
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ ప్రవేశం ఇంకా జరగలేదు. ఆయన అభిమానులు మాత్రం రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని పదే పదే చెబుతున్నారు. కాగా నటుడు రజినీకాంత్ కూడా ఇటీవల తన ప్రజా సంఘం నిర్వాహకులతో భేటీ అవ్వడం ఆ తర్వాత మీడియా ముందుకు రావడం వంటి సంఘటనలు జరిగాయి. అయితే మీడియాతో కూడా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజల కూడా రజనీ వైఖరి ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి.
ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే మాత్రం నటుడిగా వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సన్ ఫిక్చర్స్ నిర్మిస్తున్న ఆన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలంటూ నిర్మాణ సంస్థ మొదట్లోనే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా అన్నాత్త చిత్ర విడుదల వాయిదా పడక తప్పలేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కాగా నటుడు రజినీకాంత్ తాజాగా మరో మూడు చిత్రాలను చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: కలలు కరువయ్యాయా?
అందులో ఒక చిత్రాన్ని లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నటుసమాచారం. అదేవిధంగా కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. అయితే ఆ తర్వాత రజనీకాంత్ వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ప్రముఖ దర్శకుడు శంకర్‌తో కలిసి మరో చిత్రం చేయడా నికి రజనీకాంత్ సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ పూర్తిగా రాజకీయ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. చదవండి: సుశాంత్ చాలా హుందాగా ప్రవర్తించేవాడు
ఈ చిత్రాల గురించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇకపోతే రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో చేసే చిత్రం తర్వాత నటనకు స్వస్తి చెప్పనున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ వయస్సు (69). ఆయన కొత్తగా ఒప్పుకున్న చిత్రాల సమాచారం నిజమైతే మరో మూడేళ్ల వరకు నటనకే పరిమితమవుతారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆయన ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ పేరు నే ప్రకటించలేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే ఆనుమానం కూడా వ్యక్తమవుతోంది.