సాలెపురుగు భయంతో 42 వేల కార్లు వాపస్
కారు ఫ్యుయల్ టాంకు వద్ద సాలెపురుగు గూడుకట్టడంతో మజ్దా కంపెనీ అమెరికాలో 42000 కార్లను వెనక్కి రప్పించుకుంది. ఇవన్నీ 2010 నుంచి 2012 మధ్యలో ఉత్పత్తైన కార్లే.
మజ్దా వాహనం వెంట్ హోస్ లో యెల్లో సాక్ స్పైడర్ అనే సాలెపురుగు గూడు కట్టింది. ఈ సాలెపురుగుకి ఇంధనంలోని హైడ్రోకార్బన్లంటే చాలా ఇష్టం. ఇది వచ్చి గూళ్లు పెట్టేసరికి ఇంధనం టాంకులో ఒత్తిడిపెరిగి, పగుళ్లు చూపే ప్రమాదం ఉంటుంది. కారు తనంతట తాను మండిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇదే సమస్య వల్ల 2011 లోనూ కొన్ని కార్లను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. వీటిలోకి సాలెగూళ్లు వెళ్లకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. కానీ పురుగులు లోపలికి ఎలాగోలా ప్రవేశించి గూడు కట్టేసింది. దాంతో ఇప్పుడు అన్ని కార్లను ఉపసంహరించుకుంది మజ్దా కంపెనీ.