Rajinikanth
-
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
రజినీకాంత్ VS కమల్ హాసన్ బాక్సాఫీస్ ఫైట్
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
అమరన్‌కి ప్రశంసలు
శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రబృందాన్ని హీరో రజనీకాంత్ ప్రశంసించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అమరన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే హీరో శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిలని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకథ, కథనం, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని రజనీకాంత్ ప్రశంసించారు. -
ఓటీటీలో వేట్టయాన్.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సోషల్‌మీడియాలో ట్రెండింగ్ సాంగ్.. వీడియో చూశారా..?
రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్ కొరియోగ్రఫీతో దినేశ్ ఈ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటలో రజనీకాంత్‌తో మంజు వారియర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్లో ఇంత పెద్ద హిట్ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
వేట్టయాన్ కలెక్షన్స్.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఇంతటి కలెక్షన్స్ రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా భారత్‌లో రోజుకు రూ. 2 కోట్ల కలెక్షన్స్ వేట్టయాన్ రాబడుతుంది. అయితే, ఓవర్సీస్లో ఎక్కువగా ఈ మూవీ సత్తా చాటుతుంది. కేవలం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సినిమా అంతటి పాజిటివ్ టాక్ వేట్టయాన్‌కు రాలేదు. అయినా, కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే రాబడుతుంది.వేట్టైయన్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అన్ని భాషలలో డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
జైలర్‌తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
‘నాటు నాటు’సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్‌లో ఉంది. ఆస్కార్ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. నాకు రజకాంత్ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్ అని ప్రకాశ్ రాజ్‌కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్ రాజ్ నన్ను పిలిచి రజనికాంత్ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతోంది. విరామం సమయంలో రజనీకాంత్ సర్కి నన్ను పరిచయం చేశారు. అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
వేట్టయాన్‌లో నానికి ఆఫర్ ఆ రోల్.. చివరికీ!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నానికి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే నాని ప్లేస్‌లో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. అయితే నాని నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి నాని తప్పించుకున్నాడని రాసుకొచ్చారు. -
కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‌తో ఇలా
సూపర్‌స్టార్ రజినీకాంత్.. కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తగ్గిపోతుందిలే అనుకున్నారు. కానీ అది సీరియస్ అయి, గుండెకి ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్స్ స్టెంట్ వేశారు. ఇంతలోనే ఆయన నటించిన 'వేట్టయన్' సినిమా రిలీజైంది. తాజాగా మూవీ టీమ్ రజినీని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అలా రజినీ కొత్త ఫొటోలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?)ఈ ఫొటోల్లో రజినీని చూస్తే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో 'కూలీ' మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే 'వేట్టయన్' చిత్రానికి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగానే రజినీని చిత్రబృందం అంతా కలిసి విషెస్ చెప్పారు.తమిళంలో 'వేట్టయన్'కి హిట్ టాక్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. దసరా టైంలో అది కూడా నాలుగైదు చిత్రాలతో కలిసి రావడం తెలుగులో ఈ చిత్రానికి కాస్త మైనస్ అయింది. పండగకు రిలీజైన ఏ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్) -
ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?
సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కంగువ'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్యతో పాటు ప్రభాస్, రజనీకాంత్ వేదక పంచుకోనున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం రజనీకాంత్ వెట్టయాన్ కోసం వాయిదా పడింది. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవంబరు 14న సినిమా విడుదల కానుంది.కంగువ కోసం ప్రభాస్, రజనీకాంత్రజనీకాంత్ వేట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కావడంలో సూర్య పాత్ర ఎక్కువ ఉంది. తలైవా మీద ఉన్న గౌరవంతో అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువ చిత్రాన్ని సూర్య వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ కూడా కంగువ విజయం కోసం తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు ప్రీరిలీజ్ కార్యక్రమానికి వస్తున్నారట. ఇకపోతే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం యూవీ క్రియేషన్స్ అని చెప్పవచ్చు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి కంగువ సినిమాను వారు నిర్మించారు. యూవీ బ్యానర్ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మరింత ప్రమోషన్ కల్పించేందుకు పెంచేలా ప్రభాస్ కూడా భాగం కానున్నారని సమాచారం.రూ. 2000 కోట్లపై టార్గెట్కంగువ సినిమాను 3,500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్, స్పానిష్లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రూ. 1000 కోట్ల టార్గెట్‌తో దిగుతున్న ఈ సినిమా రూ. 2000 కోట్లు రాబడుతుందని నిర్మాత అంచనా వేశారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 14న సినిమా విడుదల కానుంది. -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
వేట్టయాన్‌కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.రజనీకాంత్ వేట్టయాన్ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ145.80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ సంస్థ తెలిపింది. మ్యాజిక్ నంబర్ రూ. 150 కోట్లకు చాలా దగ్గరలో కలెక్షన్లు ఉన్నాయి. నేటి కలెక్షన్లతో సులువుగా దానిని రజనీ అదిగమిస్తాడని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో 2024లో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా వేట్టయాన్ 5వ స్థానంలో ఉంది. దసరా సందర్భంగా రజనీకాంత్ సినిమాకు శనివారం నాడు మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.కోలీవుడ్‌లో సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా వేట్టయాన్ కలెక్షన్ల గురించి ఒక ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రూ. 17 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని పేర్కొన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు ఈ మార్క్‌ను అందుకున్న రజనీ సినిమాలు రోబో,2.0,కబాలి,పేట,దర్బార్, జైలర్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వేట్టయాన్ కూడా చేరిందని ఆయన తెలిపాడు. ఈ చిత్రం సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేయవచ్చని ఆయన తెలిపాడు. -
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
రజనీకాంత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ చిత్రంలో తమ ప్రాంత పాఠశాలను, విద్యార్థులను తప్పుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని కోవిల్పట్టి గాంధీనగర్ వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సౌత్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి నటీనటులతో తెరకెక్కిన వేట్టయన్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో తమ ప్రాంతంలోని ఉత్తమ పాఠశాల, అందులో విద్యార్థులను తప్పుగా చూపించారంటూ తెన్కాశి జిల్లా, కోవిల్పట్టి గాంధీనగర్‌కు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.డ్రగ్స్ విషయంలో తమ పాఠశాలకు వ్యతిరేకంగా దృశ్యాలున్నాయని, వాటిని తొలగించకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని స్థానికంగా ఉన్న లక్ష్మీ థియేటర్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సంబంధిత సినీ వర్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వేట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా నటించారు. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. చదవండి: రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఎలా ఉంది.. మూవీ రివ్యూ -
రజినీ 'వేట్టయన్'.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!) -
ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న వెట్టయాన్.. భారీ ధరకు రైట్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేట్టయాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు. అంటే నవంబర్ చివర్లో ఓటీటీకి వచ్చే అవకాశముంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్.