
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్‌ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్‌లు వస్తాయో తెలిపారు. స్లిమ్‌గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..
పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్‌ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్‌ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు.
వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్‌గా అర్థమైందన్నారు.
జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..
ఈ డైట్‌ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు.
గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్‌తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది.
కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు.
శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు.
ఆకలి తగ్గిపోవడం: కీటోన్‌లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్‌లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు.
జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.
ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు.
ఎలా తీసుకుంటే బెటర్..
జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్‌తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు.
చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?)
Comments
Please login to add a commentAdd a comment