సిడ్ని: సాలెపురుగు అనగానే మనకు టక్కున స్పైడర్ మ్యాన్ సినిమాలు గుర్తుకు వస్తాయి. హీరోకు సాలెపురుగు కుట్టడంతో అతడికి అతీత శక్తులు రావడం.. ఆపదల నుంచి ప్రజలను కాపాడే సీన్లతో రూపొందించిన సినిమాలంటే చిన్నా పెద్దా అందరికి ఇష్టమే. కానీ వాస్తవంలో మాత్రం సాలెపురుగు ఓ మహిళను విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసిది. దాని దెబ్బకు ఆమె వారం పాటు కారు డ్రైవింగ్ జోలికి వెళ్లలేదు.
ఎందుకో ఏమిటో ఆ వివరాలు చూడండి.. ఆస్ట్రేలియా సౌత్‌వేల్స్‌కు చెందిన ఓ మహిళ బయటకు వెళ్దామని భావించి కారు డోరు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకు అక్కడ గొంగళిపురుగు ఆకారంలో ఓ జీవి కనిపించింది. ఏదో పురుగు అని భావించింది. కానీ తీరా డోర్ ఒపెన్ చేశాక అక్కడ ఆమెకు ఓ భారీ.. సాలెపురుగు కనిపించింది. దాని శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి. ఇలాంటి వింత, భారీ సాలీడును తొలిసారి చూడటంతో ఆమె ఒక్కసారి షాక్‌కు గురయ్యింది. తర్వాత కారు డ్రైవ్ చేయ్యాలంటేనే భయపడింది. దాంతో వారం రోజుల పాటు కారు జోలికి వెళ్లలేదు.
క్రిస్టియన్ జోన్స్ అనే వ్యక్తి ఈ భారీ సాలీడు ఫోటోలని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఆమె మొదట దీన్ని చూసి గొంగళిపురుగు అని భ్రమపడింది. కాదు సాలీడు అని తెలిసి షాక్ అయ్యిందంటూ జోన్స్ ఈ ఫోటోలని షేర్ చేశాడు. ఇక ఇంత భారీ సాలీడుని చూసిన నెటిజనులు మేం కూడా భయపడ్డాం.. ఇక అది నీ కారు కాదు.. కొత్త ఓనర్‌కి కీ ఇచ్చేయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే 500 మందికి పైగా కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment