రాకాసి సాలీడు
తిక్క లెక్క
పాడుబడ్డ ఇళ్లల్లో బూజు గూళ్లు అల్లేసే సాలీళ్లు సాధారణంగా వేలెడంత ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాత్రం అలాంటిలాంటి సాలీడు కాదు. ఇది రాకాసి సాలీడు. ప్రపంచంలోని అన్ని రకాల సాలీడు జాతుల్లో ఇదే అతిపెద్దది. దీని రెండు పాదాల నడుమ దూరం దాదాపు ఒక అడుగు ఉంటుంది.
కచ్చితంగా చెప్పాలంటే పదకొండు అంగుళాలు (28 సెంటీమీటర్లు). సురినామ్, గయానా, ఫ్రెంచి గయానాలలోని తీరప్రాంతాలకు చేరువగా ఉండే అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు సాలీళ్లు ఈగల వంటి కీటకాలను తిని బతుకుతాయి. ఈ సాలీళ్లు మాత్రం ఏకంగా చిన్న చిన్న పక్షులను సైతం అవలీలగా భోంచేసేస్తాయి.