సొట్ట బుగ్గల సుందరి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! | Preity Zintas Diet And Fitness Secrets For Toned Body At 49 | Sakshi
Sakshi News home page

సొట్ట బుగ్గల సుందరి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published Mon, Dec 30 2024 5:43 PM | Last Updated on Mon, Dec 30 2024 6:42 PM

Preity Zintas Diet And Fitness Secrets For Toned Body At 49

స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్‌బ్యూటీగా, డింపుల్‌ గర్ల్‌గా  పాపులర్‌ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే  అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్‌లో మంచి సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్‌లో కూడా ప్రిన్స్‌ మహేష్‌ బాబు,  విక్టరీ వెంటేష్‌ల సరసన నటించి బ్యూటీఫుల్‌ హిరోయిన్‌గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పంజాబ్‌కింగ్స్‌ కో ఓనర్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్‌ ఏంటంటే..

ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్‌గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్‌ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. 

తాను పైలేట్స్‌(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్‌(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్‌ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్‌గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. 

నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్‌ని బ్రేక్‌ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..

  • హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. 

  • మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒకవేళ మూడ్‌ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. 

  • నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి.  ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం 

  • వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్‌ చేస్తే డైట్‌ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా.

     

(చదవండి: దటీజ్‌ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్‌ అయ్యే గెలుపు..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement