Political Gossip
-
Ding Dong 2.O: కోతల రాయుళ్ళకి వాతలు మాయ చేసే నాయకులకు చురకలు
-
ఇకపై అలాంటి సినిమాలు తీయను: Kangana Ranaut
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్
-
జన్వాడ కేసులో కొత్త కీలక మలుపు
-
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది. జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
13 స్థానాల్లో కేవలం 4 స్థానాలకే బీసీలకు కేటాయింపు
-
పాన్ షాప్ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్ ఏం చేశాడంటే..
రాయ్‌పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్ షాప్‌ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గడ్‌లోని ఓ పాన్ షాప్ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్ నిర్వాహకుడు ఏం చేశాడంటే.. డిసెంబర్ 3 వరకు ఆగండి.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్ షాప్ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్ తెలిపారు. కాగా ముంగేలి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. -
రాజకీయాలకు నేను చాలా దూరం: యండమూరి వీరేంద్రనాథ్
-
వాలంటీర్లు లేకపోతే ఇన్ని పథకాలు ప్రజలకు అందకపోయేవి
-
40 ఇయర్స్ ఇండస్ట్రీ వచ్చినా.. ఫ్లాప్ షోనే ఎందుకు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో మూడు రోజుల పర్యటన ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ పార్టీ కేడర్‌లో సైతం జోష్ నింపలేకపోయింది. వైఎస్సార్ కడప జిల్లా నుంచి జిల్లాలోని గిద్దలూరుకు బుధవారం రాత్రి ఆయన చేరుకున్నారు. అదేరోజు రాత్రి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. మొదటి సబే అట్టర్ ప్లాప్ కావడంతో అక్కడి నుంచే టీడీపీ నాయకులు, కేడర్‌పై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు పార్టీ కేడర్‌లో ఊపు ఇవ్వలేకపోయారన్నది ఆ పార్టీ నేతల నోటి నుంచే వినిపిస్తోంది. గిద్దలూరు నుంచి ఆ రోజు రాత్రి 11 గంటలకు బయలుదేరి మార్కాపురం చేరుకున్నారు. మార్కాపురంలోనే బస చేశారు. గురువారం రెండో రోజు చంద్రబాబు పుట్టిన రోజు అక్కడే నిర్వహించుకున్నారు. తొలుత పుట్టిన రోజు వేడుకలను మార్కాపురంలో భారీగా నిర్వహించాలనుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేయాలని చూశారు. కానీ, విఫలమయ్యారు. ఒక పక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగానే మహిళలు లేచి వెళ్లిపోవడం కనిపించింది. ఇక అదే రోజు సాయంత్రం మార్కాపురంలో నిర్వహించిన సభ సైతం తుస్సుమనిపించింది. వెలిగొండ ప్రాజెక్టు మీద చెప్పిందే చెప్పి.. మళ్లీ..మళ్లీ చెప్పి ప్రజలను విసుగెత్తించారు. తాను అధికారంలో ఉండగా ఒక టన్నెల్‌ను కూడా 5 కిలోమీటర్లు పూర్తి చేయించలేని ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీరుస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ముచ్చటగా మూడో రోజు సైతం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంద్రబాబు మార్కాపురంలోనే కాలక్షేపం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డాక్టర్లు, ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులు, రైతులతో విడివిడిగా ముఖాముఖీలు ఉంటాయని నాయకులు తెలిపారు. అయితే, అలాంటివేమీ జరగులేదు. ఎంపిక చేసుకున్న కొద్దిమంది రైతులతో మాత్రమే ముఖాముఖి నిర్వహించి ముగించారు. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకే జరిగింది. సెల్ఫీలతో కాలక్షేపం.. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ గడిపారు. సాయంత్రం 5 గంటలకు మార్కాపురం నుంచి యర్రగొండపాలెం బయలుదేరి వెళ్లారు. బయలుదేరినప్పటి నుంచే చంద్రబాబు కేడర్‌పై కొంత అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. దళితుల నిరసన సెగ... యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు దళితుల నుంచి సెగ ఎదురైంది. దళితులు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. దళితులపై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల టీ షర్టులు, ప్లకార్డులు, నల్ల బెలూన్లు ప్రదర్శించి చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దళితుల వ్యతిరేకి చంద్రబాబు అంటూ ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలను చంద్రబాబు స్వయంగా చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి వేలు చూపించి మరీ బెదిరించారు. చంద్రబాబు ప్రసంగంతో టీడీపీ కేడర్ కూడా రెచ్చిపోయి దళితులపైకి రాళ్లు రువ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది. బయటపడిన విభేదాలు... చంద్రబాబు పర్యటనలో గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అధినేత పర్యటన సందర్భంగా తమను పట్టించుకోలేదంటూ గిద్దలూరులో సాయికల్పన అలకబూనారు. అశోక్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యర్రగొండపాలెం పట్టణంలో గ్రూపుల వారీగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొంత మంది నేతలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉన్నా కేడర్‌లో ఏమాత్రం జోష్ కనిపించలేదు. ఆయన పార్టీ కేడర్‌పై అసహనం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు చిన్నబుచ్చుకున్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాయి. వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ఆయన దశాబ్దకాలంగా చెబుతున్న అబద్దాలే తిరిగి చెప్పారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. -
హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?
సాక్షి, శివాజీనగర: ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో స్యాంట్రో రవి చర్చనీయాంశమయ్యాడు. అతనికి అనేక నేరాలతోను, అలాగే రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం. ఇక కొత్తగా మరో కేసు బయటకు వచ్చింది. గత నవంబర్ 23న బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ క్రిమినల్ కేసుతో అతనికి సంబంధమున్నట్లు తెలిసింది. స్యాంట్రో రవి రెండవ భార్య, బంధువులు తనపై దాడి చేశారని రవి స్నేహితుడు కేసు పెట్టాడు. రవినే ఈ కేసు పెట్టించాడని, ఆమె వద్ద ఉన్న లాప్టాప్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమె అతన్నుంచి విడిగా ఉంటోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు రవి రెండో భార్య, ఆమె సోదరి, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తరువాత రెండో భార్య మైసూరులో రవిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆ లాప్టాప్లో పలు సంచలన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని, అవి బహిరంగమైతే కలకలం ఏర్పడుతుందని తెలిసింది. ఈ రెండు ఫిర్యాదుల్లో వాస్తవాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
పెనుకొండ టీడీపీలో ముసలం..
సాక్షి, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వరుస కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు మాట అటుంచితే పార్టీ టికెట్ పార్థుడికి దక్కడం కష్టమేనన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సవిత ధీమా రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితలో ఆశలు రేకెత్తాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన ఆమె.. ఇతర జిల్లాల్లోనూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఇమేజ్ను పెంచుకునే చర్యలు ముమ్మరం చేశారు. కలిసొచ్చిన రాజకీయ శత్రువు.. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం సవితకు కలిసొచ్చింది. పార్థుడిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసి నిమ్మలలో వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీకే ప్రతి సమావేశంలోనూ నిమ్మలను అవమానపరుస్తూ వచ్చారు. దీంతో పార్థుడి ఓటమే లక్ష్యంగా కిష్టప్ప తన రాజకీయ అస్త్రాలను ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో సవితకు కిష్టప్ప మద్దతు ఇస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తన కుమారులు అంబరీష్, శిరీష్‌లో ఎవరో ఒకరికి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కిష్టప్ప పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి లేక పెనుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి కుమారులను బరిలో దించేందుకు కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా తన భార్యకు పార్టీ టికెట్ దక్కించుకునేందుకు సవిత భర్త వెంకటేశ్వర చౌదరి పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలు పెట్టారు. కానీ బీకే మాత్రం అధిష్టానానికి తనపైనే ఎంతో గురి ఉందని, ప్రజల్లోనూ తనకే పట్టు ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాతోనే పార్టీలో ఏ ఒక్కరినీ ఆయన ఖాతరు చేయడం లేదు. ఎడమొహం.. పెడమొహం.. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బీకే పార్థసారథి ఓ కార్యక్రమాన్ని చేపడితే దానికి ప్రతిగా సవిత మరో కార్యక్రమానికి పిలుపునిస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకూ బీకే వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు సవితమ్మ గ్రూపులోకి చేరారు. ఇక ఏదైనా కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. అంతటితో ఆగకుండా దూషణల పర్వానికి తెర తీస్తున్నాయి. ఇటీవల పెనుకొండలోని బోయగేరిలో పార్థుడి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ పార్థుడి ముఖ్య అనుచరుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాడు. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. పోటాపోటీగా కార్యాలయాలు.. పెనుకొండలో టీడీపీ నాయకులు రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. తన స్వగృహంలోనే పార్థుడు కార్యాలయం నిర్వహిస్తుండగా.. ప్రతిగా ఎన్టీఆర్ సర్కిల్లో సవితమ్మ చేత మరో కార్యాలయాన్ని ఆమె వర్గీయులు ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా పోటాపోటీగా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర విభేధాలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ( చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి ) -
తుమ్మల హ్యూహం అర్థం కావడంలేదంటున్న అనుచరులు
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ తథ్యం.. సేవా కార్యక్రమాలు విస్తృతం
నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనిపిస్తోంది. చాలాకాలం క్రితమే ఈయన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ అభిమానులతో సమావేశాలు నిర్వహించి మరింత జోష్ తెచ్చారు. అయితే కారణాలు ఏమైనా అప్పట్లో వెనుకంజ వేశారు. ప్రస్తుతం అగ్ర నటుడిగా రాణిస్తున్న విజయ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోపక్క అభిమానులను ప్రజల అవసరాలను గ్రహించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో విజయ్ మక్కళ్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. தளபதி @actorvijay அவர்களின் வாழ்த்துக்களுடன், செங்கல்பட்டு மேற்கு மாவட்ட மாணவரணி தலைமை தளபதி மக்கள் இயக்கம் சார்பாக ஊக்குவிக்கும் விதமாக இரட்டை மாணவ சகோதரிகளுக்கு ரூபாய் ₹20,000/-த்தை கல்வி உதவித் தொகையாக வழங்கினார்கள்.!@BussyAnand @Jagadishbliss @RIAZtheboss #TVMI #Varisu pic.twitter.com/q1lnXwWBOJ — Thalapathy Vijay Makkal Iyakkham (@TVMIoffl) August 26, 2022 అలాగే ప్రతి ఆదివారం పుదుచ్చేరిలో తనే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు పదవుల కోసం పరుగులు తీస్తుంటే విజయ్ మక్కళ్ ఇయక్కం నిర్వాహకులు ప్రజల మధ్యకు వెళ్తూ వారి అవసరాలను తీర్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. தளபதி @actorvijay அவர்களின் உத்தரவின்படி, இன்று அகில இந்திய தளபதி மக்கள் இயக்க தலைமை அலுவலகத்தில் தகவல் தொழில்நுட்ப அணி தொடர்பான ஆலோசனைக்கூட்டம் நடைபெற்றது.!#ThalapathyVijayMakkalIyakkham #TVMI #Beast #Varisu @BussyAnand @Jagadishbliss @RIAZtheboss pic.twitter.com/KAEcENgRJ7 — Thalapathy Vijay Makkal Iyakkham (@TVMIoffl) August 21, 2022 -
కాంగ్రెస్‌లోకి త్రిష! రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ క్లారిటీ
సినిమాకు, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. పరిస్థితులు, అవకాశాలను బట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడం సర్వ సాధారణం. ముఖ్యంగా తమిళనాడులో సినీ రాజకీయాలు ప్రత్యేకం. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు, రచయితలు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక నటీమణుల విషయానికి వస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సీనియర్ హీరోయిన్లలో చాలామంది తదుపరి గురి రాజకీయాల పైనే. నటి వైజయంతి మాల నుంచి వెన్నరాడై నిర్మల, జయప్రద, నగ్మ, కుష్భు, కోవై సరళ, శ్రీప్రియ, రాధిక, నమిత ఇలా చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చినవారే. ఈ జాబితాలో తాజాగా నటి త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఆమెకు నటిగా ఒక స్థాయి, ప్రత్యేక గౌరవం ఉంది. అయితే త్రిష తరఫున నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ ప్రచారంపై స్పందించ లేదు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ దీనిపై స్పందించారు. త్రిష కాంగ్రెస్‌లో చేరడంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఈ సమాచారం, ప్రచారం నిజమో? కాదో తనకు తెలియదన్నారు. ఆమె పార్టీలో చేరడం ద్వారా పార్టీకి బలమవుతుందని తాను భావించడం లేదని, పెద్దగా స్పందన కూడా ఉండదన్నారు. త్రిషనే కాదు ఇంకెవరైనా తమ పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తామని ఇళంగోవన్ పేర్కొన్నారు. -
రజనీకాంత్ పొలిటికల్ రీ ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా వారి భేటీ!
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క రోజు తర్వాత తమిళనాడు గవర్నర్ రవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రజనీకాంత్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రవితో దాదాపుగా 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని రజనీకాంత్ కలిశారని వార్తలొచ్చాయి. గవర్నర్ భేటీ అయిన తలైవా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాలపైనే గవర్నర్‌తో చర్చించానని చెప్పారు. అయితే తానేం మాట్లాడానో మీడియాకు వెల్లడించలేనన్నారు. తనకు భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డించడం గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న -
Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..?
విశాఖపట్నం (భీమిలి): ‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్. సుమన్‌గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు. కరాటేలో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో. లవర్‌బాయ్, కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అన్నమయ్య సినిమాలో పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రంలో పోషించిన రాముడి పాత్ర మరపురానివి. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయనతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: చిరంజీవికి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? సుమన్: చిరంజీవికి నాకు విభేదాలు ఉన్నాయని అనుకోవడం పొరపాటే. మేమంతా ఒకే కుటుంబం. అదే సినీ కుటుంబం. నాకు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1980 బ్యాచ్ అంటే చిరంజీవి, వెంకటేష్ రజినీకాంత్, భానుచందర్, సుహాసిని, సుమలత, రాధిక తదితర నటులందరం కలుసుకుంటాం. ఇక్కడ అందరం స్నేహ పూర్వకంగానే ఉంటాం. సాక్షి: సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు ఎప్పుడు వస్తుంది? సుమన్: సినీ పరిశ్రమ ఎక్కడ ఉన్నా.. ఎంత పెద్ద సినిమా అయినా.. సినిమా చిత్రీకరణలో విశాఖ ఒక భాగంగా మారింది. సినీ పరిశ్రమకు వైజాగ్ అనుకూలం. అరకు, బీచ్‌రోడ్డు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ సినిమా నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరించే వారికి రాయితీ అందించాలి. వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించాలని సినీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వనించారు. ఇక్కడ ఫిల్మ్ స్టూడియోలు నిర్మించినప్పుడే.. సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాక్షి: తెలుగులో ఏ సినిమాతో మీరు అరంగేట్రం చేశారు? సుమన్: 1978లో నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. తమిళ్లో నా ఫస్ట్‌మూవీ స్విమ్మింగ్‌పూల్(నీచల్ కులం). 1982లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. తరంగణి నా మొదటి తెలుగు సినిమా. సాక్షి: మీ 44 ఏళ్ల సినీ ప్రయాణం ఎలా సాగింది? సుమన్: ఈ 44 ఏళ్లలో ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక్కసారిగా హీరో నుంచి జీరో స్థాయికి చేరుకున్న సందర్భం కూడా ఉంది. భగవంతుడి దయతో మరల హీరో స్థాయికి చేరుకున్నాను. అగ్రకథానాయకులు రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి నటులతో నటించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ ప్రయాణంలో ఒడిదొడుకులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడిన నాడే నిజ జీవితంలో హీరోగా నిలుస్తాం. సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? సుమన్: హీరోగా, విలన్‌గా 10 భాషల్లో 600లకుపైగా సినిమాల్లో నటించాను. సాక్షి: తెలుగులో మళ్లీ హీరోగా చేస్తున్నారా? సుమన్: సినిమాలో కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగులో హీరోగా 101వ సినిమా సంగప్పలో నటిస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో సినిమా సిద్ధన్నగట్టులో నటిస్తున్నాను. సాక్షి: అప్పట్లో ఒక హీరో ఏడాదికి 10 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఎందుకని? సుమన్: నిజమే. హీరోగా నేను అప్పట్లో ఒక్క ఏడాదిలో 11 సినిమాలు చేశాను. అప్పట్లో అవుట్‌డోర్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఇండోర్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు కష్టపడేవాళ్లం. షెడ్యూల్‌ను సర్దుబాటు చేస్తూ సినిమాల్లో నటించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఒక సినిమాలో నాలుగు సీన్లు తీస్తే ఓ రోజు అయిపోతుంది. ఈ రోజుల్లో కనీసం రోజుకు 12 గంటలు కష్టపడితే .. ఏడాదికి ఐదు సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. సాక్షి: నేడు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీనికి కారణం? సుమన్: ఏ సినిమాకైనా ప్రస్తుతం కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుంటే సినిమా కొనుగోలుదారులకు సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా కాస్త ఊరట కలుగుతుంది. కథకు మించి నటులను పెట్టడం.. దేశ, విదేశాల్లో చిత్రీకరణ వలన నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. సాక్షి: చిన్న సినిమా వాళ్ల పరిస్థితి ఏంటి? సుమన్: చిన్న బడ్జెట్‌తో కొత్త నటీనటులతో తీసే సినిమాలను ప్రోత్సహించాలి. చిన్న సినిమా వాళ్లకు ఎక్కడ రిలీజ్ అయినా రాయితీ, పరి్మషన్లు ఇచ్చినట్లయితే.. వారికి ఇబ్బందులు తొలుగుతాయి. సాక్షి: ప్రస్తుతం మిగతా భాషల్లో నటిస్తున్నారా? సుమన్: ప్రస్తుతం కన్నడలో 3, తమిళంలో 1 హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్నాను. సాక్షి: మీ వారసులు సినీ పరిశ్రమ వైపు ఎందుకు రాలేదు? సుమన్: నాకు ఒక అమ్మాయి. పేరు ప్రత్యూష. తను వైద్య రంగంలో మంచి స్థాయిలో ఉంది. హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. సినీ పరిశ్రమ వైపు తనకు ఆసక్తి లేకపోవడంతో వైద్య రంగం వైపు అడుగులు వేసింది. సాక్షి: రాష్ట్రంలో ప్రభుత్వపాలనపై మీ అభిప్రాయం? సుమన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు తీరు బాగుంది. ప్రభుత్వం వారికి ఆసరా అందిస్తోంది. సాక్షి: మీరు రాజకీయాల్లోకి వస్తారా? సుమన్: కళామతల్లి ఆశీస్సులతో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పటివరకు లేదు. -
ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’
Actor Vijay's fans plan to contest urban local body polls: నటుడు విజయ్ రాజకీయ తెరంగేట్రంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఎం. చంద్రశేఖర్ విజయ్ మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే విజయ్‌కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని ఆంక్షలు విధించినా అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం వారంతా విజయ్ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) ఇది రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. -
చిరంజీవి రాకపై ఇప్పుడే చెప్పలేను: పవన్‌కల్యాణ్
సాక్షి, అమరావతి: అన్నగా తన విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని, ఆయన నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని, అయితే ఆయన పార్టీలోకి వస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేనని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో శుక్రవారం రాత్రి పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చిరంజీవి గురించి పై వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం కాపు సంక్షేమం కోసమేనని పవన్ అన్నారు. కాపుల వెనుకబాటుతనాన్ని బలంగా జనసేన ముందుకు తీసుకెళుతుందన్నారు. కాపుల న్యాయపరమైన సమస్యలపై భవిష్యత్తులో తాను అండగా ఉంటానన్నారు. తుని ఘటనలో పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని జిల్లాల్లో ఎత్తివేయలేదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు హరిరామ జోగయ్య తదితరులు పాల్గొన్నారు. -
తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా..
చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని షకీలా అన్నారు. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఆమె బయోపిక్ ఇప్పుడు షకీలా పేరుతోనే ఐదు భాషల్లో రూపొందింది. ఇందులో షకీలా పాత్రలో నటి ఏస్తర్ నటించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి షకీలా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం షకీలా అని తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందుపరచలేదని.. చిత్రానికి ఏది అవసరమో దాన్ని చెప్పినట్లు తెలిపారు. ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమని అన్నారు. తాను చేసిన తప్పులను కూడా ఈ చిత్రంలో చూపినట్లు తెలిపారు. ఈ చిత్రం నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు. అయినా తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమని షకీలా పేర్కొన్నారు. -
మీకో దండం.. నాకేం సంబంధం లేదు: బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్: తను మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వస్తున్న వదంతులను నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొట్టి పారేశారు. ఏ పార్టీలో చేరడం లేదని, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్లు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా బండ్ల గణేష్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపించాయి. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో(బీజేపీ) పార్టీలో చేరబోతున్నట్లు వదంతులు వ్యాపించాయి. కాగా ఈ రూమర్లను ఖండిస్తూ రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ తన ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్’ అంటూ పేర్కొన్నారు. కాగా 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం తన పౌల్ట్రీ వ్యాపారాన్ని చూసుకుంటూ, సినిమాలపైన ఫోకస్ పెట్టారు. చదవండి: దయచేసి నా కడుపు మీద కొట్టకండి నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ 🙏🙏🙏 — BANDLA GANESH. (@ganeshbandla) November 22, 2020 అయితే ఎంత చెప్పినప్పటికీ బండ్ల గణేష్ రాజకీయ పునఃప్రవేశంపై పుకార్లు ఆగడం లేదు. కొందరు పనిగట్టుకుని మరీ బండ్ల గణేష్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఊరుకోండి సార్ మీరు ఇలాగే అంటారు. మరి కాసేపటికి మనుసు మార్చుకుంటారు. ఎన్నిసార్లు చూడలేదు’ అంటూ రచ్చ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది బీజేపీలోకి చేరుతున్నారని, బండ్ల గణేష్ కూడా త్వరలో కాషాయ కండువా కప్పుకోబుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రూమర్లపై మరోసారి స్పందించిన నిర్మాత.. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం.’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ షేర్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్ నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం. 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) November 26, 2020 -
రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందా..?
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ ప్రవేశం ఇంకా జరగలేదు. ఆయన అభిమానులు మాత్రం రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని పదే పదే చెబుతున్నారు. కాగా నటుడు రజినీకాంత్ కూడా ఇటీవల తన ప్రజా సంఘం నిర్వాహకులతో భేటీ అవ్వడం ఆ తర్వాత మీడియా ముందుకు రావడం వంటి సంఘటనలు జరిగాయి. అయితే మీడియాతో కూడా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజల కూడా రజనీ వైఖరి ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే మాత్రం నటుడిగా వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సన్ ఫిక్చర్స్ నిర్మిస్తున్న ఆన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలంటూ నిర్మాణ సంస్థ మొదట్లోనే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా అన్నాత్త చిత్ర విడుదల వాయిదా పడక తప్పలేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కాగా నటుడు రజినీకాంత్ తాజాగా మరో మూడు చిత్రాలను చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: కలలు కరువయ్యాయా? అందులో ఒక చిత్రాన్ని లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నటుసమాచారం. అదేవిధంగా కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. అయితే ఆ తర్వాత రజనీకాంత్ వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ప్రముఖ దర్శకుడు శంకర్‌తో కలిసి మరో చిత్రం చేయడా నికి రజనీకాంత్ సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ పూర్తిగా రాజకీయ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. చదవండి: సుశాంత్ చాలా హుందాగా ప్రవర్తించేవాడు ఈ చిత్రాల గురించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇకపోతే రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో చేసే చిత్రం తర్వాత నటనకు స్వస్తి చెప్పనున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ వయస్సు (69). ఆయన కొత్తగా ఒప్పుకున్న చిత్రాల సమాచారం నిజమైతే మరో మూడేళ్ల వరకు నటనకే పరిమితమవుతారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆయన ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ పేరు నే ప్రకటించలేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే ఆనుమానం కూడా వ్యక్తమవుతోంది. -
రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను..
సినిమా: రాజకీయాల్లోకి వస్తానని కచ్చితంగా చెప్పలేనని నటి శ్రుతిహాసన్ ఆసక్తికరమైన చర్చకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. అంతే కాదు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించేస్తోంది కూడా. ముఖ్యంగా తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంలో నటిస్తోంది. ఎస్పీ.జననాథన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. తెలుగులో రవితేజకు జంటగా క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో కాజోల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరిన్ని చిత్రాల్లో నటించే విషయమై కథలు వింటున్నట్లు చెప్పింది. మొత్తం మీద నటిగా ఇప్పుడు బిజీగా ఉంది. ఇటీవల మధురైలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్ మీడియాతో ముచ్చటించింది. ముఖ్యంగా తన తండ్రి రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎప్పుడూ తన తండ్రికి మద్దతు ఉంటుందని చెప్పింది. అయితే తనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పింది. రాజకీయాల్లోకి వస్తానా? అన్నది చెప్పలేనని అంది. తాను ఇతరుల పనితో పోల్చుకోవడానికి ఇష్టపడనని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను ఏం సాధించగలనో ఆ పనే చెస్తానని పేర్కొంది. ఇక తన తండ్రి గురించి చెప్పాలంటే ఆయనకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ అని తెలిపింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. కమల్‌హాసన్, రజనీకాంత్ కలుస్తారా? అన్న ప్రశ్నకు చెప్పలేనని తెలిపింది. రాజకీయాలపై తనకంత పరిజ్ఞానం లేదని పేర్కొంది. -
కురుక్షేత్రం 10th May 2019
-
కురుక్షేత్రం 17th April 2019
-
పొలిటికల్ మంటపై ఎన్నికల వంట!
‘‘ఎలక్షన్లకూ, వంటలకూ బాగా దగ్గరి సంబంధం ఉందని నా అభిప్రాయం రా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వెప్పుడూ ఇంతేరా. నువ్వనేదాన్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు ఎన్నికలకూ, వంట వండటానికీ ఎలా ముడిపెట్టగలుగుతున్నావ్’’ అంటూ కోప్పడ్డాను నేను. ‘‘విను.. ఉదాహరణకు మన చంద్రబాబు ఉన్నాడనుకుందాం. ‘మీకు పోలవరం బిర్యానీ పెడతా.. రాజధాని బగారాబైగన్ రెసిపీ చేస్తా’ అంటూ తెగ ఊరిస్తూ ఉంటాడు. కానీ ఐదేళ్ల పాటు ఏమీ చేయడు. ఉన్న టైమ్‌లో ఏమీ చేయలేక ‘నేను విదేశాలన్నీ తిరిగి రకరకాల కాంటినెంటల్ ఐటమ్స్‌తో, మీకు ఇంటర్నేషనల్ క్యూజిన్ వడ్డిద్దామనుకున్నాను. కానీ కేంద్రంలో మోదీ, పక్కరాష్ట్రంలో కేసీఆర్ అడ్డుపడటం వల్ల ఏమీ చేయలేకపోయాను. ఈసారికి ఇవే తినండి’ అంటూ పాత మేనిఫెస్టో మెనూలో మిగిలిపోయిన అన్నంలో ఏ తాలింపో, పోపో వేసేసి పోపన్నం చేస్తాడు. అలా పొద్దున్నే పాచి ఐటమ్స్‌తోనే మేకోవర్ తిరగమోతతో మేనేజ్ చేస్తూ మోత మోగించేస్తుంటాడు. ఆ పాచిబువ్వ పులిహోర కలిపేస్తున్నప్పుడు వచ్చే పోపు వాసనను పట్టుకొని, ఎల్లో మీడియా అంతా ‘వాహ్.. వాటే వాసన... ఇట్స్ గోయింగ్ టు బీ డెలీషియస్ డిషెస్’ అంటూ హడావుడి చేస్తూ ఊదరగొట్టేస్తుంది. ‘‘కరక్టేరా.. నువ్వంటుంటే నిజమే అనిపిస్తోంది’’ అన్నాను. ‘‘అప్పుడే అయిపోయిందా.. విను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల వంటలన్నీ మాటల రెసిపీల లాంటివే. ఉదాహరణకు చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ‘నేను తెలంగాణ కోసం లేఖ ఇచ్చా. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు’ అంటూ ‘రెండు డిష్’ల సిద్ధాంతం చెబుతాడు. అలాగే ఈ చంద్రబాబు కనుసన్నల్లో, అడుగుజాడల్లో నడుస్తున్న పవన్‌కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే మరింత ముందుకెళ్లి.. ఆంధ్రలో మాట్లాడేటప్పుడు ‘తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారటాడు. మళ్లీ కాసేపటికి తెలంగాణకు వచ్చి.. ‘నేను తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం. నేనిక్కడే పుట్టి ఉద్యమంలో ఉండి ఉంటే.. దుర్మార్గులైన ఆ యొక్క ఆంధ్రనాయకులను అల్లల్లాడించి, వాళ్లను అష్టకష్టాలు పెట్టేవాణ్ణి. మిమ్మల్ని కష్టాలే లేకుండా కళ్లలో పెట్టుకునేవాణ్ణి’ అని వాపోతాడు. ఇదెలాంటిదంటే.. పెనం మీద పిండి పరచి దోసె వేశాక.. అవతలివైపు కూడా బాగా కాలడానికి దోసె తిరగేయడం లాంటిదన్నమాట. ఇలా దోసెల్లాగా, చపాతీల్లాగా రెండువైపులా మాటిమాటికీ తిరగేస్తున్నట్టుంటాయి వీళ్ల పొలిటికల్ ప్రసంగాలు. వీళ్లలోనే మరికొందరుంటారు. వారు పొత్తులనే పేరుతో నలుగురైదుగురు కలిసి వంట చేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే పొత్తులేదంటూనే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పాల్ లాంటివాళ్లు కలిసి.. అన్నం లాంటి ఒకే ఐటమ్‌ను ఒకరు బగారరైస్ అనీ, మరొకరు బిర్యానీ అనీ, ఇంకొకరు ఫ్రైడ్ రైస్ అని వండుతున్నారు. ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్’ అనే సామెత తెలుసుకదా. అయితే వీరందరూ కలిసి పక్కవాళ్ల వంటను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు’’ చెప్పాడు రాంబాబుగాడు. ‘‘మరి వీళ్లలో ఎవరైనా సిన్సియర్‌గా కడుపు నింపేవారు ఉన్నారంటావా?’’ నేనడిగా. ‘‘ఉన్నారు. ఆయన షో చేయడు. అప్పటికప్పుడు ఏదో వండేస్తున్నట్టు నటించడు. చాలా ముందు నుంచే పొయ్యిసెగలాంటి ఎండలో మాడుతూ, నడుస్తూ అందర్నీ కలుస్తాడు. మర్నాటి ఇడ్లీ కోసం ముందు రోజు నుంచే పిండి కలుపుకొన్నట్టు ఎప్పట్నుంచో శ్రమ పడతారు. ఆ ఇడ్లీలోకి కొబ్బరిపచ్చడీ, అల్లంచెట్నీ, సాంబారు.. ఇలాంటివెన్నో టిఫిన్‌గా పెడతామంటాడు. వాటికి అవసరమైన సరుకుల కోసం ముందు నుంచే పాదాల మీద శ్రమతో నడుస్తూ.. చాలా చోట్ల తిరుగుతూ, అన్ని రకాల సంభారాలూ సేకరిస్తారు. నవరత్నాల్లాంటి పిండి వంటలు చేస్తాననీ, ఆ వంటకయ్యే దినుసులూ చూపిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం, రాత్రి ఫుడ్ కోసం తానేమి వండిపెట్టదలచుకున్నాడో అవే తప్పకుండా వండుతాడు. అలాంటి యువనేతలాంటి చెఫ్‌ను నమ్ముకుంటేనే ముప్పూటలా కడుపునిండుతుంది. షడ్రసోపేతమైన విందు దొరుకుతుంది’’ అంటూ ముగించాడు మా రాంబాబుగాడు. -
నాకెందుకు పరమ వికారి పురస్కారం రావాలంటే..?
సాక్షి, అమరావతి : ‘‘మరి కాసేపట్లో మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు ‘వికారి’ నామ ఉగాది పురస్కారాలను ప్రకటించబోతున్నారు’’ అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. అవునన్నట్లు వేదికపై ఉన్న చంద్రబాబు చిరునవ్వు నవ్వారు. పార్టీ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్య కార్యకర్తలు సర్దుకుని కూర్చున్నారు. ‘‘వికారి పురస్కారాలన్నీ ప్రకటించాక, చివర్లో ‘పరమ వికారి’ పురస్కారం కూడా ప్రకటించబడుతుంది కనుక వికారి పురస్కారాలు దక్కని వాళ్లు నిరాశతో లేచి వెళ్లకండి. ఏమో, పరమ వికారి పురస్కారం ఆ లేచి వెళ్లిన వాళ్లలోనే ఒకరికి రావచ్చు’’ అని రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. అవునన్నట్లు చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తూ నవ్వారు. ‘‘వికారి పురస్కారాలను పొందిన వాళ్లకు 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్, ‘పరమ వికారి’ పురస్కారం గెలుచుకున్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబడుతుంది’’అని మూడో అనౌన్స్మెంట్ వినిపించింది. ఎంపీ సీటు కన్నా, ఎమ్మెల్యే సీటు ఎంత వాల్యూనో అర్థమై పార్టీ లీడర్లు, స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్యకార్యకర్తలు మళ్లీ సర్దుకుని కూర్చున్నారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసం మొదలైంది. వెంటనే ఎండ్ అయింది! ‘‘ఈ ఏడాది జగన్‌ని ఎవరైతే వికారంగా తిట్టారో వారికి ఈ వికారి పురస్కారాలను ఇస్తున్నామన్న సంగతి మీకు తెలిసిందే. షడ్రుచులు ఆరు కాబట్టి ఆరు వికారి పురస్కారాలు ఉంటాయి. అంటే ఆరు ఎంపీ టికెట్లు. అలాగే ఈ ఆరు రుచులనూ కలిపి గిలక్కొడితే పరమ వికారంగా ఉండే రుచి ఒకటి తయారవుతుంది. ఆ రుచికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఉంటుంది. ఆరు వికారాలు, ఒక పరమ వికారం కలిపి మొత్తం ఏడుగురు విజేతల పేర్ల జాబితా నా జేబులో ఉంది. ఆ పేర్లను ప్రకటించడానికి ముందు ‘‘నాకెందుకు పరమ వికారి పురస్కారం రావాలంటే..’’ అని మీ గొప్పతనాన్ని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా పరమ వికారి పురస్కారాన్నే ఆశిస్తున్నట్లు మీ ముఖాలను చూస్తే అర్థమౌతోంది’’ అని చెప్పి కూర్చున్నాడు చంద్రబాబు. వెంటనే వైవీబీ రాజేంద్రప్రసాద్ లేచాడు. ‘‘జగన్మోదీ రెడ్డిగారి మీద జరిగిన హత్యాప్రయత్నాన్ని షర్మిల, విజయమ్మే చేశారని నేను పరమ వికారంగా తిట్టాను. జగన్మోహన్రెడ్డిని జగన్మోదీరెడ్డి అనడం కన్నా పరమ వికారం ఏముంటుంది? కనుక ఈ అవార్డు నాకే రావాలి’’ అన్నాడు. ‘‘సరే.. నువ్వు కూర్చో’’ అని, వర్ల రామయ్య లేచాడు. ‘‘వైఎస్ వివేకా మృతిపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడు అని నేను పరమ వికారంగా తిట్టాను. చిన్నాన్న చనిపోయిన బాధలో ఉన్న మనిషిని అలా తిట్టడం కన్నా పరమ వికారం ఏముంటుంది? కనుక ఈ అవార్డు నాకే’’ రావాలి అని చెప్పి కూర్చున్నాడు వర్ల రామయ్య. సాదినేని యామిని లేచారు. ‘‘లేటుగా వచ్చినా, లేటెస్టుగా వచ్చాను. జగన్‌ని అసలు నా అంత పరమ వికారంగా ఎవరూ తిట్టి ఉండరు. మహిళా దినోత్సవ వేదికపై మహిళల సమస్యల గురించి మాట్లాడకుండా ఆ వేదికను నేను జగన్‌ని తిట్టడానికి వాడుకున్నాను. పరమ వికారానికి ఇది పరాకాష్ట. కనుక ఈ అవార్డు నాకే రావాలి అన్నారు’’. ‘‘నువ్వు కూర్చోవమ్మా..’’ అని కుటుంబరావు, కళావెంకట్రావు, బుద్ధా వెంకన్నా, యనమల, జూపూడి, మురళీమోహన్.. మరికొంతమంది ఒకేసారి పైకి లేచారు. ఎవరి తిట్లు వారు వినిపించారు. ‘పరమ వికారి’ అవార్డు తమకే రావాలని వాదించారు. అందరి తిట్లూ విన్నాడు చంద్రబాబు. జేబులోంచి జాబితా తీసి, మొదట ఆరుగురు వికారి పురస్కార విజేతల పేర్లు చదివాడు. ఆ ఆరుగురు వికారి పురస్కార విజేతలు నిరుత్సాహ పడ్డారు. తమకు పరమ వికారి పురస్కారం వచ్చే ఛాన్స్ పోయిందని. ‘‘.. అండ్, ది పరమ వికారి అవార్డ్ గోస్ టు..’’ అని పాజ్ ఇచ్చాడు చంద్రబాబు. అంతా ఉత్కంఠగా తలలెత్తారు. ‘‘.. అండ్.. పరమ వికారి గోస్ టు.. సర్వేరాధ సర్వేకృష్ణ’’! అని ప్రకటించాడు. ‘‘అన్యాయం.. అక్రమం’’ అని ఆక్రోశించారు పరమ వికారి పురస్కారాన్ని ఆశించినవారంతా. ఆ పురస్కారానికి సర్వేరాధ సర్వేకృష్ణ ఎలా అర్హుడో చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపైపు చూసి, కళ్లజోడు సవరించుకున్నాడు చంద్రబాబు. ‘‘మీరంతా జగన్‌ని పరమ వికారంగా తిట్టారు నిజమే. కానీ అతను జగన్‌ని పరమ వికారంగా తిట్టించాడు. తిట్టడం కన్నా తిట్టించడం పరమ వికారం. ఇంటర్వ్యూలు చేయించి తిట్టించాడు. సర్వేలు రాయించి తిట్టించాడు. జాతకాలు వేయించి తిట్టించాడు. అవి కూడా దొంగ సర్వేలు, దొంగ జాతకాలు, దొంగ ఇంటర్వ్యూలు. ఇంతకన్నా పరమ వికారం ఉంటుందా?’’ అన్నాడు. ఒక్కరూ నోరెత్తలేదు. ‘‘దయచేసి నోరు తెరవండి.. సారీ, దయచేసి పచ్చడి తిని వెళ్లండి..’’ అని వేదిక మీద నుంచి మరో అనౌన్స్మెంట్ వినిపించింది. – మాధవ్ -
గోడ మీది పిల్లిలో ఎంత మార్పో..?
ఎన్నికల సీజన్లో ఓ పిల్లి ఓ న్యూస్‌పేపర్‌కు పే...ద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది. తనను తాను సమర్థించుకుంటూ చాలా విషయాలు చెప్పింది. ఆ వివరాలు కాస్త చూద్దాం. నాలో ఎంతో మార్పు.. ప్రశ్న : మీ కొన్ని పాలసీలకు జనం నుంచి వ్యతిరేకత వచ్చింది కదా. ఈ విషయంలో మీరు చెప్పదలచుకున్నది.. జవాబు : ఆ రోజుల్లో.. అంటే 1995–2004లో నా వ్యవహారశైలి వేరుగా ఉండేది. అప్పట్లో నేను కాస్త దూకుడుగా ఉండేదాన్ని. చాలా ఎలుకలను పట్టా. నేను అలా ఎలుకలను పట్టడానికి కారణం అవి నా ఆహారమని కాదు. వాటిని తినాలనే ఆశ నాకు లేదు. రైతులనే అమాయకపు ఓటర్లు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తారు. ఆ ఫలసాయాన్ని ఎలుకలు తినేస్తాయేమోననే ఆందోళనతో కేవలం రైతుల కష్టం తీర్చడానికే నేను వాటిని పట్టి చంపాను. అంతే తప్ప నేను తినడానికి ఎంతమాత్రమూ కాదు. అయినా ఇప్పుడు మీకో విషయం తెలుసా? నేనిప్పుడు ‘రుద్రాక్ష పిల్లి’ని. నాన్‌వెజ్ పూర్తిగా మానేశా. భూతదయతో ఇప్పుడు నేనే కొన్ని ఎలుకలను చేరదీసి పెంచుతున్నా. అవిప్పుడు పందికొక్కుల్లా ఎదిగాయి. అందుకే సీబీఐ, ఈడీ బ్రాండుల ఎలుకల మందు వద్దని చెబుతున్నా. అయినా మందు పెడుతున్నారు. కొన్ని చోట్ల పెడితే కొన్ని పందికొక్కులు దొరుకుతున్నాయి. నాలో ఎంతగా మార్పు వచ్చిందో తెలుసా? ‘పిల్లి గుడ్డిదైతే.. ఎలుక కన్నుకొట్టింద’నే సామెతను నిజం చేస్తూ పందికొక్కులకు స్థాయికి చేరిన నేను పెంచిన ఎలుకలే కొన్ని నాకు అప్పుడప్పుడూ కన్ను కొడుతున్నాయి. అయినా సరే.. ఇక నాలో ఎంతో మార్పు వచ్చి ఇప్పుడు రుద్రాక్ష పిల్లిని అయ్యాను కదా. అందుకే కన్నుకొట్టే పందికొక్కులనూ మందలించకుండా కీలకమైన స్థానాల్లో నిలబెట్టి మరీ ప్రోత్సహిస్తున్నా. చూడండి.. ఇది నాలో వచ్చిన మార్పునకు సంకేతం కాదా? నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు ప్రశ్న : హోదా విషయంలో మీరు అబద్ధాలు ఆడారు కదా? జవాబు : నేనెప్పుడూ అబద్ధాలు ఆడలేదు. నేను పిల్లిని కాబట్టి గోడ మీద ఉండటం నా నైజం. ఒకసారి గోడ మీద నేను నిలబడి ఉన్నప్పుడు ‘ఏది రైట్?’ అని ఒకరు నన్ను అడిగారు. అప్పుడు నా కుడికాళ్లు ఉన్న వైపునకు చూపిస్తూ.. ‘ఇది రైట్.. ఇదే రైట్’ అన్నా. ఆ తర్వాత గోడమీద వెనక్కు తిరిగా.. అప్పుడు కొంత మంది మళ్లీ ‘ఏది రైట్’ అని ప్రశ్నించారు. అప్పుడు మళ్లీ నా కుడి వైపున ఉన్న భాగాన్నే ‘ఇది రైట్’ అని చూపించా. నేనెప్పుడూ నా ‘రైట్ సైడ్’నే చూపించా. కానీ గోడ మీద నేనలా తిరగడం చూసి.. కొందరది ‘యూ–టర్న్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ రైట్ను రైట్ అనే చెప్పా. అబద్ధాలు ఆడటం మా ఇంటావంటా లేదు. జనం పిల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ చదవనైతే చదివారు. కానీ కాస్త ఆలోచించారు. అంతకు ముందు కూడా పిల్లి ఓసారి తనలో చాలా మార్పు వచ్చిందనీ.. గతంలో రైతులను నిర్లక్ష్యం చేసి, ఐటీ ఐటీ అన్నానని ఒప్పుకుంది. ఈసారి అలా చేయనంది. కానీ మళ్లీ దానికి తిండిపెట్టాక.. మునపటి దారిలోనే వెళ్లడం మొదలుపెట్టింది. ‘డ్యాష్బోర్డని ఒకటి ఏర్పాటు చేసుకుని, దాని మీద.. లేని అభివృద్ధిని చూస్తూ ఉండిపోయింది. కాబట్టి పిల్లికి సంబంధించి దాన్ని పెంచుతున్న వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. దానికి సంబంధించిన రెండు సామెతలను నిజం చేస్తూ.. అభివృద్ధి అనే పెళ్లికి వెళ్తూ.. పిల్లిని చంకన ఎత్తుకోవడం ఎందుకని.. ఈసారి పిల్లికి ఓటు బిచ్చం పెట్టలేదు. -
మంగళగిరి వెర్రి మాలోకం
కుర్చీలు ఉండి జనం లేకపోతే అది చంద్రబాబు ప్రచారసభ. జనం ఉండి కుర్చీలు లేకపోతే అది ఉండవల్లిలోని ప్రజావేదిక. ఈ రెండు చోట్లా కాకుండా చంద్రబాబు ప్రసంగిస్తున్నాడంటే.. అది టెలికాన్ఫరెన్స్. టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు. టెలికాన్ఫరెన్స్‌లో ప్రజలు ఉండరు. పార్టీ నాయకులు ఉంటారు. అదో సుఖం చంద్రబాబుకి. ప్రజలైతే చప్పట్లు కొట్టరేమోనన్న భయం ఉంటుంది. ఉండేది నాయకులు కాబట్టి.. చప్పట్లు కొట్టకపోతే ఎలా అనే భయం నాయకులకే ఉంటుంది. టెలికాన్ఫరెన్స్‌లో లోకేశ్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కనకమేడల, అధికార ప్రతినిధి సాదినేని యామిని.. ఇంకా రెగ్యులర్‌గా టీవీల్లో కనిపించి జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం ప్రదర్శించే స్టార్ క్యాంపెయినర్లు కూడా ఉన్నారు. ‘‘ఇంక ఐదు రోజులే’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఐదు రోజులెక్కడ నాన్గారూ.. రేపే కదా’’ అన్నాడు లోకేశ్. అంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ఉలిక్కిపడలేదు. ‘‘రేపేంటి లోకేశ్‌బాబూ.. ఏప్రిల్ 11న కదా’’ అన్నాడు. ‘‘ఏప్రిల్ 11న ఏంటి నాన్గారూ.. రేపే కదా’’ అన్నాడు లోకేశ్. మళ్లీ అంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ఉలిక్కిపడలేదు. ‘‘లోకేశ్‌బాబూ.. 11న కదా పోలింగ్. మర్చిపోయావా’’ అన్నాడు. ‘‘ఓ! నాన్గారూ.. మీరు పోలింగ్ గురించి మాట్లాడుతున్నారా. నేను పండగ గురించి అనుకున్నా. ఉగాది రేపే కదా’’ అన్నాడు లోకేశ్. బుద్ధా వెంకన్న వైపు బెంగగా చూశాడు చంద్రబాబు. చంద్రబాబు తనవైపు అలా బెంగగా ఎందుకు చూశాడో అర్థం కాక యామిని వైపు చూశాడు బుద్ధా వెంకన్న. యామిని ‘మైహూనా’ అన్నట్లు చంద్రబాబు వైపు చూశారు. ‘‘లోకేశ్‌బాబు కరెక్టే చెప్పారు నాయుడుగారూ.. ఎన్నికలంటే పండగే కదా. ఈ నెలలో రెండు పండగలు. ఒకటి ఏటా వచ్చే పండగ. ఇంకోటి ఐదేళ్లకొచ్చే పండగ. పోలింగ్ పండగ ఇంకో ఐదు రోజులే ఉందని మీరన్నారు. పచ్చడి పండగ రేపే కదా అని లోకేశ్‌బాబు అనుకున్నారు’’ అని కవర్ చేశారు యామిని. ‘‘యామినిగారూ.. మీరెవర్ని కవర్ చేయాలని చూస్తున్నారు?! చంద్రబాబు గారినా, లోకేశ్బాబుగారినా, మన పార్టీ లీడర్లనా, ప్రజలనా, టెలికాన్ఫరెన్స్నా?’’ అని లేచాడు కనకమేడల. యామిని అంతకు అంతెత్తూ లేచారు. ‘‘నేనెవర్నీ కవర్ చేయట్లేదు కనకమేడలగారూ.. మీరే ఈ మధ్య టీవీల్లో బాగా కవర్ అవుతూ, బాబుగారికి ఏదో చేస్తున్నట్లు కవరింగు, కలరింగు ఇస్తున్నారు..’’ అన్నారు. చంద్రబాబు మళ్లీ బుద్ధా వెంకన్న వైపు బెంగగా చూశాడు. ‘‘ఇంకో ఐదురోజులే మిగిలాయి వెంకన్నగారూ. ఈ ఐదు రోజుల్లో చివరి రెండు రోజులు మనం మాట్లాడేదేమీ ఉండదు. ఇంక మిగిలేది మూడు రోజులే. ఈ మూడురోజులైనా మీరంతా లోకేశ్‌బాబుకి అర్థమయ్యేలా మాట్లాడండి. ప్రజలకు అర్థంకాకపోయినా పార్టీకి నష్టం లేదు’’ అన్నాడు చంద్రబాబు. ‘నాకు అర్థంకాకపోవడం ఏంటి!’ అన్నట్లు నాన్గారి వైపు చూస్తున్నాడు లోకేశ్. ‘నేను అర్థం కాకుండా మాట్లాడ్డం ఏంటి’ అని చంద్రబాబు వైపు చూస్తున్నాడు బుద్ధా వెంకన్న. టెలికాన్ఫరెన్స్ అయ్యాక విడిగా చంద్రబాబుని కలుసుకుని ‘‘నేనేమైనా అర్థంకాకుండా మాట్లాడానా నాయుడుగారూ.. అని అడిగాడు. చంద్రబాబు నిట్టూర్పు విడిచారు. ‘‘వెంకన్న గారూ.. మంగళగిరి సభలో మీరేమన్నారు! లోకేశ్ నలభై ఏళ్లు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటారని కదా అన్నారు. లోకేశ్‌బాబు నన్ను ఏమడిగాడో తెలుసా! ‘నాన్నగారూ.. నేను నలభై ఏళ్లయినా మంగళగిరి ఎమ్మెల్యేగానే ఉండపోతానా, మీలా సీఎంని కాలేనా’ అని అడిగాడు వెంకన్నగారూ..’’ అని చెప్పి, మళ్లీ బెంగపడ్డాడు చంద్రబాబు. –మాధవ్ -
నువ్వు నాకు నచ్చలేదు !
మా రాంబాబుగాడు ఓ సినిమా కథ చెప్పడం మొదలుపెట్టాడు... ‘‘ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్? ఎవరికి ఏం చెప్పి వస్తున్నావ్?’’ ప్రశ్నించారు పబ్లిక్. ‘‘హోదా అనేది చాలా బెస్ట్ అనీ, దానికోసమే మనం రక్తం ధారపోసైనా పోరాడాలని చెప్పి వస్తున్నా అంకుల్’’ అతి వినయం నటిస్తూ పబ్లిక్‌కి ఆన్సరిచ్చారు బాబుగారు. ‘‘ఆ?’’ ‘‘అంటే.. ముందు హోదా అనే అనుకున్నాను. ఆ తర్వాత ఏవో కొన్ని ఇబ్బందులు రావడంలో.. ఆ పక్కనే ప్యాకేజ్ అనేదాన్ని ఎంచుకున్నా. కాకపోతే పబ్లిక్ తిరగబడ్డారు కాబట్టి మళ్లీ ఎప్పటిలాగే హోదా బెటర్ అని అనుకుంటున్నా సార్’’ ‘‘ఈ ఎక్స్‌ట్రాలే వద్దు. ఇంతకీ నీకు ఏమొచ్చు?’’ అడిగారు పబ్లిక్. ‘‘ఈత సార్.. కాకపోతే ఇండోర్‌లోనే ఈదుదామని తాత్కాలిక సచివాలయం స్విమ్మింగ్‌పూల్ అయ్యేలా కట్టించా’’ జవాబిచ్చారు బాబుగారు. ‘‘ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది’’ ఈసడింపుగా అన్నారు పబ్లిక్. ‘‘ఇంతకీ ఏం అవుదామనుకుంటున్నావ్?’’ మళ్లీ పబ్లిక్ ప్రశ్న. ‘‘మరోసారి సీఎం.. లేదా మావాణ్ణి ఇక్కడ పెట్టేసి పీఎం’’ . ‘అవాక్కయ్యారు’ పబ్లిక్. ‘‘ఐదేళ్లలో నెరవేర్చగలిగే హామీలు పదిహేనేళ్లయినా పూర్తి కాలేదు. నువ్వు మళ్లీ మరోసారి సీఎం.. లేదా పీఎం?’’ పబ్లిక్ ఈసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘‘సార్ మీకేం తెలుసు సార్. మా అబ్బాయి సరిగా చదవలేదు. నేను దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని చేసి, వాక్యాలు పలకడం కూడా రాకపోతే గవర్నమెంటు ఖర్చుతో ట్యూషన్ పెట్టించి.. అప్పుడు పనులు చేయడం మొదలు పెట్టేవాణ్ణి. మరి ఇంక పని చేయడానికి టైమేదీ? హామీలు నెరవేర్చడానికి వ్యవధేది? మీకు నాలాంటి కొడుకున్నాడా సార్. ఉంటే తెలిసేది సార్.. వాడికి అన్నీ నేర్పి.. అప్పుడు మళ్లీ పని చేయడం ఎంత కష్టమో’’ అంటూ ముక్కు చీదినట్టు నటించారు బాబుగారు. ‘‘సార్.. మీరు అవుతారు సార్. మళ్లీ తప్పక సీఎం అవుతారు’’ బంతి అలియాస్ ధారాకృష్ణ. ‘‘అవ్వకపోయినా ఫర్లేదు అంకుల్. నాకు కొడుకున్నాడు. మనవడు కూడా ఉన్నాడు. ఈ అందరిలో నా మనవడికి మొదటిసారి.. మా అబ్బాయికి రెండోసారీ అక్షరాభ్యాసం చేసి, ఇద్దరిని ఒకేసారి కాన్వెంట్లో వేసేసి, ఇద్దరికీ నేనే స్వయంగా ట్యూషన్ చెప్పుకుంటాను. కాకపోతే ఈ సారి మావాణ్ణి మరింత జాగ్రత్తగా చదివించుకుంటా’’ తన ఫ్యూచర్ ప్లాన్లు వివరిస్తూ.. తన విశ్రాంతి సమయాన్ని ఎంత అర్థవంతంగా గడపదలుచుకున్నారో విపులీకరించి చెప్పారు బాబుగారు. ’’’ ఇంతవరకు ఒక కథను స్పూఫ్‌లా చెప్పి.. ‘‘ఈ కథకు టైటిల్ ఏమిటో చెప్పు?’’ అడిగాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వు నాకు నచ్చలేదు’’ ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా ఠక్కున చెప్పారు పబ్లిక్. –యాసీన్ -
లోటస్‌పాండ్@లక్ష్మీస్ ఎన్టీఆర్
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్‌ని ఆపగలిగారు కానీ.. ముక్కలు ముక్కలుగా సినిమా మొత్తం రిలీజ్ అవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి కౌంటర్‌గా మనకు పనికొచ్చే డైలాగులున్న సినిమా ఏదైనా ఉంటే బయటకు తీయండి’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఆల్రెడీ తీయించి పెట్టాను నాయుడు గారూ..’’ అన్నాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఆయన ముందుచూపు ప్రణాళికకు మెచ్చుకోలుగా చూశాడు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లోకేశ్ కూడా అక్కడే ఉన్నారు. లోకేశ్ తప్ప మిగతా అందరూ చెమటతో తడిసి ముద్దయి ఉన్నారు! లోకేశ్ ఫ్రెష్‌గా ఉన్నాడు. ‘‘టన్నుల కొద్దీ ఏసీ ఉన్నా మనకిలా డ్రమ్ముల కొద్దీ చెమటలు పడుతున్నాయేమిటి’’ అన్నాడు గజపతిరాజు. ‘‘పట్టడం కాదు. కారుతున్నాయి’’ అన్నాడు కుటుంబరావు. ‘‘ఏసీ పాడైనట్లుంది. ఆ ఫ్యాన్ వెయ్యండి’’ అన్నాడు యనమల. ‘‘స్టాప్.. స్టాప్ ద షిట్ టాకింగ్’’ అని అరిచాడు చంద్రబాబు. కళా వెంకట్రావు బెదురుగా చూశాడు. చంద్రబాబు కోపం చూసి కాదు ఆ బెదురు. చంద్రబాబు అన్న మాటల్లో స్టాప్, షిట్, టాకింగ్.. ఈ మూడూ విడివిడిగా అర్థమయ్యాయి కానీ, మూడు కలిపితే మాత్రం మీనింగ్ అర్థం కావడం లేదు. ‘‘నేను చెప్పానా.. నాన్గారికి ఫ్యాన్ పడదని’’ అన్నాడు లోకేశ్.. పేపర్లోంచి తల పైకెత్తకుండానే. ఆవేళ్టి పేపర్ హెడ్డింగుల్ని కూడదీసుకుని చదువుతూ, మాటల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు లోకేశ్. ‘‘సినిమా చూపిస్తానన్నారు. చూపించండి..’’ అన్నాడు చంద్రబాబు చెమటలు తుడుచుకుంటూ. కుటుంబరావు ప్లే బటన్ నొక్కాడు. స్క్రీన్‌పై సినిమా మొదలైంది. కానీ ఎవరూ స్క్రీన్ వైపు చూడడం లేదు! సినిమా దారి సినిమాది. వీళ్ల దారి వీళ్లది. లోకేశ్ దారి లోకేశ్‌ది. ‘‘లోటస్ పాండ్‌లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అన్నాడు చంద్రబాబు టెన్షన్‌గా. ‘‘తెలిసింది’’ అని చిటికేశాడు కళా వెంక్రటావు. ‘‘ఏం తెలిసింది?’’ అన్నాడు యనమల. ఏసీ ఉన్నా మనకు చెమటలు ఇంతగా ఎందుకు పడుతున్నాయో తెలిసింది. ప్రచారానికి బ్రేక్ ఇచ్చి లోటస్ పాండ్‌లో జగన్ ఏం చేస్తున్నాడోనన్న విషయంపై మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘అంతేనంటావా..’’ అన్నాడు చంద్రబాబు కాస్త ఊరట చెందుతూ. ‘‘అంతకాకుండా ఏముంటుంది నాయుడుగారూ... ‘ఈ’పేపర్ రాసిందనీ, ‘ఆ’పేపర్ రాసిందనీ మరీ చెమటలు పట్టి తడిసిపోయేంతగా మనం లోటస్ పాండ్ గురించి భయపడక్కర్లేదు. జగన్ ఇంటికి జగన్ వెళ్తున్నాడు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటికి వెళ్లకపోతుంటే డౌట్ పడాలి కానీ, ఇంటికి వెళ్లొస్తుంటే డౌటెందుకు?’’ అన్నాడు వెంకట్రావ్. ‘‘హీ.. హీ.. హీ..’’ అని నవ్వాడు లోకేశ్. అంతా అతడి వైపు చూశారు. అతడు ఎవరి వైపూ చూడడం లేదు. పేపర్లో హెడ్డింగ్‌లు చదువుతూ నవ్వుకుంటున్నాడు. ‘‘అన్నీ నాన్గారి హెడ్డింగులే. అన్నీ నాన్గారి ఫొటోలే. నాన్గారు చెయ్యూపిన ఫొటో, నాన్గారు చెయ్యూపించిన ఫొటో. ఈరోజైతే నాన్గారి పేద్ద బయోగ్రఫీ కూడా ఇచ్చారు’’ అంటూ ఒక్కో హెడ్డింగూ చదువుతున్నాడు. సడన్‌గా స్క్రీన్ మీద సినిమా సౌండ్ పెరిగింది. ‘‘నువ్వేం చేస్తున్నా.. పేపర్ చదువుతున్నావా?’’.. అంటున్నాడు కోట శ్రీనివాసరావు. ‘‘మీకెలా తెలుసు సార్?!!’’ ‘‘ఇందులో తెలియడానికేముందీ.. పైన చదువుతున్నావ్, కింద కోసుకెళ్లిపోయాడు’’.. అన్నాడు కోట. ‘‘సినిమా సౌండ్ ఎందుకు పెరిగిందీ? అన్నాడు చంద్రబాబు విసుగ్గా. ‘‘నేనే పెంచా నాయుడు గారూ.. ఈ సీన్ భలే ఉంటుంది’’ అని చెమటలు తుడుచుకుంటూ పడీపడీ నవ్వుతున్నాడు కుటుంబరావు. - మాదవ్ -
నాలెడ్జ్‌లో లగడపాటిని దాటిన ‘నవ్యాంధ్రజ్యోతి’
జూబ్లీ హిల్స్‌లోని ‘సర్వే ఆఫ్ ఇండియా’ కార్యాలయంలో కూర్చొని ఉన్నాడు కేఏ పాల్. అతడి చేతిలో తడిగుడ్డ ఉంది. ‘‘మా ఎదవలు.. పడుకున్నవాడిని లేపుకొచ్చారు’’ అన్నాడు పాల్! ‘‘వారం రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకుని తడిగుడ్డ వేసుకుని పడుకోవటం ఏంటండీ పాల్‌గారూ చికాగ్గా..’’ అన్నాడు పక్కన ఉన్న నాయకుడు. ‘‘ఎండ ఎక్కువయింది కాబట్టే కదా తడిగుడ్డ. ఇదిగో ఇక్కడికొస్తే తడిగుడ్డతో పనుండదని చెప్తే వచ్చా. అవునూ.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ఉప్పల్‌లో కదా ఉండేది. ఇక్కడికెప్పుడు షిఫ్ట్చేశారు’’ అని అడిగాడు పాల్. ‘‘నాకూ తెలీదు.. ఇక్కడికి షిఫ్ట్ చేశారని! ముందు ఉప్పలే వెళ్లాను. వాడెవడో రూడ్‌గా మాట్లాడాడు.. ‘అలాంటి సర్వేలేమీ మా దగ్గర నడవ్వు. జూబ్లీ హిల్స్ వెళ్లు’ అంటే ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని ఇక్కడ చూడగానే ఇదే సర్వే ఆఫ్ ఇండియా అని తెలిసిపోయింది’’ అన్నాడు ఆ నాయకుడు. పాల్ నవ్వాడు. ‘‘చూశారా, నేను రావడం మీకెంత మంచిదయిందో’’ అన్నాడు. అని, ‘‘మిమ్మల్నెప్పుడూ చూడలేదు. మీరు గానీ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ కాదు కదా’’ అన్నాడు. పాల్ అలా అనగానే ఆ లీడర్ ఎమోషనల్‌గా కళ్లు తుడుచుకున్నాడు. ‘‘మీదెంత పెద్ద మనసు! కనిపించనివాళ్లను కూడా గుర్తించగలుగుతున్నారు’’ అన్నాడు. పాల్ మళ్లీ నవ్వాడు. ‘‘దాన్ని పెద్ద మనసు అనరు. నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్‌తో ఎవర్నైనా జయించవచ్చు. ఈ సృష్టిని జయించవచ్చు. వైఎస్సార్సీపీని జయించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకొచ్చామ్! ఈ మనిషి దగ్గర నాలెడ్జ్ ఉందనే కదా. మొన్నటి వరకు లగడపాటికొక్కడికే స్టేట్‌లో నాలెడ్జ్ ఉందనుకునేవాడిని. ఈ మనిషికి లగడపాటిని మించిన నాలెడ్జ్ ఉందని మా పార్టీ కార్యకర్తలు చెబితే మొదట నేనూ నమ్మలేదు. ‘నవ్యాంధ్రజ్యోతి’ పేపర్ చూపించారు. సర్వే ఏమీ జరక్కుండానే ‘అధికారం టీడీపీదే’ అని సర్వే రిపోర్ట్ ఇచ్చాడు.. అదీ నాలెడ్జ్ అంటే’’ అన్నాడు. నాయకుడు ఆసక్తిగా వింటున్నాడు. ‘‘సర్వే జరక్కుండానే.. వచ్చే సీట్లెన్నో, పడే ఓట్లెన్నో ఇచ్చాడంటే ఇతగాడు మామూలు సర్వే మాస్టర్ కాదు! ఇవన్నీ వదిలెయ్, జరగని సర్వేను జరిపించిందెవరో కూడా రాసి గ్రాఫులతో సహా వేసి పడేశాడు!’’ అన్నాడు పాల్. ఈలోపు లోపల్నుంచి చేతిలో చిన్న వైట్ పేపర్, బాల్‌పెన్ ఉన్న ఇద్దరు మనుషులు వచ్చి.. ఒకరు పాల్ దగ్గర, ఇంకొకరు కాంగ్రెస్ నాయకుడి దగ్గర కూర్చున్నారు. పాల్ దగ్గర కూర్చున్న మనిషి.. ‘‘చెప్పండి పవన్‌కళ్యాణ్ గారూ.. మీకు ఎన్ని సీట్లు కావాలి? ఓట్ల శాతం ఎంత కావాలి’’ అని అడిగాడు, బాల్పెన్ని రెండు వేళ్లతో ఊపుతూ. పాల్ మురిసిపోయాడు. ‘‘నేను పవన్‌కళ్యాణ్‌లా కనిపిస్తున్నానా?’’ అన్నాడు అతడి బుగ్గపై చిటికె వేసి. ‘‘ఓ! మీరు నిజంగానే పాల్ అన్నమాట. జనం గుర్తుపట్టకుండా ఉండడానికి పవన్‌కళ్యాణ్ మీ వేషంలో వచ్చాడనుకున్నాను. మా మాస్టర్ సర్వే కృష్ణ చెప్పారు.. పవన్ కూడా ఓ మంచి సర్వే కోసం ఇక్కడికి వస్తున్నారని’’ అన్నాడు. ‘‘మీ మాస్టర్ సర్వే రాధ కదా.. సర్వే కృష్ణ అంటున్నావేంటి’’ అన్నాడు పాల్. ‘‘ఇద్దరూ ఒకటే పాల్‌గారూ.. సెక్యూరిటీ ప్రాబ్లమ్. అందుకే రెండు పేర్లు యూజ్ చేస్తుంటాం’’ అన్నాడు.. బాల్పెన్ని ఊపడం ఆపకుండా. ఇక్కడ వీళ్లు ఈ పనిలో ఉంటే.. లోపల సర్వే మాస్టర్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘నీ సర్వేలు అందరికీ ఇస్తున్నావ్. ఇంక మాకిచ్చి ఉపయోగం ఏమిటి? రేప్పొద్దున నీ పేపర్లో ‘అధికారం పాల్దే’ అని రాస్తే నీకు పోయే క్రిడిబిలిటీ ఏమీ లేదు! మా క్రెడిబిలిటీనే పోతుంది..’’ అన్నాడు చంద్రబాబు కోపంగా. పెద్దగా నవ్వాడు సర్వే మాస్టర్. ‘‘నాయుడుగారూ.. మీరు గెలిచారు’’ అన్నాడు. ‘‘ఇంకా పోలింగే జరక్కుండా నేను గెలవడం ఏంటయ్యా.. ఇదెవరి సర్వే?’’ అన్నాడు చంద్రబాబు విసుగ్గా. ‘‘పోలింగ్ అయ్యాకే మీరు గెలుస్తున్నారునాయుడు గారూ! పోలింగ్‌కి రెండు రోజుల ముందు అన్ని పార్టీల ప్రచారం ఆగిపోతుంది. దానికి ఒక రోజు ముందే మీ ప్రచారం ఆగిపోతుంది..’’ ప్లాన్ చెప్పుకుపోతున్నాడు సర్వే మాస్టర్. –మాధవ్ -
30 రోజుల్లోనే ఇరవై నగరాలు కట్టడం ఎలా,..?
సాక్షి, అమరావతి : బాబుగారు తన సెక్రటరీలనూ, నమ్మకమైన అనుచరులనూ, క్లోజ్‌గా ఉండే కొందరు కొలీగ్స్‌ను పిలిపించే సీక్రెట్‌గా ఓ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. శిఖరాగ్ర సమావేశం కాబట్టి మొదట గాంధీకొండ మీదే ఏర్పాటు చేద్దామనుకున్నారు గానీ.. టైమ్ లేకపోవడంతో కాన్ఫరెన్స్ హాలుకే కన్ఫైన్ అయ్యారు. ‘‘ఉద్వేగంతో ఊగిపోతూ ఏదో ఎమోషన్లో హైదరాబాద్ లాంటివి 20 నగరాలు కట్టేస్తానన్నాను. కాబట్టి అర్జెంట్‌గా అవన్నీ ఎలా కట్టేయాలో సలహాలివ్వండి’’ అని అడిగారు. ఎంత అర్జెంట్గానైనా ఒకేసారి 20 నగరాలు కట్టడమంటే మాటలా! ఏదో ఒకటీ, రెండు నగరాలంటే ఫర్లేదుగానీ.. 20 నగరాలు ఎలా అని వాళ్ల మనసుల్లో అనిపించింది. అదెంత అసాధ్యమో గుర్తొచ్చి అందరూ నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ‘‘మీ చిన్నప్పటి రోజుల్లో అంబడిపూడి పుస్తకాలని బోల్డన్ని ఉండేవన్నారు కదా నాన్నారూ.. ‘ముప్పై రోజుల్లో కొంకణీ నేర్చుకోవడం ఎలా?’, ‘ఉపన్యాసం ఇవ్వడం ఎలా?’, ‘మీరు కోటీశ్వరులైపోండి’ లాంటివి అనేకం దొరికేవని మీరోసారి చెప్పారు కదా. అలాంటి పాత పుస్తకాలు ఎక్కడైనా ఫుట్‌పాత్‌ల మీద దొరుకుతున్నాయేమో చూడమని పురమాయిద్దాం. ‘30 రోజుల్లో 20 నగరాలు కట్టడం ఎలా?’ లాంటి పుస్తకాలేవైనా దొరికితే ఇక మన పని అయిపోయినట్టే. ఎలాగూ వెతుకుతున్నారు కాబట్టి.. పనిలో పనిగా ‘పోర్టులను తరలించకుండా ఆపడం ఎలా?’ లాంటివి కూడా అంబడిపూడి సిరీస్‌లో ఎక్కడైనా దొరుకుతాయేమో చూడమని కూడా చెబ్దాం నాన్నారూ మనవాళ్లకు’’ సలహా ఇచ్చాడు లోకేశం. ‘‘బావా.. అలాగే.. ‘నోరూ, చెయ్యీ అదుపు చేసుకోవడం ఎలా’ లాంటి పుస్తకం కూడా ఏదైనా దొరికితే చూడమను బావా. స్పీచులప్పుడు నేను కొడుతున్న కొటేషన్లన్నీ పాతబడిపోయాయి. ‘సారేజహా.. బుల్ బుల్.. బుల్ బుల్’’ లాంటి కొటేషన్ల పుస్తకాలు కూడా దొరికేతే బాగుణ్ణు’’ అల్లుడిగారి సలహాకు కొనసాగింపుగా మరో సలహా ఇచ్చారు బావమరిదిగారు. ఇవేమీ వర్కవుట్ అయ్యేలా లేవని కాస్తంత డొక్కశుద్ధీ, చదువూ సంధ్యా ఉన్న ఒక సెక్రటరీని సలహా అడిగారు బాబుగారు. ‘‘సార్.. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలు 20 కట్టడం అంటే మాటలు కాదు. అందునా ఇంత అర్జెంటుగా. అందుకని ఓ పని చేద్దాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 20 నగరాలను సెలక్ట్ చేద్దాం. ఆ నగరాల్లోని ఏరియా పేర్లకు దగ్గరగా ఉన్న హైదరాబాద్ కాలనీల పేర్లు పెడదాం’’ అన్నాడా సెక్రటరీ. ‘‘అదెలా?’’ ‘‘ఉదాహరణకు ఇప్పుడు మన విజయవాడనే తీసుకుందాం. లబ్బీపేట పేరును ఎల్బీనగర్ అని మారుద్దాం. దుర్గాపురం ఏరియాను దుర్గంచెరువు అందాం. కామకోటినగర్ పేరులో మొదటిదీ, చివరదీ కొట్టేసి.. సింపుల్‌గా ‘కోఠి’ అందాం. కొండపల్లిని కూకట్పల్లి అనీ, ఆజంపూడిని ఆజమాబాద్ అని, ఏసీ కంపెనీని ఏసీగార్డ్స్ అని, గన్నవరాన్ని గండిపేట అని.. అన్నీ ఇలా చేంజింగ్ చేసేద్దాం సార్. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉంది కాబట్టి దానిపేరు శంషాబాద్ అని మారుద్దాం. ఇక్కడ మనకు మరో సౌలభ్యం కూడా ఉంది సార్. ఇబ్రహీంపట్నం, మారుతీనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీ లాంటి వాటిని మార్చక్కర్లేదు. ఇదేవిధంగా... ఆల్రెడీ మనకున్న 20 పట్టణాల్లోనూ అన్ని పేటలూ, బస్తీలు, కాలనీల పేర్లను ఇలా మార్చేస్తే చాలు. దీనికి పెద్దగా టైమ్ కూడా పట్టదు సార్. పట్టణానికి ఒకటి చొప్పున 20 జీవోలు ఇస్తే సరిపోతుంది’’ సలహా ఇచ్చాడు బాబుగారి వర్కింగ్ స్టైల్ మీద పూర్తిగా అవగాహన ఉన్న సెక్రటరీ. ఈ సలహా పట్ల అందరూ ఆసక్తి కనబర్చారు. ‘‘అవును.. దీనికి తోడు ఇంకో పని చేయండి. ఒక ప్రపంచపటం కొనేయండి. ఈ 20 నగరాలనూ దాన్లో రెడ్ ఇంక్‌తో మార్క్ చేసి, వీటన్నింటినీ నేనే ప్రపంచపటంలో పెట్టానంటూ ఊదరగొట్టమని మన గొట్టాలవారికీ, ఆస్థాన న్యూస్ పేపర్ల వారికి చెప్పండి. ఇంత కొద్ది టైమ్‌లోనే ఇన్ని నగరాలు కట్టినందుకు కృతజ్ఞతగా ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ హోర్డింగులూ, బోర్డులూ ఆయా నగరాల్లో ఏర్పాటు చేయండి’’ అంటూ ఆదేశాలు జారీచేసి, మీటింగ్ ముగించారు బాబుగారు. -
రాజుగారి బావమరుదులంతా ఇంతేనేమో..!
‘‘నా చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇవన్నీ చదివేవాణ్ణి. వాటితో పాటు పెద్దవాళ్లు చదువుకునే డిటెక్టివ్ బుక్స్ కంటే ఒకింత చిన్న సైజులో ఉండే బుజ్జి బుజ్జి జానపద నవలలూ చదివేవాణ్ణి’’ డిగ్రీ చదువుతున్న పక్కింటి పిల్లాడికి తన చిన్నప్పటి అనుభవాలు చెబుతున్నాడు వెంకట్రావ్. ‘‘చాలా మంది అంతేసార్. మీ చిన్నప్పుడు మీరు అవి చదివారు. మా రోజుల్లో అవి లేవు కాబట్టి మేం బాహుబలి లాంటి సినిమాలు చూస్తున్నాం’’ మాట కలిపాడు శివ. ‘‘ఆ పుస్తకాలు చదువుతూనే మేము కూడా జానపద సినిమాలు తెగ చూసేవాళ్లం. ఎడ్లబండ్ల మీద, సైకిళ్ల మీద పక్కనుండే టౌనుకెళ్లి బోలెడన్ని సినిమాలు చూశాం’’ అన్నాడు వెంకట్రావ్. ‘‘మీ చిన్నప్పటి సినిమాలు ఈ మధ్య నేనూ కొన్ని చూశాను సార్. కానీ ప్రతి సినిమాలోనూ దాదాపుగా కథ ఒకేలా ఉంటుంది. దుష్టుడైన ఒక రాజు తన ప్రజలను విపరీతంగా బాధపెడుతూ పాలిస్తుంటాడు. ప్రజాకంటకుడైన ఆ రాజుకు ఒక బావమరిది కూడా ఉంటాడు. రాజుగారి బావమరిదిననే అహంకారంతో వాడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటాడు. ఎవరడ్డొస్తే వాళ్లను ఎడాపెడా కొడుతుండటం, అందమైన అమ్మాయి ఎవరైనా ఎదురుపడితే అసభ్యంగా ప్రవర్తించడం, కొండొకచో రేప్ చేయడం, ఇలా రాజుగారి బావమరిది ఆగడాలు తట్టుకోలేక, వాణ్ణేమీ చేయలేక ప్రజలంతా అతడిని చాటుగా తిట్టుకుంటూ ఉండటం... ఇంతేకదా అన్ని జానపద సినిమాల్లోని కథ’’అంటూ కాస్తంత నిరసనగా అన్నాడు శివ. ‘‘మేం కాస్తంత పెద్దయ్యాక సినిమాలతో పాటు సాహిత్యం చదవడమూ మొదలుపెట్టాం. దాదాపు అన్ని జానపద సినిమాలకు ఆధారమైన నాటకం ఒకటుంది. దానిపేరే మచ్ఛకటికం. ఆ అద్భుతమైన నాటకంలోనూ రాజుగారికి ఒక బావమరిది ఉంటాడు. వాడి పేరు శకారుడు. వాడూ అంతే. బహుశా రాజుగారి బావమరుదులంతా ఇంతేనేమో. శకారుడు కూడా తన బండికి మెట్లు అడ్డం వస్తే వాటినీ తొక్కేయమంటూ ఆర్డరేస్తాడు’’ ‘‘సార్.. మనమేదో జానపద కథలూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. ఆ సంభాషణంతా రాష్ట్ర పరిస్థితిలా అనిపిస్తుందేమిటి సార్! ఓ దుష్టుడైన రాజు!, అడ్డొచ్చిన ప్రతివాణ్ణీ తిడుతూ, కొడుతూ, ఎవరి మీద పడితే వారి మీద చేయిజేసుకుంటూ ఉండే ఓ రాజుగారి బావమరిదీ!! కాకపోతే ఈ బావమరిది ‘అమ్మాయి కనబడితే ముద్దు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి’ లాంటి గలీజు మాటలు మాట్లాడుతుంటాడు సార్’’ ‘‘అవునోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అదే అనిపిస్తోంది. అయితే ఇంత చీకట్లోను నాకో ఆశారేఖ కనిపిస్తోందోయ్’’ ‘‘ఏమిటి సార్ అది?’’ అడిగాడు శివ. ‘‘జానపదకథలో ఒక తోటరాముడు దేశాటనం చేస్తూ బయల్దేరతాడు. అక్కడ అతడు దేశాటనం చేసినట్టే.. వాస్తవ ప్రపంచంలోని ఈ రాష్ట్రంలో ఈ యువకుడు పాదయాత్ర చేశాడు. జనాదరణ, ప్రజామోదం ఉన్న ఈ యువనేత వచ్చి దుష్టుడైన రాజు పనీ, విలనీకామెడీ ప్రదర్శించే రాజుగారి బావమరిది పనీపట్టి, ప్రజలను ఆ దుష్టుల పరిపాలన నుంచి విముక్తులను చేస్తాడు’’ ‘‘నిజమే సార్. ఈ సీన్ కూడా కూడా అచ్చం జానపద కథతో పోలుతోంది కదా. అలాగే కానివ్వండి కానివ్వండి. రాజూ, అతడి బావమరిదితో పాటు, చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ, బ్రాహ్మణులు మొదలుకుని బడుగువర్గాల వారి వరకూ అందరినీ దూషిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉండే ఇతర రాజోద్యోగుల పీడవిరగడ కావాలనే కదా రాష్ట్రప్రజలందరూ కోరుకుంటున్నారు’’ ‘‘ప్రతి కథలోనూ అంతో ఇంతో చరిత్ర ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే హిస్టరీ రిపీట్స్ అనే మాట అక్షరాలా వాస్తవం అనిపిస్తోంది. కానీయ్.. కానీయ్. అలాగే కానీయ్. మనమనుకున్నట్టే జరగనీ. తథాస్తు’’ – యాసీన్ -
సీబీఎన్@ నవ్యాంధ్రజ్యోతి
ఐదేళ్లుగా నవ్యాంధ్ర ఫుట్‌పాత్ మీద ఉన్న ఓ ఫుట్‌పాత్ నవ్యాంధ్రుడి ముందు ఆగింది సీబీఎన్ చానల్ వాళ్ల వ్యాను. వ్యాన్‌లో ఉన్న వ్యక్తి కిందికి దిగి నేరుగా ఆ ఫుట్‌పాత్ నవ్యాంధ్రుడి దగ్గరికి వచ్చాడు. ‘‘నీకు ఇల్లు లేదు. నువ్వొక అనాథవి. అయినా గానీ నీకు నవ్యాంధ్రపై గుండెల నిండా అభిమానం ఉంది. అవునా?’’ అన్నాడు. ‘‘మీరు వేమూరి వారే కదా’’ అన్నాడు ఫుట్పాట్ నవ్యాంధ్రుడు.. ఒక్క నిముషమైనా ఆలోచించకుండా! ‘‘వావ్! ఎలా కనిపెట్టావ్.. నేనే వేమూరి వారినని’’ అన్నాడు వేమూరి వారు. ‘‘ఇల్లు లేకపోయినా, గుండెల నిండా నవ్యాంధ్రపై అభిమానం ఉంటుందని వేమూరి వారొక్కరే కనిపెట్టగలరు. చంద్రబాబు కూడా కనిపెట్టలేడు’’ అన్నాడు ఫుట్‌పాత్ పౌరుడు. ‘‘అదొక్కటే కాదు. నీ గురించి ఇంకా చాలా కనిపెట్టగలను. నీ వయసు 89. నీకు ఓటు హక్కు లేదు. నీకు తినడానికి తిండి లేదు. నీకు వృద్ధాప్య పింఛను లేదు. ఐదేళ్లుగా ప్రభుత్వం నీకేమీ చేయలేదు. అయినా నువ్వు మళ్లీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నావ్. రాత్రి దయాధర్మంగా పెద్దలిచ్చిన సొమ్ముతో అన్నం తినడమైనా మానేస్తావేమో కానీ, రోజూ ఉదయాన్నే మా ‘నవ్యాంధ్రజ్యోతి’ కొనుక్కుని చదవకుండా ఉండలేవ్. ప్రతి శనివారం రాత్రి నీకు నిద్రపట్టదు. త్వరగా తెల్లారడం కోసం చూస్తావ్. తెల్లారి లేవగానే మా పేపర్ కొంటావ్. అందులో ముందుగా నా ‘పలుకు’ చదివితేనే కానీ నువ్వు పళ్లు తోముకోవు. ‘పలుకు’ చదివాక కొన్నిసార్లసలు నీకు పళ్లు తోముకోవాలన్న అవసరమే కనిపించదు’’ అన్నాడు వేమూరి వారు. పెద్దగా ఎగ్జయిటేమీ అవలేదు ఫుట్‌పాత్ నవ్యాంధ్రుడు. ‘‘నీ గురించి ఇన్ని చెప్పాను కదా. నా గురించి ఏమీ చెప్పవా?’’ అని అడిగాడు వేమూరి వారు. వర్తమాన రాజకీయాలపై మీరు వారం వారం భలే ‘రాజకీయాలు’ చేస్తుంటారు. ఆలోచనాపరులకు ఆలోచనలు కలిగిస్తుంటారు. విచక్షణాపరులకు విచక్షణ నేర్పుతుంటారు. నిన్నటి ‘పలుకు’లో ఏపీ విద్యావంతులు తమ మనసుల్లో ఏమనుకుంటున్నారో రాశారు’’ ‘‘ఇంకా?!’’ ‘‘నాలాంటి వాళ్లను వెదకిపట్టుకుని మీ పేపర్లో ఫస్ట్ పేజీలో ఫొటో వేస్తుంటారు. మొన్న కూడా ఒక గర్భిణి స్త్రీ ఫొటో వేశారు’’ ‘‘ఇంకా?!’’ ‘‘రాజకీయాల్ని మించిన రాజకీయం.. మీ విశ్లేషణ రాజకీయం. జగన్ గురించి జనం అనుకోని దాన్ని ఎక్కుపెడతారు. చంద్రబాబు గురించి జనం అనుకుంటున్న దాన్ని తొక్కిపెడతారు’’ అన్నాడు ఫుట్‌పాత్ నవ్యాంధ్రుడు. ‘‘వావ్..’’ అన్నాడు వేమూరి వారు మళ్లీ. ‘‘ఏమైనా కావాలంటే అడుగు’’ అని కూడా అన్నాడు, పర్సు తీస్తూ. ‘‘ఏమీ వద్దు. ఇవాళ్టి నవ్యాంధ్రజ్యోతి పేపర్ ఒకటి ఇప్పించండి చాలు. కొందామంటే రాత్రి ధర్మ ప్రభువులెవరూ డబ్బులివ్వలేదు’’ అన్నాడు ఫుట్‌పాత్ నవ్యాంధ్రుడు. వ్యాన్‌లోంచి ఒక కాపీ తీసిచ్చివెళ్లిపోయాడు వేమూరి వారు. ఆబగా పేపర్ చూశాడు నవ్యాంధ్రుడు. పాత పేపర్ అది! డేట్‌ని బట్టి కాకుండా, ‘చంద్రబాబుకు కేసీఆర్ మద్దతిస్తే?’ అనే హెడ్డింగ్‌ని బట్టి అది పాత పేపర్ అని గుర్తుపట్టాడు నవ్యాంధ్రుడు. -మాదవ్ -
టీడీపీ గుండెల్లో రెబెల్స్
సాక్షి, అమరావతి : పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని రెబల్స్ వణికిస్తున్నారు. పార్టీకోసం పనిచేసిన తమను చంద్రబాబు మోసం చేశారని పలుచోట్ల ఆ పార్టీ నాయకులే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీ కోసం త్యాగం చేయాలని బతిమిలాడినా ఎవరూ లెక్కచేయలేదు. విజయనగరం జిల్లా గజపతినగరం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడికి ఇవ్వడంతో ఆయన సోదరుడు, టీడీపీ ముఖ్య నాయకుడు శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి పార్టీకి రాజీనామా చేసి రెబల్‌గా నామినేషన్ వేశారు. తనను మోసం చేసిన టీడీపీని ఓడిస్తానని శ్రీనివాసరావు ప్రకటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పార్టీ సీనియర్ నాయకుడు కంఠంనేని రవిశంకర్ టీడీపీపై తిరుగుబాటు చేసి అక్కడ పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ను ఓడించేందుకు రెబల్‌గా బరిలో నిలిచారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో పార్టీ నాయకురాలు విజయజ్యోతి రెబల్‌గా బరిలో నిలిచి.. టీడీపీ తనను మోసం చేసిందని, అవసరానికి వాడుకుని పక్కన పెట్టిందని వాపోతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోకుండా వేరే వారికి సీటిచ్చారని, పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించలేదు. రాజధాని ప్రాంతమైన తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా రెబల్‌గా పోటీకి దిగిన సర్వ శ్రీనివాసరావును పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీనియర్ నేత బొమ్మనచెరువు శ్రీరాములు టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో రెబల్‌గా దిగారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సీటు ఆశించిన కేపీఆర్‌కే ఫణీశ్వరి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మాధవరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి నాలుగు స్థానాల్లో పోటీకి దిగారు. నంద్యాల ఎంపీ స్థానంలో ఎస్పీవై రెడ్డి, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం స్థానాల్లో ఆయన కుటుంబ సభ్యులు జనసేన తరఫున పోటీలో నిలబడ్డారు. -
అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే..
‘‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే’’ అన్నది మిస్సమ్మలోని ఓ ఫేమస్ పాట. భవిష్యత్తులో బాబుగారనే ఓ క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోందని తనకింకా తెలియకుండానే పింగళి వారు ఆ పాట రాసేశారు. కానీ నిజానికి భగవంతుడు మహాస్రష్ట, భవిష్యద్దర్శీ అయిన పింగళి వారితో ఓ పాట రాయించాలనుకున్నాడట. ఆ పాటేమిటంటే.. ‘‘అవునంటే కాదని లే.. కాదంటే అవుననిలే బాబుగారి మాటలకూ అర్థాలే వేరులే..’’ అని. అయితే ఆ సినిమా వచ్చే నాటికి బాబుగారి వయసు జస్ట్ ఐదేళ్లే. కాబట్టి ఆ బాబుగారెవరో, ఆయన అనే మాటలేమిటో, వాటి అర్థాలు ఎలా వేరో అని అర్థమయ్యే అవకాశం లేదు. కొంతమంది కవులూ, రచయితలు భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహాస్రష్టలు. వాళ్లు రాసే అక్షరమక్షరమూ నిజమైపోతుందట. దానికెన్నో తార్కాణాలున్నాయి. దానికి ఉదాహరణే ఈ కథ. ఓ రోజున కాళిదాసుకు చేపలు తినాలనిపించింది. ఫిష్ మార్కెట్‌కెళ్లి ముళ్లు తక్కువ ఉండే చేపలు ప్యాక్ చేయించుకుని వెనక్కుతిరిగాడు. ఎదురుగా భోజరాజు. పొట్లాన్ని చూసీచూడగానే అక్కడేదో ‘సమ్‌థింగ్ ఫిషీ’ అనిపించింది భోజరాజుకు. అడగనే అడిగాడు ‘ఏమిటది?’ అని. అప్పుడు కాళిదాసు.. ‘ఆ.. రాజు చూడొచ్చాడా’ అని మనసులో అనుకుని.. ‘అది రామాయణ గ్రంథం’ అంటూ ఓ అబద్ధమాడేశాడు. ‘నీళ్లు కారుతున్నాయేమిటి?’ అని భోజుడి ప్రశ్నకు.. ‘అది కావ్యసారం’ అని కాళిదాసు జవాబు. ‘వాసనొస్తుందేమిట’న్న ప్రశ్నకు ‘రామరావణ యుద్ధంలో చనిపోయిన సైనికుల శవాల కంపు’ అని బదులిచ్చాడు. కాళిదాసు చెప్పేది అబద్ధమనీ, ఫిష్హ్యాండెడ్గా పట్టుకుని తీరాలని భోజరాజు పొట్లం విప్పి చూపించమంటే.. కాళిదాసుకు చూపించక తప్పలేదు. తాను కాళికాదేవి పరమభక్తుడు కావడంతో భక్తుడి పరువు నిలపడానికి అమ్మ తన వంతు ప్రయత్నం చేసింది. పొట్లాం విప్పితే రామాయణ గ్రంథం కనిపించిందట భోజుడికి. అలాగే తిక్కనగారికి కూడా ఏం రాయాలో తెలియక ఓసారి ‘ఏమని చెప్పను గురునాథా?’ అంటూ పక్కనున్న వ్రాయసకారుడితో ఏదో అంటే.. అది గణాలతో సహా చక్కగా ‘కురునాథా’ అని కుదిరిపోయిందట. పింగళివారు కూడా మహారచయితే కదా. అందుకే ‘‘బాబుగారి మాటలకూ అర్థాలే వేరులే’’ అనిపించాడు దేవుడు. ఉదాహరణకు.. మహిళల రక్షణ కోసం ఆయన రావాల్సిందే అంటూ అప్పట్లో ఆయన యాడ్ చేసి లోకం మీదికి వదిలాడు. తీరా వాస్తవంలో ఏం జరిగిందీ? డ్యూటీ సక్రమంగా చేసినందుకు వనజాక్షిని ఏడిపించారు. రిషితేశ్వరి అనే స్టూడెంట్ను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆక్వా పార్క్‌కు అడ్డుపడ్డ సత్యవతిని అక్రమంగా అరెస్టు చేయించి, పోలీసులతో వేధించారు. అనంతపురం జిల్లా జల్లిపల్లిలోని ఓ దళిత మహిళను బట్టలిప్పిమరీ కొట్టారు. న్యాయం అడగడానికి వచ్చిన డ్వాక్రా మహిళల్ని, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియకుండా తీసుకెళ్లి వదిలారు. సివిల్ సర్వెంట్ కావాల్సిన గౌతమిని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చూపారు. తెలంగాణలో తమ పార్టీ నుంచి జంప్ అయిన వారిని ఓడించమని పిలుపిచ్చారు. సొంత రాష్ట్రంలో మాత్రం పక్క పార్టీ వారికి మంత్రి పదవులిచ్చారు. ఇక మిగతా వాగ్దానాల్లో శాంపిల్‌గా కొన్నింటిని మాత్రమే చూద్దాం. ప్రపంచస్థాయి రాజధాని అన్నారు. ఇప్పటికి కాలేదు. జాబులన్నారు రాలేదు. 2016కు దుర్గగుడి ఫ్లైఓవర్.. 2018కి పోలవరం అన్నారు. ఇంకా పూర్తవ్వలేదు.‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటాడు.. అంతలోనే ‘నా భవిష్యత్తుకు మీరే బాధ్యత’ అని మాటమారుస్తాడు. ఇలా ఒకటా... రెండా ‘బాబుగారు ఏ మాట మాట్లాడినా సరే.. అది ‘అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే’. ఓ మహానుభావుడు చెబుతున్న ఈ కథను వింటున్న ఓ పాఠకుడు చివరగా .. ‘‘గురువుగారూ.. పింగళివారు బాబుగారిని ఉద్దేశించే ఆ పాట రాశారని మీకెలా తెలుసు?’’ అని ప్రశ్నించాడు. ‘‘అది చెప్పడం కోసమే కదా నన్ను పుట్టించి పింగళివారి ప్రతిభ మరోమారు లోకానికి వెల్లడయ్యేలా చేశాడు అనేక లీలావినోద ప్రదర్శనధారి అయిన ఆ దేవదేవుడు!’’ – యాసీన్ -
సింగపూర్ బాబు.. వెన్నుపోటు గేమ్స్
సాక్షి, అమరావతి : ఆయన పేరు సింగపూర్ బాబేశ్వర్‌రావు. అసలు పేరు వేరే ఏదో ఉందిగానీ.. ఆయనకు సింగపూర్ అంటే చాలా ఇష్టం. ఏదైనా అంటే చాలు.. అస్తమానం సింగపూర్ పేరెత్తుతూ ఉంటాడు. ‘అసలు సింగపూర్‌లో ఇళ్లు ఎలా కడతారో తెలుసా? మనవాళ్లకు కనీసం మెట్లు కట్టడం కూడా రాదు. మన ఇంజినీర్లు వాళ్ల దగ్గర కూలీలుగా పనిచేయడానికి కూడా పనికిరారు’ లాంటి కబుర్లు చెప్పి సింగపూర్‌ను పొగుడుతూ ఉంటాడు కాబట్టి ఆయన అసలు ఇంటి పేరుకు బదులుగా సింగపూర్ అనే ప్రిఫిక్సు చేరిపోయింది. దూకుడు సినిమాలోని సింగపూర్ రాజేశ్వర్‌రావు టైప్‌లోనే.. ఈయన కూడా అలవోకగా చాలా కోతలు కోసేస్తుంటాడు. ఉదాహరణకు కొన్ని చూద్దాం. తనదంతా సింగపూర్ టెక్నాలజీ కాబట్టి చాలా చాలా పనులు చాలా తేలిగ్గా, అతి చురుగ్గా, పరమ చులాగ్గా చేయించగలననీ, కాబట్టి తనను వాడుకొమ్మని, వాడుకున్నంత వారికి వాడుకున్నంత అనే లాంటి ఆఫర్లు ఇస్తుంటాడు. తాను తలచుకుంటే బుడతనబిల్లి నుంచి బుడంకాయపల్లి లాంటి పల్లెటూళ్ల మధ్య కూడా బుల్లెట్ ట్రైయిన్లు వేయిస్తానని, ఐదునిమిషాలకొకటి నడిపిస్తానని అంటాడు. మరి రైల్వేలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి కదా నువ్వెలా వేయించగలవ్ అంటే తానో జవాబు ఇస్తాడు. ఆటలంటే తనకు చాలా ఇష్టమంటాడు. జావొలిన్ త్రోలో బల్లెం మరీ పొడుగ్గా ఉంటుంది, అంత పెద్దది పట్టుకుంటే ఎదుటివాడికి తెలిసిపోతుంది కాబట్టి జావొలిన్లు ఎంచుకోడు. రెజ్లింగూ, కత్తియుద్ధం లాంటి ఆటల్లో పాల్గొనాలంటే, ఎదురు నిలబడి ఆడాల్సి వస్తుందనీ, తనకు పరమ సిగ్గు కాబట్టి వెనక నిలుచుని, సైలెంట్‌గా టార్గెట్‌కు కరెక్టుగా తగిలే.. వెన్నుపోటు గేమ్స్ లాంటివి ఆడతానని అంటాడు. ఇలా తనకు క్రీడల మీద ఉన్న పరమ అభిమానంతో ఈసారి తనను గనక గెలిపిప్తే ఒలింపిక్స్‌ను అమరావతిలో జరిపిస్తానంటాడు. అదెలా అంటే దానికీ అదే ఆన్సర్ చెబుతాడు. పెద్ద పెద్ద పెట్టుబడులు తెచ్చేందుకు తాను దావోసూ లాంటి చోట్లకు వెళ్తుంటే మనమంతా కామోసు అనుకుంటుంటాం. తనను కలిసేందుకు బిల్‌గేట్సు గేటు దగ్గర కాచుక్కూచ్చుంటాడనీ, ఎదురు పడగానే ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెడతాడనీ అంటాడు. అలాంటి ఎందరెందరో బిల్గేట్సులను అమరావతి గేటు దగ్గరికి రప్పించి, అక్కడ కంప్యూటర్ కొట్లూ, టెక్నాలజీ షాపులూ, సైబర్ దుకాణాలూ పెట్టిస్తానంటాడు. ప్రజలకు తానిలా అరచేతిలో వైకుంఠం చూపడం కోసమే రాహుల్ దగ్గరికి వెళ్లి వాళ్ల గుర్తుకు మద్దతిచ్చానంటాడు. మరి.. బులెట్ ట్రైయిన్గానీ, అంతర్జాతీయ క్రీడలు గానీ, పెద్ద పెద్ద పరిశ్రమలుగానీ రావాలంటే ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదిప్పట్లో సాధ్యం కాదు. అయినా ఆ లెవల్‌కు తగ్గకుండా హెచ్చులకు వెళ్తుంటాడు ఈ బడాయి బాబుగారు. మరి ఈ బడాయిలు సరే.. ఆ స్థాయివి రాష్ట్రానికైనా రావాలంటే అందులో కేంద్రప్రభుత్వ జోక్యమూ కావాలి కదా.. నువ్వు పిలిస్తే వచ్చేస్తాయా అని అడిగితే.. ‘‘పేరుకు నాది రాష్టమే అయినా.. తెలుగుదేశమంటే అది కేంద్రప్రభుత్వ జోక్యమే లేని స్వతంత్రదేశం. అందుకే నేను సీబీఐనీ, ఈడీని, ఎన్ఐఏ.. ఇలా కేంద్రానికి సంబంధించిన ఎన్నింటినో నిషేధించా. నా స్వార్థం కోసం నేనేదైనా చేసేస్తా. కాబట్టి మొదట్నుంచీ.. అన్నీ నేనే చేశా. ఇప్పుడూ అన్నీ నేనే చేస్తా’’ అంటాడు. ఇవన్నీ చూశాక.. పాక్ ప్రధాని వంటి మన దేశ వ్యతిరేకుల మాటలు నమ్మే ఇలాంటి వారి మాటలు వింటుంటే.. అదే దూకుడు సినిమాలో సింగపూర్ రాజేశ్వర్‌రావు పాత్ర అన్నట్టుగానే.. ప్రజలందరికీ ఒకే ఒక మాట అనాలనిపిస్తోంది. ఆ మాటకే కట్టుబడాలనిపిస్తోంది. అదేమిటంటే.. ‘‘ఎలిమినేట్ చేసేద్దాం సార్.. ఎలిమినేట్ చేద్దాం. ఎన్నికలొచ్చి.. బడాయి బాబుల్నీ, సింగపూర్ బాబుల్నీ ఎలిమినేట్ చేసేందుకు మంచి చాన్స్ ఇచ్చాయి. ఇలాంటివాళ్లు మనకవసరమా సార్. కాబట్టి ఎలిమినేట్ చేసేద్దాం సార్. ఎలిమినేట్ చేద్దాం’’ – యాసీన్ -
కండువా కప్పుకోవడాన్కి లైన్లు కడ్తండ్లు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘అరె, ఒక్కొక్కల ముచ్చట్లింటుంటే కడుపు మండుతంది. గిన్నాళ్లు ఎంపీల బలముండీ ఏం జెయ్యనోళ్లు గిప్పుడేమో మళ్లా అది జేస్తం, ఇదిజేత్తమంటండ్లు. కొంచెమన్న ఇసారం జేసి మాట్లాడాలే. గట్ల గాకుండా జెనాన్నీ గొర్రెలనుకుంటాండ్లేమో, నోటికచ్చినట్లు ఏదీ చెప్తే అదిని నమ్ముతలనుకుంటండ్లు లీడర్లు. మాకు దెల్వదా ఏంది’ అనుకుంట మల్లేషు కోపంల ఉన్నడు. మంచిచెడ్డలు అర్సుకోడాన్కి గాయన దగ్గరికచ్చిన బీరయ్య, ‘ఏందన్నా గట్ల కోపం మీదున్నవేంద’ని మల్లేషునడిగిండు. ‘ఆ..నువ్వా తమ్మీ. గదేం లేదు. ఎంపీ ఎలచ్చన్లు అచ్చినయ్ గదా, గా లీడర్లు పవర్ల రానీకి పసలేని ముచ్చట్లేవేవో చెప్తాండ్లు. జెనానికేమ్ తెల్వదా ఏందీ? గాళ్ల ముచ్చట్లు నమ్మనీక’న్నడు మల్లేషు. ‘గది సరేగాని తమ్మీ ఏంది గిట్ల సడల్న వచ్చనవ’ని మల్లేషు అడ్గంగనే, బీరయ్య ‘గదే అన్నా ఎలచ్చన్ల గురించి నిన్నడిగి తెల్సుకుందమ’ని అచ్చిన్నన్నడు. ‘గట్లనా.. మన రాష్ట్రంల రాజకీయాలు మస్తు మారినయ్ తమ్మీ. ఆ పార్టీ, ఈ పార్టనే తేడ లేకుండా అన్ని పార్టోళ్లు గులాబీ కండ్వా కప్పుక్కోడాన్కి లైన్లు కడ్తాండ్లు. గిట్ల జర్గంగ సుత మేమే గెలుత్తమని కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు చెప్తుంటే కోపం రాకుంటే ఏమైతది తమ్మీ. గందుకనే జెరంత మంటమీదున్న అన్నడు మల్లేషు. ‘దేశంలున్న రాజకీయాలు పక్కన పెడ్తే మన రాష్ట్రంల గాలి ఎటుతిర్గుతంద’ని మల్లేషునడిగిండు బీరయ్య. ‘గిప్పుడైతే టీఆరెస్ పార్టీ మస్తు జోరుమీదున్నది తమ్మీ, ఎంపీ సీట్లు 16 గెల్సుకొని ఢిల్లీల చక్రం తిప్పాలనుకుంటండ్ల’న్నడు మల్లేషు. ‘గట్లనా మల్లేషన్నా. ఎలచ్చన్లు రాకముందే దేశంల ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఢిల్లీ రాజకీయాలను శాసిస్తామన్నడు గదా కేసీఆర్. గిప్పుడు గా మోకతోనే ఉన్నడ ఏంద’ని అడిగిండు బీరయ్య. ‘తమ్మీ.. గిప్పుడు దెవుసంల రాజకీయాలు మస్తు తారుమారైతనయ్. పెధానమంత్రి మోది చర్మిస్మా ఏం కనబడ్త లేదు. కాంగ్రెస్‌ల రాహుల్‌గాంధి మస్తు తండ్లాతండుగని జనం నుండి హిమ్మత్ కనిపిత్తలేదు. గట్ల గా రెండు పార్టోళ్లకు మెజార్టీ సీట్లు అచ్చేటట్టు కనిపిత్తలేవట. గందుకని టీఆరెస్ 16 సీట్లు గెల్సుకుని సత్తా చాటుతమంటండ్ల’ని ఇడమర్సి జెప్పిండు మల్లేషు. ‘మన వరంగల్ జిల్లా రాష్ట్రంల కీలకమైతదని చెప్కత్తండ్లు గదా. గట్ల జర్గుతదా అన్నా’ అని బీరయ్య అగిడేసరికి మల్లేషు ఇంకింత హుషారుగా జెప్పిండు. ‘తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు వరంగల్ జిల్లా కదా ఇతర జిల్లాలకు దారి చూపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఉన్న వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు సుత దునియల మస్తు మంచి పేరున్నది. గతెందుకు గా స్థానాల నుంచి పెద్ద పెద్దోళ్లు పోటీల నిలబడి చరిత్ర కెక్కిండ్లు తమ్మీ’ అని ఎర్కజేసిండు మల్లేషు. ‘గట్లనా అన్నా. మరి గా రెండు స్థానాలు ఎస్సీలకు బద్లాయించుండ్లు కదా. గా సీట్లను టీఆరెసోళ్లు గెలుత్తరంటవా అన్నా’ అని బీరయ్య అనుమాన పడుకుంట అడిగిండు. ‘గందుకనే తమ్మీ ఆ రెండు సీట్లను గెల్సుకుని టీఆరెస్ పట్టు పెంచుకోనీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గా పార్టీల దిర్గేటోళ్లకు హుకుం జారీ చేసిండు. మస్తు మెజార్టీతో పోటీ చేసినోళ్లను గెలిపించుకుని రావాల్ననీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు ఎట్లెట్లా జేయాలో కేసీఆర్ ఇవరిత్తండ’ట అని అన్నడు మల్లేషు. ‘మల్లేషన్నా.. అచ్చే నెల రెండో తారీఖున వరంగల్ అజాంజాహి మిల్లుల కేసీఆర్ మీటింగుకత్తండట కదా. గక్కడ మీటింగు పెడ్తే మస్తు కల్సి అత్తదట కదా. నిజమేనా’ అని అడిగిండు బీరయ్య. ‘తమ్మీ బీరయ్య.. నువ్వన్నది ముమ్మాటికీ కరెస్టు. అక్కడ అప్పట్ల పీవీ నర్శింహారావు మీటింగు పెట్టిండు, ఆయన దేశానికి పెధానమంత్రి అయ్యిండు. గట్లనే ఈసారి కేసీర్ మీటింగు పెట్టి దేశానికి పెధానమంత్రి అయితడని చెప్కత్తండ్లు గా పార్టీ లీడర్ల’ని మల్లేషు ఇవురంగా జెప్పిండు. ‘అన్నా గట్లయితే మంచిదే గదా. మొత్తానికైతే సభ పెట్టనీకి మస్తుగా ఏర్పాట్లు జేత్తన్నరంటవ్’ అన్నడు బీరయ్య. ‘అవు తమ్మీ. సువ్ సుత మీటింగుకు రా. కేసీఆర్ ఏం చెప్తడో ఇని ఇసారం జేయ్’ అన్నడు మల్లేష్. గంతట్లనే ఇంట్ల పనుందని జెప్పి బీరయ్య ఇంటికెల్లి పోయిండు. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్ -
ఎండలు ముదిరే..లోకేశ్ బెదిరే !
జగన్ సభల్లో జనం తప్ప జగన్ కనిపించడం లేదు.పవన్ సభల్లో పవన్ తప్ప జనం కనిపించడం లేదు. బాబు సభల్లో జనం కనిపించడం లేదు.. బాబూ కనిపించడం లేదు! కారణమేంటని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు చంద్రబాబు. ‘లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలే కారణం’ అని ఉంది రిపోర్ట్‌లో!! రిపోర్ట్‌ని విసిరికొట్టాడు చంద్రబాబు. ‘‘నేనడిగిన రిపోర్ట్ ఏంటి, మీరిచ్చిన రిపోర్ట్ ఏంటి?’ అన్నాడు. ‘‘సారీ సార్. ఇది లోకేశ్‌బాబు తెప్పించుకున్న రిపోర్ట్.. వాతావరణ శాఖ నుంచి. ఇదిగోండి మీరు అడిగిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్’’ అని వేరే కాగితం చేతికిచ్చాడు కార్యదర్శి. దాన్ని చూడలేదు చంద్రబాబు! ‘‘వాతావరణశాఖ నుంచి లోకేశ్ రిపోర్ట్ తెప్పించుకున్నాడా!’’ అని ఆశ్చర్యపోయాడు. ‘‘అవున్సార్. రుతుపవనాలు రెండు నెలల ముందే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పమన్నారట లోకేశ్ బాబు’’.. అన్నాడు కార్యదర్శి. చంద్రబాబు ముసిముసిగా నవ్వుకున్నాడు. ‘‘ఎన్నికలు కొత్త కదా. ఎండలకు తట్టుకోలేకపోతున్నట్లున్నాడు’’ అన్నాడు. ‘‘ఎన్నికలు కొత్తయినా, లోకేశ్‌బాబుకి ఎండలు కొత్త కాదు కదా సార్. ఎండల్లో వానలు పడతాయని ఎందుకు అనుకు న్నాడో..’’ అన్నాడు కార్యదర్శి. ‘‘అనుకోలేదయ్యా.. ఆశించాడు. ఆశించడం తప్పా? నువ్వు ఆశించడం లేదా.. మళ్లీ నేనే సీఎంను కావాలని! నేను ఆశించడం లేదా నా సభలకు కనీసం ఇద్దరు ముగ్గురైనా జనం రావాలని! అలాగే లోకేశ్‌బాబూ ఆశించాడు.. సమ్మర్లో కుంభవృష్టి కురిస్తే బాగుంటుందని..’’ అన్నాడు చంద్రబాబు. ‘‘నైస్ సర్’’ అన్నాడు కార్యదర్శి. ‘‘నైస్ సరే.. ‘లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలే కారణం’ అని ఉందేంటి వాతావరణ శాఖ రిపోర్ట్‌లో! దేనికి కారణం?’’ అని అడిగాడు చంద్రబాబు. ‘‘లోకేశ్‌బాబు రుతుపవనాల గురించి మాత్రమే ఆరాతీసి ఊరు కోలేదు సార్. ఎండలింత తీవ్రంగా ఉండడానికి కారణం ఏమిటో కూడా కనిపెట్టి చెప్పమని అడిగినట్లు న్నాడు. ‘ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలు మొదలు పెట్టడంతో రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరుకున్నాయి’ అని రాసి పంపారు’’ అన్నాడు కార్యదర్శి. చంద్రబాబుకి మండిపోయింది. ‘‘ఆ రిపోర్ట్ ఇచ్చినవాడెవడో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడై ఉంటాడు. లోకేశ్‌బాబు కంటపడకుండా రిపోర్ట్‌ని దాచేయండి. సెటైర్ అని అర్థం చేసుకోకుండా ‘నాన్గారూ.. నా వల్లే ఎండలు మండిపోతున్నాయట.. హి..హి.. హీ..’ అని వచ్చి చెబుతాడు. పిచ్చి లోకన్న’’ అన్నాడు. తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసి చూశాడు. అందులో ఇలా ఉంది. మీవాళ్ల ప్రశ్నలు : జగన్ సభల్లో జనం తప్ప జగన్ కనిపించడం లేదు. పవన్ సభల్లో పవన్ తప్ప జనం కనిపించడం లేదు. బాబు సభల్లో జనం కనిపించడం లేదు, బాబూ కనిపించడం లేదు! ....కారణం ఏంటి? మావాళ్ల పరిశీలన : జగన్ జనం మధ్యలో ఉంటున్నాడు. అందుకే జనం తప్ప జగన్ కనిపించడం లేదు. పవన్ జనం మధ్యలో ఉండటం లేదు. అందుకే పవన్ తప్ప జనం కనిపించడం లేదు. చంద్రబాబు తెలుగురాని ఉత్తరాది లీడర్ల వెనుక ఉంటున్నాడు. అందుకే జనమూ కనిపించడం లేదు. బాబూ కనిపించడం లేదు. – మాధవ్ -
పాల్.. కేఏ పాల్
రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకి పొద్దున్నే ఫోనొచ్చింది. ‘‘గుడ్మాణింగ్ బాబుగారూ.. చెప్పండి’’ అన్నాడు. ‘‘మైండ్ దొబ్బిందా? బాబు గొంతేదో, కేయేపాల్ గొంతేదో గుర్తుపట్టలేదా?’’ అన్నాడు పాల్. ‘‘ఓ.. పాల్ గారా.. చెప్పండి. కానీ కాస్త మర్యాదగా చెప్పండి’’ అన్నాడు. పాల్కి మండిపోయింది. ‘‘మర్యాదా! నీకా!! బాబుకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా అని బాబు పక్కన ఉండే ప్రతి తొక్కలో గాడికీ రెస్పెక్ట్ ఇవ్వను’’ అన్నాడు. ‘‘పాల్ గారూ.. మర్యాద ప్లీజ్. ముందిది చెప్పండి. బాబుగారి పక్కన ఉంటున్నానని మీకు నా మీద రెస్పెక్ట్ లేదా? బాబుగారి పక్కన లేకున్నా కూడా మీకు నా మీద రెస్పెక్ట్ ఉండక పోయేదా?’’ ‘‘అంటే ఏంటి! ‘బాబు దగ్గర నువ్వుండబట్టే నీ మీద రెస్పెక్ట్ లేదు కుటుంబరావ్’ అని నేను అంటే.. అప్పుడు నువ్వు రెస్పెక్టబుల్ పర్సన్‌గా ఫీలవుతావా.. ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్ అని?’’ అన్నాడు పాల్. కుటుంబరావ్ కాగితాలు ఎగిరిపోయాయి. ‘‘ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు పాల్ గారూ. ఏమిటి మీకూ నాకూ ఉన్న సంబంధం?’’ అన్నాడు. ‘‘సంబంధం లేదని నువ్వు అనుకున్నావ్ కాబట్టే సంబంధం లేకుండా నా మీద సెటైర్లు వేస్తున్నావ్. వెళ్లి చంద్రబాబుని అడుగు.. మీ పార్టీకి, మా పార్టీకి ఉన్న సంబంధం ఏమిటో? ప్రణాళికలు వేస్తూ కూర్చోవడం కాదు కుటుంబరావ్... కాస్త పొలిటికల్ నాలెడ్జి కూడా ఉండాలి..’’ అన్నాడు పాల్. ‘‘ప్రణాళికలు వేయడానికి పొలిటికల్ నాలెడ్జి ఎందుకు పాల్ గారూ..’’ ‘‘ఎందుకా! నిన్న ప్రెస్‌మీట్ పెట్టి ఏమన్నావ్? బాబుగారు ప్యాకేజీకి ఒప్పుకోలేదు. హోదాకి సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే అందుకు ఒప్పుకున్నారు అని కదా అన్నావ్. నాలెడ్జ్ లేకపోవడం అంటే ఇదే కుటుంబరావ్! చంద్రబాబు వెనకేసుకోడానికి ప్యాకేజ్ తెచ్చుకుంటే, నువ్వు చంద్రబాబుని వెనకేసుకొచ్చే ప్యాకేజీ తీసుకున్నట్లున్నావ్. హోదాకి ప్యాకేజీ సమానమని వాళ్లు అన్నారే అనుకో. సమానమైనప్పుడు హోదానే ఇవ్వొచ్చు కదా మీ బాబుగారు అడగాలి కదా..’’ ‘‘ఓ.. అదా మీ కోపం పాల్ గారూ!’’ ‘‘నేను చెప్పానా కుటుంబరావ్.. అదే నా కోపం అని!! చంద్రబాబు ఏది ఎందుకు చేశాడో నువ్వే చెబుతావ్, నాకు కోపం ఎందుకొచ్చిందో కూడా నువ్వే ఊహించుకుంటావ్’’ అన్నాడు పాల్. కుటుంబరావు కాగితాలు మళ్లీ ఎగిరిపోయాయి. ‘‘కాసేపు మౌనం పాటించమంటారా పాల్ గారూ.. మీ కోపం తగ్గడానికి?!’’ అన్నాడు. ‘‘ఆ మౌనం నిన్ననే పాటించాల్సింది కుటుంబరావ్. నీకు బీజేపీ అంటే పడదు. ఓకే. కన్నా లక్ష్మీ నారాయణ అంటే పడదు. ఓకే. కన్నాకు డిపాజిట్ దక్కితే పదిలక్షలు బంపర్ ఆఫర్ అన్నావ్. ఒకే. బీజేపీకి ఓట్లే పడవన్నావ్. అదీ ఓకే. అక్కడితో ఆగావా?! బీజేపీ కన్నా ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు పడతాయ్ అన్నావ్! అంత చీప్ అయిపోయిందా కుటుంబరావ్ మా పార్టీ! దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, మూర్ఖులు.. ఎన్ని సెటైర్లు వేసినా రేపొచ్చే గర్నమెంటు మాదే. స్టేట్‌లో ప్రజాశాంతి పార్టీ జెండా ఎగరేస్తుంది చూడు. నిన్ను క్షమిస్తున్నా. మళ్లీ ఏవో కాగితాలు పట్టుకొచ్చి ప్యాకేజ్ ప్రెస్మీట్లు పెట్టకు. సరేనా’’ అని ఫోన్ పెట్టేశాడు పాల్. ఎగిరిపోయిన ప్యాకేజీ కాగితాలు ఏరుకునే పనిలో పడిపోయాడు కుటుంబరావు. – మాధవ్ -
భూములివ్వలేదని పంటలు తగలెట్టేశారయ్యా!
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించగానే.. ఈ ప్రాంతంలో అలజడి రేగింది. మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చేది లేదని ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. భూములను ఎలాగైనా లాక్కునేందుకు అధికార పార్టీకి చెందిన కొందరి సూచనలతో దుండగులు రంగంలోకి దిగారు. 2014 డిసెంబర్ 29న అర్ధరాత్రి వేళ ఐదు గ్రామాల్లోని పచ్చని పంట పొలాల ను అగ్నికి ఆహుతి చేశారు. అరటి గెలలు, చెరకు గడలు కాలి బూడిదయ్యాయి. గడ్డి వాములు, పందిళ్లు, బొంగులు భస్మీపటలమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే మంత్రులు రంగంలోకి దిగారు. దీనికి కారకులు వైఎస్సార్ సీపీ నేతలే అంటూ విమర్శలు చేశారు. అనుమానితుల పేరుతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సుమారు వంద మంది, తుళ్లూరు మండల పరిధిలోని మందడం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లోని 70 మంది రైతులు, యువకులు, కూలీలను విచారించారు. కొంతమంది యువకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసకు గురి చేశారు. ఘటనకు బాధ్యులు తామేనని ఒప్పుకోవాలని, లేకుంటే వైఎస్సార్ సీపీ నేతల సూచనతోనే పంటలు తగలబెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి చేశారు. బాధితులు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడంతో 15 రోజుల చిత్రహింసల తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. పంటలు తగలబెట్టించుకుంది రైతులేనని వితండ వాదానికి అధికార పార్టీ నేతలు దిగడం గమనార్హం. బాధిత రైతుల్లో కొందరిని ‘సాక్షి’ రచ్చబండ వేదిక పలకరించగా.. ‘ఆ రోజు అర్ధరాత్రి దుండగులు చెలరేగిపోయారయ్యా. పంటల్ని తగలెట్టేశారు. గడ్డివాములు, పందిళ్లు, బొంగులను కూడా మిగల్చలేదు. మమ్మల్ని వేధించారు. మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో మేం బతికి బట్టకట్టాం’ అంటూ ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన పోలీసులు తాడేపల్లి పరిధిలో ఆధారాలేవీ తాము సేకరించలేకపోయామని చేతులెత్తేశారు. కేసు మూసేస్తున్నట్టు మాకు నోటీసులు అందజేశారు. నాలుగేళ్లపాటు వందల మంది అమాయకులను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేసిన పోలీసులు నిందితులను పట్టుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారనే కదా’ అంటూ పలువురు ప్రశ్నించారు. 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు నా అరటి తోటలోని వెదురు బొంగులకు అర్ధరాత్రి వేళ నిప్పుపెట్టారు. విచారణ పేరుతో నన్ను 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో 144 సెక్షన్, పోలీస్ ఔట్ పోస్టులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు. నాలుగేళ్ల పాటు విచారణ చేసిన పోలీసులు ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటున్నారు. అందుకే కేసు మూసేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇన్నేళ్లపాటు విచారణ సాగించి ఇప్పుడు నిందితులను పట్టుకోలేకపోయామని చెప్పటం సిగ్గుచేటు కాదా. – మల్లికార్జునరెడ్డి, బాధిత రైతు, ఉండవల్లి కాల్ డేటా అన్నారు భూములు తగులబెట్టిన సమయంలో ఈ ప్రాం తంలో ఉపయోగించిన సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా రైతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకె ళ్లారు. రైతుల కాలిముద్రలు సేకరించారు. కేసును నాలుగేళ్ల పాటు విచారించి తీరిగ్గా నిందితులను పట్టుకోలేకపోయామనే కారణంతో కేసు క్లోజ్ చేశారు. ఈ ఘటన తర్వాత రైతులంతా భయంతో భూములిచ్చారు. పోలవరం, రాజధాని యాత్రల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సీఎం చంద్రబాబు... రైతులకు ఇచ్చిన ప్లాట్లకు మాత్రం టెండర్లు పిలవలేదు. పూలింగ్ తీసుకున్న రైతులంతా నష్టపోయారే తప్ప ఎవరూ బాగుపడలేదు. – మేకా కోటిరెడ్డి, రైతు, పెనుమాక -
ఐ హేట్యూ.. రాజా
సాక్షి,తెనాలి : కల్మషం లేని ప్రజానీకం.. కల్చర్ నేర్చిన పట్టణం. ఉద్యమాలకు పురిటి గడ్డ.. ఒకప్పుడు జలరవాణాకు వాణిజ్య కేంద్రం. సాహిత్య సామ్రాజ్యం.. ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్న ఆంధ్రా ప్యారిస్ తెనాలికి రాజకీయంగానూ ప్రత్యేకత ఉంది. ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు అధికార టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. అసమ్మతి సెగలు రాజేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై సొంత సామాజిక వర్గమే గుర్రుగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే, మరికొందరు అలకపాన్పుఎక్కుతున్నారు. వారిని బుజ్జగించలేక.. మండే ఎండలో ప్రచారం చేయలేక.. ఇప్పుడెలా అంటూ ఆలపాటి దిక్కులు చూస్తున్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత జరగనున్న రెండో పర్యాయం ఎన్నికల్లో మళ్లీ త్రిముఖ పోటీ నెలకొంది. అధికార టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ ఈ సారి ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే మంచి పేరుంది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు చివరి స్పీకరుగా పనిచేసి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన నాదెండ్ల మనోహర్ ఈసారి జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు ముందు నుంచి ప్రారంభమైన∙చేరికలు, ప్రచారం పుంజుకునేకొద్దీ ఊపందుకున్నాయి. దూరం పెరుగుతోంది.. పొరుగు నియోజకవర్గం నుంచి వలస వచ్చిన టీడీపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ నివాసం గుంటూరులో ఉంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు సహా వివిధ వ్యాపారాల నిర్వహణలో బిజీగా ఉండే ఆలపాటి, గుంటూరు కేంద్రంగానే వీటిని నిర్వర్తిస్తుంటారు. నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా గుంటూరుకు చెందిన అస్మదీయులే వెంట ఉంటారు. ఇక్కడి వ్యాపార లావాదేవీలన్నీ వారే పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆలపాటి ఆయన ఆంతరంగికుడితో అంతర్గత విభేదాల కారణంగా ఒకరొకరుగా దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం అన్నంగి శ్రీను ఒక్కరే గుంటూరు నుంచి వస్తున్నారు. స్థానికంగా కూడా పట్టణ పార్టీ నేత, మరొక ఆంతరంగికుడికి మినహా మిగిలిన ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వటం లేదనీ, తమ మాట వినిపించుకున్న పాపాన పోవటం లేదని ద్వితీయశ్రేణి పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. అక్కడ పార్టీ ఖాళీ.. ఆలపాటి సన్నిహితుల హవాతో టీడీపీలో సొంత సామాజికవర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో క్రియాశీలకంగా ఉండే మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, పార్టీ గ్రాడ్యుయేట్స్ విభాగం జిల్లా నాయకుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉండిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని తెలుసుకున్న ఆలపాటి, స్వయంగా వెళ్లి, దూతలను పంపి, ఏదోరకంగా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వ్యాపార ప్రముఖుడిని ఇదే తరహాలో బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇన్ని చేస్తున్నా కొల్లిపరలో పార్టీలోని అక్కడి కీలక సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ, జనసేనలో చేరటంతో అక్కడ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. ప్రచారానికి వెళ్లిన ఆలపాటిని, ఆయన సతీమణిని అభివృద్ధి ఎక్కడంటూ స్థానికులు నిలదీస్తున్నారు. అసమ్మతి నేతలతో తంటాలు.. పట్టణంలోని పలు వార్డుల్లోని అసమ్మతి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. పట్టణ 16వ వార్డులోని టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త భారీ సంఖ్యలో అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో తాను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావని అప్పట్లో వారు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. 33వ వార్డు కౌన్సిలర్ కూడా ఇదే తరహాలో టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వివిధ వార్డుల నుంచి స్థానిక ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే ఆలపాటిపై అలకబూనారు. ఆలపాటి స్వయంగా ఇంటికెళ్లి బతిమిలాడినా, దిగిరాలేదని నియో జకవర్గంలో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వ్యక్తి∙మళ్లీ ప్రచారంలో పాల్గొనటంతో, ఏదొక పదవి హామీతోనే అలక విరమించి ఉంటారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెచ్చుమీరిన అవినీతి నియోజకవర్గంలో అవినీతి పరాకాష్టకు చేరుకోవటం, కొల్లిపర మండల పరిధిలోని కృష్ణానదిలో ఇసుక మేట పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు, నీరు–చెట్టు పథకం అక్రమాలకు నిలయంగా మార్చటం, పట్టణంలో టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి మురుగు కాలువలు, రోడ్లు పేరుతో డబ్బు దోచుకోవటం, పట్టణంలో గత నాలుగేళ్లలో నిర్మించిన భవనాలకు ప్రతి అంతస్తుకో రేటు చొప్పున నిర్ణయించి, వసూళు సాగిస్తున్న వైనం టీడీపీ సానుభూతిపరులను కూడా ఆలోచింపజేస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమార్జనపై స్థానికులు ఏవగించుకుంటున్నారు. ఆలపాటికి ఆంతరంగికులైన కోటరీ చర్యల కారణంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టి పనిచేసే నాయకులు, కార్యకరులు దూరమయ్యారు. ఫలితంగానే ఈ పర్యాయం ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కటం అసాధ్యమనే భావనతోనే అసమ్మతి సెగ ఊపందుకుంటుంది. -
బాబు@ ‘సీబీఎన్’ చానల్
‘ఈ’పేపర్ని, ‘ఆ’ పేపర్ని చింపి పడేశాడు చంద్రబాబు! పార్టీ కార్యకర్తల ప్రాడక్ట్ మీద ఎప్పుడూ ఆయన అంత కోపం ప్రదర్శించలేదు. ‘‘చెత్తగాళ్లు, చెత్త న్యూస్’’ అన్నాడు. చుట్టూ ఆయన పెట్టుకున్న స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ‘‘నిన్నంతా మీరేమీ పీకలేదా?’’ అన్నాడు చంద్రబాబు. ‘‘పీకాము నాయుడుగారూ.. వాళ్లే, మేము పీకిందేమీ రాయలేదు’’ అన్నారు. చంద్రబాబు మండిపడ్డాడు. ‘‘జగన్ ఇలా అన్నాడు. జగన్ అలా అన్నాడు. కేసీఆర్‌తో సెల్ఫీ దిగాడు. కేటీఆర్‌తో కుల్ఫీ తిన్నాడు.. ఇదా న్యూస్! జనాన్ని జగన్‌కి దూరం చేసే న్యూస్ రాయమంటే జగన్‌కి మనవాళ్లను కూడా దగ్గర చేసే న్యూస్ రాస్తున్నారు’’ అన్నాడు. స్టార్ క్యాంపెయినర్ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు. ‘‘ఏంటా ఎక్స్ప్రెషన్?’’ అన్నాడు చంద్రబాబు. ‘‘మీ మీద కాదు. వాళ్ల మీద’’ అన్నాడు. ‘‘వాళ్ల మీద అంటే.. వేళ్ల మీద? అన్నాడు చంద్రబాబు చికాగ్గా. ‘‘అదేనండీ నాయుడుగారూ.. మన రెండు పేపర్ల మీద! మన పేపర్లు అయివుండి, పొద్దస్తమానం జగన్.. జగన్.. అంటాయేంటీ! ఆయనెరూ.. పీయుష్ గోయెల్. ఈ మధ్య ఆయన హైదరాబాద్‌లో ఏదో హోటల్లో దిగాడంట. ‘జగన్ నా ఫ్రెండు’ అన్నాడంట. పీయుష్కి జగన్ ఫ్రెండయితే జగన్‌కి వచ్చే నష్టం ఏంటి, మనకొచ్చే లాభం ఏంటి? అది రాసుకొచ్చాడు రాధాకృష్ణ! వేస్ట్ ఎనాలిసిస్. పీయుష్ గోయెల్ కేంద్ర మంత్రి అని వర్ల రామయ్య చెప్పే దాకా నాకే తెలీదు. జనానికేం తెలుస్తుంది’’ అన్నాడు రాజేంద్రప్రసాద్. నిజమేనన్నట్లు చూశాడు వర్ల రామయ్య. ‘‘ఆ పీకే గురించి ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదు. పీకే అంటే జనం పవన్‌కళ్యాణ్ అనుకుంటారు కానీ, ప్రశాంత్ కిశోర్ అనుకుంటారా! జగన్‌కి పీకే ఐడియాలు ఇస్తున్నాడని రాస్తే, పవన్ జగన్‌కి సపోర్ట్ చేస్తున్నాడని జనం జగన్‌కి ఓటేసే ప్రమాదం ఉంది. ఆ ప్రశాంత్ కిశోర్ జగన్ అడ్వయిజర్ అని రాజేంద్రప్రసాద్ చెప్పేవరకు నాకూ తెలీదు.’’ అన్నాడు వర్ల రామయ్య. విసుగ్గా చూశాడు చంద్రబాబు. ‘‘మీకు మీరు చెప్పుకోవడం మానేసి, నాక్కూడా చెబుతుండండి’’ అన్నాడు. ‘‘మీక్కూడా చెప్పాం నాయుడుగారూ’’ అన్నారు రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య. ‘ఏం చెప్పారు?’ అన్నాడు బాబు కళ్లద్దాల లోపల్నుంచి చూస్తూ. ‘‘మనమూ ఒక సీబీఎన్ చానల్, మనమూ ఒక ‘సీ’టీవీ పెట్టుకుందాం అని చెప్పాం. మీరు వినలేదు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ మనవే కదా. మళ్లీ మనకో పేపర్, మనకో చానల్ ఎందుకు.. డబ్బులు దండగ అనేశారు’’ అన్నారు స్టార్ క్యాంపెయినర్లు. ‘అవునా..’ అన్నట్లు చూశాడు చంద్రబాబు. ‘ఈ’ పేపర్‌కి, ‘ఆ’ పేపర్‌కీ లైన్ కలపమన్నాడు. కలిపారు. మాట్లాడి పెట్టేశాడు చంద్రబాబు. ‘‘ఏమంటున్నారు సార్.. ’’ అడిగారు స్టార్ క్యాంపెయినర్లు. ‘‘రోజూ మీరు పీకిందేనా.. మేం పీకిందీ రాసుకోవాలి కదా’’ అంటున్నారు.. అన్నాడు చంద్రబాబు. రాజేంద్రప్రసాద్ మళ్లీ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు. – మాధవ్ -
ఎల్లో లీల..జాతకాల మాయ..!
సాక్షి, అమరావతి : ‘ఆ’ పేపర్ నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది. ‘‘కష్టంగా ఉంది నాయుడుగారూ..’’ ‘‘పేపర్ నడపడానికేనా కష్టం. ఏమైనా పంపించమంటావా?’’ ‘‘పేపర్ని నడిపించడానికి కాదు, మిమ్మల్ని గెలిపించుకోడానికి కష్టంగా ఉంది. ఫీల్డు మీద మావాళ్లు చెబుతున్నారు కదా. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా ఉన్నారు. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా హామీలు ఇస్తున్నారు. జగన్ ఇస్తానన్నవి మీరూ ఇస్తాననడం దెబ్బ కొట్టేసింది. సీఎం అంటే ఎంత ధీమా ఉండాలి. అది మీలో లేదు. సీఎం అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మీలో లేదు. జగన్ సభకు ఎర్రటి ఎండల్లో కూడా జనం వస్తున్నారు. మీరు చలువ పందిళ్లు వేసి, స్ప్రయిట్ ఇస్తున్నా జనం రావడం లేదు.’’ ‘‘ఆ సంగతి నాకూ తెలుసు. నా సంగతి నాకు చెప్పకుండా నువ్వేం చేస్తావో అది చెప్పు అన్నాడు’’ చంద్రబాబు విసుగ్గా. ‘‘అలా విసుక్కుంటే ఎలా నాయుడుగారూ? ఇప్పటికే జనాన్ని విసుక్కుని శత్రువైపోయారు. నాయకుల్ని విసుక్కుని జగన్‌కి స్నేహితుల్ని చేసేశారు. ఇప్పుడు నన్నూ విసుక్కుంటున్నారు. నన్ను విసుక్కుంటే నేనెక్కడికీ పోయేది లేదు కానీ.. ఈరోజు మన పేపర్ చూశారా .. ‘చంద్రబాబుకి మళ్లీ రాజయోగం’ అని మీ జాతక చక్రం వేయించాను. ‘బాబుకు గురుబలం అధికం’ అని బిజుమళ్ల బిందు మాధవ సిద్ధాంతి చేత చెప్పించాను. మీ జాతకంలో 9వ స్థానంలో గురు శుక్రులు, దశమంలో రాహువు, 11వ స్థానంలో రవి బుధులు ఉన్న కారణంగా మీరు తప్ప ఈ రాష్ట్రానికి వేరే భాగ్యం లేదని జ్యోతిష పండితులు చెప్పినట్లుగా మా స్పెషల్ డెస్క్ చేత రాయించాను. గ్రహబలం ప్రకారం మీరు సీఎం అవడం ఖాయం అని జనం అనుకుని మీకే ఓటేస్తారు..’’ చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘సీఎం అవుతానని అనుకుని ఓటేయడం ఏంటి! సీఎం అవ్వాలని అనుకుని కదా ఓటెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అన్నాడు. ‘‘ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడించాలి నాయుడుగారూ. మీకోసం మా టీమ్ మొత్తం డే అండ్ నైటు కష్టపడుతున్నాం. ఒక పాత్రికేయ భీష్ముడి చేత మాట్లాడించాం. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి చేత మాట్లాడించాం. ఒక ఆర్థిక నిపుణుడి చేత మాట్లాడించాం. రోజుకొక లీడర్‌కి ఫీడింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. అయినా జనం కదలడం లేదు. ఇక లాభం లేదని పండితుల్ని పట్టుకొచ్చాం. ఏం చేసినా మిమ్మల్ని సీఎం చెయ్యడానికే నాయుడుగారూ..’’ ‘‘చాల్లేవయ్యా.. ‘నీదేమీ లేదు.. అంతా నాదే’ అనే కదా నాకు చెబుతున్నావ్. ఇంతకీ జగన్ గురించి మీ పండితులు ఏమన్నారో చెప్పు’’ అన్నాడు చంద్రబాబు. ‘‘మీకున్నట్లుగా జగన్‌కి గురుబలం లేదని రాయించాను నాయుడుగారూ..’’ ‘‘ఎందుకు! జగన్‌కి గురుబలం గ్రహబలం లేకపోయినా, జనం అనుగ్రహం ఉందని జనం అనుకోడానికా?! నాకు పనికొచ్చే ఐడియాలు వెయ్యమంటే.. జగన్‌కి పనికొచ్చే ఐడియాలు వేస్తావేంటయ్యా..’’ అన్నాడు చంద్రబాబు.. తలకొట్టుకుంటూ. – మాధవ్ -
ఆంధ్రల వున్నసొంటి యెలశ్చన్ల కామ్డి గీడేడుంది?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : యెప్పట్లెక్కనె మాపటీలి మావూరి శెర్వు కాడి రాలెశెట్టు కింద పాత దోస్తులం జమైనం. యెంపి ఎలశ్చన్ల నామ్నేశన్లు ఐపోయ్నయ్ గద... ఇగ లీడర్ల లొల్లి షురువైతదని ఏన్గోపాల్సామి గుడికాడి సత్తన్న బాతాకాని మొదల్వెట్టిండు. గివ్వేం ఎలశ్చన్లు బై... గింతనన్న మజా లేకపాయె. గవ్వే టికిట్ల లొల్లులు, ఒగల్నొగలు తిట్టుకొన్డు . పైసలిచ్చి జనాల్ను తీసుకపోవ్డు , మైకులల్ల ఊదరగొట్టుడు గంతెగద ... అన్మండ్ల కాడి అషోకు నారాజ్ ఐనట్టు మాట్లాడిండు. యెలశ్చన్లంటె గవ్వి గాకుంట ఇంకేమంటయ్ తియ్. మీ నాయిన్న గుడ యేండ్లకేండ్లు సర్పంచిగ చేసిండు గద. మరి గిప్పుడె పాల్టిక్స్కు కొత్తగచ్చినోన్లెంక మాట్లాడవడ్తివి.. గొల్లదుబ్బల మీది రమ్నరావ్ కౌంటరిచ్చిండు. అందర్ని ఓ సూపు జూశిన అషోక్... యెలశ్చన్లంటె ఎట్లుండాలె..? గింత సీర్యస్ గుంటయా? కాన్వాసింగుల కొంచెవన్న నవ్వులుండద్ద? గా అసంబ్లెలశ్చన్ల సీన్మ యాక్టరు బండుల గనేశు సీర్యస్ కామిడితోటి నవ్విచ్చిండు. ఇగ మన ఈరో బాలయ్య ఆల్లన్న బిడ్డ కోసం కూకట్పల్లికచ్చి జేస్న కామ్డి ని ఎవలన్న మర్శిపోతర? ఇగ ఐద్రాబాదును నేనే గట్టిన, సెల్ఫోన్లు నేనే దెచ్చిన అన్కుంట శెంద్రాలు సార్ గుడ గప్పట్ల కమ్మం, ఐద్రావాద్ల కామ్డి జేసి నవ్వుల పాలయ్యె.. అన్నడు. గప్పుడె రాలె శెట్టు కాడికచ్చిన సర్పంచి రమేశు .. అరె ఏందె అషోకన్నా.. గిప్పుడు గాల్లను పిల్పియ్యివంటవా ఏంది? గప్పుడు శెంద్రాలు అచ్చినందుకె కాంగ్రెసోల్ల బత్కు ఎట్లయిందో జూసినవ్ గద. అయిన గిసొంటి ఆలోశన్లు ఎందుకత్తన్నయ్ నీకు... నవ్వుకుంటనే అన్నడు. ఆంద్ర యెలశ్చన్ల కామ్డి పీక్లకు వోయింది. పేస్‌బుక్‌కు, ఆట్సప్ లల్ల సూస్తలెవ్వ. తెలంగన çసప్రేట్ అయినంక పేపర్లల్ల యే రాశ్టం వార్తలాడ్నె పెట్టవట్టిరి. గందుకె గాడ యెన్ని జోకులు జర్గుతన్నా కన్పిత్తలెవ్వు. ఆంద్ర టీవీలల్ల యెపుŠుపడన్నోసారి ఇత్తన్రు గని మనం గా టీ వీల్నెందుకు సూత్తం. పేస్‌బుక్‌కు, ఆట్సప్పులల్ల సూశి కడ్పు వట్టుకొని నవ్వుడైతంది దెల్సా.. అన్నడు అషోకు. నువ్వద్దే... నా పెద్ద కొడ్కు నిన్న సూపిచ్చిండు అని మొదల్వెట్టిండు మాజీ సర్పంచి లచ్చన్న ... సీన్మ యాక్టర్ పవనాలు ఆంద్రల కాన్వాసింగ్ శేసచ్చి... కారుడిక్కిల పండుకొని శేద తీర్త్తండని పేపర్ల పోట్వ యేసిన్రు. అరె... పవనాలు గుడ మనలెక్కనె ఉన్నడని మెచ్చుకుంట... పోట్వను దగ్గర్కి వట్టుకొని జూస్న.. డిక్కిల క్రుశ్నుని లెక్క ఓ శెయ్యి గద్వ కింద వెట్టుకొని కండ్లు మూస్కొని పండుకున్న పవనాల్... ఇంకో శేతిల ఛాయ గిలాస వట్టుకుండు. ఉడుకుడుకు ఛాయ తాక్కుంట, గద్వ కింద శెయ్యి వెట్టుకొని పండుకునుడేంది .. గా పోట్వను ‘శేద తీర్తన్న పవనం కల్యాను’ అని పేపర్లేసుడేంది. కామిడి అంటె... గదె గద అన్నడు. నేన్గూడ జూస్న నిన్న ఓ టీవ్ల. తెల్లంగి, తెల్లలుంగి. రంగేశినట్టున్న నల్లగడ్డం తోటి నుల్క మంచెం మీద గూసొని ఆకాశెంలకు సూస్కుంట ఇంటర్వు ఇత్తండె. టీవ్ల ఇంటర్వు ఇచ్చెటోడు కెమ్రను సూడరా..? గట్లనె ఇవ్వల్ల శెట్టు కింద కూసొని మట్టి ముకుట్ల సల్లతోటి జొన్న గడ్క తింటండని ఓ పోట్వచ్చింది. రోజ్కో కొత్త పోజులిచ్చుకుంట పవనాలు మస్తు నవ్విత్తండు... అన్నడు కోటర్స్లుండె లచ్చన్న శేత్లె వున్న ష్మార్ట్ ఫోన్‌ను తీసి ఆట్సప్పుల అచ్చిన జోకుల్ని జూస్కుంట ఒకటే నవ్వవట్టిండు శెర్వు కాడి శీనన్న. జెప్పి నవ్వరాదె అనెసర్కి... మన ‘మందలగిలి లోకేశెం’ నిన్న మాట్లాడుకుంట... మచ్లిపట్నం పోర్టును తెలంగానకు తీస్కపోవడాన్కి కేసియారు మస్తు కష్టపడుతండని శెప్పిండు. ఇగ మొకానికి చెయ్యండం బెట్టుకొని శెల్ఫి తీస్కునుడు. ఎవ్వల పన్న ఆల్లుంటె ఈనె ఒక్కడె శెల్ఫి దీస్కునుడు... నవ్వాప్కోలేక సత్తనాం ... కొంచెవన్న కామ్డినా... ఈల్లకు కే యెపాల్ గుడ జమైండు అని యూత్లీడర్ రాజుగాడు ముచ్చట స్టాట్ జేసిండు. కే యెపాలు అమ్రిక అద్యెక్శుడు ట్రంపు, ఇంకో రొండు మూడ్వందల దేషాల పెసిడెంట్లతోనె మాట్లాడ్తడు. ఆంద్ర రాశ్టంల గాయిన వెట్టిన పెజాషాంతి పార్టి గెలుస్తదంట. నామ్నేశన్ సుతం ఏసిండు. ఆస్తిపాస్తులు, కేస్లు, బాంకు అకౌంట్ల ఇవరాలు ఇయ్యకుంటనె నామ్నేశన్ ఏసిండట. అవన్ని అమ్రికాల్నె వుంటె... గిక్కడోల్లకెంద్కు అన్కున్నడేమొ... ఈనె జర్నలిస్టుల్ని గుడ ఆల్ల పార్టికెల్లి పోటి జేసి గెలువుమని జెప్పిండు. గాయినె పైసల్ వెట్టుకుంటడంట. గిసొంటి కామ్డి మనకద్దా అన్నా... అన్నడు రాజు గాడు. మల్ల అన్మండ్ల కాడి అషోకు అందుకున్నడు ... తెలంగాన అచ్చినంక మనకు కామిడి లేకుంటపోయింది. ఈడికచ్చన్న గిసొంటి మాటల్జెప్తురనుకుంటె గాడ గుడ యెలశ్చన్లు జరుగవట్టె.. ఈడనేమొ 15 రోజ్లు సప్పటి ప్రశారమె ఉంటదనిపిస్తంది. గీ లీడర్ల కామ్డి ఆట్సప్పులల్ల సూసుడు కన్న డైరెట్టుగనె మంచిగుంటది. లాస్టుకు పేపర్లనన్న ఆంధ్ర ఎలశ్చన్ల కామిడికి ... ప్సెషల్ పేజి పెట్టువని జెప్పాలె. ఓ పేపర్ల పవనాలు పోట్వలేస్కుంట నవ్విత్తన్న గని... ఇంక కామిడి ఉండెటట్టు ఏవన్న జెయ్యిమని గా పేపర్కె లెటర్లు రాద్దాం. టీవ్లోల్లు గుడ ప్సెషల్ బుల్టెన్లు యేసి శెంద్రాలు, పవానాలు, లోకేశెం, కేయెపాలు కామిడీ షోలు ఏపిస్తె తెలంగాన్ల మస్తు టీయార్పి వస్తది... శీకటి వడ్తంటె ఇగ అందరం ఇండ్లకు పోయెడాన్కి లేశినం. రేప ఆట్సప్పులు, టీవీల్ల శెంద్రాలు, పవనాలు , లోకేశం, కేయెపాలుల కామ్డి ఏవుంటదో అన్కుంట..-పోలంపల్లి ఆంజనేయులు -
కత్తుల చంద్రయ్య
పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు నవ్వితే నవ్వుదాం అని చూస్తున్నారు కార్యకర్తలు. కానీ ఆయన నవ్వడం లేదు. ‘‘మిమ్మల్ని మీరు మోసం చేసుకుని, పార్టీని, నన్ను మోసం చేయకండి’’ అన్నాడు చంద్రబాబు కోపాన్ని ఆపుకుంటూ! ‘నువ్వు చేశావా, నువ్వు చేశావా.. బాబు గారిని నువ్వు చేశావా మోసం..’ అని కార్యకర్తలు ముఖాలు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్ని చూసిన చంద్రబాబు.. ‘‘అమాయకత్వం నటించకండి. నాకు అన్నీ తెలుసు. ఎవరికి ఎవర్నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయో, ఎవరు వెళ్లి ఎవర్ని కలుస్తున్నారో, ఎవరు దేనికి ఆశపడుతున్నారో.. అన్నీ తెలుసు. ఆ పనులన్నీ మానండి. ఎవరి మాటలూ వినకండి. మనమే గెలుస్తాం. మన తరఫున ప్రచారానికి ఉత్తరాది నుంచి స్టార్ లీడర్లని రప్పిస్తున్నాం. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా కూడా రాబోతున్నారు. పవన్ ఆల్రెడీ మనకు ప్రచారం చేస్తున్నాడు. కేఏ పాల్నీ ప్రచారానికి ఒప్పిస్తున్నాం’’ అన్నాడు. ‘వపన్ ఉన్నాడు కదా, మళ్లీ పాల్ ఎందుకు, ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా?’’ అన్నాడో కార్యకర్త. ‘‘రెండు కాదు, మూడు కత్తులు..’’ అన్నారెవరో. ‘‘ఎవరు ఆ మూడో కత్తి?!’’ ఈ ప్రశ్న వేసిన కార్యకర్త నెత్తిపైన టప్ మని మొట్టిక్కాయ కొట్టాడు పక్కనున్న కార్యకర్త. ‘‘లోకేశ్‌బాబు కత్తి కాదనుకున్నావురా. బాలయ్యబాబు కంటిచూపుతో చంపేస్తే, లోకేశ్‌బాబు సింగిల్ వర్డ్‌తో చంపేస్తాడు’’ అన్నాడు. చంద్రబాబు కల్పించుకున్నాడు. ‘‘అదే నేను చెప్పేది. మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఉంటే అక్కడ జగన్‌కు ఓట్లు పడతాయి. మన ఒర చిన్నదేం కాదు. ఎన్ని కత్తులైనా పడతాయి. పవను, పాల్, లోకేశే కాదు.. ఇంకో ముప్పై కత్తుల్ని రెడీ చేశా. జగన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కత్తులు ఏసేస్తాయి. నా కత్తి, లోకేశ్ కత్తి ఒకవేళ ఒరలో ఇరుక్కుపోయినా వంగవీటి రాధా కత్తి, యమనల కత్తి, మురళీమోహన్ కత్తి, బాలకృష్ణ కత్తి, జూపూడి కత్తి.. జగన్ జనంలోకి వెళ్తున్నప్పుడు ఏసేస్తాయి! అక్కడ తప్పించుకున్నాడనుకో.. రాజేంద్రప్రసాద్ కత్తి, బుద్ధా వెంకన్న కత్తి, కాకి గోవిందరెడ్డి కత్తి, వర్ల రామయ్య కత్తి, దివ్యవాణి కత్తి.. జగన్ సరిగ్గా జనం మధ్యలో ఉన్నప్పుడు ఏసేస్తాయి! అక్కడా తప్పించుకున్నాడనుకో.. మిగతా ఇరవై కత్తులు జగన్ జనం కన్నీళ్లు తుడుస్తున్నప్పుడో, జనం తల నిమురుతున్నప్పుడో వెనగ్గా వెళ్లి ఏసేస్తాయి..’’ అని చెప్పాడు చంద్రబాబు. అప్పుడు కనిపించింది కార్యకర్తలకు చంద్రబాబు కళ్లల్లో నవ్వు! ‘‘మరి ఆ ముప్పై మందిలో మా ఫేవరేట్ కత్తి లేదా?’’ అని పెద్దగా అరిచారు యువ కార్యకర్తలు కొందరు. ‘‘నాకు అర్థమైంది తమ్ముళ్లూ.. యామిని కత్తి గురించే కదా మీరు అడుగుతున్నదీ. రెండో లిస్టు కత్తుల్లో ఆమె పేరూ ఉంటుంది. అన్నీ నేను చూసుకుంటా’’ అని హామీ ఇచ్చాడు. యువ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘‘తమ్ముళ్లూ.. మీ పక్కన పెద్దవాళ్లు కూడా కూర్చొని ఉన్నారు. కాస్త చూసుకుని ఉత్సాహం ప్రదర్శించండి’’ అన్నాడు చంద్రబాబు. యువ కార్యకర్తలు పక్కకు చూసి, నాలుక కరుచుకున్నారు. ‘ఈ’పేపర్ ఓనరు, ‘ఆ’పేపర్ ఓనరు కూర్చొని ఉన్నారు! ‘‘వీళ్లెందుకు వచ్చార్రా’’ అని గొణుక్కున్నాడు ఓ యువ కార్యకర్త. ‘‘పార్టీ కార్యకర్తల టెలికాన్ఫరెన్స్‌కి వీళ్లు రాకపోతే ఎవరొస్త్రారా.. నోర్మూసుకుని కూర్చో’’.. అని యువ కార్యకర్త డొక్కలో పొడిచాడు పక్కనున్న కార్యకర్త. – మాధవ్ -
పూడిక తీయించిండ్లు.. ప్రాజెక్టులు కట్టించిండ్లు..
ఏమోయ్ రాములు.. ఇంట్లున్నవానోయ్.... ఏంజేత్తన్నవేంది అనుకుంట రాములు ఇంట్ల అడుగు బెట్టిండు ఆయనకు బావ వర్సయ్యే ఎంకటి. గల్మ లోపల్కి అడుగుబెట్టి తొంగి చూసిన ఎంకటికి మంచంల పడ్కొనున్న రాములు కన్పించిండు. ఎంటనే ఎంకటి మంచం కాడికి పోయి ‘బారెడు పొద్దెక్కి ఎండ సుర్రుసుర్రు అంటంది, నీకింకా తెల్లారలేదానోయ్.. ముస్కేసుకుని కాళ్లు నిర్రదన్ని పడుకున్నవ్ అనుకుం’టా నిర్ధపోతున్న రాములును భుజం తట్టి లేపిండు ఎంకటి. ఆ.. ఆ.. ఎవలాళ్లు.. అనుకుంటా నిర్ధకు మూస్కపోయిన రెండు కండ్లను చేతులతోని తడుముకుంటా ఆవులింపు తీస్కుం టా ఒక్కసారిగా కండ్లు దెర్సి సూసిండు రాములు. ఎదురుంగ ఎంకటి బావ కనిపించే సరికి ‘శెనార్తోయ్ బావ, ఎప్పుడచ్చినవేంది’ అని పల్క రించుకుంటా మంచంలకెళ్లి లేచిండు రాములు. అంతట్లనే అంతా మంచిదేనానోయ్ బావ, ఏందో గిట్ల పొద్దుగాల్నే అచ్చినవేందని అడ్గుతుండంగనే ఇరుగుపొరుగోళ్లు చంద్రయ్య, సీతయ్య, పరశురాము ముగ్గురు మోపై అప్పుడే రాములింటి కచ్చిండ్లు. ఆళ్లను సూడంగనే రాములు, ఎంకటి ఒకలకొకలు శెనార్థులు పెట్టుకుని ఇంటి గల్మ అర్గు మీద కూసున్నరు. ‘ఏంది ఎంకన్న పొద్దుగాళ్లనే నీ బామ్మర్ది రాములింటికచ్చినవ్ ఏందీ? ఏందైనా దావత్‌కు పిల్వడానికి అచ్చినవా?’ అని అడిగిండు పరశురాము. ‘గదేం లేదు పరశురాము. ఎంపీ ఎలచ్చన్లు అచ్చినయ్ గదా, దేవుసం మీది ముచ్చట్లు అడ్గి తెల్సుకుందామని అచ్చిన. నాకేమో సదువు రాదాయే. నాలుగక్షరాలు నేర్సుకున్న బుద్ధి్దమంతుడు, నల్గుట్ల తిర్గేటోడు, రాముల్నడిగితే మంచిచెడ్డలు తెలుస్తయని అచ్చిన’ అన్నడు ఎంకటి. ‘గట్లన. ఆ ముచ్చట్లు మేము సుత ఇంటం జెర జెప్పు’ అని చంద్రయ్య, సీతయ్య అడిగిండ్రు. అది సరే గని ఏమడుగుతరో అడుగుండ్లని ఇంటిసూరుకున్న ఏప పల్కర తీసి నోట్ల బెట్టుకుంట అన్నడు రాములు. ‘గా ఢిల్లీలున్న రెండు పెద్ద పార్టోళ్లు అదిజేత్తం, ఇది జేత్తం మమ్ముల గెలిపియ్నుండ్లి అని చెప్తండ్లు గదా, గాళ్ల ముచ్చటేందో జెర జెప్పరాదా?’ అని అడిగిండు ఎంకటి. ‘ఇగో సూడుండ్లి. ఇన్నాళ్లు దేశాన్ని ఆ రెండు పెద్ద పార్టోళ్లు ఏలి మన రాష్ట్రానికి ఏమైన జేసిండ్లా?. ఏం జెయ్యలే. ఐదేండ్ల కిందట కొట్లాడి రాష్ట్రాన్నీ దెచ్చుకున్నంకనే కదా మన రాష్ట్రానికి, మనకు ఇప్పుడిప్పుడే మేలు జర్గుతంది’ అని వివరించిండు రాములు. ‘అవును గని రాములు.. గా రెండు పెద్ద పార్టోళ్లేనట గదా మన వరంగల్లు జిల్లాకు ప్రాజెక్టులు గట్టించిండ్లట. గట్లనే పెచారం చేసుకుంటండ్లు’ అని అమాయకంగా అడిగిండు సీతయ్య. ‘గదేం లేదు సీతయ్యా, ఏండ్ల సంది సూస్కుంటత్తన్నం. ఎట్లున్న చెరువులు అట్లనే ఉండే, కనీసం పూడిక సుత తీపీయకపాయిరి మీకు దెల్వదా ఏందీ, గాళ్లు చెప్తే నమ్ముతర’ అన్నడు రాములు. ‘పాపం గాలి మోటరు కూలి సచ్చిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సార్ వచ్చినంక మన మీద జెర చూపు బెట్టిండు గానీ కలవలే. ఇంతల తెలంగాణ వచ్చింది.. ఇగసూడుండ్రీ రాష్ట్రం ఏర్పడ్డంక మన రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ పథకం కింద చెరువులల్ల పూడిక తీయించింది. ఆ సంగతి మీకెర్కే. గట్ల జేయబట్టి చెరువులకు జలకళ అచ్చింది. ఉమ్మడి జిల్లాల ఏమంత తక్కువ 1,200 చెరువులల్ల పూడిక తీయించిండ్లు, మిషన్ భగీరథ పథకం కింద 1227 ఊళ్లకు మంచినీళ్లు ఇంటింటికి అందించడాన్కి అంతా సిద్ధం చేసిండ్ల’ని లెక్కలతోని పూస గుచ్చినట్లు వివరించిండు రాములు. ‘గట్లనా. ఇంకేమేం రాష్ట్ర సర్కారు జేసిందో జెర జెప్ప’ని ఆత్రుతగా అడిగిండు చంద్రయ్య. అందరు మంచిగినుండ్లి అనుకుంట సర్కారు జేసిన అభివృద్ధి పనుల గురించి ఇడమర్సి చెప్పిండు రాములు. ‘కొత్తగా రాష్ట్ర సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కడ్తాంది. గా ప్రాజెక్టుతోని ఉమ్మడి వరంగల్ జిల్లాలున్న మెట్ట ప్రాంతాలు ఇంకొన్నాళ్లకు పంటలతో కళకళలాడబోతున్నయ్. గా ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ–2 లింకు కలిపి 5 లచ్చల 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతది. పాకాల, లక్నవరం, మల్లూరు వాగు ఇంకా కొన్ని పెద్ద చెరువులతోని ఇంకొన్ని వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వత్తది. అంతేకాదు కంతనపల్లి ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టు కింద అగ్గువల అగ్గువ ఇంకో 4 లచ్చల 68 వేల 500 ఎకరాల బీడు భూములల్ల పంటలు సాగవుతయ్. ఇంతకుముందుగాల్నే దేవాదుల ప్రాజెక్టు కింద 300 చెరువులల్ల నీళ్లు నింపి పంటల సాగుకు ఢోకాలేకుండా జేసిండ్లు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కింద వంద మీటర్ల లోతుల్నే నీళ్లున్నయ్. గిట్ల భూముల సాగుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ల తక్లీబ్ రాకుండా రాష్ట్ర సర్కార్ ఇసారం జేత్తంది. ‘అబ్బా.. గిన్ని మంచి పనులు, గిట్ల ఎవుసందార్ల కోసం ఇద్వారకు ఏలినోళ్లు ఎవ్వలు సుత చేయలేద’న్నడు చంద్రయ్య. ‘అవుమల్ల చంద్రయ్య. ఇంకా ఎన్నో పనులు ముందు బెట్టుకున్నది రాష్ట్ర సర్కార్’ అని రాములు ఇంకింత ఇడమర్సి చెప్పిండు. వరంగల్లు మామునూర్ కాడ ఇమానం దిగే ఎయిర్‌పోర్టు కట్టిత్తరట. రేయాన్స్ ఫ్యాక్ట్రీ సమస్య తీరుస్తరట. టెక్స్టైల్ ఫ్యాక్ట్రీ సుత కట్టియ్యడాన్కి సెద్ద పెట్టింది, ఇంకా ఐదారు ఫ్యాక్ట్రీలు పెట్టించి సదువుకున్న పోరగాండ్లకు కొలువులు అచ్చేటట్టు చేత్తాండ్లు. ఇప్పటిదాక 36 ఫ్యాక్ట్రీలు పెట్టుకోడాన్కి మంజూరు ఆర్డర్లు ఇచ్చిండ్లు. బీడీ కార్మికుల కోర్కెలు తీరుస్తరట, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిచ్చుట్ల మన ఉమ్మడి వరంగల్లు జిల్లా ముందున్నది తెల్సా’. ‘అట్లనా రాములు. నీ దగ్గరికత్తే గిన్నీ సంగతులు, రాష్ట్ర సర్కారు చేస్తున్న పనులేందో, ఆ పనులు ఎట్లెట్లా జర్గుతున్నయో మాకు పూసగుచ్చినట్లు ఎర్కజేసినవ్. నీకాడత్తెనే మా గిన్నీ ఇసయాలు దెల్సినయ్. మళ్లో దినాం గిట్లనే పొద్దుగాల్న అచ్చి కలుత్తం’ అనుకుంట ఎవల పనులకు ఆళ్లు ఎళ్లిపోయిండ్లు.– గడ్డం రాజిరెడ్డి, వరంగల్ -
మందలగిరి మాలోకం
సుశీలక్కా.. ఓ సుశీలక్కా.. ఇంకా రడీ కాలేదేంటే.. అంటూ వచ్చింది వనజాక్షి సుశీల : ఆ.. ఇంట్లో పాచి పనులన్నా అవ్వొద్దంటే వనజ.. అన్ని పనులూ నేనే చూసుకోవాల. ఇదిగో ఉక్కరవసేపు ఉండవే వత్తన్నా.. వనజ : ఇయ్యాల ఆదివారం కదా .. మరి పిల్లలను ఏం సేత్తన్నవ్.. సుశీల : పిల్లోల్లు కూడా మనెంటే తీసుకెళదాం.. ఆళ్లే తిరగతారు.. వనజ : అమ్మో.. బైట అగ్గి చూడక్కా.. ఎట్టుందో.. మనమే మాడిపోతన్నం.. పిల్లలు తట్టుకోలేరు.. వద్దులే అక్క.. సుశీల : మరి ఏం సెయ్యాలే.. ఆదివారమైనా ఆయన రిచ్చా తొక్కితేనే కదా.. నాలుగు డబ్బులొచ్చేది.. ఇంటి దగ్గర వోరుంటారే.. ఇంతలో ఆ వీధిలో నాలుగు అక్షరం ముక్కలు చదువుకున్న పద్మ అక్కడికి వచ్చింది. పద్మ : ఏంటి అక్కాచెల్లెళ్లు ముచ్చట్ల మీదున్నారు.. వనజ : అవునక్కా.. ఇయ్యాల .. మన ముక్కమంత్రి కొడుకు లోకేశంబాబు ప్రచారమంట.. పిలిత్తే ఎలతనం..ఒక్కోరికి ఐదొంతలు నుంచి ఎయ్యిదాకా ఇత్తన్నారులే.. సుశీల : అవునమ్మా.. ఆదివారం కదా.. ఏవో నాలుగు డబ్బులొత్తాయని మేమూ వత్తామని సెప్పాం.. మన ఈది సివర తెలుగుదేశం ఆయన ఈ పని కుదిర్చాడు. పద్మ : అవునా.. సరేలే వనజ వెళ్లండి.. మరి పిల్లల సంగతేంటి ? సుశీల : అదే అక్క.. మా ఎంట తీసకెళదామనుకుంటున్నాం.. పద్మ : అమ్మో.. ఆ లోకేశంబాబు మీటింగ్‌లకు పిల్లలను తీసుకెళ్లొద్దమ్మా.. వాళ్లకు వచ్చే నాలుగు అక్షరాలు కూడాపోతాయి. కావాలంటే పిల్లల దగ్గర నేనుంటా.. మీరే వెళ్లిరండి. సుశీల : అదేంటక్కా.. అలా అంటవ్.. ఆయన ముక్కమంత్రి కొడుకు కదా.. ఆయన మాట్టాడితే.. ఏమైతదక్కా.. పద్మ : ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల గురించి చెబుతా వినవే..మంగళగిరిలో ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి లోకేశం బాబు నాలుక మడతపడని రోజు లేదు. తెలుగుకు తెగులు పుట్టించని రోజు లేదు.వచ్చిన రోజునే మంగళగిరిని మందలగిరిగా మార్చేశాడు. గుంటూరును గుంత్రు అనేశాడు. వనజ : అవునా.. మన పిల్లొల్లు కూడా సక్కగా అంటరు కదక్కా.. ఆయనకేమైనా నాలిక మందమా! పద్మ : అదేమో తెలియదే.. లోకేశం బాబు ప్రచారం మాత్రం మంగళగిరి ప్రజలకు మంచి కామెడీ షోలా అనిపిస్తుంది. సగం మంది జనం ఆయన చెప్పే మాటలు విని నవ్వుకోవడానికే వెళుతున్నారంట. సుశీల : ఆయన ఈ ఒక్క మాట సెబితే ఏమైతదిలే అక్కా! పద్మ : అమ్మో.. ఆ ఒక్కటి ఏంటే ఆయన మాట్లాడే ప్రతి మాటా.. ఆణిముత్యమేనని సోషల్ మీడియాలో తెగ జోకులు వేసుకుంటున్నారు..ఇదిగో మంగళగిరి వచ్చిన రెండో రోజే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న ‘వైఎస్ వివేకానంద రెడ్డి మృతితో పరవశించాన’ని బహిరంగంగా చెప్పాడు. మరి అది కావాలని అన్నాడో. మనసులో ఉన్నది అన్నాడో.. ఇదీ నాలుక మడతో అర్థం కాలేదే.. కానీ పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన వాహనం వెంట ఉన్న వాళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.. వనజ : పోనీలే అక్క అదేదో.. అనుంటాడులే.. పద్దాక.. రాజికీయాలే మాట్టాడతారు కదా.. అందుకే అట్ట వచ్చుంటదిలే.. పద్మ: అదొక్కటి కాదే.. ఇంకా ఉన్నాయి.. లోకేశం బాబు గురించి..ఆ మాటలు వింటున్న మంగళగిరి ప్రజలు.. ఈయనకు మంగళగిరి మాలోకం అని పేరు పెట్టేశారే.. సుశీల : అవునా అక్కా.. పాపం అదేందే.. పద్మ: అవును మరి.. రెండు రోజుల క్రితం మంగళగిరిలో మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన తనకు ఓట్లేసి గెలిపించాలని చెప్పారు.. మళ్లీ జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సుశీల : అదేంటక్కా.. ఎలచ్చన్లు వచ్చే నెల 11న అంటన్నారుగా..! పద్మ : అవునే ఎలక్షన్స్ ఏప్రిల్ 11వ తేదీనే.. ఏం చదువుకోని నీకే ఈ విషయం గుర్తుంటే.. రాష్ట్రానికి మంత్రిగా పని చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తన్నాడు. పైగా ముఖ్యమంత్రి కొడుకు.. ఆయనకు ఈ మాత్రం తెలియకపోవడం ఏమిటో.. కొంచెం కూడా అర్థమై చావట్లేదు. నిన్నటికి నిన్న తనను ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరాడు.. ఇది విన్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు ఉన్నవే 2.50 లక్షల చిల్లర. వనజ : మరి ఐదు లచ్చల ఓట్లు ఏడ నుంచి తేవాలక్కా.. అదేందే అట్ట మాట్టాడ్డం.. సుశీల : అయినా ఈ నాయకులంతా ఏదో కాగితంలో ముందుగనే రాసుకుని సదువుతరంటగా.. అట్ట కూడా ఈయన సదవలేదా ! పద్మ : ఎందుకు చదవలేదే.. ఈయనగారి కోసం ముఖ్యమంత్రి గారు.. ఏకంగా తెలుగు క్లాసులే చెప్పించారు.. కానీ లోకేశం బాబుకే వంట బట్టల! 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలిచిందే లేదన్నాడు. వనజ : అవునా.. గెలిచినట్లున్నారుగా అక్కా.. పద్మ : 1980లో తెలుగుదేశం పార్టీనే పెట్టలేదే..కానీ మంగళగిరి మాలోకానికి అదీ తెలియదనుకుంటా. ఇవే కాదే.. గతంలోనూ ఆయన పదే పదే నోరు జారడం.. తరువాత నాలుక కరుచుకోవడం చాలాసార్లు జరిగాయి. అంబేడ్కర్ జయంతి రోజున.. వర్ధంతి అనేశాడు. అవినీతి, అరాచకమైన పార్టీ ఏదైనా ఉందంటే .. అది తెలుగుదేశం పార్టీనే అని సెలవిచ్చాడు. వనజ : అమ్మో.. అదేందక్కో.. ఆళ్ల పారిటీ గొప్పలు తెగ సెప్పేసుకుంటరుగా.. మరి ఈయనేంది ఇట్టా సెప్పారంటన్నవ్.. పద్మ : అవునే.. చాలా మంది జబర్దస్త్ కామెడీ షో బదులు.. యూట్యూబ్‌లో లోకేశం బాబు వీడియోస్ చూసి నవ్వుకుంటున్నారే.. ఇప్పుడు పిల్లలవి అంతా ఇంగ్లిష్ మీడియం చదువులు.. లోకేశం బాబు సభల దగ్గరకు వెళితే వచ్చే నాలుగు ముక్కల తెలుగు కూడా రాకుండా పోతుంది. అదీగాక జనరల్ నాలెడ్జ్ విషయంలోనూ ఆయన తడబాటుకు వీళ్లకు సవాలక్ష డౌట్లు వస్తాయి. సుశీల : అమ్మో.. నా పిల్లలను ఆ సభలకాడకి పట్టకెల్లను. నీకాడే ఉంచక్కా.. మద్దానం..ఆళ్ల అయ్య వత్తడులే.. పద్మ : సరే వెళ్లిరండి.. లోకేశం బాబు ప్రసంగం మాత్రం వినకండి.. అక్కాచెల్లెళ్లు సభకు వెళ్లొచ్చాక అదే రోజు సాయంత్రం పద్మ దగ్గరకు వెళ్లారు. సుశీల : అక్కా.. ఆళ్లెంట తిరగాం.. తలా ఐదొంతలు ఇచ్చారులే.. లోకేశం బాబు అదేందో అన్నాడంటక్కా.. జనం తెగ నవ్వుకుంటన్నరు..ఏదో పోరుటు సంగతంట.! పద్మ: (ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ) అవునే.. ఈ రోజుకు కూడా లోకేష్ బాబు.. మరో జోక్ పేల్చాడు.. ఇదిగో ఈ వీడియో చూడు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తీసుకెళతాడంట! వనజ : హైదరబాద్‌లో సముద్రం ఏడదక్కా! పద్మ : అవును .. లోకేశం బాబు చెప్పే మాటలన్నీ ఇంతే ఉంటాయి. సుశీల : ఈ మాటంటే నాకోటి గుర్తుకొత్తాంది.. అదేదో సినమాలో సీకాంత్ కూడా.. ఇంతే అంటడు.. హైదరబాద్‌కు సముద్రాన్ని తీసకొత్తనని. అప్పుడు.. ఇదెట్టా కుదిరిద్దబ్బా అనుకున్నం.. లోకేశం బాబు సెబితే.. తెలుత్తుంది. ఆయన తెచ్చే సముద్రంలోకేననుకుంటా కేసీఆర్ సర్ పోరుటు తీసకెల్లేది. ఇది విన్న అక్కాచెల్లెళ్లు ఒక్కసారిగా పకపకా నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు. -
‘మద్యం కోసం పుస్తెలతాడు తెంచుకెళ్లాడు’
సాక్షి, కైకలూరు : సౌదమణి : ఏంటి.. శ్యామలక్కా.. మెడలో పసుపుకొమ్ములతాడు వేలాడుతోంది.. పుట్టింటోళ్లు పెట్టిన బంగారు పుస్తులేమైనావి.. శ్యామల : (కన్నీరు బడబడా కారుస్తూ) నా బాధ ఏ ఆడబ్డికు రాకూడదు చెల్లీ.. కట్టుకున్నోడు కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని చూస్తాడనుకున్నా.. మాయదారి మద్యం అలవాటైంది.. మా ఆయన రాత్రి తాగుడికి డబ్బులడిగాడు.. లేవన్నాను.. బలవంతంగా పుస్తులు తెంచుకెళ్లిపోయాడు.. సౌదమణి : ఆరే.. ఇటు చూడని.. మోడ కూడా కోసుకుపోయింది.. ఇంత అఘాయిత్యానికి ఆయనకు చేతులెలా వచ్చాయి.. ఇటురా మందు రాస్తా.. శ్యామల : చెల్లీ.. ఈ మందు రాస్తే.. గాయం మానుతుందేమోగాని.. ఆయన ఆ మందు మానటం లేదే.. సర్కారోళ్లు.. మద్యంలో ఆదాయం చూస్తున్నారే కాని.. మన జీవితాలు నాశనం అవుతున్నా.. పట్టించుకోవడం లేదు.. సౌదమణి : అవునక్కా.. ప్రభుత్వం నడవాలంటే మద్యం అదాయం ఒక్కటే సంజీవిని అనుకుంటున్నారు వాళ్లు.. ఏసీ గదులు వదిలి.. మన పేదల బస్తీలకు వస్తే తెలుస్తుంది.. ఎన్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయో.. తిరుపతమ్మ : వీధిన పడటమంటే గుర్తొచ్చింది.. సౌదమణి.. పాపం మన సీతాలు ఆయన తాగి, తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోయాడు.. ముగ్గురు ఆడపిల్లలు. ఆమె జీవితం ఏం కావాలి.. పిల్లల్ని చదువులు మాన్పించి కూలీ పనులకు పంపుతోంది.. సీతాలు ఇళ్లల్లో పాచి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. సౌదమణి : ఒక్క సీతాలు జీవితామే కాదు.. తిరుపతమ్మ.. మనబస్తీలో మద్యం మహమ్మారికి సర్వనాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ.. వింటుంటే కన్నీరు ఆగదు.. ఫాతిమా : (అందరికీ టీ తెస్తూ) అందరూ.. బాగున్నారా.. మంచి గరం..గరం అల్లం ‘టీ’ మీ కోసం తెచ్చా.. తాగండి.. ఓయ్.. శ్యామల ఏంటీ ఏడుస్తున్నావ్.. మీ అత్త మళ్లీ టార్చర్.. పెట్టిందా..? తిరుపతమ్మ : ఫాతిమా.. ఎప్పుడూ.. వాళ్ల అత్తమీదే.. నీ అక్కసు.. శ్యామల వాళ్లయిన రాత్రి తాగి.. పుస్తులతాడు తెంపుకెలిపోయాడంటా.. ఫాతిమా : అయ్యోయ్యో.. ఎంత పనిచేశాడు.. అలాంటోళ్లను పోలీసులతో చితక్కొంటిం చాలి.. అప్పుడు కాని బుద్ధిరాదు.. శ్యామల : ఓయ్.. ఫాతిమా.. మా ఆయనను పోలీసుతో కొట్టించమంటున్నావు ఏంటీ.. ఎంతైనా నన్ను కట్టకున్నాడు.. కొట్టినా.. పెట్టినా ఆయనే.. నాకు.. ఫాతిమా : ఇదిగో.. ఈ సెంటిమెంట్లే మన జీవితాలను పాడు చేస్తున్నాయి.. ఒక్క సారైన బుద్ధి రావాలి కదా.. అక్కా.. ఇలాగే ఉంటే వాళ్లలో మార్పు రాదు.. సువార్త : ఏమ్మా.. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.. పక్కంటి ప్రెండ్ ఒకటుందని మర్చిపోయారా ఏంటీ.. ఫాతిమా : అదేం కాదు.. ఇదిగే ముందు అల్లం టీ తాగు.. ఇక్కడ మగాళ్ల తాగుడు గురించి మాట్లాడుకుంటున్నాం.. సువార్త : ఏం.. తాగుడో ఏమిటోనమ్మా.. ఈ మద్య మందు షాపులు ఊరి చివర్లో పెట్టారని ఎంతో సంతోషపడ్డా.. ఇప్పుడు బస్తీలోనే ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు వచ్చేశాయి.. అంత దూరం వెళ్లలేక ఇక్కడే బడ్డికొట్లలో అమ్మేస్తున్నారు.. రాత్రి వేళ.. కుర్రోళ్లు.. ఒకటే తాగుడు.. చిందులు.. నిద్రపట్టడం లేదు.. ఈ పీడ ఎప్పుడు విరగడవుతోందో.. ఏమో.. సౌదమణి : సువార్త.. అసలు ఈ ప్రభుత్వాన్ని కడిగేయాలి.. మొన్న ఎన్నికల్లో ఏమన్నారు.. బెల్టు షాపులు ఒక్కటి కూడా లేకుండా చేస్తామన్నారు.. హామీలు ఇవ్వడమే కాని అమలు చేయడం వీళ్లకు తెలీయదేమో.. సువార్త : అవునక్కా.. ఈ మధ్య రాజన్న తనయుడు తమ ప్రభుత్వం వస్తే మూడు దశల్లో మద్య నిషేధం చేస్తానన్నాడు.. జరుగుతుందంటావా.. సౌదమణి : చూడు.. సువార్త.. వాళ్ల నాన్నకు మల్లే ఈయన మాటమీద నిలబడే వ్యక్తి. మొదటి దశలో బెల్టు షాపులు లేకుండా చేయడం, రెండో దశలో మద్యం ధరలు పెంచడం, మూడో దశలోపెద్దహోటల్స్లోమాత్రమే మద్యం ఉండేవిధంగా చేస్తానన్నారు.. సువార్త : అవునక్కా.. ఇదే జరిగితే మన జీవితాలు బాగుపడతాయి అంటూ సాగిపోయారు.. -
‘ప్రపంచ రాజధాని’.. అంతా భ్రాంతియేనా..?
సాక్షి, నెల్లూరు: సింగపూర్, బీజింగ్, టోక్యో, సియోల్, న్యూయార్క్, కొలంబో, దుబాయ్ ప్రతినిధులు ఇండియాలో ఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. అందరూ కాఫీ షాప్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆ పక్క టేబుల్లో ఉన్నోళ్లు అమరావతి గురించి చర్చించుకుంటున్నారు. ‘అమరావతి న్యూయార్క్‌లా ఉంటుందని ఒకరు, కాదు సింగపూర్‌లా ఉంటుందని మరొకరు.. ఇలా వారి మధ్య వాదులాట మొదలైంది. ఈ మాటలు ఆ దేశాల పౌరులు విని నోరెళ్లబెట్టారు. అసలు దీని సంగతేందో కనుక్కుందామని ఒక ట్రాన్స్‌లేటర్‌ని వెంట పెట్టుకుని ‘ప్రపంచ రాజధాని’కి వచ్చారు. అప్పుడే అక్కడ బాబోరు ప్రచారంలో ఉన్నారు. మైక్ పట్టుకుని ఆణిముత్యాలు వదులుతున్నారు. ‘తమ్ముళ్లూ.. దిస్ ఈస్ నేను.. ఒకప్పుడు హైదరాబాద్ కట్టాను. ఇప్పుడు ప్రపంచానికి దిక్సూచిని నిర్మిస్తున్నా. సింధూ, హరప్పా నాగరికతల గురించి బుక్స్‌లో ఎలా చదువుకుంటున్నామో, భవిష్యత్ తరాలు కూడా అమరావతి నాగరికత గురించి రీడ్ చేయాలి. (తమ్ముళ్లూ.. నిరుత్సాహంగా ఉన్నారు. చప్పుట్లు కొట్టి హర్షధ్వానాలు చెప్పండి అంటూ బాబోరు అడిగి మరీ కొట్టించుకున్నారు) రాజధాని లేకుండా చేశారని నేనేమీ బాధపడలేదు. (సార్! బాధ డబ్బుల విషయంలో.. కేంద్రం ఓ రూ.25 వేల కోట్లు ఇచ్చుంటే బాగుండేది. ఎక్కువ భాగం మన అకౌంట్లో పడిపోయేదని సన్నిహితుల దగ్గిర ఎప్పుడూ అంటుండేవారని ఓ సీనియర్ నాయకుడు గుసగుసలాడాడు) వరల్డ్‌లోని బెస్ట్ క్యాపిటల్స్‌ని తలదన్నేలా అమరావతి నిర్మాణం మొదలెట్టా. అందుకోసం స్పెషల్ ఫ్లయిట్లో వెళ్లి 20 దేశాలు చూసొచ్చా. అక్కడున్న రాజధానుల కన్నా బెటర్‌గా అమరావతిని కట్టాలని ఆలోచన చేస్తున్నా. కాకపోతే మనది లోటు బడ్జెట్ కదా.. అందుకే కొంచెం లేట్ అవుతోంది. (అంతలో ఓ నాయకుడు కొంచెం కాదు.. జీవితకాలం లేట్ అని అన్నాడు కాస్త పెద్దగానే.. కాకపోతే బాబోరికి వినపడకుండా) ఇంకో పది, పదిహేనేళ్లు పట్టొచ్చు. కేంద్రం సహకరించడంలేదు. మనవాళ్లపై రైడ్స్ జరుగుతున్నాయ్. బాధగా ఉంది. మీరంతా నాకు రక్షణ వలయంగా ఉండాలి. అక్కలూ.. చెల్లెళ్లూ..! మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే..(ఇంతలో ఒకతను బాబోరి దగ్గరికెళ్లి చెవిలో.. సర్ టాపిక్ డైవర్ట్ అయింది అన్నాడు) బాబోరు వెంటనే తమాయించుకుని ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఇక్కడే ఉంది. (ప్రసంగం వింటున్న ఒకతను అందుకే డేటా చోరీ చేసి ఓట్లు తొలగించింది అన్నాడు పక్క వ్యక్తితో) నన్ను మళ్లీ గెలిపిస్తే ఒలింపిక్స్ జరిపిస్తా. అమరావతి ప్రారంభోత్సవానికి వందకు పైగా దేశాల అధ్యక్షులను తీసుకొస్తా. అన్ని దేశాల రాజధానులకు ఫ్లయిట్స్ వేయిస్తా’ అంటూ బాబోరు బుల్లెట్స్ వదులుతూనే ఉన్నారు. ఇదంతా ఆ విదేశీ ప్రతినిధులకు ట్రాన్స్‌లేటర్ తర్జుమా చేసి చెప్తుండగా వారంతా విని మూర్చపోయారు. – గోరంట్ల వెంకటేష్‌బాబు, నెల్లూరు -
జగన్‌ని అన్నట్టా! జనాన్ని అన్నట్టా!
సాక్షి, అమరావతి: ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు హడలిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. పైన ‘చండ్ర’బాబు నిప్పులు కక్కుతున్నాడని కాదు. కింద చంద్రబాబు విషం కక్కుతున్నాడని! చంద్రబాబు జగన్ మీద కక్కుతున్నాడా.. జనం మీద కక్కుతున్నాడా జనానికి అర్థం కావడం లేదు. చంద్రబాబు కక్కీ కక్కీ కడుపు పట్టుకున్నప్పుడు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్, యామిని, బుద్ధా వెంకన్న కక్కిపెడుతున్నారు. లోకేశ్‌బాబు కూడా కక్కడానికి ట్రయ్ చేస్తున్నాడు కానీ పాపం మాటలు అడ్డుపడి కక్కుడు సగం గొంతులోనే ఉండిపోతోంది. పపన్ కక్కినంతసేపు కక్కగలుగుతున్నాడు. ఇక కక్కలేను బాబోయ్ అనుకున్నప్పుడు కారు డిక్కీలో కూలబడుతున్నాడు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పైపర్లకైతే.. చంద్రబాబు అండ్ టీమ్ ఎప్పుడు కక్కుతుందా, ఆ కక్కుడంతా ఎప్పుడు ఎత్తి పేపర్లో పోద్దామా అనే! కక్కుడు కన్నా పెద్దపని కక్కుడుని ఎత్తి పట్టుకోవడం. ‘ఏపీ అన్నం తింటే జగన్‌కి ఓటేయొద్దు’’ అన్నాడు బాబు. రాష్ట్రంలో ప్రజలంతా ‘అన్న క్యాంటీన్’లలోనే తింటున్నారనా! ‘‘జగన్‌కి ఓటేస్తే రౌడీయిజమే’’ అన్నాడు కళా వెంకటరావు. జగన్‌కి ఓటేసి బయటికి వచ్చేటప్పుడు పట్టుకుని రౌడీల చేత కొట్టిస్తామనా! ‘‘రామరాజ్యమా? రాక్షసరాజ్యమా?’’ తేల్చుకోండి అన్నాడు యనమల రామకృష్ణుడు. తేల్చుకోకపోతే, జగన్‌కి ఓటేసిన ఒక్కొక్కరి పనీ తేల్చేస్తాం అనా! ‘‘2004లో జగన్ నలిగిన చొక్కా వేసుకున్నాడు. 2019లో ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు. జగన్ ఆస్తి ఇన్ని కోట్లకు ఎలా చేరిందో జనానికి చెప్పాలి’’ అన్నాడు వర్ల రామయ్య. జగన్ ఇస్త్రీ చొక్కాకే ఇంత చేస్తున్నాడు. జనం రేపు కొత్త చొక్కాలు వేసుకుంటే, వర్ల రామయ్యకు సమాధానం చెప్పాలనా! ‘‘బాబుకు ఓటేస్తే పసుపు–కుంకుమ ఇస్తాడు’’ అన్నాడు రాజేంద్రప్రసాద్. చంద్రబాబుకు ఓటేయకపోతే పసుపు–కుంకుమ తుడిచేస్తాడనా!! ‘‘ఓట్లు ఎలా అడుగుతారు?’’ అన్నాడు బుద్ధా వెంకన్న. ‘ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం అనా! ‘‘జగన్ ప్రతిపక్ష నేత కావడం దౌర్భాగ్యం’’ అన్నారు యామిని. జగన్‌కి ఓటేసిన ప్రజలంతా దౌర్భాగ్యులనా! ‘‘పడ్డాయ్ పడ్డాయ్.. దగ్గర పడ్డాయ్’’ అన్నారు జనంలో ఒకరు. ‘‘ఎన్నికలేగా’’ అన్నారు ఇంకొకరు. ‘‘అవెలాగూ పడతాయి’’ ‘‘మరింకేం దగ్గర పడ్డాయి?’’ ‘‘రోజులు దగ్గర పడ్డాయి’’ ‘‘ఎవరికి?’’ ‘‘ఇంకెవరికి! జనాన్ని బెదిరిస్తున్న వారికి. జనానికి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నవారికి. జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నవారికి. జనాన్ని అవమానిస్తున్న వారికి. జనాన్ని దౌర్భాగ్యులు అన్నవారికి. జనంపై విషం కక్కుతున్నవారందరికీ.. రోజులు దగ్గరపడ్డాయి’’ – మాధవ్ -
ఆంధ్రాడవిలోని ఓ పాత కథా..ఓ కొత్త కథ!
అప్పట్లో పాత రోజుల్లోని ఓ అడవిలో జరిగిన కథ ఇది. ఓ రోజున రెండు పిట్టలకు ఒక రొట్టె దొరుకుతుంది. రొట్టె నాదంటే, నాదని అవి రెండూ వాదించుకున్నాయి. తాను న్యాయం చేస్తానంటూ ఒక పిల్లి ఆ రెంటినీ ఒప్పించింది. రొట్టెను రెండు సమాన భాగాలుగా చేస్తానంటూ, కావాలనే ఒక ముక్క కాస్త పెద్దగా ఉండేలా కట్ చేసింది. అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయినట్టు పోజు పెడుతూ... అయ్యో దీన్లో కాస్త ఎక్కువొచ్చిందే అంటూ అందులో కొంత భాగం తినేసింది. ఈసారి ఆ రెండో ముక్క దీని కంటే పెద్దగా ఉంది. అరె ఈసారిది పెద్దదయ్యిందంటూ దాన్లోనూ కొంత తినేసింది. ఇలా రెండు ముక్కలనూ మార్చి మార్చి తింటూ తింటూ పిట్టలకు రొట్టె అనేదే మిగలకుండా అంతా పిల్లే మింగేసింది. ఈ కథ ఆధారంగానే ‘పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింద’నే సామెత వాడుకలో ఉంది. అంటే... అది పిట్టలకు దక్కాల్సిన రొట్టె. అమాయకపు పిట్టలు ఒకదాంతో ఒకటి కొట్లాడాయి. దక్కిందాన్ని హాయిగా పంచుకొని తినకుండా గిల్లికజ్జాలకు దిగితే అటు గిల్లీ, ఇటు గిల్లీ తినేసే పిల్లులు మధ్యన దూరతాయంటూ చెప్పే నీతి కథ ఇది. కానీ ఇప్పుడిదో కొత్త కథ. తాజాగా జరుగుతున్న కథ... కిందటి సారి... అప్పటి పిల్లి సరిగా న్యాయం చెప్పలేదంటూ ఈసారి ఓ కోతి బయల్దేరింది. అన్నట్టు ఈ కోతి గతంలో పిల్లికి బాగా దగ్గరి ఫ్రెండు. పిల్లి సరిగా న్యాయం చేసేలా నాదీ పూచి అంటూ చెప్పిన ఈ కోతి... కొన్నాళ్లు పిల్లి మీద తెగ శివాలూగింది. నీ తరఫున జనాలకు హామీ పడినందుకే నిన్ను నేను నిలదీస్తున్నానంటూ రంకెలేసింది. ఈసారి స్వయంగా నేనే న్యాయం చేస్తానంటూ రొట్టెను తన చేతిలోకి తీసుకుంది. ఇదిగో ఈ ముక్క నీదంటూ కాస్త తుంపి ఒకరికి ఇచ్చింది. ఛీ...ఛీ... ఇది చిన్న ముక్క నీకిది వద్దంటూ మళ్లీ ఆ ముక్కనే లాక్కుని, మరో ముక్క ఇచ్చింది. మళ్లీ ఇది బాగా లేదంటూ ఆ ముక్కను తీసుకొని ఇంకో ముక్క చేతిలో పెట్టింది. ఏతావాతా చివరకు తేలిందేమిటంటే... కోతి తాను కూడా తినకుండా కేవలం 75 ముక్కలే తన చేతిలోకి తీసుకుంటూ, ఆ ముక్కలన్నింటితో సహా మొత్తం 175 రొట్టెల్నీ తాను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న పిల్లికి ఇవ్వబోతోందని ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతోంది. పెడబొబ్బలన్నీ బయటకే అనీ, పెత్తనం పిల్లి చేతికేనని అందరికీ అర్థమవుతూనే ఉంది. మరిప్పుడు అమాయకపు పిట్టల గతేమిటో, కోతి చేతిలో కొంత రొట్టె ఇవ్వడం ద్వారా మళ్లీ అంతా పిల్లికే దక్కేలా చేస్తున్న ఈ వ్యవహారంలో అమాయకపు ఆంధ్రప్రదేశారణ్యంలోని పిచ్చుకలు ఏమవుతాయో అన్న అందోళన ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఈ కోతిని గుడ్డిగా నమ్మాయి కొన్ని ఎర్రబాతులు. ఏం జరుగుతోందన్నది ఇప్పుడు ఎర్రబాతులకూ ఎరికలోకి వచ్చింది. అన్నట్టు ఈ మర్కట చేష్టలు మామూలుగా లేవు. కోతి అన్నాక కొమ్మచ్చులాడాలి కదా. మొన్నటిదాకా నివాసం ఉంటున్న చెట్టు... అదో విషవృక్షమనీ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు తానున్న చెట్టే కల్పతరువంటోంది. అవతలి విషవృక్షం మీద వాలిన పిట్టల్ని, ఆ చెట్టు విషపూరితం చేసేసి చంపేస్తోందంటూ శోకాలు పెడుతోంది. మరి ఇప్పటిదాకా ఆ చెట్టుమీదే అది బతికింది కదా. ఇప్పటికీ ఇంకా ఆ చెట్టు మీదే తన పెద్దన్న, చిన్నన్న, తన ఇతర కుటుంబసభ్యులూ, తమ సమస్త బంధుగణసంతతంతా నివాసం ఉంటోంది కదా. అటువంటప్పుడు ఆ విషం వాళ్ల మీద ఎందుకు పనిచేయడం లేదంటూ ఎవ్వరూ తనను అడగరనుకుంటోందో ఏమోగానీ... ఇప్పుడది అక్షరాలా కల్లు తాగిన కోతిలాగే గంతులేస్తోంది. కోతి పుండు బ్రహ్మరాక్షసి అని సామెత. దీనికి అసలు అర్థం వేరే. కోతికి పుండైతేనే అది దానిపాలిట బ్రహ్మరాక్షసి అయ్యేలా గిల్లుకుంటుందని. కానీ ఇప్పుడు కోతి తన పాలిటి పుండైన బ్రహ్మరాక్షసిని రాష్ట్రాల మీదా, లోకం మీదా వదులుతోంది. అలా అది పిచ్చుకలూ, పిట్టలూ, గోరింక పిట్టలూ, గోరమైనాలూ, చిలకలూ, చిన్ని పక్షులూ, కొంగలూ, కాకులూ, లేళ్లూ, జింకలూ, బట్టమేకలూ ఇలా సమస్త అమాయకపు అడవి ప్రాణులనూ బ్రహ్మరాక్షసి ఆకలికి బలిచేసేలా ఉంది. అందుకే కోతికొమ్మచ్చులను గ్రహించి... కోతికి కొబ్బరికాయ దక్కనివ్వకూడదు. అది రొట్టెనా, కొబ్బరైనా చెట్టు మీది పక్షుల ఆస్తి, అడవిలోని ప్రాణుల ఆస్తి.ఓటు అనే ఆయుధం ధరించి సామాన్యుడనే ఓ వేటగాడు బయల్దేరాడు. అడవిలో సంచరించి, అక్కడ సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ మంచి వేటగాడిది. కోతిని కట్టడి చేసి, తొలుత దాని పుండై ఆ తర్వాత ఓనరులా మారిన సదరు బ్రహ్మరాక్షసిని మట్టుబెట్టడమే ఇప్పుడు తెలివైన ఆ వేటగాడి కర్తవ్యం.కాబట్టి ఓటాయుధధారులైన ఓ ఓటర్లూ... మీరు వేటాడాల్సిందెవరితో తెలిసింది కదూ! ఎవరికి న్యాయం చేయాలో ఈపాటికి మీకు అర్థమయ్యింది కదూ!! – యాసీన్ -
కాంగ్రేసోల్లు బీజెపిల శెరికయినా బర్కత్ లేద?
సాక్షి, కరీంనగర్ : నేన్జెప్పలే... రాశ్టంల టియారెస్కు పోటిచ్చేట్ది మేవేనని... నామ్నేశన్ ఎయ్యడాన్కి వోతన్న పువ్వు పార్టి జులూస్ను బంగ్ల వీద గూసొని సూస్కుంట కండ్లెగిరేసిండు... మాదోస్త్ లచ్చన్న. వాజ్పాయ్ జమాన కెల్లి లచ్చన్నకు బార్తీయ జంత పార్టంటెæ మస్త్ ఇశ్టం. సద్వుకునెటప్పడు అద్వాని రతంయాత్ర, అయోద్యె లొల్లికి సుత లచ్చన్న వోయిండు. మొన్నటి అసంబ్లి ఎలశ్చన్ల బీజెపి ఇర్వై సీట్లన్న గెలుత్తదని ఆశె వడి నీర్గారిండు. ఎందుకొ శాన్రోజులకు ఇయ్యల్ల జెల్ది రమ్మని ఫోన్జేత్తె పోయిన. లచ్చన్నను ఏడిపిద్దావని... ‘గిప్పటికిప్పుడు గట్లెందుకనిపిస్తందే నీకు. మీ పార్టోల్లు గిట్ట ఏవన్న యాగాలు స్టాట్ జేసిన్రా... నవ్వుకుంట అడిగిన. రోజు పేపర్లల్ల, టీవ్లల్ల సూస్తలేవ ఏవైతందో... పిస్సోన్లెక్క అడ్గుతన్నవ్ ’ కొంచెవంత కోపంగనె అన్నడు లచ్చన్న ‘మీ అమిత్‌శా, మోడి తెలంగానల ఆపీసేవన్న పెడ్తన్రా. తెలంగనకేవన్న ఇస్పెషల్ పాకేజ్ అసొంటిది గిట్ట ఇత్తన్రా... ’ కొంచెం ఎగతాల్గనె అడిగిన. సాల్ తీ.. నీ ఎచ్చిర్కపు మాటలు... రోజు ఎవ్వలెవ్వలు బీజేపిల శెరీకయితన్రో సూత్తలెవ్వ. రాశ్టంల కాంగిరెస్ పనైపాయె. వాల్లు సుత ఫూచర్ల బీజేపిల్నయితెనె గెల్తమని ఆల్శంగ తెల్సుకున్రు. కాంగిరెస్ను ఇడ్షి ఐద్రబాదు వొయ్యి బార్తీయ జన్త పార్టి ఆపీస్‌కు లైన్ గడ్తన్రు. గా ముచ్చెట నేన్జెప్తంటె నువ్వేదేందొ అనవడ్తివి... మొకం మాడ్సుకుంట అన్నడు లచ్చన్న. వో గదా... టియారెస్కు పోటిచ్చెడ్ది మేవె అంటె... కొత్తగ ఇంకేవన్న మత్లబ్ ఉందేవో అన్కున్న లచ్చన్నా.... ఎలశ్చన్లన్నంక టికిట్లు రానోల్లు పార్టిలు మార్సుడు ... గెల్శినంక డెవులప్మెంటు పేర్మీద మల్ల మారుడు అయ్దేండ్ల సంది సూత్తనే వున్నం గాదె... సమ్దాయించుకుంట శెప్పిన. గద్వేరు... గిద్వేరు... గిప్పుడు రాశ్టంల కాంగిరెస్ పార్టిలున్న పెద్ద లీడర్లంత బార్తీయ జంత పార్టిల్నే శెరీకయెవట్టిరి. యెంపి శీట్లకు మస్తు డిమాండచ్చింది. తెలంగానల పదన్న గెల్వాల్నని అమిత్శ , మోడి సుత సీర్యస్ గున్నరంట. గందుకని కాంగిరేస్లున్న కత్తర్నాక్ లీడర్లను పార్టిల శేర్పిస్తున్రు... ఆయినకు ఎరుకైన సంగతులన్ని జెప్పిండు. అట్లనానె... నువ్ శెప్పింది∙నువద్దే అన్కుందాం. కాంగిరేసుల యెంపి టికిట్లు అచ్చినోల్లో, మొన్న గెల్శిన ఎమ్మెల్లెలు గిట్టనో... ఎవలన్న శేరిన్రా బార్తీయ జంతల. గాడ ఆంద్రల ఒకాయినె తెల్గుదేశెం శీటనౌన్సు జేసినంక ఏపో నువ్వద్దు, నీ శీటద్దని జగన్ పార్టిల శెరీకైండు. సిట్టింగు ఎమ్మెల్లెలు, ఎంపిలు గుడ ఆడ తెల్గుదేశెంను ఇడ్షిపెడ్తన్రు. గాడ గెల్శెడిది జగన్ పార్టె నని అందర్కి అర్దమైంది. గట్ల గీడేవన్న బార్తీయ జంత పార్టిల జరిగింద? అసంబ్లి ఎలశ్చన్ల వోడ్పోయిన కాంగిరేసోల్లె గద శేరుతన్రు. రొండు నిమ్శాలు ఆలోశన్జేసిన లచ్చన్న... నువ్వన్నది నువద్దె గని కాంగిరెసోల్లు బీజెపిల శెరికయి యెంపి శీట్లల్ల పోటి శేలె ్త పార్టి బలం, లీడర్ బలం కల్షి బంపర్ వోట్లతోటి గెల్తరు గద ... కొత్త పాయింటు జెప్పిండు లచ్చన్న గట్లనా... మైబూబ్నగర్ల పువ్వు గుర్తుకున్న ఓట్లెన్ని?ఢీకె అర్నమ్మ మొన్నట్దాక గెల్శిన ఘద్వాల సుత మైబూబ్నగర్ల లేదు. నాగర్కర్నూల్ల వుంది. గప్పుడెప్పుడొ జితెందర్‌రెడ్డి బీజెపి టికిట్ మీద గెల్శిండంటవా? గప్పుడు తెల్గుదేశెం తోటి పొత్తుండె. గప్పట్ల గా పార్టి గట్టిగుండె గెల్శిండు. గిప్పుడేడిది? తెల్గుదేశాన్ని రాశ్టంలనె బొందవెట్టిరి. బీజేపికి డిపాజిట్లె రాకపాయె. ఇంటిపార్టి లీడర్ ఎన్నెం శీనివాస్రెడ్డి బయెలశ్చన్ల బీజెపి టికిట్మీద గెల్శి, రొండువేల పడ్నాలుగుల వోడేపాయె. ఇగ అయిలాబాదుల సోయెం బాప్రావు కాంగిరేస్ టికిట్ ఇయ్యలేదనె బీజేపిల శెరీక్ అయిండు. గాడ అయిలబాద్, ముదోల్ అసంబ్లిల్నే రొండో ప్లేసచ్చింది. ఖానపూరు, నిర్మల్ల గిన్నన్ని ఓట్లచ్చిన సుత కాంగిరెసు తర్వాతె. టియారెస్సు టికిట్లు ఇయ్యని శిట్టింగులు, వివేకసొంటోల్లు , మొన్నోడిపోయినోల్ల కొడుకులు అత్తరేవో నని సూడవట్టిన్రు... గంతెగద. పూసగుచ్చినట్టు శెప్పిన్నేను. గదేందన్న... పదారు గెలుత్తం అన్న కెసియార్‌కు సపోట్గ మాట్లాడవడ్తివి నువ్వు... గీ పెద్దపెద్దోల్లు అచ్చిన సుత బార్తీయ జంత పార్టికి సీట్లు రావ? కాంగిరెస్ పనైపోయిందంటె ... ఇగ మిల్గేది బీజెపే గద? విక్రవార్కున్లెంక ఇడిసిపెట్టకుంట అడిగిండు లచ్చన్న. సూడు లచ్చన్నా... అసంబ్లి ఎలశ్చన్లయి మూన్నెల్లె దాటింది. గప్పుడున్న వోటర్లె గిప్పుడున్నరు. దబ్బన లీడర్లు పార్టిలు మారంగనె వోటర్లు సుత మార్తరనుకున్న సుత ... కాంగిరేస్లున్నప్పుడు లీడర్‌ను జూసి వోట్లేసినోల్లు గిప్పుడు బీజెపిల శెరీకైనంక గయినకె అబ్మానంతోటి ఓటేత్తరు. ఇగ బీజెపి పార్టికున్న వోట్లు గట్టనె వుంటై. మరి గట్లనె కాంగిరేసు పార్టి ఓట్లు సుత గాపార్టికె ఉంటయి గద. అంటె... కాంగిరేస్ ఓట్లు శీల్తయి తప్ప టియారెస్సుయి గాదు. గదె జర్గుతె కాంగిరేసు, బీజెపి రొండో ప్లేసు కోసం కొట్లాడుడె అయిద్ది తప్ప టీయారెస్సు వోట్లను యాడ కొడ్తరు? బారతంల క్రుశ్నుని లెక్క వుపదేశెం జేస్న. అంటె కాంగిరేసోల్లు బీజెపిల శెరికయినా బర్కత్ లేన్లెక్కనేన? గప్పట్ల నాగం జనార్దన్‌రెడ్డి, సంగారెడ్డిల జెగ్గరెడ్డి అసంటోల్లు అచ్చి మల్ల వోయిన్రు. గిప్పుడు గుడ బర్కత్ లేకపోతె ఎట్ల.. కెసియార్‌కు పదారు పండుగ తప్పద..? అన్కుంట నారాజై ఇంట్లకు వోయిండు లచ్చన్న. రోడ్‌మీద బార్తీయ జంత పార్టి జులూస్ సుత ఎల్లిపోయింది. నేను తంతెలు దిగుకుంట ఇంటి మొకం బట్టిన. – పోలంపల్లి ఆంజనేయులు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
వాళ్లకి చట్టాలు చుట్టాలురా...
సాక్షి, కైకలూరు : కుప్పుస్వామి : ఒరే.. నాగరాజు ఏంట్రా.. అంత తదేకంగా పేపరు చదువుతున్నావు.. ఏమైనా విశేషముందా.. ఉంటే.. కాస్త చెప్పరా.. నాగరాజు : స్వామి.. నాకు తెలియక అడుగుతా.. ఎప్పుడూ, ప్రజల పక్షాననిలిచి, ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. పేపర్లో రోజూ ఎక్కడో ఓ చోట ఇవే వార్తలు.. ఇదెక్కడి పోలీసు న్యాయమో.. అర్థం కావడం లేదు.. స్వామి : నాగరాజు.. నాకు చదువు అబ్బక పోయినా.. కాస్త లోకజ్ఞానం ఉందిరా.. ఆ అనుభవంతో చెబుతున్నా.. విను.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాట చెల్లుబాటు ఆవుతుంది.. ఇదేమి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు.. నేరం చేసిన వారి ఆర్థిక స్థోమత, సామాజిక నేపథ్యం, రాజకీయ విధేయతలను అనుసరించే పోలీసుల వైఖరి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదురా.. చట్టాలు వాళ్లకి చుట్టాలే. మనం వాళ్లను నిందించకూడదు.. పాలకులను నిందించాలి.. నాగరాజు : స్వామీ.. ఎక్కడో ఎందుకు.. మన దగ్గర్లో చింతపాడు గ్రామానికి వచ్చిన చింతమనేని అటవీశాఖ అధికారిని ఏమన్నాడు.. దమ్ముంటే రారా.. అంటూ పత్రికల్లో రాయలేని పచ్చి బూతులు తిట్టాడు.. అటవీశాఖ అభయారణ్యంలో ఏకంగా తారురోడ్డు వేయించాడు.. ఇప్పటి వరకు ఆయనపై యాక్షన్ లేదు.. స్వామి : ఓరేయ్.. పిచ్చోడా.. చింతమనేని ఎవరూ.. ప్రభుత్వ చీఫ్‌విప్.. టీడీపీ ఎమ్మెల్యే.. సంపన్నుడు.. అలాంటి వారిపై కేసులు నమోదైనా శిక్షలు పడవని ఖాకీలకు ముందే తెలుసురా... నాగరాజు : నిజమే స్వామి.. చింతమనేనిపై అటవీ శాఖాధికారులు మౌనం వహించారు. కేసు విచారణ కూడా లేదు.. అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీపై సివిల్ వివాదంలో కేసు నమోదైంది.. బందరులో ఎక్సైజ్ అధికారుల విధులకు ఆటంకం మరో నేతపై కలిగించారని కేసులు పెట్టారు. ఇదేంటి.. అధికార పక్షానికి ఓ చట్టం.. ప్రతిపక్షానికి ఓ చట్టమా.. చెప్పు.. కృపావరం : స్వామీ.. మీరిన్ని చెబుతున్నారు.. కానీ అసలు ఖాకీలకే రక్షణ లేదు.. అధికారం అండతో వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి.. కుప్పు స్వామి : ఇదేక్కడి వింత.. మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసుకే రక్షణ లేదంటావేంటి కృపావరం.. వివరంగా చెప్పు.. కృపావరం : చెబుతాను.. వినండి.. మన ప్రాంతంలో జరిగిన సంఘటలే ఇవి.. గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకోడానికి వెళితే ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వాహనాలను లోపలకి అనుమతించడం లేదని గ్రామపెద్ద ఏకంగా కానిస్టేబుల్ చొక్కానే చింపేశాడు. పులపర్రులో కులాలు వేరైన ఇద్దరు ప్రేమికులకు రక్షణ కల్పించడానికి వెళ్లిన పోలీసులను అధికార అండ కలిగిన పెద్దలు వారినే నిర్భందించారు.. ఇవే కాదు.. అనేక సంఘటనలు ఉన్నాయి.. బుజ్జిబాబు : (పక్కనే కూర్చుని అంతా వింటున్న వ్యక్తి) పెద్దలందరికీ ఓ నమస్కారం.. అధికారం ఎంత బరి తెగించిందో నేనూ.. ఓ మాట చెబుతా.. కృపావరం : బుజ్జిబాబు.. అరే.. నేను నిన్ను చూడలేదు.. చెప్పు.. చెప్పు.. బుజ్జిబాబు : చింతమనేని సంగతి కాస్త పక్కన పెడదాం.. మన టీడీపీ అభ్యర్థి ఏం చేశారో తెలుసా.. మొన్నీమధ్య అటవీశాఖాధికారులు కొల్లేరు అభయారణ్యంలోకి ట్రాక్టరుపై తరలిస్తున్న ఆక్వా పరికరాలను సీజ్ చేసి కైకలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.. అంతే ఆయనకు కోపం వచ్చింది. ఓ 60 మందితో వెళ్లి డాక్టరు, డ్రైవర్‌ను విడిపించుకుని వెళ్లిపోయారు.. కేసు పెట్టినప్పటికీ ఆయనను అడిగే వాడే లేడు.. ఇదేనండి అధికారం అంటే.. శంకరరావు : నిజమే నబ్బా.. పోలీసులు తీరు ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది.. మొన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. పాపం.. రక్తం కారుతూ బాధతో జగన్ హైదరాబాదు వెళ్లారు.. ఇంతలోనే టీవీల్లో కత్తి దాడి ఆయన అభిమానే చేశాడని ప్రకటన... ఏ పార్టీ అభిమానైనా కత్తితో దాడి చేస్తాడా.. గుండెళ్లో పెట్టుకుని పూజిస్తాడు కాని.. జానీ : అవునండీ.. రాష్ట్రంలో మరీ దాడులు పెరిగాయి.. శ్యాంబాబు : (నాగరాజు కొడుకు) : నాన్నో ఓట్లు అడగడానికి ఎవరో వచ్చారు... నీ గురించి అడుగుతున్నారు. బేగా రా.. అంటూ పిలవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
ఆయన వద్దు బాబోయ్..
సాక్షి, అమరావతి : శ్రీనివాసరావు (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కుల, మత, ప్రాంతం, వర్గ భేదాలు లేకుండా ఉద్యోగులను సొంత మనుషుల్లా చూసేవారు. కేంద్రం ప్రకటించిన నెలలోపు ఉద్యోగులకు డీఏలు, ఇతరత్రా అలవెన్సులు ఇచ్చేవారు. ఈ స్వేచ్ఛతో ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించారు. వ్యవసాయంలో జాతీయ సగటును దాటి ఉత్పత్తి సాధించగలిగాం. మళ్లీ అటువంటి పాలన రావాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నాడు’ అని తన మనసులోని మాట చెప్పారు. వెంకటేష్ (పేరు మార్చాం) స్పందిస్తూ.. ‘చంద్రబాబు పాలనంతా డీఏలను పెండింగ్‌లో పెట్టడమే సరిపోయింది. 2014 నుంచి ఇప్పటివరకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉంచారు. మళ్లీ ఆయనే వస్తే ఉద్యోగులకు డీఏ అవసరమా అంటారు. రద్దు చేస్తే ఎవరు అడుగుతారనే భావనకు వస్తారు. ఇంకా ఎలాంటి నిర్ణయాలను చూడాల్సి వస్తుందో’ అంటూ నిట్టూర్చారు. ‘అవును. హెల్త్‌కార్డుల సంగతేంటి. అవి కనీసం నాలుక గీసుకోవటానికి కూడా పనికి రావటం లేదండి. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అన్నారు. ఏ హాస్పిటల్‌కు వెళ్లినా మేం ట్రీట్మెంట్ చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. పెన్షనర్ల పరిస్థితి ఐతే మరీ ఘోరం. వచ్చిపడే రోగాలకు వైద్యం చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు’ అంటూ వెంకటేష్‌తో మాట కలిపారు సాయిరాం. ‘చెప్పటం మరచిపోయాను. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. దాని కోసం కమిటీ వేశారు. అది ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానంటూ వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రకటించారు. ఇచ్చిన మాటపై నిలబడే లక్షణం ఆ కుటుంబానికే ఉంది. కచ్చితంగా రద్దు చేస్తాడని ప్రతి ఉద్యోగి నమ్ముతున్నాడు. జగన్ రావాలి.. ఈ బాధలు పోవాలి ’ అంటూ రమేష్ చర్చను ముగించాడు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలివీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణ చేయకుండా మోసం చేశారు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలంటూ ఎన్నికలు దగ్గరపడటంతో ఓ పాలసీ తయారు చేశారు. ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలులో ఘోరంగా విఫలమయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేసింది చాలా తక్కువ. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేస్తామన్నారు. ఈ విధానాన్ని కేవలం సచివాలయం, హెచ్ఓడీలలో మాత్రమే అమలు చేసి మిగిలిన వారికి చెయ్యిచ్చారు. ఉద్యోగులకు పదవీ విరమణ రోజే బెనిఫిట్స్ అందిస్తామన్నారు. అమలులో పూర్తిగా విఫలమయ్యారు. ఏళ్ల తరబడి తిరిగినా బెనిఫిట్స్ అందటం లేదు. పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అమలు కాలేదు. సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. -
ఇంతకీ మన రాజధాని నగరం ఏదీ?
‘‘మనకు సిమెంటు, తాపీ, బొచ్చె, పార, గునపం.. నాకివేమీ తెలియదు. అయినా సరే మనం నగరాలు నిర్మించడంలో టాప్‌మోస్ట్ అని పేరు తెచ్చుకున్నాం. ఎలా?’’ కింగ్ సినిమాలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య టైప్‌లో అన్నారు బాబుగారు.‘‘పక్కవాడి ప్లాన్లు దొబ్బేయడం వల్ల.. కులీకుతుబ్‌షా నిర్మించినదాన్ని పట్టుకుని మనమే కట్టామని చెప్పుకోవడం వల్ల’’ జయసూర్య గారి పక్కనే ఉన్న అసిస్టెంట్ మనసులో అనుకున్నట్టుగానే అనుకున్నారు సెక్రటరీలు. ‘‘అప్పట్లో హైదరాబాద్ కడుతున్నప్పుడు కూడా నేనింత కన్ఫ్యూజన్ కాలేదు. కిందటి జన్మలో అప్పట్లో నేనూ, కులీకుతుబ్‌షా ఇద్దరం కలిసి మూసీ పక్కనే ఉన్న చించలం అనే ఊరి దగ్గర సిట్టింగేశాం. కొత్త నగరం ఎలా కట్టాలా అంటూ నాతో చర్చిస్తూ, ప్లాన్లు గీస్తూ ఉన్నాడు కుతుబ్‌షా. నీకు తెలుసు కదా. కులీకుతుబ్‌షాకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. ఇంతలో నేనేదో ఆలోచిస్తూ చేతిలో ఉన్న గంటంతో అలా పిచ్చి గీతల్లా ఏదో గీసేశాను. దాన్ని చూసిన కులీ ఎలర్టయిపోయి, ఎగిరి గంతేశాడు. ‘బాబూ సార్ వచ్చేసింది.. మన నగరానికి ప్లాన్ వచ్చేసింది’ అంటూ నన్నెత్తుకొని గాల్లో తిప్పేశాడు. అక్కడితో ఆగాడా?. ‘దీనికి ఎవరి పేరు పెడదాం?’ అని అడిగాడు. ‘మళ్లీ వేరే ఇంకెవరి పేరో ఎందుకు సార్. మీ ఆవిడ భాగమతి పేరు ఉంది కదా. మీరు పెళ్లి చేసుకున్నాక ఆమె పేరు హైదర్‌మహల్ అని మార్చారు కదా. ఆమె పేరు పెట్టేద్దాం.. హైదరాబాద్ అని’ అని సలహా ఇచ్చా. ‘అబ్బా నగరం ప్లానూ, దాని పేరూ రెండూ ఒకేసారి వచ్చేశాయి’ అన్నాడు కులీ. అప్పట్లో నా జడ్జిమెంట్‌కు అంత వ్యాల్యూ ఇచ్చేవాడు’’ అని చెప్పుకుంటూ పోతున్నారు బాబు గారు. కిందటి జన్మ సంగతి సరే.. ఇప్పటి మాటేమిటి అన్నట్టు చూస్తున్నారు సెక్రటరీలందరూ.పక్కనే ఉన్న టోక్యో నగరం ప్లాన్ చూస్తూ.. ప్లాంక్ మీద ఉన్న పేపర్ మీద ఏదో గీశారు బాబుగారు. ‘‘ఇదెలా ఉంది’’ అంటూ మళ్లీ సెక్రటరీలను అడిగారు. ‘‘యాజిటీజ్‌గా ఉంది సార్’’ అన్నాడు ఒక సెక్రటరీ. ‘‘అంటే?..’’ కోపంగా ఏదో అనబోతూ ఉండగానే.. ‘‘అంటే అదేమీ లేదు సార్. టోక్యో లాగా ఉంది’’ అంటూ జవాబిచ్చాడు సెక్రటరీ. ‘‘నోర్ముయ్. ఈ ఊరేమిటీ? అక్కడిది షింటో టెంపుల్. ఇక్కడిది దుర్గగుడి. అక్కడివి కిమినోలు. ఇక్కడివి చీరలు’’ అంటూ ఉండగానే సెక్రటరీ మళ్లీ అందుకొని.. ‘అవున్సార్.. అది జపాన్.. మనది ఆంధ్రా. అది వేరే.. మనది వేరే’’ అన్నాడు. ‘‘సరిగ్గా క్యాచ్ చేశావ్. అదేమిటోగానీ మన రాజధాని కట్టడం చాలా నాకు కష్టమైపోతోంది. కజక్‌కు వెళ్తే అక్కడి రాజధాని ఆస్తానా లాగా కట్టాలనిపించింది. కానీ ప్లాన్ వేయబోతుంటేనే ఆస్తమా అంతటి ఆయాసం వచ్చేసింది. ఒక్కోసారి షాంఘైలా, మరోసారి సింగపూర్‌లా, ఇంకోసారి ఇస్తాంబుల్‌లా ఇలా రకరకాలుగా కట్టాలనిపిస్తోంది. కానీ ఇవేవీ కుదరడం లేదు. నాకు కన్ఫ్యూజన్ పెరుగుతోంది. రాజమౌళిని పిలిపించు. మాహిష్మతిలా నిర్మించమని చెబుదాం’’ అంటూ సెక్రటరీని ఆదేశించారు. ‘‘మాహిష్మతిలా కడితే జనం మతిపోవడం ఖాయం’’ అన్నారు సెక్రటరీలందరూ ఒకేసారి. పొగడ్తో, తెగడ్తో అర్థం కాలేదు. ‘‘సార్.. అవి ఉత్తి గ్రాఫిక్స్ కద్సార్. సినిమాలో అయితే కనిపించే భ్రాంతిలా ఓకేగానీ ఇక్కడ నిజంగా ఏదో ఒకటి కట్టాలి కదా’’ ఒకడు ధైర్యం చేసి చెప్పాడు. ‘‘మరేం చేద్దాం?’’ ఎటూ పాలుపోక అడిగారు. ‘‘మనమెలాగూ.. అసలు ఒరిజినల్ అమరావతికి దూరంగా ఎక్కడో 35 కి.మీ. దూరంలో ఉద్దండరాయునిపాలెం దగ్గర శంకుస్థాపన రాయి వేశాం. మన రాజధాని పేరు అమరావతి అంటూ అక్కడి పేరును ఇక్కడ పెట్టేసి... అదీ ఇదీ ఒకటేనని బుకాయిస్తున్నాం. అయినా మీ విజనే విజను సార్’’ అన్నాడు సెక్రటరీ. ‘‘ఎందుకు నా విజన్‌ను మెచ్చుకుంటున్నావ్’’ అడిగారు బాబుగారు. ‘‘కరిమింగిన వెలగపండు లాగే.. ఇప్పటి రాజధానికి సెక్రటేరియట్ ఉన్న ప్రాంతం పేరు వెలగపూడి కదా. సార్థకనాయధేయంతో ఇంకా కట్టని నగరానికి సెక్రటేరియట్‌ను వెలగపూడిలో కట్టారంటే మీ విజనే విజన్ కదా అని మెచ్చుకుంటున్నాను సార్’’ ‘‘ఇంతకూ మన రాజధాని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు నువ్వు’’ ‘‘కజక్ రాజధాని మొదటి పేరు ఆస్తానా అనేదాన్ని మార్చి ఇప్పుడు నూర్సుల్తాన్ అంటూ పేరు మార్చి పెట్టారట’’. ‘‘అయితే?’’ అడిగారు బాబుగారు. ‘‘ఎలాగూ హైదరాబాద్ కట్టింది కూడా మీరే కదా. అందుకే ఆ నగరం పేరు అమరావతిగా మార్చేశామని జీవో ఇచ్చేద్దాం. తెలంగాణ వాళ్లెలా పిలుచుకున్నా.. ఉమ్మడి రాజధానిగా ఎలాగూ మనకు ఐదేళ్ల టైమ్ ఇంకా మిగిలుంది కాబట్టి మనం మాత్రం దాన్ని అమరావతి అందామని చెబుదాం. ఎలా ఉంది సార్ ఐడియా?’’ అన్నాడు సెక్రటరీ. ‘‘ఇది మన అబ్బాయికి రావాల్సిన ఐడియా కదా. నీకెలా వచ్చింది?’’ అంటూ బాబుగారు అతడి వైపు కొరకొరా చూశారు.– యాసీన్ -
సినీ‘కీయాలు’ రాజడైలాగులు!
‘‘అత్తెసరు సీట్లు సంపాదించి.. ఏదో ఒకటీ అరా సీటు మెజారిటీ వచ్చిందంటే వచ్చిందంటూ.. ఎలాగోలా గెలవడానికి రాలేదురా నేనూ. కనీసం టూ థర్డ్స్ మెజారిటీతో లాండ్‌స్లైడ్ విక్టరీ కోసమే ఇంతగా కష్టపడుతున్నా’’ మహేశ్‌బాబును ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ కొట్టాడు మా రాంబాబు గాడు. ‘‘నువ్వు అలాగంటావా..? అయితే నా మాట కూడా విన్కో. ఎవ్వర్ని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుందో.. వాడే రా జగన్’’ అంటూ మళ్లీ మహేశ్‌బాబునే ఎంచుకున్నాడు సత్తిబాబు. ఈ సినీ డైలాగుల కథ తెలియాలంటే కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. రోజూలాగే ఆ రోజు మా ఊరి యూత్ అంతా పొద్దున్నే కమ్యూనిటీ హాల్ దగ్గర పేపర్ చదువుతూ నిలబడ్డారు. అలా రోజూ అక్కడ చేరి పొద్దున్నే పక్కనే ఉండే పుల్లమ్మ వేసే పుల్లట్లూ, ఇడ్లీ విత్ కారప్పొడీ తింటూ రాజకీయాలూ, సినిమాల గురించి మాట్లాడుకోవడం వాళ్లకలవాటు. తెల్లారి లేస్తే సినిమాలు తప్ప ప్రపంచం ఎరగని యువత వాళ్లు. కానీ ప్రస్తుతం రాజకీయాల సీజన్ నడుస్తుండటంతో అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ న్యూస్ పేపర్ ‘అసలు జగన్‌కు ఒక్కసారైనా అవకాశం ఎందుకివ్వాలి’ అంటూ ఓ శీర్షికతో న్యూస్ ఐటమ్ కనిపించింది. అంతే ఒక్కసారిగా ఎంతో మండిపోయింది వాళ్లకు. అసలే పద్దెనిమిదేళ్లూ, ఇరవై నాలుగేళ్ల మధ్య యూత్ వాళ్లు. దాంతో ఫేమస్ సినీ హీరోల పంచ్ డైలాగులూ, రాజకీయాలను మిక్స్ చేస్తూ జగన్ గెలవడం ఎందుకు అవసరమో సినిమా డైలాగ్స్ రూపంలో చెప్పుకోవాలనుకున్నారు. అంతే.. ఒక్కొక్కడూ తమ తమ టాలెంట్స్ చూపడం మొదలుపెట్టాడు. జగన్ అభిమాని ఒకడు లేచి.. ‘‘ఒరేయ్.. ఆయన మీద అభిమానం కొద్దీ జగనన్నను ఇమిటేట్ చేయడం, జగనన్నలా మాట్లాడటం నా వల్ల కాదుగానీ ఓ అభిమానిలా మామూలు డైలాగ్ కొడతాను. వినండి. నేనుగానీ బూత్ లెవెల్లోకెళ్లి జనాలతో ఓట్లేయించడం మొదలుపెడితే.. పొరుగూరూ, పక్కూరూ వాళ్లతో సహా ఎంత మందితో ఓట్లేయించానో లెక్కబెట్టాలంటే అమెరికా కంప్యూటర్లు దిగాలి’’ అన్నాడు. మరొకడు లేచి.. అటు చంద్రబాబు డైలాగూ.. ఇటు జగనన్న డైలాగూ వాడే చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘పాలిటిక్స్‌లో నాది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఫార్టీ ఇయర్స్ ఇక్కడ’’ అని వాడే అనేసి వెంటనే మళ్లీ మహేశ్‌బాబు గొంతులోకి దిగిపోయి.. ‘‘(పాలిటిక్స్‌లోకి) ఎప్పుడొచ్చావని కాదన్నయ్యా... (ఈసారి) గెలిచావా లేదా అనేదే లెక్క’’ అంటూ యాటిట్యూడ్ చూపించాడు. ‘‘ఎవరు రైతుల కష్టాలు తెలుసుకోడానికి వేల మైళ్లు పాదయాత్ర చేశాడో, ఎవరు జనం వెతలు తీర్చడానికి హోదా కోసం మొదట్నుంచి కట్టుబడ్డాడో, ఎవరు వస్తే మళ్లీ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు మొదలవుతుందో.. ఆయనేనమ్మా జగన్మోహన్రెడ్డీ’’ అనేసి కూర్చున్నాడు ఇంకొకడు. ‘‘ఇప్పుడు ఒక్కొక్కరు విడివిడిగా పోటీ చేయడం లేదు షేర్‌ఖాన్. జనసేన అని ఒకరూ, బీఎస్పీ అనే రూపంలో ఇంకొకరు, కాంగ్రెస్ అని వేరొకరూ.. ఇలా తాము వేర్వేరూ అంటూ అందరూ కట్టగట్టుకొని అందరూ తెలుగుదేశం కోసమే పోటీ చేస్తున్నారు. అయినా అందర్నీ కట్టగట్టుకొని రమ్మను షేర్‌ఖాన్’’ అంటూ మరో యువకుడు ధాటిగా చెప్పాడు. ‘‘అరేయ్ అంతా మన రాష్ట్రం గురించే చెప్పుకుంటున్నాం. మరి పక్క తెలుగు రాష్ట్రం పరిస్థితేమిటో’’ ‘‘ఏముందీ అక్కడ ఒకే ఒక్కడు.. తిరుగులేని మనిషి’’ ‘‘అంతా హీరోల గురించే చెప్పుకుంటే ఎలా... ప్రత్యర్థికీ ఏదో ఒక సినిమా డైలాగ్‌ను అంకితం చేయకపోతే ఎలా?’’ ‘‘సరే నువ్వింతగా అడుగుతున్నావ్ కాబట్టి ఆయనకూ ఇచ్చేద్దాం కొన్ని టైటిల్స్.. మోసగాడు, కేటుగాడు, దొంగలకు దొంగ, గజదొంగ’’– యాసీన్ -
రెండు రాష్ట్రాల వారధి భద్రాచలం
ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి తెలంగాణ, ఆం్రధ ప్రాంతాలకు వారధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009 నుంచి రద్దు అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు గెలుపొందగా, సీపీఐ మూడుసార్లు, సీపీఎం ఒకసారి గెలుపొందాయి. గెలుపొందిన వారిలో కమలకుమారి, మిడియం బాబురావు కోస్తాకు చెందినవారు కాగా మిగిలిన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. కాంగ్రెస్ నేత రాధాబాయి ఆనందరావు నాలుగుసార్లు, సీపీఐ నేత సోడె రామయ్య మూడుసార్లు, కాంగ్రెస్ నేత కమలకుమారి రెండుసార్లు గెలువగా, టీడీపీ పక్షాన విజయకుమారి ఒకసారి, సీపీఎం తరఫున బాబురావు ఒకసారి గెలుపొందారు. ఇది మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వుడ్ కావడంతో ఐదుగురు గిరిజన నేతలు పన్నెండు సార్లు గెలుపొందారు. వీరిలో కమలకుమారి కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. -
మీరిచ్చే భరోసా ఇదేనా?
సాక్షి, కైకలూరు : కిరణ్ : ఏరా.. త్రినాథ్.. జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయిరా.. ఈ సారి ఏవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందంటావు.. త్రినాథ్ : అరే మూడు పార్టీల మ«ధ్యనే కదరా.. కిరణ్ : అరే.. చదువుకున్నోళ్లుగా మనం.. కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం.. త్రినాథ్.. నిజం చెప్పు.. మన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావల్సింది 4,000 ఎకరాలు.. ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో ఏకంగా 30,000 ఎకరాలు సేకరించింది.. పాపం 25 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారా.. లేదా.. త్రినాథ్ : అరే.. మొన్నే కదరా.. పోర్టుకు శంకుస్థాపన మాపార్టీ వాళ్లు చేశారు.. టీవీ, పేపర్లో చూడలేదా? కిరణ్ : త్రినాథ్.. మరి అంత అడ్డగోలుగా.. మాట్లాడకురా.. నాలుగున్నరేళ్లు తర్వాత ఎన్నికలు కొన్ని నెలల్లో ఉండగా శంకుస్థాపన చేస్తారా.. ఏమిటీ రాజకీయం.. రాజేష్ : (కూర్చున్న పిట్ట గోడ నుంచి దిగుతూ) అరే.. కిరణ్.. నేను కూడా ఓ ప్రశ్న వేస్తానురా.. అదేంటంటే... మన విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.. పనులతీరుపై పలువురు ఆందోళన చేశారు. మనకేమో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.. వినోద్ : ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబు తా నురా.. అరే విజయవాడ తాత్కాలిక రాజధాని అయిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఈ ప్రాంతానికే ఇస్తున్నార్రా.. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయంతే.. రాజేష్ : ఏరా.. నువ్వే చెబుతున్నావుగా.. తాత్కాలిక రాజధాని అని, రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుంటే ఇంకెçప్పుడురా ఫ్లైఓవర్ కట్టేది.. త్రినాథ్ : ఏంట్రా.. మరీ అలా మాట్లాడుతారు.. టీడీపీ రైతులకు ఎంతో సాయం చేసింది తెలుసా.. మీరు లోపాలనే ఎత్తి చూపుతున్నారేంట్రా... కిరణ్: ఓరే.. త్రినాథ్.. ఏంట్రా రైతులకు ఒరి గింది.. కొద్దిసేపు వరి పక్కన పెడదాం.. 2015లో సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు రూ.4,500 గిట్టుబాట ధరగా అందిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడెమో.. సుబాబుల్‌కు రూ.2,200, జామాయిల్‌కు రూ.2,600 అందిస్తున్నారు. రైతు టన్నుకు రూ.15,00 నష్టపోతున్నాడు.. ఇదేనా రైతులకు మీరేచ్చే భరోసా.. నువ్వే ఆలోచించు.. మహేష్: (కూర్చున్న వాడు ఆవేశంతో పైకి లేస్తూ) ఆరే ఏంట్రా.. మా పార్టీని అందరూ ఆడిపోసుకుంటారు.. ఏ రాష్ట్రంలోనైనా ఉచిత ఇసుక ఎక్కడైనా ఇచ్చారా.. దీనికి సమాధానం చెప్పండి.. కైలాష్ : అరే.. నీ ప్రశ్నకు మా వాళ్ల తరుపున నేను సమాధానం చెబుతాను.. విను.. ఏరా మన జిల్లాలో గన్నవరం వద్ద బ్రహ్మలింగయ్య చెరువు ఎలా ఉండేది.. అక్కడ కూడా ఇసుకను కొల్లగొట్టారు.. ఇక జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, కైకలూరులలో అక్రమ ఇసుక దందాలకు అదుపే లేదు.. ఇదేనా మీ ఉచిత ఇసుక పథకం.. వినోద్ : ఒరే.. రాష్ట్రంలో మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏకంగా 18,500 టెంపరరీ ఉద్యోగాలు అందించింది.. ఇంతకన్నా ఏం కావాలి.. రాజేష్: ఉద్యోగాలు ఇచ్చింది.. ఇచ్చిందే కాకుండా.. తీసేసినవి కూడా చూడు.. మరి.. మొత్తం మీద ఏమైనా 23,500 ఉద్యోగాలు తీసేశారు.. నోటిఫికేషన్ విషయం తీసుకుంటే.. ఒకరు నోటిపికేషన్ ఇస్తారు.. మరొకరు తీసేస్తా్తరు.. ఏంటిరా.. ఈ పద్ధతి.. త్రినాథ్ : అరే ఇవన్నీ పక్కన పెట్టండిరా.. మా పాలనలో మహిళా సాధికారత సాధిస్తున్నాం.. కిరణ్ : అబ్బో.. బాగా చెప్పావురా.. మహిళలకు గౌరవమంటే.. తహసీల్దారుని జుట్టు పట్టుకు లాగడమా.. అంతెందుకురా.. కాల్‌మనీ కేసులో ఇక్కడ మహిళలకు ఏం న్యాయం జరిగిందో.. అందరికీ తెలుసురా.. మహేష్: అరే .. ఇది మాత్రం మా పార్టీకి అనుకూలంగా ఉంటుందిరా.. ఆస్పత్రులలో పేదలకు అనేక సేవలు అందిస్తున్నాం.. దీనిని ఎవరూ కాదనలేరు.. కైలాష్ : ఏంట్రా ఆస్పత్రుల్లో అభివృద్ధి.. మన విజయవాడ పాత ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా 1000 పడకలు అన్ని చెప్పారు. అక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయో సామాన్య ప్రజలను అడగండి చెబుతారు.. అయినా మీ పాలనలో ఆస్పత్రిలో శిశువులను ఎలకలు కొరికిన సంఘటనలను.. జనాలు మర్చిపోయారనుకుంటున్నారా.. వినోద్ : అరే.. ఊరుకోండిరా.. ఎండ ఎక్కువ అవుతోంది.. పోదాం పదండి ఇళ్లకు.. -
ఎంపీ, ఎమ్మెల్యే.. మంత్రి
సాక్షి, మేడ్చల్ జిల్లా: అదృష్ట జాతకమంటే ఆయనదే అని అందరూ అనుకుంటున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతోనే ఒక్కసారిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వరుసగా పదవులు వరించాయి మల్లారెడ్డిని. అనూహ్యంగా పార్లమెంట్ టికెట్ సాధించటంతో పాటు అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఎంపీగా అయినా, ఎమ్మెల్యేగా అయినా పోటీ చేసిన తొలిసారే విజయం సాధించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి 88,066 మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీ బలహీన పడటం వంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అలాగే, ముందస్తు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభపై మోజుతో మేడ్చల్ టికెట్ ఆశించారు. ఆ ఎన్నికల్లో 88,066 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు.. ఒకే ఓటరు!
ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒకచోట ఉంచి మరోచోట తీసేస్తారు. కానీ ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న దాదాపు 34 గ్రామాల్లో ఇప్పటికీ సుమారు 2,934 ఓట్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఉదయం ఒడిస్సాలో ఓటేసిన వ్యక్తి, సాయంత్రం ఆంధ్రా ఎన్నికల్లో ఓటేస్తాడు. వినడానికి చిత్రంగా అనిపిస్తున్నా, ఇది ముమ్మాటికీ నిజం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాల మధ్య, రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 7 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలో, ఒడిస్సాలోనూ ఓటు వేస్తున్నారు. నేటికీ తేలని వివాదం 1936లో ఒడిస్సా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. కొంతకాలం క్రితం ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. చాలాకాలంగా ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. ప్రయాణం..ప్రమాదం విజయనగరం పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలూరు ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అడవులు, కొండల నడుమ అత్యంత ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తే కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. దాదాపు 14 కిలోమీటర్లు మేర రహదారి అనేదే ఉండదు. రాళ్లురప్పల్లో నడిచి వెళ్లాల్సిందే. అతికష్టం మీద కొంత దూరం వరకూ జీపులో వెళ్లినా పక్కనే వందల అడుగుల లోతున్న లోయల్లో మృత్యువు పొంచి ఉంటుంది. దీంతో ఇక్కడికి ఆంధ్రా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. రేషన్ కార్డులు కూడా మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దులోని కొఠియా ప్రాంతం ఆంధ్రా–ఒడిస్సా పోలింగ్ బూత్‌లు ఆంధ్రా–ఒడిస్సా రేషన్ కార్డులతో గిరిజన మహిళ ఆంధ్రా–ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు కొఠియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టుచెన్నేరు పంచాయతీలో 12, పగులు చెన్నేరు పంచాయతీలో 4, గంజాయిభద్రలో 13, సారికలో 2, కురుకూటిలో 2, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలున్నాయి. ఆంధ్రా ఎన్నికల కోసం నేరెళ్లవలస, శిఖపరువు, డి. వెలగవలస, కురుకూటిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒడిస్సా ఎన్నికల కోసం కొఠియా, రణసింగి, గంజాయిభద్ర, పగులుచెన్నేరులో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం ఒడిస్సాలో ఓట్లు వేసిన తర్వాత మధ్యాహ్నం ఆంధ్రా రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌లో ఓట్లు వేయడానికి వస్తారు. – బోణం గణేశ్, సాక్షి ప్రతినిధి, విజయనగర -
జగన్.. ఓ మై జగన్
చంద్రబాబు ప్రచారసభలకు జనం రావడం మానేశారు. వేదిక కింద ప్రజలు ‘నాయకులసంఖ్య’లో, వేదిక పైన నాయకులు ‘ప్రజలసంఖ్య’లో కనిపిస్తున్నారు. ‘‘చూశారా తమ్ముళ్లూ.. ఆ జగన్‌ని’’ అన్నాడు చంద్రబాబు.. మైకు నోటి దగ్గర పెట్టీ పెట్టుకోగానే. ‘‘చూడ్డానికి తమ్ముళ్లెవరూ రాలేదు సార్. కొంచెంసేపు వెయిట్ చేద్దాం’’ అన్నారు వేదిక మీది నాయక ప్రజలు. ‘‘లీడర్ కోసం జనం వెయిట్ చెయ్యాలి గానీ, జనం కోసం లీడర్ వెయిట్ చెయ్యడం ఏంటయ్యా? తమాషాగా ఉందా! ఎటుపోతున్నాం మనం? ఐ వాంట్ ప్రజలు రైట్ నౌ’’ అన్నాడు చంద్రబాబు. ‘‘రైట్ నౌ అంటే కొంచెం కష్టమేమో సార్. ఎంత ట్రై చేసినా ప్రజలు ఇళ్లలోంచి కదలడం లేదు. ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని బాబుగారు తన పేరు చెప్పి మరీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పినా ఎవరూ వినడం లేదు’’ అన్నాడు వేదిక మీద ఆ చివర్న ఉన్న లీడర్ ఈ చివరికొచ్చి. చంద్రబాబుకి చిరచిరలాడింది. ‘‘ఎండలు ముదిరిపోయాయా? ప్రజలు ముదిరిపోయారా’’ అన్నాడు. ‘‘ఎండలు ముదిరిపోతే.. మనకొక ఎండ, జగన్కొక ఎండ ఉండవు కదా నాయుడు గారూ. ఏదో ఊటీకి వెళ్లినట్లు ఓటర్లంతా మూట గట్టుకుని జగన్ మీటింగులకు వెళ్తున్నారు. అంటే.. ఎండలు ముదర్లేదు. ప్రజలే ముదిరారు. ఇకనైనా మీరు జగన్ సీఎం అయితే రాష్ట్రంలో ఏం జరగదో చెప్పడం మాని, మీరు సీఎం కాకపోతే రాష్ట్రానికి ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. రోజుకు వందసార్లు మీకు తెలియకుండానే జగన్.. జగన్.. అంటున్నారు తెలుసా మీరు’’ అన్నాడు వేదిక మీద ఉన్న ఇంకో నాయకుడు. ‘‘ఏంటయ్యా నువ్వు. జగన్‌కి ప్రశాంత్ కిశోర్‌లా, నువ్వు మాకు అశాంత్ కిశోర్‌లా తయారయ్యావు. నోటికి ఒక్క మంచిమాటా రాదా నీకు!’’ అన్నాడు చంద్రబాబు. ‘‘అదిగో చూశారా.. మళ్లీ జగన్ అన్నారు’’ అన్నాడు నాయకుడు. ‘‘సర్లే. జగన్‌ని జగన్ అనకుండా ఇంకేం అనమంటావో చెప్పు. ఏదో ఒకటి అనకపోతే జగన్‌ని జనమే కాదు మనమూ నమ్మేస్తా’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఊ.. జగన్‌లో ‘జ’ని తీసి గన్ అనొచ్చు. కానీ, ఆ గన్ని మన మీద మనమే గురి పెట్టుకున్నట్లు అవుతుంది. పోనీ, జగన్‌లో ‘గ’ ని తీసి, జన్ అందామంటే జగన్ జనం మనిషి అన్న మీనింగ్ వస్తుంది. ఈ రెండూ కాకుండా జగన్‌లోని చివరి అక్షరం తీసి ‘జగ’ అంటే మీనింగ్లెస్ అవుతుంది. బుర్ర చెడిపోయిందనుకుంటారు మనకు. పూర్తి పేరు జగన్మోహన్రెడ్డి కాబట్టి, ‘జగన్’ తీసి మోహన్‌రెడ్డి అంటే అసలే వర్కవుట్ కాదు. పవన్ కల్యాణ్‌ని పవన్ కల్యాణ్ అనకుండా కల్యాణ్ అంటే ఏం తెలుస్తుంది? జగన్‌ని జగన్ అని కాకుండా మోహన్‌రెడ్డి అన్నా అంతే’’ అన్నాడు నాయకుడు. ‘‘మరేం చేద్దామంటావ్. జనమూ రాకుండా, జగన్ పేరూ రాకుండా.. ఎలా మనం ప్రచారం చేసుకోవడం’’ అన్నాడు చంద్రబాబు డీలా పడిపోతూ. స్టేజ్ పైన ఆయన్ని ఆ స్టేజ్‌లో చూసి తట్టుకోలేకపోయారు స్టేజీపై నాయకులు. ‘‘దిగులు పడకండి నాయుడు గారూ. జనం రాకున్నా వచ్చారనీ, జగన్ పేరు ఎత్తకున్నా ఎత్తారని రాయడానికి ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ ఉన్నాయి కదా. అన్నీ మీరన్నవే రాస్తున్నాయా ఆ రెండు పేపర్లు. జనానికి మీరు చెప్పనివి, జగన్‌ని మీరు అననివి కూడా వాటికవే అల్లి, పేజీకో పెద్ద హెడ్డింగ్ పెట్టి వేస్తున్నాయి కదా. ప్రచారాన్ని వాటికి వదిలిపెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి’’ అని చంద్రబాబుని సేదతీర్చాడు వేదికపై ఉన్న ఓ నాయకుడు. – మాధవ్ -
చంద్రబాబు ఏమంటారో చూడండి..!
ఎన్నికష్టాలు ఎదురైనా సత్య మార్గాన్ని వదలని రాజు సత్యహరిశ్చంద్రుడి గురించి విన్నాం.. అశోక చక్రవర్తి నుంచి గాంధీ మహాత్ముని వరకూ.. అంతా ‘సత్యమేవ జయతే’అన్నారు. అందుకే మనమంతా.. సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని నమ్ముతాం.. సామాన్య ప్రజలమైన మనమే సత్యాన్ని ఇంతగా అనుసరిస్తుంటే.. ఇక ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి...ఇంకా ఎంతో సత్యనిష్ట కలిగి ఉంటారని భావిస్తాం కదా..! కాని, మన సీఎం చంద్రబాబు మాత్రం అందుకు మినహాయింపు!! ఆయనకు అసత్య నిష్ట ఎక్కువ... ప్రచారమే పరమావధిగా నమ్ముతారు.. తాను చేయని పనులను చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటారు. చెప్పిందే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలని నిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు.. హైదరాబాద్, సైబరాబాద్ నేనే నిర్మించా.. ఐటీ, రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు నేనే తెచ్చా..పోలవరం నేనే పూర్తిచేశా.. ప్రపంచంలో నదుల అనుసంధానం చేసింది నేనే.. రెయిన్ గన్లతో కరువన్నదే లేకుండా చేశా.. ఇంద్రుడి అమరావతిని తలదన్నే రాజధానిని నిర్మించింది నేనే అంటూ... కళ్లార్పకుండా కమిట్మెంట్తో కలియుగ అసత్యహరిశ్చంద్రుడు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో చూద్దామా..! రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేశా.. వాస్తవం: రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.15,300 కోట్లు వడ్డీకి కూడా సరిపోవు. గతేడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక మేరకు రైతుల అప్పులు రూ.1,37,502.19 కోట్లకు పెరిగాయి. వాస్తవం ఇలా ఉంటే మరి రైతుల రుణాలను మాఫీ చేసిందెక్కడ? డ్వాక్రా రుణాలను మాఫీ చేసేశా.. వాస్తవం: బాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల అప్పులు రూ.14,204 కోట్లు..డ్వాక్రా సంఘాల రుణ మాఫీకి ఎగనామం పెట్టారు. దాంతో గతేడాది సెప్టెంబర్ నాటికి డ్వ్రాక్రా సంఘాల అప్పులు రూ.25,424 కోట్లకు పెరిగాయి. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేశా.. వాస్తవం: కాపులను బీసీల్లో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. దానినే ఘనంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణాల పేదలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి జీవో జారీ చేసింది. దీన్నే ప్రచారం చేసుకుంటూ కాపులను మోసగిస్తోంది. రాష్ట్రంలో క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. ఖాళీలన్నీ భర్తీచేస్తున్నాం.. వాస్తవం: రాష్ట్రంలో మొత్తం పోస్టులు 6,97,621 ఉండగా.. అందులో ఖాళీలు 1,42,825. ఈ నాలుగున్నరేళ్లలో పదవీ విరమణ చేసిన వారిని కలిపితే ఖాళీల సంఖ్య 2.40 లక్షల వరకు ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మంజూరు అయిన ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని... అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పోస్టుల సంఖ్యను కుదించింది. ఆ పోస్టుల్లోనూ 20వేలు మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని.. తక్కిన వాటిని అవుట్సోర్సింగ్ విధానంలో నింపుతామని ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై బాబు నీళ్లు చల్లారు. 2014 నుంచి ఇప్పటివరకూ 5వేల పోలీసు ఉద్యోగాలు పోగా.. ఏపీపీఎస్సీ ద్వారా నికరంగా భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 2300 మాత్రమే. మరి ఇది ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అవుతుందాం?! దేశంలో తొలిసారిగా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించా. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశా. వాస్తవం: పోలవరం కుడి కాలువను 145 కిలోమీటర్ల పొడువున లైనింగ్‌తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పేరిట పది పంపులతో గోదావరి నీటిని పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి.. వాటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశానని.. దేశంలో ఇదే ప్రథమమని చంద్రబాబు ప్రకటించుకున్నారు. కానీ..కృ ష్ణా–గోదావరి నదులను అనుసంధానం చేయలేదని కేంద్ర జలసంఘం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. పోలవరం కుడి కాలువకు శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న అప్పటి సీఎం వైఎస్సార్ ఒక నదిపై ఆనకట్ట నిర్మించి.. నీటిని నిల్వ చేసి వాటిని కాలువ ద్వారా తరలించి.. మరో నదిపై నిర్మించిన ఆనకట్టలోకి తరలించినప్పుడే వాటిని నదుల అనుసంధానం చేసినట్లుగా భావిస్తామని కేంద్ర జలసంఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్ ప్రకటించారు. గోదావరిపై నీటి నిల్వ చేసే ఆనకట్ట పోలవరం ప్రాజెక్టు.. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి.. కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీపై నీటిని తరలించి.. కష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయడానికి దివంగత సీఎం వైఎస్ ప్రణాళిక రచించారు. 1863లో స్వాతంత్య్రం రాకముందు డచ్ దేశానికి చెందిన ఓ సంస్థ తుంగభద్ర, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ.. కేసీ కెనాల్‌ను తవ్వింది. స్వాతంత్య్రం వచ్చాక తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదులను అనుసంధానం చేస్తూ.. హెచ్ఎల్సీ (ఎగువ కాలువ) తవ్వారు. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నదులను అనుసంధానం చేసి నిజంగా చరిత్ర సృష్టించారా? నేనే ప్రాజెక్టులు పూర్తిచేశా.. నేనే ఆయకట్టుకు నీళ్లిచ్చా.. వాస్తవం: 1995 నుంచి 2004 వరకూ సీఎంగా అధికారం వెలగబెట్టిన చంద్రబాబు..1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో, 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలోనూ, 1999 సాధారణ ఎన్నికల సమయంలోనూ సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.. ఎన్నికలయ్యాక వాటిని వదిలేయడం రివాజుగా మార్చుకున్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకేసారి లక్షా మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 83 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. ఐదేళ్లలో 41 ప్రాజెక్టులను దాదాపుగా పూర్తిచేశారు. అప్పట్లో మిగిలిపోయిన ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తిచేసి.. 35.04 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తానని ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి ఇప్పటివరకూ రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అదనంగా కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లందించలేకపోయారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో దాదాపుగా పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ను, సైబరాబాద్‌ను నేనే నిర్మించా.. హైదరాబాద్‌లో ఐటీని నేనే తెచ్చా. రింగ్‌రోడ్డును, ఎయిర్‌పోర్ట్‌ను నేనే నిర్మించా. ప్రపంచపటంలోహైదరాబాద్కు గుర్తింపు తెచ్చా. వాస్తవం: అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు 1991లో తమ డేటాను నిల్వ చేసుకోవడానికి, భూకంపాలు, తుఫాన్ల తాకిడి లేని.. సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషించాయి. భూకంపాల తాకిడే లేని హైదరాబాద్ అత్యంత సురక్షిత ప్రాంతమన్న ప్రధాని పీవీ సూచనల మేరకు ఐటీ సంస్థలు నాటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిని సంప్రదించాయి. దాంతో సైబర్ టవర్స్‌కు నేదురుమల్లి శంకుస్థాపన చేసి.. ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడంతో హెటెక్ సిటీ రూపుదిద్దుకుంది. దీన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. అదేవిధంగా 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ విమానాశ్రయం పనులను ప్రారంభించి కేవలం మూడేళ్లలో పూర్తిచేసి.. మార్చి 23, 2008న జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల రింగ్ రోడ్డును 2005లో ప్రారంభించి.. 2008 నాటికి దాదాపుగా పూర్తిచేశారు. ఇప్పుడు చెప్పండి హైదరాబాద్ నిర్మించిందెవరు? సోనియా గాంధీతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో వైఎస్ ఐటీ రంగానికి ఆద్యుడిని నేనే. ఐటీ రంగంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించా. వాస్తవం: ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003–04 నాటికి ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 85 వేలు మాత్రమే. నాటి ఐటీ ఎగుమతుల విలువ రూ.5,025 కోట్లే. మే 14, 2004న సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్ వంటి చిన్న పట్టణాలకు విస్తరించారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతోపాటు మైక్రోసాఫ్ట్ మూడో దశ, విప్రో రెండో దశ పనులు అప్పట్లోనే మొదలయ్యాయి. యూఎస్ కాన్సులేట్‌ను ఏర్పాటయ్యేలా చేశారు. అప్పట్లోనే రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో ఐటీఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుకు ఆమోదం లభించింది. వైఎస్ కషి వల్ల 2009 నాటికి ఐటీ రంగం ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 2.85 లక్షలకు చేరుకుంది. ఐటీ ఎగుమతులు 2004–05లో రూ.8,145 కోట్లకు, 2005–06లో రూ.12,521 కోట్లు, 2006–07లో రూ.18,582 కోట్లు, 2007–08లో రూ.26,122 కోట్లు, 2008–09లో రూ.32,509 కోట్లు, 2009–10లో రూ.33,482 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గణాంకాలు ఇలా ఉంటే... మరి ఇందులో ఎవరి ఘనత ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తున్న అప్పటి సీఎం నేదురుమల్లి (ఫైల్) పోలవరం ప్రాజెక్టు నా కల. ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా. వాస్తవం: తెలుగు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నం పోలవరం. 2004 వరకూ ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. మే 14, 2004న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అవసరమైన ‘సైట్ క్లియరెన్స్’ను సెప్టెంబరు 19, 2005న.. అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్ 25, 2005న.. అభయారణ్యం అనుమతిని జూలై 6, 2007న.. సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్ 17, 2007న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులను సాధించారు. రూ.10,151.04 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టారు. కుడి కాలువ పనులను 145 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. ఎడమ కాలువను 134 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. హెడ్ వర్క్స్(జలాశయం) పనులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే..పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. ఇందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతిని ఫిబ్రవరి 25, 2009న సాధించారు. 2009 నాటికే రూ.5135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. ఇది వాస్తవం. నిజంగా పోలవరం తన కలైతే 1995 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీలుగా కనీసం పరిపాలన అనుమతి ఇవ్వడానికి చంద్రబాబుకు ఎందుకు చేతులు రాలేదు. పోలవరం ఎవరి కలో చెప్పడానికి పై సాక్ష్యాలే నిదర్శనం. అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్సార్ సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుంటా.. అంతర్జాతీయ ప్రమాణాలతో తలదన్నే రాజధాని అమరావతిని నిర్మిస్తా. వాస్తవం: రాజధాని కోసం బహుళ పంటలు పండే 33వేల ఎకరాల భూమిని సమీకరించారు. ఇందులో 40 ఎకరాల్లో చదరపు అడుగుకు రూ.11వేల వంతున ఖర్చు చేసి.. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ, శాసన మండలి భవనాలను నిర్మించారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలు లీకేజీ కావడం వల్ల మడుగులను తలపించడం రివాజుగా మారింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రూ.39,875 కోట్లతో శాశ్వత సచివాలయం, శాసనసభ, మండలి భవనాలతోపాటు రహదారుల పనులకు టెండర్లు పిలిచారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, బీఎస్సార్ ఇన్ఫ్రా, ఎన్సీసీ కాంట్రాక్టు సంస్థలకు వాటిని సగటున 4.89 శాతం అధిక ధరలకు అప్పగించారు. ఆ నాలుగు సంస్థలకే ఈ పనులను హడావుడిగా అప్పగించేసి.. రూ.3,987.50కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చేయడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ఐదేళ్లు అధికారంలో కొనసాగి కూడా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నది వాస్తవం. రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నా. వీటిద్వారా 32,55,263 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించింది. పెట్టుబడులు తెస్తానంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశంలోనూ విదేశాల్లోనూ చేసుకున్న ఒప్పందాల(ఎంవోయూ) ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నాం అన్నారు. కానీ.. 2014 నుంచి ఇప్పటివరకూ కేవలం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.9,553 కోట్లు మాత్రమేనని డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్) ప్రకటించడం వాస్తవం కాదా!! ఇదీ రాజధాని ప్రాంత పరిస్థితి –సాక్షి, అమరావతి -
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సో‘నయా’ కలర్
ఏదైనా సాధించాలన్న పట్టుదల ఆమెకు ఎక్కువ. అందుకే ఇటలీలో పుట్టి పెరిగినా పట్టుబట్టి హిందీ నేర్చుకున్నారు. తనను మించిన వాళ్లెవరూ లేరన్న అహంభావం ఆమెది. అదే విదేశీ మూలాలు ప్రధాని పదవికి అడ్డంకిగా మారినా తెర వెనుక సూపర్ పీఎంగా ఎదిగారు. ఎవరైనా కాస్త ఎదిగితే ఓర్చుకోలేని తత్వం ఆమెది. ఆ లక్షణమే ఎంతోమంది సమర్థులైన నాయకుల్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆమె.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. రాజీవ్‌గాంధీ హత్యానంతరం కార్యకర్తలు ఎంత బతిమాలినా రాజకీయాల్లోకి రాకుండా ఆరేళ్ల పాటు ఇంటి పట్టునే ఉండిపోయారు. తనకిష్టమైనప్పుడే కార్యకర్తలను అనుగ్రహించి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలున్నాయి. భారత్‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీని అత్యంత సమర్థంగా నడిపించిన మహిళగా ఆమెది తిరుగులేని చరిత్ర. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నారు. పార్టీ పగ్గాల్ని యువరాజు రాహుల్‌కి అప్పగించి తాను నామమాత్రపు రాజకీయాలకే పరిమితమయ్యారు. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, శిశు సంక్షేమం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. సోనియా ఒక పుస్తకాల పురుగు. హిందీ రచయిత మున్షీప్రేమ్‌చంద్ నవలలకి ఆమె అభిమాని. రాజీవ్, రాజీవ్ వరల్డ్ అన్న పేరుతో రెండు పుస్తకాలు రాశారు. ఎంతో రుచిగా వంటలు చేస్తారు. ఐస్‌క్రీమ్, సలాడ్స్ ఇష్టంగా తింటారు. ఆరోగ్యంపై శ్రద్ధతో రోజూ యోగా చేస్తారు. ♦ ఇటలీలో 1946, డిసెంబర్ 9న రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించారు. తండ్రి స్టీఫెనో మైనో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా హిట్లర్ ఆర్మీ తరపున పోరాడారు. ♦ సోనియా చిన్నతనమంతా ఇటలీలో ఒర్బాసానో అనే చిన్న పట్టణంలోనే గడిచింది. ఇప్పటికీ సోనియా తల్లి, ఇద్దరు చెల్లెళ్లు అక్కడే ఉంటారు. ♦ ఫుట్‌బాల్ ఆటంటే ప్రాణమిస్తారు. చిన్నప్పుడు ఇరుగుపొరుగుతో కలిసి ఆడేవారు. ♦ 18 ఏళ్ల వయసులో లండన్‌లో కేంబ్రిడ్జిలో ఇంగ్లిష్ కోర్సు చేస్తున్న సమయంలో ఒక రెస్టారెంట్లో రాజీవ్‌గాంధీని తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్లలో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ♦ 1968 జనవరి 13న మొదటిసారిగా ఇందిరాగాంధీని కలుసుకోవడానికి భారత్‌కి వచ్చారు. ♦ రాజీవ్‌తో వివాహానికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే కొన్నాళ్లు ఉన్నారు. సోనియా మెహెందీ ఫంక్షన్ కూడా బచ్చన్ ఇంట్లోనే జరిగింది. ♦ 1968, ఫిబ్రవరి 25న రాజీవ్, సోనియా వివాహం జరిగింది. ♦ రాజీవ్‌తో వివాహం తర్వాత ట్యూటర్‌ను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకున్నారు. చేనేత చీరలు ధరిస్తూ అచ్చమైన భారతనారిగా మారిపోయారు. ♦ రాహుల్, ప్రియాంక పుట్టాక వారి తోటిదే లోకంగా గడిపారు. ♦ 1984లో ఇందిరాగాంధీ హత్యని కళ్లారా చూసిన ఆమె రాజీవ్‌ను రాజకీయ రొంపిలోకి దిగవద్దని ప్రా«ధేయపడ్డారు. రాజీవ్‌ను కూడా హత్య చేస్తారని భయపడ్డారు. సోనియా భయపడిందే జరిగింది. 1991లో తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ దారుణ హత్యకు గురయ్యారు. ♦ అత్తగారు, భర్తనూ కోల్పోవడంతో సోనియా మానసికంగా కుంగిపోయారు. రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు ఎంతగా మొరపెట్టుకున్నా ఆరేళ్లు ఇంటిపట్టునే ఉండిపోయారు. ♦ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్లకి తలొగ్గి 1997లో కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1998లో పార్టీ పగ్గాలు చేపట్టి అధ్యక్షురాలయ్యారు. ♦ 1999లో తొలిసారిగా యూపీలో అమేథీ, కర్ణాటకలో బళ్లారి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ నెగ్గారు. అదే ఏడాది లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆపై వరుసగా నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ♦ 2004లో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా సుష్మాస్వరాజ్, ఉమాభారతి వంటి బీజేపీ నేతలు ఆమె విదేశీ మూలాల్ని లేవనెత్తి సోనియా గద్దెనెక్కితే గుండు గీయించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఒక విదేశీ వనిత చేతుల్లో దేశాన్ని పెట్టాలా అంటూ భగ్గుమన్నారు. దీంతో సోనియా కాళ్ల దగ్గరకొచ్చిన ప్రధాని పదవిని కాదనుకొని మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమె త్యాగం చేశారని కీర్తించినా, ఆమె వ్యతిరేకులు యూపీఏ చైర్పర్సన్ హోదాలో సూపర్ పీఎంగా తెరవెనుక వ్యవహారాలు నడిపించే వారని నిందించారు. ♦ 2004లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపిన మహిళల ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల్లోనూ సోనియాగాంధీ నేతృత్వంలోనే పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ♦ 2011లో ఆమె తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు. ఆమెకు సోకిన వ్యాధిపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రతీ ఏడాది అమెరికా వెళ్లి చికిత్స పొందుతున్నారు. ♦ ఇక 2014లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అనంతరం అనారోగ్యం తీవ్రం కావడంతో రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగించారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌కి పెద్దదిక్కుగా మాత్రమే ఉన్నారు. -
బహుశా అది మరో రాష్ట్రపు మార్జాలమా?
కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు బాబుగారు. ఆయన అలా తిరగడానికి కారణం కూడా ఓ పిల్లి. పొద్దున్నే హెరిటేజ్ పాలను తెచ్చి, ఓ గిన్నెలో పోసి, డైనింగ్ టేబుల్ మీద ఉంచితే.. ఓ పిల్లి వచ్చి ఆ పాలన్నీ తాగేసిందట. కొంచెం కూడా మిగల్చకుండా మింగేసిందట. మామూలుగా అయితే పిల్లులన్నీ ఎలా వస్తాయ్? పిల్లుల్లా చప్పుడు చేయకుండా వస్తాయ్. కానీ ఈ పిల్లో? లోపలికి వచ్చే ముందర అది ‘మ్యావ్.. మ్యావ్’.. అందట. అంటే ఏమిటి? మొదట ‘మై ఆవూ‘‘.. మై ఆవూ‘‘’ అంటూ పర్మిషన్ అడిగింది. పైగా ‘ఛాయ్.. ఛాయ్... ఇష్షూ.. ఇష్షూ’ అంటూ తరిమేస్తున్నా మళ్లీ మళ్లీ ‘మై ఆవూ.. మై ఆవూ’ అందట. ఆల్రెడీ లోపలికొచ్చేశాక, పాలన్నీ తాగేశాక మళ్లీ ‘మై ఆవూ’ ఏమిటి? కడాన ఎవరి కోసరం ఈ ‘మై ఆవూ’ అంటూ పిల్లి వినయాలు? ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ వాడకం కాస్తంత తక్కువ కదా. మరి అది అలా ధారాళంగా ఉర్దూ మాట్లాడిందంటే దానర్థం ఏమిటి? ఒకవేళ అది తెలంగాణ పిల్లి కావచ్చా? కావచ్చు. బహుశా కేసీఆర్ ప్రేరేపిత తెలంగాణ పిల్లే కావచ్చది. ‘‘పొద్దున్నే యోగా చేసుకున్న తర్వాత హాయిగా గ్లాసు నిండా పాలు తాగి ప్రచారానికి బయల్దేరుదామనుకున్నా. ఇప్పుడది పాలన్నీ తాగేసింది. దాంతో పాలు తాగకుండానే ప్రచారానికి.. అలా ముందుకు పోవాల్సి వస్తోంది. అంటే ఇన్‌డైరెక్ట్‌గా నన్ను వీక్ చేయడానికి ప్రయత్నించింది. కావచ్చు. నా ప్రచారాన్ని సరిగా సాగకుండా చేసేందుకు, ఇలా ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌కు సాయం చేసేందుకు వచ్చిన పిల్లేనా? ఆలోచించగా ఆలోచించగా నాకు మరో విషయమూ తడుతోంది. ఒకవేళ పిల్లి మాట్లాడింది ఉర్దూ కాదనుకుందాం. హిందీ అనుకుందాం. అంటే.. ఈ కుట్రలో బహుశా మోడీ పాత్ర కూడా ఉండే ఉండొచ్చు. పిల్లిది మాటల్లో కొంచెం నార్తిండియా గుజరాతీ యాస కూడా కనిపించనట్టయ్యింది’’ అని అనుకున్నారు బాబుగారు. వెంటనే తానేమన్నా సరే తానా తందానా అనే ఓ బ్యాచిని పిలిపించారు బాబుగారు. తన ఆలోచనలన్నీ చెప్పారు. ‘‘కాదండి. ఆవేదన ఉండదా అండీ. పొద్దున్నే పాలు తాగి ప్రచారానికి వెళ్దామనుకుంటే.. తగినంత ఎనర్జీ లేకుండా జగన్ కోసం ఇలా పక్క రాష్ట్రమాయనా, కేంద్రప్రభుత్వమాయనా ఇలా కుట్ర చేస్తే రక్తం మరగదా అండీ’’ అంటూ వాపోయారు బాబుగారు. ‘‘సార్.. ఇప్పటివరకూ మనం చేసిన ప్రతి పాపాన్నీ పాపం జగన్‌కే అంటగడుతూ వస్తున్నాం. అవన్నీ చేయడం ఆయనకే నష్టం కదా అనే లాజిక్‌ను కూడా ప్రజలకు తట్టనివ్వకుండా ఊదరగొడుతూ వస్తున్నాం. ఇప్పుడు పిల్లి చేసిన పనికీ ఆయననే బాధ్యుడిని చేస్తే కుదరదేమో సార్’’ అన్నారు తైనాతీ బ్యాచి. ‘‘ఎందుక్కుదరదూ? ఇప్పటివరకూ సక్సెస్‌ఫుల్‌గా జరగలేదా? అలాంటప్పుడు ఇప్పుడేమిటి అభ్యంతరం?’’ అడిగారు బాబుగారు. ‘‘మొన్నటి వరకూ ఏదో ఓ సాకు పెట్టుకుని జగన్ దగ్గర్నుంచి మన దగ్గరికి వచ్చినవాళ్లంతా ఇప్పుడు అక్కడికి చేరి.. మనను విశ్వసించడం తప్పనీ, జగనే విశ్వసనీయతకు మారుపేరనీ అంటున్నారు’’ వినయంగా చెప్పారు. ‘‘సీటు దక్కనివాళ్లు అలా ప్రచారం చేస్తున్నారని టముకేయండి’’ అసహనంగా అరిచారు బాబుగారు. ‘‘కానీ మనం తప్పక టికెట్టు, సీటూ ఇస్తామన్నా కూడా వారు లగెత్తి అదే పోకడ పోతున్నారు సార్’’ ‘‘కాదండి.. ఆవేదన ఉండదాండీ.. సీట్ ఇస్తామన్నా కూడా అలా పారిపోతుంటే రక్తం మరగదా అండీ’’ అంటూ మరోమారు గొణుక్కుంటూ కొత్త ఎత్తుగడ ఏమేద్దామా, మనం చేసిన పాపాల్ని ప్రత్యర్థి మెడలో ఎలా వేద్దామా అంటూ సాలోచనగా ఉండిపోయారు బాబుగారు. – యాసీన్ -
భలే తెలివితేటలు.. బాగుపడతాడులే!
‘‘సోంబాబు గురించి నువ్వేమీ దిగులు పడకు. నువ్వు చెబుతోంది వింటుంటే వాడు తప్పక బాగుపడతాడనిపిస్తోంది. కాలం కలిసొస్తే.. పెద్ద నాయకుడు కూడా అవుతాడనిపిస్తోంది’’ అంటూ సోంబాబు వాళ్ల అమ్మను ఓదార్చాడు మా రాంబాబు. ‘‘ఇంతకీ ఏం చేశాడటరా మీ సోంబాబు గాడు. వాళ్ల అమ్మ అంతగా బాధపడుతోంది’’ అడిగాన్నేను. ‘‘ఏం లేదురా. ఏదో వాళ్ల సంప్రదాయం ప్రకారం ఏడాదికోనాడు వాళ్ల తాతగారి ఫొటో ముందు కనీసం 21కు తగ్గకుండా కొబ్బరికాయలు కొట్టాలట. ఈ ఏడాది కూడా అలాగే చెయ్యమని టెంకాయలు తీసుకురమ్మని డబ్బులిచ్చిందట. అలాగేనంటూ మనవాడు ఆ డబ్బులూ... తన తాతగారి ఫొటో తీసుకొని చక్కగా బయటికెళ్లిపోయాట్ట. ఆ ఫొటోను గుడిమెట్ల దగ్గర అందరూ టెంకాయలు కొట్టేచోట అలా కనపడీ కనపడనివ్వకుండా పెట్టేశాట్ట. బోల్డంత మంది దాదాపు ఓ 50 కాయలకు పైగా కొట్టాక... వాటిని ఏరుకొచ్చి మరీ సాక్ష్యంగా చూపించి, అమ్మ ఇచ్చిన డబ్బులు మిగుల్చుకున్నాట్ట. అక్కడితో ఆగకుండా ‘తాతగారి ఫొటో ఎదురుగా కోళ్లేమైనా కోయించాలా చెప్పు. అలా చికెన్ సెంటర్‌కు తీసుకెళ్లి.. ఓ పదో ఇరవయ్యో కోళ్లు కూడా కోయించి తీసుకొస్తా’ అన్నాట్ట. వీడి తెలివితేటలు చూసి వాళ్లమ్మ ఒకటే బాధపడుతోంది. ‘‘మరి నువ్వేమని ఓదార్చావు?’’ ‘‘తనను తాను మహానాయకమన్యుడనుకునే ఓ సీఎమ్ ఉన్నాడు. ఆయన హైదరాబాద్ తానే కట్టానంటాడు. కానీ దాన్ని కులీకుతుబ్‌షా 1591 కట్టడం మొదలుపెట్టాడు. దాని వయసేవో దాదాపు 430 ఏళ్లు. ఈయనమో ఈ తరం వ్యక్తి. పైగా ఇక్కడ సీఎమ్‌గా ఉన్నది తొమ్మిదేళ్ల చిల్లర మాత్రమే. హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాలు ఒక్కొక్కటీ... రెండ్రెండూ. మూడుమూడు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అందరికీ తెలిసిన అసలుదీ, మెయిన్ ట్యాంక్‌బండ్ ఒకటుండగా... సరూర్‌నగర్ చెరువుకట్ట దగ్గర ఒకటీ, సఫిల్‌గూడ గేట్ దాటగానే మరోటీ ఇలా రెండు మినీ ట్యాంక్బండ్లు ఉన్నాయి. మ్యూజియాల మాటకొస్తే... సాలార్జంగ్ అని ఒకటీ, స్టేట్ మ్యూజియమ్ అని మరొకటీ గాక... బిర్లా మ్యూజియం లాంటి పెద్దా చిన్నా, చిల్లరమల్లరవి చాలానే ఉన్నాయి. ఆఖరికి శ్మశానాలను ఉదాహరణగా తీసుకున్నా... కుతుబ్‌షాహీ టూంబ్స్ అనీ, సయిదానిమా సమాధులనీ... ఇలా చారిత్రక రాతికట్టడాలతో ఉన్నవి ఎస్సార్‌నగర్ లాంటివి కలుపుకుంటే బోలెడున్నాయి. సదరు సీఎమ్గారు మహాఅయితే... ఒక్క సైబర్‌టవర్స్‌ను కట్టాడమో. అది కూడా ఎవరో జమానాలో నిర్ణయం తీసుకుంటే ఈయన పూర్తిచేశాడు’’ అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మా రాంబాబుగాడు. ‘‘ఇంతకీ సోంబాబు వాళ్లమ్మను నువ్వెలా సముదాయించావో చెప్పరా అంటే అందరికీ తెలిసిన ఈ సోదెందుకు చెబుతున్నావ్?’’ అడిగా. ‘‘అక్కడికే వస్తున్నా.. హైదరాబాద్ ఒక్కొక్కలాంటివే డబుల్సూ, త్రిబుల్సూ ఉన్నాయా. దానికి భిన్నంగా... తన సొంత రాజధానిలో... అందునా ఐదేళ్లు పూర్తిగా పూర్తయ్యాక కూడా తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టూ... అంటూ ఒకటి తాత్కాలికం... మరొకటి శాశ్వతం అంటూ రెండ్రెండుసార్లు వృథాగా కడుతున్నాడు. అదికూడా చిన్నపాటి వర్షమొస్తే కారిపోయేలా, మొత్తం బురదమయం అయ్యేలా. ఇంకెవరో కట్టిన ఊరిని తానే కట్టానని సదరు సీఎమ్ అన్నట్టుగానే... ఎవరో కొట్టిన కొబ్బరికాయలు... పైగా నువ్వు 21 అడిగితే వాడు 50 దాకా కొట్టించి పట్టుకొచ్చాడు కదా. ఇంత ప్రయోజకుడి కోసం నువ్వు బాధపడటం ఎందుకు? ఏనాటికైనా అంతటివాడవుతాడులే అని ఓదార్చా’’ అన్నాడు. ‘‘మరి ఆమె నీ మాటలతో సమాధనపడిందా?’’ ‘‘మొదట ఒప్పుకోలేదుగానీ.. మనవాడి పేరులో.. సోముడంటే చంద్రుడనీ.. దానికి బాబు కలిపాక వచ్చేది కూడా ఆ నాయకుడి పేరేనని.. యాదృచ్ఛికంగా ఇలా పేర్లు కలిసినట్టే – అదృష్టాలు కూడా అలా కలిసొస్తాయేమోలే అన్నా. అంతే... దిగులు పడటం మానేసి, తేటపడింది’’– యాసీన్ -
ఏమిటీ.. ఈ రెండు డైలాగులకే?
‘‘ఏదీ.. కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకో’’ టీవీ స్క్రీన్ మీద చిరంజీవి సినిమాలోని ఈ డైలాగ్ వినీవినగానే యోగా చేసుకుంటున్న బాబుగారు ఉలిక్కిపడ్డారు. ‘‘ఎవడ్రా ఈ డైలాగున్న సినిమా పెట్టింది. తీసిపారేయండి’’ అంటూ కోప్పడ్డారు అయ్యగారు. ‘‘సార్.. అది ‘రిటర్న్’ కాదు సార్. ‘టర్నింగ్’ ఇచ్చుకో అన్న మాట సార్’’ అంటూ పనివాళ్లు ఏదో సర్దిచెప్పబోయారు. అయినా ఇంకా ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోతుండటంతో ‘తీసేస్తాం సార్...’ తీసేస్తాం సార్’ అంటూ టీవీ ఆపేశారు. అయ్యగారు అంతగా చేస్తున్న యోగా కూడా ఆయన యాంగర్ మేనేజ్మెంట్కు ఏమీ ఉపయోగపడకపోవడం చూసి ఆశ్చర్యపడుతున్నారు వారు. ‘‘ఈ డిజైన్లేమీ నచ్చలేదు.. అన్నీ ‘రిటర్న్’ చేసేయండి’’ నౌకర్లను ఆదేశిస్తున్నారు అమ్మగారు. ఆ మాట ఆమె నోట అలా వచ్చిందో లేదో... ‘‘ఎవర్రా అక్కడ? ఏదో అనకూడని మాట అంటున్నారు’’ అంటూ రంకెలేశారు అయ్యగారు. ‘‘అమ్మగారేలెండి. చీరలేవో కొత్త డిజైన్లు వచ్చాయంటే ‘కంగనా కజిన్స్’ నుంచి తెప్పించారు. నచ్చలేదట.. వాళ్లవి వాళ్లకు ‘రిటర్న్’ ఇచ్చేయమంటున్నారు’’ అంటూ నిశ్చింతగా చెప్పారు నౌకర్లు. ఆ మాట అన్నది అమ్మగారు కావడమే వాళ్ల నిశ్చింత. ‘‘వద్దంటే మళ్లీ అదే మాట’’ అంటూ కూకలేశారు బాబుగారు. ప్రచారానికి బయటకు వెళ్లబోతుంటే ‘‘సాయంత్రానికల్లా రిటర్న్ అవుతారా?’’ అసలు విషయం మరచిపోయి మళ్లీ ఆ మాట అననే అన్నారు అమ్మగారు. అమ్మగార్ని ఏమీ అనలేక ‘‘హు’’ అంటూ బలంగా ఒక హూంకరింపు, నిస్సహాయంగా ఒక నిట్టూర్పు విడిచారాయన. ప్రచారం కోసం కార్లో బయటకు వెళ్తుండగా రోడ్డు మీద ఎవరో కుర్రాడి బైక్ వెనకాల ‘డాడ్స్ గిఫ్ట్’ అనే మాట కనిపించింది. వాహనం ఇలా మళ్లీ ఓ మలుపు తిరిగిందో లేదో మరో కారు వెనకాల ‘మామ్స్ గిఫ్ట్’ అనే మాట ఉంది. ‘‘అన్నట్టు... ఈ బైకుల మీద... కార్ల మీద ఫలానా వారి గిఫ్ట్ అని రాసుకుంటూ ఉంటారు కదా. అలా రాయకూడదంటూ ఓ ఆర్డర్ ఇచ్చేద్దామా?’’ అడిగారు బాబుగారు సెక్రటరీని. ‘‘అలా కుదరదేమో సార్’’ నసిగాడు సెక్రటరీ. ‘‘ఎందుక్కుదరదు? అప్పట్లో ఆటోలన్నింటి వెనకాలా ‘‘థ్యాంక్యూ సీఎం సార్’’ అంటూ మనకు మనమే సార్ అని పిలుచుకుని, మనకు మనమే థ్యాంక్యూ అనీ చెప్పుకోలేదా?’’ మళ్లీ సెక్రటరీని గసిరారు. ‘‘ఏమిటిది? రిటర్న్ అన్న మాట వినబడ్డా, గిఫ్ట్ అన్న పదం కనబడ్డా సార్ అలా చిందులేస్తున్నారు?’’ అడిగాడు బంట్రోతు పక్కనే ఉన్న డ్రైవర్ని. ‘‘ఏమోరా.. ఆ పక్క రాష్ట్రం ఆయన అప్పుడెప్పుడో ‘‘రిటర్న్ గిఫ్ట్’ అన్న దగ్గర్నుంచీ ఇదే వరస. ఈ రాష్ట్రం నేతలు కూడా ‘యూ టర్న్’ అన్న దగ్గర్నుంచీకూడా. అప్పట్నుంచి... ‘టర్న్’... ‘రిటర్న్’... ‘టర్నింగ్’... అనే మాట వింటే చాలు అదే ధోరణి. ఇప్పుడాయనకు ఇంగ్లిష్ భాషలో నచ్చనివి రెండే రెండు పదాలు’’ కారణాలు వివరిస్తూ చెప్పాడు డ్రైవర్. ‘‘ఏమిటవి...?’’ ‘‘మొదటిది ‘రిటర్న్!’... రెండోది ‘గిఫ్ట్!!’’ – యాసీన్ -
ఎన్నికలు ముగిశాక.. అప్పుడిక మనం మొదలుపెడదాం
సాక్షి, అమరావతి :‘‘ఆహా.. మన ఎలక్షన్లు మొదటివిడతే అయిపోవడం ఎంత లాభం తెలుసా?’’ అన్నాను నేను. ‘‘ఏం లాభం.. ఎవరికి లాభం?’’ కాస్త ఘాటుగానే అడిగాడు మా రాంబాబు గాడు. ‘‘అందరికీ’’ అన్నాను. ‘‘ఎలా?’’ మళ్లీ రెట్టించాడు. ‘‘ఎన్నికలు నెల రోజుల్లోనే అయిపోయాయనుకో.. ఇప్పటికి దాదాపు నాలుగు వారాలే టైమ్ ఉంది కాబట్టి.. సరిగ్గా ఏ 28 రోజులో బయట తిరిగితే చాలు. చూశావా ఎండలు ఎలా ఉన్నాయో? అదే మన షెడ్యూలు ఏ మే నెలలోనో ఉందనుకో.. అప్పుడు రెండు నెలల పాటు ఇటు నాయకులూ, అటు కార్యకర్తలూ అందరూ ఎండల్లో పొద్దస్తమానం తిరగలేక చచ్చేవారు. ఇక పార్టీల అధినేతలైతే అంతంత కాలం పాటు గొంతులు చించుకుంటూ ఉపన్యాసాలివ్వలేక బాధపడేవారు. వాళ్లకు.. నెల రోజుల్లో పెట్టాల్సిన ఖర్చులు రెణ్ణెల్ల పాటు పెట్టాల్సి వస్తే.. అది ఏ డబులో త్రిబులో అవుతుంది కదా. డబ్బు కోట్లలో వేస్టవుతుంది.. ఆలోచించు’’ అన్నాను. ‘‘ఒరే పిచ్చి సన్నాసీ! ఎంతసేపూ నాయకుల కోణం నుంచి, వాళ్లకయ్యే ఖర్చుల కోణం నుంచి చూస్తావుగానీ.. కాసేపు అట్టడుగున ఉండే తాడిత పీడత జనాల వైపు నుంచి ఆలోచించవేమిట్రా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎన్నికలు లేటుగా ఏ మే నెలలోనో జరిగితే వాళ్లకొచ్చే లాభం ఏమిటి?’’ అడిగాన్నేను. ‘‘అమాయకుడా.. నువ్వు చెబుతున్న అణగారిన వర్గాల వారినే నాయకులు తమ వెంటేసుకుని ప్రచారాలకు తిప్పుతుంటారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగు నిండుగా ఉండాలని.. చాలామందికి డబ్బులిచ్చి పిలిపించుకుంటుంటారు. ఇంత అర్లీగా ఎన్నికలు ముగిసిపోవడం అంటే అలాంటి వాళ్లందరి ఉపాధికీ గండి కొట్టినట్టేనని గ్రహించవేమిరా?’’ ‘‘నాకు అర్థం కాలేదు’’ అన్నాను. ‘‘పిచ్చివాడా.. ఇప్పుడు నేతాశ్రీల వెంట వచ్చే కార్యకర్తలందరికీ పొద్దున్నే టిఫినూ, మధ్యానం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్.. రాత్రికి మళ్లీ కోడిపలావ్ విత్ మందూ.. ఇవన్నీ జస్ట్ 28 రోజులే. అదే రెండు నెలల గడువుందనుకో.. పాపం.. వాళ్లందరికీ రెండు నెలల పాటు విందే విందు.. మందే మందు’’ ‘‘పోన్లే.. పాపం. కనీసం రెండు నెలలు తాగే ఆ చీప్ లిక్కర్ ఒక నెలే తాగుతారంటే ఆ మేరకు వాళ్ల హెల్త్ బాగుపడ్డట్టేగా’’ అన్నాను నేను. ‘‘బాగుపడేది వాళ్లు కాదురా.. ఎన్నికలు మేలో జరిగితే కనీసం ఓటర్ల పంపకాలు రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరిగేవి. ఇప్పుడు కార్యకర్తలతో పాటు వాళ్లను బుజ్జగించాల్సిన సమయమూ కొద్దిగానే ఉంది.. ఓటరు దేవుళ్లంటూ వాళ్లను మునగచెట్లు ఎక్కించే వ్యవధీ తగ్గిపోయింది. కానీ బాగుపడేదెవరంటావా.. ఇక ఎలక్షన్ అయిన మర్నాటి నుంచి ఫలానా వారి సర్వే అనీ, ఫలానా వారి అంచనా అంటూ సెఫాలజిస్టులనే రాజకీయ జాతకాలు చెప్పేవాళ్లు టీవీల్లో కూర్చొని అదేపనిగా ఊదరగొట్టేస్తుంటారు. ఒక్కొక్కరి అంచనా ఒకలా ఉంటుంది. తమకు అనుకూలమైన అంచనాను పట్టుకొని ఒక పార్టీ వారు.. దాన్ని ఖండిస్తూ ఎదుటిపార్టీ వాళ్లూ టీవీ చర్చల్లో గొంతులూ.. బట్టలూ చించుకుంటుంటారు. వాళ్ల వాదనలు వింటూ బెట్టింగ్ రాయుళ్లు.. నెల రోజుల పాటు కాయాల్సినంత కాస్తూ నష్టపోతారు. ఏతావాతా బాగుపడేదెవరంటే.. ’’ నా మొహాన సుదీర్ఘంగా ఉపన్యాసమొకటి పడేస్తూ కాస్త గాలి పీల్చుకోడానికి ఆగాడు. ‘‘ఎవర్రా’’ సస్పెన్స్ పట్టలేక అడిగేశా. ‘‘ఇంకెవరూ.. చెత్త చర్చలతో తమ టీఆర్పీలు, జనాల బీపీలు పెంచే ఓ వర్గం టీవీ వాళ్లు’’ అంటూ అసలు విషయం కూల్‌గా చెప్పాడు మా రాంబాబుగాడు. -
వాటే మీటర్స్ యార్!
అప్పట్లో ప్రతి ఇంటికి ఉంటేగింటేకరెంటు మీటర్ అనేదొక్కటే ఉండేది.అది కూడా ముక్కీ మూలిగీ నడిచేది. పొరుగింటి వాళ్ల కంటే ఒకవేళ మన ఇంటి కరెంటు మీటరు గబగబా తిరుగుతుందనుకోండి. అలా తిరగడంలో అది అతిచురుగ్గా ఉందనుకోండి. అప్పుడు దాని దూకుడు చూసి మనం ఏడ్చి చచ్చేవాళ్లం. దీనికిదేం పోయే కాలం వచ్చిందో.. అలా వేగంగా తిరిగి చస్తోందని ఆడిపోసుకునేవాళ్లం. కానీ ఆ స్వర్ణయుగం కాస్తా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడంతా కాలమంతా టెక్నాలజీదే. మీరొక మాడ్రన్ వాచీలాంటిది పెట్టుకున్నారనుకోండి. అదెన్నో విషయాలు చెబుతుంటుంది. ఇవ్వాళ మీరెన్ని క్యాలరీలు తిన్నారు? తిన్నదరిగి చావాలంటే.. నడిస్తే ఎన్ని అడుగులు వేయాలి? ఒకవేళ గెంతితే ఎన్ని గెంతులు? పరుగెత్తితే ఎన్ని అంగలు?ఇలా నడకోమీటరూ, పరుగోమీటరూ, గెంతోమీటరు.. అన్నీ మీ వాచీలోనే ఉంటాయి. అన్నట్టు.. అది మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోందో కూడా చెబుతుంది. రాత్రి మీకెంత నిద్ర పట్టిందీ.. ఒకవేళ ఆ నిద్రలో ఏమైనా కొరత ఏర్పడితే ఇవ్వాళ ఎన్ని గంటలు నిద్రపోవాలి లాంటి విషయాలన్నీ చెప్పేసి, వాటిని అక్షరాలా అమలు జరిపే మెకానికల్ డివైజ్‌ల కాలం వచ్చేసింది. పైగా ఇప్పుడు ఆరోగ్యస్పృహ విపరీతంగా పెరిగిపోవడంతో చేతికి వేసుకునే ఆ మోడ్రన్ బ్యాండ్ లాంటి గడియారాలకు తెగ గిరాకీ పెరిగిపోయింది. అందరూ తలో వాచీ పెట్టేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మా రాంబాబుగాడు ఈ ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించడం నేను గమనించాను. ‘‘అయినా నీకింత మెకానికాలిటీ నచ్చదు కదరా. మరి ఎందుకీ గాడ్జెట్లను ఇంతగా పరిశీలిస్తున్నావ్?’’ ఉండబట్టలేక అడిగా. ‘‘ఈ తరహాలోనే మనం గనక కొన్ని కొత్త కొత్త గాడ్జెట్లు కనిపెట్టామనుకోరా. అప్పుడు వాటికి తెగ గిరాకీ ఉంటుంది. మనం కనిపెట్టిన వాటిని ఒక్క పార్టీ కొనేసినా చాలు.. మనం కోటీశ్వరులమైపోవడం గ్యారెంటీ’’ అన్నాడు వాడు. ‘‘వీటిల్లోంచి కొత్తగా ఏం కనిపెడతావ్రా నువ్వు?’’ ‘‘సపోజ్... ఫర్సపోజ్.. అచ్చం సెల్‌ఫోన్‌లాగే ఉండేలా మనం ‘అభిప్రాయోమీటర్’ అనేది కనిపెడదాం. అప్పుడు దాన్ని ఆపరేట్ చేయగానే ఎదుటివాడు ఏ పార్టీని అభిమానిస్తున్నాడు, వచ్చే ఎన్నికల్లో వాడు ఎవరిని సమర్థిస్తాడనే వాడి అభిప్రాయాలు మనకు తెలిసిపోతాయన్నమాట’’ చెప్పాడు రాంబాబు గాడు. ‘‘ఒరేయ్ నీ బుర్ర సామాన్యం కాదురా’’ అంటూ కితాబిచ్చేలోపే మళ్లీ చెలరేగిపోయాడు వాడు. ‘‘అప్పుడే పొగడకు. ఇదేగాక మళ్లీ ఇంకో డివైజ్ కూడా డెవలప్ చేస్తాం. దానిపేరే చేంజోమీటర్. ఇది వాడగానే ఎదుటాడి అభిప్రాయం టక్కున మారిపోతుంది. వాడు కాస్తా ఇలా మన వైపునకు వచ్చేస్తాడు. మనకే ఓటేసేస్తాడు. ఇక చూడ్రా. సింపుల్‌గా ఇలాంటి రెండు పరికరాలను తయారు చేస్తే చాలు. ఇక్కడ మన రాష్ట్రాల్లోనూ, మన దేశంలోని పార్టీలే కాదు.. అమెరికాలోని రిపబ్లికన్లూ, డెమోక్రాట్లు మొదలుకుని ప్రపంచంలోని అందరూ మన గాడ్జెట్లే కొనుక్కుంటార్రా. అప్పుడు మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. మొదట.. వాడు చెప్పిందేదో బాగానే ఉన్నట్టు అనిపించిందిగానీ, ఆలోచించగా ఆలోచించగా ఇక్కడేదో తిరకాసున్నట్టు నాకు అనిపించింది. ‘‘అవున్రా.. అంతా బాగానే ఉందిగానీ ఇక్కడో సమస్య ఉంది. ఈ మీటర్లనీ ఏదో ఒక్క పార్టీ దగ్గరే ఉంటే వీటితో ప్రయోజనం గానీ.. మన పార్టీ దగ్గరా ఇవే ఉండి, మళ్లీ ఎదుటాడిదగ్గరా ఇవే ఉంటే.. అప్పుడందరూ వాటిని ఎదుటాడిమీద యధేచ్ఛగా ప్రయోగిస్తూ ఉంటే ప్రయోజనమేముంటుందిరా. మళ్లీ అంతా నార్మల్‌గానే నలిఫై అయిపోతుంది కదా?!.. అంటే ఒకదాన్నొకటి రద్దు చేసేసుకుంటాయి కదా’’ ‘‘ఛీ నువ్వో అపశకున పక్షివి. ఆలోచనల్లో కూడా అనుక్షణం అడ్డుపడటమే. కనీసం కాన్సెప్టులను కూడా డెవలప్ కానివ్వవు. కొనేవాడు కొంటాడు... లేకపోతే లేదు. ఈ లాజిక్‌లన్నీ నీకెందుకోయ్ ’’ అంటూ నన్నాడిపోసుకున్నాడు వాడు. –యాసీన్ -
వాటే పరిష్కారం గురూ!
ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇక పార్టీ టిక్కెట్లు ఆశించేవారి వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ఈ ఆశావహుల్ని సంతృప్తిపరచలేక పార్టీ అధినేతల తల నుంచి ప్రాణం తోకలకు వచ్చేస్తుంటుంది. వాస్తవానికి అధినేతలు పార్టీ టిక్కెట్లను కేటాయించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. తమ తోకలోని ప్రాణాలతో పాటు కంటే ఆశావహుల తోకలనూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఎందుకంటే.. ఒకవేళ ఎవడైనా బలమైన ఆశావహుడికి టిక్కెట్ దక్కలేదనుకో.. వాడు తోక ఝాడించేస్తాడు. వెంటనే హైజంపూ, లాంగ్జంపూ ఏకకాలంలో చేస్తాడు. అలా ఎగిరిన మనవాడి అంగ పడేది ప్రత్యర్థి శిబిరంలోనే. అందుకే ఇలాంటి వాళ్లను బుజ్జగించలేక అధినేతల ప్రాణం మళ్లీ తలల నుంచి తోకలకు వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ ఒక ప్రాణం తోకలోకి వచ్చాక మళ్లీ మరో ప్రాణం ఎలా వస్తుందని అడక్కూడదు. మనలాంటి సాదాసీదా మనుషులకు ఇలాంటి సందేహాలు వస్తాయనే... ప్రాణాల సంఖ్య ఐదనీ, వాటిని పంచప్రాణాలనీ అంటారని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు. టిక్కెట్టు ఆశించే పెద్దలంతా చిన్నపిల్లల్లా అలుగుతారు కదా. అప్పుడు అధినేతలు పెద్దవాళ్లలా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్లు చేసే పనులన్నీ చేసేస్తుంటారు. ‘‘మా బుజ్జికదూ.. మా చిన్ని కదూ.. ఆఫ్ట్రాల్ ఈ టిక్కెట్టులో ఏముంది. చూస్తూ ఉండు. నిన్ను ఇంతకంటే ‘పెద్ద’సభకు పంపిస్తా’’ అంటూ బుజ్జగిస్తుంటారు. ఇలా ఈ సీజన్లో అధినేతలంతా జోలపాడటం, ఆశపెట్టడం, దువ్వుతూ ఉండటం లాంటి పనులతోనూ బిజీగా ఉంటారు. ఇలా ఈ సీజన్లో మేం రాజకీయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అధినేతల మీద బోల్డంత జాలిపడుతూ ఇదే విషయాన్ని మా రాంబాబు గాడికి చెప్పా. ‘‘ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. పాపం అధినేతలందరి ఉమ్మడి సమస్యరా ఇది. ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ టిక్కెట్లు ఎలా పంచుకొస్తారో చూడాలి’’ అన్నాన్నేను. ‘‘ఇది అధినేతలందరికీ ఉన్న సమస్యే అయితే దీనికి పరిష్కారం చాలా ఈజీరా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘చాలా పార్టీలకు సీట్లు తగ్గేది ఈ సమస్యతోనే. ఎవడో అసంతృప్త నేత ఇండిపెండెంటుగా పోటీ చేస్తాడు. అసలు అభ్యర్థి గెలుపునకు గండి కొడతాడు. అంత ఈజీ అంటున్నావ్. ఎలాగో చెప్పు?’’ నేనడిగా. ‘‘సింపుల్‌రా... ఎంతమంది టిక్కెట్ ఆశిస్తున్నారో ఆ అందరికీ టిక్కెట్లు ఇచ్చేయాలి. అంటే సదరు పార్టీ గుర్తుపై ఈ ఆశావహులంతా ఉమ్మడిగా పోటీ చేస్తారన్నమాట. ప్రతి పార్టీ కూడా ఇలా ఎంత మంది ఆశిస్తున్నారో అంతమందికీ ఇచ్చేయాలి. మనమెలాగూ ఓటేసేటప్పుడు పార్టీ గుర్తుకు ఓటేయడంతో పాటు... అభ్యర్థికీ ఓటెయ్యాలన్నమాట. ఇలా ఏ పార్టీకి ఎక్కువ ఓట్లొస్తాయో... ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచినట్టు. అలాగే ఒకే పార్టీ నుంచి చాలామంది ఆశావహులు నిలబడ్డారు కదా. వాళ్లందరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాడే అసలైన పార్టీ అభ్యర్థి అన్నమాట. చూడు. ఇలా ఎంతమందినైనా సంతృప్తిపరచవచ్చు. చూశావా! మనసుండాలే గానీ మార్గం ఉంటుంది’’ అన్నాడు వాడు. అధినేతలకే సంక్లిష్టమైన సమస్యకు వాడింత సింపుల్‌గా పరిష్కారం చెప్పడంతో వాడి (అతి)తెలివితేటలకు నోరెళ్లబెట్టి చూస్తూ... ‘‘నువ్వు చెప్పిన ప్రకారం టిక్కెట్లిస్తే... ఆ బ్యాలెట్ పేపర్ తయారు చేయడానికి పేపర్ పరిశ్రమలన్నీ సరిపోవురా. అలాగ్గనక ఇస్తే నియోజకవర్గం నియోజకవర్గమంతా పోటీ చేసేస్తుంది. తెల్సా...’’ అంటూ కూకలేశాను. -
పికప్ మీటింగ్..
బోర్డు మీటింగ్ మొదలైంది. మీటింగ్‌లో ‘ఈ’ పేపర్ ఓనరు ఉన్నాడు. ‘ఆ’ పేపర్ ఓనరూ ఉన్నాడు. ఏ పేపరుకు ఆ బోర్డు మీటింగు ఉండాలి కానీ, జగన్ మీద ఏమైనా రాయాలనుకున్నప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి ఒకే బోర్డు మీటింగు పెట్టుకుంటారు. ఒక మైండ్‌కి, ఒకటికన్నా ఎక్కువ మైండ్స్ కలిస్తే క్రియేట్ అయ్యే ‘క్రియేటివ్ మైండ్’కి తేడా ఉంటుందని వాళ్ల నమ్మకం. ‘మూడో మైండ్ ఏదీ’ అన్నాడు ‘ఈ’ పేపర్ ఓనరు. ‘దారిలో ఉన్నట్లున్నాడు’ అన్నాడు ‘ఆ’ పేపరు ఓనరు. మీటింగులో రెండు పేపర్ల సర్క్యులేషన్ మేనేజర్లు కూడా ఉన్నారు! ‘‘నేరాల్లో జగన్ జెంత్రీ.. అదిరిపోయింది కదా ఈరోజు మన హెడ్లైన్. జగత్‌కి బదులు జగన్ అని పెట్టాం. జగన్‌కి రెడ్ కలర్ ఇచ్చాం’’ అన్నాడు ‘ఈ’ పేపర్ ఓనరు. ‘‘అవునవును. కొంచెం మార్చి మేమూ అదే పెట్టాం. జగన్‌కి ఓటేస్తే మరణ శాసనమే అని పెట్టాం’’ అన్నాడు ‘ఆ’ పేపర్ ఓనర్. ఎవరో గుర్రున చూసినట్లనిపించింది ‘ఈ’పేపర్ ఓనరుకి. ‘‘ఎవరు గుర్రున చూసింది?’’ అని అడిగాడు. ‘ఈ’ పేపర్ సర్క్యులేషన్ మేనేజర్ లేచాడు! ‘‘పొద్దుట్నుంచీ రీడర్స్ నుంచి ఒకటే ఫోన్లు’’ అన్నాడు ఈ.స.మే.. చేతులు నలుపుకుంటూ. ‘ఏంటటా’ అన్నట్లు చూశాడు ‘ఈ’ ఓనరు. ‘‘నీయబ్బ రేయ్’’ అని తిడుతున్నారు అన్నాడు ఈ.స.మే. ‘‘అరే! మాకూ అలాగే ఫోన్లు వస్తున్నాయి’’ అన్నాడు ‘ఆ’ పేపర్ సర్క్యులేషన్ మేనేజర్ లేచి. ‘‘ఎలాగా.. నీయబ్బ రేయ్ అనేనా’’ అన్నాడు ఈ.స.మే.. ఆ.స.మే. వైపు ఆసక్తిగా చూస్తూ. ‘‘కాదు.. ‘నీ యబ్బ రేయ్’ అని కాదు, ‘రేయ్ నీ యబ్బా’ అని వస్తున్నాయి’’ అన్నాడు ఆ.స.మే. ‘‘ఎందుకటా’’ అడిగారు ‘ఈ’ ఓనరు, ‘ఆ’ ఓనరు. ‘‘2014 మార్చి దిన పత్రికల్నే మళ్లీ ఇప్పుడెందుకు వేస్తున్నారు బే’’ అని రీడర్స్ అడుగుతున్నారు సార్’’ అన్నాడు ఈ.స.మే. ‘‘మమ్మల్నీ అలాగే అడుగుతున్నారు.. ఎందుకు బే 2014 మార్చి దినపత్రికల్నే మళ్లీ ఇప్పుడు వేస్తున్నారు అని’’ అన్నాడు ఆ.స.మే. ‘‘డేట్ చూసుకోమనకపోయారా?!’’ అన్నారు ‘ఈ’ ఓనరు, ‘ఆ’ ఓనరు. ‘‘చూసుకున్నారట. ఇయర్ 2019 అనే ఉంది. న్యూస్ మాత్రం 2014 లో ఇచ్చిందే ఉందట’’ అన్నారు ఈ.స.మే., ఆ.స.మే. మూడో మైండ్ బోర్డు రూమ్‌లోకి వచ్చింది. ‘‘ఇంత లేటేమిటయ్యా నువ్వు’’ అన్నాడు ‘ఈ’ ఓనరు చికాగ్గా. మూడో మైండ్ గుడ్లురిమి చూశాడు. ‘‘ఉరిమావా? ఉరమబోతున్నావా? ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? ‘నువ్వు’ అన్నందుకు కోపం వచ్చిందా. నాకన్నా పద్నాలుగేళ్లు చిన్నవాడివి. ‘నువ్వు’ అంటే తప్పేముంది చెప్పు?’’ అన్నాడు ‘ఈ’ ఓనరు. ‘‘నాకైతే చిన్నా పెద్దా లేదు ఎంతటివారినైనా ‘నువ్వు’ అనే అంటా. నా చానెల్లో నా ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది..’’ అన్నాడు ‘ఆ’ పేపరు ఓనరు.. మూడో మైండ్ వైపు చూస్తూ. ‘‘చెప్పవయ్యా.. ఎంతసేపూ మేమిద్దరం నిన్ను పికప్ చేసుకోవడమేనా? నీకై నువ్వు పికప్ అయ్యేది ఉందా?’’ అన్నాడు ‘ఈ’ పేపరు ఓనరు. ‘‘అవునవును.. నేనూ అదే అడగబోతున్నా..’’ అన్నాడు ‘ఆ’పేపరు ఓనరు. మూడో మైండ్ కోపంగా పైకి లేచాడు. ‘‘ఏంటి మీరు పికప్ చేసేదీ! నాకూ రెండ్రోజుల నుంచి 2014 పేపర్లే వస్తున్నాయి. ఇదిగో ఇవాళ్టి పేపరు. ఇదిగో మా ఇంట్లో ఉన్న ఐదేళ్ల నాటి పేపర్. సేమ్ టు సేమ్. జనం నమ్మాలా వద్దా..!’’ అని బోర్డు మీటింగు నుంచి బయటికి వెళ్లిపోయాడు. –మాధవ్ -
ఇదీ ఇప్పటి కొత్త సంప్రదాయం!
పార్టీ మార్పిడిని సూచించడం ఎలా? గతంలో ఈ ప్రక్రియకు ఉన్న పేరేమిటి? అప్పటి ప్రక్రియ కంటే ఇప్పటి ప్రక్రియ వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలేమిటి? పైన కనిపిస్తున్న వాక్యం పరీక్ష పేపర్లోని ప్రశ్నలా అనిపిస్తోందా? కరెక్టే. కానీ ఈ ప్రశ్న నా దృష్టికి వచ్చిన తీరూ.. దాని కథా కమామిషూ తర్వాత చెబుతా. క్వెశ్చన్ పేపర్లో దీన్ని చదవగానే.. ‘‘ఇదేంట్రా.. ఈ ప్రశ్నేమిటి ఇలా ఉంది?’’ అంటూ మా బుజ్జిగాడిని అడిగా. ‘‘ఇది చాలా ఈజీ క్వెశ్చెన్ నాన్నా. పైగా ఏదైనా తెలియకపోతే కామన్‌సెన్స్‌తో ఆలోచించి రాసేయమని నువ్వే అన్నావ్ కదా. అలా ఈజీగా రాసేశా’’ అన్నాడు. ‘‘పార్టీ మార్పిడికి అప్పట్లో ఓ మాటా.. ఇప్పుడు ఆ ప్రక్రియకు ఓ విధానం ఉందా? అయినా ఈజీ క్వెశ్చెన్ అంటున్నావు కదా. ఏం రాశావ్?’’ అని అడిగా. అప్పుడు వాడు చెప్పిన జవాబిది. ఒకప్పుడు పార్టీ మారితే.. దాన్ని ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే మాటతో సూచించేవారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు ఫలానా అభ్యర్థి ఫలానా పార్టీ ‘‘తీర్థం పుచ్చుకున్నాడ’’ని న్యూస్ పేపర్లలో రాసేవారు. కానీ ప్రస్తుతం ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే ఆ మాట పూర్తిగా అంతరించిపోయినట్లే. దాన్ని ఇప్పుడెవరూ న్యూస్ పేపర్లలో రాయడం గానీ, టీవీల్లో చెప్పడం గానీ చేయడం లేదు. అయితే ఒక అభ్యర్థి పార్టీ మారిన సందర్భాల్లో మరికొందరు ‘‘ఫలానా గూటికి చేరడం’’ అని కూడా వ్యవహరించేవారు. ఈ మాట కూడా దాదాపుగా అంతరించే దశలోనే ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం: అయితే ఇప్పుడు తాజాగా పార్టీ మారిన ప్రక్రియకు సూచనగా ఆ పార్టీ జెండాను సూచించేలా ఉన్న రంగులతో కూడిన ‘‘కండువాను పార్టీ మారిన వ్యక్తికి కప్పడం’’ జరుగుతోంది. అందుకే ఇప్పుడు పార్టీ మారే ప్రక్రియను ‘‘తీర్థం పుచ్చుకోవడం’’గా చెప్పడానికి బదులు ‘‘కండువా కప్పుకోవడం’’గా వ్యవహరిస్తున్నారు. ప్రయోజనాలు: తీర్థం పుచ్చుకోవడం అన్న మాట ఒక సూచనాత్మకమైన మాట మాత్రమే. ఈ సమయంలో నిజంగా తీర్థం పుచ్చుకోవడం జరిగేది కాదు. ఒకవేళ గతంలో పార్టీ మారినప్పుడు నిజంగానే తీర్థం పుచ్చుకోవడం జరిగినా అది కడుపులోకి వెళ్లి, మటుమాయం అయిపోతుంది కాబట్టి తాను మారిన పార్టీ ఏమిటో గట్టిగా గుర్తుపెట్టుకుంటే తప్ప అభ్యర్థికి పెద్దగా గుర్తుండే అవకాశం ఉండదు. అయితే కండువా కప్పడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. కండువాపై పార్టీ జెండాలోని రంగులు, పార్టీ గుర్తు స్పష్టంగా ఉంటాయి కాబట్టి... ఆ కండువా కనిపిస్తున్నంత సేపు అభ్యర్థికి తాను మారిన పార్టీ ఏదో, తానిప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ‘‘ఇదీ నాన్నా ఆ ప్రశ్నకు ఆన్సరు’’ అంటుండగా నాకు మెలకువ వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెబుతా వినండి. ప్రస్తుతం మావాడి పరీక్షలు అవుతున్నాయి. ఈ టైమ్‌లోనైనా కాస్తో కూస్తో శ్రద్ధ తీసుకోవాలి కదా అంటూ నిన్న వాడితో సోషల్ సబ్జెక్ట్ చదివించా. అలాగే వాడు పరీక్ష రాసి రాగానే.. ఆ క్వెశ్చన్ పేపర్లోని ప్రశ్నల్ని చదువుతూ.. వాటికి ఆన్సర్లు ఏమి రాశాడో వాకబు చేయడం కూడా నాకు అలవాటు. సరిగ్గా పరీక్షల సీజన్లోనే, ఎన్నికలూ రావడం.. న్యూస్పేపర్లలో చదివిన అంశాలూ, వాడితో చదివించిన విషయాలు మెదడులో కలగాపులగమైపోయాయి. దాంతో వాడు ‘‘పార్టీమార్పిడి... అనుకూల దశలు... పద్ధతులూ – ప్రయోజనాలూ’’ లాంటి పాఠాన్ని నేను వాడితో చదివించినట్టూ.. అదే లెసన్ నుంచి ఎగ్జామ్‌లో క్వెశ్చన్ వచ్చినట్టూ, దానికి వాడు రాసిన ఆన్సర్‌ను నేను చదివించుకున్నట్టూ వచ్చిన కల ఇది. –యాసీన్ -
నాటి దేవతా వస్త్రాల్లాంటివే ఇవన్నీ..
ఎప్పటిలాగే శ్మశానం వైపునకు నడుస్తున్నవిక్రమార్కుడికి బేతాళుడు మళ్లీ ఓ కథ చెప్పడం మొదలు పెట్టాడు. అదేమిటంటే...మనం ఏదో అవన్నీ కల్పిత గాధలనుకుంటాం గానీ... ఎంత కల్పనలోనైనా కాస్తో కూస్తో నిజం ఉంటుంది. ఇది అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చెప్పుకున్న దేవతా వస్త్రాల కథ. ఓ రాజు పూర్తిగా నగ్నంగా ఉండి... తాను దేవతావస్త్రాలు ధరించానని చెప్పుకుంటూ ఊరేగుతూ ఉండేవాడట. ఆ నగ్న స్వరూపాన్ని కన్నులారా గాంచిన వాళ్లు కూడా ‘‘అబ్బ... చీనీ చీనాంబరాల దుస్తుల జరీ ఎంత బాగుంది. ఆహా... దాని కుచ్చుల కుచ్చుల అంచు ఎంత అద్భుతంగా ఉందీ’’ అంటూ ప్రశంసిస్తూ తరిస్తూ ఉండేవారట. అదే కథ మళ్లీ ఇంతకాలానికి ఇలా పునరావృతమవుతుందనుకోలేదు. అదేదో కథ కదా... అప్పటి అమాయకులే ఇప్పటికీ ఉన్నారా... ఉంటారా... అని ఒక్కోసారి మనకనిపిస్తుంటుంది గానీ, ముందే చెప్పుకున్నట్టు ఎంత కథలోనైనా వాస్తవం ఉంటుంది కదా. అనగనగా ఓ రాజు. నభూతో నభవిష్యతి అనేలా రాజధాని నిర్మిస్తానన్నాడు. ప్లాన్లు గీశాడు. నమూనాలు తీశాడు. వాటినే చూపిస్తూ... ఆహా ఓహో అనమన్నాడు. దేవతల రాజధాని పేరేమిటి? అమరావతి. తన రాజధాని పేరు కూడా అదే కాబట్టి... దేవతా వస్త్రాల్లాగే సదరు రాజధాని కూడా దేవతాంశ ఉన్నవారికే కనిపిస్తుందంటూ రాజపత్రాలు విపరీతంగా ప్రచారం చేశాయి. అది కనిపించలేదంటే వాడు కచ్చితంగా పాపాత్ముడే అవుతాడంటూ తీర్మానించేశాయి. ప్రజలు కామోసనుకున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నారు. ‘‘ఆహాహ... ఎంత బాగా కనిపిస్తుందేమండీ మన రాజధాని! ఆ ఉద్యానవనాలూ, ఆ సరస్సులూ’’ అని ఒకడంటే... ‘‘ఇక్కడ చూడండి... ఈ పచ్చిక బయళ్లు సాక్షాత్తూ పచ్చటి పట్టు తివాచీలు కదండీ’’ అంటూ మరొకడు ప్రస్తుతించాడు. మనమందరమూ ఆ యొక్క దేవతాంశ ఉన్నవాళ్లం సుమండీ అనుకుంటూ ఒకరి జబ్బలు మరొకరు చరచుకున్నారు. తర్వాతి వంతు దేవతాకర్మాగారంలో తయారైన కారుది. దాని పేరు ‘కియా’ అన్నారు. దేవతా కారంటూ ఒక దాన్ని రోడ్ల మీద నడిపారు. కానీ చిత్రమేమిటంటే... ఎంత ఏబ్రాసీ వాడైనా కొత్తకారు కొంటే దాని రంగూ, హంగూ, తళతళా, మిలమిలా లోకానికి చూపాలనుకుంటాడు. అదేమిటో గానీ సదరు వాహనానికి అన్ని వైపులా నల్ల పరదాలు కట్టారు. అదేమిటంటే... పాపాత్ముల కన్ను పడి దిష్టి తగులుతుందేమో లాంటి కథలు చెప్పారు. అప్పటికీ పాపం... అన్నెం పున్నెం ఎరగని పిల్లాడిలాంటి వాస్తవవాదులు కొందరు చెవులుకొరుక్కున్నారు. అక్కడ తయారైన కారు కాదని కనిపెట్టేశారు. కానీ మనం పాపాత్ములమని ఎందుకనిపించుకోవాలంటూ గమ్మునుండిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఓట్ల వంతు వచ్చింది. రాజును ఎన్నుకునేందుకు ప్రజలక్కడ ఓట్లు వేస్తారు. కానీ చిత్రమేమిటంటే... పుణ్యాత్ముల ఓట్లు మాత్రమే జాబితాలో ఉంటాయనీ, పాపాత్ముల ఓట్లు కనిపించవంటూ రాజు మళ్లీ బుకాయించడం మొదలు పెట్టాడు. దీనికి విరుగుడెలా అని ప్రజలు ఆలోచించారు. వాళ్లకో ఐడియా తట్టింది. ... అంటూ ఇంతవరకు కథ చెప్పి ఆ ఐడియా ఏమిటో తెలిసి కూడా చెప్పకపోతే నీ ఓటు కూడ గల్లంతవుతుందన్నాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు చెప్పిన ఆన్సరిది.ప్రజలు ఓట్లేశారు. రాజును గద్దె దించేశారు. రాజు లబోదిబో అన్నాడు. అప్పుడా ప్రజలు రాజుతో... ‘‘హే రాజన్. పద వీచ్యుతుడినయ్యావని నువ్వెందుకనుకుంటున్నావ్. నీకు పడ్డ ఓట్లన్నీ దేవతాఓట్లు. నీకు కనిపించడం లేదంటే బహుశా నువ్వు పుణ్యాత్ముడివి కావేమో అని మాకనిపిస్తోంది’’ అంటూ తగిన శాస్తి చేశారంటూ జవాబు చెప్పాడు. అది సరైన సమాధానం కావడంతో, విక్రమార్కుడికి మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు.– యాసిన్, ప్యామిలీ డెస్క్