముందు ఆయన ఫొటోను (మగ్‌షాట్) కూడా తీశారు. ఫుల్టన్ కౌంటీ రికార్డుల ప్రకారం ట్రంప్ ఎత్తు 6.3 అడుగులు. 97 కిలోల బరువు ఉన్నారు. ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 2లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను(భారత కరెన్సీ ప్రకారం రూ.1.65 కోట్లు) సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. ఆ వెంటనే బెయిల్ రావడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ఆయన జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు. చదవండి: ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా ఆ దేశంలో దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. ఇక అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్‌షాట్) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకు నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. https://t.co/MlIKklPSJT pic.twitter.com/Mcbf2xozsY — Donald J. Trump (@realDonaldTrump) August 25, 2023 కాగా తన మగ్ షాట్ ఫోటోను ట్రంంట్ ట్విటరల్లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.అయితే 2021 జనవరి 6వ తేదీన ట్రంప్‌ను ట్విటర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ యాజమాన్య పగ్గాలు ఎలాన్ మస్క్ తీసుకున్నా గత నవంబర్‌లో ట్రంప్‌పై బ్యాన్ తొలగించారు. కానీ ట్రంప్ ట్విటర్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. నేడు అరెస్టు తర్వాత తొలిసారి తన ఖాతాలో మగ్‌షాట్‌ను పోస్టు చేశారు.. ‘ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూ లొంగను..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్‌ను కేవలం 2గంటల్లో 4.2 కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల సార్లు రీట్వీట్ చేశారు. -
మార్పు కోసం మార్పా?
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు. ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్‌ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు. ఇక భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి. ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్ చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్ చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఏడాది జూన్‌లో న్యాయ కమిషన్ దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది. దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది. నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు. ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్ వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా? ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్ఎస్లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్ డిఫమేషన్ ను చేర్చడం. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్ చెప్పిన మాట నిజం! అభిషేక్ సింఘ్వీ వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
శారీరక బంధం నిరాకరణ నేరం కాదు
సాక్షి బెంగళూరు: వివాహం అనంతరం శారీరక సంబంధాన్ని నిరాకరించడం నేరం కాదని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం లైంగిక చర్యకు నిరాకరించడం క్రూరత్వంతో సమానమని తెలిపింది. శారీరక సంబంధం నిరాకరించిన ఘటనలో ఒక భర్తపై భార్య, ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై విచారించిన హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. శారీరక సంబంధాన్ని నిరాకరించడం ఐపీసీ సెక్షన్ 489ఏ కిందికి రాదని, అది నేరం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం–1961 సెక్షన్ 4 కింద దాఖలైన కేసులు, పోలీసు చార్జిషీట్‌ను వ్యతిరేకిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. ‘పిటిషనర్ ధార్మికుడు. అతని దృష్టిలో ప్రేమ అంటే శారీరక సంబంధం కాదు. అది ఆత్మల కలయిక. అందుకే భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించాడు’అని జడ్జి తెలిపారు. ఇలా శారీరక సంబంధం కలిగి ఉండకపోవడం హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 (1) (ఏ) కింద క్రూరమైన చర్య, అయితే ఐపీసీ 498 (ఏ) కింద నేరం కాదంటూ భర్త, అతని తల్లిదండ్రులపై పెట్టిన కేసులను కొట్టివేశారు. -
బ్లాక్మెయిల్ చేస్తున్న నలుగురు విలేకరులపై కేసు నమోదు
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి యజమానులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు విలేకరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ... శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలోని కమలాపురి కాలనీలో మనీష్ జైన్ అనే వ్యాపారి ప్లాట్ నెంబర్ 117లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నెల 4వ తేదీన తాము విలేకరులమంటూ నలుగురు వ్యక్తులు ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. తాము లోకల్ మీడియా రిపోర్టర్లమని పేర్కొంటూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఆకుల కిరణ్ గౌడ్, సోపాల శ్రీనివాస్, తడక విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్ తదితరులు రోజూ 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వీరిపై బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నిర్మిస్తున్న భవనంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ తన ఇంటి ఫొటోలు తీస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బిల్డింగ్ కూలి్చవేయిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. అయిదు సంవత్సరాల క్రితం కూడా ఈ నలుగురు విలేకరులు తమను డబ్బుల కోసం డిమాండ్ చేయడం జరిగిందని వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్లు ఆరోపించారు. బిల్డింగ్ కూలి్చవేయిస్తామని అప్పట్లోనే బెదిరించగా రూ. 12 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా మళ్లీ తనను డబ్బు ల కోసం బెదిరిస్తున్నాడని తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా మారిందని వీరి బారి నుంచి రక్షించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్, విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్‌లపై ఐపీసీ సెక్షన్ 447, 385, 386, 506 రెడ్‌విత్ 120(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాక్షులతో మాట్లాడొద్దు
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్‌కు తోడుగా ఆయన వెంట కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్‌కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్‌పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్ టాన్ బ్లాంచ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్ గూడ్‌మ్యాన్ ట్రంప్ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు. అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్ 14 బుధవారం ట్రంప్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
కొడంగల్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: అధికార బీఆర్ఎస్కు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరులపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఓ భూవిక్రయం విషయంలో ఎమ్మెల్యే, మరికొందరు తనపై భౌతిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా స్థలం కొని... బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి నాయుడు కాలనీకి చెందిన సామ ఇంద్రపాల్‌రెడ్డి అదే ప్రాంతంలో స్థలం కొనేందుకు 2018లో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు రాకేశ్‌రెడ్డి మధ్యవర్తులుగా ఆయనకు పరిచయమయ్యారు. వారు ఆయనకు ఉప్పర్‌పల్లిలోని భూయజమానులను పరిచయం చేశారు. స్థలం కొనుగోలుకు అంగీకరించిన ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు కమిషన్‌తో కలుపుకొని రూ. 3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భూయజమానులకు రూ. 90 లక్షలను అడ్వాన్స్ కింద చెల్లించడంతోపాటు రూ. 2.75 కోట్లకు ఖాళీ చెక్కులను ఎమ్మెల్యే వద్ద ష్యూరిటీగా ఉంచాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని యజమానులకు చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు రాకేశ్‌రెడ్డికి చెరో రూ. 20 లక్షల చొప్పున కమీషన్ చెల్లించాడు. అయినప్పటికీ వారు ఖాళీ చెక్కులను ఇవ్వకపోగా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయన రుణానికి ప్రయత్నించగా లభించలేదు. దీంతో నాటి నుంచి తరచూ వేధింపులకు గురిచేస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 2022 జూన్‌లో ఇంద్రపాల్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగొలా తప్పించుకున్న ఇంద్రపాల్‌రెడ్డి దీనిపై 2022 జూన్ 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీని కోరినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే, ఇతరులపై కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిలింనగర్లో జరగడంతో కేసును ఫిలింనగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. -
కేకు డబ్బులు అడిగాడని కాల్పులు!
బేకరీ నిర్వాహకుని హత్య అనంతరం స్థానికులతోపాటు ఇతర దుకాణదారులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మార్కెట్ మధ్యలో ఆందోళన చేపట్టారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన కారులు కోరారు. బీహార్‌లోని ఆరా ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు ఒక బేకరీ దుకాణదారుడిని తుపాకీతో కాల్చి హత్యచేశారు. కేకు కొనుగోలు చేసేందుకు వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే మృతుని కుటుంబసభ్యులతో పాటు స్థానికులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. బిహియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజా బాజార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ సింగ్ కుమారుడు మనోహర్ కుమార్ ఉరఫ్ మిన్చీ(35) తన ఇంటిలో బేకర్స్ కింగ్ అనే దుకాణాన్ని నడుపుతున్నాడు. మృతుని తండ్రి అశుతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో దుకాణానికి ముగ్గురు వినియోగదారుల వచ్చి కేకు అడిగారు. దీంతో మనోహర్ వారికి కేకు అందించి, డబ్బులు అడిగాడు. వెంటనే వారు తుపాకీతో తన కుమారునిపై కాల్పులు జరిపారన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఇంటిలోనివారంతా దుకాణంలోనికి వచ్చి చూశారు. అయితే ఇంతలోనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మనోహర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడని పరిశీలించి మృతి చెందాడని నిర్థారించారు. కాగా మృతునికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ శతృవులెవరూ లేరని అశుతోష్ తెలిపారు. ఈ సందర్భంగా భోజ్‌పుర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటమన్నారు. చదవండి: విచిత్రంగా ప్రవర్తిస్తున్న రైలు ప్రమాద బాధితులు -
ట్రంప్‌పై నేరాభియోగాలు
మియామి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒక మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ జ్యూరీ నేరుగా అభియోగాలు నమోదు చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కేసులో 13 తేదీ మంగళవారం మియామి కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఒక మాజీ అధ్యక్షుడికి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశం ఎంతగా దిగజారిపోతున్నా, అందరం కలిసి అమెరికా గ్రేట్ ఎగైన్ అని నిరూపిద్దామని తన అభిమానులకి పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ముందంజలో ఉన్న ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడం రాజకీయంగా ఆయనకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్‌కి ముడుపులు చెల్లించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ ఈ సారి ఏకంగా ఫెడరల్ జ్యూరీ అభియోగాలనే నేరుగా ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2021లో గద్దె దిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆర్కీవ్స్‌కు అప్పగించకుండా ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే రుజువైతే వందేళ్లు జైలు రహస్య పత్రాల కేసులో గూఢచర్య చట్టం కింద డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు అంశాల్లో అభియో గాలు నమోదయ్యాయి. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉంచుకోవడం, న్యాయ ప్రక్రియను అడ్డుకో వడానికి కుట్ర, నిజాయితీ లేకుండా డాక్యుమెంట్లను దాచిపెట్టడం, తన గుట్టు బయటపడకుండా పథక రచన, తప్పుడు ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఇవి రుజువైతే ట్రంప్‌కి గరిష్టంగా వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ అభియోగాలు ఎలాంటి అడ్డంకి కాకపోయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎంత మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. -
ఏ మి టీ రహస్య పత్రాల కేసు..?
అమెరికా అధ్యక్షుడు ఎవరైనా పదవి దిగిపోయిన వెంటనే తన అధీనంలో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంట్లు జాతీయ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ ఏజెన్సీ (ఎన్ఏఆర్ఏ)కి అప్పగించాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ రహస్య పత్రాలన్నీ జాతి సంపదగా భావిస్తారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైన కొద్ది నెలలకి అంటే 2021 మేలో ఎన్ఏఆర్ఏ ట్రంప్ రహస్య పత్రాలు పూర్తిగా ఇవ్వలేదని తొలిసారిగా బయటపెట్టింది. రెండు డజన్ల బాక్సుల్లో ఉండే పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై విచారణ మొదలై ట్రంప్ అధీనంలో ఉన్న రహస్య పత్రాలన్నీ ఆర్కీవ్స్‌కు ఇవ్వాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2021 జనవరిలో అధ్యక్షుడిగా గద్దె దిగిన ట్రంప్ వందలాది పత్రాలను తన అధీనంలోనే ఉంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్ తరఫు లాయర్లు మరో 30 పత్రాలు అందజేశారు. అంతకు మించి తమ దగ్గర ఏవీ లేవని స్పష్టం చేశారు. 2022 ఆగస్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగి ఫ్లోరిడాలోని ట్రంప్ ప్రైవేటు ఎస్టేట్ మార్ ఎ లాగోలో సోదాలు చేపడితే 15 బాక్సుల్లో 184 కీలక పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ పత్రాలు, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే తరహా రహస్య పత్రాల కేసులో ట్రంప్ హయాంలో ఉపాధ్య’క్షుడిగా వ్యవహరించిన మైక్ పెన్స్, అంతకు ముందు ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై కేసులు నమోదై ఉన్నాయి. వైట్ హౌస్ నుంచి అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే తీసుకువెళ్లారా ? గూఢచర్య చట్ట నిబంధనల్ని ట్రంప్ ఉల్లంఘించారా ? అన్న దిశగా ప్రాసిక్యూషన్ విచారణ సాగిస్తోంది.అయితే శ్వేతసౌధం ఖాళీ చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో హడావుడిగా తీసుకువెళ్లిన సామాన్లలో పత్రాలు కూడా వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో సమర్థించుకుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు ఇవే..! హష్ మనీ అగ్రరాజ్యం చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఒక మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ నోరు మూయించడానికి 1.30 లక్షల డాలర్లను ముట్టజెప్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా సొమ్ములు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ట్రంప్ మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 4న హాజరయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ముందే జో బైడెన్‌పై గెలుపు తనదేనంటూ ట్రంప్ ప్రచారం చేయడంపై విచారణ జరుగుతోంది. జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతూ జార్జియాలో జరిగిన రీకౌంట్‌లో తనకు అదనపు ఓట్లు లెక్కించాలంటూ మాట్లాడిన సంభాషణ బయటకు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మధ్య ఈ కేసులో నేరాభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. క్యాపిటల్‌పై దాడి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఓటమి భారాన్ని తట్టుకోలేక క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరుల్ని ఉసిగొల్పిన ఘటనకు సంబంధించిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. కొలంబియా జిల్లా కోర్టులో ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా అడ్డుకోవాలని అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదై ఉంది. అక్రమ వ్యాపారాలు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో చేసిన వ్యాపారాల్లో నిబంధనల్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని, తన ఆస్తుల్ని కూడా తప్పుడుగా చూపించారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కేసు నమోదు చేశారు. ట్రంప్ న్యూయార్క్ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించకుండా నిషేధం విధించాలంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ట్రంప్‌ను అటార్నీ జనరల్ తన కార్యాలయంలోనే కొన్ని గంటలు ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ కేసు అక్టోబర్‌లో విచారణకు రానుంది. కాలమిస్ట్‌పై అత్యాచారం మూడు దశాబ్దాల క్రితం తనపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కాలమిస్ట్ జీన్ కరోల్ వేసిన కేసులో డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు మే 9న దోషిగా తేల్చింది. 1990లో మన్‌హటన్‌లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ 2019లో న్యూయార్క్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఏప్రిల్ 25న దీనిపై విచారణ మొదలైంది. కరోల్‌ను అబద్ధాల కోరుగా ప్రచారం చేసి ఆమె పరువుని బజారుకి ఈడ్చినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ న్యాయనిపుణుల బృందం పై కోర్టుకు వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
మహిళా సీఐ సస్పెండ్
శివాజీనగర: విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలతో నగరంలో శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమ ను పై అధికారులు సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ దయానంద్ ఉత్తర్వులిచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ పోలీస్‌స్టేషన్‌లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఎస్ఐ సవిత రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చికకారు. ఇందులో సీఐ సుమ పాత్ర ఉందని వినిపించింది. సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి. ఉన్నతాధికారులు చెప్పి పంపిన కేసుల్లో కూడా ఆమె లంచం డిమాండ్ చేసి, ఇచ్చేవరకూ పనిచేసేది కాదని ఆరోపణలున్నాయి. ఇంతకుముందు డీసీపీ భీమాశంకర్ గుళేద్ హెచ్చరించినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు లంచం, అలసత్వం, దుష్ప్రవర్తన తదితర ఆరోపణల కింద ఆమైపె సస్పెన్షన్ వేటు వేశారు. -
డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు.. స్పందించిన నటి
రామబాణం ఫేం డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు) ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. Using power doesn’t stop any mistake . 😂 — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 -
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లోని టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారట. అయితే ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం వంటివి చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె డింపుల్ గోపీచంద్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. -
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విచారించవచ్చు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు అధికారులు గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ కోరుతూ నిందితులు దాఖలు చేసే పిటిషన్లను హైకోర్టులు, ట్రయల్ కోర్టులు విచారించవచ్చంది. 60 నుంచి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితులు ఢిపాల్ట్ బెయిల్‌కు అర్హులు. విచారణ పూర్తవకుండానే అసంపూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేసినా డిఫాల్ట్ బెయిల్ పొందవచ్చని రీతూ ఛాబ్రియా కేసులో జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 26న తీర్పు వెలువరించింది. కేవలం నిందితులకు డిఫాల్ట్ రావొద్దన్న కారణంతో చార్జిషీల్ దాఖలు చేయొద్దని సూచించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలని కోరింది. ఈడీ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కింది కోర్టులు రీతూ ఛాబ్రియా కేసు తీర్పుపై ఆధారపడాల్సిన అవసరం లేదని, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కేంద్రంపై సుప్రీంకు ఆప్ ఢిల్లీ ప్రభుత్వాధికారులపై పాలనపరమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ విషయమై కేంద్రానికి, ఆప్ సర్కారుకు మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వ సేవల శాఖ కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు వచ్చే వారం ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ‘అదానీ’ విచారణకు 3 నెలలు? అదానీ గ్రూప్ అవకతవకల ఆరోపణలపై విచారణకు సెబీకి మరో మూడు నెలలు గడువివ్వాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో సెబీ వైఫల్యముందన్న వాదనలను తిరస్కరించింది. సెబీ నివేదికను తమ నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక దానిపై తేలుస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ స్టోరీపై నిషేధం ఎందుకు ? ది కేరళ స్టోరీ సినిమాను ఎందుకు నిషేధించారో చెప్పాలంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సీజేఐ ధర్మాసనం నోటీసులిచ్చింది. ‘‘ఇతర రాష్ట్రాలు ఏ సమస్యా లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నాయిగా! దానివల్ల ఏమీ జరగలేదు. మరి మీరెందుకు నిలిపివేశారు? సినిమా నచ్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. -
నేర నిలయాలు!
ఒక సమాజ నాగరికత స్థాయిని అంచనా వేయాలంటే అక్కడున్న జైళ్లను ముందుగా చూడాలన్నాడు విశ్వవిఖ్యాత రచయిత ఫ్యూదోర్ డాస్టోవిస్కీ. దాన్నే గీటురాయిగా తీసుకుంటే అన్ని వ్యవస్థలూ సిగ్గు పడాల్సిందే. మన దేశంలో జైళ్ల స్థితిగతుల గురించి ఏటా జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించే అంశాలు కంగారు పుట్టిస్తుంటాయి. ఇతర జైళ్ల సంగతలావుంచి దేశంలోనే అతి పెద్దదయిన తిహార్ జైలు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఈ జైలు దేశంలో మాత్రమే కాదు...దక్షిణాసియా దేశాల్లోనే అతి పెద్దది. అలాంటిచోట నెలరోజుల వ్యవధిలో రెండో హత్య జరిగిందంటే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నెల 14న రౌడీ షీటర్, ఒక హత్య కేసు ముద్దాయి అయిన ప్రిన్స్ తెవాతియా అనే యువకుణ్ణి అతని ప్రత్యర్థి వర్గం హతమార్చింది. రెండూ వర్గాలూ పదునైన ఆయుధాలతో దాడి చేసుకోవటంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకడైన తెవాతియా మరణించాడు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ, గతవారం టిల్లూ తాజ్‌పురియా అనే గూండాను ప్రత్యర్థివర్గం దాడిచేసి మట్టుబెట్టింది. నిరుడు ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన గూండా జితేందర్ గోగి మరణానికి టిల్లూ తిహార్ జైలునుంచే పథక రచన చేశాడని అప్పట్లో అధికారుల దర్యాప్తులో తేలింది. జైళ్లను సంస్కరణాలయాలుగా ఎంత చెప్పుకున్నా అందుకు అనుగుణమైన చర్యలు అంతంతమాత్రమే. ఏ నేరమూ చేయకుండానే కేసుల్లో ఇరుక్కుని వచ్చే అమాయకులతోపాటు రకరకాల నేరాలు చేసి అక్కడికొచ్చేవారు కూడా అధికంగా ఉంటారు జైళ్లలో పర్యవేక్షణ అంత సులభం కాదు. అందునా తిహార్ జైలు రాజకీయ నాయకులకూ, గూండాలకూ, కరడుగట్టిన నేరగాళ్లకూ, చిల్లర నేరగాళ్లకూ నిలయం. అక్కడ పరిస్థితి చేయిదాటిందంటే ఎంతటి ప్రమాదమైనా చోటుచేసుకోవచ్చు. అయితే సమస్య ఉందని గుర్తించి నపుడు దానికి తగిన పరిష్కారం వెదకాలి. ఎక్కడో ఒకచోట ఆ సమస్యకు అడ్డుకట్ట పడాలి. కానీ అది ఎవరికీ పట్టినట్టు లేదు. ఫలితంగా జైల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, చంపుకోవటం, బయటనున్న ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి పథక రచన చేయటం యధేచ్ఛగా సాగిపోతోంది. మరీ ఘోరం జరిగితే తప్ప అన్నీ బయటకు రావు. తిహార్ జైలు 400 ఎకరాల విస్తీర్ణంలో 9 జైళ్లుగా ఉంటుంది. అక్కడ 10,026మందిని ఖైదు చేయ టానికి వీలుండగా, అంతకు రెట్టింపు మంది ఉంటారు. ఆ జైల్లో అత్యధికంగా ఉండేది ఉత్తరాదివారు గనుక జైలు భద్రతను తమిళనాడు స్పెషల్ పోలీస్(టీఎన్‌ఎస్‌పీ)కి అప్పగించారు. ఆ విభాగంనుంచి దాదాపు వేయిమంది సిబ్బంది తిహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారితోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే ఎదర్కొనడానికి ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ) సన్నద్ధంగా ఉంటుంది. కానీ టిల్లూను ప్రత్యర్థివర్గం కొట్టిచంపినప్పుడు అందరూ ప్రేక్షకపాత్ర వహించారని సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. ఇప్పటికైతే ఏడుగురు టీఎన్‌ఎస్‌పీ అధికారులను సస్పెండ్ చేశారు. ఇందువల్ల అంతా మారిపోతుందనుకోవటం అత్యాశే. నిజానికి కొన్ని దేశాల జైళ్లతో పోలిస్తే మన జైళ్లు మరీ అంత కిక్కిరిసినట్టు భావించనక్కరలేదని కొందరి వాదన. అది నిజమే కావొచ్చు గానీ...మన జైళ్లు కూడా రకరకాల కారణాలతో పరిమితికి మించిన ఖైదీలతోనే నిండి ఉంటున్నాయి. జైళ్లలో ఉండేవారంతా నేరస్తులు కాదు. అందులో విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఉంటారు. చెప్పా లంటే మన ప్రభుత్వాల విధానాల వల్లనో, అలసత్వం వల్లనో ఈ రెండో క్యాటగిరీవారే అధికం. విచారణలో ఉండే ఖైదీల్లో క్షణికావేశంలో ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కొని వచ్చేవారు ఎక్కువ. అలాగే పల్లెటూళ్లలో పెత్తందార్ల ఆగ్రహానికిగురై అకారణంగా జైలుపాలైనవారూ ఉంటారు. అటువంటివారిని గుర్తించి వెంటవెంటనే విడుదల చేయగలిగితే జైళ్లు ఇంత చేటు కిక్కిరిసిపోయే అవకాశం ఉండదు. ఇలాంటివారిని జైళ్లలో ఉంచటం వల్ల కలిగే మరో అనర్థం ఏమంటే... తప్పు చేయటం పెద్ద నేరమేమీ కాదన్న భావన వారిలో కలిగినా కలగొచ్చు. ఎన్డీటీవీ యాంకర్‌గా పనిచేసిన సునేత్రా చౌదరి ఆరేళ్లక్రితం రాసిన ‘బిహైండ్ బార్స్’ అనే పుస్తకం ఈ సంగతినే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా తిహార్ జైల్లో అడుగడుగునా కనిపించే అవినీతిని, సంపన్నుల ఇంట పుట్టి నేరాల్లో ఇరుక్కొని జైలుకొచ్చేవారికి దక్కే రాచమర్యాదలనూ పుస్తకం వివరిస్తుంది. కిరణ్ బేడీ తిహార్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నకాలంలో అక్కడ సంస్కరణలు చేపట్టినట్టు, అందువల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడేవి. కానీ ఆ తర్వాత అంతా మామూలే. సిబ్బంది కొరత, విచారణలో ఉన్న ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవటం వంటి కారణాలవల్ల ఖైదీల పర్యవేక్షణ సక్రమంగా ఉండటం లేదు. దీన్ని అధిగమించటం కోసం కొందరు ఖైదీలను పర్యవేక్షకులుగా ఉంచే సంస్కృతి అన్నిచోట్లా కనబడుతోంది. ఇందువల్ల ఏ ఖైదీ మానసిక స్థితి ఎలావుందో, ఎవరికి వైద్య సాయం అవసరమో తెలిసే పరిస్థితి ఉండటం లేదు. జైళ్లలో తగినమంది సిబ్బందిని నియమించటం, అనవసరంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించటం వంటివి చేయగలిగితే మెరుగైన పర్యవేక్షణకు వీలవుతుంది. అప్పుడు ఈ స్థాయిలో నేరగాళ్లు బరి తెగించే అవకాశం ఉండదు. సస్పెన్షన్లు, తొలగింపులు సిబ్బందిలో భయం కలిగిస్తాయన్నది నిజమే కావొచ్చు. కానీ అది తాత్కాలికమే. దానికి బదులు వారిపై పడే అదనపు భారాన్ని వదిలిస్తే సిబ్బంది మెరుగ్గా పనిచేయగలుగుతారు. అప్పుడు జైళ్లు నిజమైన సంస్కరణాలయాలుగా మారతాయి. -
నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వర్సిటీలో పాలకమండలి సభ్యులు, వైస్ చాన్స్‌లర్ మధ్య న డుస్తున్న పోరు మరో స్థాయికి చేరుకుంది. శుక్రవా రం వీసీ రవీందర్ గుప్తా ఉన్నతవిద్యా శాఖ కమిష నర్ నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వర్సిటీ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరోవై పు నవీన్ మిట్టల్ చైర్మన్‌గా శుక్రవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో తెయూ పాలకమండలి 57వ సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా న వీన్ మిట్టల్‌పై ఆరోపణల పర్వాన్ని మరింత పెంచ గా, పాలకమండలి సభ్యులు సైతం తమ చర్యలకు మరింత పదును పెడుతున్నారు. ఏకంగా వర్సిటీ వ్యవహారాల విషయమై ఉన్నత స్థాయి దర్యాప్తు చే యించేందుకు, ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు లు పెట్టేందుకు తీర్మానం చేయడం గమనార్హం. నవీన్ మిట్టల్ చైర్మన్‌గా.. వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నత స్థా యిలో విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. తె లంగాణ యూనివర్సిటీల చట్టం 1991 మేరకు సెక్ష న్ 18(1) ప్రకారం 10 మంది సభ్యుల కోరం ఉండడంతో ఈసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వీసీ హాజరు కాకపోవడంతో ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించా రు. 1991 తెలంగాణ యూనివర్సిటీల చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించేందుకు ఉన్న పూర్తి అధికారంతో పాలకమండలి ప్రొఫెసర్ యాదగిరిని పునర్నియామకం చేసింది. 2021 అక్టోబర్ 30న యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఈసీ నియమిస్తే, వర్సిటీల చట్టంలోని 50.6(ఏ) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా వీసీ నియమించడం చట్టవ్యతిరేకమన్నారు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ పదవీకాలం పూర్తయితే లేదా ఆ స్థానం ఖాళీ గా ఉంటే మాత్రమే కొత్త రిజిస్ట్రార్‌ను నియమించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈసీ ఆమోదం లేకుండా శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం తదితరాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీలతో విచారణ చేయించాల ని తీర్మానించారు. 2022–23, 2023– 24 బడ్జెట్‌కు సంబంధించి సైతం విచారణ చేపట్టాలని, ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించా రు. తెయూలో అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. స మావేశంలో ఈసీ సభ్యు లు గంగాధర్ గౌడ్, వసుంధరా దేవి, మారయ్య గౌడ్, ఎన్ఎల్ శాస్త్రి, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రకళ పాల్గొన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.. తెయూ (డిచ్పల్లి) : నాపై తప్పుడు, లేనిపోని అవినీతి ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను నాశనం చేస్తూ.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ లక్ష్యమని తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పరిణామాలపై తీవ్ర వేదనతో, బాధతో మీడియా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తెయూ వీసీగా నియమించారని, అయితే నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్‌డోర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ కొన్ని నిరాధారమైన ఆరోపణలకు వివాదాలకు కేంద్రంగా మారిందన్నారు. వీటన్నింటికీ నవీన్ మిట్టల్ కారణమని చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. మిట్టల్ తన నామినీ అయిన ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఎలాగైనా నియమించాలనే తపనతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని తాను వ్యతిరేకిస్తున్నానని, వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో సహకరించలేడని పేర్కొన్నారు. ఏప్రిల్ 19, 2023 న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమించాలని తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి ఈసీ నిర్ణయాలపై స్టే తెచ్చినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి తన ఉద్దేశాలు, చట్టవిరుద్ధమైన నిర్ణయాలతో విద్యాశాఖలోని మొత్తం వ్యవస్థలను తారుమారు చేయడం దురదృష్టకరమని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తున్న గొప్ప యూనివర్సిటీ ఖ్యాతిని పణంగా పెట్టి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్) మంజూరు నిధులను రూ.20 కోట్లను మిట్టల్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రూసా డైరక్టర్‌గా ఉన్న మిట్టల్ తనకు నచ్చిన వ్యక్తిని ఇక్కడ రిజిస్ట్రార్‌గా నియమించినప్పుడే వర్సిటీకి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా ఉండటం శోచనీయమన్నారు. మిట్టల్ అనవసర జోక్యాన్ని అడ్డుకుని యూనివర్సిటీని యథావిధిగా నిర్వహించేలా చూడాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులకు వీసీ విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయవిచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు. -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
బైడెన్ అసమర్థ పాలనలో... అమెరికా సర్వభ్రష్టం
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తాను పూర్తిగా అమాయకుడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనపై దాఖలైన క్రిమినల్ అభియోగాలకు సంబంధించి మంగళవారం ఆయన న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ ముందు విచారణకు హాజరవడం తెలిసిందే. అనంతరం ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. వామపక్ష అతివాద ఉన్మాదులు దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకెళ్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మద్దతుదారులపై నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడిలా ఎన్నికల ప్రక్రియనూ ముందుగానే ప్రభావితం చేయజూస్తున్నారని ఆరోపించారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హెచ్చరించారు. ‘‘బైడెన్ దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. ఆయనకు ముందున్న ఐదుగురు అత్యంత అసమర్థ అధ్యక్షుల వైఫల్యాన్నింటినీ కలగలిపినా బైడెన్ పాలనా వైఫల్యాల్లో పదో వంతుకు కూడా తూగవు. అంతటి దారుణ పాలనతో అమెరికాను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తూ విఫల రాజ్యంగా మారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. డాలర్ శరవేగంగా పతనమవుతోంది. గత 200 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత దారుణ పరాజయమిది! ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ఇంకెంత మాత్రమూ సూపర్ పవర్ కాదు. సర్వనాశనం దిశగా పయనిస్తోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. నేనుంటేనా...! బైడెన్ అసమర్థత వల్ల నమ్మశక్యం కాని రీతిలో చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా చేతులు కలిపాయని ట్రంప్ ఆరోపించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి అత్యంత వినాశకర సంకీర్ణంగా రూపొందాయి. ఎన్నో దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్తిస్థాయి అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. బైడెన్ హయాంలోనే జరిగి తీరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేనుంటే వీటిలో దేన్నీ జరగనిచ్చేవాన్ని కాదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు. ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదు. అందమైన ఉక్రెయిన్ పట్టణాలు నేలమట్టమయ్యేవి కాదు’’ అని ట్రంప్ అన్నారు. అదే నా తప్పిదం... వినాశక శక్తుల బారినుంచి దేశాన్ని సాహసోపేతంగా కాపాడటమే తాను చేసిన ఏకైక తప్పిదమంటూ బైడెన్, ఆయన మద్దతుదారులపై ట్రంప్ నిప్పులు చెరిగారు. తనపై కేసు విషయంలో మన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్‌తో పాటు దాన్ని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జువాన్ ఎం.మెర్చన్పైనా విరుచుకుపడ్డారు. వారిద్దరూ డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అంతేకాదు, వారిద్దరికీ నేనంటే విపరీతమైన ద్వేషం. జువాన్ భార్యకు, కుటుంబానికీ నేనంటే అసహ్యమే. ఆయన కూతురు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం పని చేస్తోంది’’ అన్నారు. ఎవరేం చేసినా తనను కుంగదీయలేరని, అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చి చూపిస్తానని చెప్పుకొచ్చారు. -
ఇంతకీ ట్రంప్ చేసిన నేరం ఏమిటి?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trumpపై క్రిమినల్ అభియోగాలు నమోదు కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన ట్రంప్‌పై ఏకంగా 34 నిందారోపణలు అయ్యాయి. ఓ శృంగార తారతో పాటు ఓ ప్లేబాయ్ మాజీ మోడల్‌తో సంబంధంతో బయట పడకుండా ఉండేందుకు ఆయన చేసుకున్న అనైతిక ఒప్పందాలే ఆయన్ని ఇలా ఇరకాటంలో పడేశాయి. అనైతిక ఒప్పందాలతో వ్యాపార ఒప్పందాల్లో మోసాలకు పాల్పడడం, తద్వారా తన కంపెనీలలో పన్నుల ఎగవేత కుంభకోణం.. ఇది సంక్లిప్తంగా ట్రంప్‌పై మోపబడ్డ అభియోగాల సారాంశం. ఇంతకీ ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది?.. ట్రంప్ దోషిగా తేలినా ఆయన రాజకీయ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడదా? ఆ అంశాల్లోకి వెళ్తే.. ► స్టార్మీ డేనియల్స్ ఓ శృంగార తార(మాజీ). 2006లో నెవడాలోని సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా తొలిసారి ఆమె ట్రంప్‌ను కలుసుకుంది. ఆ సమయానికి ఆమె వయసు 27 ఏళ్లు. ట్రంప్ వయసు 60. ఆ తర్వాత టీవీ షోలో పాత్ర కోసం లాస్ ఏంజెల్స్‌లోని తన బేవర్లీహిల్స్ ఇంట్లో కలవాలని ట్రంప్, డేనియల్స్‌కు తన బాడీ గార్డు ద్వారా కబురు పంపారు. అక్కడే డిన్నర్ చేశాక.. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ► వాస్తవానికి 2011లోనే ఆమె ట్రంప్‌తో సంబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినా.. అప్పుడు ఆ అంశానికి పెద్దగా ఫోకస్ దక్కలేదు. ► 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పందం చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. ► ఆ సమయంలో ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైకేల్ కోహెన్.. డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆమె గప్‌చుప్‌గా ఉండిపోగా.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. ► 2018 జనవరిలో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. అప్పటికి ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండేసరికి.. ఇదొక హైప్రొఫైల్ కేసు అయ్యింది. ఆమె ఆరోపణలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ► అయితే విచారణలో కోహెన్ మాత్రం అది తన సొంత డబ్బు అని, ట్రంప్ చెల్లించలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఏడాది.. ఫుల్ డిస్క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్. ఈలోపు ట్రంప్ తన ప్రచార నిధి నుంచి కాకుండా.. సొంత డబ్బును ఈ అనైతిక ఒప్పందం కోసం చెల్లించాడనే వాదన తెర మీదకు వచ్చింది. ► 2018 ఫిబ్రవరిలో కోహెన్ తన సొంత డబ్బును డేనియల్స్‌కు చెల్లించినట్లు బుకాయించాడు. అయితే.. చివరకు 2018 ఆగస్టులో కోహెన్ నేరం అంగీకరించాడు. ట్రంప్ ప్రచార నిధి నుంచే ఆ డబ్బు చెల్లించినట్లు చెప్పాడు. దీంతో అదే ఏడాది డిసెంబర్లో కోర్టు కోహెన్‌కు మూడేళ్ల శిక్ష ఖరారు చేసింది. ► 2019 ఆగష్టులో.. ఆ అనైతిక ఒప్పందం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆదేశించడంతో.. ట్రంప్ ఇరకాటంలో పడినట్లయ్యింది. పన్నుల కుంభకోణంలో.. ట్రంప్ సంస్థ తప్పిదం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ► అనైతిక ఒప్పందం.. తద్వారా పన్నుల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ట్రంప్ కంపెనీపై అభియోగం నమోదు అయ్యింది. 2023, జనవరిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట ట్రంప్ అనైతిక ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. మార్చిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట హాజరు కావాలంటూ ట్రంప్‌కు ఆదేశాలు జారీ కాగా, వాటిని ట్రంప్ తిరస్కరించాడు. ► చివరకు.. 2023 మార్చి చివరి వారంలో మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆయనపై అభియోగాల నమోదు దిశగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన లొంగిపోతారంటూ ట్రంప్ తరపు న్యాయవాది ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ► కోర్టు ఆయనపై నేరాభియోగాలు మోపడానికి, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే మాన్‌హట్టన్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్లారు డొనాల్డ్ ట్రంప్‌ను. కానీ, సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అటుపై లీగల్ టీంతో కలిసి కోర్టు విచారణలో పాల్గొన్నారు ట్రంప్. గంట పాటు వాదనలు జరగ్గా.. చివరకు బయటకు వచ్చి ఫ్లోరిడాలోని ఇంటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతానికి ఎపిసోడ్‌కు కామా పడినట్లయ్యింది. ► డిసెంబర్లో(4వతేదీన) ఈ కేసుకు సంబంధించి మరోసారి ట్రంప్ విచారణకు కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► ఇండియానాకు చెందిన మోడల్, నటి మెక్‌డగల్(52).. 90వ దశకంలో ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం పని చేసింది. 2006-07 సమయంలో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా తనకు కొంత డబ్బు ముట్టజెప్పాడని అంటోంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఓ మీడియా సంస్థ ద్వారా లక్షా యాభై వేల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సదరు మీడియా ఏజెన్సీ.. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ముందు అంగీకరించింది కూడా. ► ఏది ఏమైనా అమెరికా చరిత్రలోనే తొలిసారి క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ట్రంప్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన అధ్యక్ష ఎన్నిక అభ్యర్థితత్వంపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. అలాగే.. న్యూయార్క్ చట్టాల దృష్టిలో తక్కువ తీవ్రమైనవి. ఒక్కో లెక్కన వాటన్నింటికి పడేది నాలుగేళ్ల శిక్ష మాత్రమే. ఒకవేళ దోషిగా తేలి శిక్షపడినా కూడా.. ట్రంప్ ప్రొబేషన్ శిక్షనే ఎదుర్కొంటారు తప్ప ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది అక్కడి న్యాయనిపుణుల మాట. కానీ, తొలి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న ట్రంప్.. పరిస్థితి అంతదాకా రాదని, పోరాటం ద్వారా రాజకీయ కుట్రను తిప్పి కొడతానని అంటున్నారు. -
Donald Trump: అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు
ఫ్లోరిడా: క్రిమినల్ అభియోగాలు ఎదుర్కోవడమే కాదు.. కోర్టు విచారణకు హాజరయ్యే క్రమంలో అరెస్టయిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కారు. అయితే కోర్టు విచారణ అనంతరం ఈ కేసుపై మీడియాతో మొదటిసారిగా మాట్లాడిన ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. బైడెన్ పాలనలో అమెరికా నానాటికీ నాశనం అవుతోందంటూ మండిపడ్డారాయన. శృంగార తారతో అనైతిక ఒప్పందం కేసులో ఆయన కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లగా.. పోలీసులు అరెస్ట్ చేసి మరీ కోర్టులో హాజరు పరిచారు. తానే నేరమూ చేయలేదని ట్రంప్ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ మాన్‌హట్టన్ కోర్టులో సుమారు గంటపాటు విచారణ జరిగిన తర్వాత.. ట్రంప్ నేరుగా ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఇంటికి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని ఏనాడూ ఊహించలేదు. ఇలా జరగాలని కోరుకోవడం లేదు కూడా. నేను చేసిన నేరమల్లా ఒక్కటే. దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న శక్తులకు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడమే అని ట్రంప్అన్నారు. అమెరికా నరకంగా మారి నాశనం వైపు అడుగులేస్తోందని, అది చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనపై ఈ కుట్ర జరుగుతోందని, దానిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసంటూ ఈ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ట్రంప్ డిసెంబర్లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావొచ్చని తెలుస్తోంది. మిస్టర్ ట్రంప్.. యూ ఆర్ అండర్ అరెస్ట్ -
నేడు కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) మంగళవారం మన్హటన్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరు కానున్నారు. పోర్న్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌తో తన అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు చేసిన చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు మోపుతూ జ్యూరీ గత గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. మంగళవారం విచారణ తంతు 10 నుంచి 15 నిమిషాల్లో ముగుస్తుందని చెబుతున్నారు. ట్రంప్‌పై ఏయే అభియోగాలు మోపిందీ ఆయనకు చదివి వినిపిస్తారు. అనంతరం ట్రంప్ ఫ్లోరిడా వెళ్లి మంగళవారం రాత్రి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న ప్రాసిక్యూటర్‌తో పాటు జడ్జిపైనా ట్రంప్ ఆరోపణలతో విరుచుకుపడ్డారు! ‘‘ఈ కేసు కేవలం నాపై కక్షపూరిత చర్యే. దీన్ని విచారిస్తున్న జడ్జికి నేనంటే అమిత ద్వేషం. కేసును దర్యాప్తు చేస్తున్న జిల్లా అటార్నీ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీకి చెందినవాడు. ఏరికోరి నన్ను ద్వేషించే జడ్జినే విచారణకు ఎంచుకున్నారు’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్ విచారణకు దారితీయగల పలు ఇతర అభియోగాలను కూడా ట్రంప్ ఇప్పటికే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ముద్దాయి ట్రంప్!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
న్యూయార్క్: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వేలి ముద్రలు, ఫొటో తీసుకొని... ట్రంప్ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ న్యూయార్క్ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్‌లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్‌హట్టన్ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి. సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్‌ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్‌ని ప్రత్యేక సెల్లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది. బెయిల్ లభిస్తుందా? ట్రంప్‌పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్ వేసి ఉంచింది. ట్రంప్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే సీల్ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్‌పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్ తన ఇమేజ్ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు. ‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్‌ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్‌షైర్‌లో రిపబ్లికన్ పార్టీ చీఫ్ గ్రెగ్ హగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. రాజకీయ అణచివేత: ట్రంప్ రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్‌హట్టన్ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం ఇదీ.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్ మైఖేల్ కొహెన్ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Donald Trump: కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!
న్యూయార్క్: శృంగార తార(మాజీ)తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించి అనైతిక ఒప్పదం చేసుకున్న కేసులో.. డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు నేరారోపణలు రుజువయ్యాయి. అయితే ఆయన అరెస్ట్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చేకంటే ముందే.. ఆయన స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలని, ఆరోపణలపై విచారణకూ హాజరు కావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రంప్ తరపున లాయర్(అటార్నీ) జోయ్ టాకోపినా ఒక ప్రకటన చేశారు. ట్రంప్ వచ్చేవారం మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయే అవకాశం ఉందని జోయ్ ప్రకటించారు. మరోవైపు ట్రంప్ లీగల్ టీం కూడా ప్రాసిక్యూటర్లతో టచ్‌లో ఉందని, వచ్చేవారం విచారణకు ఆయన వాళ్ల ఎదుట హాజరు కావొచ్చని పేర్కొంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. సె* స్కాండల్ కేసులో దోషిగా తేలినప్పటికీ.. 2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు కాబట్టి. కాకపోతే నైతిక విజయంపై ఇది ప్రభావం చూపెట్టవచ్చని, ఆయన కెరీర్లో ఓ మచ్చగా మిగిలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. hush money case ప్రకారం.. ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు.. స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే పో* స్టార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ తన వ్యక్తగత లాయర్ ద్వారా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పాడు ట్రంప్. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జరిగింది. అయితే.. రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ఏంజెల్స్ కోర్టులో దావా వేసిందామె. ఆ సమయంలో ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండడంతో దీన్నొక హైప్రొఫైల్ కేసుగా భావించి.. అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసులోనే ఆరోపణలు రుజువు కావడంతో.. ఆయనపై ఇప్పుడు నేరారోపణలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2006లో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా పేరొందిన డొనాల్డ్ ట్రంప్.. స్టార్మీ డేనియల్స్‌ను తొలిసారిగా ఓ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భలో కలుసుకున్నారు. ఆ సమయానికి ఆమె వయసు 27. ట్రంప్ వయసు 60. 2018లో ఫుల్ డిస్క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్. ఆ ఈవెంట్లో ట్రంప్ బాడీగార్డుల్లో ఒకతని ద్వారా నాకు ఆహ్వానం అందింది. ఆయన(ట్రంప్), నేను రాత్రి భోజనం తర్వాత ఆయనకు సంబధించిన ఓ పెంట్‌హౌజ్‌కు చేరుకున్నాం. అక్కడే తామిద్దరం శారీరకంగా కలుసుకున్నాం. అప్పటికీ ఆయన మూడో భార్య.. పిల్లలను కని నెలలు అవుతుందేమో. నాతో కలయికను ట్రంప్ ఎంతగానో పొగిడారని ఆ బుక్‌లో ఆమె పేర్కొంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పంద చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. 2018 ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. మరోవైపు ట్రంప్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కొన్నాలో తనకు తెలుసని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. -
స్వప్నలోక్ ప్రమాదం.. ‘క్యూ–నెట్’పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ–నెట్ సంస్థ చీకటి దందా మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురు యువతీయువకులూ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఈ సంస్థ ఉద్యోగులే. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మర్నాటి నుంచి దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. మాదసి నవీన్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో ఉన్న క్యూ–నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయం కొనసాగుతోంది. ‘వి–ఎంపైర్’పేరుతోనూ కొనసాగుతున్న ఈ సంస్థలో అనేక మంది పని చేస్తున్నారు. ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ–నెట్ సంస్థ మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్స్కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దాంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ సంస్థ ఇటీవలే మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్న వరంగల్ వాసి మాదసి నవీన్, స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బానోత్ శ్రావణి స్నేహితులు. శ్రావణి ద్వారానే నవీన్‌కు ‘వి–ఎంపైర్’సంస్థ కార్యకలాపాలు తెలిశాయి. తమ సంస్థలో చేరితే ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్జించవచ్చని ఆమె చెప్పడంతో నవీన్ గతేడాది ఆక్టోబర్‌లో ‘వి–ఎంపైర్’లో చేరాడు. రూ.1.6 లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న అతనికి ఇద్దరు సభ్యులను చేరిస్తే కమీషన్ల రూపంలో నగదు వస్తుందని సూచించారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంస్థలో చేరాకే నవీన్‌కు వి–ఎంపైర్ అన్నది మలేసియాకు చెందిన క్యూ–నెట్లో భాగమని తెలిసింది. ఇక్కడ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కార్యకలాపాలు సాగిస్తోందని తెలుసుకున్నాడు. నిషిద్ధ మనీ సర్క్యులేషన్, మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాలు చేస్తున్న ఈ సంస్థను బెంగళూరుకు చెందిన రాజేష్ ఖన్న నిర్వహిస్తున్నాడని నవీన్ గుర్తించాడు. -
ఎన్కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..
ఎన్కౌంటర్లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు. అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్కౌంటర్లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్కౌంటర్ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు. అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. (చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు..పైగా నేరస్తుడిలా..) -
Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్ కేసులు
అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్ కూడా అయిన మాణిక్ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. -
ప్రకృతి ఒడిలో అలజడి.. టూరిస్ట్ స్పాట్లో చీకటి ఉదంతాలు!
బనశంకరి: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా చార్మాడీ ఘాట్ ప్రకృతి అందాలకు నిలయం ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. పర్వతాలు, లోయలు పచ్చగా, పొగమంచుతో అద్భుతం అనిపిస్తాయి. కానీ ఇటీవల వేర్వేరు కారణాలతో హాట్‌టాపిక్‌గా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి ఆ మృతదేహాలను తీసుకువచ్చి చార్మాడీ ఘాట్‌లో పడేసి వెళ్లడం పెరిగింది. దీని వల్ల కేసుల విచారణ కష్టమవుతుంది. మరోపక్క పర్యాటకులు ఇక్కడ ప్రమాదకర స్థలాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. సాయంత్రం కాగానే.. చార్మాడీఘాట్‌లో 28 కిలోమీటర్లు విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వెళుతుంది. ఈ మార్గంగా నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. ఎత్తైన పర్వతాలతో కూడిన ఘాట్‌లో సాయంత్రం తరువాత వాహనాల సంచారం తక్కువై నిర్మానుష్యమవుతుంది. ఈ సమయంలో నేర ముఠాలు మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ప్రకృతి సోయగాలకు నిలయమైన చార్మాడీఘాట్‌కు రక్తపు మరకలు అంటిస్తున్నారు. పనిచేయని సీసీ కెమెరాలు.. కొట్టిగేహార అటవీశాఖ చెక్‌పోస్టులో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఘాట్‌లోకి ప్రవేశించే చెక్‌పోస్టులో వాహనాల తనిఖీ నామమాత్రమే. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారికి ఘాట్ స్వర్గధామంగా తయారైంది. హంతకులు జంకు లేకుండా వాహనాల్లో మృతదేహాలను తీసుకొచ్చి వదిలేస్తుంటారు. ఇదే కాదు కొన్ని వాహనాల డ్రైవర్లు మృతిచెందిన పందులు, కోళ్లను ఇదే ఘాట్ రోడ్డులో పడేస్తున్నారు. అడ్డుకట్టకు చర్యలు చేపడతాం: ఎస్పీ కొట్టిగుహర, చార్మాడీ గ్రామాల్లో చెక్‌పోస్టుల్లో పగలూ రాత్రి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కాగా, ఘాట్‌లో మృతదేహాలు లభిస్తున్నట్లు తెలిసింది, సంఘ సంస్థలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి నియంత్రణ గురించి చర్చిస్తాం, చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాలు అమర్చడానికి చర్యలు తీసుకుంటామని దక్షిణ కన్నడ ఎస్పీ ఉమాప్రశాంత్ తెలిపారు. ఎన్నో చీకటి ఉదంతాలు 2008 జూన్ 11 తేదీన శివగంగమ్మ అనే మహిళ మృతదేహాన్ని పడేశారు. 2012లో వజ్రాల వ్యాపారిని బెంగళూరులో హత్యచేసి చార్మాడీ కనుమలో వేశారు. అదే ఏడాది అల్దూరిలో ఒక డాక్టరు స్పృహలేని స్థ్దితిలో కనబడ్డారు. 2013 జూన్ 21 న మలయమారుత వద్ద శివమొగ్గ మంగోటి గ్రామ మమతా, 2016లో చెన్నరాయపట్టణ కాంత అనే మహిళల మృతదేహాలు సోమనకాడు వద్ద కనిపించాయి. 2020లో చార్మాఢీఘాట్ రోడ్డులోని కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత ఏడాది డబ్బు విషయంపై చిక్కబళ్లాపుర శరత్ అనే వ్యక్తిని హత్యచేసి చార్మాడి ఘాట్‌లో విసిరేశారు. ఇలా అనేక హత్యల్లో మృతదేహాలను పడవేసి ఈ ప్రాంతమంటే భయాందోళన కలిగించే దుస్థితిని తెచ్చారు. ఆచూకీ లేని అనేక మృతదేహాలు ఇక్కడి నేలలో లీనమౌతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. సెల్ఫీ ప్రమాదాలు అలెకాన్ జలపాతం, ఆలయం వద్ద సెల్పీ తీసుకోవడానికి వెళ్లి పలువురు మృత్యవాత పడ్డారు. 2015 సెప్టెంబరులో హండుగళి మహేంద్ర, 2016 జనవరి 18 చిత్రదుర్గ కు చెందిన హనుమంతప్ప(34), నాగభూషణ్ (28) ప్రాణాలు కోల్పోయారు. -
ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!
సాక్షి, హైదరాబాద్: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మోసాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్’బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్ హెచ్చరించారు. ఖాతాలు.. కమీషన్లు.. వర్క్‌ఫ్రం హోం పేరిట.. ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు. డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్‌ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్లైన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కమిషన్ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్ బటన్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులను వాడి వీరికి ఎస్ఎంఎస్ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్బటన్ యాప్‌లను వాడాలని సూచిస్తారు. మొత్తానికి.. సైబర్ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్బటన్ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్ తెలిపారు. ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్ నేరస్తులకు సహకరించినవారే. సైబర్ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్ భద్రత నిపుణులు ‘పారసైట్’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్కాయిన్లుగా మార్చి.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్లైన్లో బిట్కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. అవన్నీ కూడా తమ కంప్యూటర్ సర్వర్లను హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు. -
టార్గెట్ స్యాంట్రో రవి..నాలుగో భార్య ఫిర్యాదు
సాక్షి, మైసూరు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రముఖ నేరారోపి స్యాంట్రో రవిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం మైసూరుకు వచ్చిన అలోక్ కుమార్ పోలీసు కమిషనర్ రమేశ్ కార్యాలయంలో స్యాంట్రో రవి కేసుల తనిఖీ గురించి పోలీసు అధికారులతో చర్చించారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, అత్యాచార కేసులను సమగ్రంగా తనిఖీ చేయాలని ఏడీజీపీ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ గీతా, ఎస్పీ సీమా లట్కర్, ఏసీసీ శివశంకర్, ఇన్స్పెక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై నాలుగో భార్య ఫిర్యాదు కాగా, ఏడీజీపీ ఎదుట స్యాంట్రో రవి నాలుగో భార్య, ఆమె చెల్లెలు హాజరయ్యారు. వారిద్దరిని ఏడీజీపీ సుమారు గంటకు పైగా విచారించారు. ఈ సమయంలో రవితో పాటు బెంగళూరు కాటన్‌పేట ఏడు మంది పోలీసులు తనను వేధించిన తీరు, అలగే గూగుల్ పే ద్వారా ఆ పోలీసు అధికారులకు చెల్లించిన డబ్బుల వివరాలు ఏడీజీపీకి ఆమె తెలిపారు. తనను వేధించిన పోలీసులను సస్పెండ్‌చేయాలని, రవిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాటన్‌పేట సీఐ ప్రవీణ్ సస్పెండ్ స్యాంట్రో రవి కేసులో బెంగళూరు కాటన్‌పేట ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌ను డీజీపీ ప్రవీణ్ సూద్ సస్పెండ్ చేశారు. స్యాంట్రో రవికి మద్దతుగా ఇద్దరు మహిళలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ప్రవీణ్‌పై ఆరోపణలువవచ్చాయి. హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు. దోపిడీ కేసులో వారి పాత్ర లేకపోయినా రవి భార్య, ఆమె సోదరిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని తేలింది. రవిపై నిఘా ఉంచాం మీడియాతో అలోక్ కుమార్ మాట్లాడుతూ స్యాంట్రో రవి కేసు విచారణ నిమిత్తం మైసూరుకు వచ్చినట్లు , అతనిపై రేప్, అట్రాసిటీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అతని ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. బెంగళూరు రాజరాజేశ్వరి లోని రవి మరో భార్య వనజాక్షిని కూడా విచారించినట్లు చెప్పారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. రవి ప్రస్తుతం మొబైల్ వినియోగించడం లేదన్నారు. అతి త్వరగా అతన్ని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తొదరలోనే పట్టుకుంటాం: హోంమంత్రి శివాజీనగర: పలు నేరారోపణలు ఉన్న స్యాంట్రో రవి అరెస్ట్‌కు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించినట్లు, త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, రవి కదలికలపై నిఘా ఉంది, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం. అన్నివిధాలా గాలింపు జరుగుతోంది. త్వరలోనే రవి అరెస్ట్ అవుతారని చెప్పారు. అతనిపై ఉన్న అన్ని కేసులపై విచారణ చేస్తామన్నారు. అంతేకాకుండా మహిళపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ తప్పుడు కేసులు వేసి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నివేదిక సిద్ధంగా ఉంది. ఇందులో ఏ అధికారి ఉన్నా కూడా వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వమే రవిని దాచిపెట్టిందన్న జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణపై మాట్లాడుతూ కుమారస్వామి మాటలకు సమాధానం చెప్పను అన్నారు. (చదవండి: హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?) -
హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?
సాక్షి, శివాజీనగర: ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో స్యాంట్రో రవి చర్చనీయాంశమయ్యాడు. అతనికి అనేక నేరాలతోను, అలాగే రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం. ఇక కొత్తగా మరో కేసు బయటకు వచ్చింది. గత నవంబర్ 23న బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ క్రిమినల్ కేసుతో అతనికి సంబంధమున్నట్లు తెలిసింది. స్యాంట్రో రవి రెండవ భార్య, బంధువులు తనపై దాడి చేశారని రవి స్నేహితుడు కేసు పెట్టాడు. రవినే ఈ కేసు పెట్టించాడని, ఆమె వద్ద ఉన్న లాప్టాప్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమె అతన్నుంచి విడిగా ఉంటోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు రవి రెండో భార్య, ఆమె సోదరి, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తరువాత రెండో భార్య మైసూరులో రవిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆ లాప్టాప్లో పలు సంచలన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని, అవి బహిరంగమైతే కలకలం ఏర్పడుతుందని తెలిసింది. ఈ రెండు ఫిర్యాదుల్లో వాస్తవాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా, జూటూరులో వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. -
నేరస్తుల చుట్టూ ముద్రావలయం
సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ని ఆదేశించింది. ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది. ప్రాథమిక విధానం ఖరారు నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్సీఆర్బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్సీఆర్బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు. సీఆర్పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది. డిజిటల్ రూపంలో భద్రం నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. -
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పలుమార్లు జైలుకెళ్లినా బుద్ది మార్చుకోని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు రమేష్ రాచకొండ పోలీసులకు చిక్కాడు. గతేడాది డిసెంబర్లో ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ కారును చోరీ చేసిన ఇతడిపై ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు నిఘా పెట్టారు. శనివారం తెల్లవారు జామున ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. ► సూర్యాపేట జిల్లా, చివేముల మండలం, మూ న్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ రమేష్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. జనసంచారం లేని చోట పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రాత్రి వేళల్లో వాటిపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ► ప్రస్తుతం రమేష్‌పై రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 10 కేసులు, సూర్యాపేటలో 5, నల్లగొండలో 3, విశాఖపట్నంలో 2, కొత్తగూడెం, విజయవాడలో ఒక్కో కేసు న్నాయి. సూర్యాపేట టు టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన 15 కేసుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. మోత్కూరు ఠాణాలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) కూడా జారీ అయింది. 2017లో నాగార్జునసాగర్ పోలీసులు రమేష్‌ను దోపిడీతో పాటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. చివరిసారిగా 2019లో ఖమ్మంలోని రఘునాథపాలెం పోలీసులు ఇతడిని వాహనం చోరీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 సెప్టెంబర్‌లో కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా ప్రవృత్తి మార్చుకోలేదు. ► గతేడాది డిసెంబర్ 22న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలోని శ్రీదుర్గా కార్స్ ఆఫీసులో చొరబడి టేబుల్‌పైన ఉన్న కారు తాళాలను తీసుకుని స్కోడా కారును దొంగిలించాడు. ఈ కేసులో రమేష్‌పై ఎల్బీనగర్ సీసీఎస్, ఎల్బీనగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తిరుగుతున్న అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.35.55 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం ఆభరణాలు, 2 కార్లు, 2 బైక్‌లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు -
క్రైమ్ వర్క్‌కూ ట్రాఫిక్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం ట్రాఫిక్ కోణంలోనే కాకుండా క్రైమ్ వర్క్‌కూ ఉపకరిస్తోంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లోని ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ డేటాతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) వల్ల అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి పోలీసు అండ్ సేఫ్టీ అంశంలో గోల్డ్, సిల్వర్ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం, వాహన చోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) నగర పోలీసు విభాగానికి వెన్నెముకగా మారింది. నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెప్తోంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. ట్రాకింగ్ విధానం సైతం.. నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచి్చంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతోంది. ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటి ద్వారా ప్రదర్శితమవుతున్నాయి. వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేశారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై ఐటీఎంఎస్ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతోంది. కొలిక్కి వచి్చన కేసుల్లో కొన్ని... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఏడాది మార్చిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన హేమంత్ కుమార్ గుప్తా 48 గంటల్లోనే శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ వాడిన వాహనం నెంబర్ గుర్తించిన అధికారులు ఈ–చలాన్ డేటాబేస్ నుంచి యజమానికి ఫోన్ నెంబర్ సంగ్రహించారు. దీంతో ముందుకు వెళ్లిన పోలీసులు స్సైస్ జెట్ విమానం ఎక్కిన హేమంత్‌ను అందులోనే పట్టుకుని తీసుకువచ్చారు. వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 11 వాహనాలను తస్కరించిన నిందితుడు సైతం ఈ డేటాబేస్ ద్వారానే చిక్కాడు. మహంకాళి, చిలకలగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు, ఎస్సార్‌నగర్ పరిధిలోని స్నాచింగ్ కేసు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన చోరీ కేసు తదితరాలు సైతం ఈ డేటాబేస్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనుల గుర్తింపు, ఫలక్నుమలో నమోదైన కిడ్నాప్ కేసుల ఛేదనలో ఏఎన్పీఆర్ డేటా ఉపయుక్తంగా మారింది. (చదవండి: ట్రేడింగ్ పేరుతో హాంఫట్ ) -
మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు!
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమితో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువుతీర్చిన సీఎం నితీశ్‌కుమార్ క్రిమినల్ కేసులున్న నేతలతో దాదాపు మొత్తం మంత్రివర్గాన్ని నింపేశారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో 70 శాతానికిపైగా నేతలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదించింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా వీరంతా సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్, బిహార్ ఎలక్షన్ వాచ్ సంస్థ సంయుక్తంగా క్షుణ్ణంగా పరిశీలించాక ఈ నివేదికను బహిర్గతంచేసింది. ఇందుకోసం సీఎం నితీశ్ సహా 33 మంది మంత్రుల్లో 32 మంది అఫిడవిట్లను పరిశీలించారు. మొత్తం మంత్రుల్లో 23 మంది(72 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మంది మంత్రులు(53 శాతం) తమపై తీవ్రమైన నేరమయ కేసులున్నాయి. మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు. -
‘క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్! -
‘జయలక్ష్మి’ పాలకవర్గం రద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడలోని ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ (ఎంఏఎం) కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం రద్దు అయ్యింది. చైర్మన్ సహా 10 మంది డైరెక్టర్లపై మహాజనసభ అనర్హత వేటు వేసింది. డిపాజిట్లకు 12.5 శాతం వడ్డీలు ఇస్తామని ఆశ చూపి రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లలో 19,971 మంది విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు ఇలా అన్ని వర్గాల నుంచి రూ.520 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించారని ప్రాథమికంగా నిర్ధారించారు. డిపాజిట్ల గడువు ముగిసినా సొమ్ములు చెల్లించకపోవడంతో ‘జయలక్ష్మి’ గత ఏప్రిల్ 6న బోర్డు తిప్పేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న సొసైటీ పాలకవర్గంపై బాధితుల ఫిర్యాదులతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సొసైటీ రికార్డులను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార శాఖలోని రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు విచారణ చేస్తున్నారు. సొసైటీ నిర్వహణ లేక కుంటుపడుతోందని.. వెంటనే మహాజన సభ ఏర్పాటు చేయాలని డిపాజిటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌కు అందిన లేఖతో శనివారం కాకినాడలో మహాజనసభ ఏర్పాటు చేశారు. ఇందులో పలు తీర్మానాలు ఆమోదించారు. అడ్హాక్ కమిటీకి పాలకవర్గం బాధ్యతలు సుమారు రూ.520 కోట్లు డిపాజిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితులు, సొసైటీ పరిపాలన మందగించడం, వారిపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో చైర్మన్ సహా 10 మంది సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగే అర్హత లేదని మహాజనసభ నిర్ణయించింది. 30 రోజుల్లోపు పాలకవర్గం మహాజనసభ ఏర్పాటు చేయకపోవడంతో సంఘం బైలా ప్రకారం సభ్యులపై అనర్హత వేటు వేసింది. పరారీలో ఉన్న పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా మరో తీర్మానాన్ని ఆమోదించింది. పాలకవర్గ చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ ఆర్బీ విశాలాక్షి, ట్రెజరర్ ఏపీఆర్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.జయదేవ్‌మణి, డైరెక్టర్లు.. నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఎస్.చక్రభాస్కరరావు, వి.నరసయ్య, జి.నారాయణమూర్తి, మాజీ ట్రెజరర్ డి. వెంకటేశ్వరరావులను పాలకవర్గంలో కొనసాగేందుకు అనర్హులుగా ప్రకటించారు. వీరిని పాలకవర్గం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. తొలగించిన సభ్యుల స్థానంలో సొసైటీ బైలా ప్రకారం కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా 10 మందితో అడ్హాక్ కమిటీని నియమించారు. దీనికి చైర్మన్‌గా వీఎస్వీ సుబ్బారావు, సభ్యులుగా.. గోదావరి శ్రీనివాస చక్రవర్తి, ఎండీ మెహబూబ్ రెహ్మాన్, పీవీ రమణమూర్తి, అంగర నరసింహారావు, సూరి రామ్‌ప్రసాద్, చింతలపూడి సుబ్రహ్మణ్యం, షేక్ జానీ బాషా, ఏవీఎస్ రవికుమార్, జ్యోతుల స్వామిప్రసాద్‌లను నియమించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేసే వరకు సొసైటీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగించారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
గుంతకల్లు: తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఠా కొంతకాలంగా కిడ్నాప్లతో హల్చల్ చేస్తోంది. స్థానిక యువతను ముఠాలో చేర్చుకోవడం, వారికి సమాచారం, సహకారం అందించడం, కిడ్నాప్‌లు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఈ ముఠా లక్ష్యం. దీనికి నాయకుడు సుంకర ప్రసాద్‌నాయుడు. ఎవరీ సుంకర ప్రసాద్? ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. క్రిమినల్ చరిత్ర చాలా పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. జైళ్లు, పోలీసులు, కేసులంటే లెక్కలేదు ఇతనికి. తాను చేసిన హత్యల గురించి ఒక్కొక్కటిగా విడమరిచి మరీ మీడియాకు వెల్లడించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది. ఇంతటి నేర చరిత్ర కల్గిన ఇతని కన్ను ఇటీవల గుంతకల్లు ప్రాంతంపై పడింది. గుంతకల్లు వాసులతో కలసి.. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సుంకర ప్రసాద్ జతకట్టాడు. వీరిలో ముఖ్యుడు జి.కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అతను ఇచ్చిన సమాచారం మేరకు జి.కొట్టాలకు చెందిన ఓ స్వామీజీని గత నెల 29న కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి రూ.26 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.10 లక్షలు వాటాగా జి.కొట్టాలకు చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. ఈ దందా బాగుందని భావించిన జి.కొట్టాల వాసి తన గ్రామానికే చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ వివరాలను సుంకర ప్రసాద్ ముఠాకు చేరవేశాడు. దీంతో సుంకర ప్రసాద్ ముఠా ఈ నెల 20న ఆకుల వ్యాపారిని కిడ్నాప్ చేసింది. అతని కుమారుడు సాయికుమార్‌కు ఫోన్‌చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. సాయంత్రంలోగా సమకూర్చకపోతే వెంకటేష్‌ను చంపుతామని బెదిరించింది. బెంబేలెత్తిన అతను గ్రామస్తుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇంటర్వ్యూలు చూసి.. ఇక సుంకర ప్రసాద్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో చూసి జి.కొట్టాలకు చెందిన వ్యక్తి అతన్ని సంప్రదించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన ఆ వ్యక్తికి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సుంకర ప్రసాద్ సహకారంతో తొలుత స్వామీజీని కిడ్నాప్‌చేసి విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో రెండో కిడ్నాప్‌కు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. ముఠా ఆటకట్టు ఇలా.. పోలీసుల సూచన మేరకు కిడ్నాపర్లకు సాయికుమార్ ఫోన్‌చేసి డబ్బులు సిద్ధం చేశానని, తమ గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో గ్రామానికి చేరుకున్న కిడ్నాపర్లు ఒక కారు ఏర్పాటుచేశామని, అందులో డబ్బు పెట్టాలని సాయికుమార్‌కు చెప్పారు. అదే సమయంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు కారు వదిలేసి పరారయ్యారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ వద్ద వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జి.కొట్టాల వాసితోపాటు సుంకర ప్రసాద్, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. -
ఆర్ఈసీఎస్ ఎండీపై క్రిమినల్ కేసు పెట్టండి
సాక్షి, అమరావతి: రూరల్ ఎలక్ట్రిక్ కో–ఆపరేటివ్ సొసైటీ (ఆర్ఈసీఎస్)ల్లో అధికార దుర్వినియోగం, అనధికారికంగా బిల్లుల వసూలు తదితర ఆరోపణలపై విచారణకు హాజరు కాని అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఈమేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఈసీఎస్‌లలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, అనధికారికంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి ఆర్ఈసీఎస్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న వైనాన్ని సూమోటోగా స్వీకరించిన ఏపీఈఆర్సీ.. ఈ నెల 13న విచారణకు రావాలని ఎండీ రామకృష్ణంరాజుకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన బుధవారం విచారణకు హాజరు కాలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్లు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, విచారణకు హాజరు కాలేనని తెలుపుతూ డాక్టర్ సర్టిఫికెట్తో పాటు లేఖను మెయిల్ ద్వారా కమిషన్‌కు పంపారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకే వెన్నునొప్పిని సాకుగా చూపించారని ఏపీఈఆర్సీ భావించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టాలని బుధవారం విచారణకు హాజరైన ఈపీడీసీఎల్ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై పూర్తి స్థాయి నివేదికలతో ఈ నెల 20న మరోసారి హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విచారణకు రావాలని ఎస్ఈని ఆదేశించింది. అదే రోజు ఎండీ కూడా వ్యక్తిగతంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. మేం ఆదేశించినా ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎస్ఈ సురేష్‌కుమార్ వెంటనే అఫిడవిట్ దాఖలు చేశారు. అనకాపల్లి ఆర్ఈసీఎస్కు లైసెన్స్ మినహాయింపు గడువు ముగియగా, గతేడాది మార్చి 25న దానిని స్వాధీనం చేసుకోవాలని ఈపీడీసీఎల్‌కు ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని ఎస్ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలోనే బిల్లింగ్ జరుగుతుతోందని తెలిపారు. కానీ జూన్ మొదటి వారంలో ఆర్ఈసీఎస్ మే నెల బిల్లులు జారీ చేసి దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసిందన్నారు. బిల్లులు వసూలు చేయవద్దని తాము జూన్ 1న, 3న నోటీసులు జారీ చేశామని వివరించారు. అయినప్పటికీ ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదన్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను వెంటనే ఈపీడీసీఎల్‌కు పంపాలని కోరుతూ జూన్19న, 22న, 23న లేఖలు పంపినప్పటికీ స్పందన లేదన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.9 కోట్లను వెంటనే రికవరీ చేస్తామని, అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఈ అఫిడవిట్లో తెలిపినట్లు విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. -
43 శాతం మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 28 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) నివేదిక ఈ మేరకు పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాను 4,759 మంది ఎన్నికల అఫిడవిట్లను నివేదిక పరిశీలించింది. క్రిమినల్ కేసుల్లో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియా కోజ్ తొలిస్థానంలో ఉన్నారు. ఆయనపై 37 తీవ్రమైన క్రిమినల్ కేసులతో పాటు మొత్తం 204 కేసులున్నాయి. 37 తీవ్రమైన కేసులతో పాటు మొత్తం 64 కేసులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. సంపన్న ప్రజాప్రతినిధుల జాబితాలో టీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్లతో తొలి స్థానంలో, వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రూ.2577 కోట్లతో రెండో స్థానంలో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రూ.668 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. -
‘బెయిల్ చట్టం’ తీసుకురండి..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో నిందితులను జైలు నుంచి విడుదల చేసే విషయంలో క్రమబద్ధత సాధించేందుకు బెయిల్ చట్టం తీసుకువచ్చే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. చట్టంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి, రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్వాతంత్య్రానికి పూర్వమున్న విధానానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొంది. దేశంలోని జైళ్లు విచారణ ఖైదీలతో కిక్కిరిసిపోయాయని తెలిపింది. గుర్తించదగిన నేరాన్ని నమోదు చేసినప్పటికీ వీరిలో ఎక్కువ మందిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై పోలీసు రాజ్యమనే ముద్ర పడరాదని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
నేరస్తుడికి స్వాగతం ర్యాలీ... 83 మంది అరెస్టు
కొంతమంది నేరస్తులకు అరెస్టు అయినా భయం ఉండదు. జైలుకి వెళ్లడం అంటే ఏదో ఘన కార్యం చేసినట్లుగా ఫీలవుతారు. వాళ్లకి పొరపాటున బెయిల్ వచ్చి విడుదలైతే...వాళ్ల సహచరులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అచ్చం అలానే ఇక్కడొక నేరస్తుడికి కూడా అతని సహచరులు ఇలానే హడవిడి చేసి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో బెయిల్ పొందిన ఒక నేరస్తుడుకి ఘన స్వాగంత పలికి ఇతరులను ఇబ్బంది పెట్టినందుకు గానూ సుమారు 83 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్ నివాసి, గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు చెందిన నేరస్థుడు తీహార్ జైల్ నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు. దీంతో అతనికి స్వాగతం పలికేందుకు పేరుమోసిన నేరస్తులు, సహచరులు తీహార్ జైలు వద్దకు వచ్చారు. ఈ మేరకు వారంతా ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా మీదుగా 'షో ఆఫ్ పరేడ్(స్వాగతం ర్యాలీ)'ని నిర్వహించి మరీ ఆ నేరస్తుడుని ఘనంగా తీసుకువెళ్లారు. అక్కడ ఉండే స్థానికులను ఇబ్బంది పెట్టేలా గోల చేస్తూ... ఆ నేరస్తుడిని ఊరేగిస్తూ తీసుకువెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని...19 వాహానాలను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా సుమారు 83 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: రోడ్డు బంద్ చేసి మరీ ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన ప్రజలు ఏం చేశారంటే..) -
బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో పనిచేసినప్పుడు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు నడుచుకున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయనపై సీబీఐ, ఈడీల్లో మూడు కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీతోపాటు జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్, డిప్యూటీ కమిషనర్ చిల్కల సుధారాణి, సూపరింటెండెంట్ ఇస్బెల్లా బ్రిట్టోలపై గత శుక్రవారం క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ.. ►బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన జేఎస్ శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ స్టీల్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్నాళ్లు ఆయన భార్య జె.రాఘవిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. తర్వాత తన భర్తకే ఆమె జీపీఏ ఇచ్చారు. అయితే 2019లో ఆ సంస్థపై జీఎస్టీ ఎగవేత ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 27 సాయంత్రం 5.30 గంటలకు ఐదుగురు వ్యక్తులు శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తాము జీఎస్టీ అధికారులమని, ఇంట్లో సోదాలు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు చూపించలేదు. వీరంతా తీవ్ర అభ్యంతరకరంగా, ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రవర్తించారు. ►తన భర్త విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చాక వివరణ ఇస్తారని రాఘవిరెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. సోదాల సమయంలో బాధితురాలి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులూ ధ్వంసమయ్యాయి. జీఎస్టీ అధికారుల తీరుతో బాధితురాలి కుటుంబీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ►కొన్ని గంటలపాటు జరిగిన సోదాల్లో శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు బాధితురాలిని బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలయానికి తరలించి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్బంధించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గాంధీతోపాటు సుధారాణి ఆ కార్యాలయానికి వచ్చారు. బాధితురాలిని బెదిరిస్తూ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ►ఆ మొత్తం లంచం తమ కోసమేకాదని, ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్లకూ వాటా ఇవ్వాల్సి ఉంటుందని గాంధీ ఆమెతో చెప్పారు. తాను 2009లోనే భర్త పేరుతో జీపీఏ ఇచ్చానని చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అయినప్పటికీ తాము పట్టించుకోబోమంటూ వారిద్దరూ బాధితురాలిపై తీవ్ర, అసభ్య పదజాలం వాడారు. ఆమె చూపిస్తున్న జీపీఏ కాపీలను గాంధీ చింపి నేలపై పడేశారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ తతంగం నడిచింది. ►అదేరోజు మధ్యాహ్నం మరోసారి కార్యాలయానికి రావాలంటూ రాఘవిరెడ్డిని బెదిరించి పంపారు. ఇస్బెల్లా బ్రిట్టో తన వాహనంలో ఆమెను ఇంటికి చేర్చారు. మధ్యాహ్నం మరోసారి ఆమెను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. అయితే ఆ సందర్భంలో ఆనంద్ కుమార్ అభ్యంతరంగా ప్రవర్తించారంటూ బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాల మేరకు గత శుక్రవారం ఐదుగురిపై ఐపీసీ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►గాంధీతోపాటు సుధారాణి 2021 ఫిబ్రవరి నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో దఫా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితంతో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికార పీఠంపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఓ యువకుడు ఆందోళనలో ఉన్నాడు. కారణం ఏంటని అంటారా?.. ప్రాణభీతి. సీఎంగా యోగి ఆదిత్యానాథ్ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయ్యారు. వరుస ఎన్కౌంటర్లలో క్రిమినల్స్‌ను ఏరిపారేయించారు. ఈ తరుణంలో ఆయన రెండోసారి సీఎం అయ్యేసరికి.. తననూ ఎక్కడ ఎన్కౌంటర్ చేయిస్తాడో అని భయపడుతున్నాడు ఆ వ్యక్తి. తనను చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ముందస్తుగా లొంగిపోవడమే మంచిదని భావించి.. గౌతమ్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అదీకాక ‘నేను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నా.. నన్ను దయచేసి చంపోద్దు’అంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు
సాక్షి, హైదనాబాద్: ‘ఇబ్రహీంపట్నంలో స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను తుపాకీతో కాల్చి చంపేసిన ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతిలు తొలిసారి నేరస్తులే. అప్పటివరకు వాళ్లసలు గన్ను ఎప్పుడు చూడలేదు, పట్టుకోలేదు కూడా. హత్యకు 20 రోజుల ముందు తుపాకీని కొనుగోలు చేసి గురి తప్పకుండా ఎలా కాల్చాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు’ ‘గచ్చిబౌలిలో భువనతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యజమాని వెంకట సుబ్రమణ్యం యజమాని ఇంట్లోకి ఐటీ అధికారుల వలే ప్రవేశించి రూ.2 లక్షల నగదు, 13.40 తులాల బంగారంతో ఉడాయించిన తొమ్మిది మంది నిందితులూ తొలిసారి నేరస్తులే. చోరీ కంటే ముందు నిందితులు.. సోదాల సమయంలో ఐటీ అధికారులు ఎలా ప్రవర్తిస్తారో ‘స్పెషల్ 26’ హిందీ సినిమా చూసి నేర్చుకున్నారు. ...ఇలా ఒకట్రెండు సంఘటనలు కాదు గ్రేటర్లో నమోదవుతున్న నేరాలలో సగానికి పైగా కేసులలో నిందితులు తొలిసారి నేరస్తులే. ఇంటర్నెట్లో సినిమాలు, యూట్యూబ్‌లో చూసి నేరాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. జల్సాల కోసం.. పిల్లలు, పెద్దలు ఎవరినైనా సరే ‘ఫలానా వాణ్ని చూసి నేర్చుకో’ అంటుంటాం. దీన్నే కాస్త మార్చేసి సినిమాలు, యూట్యూబ్‌లలో చూసి నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, వాహనాల చోరీలు, చైన్ స్నాగింగ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నేరస్తులు భావిస్తున్నారు. అక్రమ సంపాదనతో గోవా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లి జల్సాలు చేస్తుంటారు. జేబు ఖాళీ కాగానే మళ్లీ నేరాల బాట పడుతుంటారు. పోలీసుల చేతికి చిక్కి జైలుకెళ్లిన ప్రవర్తన మార్చుకోకపోగా.. పాత నేరస్తులతో పరిచయాలు చేసుకొని బయటికొచ్చాక కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు.. గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని వాళ్లు కూడా నేరస్తులుగా మారుతున్నారు. వ్యక్తిగత కక్షలతో కొందరు, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని మరికొందరు నేరస్తులుగా మారిపోతున్నారు. తొలిసారి నేరస్తులలో యువతే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. సాధారణంగా పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంటుంది. జైలు నుంచి విడుదలయ్యాక వారి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. కొన్ని సందర్భాలలో నేరం జరగకముందే అడ్డుకునే అవకాశం ఉంటుంది. కొత్త నేరస్తుల విషయంలో అలా కుదరదు. వారు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు నేరానికి పాల్పడతారో పసిగట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో నేరాలలో కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలి, జల్సా చేయాలనే వక్రబుద్ధే కొత్త నేరగాళ్ల పుట్టుకకు కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? పాత నేరస్తుల అనుభవాలే పాఠాలుగా.. ∙తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడపాలి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగాలి.. నేరస్తులు ఎవరైనా ఇదే తరహా ఆలోచనే. నేరం చేయడానికి ఏ స్థాయిలో ప్రణాళికలు వేస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నేరం చేశాక పోలీసులకు దొరకకుండా పథకం రచిస్తున్నారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నేరస్తులు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం తొలిసారి నేరస్తులు, పాత క్రిమినల్స్‌లో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారి అనుభవాలను, పోలీసుల దర్యాప్తు, విచారణల గురించి ముందుగానే తెలుసుకొని రంగంలోకి దిగుతున్నారు. నేరం చేయడానికి ముందు ఇంటర్నెట్ ఆ తరహా నేరాలకు సంబంధించిన సినిమాలు, యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. వాటిని చూసి పక్కాగా అమలుపరుస్తున్నారు. ఖరీదైన వాహనాల నుంచి కార్పొరేట్ మోసాల వరకూ నేరస్తులది ఇదే మార్గం. ఏటా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లక్షల్లోనే నేరాలు జరగుతున్నాయి. నేరగాళ్లను పట్టుకోవటం, జైలు శిక్షలు వేసినా సరే ఏటా నేరాల సంఖ్య 10–15 శాతం వరకు పెరుగుతోంది. చదవండి: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది! -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
యూపీ: 25 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండో దశలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 584 మంది పోటీపడుతుండగా... వీరిలో 25 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా యని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్సు తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా.. వీరిలో 35 మందిపై (67 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. కాంగ్రెస్ తరఫున రంగంలో నిలిచిన 54 మందిలో 23 మందిపై కేసులున్నాయని, బీఎస్పీ నిలబెట్టిన 55 మంది అభ్యర్థుల్లో 20 మంది కేసులను ఎదుర్కొంటున్నారని వివరించింది.