Anirudh Ravichander
-
అజిత్ కుమార్ విదాముయార్చి.. రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వాయిదా..ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. #PATHIKICHU Out Now 💥➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025 -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.#Sawadeeka 🕺💃⚡️ https://t.co/Pm5XIZtP2LHappy New Year and love you all 🎉🎉🎉Dearest AK sir #MagizhThirumeni @trishtrashers Sung by @anthonydaasan 🎙️Written by @Arivubeing ✍🏻Choreography by @kayoas13 🕺#Vidaamuyarchi #EffortsNeverFail@LycaProductions #Subaskaran…— Anirudh Ravichander (@anirudhofficial) December 27, 2024ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రజినీతో బంధుత్వం.. సినిమాకు రూ.10 కోట్లు.. అనిరుధ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్‌కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
మళ్ళీ అనిరుద్ ట్వీట్.. ఫుల్ జోష్ లో తలైవా ఫ్యాన్స్
-
రజనీకాంత్ 'వేట్టైయాన్' నుంచి ప్రివ్యూ ప్రోమో
దసరా పండక్కి థియేటర్స్‌లోకి రానున్నాడు ‘వేట్టైయాన్ ’. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, వేట్టైయాన్ ప్రమోషన్స్‌లో భాగాంగా తాజాగా ప్రివ్యూ పేరుతో ఒక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అనిరుధ్ ఫ్లాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్మురేపాడు. టీజర్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. -
రజనీకాంత్ 'వేట్టైయాన్' సాంగ్ ప్రోమో.. అనిరుధ్ మ్యూజిక్ మార్క్
దసరా పండక్కి థియేటర్స్‌లోకి రానున్నాడు ‘వేట్టైయాన్ ’. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ 9న పూర్తి పాటను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్- అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కాంబినేషన్ మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేయనుంది. సాంగ్ ప్రోమోలోనే అనిరుధ్ మ్యూజిక్ మార్క్ కనిపిస్తుంది. దసర సందర్భంగా అక్టోబర్ 10న వేట్టైయాన్ విడుదల కానుంది.రిలీజ్ డేట్‌ని బట్టి చూస్తే దసరా సెలవులను ఈ సినిమా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్, లాయర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ‘వేట్టైయాన్ ’ సందడి చేయనున్నాడు. -
'దేవర' సాంగ్ కాపీపై కామెంట్ చేసిన ఒరిజినల్ కంపోజర్
'దేవర' సినిమా నుంచి రీసెంట్గా రెండో సాంగ్ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్ క్రియేట్ చేశారని చర్చ జరుగుతుంది.ఈ వివాదంపై చమత్ సంగీత్ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
కమల్‌హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
‘రానా’ లోకాలోకా టెకీలా...
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, హర్షా వడ్లమూడి ఆధ్వర్యంలోని ఇరాన్ హిల్ ఇండియా సంస్థ.. రూపొందించిన టెకీలాబ్రాండ్ ‘లోకాలోకా’ పానీయం అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచి్చంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా మెక్సికోలోనే తయారయ్యే ఈ లోకాలోకా, తొలుత అమెరికా మార్కెట్లో విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా రానా దగ్గుబాటి తెలిపారు. -
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్‌విడుదల చేశారు.బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలై ఫియర్ సాంగ్ అభిమానులను మెప్పించేలా ఉంది. ఇందులోని ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట కోసం గేయ రచయతలు ఎంతో ప్రత్యేకంగా దీనిని రచించారని ఇప్పటికే మేకర్స్ చెప్పారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రచించారు. -
ఎన్టీఆర్ కోసం అనిరుధ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సాంగ్
-
ప్రేమలో పడ్డ ఐశ్వర్య రజనీకాంత్.. ఆమె మాటలే చెప్తున్నాయ్!
కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడిపోయి రెండేళ్లు అవుతోంది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విడిపోయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం, గౌరవం అలాగే ఉందని, అందుకు నిదర్శనం ఐశ్వర్య ఇప్పుడు తన మాజీ భర్త ధనుష్ గురించి మాట్లడమేనని నెటిజన్లు అంటున్నారు. పెళ్లయి 18 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతుందని కోలీవుడ్‌లో పుకార్లు వస్తున్నాయి. విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ధనుష్, ఐశ్వర్య విడివిడిగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే. భార్యాభర్తలుగా కలిసి లేకున్నా.. ఇద్దరూ మంచి స్నేహితులని ఐశ్వర్య మాటలే నిదర్శనం. ఐశ్వర్య తన దర్శకత్వం వహించిన లాల్ సలామ్ కోసం ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడింది. దీంతో ఇద్దరూ తిరిగి మళ్లీ కలుసుకోనున్నారని ఊహాగానాలకు దారితీసింది. దక్షిణాది సినిమాకి చెందిన ప్రముఖ సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ సినీ జర్నీ వెనుక ధనుష్ ఉన్నాడని ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అనిరుధ్ రవిచందర్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన '3' చిత్రానికి అనిరుధ్ మొదట సంగీతాన్ని అందించాడు. అప్పుడు అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అలాంటి కుర్రాడు సంగీత దర్శకత్వం వహించాలనేది ధనుష్ కోరికని.. అనిరుధ్ నేడు ఇంత స్థాయికి చేరుకున్నాడంటే అందుకు కారణం ధనుష్ అని ఆమె చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా, అనిరుధ్ రవిచందర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత స్వరకర్తలలో ఒకరిగా మారారు. నేడు దక్షిణాదిలోని ప్రతి దర్శకుడి మొదటి ఎంపిక అతనే. 2012లో '3' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాలోని 'కొలవెరి డి..' పాట ఆప్పట్లో పెద్ద సెన్సేషన్ అని అందరికి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఐశ్వర్యకు కజిన్ అవుతాడు. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్‌లోని ప్రతిభను గుర్తించాడని ఐశ్వర్య తెలిపింది. అనిరుద్ సక్సెస్ జర్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అతను మా బంధువు అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్ వల్లే అనిరుధ్ సినిమాల్లోకి వచ్చాడు. అనిరుధ్‌ను మొదట సింగపూర్‌కు పంపించి చదివించాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం సంగీతంపై మక్కువ కొనసాగించాలని అన్నారు. ప్రతిభను ఎలా గుర్తించాలో ధనుష్‌కి తెలుసు. ఇక్కడే ఉండి విజయాన్ని అందుకోవాలని అనిరుధ్‌ని ధనుష్ ఒప్పించాడని ఐశ్వర్య తెలిపింది. కీబోర్డ్ కొనడం నుంచి పాటలు రాయమని ఒత్తిడి చేయడం వరకు ప్రతిదానికీ ధనుష్‌కే క్రెడిట్ ఉంది. అనేలా ఐశ్వర్య తెలిపింది. దీంతో తన మాజీ భర్త ధనుష్‌తో ఐశ్వర్య మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఆమె నుంచి ఎలాంటి ప్రకటన జరగలేదు. -
అది నేను ఒప్పుకోను !..అనిరుధ్ పై దేవిశ్రీ ప్రసాద్ సంచలనం
-
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
అనిరుధ్ వల్ల దేవర ఆలస్యం.. తారక్ ఫ్యాన్స్ ఫైర్
-
Devara Glimpse: జూ.ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ గ్లింప్స్ వీడియో ఎలా ఉంది? కొరటాల మార్క్ మేకింగ్.. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్) 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తొలుత ఒక పార్ట్ అనుకున్నారు గానీ తర్వాత రెండు భాగాలుగా చేశారు. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 79 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. అలానే ఎన్టీఆర్ చెప్పిన.. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది. ఈ వీడియోలో 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించారు. అలానే అనిరుధ్ మార్క్ బీజీఎం కూడా ఉంది. అదిరిపోయే విజువల్స్‌కి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలతో పాటు 'దేవర' గ్లింప్స్ వీడియోని థియేటర్లలో ప్లే చేయబోతున్నారని టాక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు రిలీజ్) -
రజనీకాంత్ 'జైలర్'కు మెగాస్టార్ చిరంజీవి చురకలు
ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్, జైలర్ రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే తెరపైకి వచ్చాయి. భోళాశంకర్ భారీ డిజాస్టర్ కాగా, జైలర్ సూపర్ హిట్ కొట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు అనిరుధ్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. జైలర్ విజయంలో అనిరుధ్ కూడా ఒక కారణమని, ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజీఎం సూపర్ అని రజనీ తెలిపాడు. సినిమా రీరికార్డింగ్‌కి ముందు చూసినప్పుడు అంతగా బెటర్ అనిపించలేదు కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత జైలర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని ఆయన తెలిపాడు. ఒక రకంగా జైలర్‌ను అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కాపాడిందని రజనీకాంత్ పరోక్షంగా ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితి మనది కాదు: చిరంజీవి ఒక సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలా ఉండాలో తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడాలి అని మెగాస్టార్ అన్నారు. అభిమానుల కోసం నేను ఎప్పుడూ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయాలని ఉంటుంది. నా నుంచి వారు కూడా అదే ఆశిస్తారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారు. కొందరు నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది. (ఇదీ చదవండి: ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో తెలుగు నటి గాయత్రి) కానీ.. అలా చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు. అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక- నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి. కానీ ఒక సీన్లో విషయం లేకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారు.' అని చిరంజీవి అన్నారు. ఇప్పుడా కామెంట్లను జైలర్ సినిమాకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు. జైలర్ సినిమాను ఉద్దేశించే మెగాస్టార్ ఆ కామెంట్లు చేశాడని కొందరు అంటుండగా.. ఉన్న విషయమే ఆయన చెప్పాడని మరికొందరు అంటున్నారు. -
Thalapathy Vijay's Leo: దళపతి విజయ్ ‘లియో’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ
సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్‌ని కూడా తన మ్యూజిక్‌తో బ్లాక్‌బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు. పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్‌గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా! (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్ దర్శించుకున్న విషయం తెలిసిందే.. తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్‌ను షారుఖ్ ధరించగా.. తన కూతురు సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?) OTT విడుదల వివరాలు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. జవాన్ విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఇలా చిత్ర బృందం భారీ ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 7 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు బద్దలే... జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీ-టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. టిక్కెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే 'జవాన్' విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. మొదటి రోజు రూ. 70 నుంచి 75 కోట్ల రూపాయల బిజినెస్ చేయనుందని టాక్. దీని ద్వారా బాహుబలి 2 (రూ. 58 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 61 కోట్లు), పఠాన్ (రూ. 55 కోట్లు) రికార్డులను అధిగమిస్తారు. #ShahRukhKhan visited #Tirumala for blessing of lord venkateswara before #Jawan Release.#Jawan7thSeptember2023 pic.twitter.com/IiTjBy2MYU — Film Blocks (@FilmBlocks) September 5, 2023 #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv — ANI (@ANI) September 5, 2023 SRK , offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati 🙏🏻❤️ The most secular man on this planet 🇮🇳🙏🏻#ShahRukhKhan pic.twitter.com/J1c01of5Qu — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 5, 2023 -
'జైలర్' మరో హీరో అనిరుధ్‌కి కొత్త కారు గిఫ్ట్
'జైలర్'లో హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్. అదే మరో హీరో ఎవరు అంటే దాదాపు ప్రతిఒక్కరూ చెప్పే పేరు అనిరుధ్. ఈ మూవీని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మరో రేంజుకి తీసుకెళ్లాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అతడి పనికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిర్మాత కళానిధి మారన్.. అదిరిపోయే బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?) చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక అల్లాడిపోయిన రజనీకాంత్‌కు 'జైలర్' రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. ఈ సినిమా స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ.. రజనీ స్టైల్, స్వాగ్ తోపాటు అనిరుధ్ మ్యూజిక్ బాగా ఎక్కేసింది. దీంతో మూవీ సూపర్ హిట్ అయిపోయింది. ప్రస్తుతం రూ.700 కోట్ల మేర వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. మూవీ ఈ రేంజులో హిట్ కావడంతో పాటు ఈ స్థాయిలో లాభాలొచ్చేసరికి నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొన్నిరోజుల ముందు హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఖరీదైన కార్లతోపాటు చెక్ ని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అనిరుధ్ కి కూడా ఓ చెక్ ప్లస్ కాస్ట్ లీ పోర్స్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబరు 7 నుంచి 'జైలర్' స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: 'బిగ్ బాస్' భయపడ్డాడా? ఏకంగా ఆ విషయంలో!) -
'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!
'జైలర్' హవా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు. మరి 'జైలర్'కి మరో హీరో అయిన అనిరుధ్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ. రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణమైన సీన్స్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అనిరుధ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'జైలర్' హీరోగా నటించిన రజినీకాంత్‌కు రూ.110 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇక మిగిలిన వారిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కే ఎక్కువట. ఏకంగా రూ.10 కోట్ల వరకు ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. 'జైలర్'తో ఏఆర్ రెహమాన్(రూ.8 కోట్లు)నే దాటేశాడు. అలానే ఇతడు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తం, చాలామంది యంగ్ హీరోలకు ఇచ్చేదాని కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా మనోడి వెంట పడుతున్నారు. రూ.10 కోట్లు కంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు పవన్ 'అజ్ఞాతవాసి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. నాని 'జెర్సీ'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తీస్తున్న 'దేవర' కోసం పనిచేస్తున్నాడు. ఏదేమైనా సరే ఓ సంగీత దర్శకుడు గురించి ఇంతలా మాట్లాడుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!) -
Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ
టైటిల్: జైలర్ నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఎడిటర్: ఆర్.నిర్మల్ సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ విడుదల తేది: 2023 ఆగస్టు 10 'జైలర్' కథేంటి? ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే. ఎలా ఉందంటే? ముత్తు అదేనండి రజినీకాంత్.. విలన్ డెన్లోకి వెళ్లి, అతడికి వార్నింగ్ ఇస్తాడు. స్టైల్‌గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు. ఇంటర్కట్లో మరో రెండు చోట్ల శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కూడా అదే టైంకి సిగరెట్స్ స్టైల్‌గా వెలిగిస్తారు. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇదంతా చెప్పడానికి చాలా నార్మల్‌గా ఉన్నాసరే.. స్క్రీన్‌పై ఈ సీన్ చూస్తున్నప్పుడు మీరు రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి. ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), అతడి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఏడిపిస్తుంటాడు. కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం.. పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే మంచి హై ఇస్తుంది. ఇంటర్వెల్ వరకు రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం గందరగోళానికి గురిచేశాడు. అప్పటివరకు ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో ఎటెటో పోతుంది. అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. ఫైనల్లీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్, ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప ఇంకేం లేదు! డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అయిన నెల్సన్.. 'జైలర్' విషయంలోనూ అదే ఫార్ములా పాటించాడు. ఫస్టాప్‌లో రజినీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ పై కనిపించే యాక్టర్స్ అందరూ సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. మనకు మాత్రం నవ్వొస్తుంటుంది. అదే 'జైలర్'లో మ్యాజిక్. ఎవరెలా చేశారంటే? 'జైలర్'లో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఆయనకు ఇలాంటివన్నీ కొత్తేం కాదుగా! తన మార్క్ మేనరిజమ్స్‌తో.. విజిల్స్ వేయించే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో రజినీ యాక్టింగ్ మీకు కచ్చితంగా హై ఇస్తుంది. రజినీకి భార్యగా రమ్యకృష్ణ హుందాగా నటించింది. కొడుకు అర్జున్‌గా వసంత్ రవి డిఫరెంట్ పాత్రలో ఓకే అనిపించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ నిడివి చాలా తక్కువ. కానీ ఉన్నంతలో వీళ్లకు ఎలివేషన్స్ బాగా పడ్డాయి. విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్ బాగానే చేశాడు. కానీ అతడు పాత్రలో తమిళ నేటివిటి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. సునీల్ ఇందులో బ్లాస్ మోహన్ అనే సినిమా హీరో పాత్రలో నటించాడు. కానీ ఇతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. తమన్నా.. ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. యోగిబాబు, వీటీవీ గణేశ్ ఉన్నంతసేపు నవ్వించారు. మిగిలిన వాళ్లు తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరో అని చెప్పొచ్చు. పాటల సంగతి పక్కనబెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజినీకాంత్‌ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటే నార్మల్ ఆడియెన్స్‌కి 'జైలర్' నచ్చుతుంది. రజినీకాంత్ అభిమానులకు అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది! -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్