
సాక్షి, సినిమా : కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో తన డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఏకంగా పవన్ 25వ చిత్రానికే ట్యూన్లు అందించే బంపరాఫర్‌ను కొట్టేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెలోడియస్ పాటలతో అజ్ఞాతవాసి ఆల్బమ్‌ను అందంగా తీర్చి దిద్దాడు కూడా. అయితే అజ్ఞాతవాసికి సంగీతం అందించటంతోపాటు మరో అవకాశం కూడా అనిరుధ్ కొట్టేశాడంట.
నిన్న సాయంత్రం విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది పవర్ స్టార్ పాడిన కొడకా కోటేశ్వర రావు సాంగ్. అందులో పవన్‌తోపాటు అనిరుధ్ కూడా స్టెప్పులేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలోని ఆ పాట చివర్లో కొద్ది సెకన్లపాటు అనిరుధ్ కూడా కనిపించబోతున్నాడంట.
అనిరుధ్‌కి ఇలా స్టార్ల సినిమాల్లో కనిపించటం కొత్తేం కాదు. గతంలో ధనుష్ నటించిన ఓ చిత్రం కోసం అనిరుధ్ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అలరించాడు కూడా. ఇక అజ్ఞాతవాసి విషయానికొస్తే.. టీజర్‌లతోనే పవన్ రికార్డులు బద్ధలు కొడుతుండగా... ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని పీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
— PK Creative Works (@PKCreativeWorks) 31 December 2017
Comments
Please login to add a commentAdd a comment