
పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయానని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వారీసు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. 2017లో ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేశాను.
నా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్ కూడా ఆడలేదు. రెండు సినిమాలు ఒకేసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో చాలా నష్టపోయాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ కొట్టడంతో నేను నిలబడగలిగాను'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment