Fitness
-
ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!
ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోతే ఇట్టే బరువు పెరగడం, కొలతలు సరిలేక, అందం తగ్గడం సాధారణ సమస్యలుగా మారిపోతున్నాయి. తినే తిండి, ఎక్కువ సమయం కూర్చునే వర్క్ చేయడం, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో, చాలామందికి ఫిట్నెస్ దూరమవుతోంది. అయితే జిమ్‌లో చేసుకున్నట్లే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి ఈ ’ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్’ చక్కగా పని చేస్తుంది.ఈ రోప్‌తో వర్కౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్ని భంగిమల్లోనూ వ్యాయామం చేయడానికి, శారీరక శ్రమను కలిగించి, కొవ్వును తగ్గించడానికి సహకరిస్తుంది. మన్నికైన ఈ రోప్.. వీపు, నడుము, పొట్ట, తొడలు, చేతులు వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి వినియోగించొచ్చు. దీంతో వ్యాయామం చేస్తే కండరాలు బలపడి, శరీరం దృఢంగా తయారవుతుంది.వ్యాయామ సమయంలో దీన్ని ఎలా కావాలంటే అలా సులభంగా, బలం ఉపయోగించి సాగదీయొచ్చు. సాగదీసే క్రమంలోనే గ్రిప్ తప్పి లేని నొప్పులు వస్తాయేమోనన్న భయం అవసరం లేదు. సౌకర్యవంతమైన పట్టును అందించగల ఈ సాగే తాడు.. చేతులకు, కాళ్లకు అలసట కలిగించదు. ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్‌తో రూపొందిన ఈ రోప్ కొత్తగా వ్యాయామం ప్రారంభించే వాళ్లకు కూడా అనువుగానే ఉంటుంది. దీని ధర 14 డాలర్లు (రూ.1,286) మాత్రమే! -
కిక్ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్‌ని విజృంభించి పంచే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్‌లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్‌ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్‌ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్‌కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్‌ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్‌కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్‌బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్‌ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్‌ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్‌గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్‌లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్‌లోని సెలబ్రిటీస్ లిస్ట్‌లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్‌తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్‌ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
అందంలో మన్మథుడు...యువ సామ్రాట్ నాగర్జున డైట్ సీక్రెట్ ఇదే..!
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో అవార్డులను, సత్కారాలను పొందారు. ఒకప్పుడు అమ్మాయిల క్రేజీ హీరో, కలల మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. అయినా అదే అందం, గ్లామర్‌తో యువ హీరోలకు తీసిపోని విధంగా ఫిట్‌గా ఉంటాడు. వయసుతో సంబంధం లేకుండా అంతలా యవ్వనంగా ఫిట్‌గా బాడీ మెయిటైన్ చేసేందుకు నాగార్జున ఏం చేస్తుంటాడో తెలుసుకుందామా..!నాగార్జునని చూడగానే అందరూ సార్ ఇప్పటికీ అలానే అంతే అందంగా ఎలా మెయిటైన్ చేస్తారు అని అడుగుతారట. అందరికీ ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని కుతుహలమే. ఆ సందేహాలకు చెక్‌పెట్టేలా ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కూడా అవేంటంటే..తన రోజుని వ్యాయమాలతోనే ప్రారంభిస్తాడట. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తారట. ఒకవేళ జిమ్‌కి వెళ్లకపోతే కనీసం వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తారట. అంతే తప్ప ఏ వ్యాయామాన్ని మిస్ చేయానని చెబుతున్నారు నాగ్. వర్కౌట్లు చేయడమే తన తొలి ప్రాధాన్యత అని అంటున్నారు. కచ్చితంగా వారానికి ఐదు రోజులు వ్యాయామాలు చేస్తానని చెప్పారు. ఒక గంట 45 నిమిషాలు వ్యాయమాలకే కేటాయిస్తారట. అదే తన బాడీ ఆకృతి సీక్రెట్ అంటున్నారు. మన శరీరం షేప్అవుట్ అవ్వకూడదంటే ఇవి తప్పనసరి అని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ఓ చిట్కాను షేర్ చేశారు. క్రమ తప్పకుండా సక్రమంగా వ్యాయామాలు చేయాలంటే ఫోన్లు వంటి గాడ్జెట్లు తీసుకెళ్లొద్దని అన్నారు. శక్తితో కూడిన వర్కౌట్లు చేస్తూ..హృదయస్పందన రేటు 70% ఉండేలా చూడండి. ఇది మీ ఏకగ్రతను పెంచి, రోజంత జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందని అన్నారు. ఇదే తన ఫిట్నెస్మంత్ర అని దృఢంగా చెబుతున్నారు. దీంతోపాటు తగినంత నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయాలన్నారు.అందంగా కనిపించేందుకు..మంచి డైట్‌ని తీసుకుంటారట. అదే తన ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ్గా ఉంచుతాయని నమ్ముతానన్నారు. ఆరోగ్యకరమైన అల్పహారం, లంచ్, డిన్నర్లు తీసుకుంటే ఎవ్వరైనా అందంగానే ఉంటారని చెప్పారు. రాత్రి ఏడు లేదా ఏడున్నర లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారట నాగ్. పాల సంబంధిత పదార్థాలకు నిర్ధిష్ట వయసు వచ్చేటప్పటికీ తీసుకోవడం మానేస్తేనే బెటర్ అని అన్నారు. నాగ్ కచ్చితంగా 12 గంటలు తిని 12 గంటలు ఉపవాసం ఉంటారట. ఆయన అడపాదడపా ఉపవాసం కూడా ఉంటారట. అప్పడప్పుడు చీట్ మీల్స్ కూడా ఉంటాయని నవ్వుతూ చెబుతున్నారు. ఎప్పుడు నోరుని కట్టేసుకుని స్ట్రిక్ట్‌గా ఉండనవసరం లేదని అంటున్నారు. ఆదివారం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినవి మొహమాటం లేకుండా తినేస్తా వర్కౌట్లతో అదనపు కేలరీలు కరిగించేస్తా అంటున్నారు. ఒకవేళ నచ్చింది తినాలనుకుంటే..అమ్మో డైట్ అని ఆలోచించను అది తినేదైనా..తాగాలనుకున్నా మందైనా.. ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఆయనకు స్వీట్లంటే మహా ఇష్టమట. ముఖ్యంగా చాక్లెట్లు తినకుండా ఉండరట. అయితే వర్కౌట్లు చేసినంత కాలం హాయిగా అవి తీసుకోవచ్చని అంటున్నారు. అలాగే గోల్ఫ్ తప్పనిసరిగా ఆడతారట. ఇది తన మనసుకు చక్కటి వ్యాయామంలా ఉండి తనకొక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ఈత యవ్వనంగా ఉండేందుకు ఉపకరిస్తుందట. ఇది ఒక అద్భుతమైన వ్యాయమం అట. మొత్తం ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు.(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..) -
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. -
బౌన్స్ బ్యాక్..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‘చందమామ’
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) "బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్. ఈ ప్రయాణంలో ఫిట్నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్‌గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్‌కింగ్స్ కో ఓనర్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్‌గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్‌గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్‌ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..) -
75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!
మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్నెస్ మంత్ర ఏంటో ఇన్‌స్టా థియోబ్లిక్స్లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్‌గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లో బెంచ్ ప్రెస్‌లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్లు చేయడమం మంచిదన్నారు. ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్‌గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్‌లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. మలి వయసులో అవి తప్పనిసరి..ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు. శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by Obliques24 (@obliques24_) (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
అనన్య పాండేలాంటి నాజూకు నడుము కావాలంటే...!
బాలీవుడ్ నటి అనన్య పాండే ఫిట్నెస్ ప్రియురాలు. యోగా నుండి పైలేట్స్ వరకు, వివిధ రకాల వ్యాయామాలతో చెక్కిన శిల్పంలా తన శరీరాన్ని మల్చుకుంటుంది. తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇటీవల ఆమె ఫిట్నెస్ శిక్షకురాలు , ప్రెండ్ అయిన నమ్రతా పురోహిత్ వర్కవుట్ ( పైలేట్స్) చేస్తున్న ఫోటోను షేర్ చేసి,ఆమెపై ప్రశంసలు కురిపించింది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనన్య లాగా, నాజూకైన నడుము కావాలనుకుంటున్నారా? అయితే ఆమె చేసే పైలేట్ష్తోపాటు కొన్ని రకాల యోగాసనాలనూ ఇక్కడ చూద్దాం.సైడ్ ప్లాంక్ ట్విస్ట్: నడుముకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. పక్కకు పడుకుని, తలను ఒక చేతితో పట్టుకుని, ఆపై నడుము భాగం కదలకుండా, పాదాల మధ్య ఎడం ఉంచి, మరొక చేతిని నిలువుగా పైకి లేవాలి. కొద్ది సేపు ఈ స్థితిలో ఉండి, తరువాత యథాస్థితికి రావాలి. అలాగే బోర్లా పడుకుని, మోచేతులపై భారం వేసి, బొటన వేళ్లపై బాడీని కొద్దిగా పైకి లేపాలి. ఇదేస్థితిలో బాడీని రెండు వైపులా మెల్లిగా ట్విస్ట్ చేయాలి. ఇలాంటి రిక్లైనింగ్ మోకాలి ట్విస్ట్, సిజర్స్ క్రిస్ క్రాస్ లాంటి కొన్ని వ్యాయామాలతో మాత్రమే కాదు, కొన్ని రకాల యోగసనాల ద్వారాకూడా నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు.త్రికోణాసనం..త్రికోణాసనం నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువును కంట్రోల్లో ఉంచడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. త్రికోణాసనం వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.నౌకాసనంనౌక మాదిరిగా ఈ ఆసనం ఉంటుంది గనుక దీనికి ఆపేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి. తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్ మీద బరువు నిలుపుతూ ,నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉంటే మంచిది. మధ్యలో స్వల్ప విరామం తీసుకుని మళ్లీ దీన్ని రిపీట్ చేయాలి.మత్స్యాసనంమత్స్యాసనం వేయండానికి ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కాళ్లను తిన్నగా చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్డ్గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ రిలాక్స్‌గా ఉంచుతూ ఈ పోజ్‌లో కొంతసేపు ఉండండి.ధనురాసనంయోగా మ్యాట్‌పైన బోర్లా పడుకొని, రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొత్తికడుపు, పొట్ట మీద ఒత్తిడి మనకు తెలుస్తుంది. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. తొందరగా ఫలితం కనబడాలంటే.. రోజులో రెండు సార్లు ఒక గంట పాటు , ఆసనానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటూ నిదానంగా ఈ ఆసనాలను వేయాలి. నోట్ :యోగాసనాలు ఎపుడూ కూడా హడావిడిగా చేయకూడదు. శ్వాసనిశ్వాసలను నియంత్రణలో ఉంచుకుంటూ నిదానంగా చేయాలి. అలాగే యోగసనాలను ప్రారంభించే ముందు యోగా నిపుణుల సలహాలను తీసుకోవాలి. -
వర్కవుట్స్ డైట్... డౌట్
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం వర్కవుట్లు చేయాలని సలహా ఇస్తుంటారు అందరూ. అయితే కేవలం ఎక్సర్సైజ్ చేయడంతోనే సరిపోదు, వ్యాయామం చేయక ముందు, చేసిన తర్వాత తీసుకునే ఆహారాలను బట్టి కూడా దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒక క్రమపద్ధతిలో చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.ఏ వయసువారికైనా ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవడం అవసరం. అందువల్ల వ్యాయామం చేసే ముందు, తర్వాత ఏం తినాలి..? అనేదానిని ఇక్కడ చూద్దాం.వర్కౌట్స్‌కు ముందు..?ఎక్సర్సైజ్లు చేయడానికి కొద్దిసేపటి ముందే ఏదైనా తినడం మంచిది కాదు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల తిన్న వెంటనే వర్కవుట్స్‌కి దిగకుండా కొంత గ్యాప్ ఇవ్వాలి. వ్యాయామానికి కనీసం అరగంట నుంచి గంట ముందు అల్పాహారం పూర్తి చేయాలి. అలాగే కసరత్తులు చేసిన తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. ఇక వ్యాయామం ముగిసిన తర్వాత బాడీ అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం. అదే సమయంలో కసరత్తుల వల్ల ఖర్చైపోయిన శక్తిని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా నీళ్లు తాగొచ్చు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడానికి ముందు సుమారు 2 నుంచి 3 కప్పుల నీళ్లు తాగాలి. ఇక అయిపోయిన తర్వాత కూడా అంతే పరిమాణంలో తాగాలి. కసరత్తులు చేస్తున్నప్పుడు..హెవీ వెయిట్లు లేపడం, ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేస్తే.. ప్రతి అరగంటకు 50 నుంచి 100 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనికోసం తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష లేదా అరటి పండు తీసుకోవాలి. -
ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..!
72 ఏళ్ల శక్తి కపూర్ తన ఫిట్నెస్ రహాస్యాన్ని ఇటీవల తెలియచేశాడు. రోజుకు 35 వేల అడుగులు నడవడం తన ఆరోగ్య రహస్యం అన్నాడు. నడక వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసినా.. 70 ఏళ్ల తర్వాత కూడా నడక మంచిదేనని వైద్యులు అంటున్నారు. రోజూ 7 వేలతో మొదలుపెట్టి కనీసం 10 వేల వరకూ నడిస్తే మంచిది అంటున్నారు. నడవని వారు గుండెకు చేటు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. మీరెంత నడుస్తున్నారు?వందలాది సినిమాల్లో నటించిన శక్తి కపూర్ 72 ఏళ్ల వయసులో కూడా చలాకీగా, ఫిట్‌గా ఉంటారు. ఇటీవల ఒక టీవీ షోలో మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటని అడిగితే ‘రోజూ కనీసం 35000 అడుగులు నడవడమే‘ అని చెప్పాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాను... తిరిగి మొదలుపెట్టాను అని చెప్పాడు. నటన అంటే రకరకాల పాత్రలు చేయాలి. పరిగెత్తడం, డాన్స్.. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. చాలామంది రకరకాల వ్యాయామం చేస్తారు. అయితే శక్తికపూర్ నడకే తన ఫిట్‌నెస్‌కు కారణం అని తెలియచేశాడు.నడక మంచిదిఈ విషయం గురించి ఢిల్లీలోని సికె బిర్లా హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ నరేంద్ర సింఘ్లా ఏమన్నారంటే ‘రోజుకు 35 వేల అడుగులు నడవడం ఎవరికైనా మంచిది... ముఖ్యంగా వయసు మళ్లిన వారి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని అడుగులు నడవడం వల్ల 2000 నుంచి 2500 కేలరీలు బర్న్ అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల పెద్ద వయసు వారిలో రక్తప్రసరణ క్రమబద్దీకరణ జరిగి బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నడక బరువును అదుపు చేస్తుంది. వయసు మళ్లాక బరువు పెరిగితే స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు తోడవుతాయి. వాటిని నివారించాలన్నా బరువు పెరగకుండా చూసుకోవాలన్నా వయసు పెరిగే కొద్దీ నడకను పెంచాలి’ అన్నారాయన.మానసిక ఆరోగ్యానికి...ఎక్కువ అడుగులు నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. నడక మెదడుకు స్పష్టతనిచ్చి ఎంచుకున్న పనిపై ఏకాగ్రతను కలిగిస్తుందని వారు అంటున్నారు. అయితే 70 ఏళ్లు దాటాక 35 వేల అడుగుల నడక చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.ముందు నుంచి అలవాటు లేకపోతే. కాని 7000 అడుగుల నుంచి శక్తి, ఓపికను బట్టి 10 వేల అడుగుల వరకూ నడవాలని వారు అంటున్నారు. నడకకు అనువైన షూస్, పోష్చర్, తగినంత నీరు తాగి బయలుదేరడం... ఈ జాగ్రత్తలతో క్రమం తప్పకుండా నడిస్తే ఆరోగ్యం ఓ భాగ్యంలా తోడు ఉంటుందని అంటున్నారు వారు. నడవడమే బాకీ. -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్‌గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్‌కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్‌ని బట్టి..) -
ఈమె ఫేమస్ హీరోయిన్.. 49 ఏళ్లంటే మీరు నమ్ముతారా? (ఫొటోలు)
-
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!
ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 ఫీవరే నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డుని సృష్టించి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ప్రభాస్‌ల పేరు మీదున్న రికార్డుని బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఆయన డైలాగులు, ఆహార్యం, ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ స్టెప్పులు, ఫిజికల్ అపీరియన్స్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా హై ఎనర్జీతో కూడిన పెర్ఫార్మెన్స్కి ఎవ్వరైనా.. ముగ్గులైపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన నటన. మరి చూడటానికి ఆకర్షణీయంగా, ఆజానుబాహుడిలా ఉండే మన పుష్ప2 హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!పుష్ప మూవీలో డైలాగ్ మాదిరిగా.. "అల్లు అర్జున్ డైట్ అంటే నార్మల్ అనుకుంటివా అత్యంత హెల్తీ". ఆయన చెప్పే డైలాగులు..స్టెప్పులు అత్యంత వేగంగా ఉంటాయి. ప్రేక్షకుడిని అటెన్షన్‌తో వినేలా చేస్తాయి. అంతలా శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైన డైట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందుకోసం హీరో అల్లు అర్జున్ ఈ ఎనిమిది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తారట. అవేంటంటే..బన్నీ రోజు.. వ్యాయామాలు, వర్కౌట్లతోనే ప్రారంభమవుతుందట. అందువల్ల ఉదయాన్నే హై ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌నే తీసుకుంటారట. దీని కారణంగానే ఆయన రోజంతా చురుకుగా ఉంటారుతప్పనిసరిగా అల్పాహారంలో గుడ్లు ఉండాల్సిందేనట. కండలు తిరిగిన దేహానికి అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇవి కండరాలను బలోపతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఇక లంచ్‌లో తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్ ఉండాల్సిందే. దీనిలోని లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా డైట్లో చేర్చకుంటారు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మ సంరక్షణకు, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడతాయి. హైడ్రేటెడ్‌గా ఉండేలా ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్లు, షేక్‌లు కూడా తీసుకుంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్లు అందుతాయి. డిన్నర్ దగ్గరకి వచ్చేటప్పటికీ చాలా తేలికైన ఆహారమే తీసుకుంటారు. బ్రౌన్‌రైస్, కార్న్, గ్రీన్ రైస్ , సలాడ్లు ఉండేలా చూసుకుంటారు. చివరగా అల్లు అర్జున్‌లా మంచి పిట్‌నెస్‌తో ఉండాలంటే..వ్యాయమాలను స్కిప్ చేసే ధోరణి ఉండకూడదు. సమతుల్యమైన డైట్‌ని తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం నిబద్ధతతో ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకునేలా డైట్‌ని అనుసరిస్తే.. పుష్ప హీరోలాంటి లుక్‌ని ఈజీగా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.(చదవండి: ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?) -
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్‌గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్విస్ బాల్లో ప్రోన్ రివర్స్ హైపర్ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్‌ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్లో ఎక్స్‌ర్‌సైజ్‌లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్‌కు ఇచ్చేసింది. అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! ) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!
బరువు తగ్గడం అంటే.. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలు అనే అనుకుంటాం. అందుకే చాలామంది బరువు తగ్గడం విషయమై చాలా భయపడుతుంటారు. కొందరూ ప్రయత్నించి మధ్యలోనే అమ్మో..! అని చేతులెత్తేస్తారు. సెలబ్రిటీలు, ప్రముఖులు, మంచి ఫిట్నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వెయిట్ లాస్ అవ్వగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఇక ఆ భయాలేమి వద్దంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్, ఫోర్త్ లెవెల్ 4 సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుప్రతిమ్ చౌదరి. ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించాల్సిన పని లేకుండానే తొందగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!.ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్కు ఇన్‌స్టాలో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోవడమే గాక తన ఫాలోవర్లకు ఈజీగా బరువు తగ్గే చిట్కాలను గురించి చెబుతుంటారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) ఇటీవలే తన వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 20 కిలోల బరువు వరకు ఎలా తగ్గాననేది కూడా హైలెట్ చేశారు. ఆయన అందుకోసం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదని ఈ అమూల్యమైన ఐదు రూల్స్‌ని పాటిస్తే చాలు తొందరగా బరవు తగ్గిపోతారని అన్నారు. ముందుగా తాను ఎలాంటి నియమాలు పాటించారో వివరించారు. ఆ తర్వాల ఎలాంటి డైట్ లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ వివరించారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) మొదటిది: రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ ముగించటం.. రెండు: ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగాలి.మూడు: ప్రతిరోజూ 50 శాతం తక్కువగా తినడానికి ప్రయత్నించండి నాలుగు: ప్రతిరోజూ 30-40 నిమిషాలు చాలా సాధారణ వ్యాయామలు ఐదు: ఒత్తడి లేకుండా ఉండటంఈ నియమాలను అనుసరించే తాను బరువు తగ్గగలిగానని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అలాగే మరొక వీడియోలో ఎలాంటి కఠిన ఆహార నియమాలు లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ తెలిపారు. దానికి కూడా ఐదు రూల్స్‌ని తప్పనిసరిగా పాటించాలన్నారు. అవేంటంటే.. ఎలాంటి డైట్ లేకుండా.. మొదటిది: ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.రెండు: భోజన సమయాలను సరి చేయండిమూడు: భోజనంలో అన్ని రకాల మాక్రోన్యూట్రియెంట్లను జోడించాలి(ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, గ్రీన్ సలాడ్లు ఉండాలి)నాలుగు: ఒక్కసారే వడ్డించుకోండి మరోసారి తీసుకునే యత్నం చెయ్యొద్దుఐదు: తినే సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దుఅలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చిప్స్, కుకీలు, ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండమని సూచించారు ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..) -
తొమ్మిది పదుల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా..
ఈ బామ్మ ఫిట్నెస్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఈ ఏజ్‌లోనూ ఎంతో చలాకీగా వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెస్ట్ తీసుకునే వయసులో తనకు వీలైన విధంగా సింపుల్ వ్యాయామాలు చేస్తున్నారు. అదికూడా ఏ రోజు స్కిప్ చేయకుండా చేస్తుందట. ఫిటనెస్ పట్ల ఆమె కనబరుస్తున్న నిబద్ధతకు సలాం కొట్టకుండా ఉండలేరు. వృద్ధాప్యంలోనూ మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?. ఈ బామ్మలా చలాకీగా వ్యాయమాలు చేయాలంటే..ఫిట్నెస్కి నిజమైన స్ఫూర్తి 90 ఏళ్ల జే. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వ్యాయామాలు చేస్తుంది. చాలా చురుకుగా తన దినచర్యను పూర్తిచేస్తుంటుంది. జే 30 స్క్వాట్లు (సపోర్ట్ కోసం ఫ్రిజ్‌ని పట్టుకుని మరీ..) 25 సిట్-అప్లు, 30-సెకండ్ ప్లాంక్ , పదివేల అడుగులు నడవడం తదితరాలన్నింటిని చేస్తుంది. మాములుగా అయితే ఎవ్వరైనా ఓ రెండు, మూడు రోజులు చేసి వదిలేస్తారు. కానీ ఈ బామ్మ అలాకాదు. ప్రతిరోజూ చక్కగా వ్యాయామాలు చేస్తుంది. ఇలా ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్లు చేయడం ముఖ్యం అని చేతల్లో చూపించింది జెనీ బామ్మ. వృద్ధాప్యంలో కూడా జే బామ్మలానే చక్కగా వీలైనన్నీ వ్యాయామాలు చేస్తే అనారోగ్యం బారిన పడరు, పైగా హాయిగా చివరి రోజులు సాగిపోతాయి. ఈ సందర్భంగా వృద్ధులు ఈజీగా వేయగలిగే సింపుల్ వ్యాయామాలను చూద్దామా..!. చైర్ స్క్వాట్లు: కాలు కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యతకు స్క్వాట్లు మంచివి. ఇవి లేచి నిలబడి, కూర్చీలోంచి నెమ్మదిగా కూర్చవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఉండదు. పైగా సులభంగా చేయగలుగుతారు. వాల్ పుష్-అప్స్: ఇవి ఎగువ శరీర బలాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వృద్ధులు నేలకు బదులు గోడను ఆసరా చేసుకుని చెయ్యొచ్చు. కూర్చునే మార్చింగ్: కూర్చీలో కూర్చొని ఆర్మీ మాదిరిగా మార్చింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపరడటమే గాక కాలు కండరాలు బలోపేతమవుతాయి.లైట్ వెయిట్స్తో ఆర్మ్ రైజ్‌లు: భుజం ఎత్తుకు చేతులు ఎత్తడం వల్ల భుజాల పైభాగంలో ఉన్న కండరాలు బలపడతాయి. చీలమండల భ్రమణాలు: కూర్చీలో కూర్చొని మడమలను ముందుకు వెనుకకు సవ్య-అపసవ్య దిశల్లో తిప్పడం వల్ల కాళ్లో చక్కటి రక్తప్రసరణ జరిగి.. అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు) -
కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..
తాను నృత్యకారిణిగా కొనసాగాలని, తన కూతురిని కూడా గొప్ప కళాకారిణిగా చూడాలని ఓ కన్నతల్లి ఆరాటం.. మూడేళ్ల వయసులోనే కూతురికి శిక్షణ.. చదువుల వేటలో మార్గాలు వేరుపడినా.. వేర్వేరు రంగాల్లో రాణింపు.. అయినా కూతురితో కలిసి ప్రదర్శన ఇవ్వాలనే ఆ తల్లి ఆశ మాత్రం చిరంజీవిగా ఉండడం.. చివరకు ఆ ఆకాంక్ష జయించడం.. బహుశా కీర్తిశేషులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఉండి ఉంటే ఇదో భావోద్వేగ భరిత వెండితెర కథగా మారి ఉండేదేమో.. హైదరాబాద్ నగరంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లు కలిసి సమర్పించనున్న సంప్రదాయ నృత్య ప్రదర్శన నేపథ్యం ఆసక్తికరమైనదిగా మారింది.. ‘ఇది అమ్మ చిరకాల ఆకాంక్ష. నాతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని తను ఎప్పటి నుంచో ఆశపడుతోంది’ నగరంలో ఒక మోడల్‌గా, ఫిట్నెస్ ట్రైనర్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా చిరపరిచితమైన అభిమానిక.. మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయే. ఆమె అకస్మాత్తుగా నృత్యకారిణిగా మారడం వెనుక కారణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన అభిమానిక అమ్మతో కలిసి అడుగులు..ప్రస్తుతం హైకోర్ట్‌లో సీనియర్ లాయర్‌గా ఉన్న దువ్వూరి వత్సలేంద్రకుమారి తొలి అడ్వకేట్ జనరల్ దువ్వూరి నరసరాజు కుమార్తె.. తను మూడేళ్ల వయసు నుంచే నటరాజు రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. న్యాయవాదిగా మారినా నాట్యాభిరుచిని కొనసాగించారు. తన కూతురు అభిమానిక కూడా తనలాగే గొప్ప నాట్యకారిణి కావాలని మూడేళ్ల వయసులోనే ఆమెకు కూడా తానే గురువుగా మారి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కూడా ప్రదర్శనలు ఇస్తుంటే తన ఆకాంక్ష నెరవేరుతోందని మురిసిపోయారు. అయితే ఆ తల్లి ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలచింది. చదువుల వేటలో అభిమానిక నాట్యపిపాస అటకెక్కింది. బీటెక్ టాపర్‌గా నిలిచినా.. వ్యక్తిగత అభిరుచి మేరకు ఫిట్నెస్ ట్రైనర్‌గా మోడల్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా విజయవంతంగా కొనసాగుతున్నారు అభిమానిక.. ఇప్పుడు తల్లి ఆకాంక్షకు తలొగ్గారు. పాతికేళ్ల తర్వాత.. మారిన ప్రయాణం‘నేను నాట్యానికి పాతికేళ్లుగా దూరమైనా అమ్మ తన ఆశకు మాత్రం దూరం కాలేదు. తరచూ నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అమ్మ పట్టుదలతో కొన్ని రోజుల్లోనే మళ్లీ నా చిన్ననాటి నాట్య పిపాస తిరిగి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఇష్టంతో నెలల తరబడి కఠినమైన సాధన ద్వారా అమ్మతో కలిసి ప్రదర్శనకు సిద్ధమవుతున్నా.. నిజం చెప్పాలంటే అమ్మ నాట్యానికి నేనో అభిమానిని’ అంటూ భావోద్వేగంతో చెప్పారు అభిమానిక. ‘నృత్యకారిణిగా, న్యాయవాదిగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చాను. ఎందరినో శిష్యురాళ్లుగా, నృత్యకారిణులుగా తయారు చేశాను. 2017లో పేరిణిలో తొలి మహిళా నృత్యకారిణిగా ప్రదర్శన ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాను. వ్యక్తిగతంగా ఎన్ని సాధించినా.. నా కూతురుతో కలిసి నాట్య ప్రదర్శన ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ’ అన్నారు వత్సలేంద్ర కుమారి. వయసు పైబడకుండానే.. ‘కేవలం కలిసి నృత్యం చేయడమే కాదు తనతో ధీటుగా చేయాలి కదా.. అందుకే వయసు మరీ పైబడకుండానే చేయాలని అనుకున్నా. ఏమైతేనేం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది’ అంటూ ఆనందంగా చెప్పారు వత్సలేంద్ర కుమారి.. ఇప్పటిదాకా తల్లీ కూతుర్లు కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వడం అనేది లేదని, అది తామిద్దరూ సాధించనుండడం గర్వంగా ఉందన్నారు. కూచిపూడి, భరతనాట్యం మేలు కలయిక లాంటి ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ ప్రారంభించారని, ఇటీవల అంతగా ప్రాభవానికి నోచుకోని ఈ నాట్యాన్ని అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by ABHIMANIKA 🇮🇳 Fashion & Fitness Coach (@abhimanika) (చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్నెస్తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.మలైకా అరోరా ఫినెస్కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్‌ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది. ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్విచ్లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది. తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!. (చదవండి: ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?) -
‘ఫిట్‌లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
ట్రామ్ పోలిన్ పిల్లలాటతో ఫిట్‌గా..
కొన్నిపార్కుల్లోనూ, మాల్స్‌లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్ అందుబాటులోకి వచ్చింది.పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్‌లో రొటీన్‌గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.అనేక ప్రయోజనాలు...⇒ ట్రామ్ పోలిన్పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి. ⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి. ⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.మొదట్లోనే జంపింగ్‌లు వద్దు...ట్రామ్ పోలిన్ వర్కౌట్లలో స్క్వాట్ జంప్‌లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్‌లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు.ప్రమాదం.. నివారణఫిట్నెస్లో ట్రామ్ పోలిన్ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి. ⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి. ⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి. ⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు. సమస్యలు ఉంటే.. ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనండెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు డెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్‌లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్నెస్ ట్రైనర్ -
ప్రపంచ చాంపియన్‌షిప్ లక్ష్యం
సొనెపట్: కొత్త సీజన్‌ను వంద శాతం ఫిట్నెస్తో ప్రారంభిస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్‌లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో టాప్–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్‌ను ఘనంగా ముగించాడు. హరియాణాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్స్–2036’ పాల్గొన్న నీరజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్ ముగిసింది. కొత్త సీజన్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్తో కొత్త సీజన్ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్ బయోమెకానిక్ నిపుణుడైన క్లాస్ బార్టొనిజ్తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని వివరించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్‌లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో నీరజ్ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్ అందజేశాడు. -
Zumba Dance: జుంబా హాయిరే..
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్‌లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్‌ను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గేందుకు.. నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్‌లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్‌సైజ్‌లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.హార్ట్‌కు మాంచి ఎక్సర్సైజ్.. జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్‌లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మరెన్నో లాభాలు.. జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ.. గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్‌గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. – ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో ఆహ్లాదం.. ఆరోగ్యం.. బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్టైన్మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్‌గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు. – బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా -
ఏడుపదుల వయసులోనూ చలాకీగా మోదీ.. అలా ఎలా?
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్‌గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్నెస్ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!యోగా..యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) యోగా నిద్ర లేదా సమాధి స్థితి..ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా. తప్పనిసరిగా వాకింగ్..ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్‌ని ఇస్తుందని అంటారు మోదీ.అల్పాహరం, భోజనంగా..ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్‌కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు. ఆయర్వేదానికే ప్రాధాన్యత..మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!)