సాక్షి, శివాజీనగర: ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో స్యాంట్రో రవి చర్చనీయాంశమయ్యాడు. అతనికి అనేక నేరాలతోను, అలాగే రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం. ఇక కొత్తగా మరో కేసు బయటకు వచ్చింది. గత నవంబర్ 23న బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ క్రిమినల్ కేసుతో అతనికి సంబంధమున్నట్లు తెలిసింది.
స్యాంట్రో రవి రెండవ భార్య, బంధువులు తనపై దాడి చేశారని రవి స్నేహితుడు కేసు పెట్టాడు. రవినే ఈ కేసు పెట్టించాడని, ఆమె వద్ద ఉన్న లాప్‌టాప్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమె అతన్నుంచి విడిగా ఉంటోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు రవి రెండో భార్య, ఆమె సోదరి, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెయిల్‌పై విడుదలైన తరువాత రెండో భార్య మైసూరులో రవిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆ లాప్‌టాప్‌లో పలు సంచలన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని, అవి బహిరంగమైతే కలకలం ఏర్పడుతుందని తెలిసింది. ఈ రెండు ఫిర్యాదుల్లో వాస్తవాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
(చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య )
Comments
Please login to add a commentAdd a comment