అజ్ఞాతవాసి బాలేదన్నందుకు.. | Pawan Kalyan fan attacked on person | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 12:23 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan fan attacked on person - Sakshi

తన అభిమాన హీరోను అభిమానులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి సినిమాలు హిట్‌ అయినా, ఫట్‌ అయినా ఫ్యాన్స్‌లో అభిమానం ఏమాత్రం తగ్గదు. అయితే ఒక్కోసారి మాత్రం అభిమానం వెర్రితలలు వేస్తుంది. తమ అభిమాన హీరోను ఒక్క మాట అన్న సహించలేరు. గొడవలకు దిగుతారు. దాడులు, అల్లర్లకు పాల్పడుతారు. తాజా అలాంటి సంఘటనే జరిగింది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలైంది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరకుపోయారు. తన నాయకుడు నటించిన ఆఖరి చిత్రం బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకున్నారు. కానీ ప్లాప్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో పవన్‌ అభిమానులు సైతం బహిరంగానే సినిమాపై తమ అసంతృప్తి వెల్లగక్కారు. సోషల్‌ మీడియా వేదికగా పలు కామెంట్లు పెట్టారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పోస్టు చేశారు. అలాగే ఓ పవన్‌ కల్యాణ్‌ అభిమాని కూడా అజ్ఞాతవాసి బాగాలేదంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశాడు.

ఆ వీడియో చూసి ఇతర అభిమానులు రెచ్చిపోయారు. సోషల్‌ మీడియాలో వీడియో పెట్టిన వ్యక్తిని వెతికి మరీ పట్టుకొని చితక బాదారు. పవన్‌ కల్యాణ్‌ ఫోటోకు మొక్కాలంటూ పిడిగుద్దులు కురిపించారు. పవన్‌ గురించి ఏమనుకుంటున్నావ్‌ అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. చొక్కా విప్పించి అర్థనగ్నంగా పవన్‌ ఫ్లెక్సీ ముందు మోకాళ్లపై కూర్చోపెట్టించారు. రాయలేని విధంగా బూతులు తిడుతూ, పరిసరాల్లో ఈడ్చి, తిప్పి కొట్టారు. ఇంకో సారి ఇలా చేయనని బాధితుడు బ్రతిమాలినా, విడిచిపెట్టమని వేడుకున్నా వదిలిపెట్టలేదు. భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ను ఎవరైనా ఏమైనా అంటే వారికి ఇదే శిక్షపడుతుందంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement