Spider
-
యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!
తన కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్‌కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్మ్యాన్కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు. పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు. దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్మెంట్ వెలుగులోకి వచ్చింది. సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు. ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్‌కు సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది. సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది. -శ్రీరంగం కామేష్(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!) -
20 కిలోల బరువు: దీని దుంపతెగ! మూములు పీత కాదిది, రాకాసి పీత!
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది. ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు. ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగుఅరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా? -
'స్పైడర్ విమెన్': జస్ట్ ఒట్టి చేతులతో అవలీలగా వంద మీటర్లు..!
మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణించి చూపిస్తున్నారు. సాధ్యం కానీ ప్రతి పనిని నారీ శక్తితో సాధించగలమని చాటి చెబుతున్నారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ.చైనాలో 43 ఏళ్ల షాన్డాంగ్ మహిళ ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా అవలీలగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్నే అధిరోహించింది. దాదాపు 30 అంతస్తులకు సమానమైన 108 మీటర్ల ఎతైన కొండను అధిరోహించి రికార్డు సృష్టించింది.. ఆమె నిలువు రాతి మీదుగా చాలా సునాయాసంగా ఎక్కేయగలదు. అక్కడ ఆమె మగ స్పైడర్ పీపుల్లోని ఏకైక మహిళ. జస్ట్ ఒట్టి చేతులతో శిఖరాలను ఎక్కేస్తుంది . ఆమె తన తండ్రి మార్గదర్శకత్వంలో సుమారు 15 ఏళ్ల వయసులో ఈ ఎతైన కొండను అధిరోహించడం ప్రారంభించింది. అంతేగాదు చిన్నతనంలో తాను అబ్బాయిలతో పోటీ పడి మరీ ఔషధ మూలికలు తెచ్చేందుకు కొండలపైకి ఎక్కడం నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందక మునుపే తాను పక్షుల వ్యర్థాలు వంటివి సేకరించడం కోసం ప్రతి రోజు పర్వతాలను ఎక్కేదాన్ని అని చెప్పింది షాన్డాంగ్. నిజానికి మియావో ప్రజలు సాంప్రదాయకంగా మారుమూల పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. అందువల్లే వారు ఒట్టి చేతులతో ఈజీగా ఎక్కేయగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకరకంగా ఒట్టి చేతులతో పర్వతాన్ని అధిరోహించడంలో వారికి సాటి లేరు. అక్కడ ప్రజలకు ఇది తరతరాలుగా వచ్చిన సంప్రదాయం. అయితే తనను అందరూ స్పైడర్ మహిళగా పిలుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో ..నెటిజన్ల సదరు మహిళని హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. పోస్టులుపెట్టారు. (చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..
ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌కి చెందిన లూసీ వైల్డ్ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు. అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్ మందులతో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే.. ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్ డ్రమ్‌కి సమస్య ఏర్పడవచ్చు ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
సాలీడు కాటుతో పాపులర్ సింగర్ మృత్యువాత!
ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. సాలీడు కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన తీవ్రంగా పోరాడిన మోరైస్ చివరికి మృత్యువాత పడ్డాడు. ముఖంపై సాలీడు కుట్టడంతో చనిపోయాడని అతని భార్య అతని భార్య జులెన్నీ లిసోబ (Jhullenny Lisboa) స్థానిక మీడియాతో వెల్లడించింది. మోరైస్ భార్య జులినీ లిసోబ అందించిన వివరాల ప్రకారం సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆ తరువాత ముఖం ఉబ్బిపోయింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీలా వచ్చింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మోరైస్ సోమవారం తుదిశ్వాస విడిచాడని లిసోబ తెలిపింది. అంతేకాదు మోరైస్ సవతి కూతురు (18)ని కూడా సాలీడు కుట్టిందని, అయితే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపింది. దీనిపై మోరైస్ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ కష్టసమయంలో తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఖలీజ్ టైమ్స్ ప్రకారం, మోరైస్ 15 సంవత్సరాల వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించాడు. తనదైన స్టయిల్‌తో ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో సోదరుడు ,స్నేహితుడితో కూడిన ముగ్గురు సభ్యుల బ్యాండ్ టోకాంటిన్స్, గోయాస్, మారన్హావో, పారా రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రదర్శనలతో ఆకట్టుకునేది. ఎపుడూ సంతోషంగా, నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాడని , నలుగురికీ సాయం చేసే వాడంటూ మోరైస్‌ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు సమీప బంధువు వెస్లేయా సిల్వా. మోరైస్ ప్రతిభను గుర్తు చేసుకుంటూ తన సహచర గాయకుడికి స్నేహితులు నివాళులర్పించారు. ఇది ఇలా ఉంటే బ్రెజిల్లో, కొన్ని రాష్ట్రాల్లో యాంటీ-వెనమ్ సీరమ్‌లు ఉత్పత్తి అవుతాని ఆరోగ్య సేవల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా బాధితులకు ఉచితంగా అందిస్తామని తెలిపింది. డార్లిన్ మోరైస్ మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (SES-TO) తెలిపింది. View this post on Instagram A post shared by DARLYN MORAIS (@darlynmorais) -
షాకింగ్ ఘటన: చెవిలో గూడు కట్టుకుని, పిల్లలతో సహా కాపురమున్న సాలీడు
షాంఘై: చైనాలో ఓ మహిళ చెవి నొప్పితో ఆస్పత్రికెళ్లింది. పరీక్షించిన వైద్యులు చెవిలోపలి భాగంలో ఓ సాలీడు గూడు కట్టుకుని సంతానంతో సహా కాపురం ఉన్నట్లు తేల్చారు. సిచువాన్ ప్రావిన్స్ హుయిడాంగ్ కౌంటీ ఆస్పత్రికి సుమారు పది రోజుల క్రితం ఓ మహిళ వచ్చింది. కుడి చెవి నొప్పితోపాటు లోపలి నుంచి బెల్ కొడుతున్నట్లుగా శబ్ధం వస్తోందంటూ వైద్యులకు తెలిపింది. ఎండోస్కోపీ పరీక్ష చేసిన వైద్యులు కర్ణభేరిలాంటి నిర్మాణాన్ని గుర్తించారు. కెమెరా అమర్చిన ప్రత్యేక పరికరాలను లోపలికి పంపించి చూడగా దాని వెనుక ఒక సాలీడు గూడు కనిపించింది. దీంతో,ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. వైద్య నిపుణులు ఆ గూడును బయటకు లాగగా దాంతోపాటు అందులోని సాలీడు, దాని పిల్లలు బయటకు వచ్చాయి. అయితే, ఈ సాలీడు విషపూరితమైంది కాకపోవడం సంతోషించాల్సి విషయమని వైద్యులు తెలిపారు. (లేటు వయసులో ఘాటు ప్రేమ.. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!) -
పవన్ సినిమాతో చాలా నష్టపోయా, కెరీర్లోనే బిగ్గెస్ట్ డ్యామెజ్ : దిల్‌రాజు
పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయానని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వారీసు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. 2017లో ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్ కూడా ఆడలేదు. రెండు సినిమాలు ఒకేసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో చాలా నష్టపోయాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ కొట్టడంతో నేను నిలబడగలిగాను'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా?
ఈ సాలీడు అంతలేసి కొమ్ములతో భయపెట్టేలా కనిపిస్తుంది గాని, ఇది నిజానికి చాలా సాధుజీవి. కొమ్ములు ఉండటం వల్ల దీనిని ‘హార్న్డ్ ఆర్బ్ స్పైడర్’ అని పిలుచుకుంటారు. దీనినే ‘విష్బోన్ స్పైడర్’ అని కూడా అంటారు. వేలెడంత ఉండే ఈ సాలీడు కొమ్ములు, దాని శరీరానికి మూడురెట్లు పొడవు ఉంటాయి. దీనికి మరో విశేషమూ ఉంది. దీనికి మూడు వెన్నెముకలు ఉంటాయి. అవి కూడా మామూలుగా వీపు మీద కాకుండా, కడుపు భాగంలో ఉంటాయి. ఈ జాతి సాలీళ్లు పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చైనా, ఆగ్నేయాసియా అడవుల్లో కనిపిస్తాయి. భారత్‌లోనూ కొన్ని చోట్ల ఇవి అరుదుగా కనిపిస్తాయి. పక్షులు, బల్లుల దాడుల నుంచి తప్పించుకోవడానికే వీటికి ఆ కొమ్ములు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇవి మనుషులకు ఏమాత్రం హాని చెయ్యవు. మనుషులకు హాని కలిగించే విషపదార్థాలేవీ వీటిలో ఉండవు. -
స్పైడర్ ‘మ్యాన్’!
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్)ను కనుగొన్నారు. దాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్ మ్యాన్‌లా ఉందంటూ కేరింతలు కొట్టారు. సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్ మిటిఫికస్ అని సమాచారం. -
ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు
బాసర(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్ నిర్వాహకులు. మీడియాలో వరుస కథనాలతో సీరియస్ అయిన సర్కార్... మెస్ నిర్వహణపై కలెక్టర్ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ట్రిపుల్ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!
Spider Interupts Australia News Conference: ఒక్కోసారి ప్రజానాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడూ అది కూడా మీడియా ప్రత్యక్ష ప్రశారాల్లో అనుకోని అంతరాయాలు ఏర్పడటం చూస్తుంటాం. సిగ్నల్స్ లేక లేదా ఒక వేళ అక్కడ ఉన్న వ్యక్తులు సమావేశం జరగకుండా అడ్డుతగలడమే చూస్తుంటాం. కొంత మంది వ్యక్తులైతే పనిగట్టుకుని ఉపన్యాసిస్తున్న నేతను పట్టుకుని అందరి ముందు దులిసేసి రసభాస చేయడం కూడా ఇటీవలకాలంలో మనం ఎక్కువగా చూశాం. కానీ ఒక సీరియస్ మీటింగ్‌లో అది కూడా ఒక ఆరోగ్య మంత్రి సమావేశంలో ఒక చిన్న సరీసృపం ఎలా అంతరాయం కలిగించిందో తెలుసా!. పైగా ఒక్క నిమిషంపాటు ఆ మంత్రి కూడా కంగారుపడి పోవడం కూడా జరిగింది. (చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!! అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ఆరోగ్య మంత్రి యివెట్ డి అథ్వాస్ కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణలు, వ్యాక్సిన్లకు సంబంధించి బహిరంగ మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఆ సమావేశంలో వ్యాక్సినేషన్ విధివిధానాలకు అనుగుణమైన వ్యాపార ఆవశ్యక్యత గురించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక సాలీడు ఆమె మాట్లాడుతుండగా ఆమె మీద నుంచి సమీపంలోని పోడియం పై పడుతుంది. దీంతో ఏదో మీద పడినట్టుగా భావించి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఆ తర్వాత వెంటనే మీలో ఎవరైన దీన్ని ఇక్కడ నుంచి తీసేయగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతలో చీఫ్ హెల్త్ ఆఫీసర్ జాన్ గెరార్డ్ కొన్ని కాగితాలను ఉపయోగించి సాలీడును తీసేశాడు. అయితే ఆమె మన వద్ద కోవిడ్ ఉంది, స్పైడర్లు ఉన్నాయంటూ చమత్కరించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’
పిల్లలు ఏ విషయం అయిన తొందరగా నేర్చుకుంటారంటారు. పనులైన, ఆటలైన ఒక్కసారి ఆసక్తి పెట్టారంటే ఇట్టే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ చిన్నారి ఎలాంటి సాయం లేకుండా అవలీలగా గోడను పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. ఐదేళ్ల చిన్నారి ఇంట్లోని రెండు గోడల మధ్య ఒక్కో కాలు పెట్టి స్పైడర్మెన్లా పైకి పాకుతుంది. నిమిషంలోనే ఇంటి పైకప్పు వరకు చేరి అక్కడే కాసేపు విన్యాసాలు చేసింది. కాళ్లను, చేతులను ఆడిస్తూ ఫీట్లు చేసింది. అనంతరం మళ్లీ అలాగే పాకుతూ కిందకు దిగింది. అయితే ఇక్కడ చిన్నారి గోడకు వ్యతిరేకంగా చేతులు, కాళ్లను ఉంచడం విశేషం. వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. పాప టాలెంట్‌ను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నారి.. నువ్వు సూపర్. అచ్చం స్పైడర్‌లా వెళ్లావ్. అర్ధరాత్రి నిద్రలోంచి లేచి ఇలాంటివి ట్రైం చేస్తే ఇక నా జీవితమంతా డాక్టర్‌తో మందులు వాడుతూనే ఉంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు తెలియరాలేదు. చదవండి: తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లిన ఏం కాలేదంటే.. రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 It's like something out of the Exorcist.😲😱 https://t.co/ODSpti0rGv — MrChelsea (AKA col ) London is blue 💙⭐⭐ (@MrChels33381819) September 16, 2021 -
Photo Feature: బైక్‌తో భళా.. పోలీసులుంటే ఎలా..?
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలో అరుదైన సప్తవర్ణశోభిత సాలీడు దర్శనమిచ్చింది. వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా హైదరాబాదీలకు అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. కాగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాలో వేడుకలు ఘనంగా జరిగాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
యోగివేమన వర్సిటీలో అరుదైన ‘జంపింగ్ స్పైడర్’
వైవీయూ (వైఎస్సార్ జిల్లా): అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి, అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ కనిపించింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. దీనికి వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ వేదికైంది. ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో ఈ కీటకాల ఉనికిని కనుగొనగా.. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో దీని ఆచూకీ బయట పడింది.దీంతో ఈ కీటకం గురించి పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. -
పాముకే విషమిచ్చి చంపేస్తే!!
సాక్షి, హైదరాబాద్: విషముండే పాములకే విషమిచ్చి చంపేస్తే.. దాని బాడీని ద్రవరూపంలోకి మార్చేసుకుని.. జ్యూస్ తాగినట్లు తాగేస్తే.. ఇవన్నీ చేస్తోంది.. మనం చాలా లైట్ తీసుకునే సాలె పురుగులే. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం తెలుసుకుని డంగైపోయారు. ఇదేదో ఒకట్రెండు సంఘటనలంటే మామూలుగా తీసుకోవచ్చు. వారు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశీలనలు చేసిన తర్వాత విడోస్ స్పైడర్ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను చంపేసి తినేస్తున్నాయని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్పర్ట్ మార్టిన్ నీఫ్‌లర్ జరిపిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాములు, సాలెపురుగులు ఎదురై.. ఘర్షణ పడితే.. 87 శాతం కేసుల్లో సాలెపురుగుదే పైచేయి అయిందట. ఇలాంటివి వాళ్లు ఓ 300 ఘటనలను చూశారట. మిగిలిన వాటిల్లోనూ పాములు గెలవడం లేదట. ఎవరైనా వచ్చి వాటిని రక్షించడం ద్వారా అవి బతికిపోతున్నాయట. థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగులు ఉత్పత్తి చేసే సాలె గూళ్ల దారాలు చాలా గట్టిగా ఉంటాయని, పెద్ద పెద్ద పాములు సైతం అందులో ఇరుక్కుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. గూళ్లలో చిక్కుకోగానే అవి తమలోని విషాన్ని పాములకు ఎక్కిస్తాయి. దీంతో అవి పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తర్వాత వాటి శరీరంలోని భాగాలను ద్రవ రూపంలోకి మార్చుకుని ఆ ద్రవాలను పీల్చుకు తినేస్తున్నాయని మార్టిన్ వివరించారు. స్పైడర్ ఏమో చిన్నది.. పాము కాస్త పెద్దది కదా.. దాంతో వారాలపాటు వాటికి వంటావార్పూ లాంటి పనులు ఉండవట. ఒక్కపామునే రోజులపాటు తింటూ పండుగ చేసుకుంటాయట. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సాలీడు దెబ్బకు ఆ మహిళ వారం పాటు...
సిడ్ని: సాలెపురుగు అనగానే మనకు టక్కున స్పైడర్ మ్యాన్ సినిమాలు గుర్తుకు వస్తాయి. హీరోకు సాలెపురుగు కుట్టడంతో అతడికి అతీత శక్తులు రావడం.. ఆపదల నుంచి ప్రజలను కాపాడే సీన్లతో రూపొందించిన సినిమాలంటే చిన్నా పెద్దా అందరికి ఇష్టమే. కానీ వాస్తవంలో మాత్రం సాలెపురుగు ఓ మహిళను విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసిది. దాని దెబ్బకు ఆమె వారం పాటు కారు డ్రైవింగ్ జోలికి వెళ్లలేదు. ఎందుకో ఏమిటో ఆ వివరాలు చూడండి.. ఆస్ట్రేలియా సౌత్‌వేల్స్‌కు చెందిన ఓ మహిళ బయటకు వెళ్దామని భావించి కారు డోరు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకు అక్కడ గొంగళిపురుగు ఆకారంలో ఓ జీవి కనిపించింది. ఏదో పురుగు అని భావించింది. కానీ తీరా డోర్ ఒపెన్ చేశాక అక్కడ ఆమెకు ఓ భారీ.. సాలెపురుగు కనిపించింది. దాని శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి. ఇలాంటి వింత, భారీ సాలీడును తొలిసారి చూడటంతో ఆమె ఒక్కసారి షాక్‌కు గురయ్యింది. తర్వాత కారు డ్రైవ్ చేయ్యాలంటేనే భయపడింది. దాంతో వారం రోజుల పాటు కారు జోలికి వెళ్లలేదు. క్రిస్టియన్ జోన్స్ అనే వ్యక్తి ఈ భారీ సాలీడు ఫోటోలని ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఆమె మొదట దీన్ని చూసి గొంగళిపురుగు అని భ్రమపడింది. కాదు సాలీడు అని తెలిసి షాక్ అయ్యిందంటూ జోన్స్ ఈ ఫోటోలని షేర్ చేశాడు. ఇక ఇంత భారీ సాలీడుని చూసిన నెటిజనులు మేం కూడా భయపడ్డాం.. ఇక అది నీ కారు కాదు.. కొత్త ఓనర్‌కి కీ ఇచ్చేయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే 500 మందికి పైగా కామెంట్ చేశారు. -
ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...
లండన్: బ్రిటన్‌లో అంతరించిపోయిందనుకున్న ఒక సాలీడు జాతిని ఇటీవలే కనుగొన్నారు. యూకేలోని సర్రేలో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌కు చెందిన ఒక స్పైడర్ జౌత్సాహికుడు మైక్ వైట్ మిలిటరీ సైనిక శిభిరంలో దీనిని కనుగొన్నాడు. ఫాక్స్ స్పైడర్‌గా పిలిచే ఈ జాతి సాలీడులో బ్రిటన్‌లో చివరిసారిగా 1993లో కనిపించాయి. తరువాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. ఈ సాలీడు జాతి గురించి చెప్పాలంటే ఇవి చాలా వేగంగా, చురుకుగా ఉంటాయి. ఊసరవెల్లిలాగా తమ పరిసరాలకు అనుగుణంగా రంగులను కూడా మార్చుకోగలవు. ఇది ఒక అరుదైన సాలీడు జాతి. ఇది బ్రిటన్‌లో కేవలం మూడు ప్రాంతాలలోనే కనిపిస్తుంది. దీనికి ఎనిమిది కనులు, స్పష్టమైన కంటిచూపు ఉంటుంది. ఇవి రాత్రి పూట ఆహారం కోసం వేట మొదలు పెడతాయి. రాళ్లను తవ్వి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఆహార సేకరణలో ఇవి నక్కలాగా ప్రవర్తిస్తాయి అందుకే వీటిని ఫాక్స్ స్పైడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ సాలీడు జాతి 27 ఏళ్ల క్రితం కనిపించి మళ్లీ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించకపోవడంతో అంతం అయిపోయిందని భావించినట్లు వైట్ తెలిపారు. ఇనాళ్లు మళ్లీ కనుగొనడం ఆనందంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ఇలాంటి స్పైడర్ ఎప్పుడైనా చూశారా.. -
హెడ్ ఫోన్లు వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్
మనలో చాలామంది గంటల కొద్దీ హెడ్ఫోన్లను ఉపయోగిస్తుంటారు. అసలు అవి శుభ్రంగానే ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా పాటలు వింటూనో, సినిమాలు చూస్తూనో గంటలకొద్దీ చెవుల్లో మోత మోగాల్సిందే. అయితే ఈ వీడియా చూశాక మాత్రం హెడ్ ఫోన్లను ఉపయోగించే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటారేమో. ఆస్ర్టేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన ఓలీ అనే వ్యక్తి ఎప్పటిలానే హెడ్సెట్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండగా, చెవులో ఏదో గిలిగింతగా అనిపించింది. దీంతో ఏంటా అని చూస్తే స్పైడర్ (సాలెపురుగు) దర్శనమిచ్చింది. అంతే ఇక దాన్ని బయటకు తీయడానికి చాలా సమయమే పట్టింది. అటు తిప్పి, ఇటు తిప్ప మొత్తానికి స్పైడర్‌ను బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్తా వైరల్ అయ్యింది. (ఇదేమి స్పైడర్ రా నాయనా..) ఇక మీరు ఆ పాత హెడ్సెట్ వాడే బదులు కొత్తది కొంటారేమో అని ఒకరు సరదాగా కామెంట్ చేస్తే..చూడ్డానికి చాలా భయానకంగా ఉంది ఇంతకీ మీరు ఆ హెడ్‌సెట్‌ను కాల్చేశారా లేదా అని మరొక యూజర్ ప్రశ్నించారు. అయితే సాలెపురుగు అంత ప్రమాదకరం కాదని మరికొందరి వాదన. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మ్యూజియం నిర్వాహకులు సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. శరీరంపై పెద్ద వెంట్రుకలు ఉన్న సాలె పురుగులు ఎటువంటి హానీ కలిగించవని, అయితే కొన్ని మాత్రం విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటాయని వెల్లడించారు. అవి కాటు వేసినా కొన్ని సైడ్ ఎఫెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మొత్తానికి ప్రమాదం జరిగేకంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. (ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే) -
ఇలాంటి స్పైడర్ ఎప్పుడైనా చూశారా..
మనకు తెలిసిన స్పైడర్‌కు (సాలెపురుగు) ఒక కన్ను.. ఎనిమిది కాళ్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ ఒక స్పైడర్‌కు మాత్రం ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లు ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీనిని చూడాలంటే మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిందే. ఎందుకంటే అమండా డీ జార్జ్ అనే మహిళ సౌత్ సిడ్నీలోని తిర్రోల్లో దీనిని కనుగొంది. (చదవండి : నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు) 18 నెలల కిందట అమండా ఈ స్పైడర్‌ను తొలిసారి చూసింది. కానీ అప్పడు ఆమెకు దానిని ఫోటో తీయడం సాధ్యపడలేదు. మళ్లీ జూన్‌లో అమండా కళ్లలో పడ్డ ఆ సాలీడును ఈసారి మాత్రం మిస్సవలేదు. కెమెరా తీసుకొని చకచకా నాలుగు ఫోటోలు తీసి వెంటనే నిపుణుడికి పంపించింది. ఆ తర్వాత అమండా స్పైడర్ ఫోటోలను బ్యాక్‌యార్డ్ జువాలజీ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసింది. ' ఫోటోలోని సాలీడు నాకు నిద్రపట్టకుండా చేసింది. నేను చూసిన స్పైడర్‌కు ఎనిమిది కళ్లు ఉండడంతో పాటు ముఖం కూడా నీలిరంగులో ఉంది. అది నానుంచి తప్పించుకోవాలని చూసింది.. కానీ ఈసారి మాత్రం మిస్సవకుండా ఫోటో తీయగలిగాను. ఫోటో తీసే సమయంలో సాలీడు నావైపై చూసినట్టుగా అనిపించింది. ఇలాంటి అరుదైన దృశ్యాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!
ప్రకృతిలోని అద్భుతమైన ‘నిర్మాణాల్లో’ సాలెగూడు కూడా ఒకటి. ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు దీనిని అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన జీవి(సూక్ష్మజీవులు) ఏదైనా సరే విలవిల్లాడుతూ ప్రాణాలు విడవాలే తప్ప.. తప్పించుకోవడం అసాధ్యం. ఆహారం సంపాదించుకునేందుకు అంత పక్కాగా ప్లాన్ చేస్తాయి సాలీడులు. ఇక సాధారణంగా ఇప్పటి వరకు సాలీడులు చిన్న చిన్న జీవులను తినడం మాత్రమే మనం చూశాం. అయితే తరంతుల అనే జాతికి చెందిన ‘పింక్ టో తరంతుల’ అనే పెద్ద సాలీడు ఓ పక్షిని ముందరి కాళ్లతో బంధించి దానిని నోట కరచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘సాలీడు, పక్షిని తింటుందా. మా షెడ్లో కూడా సాలీడు గూళ్లు ఉన్నాయి. ఇకపై అక్కడికి వెళ్లను. ఇది చాలా భయంకరంగా ఉంది’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) ఇక ఈ విషయం గురించి జాసన్ డన్లోప్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘చెట్లపై నివసించే ఇలాంటి పెద్ద సాలీడులు సాధారణంగా చిన్న చిన్న పక్షులు, ఎలుకలను చంపి తింటాయి. అయితే ఎటువంటి ఆహారాన్నైనా సరే చప్పరించి, జ్యూస్‌లా మార్చుకుని తాగేస్తాయి. ఇక ఈ వీడియోలో ఉన్న పక్షి ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగిలే అవకాశం లేదు’’అని చెప్పుకొచ్చారు. కాగా పింక్ టో తరంతుల సాలీడులు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. -
పక్షిని నోట కరచుకున్న సాలీడు
-
వామ్మో.. ఇది భయకంరంగా ఉంది!
సాధారణంగా ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన కీటకాలు లేదా ఇతర సూక్ష్మజీవులు ఏవైనా సరే తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తరంతుల అనే జాతికి చెందిన పెద్ద సాలీడు ఆహారాన్ని నోట కరచుకున్న ఈ పాత వీడియోను ‘వైల్డ్అట్రాక్షన్స్’ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయడంతో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ‘‘వామ్మో.. ఇది చాలా భయంకరంగా ఉంది’’ అంటూ హ్యారీపోటర్ అండ్ చాంబర్ ఆఫ్ సీక్రెట్స్లోని సన్నివేశాలు గుర్తు చేసుకుంటుండగా.. మరికొందరు.. ‘‘స్పైడర్ ఫ్యాన్స్ ఈ వీడియోను ఎంజాయ్ చేస్తారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram Adult female Ceratogyrus marshalli 🕷 Check out the size of that horn! 🎥 by @friends_with_fangs be sure to give her a follow for some fascinating animals! Use #wildattractions4u to be featured Follow @wildattractions2 for more! 🕷🐍 ———————————————————— Friendly neighborhood Spider fan merch out now, check it out 😄LINK IN BIO! 10% of all profits donated to The Nature Conservancy. A post shared by Andrew Raciti (@wildattractions) on Jun 30, 2020 at 7:39pm PDT -
వైరల్: పాము కాదు, స్పైడర్ కాదు మరేంటి?
ప్రకృతి గురించి చెప్పాలంటే ఎవరూ పూర్తిగా చెప్పలేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలియదు. అవి జరిగినప్పుడు చూడాల్సిందే. అసలు ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. అలా ఉంటాయి ఆ వింత జీవులు. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ అసాధరమైన జీవి పేరు ఎంటో నెటిజన్లు కనుక్కోలేకపోతున్నారు. పాము, సాలీడును పోలి ఉన్న ఈ జీవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వీడియో చూసి మొదట్లో ఇది పాము అని భావిస్తాం. కానీ కాసేపటి తర్వాత పాము కాదని తెలుస్తోంది. సాలీడు అనుకుంటే అదీ కాదు. ఐదు కాళ్లతో పాకుతూ ఆ జీవి కొలనులోకి వెళ్లిపోతుంది. 32 సెకండ్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.9 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వింత జీవి వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇది 2020 కాలం, అందుకే ఈ అద్భుతం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ ఐదు పాములు కలిసి ఒక తాబేలు తినడానికి ప్రయత్నించగా, అది తప్పించుకోని కొలనులోకి వెళ్లింది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని పేరు ‘ స్నేక్ స్పైడర్’ అని ఇంకో నెటిజన్ నామకరణం చేశాడు. -
వైరల్: చెవిలో గూడు కట్టిన ‘స్పైడర్’
చైనా: సాధారణంగా చెవిలోకి చీమలు, చిన్నగా ఉండే పురుగులు దూరితే చాలా ఇబ్బంది పడతాం. వాటిని చెవి నుంచి తీసే వరకు నొప్పి భరించలేము. అయితే తాజాగా చైనాలోని ఓ వృద్ధ మహిళ చెవిలో సాలీడు ఏకంగా గూడు కట్టుకుంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ వృద్ధ మహిళకు చెవి నొప్పి, దురదగా ఉండటంతో పాటు, ఏదో మోగుతున్న శబ్దం రావటంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో ఆ మహిళ స్థానిక మియాన్యాంగ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ లియూ.. ఆమె చెవిని పరిశీలించి.. చెవిలో పట్టు బంతి మాదిరిగా ఏదో ఉన్నట్లు గుర్తించారు. దీంతో చెవిలో ఏం ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో వృద్ధ మహిళ చెవిలో ఓ స్పైడర్ ఉన్నట్లు, అది చెవిలో చేరి గూడు కట్టుకున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేశారు. (కరోనా కాలంలో ట్రంప్ ఊహించని నిర్ణయం) దీంతో ఆ డాక్టర్ ఆమె చెవిలో.. చెవిని శుభ్రపరిచే రసాయనాన్ని చుక్కలుగా వేశారు. దీంతోపాటు ఆ స్పైడర్‌ను ప్రాణాలతో చెవి నుంచి బయటకు తీశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తు ఆ మహిళ చెవి దెబ్బతినలేదు.ఇక చెవిలోకి వెళ్లిన స్పైడర్ చాలా చిన్నదని, లేదంటే ఆమెకు వినికిడి లోపం కలిగేదని డాక్టర్ లియూ పేర్కొన్నారు. ‘నేను ద్రాక్షతోటలో పని చేస్తుంటాను. అదే సమయంలో నాకు ఎటువంటి స్పృహ లేకుండా ఆ సాలీడు నా చెవిలోకి దూరినట్టుంద’ని ఆ మహిళ తెలిపారు. కాగా, ఈ ఘటన ఏప్రిల్ 22న చోటు చేసుకుంది. -
ఊహించని పరిణామం అంటే ఇదే..
ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనడానికి ఉదాహరణగా ఈ సన్నివేశాన్ని చెప్పుకోవచ్చు. ఒక బగ్‌ను సాలీడు అమాంతం లాగేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక బగ్ ఆహారం వెతుక్కుంటూ తన దారిన తాను పోతుంది. దాని పక్కన ఒక పెద్ద మట్టికుప్పలాగా ఉంది. ఆ మట్టికుప్ప కింద సాలీడు తన స్థావరాన్ని ఏర్పరుచుకొంది. అయితే బగ్ దానిని చూసి పట్టించుకోకుండానే ముందుకు వెళ్లిపోయింది. అయితే బగ్ తన చావు ఆ మట్టికుప్పలోనే పొంచి ఉందని అస్సలు ఊహించి ఉండదు. బగ్ అలా కొంచెం ముందుకు వెళ్లగానే.. కుప్పలో నుంచి సాలీడు బయటికి వచ్చి తన ఎనిమిది కాళ్లతో అమాంతం దానిని కిందకు లాక్కొంది. ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. తాజాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుషాంత నందా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ' జీవితంలో ఎవరైనా ఇలాంటి ఆశ్చర్చకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. చావు నుంచి ఎవరు అతీతులు కారు' అంటూ కాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోనూ 4500 మందికి పైగా వీక్షించారు. 'పాపం.. బగ్'.. 'వీడియో చూడగానే భయమేసింది'.. 'ఓ మై గాడ్'.. 'తెలివైన స్పెడర్' అంటూ కామెంట్లు పెట్టారు. -
చావు అంచుల దగ్గరకు తీసుకెళ్లింది...
-
ప్రాణం కోసం పోరు.. విజేత ఎవరంటే?..
మెల్బోర్న్ : ఆ రెండు జీవులు ప్రాణాంతకమైనవే. గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ, రెండిటిని చావు అంచుల దగ్గరకు తీసుకెళ్లింది. ఈ భీకరపోరులో ప్రపంచంలోనే రెండవ ప్రాణాంతకమైన దానికి చావు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. అడిలైడ్‌కు చెందిన ఓ మహిళ గత శుక్రవారం బట్టలు ఆరేయటానికి ఇంటి బ్యాక్యార్డ్కు వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియాలోనే అతి ప్రమాదకరమైన జీవులు రెడ్ బ్యాక్ సాలీడు, బ్రౌన్ స్నేక్ గొడవపడుతూ కనిపించాయి. సాలెగూడులో చిక్కుకున్న పాము అందులోనుంచి తప్పించుకోవటానికి ఎంత గానో ప్రయత్నించింది కానీ, కుదరలేదు. సాలీడు దాన్ని పక్కకు తప్పించుకోకుండా తన జిగురు తీగలను మెడకు చుడుతూ కొరకటం ప్రారంభించింది. పెద్దమొత్తంలో జిగురు తీగలను పాము తలకు చుట్టడంతో అది నోరు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సాలీడు.. పాము మెడను తీవ్రంగా కొరికింది. పెద్ద మొత్తంలో విషం పాము తలలోకి ఎక్కటంతో అది చనిపోయింది. చనిపోయిన పాము... రెడ్ బ్యాక్ సాలీడు రెడ్ బ్యాక్ సాలీడుకు తన జిగురు తీగలు, విషమే బలం. పెద్దపెద్ద పాముల్ని కూడా ఈజీగా చంపేయగలదు. అందుకే ఆస్ట్రేలియాలోని అతి ప్రమాదకరమైన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇక బ్రౌన్ స్నేక్ విషయానికి వస్తే ప్రపంచంలోనే రెండవ అతి ప్రమాదకర పాము. ఆ దేశంలో ఏటా సంభవిస్తున్న పాము కాటు మరణాలల్లో 50 శాతం బ్రౌన్ స్నేక్ వల్లే అవటం గమనార్హం. -
సాలీడు 'సాగు మిత్రుడు'..
(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) :వ్యవసాయంలో మిత్రపురుగుల ప్రాధాన్యం తెలియనిది కాదు. పంటలకు మేలు చేసే ఈ కీటకాల జాబితాలోకి సాలీడును కూడా చేర్చాలని అంటున్నారు డాక్టర్ అతుల్ భోడ్కే. మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ అభయారణ్యంలో సరికొత్త సాలీడు జాతిని గుర్తించిన అతుల్.. దశాబ్దానికిపైగా వీటిపై పరిశోధనలు చేశారు. ప్రభుత్వాలు పులుల సంరక్షణ కోసం ఎంతో సొమ్ము ఖర్చు పెడుతున్నాయని, సాలీడులను సంరక్షించుకోవడం ద్వారా పులుల సంతతిని పెంచడమూ సాధ్యమని గుర్తించడం లేదని అతుల్ ‘సాక్షి’కి తెలిపారు. ప్యూరోరిథిడీ జాతి సాలీడును పదేళ్ల క్రితం తాను గుర్తించానని, అప్పటివరకూ దేశంలో 60 సాలీడు కుటుంబాలు ఉండగా, 61వ కుటుంబాన్ని చేర్చామని ఆయన వివరించారు. జీవావరణాన్ని కాపాడేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. ‘‘గడ్డిలో పెరిగే ప్యూరోరిథిడీ సాలీడు గడ్డిలో దొరుకుతుంది. ఇది హానికారక సూక్ష్మజీవులను తింటూ బతుకుతుంది. ఫలితంగా ఈ సాలీళ్లు ఉన్న చోట గడ్డి ఏపుగా పెరుగుతుంది’’అని అతుల్ వివరించారు. సాలీళ్లలో గూడు అల్లేవి ఒక రకమైతే.. నేలపై తిరుగుతుండేవి రెండో రకమని చెప్పారు. ఈ రెండు రకాల సాలీళ్లూ కీటకాలను నాశనం చేస్తాయని తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రభుత్వాలు సాలీళ్ల ప్రాముఖ్యతను గుర్తించడం లేదని వాపోయారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సాలీడులను కీటక వర్గీకరణకు మినహా మరే ఇతరాలకు వాడుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో కీటక నాశినుల వాడకం ఎక్కువ అవుతుండటంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సాలీడులను సహజసిద్ధ కీటక నాశినులుగా ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేశారు. సాలీడుల పెంపు ఇలా.. రైతులు పొలంలో కనిపించే ఏదైనా సాలీడును గుర్తించి వాటికి ‘డ్రోసఫిలా’అనే లార్వేను అం దిస్తే చాలని, అవి బాగా పెరుగుతాయని అతుల్ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాలీడు అవసరాన్ని గుర్తించారని, వారి పొలాల్లో సాలీడు గూళ్లను తొలగించడం మానేశారని చెప్పారు. ఇళ్లల్లో దోమల నియంత్రణకూ సాలీళ్లు బాగా పనిచేస్తాయన్నా రు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని సాలీడులపై విస్తృత పరిశోధనలను చేపట్టాలని సూచించారు. తద్వారా కీటక నాశినుల వాడకం తగ్గడంతోపాటు ఆహారంలోకి చేరుతున్న విషతుల్యకాలుష్యాలను నివారించవచ్చన్నారు. -
సాలీడు భరతం పట్టిన బాలుడు
-
నన్నే భయపెడతావా.. నీ అంతు చూస్తా!
చిన్నపిల్లలకు చీమ కుట్టినా ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుగా భయపడిపోతుంటారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే అది పొరపాటే. ఇక్కడ చెప్పుకునే బుడతడు భయపడటం సరి కదా.. ఎవరైనా భయపెట్టాలని చూసినా ఊరుకోడు. ఓరోజు ఆ పిల్లవాడు హాలోవీన్ ఉత్సవానికి వెళ్లాడు. అక్కడ సాధారణం కన్నా పెద్ద సైజులో ఉన్న సాలీడు కనిపించింది. ఆదుర్దాగా దాని దగ్గరికి వెళ్లి తల నిమిరాడు. ఒక్క క్షణంలో ఉన్నపళంగా సాలీడు పైకి లేచి బాలుడిని భయపెట్టింది. దీంతో అతన్ని భయపెట్టాలనుకున్న ప్రాణికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెంటనే ఆ సాలీడుపై పిడిగుద్దులు కురిపించాడు. దాని తల పట్టి లాగుతూ భరతం పట్టాడు. ఇక్కడ విశేషమేమంటే అది నిజమైన సాలీడు కాదు. ఎలక్ట్రానిక్ బొమ్మ.ఇక ఈ తతంగాన్నంతా మెక్కార్మిక్ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘బుడతడు సాలీడును ఇష్టపడ్డాడు కానీ, భయాన్ని కాదు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘వీడు పిల్లోడు కాదు.. పిడుగు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఏమవుతాడో!’ అంటూ మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు. ఇక అతని ధైర్యానికి సోషల్ మీడియా నీరాజనాలు కురిపిస్తోంది. -
భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...
ఆ కీటకం వల పన్నితే తప్పించుకోవడం కష్టం. అందులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడవాల్సిందే. అదే సాలీడు (స్పైడర్) ప్రత్యేకత. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ‘వల పన్నడం’ సాలీడుకు చిటికెలో పని. అనెటా అలానిజ్ గుజార్డో అనే వ్యక్తి టెక్సాస్‌లో నివాసముంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో గత బుధవారం ఇంటిపక్కన ఓ భారీ సాలీడు వల చూసి షాక్‌కు గురయ్యాడు. సినిమాలో మాదిరి అంతపెద్ద వల అతని కంటబడటంతో విషయం అర్థమైంది. ఓ భారీ స్పైడర్.. దాని వలలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి గింజుకుంటున్న గబ్బిలం కనిపించాయి. అతను చూస్తుండగానే గబ్బిలం వైపు సాలీడు దూసుకొచ్చింది. దానిపైబడి నంజుకు తినేసింది. స్పైడర్ కన్నా ఆ గబ్బిలం పెద్ద సైజులో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్నంతా గుజార్డో ఫేస్బుక్లో పంచుకున్నాడు. సాలీడు ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జియోప్ ఆరంటియా జాతికి చెందిన ఈ స్పైడర్ తేనెటీగలు, బొద్దింకలు, కీటకాలు, పక్షుల్ని ఆహారంగా తీసుకుంటాయి వాటికన్నా భారీ ప్రాణలను కూడా అవి ట్రాప్ చేసి ఆహారంగా చేసుకోవడం విశేషం. -
డెలివరీ బాయ్స్‌ను ఇలా కూడా వాడుకుంటారా ?
మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. ఇలానే ఓ యువతి వినూత్నంగా తన సమస్యను పరిష్కరించుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంది. సాధారణంగా బల్లులు, సాలీడులు, బొద్దింకలు ఇంట్లో కనిపిస్తే చాలు ప్రాణాలు పోయేంత పనిచేస్తారు మహిళలు. ఇలానే డెమీ అనే యువతికి తన ఇంట్లో సాలీడులు కనిపించాయి. అవి చూస్తే ఆమెకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఇంట్లో ఎవరు లేరు.. వాటిని తీసేంత ధైర్యం లేదు. ఏం చేయాలి మరీ ఆలోచిస్తుండగా.. ఒక ఆలోచన తట్టింది. ఫుడ్ ఆర్డర్ చేస్తే.. డెలివరి బాయ్ సలహా తీసుకొవచ్చు అనుకుంది. వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ వచ్చాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చిన బాయ్ ఏమైన సాయం కావాలా మేడమ్ అని అడిగాడు. ఆ మాటకు తనలో తాను నవ్వుకున్న డెమీ తన సమస్యను వివరించి సాయం కోరింది. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ హెల్మెట్ పెట్టుకుని మరీ సాలీడులను తొలిగించాడు. ఈ తతంగాన్ని ట్విటర్లో పంచుకుంటూ డెమీ ఉబ్బితబ్బిబ్బయింది. అంతేకాదండోయ్ ఈ ట్వీట్‌కు సదరు డెలివరీ కంపెనీ సైతం స్పందిస్తూ ఆ బాయ్‌ని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ బాయ్‌కు మంచి టిప్ ఇచ్చావని భావిస్తున్నామని కొందరు.. డెలివరీ బాయ్స్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. My fear of spiders was taken to a whole new level today in which I ordered food in a hope that the delivery driver would remove the spider.. Joe @Deliveroo @DeliverooHelp you are an actual LIFESAVER 🙌🏼 pic.twitter.com/YnkQhqhhWW — Demi (@demiswn) May 30, 2018 -
రోబో డా.. స్పైడర్ రోబో!
చూడటానికి అచ్చు సాలిపురుగు మాదిరిగా ఉన్న ఈ స్పైడర్ రోబోను జర్మనీకి చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీనికి బయోనిక్ వీల్ బోట్ అని నామకరణం చేశారు. దీనికి ఇరువైపులా ఉన్న 8 కాళ్లతో నడవడమే కాకుండా పరిగెత్తడం, గుండ్రంగా మారిపోయి వేగంగా వెంటాడుతుందట. దీన్ని మొరాకోలో ఉండే ఫ్లిక్–ఫ్లాక్ అనే సాలిపురుగును స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశారు. ఈ సాలిపురుగు కూడా తన శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా ఉండలా మారి గాల్లోకి తనను తానే విసిరేసుకోవడం దీని ప్రత్యేకత. అంతేకాదు ఏదైనా ఆహారం ఉన్నా కూడా ఇలాగే చేస్తుందట. మన రోబో ఇలా ఉండలా మారి వెళ్లేందుకు వీలుగా ఇరువైపులా మూడు చొప్పున కాళ్లు అమర్చారు. మిగతా రెండు కాళ్లు రోబో ఉండలా మారినప్పుడు కూడా నడిచేందుకు వీలుగా తయారు చేశారు. కొండలు, రాళ్లు, మనుషులు వెళ్లేందుకు వీలులేని ప్రాంతాల్లో ఈ రోబో చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
సాలెగూడు కట్టే తీరు చూస్తే ఔరా అనాల్సిందే!
-
సాలెగూడు స్ఫూర్తితో..
టైప్–1 మధుమేహానికి చికిత్సను ఆవిష్కరించారు చైనా శాస్త్రవేత్తలు. సాలెగూడు స్ఫూర్తిగా తయారుచేసిన ఓ పోగులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐస్లెట్ కణాలు వేలకువేలు ఉంచి.. శరీరంలో అమర్చడం ఈ పద్ధతిలో కీలకమైన అంశం. ఈ రకమైన మధుమేహంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుందన్నది తెలిసిన విషయమే. ఫలితంగా టైప్–1 మధుమేహం బారిన పడినవారు తరచు ఇన్సులిన్‌ను ఎక్కించుకోవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఐస్లెట్ కణాలను శరీరంలోకి చొప్పించడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటిరవకూ బోలెడు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. శరీరం ఈ కొత్త కణాలను నిరోధించే సమస్యను ఎదుర్కొనేందుకు మరిన్ని మందులు వాడవలసి రావడం దీనికి ఒక కారణం. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు నానో స్థాయిలో అతి సూక్ష్మమైన రంధ్రాలున్న ఓ పోగును తయారుచేసి అందులో ఈ ఐస్లెట్ కణాలను ఉంచారు. సాలెగూడు పోగంత పలుచగా ఉండటమే కాకుండా... కణాలను తనలో దాచుకోగలగడం వీటి ప్రత్యేకత. అవసరమైనప్పుడు దీన్ని సులువుగా తీసేసే అవకాశమూ ఉంటుంది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక అంగుళం పొడవైన పోగును రెండు రోజుల పాటు ఇన్సులిన్ అవసరం లేకుండా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో..
తమిళసినిమా: స్పైడర్‌తో కోలీవుడ్‌లో హంగామా చేసిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి అనిరుధ్టూ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.స్పైడర్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌తోనే రొమాన్స్ చేసిన ఈయన ఈ సారి ఏకంగా కాజల్‌అగర్వాల్, సమంత, ప్రణీత అంటూ ముగ్గురితో ఫుల్కలర్ఫుల్గా అలరించడానికి వస్తున్నారు. అవును టాలీవుడ్లో మహేశ్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రం ఇప్పుడు అనిరుధ్ పేరుతో కోలీవుడ్‌కు రానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్, రేవతి, జయసుధ, షియాజీ షిండే, ముఖేష్ రిషీ అంటూ ప్రముఖ నటీనటులే నటించారు. కోలీవుడ్‌లో మహేశ్‌బాబు చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంతకు ముందు భారీ చిత్రాలు సెల్వందన్, ప్రభాష్ బాహుబలి, మగధీర, బ్రూస్లీ, ఎవండా వంటి చిత్రాలను కోలీవుడ్ ప్రేక్షకులకు అందించిన స్వాతి, వర్షిణిల భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ తమిళంలో అనువదిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా సత్యాసీతల ,అడ్డాల వెంకట్రావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రత్నవేల్ ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి అనువాత రచయిత బాధ్యతలను ఏఆర్‌కు.రాజరాజన్ నిర్వహిస్తున్నారు.ఈ చిత్ర విలేకరుల సమావేశాన్ని శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మహేశ్‌బాబు నటించిన అత్యంత భారీ చిత్రాల్లో బ్రహ్మోత్సవం ఒకటని తెలిపారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. ప్రపంచంలోని ప్రాణులన్నిటికీ ప్రేమానుబంధాలతోనే మనుగడ ముడిపడి ఉంటుంది. అలాంటి కుటుంబ అనుబంధాల ప్రాధాన్యతను చెప్పే చిత్రంగా అనిరుధ్ ఉంటుందన్నారు. అంతా కలిసి ఉన్నప్పుడు ప్రేమానుబంధాల విలువ తెలియదన్నారు.ఒక్క సారి దూరం అయితే దాని విలువేమిటో అవగతం అవుతుందన్నారు.అలా తండ్రి ఆశయం కోసం తన ఏడుతరాల బంధువులను అన్వేషిస్తూ హీరో సాగించిన పయనమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని తెలిపారు.చిత్రంలో ఫ్రేమ్ నిండా తారలు కనిపిస్తూ కలర్ఫుల్గా అనిరుధ్ చిత్రం ఉంటుందన్నారు. కాజల్‌అగర్వాల్, సమంత, ప్రణీతలతో మహేశ్‌బాబు రొమాన్స్ రమణీయంగా, కనువిందుగా ఉంటూ యువతను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. -
సినిమాను 150సార్లు చూశా : మహేశ్
‘‘సిన్మాలో చాలా ఎగ్జయిటింగ్ అంశాలున్నాయి. హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని దాచిపెట్టాం!’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. రేపు రిలీజవుతున్న ఈ సిన్మా గురించి మహేశ్ చెప్పిన ముచ్చట్లు... ► సిన్మాలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఆఫీసర్‌గా నటించా. టీజర్లో చూపించిన ‘స్పైడర్’ సిన్మాలో ఉండదు. హీరో క్యారెక్టర్ని పరిచయం చేయడం కోసం కాన్సెప్ట్ బేస్డ్గా టీజర్‌ను షూట్ చేశాం. ∙ ► ‘స్పైడర్’ తెలుగు, తమిళ్ వెర్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. తెలుగుకి, తమిళ్‌కి కొందరు నటీనటులు మారతారు. అలాగే రెండు భాషలకు సంబంధించిన సీన్స్‌ని వెంట వెంటనే షూట్ చేయడంతో తెలుగు, తమిళ్ డైలాగ్స్ మాట్లాడేవాణ్ణి. అదో కొత్త ఎక్స్పీరియన్స్! అందుకే.. కొరటాల శివగారితో ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అనే నేను’ చాలా ఈజీగా ఉంది. జస్ట్ తెలుగులో డైలాగులు చెబితే చాలు.. సీన్ కంప్లీట్ అయిపోతోంది. ఇంతేనా అనిపిస్తోంది. ‘స్పైడర్’ అనేది హీరో–విలన్ కథ. సిన్మాకు విలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మురుగదాస్‌గారు కథ చెప్పిన రెండు నెలల తర్వాత ‘మన సినిమాలో ఎస్.జె. సూర్య విలన్’ అన్నారు. ఫస్ట్... నాకేం అర్థం కాలేదు. దర్శకుడిగా అతను నాకు బాగా తెలుసు. రెండు రోజులు ఆలోచించాక అతనే విలన్‌గా పర్ఫెక్ట్ అనుకున్నా. ఎస్.జె. సూర్య నటించిన తమిళ సినిమాలు చూశా. బ్రిలియంట్ యాక్టర్! మురుగదాస్‌గారిపై గౌరవంతో తమిళ నటుడు భరత్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ► ‘స్పైడర్’లో డ్యూయల్ రోల్ చేశారట? అనడిగితే... అదే నిజమైతే ప్రోమో లో వేసేవాళ్లమన్నారు. మీరు, నమ్రతగారు ఈ సిన్మా చూశారా? అనడిగితే... ‘‘నమ్రత చూడలేదు. నేనిప్పటివరకూ 150సార్లు చూశా’’ అని మహేశ్ చమత్కరించారు. -
నో కట్స్..
ఇటు టాలీవుడ్లో అటు కోలీవుడ్ జనాల్లో, సినీ వర్గాల్లో ఇప్పుడు బాగా నానుతోన్న సినిమా ‘స్పైడర్’. మహేశ్‌బాబు, ఎ.ఆర్. మురుగదాస్ వంటి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేశ్ తమిళ చిత్రసీమలో అడుగుపెడుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ భారీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. దసరా కానుగా ఈ నెల 27న ‘స్పైడర్’ విడుదల కానుంది. ‘‘హేరిస్ జయరాజ్ స్వరపరచిన ఈ సినిమా పాటలకు మంచి లభిస్తోంది. ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మహేశ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శివన్. -
నేను ఒక్కసారి కమిట్ అయితే ప్రాణం పెడతా!
– మహేశ్‌బాబు ‘‘నేను మద్రాస్‌కి వెళ్లినప్పుడు దర్శక–నిర్మాత చక్రపాణిగారి రైట్‌హ్యాండ్ కుటుంబారావుగారితో మాట్లాడుతున్నప్పుడు మా ముందు ఓ కారు ఆగింది. ‘ఎవరీ అబ్బాయి’ అని ఆయన్ను దర్శకులు శ్రీధర్ అడిగారు. ‘ఊరు తెనాలి. సినిమాల్లో నటిద్దా’మని వచ్చాడన్నారు. రేపు ఆఫీసుకి వచ్చి కలవమని చెప్పడంతో వెళ్లా. ‘నా సినిమాలో మీరే హీరో’ అంటే, నాకు తమిళం రాదన్నా. ఓ నెల ట్యూటర్ని పెట్టి తమిళ్ నేర్పించేందుకు ప్రయత్నించారు. కానీ, నాకు రాకపోవడంతో మా ఊరు వెళ్లిపోయా. అదే ‘కాదలిక్క నేరమిల్లై’. సూపర్‌డూపర్ హిట్’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. మహేశ్‌బాబు, రకుల్ జంటగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పెడర్’ ఈ నెల 27న విడుదలవుతోంది. శుక్రవారం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. కృష్ట మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మహేశ్ మద్రాస్‌లో ఉండటం వల్ల తమిళం బాగా వచ్చు. తన తొలి తమిళ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేయడం సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సిని మా సూపర్‌డూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. మహేశ్ తమిళ్ బాగా మాట్లాడాడు’’ అన్నారు విజయనిర్మల. ‘‘తమిళ సినిమా చేయాలనే మహేశ్ కోరిక ‘స్పైడర్’తో నెరవేరింది. మురుగదాస్ మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్’’ అన్నారు నిర్మాత జి. ఆదిశేషగిరిరావు. ‘‘మహేశ్ ఫ్యాన్స్ గర్వపడేలా, తలెత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇండస్ట్రీలోని సూపర్‌హిట్ సినిమాల్లో ‘స్పైడర్’ ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘రెండు భాషల్లో సినిమా తీయడం అంత ఈజీ కాదు. అది గ్రేట్ డైరెక్టర్స్ వల్లే అవుతుంది. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్, ప్యాషన్ ఉండాలి. అది ఈ చిత్రనిర్మాతలకు ఉంది. సంతోష్ శివన్‌గారితో పనిచేయాలనే నా కోరిక మురుగదాస్ వల్ల తీరింది. నేను ఒక్కసారి కథ ఒప్పుకుని సినిమా కమిట్ అయితే ప్రాణం పెట్టి చేస్తా. నా డైరెక్టర్లు నాకు దేవుళ్లతో సమానం. దర్శకులను నమ్మినందుకే ‘అతడు, పోకిరి, శ్రీమంతుడు, ఒక్కడు’ వంటి సినిమాలు వచ్చాయి. అందువల్లే ఇంతవాణ్ణి అయ్యా. మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరోకూ ఉండరు. ఎందుకంటే.. నా సినిమా నచ్చితేనే చూస్తారు.. నచ్చకపోతే మీరే చూడరు. మీరెప్పుడూ అలాగే ఉండాలి. మీకోసం మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. ‘‘ఓ డైరెక్టర్‌కి మంచి స్ట్రెంత్ హీరో. అది మహేశ్‌లో ఉంది. ఏడాదిలో ఆర్నెల్లు నైట్ షూట్ చేశాం. ఏ రోజూ తను ఆలస్యంగా రాలేదు. త్వరగా వెళ్లలేదు. మహేశ్ డెడికేషన్‌కి ఈ ఫిల్మ్ డెడికేట్ చేస్తున్నా. నిర్మాతలు ఈ సినిమాకి పిల్లర్లు’’ అన్నారు మురుగదాస్. ‘‘నా కెరియర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘స్పైడర్’. నా డ్రీమ్ డైరెక్టర్ మురుగదాస్ అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పా. కథ వినకుండా ఈ సినిమా ఓకే చేశా. మరోసారి మహేశ్‌తో పని చేయాలనుకుంటున్నా’’ అన్నారు రకుల్. ‘‘స్పైడర్’ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్లో ‘మీకేం కావాలి’ అని మహేశ్‌ని అడిగినప్పుడు ‘ఈ జన్మకి నా ఫ్యాన్స్ చాలు’ అన్నారు. రజనీకాంత్‌గారికి ‘చంద్రముఖి’లా మహేశ్‌కి ‘స్పైడర్’ మిగిలిపోతుంది’’ అన్నారు ఎస్.జె.సూర్య. నిర్మాతలు సి. అశ్వినీదత్, బీవీఎస్ఎన్ ప్రసాద్, శానం నాగ అశోక్‌కుమార్, డీవీవీ దానయ్య, ‘దిల్’ రాజు, దర్శకులు కొరటాల శివ, వంశీ పైడిపల్లి, తమిళ నిర్మాత రాజు మహాలింగం, రిలయన్స్ సీఈఓ సుభాశిష్, ఎంపీ గల్లా జయదేవ్, నమ్రతా శిరోద్కర్, హీరో సుధీర్‌బాబు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్, కెమెరామెన్ సంతోష్ శివన్, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్, ‘ప్రేమిస్తే’ భరత్ పాల్గొన్నారు. -
ఈ జన్మకు తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలు!
– చెన్నైలో జరిగిన ‘స్పైడర్’ ఆడియో వేడుకలో మహేశ్‌బాబు మీరు చెన్నైలో పుట్టి, పెరిగారు. తమిళ్ బాగా వచ్చు. ఎప్పుడూ తమిళ సినిమా చేయాలనుకోలేదా? అనడిగితే... ‘‘భగవంతుడు తెలుగులో మంచి అభిమానులను ఇచ్చాడు. అక్కడ నేను పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నా. ఈ జన్మకు నాకది చాలు. తమిళంలో సినిమాలు చేయడం లేదనే కొరత లేదు. ఇప్పుడీ సిన్మాతో 18 ఏళ్ల తర్వాత మళ్లీ నేను నటుడిగా (తమిళంలో తొలి సినిమా) పరిచయమవుతున్నట్టుంది. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాషల్లో సినిమా చేయడం తమషా కాదు. దర్శక–నిర్మాతలు ఎలాంటి టెన్షన్లు లేకుండా చేశారు’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన తెలుగు–తమిళ సినిమా ‘స్పైడర్’. ‘ఠాగూర్’ మధు చిత్రసమర్పకులు. హ్యరీస్ జయరాజ్ స్వరకర్త. శనివారం చెన్నైలో తెలుగు, తమిళ పాటల్ని రిలీజ్ చేశారు. మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘మహేశ్ మద్దతు లేకుండా ‘స్పైడర్’ను బైలింగ్వల్‌గా తీయడం సాధ్యమయ్యేది కాదు. మహేశ్‌కు సూపర్‌స్టార్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. ‘నన్ను మీరు సూపర్‌స్టార్ అని పిలవొద్దు. టైటిల్స్‌లోనూ వేయొద్దు. ఫ్యాన్స్ మనసులో ఎలాగూ ఉన్నాను. ఇక, ప్రత్యేకంగా చాటుకోవలసిన అవసరం లేదు’ అన్నారు మహేశ్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేశ్‌ను చూసి... ‘చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్లా ఉన్నాడు. లుక్ అదిరింది’ అని మెచ్చుకోవడం చూసి థ్రిల్ అయ్యా. ఆయన మహేశ్ గురించి చాలాసేపు మాట్లాడారు. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ‘లైకా ప్రొడక్షన్స్’ రాజుమహాలింగం. ‘‘మహేశ్, సూర్య, కార్తీ, దర్శకుడు వెంకట్‌ప్రభు, నేను... చెన్నైలో సేమ్ స్కూల్లో చదువుకున్నాం. మహేశ్‌తో తప్ప మిగతావాళ్లతో సిన్మాలు తీశా. మహేశ్‌తో తీయాలని నా కోరిక. తెలుగులో ‘గజని’ ఎంత హిట్టయ్యిందో ‘స్పైడర్’ అంతకు మించి హిట్టవుతుంది. సెప్టెంబర్ 27న వసూళ్ల సునామి రాబోతోంది’’ అన్నారు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా. -
గుమ్మడికాయ కొట్టేశారు... హాలీ హాలీతో వస్తున్నారు
మహేశ్‌బాబు, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. రొమేనియాలో చిత్రీకరించిన చివరి పాటతో సినిమా పూర్తయింది. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు మ్యూజిక్ సింగిల్స్‌తో (ఒక్కో పాట విడుదల చేస్తూ) సందడి తీసుకు రావడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. ఆల్రెడీ విడుదలైన ‘బూమ్ బూమ్’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి తోడు ఈ నెల 4న సెకండ్ సింగిల్ ‘హాలీ హాలీ...’ను విడుదల చేస్తామని ప్రకటించారు. మహేశ్, రకుల్ స్టెప్పులేసిన ఈ డ్యూయెట్ ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ!! హ్యారీస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
బూమ్‌బూమ్ నాకు ప్రత్యేకం
తమిళసినిమా: బూమ్ బూమ్ పాట నాకు చాలా స్పెషల్ అంటున్నారు గాయని నిఖితగాంధీ. ఇటీవల హిట్ సాంగ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఈమె తాజాగా పాడిన పాట బూమ్‌బూమ్. స్పైడర్ చిత్రం కోసం పాడిన ఈ పాట పెద్ద హిట్ అయ్యిందన్న సంతోషంలో ఉన్న నిఖితగాంధీ తాను గాయనిగా మారడమే వింత అని పేర్కొన్నారు. ఆ కథేంటో ఆమె మాటల్లోనే చూద్దాం. నేను చెన్నైలో రామచంద్ర కళాశాలలో బీడీఎస్ చదువుకుంటున్నాను. నేను డాక్టర్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్న తరుణంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం యాదృచ్ఛికంగా వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో గాయనిగా స్థిరపడిపోయాను.తాజాగా స్పైడర్ చిత్రంలో పాడిన బూమ్‌బూమ్ పాట చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజం చెప్పాలంటే హారీష్ జయరాజ్ సంగీతదర్శకత్వంలో నేను పాడిన తొలిపాట ఇదే. ఆయన సంగీత దర్శకత్వంలో పాడడం చాలా జాయ్‌ఫుల్‌గా ఉంది. అయితే వర్క్ విషయంలో హారీష్‌జయరాజ్ చాలా పర్ఫెక్ట్‌నిస్ట్.తనకు కావలసింది వచ్చే వరకూ విశ్రమించరు. ఇక దర్శకుడు ఏఆర్.మురుగదాస్ చూడడానికి కామ్‌గా ఉన్నట్లు అనిపించినా యూనిట్ వాళ్లతో చాలా సరదాగా ఉంటారు.అదే విధంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రంలో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకూ చాలా పాటలు పాడినా స్పైడర్ చిత్రంలోని బూమ్‌బూమ్ పాట నాకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు. మహేశ్‌బాబు, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం స్పైడర్. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో ఎస్ఏ.సూర్య, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని బూమ్ బూమ్ పాట ఇప్పటికే సింగిల్ ట్రాక్‌గా విడుదలై విశేష ఆదరణను పొందుతుండగా,చిత్ర టీజర్ మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ఈ నెల 9వ తేదీన విడుదలై మూడు రోజుల్లోనే 8 మిలియన్ల ప్రేక్షకులను అలరించడం రికార్డు అంటున్నారు చిత్ర వర్గాలు. స్పైడర్ చిత్రం విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 23న తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. -
భయపెట్టడం మాకు తెలుసు: మహేష్ బాబు
-
భయపెట్టడం మాకూ తెలుసు: మహేష్ బాబు
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్’ టీజర్‌ని విడుదల చేసింది. ఎస్జే సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నారు. 'భయపెట్టడం మాకు తెలుసు' అనే మహేష్, 'పెరుగుతున్న జనాభాను కంట్రోల్ గవర్న్మెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్జే సూర్య చెబుతున్న డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి. స్పైడర్ టీజర్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేసిన గంటలో 33 వేలకు పైచిలుకు హిట్స్ వచ్చాయి. విజయ దశమి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యూరప్‌లో ఆటాపాటా
ఆగస్ట్ ఫస్ట్ వీక్ మహేశ్‌బాబు హైదరాబాద్‌లో ఉండరు. మరెక్కడ ఉంటారు? అంటే, యూరప్‌లో. అక్కడ రకుల్ ప్రీత్‌సింగ్‌తో ఆటాపాటాతో బిజీగా ఉండబోతున్నారు. ఈ బిజీ అంతా ‘స్పైడర్’ సినిమా కోసమే. ఈ ఇద్దరూ పాల్గొనగా యూరప్‌లో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆగస్ట్ 1న యూరప్‌లో పాట చిత్రీకరణ మొదలుపెడతాం. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తాం. ఈ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్‌తో ‘స్పైడర్’ నిర్మిస్తున్నాం. మిక్సింగ్, గ్రాఫిక్స్ పనులూ వేగంగా జరుగుతున్నాయి. విజయదశమి కానుకగా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు. -
ష్... తమిళ్ సేల్స్ క్లోజ్డ్!
మహేశ్‌బాబు ‘స్పైడర్’ టీజర్లో ఏముంది? అనడిగితే ‘ష్...’ అనే చెప్పాలి! అందులో నో డైలాగ్స్, నో యాక్షన్, నో డీటెయిల్స్! మాంచి స్టైలిష్ లుక్కులో ఉన్న మహేశ్ ‘ష్..’ అంటూ ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. జస్ట్ వన్ మినిట్ ఉన్న ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేశ్‌బాబు–దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌కి తోడు, సిన్మాపై ఉన్న అంచనాలను ఈ టీజర్ మరింత పెంచింది. అందుకు ఉదాహరణగా ఈ విజయ దశమికి విడుదలవుతోన్న ఈ సినిమా తమిళ్ సేల్స్ రెండు నెలల ముందే క్లోజ్ అవ్వడాన్ని చెప్పుకోవాలి. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ‘స్పైడర్’ తమిళ్ థియేట్రికల్ రైట్స్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. రజనీకాంత్ ‘2.0’ను నిర్మిస్తున్నది ఈ సంస్థే. రూ. 25 కోట్లకు లైకా సంస్థ ‘స్పైడర్’ రైట్స్‌ను సొంతం చేసుకుందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్, ఎస్.జె. సూర్య విలన్. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: సంతోష్ శివన్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిక్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్. -
ప్రియమైన అతిథి
మహేశ్‌బాబు గుడ్ ఫాదర్. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం టైమ్ కేటాయిస్తారు. ఎక్కువ రోజులు షూటింగ్‌కి సెలవులు దొరికితే భార్యా–పిల్లలతో విదేశాలకు చెక్కేస్తారు. ఒకవేళ లోకల్లో ఉంటే, అప్పుడప్పుడూ పిల్లలను షూటింగ్ లొకేషన్‌కి తీసుకెళుతుంటారు. షాట్ గ్యాప్‌లో పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తారు. అలా ‘స్పైడర్’ సెట్‌కి కూతురు సితారను తీసుకెళ్లారు మహేశ్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ‘స్పైడర్’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేశ్–రకుల్‌పై ఓ సెట్ సాంగ్ తీస్తున్నారు. ‘‘మా సెట్‌కు ప్రియమైన అతిథి ఒకరు వచ్చారు. ఆ గెస్ట్ ఎవరో చూడండి’ అంటూ సంతోష్‌శివన్ తన కెమెరాలో బంధించిన తండ్రీకూతుళ్లు మహేశ్–సితార చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే సితారతో దిగిన ఫొటోను చిత్రకథానాయిక రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మొత్తానికి చిన్నారి సితార షూటింగ్ లొకేషన్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది. ‘స్పైడర్’ యూనిట్‌కి ప్రియమైన అతిథి అయింది. -
గన్నుకీ... స్టెతస్కోప్కీ..!
అబ్బాయేమో ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అమ్మాయేమో కాబోయే డాక్టర్. ప్రొఫెషనల్ ట్రాక్ వేరైనా లవ్ ట్రాక్ ఈ ఇద్దర్నీ ఒక్కటి చేసింది. గన్‌కు, స్టెతస్కోప్‌కు జోడీ కుదిరింది. ఇంకేముంది? మంచి సాంగ్ పాడుకోవాలనుకుందీ జంట. అంతే.. పాడుకున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పైడర్’లో మహేశ్‌బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా, రకుల్‌ప్రీత్ సింగ్ మెడికో స్టూడెంట్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హ్యారీస్ జైరాజ్ పాటలు అందించారు. పైన చెప్పుకున్నదంతా ఈ పాటల్లో ఉన్న ఓ రొమాంటిక్ సాంగ్ గురించే. ఈ పాటను బ్రిజేష్ శాండిల్య పాడారు. అల్లు అర్జున్ ‘సరైనోడు’ కోసం ‘రంగు రంగు సైకిలెక్కి...’ అనే టైటిల్ సాంగ్ తర్వాత తెలుగులో బ్రిజేష్ పాడింది ‘స్పైడర్’ కోసమే. ఈ పాట పాడే అవకాశం చాలా గమ్మత్తుగా వచ్చిందంటున్నారు బ్రిజేష్. ‘‘హడావిడిగా ఉన్న ఓ మార్కెట్లో వెళుతున్నప్పుడు హ్యారీస్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. మహేశ్‌బాబు ‘స్పైడర్’కి పాడాలన్నారు. కావాలని ఎవరో ఆటపట్టిస్తున్నారని లైట్ తీసుకున్నా. ఆ తర్వాత ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే, అది హారీస్ సార్‌ది అని తెలిసింది. దాంతో ఎగై్జట్. నాకీ పాటకు అవకాశం రావడానికి కారణం రైటర్ రామజోగయ్య శాస్త్రి. ఆయనే నా పేరుని హ్యారీస్‌కి సూచించారు’’ అని బ్రిజేష్ పేర్కొన్నారు. ఇది పక్కా దేశీ రొమాంటిక్ సాంగ్. ‘‘వచ్చే నెల 5న ఈ పాట చిత్రీకరణ మొదలుపెడతాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన మూడు భారీ సెట్స్‌లో షూట్ చేయబోతున్న ఈ పాట చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన పాటను చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి’’ అని నిర్మాతల్లో ఒకరైన ‘ఠాగూర్’ మధు తెలిపారు. సెప్టెంబర్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
సిట్టింగ్ వేసి మందు బాటిల్ ఓపెన్ చేయబోతే..
పాడేరు రూరల్: సిట్టింగ్ వేసిన మందుబాబు.. తీరా బాటిల్ తెరవబోయేసరికి షాక్ తిన్నాడు. మందుతాగాలన్న కోరిక సంగతేమోగానీ ఒక్కక్షణం.. ‘బతికిపోయానురా దేవుడా’ అనుకున్నాడు. విశాఖపట్నం జిల్లా పాడేరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక శ్రీనివాస లాడ్జి ఎదురుగా ఉన్న వైన్ షాపులో సోమవారం హాఫ్‌బాటిల్ మద్యం కొన్నాడు. ఇంటికెళ్లి గ్లాసు, వాటర్ ప్యాకెట్, స్టఫ్.. సిద్ధం చేసుకుని తీరా మందుబాటిల్ ఓపెన్ చేయబోతు ఆగిపోయాడు. బాటిల్ లోపల పెద్ద పెద్ద సాలె పురుగులు చనిపోయి ఉండటాన్నిచూసి షాకయ్యాడు. కొద్దినిమిషాల తర్వాతగానీ తేరుకున్న మందుబాబు.. ఆ బాటిల్‌ను తీసుకెళ్లి వైన్‌షాప్ యజమానికి చూపించాడు. అయితే సదరు బాటిల్ తన షాపులో కొన్నది కాదని ఆ యజమాని వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య కాసుపు వాగ్వాదం నడిచింది. ఇంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు వైన్‌షాప్ వద్దకు చేరుకుని బాధితుడిని అక్కడి నుంచి పంపేశారు. ఇంతకీ బాటిల్లోకి పురుగులు ఎలా వచ్చాయి? స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై ఎక్సైజ్ సీఐ రాజారావును ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘పురుగులు కనిపించిన మద్యం బాటిల్ సీల్ వేసే ఉంది. అంటే, స్థానికంగా కల్తీ అయినట్లు కాదు. ఖచ్చితంగా మద్యం తయారీ కేంద్రం(కంపెనీ)లోనే తేడా జరిగి ఉండొచ్చు’ అని సమాధానమిచ్చారు. కాబట్టి మద్యం ప్రియులూ.. కాస్త జాగ్రత్త. ఏ బాటిల్లో ఏముందో జర చూసుకొని.. -
నో రెస్ట్
షూటింగ్ స్పాట్... మేకప్ కిట్... సై్టల్ కట్... చివరకు, డైరెక్టర్ కట్ చెప్పగానే ఆయన వాయిస్ వచ్చే మైక్ సెట్... ఈ వీకెండ్లో ఆల్మోస్ట్ అన్నీ ఛేంజ్ అవుతాయి. సినిమాలపై మహేశ్‌బాబు డెడికేషన్, ప్యాషన్ తప్ప! రెస్ట్ తీసుకోకుండా ఓ సినిమా సెట్ నుంచి మరో సినిమా సెట్‌కు ఆయన షిఫ్ట్ అవ్వనున్నారు. మొన్న మంగళవారం ఉదయమే మహేశ్‌బాబు లండన్ నుంచి వచ్చారు. ఫ్యామిలీతో కలసి హాలిడేకి వెళ్లిన ఆయన తిరిగొచ్చిన వెంటనే చెన్నైలోని ‘స్పైడర్’ సెట్‌కి వెళ్లారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నెల 17 వరకు ‘స్పైడర్’ చెన్నై షెడ్యూల్ జరుగుతుంది. ఆదివారం ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని వచ్చే సోమవారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో మొదలైంది. మహేశ్ లేకుండా ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు సోమవారం మహేశ్ ఈ చిత్రబృందంతో కలుస్తున్నారన్న మాట!! -
ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. అంతే కాకుండా ఆమె తన ప్రాణం పోతుందేమో అనుకునేలా చేసింది. తీవ్రమైన తలనొప్పితో బాధిత మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బతికున్న సాలీడును ఆమె చెవిలో గుర్తించారు. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం లేవగానే భరించలేని తలనొప్పితో పాటు తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడంతో... ఆమె చెవిని పలుసార్లు రుద్దుకుని, చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా తలనొప్పి అంతకంతకు తీవ్రతరం కావడంతో కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లిన ఆమెను డాక్టర్ పరీక్షించిన చెవిలో సాలీడు ఉన్నట్లు గుర్తించారు. అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు సాలె పురుగు పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో షాక్ తినడం డాక్టర్ వంతైంది. ఈ సందర్భంగా లక్ష్మిని పరీక్షించిన ఈఎన్టీ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడుతూ .... చెవిలో దూరిన సాలీడు బతికి ఉండటం తాము తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. -
జస్ట్ పది రోజులు చాలు!
జస్ట్... టెన్ డేస్! పదంటే పది రోజులు షూటింగ్ చేస్తే మహేశ్‌బాబు ‘స్పైడర్’ సిన్మా కంప్లీట్ అవుతుందట! దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ చాన్నాళ్లుగా జరుగుతోంది. ఈ సిన్మా టాకీ పార్ట్ ఆల్మోస్ట్ పూర్తయింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలలోనే వాటిని ఫారిన్లో పిక్చరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు పాటల చిత్రీకరణకు పది రోజులు పడుతుందట. మహేశ్‌తో మొదటిసారి పని చేస్తోన్న మురుగదాస్... ‘‘హి (మహేశ్) ఈజ్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఫ్రెండ్లీ అండ్ డౌన్ టు ఎర్త్’’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ను నెట్టింట్లో కోటీ యాభై లక్షల మందికి (15 మిలియన్ వ్యూస్) పైగా చూశారు. -
వారం ముందే స్పైడర్?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాక, హిందీ సినిమా మాత్రమే పరిచయమున్న ప్రేక్షకుడికి కూడా తెలిసిన పేరు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘స్పైడర్’ దసరా సీజన్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మధ్యే ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేకుండా ‘ష్...’ అంటూ వచ్చిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రాబడుతోంది. దీంతో ‘స్పైడర్’ పై బాలీవుడ్లో కూడా క్రేజ్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ హిందీలో అనువదించి, విడుదల చేయాలనుకుంటోందట. రిలీజ్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇంకో విషయం ఏంటంటే... బాలీవుడ్ ప్రముఖులకు, మీడియా వారికీ రిలీజ్‌కు ఓ వారం ముందే స్పెషల్ షోస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీమ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. -
నో సెలబ్రేషన్స్
మే 31 అంటే నిన్న... సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే. ప్రతి ఏడాది అభిమానుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, నిన్న ‘నో’ బర్త్‌డే సెలబ్రేషన్స్. ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుపై గౌరవంతో, ఆయన మృతికి సంతాప సూచికంగా నివాళులు అర్పిస్తూ పుట్టినరోజు వేడుకలను రద్దు చేశారు. అలాగే, కృష్ణ తనయుడు మహేశ్‌బాబు నటిస్తున్న తాజా సినిమా ‘స్పైడర్’ టీజర్‌ను సైతం నిన్న సాయంత్రం విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ, దాసరి మరణించిన సంగతి తెలియగానే ‘స్పైడర్’ టీజర్ విడుదల వాయిదా వేశారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
దసరాకు వచ్చేస్తున్నా
‘స్పైడర్’గా మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ సూపర్! అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మహేశ్‌కు మాంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సేమ్ లుక్‌లో రెండున్నర గంటలు సిల్వర్ స్క్రీన్‌పై సూపర్‌స్టార్ సందడి ఎలా ఉంటుందో అనే ఊహ సినిమాపై రోజు రోజుకీ ఆసక్తిని పెంచేస్తోంది. దాంతో థియేటర్లలోకి ‘స్పైడర్’ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ద వెయిట్ ఈజ్ ఓవర్! ‘‘ఈ దసరాకు ‘స్పైడర్’ థియేటర్లలోకి వస్తుంది. బుధవారం ఐదు గంటలకు విడుదలయ్యే టీజర్‌తో పార్టీ మొదలవుతుంది’’ అని మహేశ్ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. బుధవారం మహేశ్ తండ్రి కృష్ణ పుట్టినరోజు. సో.. డాడీ బర్త్‌డే గిఫ్ట్‌గా మహేశ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. -
సాలెగూళ్లో చిక్కారు!
సాలెగూడులో పడి ఎటూ వెళ్లలేక కొన్ని పురుగులు గిల గిల గింజుకుంటుంటే ఎలా ఉంటుందో... సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషనే మహేశ్‌బాబు ‘స్పైడర్’ సెట్లో కనిపిస్తోందట! మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ‘స్పై’... అదే సీక్రెట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగారు ‘స్పై’ అని తెలీక, కొందరు చీడ పురుగులు చాలా చాలా చెడు పనులు చేసేశారు. చివరకు, కథ కంచెకు చేరే టైమ్‌లో సాలీడులా మన ‘స్పై’ అల్లిన సాలెగూడు (ఉచ్చు)లో చిక్కుకుంటారు. ఆ సాలెగూళ్లో చిక్కుకున్న బద్మాష్లకు సంబంధించిన సీన్లను ఇప్పుడు చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. ఈ 16న చెన్నైలో ‘స్పైడర్’ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ వరకు క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందట! ఆ తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్ వెళ్తారట! చెన్నై షెడ్యూల్లో హీరోతో పాటు సినిమాలో విలన్‌గా నటిస్తున్న దర్శకుడు ఎస్.జె. సూర్య తదితరులు పాల్గొంటున్నారు. రకుల్ íహీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
అభిమానులకు స్పైడర్ గిఫ్ట్
ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. అభిమానులకు ఆ రోజు పెద్ద పండగే. ఈ ఏడాది పండక్కి వాళ్లకు పెద్ద బహుమతి ఇవ్వడానికి మహేశ్ సిద్ధమవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. మొదట ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు విడుదల తేదీ మారింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘స్పైడర్’ను విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాట. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరపనున్నారు. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదల చేసిన మహేశ్ ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారీస్ జయరాజ్. -
క్లాస్.. మాస్... స్పైడరే
చూపుల్లో బుల్లెట్ కంటే పవరూ... యాటిట్యూడ్‌లో ఇతరులకు అంతు చిక్కని ఆలోచనలూ... ఈ రెండిటికీ మించి సూపర్ స్టైలూ... మహేశ్‌బాబు కొత్త లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. మహేశ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్పైడర్’ను టైటిల్‌గా ఖరారు చేశారు. బుధవారం టైటిల్‌తో పాటు సినిమాలో మహేశ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకోవడం, ఇన్‌షర్ట్ చేసుకోవడం మహేశ్‌కు కొత్త కాదు. కానీ, మాస్లో క్లాస్... క్లాస్‌లో మాస్.... మిక్స్ చేసిన ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. మహేశ్ జేమ్స్ బాండ్లా ఉన్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య, తమిళ నటుడు భరత్ తదితరులు నటిసున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: హ్యారీస్ జయరాజ్. -
స్పైడర్
స్పైడర్ అంటే.... సాలీడు. అది కట్టిన సాలెగూడులో ఎవరైనా పడాల్సిందే. ఈ హీరో కట్టిన స్పైడర్ వెబ్‌లో దొంగల్, దుర్మార్గుల్, రాస్కెల్, క్రిమినల్ అండ్ అదర్స్ ప...డ...క... మానుతారా! మహేశ్‌బాబు సినిమా కథ కోసం ‘స్పైడర్’ అన్న టైటిల్ రిజిస్టర్ అయ్యిందనీ, మా మాటే రైట్ అనీ... అందరూ బూజు దులుపుతున్నారు. బూజు దులుపుతున్నవాళ్లు కొత్త కథల గూళ్లను కూడా కడుతున్నారు. నిజానికి, ఈ రోజుల్లో కథకులు, దర్శకుల కంటే రెండు గూళ్లు ఎక్కువే చదివారు ప్రేక్షకులు. వాళ్లు చెప్పే కథ ప్రకారం... ‘స్పైడర్’లో మన హీరో మహేశ్ ఓ ‘స్పై’ అట. సూపర్‌స్టార్ ‘గూఢచారి 116’ తర్వాత ఇండస్ట్రీ రికార్డుల గూళ్లను బద్దలుగొట్టే ‘స్పై’ ఇతనేననీ, మఫ్టీలో తిరిగే మస్త్ భాయ్ అనీ టాక్. మఫ్టీలో క్రిమినల్స్‌నే కాదు... హీరోయిన్లను కూడా గిరికీలు తిప్పి తన హార్ట్ వెబ్‌లో తీసుకుంటాడట. రొమాన్స్ అదిరిందట! సెంటిమెంట్ చిక్కగా ఉందట! ఫైట్స్ బాండ్‌ను తలదన్నేలా ఉన్నాయట! సినిమా కథ నిజంగా ఏమై ఉంటుందో మాకు తెలీదు గానీ... కొత్తగా గూఢచర్యం చేస్తే ‘స్పైడర్’ గూడు చెదిరింది. సరదాగా చదువుకున్నోళ్లకు బోరింగ్ లైఫ్‌లో బూజు కొంచెం వదిలింది. ఏమంటారు...! ఇంతకు ముందు ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’, ‘సంభవామి’, ‘మర్మం’ ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరకు, హీరో మహేశ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధులు ‘స్పైడర్’ను ఫిక్స్ చేశారట. ‘ఎన్వీఆర్ సినిమా’ సంస్థ ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. త్వరలో ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేస్తారట! -
ముత్యాల పందిరి
-
రెడ్ బ్యాక్... యమ డేంజర్!
విష జంతువులు, పురుగులతో జర జాగ్రత్తగానే ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. చూసేందుకు సూక్ష్మంగా కనిపించినా వాటిలో విషం మహ పవర్ ఫుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయన్నది మళ్ళీ తెలిసింది. చిన్న సాలీడు కుట్టినా ప్రాణం పోతుందన్నది ఇప్పుడు ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. 'రెడ్ బ్యాక్' స్పైడర్ కుట్టి ఓ యువకుడు చనిపోవడం అక్కడి జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్ట్రేలియాలో సిడ్నీకు చెందిన జాయ్ డెన్ బర్లైగ్ అనే 22 ఏళ్ళ యువకుడు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలోని నార్త్ కోస్ట్ ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా 'రెడ్ బ్యాక్' సాలీడు కుట్టి చనిపోవడం అక్కడి జనాన్ని భయకంపితుల్ని చేసింది. గతవారం జాయ్ డెన్ ఎడమ మోచేతిని సాలీడు కుట్టడంతో విషం అతని గ్రంధులకు చేరిపోయింది. నాలుగు రోజులపాటు యాంటీబయోటిక్స్ తో వైద్యం అందించిన డాక్టర్లు గురువారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేశారు. ఒకరోజు బాగానే ఉన్న అతడు ఆదివారం చనిపోయాడు. అయితే జాయ్ కు నంబోర్ ఆస్పత్రి వైద్యులు విషానికి విరుగుడుగా మందు అందించారో లేదో అన్న అనుమానం అతడి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. యాంటీ వీనమ్ అభివృద్ధి పరిచిన అనంతరం 1955 తర్వాత రెడ్ బ్యాక్ కుట్టడంతో మనుషులు చనిపోయినట్లు రికార్డుల్లో మాత్రం ఎక్కడా లేనట్లు తెలుస్తోంది. జాయ్ మరణం తమకు తీరని విషాదంగా మారిందని, తమ కొడుకు ప్రాణాన్ని సాలీడు రూపంలో మింగేస్తుందని ఊహించలేదని జాయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడాది క్రితం చిన్నకొడుకు లచ్లాన్ కారు ప్రమాదంలో చనిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డ జాయ్ ఇప్పుడిప్పుడే కోలుకోగా... వారం క్రితం సాలీడు కుట్టడంతో వచ్చిన ఇన్ఫెక్షన్ తో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, తీరా ఇంటికి వచ్చిన రెండు రోజులకు ప్రాణం పోవడం ఆ తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడికి వైద్యులు సరైన విషం విరుగుడు మందు ఇచ్చారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ డెన్ ప్రకృతి ప్రేమికుడని, పర్వతాలు ఎక్కడం, సముద్రాల్లో డైవింగ్, అడవుల అన్వేషణ వంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేసేవాడని మరెవ్వరికీ ఇటువంటి నష్టం జరగకుండా విష పురుగులతో ప్రమాదాలను నివారించే ప్రయత్నాలు మరింత జరగాలని కోరుతున్నారు. వైవిధ్యభరితమైన సాలె పురుగులకు ఆస్ట్రేలియా ప్రసిద్ధి. అయితే వాటిలో చాలా జాతులు మనుషులకు కొద్దిపాటి ముప్పు తెచ్చిపెట్టేవే అయినా ప్రాణాంతకం మాత్రం కావు. అయితే బ్లాక్ విడో జాతికి చెందిన రెడ్ బ్యాక్ మాత్రం దేశంలోని పెద్ద నగరాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని రెండు డేంజరస్ సాలె పురుగుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఆ ఖండంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలెపురుగు మాత్రం ఫన్నల్-వెబ్. ఈ ఫన్నల్ వెబ్ కుట్టడం కారణంగా 1980 తర్వాత ఎవరూ చనిపోయినట్లుగా రికార్డులు లేవని ఆస్ట్రేలియా మ్యూజియం ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే సంవత్సరానికి కనీసం 2 వేల మంది దాకా రెడ్ బ్యాక్ కాటుకు గురౌతూనే ఉంటారని, ఈ సాలె పురుగు కుట్టినప్పుడు తీవ్రమైన మంట, నొప్పి, నరాల బలహీనత, వాంతులు వంటి బాధలు కలుగుతాయని చెప్తున్నారు. కాగా ముఖ్యంగా ఆడ పురుగులు కుట్టినప్పుడు అవి వాటి చొంగను వదులుతాయని దాంతో కొంత ప్రమాదమేనని చెప్తున్నారు. -
రాకాసి సాలీడు
తిక్క లెక్క పాడుబడ్డ ఇళ్లల్లో బూజు గూళ్లు అల్లేసే సాలీళ్లు సాధారణంగా వేలెడంత ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాత్రం అలాంటిలాంటి సాలీడు కాదు. ఇది రాకాసి సాలీడు. ప్రపంచంలోని అన్ని రకాల సాలీడు జాతుల్లో ఇదే అతిపెద్దది. దీని రెండు పాదాల నడుమ దూరం దాదాపు ఒక అడుగు ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే పదకొండు అంగుళాలు (28 సెంటీమీటర్లు). సురినామ్, గయానా, ఫ్రెంచి గయానాలలోని తీరప్రాంతాలకు చేరువగా ఉండే అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు సాలీళ్లు ఈగల వంటి కీటకాలను తిని బతుకుతాయి. ఈ సాలీళ్లు మాత్రం ఏకంగా చిన్న చిన్న పక్షులను సైతం అవలీలగా భోంచేసేస్తాయి. -
చంపేస్తా... నీ పని అయిపోయినట్లే!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వారం కిందట ఓ ఫ్లాట్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. భయంతో కూడిన అరుపులు ‘నేను నిన్ను చంపేస్తా. నీ పని అయిపోయింది. చావు... చావు’ అని గట్టిగా కేకలు వినిపించేసరికి అపార్ట్మెంటులోని ఇరుగుపొరుగు ఫ్లాట్లలో నివసించే వారు కంగారుపడిపోయారు. ఏదో ఘోరం జరుగుతోందనుకొని... పోలీసులకు ఫోన్ కొట్టారు. భార్యాభర్తలో, ప్రేమికులో గొడవ పడుతున్నారని... చంపేస్తాననే కేకలు వినపడుతున్నాయని ఫిర్యాదు చేశారు. దాంతో ఆగమేఘాల మీద పోలీసులు వచ్చేశారు. సదరు అరుపులు వినిపించిన ఫ్లాట్‌ను చుట్టుముట్టి... డోర్ కొట్టారు. 30లలో ఉన్న వ్యక్తి తలుపుతీసి భారీ సంఖ్యలో ఉన్న పోలీసులను చూసి నివ్వెరపోయాడు. పోలీసులు ఫ్లాట్‌లో వెతుకుతూ... ఎక్కడ నీ భార్య లేక గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడ? అంటూ గద్దించారు. వెర్రిమొహం వేసిన అతను... ‘నాకెవరూ లేరు. నేను ఒంటరిగా ఉంటాను’ అంటూ బదులిచ్చాడు. మరి చంపేస్తాననే కేకలేంటి? అని పోలీసులు అడగ్గా.... అప్పుడు విషయం అర్థమైంది మనోడికి. ‘ఓ అదా... పెద్ద సాలీడు ఫ్లాట్‌లో చొరబడింది. దాన్ని చంపుదామని స్ప్రేతో వెంటపడ్డాను. ఆ సందర్భంగా అన్నాను’ అంటూ అసలు విషయం చెప్పాడు. మరి భయంతో కూడిన అరుపులు వినిపించాయి అని అడగ్గా... మనోడు మెలికలు తిరిగిపోతూ ‘సారీ... నాకు సాలీడు అంటే విపరీతమైన భయం. దాంతో మొదట్లో భయంతో అరిచాను. తర్వాత చంపేస్తానంటూ దాని వెంటపడ్డాను’ అని మెలికలు తిరిగిపోతూ చెప్పాడట. ఓరి నీ దుంపతెగ... అనవసరంగా మా సమయం అంతా వృథా చేశావంటూ పోలీసులు ఓ నిట్టూర్పు విడిచి వెళ్లిపోయారట. -
‘ఎమ్మా’యో...
ఈ ఫొటో చూసి ఇదేదో కొంచెం కొత్తగా ఉన్న సాలీడు అనుకుంటున్నారా? కాస్త పరిశీలించి చూడండి.. ఏమి కనిపిస్తోంది? ఔను.. మీరు అనుకున్నది కరెక్టే.. ఆమె ఓ యువతి. ఇంగ్లండ్‌లోని లీఛెస్టర్కు చెందిన ఎమ్మా ఫే అనే బాడీ పెయింటింగ్ ఆర్టిస్ట్ తన చిత్రకళా నైపుణ్యంతో లౌరీ థామస్ అనే కార్టూనిస్ట్‌ను ఇలా సాలీడు గా మార్చేశాడు. ఇందుకు అతడికి ఐదు గంటల సమయం పట్టింది. అలాగే బెత్ సైక్స్ అనే మరో యువతిని జిరాఫీ, సముద్ర గుర్రంగా తీర్చిదిద్దాడు. -
సాలీడును చంపబోయి కటకటాలపాలు!
వాషింగ్టన్: సాలెపురుగును చంపబోయి అమెరికాలో ఓ అమ్మడు కటకటాలపాలైంది! సాలీడును చంపితే అరెస్టు చేయాలంటూ అమెరికాలో చట్టాలేమీ లేవుగానీ.. ఎలుక కోసం ఇంటికి నిప్పుపెట్టినట్టుగా కాన్సాస్‌లోని హచిన్సన్కు చెందిన గిన్నీ ఎం.గ్రిఫిత్ అనే 34 ఏళ్ల మహిళ కూడా దాదాపుగా ఇంటికి నిప్పుపెట్టినంత పనిచేసింది. ఇంట్లో ఉన్న టవల్స్‌ను పోగేసి వాటికి నిప్పుపెట్టి ఆ మంటతో సాలీడును హతమార్చేందుకు ప్రయత్నించింది. అయితే.. మంటలు ఇంట్లో సగం వరకూ వ్యాపించాయి. మంటల సంగతి తెలిసి వెంటనే ఉరుకులు పరుగుల మీద వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేశారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. తీరా సాలీడును చంపేందుకే తాను నిప్పుపెట్టానని చెప్పినా.. ప్రమాదకర స్థాయిలో గృహదహనానికి కారణమైందన్న అభియోగం కింద ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారని స్థానిక మీడియా పేర్కొంది. -
సాలీడుకు, మనకూ జన్యు పోలికలు..!
జన్యు మార్పిడి చేసిన సాలీడు కాటు వల్ల తాజా స్పైడర్‌మ్యాన్ సినిమాలో హీరోకు విచిత్ర శక్తులు వస్తాయి. వాస్తవానికి సాలీడు కాటువల్ల సినిమాలో తప్ప నిజజీవితంలో ఎలాంటి శక్తులూ రావు. కానీ.. జన్యుపరంగా సాలీడుకు, మనకూ కొన్ని పోలికలు మాత్రం ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. డెన్మార్క్ ఆరస్ యూనివర్సిటీ, బీజింగ్ జీనోమిక్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా చిన్నగా ఉండే వెల్వెట్ స్పైడర్, పెద్దగా, వెంట్రుకలతో ఉండే టరంటులా స్పైడర్ల జన్యుపటాలను ఆవిష్కరించారు. ఈ రెండు సాలీడు జాతులు 30 కోట్ల ఏళ్ల క్రితం ఒకే జాతి సాలీడుల నుంచి పరిణామం చెందాయని అంచనా. సుదీర్ఘ కాలం అయినందున వీటిలో 300 జన్యువులు మాత్రం ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. అయితే టరంటులా సాలీడు జన్యుపటంలో ఇంకా కొన్ని జన్యుక్రమాలను ఆవిష్కరించాల్సి ఉంది. సాలెగూడు అల్లేందుకు సన్నటి, దృఢమైన దారాన్ని, విషాన్ని అవి ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి? అందుకు జన్యుపరంగా ఉన్న అనుకూలతలు ఏమిటన్నది సాలీడు జన్యుపటంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి జన్యుసమాచారంపై అధ్యయనం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమమైన బయోమెటీరియల్స్, ఔషధాలు, పురుగుమందులు వంటివాటిని తయారు చేయవచ్చని చెబుతున్నారు. -
సాలెపురుగు భయంతో 42 వేల కార్లు వాపస్
కారు ఫ్యుయల్ టాంకు వద్ద సాలెపురుగు గూడుకట్టడంతో మజ్దా కంపెనీ అమెరికాలో 42000 కార్లను వెనక్కి రప్పించుకుంది. ఇవన్నీ 2010 నుంచి 2012 మధ్యలో ఉత్పత్తైన కార్లే. మజ్దా వాహనం వెంట్ హోస్ లో యెల్లో సాక్ స్పైడర్ అనే సాలెపురుగు గూడు కట్టింది. ఈ సాలెపురుగుకి ఇంధనంలోని హైడ్రోకార్బన్లంటే చాలా ఇష్టం. ఇది వచ్చి గూళ్లు పెట్టేసరికి ఇంధనం టాంకులో ఒత్తిడిపెరిగి, పగుళ్లు చూపే ప్రమాదం ఉంటుంది. కారు తనంతట తాను మండిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇదే సమస్య వల్ల 2011 లోనూ కొన్ని కార్లను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. వీటిలోకి సాలెగూళ్లు వెళ్లకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. కానీ పురుగులు లోపలికి ఎలాగోలా ప్రవేశించి గూడు కట్టేసింది. దాంతో ఇప్పుడు అన్ని కార్లను ఉపసంహరించుకుంది మజ్దా కంపెనీ.