
రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ 2023 సినిమా భారీ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చెప్పలేదు. తాజాగా, ఈ అంశం గురించి సన్‌పిక్చర్స్ అప్‌డేట్ ఇచ్చేసింది. ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటంచారు. ముత్తువేల్ పాండియన్ వేట ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు.
జైలర్2 షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించడంతో రజనీకాంత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘టైగర్ కా హుకుమ్’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్‌లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. దీంతో వెంటనే ఆయన జైలర్2 ప్రాజెక్ట్‌లోకి షిఫ్ట్ అయిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment