మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా మనకు సహకరిస్తాయి. అయితే ప్రస్తుత జీవన శైలి,ఆహారం కారణంగా చిన్నా పెద్దా, తేడాలేకుండా ప్రపంచంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
ఇలా శరీర బరువు పెరగడానికి చాలా కారణాలను విశ్లేషించుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం నెట్టింట చర్చనీయాంశమైంది.
బేబీ టింగ్జీ యువతి 160 సెం.మీ పొడవు (5అడుగుల 2 అంగుళాలు) ఉంటుంది. బరువు కూడా 25 కిలోలు మాత్రమే. సన్నబడాలనే విపరీతమైన కోరికతో అమ్మాయి బాగా తగ్గించుకుంది. ఎంతలా అంటే.. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోతుందా అన్నట్టు పీలగా తయారైంది. గట్టిగా అడుగులు వేస్తేనే ఎముకలు విరిగిపోతాయో అన్నట్టు అస్థిపంజరం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏమిటంటే..తన బరువును ఇంకా తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఇది చూసి నెటిజన్లు విస్తు పోతున్నారు. బేబీ టింగ్జీకి సోషల్ మీడియాలో 42 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. బేబీ టింగ్జీ కోల్పోయిన బరువుని చూసి నెటిజన్లు పలు సలహాలిస్తున్నారు. ఇంతకంటే బరువు తగ్గవద్దని, పోషకాహారం లోపంతో పలు రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment