బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారాన్ని త్యాగం చేయడమే. ఒకవేళ నచ్చింది తినాలనిపించినా.. మనస్పూర్తిగా తినలేక డైట్‌ని మధ్యలోనే వదిలేయలేక ఎంతలా తిప్పలు పడతారో చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే వెయిట్ లాస్ జర్నీలో నోరుని కట్టేసుకుని మరీ కఠినమైన డైట్‌లు, వర్కైట్‌లపై దృష్టిసారిస్తారు. అధికంగా వ్యాయమాలు చేసి తీపి పదార్థాలు దరిచేరనివ్వకుండా ఉంటేనే బరువు తగ్గుతారనేది చాలమంది అభిప్రాయం. అయితే వాటన్నింటిని కొట్టిపారేసేలా ఈ మహిళ వెయిట్ లాస్ జర్నీ ఉంది. పైగా తీపి పదార్థాలు తింటూనే బరువు తగ్గిందంట. అది నిజమేనా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆమె చెబుతున్న వెయిట్ లాస్ టిప్స్ వింటే నమ్మకుండా ఉండలేరు.
ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కార్లా విసెంటిన్ వెయిట్ లాస్ జర్నీ చాలా విభిన్నంగా కొత్తగా ఉంది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం కాదని అంటోంది క్లారా. తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను ప్రతిరోజు ఇష్టమైన స్వీట్స్‌ని తింటూనే బరువు తగ్గానని నమ్మకంగా చెబుతోంది.
అలా స్వీట్లు తింటూనే తన బరువు వ్యూహాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. తనకు వెయిట్‌లాస్ జర్నీలో హెల్ప్ అయిన చిట్కాలను కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..
వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదని అంటోంది క్లారా. కేలరీలను తగ్గించే డైట్ తోపాటు మంచి కదిలకలతో కూడిన శారీరక శ్రమతోనే బరువు తగ్గుతారని అంటోంది.
దాహం ఆకలి మారువేషంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకలితో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి తరుచుగా నీరు తాగుతూ ఉండండి.
ప్రతిరోజు ఒకే ఆహారం తినడం వల్ల కేలరీలు తీసుకోవడం, ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అదీగాక భోజనం త్వరగా సిద్ధం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది.
చిన్న ప్లేటుల్లో తింటే..ఎక్కువ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. అలాగే నెమ్మదిగా తినడం తెలియకుండానే వస్తుందట.
వ్యాయామం చేసే ముందు మంచి డిటాక్స్ వాటర్‌ని తీసుకుంటే జిమ్‌కి వెళ్లేలా బాడీ సిన్నద్ధం అవుతుందట. అంతేగాదు ఉత్సాహంగా వ్యాయమాలు చేయగలుగుతారు.
నచ్చిన ఆహారం వదులుకోకుండా హాయిగా తినాలంటే..కేలరీలను తగ్గించుకునే యత్నం చేయాలి. ఇక్కడ క్లారాకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా తినే అలవాటు ఉందట. అందుకుని తనకు నచ్చిన స్వీట్‌ని హాయిగా తినేసి అదనపు కేలరీలు తీసుకోకుండా చూసుకుంటుందట. ఇలా చేస్తే తినాలనే పిచ్చికోరిక అదుపులో ఉంటుందని చెబుతుంది.
స్వీట్స్ అధికంగా తినాలనిపించినా లేదా ఆకలిగా అనిపించినప్పుడల్లా చక్కెర లేని గమ్ నమలాలని సూచిస్తోంది.
అలాగే మనల్ని మనం ఇష్టపడితేనే తొందరగా బరువు తగ్గకలుగుతామని అంటోంది.
చివరగా అన్నింటికి సానుకూల దృక్పథంతో ఉండాలి అప్పుడే చక్కటి మార్పులు సాధ్యమవుతాయని నమ్మకంగా చెబుతోంది క్లారా.
ఇక్కడ పాజిటివ్ ఆటిట్యూడ్ తోపాటు మనల్ని మనం ప్రేమించుకుంటేనే చక్కటి రూపం సొంత చేసుకోగలమని క్లారా కథే చెబుతోంది కదూ..!.
(చదవండి: 'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..శాశ్వతంగా కంటి రంగు మారిపోతుంది..!)
Comments
Please login to add a commentAdd a comment