షాంఘై: చైనాలో ఓ మహిళ చెవి నొప్పితో ఆస్పత్రికెళ్లింది. పరీక్షించిన వైద్యులు చెవిలోపలి భాగంలో ఓ సాలీడు గూడు కట్టుకుని సంతానంతో సహా కాపురం ఉన్నట్లు తేల్చారు. సిచువాన్ ప్రావిన్స్ హుయిడాంగ్ కౌంటీ ఆస్పత్రికి సుమారు పది రోజుల క్రితం ఓ మహిళ వచ్చింది. కుడి చెవి నొప్పితోపాటు లోపలి నుంచి బెల్ కొడుతున్నట్లుగా శబ్ధం వస్తోందంటూ వైద్యులకు తెలిపింది.
ఎండోస్కోపీ పరీక్ష చేసిన వైద్యులు కర్ణభేరిలాంటి నిర్మాణాన్ని గుర్తించారు. కెమెరా అమర్చిన ప్రత్యేక పరికరాలను లోపలికి పంపించి చూడగా దాని వెనుక ఒక సాలీడు గూడు కనిపించింది. దీంతో,ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. వైద్య నిపుణులు ఆ గూడును బయటకు లాగగా దాంతోపాటు అందులోని సాలీడు, దాని పిల్లలు బయటకు వచ్చాయి. అయితే, ఈ సాలీడు విషపూరితమైంది కాకపోవడం సంతోషించాల్సి విషయమని వైద్యులు తెలిపారు.
(లేటు వయసులో ఘాటు ప్రేమ.. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!)
Comments
Please login to add a commentAdd a comment