Nutrition
-
Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్‌ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్‌లు వస్తాయో తెలిపారు. స్లిమ్‌గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్‌ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్‌ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్‌గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్‌ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్‌తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్‌తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
జన్యు నిధుల అనుసంధానం కీలకం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండవ ‘నేషనల్ జీన్ బ్యాంక్’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్ ఆన్ బయోలా జికల్ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.జాతీయ జన్యు బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.భారత్ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్–నికోబార్ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.బలిజేపల్లి శరత్ బాబువ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త -
ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం త్వరగా వస్తుందా..?
ఇటీవల కాలంలో అంతా స్లిమ మంత్ర.. అంటూ వివిధ రకాల డైట్లు పాటిస్తున్నారు. కొందరూ అవి తమ శరీర తత్వానికి సరిపోతాయా..? లేదా అని లేకుండా అనాలోచితం పాటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఒక టీనేజర్ అలానే ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే చాలావరకు అన్ని డైట్లలో చెప్పేది ఒకటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోమనే చెబుతాయి. అది మన శరీర తత్వం ఆధారంగా ఎంత మేర తీసుకుంటే మంచిది అనేది పోషకాహార నిపుణులను సంప్రదించి పాటిస్తే సత్వరగతిన మంచి ఫలితాలు పొందుతారు. అలా కాకుండా ప్రోటీన్ మంచిదని అధికంగా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అదేంటో పోషకార నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.మన రోజువారీ భోజనంలో ప్రోటీన్‌ను చేర్చుకోవడం ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఇది మన కణజాలాలను, కండరాలను నిర్మించడానికి, మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో మొత్తం శక్తిని ఇస్తుంది. అందుకోసం అని చాలామంది ప్రోటీన్ పౌడర్లు, షేక్‌లు, సప్లిమెంట్లపై ఆధారపడతారు. కానీ వాటికంటే గుడ్లు, మాంసం, పెరుగు, జున్ను వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తమ డైట్లో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా ప్రోటీన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పేనని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వృద్ధాప్యం ేవేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.ఈ మేరకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా దీని గురించి షేర్ చేశారు.ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందా? ఇటీవల పోషకాహార నిపుణుడు లోవ్నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని పంచుకున్నారు. ప్రోటీన్ పౌడర్లు,జంతు ఆధారిత ప్రోటీన్లపై ఎక్కువగా ఆధారపడితే గ్లైకేషన్ ప్రేరేపించబడుతుందట. ఇది కణజాలాలను గట్టిపరిచే ప్రక్రియ అట. దీంతో ముడతలు, కీళ్ల ధృడత్వం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. అంతేగాదు ఇది శరీరంలో ప్రోటీన్ అసమతుల్యతను ఏర్పరిచి జీవక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. ఫలితంగా ఇన్సులిన నిరోధకత, వాపు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే ఈ ప్రోటీన్ షేక్‌లలో ఉండే కృత్రిమ స్వీటెనర్ల ప్రిజర్వేటివ్‌లతో శరీరం లోడ్ అవుతుందనేది గ్రహించండి అని చెబుతున్నారు. కాబట్టి అధిక ప్రోటీన్ వినియోగం అనేది ఆరోగ్యానికి అన్ని విధాల హానికరమే అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ శరీరానికి అనుగుణంగా ప్రోటీన్ తీసుకోండి. అలాగే జంతు ఆధారిత ప్రోటీన్ కంటే ఆల్కలీన్ స్వభావం కలిగిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకువాలని అన్నారు. ముఖ్యంగా కాయధాన్యాలు, క్వినోవా, టోఫు, గింజలు, నట్స్, వంటివి ఉత్తమం అని చెప్పారు. అదనంగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలతో భర్తీ చేసుకోమని సూచించారు. అంటే విటమిన్లు సీ, ఈఅధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలతో సమతుల్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రోటీన్ పౌడర్ల కంటే సంపూర్ణ ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిదని నొక్కి చెప్పారు. అలాగే మన శరీరం ప్రోటీన్ లోపంతో బాధపడుతుందనేందుకు సంకేతంగా జుట్టు, చర్మం, గోర్లు కండరాల బలహీనత, అలసట, కొవ్వు కాలేయం కారణంగా పెరిగిన ఆకలి కోరికలు, గాయాలు త్వరగా నయం కాకపోవడం తదితర సమస్యలు చుట్టుముడతాయని వివరించారు లోవ్నీత్ బాత్రా. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!) -
మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్‌తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్‌గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్‌తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్‌గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
పోషకాల పరంగా బెస్ట్ చట్నీలివే..!
భారతీయ ఆహారంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా.. పక్కన కాస్త రోటి పచ్చడి లేదా కొద్దిపాటి చట్నీతో గానీ భోజనం పూర్తి చేయరు. ఇవి భోజనాన్ని శక్తిమంతంగా మార్చుతాయి. ఓ గొప్ప రుచిని అందిస్తాయి. అయితే మనం ఎన్నో రకాల వెరైటీ చట్నీలు చేసుకుంటాం. హాయిగా లాగించేస్తుంటాం. కానీ పోషకాల ప్రొఫెల్ పరంగా ఏ చట్నీ ఆరోగ్యానికి మంచిదనేది తెలియదు. అయితే కొన్ని చట్నీలు బరువు తగ్గేందుకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపకరిస్తాయట. వాటి పోషకాల ఆధారంగా ఆయా చట్నీలకు ర్యాంకుల ఇచ్చి మరీ వివరంగా చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా. అవేంటంటే..చట్నీలను మాగ్జిమం సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల ఆయుర్వేద సంబంధిత మూలికలు వంటి వాటితో తయారు చేస్తుంటాం. అందువల్ల వాటి తయారీ ఆధారంగా పోషక విలువలు గణనీయంగా మారతాయని చెబుతున్నారు మల్హోత్రా. ఆ నేపథ్యంలోనే మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చట్నీలకు పోషకాల ఆధారంగా ర్యాంకులిచ్చి మరీ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అవేంటో చూద్దామా..పుదీనా-కొత్తిమీర చట్నీ: దీనిలో విటమిన్లు ఏ,సీ, కేలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.వెల్లుల్లి చట్నీ: గుండె ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు (ఎంసీటీలు), ఫైబర్ అధికంగా ఉంటాయి, జీవక్రియ, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మాంగనీస్, రాగి వంటి ఖనిజాలను అందిస్తుంది.వేరుశెనగ చట్నీ: ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. శక్తి వంతమైనది. సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.టమాటో చట్నీ: లైకోపీన్ (గుండె ఆరోగ్యానికి సంబంధించిన యాంటీఆక్సిడెంట్), విటమిన్లు సీ, ఈలు సమృద్ధిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.చింతపండు చట్నీ: విటమిన్ బీ, మెగ్నీషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎక్కు చక్కెర ఉండటం వల్ల దీన్ని అంతగా ఆరోగ్యకరమైనదిగా పరిగణించలేదు నిపుణులు. మామిడి చట్నీ: ఇందులో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. అయితే దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర మిరప చట్నీ: క్యాప్సైసిన్ అధికంగా ఉంటుంది,. జీవక్రియను పెంచుతుంది. అయితే మితంగానే తీసుకోవాలి.“కారపు చట్నీలు వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ప్రకాశవంతమైన రంగును ప్రోత్సహిస్తాయి. ఇంట్లో తయారుచేసిన చట్నీలు స్టోర్-కొనుగోలు చేసిన వెర్షన్ల కంటే ఎక్కువ పోషకాలను ఉంటాయి. ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెరలు ఉండవు కాబట్టి చెబుతున్నారు మల్హోత్రా .మితంగా తీసుకోవాల్సిన చట్నీలుకొన్ని భారతీయ చట్నీలు అధిక కేలరీలు లేదా సోడియం కంటెంట్ కారణంగా మితంగా తినాలి అని మల్హోత్రా సూచించారు.కొబ్బరి చట్నీ: రుచికరమైనది అయినప్పటికీ, 100 గ్రాములకు 217 కేలరీలు, 19.84 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంద., ప్రధానంగా సంతృప్త కొవ్వు నుంచి ఎల్డీఎల్ (LDlL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధితన సమస్యలు ఉన్నవారికి మంచిది కాదని చెబుతున్నారువేరుశెనగ చట్నీ: కేలరీలు అధికంగా ఉంటాయి. దీనిలో 100 గ్రాములకు సుమారు 331.78 కేలరీలు, 22.82 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లను అందిస్తున్నప్పటికీ.. ఇందులో జోడించిన ఉప్పు, చక్కెర మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం.చింతపండు చట్న: తయారీ పద్ధతులను బట్టి ఈ చట్నీలో అదనపు చక్కెరలు, సోడియం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇది ఒకరకంగా అదనపు కేలరీల తీసుకునేందుకు దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు మల్హోత్రా. చివరగా ఈ చట్నీలన్నీ రుచి, పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆహార సమతుల్యత, ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్కువగా తీసుకోవడమే మంచిదని సూచించారు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యలను సంప్రదించడం ముఖ్యం. (చదవండి: Vicky Kaushal: 'ఛావా' కోసం వంద కిలోలు దాటేసిన హీరో.. ఏ డైట్ ఫాలో అయ్యాడంటే?) -
ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) -
సాగర తీరాన.. విరుల సరాగం
సాగరతీరాన ఎటూ చూసినా విభిన్న మొక్కల సోయగం.. దేశీ వెరైటీలు మొదలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన మొక్కలతో సందడిగా మారింది నెక్లెస్‌రోడ్ పీపుల్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన హార్టికల్చర్ షో. సాధారణ చామంతులు మొదలు ఇంపోర్టెడ్ ఆర్కిడ్స్, హోల్కోనియా వరకూ అన్నిరకాల మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ వినూత్న జీవనశైలికి హంగులద్దుతున్న నగరంలోని మొక్కల ప్రియులు ఈ హారీ్టకల్చర్ షోకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ 50 రూపాయలు మొదలు లక్షకు పైగా ధరల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగర జీవనశైలిలో కాసింత సాంత్వన, విశ్రాంతి మొక్కలు ఎంతో అవసరం. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యం, పరిరక్షణలో ఈ మొక్కలదే కీలక పాత్ర. వెరసి గత కొన్నేళ్లుగా నగర వాసులు గార్డెనింగ్, మిద్దెపంట, ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ విభిన్న రకాలుగా మొక్కల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఏటా నగరం వేదికగా నిర్వహించే హారీ్టకల్చర్ ప్రదర్శనకు ప్లాంట్ లవర్స్ తాకిడి క్రమంగా పెరుగతోంది. సాధారణ మొక్కలు మొదలు అరుదైన మొక్కలు, బోస్సాయ్ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆర్నమెంటల్ తదితర మొక్కలు అమ్మకానికి వచ్చాయి. ఇందులో భోన్సాయ్, ఫైకస్ మొక్క లక్ష రూపాయలకు పైగా అమ్మకానికి రావడం విశేషం. అంతేకాదు థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసిన కమేలియన్ మొక్క కూడా అక్షరాల లక్ష రూపాయలు పలకడం విశేషం. అరుదైన మొక్కలు.. ‘అరుదైన మొక్క స్టాగన్ ప్లింగ్ రకం ఈ సారి తీసుకొచ్చాం. ఇవి వాటి సైజుల ఆధారంగా 4 వందల నుంచి 8 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. డ్రిఫ్ట్ వుడ్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఇంటీరియర్ మొక్కలకు పూసిన పూలు 6 నెలల వరకూ వాడిపోవు. ఇవన్నీ ఆర్కిడ్ జాతికి చెందినవి. పూణే నుంచి తీసుకొచి్చన ఈ వెరైటీ ఖరీదు 35 వేలు అని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం.. మా దగ్గర సీజనల్ చామంతి ప్రత్యేకం. వీటిని కాకినాడలోని గణపతి గార్డెన్స్‌లో ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం. దాదాపు 6 నెలలు కష్టపడితే వందల పూలతో ఒక బంతిలా తయారవుతాయి. ఇందులో 25 రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. 3 వందల నుంచి 3 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూలతో అలరిస్తాయి. రెండు మొక్కలు తీసుకుంటే 500 వందల ఆఫర్‌తో అందిస్తున్నాం. – గణపతి గార్డెన్స్ నిర్వాహకులుగత మూడున్నరేళ్లుగా.. దేశవ్యాప్తంగా సేకరించిన విభిన్న మొక్కలు ఈ నర్సరీ మేళాలో అందుబాటులో ఉంచాను. ముఖ్యంగా కలకత్తా నుంచి తీసుకువచి్చన కమేలియాస్ ఈ సారి ప్రత్యేకం. అజేలియాస్ హైడ్రేంజియాస్, డేలియాస్ వంటి విభిన్న మొక్కలకు మంచి ఆదరణ పెరిగింది. డేలియాస్ పూల మొక్కల్లో అతిపెద్ద సైజు వెరైటీ మొక్కలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఏప్రిల్ వరకూ పూలతో అలరిస్తాయి. నాటు కమేలియాస్ మా ప్రత్యేకం.. పెద్దవి రూ.2900 చిన్నవి రూ.1200 వరకూ అమ్ముతున్నాను. నగరంలోని కౌకూర్ వేదికగా గత మూడన్నరేళ్లుగా మొక్కలతో పాటు కాంప్రహెన్సివ్ స్టోర్‌గా మార్బుల్, సిరామిక్, హుడ్, ప్లాస్టిక్ తొట్లతో సేవలందిస్తున్నాం. – పాల్ చంద్రకాంత్, స్టాల్– బీ24, 2530 రకాల ఆర్కిడ్స్.. ఇందులో 30 రకాల వరకూ అందుబాటులో ఉన్నాయి. కటేలియా, ఫాక్స్‌టైల్, బ్యాండ్రియం, క్రీపర్స్, ఎయిర్ ప్లాంట్స్ తదితర వెరైటీలు బాగా అమ్ముడుపోతున్నాయి. వీటిని థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకుని, వెస్ట్ గోదావరి తణుకు వేదికగా 7 ఎకరాల నర్సరీలో పెంచుతున్నాం. 7 వందల నుంచి 2500 వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. – సంతో‹Ù. 450కు పైగా వెరైటీలు.. తెలంగాణలో అడీనియం బోన్సాయ్ మొక్కల్లో అన్ని వెరైటీలనూ అందిస్తున్నది ‘హైదరాబాద్ అడీనియం’ మాత్రమే. 450కు పైగా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. బేబీ ప్లాంట్ నుంచి 30 ఏళ్ల అడీనియం మొక్కలు 250 నుంచి 50 వేల వరకూ అందుబాటులో ఉంటాయి. కేరళ నుంచి వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాటర్ లిల్లీ, తామర పూలు మా ప్రత్యేకం. అంతేకాకుండా అలోకేíÙయా, హెల్కోనియా, కొలకేషియా తదితర రకాలు ఉన్నాయి. తామరలోనే ఎనిమిది రకాలకు పైగా ఉన్నాయి. మా వద్ద 6 వందల నుంచి 7 వేల వరకూ ధరలు ఉన్నాయి.జనప నారతో బ్యాగ్స్.. ఆంక్రో పెగ్రో సైన్సెస్ అనేది మా సంస్థ. మా వద్ద హెర్బల్, ఈకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ గ్రో బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో ఇవి మొక్కలకు అధిక రక్షణ ఇస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ బ్యాగులు చూసుకుంటాయి. ఈ బ్యాగుల్లో రెండు రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. వీటిని జనప నారతో తయారు చేస్తాం. – ప్రదీప్ -
ఆమె ఈమెనా...! ఏకంగా 150నుంచి 68 కిలోలు..
బరువు తగ్గడం అనేది అంత సులభమైన పని కాదు. అందులోనూ మూడంకెల రేంజ్లో బరువు ఉంటే నో ఛాన్స్ అనేస్తారు. కేవలం ఫ్యాట్ తగ్గించుకునే ఆపరేషన్లతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ మహిళ అంత భయనాక స్థాయిలో ఉన్న తన శరీర బరువుని విజయవంతంగా తగ్గించుకుని నాజుగ్గా మారిపోయింది. ఆమె పాత ఫోటోలు చూస్తే "ఆమె ఈమెనా.."అని ఆశ్చర్యపోవాల్సిందే అంతలా ఆమె బాడీ రూపురేఖలు మారిపోయాయి. సన్నబడితే ఇంత అందంగా ఉంటుందా అని అంతా కళ్లప్పగించి చూసేలా స్లిమ్‌గా అందంగా మారిపోయింది. ఏదో మాయ చేసినట్లుగా బరువు తగ్గి, అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఇది సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే(Pranjal Pandey) వెయిట్ స్టోరీ. బరువు తగ్గడం అనేది ఎంత క్లిష్టమైన ప్రక్రియ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రాంజల్ పాండే అలా ఇలా కాదు..ఏకంగా 150 కిలోలు బరువు ఉండేది. ఈమె బరువు తగ్గాలనుకున్నా(Weight Loss) తగ్గుతుందా అనేంతగా భారీగా ఉండేది ఆమె శరీరం. కానీ ఆమె మాత్రం సాధ్యమే అంటూ ఎవ్వరూ ఊహించని రీతీలో బరువు తగ్గి గుర్తపట్టేలేనంత అందంగా మారిపోయింది. ఎవరీ అమ్మాయి అనుకునేలా ప్రాంజల్ పాండే తన బాడీ రూపరేఖలను మార్చుకుంది. కానీ తాను కూడా ఈ రేంజ్లో బరువు తగ్గగలనని అస్సలు ఊహించలేదని అంటోంది. అయితే ప్రాంజల్ పాండే డైట్(Diet), వర్కౌట్లు(work out) అంటూ నెటింట వైరల్ అవుతున్న కొత్తకొత్త వాటిని వేటిని ఫాలో కాలేదు. కేవలం తన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అదే తనకు 'పెద్ద గేమ్ చేంజర్'లా పనిచేసి కిలోలు కొద్దీ బరువు తగ్గేందుకు ఉపకరించిందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు తన జీవనశైలిలో జతచేసిన అలవాట్లను గురించి ఇన్స్టాగ్రాం వేదికగా షేర్ చేసుకుంది. అవేంటంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి..ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడిన గోరు వెచ్చని నీరు తీసుకోవడం. ఇది పొట్ట ఉబ్బరాన్ని నివారిస్తుంది, కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.ప్రతి భోజనానికి ముందు ఫైబర్. ఫైబర్ ఉండే సలాడ్లు లేదా పళ్లు, నట్స్ వంటివి తినడం. దీంతో పొట్ట నిండి ఉంటుంది కాబట్టి భోజనం మితంగా తింటారు. పైగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు.ప్రోటీన్ లేదా కొవ్వుతో ఉండే పండ్లు తినడం. ఇలా అందరికీ వర్తించదు. ఇక్కడ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండేకి పీసీఓసీ సమస్య ఉంది. అందువల్ల బాదంతో కలిపి ఆపిల్ తినడం, వెన్నతో కూడిన పెరుగుతో స్ట్రాబెర్రీలు తీసుకునేదట.ప్రతిరోజూ 4 లీటర్ల నీరు త్రాగడం. దీనివల్ల మూత్రం ద్వారా అదనపు కొవ్వు తొలగిపోతుందిఅలాగే భోజనం అనంతరం కనీసం 10 నిమిషాలు నడవడం, 10-15 స్క్వాట్లు చేయడం వంటివి చేయాలి. పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు చివరి భోజనం చేయడం.భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కడుపు నిండుగా తిన్న అనుభూతి దక్కుతుంది. కొద్దిపాటి సింపుల్ వ్యాయామాలు శరీరాన్ని ఫ్రీగా కదిలించడానికి, రిఫ్రెషింగ్కి ఉపయోగపడతాయి. ఇలాంటి అలవాట్లతో కొండలాంటి శరీరాన్ని నాజుగ్గా మార్చేయవచ్చని ప్రూవ్ చేసింది న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే. ఎలాంటి డైట్లు అవసరం లేదు జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, జస్ట్ తీసుకునే ఫుడ్‌పై ఫోకస్ పెట్టండి అంటోంది. View this post on Instagram A post shared by Pranjal Pandey (@transformwithpranjal) (చదవండి: నిఖిల్ కామత్ సూపర్ ఫుడ్ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?) -
స్లిమ్ సెట్.. డైట్ మస్ట్
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తింటున్నారు.. నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు.. చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి. ఆ ఆలోచన చేయవద్దు డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది. – బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్సుమారు 30 కేజీలు బరువు తగ్గాను అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్. – వై.నిషిత, కూకట్పల్లి -
ఎఫ్ఎంసీజీ.. ఆరోగ్య‘మస్తు’!
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది. గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి. ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం. అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఫిట్నెస్.. లైఫ్ స్టయిల్... నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ. డిమాండ్ ఫుల్.. సరఫరా డల్కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వీటిపై ‘శీత’ కన్నేయండి
ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...నూనెలో వేయించిన చిరుతిళ్లు...వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.డెయిరీ ఫుడ్...మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు. రెడ్ మీట్...చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బండ్లమీద అమ్మే పదార్థాలు...బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. శీతల పానీయాలు...చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. సిట్రస్ జాతి పండ్లు...విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.ఆవకాయ వంటి ఊరగాయలు...వింటర్లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్థాలు...మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు. -
ఎలాన్ మస్క్ తల్లి మాయే హెల్త్ టిప్స్: 14 మంది పిల్లలకు నానమ్మగా..!
ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికి టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా.. ఓ కొడుకుగా తల్లి మాట వినాల్సిందే. ఇక్కడ మస్క్ కూడా తన తల్లి మాయే ఆహార నియమాలకు కట్టుబడి ఉంటాడట. అంతేకాదు ఆమె తన 14 మంది మనవళ్లు, మనవరాళ్లు కోసం కూడా కొన్ని ఆహార నియమాలను కూడా రూపొందించిందట. అవి వాళ్లంతా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనట. ఇక మస్క్ తల్లి మాయే ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. మాయే మాజీ మోడల్, డైటీషయన్ కూడా. ఆమె ఆహారం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు యువతరం చక్కటి ఆరోగ్య కోసం ఎలాంటి పోషకాహార నియామాలు పాటించాలో కూడా వివరించారు. అవేంటో చూద్దామా..!.76 ఏళ్ల మాయే మస్క్ ఈ వయసులో కూడా ఎంతో అందంగా, చురుకుగా ఉంటారు. ఆమె గత 40 ఏళ్లుగా డైటీషియన్‌కి సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థను కూడా నడుపుతోంది. ఆమె తరుచుగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో తన హెల్త్ సీక్రెట్‌ని వివరిస్తూ.. ఈనాటి యువతరం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా డైట్‌ని మార్చి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేలా ప్రయత్నించాలని అంటారు మాయే. అప్పుడు బ్లడ్‌లో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలో మెరుగైన మార్పులు కనిపించడమే గాక చికిత్స ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటారామె. అలాగే తాను 14 మంది పిల్లలకు నానమ్మగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వనని అన్నారు. ముఖ్యంగా చిప్స్, కుక్కీలకు తన ఇంట్లో స్థానం ఉండదంటారు. చక్కెర, సోడియంతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయని నొక్కిచెప్పారు. తన మనవళ్లు, మనవరాళ్లను అవి తినే విషయంలో తాను చాలా స్ట్రిక్‌గా ఉంటానన్నారు. జంక్‌ఫుడ్‌కి ఎడిక్ట్ అయ్యేలా చేసేవే అవేనని అంటారు మాయే. చిన్నారులు ఒక్కసారి తినే ప్రయత్నం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు అందువల్లే ముందే వాళ్ల దరిదాపుల్లోకి వాటిని రానీయకూడదంటారామె. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వమని సూచిస్తున్నారు మాయే. అవేంటంటే..పండ్లుకూరగాయలుపెరుగుపాలుతృణధాన్యాలు గోధుమ రొట్టె తదితరాలు..ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..చిప్స్, కుక్కీలు విపరీతమైన ఉప్పు, చక్కెరతో ఉంటాయి. వీటిని తినడం వల్ల దంత క్షయం, చెడు కొలెస్ట్రాల్, టైప్2 డయాబెటిస్, కేన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి, ఒబెసిటీ తదితర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వీటిని సరదాగా ఒక్కసారి చిన్నారులకు అలవాటు చేస్తే వాటి రుచికి ఆటోమెటిక్ మళ్లీ తినాలను కోరిక వారిలో బలంగా పెరుగుతుందని అన్నారు. ఒకరకంగా వారి మెదడు కూడా తెలియకుండా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆదిలోనే వాటిని దరిచేరనీయకుండా చూస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: -
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
శుక్రవారం మాది..
నేటి కాలంలో ఆడపిల్ల కడుపున పడినప్పటి నుంచీ కష్టాలే. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడం నుంచి కిశోర బాలికలకు, బాలింతలకు పోషకాహారం అందకపోవడం దాకా ఎన్నో సమస్యలు. మహిళలు కేన్సర్లు సహా ఎన్నో శారీరక రుగ్మతలకు లోనైనా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్న పరిస్థితి. పిల్లలను అంగన్వాడీలకు పంపడం లేదు. తెలియక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేలా, మహిళల్లో అవగాహన కల్పించేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, స్వయం సహాయక సంఘాలను ఒకే తాటిపై తీసుకువచ్చారు. ‘శుక్రవారం సభ’పేరిట ప్రభుత్వ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ముందు మా సేవలు చూడండి నేటి కాలంలో మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారు. పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అనారోగ్యమొస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ‘ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఎదగండి. చిన్నారులకు అంగన్వాడీలలో అందించే బాలామృతం, కిశోర బాలికలకు రక్తహీనతను తగ్గించే పోషకాహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం, మధ్య వయసు స్త్రీలకు ప్రతీ 3 నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్య మహిళ’ పేరిట లభించే 52 ఉచిత పరీక్షల వివరాలు తెలుసుకోండి. ఈ సేవలన్నీ ప్రభుత్వం వద్ద ఉచితంగా అందుతాయి..’అంటూ ‘శుక్రవారం సభ’పేరిట వారానికి ఒక మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే గర్భవతులకు సీమంతం, బాలింతలకు పోషకాహార పంపిణీ వంటివాటిని కలెక్టర్ స్వయంగా చేపడుతుండటం గమనార్హం. పీసీవోడీ, కేన్సర్, భ్రూణహత్యలపైనా.. నడి వయసు మహిళలకు ఆరోగ్య మహిళా పథకం ద్వారా పీసీవోడీ (గర్భాశయంలో కణతులు), కేన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ముప్పును ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని.. అవే పరీక్షలు, చికిత్సలు ప్రైవేటులో చేస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని కలెక్టర్ సత్పతి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. మహిళలు తీవ్ర అనారోగ్యాల పాలైతే వారి కుటుంబాలు ఆగమవుతాయని సూచిస్తున్నారు. పిల్లల మానసిక వికాసానికి వీలుగా అంగన్వాడీలను ఆహ్లాద వాతావరణం ఉండేలా మారుస్తున్నారు. భ్రూణహత్యలను అరికట్టేలా మహిళల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పోషకాహారం ప్రాధాన్యం తెలిసింది.. కలెక్టర్ సత్పతి మేడం మొదలుపెట్టిన శుక్రవారం సభ మాలో చైతన్యం తెచ్చింది. బాలింతలకు, గర్భవతుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మాలో రక్తహీనత నివారించేలా అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాముఖ్యత, అంగన్వాడీలలో లభించే సేవల గురించి చక్కగా వివరించారు. –అనిత, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్కేన్సర్ ముప్పు గురించి చెప్పారు కలెక్టర్ మేడం పీసీవోడీ, కేన్సర్ ఎలా వస్తాయో వివరించారు. మా ముందు తరాల వారు పనిలో పడి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నారు. కలెక్టర్ మేడం తల్లిలా మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడపిల్లల ప్రాధాన్యం వివరించి భ్రూణహత్యల నివారణపైనా అవగాహన కల్పించారు. – అఖిల, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్ -
మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
మహిళలు తమ కుటుంబ సంక్షేమం పట్టించుకున్నంతగా తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అలాగే ఇంటిల్లపాదికి ఇష్టమైనవి, ఆరోగ్యకరమైన ఆహారాలు ఓపిక తెచ్చుకుని మరీ వండిపెడతారు. తమ వద్దకు వచ్చేటప్పటికీ నాకెందుకు అనే భావన లేక త్యాగమో తెలియదు గానీ సరైన పోషకాహారం మాత్రం అస్సలు తీసుకోరు. ఇలా భావించే మహిళలు ప్రతి ఇంటిలోనూ ఉంటారు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దాదాపు 1.2 మిలియన్ల మంది బాలికలు, మహిళలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ప్రతి స్త్రీకి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఏటా సెప్టెంబర్ 25న జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ దినోత్సవం పేరుతో ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ చైతన్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఏంటో సవివరంగా చూద్దామా..!.పాలకూరపాలకూరలో ఐరన్ సమృద్ధిఆ ఉంటుంది. ఇది ఋతుస్రావం కారణంగా ఎదురయ్యే రక్తహీనతను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్‌ను కూడా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ,సీ, కే, సీలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరి మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.పెరుగు కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉన్న పెరుగు ఎముకలను బలోపేతం చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. స్త్రీలకు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మోనోపాజ్ దశలో కాల్షియం తగ్గిపోతుంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి ఇది తోడ్పడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.బెర్రీలుబ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటివి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి జీర్ణక్రియ, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్ మూలం.సాల్మన్సాల్మన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పవర్‌హౌస్. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఒమేగా -3 లు మహిళలకు అత్యంత అవసరమైనవి. ఇవి మహిళల్లో మరణానికి ప్రధాన కారణం అయిన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.పప్పుకాయధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ సంబంధిత మూలం. శాఖాహారం లేదా శాకాహారి ఆహారాన్ని అనుసరించే వారికి పరిపూర్ణంగా ఉంటాయి. కాయధాన్యాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.అక్రోట్లనువాల్నట్లు మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలకు మంచి చిరుతిండిగా పేర్కొనవచ్చుస్వీట్ పొటాటోస్వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, దృష్టికి తోడ్పడుతుంది. ఇవి ఫైబర్, పొటాషియంతో నిండి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవన్నీ మహిళలకు పోషకమైన శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లుగా పనిచేస్తాయి.చియా విత్తనాలుచియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, కాల్షియంను కూడా అందిస్తాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు, గుండె ఆరోగ్యానికి, గర్భధారణ తోపాటు వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు అత్యంత ముఖ్యమైనవి.(చదవండి: అవోకాడో వర్సెస్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?) -
పామాయిల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదా? ఎందుకని?
పామాయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైన కూరగాయ నూనె ఇది. దీన్ని ప్రాసెసింగ్ చేసే ఆహారపదార్థాల్లోనూ, సౌందర్య సాధనాలు, గృహోపకరణాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ ధరలోనే లభించే నూనె కావడంతో చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఈ పామాయిల్ చెట్ల పెంపకం అటవీ నిర్మూలన, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు వంటి పర్యావరణ నష్టాలతో ముడిపడి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఈ పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదా? ఎందువల్ల? తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఎలా ఆరోగ్యానికి హానికరం అంటే..ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి సుమారు 50% వరకు ఉంటాయి. అందువల్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తే శరీరంలో ఎల్డీఎల్ అనే చెడు కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన పామాయిల్లో సంభావ్య ట్రాన్స్ఫ్యాట్స్లు ఏర్పడతాయి. ఇవి గుండెజబ్బులు, మంట, ఇన్సులిన్ నిరోధకతతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అంతేగాదు అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఆ ఆయిల్లో ఆరోగ్యానికి హానికరమైన కలుషితాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మేళనాలు కేన్సర్ కలిగించేవని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు జంతు అధ్యయనంలో మూత్రపిండాలు, కాలేయం సంబంధ సమస్యలను కలిగిస్తుందని తేలిందని వెల్లడించారు. కొన్ని అధ్యయనాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఈ పామాయిల్ శరీరంలో మంటను పెంచుతుందని తేలింది కూడా. దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్లతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పామాయిల్‌ను కలిగి ఉండే ఆహారాలు తరుచుగా ప్రాసెస్ చేసినవి, కేలరీలు దట్టమైనవి. అందువల్ల తరుచుగా ఇవి తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. పైగా టైప్ 2 మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే పామాయిల్ ఉత్పత్తి ప్రక్రియలో పురుగుమందుల అవశేషాలు, ఇతర పర్యావరణ కలుషితాలు కలిగి ఉండవచ్చు. ఇది ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. ముడి పామాయిల్లో విటమిన్ ఈ, బీటా కెరోటిన్ వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ ఆహార ఉత్పత్తులలో ఉపయోగించే చాలా పామాయిల్ శుద్ధి చేయబడిందే. దీనిలో ప్రయోజనకరమైన పోషకాలు ఉండనే ఉండవని చెబుతున్నారు. పామాయిల్ మితంగా వినియోగిస్తే సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏదీఏమైనా పామాయిల్ కంటే ఆలివ్, కొబ్బరి లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలకే ప్రాధాన్యత ఇవ్వమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: పీసీఓసీ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?) -
గర్భంతో ఉన్నాం కదా అని.. అన్నీ లాగించేయకూడదు!
మన ఇంట్లోకి చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి. లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి. ఆహారం, జాగ్రత్తలుకోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు. వీటికి కారణంగా ఒక్కోసారి గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి. కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ చేపలను పరిమితంగా తినవచ్చు.కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు. -
ప్లేట్ మీల్స్ ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..!
బరువు తగ్గడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. వ్యాయమాలు, డైట్లని ఒకటి కాదు. ఎక్కడ ఏ తేడా కొడుతోందో గానీ బరవు తగ్గక భారంగా నిట్టూర్చుతాం. అయితే ఇలాంటి విషయంలో పోషకాహర నిపుణులు సహాయం తప్పనిసరి. అందుకోసం ఎలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలో సోషల్ మీడియాలో ఓ ప్రముఖ పోషకాహర నిపుణురాలు దీప్సిఖా జైన్ వివరించారు. మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో అన్ని పోషకాలు ఉండేలా బ్యాలెన్సింగ్‌గా తీసుకుంటే చాలని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ బ్యాలెన్సింగ్ ప్లేట్ మీల్స్ టెక్నిక్..!.మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటాం. ఐతే ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు దీప్సిఖా జైన్. ముఖ్యంగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గిస్తే ఎక్కువ సానూకూల మార్పులు చూడగలమని అన్నారు. అందుకోసం ప్లేట్ భోజనంలో కొద్ది మార్పులు చేయమని సూచిస్తున్నారు. ఇంట్లో వండిన రోటీలు, అన్నం అయితే అతిగా తినేస్తాం. అలాగే బరువు కూడా పెరిగిపోతారు. కాబట్టి సమతుల్యంగా ప్లేట్ మీల్స్ ఉండేలా చూడాలి. అంటే.. స్థూల, సూక్ష్మ పోషకాలను చేర్చడం తోపాటు మనసు పెట్టి తినడం వంటివి కూడా చేయాలని చెప్పారు. బరువు తగ్గేందుకు మన భోజనం ప్లేట్లో నాలుగు రకాలుగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.మొదటిది సలాడ్‌తో ప్రారంభించాలి, పచ్చికూరగాయలతో చేసిన ఓ కప్పు సలాడ్‌తో ప్రారంభించాలి. ఇది మంచి బ్లడుషగర్కి దోహదపడుతుంది. రెండోది ప్రోటీన్‌తో భర్తీ చేయాలి అంటే పప్పు, పనీర్ సబ్దీ లేదా నచ్చనీ ప్రోటీన్ మూలం తప్పనిసరిమూడోది ప్రోబయోటిక్స్ లేదా ప్రీబయోటిక్స్ మూలంతో నింపాలి. అంటే రైతా లేదా పెరుగుతో తీసుకోవచ్చు. ఇది జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నాలుగు కార్బోహైడ్రేట్ల కోసం చివరగా మల్టీగ్రెయిన్ రోటీని ఎంచుకోవాలి. ఇలా తీసుకుంటే కార్బోహైడ్రేట్లపై నియంత్రణ ఉంటుంది.ఈ నాలుగింటిని తప్పనిసరిగా ప్లేటు భోజనంలో ఉండేలా చూసుకుంటే అన్ని రకాల పోషకాలు విటమిన్లు శరీరానిక అందడమే కాకుండా బుద్దిపూర్వకంగా తింటారు. పైగా అధికా కేలరీలను తీసుకోకుండా నియంత్రించగలుగుతాం. ఇది ఒక రకరంగా ఆరోగ్యకరమైన రీతీలో భోజనం తీసుకునేందుకు సహాయపడుతుంది కూడా అని చెబతున్నారు పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్. View this post on Instagram A post shared by Deepsikha Jain (@fries.to.fit) (చదవండి: ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!) -
National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా మారాలంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. -
'పైన్ నట్స్'తో ఆరోగ్యం ఫైన్..!
నట్స్ అనంగానే గుర్తొచ్చేవి వేరుశెనగ, బాదం, జీడిపప్పు తదితరాలే. కానీ మధురమైన రుచిలో అంతకు మించి అనే నట్స్ మరొకటి ఉన్నాయి. అవే పైన్ నట్స్. ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ధర వింటే మాత్రం తినాలన్న కోరిక పోతుంది. ఆ రేంజ్లో ధర పలుకుతాయి ఈ గింజలు.ఈ పైన్నట్స్ని తెలుగులో చిల్గోజా అంటారు. రుచికరమైన జీడిపప్పులు, బాదాంలకు మించి అన్నట్లు టేస్టీగా ఉంటాయి. చెప్పాలంటే ఇవి తింటే ఓ చక్కటి స్వీట్ తిన్న ఫీల్ కలుగుతుంది. దీనిపై చింతపండుకు ఎలాగైతే గోధుమరంగు తొడుగు ఉంటుందో అలానే ఉంటుంది. దాన్ని పగలకొడితే తెల్లటి గింజ బయటకు వస్తుంది. అవే పైన్ నట్స్. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.ధర మాత్రం..ఈ పైన్‌నట్స్ ధర చాలా ఎక్కువ. కిలోకు ఏకంగా రూ.8000ల వరకు పలుకుతాయి. అంటే..దగ్గర దగ్గర ఓ గ్రాము బంగారం ధర పలుకుతుంది. ఆరోగ్యం కావాలనుకుంటే ధర గురించి పట్టించుకోకుండా చక్కగా కొని ఆస్వాదించండి. మరి ఖరీదు అనిపిస్తే..కనీసం ఒక్కసారైనా వందగ్రాముల గింజల్ని తెచ్చుకుని తప్పకుండా రుచి చూడండి.చిల్గోజాలో పోషకాలు:వంద గ్రాముల గింజల్లో సుమారు 673 కేలరీలు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల 13.69 ప్రోటీన్లు లభిస్తాయి. అదే సమయంలో, చక్కెర పరిమాణం 3.59గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా, 100 గ్రాముల చిల్గోజాలో 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి.గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం ఉంటాయి. వీటి తోపాటే ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.గుండె ఆరోగ్యం:చిల్గోజాలో 90% అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు బారిన పడకుండా ఉండొచ్చు. దీనిలో ఇతర గింజల కంటే ఎక్కువ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.జంక్ ఫుడ్‌పై ఆసక్తి తగ్గుతుంది..వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇవి తిన్నవెంటనే విడుదలయ్యే హార్మోన్లే దానికి కారణం. బరువు తగ్గాలని ఆలోచించే వ్యక్తులు చిల్గోజా తినడం ప్రారంభించాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది.కేన్సర్:చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. కేన్సర్ రాకుండా కాపాడుతుంది.సంతానలేమికి చెక్ పెడుతుంది..సెలీనియం పరిమాణం సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది. చిల్గోజా పురుషుల్లో సెక్స్ శక్తిని పెంచుతుంది. చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. రోజూ చిల్గోజా తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే, చిల్గోజా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.ఇతర ప్రయోజనాలు..చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిరాశ సమస్యతో పోరాడతారు. వీరు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.మోనోపాజ్ తరువాత, మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి మహిళలు తప్పనిసరిగా చిల్గోజా తినాలి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిల్గోజాలో ఉండే మెగ్నీషియం మొత్తం శరీరానికి కాల్షియం రవాణా చేయడానికి సహాయపడుతుంది.పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్‌లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.(చదవండి: ఈ విటమన్ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..) -
స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు: నిజమెంత?
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(58)తన సహోద్యోగితో కలిసి మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లింది.ఇద్దరూ బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సునీతా విలియమ్స్ స్టార్‌లైనర్ యాత్ర జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ద్వారా ఈ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాత్రలో విలియమ్స్‌తో పాటు తన సహచరుడు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. కానీ, వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్‌లైనర్ విమానానికి పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో జూన్ 14కి తిరిగి రావాల్సిన వారు కాస్తా జూన్ 26కి తిరిగి రావాల్సి వచ్చింది. సుమారు తొమ్మిది రోజులు ఆలస్యం అవ్వడమే గాక ఎక్కువి రోజుోల అంతరిక్షంలో ఉండిపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఛానెళ్లు ఊదరగొట్టాయి కూడా. వారంతా అన్నట్టుగానే సునీతా చాలా రోజులు అంతరిక్షంలో ఉండిపోవడంతో ఆస్టియోపోరోసిస్‌కి గురయ్యింది. దీని వల్ల ఎముకలు సాంద్రత కోల్పోతాయి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అని కూడా అంటారు. ఇక్కడ ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయేందుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ వ్యోమగాములు ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉంటే ఆరోగ్య ప్రమాదాల బారిన పడతారనే సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకీ అక్కడ ఎలాంటి ఫుడ్ తింటారు. అది వారికి ఆయా మిషన్లలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దామా..!అంతరిక్షంలో ఆహారంమిషన్లలో వ్యోమగాములను ఫిట్‌గా, చురుగ్గా ఉండేందుకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి మిషన్లలో ఆహారాన్ని నాసా క్షణ్ణంగా విశ్లేషిస్తుంది కూడా. నాసా వ్యోమగాములకు భూమిపై తయారు చేసిన రెసిపీలే ఇస్తారు. అంతేగాదు అంతరిక్ష వాతావరణానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల కలిగిన ఆహారాన్నే సిఫార్సు చేస్తోంది నాసా. ఐతే ఇవన్నీ పొడిగా ఉంటాయి. మంచి నిల్వచేసేలా ప్యాక్ చేస్తారు. రుచి, వాసన, ఆకృతి పరంగా రేట్ చేసి మరి ప్యాక్ చేయడం విశేషం. అలాగే ఫుడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మెరుగైన అంతరిక్ష ఆహారాన్ని రూపొందించడం కోసం వ్యోమగాముల రేటింగులను ఉపయోగిస్తుందట.ప్రారంభ రోజుల్లో స్పేస్ ఫుడ్నాసా నివేదిక ప్రకారం, ప్రారంభ రోజులలో పూర్తి రోజు భోజనం అవసరం లేదు. తరువాత అంతరిక్ష ఆహారం అభివృద్ధి కావడంతో అల్యూమినియం టూత్‌పేస్ట్-పరిమాణ ట్యూబ్లలో ఎండిన ఆహారాలు, సెమిలిక్విడ్లు అభివృద్ధ చేసింది. అయితే ఈ ఆహారాలు ఆకలిని కలిగించవని చెబుతున్నారు. నాసా ప్రకారం, వ్యోమగాములను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఎనిమిది రకాల స్పేస్ ఫుడ్ ఉన్నాయి. అవేంటంటే..రీహైడ్రేటెడ్ ఫుడ్: నీటిని తొలగించి నిల్వ చేస్తారు. ఈ నిర్జలీకరణ ప్రక్రియని ఫ్రీజ్ డ్రైయింగ్ అని కూడా పిలుస్తారు. అంటే..ఇక్కడ ఆహారం తినే ముందు వాటిలో నీరు భర్తీ చేయడం జరుగుతుంది. థర్మోస్టాబిలైజ్డ్ ఫుడ్: థర్మోస్టాబిలైజ్డ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసినట్లుగా వేడిని సూచిస్తాయి. కాబట్టి వీటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. చాలా పండ్లు, చేపలు (ట్యూనా ఫిష్) క్యాన్లలో థర్మోస్టాబిలైజ్ చేస్తారు. స్థానిక కిరాణా దుకాణంలో కొనుగోలు చేయగల పండ్ల కప్పుల మాదిరిగానే సులభంగా-ఓపెన్ పుల్ ట్యాబ్‌లతో క్యాన్లు తెరవబడతాయి. అలాగే, పుడ్డింగ్లను ప్లాస్టిక్ కప్పులలో ప్యాక్ చేస్తారు.ఇంటర్మీడియట్ తేమ ఆహారం: నాసా ప్రకారం, మృదువైన ఆకృతిని నిర్వహించడానికి తగినంతగా వదిలివేసేటప్పుడు ఉత్పత్తి నుంచి కొంత నీటిని కోల్పోయి ఇంటర్మీడియట్ తేమతో సంరక్షించబడతాయి. ఈ ఆహారాలలో ఎండిన పీచెస్, బేరి, ఆప్రికాట్లు మరియు మాంసం ఉన్నాయి.సహజమైన ఆహారం: ఈ ఆహారాలు సౌకర్యవంతంగా ప్యాక్ చేసి ఉంటాయి. సహజ ఆహారాలలో గింజలు, గ్రానోలా బార్లు, కుకీలు ఉన్నాయి. రేడియేటెడ్ ఫుడ్: మీట్ స్టీక్, స్మోక్డ్ టర్కీ మాత్రమే వికిరణ ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులను ఫ్లెక్సిబుల్ ఫాయిల్ పౌచ్‌లలో వండి ప్యాక్ చేస్తారు. అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా క్రిమిరహితం చేస్తారు. తద్వారా వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు.ఘనీభవించిన ఆహారం: పేరు సూచించినట్లుగా, పెద్ద మంచు స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి ఈ ఆహారాలు త్వరగా స్తంభింపజేయబడతాయి. ఇది ఆహారం అసలు ఆకృతిని నిర్వహిస్తుంది. తాజా రుచిని అందిస్తుంది. ఉదాహరణకు, క్విచెస్, క్యాస్రోల్స్ .తాజా ఆహారం: ఈ ఆహారాలు ప్రాసెస్ చేయరు లేదా కృత్రిమంగా సంరక్షించలేం. ఉదాహరణకు ఆపిల్, అరటిపండ్లు.రిఫ్రిజిరేటెడ్ ఫుడ్: ఈ ఆహారాలు చెడిపోకుండా చల్లని ఉష్ణోగ్రతలో స్టోర్ చేస్తారు. అటువంటి ఆహారాలకు ఉదాహరణలు క్రీమ్ చీజ్, సోర్ క్రీం (చదవండి: హైలెట్‌గా వినేష్ ఫోగట్ ఓవర్‌నైట్ వర్కౌట్లు..ఇలా చేస్తే బరువు తగ్గగలమా!) -
ఆ వ్యాధులకు ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వల్ల మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘవ్యాధుల వస్తాయని అందరికీ తెలిసిందే. నిపుణులు కూడా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది వాటిని తినే అలవాటుని మానుకోరు. పైగా అందుకు తగ్గట్టు యాడ్లు కూడా ఆకర్షణీయంగా వస్తాయి. అందులోనూ ప్రముఖులు, సెలబ్రెటీలే వాటిని ప్రమోట్ చేయడంతో నిపుణుల సలహాలను పక్కకు పెట్టేస్తుంటారు. అందువల్లే దేశమంతటా ఊబకాయం, మధుమేహ వ్యాధుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడూ ఆ విషయం నిపుణులు జరిపిన తాజా నివేదికలో తేలింది. ఆయా ఫుడ్స్ యాడ్స్ తప్పుదారి పట్టించి..తినేలా ప్రేరేపిస్తున్నట్లు న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) 50 షేడ్స్ ఆఫ్ ఫుడ్ అడ్వర్టైజింగ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో ఢిల్లీలో అందుబాటులో ఉన్న ప్రముఖ, ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో వస్తున్న సుమారు 50 ఫుడ్ ప్రకటనలను పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. భావోద్వేగాలు రేకెత్తించేలా అనారోగ్యకరమైన ఆ ఆహార ఉత్పత్తులను ప్రముఖులచే అడ్వర్టైజింగ్ చేపించి, వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలోనూ, సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) కన్వీనర్, పీడియాట్రిక్ అరుణ్ గుప్తా నివేదించారు. అంతేగాదు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వస్తున్న వాణిజ్య ప్రకటనలపై ముగింపు పలికేలా ప్రస్తుత నిబంధనలను సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఆయా ప్రొడక్ట్‌లు వందగ్రాములు/మిల్లీ లీటర్‌కు ఎన్ని పోషకాలు ఉంటున్నాయనేది బోల్డ్ అక్షరాలతో బహిర్గం చేసే చర్యలకు పిలుపునిచ్చారు. కాగా, ఇటీవలే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఈ ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో 10 ఏళ్లలోపు వయసుగల పిల్లల్లో పదిశాతానికి పైగా ఎక్కువ మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారని పేర్కొంది.(చదవండి: అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?) -
పొట్ట రాకూడదా? పొట్టు తియ్యద్దు మరి!
పొట్టు తీయని ధాన్యాల (హోల్ గ్రేయిన్స్)లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిల్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులూ ఆలస్యమవుతాయి. పొట్టుతీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. ∙ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో ΄ాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలనూ తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. -
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
సిద్దిపేటలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరిట భారీ మోసం
-
ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'!
ఈ జీవిత పోరాటంలో ఒక్కొక్కరి జీవనం ఒక్కోవిధంగా కొనసాగుతూంటుంది. వాటిలో ఎన్నో మార్పులు, చేర్పులు కూడా జరుగుతూంటాయి. కొన్ని సమయాల్లో జీవించడానికి వలసలు వెళ్లాల్సివస్తుంది. కొందరైతే ఊర్లు, దేశాలు, ఏకంగా ఖండాలే దాటి వెళ్తున్నారు. అది కూడా బస్సులు, రైల్లు, విమనాల్లోనో ప్రయాణిస్తున్నారు. జీవన శైలిలో ఇది ఒకెత్తు అయితే, మరో ఎత్తు.. మూగ జీవాలకై.. గిరిజన తండా వాసులు పడే తంటాలు. ఎండనకా, వాననకా, రాళ్లనకా, ముళ్లనకా వారివి కాలినడక ప్రయాణాలు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు.. ఏకంగా ఏడాదిలో ఆరుమాసాలు. ఇంటివాకిలిపై, పిల్లాజల్లలపై మనసున్నా గానీ, ఎంచుకున్న మార్గాన్ని వీడక, మూగప్రాణుల కడుపు మేతకై ఈ ఆడపడుచుల ప్రయాణాన్ని గురించి ఓసారి చూద్దాం! రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, వీర్నపల్లి గిరిజన తండాలకు చెందిన 25 కుటుంబాలు ఆరు నెలలపాటు ఇల్లు విడిచి, ఊరును వదిలి వనవాసం చేస్తూ... ఆవులను మేపుతుంటారు. స్థానికంగా గడ్డి లేకపోవడంతో ఊరు వదిలి మన్నెం(వలసపోవడం) అనివార్యమైంది. మద్దిమల్ల నుంచి అటవీమార్గంలో ఆవులను మేపుతూ.. కోరుట్ల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్ శివారులోకి వెళ్లి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆవులను మేపుతారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే ఆవులతోపాటు నిద్రిస్తారు. అక్కడే వంట చేసుకుని తింటారు. ఎవరైనా పెద్ద రైతులు తమ పొలాల్లో సేంద్రియ ఎరువుల కోసం ఈ ఆవుల మందలను వారం, పది రోజులు పెట్టించుకుని డబ్బులు ఇస్తారు. ఆవుల మూత్రం, పేడ పొలాలకు సేంద్రియ ఎరువులుగా పనికి వస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా ఆవుల మందలను పొలాల్లో పెట్టిస్తారు. అలా వచ్చిన డబ్బులతోనే గిరిజనులు బియ్యం కొనుక్కుని, కట్టెల పొయ్యిపై వంట చేసుకుని తింటారు. కొన్ని ఆవులను, కోడెలను ఒక్కోదాన్ని రూ.15వేల నుంచి రూ.30 వేలకు స్థానిక రైతులకు, పశువుల సంతల్లో అమ్ముతారు. కోడెలు రైతులకు ఎవుసానికి అక్కరకు వస్తుంటాయి. ఇలా ఆరు నెలలపాటు వనవాసం చేసి వర్షాకాలంలో ఇల్లు చేరుతారు. ఆవుల మందలే ఆధారం.. గిరిజనులకు ఆవుల మందలే ఆధారం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉండేవి. ఇప్పుడు వాటిని మేపేందుకు చెల్కలు లేక, అడవుల్లోకి వెళ్లకుండా కంచెలు వేయడంతో ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు వన్యప్రాణుల భయం వెంటాడుతుండడంతో అడవుల్లోకి వెళ్లడం తగ్గిపోయింది. మైదాన ప్రాంతాలన్నీ పొలాలుగా మారడంతో పశుపోషణ భారమైంది. అయినా.. కొందరు గిరిజనులు ఆవులను పోషిస్తూ.. వాటితో వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టడం, పిల్లలను చదివించడం, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆవుల మందల సంఖ్య తగ్గిపోయింది. అయినా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ వంద కుటుంబాల వరకు ఆవులే ఆధారంగా ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇవి చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా! -
అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!
‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్‌లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజనీర్లు. కెరీర్లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ". ‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్‌లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్‌కి చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో చేర్చడం కోసమే హైదరాబాద్‌లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్‌లో ఉద్యోగం. హరిద్వార్‌లో పోస్టింగ్. దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్‌లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్‌రంగంలో ముంబయి, లండన్లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ. సీట్లో కూర్చోవడం నుంచి మొదలు... ‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్‌లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్‌తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం. బలహీనమవుతున్న దేహం మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్‌లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లున్నారు. ఆకు నుంచి గింజ వరకు... ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్‌స్టయిల్‌ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్‌లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం. జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం. బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది! భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్‌కి ఎర్త్ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు. ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో, ఎఫ్బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్లెట్లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’ – సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్ఫుల్ , హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!) -
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
టిఫినీలు చేసి.. చదివేసి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారం అందించడం, బడిపై పిల్లల్లో ఆసక్తి పెంచడం లక్ష్యంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ‘ముఖ్యమంత్రి ఉపాహార పథకం’పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా.. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ ఉపాహార పథకం మ రింత దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. బడి మానేసే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే పిల్లలకు కావాల్సిన ఆహారం విషయమై తామిక ఎలాంటి హడావుడి పడాల్సిన అవసరం ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు. రోజుకో రకం అల్పాహారం అందిస్తుండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, క్రమం తప్పకుండా బడికి రావడం వల్ల చదువుల్లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యం, ప్రమాణాల పెంపే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి ఉపాహారం పథకం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 1–10 తరగతులు చదివే విద్యార్థులు 23,05,801 మంది ఉన్నారు. వీళ్ళంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళూ ఎక్కువ మందే ఉన్నారు. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సైతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే హడావుడిగా తమ పనులకు వెళ్ళడం వల్ల స్కూలుకెళ్లే పిల్లలను పట్టించుకోవడం కష్టంగానే ఉంటోంది. చాలామంది పిల్లలు ఉదయం పూట ఆహారం తీసుకోకుండానే స్కూలుకు వెళ్ళాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం అందిస్తున్నా ఈలోగా తరగతి గదిలో నీరసపడిపోతున్న ఘటనలూ ఉంటున్నాయి. మరోవైపు సరైన పౌష్టికాహార లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్ర విద్యా, ఆరోగ్యశాఖలు జరిపిన సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఎక్కువ మందిని పౌష్టికాహార లోపం వెంటాడుతోందని తేలింది. దీనివల్ల రక్తహీనత, దృష్టి లోపం ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఉపాహారం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పదో తరగతికి చేరే నాటికే బడి మానేస్తున్న వారి శాతం 13.9గా ఉంటోంది. పేదరికం, సరైన ఆహారం అందే పరిస్థితి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఉపాహారం అందుబాటులోకి తేవడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం సార్.. బ్రేక్‌ఫాస్ట్ సూపర్ ఈ రోజు మా స్కూల్లో ఇచ్చిన ఇడ్లీ, పూరీ, కిచిడీ, చట్నీ, సాంబార్ చాలా బాగున్నాయి. ఆరు రోజుల పాటు రకరకాల బ్రేక్ ఫాస్ట్ ఇస్తారట. మా కోసం మంచి పథకం తీసుకొచ్చి న సీఎం సార్‌కు కృతజ్ఞతలు. – హైమావతి, ఏడో తరగతి, రావిర్యాల ప్రభుత్వ పాఠశాల (రంగారెడ్డి జిల్లా) ఇంట్లో సమస్య తీరిపోతుంది ఉదయం పిల్లలు తినీతినకుండానే హడావుడిగా బడికి వెళ్తారు. ఇప్పుడు ప్రభు త్వం ఉపాహారం అందిస్తుండటంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇంట్లో తినకుండా మారం చేసేవాళ్లు కూడా అక్కడే బుద్ధిగా తింటారు. మధ్యాహ్న భోజన పథకం మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నిరంతరం కొనసాగించాలి. – గుడిమల్ల రాజేష్, విద్యార్థి తండ్రి, భూపాలపల్లి ఈ పథకం ఎంతో ఉపయోగకరం మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు అధిక శాతం పని చేసుకుంటూ జీవించేవారే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థినులు అందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందుతుంది. ఇకపై ఎవరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా క్లాసులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. – మోహనాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మారేడుపల్లి -
తగ్గేదేలే.. ప్రతీ నెలా నాన్‌వెజ్ కోసం రూ.240కోట్లు ఖర్చు చేస్తున్న జనాలు
ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు. ఆరోగ్యానికీ ప్రాధాన్యత ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది. పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే.. 10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు. ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది. ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది. ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు. ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. -
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం భూమిపూజ చేశారు. మొత్తం 33 ఎకరాల్లో చేపడుతున్న నిమ్స్ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 1,571 కోట్లు కేటాయింది. అదే విధంగా నిమ్స్‌లో.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మిస్తున్న దశాబ్ధి బ్లాక్‌కు నూతన భవనం ‘దశాబ్ది టవర్’కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా కొత్త భవనం నిర్మాణంలో 4వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలోకి నిమ్స్ చేరనుంది. కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మూడు బ్లాక్‌లుగా దశాబ్ది టవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఓపీ,ఏపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపీ సేవల కోసం 8 అంతస్తుల్లో ఓ బ్లాక్, ఎమర్జెన్సీ సేవల కోసం 8 అంతస్తులతో ఓ బ్లాక్ నిర్మాణం చేస్తున్నారు. ఇన్ పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ నిర్మిస్తున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ ధియేటర్లు ఉండనున్నాయి. ప్రతి రోజు నిమ్స్‌కు రోజుకు 2000-3000 ఔట్ పేషెంట్లు వస్తుంటారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిమ్స్‌లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగుతుండగా.. తెలంగాణలో 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ను 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్ ఉండనుందని అన్నారు. చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్? -
సర్కార్ బడుల్లో ఇక రాగి జావ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధాన మంత్రి పోషణ్’పథకాన్ని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఐరన్, ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్ధేశం. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన రాగి జావను అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే.. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యార్థులకు ఏడాదిలో 110 రోజుల పాటు రాగిజావను పంపిణీ చేస్తారు. ఇప్పటికే స్కూళ్లలో ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి అదనంగా.. ఉదయమే ఈ రాగి జావను అందిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో దీని అమలుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ సమావేశం సందర్భంగా ఎందరు విద్యార్థులకు రాగి జావ అందించాల్సి ఉంటుంది? ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. 2023–24లో రాష్ట్రంలో మొత్తంగా 16.82 లక్షల మంది విద్యార్థులకు 110 రోజుల పాటు రాగి జావ అందజేసేందుకు ఆమోదం తెలిపింది. దీనికి రూ.27.76 కోట్లు వ్యయం కానుండగా.. కేంద్రం 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. మధ్యాహ్న భోజనం 231 రోజులు సర్కారు బడుల్లో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో 231 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, బాల వాటికల్లో 231 రోజులు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో 293 రోజులపాటు మధ్యాహ్న భోజన పథకం అమలుకు పీఏబీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.323.71 కోట్లను వెచ్చించనుండగా.. కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 119.95 కోట్లను భరించనున్నాయి. కేంద్రం మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్లకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే పారితోíÙకం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేలు అదనంగా కలిపి.. 54,232 మంది సిబ్బందికి నెలకు రూ. 3వేల పారితోషికం ఇస్తోంది. ఈ చొరవను కేంద్రం ప్రశంసించింది. ఆరోగ్య విశ్లేషణ అనంతరం.. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది. విద్యార్థుల్లో పోషకాహార లోపం ఉందని, అందుకే చదువుపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారని అందులో గుర్తించింది. ఈ క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పాలకొండ రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ పీఓ గీత సూచించారు. స్థానిక కస్పా, కోమటి, కొత్త వీధుల్లోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు మండల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం సందర్శించిన ఆమె అక్కడి లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రీ–స్కూల్ విద్యార్థులకు చేస్తున్న విద్యాబోధనపై ఆరాతీశారు. కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలని, చిన్నారుల బరువు, ఎత్తు సరిచూడాలన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సూపర్వైజర్ మేరి ఉన్నారు. -
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వాళ్లవి పార్టిషన్ పాలిటిక్స్
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని తాము న్యూట్రిషన్ అందిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పార్టిషన్ పాలిటిక్స్ (విభజన రాజకీయాలు) చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ హిట్ అయితే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి,, అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలా సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన మరో పథకమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం’’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతోపాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గర్భిణులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను బాగా తగ్గించగలిగామని, మరింత ప్రయోజనం కలిగించేలా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. రెండు సార్లు కిట్.. ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐర¯న్ సిరప్లు, అర కిలో నెయ్యి, అల్బెండోజల్ మాత్రలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.2 వేల విలువైన కిట్‌ను రెండు సార్లు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులకు అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలో వచ్చే ఏడాది కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభిస్తామని ప్రకటించారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జెడ్పీ చైర్పర్సన్ డి.శోభ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ఎనిమిది జిల్లాల్లో ప్రారంభం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కామారెడ్డిలో నేరుగా, మిగతా ఎనిమిది జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు. వికారాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు లో మంత్రి సత్యవతి రాథోడ్, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్‌లో విప్ బాల్క సుమన్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతుండగా హరీశ్‌రావు కల్పించుకుని.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మెచ్చుకున్నారా, లేదా అని అడిగారు. మెచ్చు కున్నారంటూ ఎర్రబెల్లి సమాధానమివ్వగా.. శ్రీధర్‌బాబు మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
పోషకాహారం అందజేతలో ఏపీ అగ్రగామి
ఉయ్యూరు: ప్రజలకు పోషకాహారం అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఫుడ్ కమిషన్ రాష్ట్ర బృందం గురువారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో పర్యటించింది. కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు. నాడు–నేడు కింద పాఠశాలలో చేపట్టిన ప్రగతిని పరిశీలించి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును సందర్శించి సరుకుల నాణ్యత పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కడవకొల్లు–కాటూరు మధ్య అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కోళ్లఫారంను సందర్శించారు. విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు పథకాలను అందించాలన్నారు. -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
చిట్టి ధాన్యం..గట్టి ఆరోగ్యం..!
విజయనగరం: కొండ ప్రాంతాల్లోని గిరిజనులు ఆకలి తీర్చుకొనడానికే సాగుచేసే గడ్డిజాతికి చెందిన తృణధాన్యాలలో విశేష గుణాలను గుర్తించిన ఆహార శాస్త్రవేత్తలు ప్రపంచానికి చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని చాటుతున్నారు. చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, ఆరికెల సాగుపై మక్కువ పెంచుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిరుధాన్యాల సాగు వల్ల భూమి సారం పెరుగుతుంది. నీటి వినియోగం తక్కువగా ఉండి పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు. పోషక విలువలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటి ఉత్పత్తి పెంచడానికి ప్రోత్సహించింది. అతి తక్కువ పెట్టుబడితో పండించే మిల్లెట్స్‌తో అధిక ఆదాయం వచ్చే మార్గాలను పెంపొందించింది. మిల్లెట్ పాలసీ పోషక గనులున్న చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్ పాలసీ ప్రకటించింది. చిరుధాన్యాల సాగు పెంచేందుకు హెక్టారుకు రూ.6వేలు చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. సాగు విస్తీర్ణం పెంచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యంపై దృష్టి సారించింది. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన ఆహారం. ఆరోగ్య గుళికలుగా వాటిని వరి్ణస్తారు. అవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు. రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం శరీరానికి రక్షణగా నిలుస్తుందని న్యూట్రియన్స్ చెబుతున్నారు. ప్రభుత్వం అందసేస్తున్న ప్రోత్సాహాకాలతో పెరిగిన చిరు ధాన్యాల పంటను మార్కెట్లోకి వినియోగం పెంచడానికి జీసీసీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. చిరుధాన్యాలతో ఆహర పదార్థాల తయారీ, ముడి సరుకులను పుడ్‌ప్రోడక్ట్స్‌గా సిద్ధం చేయడం, దేవాలయాల్లో ప్రసాదాలకు అందించేందుకు మార్గం సుగమం చేసింది. చిరుధాన్యాల్లో కొర్రలను వినియోగిస్తే నరాల శక్తి మానసిక దృఢత్వం కలగడంతో పాటు ఆర్థరైటిస్, మార్ఛ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అండు కొర్రల వినియోగంతో రక్తశుద్ధి జరిగి, రక్తహీనత పోయి, రోగ నిరోధక శక్తి పెంచి డయాబిటిస్, మలబద్ధకం నివారిస్తుంది. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్యలు దూరం కావడమే కాకుండా పీసీఓడీ, సంతాన లేమి సమస్యల నివారణకు పని చేస్తాయి. ఊదలు వాడడం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులు, కొలెస్టరాల్, కామెర్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్య, పీసీఓడీ, సంతానలేమి సమస్యల నివారణకు దోహదంచేస్తుంది. అండుకొర్రలు: జీర్ణాశయం,ఆర్ద్రయిటీస్,బి.థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణకు సహకరిస్తుంది. పెరుగుతున్న విస్తీర్ణం పార్వతీపురం మన్యం జిల్లాలో మిల్లెట్స్ సాగు విస్తరిస్తోంది. ఇప్పటికే 3,750 ఎకరాల్లో సాగు విస్తురించే దిశగా చర్యలు తీసుకున్నారు. జీసీసీ బ్రాండ్‌తో మార్కెట్లోకి.. అత్యధిక పోషక విలువలు గల చిరుధాన్యాలకు ప్రాముఖ్యం లభించడంతో జీసీసీ బ్రాండ్‌తో మిల్లెట్స్‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాం. జీసీసీ ఎం.డి ఆదేశాల మేరకు నాణ్యత గల చిరుధాన్యాల కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాల ఆవశ్యకత వివరిస్తున్నాం. గిరిజన రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. గురుగుబిల్లి సంధ్యారాణి, జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సీతంపేట -
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి.. వెలుగులోకి భారీ స్కాం?
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోషకాహార పథకంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్ గుర్తించారు. పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకి రావటం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు. నకిలీ ట్రక్కులు.. పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్ టన్నుల రేషన్ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు స్పష్టమవుతోంది. 9వేలు ఉండాల్సింది.. 36.08 లక్షలు రేషన్ తీసుకునేందుకు అర్హులైన పాఠశాల మానేసిన బాలికల వివరాలను 2018, ఏప్రిల్‌లోపు సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, 2021, ఫిబ్రవరి వరకు ఆ వివరాలను సేకరించలేకపోయింది మహిళా, శిశుసంక్షేమ శాఖ. మరోవైపు.. పాఠశాల విద్యా విభాగం రాష్ట్రంలో స్కూల్ మానేసిన బాలికలు 2018-19 మధ్య 9వేల మంది ఉంటారని అంచనా వేసింది. అయితే, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఎలాంటి సర్వే నిర్వహించకుండానే 36.08 లక్షల మందిగా తేల్చింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించగా ఎలాంటి స్పందన లేదని పలు మీడియాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘రామన్ మెగసెసె’ అవార్డు తిరస్కరించిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి -
బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గర్భిణుల్లో పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవ ంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందుబాటులో కి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకు ని బతుకమ్మ కానుకగా ఈ కిట్లను లబ్ధిదా రులకు అందిస్తున్నట్లు తెలిపారు. శనివారం కోఠిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రో గ్రాం మేనేజ్మెంట్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కా మారెడ్డి, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నా రు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు కిట్లు.. ఒక్కో కిట్ ధర రూ.2వేల వరకు ఉంటుందని, ఇందులో నెయ్యి, ఖజూర్, హార్లిక్స్ తదితర పౌష్టిక పదార్థాలుంటాయని మంత్రి హరీశ్ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఇందులోభాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు. మందుల కొనుగో లుకు సీఎం కేసీఆర్ రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారని, ఇందులో రూ.100 కోట్లను ఆస్పత్రుల సూపరింటెండెంట్ల దగ్గర అందుబాటులో ఉంచామని వివరించారు. -
అమ్మకు పోషకాల కానుక..
సాక్షి, హైదరాబాద్: గర్భిణీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్‌ను అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కిట్‌లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు ఖరారయ్యాక న్యూ ట్రీషన్ కిట్లను మహిళలకు పంపిణీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్ ఇవ్వాలా లేక కేసీఆర్ కిట్ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు. ముందుగా తొమ్మిది జిల్లాల్లో అమలు.. కేసీఆర్ కిట్ లాగానే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా జూన్ 2, 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. -
శతమానం భారతి: పోషకాహారం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత స్త్రీ పురుష నిష్పత్తిలోని మహిళల జనాభా 2021 నాటికి కాస్తయినా పెరిగింది. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి చేరింది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలానే ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. భారతదేశం ఈ 75 ఏళ్లలో అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించినప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇది అవరోధం అయినా కావచ్చు. అందుకే దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంబులెన్స్ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగబోతోంది. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 నెహ్రూ వారసత్వం) -
బాలల ఆరోగ్యం
స్వాతంత్య్రానికి ముందు బాంబే, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమై కేవలం 12 మంది మాత్రమే చిన్నపిల్లల వైద్య నిపుణులు దేశవ్యాప్తంగా సేవలు అందించినట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్న పిల్లల వైద్యులు 50 వేల మంది వరకు ఉండొచ్చని అకాడమీ అంచనా. ఏటా సుమారు 1500 మంది చిన్నపిల్లల వైద్యంలో డిగ్రీలు పొందుతున్నారు. అయినప్పటికీ పది వేల జనాభాకు ఒక చిన్న పిల్లల వైద్యులు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. భారతదేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధమైన దశలోనూ జనాభాలో 40 శాతం మందిగా ఉన్న 47 కోట్ల మంది పిల్లల ఆరోగ్య సంరక్షణ అంతంత మాత్రం పురోగతి తోనే ఉంది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. 2021 అక్టోబరు నాటికి మన దేశంలో 33 లక్షల మంది పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం ఉంది. చిన్నారుల మరణాల్లో 70 శాతం ఈ కారణాల వల్లనే సంభవిస్తున్నాయి. 2018–2050 మధ్య ప్రపంచంలో 200 కోట్ల జననాలు సంభవించవచ్చని యునిసెఫ్ అంచనా వేసింది. అందులో ఐదో వంతు భారత్‌లోనే జన్మించే అవకాశం ఉంది. అందుకని శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటి నుంచే భరోసా కల్పించే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు పరచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు మనం చైనాను ఆదర్శంగా తీసుకోవచ్చు. చిన్న పిల్లల మరణాలను చైనా సమర్థంగా అదుపు చేయగలిగింది. నాణ్యమైన వైద్య సేవలను అందించడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించింది. అదే బాటలో మనమూ పయనించాలి. ఆరోగ్యవంతమైన రేపటి భారత్ కోసం చక్కటి ఆరోగ్య బాటను ఏర్పరచాలి. -
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
మహిళలే పోషకులు.. కొత్త ఆలోచనకు వేదిక
ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్నట్టే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని చూసి ఇల్లాలి వంటను చూడు అని కూడా అంటారు. తనవారందరి ఆరోగ్యాన్నీ పరిరక్షించేందుకు తగినట్టుగా ఆహారాన్ని వండిపెట్టడంలో గృహిణులకు సాటి లేదు. అందుకేనేమో... పోషకాహార రంగంలో దేశవ్యాప్తంగా మహిళలు సత్తా చాటుతున్నారు. డైటీషియన్లుగా, న్యూట్రిషనిస్ట్లుగా రాణిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇండియన్ డైటెటిక్ డే రోజును పురస్కరించుకొని జరిగిన దేశవ్యాప్త ‘సాధన’ అసోసియేషన్ కార్యక్రమంలో పోషకాహార నిపుణులంతా కలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 99 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. వారిలో అన్ని కేటగిరీలలో కలిపి తెలుగు రాష్ట్రాల మహిళలకు ఎనిమిది పురస్కారాలు దక్కాయి. పోషకాహార వైద్యులు అవంతీరావు, సంతోషి లక్ష్మి, వసుంధరా అయ్యగారి, జ్యోతి శ్రీనివాస్, అంజలి డాంగె, గౌరీప్రియ, హరితాశ్యామ్, సి.అంజలి... పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, అవార్డు గ్రహీతలతో మాట్లాడినప్పుడు ఈ రంగం పట్ల మహిళల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. ఆరోగ్యాన్ని పంచడానికి... కొంత కాలంగా ఫిట్నెస్ రంగం ఊపందుకోవడంతో యువతులు న్యూట్రిషన్/డైటీషియన్లుగా ఈ రంగంలోకి వచ్చారు. దీంతో పాటు ఆసుపత్రులు, ఫిట్నెస్ స్టూడియోలు, కార్పొరేట్ కంపెనీలు, కాలేజీలు... వగైరాలన్నీ సర్టిఫైడ్ పోషకాహార నిపుణులైన మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసినా, మహిళలే పోషకాహార నిపుణులుగా టాప్‌లో ఉన్నారు. ఇదీ మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. తమను తాము ఆరోగ్యకరంగా ఉంచుకుంటూ ఇతరులకు కూడా ఆరోగ్య పరంగా మంచి చేసే అవకాశం ఉండడంతో ఈ రంగానికి ఓటేస్తున్నారు. ‘వివిధ శాఖలకు అనుసంధానంగా ఉండటం, సమాజ సంక్షేమం కోసం పాటు పడేలా మంచి ఉద్దేశ్యం కూడా తోడవడంతో మహిళలు ఈ రంగం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు’ అంటారు పాతికేళ్లుగా పోషకాహార రంగంలో ఉన్న డాక్టర్ జానకి. మహమ్మారి పెంచిన అవగాహన ఇటీవల కరోనా మహమ్మారి వల్ల చాలామందిలో పోషకాహారం పట్ల అవగాహన మరింత పెరిగింది. వ్యాధినిరోధకత పెంచడంలో సరైన ఆహారం పాత్ర గురించిన ఆలోచన చాలా మందిలో వచ్చింది. ప్రస్తుత సమాజంలో పోషకాహార నిపుణుల పాత్ర గురించి వివరిస్తూ ‘‘ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండటం ఎంత అవసరమో, వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్ కూడా అంతే అవసరంగా భావిస్తున్నారు. ఒక్కో జబ్బుకు ఒక్కో రకమైన ఆహార ప్లానింగ్ చేయాల్సి ఉంటోంది. ఇది కూడా న్యూట్రిషనిస్ట్‌ల ప్రాధాన్యత పెంచింది’’ అంటూ 22ఏళ్లుగా పోషకాహార నిపుణురాలిగా కొనసాగుతున్న జ్యోతి శ్రీనివాస్ విశ్లేషించారు. ఎస్పెరర్ న్యూట్రిషన్ సిఇఒ రక్టిమ్ ఛటోపాధ్యాయ్ మాట్లాడుతూ ‘‘ఈ రంగం మహిళల మనసులకు దగ్గరైనది కావడం, పార్ట్‌టైమ్‌గా, ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేసే వీలుండడం వల్ల చాలా మంది యువతులు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. అందువల్లే కావచ్చు మేం ఏ డైటీషియన్ ప్రోగ్రామ్ చేసినా దానికి పురుషుల సంఖ్య కన్నా చాలా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు’’ అని తెలిపారు. అడ్డంకులను అధిగమించడానికే... ‘కొందరు తక్కువ సమయంలో నైపుణ్యాలు పొందాలనుకుంటారు. ఎమ్మెస్సీ న్యూట్రిషన్ చదవరు. ఏదో ఒక ఫుడ్ పాయింట్ ఎంచుకుని, దానినే ప్రధానంగా ప్రజల మీద రుద్దడానికి చూస్తుంటారు. వ్యాపారపరంగా ఆలోచించేవారు చేసే పని ఇది. ఉదాహరణకు.. వెయిట్‌లాస్ మీద మార్కెట్లోకి విపరీతమైన ఉత్పత్తులు వచ్చాయి. అవి ఏ మేరకు అవసరం? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుకోవడం వల్ల కూడా గతంలో కన్నా ఇప్పుడు డైటీషియన్ల ప్రాముఖ్యం పెరిగింది’ అంటున్నారు పోషకాహార నిపుణులు. కొత్త ఆలోచనకు వేదిక ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే పోషకాహార నిపుణలు ఉండేవారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ డైటీషియన్స్ని నియమించుకుంటున్నారు. అమ్మాయిలకు ఇది నప్పే రంగం అని తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల కూడా ఈ రంగంలోకి అమ్మాయిలు ఎక్కువ శాతం వస్తున్నారు. అబ్బాయిలు వచ్చినా ఫుడ్ సైన్స్ మీద ఆసక్తి ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. – డాక్టర్ జానకి, న్యూట్రిషనిస్ట్ సమాజ శ్రేయస్సుకు.. పోషకాహార నిపుణులుగా మహిళలు ఇంకా అధిక సంఖ్యలో రాణిస్తే వ్యాధుల నివారణకు అది ఎంతైనా ఉపయోగపడుతుంది. మిషన్ న్యూట్రిక్ కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎనిమిది రాష్ట్రాల అసోషియేషన్స్‌తో కలిపి వర్క్ చేస్తున్నాను. సమతుల ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవన విధానం ఉన్నవారిలో ఏ ఫ్లూ వచ్చినా త్వరగా బయటపడతారు. ఇమ్యూనిటీకి రైట్ డైట్ అనేది కీలకం. – జ్యోతి శ్రీనివాస్, న్యూట్రిషనిస్ట్ -
సంక్రాంతికి వీటిని తినే ఉంటారు.. అయితే వాటి లాభాలు కూడా తెలుసుకోండి!
పండగ అనగానే ఆహారం గురించి హెచ్చరికలు చేసేవారే ఎక్కువ. మితం ఎలాగూ హితమే. కానీ ఈ సందర్భంగా మనం చేసుకునే కొన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికీ తోడ్పడతాయి. రోజూ అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేనివారు కనీసం పండగ రోజయినా నచ్చిన పిండి వంటలను చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ఫలానా పండగ నాడు ఫలానా పదార్థంతో చేసిన పిండివంటలు తినాలనే నియమాన్ని ఏర్పరచారు పెద్దలు. పండగ పిండివంటల్లోనూ, పాయసాల్లో వాడే కొన్ని పదార్థాలూ, వాటిలో ఉండే ఆరోగ్య విలువల గురించి తెలుసుకుందాం. హాయిగా తిందాం. ఆరోగ్యంగా ఉందాం. సంక్రాంతి నాడు తీపి గుమ్మడి కూర లేదా గుమ్మడి కాయ ముక్కలతో పులుసు చేసుకుని తినడం ఆచారం. అందుకు కారణం గుమ్మడిలో ఉండే ఔషధ గుణాలే. బాగా మగ్గిన గుమ్మడిపండును ఆహారంగా తీసుకుంటే చక్కెర వ్యాధిగ్రస్తులకు, భారీకాయంతో బాధపడేవారికి మేలు జరుగుతుంది. ప్రొస్టేట్ గ్రంథి వాచినపుడు గుమ్మడికాయ నుంచి తాజాగా జ్యూస్ తీసి, రెండు లేదా మూడు చెంచాలు తాగటం మంచిది. గుమ్మడి గింజల్లో పీచు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్–ఇ, మాంగనీస్, ఫాస్పరస్ వంటి పోషకాలున్నాయి. , కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడి గింజలు భేష్‌గా పనిచేస్తాయి. రక్తపోటును నియంత్రించి.. బరువును తగ్గిస్తుంది. గుండెను పదిలంగా వుంచేందుకు గుమ్మడి గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. గుమ్మడిలో వ్యాధినిరోధక శక్తిని పెంచే పోషకాలున్నాయి. జలుబు, జ్వరం, అలసట, మానసిక ఒత్తిడి, మొటిమలు, సంతానలేమి వంటి సమస్యలను గుమ్మడి నయం చేస్తుంది. ఇందులో ఒమేగా–3 ఆమ్లాలున్నాయి. మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి.. రోజు తీసుకుంటే నెలసరి సమస్యలు, నొప్పులు మటుమాయం అవుతాయి. బెల్లం ఏ పండగకైనా బెల్లం లేనిదే తీపి ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి స్పెషల్ అయిన అరిశలు, పొంగలి వంటివి చేసేది బెల్లంతోనే. బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది. దీనివల్ల శరీరానికి హాని ఉండదు. ప్రాణాంతక మైన వ్యాధుల బారి నుంచి కాపాడే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో బెల్లంతో చేసిన పిండివంటలు తినటం వల్ల శరీరం వెచ్చగా ఉండి ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబును నివారిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్ధాలను బయటకు పంపుతుంది...రోజు ఒక ముక్క బెల్లం తింటే వ్యర్ధాలను బయటకు పంపి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పెసరపప్పు అనాదిగా పెసరపప్పు మన ప్రధాన ఆహారాల్లో ఒకటి. సంక్రాంతికి చేసే కట్టె పొంగలిలోనూ, పులగంలోనూ పెసరపప్పు విధిగా వాడతారు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థకి ఎంతో మేలు. జీర్ణశక్తి మెరుగుదలకూ, మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తపోటు నియంత్రణకూ ఉపయోగపడుతుంది. పొటాషియమ్ ఎక్కువ. అందుకే హైబీపీ నివారణకు తోడ్పడుతుంది. పొట్టుతో పాటు వాడితే చికెన్ కంటే పెసరపప్పు నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ చాలా మంచిది. చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాల వల్ల చర్మం నిగారింపుతో పాటు, ఏజింగ్ ప్రక్రియకు పెసరపప్పు అడ్డుకట్టగా నిలుస్తుంది. గుండెకు మేలు చేయడంతో పాటు రక్తప్రసరణ సాఫీగా జరడానికి తోడ్పడుతుంది. జింక్ వల్ల మంచి రోగనిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎన్నో క్యాన్సర్ల నివారణ జరుగుతుంది. విటమిన్–ఏ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు. రేచీకటిని అరికడుతుంది. ఎముకల పెరుగుదలకు, వాటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పాలు పండగ అంటే పాయసం తప్పదు. పాయసం అంటే పాలు ప్రధానం. అది మాత్రమే కాదు ఎన్నో వంటకాల్లో ప్రధాన ముడిసరుకు. పాలల్లో ఉండే క్యాల్షియమ్ ఎముకల ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహద పడుతుంది. అందుకే చిన్ననాటి నుంచి పిల్లలకు పాలు అలవాటు చేయడం మన సంస్కృతిలో ఓ ఆనవాయితీ. పాలల్లో ప్రోటీన్ ఎక్కువ. ∙పాలల్లో ఉండే కొవ్వులు బరువు పెరగకుండానే మంచి ఆరోగ్యాన్నిస్తాయి. పాలల్లోని విటమిన్–డి ఎముకల ఆరోగ్యానికీ, వ్యాధినిరోధకతకు తోడ్పడుతుంది. విటమిన్–బి కాంప్లెక్స్, జింక్ వంటి పోషకాల వల్ల మంచి వ్యాధినిరోధకశక్తి చేకూరుతుంది. పొటాషియమ్ వంటి లవణాల వల్ల పెద్దల్లో రక్తపోటు నివారితమవుతుంది. ∙కొవ్వు పెద్దగా లేని పాలతో గుండెకు మంచి ఆరోగ్యం. మేని మెరుపుకూ, జుట్టు పెరుగుదలకు పాలు తోడ్పడతాయి. ఎన్నో రకాల వ్యాధులకు మంచి నివారణ మార్గం క్రమం తప్పకుండా పాలు తాగడమే. యాలకులు స్వీటు ఏదైనా... దాని తయారీ పూర్తయ్యే సమయానికి వాడాల్సిన దినుసుల్లో (ఇన్‌గ్రేడియెంట్స్) ముఖ్యమైనవి యాలకులు. యాలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. జీర్ణక్రియ ప్రక్రియలో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలన అవి సమర్థంగా అరికడతాయి. ఉదాహరణకు... యాసిడ్ గొంతులోకి రావడం (యాసిడ్ రిఫ్లక్స్), ఛాతీలో మంట వంటివి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ మోతాదు తగ్గించడం ద్వారా గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు అవి క్యాన్సర్‌ను నివారిస్తాయి కూడా. ∙రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. డిప్రెషన్ వంటి మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారిస్తూ... రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూసి పక్షవాతం, గుండెపోటు నివారణకు తోడ్పడతాయి. బాదం (ఆల్మండ్) స్వీట్లమీద అలంకరణకు వాడే బాదం పలుకుల ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజూ గుప్పెడు బాదం పలుకులు తినేవారిలో రోగనిరోధక శక్తి పెరిగి, ఎన్నో రకాల వ్యాధుల నివారణ జరుగుతుంది. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి. అన్ని రకాల నట్స్... ముఖ్యంగా జీడిపప్పుతో పోల్చినప్పుడు బాదంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాదంలోని ఎల్–కార్నిటిన్ పోషకం మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది. పీచు (ఫైబర్) పుష్కలంగా ఉన్నందున జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికీ, మలబద్ధక నివారణకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులకు దోహదపడే ‘సీ–రియాక్టివ్ ప్రోటీన్’ అనే పదార్థాన్ని బాదం తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇందులోని శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్స్ ఎన్నో క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాల్షియమ్, ఐరన్, పొటాషియమ్, మెగ్నీషియమ్, జింక్ వంటి చాలా ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. మినుములు సంక్రాంతి పండగ మర్నాడు కనుమ. ఈ రోజున మాంసాహారం తినేవారు మాంసం తింటే, శాకాహారులు మినుములతో చేసిన వంటకాలను తింటారు. ముఖ్యంగా మినప గారెలు. పండక్కి ఇంటికి వచ్చిన అల్లుళ్లకు మినప సున్ని ఉండలు చేసి పెడతారు. మినుములో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, డయటరీ ఫైబర్, ప్రొటీన్లు, బికాంప్లెక్స్, సి, ఈ, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా మినుముల్లో ఉంటాయి. కొవ్వుపదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. చక్కెరలు అసలు ఉండవు. మినుముతో చేసిన పదార్థాలు తినేవారికి రక్తహీనత దరిచేరదు. అందువల్ల ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేనివారు పండగ నాడు మినప గారెలు హాయిగా లాగించడం ఉత్తమం. కుంకుమపువ్వు ఎప్పట్నుంచో మనం సుగంధ ద్రవ్యంగా వాడుతూ వస్తున్న దినుసు ఇది. యాలకుల్లాగే ఇటు బిర్యానీ వంటి వంటకాలతో పాటు అటు స్వీట్లలోనూ ఉపయోగించే కుంకుమ పువ్వులో మంచి యాంటీసెప్టిక్ గుణాలతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో బీ–కాంప్లెక్స్‌లోని థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి విలువైన పోషకాలు ఉన్నాయి. వ్యాధి నిరోధకతకు ఇవి తోడ్పడతాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రిస్తుంది. త్వరత్వరగా మూడ్స్ మారిపోవడాన్ని (మూడ్ స్వింగ్స్) అరికడుతుంది. కడుపులోని బిడ్డ రంగును కుంకుమపువ్వు ఆకర్షణీయంగా మార్చుతుందని పెద్దలంటారు. గర్భవతుల్లో చాలామంది వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి అంత సుముఖంగా ఉండరు. కుంకుమపువ్వు సుగంధ ద్రవ్యం కావడంతో అది పాలకు మంచి రుచినీ, సుగంధాన్ని ఇచ్చి, వారు హాయిగా పాలు తాగేలా చేస్తుంది. పరిమితంగా తీసుకున్నప్పుడే ఇది గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పరిమిత మోతాదులో తీసుకునే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేసి, ఆకలిని పెంచుతుంది. కేవలం గర్భవతుల్లోనే కాదు... మిగతావారికీ ఇవే ఆరోగ్యప్రయోజనాలను ఇస్తుంది. జీడిపప్పు జీడిపప్పు లేనిదే పాయసం తదితర తీపి వంటకాలు రుచించవు. ఇటు స్వీట్లలో, అటు హాట్స్‌లో డబుల్ యాక్షన్ చేసే ప్రధాన ‘నట్’ ఇది. దీనిలో ఉండే జింక్ వంటి పోషకాలు వ్యాధి నిరోధకతకు తోడ్పడతాయి. పీచు (ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల మంచి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. పొటాషియమ్, మెగ్నీషియం, ఎల్–ఆర్జినైన్ వంటి ఖనిజ లవణాలు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాల్షియమ్, కాపర్ కారణంగా ఎముకలు బలోపేతమవుతాయి. మెదడునూ చురుగ్గా చేస్తాయి. అందుకే పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మంచిది. కాపర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తసంబంధిత జబ్బుల నివారణకు తోడ్పడుతుంది. జాజికాయ సాధారణంగా స్వీట్లలోనూ, బిరియానీలోనూ ఓ సుగంధద్రవ్యంలా వాడే జాజికాయ మంచి జీర్ణక్రియకూ ఉపయోగపడటంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. అందుకే గోరువెచ్చని పాలలో జాజికాయ తురుము కొద్దిగా వేసుకుని తాగితే మంచి నిద్రపడుతుంది. మంచి నొప్పినివారణి. మెదడు చురుకుదనానికి, నాడీ వ్యవస్థ మెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. మేని నిగారింపుకు బాగా ఉపయోగపడుతుంది. తనలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల నోటి దుర్వాసనను అరికడుతుంది. అందుకే దీన్ని ‘తాంబూలం’ (పాన్)లో ఓ దినుసుగా వాడుతుంటారు. ఈ గుణాల కారణంగానే పంటి ఆరోగ్యానికీ ఇదెంతో మేలుచేస్తుంది. ∙కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. యాంటీ డిప్రెస్సెంట్ గుణాల వల్ల డిప్రెషన్ పాటు మూడ్‌స్వింగ్స్, యాంగై్జటీని నివారిస్తుంది. పచ్చకర్పూరం.. పచ్చకర్పూరాన్ని కూడా ఓ సుగంధ ద్రవ్యంగా చాలావంటల్లో ముఖ్యంగా స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఔషధగుణాలూ ఎక్కువే. ∙గ్యాస్ నివారణకు, నీళ్లవిరేచనాలను సమర్థంగా అరికట్టడానికీ పచ్చకర్పూరం బాగా ఉపయోగ పడుతుంది. ∙కండరాలు పట్టివేయడాన్ని నివారించడమే కాదు... తిమ్మిర్ల వంటివి రాకుండా చూస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వాటికి విరుగుడు కాబట్టి... ప్రస్తుత పాండమిక్ సీజన్లో ఇది చాలా రకాల జలుబులను నివారిస్తుంది. ∙ఎముకలకు బలాన్ని చేకూర్చడంతో పాటు ఆస్టియో ఆర్థరైటిస్‌ను సమర్థంగా అరికడుతుంది. -
Banjara Hills: మిసెస్ ఇండియాగా డాక్టర్ మతీన్
బంజారాహిల్స్: నగరానికి చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మతీన్ అస్రార్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో డాక్టర్ మతీన్ రెండు విభాగాల్లో పతకాలను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసిన డాక్టర్ మతీన్ ప్రస్తుతం నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ క్లాసిక్ విభాగంలో పాల్గొన్న డాక్టర్ మతీన్ బ్యూటీ విత్ బ్రెయిన్, ఇంటర్నేషనల్ ఐకాన్ కేటగిరీలలో విజేత గా నిలిచారు. డాక్టర్ మతీన్ జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైద్యురాలైనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో 103 మంది పాల్గొన్నారని తాను రెండు కేటగిరీలలో విజేతగా నిలవడం సంతోషంగా ఉంది అని అన్నారు. (చదవండి: ఉత్సాహంగా బర్డ్ వాక్ ఫెస్టివల్) -
‘పొగాకు నమలడం’ ఆహార నిర్వచనం పరిధిలోకి రాదు
సాక్షి, అమరావతి: ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన కిందకు రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పొగాకును ఆహారంగా ఉపయోగించడంగానీ, ఆహారంగా మానవ వినియోగం నిమిత్తం తీసుకోవడంగానీ జరగదని.. పోషకాహారంగా కూడా స్వీకరించరని స్పష్టంచేసింది. పొగాకు నమలడంవల్ల వచ్చే ఓ రకమైన థ్రిల్ కోసం, ఉత్తేజం కోసమే దానిని ఉపయోగిస్తారని తెలిపింది. అందువల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టంలోని సెక్షన్–3(1)(జే) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రాదని తెలిపింది. చూయింగ్ గమ్‌ను ఆహార నిర్వచన పరిధిలో చేర్చిన పార్లమెంట్.. పొగాకు నమలడాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆహారం కింద చేర్చలేదని వెల్లడించింది. మానవ వినియోగానికి పనికొచ్చే దానినే పార్లమెంట్ ఆహారంగా పేర్కొందని గుర్తుచేసింది. పొగాకు ఎన్నటికీ మానవ వినియోగానికి పనికిరాదని హైకోర్టు తెలిపింది. అందువల్ల నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అక్రమ నిల్వ, అమ్మకాలు చేపట్టినందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంతో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిషేధ చట్టం (సీఓటీపీఏ), ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలా ఈ చట్టాల కింద పలువురిపై పోలీసులు నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ తదితరాలతో పాటు అక్రమంగా మద్యం, గంజాయి రవాణా చేసినందుకు మరికొందరిపై నమోదు చేసిన కేసులను హైకోర్టు పాక్షికంగా కొట్టేసింది. కానీ, ఏపీ ఎక్సైజ్ చట్టం కింద, ఎన్డీపీఎస్ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించవచ్చునని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మూడ్రోజుల క్రితం తీర్పు వెలువరించారు. 130 పిటిషన్లు దాఖలు నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అమ్మకాలు, నిల్వ, సరఫరా, పంపిణీతో పాటు గంజాయి రవాణా, అమ్మకాలు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురిపై పోలీసులు ఐపీసీ, ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీపీఏ, ఏపీ ఎక్సైజ్ చట్టంతో పాటు ఎన్డీపీసీఎస్ చట్టాల కింద కేసులు నమోదుచేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ సదరు వ్యక్తులు హైకోర్టులో దాదాపు 130 పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాజాగా తీర్పునిస్తూ.. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదని, ఇదే విషయాన్ని మన హైకోర్టుకు చెందిన బెంచ్‌లు వేర్వేరుగా ఇప్పటికే తీర్పునిచ్చాయన్నారు. అయితే, ఇటీవల మరో సింగిల్ జడ్జి మాత్రం పొగాకు నమలడం ఆహారం కిందకు వస్తుందంటూ తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో తాను ఏకీభవించడం లేదన్నారు. పొగాకు నమలడం ఆహారం కిందకు రాదంటూ పిటిషనర్లపై పోలీసులు ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీఏపీ తదితర చట్టాల కింద నమోదు చేసిన కేసులను కొట్టేశారు. -
పోషకాహార లోపాలు ఇంకానా?
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి పెరిగింది. ఈ మార్పు సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. జనాభాలో సగం మందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ఆడపిల్లలు, మహిళల్లో రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది. భారతదేశం అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించి నప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఫ్యాక్ట్ షీట్స్ వెలువడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఎన్ఎఫ్హెచ్ఎస్–5కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒక్కసారి వీక్షిస్తే మిశ్రమ ఫలి తాలు కనిపిస్తాయి. కొన్ని హర్షణీయమైన అంశాలతోపాటు దిగాలు పడాల్సినవీ దీంట్లో ఉన్నాయి. ఒక శుభవార్త ఏమిటంటే.. భౌగోళిక పోకడల విషయంలో మరీ ముఖ్యంగా లింగ నిష్పత్తిలో కొంత మార్పు కనిపిస్తూండటం! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో మొట్టమొదటిసారి చేపట్టన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అంతేకాదు. పుట్టుక సమయంలో లింగ నిష్పత్తి ప్రస్తుతం 929 (2015–16 నాటి ఎన్ఎఫ్హెచ్ఎస్–4లో ఇది వెయ్యి మంది పురుషులకు 919గా నమోదై ఉంది)కి చేరుకుంది. సాఫల్యత రేటు 2.2 శాతం నుంచి రెండు శాతానికి పడిపోవడమూ ఆనందం కలిగించే విషయమే. సాఫల్యత రేటు తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో మరింత తగ్గిపోయినట్లుగా కనిపిస్తూంటే.. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా తేడా ఏమీ లేకుండా పోయింది. ఈ తేడా సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్నది తెలిసిందే. పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వివరాలు విధాన రూపకల్పనలో, సామాజిక స్థాయిలో ఈ అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మహిళ సాధికారత, బాలికల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అవలంబిస్తున్న విధానాలు, ప్రచారాల పుణ్యమా అని ఇప్పుడు ఎంతో కొంత ప్రగతినైతే సాధించాం. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదల, సాఫల్యత రేటులో తరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సాక్షరత విషయంలో ఎంతో అభివృద్ధి నమోదవుతోంది. పదేళ్ల బడిని పూర్తి చేసుకున్న మహిళలు, పురుషుల శాతం కూడా ఎక్కువై 41 శాతం, 50.2 శాతానికి చేరుకుంది. కానీ చేయాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది. ఎందుకంటే ఈ అంకెలు మన శ్రామిక వర్గంలో సగానికపైగా తగిన నైపుణ్యం, అర్హతలకు దూరంగా ఉన్నారని చెబుతున్నాయి. వీటిని సాధించడం ద్వారా మాత్రమే అట్టడుగు శ్రామికులు పేదరికం చట్రం నుంచి బటయపడగలరు. ఆసుపత్రుల వంటి సంస్థల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రమే కాదు... మాతా శిశు సంక్షేమం, పసిపిల్లల టీకా కార్యక్రమం (ఏటా రెండు శాతం వృద్ధి)లో ప్రగతి సాధించిన ఖ్యాతి ఆరోగ్య రంగానికే దక్కుతుంది. కాన్పుల సమయంలో తల్లీబిడ్డల్లో మరణాలు ఒక శాతం వరకు కూడా తగ్గడం ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లోనూ 1.6 శాతం తగ్గుదల నమోదు కావడం విశేషమే. ఈ అంశాల మాటేమిటి? ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. కొంచెం ఆందోళన కలిగించే అంశాలు ఇలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15 – 49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతూండటం ఆందోళనకరమే. ఇంకోలా చెప్పాలంటే జనాభాలో సగంమందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇదేమంత మంచి విషయం కాదు. రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాల్లోనూ కనిపిస్తూంటాయి. శారీరక, మానసిక అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా పిల్లలు, కౌమారుల్లో ఉండాల్సిన చురుకుదనాన్నీ తగ్గించేస్తుంది. ఆటలు, నేర్చుకునే శక్తినీ హరిస్తుంది. తద్వారా వారు సమర్థమైన ఉత్పాదకత కలిగిన పౌరులుగా ఎదగడం వీలుపడదు. పనిచేసే సామర్థ్యం తగ్గడం, తొందరగా అలసిపోవడం వల్ల ఉత్పత్తి, ఆదాయం రెండూ తగ్గిపోతాయి. అంతేకాదు.. కౌమార వయస్కులైన బాలికల్లో దాదాపు 59.1 శాతం మందిలోని రక్తహీనత కాబోయే తల్లులపై ప్రభావం చూపుతోంది. కాన్పు సమయంలో మాతా శిశువుల మరణానికి ప్రధాన కారణంగా మారుతోంది. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. గతంతో పోలిస్తే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ గర్భిణుల్లో ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ల వాడకం ఇప్పటికీ తక్కువగా ఉంది. (41 శాతం మంది వంద రోజులపాటు తీసుకోగా, 26 శాతం మంది 180 కంటే ఎక్కువ రోజులు తీసుకున్నారు). ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యామో పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత స్పష్టత వస్తుంది. ఇంకో ఆందోళనకరమైన విషయం అన్ని వయసుల వారిలోనూ పౌష్టికతను సూచించే అంశాల్లో పెరుగుదల అతితక్కువగా (ఏడాదికి 0.5 శాతం) ఉండటం. ఎన్ఎఫ్హెచ్ఎస్–4, ఎన్ఎఫ్హెచ్ఎస్–5ల మధ్య అవసరానికంటే ఓ మోస్తరు బరువు తక్కువన్న ఐదేళ్లలోపు పిల్లల శాతం 35.8 నుంచి 32.1 శాతానికి తగ్గింది. ఎదుగుదల తగ్గిన పిల్లల శాతం కూడా 38.4 నుంచి 35.5 శాతానికి మాత్రమే తక్కువైంది. సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల ఓ మోస్తరుగా మాత్రమే లేని వారు 21 శాతం నుంచి 19.3 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో సామర్థ్యానికి తగ్గ ఎదుగుల లేమి తీవ్రంగా ఉన్న వారు 7.5 నుంచి 7.7 శాతానికి పెరగడం గమనార్హం. రెండేళ్ల లోపు వయసు వారు తగిన ఆహారాన్ని తీసుకోని వారు 11.3 శాతం వరకూ ఉన్నారు. దీని వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నది నిర్వివాద అంశం. గత ఎన్ఎఫ్హెచ్ఎస్ సమయంలో ఇది 9.6 శాతం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో జరుగుతున్న ఈ పౌష్టికాహర లేమిని విధానకర్తలు, నిపుణులు... పౌష్టికాహర రంగంలో పనిచేస్తున్న వారు విస్మరిస్తూండటం ఎంతైనా ఆందోళన కలిగించే అంశం. ఈ లోపాన్ని సరిదిద్దకుండా పౌష్టికాహార సూచీల్లో చెప్పుకోదగ్గ మార్పులు అసాధ్యమనే చెప్పాలి. అందనంత ఎత్తులో ఇరుగుపొరుగు... కుటుంబ ఆరోగ్యం విషయంలో ఇరుగు పొరుగు దేశాలు మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చైనాలో అటు పురుషులైనా, ఇటు మహిళలైనా వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. రక్తహీనత, 15–59 మధ్య వయస్కులైన మహిళల్లో 16 శాతం మాత్రమే ఉండగా.. ఎదుగుదల లోపం ఐదు శాతం మందిలో, సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల లేదు. ఇటీవలి వరకూ ఎంతో వెనుబడి ఉన్న బంగ్లాదేశ్ కూడా వేగంగా పుంజుకుని.. మనల్ని మించిపోయింది. దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ఆంబులెన్స్ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగాలి. సమగ్ర శిశు సంక్షేమ సేవల (ఐసీడీఎస్) కార్యక్రమాలను సమీక్షించుకుని ఆచరణ సాధ్యమైన ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలను అందించేలా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారం సాధ్యం కాదు. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి ఉంటుంది.! – వీణా రావు, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
AP: హైరిస్క్ ప్రెగ్నెన్సీలు.. ఉండవిక
సాక్షి, అమరావతి: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చేవరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారం, మంచి వైద్యం ఇందులో ప్రధానమైనవి. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. అటువంటి సమయాల్లో తల్లీ, బిడ్డకు ప్రమాదమేర్పడుతుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి, గర్భిణికి మంచి వైద్యం అందించడానికి ప్రభత్వం పలు చర్యలు చేపట్టింది. అందులోనూ ప్రసవ సమయంలో తల్లుల మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) ప్రెగ్నెన్సీలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల లోపు ఒకసారి, ఆరు నెలల లోపు మరోసారి వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. 7వ నెల దాటాక కూడా హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని తేలిన వారికి ఎంసీపీ (మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో రెడ్ స్టిక్కర్ వేస్తారు. వీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి. ప్రత్యేక వైద్యం అందించాలి. ఇలాంటి గర్భిణుల కోసం ఒక ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్‌ను కేటాయిస్తారు. గర్భిణులకు ప్రసవం అయ్యేవరకూ వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రధానమంత్రి మాతృత్వ స్వాస్థ్య అభియాన్ కార్యక్రమం కింద ఏపీలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తున్నారు. 13.47 శాతం హైరిస్క్ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 3,56,979 మంది గర్భిణులను గుర్తించగా, వారిలో 57,124 మంది హైరిస్క్ గర్భిణులే. అంటే 13.47 శాతం. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. గతంలో 19 శాతంపైనే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఆరు నెలల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ (18 ఏళ్ల నిండకుండా గర్భం దాల్చిన వారు) 2,222 మంది ఉన్నారు. ఎక్కువగా విశాఖ జిల్లాలో 333 టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. రక్తహీనతే ప్రధాన కారణం హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు పలు కారణాలు ఉంటాయి. రక్తహీనత, 35 ఏళ్ల తర్వాత (ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ) గర్భం దాల్చడం, పద్దెనిమిదేళ్ల కంటే ముందే గర్భం దాల్చడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ తదితర కారణాలతో కాన్పు కష్టమవుతుంది. వీటిలో రక్తహీనత ప్రధాన కారణంగా గుర్తించారు. గర్భిణు ల్లోని రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12 గ్రాములు (డెసిలీటర్కు) ఉండాలి. అయితే, హైరిస్క్ గర్భిణుల్లో 11,437 మందికి హిమోగ్లోబిన్ 7 గ్రాములు, అంతకంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. రక్తహీనతే మాతృ మరణాలకు అతిపెద్ద సమస్య. దీనికోసం ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వడం, క్రమం తప్పకుండా యాంటినేటల్ చెకప్(గర్భస్థ పరీక్షలు) చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైరిస్క్ ఉంటే పీహెచ్సీ కాకుండా పెద్దాసుపత్రికి హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే వారిని పీహెచ్సీలో కాకుండా సీహెచ్‌సీ, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు అనుసంధానం చేస్తున్నాం. వీళ్ల వివరాలు 104, 108 వాహనాలకు ఇస్తాం. అత్యవసరమైతే వారు వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావాలి. ఏఎన్ఎం ఒకరిని అటాచ్ చేస్తాం. హైరిస్క్ ప్రెగ్నెన్సీపై అవగాహన పెరిగింది. ఎక్కువ మంది పరీక్షలకు వస్తున్నారు. దీనివల్ల మాతృమరణాలు తగ్గించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే ఉచితంగా వైద్యపరీక్షలు అందుతాయి. –డా.గీతాప్రసాది, సంచాలకులు,ప్రజారోగ్యశాఖ గడిచిన ఆరుమాసాల్లో ఇలా.. -
లక్షమందికి కోవిడ్ కేర్ సెంటర్ల ఆసరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లు పేదలకు పెద్ద ఆసరాగా నిలిచాయి. ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ అయితే ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. చిన్న ఇల్లు ఉండే కుటుంబాల్లో ఇది ఏమాత్రం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో మూడు పూటల పోషకాహారం, మందులు ఇచ్చి అక్కడే బస ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లు లక్షమందికిపైగా ఆశ్రయం కల్పించాయి. ఈ కేంద్రాల్లో ఒక్కో పేషెంటుకు భోజనానికే ప్రభుత్వం రూ.500 వెచ్చించింది. తాజాగా కేసులు తగ్గిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మినహా ఏ జిల్లాలోనూ కోవిడ్ కేర్ సెంటర్లలో బాధితులు లేరు. రాష్ట్రవ్యాప్తంగా 130 కోవిడ్ కేర్ సెంటర్లలో 52,851 పడకలు ఏర్పాటు చేశారు. ఈనెల 15 నాటికి ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే 15 మంది బాధితులు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నారు. మిగతా ఏజిల్లాలోనూ ఒక్క పేషెంటు కూడా కోవిడ్ కేంద్రాల్లో లేరు. సెకండ్ వేవ్‌లో అక్టోబర్ 15 వరకు 1,01,103 మంది కోవిడ్ కేంద్రాల్లో చేరినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24,883 మంది ఈ కేంద్రాలకు వచ్చారు. 13,821 మంది బాధితులు గుంటూరు జిల్లాలో చికిత్సకు వచ్చారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,188 మంది బాధితులు కోవిడ్ కేంద్రాలకు వచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్లలో 52 వేలకు పైగా పడకలు ఏర్పాటు చేసింది. -
Andhra Pradesh: ‘సచివాలయ’ వ్యవస్థతో యునిసెఫ్ జత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్) ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్ పనిచేస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే యునిసెఫ్ ప్రతినిధులకు ఆ సంస్థే జీతభత్యాలు చెల్లిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి పౌష్టికాహార సంబంధ అంశాలపై.. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని పేదల కాలనీలలో కరోనా నియంత్రణపై యునిసెఫ్ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పౌష్టికాహరం, దాని ఆవశ్యకత, పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలపై వలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు యునిసెఫ్ స్టేట్ మేనేజర్ మోహనరావు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కరోనా మూడో వేవ్ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు 2.58 లక్షల మంది వలంటీర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం అన్ని పాఠశాలల్లో యునిసెఫ్ ప్రతినిధులు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. -
ప్రపంచానికి పోషకాల లోపం..!
ప్రపంచంలో దాదాపు సగం మందికి పౌష్టికాహారం లభించడం లేదు... ఇంకే, ఇందుకు కరోనానే కారణం అనుకుంటున్నారా? కాదు. ప్రపంచంలో ప్రతి సమస్యకు కరోనా కారణం కాదని, నిజానికి జనాలకు తగినంత హెల్తీ ఫుడ్ దొరక్కపోవడం కరోనా ముందునుంచే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.ఈ సమస్యను ఎదుర్కోవాలంటే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది నిపుణుల మాట. మరి ప్రపంచ దేశాలు పట్టించుకుంటాయా? అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న! ప్రపంచంలో ఒకపక్క అన్నమో రామచంద్రా అనేవారి కేకలు పెరిగిపోతుంటే, మరోపక్క పౌష్టికాహారం దొరక్క అలో లక్ష్మణా అనే వాళ్ల సంఖ్య అంతే వేగంగా పెరుగుతోంది. ఏదో తిన్నాం అంటే తిన్నాం అన్నట్లు కడుపునింపుకోవడమే తప్ప శరీరానికి సరిపడా పోషకాలనిచ్చే ఆహారం తీసుకునే వీలు చిక్కని వారి సంఖ్య 300 కోట్లను దాటిందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్ తదితర ఆంక్షలు ప్రపంచ ఎకానమీలను దెబ్బతీశాయి. ఇప్పటికీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిన పడలేదు. అనేక దేశాలు మాంద్యం దిశగా జారుకుంటున్నాయి. ఇదే తరుణంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పోషకాలు సమృద్ధిగా లభించే మొక్కజొన్న, పాలు, బీన్స్ తదితర చౌక ఆహార పదార్ధాలు సైతం సామాన్యుడికి అందకుండా పోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది ఇప్పుడు తలెత్తిన సమస్య కాదని, చాలా సంవత్సరాలుగా జనాభాను ఈ సమస్య పీడిస్తోందని న్యూట్రిషనిస్టులు, ఎకానమిస్టులు చెబుతున్నారు. కరోనా మాత్రమే కారణమా? ప్రపంచ ఆహార పదార్ధాల ధరలను విశ్లేషించే అధికారిక గణాంకాల ప్రకారం కరోనాకు ముందు ప్రపంచంలో పౌíష్టికాహారం అందనివారి సంఖ్య 40 శాతం ఉంది. అంటే ప్రస్తుత సంక్షోభానికి ముందు కూడా పౌష్టికాహార లోపం జనాభాలో అధికమనే తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సంపద కొందరి వద్దే పోగుపడడమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్పాదాయాలు, ఆహారపదార్ధాల అధిక ధరలు.. ఎన్నాళ్లుగానో దాదాపు సగం జనాభాను పీడిస్తున్న సమస్యలు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం దొరకకపోవడంతో ఎక్కువమంది అనీమియా, డయాబెటిస్ లాంటి వ్యాధులకు గురవుతున్నారు. మరి మిగిలిన 60 శాతం జనాభా ఓకేనా అంటే నిరాశాపూరిత సమాధానమే ఎదురవుతుంది. వీరికి పౌíష్టికాహారం లభించే అవకాశాలున్నా, వారంతా ఎల్లప్పుడూ మంచి ఆహారం తీసుకుంటున్నారని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. పోషకాలుండే పదార్ధాలు అందుబాటులో ఉండకపోవడం, ఆధునిక ఉద్యోగాల కారణంగా వంటకు సమయం చాలకపోవడం, అనారోగ్యకారక ఆహార పదార్ధాల ఉత్పత్తిదారులు చూపే ప్రకటనలకు మోసపోవడం, పోషకాల గురించి అవగాహన లేకపోవడం.. లాంటి కారణాలతో వీరికి కూడా పూర్తి న్యూట్రిషన్ అందడం లేదు. అంటే రమారమిన ముప్పావు శాతం ప్రపంచ జనాభాకు పౌíష్టికాహారం అందడం లేదన్నది నిపుణుల మాట. ఏం చేయాలి? అధికాదాయ ఉద్యోగాల కల్పన, అల్పాదాయ వర్గాలకు సామాజిక రక్షణలను విస్తృతీకరించడం, స్థానికంగా న్యూట్రిషన్ విలువలుండే ఆహారాల ఉత్పత్తి, సాగును ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు కనీస పౌష్టికాహారం అందించవచ్చని ప్రభుత్వాలకు నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాలోని ఎస్ఎన్ఏపీ కార్యక్రమాన్ని చూపుతున్నారు. ఈ ప్రోగ్రాం కింద అల్పాదాయ అమెరికన్లు తమకు కావాల్సిన ఆహారంలో కొంత కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తుంది. అయితే అన్ని దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడం కష్టం కనుక, వీలయినంతగా ఆహార పదార్థ్ధాల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని నిపుణుల సూచన. ఇందుకోసం వ్యవసాయ రంగ నూతన టెక్నాలజీల్లో పబ్లిక్ పెట్టుబడులు పెంచడం అవసరమంటున్నారు. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు ఈ ఏడాది జరగనున్న సదస్సుల్లో పౌష్ఠికాహార లభ్యతపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. -
నెట్టింట 'బుడి బుడి' బడి
సాక్షి, విజయవాడ: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఆటపాటలతో రూపొందించిన పాఠాలు బోధిస్తున్నారు. కరోనా కాలంలో చిన్నారులకు ఈ బోధన చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటివద్దకే విద్య’ పేరుతో వైఎస్సార్ ప్రీ–ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. వంద రోజుల ప్రణాళికను రూపొందించి ఈ శిక్షణ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చిన్నారుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు అర్థమయ్యేలా రోజుకో అంశంపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఈ పాఠాలను ఎంపిక చేసిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. దీనివల్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆటపాటలతో విద్య అందుతోంది. 3,812 కేంద్రాల్లో విద్యాబోధన కృష్ణా జిల్లాలో 3,812 అంగన్వాడీ కేంద్రాల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి 67,357 మంది ప్రీ స్కూల్ పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు. 32 నుంచి 72 నెలల వయసు కలిగిన చిన్నారులు ఇంట్లోనే ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా పద్యాలు, పాటలు చిత్రాలు తల్లుల ఫోన్లకు పంపుతున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పొందుపరుస్తూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సరుకుల వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే తక్షణమే గ్రూపులో సమాచారం పొందుపరిస్తే దగ్గరలో ఉన్న ఏఎన్ఎంల ద్వారా అంగన్వాడీలు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. కోవిడ్‌పై అవగాహన చిన్నారులు, బాలింతలు, గర్భిణులు కోవిడ్ బారిన పడకుండా అంగన్వాడీలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచిస్తూ వారిని చైతన్యపరిచేందుకు ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తూ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నదీ, లేనిది వాట్సాప్ గ్రూపుల్లో పొందుపరుస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అంగన్వాడీ నిర్వహణ సమయం కుదించి కర్ఫ్యూ సమయం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ఉపయుక్తంగా ఉంది.. కరోనా సమయంలో చిన్నారులు స్కూలుకు రావడం కుదరదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆన్లైన్లో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. తల్లుల వద్ద ఉండి పాఠాలు నేర్చుకుంటున్నారు. పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. – వెంకటలక్ష్మి, సీడీపీవో, గన్నవరం -
ఊరికో ‘పోషకాహార నిపుణురాలు’
సాక్షి, అమరావతి: పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచేలా వారిలో ఓ మహిళను ‘పౌష్టికాహార నిఫుణురాలి’గా ఎంపిక చేస్తారు. ఇలా గ్రామ సమైఖ్య (వీవో)కు ఒకరి చొప్పున నియమిస్తారు. ఆ పౌష్టికాహార నిపుణురాలి ద్వారా ఆ గ్రామ సమైఖ్య పరిధిలోని అన్ని పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలందరికీ పౌష్టికాహారం అవసరం ఏమిటి, పౌష్టికాహారం సమకూరాలంటే ఏ ఆహారం తీసుకోవాలి, వాటి తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో గ్రామ పౌష్టికాహార నిపుణురాలితో పాటు ఏఎన్ఎం కూడా పాల్గొంటారు. పొదుపు సంఘాల వారీగా మహిళలు ప్రతినెలా నిర్వహించుకునే సంఘ సమావేశాల్లో పోషకార నిపుణురాలు, ఏఎన్ఎం పాల్గొని పౌష్టికాహారంపై కొద్దిసేపు అవగాహన కలిగిస్తారు. గ్రామంలోని గర్భిణులు, చిన్న పిల్లల తల్లులతో పౌష్టికాహార నిపుణురాలు, ఏఎన్ఎం ప్రతి నెలా 5, 25వ తేదీల్లో గ్రామ సమైఖ్య ద్వారా సమావేశపరిచి వేర్వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలకు ఒక విడత ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో ప్రతి కుటుంబానికి దీనిపై అవగాహన పెంచవచ్చని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉండే వాటితోనే.. గ్రామాల్లో అతి తక్కువ ధరకు దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే వివిధ రకాల ఆహార దినుసుల్లో వేటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. ఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. వాటివల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న అంశాలపై గ్రామాల్లోని మహిళలందరికీ తెలియజేస్తారు. విటమిన్లు, పోషకాలు గల కూరగాయలతో పాటు సజ్జలు, రాగులు వంటి వాటిని వినియోగించాల్సిన ఆవశ్యకతను చెబుతారు. వీలును బట్టి వాటిని ఇంటి పెరట్లోనే పండించుకునేలా ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో సంబంధిత విత్తనాలు, మొక్కలను అందించేలా తోడ్పాటునిస్తారు. గర్భిణికి తొమ్మిది నెలలు, ఆ తర్వాత 6 నెలల పాటు బాలింతగా, ఆ తర్వాత పసి పిల్లల తల్లిగా మొత్తం 1,000 రోజుల కాలంలో తల్లీ, బిడ్డ తొలి రెండున్నర ఏళ్ల కాలంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్నది ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు చేపడతారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని ఒకే విడతలో అమలు చేసేలా చర్యలు చేపడతారు. అయితే పౌష్టికాహారం తక్కువ తీసుకుంటున్నట్టు నిర్ధారించిన 218 మండలాల్లో ఫలితాల ప్రాతిపదికన ప్రత్యేకంగా దృష్టి పెడతారు. తొలి ఏడాది 218 మండలాల్లో.. అందులోనూ ప్రత్యేకించి 52 మండలాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. మరుసటి ఏడాది మరో వంద మండలాల్లో, మూడో ఏడాది మిగిలిన మండలాల్లో కార్యక్రమం ఫలితాల ప్రాతిపదికన ఫోకస్డ్గా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
బియ్యంతో లాభం లేదు, ‘చిరు’కు జైకొడితేనే బెటర్!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలు ఇకనైనా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) సూచించింది. పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కోసం చిరు ధాన్యాల బాట పట్టాలని విజ్ఞప్తి చేసింది. ఆహార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రకటిస్తూ.. నీటి ఆధారిత పంటల్ని, సాగు పద్ధతుల్నీ మార్చాలని కోరింది. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు మారడంతో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వంటి వైరస్ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వాడకంతో శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా సమకూర్చుకోవచ్చు. తద్వారా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చని హోంసైన్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. చిరు ధాన్యాలే కదా అని.. చిన్న చూపు కూడదు పూర్వ కాలం నుంచి చిరు ధాన్యాల సాగు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మరుగున పడిపోయింది. ఆ స్థానాన్ని వరి ఆక్రమించింది. ఆధునిక జీవన శైలిలో బియ్యం, ప్రత్యేకించి పాలిష్ చేసిన బియ్యం రకాల వాడకం పెరిగింది. పోషకాలు లేని బియ్యం రకాల వినియోగంతో ఫలితం లేదని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు చాలా కాలం నుంచే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. దేశంలోని జాతీయ పోషకాహార సంస్థ సైతం చిరు ధాన్యాలను చిన్న చూపు చూడొద్దని హెచ్చరించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ముందుచూపుతో చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగుకు చర్యలు చేపట్టడమే కాకుండా, చిరు ధాన్యాలకూ మద్దతు ధర ప్రకటించిన తరుణంలోనే.. ఎఫ్ఏవో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం గమనార్హం. స్మార్ట్ ఫుడ్‌తో జీవనశైలి వ్యాధులు దూరం జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పోషక లోపాలు దరిచేరకుండా ఇవి ఒక కవచంలా పని చేస్తాయి. పోషకాలను అందించడంలో బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాలు మేలైనవి. అందుకే వీటిని స్మార్ట్ ఫుడ్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. ఊబకాయం, షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులను దూరం చేయడంలో చిరుధాన్యాలు ఉపయోగపడుతున్నందున ప్రజలు వీటిని ఎక్కువగా వాడాలి. – టి.గోపీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రాష్ట్రంలో చిరుధాన్యాలకు పూర్వవైభవం రాష్ట్రలో చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటి సాగును ప్రోత్సహించేందుకు చిరు ధాన్యాల బోర్డుల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా కొన్ని రకాల చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ప్రోత్సహిస్తోంది. – డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ -
రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే!
చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు. అలా కాకుండా రోజంతా చురుగ్గా ... హెల్దీగా ఉండాలంటే ఈ సూచనలు పాటిస్తే చాలు... ∙ఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోండి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. నట్స్ ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. ∙వెన్న, నెయ్యి వాడకం పూర్తిగా తగ్గించండి. ఇక మీ ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి. ∙కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తీసుకోండి. ∙ఫ్రూట్ జ్యూస్ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తినండి. -
బీట్రూట్లోని ఏ పోషకం క్యాన్సర్‌ను నివారిస్తుంది?
చూడటానికి బీట్రూట్ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుంది. బీట్రూట్లోని ఆ ఎరుపు రంగుకు బిటాలెయిన్స్ అనే పోషకమే కారణం. ఇది ఒక చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అలాగే విటమిన్–సి కూడా ఎక్కువే. ఇది కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడి... దీర్ఘకాలం చర్మంతో పాటు శరీరం యౌవనంగా ఉండటానికి దోహదం చేస్తుంది. పైగా బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారిలో దానివల్ల అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం (స్టామినా) పెంపొందుతుంది. దాంతో ఎంతసేపైనా అలసట లేకుండా వ్యాయామం చేయగలరు. వ్యాయామం క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా పరోక్షంగానూ బీట్రూట్ స్టామినాను పెంచడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నివారిస్తుందన్నమాట. -
చుండ్రు...ఆహారపరమైన జాగ్రత్తలు
చుండ్రు సమస్య ఉన్నవారు మాంసాహారం తక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవి కొంతమేర చుండ్రు సమస్యను ప్రేరేపించేందుకు అవకాశం ఉంది. ఇక చుండ్రును అరిట్టేందుకు ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతో పాటు అన్నిరకాల కాయగూరలు, తాజా పండ్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడంలో దోహదపడతాయి. తద్వారా చుండ్రు సమస్యకు చెక్ చెప్పొచ్చు. అలాగే చుండ్రు ఉన్నవారు రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగి, చర్మం బిగుతుగా మారి చర్మ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇవే ఆహార నియమాలు ఆరోగ్యవంతులకూ చుండ్రు రాకుండా నివారిస్తాయి . -
అన్నం సయించడం లేదా?
అన్నం సయించడం లేదనీ, ఏమీ తినాలనిపించడం లేదనీ చాలామంది సరిగా భోజనం చేయరు. తినాలి కాబట్టి ఏదో తక్కువగా తినేసి ఊరుకుంటారు. మధ్యవయసు దాటాక వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా అనిపించడం చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తినేదేదో చాలా తక్కువగా తిన్నా అది మంచిపౌష్టికాహారం (అని పోషకాలు ఉండే బ్యాలెన్స్డ్ డైట్) అయి ఉంటే చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే అందులో ధాన్యాలు, పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, వూంసం, పప్పుధాన్యాలు... ఇవన్నీ ఉండాలి. ఇవి దేహానికి ఎంతెంత అవసరమో అందేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ నిర్వహించే కార్యకలాపాలు అంటే పనులు... మెుదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అన్నం సయించడం లేదంటూ పెద్దగా తినలేని వారు... తాము తినే కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు తినేందుకు ప్రయత్నించాలి. ఇలా అనేక రకాలు తీసుకునే సమయంలో ఇవి కొద్దిగా, అవి కొద్దిగా అంటూ చాలా రకాలు తినే అవకాశం ఉంటుంది, దాంతో వారికి అవసరమైన మోతాదులో ఆహారం అందేందుకు అవకాశముంటుంది. అన్నం సయించనివారు ఈ కింది డైట్ ప్లాన్ అవలంబిస్తే మంచిది. వారు రోజూ తమ ఆహారంలో చపాతి లేదా అన్నంతో పాటు పప్పులు, శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. దాంతో వారికి అందాల్సిన కార్బోహైడ్రేల్లు, ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తీసుకోండి. భోజనానికి ముందు కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్లో దొరికేవీ సాధ్యమైనన్ని వెరైటీలు తీసుకోవాలి. అప్పుడప్పుడూ తృణధాన్యాలతో తయారైన చిరుతిండ్లు తినాలి. ఇవి చిరుతిండిలా తీసుకునేవి కాబట్టి అన్నంలా అవి తినబుద్ధికాకపోవడం ఉండదు. ఇలా ఇన్నిరకాల వెరైటీలు తీసుకోవడం వల్ల దేహానికి అవసరమైన పిండిపదార్థాలూ (కార్బోహైడ్రేట్లు), ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు మనం రోజూ అన్నం సయించడం లేదంటూ ఎక్కువ పరివూణంలో భోజనం తీసుకోకపోవడం / తీసుకోలేకపోవడం గురించి పెద్దగా బెంగ పడాల్సిన అవసరమే ఉండదు. అన్నం సయించనందువల్ల తక్కువగానే తింటున్నా దేహానికి అవసరమైన పోషకాలన్నీ అందుతున్నందున ఆరోగ్యం గురించి ఆందోళనపడాల్సిన అవసరమూ ఉండదు. -అబ్బు అనూష, న్యూట్రిషనిస్ట్ -
రాష్ట్రంలో అంగన్వాడీలు భేష్
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పటిష్టంగా అమలవుతున్నాయి. గిరిజనులకు ప్రత్యేక పౌష్టికాహారం అందించేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలూ ప్రశంసలందుకుంటున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు బాగుందని, పౌష్టికాహారలోపం గల గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో బాగా పనిచేస్తున్నారని పోషణ్ అభియాన్ మూడో నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వివిధ రాష్ట్రాల్లో సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) వినియోగంపై పోషణ్ అభియాన్ సర్వే నిర్వహించి మూడో నివేదికను గత నెలలో సమర్పించింది. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాల అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చింది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే అంగన్వాడీ కేంద్రాల పనితీరుపైన, గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోనే గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంపైన దృష్టి సారించడమే కాకుండా సమీక్షలు నిర్వహించి మెనూను కూడా స్వయంగా సీఎం రూపొందించారు. దీంతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులతోపాటు పౌష్టికాహారం అందించడంలో పురోగతి పోషణ్ అభియాన్ నివేదికలో ప్రస్ఫుటం అయ్యింది. పోషణ్ అభియాన్ నివేదికలోని ముఖ్యాంశాలు ► 55,586 అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్–సీఏఎస్ వినియోగిస్తున్నారు. ఇది 99.96 శాతం. రెండో ర్యాంకు. ► 2,210 మంది మహిళా సూపర్వైజర్లు సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. ఇది 99.24 శాతం, మూడో ర్యాంకు. ► లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది 91.11 శాతం. రెండో ర్యాంకు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇది 93.96 శాతం. రెండో ర్యాంకు. ► కమ్యూనిటీ ఈవెంట్స్‌ను 99 శాతం నిర్వహిస్తున్నారు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో 31.09 శాతం మంది ప్రీ స్కూల్స్‌కు హాజరవుతున్నారు. ఐదో ర్యాంకు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, మూడునెలల నుంచి 36 నెలల పిల్లలకు ఇంటికే వెళ్లి రేషన్ అందిస్తున్నారు. ఇది 76.17 శాతం. ఆరో ర్యాంకు. ► రాష్ట్ర ప్రభుత్వం 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షలమంది గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఏటా రూ.1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోంది. గిరిజనేతర, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా, గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలవుతున్నాయి. -
1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ 1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.1,863 కోట్లతో 30లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి రేషన్‌ను ఇంటికే పంపిణీ చేస్తామని తెలిపారు. 50 శాతం మంది మహిళల్లో రక్త హీనత ఉందని.. గర్భిణీలు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత నివారించేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని.. 55 వేల అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ల తరహాలో విద్య అందిస్తామని అనురాధ పేర్కొన్నారు. (చదవండి: అమరావతి రైతులు: రూ. 158 కోట్లు విడుదల) -
393 సహాయక శిబిరాలు..21,025 మందికి వసతి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా నిలుస్తోంది. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వారికి కూడా జిల్లాల వారి గా ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి వారందరికీ పౌష్టికాహారం అందిస్తోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 393 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి మొత్తం 21,025 మందికి వసతి ఏర్పాట్లు కల్పించినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్, సహాయక శిబిరాల నోడల్ ఆఫీసర్ పీయూష్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో 12,820 మంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు పనుల మీద వచ్చి చిక్కుపోయిన వారు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 8,205 మంది ఉన్నట్లు తెలిపా రు. మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఈ శిబిరాల్లో ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1,334, తమిళనాడు 1,198, జార్ఖండ్ 918, బిహార్ 735 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రంలో తమిళనాడు ప్రజలకు చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తంచేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలోనే 106 శిబిరాలు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 393 సహాయక శిబిరాలు ఏర్పాటుచేస్తే అందులో ఒక్క కృష్ణాజిల్లాలోనే 106 శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ అత్యధికంగా 7,061 మంది ఉన్నారు. అత్యల్పంగా వైఎస్సార్ జిల్లాలో నాలుగు శిబిరాలు ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటుచేశామని, అలాగే అల్పాహారం, భోజనంతోపాటు ఉడకపెట్టిన కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు పీయూష్‌కుమార్ వివరించారు. ఈ శిబిరాలను నిరంతరాయంగా పర్యవేక్షించడానికి అధికారులను నియమించామని.. వీరికి 49,758 మంది సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం ప్రభుత్వమే కాకుండా 95 ఎన్జీవో సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. ఈ శిబిరాల్లో ఉండే వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీయూష్‌కుమార్ తెలిపారు. -
వెరీ'గుడ్డు'
సాక్షి, అమరావతి: కోడిగుడ్డుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా నేపథ్యంలో అపోహలతో వినియోగం తగ్గి ధరలు పడిపోవడం, తర్వాత లాక్‌డౌన్‌తో రవాణా ఆగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. కోడిమాంసం, గుడ్లు వల్ల కరోనా వైరస్ సోకదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం, కరోనా వైరస్ బారిన పడిన వారికి సైతం చికెన్ సూప్, గుడ్డు ఇవ్వొచ్చని కేంద్రప్రభుత్వ పశు సంవర్థక శాఖ అడ్వయిజరీ ప్రకటించడంతో అపోహలు తొలగిపోయాయి. అలాగే లాక్డౌన్ నుంచి కోడిగుడ్లను మినహాయించి నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం వల్ల నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్ ధరలతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇబ్బందులు ఇలా... ► కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడో వంతు ఇతర రాష్ట్రానికి ఎగుమతి చేయాలి. ► కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం తగ్గడంతో గుడ్లు మిగిలిపోవడం మొదలైంది. ఆ వెనువెంటనే వెలువడిన లాక్‌డౌన్‌తో ఎగుమతులపైనా ప్రభావం పడింది. ► ఎండ పడకపోతే 15 రోజుల వరకు గుడ్లను నిల్వ చేయవచ్చు. ఎండ పడితే వారానికే మురిగిపోతాయి. ► ఒక దశలో ఒక్కో గుడ్డును రూపాయిన్నరకు కూడా కొనే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నష్టాలు తీవ్రమయ్యాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపుతో.. ► జిల్లాల సరిహద్దుల వద్ద, చెక్‌పోస్టుల వద్ద కోడిగుడ్ల వాహనాలను ప్రస్తుతం ఆపడం లేదు. స్థానిక మార్కెట్లకు తరలించుకునే అవకాశం వచ్చింది. ► అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం తదితర రాష్ట్రాలకు మళ్లీ రవాణా ఊపందుకుంది. ► లాక్డౌన్ ప్రారంభంలో మాదిరిగా రెండు మూడు రోజులు చెక్‌పోస్టుల వద్ద ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. -
బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి. సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి. మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి. నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. -
జుట్టు రాలకుండా ఉండాలంటే....
ప్రపంచంలోనే అందమైన శిరోజాలు కావాలని అందరు కోరుకుంటారు. మనిషికి అందాన్నిచ్చేవి శిరోజాలే. అలాంటిది జుట్టు రోజూ కొద్దికొద్దిగా రాలిపోతుంటే.. బట్టతల వస్తుందనే ఆందోళన మొదలవుతుంది. పౌష్టికాహార లోపం, మానసిక ఒత్తిడి కారణంగా కొందరికి జుట్టు రాలడం సర్వసాధారణమయింది. ఈ క్రమంలో మెరుగైన జీవనశైలిని ఆచరించడం వల్ల జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయిదు నియమాలు పాటించినట్లయితే ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆహార నియమాలు మనం తీసుకునే ఆహార నియమాల ద్వారానే మెరుగైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లలతో కూడిన సమతుల ఆహారమే దివ్యౌషదమని వైద్యులు సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, బయోటిన్, ప్రొటీన్, జింక్ తదితర పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. నిత్యం తలకు నూనె వాడడం చాలామంది తలకు నూనె రాయడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమం తప్పకుండా నూనెను వాడడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ శిరోజాల రకానికి అనుగుణమమైన ఏ నూనె అయినా ఎంచుకోవచ్చు. హేర్‌స్టైల్ అందంగా కనిపించడానికి చక్కటి హేర్‌స్టైల్ ఉండడం అవసరమే, కానీ స్టైల్ కోసమని విపరీతంగా కెమికల్స్ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కండీషనర్ వాడడం తలస్నానం చేశాక కండీషనర్‌ను వాడడం తప్పనిసరిగా చేయాలి. జుట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు మృదువుగా చేయడంలో కండీషనర్ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలే వాటిని నివారించడంలో కండీషనర్‌ను ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి జుట్టు రాలే సమస్యకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం జుట్టు రాలే సమస్యే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక వ్యాధులకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. -
గొంతులో గరగర!
అయోడిన్ లోపం వల్ల కాకుండా వాహన, పారిశ్రామిక కాలుష్యం..హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడుహైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లోథైరాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మందిథైరాయిడ్తో బాధ పడుతుంటే, అత్యధికబాధితులతో కోల్‌కతా తొలిస్థానంలో,హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచాయి. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ జడలు విప్పుతోంది. పౌష్టికాహారం, అయోడిన్లోపం...వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్లో నేడు అనేక మంది థైరాయిడ్ బారిన పడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోం ది. ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాల తో పోటీపడుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతా ల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి థైరాయిడ్‌తో బాధపడుతున్న వారి వివరాలను సేకరించింది. కొల్కటలో 21.6 శాతం, ఢిల్లీలో 11.07 శాతం, అహ్మదా బాద్‌లో 10.6 శాతం, ముంబైలో 9.6 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 8.88 శాతం మంది థైరాయిడ్ బాధితులు ఉన్నట్లు గుర్తించింది. బాధితుల్లో 70 శా తం మహిళలు ఉంటే..30 శాతం పురుషులు ఉన్నట్లు నిర్ధారించింది. హార్మోన్లలో సమతుల్యత లోపానికి తోడు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన, ప్రారిశ్రామిక కాలుష్యం, పని ఒత్తిడి, మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని గుర్తించింది. థైరాయిడ్ అంటే... థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం కాగా, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉప యోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణో గ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. అయితే ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు కార ణమవుతోంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు ఉక్కువ ఉన్నారు. ఉన్నట్లుండి బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం, విపరీతమైన అలసట, మహిళలల్లో రుతుక్రమం తప్పడం, సంతానలేమి వంటివి ఈ హైపోథైరా యిడ్ లక్షణాలైతే...., బరువు తగగ్గడం, విపరీతమైన చమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒకటే టెన్షన్, చేతులు వణకడం వంటి లక్షణాలు కన్పిస్తే హైపర్ థైరాయిడ్‌గా భావిస్తారు. కాలుష్యం కూడాఓ కారణం అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతన్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి దానికి విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. ఆసక్తికర అంశమేమంటే తమకు థైరాయిడ్ ఉన్నట్లు బాధితుల్లో సగం మందికి నేటికీ తెలియదు. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం. – డాక్టర్ శివరాజు,కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ -
పండ్లు, పాలు వద్దని మారాం చేస్తున్నారా?
దాదాపు ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లలు కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోడానికి ఇష్టపడకపోవడం చాలా సాధారణం. ఇలాంటి ఫిర్యాదులు దాదాపు ప్రతి తల్లి నుంచి వస్తూనే ఉంటాయి. పిల్లలు అలా పౌష్టికాహారం తిసుకోకుండా, పాలు తాగకుండా మారాం చేస్తుంటే... ఈ కింది సూచనలు పాటించండి. ఉదాహరణకు పిల్లలు పండ్లు తినడానికి ఇష్టపడకపోతే... రకరకాల పండ్లను కట్ చేసి ఫ్రూట్ సలాడ్స్‌గా ఇవ్వడమో లేదా కస్టర్డ్‌తో కలిపి పెట్టడమో చేయండి. కొన్ని సందర్భాల్లో పండ్లను జ్యూస్‌గా తీసి ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలకు జ్యూస్ చేసి ఇవ్వడం కంటే వాళ్లంతట వాళ్లే కొరికి తినేలా పండ్లు ఇవ్వడమే మంచిది. ఇక పిల్లలు పాలు తాగకపోతే మిల్క్‌షేక్ రూపంలో ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి. అలాగే చాలామంది పిల్లలు కూరగాయలను ఇష్టపడరు. ఒకవేళ వారు కూరగాయలు తినకపోతే... వెజిటెబుల్ ఆమ్లెట్, గ్రిల్డ్ వెజిటెబుల్ శాండ్విచ్... ఇలా రకరకాలుగా ఇవ్వండి. ఒకవేళ వాళ్లు నూడుల్స్ ఇష్టంగా తింటుంటే, వాటికే రకరకాల కూరల ముక్కలు కలిపి తయారు చేయండి. ఎదిగే పిల్లలకు మాంసాహారం, చేపలూ (తినేవారైతే), లెగ్యూమ్స్ (పప్పులు / దాల్స్), బాదాం, జీడిపప్పు, వాల్నట్ వంటి నట్స్ తప్పక ఇవ్వాలి. వల్ల వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆ వయసు పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే పిల్లలు కాస్త పెద్దయాక ఆటల రూపంలో వాళ్లకు మంచి వ్యాయామం అందేలా తల్లిదండ్రులు తప్పక చూడాలి. -
పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పాడి పశువుల పోషణ, నిర్వహణతోపాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధవహించడం ఎంతో ముఖ్యం. పాడి పశువులు సక్రమంగా మేత మేస్తూ, ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి. అనారోగ్య సూచనలు: పశువు మందకొడిగా ఉండడం, ముట్టి తడి ఆరిపోయి ఉండడం, కళ్లు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత తినదు, నెమరు వేయదు, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, శరీరం వేడిగా జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకటం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి ఒకేసారి తగ్గించడం/ క్రమేమీ తగ్గించడం, మూత్రం రంగు మారడం. ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే ఊగిలెనంత త్వరగా పశువైద్యుడ్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు వాతావరణం: విదేశీ ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే 50% సంకర జెర్సీ ఆవును లేదా సంకరజాతి హెచ్.ఎఫ్. జాతి ఆవులను ఎన్నుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటివద్దనే చెట్ల నీడలలో గానీ, పాక లేదా తాటాకు షెడ్ల కింద చల్లటి వాతావరణంలో పోషించినట్లయితే మంచి పాలదిగుబడినిస్తాయి. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన వేసవి తాపాన్ని తట్టుకోలేవు. వాటిని ఉదయం పూటనే మేతకు పంపాలి. పగటిపూట ఇంటి వద్ద చల్లటివాతావరణంలో పోషించాలి. అప్పుడే వాటి ఉత్పాదకత కోల్పోకుండా మంచి పాలదిగుబడినిస్తాయి. పరిసరాలు : పాడి పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. దాని వల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. మేత, తాగునీరు: పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం, ఒక వేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత, దాణా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికినీరు, కలుషితప్రాంతాలలో నీరు తాగించడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతి రోజూ తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనపరిస్తే నష్టం అపారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. -
మీకు నెల రోజులే టైం..
సాక్షి, హన్మకొండ : ‘వైద్య, ఆరోగ్యశాఖలో కొందరు పీహెచ్సీ వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సూపర్వైజర్ల తీరు అద్వానంగా మారింది.. వారు తమ పనితీరు మార్చుకునేందుకు సరిగ్గా నెల రోజులు సమయం ఇస్తున్నా..అప్పటికీ తీరు మారకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లండి.. లేకుంటే నేనే సస్పెండ్ చేయాల్సి వస్తుంది’ అని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో నూతన జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమం అమలుతీరుపై మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి నివారణకు జిల్లాలో చేపడుతున్న చర్యలు, వైద్యాధికారులు సిబ్బంది పనితీరు పై చర్చించారు. క్షయ వ్యాధి నివారణ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. క్షయ వ్యాధిని పూర్తిగా తగ్గించేలా వైద్య సేవలు అందించొచ్చని..ముందుగా వ్యాధిని గుర్తించడం, మందులు అందజేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపారు. బాధితులకు చేయూత క్షయ వ్యాధి బాధితులు సరైన మోతాదులో మందులు తీసుకునేందుకు శరీర పటుత్వం అవసరమని అందుకోసం నెలకు రూ.500 చొప్పున పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎస్టీలకు రూ.750చొప్పున, డ్రగ్ రెసిస్టెంట్, మల్టీడ్రగ్ రెసిస్టెంట్ చికిత్స పొందుతున్న టీడీ పేషెంట్లకు రూ.1200 చొప్పున పోషకాహారం కోసం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా టీబీ పేషెంట్ల సమాచారాన్ని టోల్‌ప్రీ నంబర్ 104కు తెలియచేస్తే సదరు వ్యక్తులు, మెడికల్ షాప్ యాజమాన్యాలు, ప్రైవేట్ వైద్యులకు రూ.500 చొప్పున ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక టీబీ పేషెంట్లను చైతన్య పరిచి ఆరు నెలల పూర్తి స్థాయిలో చికిత్స అందించే అశావర్కర్లకు రూ.వెయ్యి చొప్పున 9నుంచి 24 నెలల పాటు అందించే మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ట్రీట్ మెంట్ మానిటరింగ్ చేస్తున్న ఆశా వర్కర్లకు మొదటి విడతగా రూ.5వేలు, చికిత్స పూర్తయిన అనంతరం రూ.3వేల పోత్రాహకంగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ వివరించారు. 2017లో 2,094కేసులు జిల్లాలో 2017లో మొత్తం 2,094 టీడీ కేసులు నిర్ధారణ అయినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. వీటిలో 1,125 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 969కేసులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్ధారణ అయ్యాయన్నారు. ఇక 2018లో మొత్తం 1,290 కేసులు నిర్ధారణ కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 939, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 351 నిర్ధారణ అయ్యాయని తెలిపారు. 2019లో ఇప్పటి వరకు 937 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 312, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 325కేసులు నమోదు చేశారని వివరించారు. నిక్షయ్ పోషణ యోజన పథకం ద్వారా టీడీ నివారణకు చికిత్స పొందుతున్న పేషెంట్లు 1,769 మందికి పోషకాహారంపై 2017నుంచి జూన్ 2019వరకు రూ.40.83లక్షలు ఆర్ధిక సాయం అందించినట్లు తెలిపారు. ఆశావర్కర్లకు సంబంధించి 2018 డిసెంబర్ వరకు అందించాల్సిన ప్రోత్సాహకాన్ని వారంలో విడుదల చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎంజీఎంలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా టీబీ కేంద్రంలో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేస్తారని, ఈ విషయం పేషెంట్లకు తెలియచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. కేంద్రంలో కొందరు సిబ్బంది డబ్బు డిమాండ్ చేసనట్లు ఫిర్యాదులు అందాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీబీ మందుల విషయంలో ఎవ్వరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మల్లికార్జున్(98498 81883)కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. టీబీ వ్యాధి నిర్ధారణలో చికిత్స ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సూసపర్ వైజర్ల తీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ధారణ అయిన పేషెంట్ వివరాల సేకరణ, నిక్షయ్ పోర్టల్‌లో పొందుపర్చే అంశంపై వైద్యాధికారులు, ఎల్టీలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా టీబీ పేషెంట్లకు హెచ్ఐవీ పరీక్షలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగం ప్రతినిధి డాక్టర్ జయకృష్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్‌రాజ్, వైద్యాధికారులు, ఎల్టీలు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులను అరికట్టే విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ ఏరియాతోపాటు ముందస్తుగా గురుకులాలు, కేజీబీవీలు, వసతి గృహాల్లో ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న వైద్యాధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అంటువ్యాదుల నివారణకు వాటర్ ట్యాంకులను ప్రతి 15రోజులకోసారి శుభ్రం చేసి రెగ్యులర్‌గా క్లోరినేషన్ చేయాలని పీఆర్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో ట్యాంకుల స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి క్లోరినేషన్ చేపట్టే ప్రక్రియను ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా పైప్లైన్ల లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండేళ్ల క్రితం ఘటన.. జిల్లాలో రెండేళ్ల క్రితం కడిపికొండ, హసన్‌పర్తి ప్రాంతాల్లో నీటి కాలుష్యం వల్ల అంటువ్యాధులు ప్రబలినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ వివరించారు. 2018లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 10 స్వైన్‌ఫ్లూ, 14మలేరియా, 145 డెంగీ, ఆరు ఫైలేరియా కేసులు నమోదైనా మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోగలిగామని తెలిపారు. 2019లో జనవరి నుంచి ఇప్పటివరకు 9 సైన్‌ఫ్లూ కేసుల్లో రెండు మరణాలు సంభవించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహణకు నిధుల కొరత లేదని తెలిపారు. సమావేశంలో డీఆర్వో పి.మోహన్‌లాల్, ఈడీఓ కె.నారాయణరెడ్డి, జోనల్ మలేరియా అధికారి మదన్మోహన్రావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కృష్ణారావు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ మల్లేశం, డీపీఓ మహమూది తదితరులు పాల్గొన్నారు. 30ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జాతీయ ఆరోగ్య కార్యక్రమం ద్వారా జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కేన్సర్, డయాబెటిక్, బీపీ, గుండె పోటు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11లక్షల జనాభా ఉండగా.. 30ఏళ్ల వయస్సు పైబడిన వారు గ్రామీణ ప్రాంతాల్లో 4లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7లక్షల మంది ఉన్నారని చెప్పారు. 2018 జనవరి11న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,59,312మందిని, పట్టణ ప్రాంతాల్లో 54మందిని పరీక్షించారని తెలిపారు. ఈ మేరకు 24,887మందికి మధుమేహం, 29,126మందికి బీపీ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇక 115మందికి ఓరల్ కేన్సర్, 94మందికి బ్రెస్ట్ కేన్సర్, 356మందికి సర్వికల్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సైతం సెప్టెంబర్ 10లోపు పరీక్షలు పూర్తిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
చౌకగా పౌష్టికాహారం!
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరికీ పౌష్టికాహారం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరగాల్సిన అవసరముందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, పౌష్టికత, ఆరోగ్యం అనే అంశాలపై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ఒకటి మొదలైంది. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌గా పిలుస్తున్న ఈ సదస్సును ఇక్రిశాట్, ఎన్ఐఎన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసన్, సీజీఐఏఆర్లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో 35 దేశాలకు చెందిన సుమారు 3,560 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. వ్యవసాయం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం ఎలా? తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలా? అనే అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజీఐఏఆర్ పరిశోధనా విభాగం అగ్రికల్చర్ ఫర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ డైరెక్టర్ జాన్ మెక్‌డర్మెట్ మాట్లాడుతూ.. ఆహార భద్రత కోసం భారత్ దశాబ్దాల క్రితం చేపట్టిన హరిత విప్లవం మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పౌష్టికాహార లభ్యతపై దృష్టి పెట్టడం అవసరమని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం వరి, గోధుమ వంటి ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే విధానాలను అవలంబించిందని.. వీటిని మార్చుకుని పుష్టినిచ్చే కాయగూరలు, పప్పు దినుసులు, చేపలు, ఆకుకూరల పెంపకానికి అనువైన విధానాలను సిద్ధం చేయాలని సూచించారు. లింగ వివక్ష కోణమూ ఉంది: కడియాల సంగీత వ్యవసాయం, ఆరోగ్యం, పౌష్టికతల్లో లింగ వివక్ష కోణమూ ఉందని.. పొలాల్లో ఎక్కువ కాలం పనిచేసే మహిళలు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఇది కాస్తా వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ కడియాల సంగీత తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌లో భాగంగా తాము ఆయా రంగాల్లో వస్తున్న కొత్త కొత్త అధ్యయనాల ఫలితాలను ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ చర్యలు కీలకమని అన్నారు. పౌష్టికాహారం పొందేందుకు ఆదాయం ముఖ్యమైన అంశమైనప్పటికీ అదొక్కటే కారణం కాదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం అధిక దిగుబడుల కోసం మాత్రమే కాకుండా.. పోషకాలు అందించేలా మారాల్సిన అవసరముందని చెప్పారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌కు ఆతిథ్యం ఇస్తున్న జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భారతీ కులకర్ణి మాట్లాడుతూ, పౌష్టికాహారం విషయంలో ఎన్ఐఎన్ విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తోందని.. ప్రభుత్వానికి విధానపరమైన సలహాలు, సూచనలు ఇస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త జి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు వరం ‘పోషణ్ అభియాన్’
సాక్షి,దామరగిద్ద: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఐసీడీఎస్ పథకం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన పోషణ్ అభియాన్ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తుంది. గర్భిణులు, చిన్నారులు తీసుకునే ఆహరంలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి ప్రజలను అవగాహణ కల్పించడంలో అంగన్వాడీ కార్యకర్తలు వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు గ్రామంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. స్థానికంగా లభించే ఏ ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. తీసుకోవల్సిన జాగత్రలు వాటిని కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. పక్షోత్సవాల్లో చైతన్య కార్యక్రమాలు మద్దూర్ ప్రాజెక్టు పరిధిలోని దామరగిద్ద, కోస్గి, మద్దూరు మండలాల్లోని 239 అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ స్వప్నప్రియ సమక్షంలో మహిళ దినోత్సం సందర్భంగా మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ నిర్వహిస్తున్నారు. మండలంలో 63 కేంద్రాల పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్ రాధిక జ్యోతి పర్యవేక్షించారు. పౌష్టికాహరం ప్రాధాన్యతను తెలిపే ప్రదర్శణలు క్షేత్ర పర్యటను అవగాహణ సదస్సులు నిర్వహించారు. రోజుకో కార్యక్రమంతో.. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 8న పోషణ మేళా– పోషణ పక్షం, 9న అన్నప్రాసన, సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, 10న పోషణ్ ర్యాలీ, 11న రకతహీణతపై పాఠశాలలో క్యాంపు, కిషోర బాలికలకు అవగాహన, 12న పోషక ఆహారం పై సమావేశం, 13న ఇంటింటి పోషణ పండుగ ప్రతిజ్ఞ, 14న యువజన సంఘాలతో సమావేశం పోషణ నడక, 15న పోషకాహార ప్రదర్శన, 16న రైతు క్లబ్‌ల సమావేశం, అంగడి సంత కార్యక్రమం, 17న ప్రభాత్ ఫెరి పోషణ, 18న యువజన సంఘాల లేదా పాఠశాలల్లో సమావేశం,19న కిచెన్ గార్డెన్ల పై క్షేత్ర పర్యటన, 20న రక్తహీనతపై కిషోర బాలికల ఆవగాహణ క్యాంపు, 21న పోషణ్ ర్యాలీ నిర్వహించారు. పౌష్టికాహార ప్రాధాన్యత తెలిపేందుకే పౌష్టికాహార లోపంతో గర్భిణులు, చాన్నిరులు అనారోగ్యపాలవుతున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పోషణ అభియాన్ పక్షోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 239 కేంద్రాల్లో పక్షం రోజులుగా నిర్ధేశిత షెడ్యూలు ప్రకారం అంగన్వాడీ కార్యర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. శుక్రవారం ప్రాజెక్టు స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. –స్వప్నప్రియ, సీడీపీఓ, మద్దూరు -
దానికి లేజర్ ట్రీట్మెంట్ ఉందా?
నా వయసు 35 సంవత్సరాలు. రెండు సాధారణ కాన్పులు. ఇప్పుడు నాకు యోని వదులుగా అనిపిస్తుంది. దగ్గినా, తుమ్మినా కొద్దిగా మూత్రం కారిపోతోంది. యోని లూజుగా ఉండటం వల్ల కలయికలో నాకు, మా ఆయనకు తృప్తి అనిపించడం లేదు. యోని బిగుతుగా అవడానికి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఉందని విన్నాను. దాని గురించి చెప్పగలరు. – ప్రజ్ఞ, హైదరాబాద్ కొంతమందిలో సాధారణ కాన్పుల వల్ల, ఆ సమయంలో తలెత్తే ఇబ్బందుల వల్ల యోనిలోని కండరాలు, టిష్యూ బాగా సాగిపోయి మళ్లీ పూర్వ స్థితి రాకపోవచ్చు. అలాగే కొందరిలో రక్తహీనత, ప్రొటీన్స్ తక్కువగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల యోని వదులుగా అయిపోయి, మూత్రాశయానికి సపోర్ట్ లేకపోవడం వల్ల దగ్గినా, తుమ్మినా మూత్రం కారడం, కలయికలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దీనికి చికిత్సలో భాగంగా పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, పౌష్టికాహారం, వెజైనోప్లాస్టీ ఆపరేషన్, వెజైనల్ టేపులు వంటి ఆపరేషన్ల ద్వారా యోని భాగాన్ని బిగుతు చేయడం జరిగేది. ఇప్పుడు వీటికి పీఆర్పీ చికిత్స, లేజర్ చికిత్స కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. పీఆర్పీ అంటే ప్లాస్మా రిబ్ ప్లేట్లెట్స్. సమస్య ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా, ప్లేట్లెట్స్ కణాలను వేరు చేసి, వారి యోని భాగంలోకి ఇంజెక్షన్ ద్వారా పంపడం వల్ల అక్కడి కణాలు వృద్ధి చెంది యోనిభాగం బిగుతుగా అవుతుంది. అలాగే లేజర్ ద్వారా యోనిలోకి పంపించే కిరణాలకు యోని కణజాలం వేడి చెంది, తద్వారా అందులోని గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్ వంటి అనేక కణాలు ప్రేరేపణ చెంది, రక్తప్రసరణ వృద్ధి చెంది యోని బిగుతుగా అవుతుంది. దీనివల్ల చాలా వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఏ.సి రూమ్ నుంచి బయటికి రాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో అదేపనిగా ఏసీ రూమ్‌లో ఉండడం మంచిదేనా? రాబోయే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ద్రవాలు తీసుకోవాలనేది తెలియజేయగలరు. – కె.సంగీత, కాకినాడ ఎండాకాలంలో ఎక్కువ వేడి వాతావరణం కారణంగా గర్భిణులలో చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండటం, వడదెబ్బ తగలడం, బీపీ తగ్గడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తొందరగా అలసట చెందడం, కాళ్ల వాపు వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఎండాకాలం వీలైనంత వరకు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటి పనులు పొద్దున్నే లేదా సాయంత్రం ఎండ చల్లబడిన తర్వాత చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా వేడి ఉంటే ఫ్యాను దగ్గర లేదా ఏసీలో ఉండవచ్చు. దీనివల్ల కడుపులోని బిడ్డకు జలుబు చేయడం వంటివేమీ ఉండవు. ఎండాకాలంలో ద్రవపదార్థాలు– మంచినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. గొడుగు పట్టుకు వెళ్లాలి. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. రోజూ రెండుసార్లు మంచినీళ్లతో స్నానం చేయడం మంచిది. కాఫీ, టీ, పచ్చళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది. చర్మం పొడారిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్లు, యాంటీ ఫంగల్ పౌడర్లు వాడుకోవచ్చు. లైట్ కలర్ దుస్తులు వదులుగా ఉండేలా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మరీ ఎక్కువగా వ్యాయామాలు చేయకూడదు. పనులు కూడా వెంట వెంటనే కాకుండా మెల్లగా చేసుకోవడం మంచిది. మరీ అధికంగా ఎండకు ఎక్స్పోజ్ అయినట్లయితే మొదటి మూడు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డ వెన్నుపూసలో లోపాలు ఏర్పడవచ్చు. తర్వాతి నెలల్లో జాగ్రత్తలు తీసుకోకుంటే ఉమ్మనీరు తగ్గడం, నెలలు నిండకుండానే కాన్పులు జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సి సమయంలో iodine సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అని చదివాను. దీనివల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయగలరు.– శ్రీ, వేటపాలెం అయోడిన్ అనే ఖనిజలవణం గర్భంలో ఉన్న శిశువు మెదడు ఆరోగ్యకరంగా ఎదగడానికి, పుట్టిన తర్వాత కూడా బిడ్డ మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ తయారీకి అయోడిన్ ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో అనేక రసాయనిక చర్యలకు దోహదపడుతుంది. తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదల అయితేనే అది శిశువుకు చేరి, శిశువు ఆరోగ్యంగా పుట్టడానికి దోహదపడుతుంది. తల్లిలో అయోడిన్ సరిగా లేకపోతే, బిడ్డలో థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం, § éనివల్ల శిశువులో మానసిక, శారీరక లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు తర్వాత కూడా తల్లి పాల ద్వారా అయోడిన్ బిడ్డకు చేరి బిడ్డ మెదడు పనితీరుకు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయోడిన్ ఎక్కువగా పాల ఉత్పత్తులు, గుడ్లు, కూరగాయలు, అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఆహారం వంటి వాటిలో ఉంటుంది. పైన చెప్పిన ఆహారం సరిగా తీసుకుంటే అయోడిన్ సప్లిమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలనేమీ లేదు. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ముళ్ళతీగకు మల్లెలు పూస్తాయా?
ఊహకు సైతం అందని ఈ విశాల విశ్వం, అందులోని అణువణువూ దేవుని ఏకత్వాన్ని, ఆయన ఘనతను, ఆయన పాలనా, పోషణా గుణాలను సూచిస్తున్నాయి. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టి్టంచినవాడు ఆ ప్రభువే కనుక అన్నిటిపై అధికారం, ఆధిపత్యం కూడా ఆయనదే. ఈ విశ్వంలోని అసంఖ్యాక సృష్టితాల్లో మానవ రాసి కూడా ఒకటి. మరే ప్రాణికీ లేనటువంటి అత్యద్భుత ప్రతిభా పాటవాలను దైవం ఒక్క మానవ రాసికే అనుగ్రహించి, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని నిర్దేశించాడు. నిజానికి ఈ సృషి ్టసమస్తమూ ఒక్క మానవుడి కోసమేనంటే అతిశయోక్తి కాదు. మానవ మనుగడకోసం, మానవుల ప్రయోజనం కోసం దైవం అసంఖ్యాక ఏర్పాట్లు చేశాడు. గాలిని, నీటిని, వెలుగును, వేడిని, పగటిని, రేయిని ఆయన సృష్టించాడు. మానవుల ఆయురారోగ్యాలు, సౌభాగ్య దౌర్భాగ్యాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. జీవన్మరణాలు కూడా ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి. మొరలు వినేవాడు, అవసరాలు తీర్చేవాడు అన్నీ ఆయనే. అండనిచ్చేవాడు, ఆశ్రయమిచ్చేవాడూ ఆయనే. మానవులు ఈప్రపంచంలో శాంతి సంతోషాలతో జీవితం గడపడానికి, పరలోక జీవితంలో సాఫల్యం పొందడానికి కావలసిన సకల ఏర్పాట్లూచేశాడు, సాధనాలనూ సమకూర్చాడు.అయితే, దురదృష్టవశాత్తూ మానవులు సృష్టికర్తను మరిచి ఇష్టారాజ్యంగా జీవించడం వల్ల రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఈ ప్రాపంచిక జీవితంలో సుఖశాంతులు లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా భారంగా జీవితం వెళ్ళదీస్తున్నారు. అన్ని జీవరాసులకన్నా శ్రేష్ఠస్థానంలో ఉండి, బుద్ధికుశలతలకు అజ్ఞానపు పరదా కప్పి హీనస్థాయికి దిగజారిపోతున్నారు. ఇంతకన్నా భయంకరమైన నష్టం మరొకటి ఉంది. అదే పరలోక వైఫల్యం. ఏదో ఒక విధంగా ఇహలోక జీవితం గట్టెక్కినా, శాశ్వతమైన పరలోక జీవితంలో చేదు అనుభవమే ఎదురు కానుంది. ఇహలోక జీవితంలో బుద్ధినుపయోగించి, మంచిమార్గంలో నడిస్తే, రేపటి పరలోక జీవితం సఫలమవుతుంది. అంతేతప్ప ముళ్ళ విత్తనాన్ని నాటి మల్లెపూలు కోస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి ఆచరణ, నడవడిని బట్టే, అక్కడ ప్రతిఫలం నిర్ణయమవుతుంది. కనుక బుధ్ధిజీవి అయిన మానవుడు దైవం తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని,స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే ఇహ, పరలోకాల్లో సంపూర్ణ సాఫల్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దైవం మనందరికీ సన్మార్గపథాన నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చేపల వినియోగం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహారమైన చేపల వినియోగాన్ని పెంచేందుకు జాతీయ చేపల అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ అధికారి రాణికుముదిని తెలిపారు. శరీరానికి కావాల్సిన ఆవశ్యక ప్రొటీన్లను అందించే చేపలు మెరుగైన ఆహారమన్నారు. వీటిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చేపల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. చేపలు తింటే ముళ్లు గొంతులో ఇరుక్కుంటాయని, ఇతర అపోహలు ప్రజల్లో ఉన్నాయని.. ఇలాంటి వాటిని పోగొట్టేందుకు జాతీయ స్థాయిలో పలు ఫిష్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. 2018 జూలైలో విశాఖపట్నంలో తొలిసారిగా ఫిష్ ఫెస్టివల్ నిర్వహించామని, దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది తొలి ఫిష్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొనే వారికి స్టాల్స్ కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసం విక్రయాలు 93 శాతం.. తెలంగాణలో చేపల వినియోగం మొదటి నుంచి తక్కువగానే ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. చికెన్, మటన్ వినియోగం ఏకంగా 93 శాతం ఉందన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే రూ. 50 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేసిందన్నారు. ముళ్లు లేని చేపల మాంసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసిందని వెల్లడించారు. నగరంలో 15 మొబైల్ ట్రక్కుల్లో డీ బోనింగ్ (ముళ్లు, చర్మం తొలగించినవి) చేపలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇవి సఫలీకృతం కాగానే రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. -
మధుమేహాంతో మెదడు సమస్యలు?
మధుమేహంతో అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలుసుకుగానీ.. ఈ జబ్బు వల్ల మెదడుకూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు తాము జరిపిన అధ్యయనంలో టైప్–2 మధుమేహం వల్ల ఆలోచన తీరు, జ్ఞాపకశక్తుల విషయాల్లో సమస్యలు రావచ్చునని తేలినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిషేల్ కల్లిసాయ తెలిపారు. మధుమేహం ఉన్న కొంతమంది వయోవృద్ధులపై పరిశోధనలు చేశామని.. మొదట్లో వారి ఎమ్మారై స్కాన్లను పరిశీలించినప్పుడు మెదడులోని కొన్ని భాగాల సైజు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఐదేళ్ల కాలంలో వారి మెదడు పనితీరు తగ్గుదల కనిపించిందని, ఇందుకు అనుగుణంగానే మెదడు సైజు కూడా తగ్గిపోవడాన్ని తాము గుర్తించామని వివరించారు. మధుమేహులు తమ మెదడుపట్ల కూడా కొంత శ్రద్ధ వహించాలనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని.. ఇందుకు రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. ఏదో ఒక రూపంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం.. పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గుండెకు మంచి చేసే ఆహారం మెదడుకూ మేలు చేస్తుందని చెప్పారు. వీటితోపాటు నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండేందుకు అవకాశముందని అన్నారు. -
చిట్టి బొజ్జలకు.. చేటు భోజనం!
మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒకవేళ తిన్నా అవి బతికి బట్టకట్టవు’’.. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన నాణ్యతా ప్రమాణాలపై ప్రకాశం జిల్లా రామాయపట్నం మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు లేఖరాయడంతో నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర సర్వోత్తమ న్యాయస్థానం..విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి.. ఉడకని బియ్యం, నీళ్ల చారు. గోలీ సైజు కోడిగుడ్డు.. ఇదీ ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న భోజనం మెను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయం ప్రస్తావిస్తేనే విద్యార్థులు ‘అమ్మో’ అంటున్నారు. అది తిని ఆరోగ్యంగా ఉంటామా? అని సందేహం వ్యక్తంచేశారు ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. మధ్యాహ్న భోజనం కంటే జైలు భోజనమే నయమంటూ వారు వ్యాఖ్యానించడం విశేషం. దీంతో చాలామంది ఇంటి నుంచే తెచ్చుకు తింటున్నారు. ఇది ఒక్క ప్రకాశం జిల్లాకే పరిమితం కాదు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పరిస్థితి దాదాపు ఇంతే. సాక్షి, అమరావతి/నెట్వర్క్: పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో అధ్వానంగా మారింది. జంతువులు కూడా ముట్టుకోని రీతిలో ఉంటున్న ఆహార పదార్థాలను ప్రభుత్వం పిల్లలకు అందిస్తోంది. ఈ ఆహారాన్ని తినలేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికత మాట దేవుడెరుగు.. తిన్నవారంతా రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు పిల్లల కడుపుకొడుతున్నారు. భారీగా కమీషన్లు తీసుకుంటుండడంతో సరుకులు పంపిణీ చేసే సంస్థలు నాసిరకమైనవి సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి గతంలో ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సరుకుల పంపిణీ వ్యవహారాల టెండర్లు ఖరారుచేసి, పాఠశాలల వారీగా అక్కడికక్కడే డ్వాక్రా మహిళల ద్వారా మధ్యాహ్న భోజనం వండించి పిల్లలకు వేడివేడి పదార్ధాలను అందించేవారు. కానీ, కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు ఈ టెండర్లను రాష్టస్థాయిలో కేంద్రీకరించి తమకు భారీగా ముడుపులిచ్చే సంస్థలకు కట్టబెడుతున్నారు. మరోపక్క డ్వాక్రా మహిళలను తప్పించి క్లస్టర్ల వారీగా పలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఎప్పుడో తెల్లవారుజామున వండిన పదార్థాలను మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు అందిస్తున్నాయి. దీంతో ఆ పదార్థాలు పాడవుతున్నాయి. విద్యార్థులు తినడానికి పనికిరావడంలేదు. వారానికి ఐదు గుడ్లు అందించాల్సి ఉన్నా ఈ సంస్థలు పంపిణీ చేయడంలేదు. కొన్ని జిల్లాల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నా అవి పురుగులుపట్టి ఉండడంతో విద్యార్థులు పారేస్తున్నారు. నాణ్యత ఒట్టిమాటే! రాష్ట్రంలోని 45,589 స్కూళ్లలోని 36.17 లక్షల మంది విద్యార్థులకుగాను హాజరును బట్టి 23.46లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆరంభంలో 1 నుంచి 8వ తరగతి పిల్లల వరకే ఇది అమలుకాగా తరువాత 9, 10 తరగతుల పిల్లలకు విస్తరించారు. వీరికి ఉడికీ ఉడకని అన్నం, కూరలు కొన్నిసార్లు వడ్డిస్తుండగా కొన్నిమార్లు ముద్దయిన అన్నం పెడుతున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి.. - కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు దగ్గర ఇటీవల ఒక కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడంతో రెండు రోజులకే బంద్ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడంతో ఉడకడంలేదు. కందిపప్పు సైతం విద్యార్థులకు సరిపడా పంపిణీ చేయడంలేదు. 840 స్కూళ్లకు కోడిగుడ్డు సరఫరా నిలిచి పోయింది. - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పూర్తిస్థాయిలో భోజనం సరఫరా కావడంలేదు. అప్పుడప్పుడు తడిసిపోయిన, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో రంగుమారి వాసన వస్తుండడంతో అనేకమంది విద్యార్థులు భోజనం చేయడంలేదు. - ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని నెల్లూరు జిల్లా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. - చిత్తూరు జిల్లాలో బడ్జెట్ సరిపోక నీళ్లచారు, నీళ్ల పప్పును వడ్డిస్తున్నారు. బియ్యం కూడా నాసిరకం కావడంతో అన్నం ముద్దముద్ద అవుతోంది. భోజనం అధ్వానంగా ఉండటంతో చాలాచోట్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపించడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చదువుకున్న చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. - కృష్ణాజిల్లా వ్యాప్తంగా 90శాతం పాఠశాలల్లో నీళ్లచారు, ఉడకని అన్నం, కుళ్లిన కోడిగుడ్లు అందిస్తున్నారు. వాటిని తినలేక బయటపడేస్తున్న పరిస్థితి నెలకొంది. - కేంద్రీకృత వంటశాల విధానంతో అనంతపురం జిల్లాలోని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 2.30గంటలకే తయారుచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేసరికి నాణ్యత లోపిస్తోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. కోడిగుడ్లను సైతం నాణ్యతలేనివి సరఫరా చేస్తున్నారు. - విజయనగరం జిల్లాను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. దీంతో రెండ్రోజులపాటు అనేక పాఠశాలలకు సకాలంలో భోజనాలు అందలేదు. జిల్లాలో శుక్రవారం గుడ్డు, అన్నం, వెజిటబుల్స్, పప్పు పెట్టాలి. కానీ, ఉడికీ ఉడకని అన్నం, తాలింపులేని పప్పు మాత్రమే పెట్టారు. గుడ్డు ఇవ్వలేదు. - వైఎస్సార్ జిల్లాలో అయితే చాలాచోట్ల కోడిగుడ్ల సరఫరా లేదు. ఇక్కడ మెనూను పక్కన పెట్టి వండుతున్నారు. - గుంటూరు జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతుండడంతో పిల్లలు తినకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే, ఎక్కువశాతం పాఠశాలల్లో మంచినీరు అందుబాటులో ఉండడంలేదు. - ఇక విశాఖ జీవీఎంసీ పరిధిలో నాణ్యత కొంతమేర బాగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం అధ్వాన్నంగా ఉంది. ముతకబియ్యం సరఫరా చేస్తున్నారు. అన్నంలో రాళ్లు, ఇసుక, పురుగులు కూడా ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాంబారు చిక్కగా ఉండేందుకు పప్పుకు బదులుగా జొన్న, శనగపిండి కలిపేస్తున్నారు. సాంబారులో కూరగాయల ఊసే లేదు. దీంతో విద్యార్థులు ముట్టకుండానే పారేస్తున్నారు. - తూర్పుగోదావరి జిల్లాలోనైతే విద్యార్థులు ఆహారాన్ని తినడంలేదని సాక్షాత్తు కేంద్ర, రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గుర్తించడం గమనార్హం. ఢిల్లీ, అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గత నెల 68 పాఠశాలల్లో పరిశీలించగా 20 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడంలేదని గుర్తించాయి. పర్యవేక్షణ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం సామాగ్రి వినియోగంతో విద్యార్థుల్లో పోషకాహారం లోపించి వ్యాధుల బారిన పడుతున్నారని.. వయసు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటంలేదని, మరికొన్ని, ఇతర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు వారి పరిశీలనలో తేలింది. వంట ఏజెన్సీలపై బకాయిల బండ పిల్లలకు భోజనాలు అందించే వంట ఏజెన్సీలకు, కార్మికులకు బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉదాహరణకు.. శ్రీకాకుళం జిల్లాలో రెండు నెలలుగా ఇలా బకాయి ఉన్నాయి. దీంతో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులతో గుడ్లు తెప్పిస్తున్నారు. వారానికి ఐదు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.4.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడంలేదని నెల్లూరు జిల్లాలోని నిర్వాహకులు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలోనూ సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలవుతున్న వంట నిర్వాహకులు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.3.72కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాల్లోనూ రూ.6కోట్ల వరకు బకాయిలున్నాయి. ఇక్కడ సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అప్పులు చేసి వారు బాధ్యతగా భోజనాలు పెడుతుండగా ఇక్కడ ప్రైవేట్‌కు అప్పజెప్పడంతో నిర్వాహకులు రోడ్డునపడ్డారు. వైఎస్సార్ జిల్లాలో రూ.1.32కోట్ల బకాయిలున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేస్తూ మరీ నిర్వాహకులు వంట చేస్తున్నారు. జిల్లాలన్నింటిలో ఇదే పరిస్థితి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ తప్పుబట్టినా మారని వైనం మధ్యాహ్న భోజనం తీరుపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉంటోందని ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చినా పథకం అమలు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గుడ్లలో 60 శాతం మాత్రమే పంపిణీ అవుతోందని తేల్చింది. గుడ్లు కూడా 52 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం 35 గ్రాములే ఉంటున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన రూ.131కోట్ల వరకు నిధులు పక్కదారి పడుతున్నట్లు కమిషన్ నివేదిక ద్వారా తేటతెల్లమవుతోంది. స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం సరికాదు 16 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్నా. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మేం రోడ్డున పడతాం. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు రావాలి. తొమ్మిది నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్న రోజుల్లో కూడా అప్పులు తెచ్చి విద్యార్థులకు వడ్డించాం. – రుక్మిణి, ఏజెన్సీ నిర్వాహకురాలు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా కడుపులో నొప్పి వస్తోంది అన్నం లావుగా ఉంటోంది. తినాలంటే చాలా కష్టంగా ఉంది. ముద్ద దిగడంలేదు. ఆకలికి ఉండలేక తింటున్నాం. ఒక్కోసారి అన్నం తిన్నాక కడుపులో నొప్పి వస్తోంది. అందుకే ఎక్కువ రోజులు ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటాం. ఇక్కడ మంచి నీళ్లు కూడా సరిగాలేవు. – ఓర్చు అశ్వని, 4వ తరగతి, చండ్రాజుపాలెం పాఠశాల, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా రోడ్డున పడేస్తున్నారు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి మాకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. వాటితోనే అప్పటికప్పుడు వండి వేడివేడిగా పిల్లలకు పెడుతున్నాం. కానీ, ఇప్పుడు నవప్రయాస్ సంస్థ వారు వండి తీసుకొస్తున్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అయినా సరే ఆ ఏజెన్సీకే సహకరిస్తూ సేవలందిస్తున్న మమ్మల్ని రోడ్డుపాల్జేస్తున్నారు. చాలా దారుణం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – జి.వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, మిడ్ డే మీల్స్ నిర్వాహుకల సంఘం, విశాఖపట్నం వంట కార్మికులకు ఇస్తున్న వేతనం అత్యల్పం రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ.1000 చొప్పున మాత్రమే అందిస్తోంది. ఇది కనీస వేతనం కూడా కాదు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే తమిళనాడులో రూ7,500, కేరళలో 6వేలు, లక్షద్వీప్‌లో రూ.6వేలు, పాండిచ్చేరిలో రూ.5నుంచి 9వేలు ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది రూ.1000 అయినా మిగతా మొత్తాన్ని కలిపి టైమ్‌స్కేల్ కింద ఈ మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.1000 మాత్రమే ఇస్తుండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్రమేణా స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ వారి నోట మట్టికొడుతోంది. రూ.4.35తో భోజనం వస్తుందా.. ప్రభుత్వం ఆయా విద్యార్థులకు భోజనానికి నిర్దేశించిన మొత్తాన్ని పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల్లో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ రోజుల్లో బయట భోజనం చేయాలంటే కనీసం 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఈ పిల్లల భోజనానికి అవసరమయ్యే బియ్యాన్ని పౌరసరఫరాల ద్వారా అందిస్తుండగా పప్పులు, కూరగాయలు, ఆయిల్, ఇతర పప్పు దినుసులు, గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం మరీ దారుణంగా చాలా తక్కువగా ఉంటోంది. ఈ విద్యార్ధుల్లో ప్రాథమిక స్థాయి వారికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారికి రూ.6.51 కేటాయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తమే అతి తక్కువ కాగా ఇందులో ఆయా సరుకుల కాంట్రాక్టులను కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కోట్లలో కాజేస్తున్నారు. కోడిగుడ్లు, కందిపప్పు, ఆయిల్ సరఫరా కాంట్రాక్టుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అయితే క్యాలరీస్, ప్రొటీన్లు ఎలా.. ప్రభుత్వమిచ్చే మొత్తమే తక్కువగా ఉండగా అందులో కమీషన్ల కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకంగా ఉన్న వాటిని సరఫరా చేస్తున్నారు. దీంతో విద్యార్ధులకు సరైన పౌష్ఠికాహారం అందడంలేదు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి ఐదు గుడ్లు, అరటి పండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలుకావడంలేదు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ స్థాయిలో క్యాలరీస్, ప్రొటీన్లు అందకపోవడంతో అందడానికి విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఏ మోతాదులో ఆయా పదార్థాలు అందించాలో సూచించినా అవి అందడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వ్యవహారాలతో కూడుకున్నవి అయినందున కోడిగుడ్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. కిచెన్ షెడ్లు ఏవీ? ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆయా పాఠశాలల పరిధిలోని డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వారే స్కూళ్లలో ఈ ఆహారాన్ని వండి విద్యార్థులకు వేడివేడిగా అందిస్తున్నారు. అనేకచోట్ల కిచెన్ షెడ్లు వంటివి లేకపోయినా ఆరుబయటే ఏదోలా సర్దుబాటు చేసుకుంటూ భోజన తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో 1,078 స్కూళ్లలో వంట గదులు, 1,445 స్కూళ్లలో తాగునీటి సదుపాయంలేదు. అనంతపురం జిల్లాలో షెడ్లు లేకపోవడంవల్ల పొయ్యిలు మండక ఉడికీ ఉడకని భోజనాన్నే పిల్లలకు వడ్డించే పరిస్థితి. ఇక్కడ 2012లో మంజూరు చేసిన వంట గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. గుంటూరు జిల్లాలోని సగం పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేక అపరిశుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు భోజనాన్ని వండి పెడుతున్నారు. పాఠశాలల్లోనే వండి వడ్డించాలని ‘సుప్రీం’ చెప్పినా.. విద్యార్థులకు అందించే భోజనాన్ని పాఠశాలల్లోనే వండి వడ్డించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో రాష్ట్రంలో సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ పర్యటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ కమిషన్ ఆయా స్వచ్ఛంద సంస్థల్లో తయారవుతున్న ఆహార పదార్ధాలను, సరఫరా తీరుతెన్నులను పరిశీలించింది. - ఈ సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషన్ గుర్తించింది. - అటెండెన్సు ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం పిల్లల సంఖ్యలను వేస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి పిండుకుంటున్నట్లు నివేదికలో పొందుపరిచింది. - భోజనాన్ని అందించే పరిమాణంలో కూడా 200 గ్రాముల నుంచి 275 గ్రాములు తక్కువగా ఉంటోందని పేర్కొంది. - యంత్రాల సహాయంతో అత్యధిక వేడితో టన్నుల కొద్దీ ఆహార పదార్ధాలను వండుతుండడం వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని గుర్తించింది. - అదే సమయంలో తెల్లవారుజాము నుంచి ఈ పదార్ధాలు తయారుచేసి మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు పంపిణీ చేస్తున్నందున పాచిపోతున్నాయని గుర్తించింది. - వీటిని తింటున్న విద్యార్ధులు అనారోగ్యం పాలవుతున్నారని నివేదించింది. - కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని సరుకులతో వంటకాలు తయారు చేస్తుండడంవల్ల అవి మరింత త్వరగా పాడవుతున్నాయి. డ్వాక్రా మహిళల పొట్టకొట్టి.. పాఠశాలలకు బియ్యం వచ్చినా ఇతర సరకులు సరఫరా కాని సమయంలో కూడా డ్వాక్రా మహిళలు స్థానికంగా ఉన్న షాపుల్లో అరువుకు తెచ్చి పిల్లలకు పదార్ధాలు చేసి పెడుతుండేవారు. ఈ వంటలకు కాలసిన గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చేయాల్సి ఉన్నా పలుచోట్ల అదీ లేదు. దీంతో స్థానికంగా ఉన్న వనరులతో పూర్తిచేస్తూ వచ్చారు. ఇటీవల గ్యాస్ సరఫరాను చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతుండడంతో నెలల తరబడి ఆ గ్యాసూ రావడంలేదు. నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని, కిచెన్ షెడ్లు నిర్మాంచామని గొప్పలు చెబుతున్నప్పటికీ విశాఖ జిల్లాలోని 70 పాఠశాలల్లో ఆరుబయటే కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం గుడ్లు, పప్పు, ఆయిల్ వంటి సరుకుల సరఫరా కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకరించడంతో పాటు ఆహార పదార్థాలు వండి స్కూళ్లకు సరఫరా బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా స్కూళ్లకు సెంట్రలైజ్డ్ కిచెన్లను తానే ఏర్పాటుచేసి అక్కడ వండే పదార్థాలను ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80వేల మంది డ్వాక్రా మహిళలను దశలవారీగా ఈ వంట పని నుంచి తొలగిస్తూ వస్తున్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వారు ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. -
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మంపైన తెల్లని పొట్టులా ఏర్పడుతుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... ∙అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తాయి. చలికాలం ఉన్నన్ని రోజులు రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మ మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది. ∙రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్–ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని శరీరానికి మసాజ్ చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ∙టేబుల్ స్పూన్ తేనెలో, టీ స్పూన్ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. ముఖ్యంగా చలికాలంలో. ∙మూడు బాదంపప్పులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసి, మెత్తగా రుబ్బి, అందులో టేబుల్ స్పూన్ పచ్చి పాలు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతో పాటు చేతులు, పాదాలకు కూడా రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత సున్నిపిండితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారి నిస్తేజంగా ఉన్న చర్మం మృదువుగా, కాంతివంతం అవుతుంది. ∙ఉడికించిన ఒట్స్, తేనె బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. -
పౌష్టికాహారం అందని ద్రాక్షేనా!
ప్రొద్దుటూరు : అన్న అమృత హస్తం పథకంలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో గర్భిణులు, బాలింతలతోపాటు ఎంపిక చేసిన చిన్నారులకు గుడ్డు వడ్డించాల్సి ఉంది. పౌష్టికాహారం అందించేందుకు రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా ఈ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు 1.50 లక్షల గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. గత నెల రోజులుగా గుడ్ల సరఫరా ఆగిపోయింది. ఈ కారణంగా అంగన్వాడీలు వీరికి భోజనం మాత్రమే పెట్టి పంపుతున్నారు. ప్రొద్దుటూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 1268 మంది, బాలింతలకు 1187 మంది, చిన్నారులు 14,448 మంది ఉన్నారు. స్వరాజ్యనగర్ సెక్టార్ పరిధిలో దాదాపుగా అన్ని ఎస్సీ అంగన్వాడీ కేంద్రాలే ఉన్నాయి. వీరికి గత నెల రోజులుగా 6వేలకుపైగా అందాల్సిన గుడ్ల సరఫరా ఆగిపోయింది. మైదుకూరు నగర పంచాయతీ పరిధిలోని 87 అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజులుగా కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేయడం లేదు. జిల్లాలో 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,268 మెయిన్, 353 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 21,711 మంది గర్భిణులు, 20,155 మంది బాలింతలు, ఏడాదిలోపు చిన్నారులు 23,700 మంది 1 నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 76,075 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 98,842 మంది నమోదై ఉన్నారు. వీరిలో 3–6 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ మంది అంగన్వాడీ కేంద్రాలకు రావడం లేదు. మిగిలిన వారందరికి ప్రతి నెల దాదాపుగా 30 లక్షల గుడ్లు కాం ట్రాక్టర్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రకారం ఆయా ప్రాజెక్టు సీడీపీఓలు ప్రతి నెల వీరికి బిల్లులు చెల్లిస్తున్నా రు. గతంలో రెవెన్యూ డివిజన్ల వారి గా గుడ్ల సరఫరా కాంట్రాక్టును ప్రతి ఏడాది జిల్లా జాయింట్ కలెక్టర్ టెండ ర్లు నిర్వహించి అప్పగించేవారు. కొత్త విధానానికి తెరతీసిన ప్రభుత్వం తొలి నుంచి రెవెన్యూ డివిజన్ల వారిగా గుడ్ల సరఫరా కాంట్రాక్టర్‌ను నియమించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టు నిర్వహించి ఎంపిక చేసిన కంపెనీలకు జిల్లాల వారీగా కాంట్రాక్టును అప్పగించింది. ఈ ప్రకారం వైజాగ్‌కు చెందిన యునైటెడ్ ట్రేడర్స్ వారు కాంట్రాక్టు దక్కించుకుని గుడ్లు సరఫరా చేశారు. గతంలో నెక్ ప్రకారం మార్కెట్ ధరలను బట్టి కాంట్రాక్టర్లకు దబ్బు చెల్లిస్తుండగా ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఏడాది పొడవునా గుడ్డుకు రూ.4.68 చొప్పున చెల్లించారు. గత ఏడాది జూలై 14 నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న వీరు గుడ్లు సరఫరా చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది జూలై 14తో వీరికి గడువు ముగిసింది. కారణం తెలియదు కానీ అధికారులు జూలై 15 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 15 వరకు గడువు పొడిగించారు. దీంతో ఈనెల 15 నాటికి అధికారులు టెండర్లు నిర్వహించి కొత్తవారికి కాంట్రాక్టును అప్పగించాల్సి ఉంది. అలాంటిది జనవరి 2019 వరకు మరో మూడు నెలలపాటు యునైటెడ్ ట్రేడర్స్‌కు గడువు పొడిగించారు. ఈ లెక్కన ఆరు నెలలపాటు ఇదే సంస్థకు గడువును పొడిగించారు. ఈ సమస్య కారణంగా సంబంధిత కాంట్రాక్టర్ గుడ్ల సరఫరాలో జాప్యం చేస్తున్నారు. నెల రోజులుగా బకాయిపడ్డ 30 లక్షల గుడ్లను ఏవిధంగా ఎవరికి పంపిణీ చేస్తారో అర్థం కాని విషయం. కాంట్రాక్టర్ నిర్వాకంతో 30 లక్షల గుడ్లకు సంబంధించిన మొత్తం రూ.1.50 కోట్లు మిగిలినట్లేనని అధికారులు సంబరపడుతారో చూడాల్సి ఉంది. -
బ్యూటిప్స్
సౌందర్య పోషణలో అతివల జుట్టుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన జుట్టుని చూసి చెప్పవచ్చు. ఒత్తయిన నిగనిగలాడే జుట్టు ఆరోగ్యానికి సంకేతం. వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. ఈ చిట్కాలతో దీన్ని అరికట్టి మెరిసే జుట్టు మీ సొంతంచేసుకోండి.ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్ల నుండి పట్టించాలి. 20 నిమిషాల తరువాత తల స్నానం చెయ్యాలి. ఒక కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
జడ్చర్లలో డీఎస్ఎం న్యూట్రిషన్ ప్లాంటు
జడ్చర్ల: జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్ఎం సంస్థ... మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో తన ప్లాంటును ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ... తన రెండో ప్లాంటును జడ్చర్లలో సోమవారం ఆరంభించింది. ఈ సందర్భంగా డీఎస్ఎం న్యూట్రీషియనల్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ డేవిడ్ బ్లాకెమోర్ మాట్లాడుతూ... యానిమల్ న్యూట్రిషన్‌కు సంబంధించి భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో భారత మార్కెట్లో ఎదిగేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. జంతువులకూ పోషక పదార్థాలు అవసరమన్నారు. తమ రెండు ప్లాంట్ల ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల్లో విస్తరిస్తామని, తరువాత పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌కు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారాయన. దాదాపు 174 దేశాలలో కార్యకలాపాలున్న డీఎస్ఎం టర్నోవరు రూ.2 వేల కోట్ల వరకూ ఉంది. ఈ కార్యక్రమంలో బిజినెస్ యూనిట్ డైరెక్టర్ రవీంద్ర, డీఎస్ఎం ఇండియా ప్రెసిడెంట్ రాజగోపాల్, స్థానిక సైట్ మేనేజర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
తిండికలిగితే.. కండగలదోయ్
పోషకాహారం ప్రజలందరికీ చేరకపోవడం అతిపెద్ద సమస్య. ప్రపంచ దేశాలన్నీ వివిధ వేదికలపై దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పోషకాహార లోపం వల్ల ఆర్థిక వ్యవస్థకు, మానవాభివృద్ధికి వాటిల్లుతున్న నష్టాన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నాయి. ఐక్యరాజ్యసమతి ఈ అంశాన్ని సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో (ఎండీజీ) భాగం చేసింది. అయినా ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ వంటి దేశాలు పోషకాహార లేమిపై మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార మిషన్ (ఎన్ఎన్ఎం)ను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెం బర్ను జాతీయ పోషకాహార మాసంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పోషకాహార సందేశాన్ని చేరవేయాలనుకుంటోంది. రక్తహీనతపై అవగాహన.. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదలపై పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది. బాలికలకు విద్య, పోషకాహారం అందచేయాల్సిన అవసరం, తగిన వయసులోనే పెళ్లి చేయడం వంటి అంశాల్ని కూడా ప్రచారంలో పెట్టనుంది. పిల్లలకు తల్లిపాలు, అనుబంధ ఆహారాన్ని తగిన మేరకు అందచేయాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మేళాలు, పోషణ్ వాక్స్, వంటకాల ప్రదర్శనల వంటి ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టనుంది. నీతి ఆయోగ్ సహా పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇందులో పాత్ర పోషించనున్నాయి. 42 కమ్యూనిటీ రేడియోలు, పంచాయతీరాజ్ ప్రతినిధులు, టీచర్లు, స్వయం సహాయక గ్రూపులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు ప్రచార కార్యక్రమాల్లో భాగం కానున్నారు. మెరుగైన ఫలితాల కోసం.. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) 1975 నుంచి అమలవుతోంది. గత యూపీఏ ప్రభుత్వం ఇందులోని కొన్ని లక్ష్యాలను 2005లో తీసుకొచ్చిన ‘నేషనల్ హెల్త్ మిషన్’లో భాగం చేసింది. 2022 నాటికి దేశంలో పోషకాహార సమస్యను పారదోలుతామంటున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఈ దిశగా అమలు చేయదగ్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా రూ.9,046.17 కోట్లతో నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌ను అమల్లోకి తెచ్చింది. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపించిన వారు 38.4 శాతం మంది ఉన్నారు. 2022 నాటికి దాన్ని 25 శాతానికి తగ్గించాలనేది ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఏటా స్త్రీలలో పోషకాహార లోపాన్ని 2 శాతం మేరకు, కిశోర బాలికల్లో రక్తహీనతను 3 శాతం మేర, బరువు తక్కువ జననాలను 2 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతికత సాయంతో పర్యవేక్షించడం, నిర్దేశిత లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు.. ఐటీ ఆధారిత పరికరాలు ఉపయోగించే అంగన్వాడీ వర్కర్లకు.. ప్రోత్సాహకాలివ్వడం, సామాజిక తనిఖీలు చేయడం, పోషకాహార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం, ‘పోషణ’తో సంబంధమున్న పలు శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి కార్యకలాపాల ద్వారా ముందెన్నడూ లేని రీతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017–18, 2019–20 మధ్య 10 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ పథకం ఫలాలు అందించాలని సంకల్పించింది. -
పిచ్చితల్లి
గబగబా అడుగులేసుకుంటూ తన గుడిసె దగ్గరకొచ్చింది లక్ష్మమ్మ. చేతిలోని గిన్నెలో ఆమె పాచిపని చేసే యాజమానురాళ్ళు ఇచ్చిన అన్నం కూరలు, వస్తూ వస్తూ కొని కొంగులో దాచిన మొక్కజొన్న పొత్తు ఉన్నాయి. బయట ఆమె ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. తల్లిని చూడగానే, ‘‘అమ్మా! ఆకలే...’’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. తల్లడిల్లిపోయింది. ఆమె తల్లిమనసు. కొంగులో ఉన్న కాల్చిన మొక్కజొన్న పొత్తును రెండుగా తుంపి చెరొక ముక్కా ఇచ్చింది. ‘‘అమ్మా! అన్నం పెట్టవే బాగా ఆకలేస్తోంది’’ అన్నారు పిల్లలు జాలిగా. గబాలున ఇద్దర్ని గుండెల్లో పొదువుకుంది ఆర్తిగా. ‘‘రండిరా పెడతాను’’ అంటూ గుడిసెలోకి దారితీసిందామె. లోపలికెళ్ళి రెండు బొచ్చెల్లో అన్నం పెట్టి కూరలేసింది. ఇద్దరు పిల్లలు ఆ చద్దన్నాన్నే ఆవురావురంటూ తిని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పిల్లలకింత ఉడుకుడుకుగా రోజూ అన్నం కూరలు వండిపెట్టాలనుంటుంది లక్షమ్మకి. పొద్దున్నే ఆరింటికల్లా పాచిపనికెళ్ళాలి. నాలుగు గంటలకి నిద్రలేచి పొయ్యంటించి మండని కట్టెలను ఊదుకుంటూ తాను కాసిని టీనీళ్ళు పెట్టుకుతాగి వంటచేసేసరికి ఆరుదాటి పోతుంది. పనికి ఆలస్యంగా వెళితే కేకలేస్తారు ఆమె యజమానురాళ్ళు. ఆరేడిళ్ళలో అంట్లు, బట్టలు, ఇల్లు తుడవటం, వాకిలి ముగ్గేయటం, మెట్లు చిమ్మటం చేస్తుంది లక్షమ్మ. పొద్దున్నే ఆరింటికి బయలు దేరితే అందరిళ్ళల్లో పని చేసి ఇంటికొచ్చేసరికి దగ్గరదగ్గర ఒంటిగంట దాటుతుంది. దాదాపు రోజూ ఒక ఇంట్లో కాకపోతే మరో ఇంట్లో ఎవరోఒకరు అన్నం కూరలు ఆమెకు తినమని ఇస్తారు. ఆమె అక్కడ తినకుండా గిన్నెలో ఇంటికి పట్టుకొచ్చి పిల్లలకి పెట్టి మిగిలింది తను తింటుంది. పనులతో అలసిన శరీరంతో తనింటి పని చేసుకునే సరికి నాలుగౌతుంది. మళ్ళీ సాయంత్రం అంట్లు తోమడానికెళ్ళి ఇంటికొచ్చేసరికి ఏడు. ఇంత ఉడకేసి పిల్లలకు పెట్టి తాను తినేసరికి పదిదాటుతుంది. వళ్ళు హూనమై అలసిన ఆమె శరీరం ఓ కునుకు తీసి లేచేసరికి మళ్ళీ తెల్లారుతుంది.రాత్రి మిగిలిన గుప్పెడన్నాన్ని కంచాల్లో పెట్టి పిల్లలను లేపి తినమని చెప్పి పనికెళ్ళిపోతుంది. లక్ష్మమ్మ ఇద్దరు పిల్లల్లో పెద్దపిల్ల పన్నెండేళ్ళది. సరైన పోషణ లేకపోయినా ఎదిగే వయసు కాబట్టి పిల్ల ఈడేరటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లాడు తొమ్మిదేళ్ళవాడు. లక్ష్మమ్మ భర్త యాదగిరి తాపీపని చేసేవాడు. పెళ్ళాం బిడ్డలని చక్కగా చూసుకునేవాడు. నాలుగేళ్ళ క్రితం ఒకరోజు పెద్ద బిల్డింగ్‌పై పనిచేస్తూ పొరపాటున జారిపోయి కిందపడి చనిపోయాడు. అప్పటి వరకూ ఇంట్లో ఉండి గుట్టు చప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మమ్మ ఇల్లు గడవటానికి, పిల్లల్ని పోషించటానికి పాచిపని చేయటం మొదలు పెట్టింది. వీధిబడిలో చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు కొనడం కష్టమైపోతోంది ఆమెకు. ఆమెకు వచ్చే జీతం ఇంటి కిరాయి, వెచ్చాలు, పొయ్యిలోకి కట్టెలకే సరిపోక అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఏ జ్వరమో వస్తే మందుమాకో కొనాలంటే అప్పుచేయాల్సిందే. పిల్లలకు గుడ్డముక్క కొనాలన్నా భారమే లక్షమ్మకు. కూడబెట్టి దాచుకుందామనుకున్నా పదో పరకో తప్ప మిగలవు. దసరా సెలవులిచ్చారు పిల్లలకు. పండక్కి పిల్లలకు కొత్త బట్టలు కొనాలని ఆశ లక్ష్మమ్మకు.యజమానురాళ్ళు ఇచ్చిన పాతచీరలే తను కట్టుకుంటుంది. వాళ్ళ పిల్లల పాత బట్టలే లూజైనా బిగుతైనా ఆమె పిల్లలకు. భర్త బతికున్నప్పుడు ప్రతి దసరాకి పిల్లలకి కొత్తబట్టలు, లక్ష్మమ్మకు కొత్తచీర తెచ్చేవాడు. పండుగరోజున గారెలు, పాయసం వండమనేవాడు. లక్ష్మమ్మను, పిల్లలను గుడికి తీసుకెళ్ళి అట్నించటే సినిమాకు తీసుకెళ్ళేవాడు. భర్తతో పాటే అన్ని సంతోషాలు దూరమయ్యాయి లక్ష్మమ్మకు.ఆరోజు ఈదురు గాలితో కూడిన వాన బాగా పడుతోంది. లక్ష్మమ్మ ఆ వానలో పనికి వెళ్ళలేకపోయింది. గుడిసె పై కప్పునుండి రెండుమూడు చోట్ల నుండీ చినుకులు కారుతున్నాయి. కారేచోట సత్తు గిన్నెలు పెట్టి నిండగానే పారబోస్తోంది. పిల్లలిద్దరూ తడవని జాగాలో చాపేసుకు కూర్చున్నారు. రాత్రి ఉన్న బియ్యం కాస్తా వండేసింది. చాలీచాలని అన్నాన్నే తిన్నారు పిల్లలు. లక్ష్మమ్మ మంచినీళ్ళు తాగి పడుకుంది.పొద్దుటి నుండీ టీనీళ్ళు కూడా తాగక కడుపు నకనకలాడుతోంది లక్ష్మమ్మకు. పనికి పోయుంటే ఏ తల్లినన్నా అడిగి డబ్బులు తీసుకుని కాసిని బియ్యం కొనుక్కొచ్చేదే. ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ వెతికింది. ఒక డబ్బాలో కాస్త పిండి ఉంది. రెండురోజుల కిందట ఒకమ్మ చాలా రోజులైందని, నిల్వ ఉందని, బావుంటే ఉపయోగించుకోమని లేదంటే పడేయమని ఇచ్చిన పిండి అది. అది తెచ్చి జల్లించి డబ్బాలో పోసింది.ఇంత జావ కాచుకుంటే ఓ పూటైనా గడుస్తుందని. పొయ్యి రాజేసింది. కట్టెపుల్లలు సరిగా మండక వచ్చే పొగతో కళ్ళుమండుతున్నాయి లక్ష్మమ్మకు. పొయ్యి మీద ఓ గిన్నెతో నీళ్ళు పెట్టింది. పిల్లలు ఆకలితో ఆ చాపమీద పడి అలాగే నిద్ర పోతున్నారు. చిరిగిన దుప్పటొకటి కప్పింది. బాగా చలిగాలి కొడుతోంది. వాన తగ్గేట్టు లేదు. ప్చ్. ఎప్పుడు తగ్గుతుందో అనుకుంది. కాసేపటికి నెమ్మదిగా కట్టెలు అంటుకొని నీళ్ళు కాగాయి. మరుగుతున్న నీళ్ళలో పిండివేస్తూ గరిటెతో జారుడుగా తిప్పింది. కాస్తంత ఉప్పు వేసి కలిపి ఒకగ్లాసులో పోసుకొని ఊదుకుంటూ తాగసాగింది. వేడివేడిగా గొంతు జారుతుంటే ప్రాణం లేచొచ్చినట్లయ్యింది లక్ష్మమ్మకు. సరుకులన్నీ నిండుకున్నాయి. ఏ పూటకాపూట గడవటం కష్టంగా ఉంది. పనికిపోతే పచ్చడి మెతుకులన్నా దొరుకుతాయి. ముసురులా పట్టుకున్న వాన తగ్గేట్టు లేదు. ఆలోచిస్తూ తలుపుతీసి చూసింది. వర్షం ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టు విజృంభించి కురుస్తోంది. వీచిన చలిగాలికి కొంగు కప్పుకుంటూ లోపలికొచ్చింది లక్ష్మమ్మ. ఇంతలో పిల్ల లేచింది కడుపు నొప్పంటూ బయటకు వెళ్ళాలని. దుప్పటిని నెత్తినేసుకొని తలుపు తీసుకెళ్ళింది. లక్ష్మమ్మ పిల్లాడిని కూడా లేపి పొయ్యి మీద పిండి జావ పెట్టి కట్టెలను ఊదుతోంది. బయటకెళ్ళిన పిల్ల ఏడుస్తూ వచ్చింది. ఎందుకని అడిగితే లంగాకంటిన నెత్తురు మరకలను చూపించింది. హతాశురాలైపోయింది లక్ష్మమ్మ. ఒక్కక్షణం నోట మాట రాలేదామెకు.విషయం గ్రహించిన ఆమె హృదయం ద్రవించింది. వెంటనే పాత బొంతొకటి పొడిగా ఉన్న చోట పరిచింది. పిల్లకు మరొక లంగా ఇచ్చి కట్టుకోమంది. తన పాత చీరను వోణీలా చింపి పిల్లకు పైటలా వేసింది. అమాయకంగా చూస్తున్న పిల్లకు ధైర్యం చెప్పింది.డబ్బాలో ఉన్న చిన్న బెల్లం ముక్కను తీసి చప్పరించమంటూ పిల్లకిచ్చింది. గ్లాసులో జావ పోసిచ్చి తాగమంది.దేవుడా! ఏమిటీ పరిస్థితి. ఇప్పుడేం చేయాలి. బయట హోరున గాలి వర్షం. ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. తను పనికెళ్తే యజమానురాళ్ళకు విషయం చెప్పి కొంత పైకం అడగొచ్చు. బియ్యం కొనుక్కోవచ్చు. కొత్తబట్టలు కొనొచ్చు. ఈడేరిన కూతురికి పాయసం చేసి పెట్టాలి. కొబ్బరి, కొత్త బెల్లం, నువ్వులు కలిపి చిమ్మిరుండలు పెట్టాలి. ఉడుకుడుకుగా వేడన్నం పాలు పోసి పెట్టాలి. భర్త బతికుంటే ఎంత సంబరంగా వేడుక జరిపించే వాడో! అసలు దేవుడు తనలాంటి వారినెందుకు ఇన్ని కష్టాలు పెడతాడో. పిల్లల కోసమే బతుకుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటోంది తను. పేదవారినసలు పుట్టించకు దేవుడా!వానతగ్గే సూచనలేవీ కనిపించటం లేదు. అంతకంతకు ఎక్కువౌతూ కురుస్తూనే ఉంది. రోడ్లు నిండి చెరువులయ్యాయి. బయటకెళ్ళే మార్గం కనిపించటం లేదు. రోడ్లమీద నీళ్ళన్నీ పల్లంగా ఉన్న లోపల గుడిసెలోపలికి వచ్చేశాయి. కూర్చోటానికి, నించోటానికి కూడా చోటు లేకుండా పోయింది. గుడిసె లోపలున్న పొయ్యిలోని కట్టెలు నీళ్ళలో తడిశాయి. చలి ఎక్కువౌతోంది.క్రమంగా చీకటి ఆవరిస్తోంది. పెద్ద తుఫాను లక్ష్మమ్మ పూరిగుడిసెని నేలమట్టం చేయడానికి వికృతంగా తన బలాన్ని చూపుతోంది.మరింత ఉదృతమయ్యాయి వాన, గాలి. బహుశా తుపాను తీరం దాటుతోందేమో.తిండి తిప్పలు సంగతి దేవుడెరుగు! బతికితే చాలు. ఈరాత్రి గడిస్తే చాలు తెల్లారితే వర్షం తగ్గుతుంది. ఎలాగోలా తను పనికి వెళుతుంది. అమ్మగార్లనడిగి ఏదో ఒకటి కచ్చితంగా తేవొచ్చు. తను ఇంకా ఓ రెండు మూడు ఇళ్ళలో పనికి ఒప్పుకోవాలి. తప్పదు. పిల్ల ఎదిగింది. ఇలా సాగుతున్నాయి లక్ష్మమ్మ ఆలోచనలు.తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది. పిచ్చితల్లి లక్ష్మమ్మ ఆశలను నెరవేర్చనంది వికృతమైన తుపాను. కుప్పగా కూలింది ఒక్కసారిగా గుడిసె. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ జోరు వానలో, హోరు గాలిలో ఆ పిచ్చితల్లి పిల్లల హృదయ విదారకర ఆర్తనాదాలు. గుడిసె పై కప్పు ఆకులన్నీ లేచిపోయాయి. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.రెండు పసిప్రాణాలను బలి తీసుకున్న తుపాను లక్ష్మమ్మను మాత్రం జీవచ్ఛవంగా బతకమంటూ వదిలేసింది. తెల్లవారాక కొన ఊపిరితో ఉన్న లక్ష్మమ్మను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వారం రోజులకు కోలుకుంది. ఆసుపత్రిలో మగతలో నా పిల్లలేరని కలవరిస్తూనే ఉందా పిచ్చితల్లి.‘‘నా పిల్ల ఈడేరింది. ఇంత పాయసం చేయాలి. చిమ్మిరుండలు పెట్టాలి. కొత్త బట్టలు కొనాలి.’’‘‘ఏదీ వాన తగ్గిందా! ఛీ పాడు వర్షం. పనికి పోనీకుండా. రండిరా అన్నం పెడతాను.’’‘‘ఇదిగోండి ఈ మొక్కజొన్న పొత్తు తినండి.’’పిచ్చి దానిలా అంటూ ఉంటుంది. ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తుంటుంది. ఎవరైనా జాలిపడి ఏదైనా ఇస్తే తింటుంది. ఆడుకోవడానికి వెళ్ళిన తన పిల్లలొస్తారని ఎప్పుడూ ఎదురుచూస్తూ కూర్చుంటుందా పిచ్చితల్లి. హంసగీతి -
ఆరోగ్యకరమైన ఆహారంతోనే మేనికి మేలైన నిగారింపు!
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నాకెందుకో కాస్మటిక్స్ అంటే ఇష్టం ఉండదు. చర్మానికి శాశ్వతమైన మెరుపు రావాలంటే అది నేచురల్‌గానే మెరుస్తుండాలన్నది నా కోరిక. మంచి డైట్‌తోనే చర్మానికి మంచి నిగారింపు వచ్చేందుకు మార్గాలు చెప్పండి. – సుష్మా, హైదరాబాద్ మీరన్నది వాస్తవమే. కాస్మటిక్ ద్వారా వచ్చే నిగారింపు కాసేపే ఉంటుంది. అదే నేచురల్‌గానే మేనిలో మెరుపు ఉంటే దానికి మేకప్‌తో గానీ, కాస్మటిక్స్తోగాని ప్రమేయం ఉండదు. ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలతో మేనిలో స్వాభావికంగానే మెరుపు వచ్చేలా చేసుకోగలగడం సాధ్యమే. అయితే కొన్ని ఆహారాలు చర్మం మెరుపును తగ్గించేందుకు అవకాశం ఉంది. ఆ రెండు ఆహారాల వివరాలు... మేనికి మేలు చేసే ఆహారాలు ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నుపుపుగా చేసేందుకు దోహదపడతాయి. ఆహారం: ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. (డీ–టాక్సిఫై చేస్తాయి). ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. ఆహారం:వైటమిన్–బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన క్యారెట్‌తో పాటు కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను వైటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. ఆహారం: ఆపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. చర్మానికి కీడు చేసే పదార్థాలు ఆహారం: కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. కీడు: వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. కెఫిన్ ఒంట్లోని నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. ఆహారం: చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా ఉండే పానియాలు. కీడు: తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్. కీడు: ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. ఆహారం: నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. కీడు : ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. -
అమ్మాయికి నెలసరి సరిగా రావడంలేదు
హోమియో కౌన్సెలింగ్స్ మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. – పి. అనసూయ, కావలి మనలోని హార్మోన్లు అనేక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేశాక ఆమె సమస్యను నయం చేసేందుకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. మీరొకసారి మీ అమ్మాయిని అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమె సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సెబోరిక్ డర్మటైటిస్‌కు చికిత్స ఉందా? నా వయసు 46 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – ఎన్. గోపాలరావు, చీరాల చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. ►రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. ►మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. ►వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు : ►సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడం ద్వారా సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ స్పాండిలోసిస్ తగ్గుతుందా? నా వయసు 42 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఆర్. లక్ష్మణరావు, కరీంనగర్ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ►సర్వైకల్ స్పాండిలోసిస్: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ►లంబార్ స్పాండిలోసిస్: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పౌష్టికాహారంతో కేన్సర్ ముప్పు తక్కువ
పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ.. తగినంత వ్యాయామం చేస్తూ... మద్యానికి దూరంగా ఉంటే కేన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువని అంటున్నారు అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా! కొత్తేముంది అంటున్నారా? చాలానే ఉంది. 2009లో మొదలైన ఒక సర్వే ఆధారంగా తాము ఈ అంచనాలకు వచ్చినట్లు తాజా అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టోవోయిర్ చెప్పారు. నలభై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 41 వేల మంది ఆహారపు అలవాట్లను పరిశీలిస్తూ సాగింది ఈ అధ్యయనం. ఆరు నెలలకు ఒకసారి వీరు తమ ఆహారపు అలవాట్లను ఇంటర్నెట్ ద్వారా పరిశోధకులకు అందించారు. ఆ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు పోషక విలువలను లెక్కగట్టి విశ్లేషించారు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత సర్వే చేసిన వారిలో 1489 మందికి కేన్సర్ సోకినట్లు తెలిసింది. ప్రత్యేకమైన సిద్ధాంతాలను ఉపయోగించుకుని కేన్సర్ వచ్చినవారు తీసుకున్న ఆహారానికి, ఇతరుల ఆహారానికి ఉన్న తేడాలను గమనించినప్పుడు అధిక పోషకాహారం తీసుకున్న వారికి కేన్సర్ వచ్చే అవకాశం 12 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. రొమ్ము కేన్సర్ విషయంలో ఇది 14 శాతం కాగా, ప్రోస్టేట్ కేన్సర్ విషయంలో 12 శాతమని టోవోయిర్ తెలిపారు. ఈ అధ్యయనం ద్వారా మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా కేన్సర్ ముప్పును తగ్గించవచ్చునని తెలుస్తోందని వివరించారు. -
పోషకాహార విలువలపై యాప్
హైదరాబాద్: జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రి షన్ గైడ్‌లా పనిచేయనుంది. ఒక వ్యక్తి ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలో ఏయే మోతా దుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను దీని ద్వారా తెలుసుకుని, ఆయా పదార్థాలను తీసుకునే వీలుంటుం ది. పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే భారతీయులు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాలు, వాటిలో కేలరీల శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఏయే మోతాదుల్లో ఉంటాయి, అవి మన శరీరానికి ఏయే మోతాదుల్లో అవసరమనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆయా దేశాలు వారి ఆహా రపు అలవాట్లకు అనుగుణంగా ఇలాంటి న్యూట్రిషనల్ యాప్‌లను రూపొందించుకుని వినియోగిస్తున్నారు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఇప్పటి వరకు ఇలాంటి యాప్‌లు అందుబాటులో లేవు. దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాప్‌లో.... ఈ యాప్‌లో నాకు కావాల్సిన పోషకాహా రాలు (మై న్యూట్రియెంట్స్ రిక్వైర్మెంట్స్) నా భోజనంలో పోషకాలు (న్యూట్రియెంట్స్ ఇన్ మై ఫుడ్), నా డైట్.. నా యాక్టివిటీ (మై డైట్ అండ్ యాక్టివిటీ), సెర్చ్ ఫుడ్ బై న్యూట్రిషన్, సెర్చ్ ఫుడ్ బై లాంగ్వేజ్ తదితర అంశాలు ఉన్నాయి. అవస రమైన దానిపై క్లిక్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. యాప్ ఉపయోగాలు... ఈ యాప్ వల్ల మనిషి తాను తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ వయసు వారికి ఎన్ని కిలో కేలరీల ఆహారం అవసరం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ మేరకు పోషకాలు లభిస్తాయి అనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
అంగన్వాడి.. ‘పోషకం’ ఏదీ?
సాక్షి, మెదక్: అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం, నీళ్లచారునే వడ్డిస్తున్నారు. అంగన్వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడా సరఫరా అవుతున్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల సన్నబియ్యం పేరుతో సరఫరా చేస్తున్న బియ్యం వండిన తరువాత ముద్దగా మారుతోంది. పలుచోట్ల పాలు సరఫరా కావంలేదు. దీనికితోడు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు చిన్నసైజులో ఉన్న కోడిగుడ్డు అందజేస్తున్నారు. మరోవైపు కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది సరుకులను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటుంటే.. ఇంకొన్ని చోట్ల తక్కువ పరిమాణంలో సరుకులు అందచేసి లెక్కలు మాత్రం సరిగా రాయాలని అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్న దాఖ లాలు బయటపడ్డాయి. ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అంగన్వాడి కేంద్రాలను సందర్శించినపుడు పలు విషయాలు వెలుగుచూశాయి. లో‘పాల’ కాంట్రాక్టర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,730 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1,99,213 మంది పిల్లలు ఉన్నారు. వీరితోపాటు 47,696 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయాలి. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం, 16 గుడ్లు అందజేస్తున్నారు. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంతోపాటు గుడ్లు అందజేస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా బాలింతలు, గర్భి ణులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అలాగే ఒక్కొక్కరికి రోజూ ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నారు. మెనూ ప్రకారం అన్నిరకాల కూరగాయలతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో ఎక్కడా మెనూ పూర్తి స్థాయిలో అమ లు కావటం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందటంలేదు. చిన్నారుల హాజరు శాతాన్ని ఎక్కువ సంఖ్యలో చూపి అంగన్వాడి సిబ్బంది వారి పేరిట సరుకులను తీసుకుని అ మ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గర్భిణి, బాలింతలకు ప్రతి ఒక్కరికి 200 మిల్లీలీటర్ల మేరకు పాలు ఇవ్వాలి. అసలు పాలు పూర్తి స్థాయిలో చాలా తక్కువ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి. మెదక్ మండలం అవుసలపల్లిలో మూడు మాసాలుగా గర్భిణీలు, బాలింతలకు పాలు ఇవ్వటంలేదు. దీనిని బట్టి పాల పంపిణీ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఇలా... మెదక్ జిల్లాలో మొత్తం 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో 39,525 మంది పిల్లలు, 10,624 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ‘సాక్షి’ టేక్మాల్ మండలం ఎల్లంపల్లి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించింది. ఇక్కడ దొడ్డు బియ్యాన్నే వండి వార్చారు. పప్పునీళ్లతోనే పిల్లలు కడుపు నింపుకున్నారు. గుడ్లు అందచేయలేదు. అల్గాదుర్గం మండలం గొల్లకుంట అంగన్వాడి కేంద్రంలో 19 పిల్లలకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సి ఆయా కొద్దిరోజులుగా స్థానికంగా ఉండడం లేదు. దీంతో పిల్లల ఆలనాపాలనా కరువవుతోంది. పాపన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ అంగన్వాడి కేంద్రంలో ఉదయం 11 దాటినా అంగన్వాడి టీచర్ జాడలేదు.సెంటర్లో 14 మంది విద్యార్థులకు ఒక్కరే హాజరై ఆడుకుంటున్నాడు. నలుగురు గర్భిణులు ఇక్కడ పేర్లు నమోదు చేసుకోగా ఇద్దరు, నలుగురు బాలింతలకు ఇద్దరే వస్తున్నట్లు అంగన్వాడి టీచర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చా రం, కౌడిపల్లి, శివ్వంపేట, చిలప్‌చెడ్ మండలాల్లోని 60 శాతం అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు జిల్లాల్లో దొడ్డు బియ్యం.. నీళ్ల చారు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందజేయటం లేదు. కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి. అయితే దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడుతుండటంతో తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. మధ్యాహ్న భోజనంలో కూరగాయలు లేదా పప్పు వడ్డించాలి. అయితే అంగన్వాడి సిబ్బంది నీళ్లచారుతోనే సరిపెడుతున్నారు. దానిని తినలేక పిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకమైన, నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అంగన్వాడిల్లో పిల్లలు, గర్భిణులకు పోషకాహారం గగనమవుతోంది. ముఖ్యంగా మెనూ ప్రకారం రోజూ వివిధ రకాల పౌష్టికాహారాన్ని అందజేయాలి. ఎక్కడా మెనూ సరిగా అమలవుతున్న దాఖలాల్లేవు. పిల్లలు, గర్భిణి, బాలింతలకు రోజూ గుడ్డు ఇవ్వాలి. గుడ్డు 50 గ్రాములు ఉండాలి. కాంట్రాక్టర్లు చిన్న సైజు గుడ్డును సరఫరా చేస్తున్నారు. పౌల్ట్రీల్లో తక్కువ ధరకు వచ్చే చిన్నసైజు కోడిగుడ్లను కొని వాటినే అం గన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాలకు పా లు సక్రమంగా ఇవ్వటంలేదు. కాంట్రాక్టర్లు పా ల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు తేలింది. అరకొర వసతుల నడుమ.. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. అంగన్వాడీలకు సొంత భవనాలకు లేకపోవడంతో చిన్న పిల్లలు, గర్బిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వీరికి సక్రమంగా పౌష్టిక ఆహారం కూడా అందడం లేదు. అంగన్వాడీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం ‘సాక్షి’ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మూడో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించింది. ఈ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. చిన్నారుల హాజరు శాతం కూడా అంతంత మాత్రమే. హాజరు పట్టికలో ఉన్న సంఖ్యకు కేంద్రంలో ఉన్న చిన్నారుల సంఖ్యకు పొంతనేలేదు. 15 మంది విద్యార్థులకు గాను 8 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా ఇక్కడ చిన్నారులకు, గర్భిణులకు దొడ్డు బియ్యం అన్నం వడ్డిస్తున్నారు. బియ్యం నాణ్యత బాగాలేకపోవటంతో అన్నం తినేందుకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సైతం దొడ్డు బియ్యం అన్నం తినేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు మెనూ ప్రకారం కూరగాయలు, పప్పులు వడ్డించటంలేదు. రెండు మాసాలుగా పాలు ఇవ్వడంలోనూ ఇబ్బంది ఉండగా ప్రస్తుతం మాత్రం గర్భిణులకు, బాలింతలకు అందజేస్తున్నారు. అయితే కోడిగుడ్లు సరిగ్గా ఇవ్వడం లేదు. చిన్నసైజు కోడిగుడ్లనే ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే ఆహారం రుచిరకరంగా ఉండడం లేదని పిల్లలు, గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. ఈ విషయమై అంగన్వాడీ ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదను వివరణ కోరగా అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
పదేళ్లలో కేన్సర్‌ను జయిస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కేన్సర్‌పై విజయం సాధించే రోజు ఎంతో దూరం లేదని, ప్రస్తుత పరిశోధనలు పరిశీలిస్తే పదేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ పరిశోధకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం కేన్సర్ సోకితే మరణమే అనుకునే వారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ఒకట్రెండు రకాలు మినహా ఇతర కేన్సర్ల విషయంలో రోగులు 15–20 ఏళ్లు జీవిస్తున్నారని వివరించారు. కేన్సర్‌కు ఒకట్రెండు జన్యుమార్పులే కారణమని ఒకప్పుడు అనుకునేవారని, తాజా పరిస్థితులు గమనిస్తే వందకుపైగా మ్యూటేషన్స్ వ్యాధిని ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రేమ్‌కుమార్.. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య రంగంలో ఇమ్యూనోథెరపీ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని.. మందులు, ఇమ్యూనోథెరపీ కలిపి వాడితే వ్యాధిని జయించవచ్చని పేర్కొన్నారు. క్రిస్పర్, జన్యు చికిత్స విధానాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని.. కేన్సర్ సోకిందని గుర్తించే సమయానికే శరీరంలో 10 కోట్లకుపైగా కేన్సర్ కణాలు ఉంటాయని, అన్ని కణాల్లోని జన్యువులను మార్చ డం దాదాపు అసాధ్యమని చెప్పారు. పైగా జన్యు మార్పు లున్న కణాలు గుర్తించడమూ పెద్ద సమస్య అవుతుందని వివరించారు. అయితే కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా జన్యువుల్లో వచ్చే మార్పులను సరి చేసేందుకు ఈ చికిత్స ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సకు సంబంధించి పురాతనమైన పద్ధతులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని ప్రేమ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పౌష్టికాహారంతో నివారణ.. పౌష్టికాహారం కేన్సర్‌ను నయం చేయకపోవచ్చుగానీ.. నివారణకు మాత్రం మెరుగ్గా ఉపయోగపడుతుందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. కేన్సర్ చికిత్సకు అందించే ట్యాక్సాల్ ఔషధం శరీరంలో వేగంగా విభజితమవుతున్న కణాలను చంపేస్తుందని, ఈ ప్రక్రియలో కొన్ని ఆరోగ్యకర కణాలూ నాశనమవుతూంటాయని పేర్కొన్నారు. ఈ చికిత్స ఫలితంగా వెంట్రుకలు ఊడిపోతాయని.. కడుపు, పేగుల గోడలపై ఉండే పొర కణాలూ దెబ్బతింటాయని, తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోవడంతో రోగులు బలహీన పడతారని వివరించారు. కడుపు, పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా కేన్సర్‌పై ప్రభావం చూపుతాయని.. అందుకే బ్యాక్టీరియా, కేన్సర్ల మధ్య సంబంధం తెలుసుకోడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు. హోమియోపతితో పోలిస్తే ఆయుర్వేదం విస్తృతంగా అర్థం చేసుకున్న విధానమన్నారు. కొన్ని వ్యాధుల విషయంలో హోమియో పనిచేస్తుందని నమ్ముతానని చెప్పారు. ఈ రెండు విధానాలనూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
అంగన్వాడీకి కాలం చెల్లిన సరుకులు
పౌష్టికాహారం మాట దేవుడెరుగు... ఏకంగా ప్రాణాలమీదికొచ్చేలా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు... బాలింతలు... గర్భిణులకు పోషకాలు కలిగిన ఆహారం అందివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం అవసరమైన సరకులు సరఫరాకు ఓ కాంట్రాక్టర్‌ను నియమించారు. కాసులకు కక్కుర్తిపడిన ఆయన కాస్తా కాలం చెల్లిన సరకులు ఇచ్చేసి వారందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పూసపాటిరేగ(నెల్లిమర్ల): చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి వారికి తగిన విద్యాబుద్ధులు నేర్పించడానికి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరకుల్లో అవినీతి చోటు చేసుకుంటోంది. కాలం చెల్లిన సరకులు సరఫరా చేయడం, నాసిరకం పప్పు అందించడం వంటివి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కొంత కాలంగా పూసపాటిరేగ మండలంలో పలు కేంద్రాలకు కాలం చెల్లిన సరకులు, నాసిరకం పప్పులు సరఫరా చేస్తున్న విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కేంద్రాల్లో ప్రీస్కూల్ చిన్నారులు 1528 మంది, గర్భిణులు 543 మంది, బాలింతలు 441 మంది ఉన్నారు. కోనాడ గ్రామంలోని కేంద్రానికి 2016 సంవత్సరంలో తయారైన రజినీ రిఫైన్డ్ పామాయల్ సరఫరా చేశారు. అంతేకాదు. కామవరం, కనిమెల్ల, పేరాపురం గ్రామలకూ వాటినే అందించారు. వాస్తవానికి తయారైన ఆరునెలల్లోగానే సరకు వినియోగించాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా వాటిని సరఫరా చేయడం విశేషం. పేరాపురం, గొల్లపేట కేంద్రాలకు కల్తీ అయిన కందిపప్పు సరఫరా చేయడంతో వెనక్కి పంపించినట్లు కార్యకర్త చిన్నమ్మలు తెలిపారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు కూడా ఎందుకో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. తక్షణమే చర్యలు తీసుకుంటాం పూసపాటిరేగ మండలంలోని పలు కేంద్రాలకు కాలం చెల్లిన నూనెప్యాకెట్లు, కంది పప్పు సరఫరా అయినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించగా కాలం చెల్లినట్లు తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు తెలియచేస్తాను. – ఎన్.ఆరుద్ర, ఏసీడీపీఓ,భోగాపురం ఐసీడీఎస్ సెక్టారు. కాలం చెల్లిన నూనె అందించారు అంగన్వాడీ కేంద్రానికి 2016లో తయారైన నూనెప్యాకెట్ను సరఫరా చేశారు. దీనిని నిశితంగా పరిశీలించగా ఆ విషయం బయటపడింది. దీనివల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. – కె.ఎస్.కె.దుర్గ, అంగన్వాడీ కార్యకర్త, కోనాడ -
చిట్టి పొట్ట నిండుతలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశుపోషణ ఆందోళనకరంగా మారుతోంది. నవజాత శిశువుకు ఆరు నెలల వరకూ తల్లి పాలు ఇస్తుండగా.. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వాలి. చిన్నారుల ఎదుగుదలకు ఈ సమయంలో పోషణే కీలకం. కానీ రాష్ట్రంలో మెజారిటీ శాతం పిల్లలకు సరైన పోషణ అందడం లేదు. ఆరు నెలలు దాటిన చిన్నారులకు ఘనాహారం పంపిణీపై శిశు సంక్షేమ శాఖ పరిశీలన నిర్వహించగా.. పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 9.6 శాతం మంది పిల్లలు మాత్రమే ఆరు నెలలు నిండిన తర్వాత ఘనాహారం తీసుకుంటున్నట్లు ఈ పరిశీలనలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉన్నా.. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ కేంద్రాలు. వీటి పరిధిలో 23.71 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా.. వీరిలో 7.25 లక్షల మంది ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు వయసున్నవారు. ఈ క్రమంలో చిన్నారులు ఘనాహారం తీసుకునే తీరుపై ఆ శాఖ పరిశీలన చేయగా.. ఇందులో సగటున 9.6 శాతం చిన్నారులు మాత్రమే సకాలంలో ఘనాహారం తీసుకుంటు న్నట్లు వెల్లడైంది. ఆరు నెలలు దాటిన చిన్నారుల ఎదుగుదల రెండురెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా అవయవాల పెరుగుదల వేగం పుంజుకుంటుంది. దీంతో ఆరు నెలలు దాటిన తర్వాత చనుబాలతో పాటు ఉగ్గు, ఫారెక్స్లాంటి పొడితో కూడిన పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకీ వెనుకబాటు.. చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం తప్పనిసరైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువభాగం చనుబాలతోనే సరిపెడుతున్నారు. ఎక్కువ మంది చిన్నారులకు ఏడాది దాటిన తర్వాతే పోషకాహార పంపిణీ మొదలుపెడుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో పోషకాల పంపిణీపై అవగాహన లేకపోవడం కారణమైతే.. కొన్ని సందర్భాల్లో ఆర్థిక స్తోమత మరో కారణమని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పోషకాహార పంపిణీ ఆందోళనకరంగా ఉంటోందని శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోషకాహార పంపిణీ చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు నెలలు నిండిన చిన్నారులకు ఉగ్గు తదితరాలు కాకుండా సాధారణ భోజనం(మొత్తగా వండిన అన్నం), పెరుగన్నం లాంటివి మెత్తబర్చి పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే తృణధాన్యాలతో కూడిన పోషకాల పంపిణీ సంతృప్తికరంగా జరగడంలేదు. సరైన పోషకాలు అందకపోవడంతో చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అ ఆ అక్షరాలు నేర్పేదెవరు..!
♦ అంగన్వాడీ స్కూళ్లలో ఆయాలే దిక్కు ♦ జిల్లాలో 908 కేంద్రాలు 50 మంది టీచర్లు, ♦ 77 ఆయా పోస్టులు ఖాళీ ♦ పౌష్టికాహారం, ఆట పాటలకు దూరమవుతున్న చిన్నారులు ♦ తగ్గిపోతున్న పిల్లల హాజరు శాతం ♦ ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు అంగన్వాడీ స్కూళ్లను టీచర్ల కొరత వేదిస్తోంది. అక్షరాలు నేర్పేవారు లేకపోవడంతో పిల్లలకు ఆయాలే దిక్కయ్యారు. ఆట పాటలు నేర్పడంతో పాటు పౌష్టికాహారాన్ని వారే అందిస్తున్నారు. అంగన్వాడీ స్కూళ్లలో ప్లేవే విద్య బోధిస్తామని చెబుతు న్న ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా 908 అంగన్వాడీ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 50 మంది టీచర్లు, 77 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు లేని చోట ఆయాలే చిన్నారుల ఆలన పాలన చూసుకుంటున్నారు. పిల్లలకు వంట చేసి పౌష్టికాహారం అందిస్తునే పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారికి అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. 5 సంవత్సరాల వయస్సు వచ్చినా పిల్లలకు పాటలు, అక్షరాలు రావడం లేదని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ గురించి చెప్పే వారు లేకుండా పోయారు. దీంతో బాలింతలు, గర్భిణులు కేవలం పప్పు, కోడిగుడ్లు తీసుకునేందుకే కేంద్రాలకు వస్తున్నారు. ఆయాలు లేని చోట చిన్నారులకు పౌష్టికాహారం సమయానికి అందించడంలో టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతో చిన్నారులను పంపించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఫలితంగా రోజురోజుకూ హాజరు శాతం తగ్గిపోతోంది. శాయంపేట మండలం ఎస్సీ కాలనీ నాలుగో నంబర్ కేంద్రానికి చెందిన టీచర్ ఏడు సంవత్సరాల క్రితం చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆయాతోనే కొనసాగిస్తున్నారు. అదే మండల కేంద్రంలోని ఒకటి, ఎనిమిదో నంబర్ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు పదోన్నతిపై వెళ్లడంతో మూడేళ్లుగా ఆయాల సంరక్షణలోనే నడుస్తున్నాయి. ఫిర్యాదు చేసినా.. అంగన్వాడీ స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతో అక్షరాలు నేర్పడం లేదని వెంటనే పోస్టులు భర్తీ చేయాలని పలుమార్లు గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న టీచర్ల, ఆయా సిబ్బందిని నియామించాలని కోరుతున్నారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం సీడీపీఓల నుంచి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. ఖాళీల వివరాలు రాగానే కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం. త్వరలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి -
పోషకాహారానికి ధరాభారం
-కుకింగ్ చార్జీలు నామమాత్రంగా పెంచిన సర్కారు -ఈ పెంపు ఏ పాటి అంటున్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు -మధ్యాహ్న భోజనంలో అనివార్యమవుతున్న కోత -2.80 లక్షల మంది బాలలకు పస లేని తిండే గతి రాయవరం (మండపేట): పిల్లలంటే చాలు..ఎవరైనా ఎంతో ఇష్టంగా కొసరి కొసరి పెడతారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ‘ఈరోజుకు ఇంతే..సర్దుకోం’డంటూ..కోత పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయల ధరలు చూస్తే ఆకాశన్నంటుతున్నాయి. పప్పుల రేట్లు వింటే నిప్పుల్ని ముట్టుకున్నట్టవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజనానికి ఆచితూచి తాజాగా విద్యార్థికి రూ.1.35 పెంచింది. ఈ నేపథ్యంలో చేసేది లేక నీళ్ల సాంబారు, అరకొర పప్పుతో, ఆకుకూర, గుడ్డులో కోతతో చాలీ చాలని భోజనం పెడుతూ పిల్లల ఉసురు పోసుకుంటున్నామని మధ్యాహ్న భోజన పథకంనిర్వాహకులు వాపోతున్నారు. పిల్లలు ఉదయం తినే రెండు ఇడ్లీలే రూ.10 పెడితే గానీ రావడం లేదు. అలాంటిది రూ.6.48 ఇస్తే పప్పుకూర, గుడ్డుకు ఎలా సరిపోతుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇలా మధ్యాహ్న భోజనం పథకంలో పౌష్టికాహార లోపంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుపై ‘సాక్షి’ కథనం. రేట్లు రగులుతుంటే ఈ పెంపు ఏపాటి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో రోజుకు సుమారు 2.80 లక్షల మంది పిల్లలు ఈ పథకంలో భోజనం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి విద్యార్థులకు సరఫరా చేస్తుండగా, అధిక పాఠశాలల్లో మిడ్డే మీల్ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి వార్చేందుకు వంట ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి ఈ ఏడాది అదనంగా రూ.1.35 చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.18 నుంచి రూ.8.53, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5.13 నుంచి 6.48కు పెరిగినట్లైంది. పెరిగిన చెల్లింపు జూన్ నుంచే అమలులోకి వచ్చింది. అయితే పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నేపథ్యంలో ఈ పెంపు ఏపాటి అన్న విమర్శలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల నుంచి వినిపిస్తున్నాయి. సాంబారు చేయాలంటే కందిపప్పుతో పాటు చింతపండు, తాలింపుకు దినుసులు, నూనె, ఉల్లిపాయలు, టమాటాతో పాటు కూరగాయలు వేయాలి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.70, చింతపండు రూ.90, టమాటాలు రూ.30పై మాటే. ఇలా అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరలతో నాణ్యతగా వండమని ఉపాధ్యాయులు నిర్వాహకులకు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు నెల నెలా బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో అప్పుచేసి పప్పుకూడు పెట్టలేక, పెరిగిన ధరలతో అన్నీ తెచ్చి వండలేక మామూలు కూరల తయారీతో మమ అనిపిస్తున్నారు. కూరగాయలు ఏవైనా కిలో రూ.30 పైమాటే 2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. అప్పటిలో ధరలకు, నేటి ధరల మధ్య పెరుగుదల చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. 2005లో ఒక కోడిగుడ్డు రూ.3 ఉంటే నేడు రూ.4.50కి పెరిగింది. నిన్న మొన్నటి వరకూ కోడిగుడ్డు రూ.5కి అమ్మారు. కూరగాయలు కిలో రూ.10 నుంచి రూ.15 ఉండగా నేడు..ఏ కాలమైనా ప్రతి కూరగాయ కిలో రూ.30 పైమాటే. ప్రతి రోజూ విద్యార్థికి అందించాల్సిన ఆహార పరిమాణం ఆహార పదార్థాలు ప్రాథమిక యూపీ/ఉన్నత పాఠశాలలు బియ్యం 100 గ్రాములు 150 గ్రాములు పప్పులు 20 గ్రాములు 30 గ్రాములు కూరగాయలు 50 గ్రాములు 75 గ్రాములు నూనె 5 గ్రాములు 7.5 గ్రాములు కొత్త మెనూ ఇదే.. సోమవారం : గుడ్డు+సాంబారు మంగళవారం : కూరగాయలు బుధవారం : గుడ్డు+సాంబారు గురువారం : పప్పు+ఆకుకూర శుక్రవారం : గుడ్డు+సాంబారు శనివారం : పప్పు+ఆకుకూర హాస్టల్ విద్యార్థులతో సమానంగా చెల్లించాలి.. హాస్టల్ విద్యార్థులతో సమానంగా మధ్యాహ్న భోజన పథకం చార్జీలు పెంచాలి. హాస్టల్లో ఒక్కో విద్యార్థికి రూ.12 నుంచి రూ.15 చెల్లిస్తుండగా, మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక స్థాయిలో కేవలం రూ.6.18 చెల్లించడం సమంజసం కాదు. – కవి శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ బిల్లులు సకాలంలో చెల్లించాలి.. మధ్యాహ్న భోజన పథకంలో బిల్లులు సకాలంలో చెల్లించాలి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను బట్టి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు డబ్బులు కేటాయించాలి. – సీహెచ్ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ ఇబ్బందులు పడుతున్నాం.. ఒక పక్క నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు. ఏటా అరకొరగానే పెంచుతున్నారు. – వాసంశెట్టి సత్యవతి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, సూర్యారావుపేట, కాకినాడ రూరల్ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. బిల్లులు సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం చార్జీలు అరకొరగా పెంచితే ఎలా నిర్వహించాలి? చాలా ఇబ్బందులు పడుతున్నాం. – తిక్కా రమణ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, ఎంపీపీ స్కూల్, బెల్లంపూడి, పి.గన్నవరం మండలం -
అందుకే నైవేద్యానికి అంతటి రుచి!
అన్నం వండేవారు ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వండేవారు దాని రుచి చూడరు. కనీసం వాసన కూడా పీల్చరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల... దాన్ని దేవుడు స్వీకరించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది. ఇతరులకు పెట్టడం కోసం సంపాదించేవాడు దాత అని, తాను తినడం కోసమే సంపాదించేవాడు పాపాత్ముడనీ శ్రుతి పేర్కొంటోంది. తినే అన్నాన్ని బట్టే రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని చెపుతుంది ఆయుర్వేదం. అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరానికి బలం వస్తుంది. బలం వల్లే తపస్సు చేస్తున్నాం. అందుకే అన్నదానం వల్ల సర్వవస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. -
ఓట్స్ ముస్లీ
హెల్దీ ట్రీట్ కావలసినవి: ఓట్స్ – 1 కప్పు నీరు – 2 కప్పులు ఆపిల్ – 1 నిమ్మరసం – 2 టీ స్పూన్లు కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు – 1 టేబుల్ స్పూన్ పాలు – 1 కప్పు తేనె – 2 టీ స్పూన్లు తయారి: 1. రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి. 2. ఉదయాన ఆపిల్ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి. 3. తర్వాత ఇందులో కిస్మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్ వేసి కలపాలి. 4. పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. నోట్: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు. -
అంగన్వాడీల్లో.. నారాయణ మంత్రం
కార్పొరేట్ సంస్థ కోసం ఐసీడీఎస్‌ను నిర్వీర్యంచేసే కుట్ర మోడల్ అంగన్వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు ఎంపికచేసిన వర్కర్లకు నారాయణ వారితో ప్రత్యేక శిక్షణ త్వరలో పూర్తిస్థాయిలో అమలుకు సర్కారు సన్నాహాలు దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఐసీడీఎస్ ప్రాజెక్టు నిర్వీర్యం కానుందా..? మోడల్ అంగన్వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు కానున్నాయా..? చిరుద్యోగుల బతుకులు వీధిన పడనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇంగ్లిష్ బోధన అంటూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ జపం చేస్తూ.. నారాయణ మంత్రాన్ని పఠించడం పలు విమర్శలకు తావిస్తోంది. పలమనేరు: ఐసీడీఎస్‌లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై నారాయణ మం త్రం జపించబోతున్నారు. మోడల్ అంగన్వాడీ సెంటర్ల పేరిట ప్రభుత్వం జిల్లాలోని పలు ప్రాజెక్టులను ఎంపికచేసింది. అంగన్ వాడీ సెంటర్లను పూర్తిస్థాయి ఇంగ్లిష్ కాన్వెంట్లుగా మార్చే కార్యక్రమం అంటూ మభ్యపెడుతోంది. ఇందుకోసం మూడేసి అంగన్వాడీ కేంద్రాలను ఒకటిగా కలిపి మోడల్ కాన్వెంట్లుగా తయారుచేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లకు నారాయణ విద్యాసంస్థలకు చెందిన టీచర్లతో శిక్షణ ఇస్తున్నారు. పలమనేరు ఐసీడీఎస్ పరిధిలో 335 అంగన్వాడీ సెంటర్లున్నాయి. ఇందులో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 6,179 మంది ఉన్నారు. పలమనేరు మున్సిపాలిటీలో 8, మండల కేంద్రాల్లో కొన్నింటిని కలిపి మొత్తం 20 సెంటర్లను మోడల్ అంగన్వాడీలుగా ఎంపిక చేశారు. దీనికోసం ఇన్నాళ్లూ సాఫీగా కొనసాగుతున్న 20 సెంటర్లను రద్దుచేశారు. అంగన్వాడీ వర్కర్లకు ఈ మధ్యనే పలమనేరులోని నారాయణ స్కూల్లో బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ పిల్లలను 3 నుంచి 3.7 నెలల వయసు దాకా నర్సరీ, 3.8 నెలల నుంచి 4.8 నెలల దాకా ఎల్కేజీ, 4.9 నెలల నుంచి 5.8 నెలల దాకా యూకేజీగా జాబితాను తయారు చేశారు. ఈ పిల్లలకు నారాయణ పాఠశాలలో ఎదైతే సిలబస్ ఉందో అదే పుస్తకాలను పంపిణీ చేశారు. త్వరలో ఈ మోడల్ అంగన్వాడీలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎంపికచేసిన ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల ఒరిగేదేమీ లేదు మామూలుగా ఐసీడీఎస్ ద్వారా పిల్లలకు బోధన బా గానే ఉంది. ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రత్యేక సిలబ స్ను రూపొందించి తద్వారా పాఠాలు చెబుతున్నారు. బోధన కోసం బొమ్మలను కూడా ప్రభుత్వం అన్ని సెంటర్లకు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఉన్న బోధనా పరికరాలు, పుస్తకాలు వృథా కావాల్సిందే. పదో తరగతి చదువుకున్న అంగన్వాడీలు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు పదిరోజులు శిక్షణ తీసుకున్నంత మాత్రాన కార్పొరేట్ శైలిలో కాన్వెంట్ పాఠాలు చెప్పడం కుదిరేపనేనా అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థలకు అంగన్వాడీ పిల్లలకు ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 160 సెంటర్ల దాకా రద్దు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ ఏరియాల్లో అన్ని సెంటర్లు, మండలానికి రెండు కేంద్రాలను మోడల్ అంగన్వాడీలుగా మార్చారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 120 కేంద్రాలను మూడింటికి ఒకటి చొప్పున 40కి కుదించారు. 60 మండలాల్లో రెండేసి చొప్పున 120 సెంటర్లను 40కి తగ్గించారు. మొత్తం జిల్లాలో 80 అంగన్వాడీలను మోడల్ అంగన్వాడీలుగా మార్చారు. ఈ నేపథ్యంలో 160 సెంటర్లు మూతబడినట్టే. రద్దు చేసిన వర్కర్లు మోడల్ సెంటర్లలో పనిచేసేలా ఆదేశాలిచ్చారు. అంటే ఒక్కో సెంటర్లో ముగ్గురు వర్కర్లు మూడు తరగతులు బోధించాలి. -
అద్దె భవనాల్లో ఇంకెన్నాళ్లు?
► ఏళ్లుగా అద్దె భవనాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు ► మౌలిక వసతులు లేక ఇబ్బందులు ► పట్టించుకోని అధికారులు ఇల్లంతకుంట : మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాలు అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. మండలంలో 66 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 14 కేంద్రాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. 22 ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండడంతో చిన్నపాటి వర్షం కురిసినా ఊరుస్తున్నాయి. రేపాక, అనంతగిరి, వల్లంపట్ల, ఓబులాపూర్, ఇల్లంతకుంట గ్రామాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు భోజనంతోపాటు పౌష్టికాహాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్ వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మౌలిక వసతులు కరువు కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలతోపాటు మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి కేంద్రాల్లో ప్రతీరోజు వంట చేయాల్సిన పరిస్థితి తయారైంది. ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. -
లోపపోషణ పిల్లలకు పౌష్టికాహారం
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ అంగన్వాడీ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇందూరు : లోపపోషణకు గురైన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్య వంతులుగా చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు లోప పోషణకు గురైన 0–6 లోపు పిల్లలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల నుంచి ఒక్కో సూపర్వైజర్కు రాష్ట్ర ఐసీడీఎస్ డైరెక్టరేట్ అధికారులు డిసెంబర్ 23 న శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న సూపర్వైజర్లు జిల్లాలోని మిగతా సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. లోప పోషణ పిల్లలను గుర్తించడానికి అంగన్వాడీ కేంద్రాల్లో ఎత్తు కొలతలు కొలిచే చార్టులు, బరువు కొలిచే మెషిన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఐసీడీఎస్ అధికారులు సెక్టార్ సూపర్ వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. లోప పోషణ పిల్లలను గుర్తించి వారి వివరాలను ఎప్పటికప్పుడు డైరెక్టరేట్‌కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1500 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఆరేళ్లలోపు పిల్లలు 79, 275 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారు కాకుండా ప్రయివేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలను కూడా బరువు చూడాలని ఆదేశాలున్నాయి. లోప పోషణకు కారణాలు. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన ప్రతి పిల్లవాడికి గుడ్డు, పాలు, భోజనం అందించాలి. అయితే కొన్ని కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడం, అందినా ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడంతో వారు లోప పోషణతో బాధపడుతున్నారు. పుట్టినప్పుడే తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా శరీరం ఎదుగుదల ఉండదు. అలాంటి వారిని ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఇంటింటికీ తిరిగి బయట పిల్లల్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలు బరువు తీస్తారు. అతి తక్కువ, తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించిన వెంటనే మెడికల్ ఆఫీసర్ వద్దకు పంపించి వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షల అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పర్యవేక్షణతో కూడిన పౌష్టికాహారం ఫీడింగ్ ఇస్తారు. రెగ్యులర్ ఇచ్చే పౌష్టికాహారంతో, అదనంగా పౌష్టికాహారం ఇస్తూ వారానికి ఒక సారి బరువు తీసి ఎంత బరువు పెరిగారో రికార్డులో నమోదు చేస్తారు. ఒక వేళ పెరుగుదల లేకపోతే మెడికల్ ఆఫీసర్ పరీక్షించిన తరువాత అక్షయ కేంద్రానికి రిఫర్ చేస్తారు. వీరికి ప్రత్యేకంగా ఆరు నెలల వరకు ఫీడింగ్ ఇస్తారు. -
‘బాల్యం’.. చిక్కి శల్యం
- పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహారలోపం - నెలకు సగటున ఈ సమస్య బారిన 12 వేల మంది చిన్నారులు - శిశు సంక్షేమ శాఖ తాజా అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో నెలకు సగటున 12 వేల మంది చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధ పడుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. బిడ్డ జనన సమయంలో పౌష్టికత్వంలో లోపాలు, తదనంతర పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రక్రియ శిశుమరణాలకు దారితీస్తోంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ చిన్నారుల పౌష్టిక స్థితిపై ఇటీవల అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 19.48 లక్షల మంది ఉండగా, వీరిలో 15.05 లక్షల మంది సాధారణ బరు వు ఉన్నారు. 4.29 లక్షల మంది తక్కువ బరువుతో ఉన్నారు. 12,620 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. గర్భిణీ సమయం నుంచే... మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టి కాహార స్వీకరణపై దృష్టి పెట్టాలి. కానీ గ్రా మీణ ప్రాంతంలో ఈ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలపై ప్రభావం చూపుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యలక్ష్మి, బాలామృతం లాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి ఫలితాలు రావడం లేదు. ఆర్నెళ్లు దాటిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు పోషణ ఇవ్వాలి. ఉగ్గు, ఫ్యారెక్స్ తదితర పోషకాహారాన్ని మితంగా ఇవ్వాలి. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదినెలల వరకు తల్లిపాలతోనే సరిపెడు తున్నారు. కొన్నిచోట్ల ఆర్నెళ్ల తర్వాత తల్లి పాలు ఆపేసి గేదెపాలు ఇస్తున్నట్లు పరిశీలనలో తెలిసింది. ఈ ప్రక్రియ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పౌష్టిక లోపాలున్న చిన్నారుల సంఖ్య రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,620 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందులో రంగారెడ్డి జిల్లాలో 2,978 మంది, మెదక్ జిల్లాలో 2,922 మంది చిన్నారులున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఈ సంఖ్య 578గా నమోదు కావడం గమనార్హం. -
హెచ్ఐవీ బాధితులు నిరాశ చెందొద్దు
-డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ భారిన పడిన వారు జీవితమైపోయిందని భయపడవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వ్యాధి నివారణకు మంచి మందులున్నాయన్నారు. జిల్లాలోని ఎయిడ్స్ నివారణ ఒప్పంద ఉద్యోగులు, లెప్రసీ ప్రోగ్రామ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడ్స్ నివారణ స్వచ్చంధ సంస్థల సిబ్బంది ఒకరోజు వేతనాన్ని రూ.లక్ష విరాళంగా ఇస్తూ జిల్లాలోని అన్ని డివిజన్లలోని హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతి గర్భిణి తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన కాన్పు కావాలన్నారు. అప్పుడే మనం జీరో పాజిటివ్‌ను సాధించడానికి వీలవుతుందన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడటం వల్ల జీవిత కాలం పెంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేబార్ కో ఆర్డినేటర్ హేమలత, మెడికల్ ఆఫీసర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ నివారణ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, ఆరోగ్య విద్య అధికారి ఎస్ఎస్ రావు, లెప్రసీ డీపీఎంలు, నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి, ఎయిడ్స్ నివారణ కౌన్సిలర్లు దస్తగిరి, రసూల్ పాల్గొన్నారు. -
చలితిండి
వింటర్ న్యూట్రిషన్ మనం తీసుకునే ఆహారం ఆ సీజన్‌కు సరైనదేనా అని ఆలోచించి, తగిన న్యూట్రిషన్ తీసుకుంటే ఎంతో ప్రయోజనం. చలికాలంలో మన ఆహారాన్ని ఈ కిందివిధంగా ఉండేలా చూసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం టిఫిన్ ఇలా: మీరు రోజూ తీసుకునే రెగ్యులర్ టిఫిన్ స్థానంలో వేడిగా ఉండే ఓట్మీల్తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి. బాగా కూరగాయలు ఎక్కువగా ఉండేలా ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. టిఫిన్ తర్వాత : ఆ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే దానికి బదులు ఈ వింటర్లో జింజర్ టీ తాగడం అన్ని విధాలా మేలు. వీలైతే అందులో ఒకటి రెండు తులసి ఆకులు వేసుకోండి. దీనికి ఒక కారణం ఉంది. ఈ సీజన్లో చల్లగా ఉన్నందున మనం నీళ్లు తాగడం తగ్గిస్తాం. దానికి తోడు కాఫీ తాగితే మన శరీరంలో నీటి పాళ్లు మరింతగా తగ్గుతాయి. దానికి బదులు టీ తాగడం బెటర్. మధ్యాన భోజనం: పొట్టుతీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలారకాల కూరగాయలతో చేసిన కూరలతో మధ్యాహ్న భోజనం మంచిది. ఆకుకూరలతో పాటు అనేక రంగుల్లో ఉండే కాయగూరలూ ఎంతో మేలు చేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కూరల్లో అల్లం, ఉల్లి, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. చలికాలంలోనూ మేలు నిమ్మకాయ... చలికాలం కదా అని కొందరు ఈ సీజన్లో నిమ్మకాయ వాడరు. మీకు అలర్జీ కలిగించకపోతే మీ లంచ్‌లోని కూరలపై కాస్తంత నిమ్మకాయ పిండండి. ఇది రుచిని పెంచడంతో పాటు మీకు ఈ సీజన్లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక జబ్బులనుంచి కాపాడేలా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్లో నీళ్లు తాగడం తగ్గిస్తాం. అది డీ-హేడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి. సాయంత్రపు శ్నాక్స్: సాయంత్రం వేళల్లో వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. ఇక కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం కూడా మేలే. దాంతోపాటు మొలకెత్తిన ధాన్యాలు. ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి మేలు. రాత్రి భోజనం : ఈ సీజన్లో రాత్రివేళల్లో తినే భోజనం ఎంత వీలైతే అంత సింపులగా ఉండాలి. నూనె వీలైనంత తక్కువగా ఉండాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ఎంతో మేలు. రాత్రి తినే భోజనంలో ఆకుకూరల్లో పాలకూర ఉంటే బెటర్. రాత్రి పూట చపాతీలు తీసుకునేవారు నూనెలేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాంటి కూరలు తినడం మేలు. ఈ సీజన్లో వండే వంటలు ఆలివ్ నూనెతో గాని, అవిశెనూనెతో గాని వండితే... ఆరోగ్యానికి మరీ మంచిది. పాలతో గుడ్‌నైట్ బెటర్... డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. ఇది క్యాల్షియమ్‌ను ఇస్తుంది. పాలలోని ట్రిప్టొఫాన్ అనే పోషకం రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ సీజన్ కాస్త మందకొడిగా ఉంటుంది. మనకు బద్దకంగా అనిపించినా ఈ సీజన్ అంతా వ్యాయామానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ చలికాలాన్ని వృథాపోనివ్వకుండా వెంటనే వ్యాయామం మొదలుపెట్టండి. -
చెరువులో పడేసి.. కాలితో తొక్కేసి..
దౌల్తాబాద్: ఇద్దరుపిల్లల పోషణను భారంగా భావించిన ఓ తల్లి వారిని చెరువులో విసిరేసి ప్రాణం తీసింది. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్ మండలం బాలంపేటకు చెందిన హన్మమ్మ, కర్ణాటకలోని కదలాపురం గ్రామవాసి భీంషప్ప భార్యాభర్తలు. వీరికి కూతురు శిరీష(11), కుమారుడు భీంషప్ప(9) ఉన్నారు. నాలుగేళ్లుగా భర్త మతిస్థిమితం కోల్పోయి భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదు. హన్మమ్మ బాలంపేటలో కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. బతుకు భారం కావడంతో బుధవారం సాయంత్రం పిల్లల ను చెరువు వద్దకు తీసుకెళ్లి వారి నడుముకు కొంగుచుట్టి చెరువులో పడేసింది. పిల్లల అరుపులకు చుట్టుపక్కలవారు వచ్చేసరికి వారిని కాలితో తొక్కి చంపింది. తాను కూడా చెరువులో దూకడానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. -
మూసీ నీటితో మల్టీవిటమిన్ టానిక్ లు
♦ నకిలీ మందుల తయారీ గుట్టురట్టు ♦ రూ. 30 లక్షల సరుకు స్వాధీనం ♦ రెండు కంపెనీలు సీజ్ చేసిన ఎస్వోటీ పోలీసులు ఉప్పల్ : చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే మల్టీ విటమిన్స్ టానిక్‌లు, న్యూట్రిషన్స్, గ్లూకోజ్‌లను బ్రాండెడ్ల కంపెనీల పేరుతో సరిపోలేలా కొద్దిపాటి మార్పులతో ప్యాకింగ్ చేసి నకిలీ మందులను, పోషకపదార్ధాల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి రూ.30 లక్షల విలువైన నకిలీ మందులు, టానిక్లను స్వాదీనం చేసుకున్నారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన జిల్లా శ్రీరాములు, గంగాధర్‌రెడ్డి పదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి రామంతాపూర్‌లో స్థిరపడ్డారు. టీవీ కాలనీలోని మూసీ నాలా సమీపంలో రెండు ఇళ్లను అద్దెకు తీసుకొని మెడికెమ్ ల్యాబ్స్, శ్రీసాయి వర్ష న్యూట్రిషన్ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారు. బీ ఫార్మసీ పట్టభద్రుడైన శ్రీరాములు ప్రముఖ న్యూట్రిషన్ కంపెనీల పేర్లను ఒక్క అక్షరం తేడాతో లేబుల్‌లను తయారుచేస్తూ దాదాపు 30 రకాల మల్టీ విటమిన్ టానిక్‌లు, ఎనిమిది రకాల మాత్రలను మార్కెట్‌కు సరఫరా చేసేవాడు. వీరి కంపెనీలకు సం బందించి 2006 నుండి లెసైన్స్ రెన్యువల్ చేయకపోగా, గడువు తీరిన మందులపై కొత్త తేదీలను ముద్రించి విక్రయించేవారు. వీటిని ఎక్కువ కమీషన్ ఆశ చూపి ఏజెన్సీల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సహా పొరుగు రాష్ట్రాల్లో విక్రయించేవారు. వీరికి హిమాయత్‌నగర్‌లోని వెంకటనారాయణ ప్రింటింగ్ ప్రెస్‌లో మందులకు అవసరమయ్యే ప్యాకింగ్‌లు, లేబుల్లు తయారు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూసీ నీటితోనే మందుల తయారీ నిందితులు తయారుచేసే నకిలీ సిరప్, టానిక్‌లకు మూసీ సమీపంలో వేసిన బోరు నీటినే వాడుకుంటుం డటం గమనార్హం. దాడుల్లో మల్కాజిగిరి ఎస్వోటీ ఎస్సై రాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. -
సమస్యల వాడి
ఇరుకు గదుల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జిల్లాలో ఒక్క కేంద్రానిక్కూడా అన్ని వసతులు లేవు సకల సౌకర్యాలతో ‘గుర్తింపు’ సాధించేదెప్పుడో? కనిపిస్తున్న ఈ పూరి గుడిసె అంగన్వాడీ కేంద్రమంటే నమ్మండి. ఇది పెద్దమండ్యం మండలంలోని పంచాయతీ కేంద్రం సీ.గొల్లపల్లె అంగన్వాడీ కేంద్ర ం. కేంద్రం లో 6 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 20మంది, 3ఏళ్లనుంచి ఆరేళ్ల చిన్నారులు 16 మంది ఉన్నారు. వీరంతా పాఠశాల వేళకు ఇక్కడికి వస్తారు. పౌష్టికాహారం స్వీకరించాక ఇళ్లకు వెళ్తారు. అంగన్వాడీ కేంద్రాలు ఏలా ఉన్నాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం. బి.కొత్తకోట: పొరుగున ఉన్న మహరాష్ట్రలోని అంగన్వాడీ కేంద్రాలు సకల సౌకర్యాలతో కొనసాగుతూ ఐఎస్ఓ గుర్తింపు పొందాయి. సాక్షాత్తూ మన ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. మన సర్కారుకు కూడా అక్కడ తీరుతెన్నులపై నివేదిక ఇచ్చారు. ఐఎస్ఓ గుర్తింపు మాటేమో గానీ మన జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు కనీస సౌకర్యాలకు కూడా దూరమయ్యాయి. బాల్యాన్ని ఇరుకుగదుల్లో బంధించేస్తున్నాయి. ఇరుకుగా, గాలి సోకని గదుల్లో కూర్చోబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో అన్ని వసతులు కలిగినవి వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంగన్వాడీ కేంద్రంలో మూడు గదులు, మరుగుదొడ్డి, స్నానా లగది, విద్యుత్, నీటివసతి ఉండాలి. దీనికిగానూ పట్టణప్రాంతాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 అద్దెగా నిర్ణయించి చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,768 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 6నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 2,20,679 మంది, 24,018మంది బాలింతలు వస్తున్నారు. ఇందులో 1,528 కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాల్లో మారుమూల ప్రాంతాల్లోని కొన్నింటి కనీస భద్రతకూడా లేదు. ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలకు అనువైన భవనాలు ఇచ్చేందుకు యజమానులు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఇరుకు గదుల్లోనే కేంద్రాల నిర్వహణ సాగిపోతోంది. కేంద్రానికి 51మంది అధికారులు చెబుతున్న లెక్కల ప్రకా రం ప్రధాన అంగన్వాడీ కేంద్రానికి సగటున 15 నుంచి 20మంది, మినీ కేంద్రానికి 10నుంచి 15మంది ఉన్నా రు. అధికారిక లెక్కల ప్రకారం గర్భిణుల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు సగటున 51మంది ఉన్నారు. ఇంతమందిని ఇరుకు గదిలో ఉంచడం అసౌకర్యంగా మారింది. కొత్త కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణలు చేపట్టారు. 1,528 అద్దె భవనాల్లో 2015-16లో మంజూరైన 159 భవనాలను ఒక్కోదానికి రూ.9లక్షలు మంజూరు చేశారు. ఈ భవనాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు నిధులు సరిపోని పరిస్థితి. 2016-17 సంవత్సరానికి 312 భవనాలు మంజూరుచేయగా ఒక్కో భవనానికి రూ.12లక్షలు కేటాయించారు. ఈ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. పశువులపాక అసంపూర్తి భవనం మండల కేంద్రం పెద్దతిప్పసముద్రంలో ఏనిమిదేళ్ల క్రితం రూ.7లక్షల బీఆర్జీఎఫ్ నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాలుగేళ్ల క్రితమే పనులు నిలిపివేయడంతో అసంపూర్తిగా ఆగిపోయింది. దీన్ని ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పశువులపాకగా మారిపోయింది. కొందరు స్థానికులు ఇందులో పశువులు, మేకలకు షెల్టర్‌గా వాడుకుంటున్నారు. గుర్తింపు సాధిస్తాం అంగన్వాడీ కేం ద్రాలకు కలెక్టర్ నిధులు మంజూ రు చేశారు. రూ.12 లక్షల వ్యయంతో నిర్మించే భవనాలకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. పక్కా భవనం, ప్రహరీగోడ, తా గునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, మైదానం లాంటి ఆవరణం ఉంటాయి. ఇలా సంపూర్ణ సౌకర్యాలతో ఐఎస్ఓ గుర్తింపు దక్కించుకుంటాం. -ఎస్.లక్ష్మి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ, చిత్తూరు -
కురులకు పోషకాలు...
బ్యూటిప్స్ పోషకాహారం మేనికి ఆరోగ్యాన్నికి ఇస్తుంది. అలాగే ఇంట్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల కొబ్బరిపాలు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి నానబెట్టాలి. తర్వాత మెత్తని పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, అర గంట తర్వాత షాంపూతో తలంటుకోవాలి. ఇలా ప్రతి 15 రోజులకోసారి చేస్తూ ఉంటే వెంట్రుకలకు మృదుత్వంతో పాటు, సహజసిద్ధమైన రంగు వస్తుంది.బంగాళదుంప పొట్టు తీసి, సన్నటి ముక్కలుగా కట్ చేయాలి. గుజ్జుగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. విటమిన్ ఎ, బి, సి పోషకాలు జుట్టు కుదుళ్లకు అంది వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. -
ఇదండీ.. మన స్మార్ట్ అంగన్వాడీ!
ఈ ఫొటో చూశారా!.. ఆ ఏదో షాపు.. అయితే మనకేంటి అంటారా?.. అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరునుకుంటున్నట్లు అది పాన్షాపో.. చిన్న కిరాణా కొట్టో కాదు.. పేదవర్గాలకు చెందిన పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు.. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు మన పాలకులు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం. అది కూడా ఏ పల్లెలోనో లేదు.. రాష్ట్ర ఆర్థిక రాజధాని, స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న మన విశాఖ మహనగర నడిబొడ్డులోనే ఉండటం విశేషం. నగరంలోని సీతంపేట ప్రాంతంలోని మధురానగర్ చాకలిగెడ్డ అంగన్వాడీ కేంద్రం దుస్థితి ఇది. దీని పరిధిలో సుమారు 320 కుటుంబాలు ఉండగా 1258 మంది జనాభా ఉన్నారు. వీరిలో పేదవర్గాలకు చెందిన 16 మంది గర్భిణులు, ఆరుగురు బాలింతలు, 10 మంది పిల్లలకు ఈ అంగన్వాడీ కేంద్రం ద్వారా సేవలు, పౌష్టికాహారం అందాల్సి ఉంది. కేంద్రంలో ఓ కార్యకర్త, ఆయా ఉండాల్సి ఉండగా శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించే సమయంలో ఆయా, ఆమెతోపాటు నలుగురు చిన్నారులు మాత్రమే బిక్కుబిక్కుమంటూ కనిపించారు. పౌష్టికాహారం, వారికి చదువు చెప్పడం వంటివేవీ కనిపించలేదు. ఒక ఇంటి మేడ మెట్ల కింద ఇరుకైన గదిలో ఏర్పాటు చేసిన ఆ కేంద్రం పరిస్థితి చూస్తే.. అదేదో నామమాత్రంగా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ అని పాలకులు ఆర్భాటం చేస్తున్న విశాఖ నగరంలో పరిస్థితి ఏమాత్రం స్మార్ట్‌గా లేదని ఈ కేంద్రాన్ని చూసేవారెవరికైనా అర్థమవుతుంది. -
తండ్రిని హత్య చేసిన తనయుడు
పోషణ కోసం ఉంచుకున్న భూమి ఇవ్వాలని గొడవ తల, మెడపై ఇష్టారాజ్యంగా కొట్టడంతో మృతి గీసుకొండ : భూమి తనకు ఇవ్వకపోవడం తో ఉన్మాదిలా మారిన తనయుడు.. వృద్ధు డు అని కూడా చూడకుండా తండ్రిపై దాడికి దిగి హత్య చేసిన సంఘట న మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవారం ఉద యం జరిగింది. గీసుకొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారుు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన వాంకుడోతు వాల్యా(75)కు ముగ్గురు కుమారులు ఉండగా తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎనిమిది ఎకరాల భూమిని ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చిన ఆయన తాను, తన భార్య పోషణ కోసం మిగిలిన ఎకరం సాగు చేసుకుంటున్నాడు. అరుుతే, ఆ ఎకరం భూమి కూడా తనకు కావాలని రెం డో కుమారుడు నర్సింహ తరచూ వాల్యాను వేధించేవా డు. చివరకు డబ్బు చెల్లించి ఆ భూమి కొనుగోలు చేసేం దుకు నర్సింహ సిద్ధం కాగా.. పెద్దమనుషులు రూ.15లక్షలుగా ధర నిర్ణరుుంచారు. ఇందులో రూ.3లక్షలు చెల్లిం చిన నర్సింహ గడువు పూర్తరుునా మిగిలిన డబ్బు ఇవ్వలేదు. దీంతో అడ్వాన్స్ డబ్బును వాల్యా ఇచ్చేశాడు. ఇది లా ఉండగా వర్షాకాలం కావడంతో వాల్యా తన భూమిని దున్నేందుకు గురువారం సిద్ధం కాగా నర్సింహ ఆ భూ మి తనకే దక్కుతుందంటూ గొడవ పడ్డాడు. ఇదే విషయాన్ని శుక్రవారం పెద్దమనుషులతో చెప్పుకోవడానికి వాల్యా వెళ్లగా వారు లేకపోవడంతో ఉదయం 8.15 గం టలకు తిరిగి వచ్చేశాడు. దీంతో అక్కడే ఉన్న నర్సింహ ఎక్కడికి వెళ్లావంటూ వాల్యాను ప్రశ్నిస్తూ చెప్పు తీసి తల, కణత, మెడపై కొట్టడమే కాకుండా, మరో చేయితో బలంగా మోదాడు. ఈ ఘటన లో వాల్యా అక్కడికక్క డే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని మామునూరు ఏసీపీ మహేందర్ పరిశీలించగా.. మృతుడి పెద్ద కుమారుడు బాలు ఫిర్యాదు మేరకు గీసుకొండ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిగనిగల కురులకు...
బ్యూటిప్స్ కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం. శిరోజాల ఆరోగ్యాన్ని పెంపొందించే ప్యాక్స్ గురించి... గుడ్డు సొన, పెరుగు, ఆవనూనె కలిపి తలకు పట్టించాలి. గుడ్డులోని ఎ, బి12, డి, ఇ విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు కుదుళ్లను బలంగా మార్చుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడతాయి. అవకాడో గుజ్జులో నాలుగైదు చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వీటిలోని అధిక ప్రొటీన్లు, మాంసకృత్తులు తలకట్టు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతేమొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది. వెంట్రకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
పర్యవేక్షణ ఖాళీ
► ఐసీడీఎస్‌లో సూపర్వైజర్ల కొరత ► అంగన్వాడీ కేంద్రాల ప్రగతిపై ప్రభావం ► జిల్లాలో 61 పోస్టులు ఖాళీ మందమర్రి రూరల్ : గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ.. పిల్లలకు ఆటపాటలు నేర్పిస్తూ వారిలో ృసజనాత్మక శక్తిని పెంపొందించి క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు పునాది వేసే అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆయూ కేంద్రాల ప్రగతి కుంటుపడుతోంది. జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,558 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,558 మంది కార్యకర్తలు, ఆయాలు పని చేస్తున్నారు. కేంద్రాల పర్యవేక్షణకు సరిపడా సూపర్వైజర్లు లేరు. జిల్లాకు గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు 84 మంజూరు ఉండగా.. 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 పోస్టులు 81 మంజూరు ఉండగా.. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 61 పోస్టులు ఖాళీలున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో సూపర్వైజర్కు పర్యవేక్షణ కోసం 20 అంగన్వాడీ కేంద్రాలు కేటాయించాల్సి ఉండగా.. కొన్ని మండలాల్లో ఒక్కొక్కరికి 20 నుంచి 70 కేంద్రాలను కేటాయించారు. వీరు రోజుకో అంగన్వాడీ కేంద్రం చొప్పున తనిఖీ చేసి వాటి ప్రగతిని పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లాలో తగినంత మంది సూపర్వైజర్లు లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. తనిఖీలు సక్రమంగా జరగకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. 30 కేంద్రాలను ఒకే సూపర్వైజరు తనిఖీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల, అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణుల నమోదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలు తయూరు చేయూలి. అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి వివరాలను కూడా సేకరించాలి. ఎంతమంది గర్భిణులకు సంపూర్ణ భోజనం అందుతుంది, అందుకు సంబంధించిన సరుకుల వివరాలు, ఖర్చులు, మిగులు వంటి అంశాలను క్రోడికరించి ప్రగతి నివేదికలు ప్రతినెలా జిల్లా ఉన్నతాధికారులకు పంపించాలి. 30 కేంద్రాల నివేదికలు తయూరు చేయడం సూపర్వైజర్లకు భారంగా మారుతోంది. దీంతో కొన్ని మండలాల్లో సీనియర్ అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని నివేదికలు తయారు చేయూల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్థానికంగా ఉండని సూపర్వైజర్లు చాలామంది సూపర్వైజర్లు వారికి కేటాయించిన మండలంలో ఉండడం లేదు. దీంతో పర్యవేక్షణ కష్టసాధ్యమవుతోంది. సూపర్వైజర్ల పోస్టులు జోనల్‌కు సంబంధించినవి కావడంతో ఒక్క జిల్లా వారికి మరో జిల్లాలో పోస్టింగులు ఇచ్చారు. దీంతో వారు ఇక్కడికి రాలేక దూర ప్రాంతాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వారి రాకపోకలకే సమయం సరిపోతోంది. అంగన్వాడీలను ప్రటిష్టం చేసేందుకు ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకువస్తోంది. దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ బడులకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలో భాగంగా సూపర్వైజర్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం 10 నుంచి 15 సెంటర్లు మాత్రమే కే టాయిస్తే పర్యవేక్షణ సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్వైజర్ల నియామకం జిల్లా పరిధిలోనే జరగాలని, ఇక్కడి అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలకే పరీక్షలు లేకుండా పదోన్నతి కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమే నియమించాలి జిల్లాలో సూపర్వైజర్ల సంఖ్య తక్కువగా ఉన్న మాట నిజమే. ఈ పోస్టులను ప్రభుత్వమే భర్తీ చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 61 గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ అంగన్వాడీలపై పర్యవేక్షణ లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం - ఎ.వెంకటేశ్వరమ్మ, పీడీ, ఐసీడీఏస్, ఆదిలాబాద్ -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు...
ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగిది, సుగంధ ద్రవ్యాలలో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. ఈ పేరు వినగానే మనకు వెంటనే కాశ్మీర్ గుర్తుకు వస్తుంది. నిజానికి కుంకుమపువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా! అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లోనూ దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే, అన్నింటిలోకి కాశ్మీరీ కుంకుమపువ్వు నాణ్యమైనది. క్రీ.పూ. 500 సంవత్సరాలకు ముందే మన దగ్గర దీని ప్రస్తావన ఉంది. వేదకాలపు సంస్కృతిలోనూ ప్రముఖమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది. వంటకాలకు ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. ఈ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, కొద్దిగా తియ్యగా ఉంటుంది. కుంకుమపువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారుచేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారుచేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. తిండి గోల -
పోషకాహారలోపం నివారణకు సహకరించాలి
యునిసెఫ్ ప్రతినిధులతో భేటీలో స్పీకర్ కోడెల సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. పోషకాహారలోపం నివారణకు అసెంబ్లీ త గిన సహకారం అందిస్తుందన్నారు. మంగళవారం కోడెలతో యునిసెఫ్ ప్రతినిధులు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. వ్యవస్థపై ఈ సమస్య విభిన్న రూపాల్లో ప్రభావం చూపుతుందని, దీన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పౌష్టికాహారం విషయంలో మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సందర్భంగా యునిసెఫ్ ప్రతినిధులు లక్ష్మీ భవాని, ప్రోసన్సేన్ స్పీకర్‌కు సూచించారు. పౌష్టికాహారలోపంపై అంతర్జాతీయ సదస్సును విజయవాడలో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు పదోన్నతులు, విభజన విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు స్పీకర్ కోడెల హామీనిచ్చారు. -
బ్లాక్ రైస్.. భలె.. భలే!
ఆహారమే తొలి ఔషధం అంటారు. పూర్వీకులు తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా పరిరక్షించారు. ఆధునిక శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవడంతో.. ఔషధ విలువలతో కూడిన సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అయితే, విశిష్ట ఔషధ విలువలతో కూడిన దేశీ వరి వంగడాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి సాగు మళ్లీ విస్తృతమవుతోంది. అటువంటి అపురూపమైన వరి వంగడాల్లో ‘బ్లాక్ రైస్’ ఒకటి. కరువు పరిస్థితుల్లోనూ దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. బ్లాక్ రైస్ వంగడాల బియ్యం కారు నలుపులో లేదా ఊదా రంగులో ఉంటాయి. కేన్సర్‌ను నిరోధిస్తుందని దీనికి పేరు. రాజులకు ప్రియమైన ఆహారంగా దీనికి పేరు. విశ్యవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్లాక్ రైస్ వంగడాలు కనిపిస్తాయి. చైనాకు చెందిన కేన్సర్ నిపుణుడు లి పుంగ్ లియో అతని బృందం జరిపిన పరిశోధనలో ముఖ్యంగా కేన్సర్ నిరోధక పదార్థాలు బ్లాక్ రైస్‌లో మెండుగా ఉన్నాయని తేలింది. మణిపూర్ సంప్రదాయ వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వాడతారు. సామూహిక ఉత్సవాల్లో బ్లాక్ రైస్‌తో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. బ్లాక్ రైస్‌లో అనేక పోషక విలువలతోపాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌లో విటమిన్ బీ, నియాసిన్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికమని భారతీయ జీవ వనరులు, సుస్థిర సేద్యం అభివృద్ధి సంస్థ (ఐబీఎస్‌డీ) అధిపతి దీనబంధు సాహూ అంటున్నారు. మణిపూర్‌లో బ్లాక్ రైస్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ నడుం బిగించింది. బ్లాక్ రైస్ వంగడం కరవు పరిస్థితులను తట్టుకొని పెరుగుతుందని మణిపూర్‌కు చెందిన అభ్యుదయ రైతు పోత్సగంభం దేవకాంత అంటున్నారు. వందకు పైగా సంప్రదాయ వంగడాలను ఆయన సాగు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో మణిపూర్, అసోం, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ అక్కడక్కడా ప్రకృతి వ్యవసాయదారులు రెడ్ రైస్‌ను సాగు చేయనారంభించారు. సేంద్రియ బ్లాక్ రైస్‌కు విదేశాల్లో మంచి ధర (కిలో రూ. 300) లభిస్తుండటంతో అసోం ప్రభుత్వం సేంద్రియ బ్లాక్ రైస్ సాగును విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది. గొల్పారా జిల్లా అముగురిపారాలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాలతో బ్లాక్‌రైస్‌ను ఇప్పటికే సాగు చేస్తున్నారు. బ్లాక్‌రైస్ సాగును పెంచేందుకు బెంగాల్ వ్యవసాయ శాఖ కూడా సన్నద్ధమవుతోంది. బ్లాక్‌రైస్‌లో అధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కేన్సర్‌పై చాలా సమర్థవంతంగా పోరాడతాయని ఫులియాకు చెందిన వ్యవసాయ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకుడు అనుపమ్ పాల్ చెప్పారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ నాలుగు నెలల పంట రెండేళ్ల నుంచి బ్లాక్ రైస్‌ను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తోంది. పంటకాలం 4 నెలలు. నేను విన్నదాన్ని బట్టి.. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేయడం, కేన్సర్‌ను నిరోధించడం ఈ బియ్యం ప్రత్యేకత. మణిపూర్ నుంచి ఈ ఏడాది 3 బ్లాక్ రైస్ వంగడాల విత్తనాలు తెప్పించాను. వీటిల్లో సుగంధాన్నిచ్చే బ్లాక్ రైస్ కూడా ఒకటి. రెడ్ రైస్ (నవర)ను కూడా ఎకరంలో సాగు చేస్తున్నాను. - రాంమోహన్‌రెడ్డి (98667 60498), పెనుబల్లి, బుచ్చిరెడ్డిపాలెం మం, నెల్లూరు జిల్లా -
నురుగు కాదు.. మురుగు
►‘అంగన్వాడీ’లకు దుర్వాసనతో కూడిన పాల సరఫరా ►విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్యం ►యంత్రాలు పాడయ్యూయంటూ సమాధానం ►లబ్ధిదారులకు సర్దిచెప్పలేక కార్యకర్తల సతమతం హన్మకొండ చౌరస్తా : విజయ డెరుురీ అధికారుల నిర్లక్ష్యం... అంగన్వాడీ కేంద్రాల ద్వారా ‘ఆరోగ్యలక్ష్మి’పథకం కింద పౌష్టికాహారం పొం దే లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ని ర్వహిస్తున్న ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం డెయిరీ అధికారుల తీరుతో అబాసుపాలవుతుంది. పథకం ప్రారంభం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇటు అంగన్వాడీ కార్యకర్తలు, అటు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పౌష్టికాహారం కోసం ‘ఆరోగ్యలక్ష్మి’ శిశు సంక్షేమం, మహిళాభివృద్ద్ధి శాఖ ఆధ్వర్యాన జిల్లాలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 4,196 మెయిన్, 327 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, ఐదేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గత ఏడాది జనవరి 1న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా సెంటర్లలోనే 200 ఎంఎల్ పాలు, ఒక గుడ్డు, పప్పు, కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందజేయూలి. ఈ మేరకు గుడ్ల సరఫరాను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. పాల సరఫరా మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి అప్పగించింది. పథకం ప్రారంభంలో కొద్దిరోజులు అంగన్వాడీ సెంటర్లను గుర్తించడంలో జాప్యం కారణంగా పాల సరఫరా ఆలస్యం కాగా, సెంటర్ల గుర్తింపు తర్వాత పాల నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆది నుంచి డెయిరీ అధికారుల తీరు పట్ల ఐసీడీఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నా రు. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నాణ్యమైన పాల సరఫరా కలగానే మిగిలిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10వేల లీటర్ల పైనే.. హన్మకొండ అలంకార్ సమీపంలోని విజయ డెయిరీ ద్వారా ప్రతిరోజు సుమారు 30 వేల లీ టర్ల పైచిలుకు పాలు జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తారు. ఇందులో పది నుంచి 12వేల లీటర్ల వరకు అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తారు. అయితే ఇటీవల పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో డెయిరీ మిషనరీ సామర్థ్యం సరిపోక పాల శీతలీకరణ, శుద్ధి ఆలస్యమవుతోందని డెయిరీ సిబ్బంది వాపోతున్నారు. అ రుుతే, పాలు ఎక్కువగా వస్తే మిగిలినవి హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడి యంత్రాల సామర్థం సరిపోక డెరుురీ అధికారుల నిర్లక్ష్యంతో పాల శీతలీకరణ జరగపోగా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మిగిలిన పాలు హైదరాబాద్ వెళ్లడం లేదు. దీంతో ఈ రోజు మిగిలిన పాలను.. ఆ తర్వాత రోజు ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తుండడంతో దుర్వాసన వస్తోందని సమాచారం. తాజాగా.. రాయపర్తి : జిల్లావ్యాప్తంగా అత్యధికంగా అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సరఫరా చేసిన పాలు దుర్వాసన వచ్చాయని బాధ్యులు వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ప్రాజెక్టుల పరిధిలో ఈ మేరకు పలు ఫిర్యాదులు వచ్చారుు. రాయపర్తిలో నాలుగు అంగన్వాడీ కేం ద్రాలు ఉండగా.. నాలుగింటికి సరఫరా చేసిన పాలు వేడి చేయగానే పగిలి పోవడమే కాకుండా దుర్వాసన వచ్చిందని కార్యకర్తలు.. సూపర్వైజర్లు, సీడీపీవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విజయ డెయిరీ అధికారులను ప్రశ్నిస్తే సమాధా నం కరువైందని పేర్కొన్నారు. అంతే కాకుండా రాయపర్తిలోని కేంద్రాలకు గడి చిన జనవరిలో పదిహేను రోజుల పాటు పాలు సరఫరా చేయలేదని చెప్పారు. ఇక వారం నుంచి సరఫరా చేస్తున్న పాలలో నాణ్యత లేకపోవడంతో కాగబెట్టగానే పగిలిపోతున్నాయని తెలిపారు. ఇలా జరుగుతుండడంతో లబ్ధిదారులు తమను తప్పు పడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. పీడీ దృష్టికి తీసుకెళ్లాం ఘన్పూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లకు పాడైన పాలు పోసింది వాస్తవమే. నేనే స్వయంగా చూశాను. ఈ విషయాన్ని పీడీకి తెలియజేస్తే ఈరోజు జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్ల పరిస్థితి ఇలానే ఉందన్నారు. అందుకే పాలు తీసుకున్నట్లు ఇండెంట్లో రాయకండని సూచించారు. విజయ డెరుురీలో మిషన్ పాడైందని గత నెలలో ఆరు రోజులు పాలు సరఫరానే చేయలేదు. - జయంతి, సీడీపీఓ, స్టేషన్ ఘన్పూర్ రేపు పాలు పంపించొద్దని చెప్పా.. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లకు పాడైన పాలు సరఫరా అయినట్లు నాకు ఫిర్యాదులు అందాయి. మిషనరీ సమస్యతో ఐస్ తయారుకాక ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే పాలు పాడవుతున్నాయి. అరుుతే, కొత్త యంత్రాలు వచ్చినా కనెక్షన్ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి నిపుణులు రావాల్సి ఉంది. ఆ యంత్రాల బిగింపు పూర్తరుుతే సమస్యలు తలెత్తవు. ఈమేరకు అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం పాలు సరఫరా చేయొద్దని సిబ్బందికి చెప్పా. - వెంకట్‌రెడ్డి, ఇన్చార్జి డీడీ, విజయ డెయిరీ, వరంగల్ -
వస్తాదులు ముస్తాబవుతున్నారు...
మగాడంటే... ఒకప్పుడు వస్తాదులా ఉండాలి. మరిప్పుడో..! ముస్తాబై ఉండాలి. ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు... వారు వీరవుతారని... వీరు వారవుతారని... ఆయన ఏం ఊహించుకుని అన్నారో తెలీదు గానీ, అందచందాల విషయంలో మాత్రం మగాళ్లు ఇప్పుడు శ్రద్ధ పెంచుతున్నారు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ‘వారేవా... ఏమి ఫేసు... అచ్చం హీరోలా ఉంది బాసూ’ అనేలా తయారవుతున్నారు. సౌందర్య పోషణ ఆడాళ్లకే పరిమితమా..? మగాళ్లకు మాత్రం ఉండొద్దూ..? పౌడర్లు, క్రీములు వగైరాలన్నీ ఆడాళ్లకే ప్రత్యేకమా..? మగాళ్లకు అక్కర్లేదూ..? ఇంకెన్నాళ్లు ఈ వివక్ష..? అని ప్రశ్నిస్తున్నారు మగమహారాజులు. ప్రశ్నించే మగపుంగవుల ఆక్రోశాన్నీ, ఆవేదనను అర్థం చేసుకున్న మార్కెట్ శక్తులు... ఇదిగిదిగో... మీ కోసం మేమున్నాం... మరేం ఫర్వాలేదు అంటూ ముందుకొస్తున్నాయి. ‘మగాళ్లకు మాత్రమే’ పౌడర్లు, క్రీములు వగైరా ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సహజంగానే కళాపోషకులైన పురుషపుంగవులు సదరు ఉత్పత్తులను సాదరంగా సొంతం చేసుకుంటున్నారు. మేని మెరుపుల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా తమ సౌందర్య పిపాసను చాటుకుంటున్నారు. సౌందర్య పోషణలో కొన్నేళ్లుగా పురుష ‘ప్రపంచ దృక్పథం’ మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోనే కాదు, మన దేశంలో కూడా. పైగా, మన దేశంలో ధవళకాంతులతో అలరారే మేనిఛాయకే అగ్రతాంబూలం. సూటిగా చెప్పాలంటే, మనోళ్లకు తెల్లతోలుపై మోజెక్కువ. సౌందర్య పోషక ఉత్పత్తులను తయారు చేసే బడా కార్పొరేట్ సంస్థలన్నీ, ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తులతో మన మగమహారాజులను ఊరిస్తున్నాయి. ఇదే అదనుగా మహానగరాలు మొదలుకొని చిన్న చిన్న పట్టణాల్లో సైతం సందు సందునా మెన్స్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలు వెలుస్తున్నాయి. మెన్స్ పార్లర్లు, సెలూన్లలో వినియోగించే క్రీములు, పౌడర్లు, బ్లీచింగ్ ప్రక్రియల వల్ల మేనిఛాయ తాత్కాలికంగా మెరుగుపడినా, ఆ తర్వాత వాటి దుష్ర్పభావాల ఫలితంగా చర్మంపై నల్లని పొరలా ఏర్పడటం, మొటిమలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు పడే పురుష పుంగవులు ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే ఏమవుతుందో తెలియని భయంతో కుంగిపోతుండటం కూడా మామూలే. చర్మతత్వానికి తగిన మేలిరకం సౌందర్య పోషక ఉత్పత్తులను వినియోగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో మగ మహారాజులు సోగ్గాళ్లలా వెలిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా పురుషుల చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే రకరకాల సమస్యలు, వాటి నివారణ మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే... ఖతర్నాక్ కాలుష్యం వృత్తి, ఉద్యోగాల కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలపై గంటల తరబడి ఎండనపడి తిరగడం చాలామందికి అనివార్యం. భవన నిర్మాణ పనుల్లో సిమెంటు, ధూళి సోకే పరిసరాల్లో గంటల తరబడి గడపడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం కాలుష్యంబారిన పడేవారికి పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ (పీఎంఎల్‌ఈ) ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ర్యాషెస్ ‘సన్‌బర్న్’ అంత తీవ్రమైన సమస్య కాకపోయినా, నిరంతరం చర్మంపై దురదపెడుతూ ఇబ్బంది కలిగించే సమస్యే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత బట్టి పైపూతగా వాడే కార్టికో స్టిరాయిడ్ క్రీములు లేదా నోటి ద్వారా తీసుకునే కార్టికో స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనుకుంటే, నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. గంటల తరబడి ఎండలో ఉండకుండా, వీలైనంత వరకు నీడ పట్టున ఉండేలా చూసుకోవాలి. ముందస్తు ముదిమి వయసు మళ్లడం మొదలయ్యాక చర్మం వదులై, ముఖంపై ముడతలు పడటం ఎవరికైనా సహజమే. కొందరిలో మాత్రం ముప్పయిలు దాటకుండానే ముదిమి లక్షణాలు మొదలవుతాయి. చర్మంలో ఒకదానినొకటి బిగుతుగా అంటిపెట్టుకుని ఉండే కణజాలం బలహీనపడుతూ ఉంటుంది. ఫలితంగా చర్మం వదులై, ముఖాన ముడుతలు దేరి ముసలాళ్లలా కనిపిస్తారు. దీనినే ‘ప్రీమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే, ఈ సమస్యను ముందస్తు ముదిమి అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తీక్షణమైన ఎండకు దూరంగా ఉండాలి. సన్‌బాతింగ్ వంటి చర్యలు ఇలాంటి వారికి అసలు పనికిరావు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సి ఉంటుంది. గంటల తరబడి ఎండలో గడపడం తప్పనిసరి అయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్బు బదులు మాయిశ్చరైజింగ్ బాడీవాష్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. చర్మం బిగుతు సడలకుండా ఉండేందుకు వ్యాయామాలు, మసాజ్‌లు కొంతవరకు దోహదపడతాయి. ఈ సమస్యకు ‘నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ’ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వర్ణం చర్మాంతర్యామి పుట్టుకతోనే చర్మానికి రంగు వస్తుంది. దానినెవరూ మార్చలేరు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో అసహజమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి ముఖంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా ఉంటాయి. చర్మానికి గాఢమైన రంగునిచ్చే మెననోసైట్స్ ఒకేచోట ఎక్కువగా పోగుపడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని ‘మెలాస్మా’ అంటారు. ఇక కొందరికి నుదురు, మెడ, బాహుమూలలు, మర్మాయవాల వద్ద చర్మం చాలా నల్లగా మారడమే కాకుండా, దళసరిగా మారుతుంది. ఈ పరిస్థితిని ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. దీనిని డయాబెటిస్‌కు ముందస్తు సూచనగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి అసహజమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి చర్మం జిడ్డుగాను, మరికొందరి చర్మం పొడిగాను ఉంటుంది. చర్మం అడుగున ఉత్పత్తయ్యే ‘సీబమ్’ హెచ్చుతగ్గుల కారణంగానే ఇలా జరుగుతుంది. కొందరిలో ముఖంపై జుట్టు మరీ దట్టంగా పెరుగుతుంది. గడ్డం దాదాపు కళ్ల దిగువ వరకు ముఖమంతా కప్పేసినట్లు పెరిగితే చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నిపుణులను సంప్రదిస్తే, లేజర్ చికిత్స ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుతారు. కొందరిలో కనుబొమలు బాగా పల్చబడిపోవడం లేదా పూర్తిగా లేకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కూడా ఇప్పుడు తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ నీడలో నీటుగాళ్లు ఎండ కన్నెరుగకుండా ఎంతసేపూ నీడపట్టున ఆఫీసుల్లో, ఇళ్లలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీ తెరలకు అతుక్కుపోయి బతికేసే నీటుగాళ్లకు కూడా రకరకాల చర్మ సమస్యలు తప్పవు. గంటల తరబడి ఎండలో గడిపే వాళ్లకు అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎలాంటి హాని జరుగుతుందో, నిత్యం డెస్క్‌టాప్, లాప్టాప్, టాబ్లెట్లు, సెల్ఫోన్లతో బిజీబిజీగా గడిపేసే ఐటీ, బీపీవో ఉద్యోగులకు కూడా అలాంటి దుష్ర్పభావాలే కలుగుతాయి. వారు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. పైగా, నీరెండ అయినా సోకకుండా బతికేయడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకలు కూడా బలహీనపడతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మంచి సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, తరచు ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టీనేజీ కుర్రకారు అందచందాలపై తాపత్రయం టీనేజ్లోనే మొదలవుతుంది. టీనేజ్ కుర్రాళ్లు గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. అమ్మాయిల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. తమ అభిమాన కథానాయకుల తరహాలో తయారయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. టీవీ, పేపర్లలో కనిపించే ప్రతి యాడ్‌లోని ఉత్పత్తినీ వెంటనే కొనేసి, ముఖాలకు పూసుకుంటూ ఉంటారు. ఇక స్ప్రేలు, సెంట్లు సరేసరి. కుర్రకారులోని ఈ ప్రయోగశీలత ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాంటి పదార్థాలతో తయారు చేశారో, నాణ్యత ఏమిటో తెలుసుకోకుండా హానికరమైన క్రీములు వాడేస్తే, ముఖవర్చస్సు దెబ్బతిని, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, యాడ్స్ మాయాజాలంలో కొట్టుకుపోకుండా, వైద్యుల సలహాపై తమ చర్మం తీరుకు సరిపడే ఉత్పత్తులనే వాడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, తగిన వ్యాయామం చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవచ్చు -
4వేల ఆధునిక అంగన్వాడీలు
వేదాంత గ్రూప్‌తో కేంద్రం ఒప్పందం న్యూఢిల్లీ: రూ.400 కోట్లతో దేశంలోని 4 వేల అంగన్వాడీల ఆధునీకరణకు వేదాంత గ్రూప్, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్‌కుమార్, వేదాంత అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మయాంక్ అషార్ సోమవారం దీనిపై సంతకాలు చేశారు.బాలలకు విద్య, పౌష్టికాహారం, మహిళలకు వృత్తినైపుణ్యాలు కల్పించడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని రాజేశ్‌కుమార్ చెప్పారు. కేవలం పౌష్టికాహారం అందించడానికే కాకుండా గ్రామాల్లో వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేయడం, సమాజాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం అయ్యేలా శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు అంగన్వాడీలను ఈ ప్రాజెక్టు కింద ఆధునికీకరించనున్నారు. -
ధరల అదుపులో కేంద్రం విఫలం
బృందాకారత్ సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జాతీయనాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ విమర్శించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందని, మహిళలకు పౌష్టికాహారం లభించక రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పది వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. పోడుభూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, హైమావతి, ఇందిర, అరుణజ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్గొట్టారు!
వారానికి ఒకరోజుతోనే సరి.. కొన్నిచోట్ల అరటిపండే దిక్కు అక్కడక్కడా శ్రావణమాసం పేరుతో ఎగవేత పట్టించుకోని అధికారులు గవర్నర్ ఆదేశించినా ఫలితం శూన్యం పాలమూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, వారి ఆకలి తీర్చేందుకు పౌష్టికాహారం అందించేందుకు, సామాజిక అసమానతలను తగ్గించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. బిల్లులు సకాలంలో అందించకపోవడం, పర్యవేక్షణ లేని కారణంగా ఏ పాఠశాలలోనూ మెనూ సక్రమంగా పాటించడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి రెండు రోజులు (సోమ, గురు) గుడ్డు ఇవ్వాలని నిర్ణయించినా బిల్లులు రాలేదనే సాకుతో చాలా పాఠశాలల్లో గుడ్డు వడ్డించడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం గురువారం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వాలి, కానీ, గురువారం జిల్లాలోని అనేక పాఠశాలల్లో గుడ్డు ఇవ్వలేదు. ఈ విషయం ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో వెల్లడైంది. జిల్లావ్యాప్తంగా ఇది పరిస్థితి..: జిల్లా వ్యాప్తంగా 2,672 ప్రాథమిక పాఠశాలల్లో 2,52,850 మంది విద్యార్థులు, 579 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,24,613 మంది, 586 ఉన్నత పాఠశాలల్లో 68,822 మంది ఉన్నారు. మొత్తం 3,837 పాఠశాలల్లో 4,46,285 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35 పైసలు, 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.38 చొప్పున ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించక పోవడం వల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అమలు కాని మెనూ.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సోమవారం గుడ్డు, సాంబార్‌తో భోజనం, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, ఆకుకూరలు, గురువారం గుడ్డు, సాంబర్, శుక్రవారం కూరగాయలు, శనివారం పప్పు ఆకుకూరలు పెట్టాలని ప్రభుత్వం మెనూ నిర్ణయించింది. కానీ ధరలు పెరిగిన సాకుతో చాలా పాఠశాలల్లో మెనూ అమలు చేయడం లేదు. చాలా పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం లేదు. శ్రావణమాసం విద్యార్థులు తినడం లేదని కొన్ని పాఠశాలల్లో సాకులు చెబుతుండగా, విద్యార్థులు మాత్రం తమకు ఒక్కరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారని, కొన్ని పాఠశాలల్లో అసలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. మూడు నెలలుగా అందని బిల్లులు.. మధ్యాహ్న బోజనం వండి పెట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చింది. విద్యార్థులకు సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 1 నుంచి 5మంది కార్మికుల వరకు పనిచేస్తున్నారు. వారికి ప్రతి నెలా ’వెయ్యి చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండగా సరకులు, కూరగాయల కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెట్టేందుకు నిర్హాహకులకు ప్రత్యేకంగా బిల్లులిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో విద్యార్థులకు వండిపెట్టడం గిట్టుబాటు కావడం లేదని మహిళలు మహిళలు వాపోతున్నారు. బిల్లులు మూడు నెలలుగా ఇవ్వలేదని వంట ఏజేన్సీల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు నెలా నెలా ఇవ్వాల్సిన వేతనం ’వెయ్యి కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం కోసం ట్రెజరీలో రూ.12.74కోట్లు అందుబాటులో ఉన్నా ఎంఈఓల నిర్లక్ష్యం కారణంగా చాలా పాఠశాలలకు అందడం లేదు. ఒక్కరోజు గుడ్డు ఖర్చు రూ.13లక్షలు.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 4,46,285 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. మెనూలో ఒక్కరోజు గుడ్డు విద్యార్థులకు ఇస్తే గుడ్డు ధర సరాసరి రూ.3 చొప్పున వేసుకున్నా ప్రతి రోజు విద్యార్థుల సంఖ్య ప్రకారం రూ.13,38,855 ఖర్చు అవుతుంది. ఒక్కరోజు విద్యార్థులకు గుడ్డు ఇవ్వకుంటే ఇంతేమొత్తంలో మిగులుతుంది. ఇలా వారానికి ఒకరోజు గుడ్డు ఇవ్వకుండా ఉంటే నెలలో రూ.1.07కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్లే. -
ఆ భోజనం మాకొద్దు
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన క్షీరభాగ్యతో పాటు మధ్యాహ్న భోజన పధకాన్ని లక్షలాది మంది చిన్నారులు వద్దంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2.67లక్షల మంది భోజనాన్ని వద్దనుకుంటే, మరో 2.46లక్షల మంది క్షీరభాగ్య పథకానికి దూరంగా ఉంటున్నారు. ఇవి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడవుతున్న అంశాలు. బెంగళూరు: రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి పాఠశాలలతోపాటు మదరసాల్లో సైతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,582 పాఠశాలలుండగా, వీటిలో మొత్తం 64.74లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో గత ఏడాది 62.07లక్షల మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటే, 61.28 లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యలో భాగంగా అందజేసే పాలను తీసుకున్నారు. అంటే పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల్లో 2.67లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి, 2.46లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యకు దూరంగా ఉండిపోయారు. వీరంతా కావాలనే మధ్యాహ్నభోజనాన్ని, క్షీరభాగ్యలో ఇచ్చే పాలను వద్దనుకుంటున్నారని అధికారులే చెబుతున్నారు. కారణాలివే: విద్యార్థులు తమంతట తామే మ ధ్యాహ్న భోజ నాన్ని, క్షీరభాగ్య పథకాన్ని వద్దనుకోవడానికి కొన్ని కారణాలను అధికారులు అన్వేషించారు. ప్రస్తుతం క్షీరభాగ్య పథకంలో పాలను పాల పొడిని కలపడం ద్వారా వి ద్యార్థులకు అందజేస్తున్నారు. 18 గ్రాముల పాలపొడిని నీటిలో కలపడం ద్వారా 150 మిల్లీలీటర్ల పాలను తయారు చేసి ఒక్కో విద్యార్థికి వారంలో మూడు రోజుల పాటు అందజేస్తున్నారు. అయితే పాలపొడి ద్వారా తయారుచేసిన పాలను తాగడం ద్వారా ఆడపిల్లలు లావుగా తయారవుతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. తమ ఆడపిల్లలు ఊబకాయం బారిన పడతారనే ఉద్దేశంతోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షీరభాగ్యకు దూరంగా ఉంచుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట మధ్యాహ్న భోజనాన్ని తీసుకున్న చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మ ధ్యా హ్న భోజనానికి దూరంగా ఉంచుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే భోజనంలో నాణ్యత లేదని, ఆ భోజనం తయారీలో ఉపయోగించే సరుకులు నాసిరకమైనవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల లక్షల సంఖ్యలో చిన్నారులు మ ధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటున్నారని అక్షర దాసోహ అధికారులు చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించలేదు పాఠశాలల్లోని విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య పథకాల్లో భాగస్వాములను చేసేందుకు అక్షర దాసోహ అధికారులు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు అక్షర దా సోహ అధికారులు ఇంటింటికీ వెళ్లి జాగృతి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అం దువల్ల వచ్చే విద్యా ఏడాది మధ్యాహ్న భోజ నం, క్షీరభాగ్యలో భాగస్వాములయ్యే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అధ్వానం
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ఆకలి కేకలు తప్పడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు అన్నీ సక్రమంగా అందిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే కుదరడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సాక్షి కడప : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఆకలికేకలు పెడుతున్నారు. సక్రమంగా భోజనం, పౌష్టికాహారం అందించలేని దుస్థితిలో పలు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నా అడిగేవారు లేకపోగా.. ఉన్నతాధికారులకు చెప్పడం ఎందుకులే అని కొంతమంది అంగన్వాడీ వర్కర్లు మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా....అధికారులు చూడకపోయినా తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం చిన్నారులే. సింహాద్రిపురం మండలంలో అందని భోజనం పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలలో చదువుకుంటున్న చిన్నారులకు భోజనం అందడం లేదు. కందిబేడలు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మండలంలోని దాదాపు 10 గ్రామాల్లో చిన్నారులకు భోజనం కరువైంది. అందులోను ఈసారి కందిబేడలు కొన్ని మాత్రమే రావడంతో అందరికీ సర్దినట్లు పలువురు వర్కర్లు చెబుతున్నారు. మైదుకూరు ప్రాంతంలో కూడా పదుల సంఖ్యలో అంగన్వాడీ సెంటర్లలో అటు చిన్నారులకు, ఇటు గర్భవతులకు కూడా భోజనం కరువైంది. పాలు..గుడ్లు అంతంత మాత్రం జిల్లాలో సుమారు 15 అంగన్వాడీ ప్రాజెక్టులుండగా.. వాటి పరిధిలో 3621 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. ప్రతిరోజు చిన్నారులకు పౌష్టికాహారంలో భాగంగా 15 గ్రాముల శనగలతోపాటు పాలు, గుడ్లు అందివ్వాల్సి ఉంది. అయితే, పులివెందులలో నాలుగు రోజుల క్రితం గుడ్లు సరఫరా చేశారు. అంతకుముందు అసలే లేదు. పాలు కూడా సక్రమంగా రావడం లేదని పేర్కొంటున్నారు. మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలలో నెలల తరబడి గుడ్లు, పాలు ఇవ్వడం లేదు. దాదాపు రెండు నెలలుగా శనగలు కూడా ఇవ్వడం లేదని పలువురు చిన్నారులు చెబుతున్నారు. బద్వేలులో కూడా నాలుగు నెలలుగా శనగల ఊసే లేదు. ప్రొద్దుటూరులో కూడా పాలు, శనగలు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. రైల్వేకోడూరులో కూడా దాదాపు మూడు నెలలుగా గుడ్లు అందజేయలేదు. పాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. వడియాలకు మంగళం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బాల బడి వడియాలకు ప్రభుత్వం మంగళం పాడింది. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ నోరూరించిన వడియాలు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు రావడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వడియాల స్థానంలో ఒక్కో చిన్నారికి 15 గ్రాముల శనగలు అందించాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా శనగలు కూడా విద్యార్థులకు సక్రమంగా అందించడం లేదు. ఎక్కడ చూసినా శనగలు అందలేదని చిన్నారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉందని స్పష్టమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఐసీడీఎస్ పీడీ రాఘవరావు ఏమంటున్నారంటే.... జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో కందిబేడలు, ఇతర నిత్యావసర సరుకుల సమస్యతో చిన్నారులకు భోజనం అందడంలేదని ‘సాక్షి’ పీడీ రాఘవరావు దృష్టికి తీసుకెళ్లగా అలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. అన్నిచోట్ల అవసరమైన సరుకులు ఉన్నాయని, ఎక్కడా కూడా చిన్నారులకు సమస్య రాలేదని వివరించారు. ‘ఇక్కడ కనిపిస్తున్నది వనిపెంట అంగన్వాడీ కేంద్రం. ఇందులో పిల్లలు 30మందికి పైగా ఉన్నారు. అయితే పిల్లలు, గర్భవతులు, బాలింతలకు భోజనం అందించే పరిస్థితి లేదు. కారణం అవసరమైన సరుకులు రాకపోవడమే. ఇక్కడ ఒక్కచోటే కాదు. చాలాచోట్ల ఇదే పరిస్థితి. పౌష్టికాహారంలో భాగమైన శనగలు కూడా నెలల తరబడి కేంద్రాలకు అందలేదు. -
అతి వ్యాయామం అనర్థదాయకం..
సరైన పోషకాహారంతో పాటు తగిన వ్యాయామం కూడా శరీరానికి అవసరమే. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం వ్యాయామానికీ వర్తిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు అనర్థాలు ఎదురవుతాయని వారు అంటున్నారు. రోజుకు నాలుగు గంటలకు పైబడి వ్యాయామం చేస్తే, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందని, దీనివల్ల రక్తం విషపూరితంగా మారుతుందని చెబుతున్నారు. సుదీర్ఘ సమయం పట్టే మారథాన్ వంటి ఈవెంట్లలో పాల్గొనే వారికి, బాగా కండలు పెంచుకోవాలనే విపరీతమైన తపనతో గంటల తరబడి జిమ్‌లో గడిపేవారికి ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ వ్యాయామాలు సాగించే వారి రక్త నమూనాలను వ్యాయామానికి ముందు, వ్యాయామానికి తర్వాత సేకరించి, పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. -
నీరసం వీడని ‘ఆరోగ్యలక్ష్మి’
అందని కొత్త మెనూ సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యలక్ష్మి’ నీరసించిపోతోంది. పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆచరణకు నోచుకోవడంలేదు. ఆరోగ్యలక్ష్మి మెనూ పెంపునకు సంబంధించిన సర్క్యూలర్ ఉన్నతస్థాయి నుంచి అంగన్వాడీలకు అందాల్సి ఉంది. బాలింతలు, గర్భిణులకు తగిన పోషకాహారం అందించడం ఆరోగ్యలక్ష్మి ఉద్దేశం. ప్రస్తుతం రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే ఇస్తున్నారు. ఈ మెనూ సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలని జూన్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారులకు రోజువారీ ఇచ్చే ఆహారంలో ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు, ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్లు పాలు అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించే విధంగా సర్కారు కొత్త మెనూను రూపొందించింది. ఒకపూట పూర్తి భోజనంతోపాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇప్పించడం, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం తదితర కార్యక్రమాల పర్యవేక్షణను కూడా అంగన్వాడీ కేంద్రాలకే సర్కారు అప్పగించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 5.18 లక్షల మందికి వారానికి ఆరురోజులపాటు సమృద్ధిగా పోషకాహారం ఇవ్వాలి. ‘ఆరోగ్యలక్ష్మి’ ద్వారా లబ్ధిదారులకు కొత్త మెనూను అమలు చేయాలని అన్ని జిల్లాల సమగ్ర శిశు అభివద్ధి సేవాకేంద్రాల(ఐసీడీఎస్) సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ విభాగం డెరైక్టర్ సర్క్యులర్ పంపాల్సి ఉంది. డెరైక్టర్ సెలవులో ఉండడం, ఇన్చార్జి డెరైక్టర్‌కు పని భారం అధికంగా ఉండడంతో సకాలంలో సర్కులర్ జారీ కాలేదని ఆ విభాగం సిబ్బంది చెబుతున్నారు. -
మెదడు పదిలంగా ఉండాలంటే..
మూడు ముచ్చట్లు వయసు మళ్లే కొద్దీ చాలామందిలో మెదడు పనితీరు మందగిస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, మెదడును పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం వల్ల శరీరం దృఢంగా, చురుగ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మెదడుకు కూడా పోషకాహారంతో పాటు కొంత వ్యాయామం కూడా అవసరం అని పేర్కొన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు వంటివి గుర్తుపెట్టుకోవడం మరచిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అతిగా ఆధారపడే వారి మెదడు పనితీరులో ప్రతికూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు బ్రిటన్‌లోని గోల్డ్‌స్మిత్ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వేళకు తగినంత నిద్ర, సన్నిహితులతో కాలక్షేపం, పజిల్స్ వంటివి చేయడం, కొత్త భాషలు నేర్చుకోవడం లేదా సంగీత పరికరాన్ని పలికించడం నేర్చుకోవడం వంటి పనుల్లో నిమగ్నమైతే మెదడు చిరకాలం చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
ఆకలి రహిత కర్ణాటక లక్ష్యం
సీఎం సిద్ధరామయ్య అన్నభాగ్యతో 4 కోట్ల మందికి {పయోజనం రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోండి ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుల ఆహ్వానం జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకు దేషన్ బెంగళూరు: ఆకలి రహిత కర్ణాటకను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బీపీఎల్ కార్డుదారులకు చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన విధానసౌధ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్నభాగ్య పథకం వల్ల రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఈ పథకం కోసం వరి, రాగి, గోదుమలకు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. దీని వల్ల రైతులకు కూడా లాభం చేకూరుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం జనాభాలో 21 శాతం మంది దారిద్ర రేఖకంటే దిగువన ఉన్నారని తెలిపారు. తమిళనాడులో ఈ సంఖ్య 17 శాతం, కేరళలో 12 శాతంగా ఉందని వివరించారు. అయితే కర్ణాటకలోని మొత్తం జనాభాల్లో 23.6 శాతం మంది దారిద్రరేఖ కంటే దిగువన ఉన్నారని తెలిపారు. వీరందరికీ పౌష్టికాహారం దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఉచితంగా ఆహారధాన్యాలను, రాయితీ ధరల్లో వంటనూనె, ఉప్పును అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నూతనంగా ఏపీఎల్ లేదా బీపీఎల్ కార్డు పొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకూ రాయితీ ధరల్లో బియ్యం, గోదుమలను రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రేషన్‌కార్డులను వితరణ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ రేషన్‌కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, కే.జే జార్జ్ తదితరులు పాల్గొన్నారు. -
భయం వద్దు.. హాయిగా ఆరగిద్దాం..
చికెన్,ఎగ్ మేళాకు అనూహ్య స్పందన పౌల్టీ పరిశ్రమకు ప్రభుత్వ అండగా ఉంటుందని మంత్రుల హామీ సిటీబ్యూరో: అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా మాంసాహార ప్రియులంతా చికెన్, గుడ్డు ఆరగించవచ్చని మంత్రులు పిలుపునిచ్చారు. చికెన్ ,గుడ్డు ద్వారా పౌష్టికాహారం లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రులు చికెన్ ఆరగించడమే కాకుండా బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఆర్థిక వుంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హోంమంత్రి నాయిని తన ప్రసంగంతో అందర్నీ ఉత్సాహపరిచారు. ఎలాంటి భయం లేకుండా బలవర్ధకమైన గుడ్డు, చికెన్‌ను తినాలని సూచించారు. స్నేహ చికెన్ ఎండీ రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయకులు మాళవిక,సుధామయి,సింహ, హిందీ గాయకులు మోనాలీసా,రత్న తదితరులు ఆలపించిన పాటలు,నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
మీ పిల్లలు బరువు పెరగాలా?
సాక్షి: కొందరు పిల్లలు చాలా సన్నగా ఉంటారు. వయసుకు తగిన బరువు ఉండకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అవసరమైనంత బరువు పెరిగేందుకు పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలోనని ఆలోచిస్తుంటారు. అలాంటివారికోసమే ఈ సూచనలు. 1. 2-3సంవత్సరాల పిల్లలకు సగటున రోజుకు వెయ్యి కేలరీల శక్తి అవసరం. 4-8కసంవత్సరాల పిల్లలకు 1,200-1,400కేలరీలు అవసరం. 2. ఒక పౌండ్ బరువు పెరగాలంటే అదనంగా 3,500కేలరీల ఆహారం తీసుకోవాలి. రోజుకు 500కేలరీల శక్తిగల అదనపు ఆహారం తీసుకోవడం ద్వారా వారంలోపు ఒక పౌండ్ బరువు పెరిగే అవకాశముంది. ఇలా బరువు పెరగాలంటే ఆహారంలో ఈ కింది మార్పులు చేయాలి. * ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. సహజంగా అధిక కొవ్వు ఒంటికి మంచిది కాకపోయినా సన్నగా ఉన్నవారికి పరిమితమైన కొవ్వు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారిలో సహజంగానే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది కూడా అంత మంచిది కాదు. పాస్తా, చీజ్, సాస్‌లాంటి పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థాలతో శరీరానికి ఎక్కువ కేల రీలు చేరుతాయి. * పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. డ్రైఫ్రూ ట్స్, యోగర్ట్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఓట్మీల్, గోధుమలవంటి ఆహార పదార్థాల్ని కూడా ఎక్కువగా ఇవ్వాలి. * డ్రింక్స్‌లో కూడా కేలరీలు అధికంగా ఉంటాయి. తాజా పళ్ల రసాలు, స్మూతీస్, పాల పదార్థాలతో వంద కేలరీల శక్తి లభిస్తుంది. ఇలాంటి ఆహారాల వల్ల బరువు పెరిగే అవకాశమున్నా అతిగా తీసుకోవడం కూడా మంచిదికాదు. కావాల్సినంత బరువు పెరిగిన తర్వాత ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. -
కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన
మెనూ అమలుచేయాలని డిమాండ్ అల్పాహారం తినకుండా నిరసన ఏటీడబ్ల్యూవో హామీతో విరమణ పెదబయలు: వారం రోజులుగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదని స్థానిక కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. సుమారు 180 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు ధ్వజమెత్తారు. అల్పాహారాన్ని బహిష్కరించి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పాహారంగా చపాతి, వడ పెట్టాల్సి ఉండగా పొంగలి ముద్దలా ఉందని, సాయంత్రం ఇవ్వాల్సిన పండ్లు, మిఠాయి చాలా రోజులుగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నెల నుంచి కాస్తోటిక్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆదివారం పెట్టిన మాంసం ఒక్కో విద్యార్థికి 100 గ్రామాలు కేటాయించాల్సి ఉండగా, 50 గ్రాములు మాత్రమే పెడుతున్నారని ఆరోపించారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని వివరించారు. ఇప్పటికైనా పాఠశాల ప్రత్యేకాధికారి సుధారాణి, అధికారులు స్పందించి మెనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో 77 రోజుల ప్రణాళిక తీరు, పాఠశాల మౌలిక సదుపాయాలపై మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని పీవో ఆదేశించినా ఫలితం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థినుల ఆందోళన సమాచారం తెలుసుకున్న మండల ఉప గిరిజన సంక్షేమ అధికారి బి. సూర్యనారాయణ పాఠశాలకు వచ్చారు. విద్యార్థినుల ససమస్యలు తెలుసుకున్నారు. మెనూ అమలుచేయకపోవడంపై ప్రత్యేకాధికారి సుధారాణిపై మండిపడ్డారు. మెనూ అమలుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
డాక్టర్ అమ్మ
ఇంట్లోనే పౌష్టికాహారం... శిశువులను ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు.. మహిళలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు బంజారాహిల్స్: సరైన పౌష్టికాహారం లేక దేశంలో నిత్యం వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రపంచంలోని 185 దేశాలు ఈ సమస్యను అధిగమించేందుకు ఒక్కటయ్యాయి.. అందులో మన దేశం కూడా ఒకటి.. కానీ గణాంకాల లెక్కలు ఈ మరణాలను తగ్గించలేకపోతున్నాయి.. ఈ నేపథ్యంలోనే వచ్చే ఐదేళ్లలోనైనా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.. ఇది ఇటీవల ఒక ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో సాక్షాత్తు ఎంపీ కవిత చెప్పిన మాటలివి.. అయితే పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు ప్రతి తల్లి ప్రయత్నం చేయవచ్చు.. ఇంట్లో లభించే నిత్యావసర సరుకులతోనే బిడ్డను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు.. సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఈ ఆహార పదార్థాలను తయారు చేసుకునే విధానం, తల్లి తన బిడ్డ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ సామాజిక భవనంలో నిర్వహించిన సమావేశంలో వివరించారు.సామాజిక ఆహార పోషణ విస్తరణశాఖ, ఆహారంపోషక విషయాల బోర్డు ప్రదర్శనాధికారి నటరాజశేఖర్, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్టు డెరైక్టర్ కెఆర్ఎస్ లక్ష్మీదేవి, ఐసీడీఎస్-2 ప్రాజెక్టు సీడీపీఓ కె.సత్యవతి ఈ చర్చాగోష్టిలో పాల్గొని గర్భిణులు, బాలింతలు, తల్లులు, పిల్లలకు పోషక విలువలున్న ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో, దాంతో ప్రయోజనాలు ఎంటో పలు సూచనలు జారీ చేశారు. గోధుమపిండి, రాగులు, వేరుశనగ, బెల్లం, పప్పులు, గోధుమ రవ్వ ఇలా ఇంట్లో లభించే ఆహార పదార్థాలతో పోషక విలువలు లభించే ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ప్రత్యక్షంగా అక్కడికి వచ్చిన మహిళలకు చేసి చూపారు. ముఖ్యంగా కిచిడీ తయారీ ఎంత తేలికో చూపడమే కాకుండా అందులో లభించే పోషక విలువలను వివరించారు. బియ్యం, నెయ్యి, బెల్లం, పెసరపప్పుతో తయారుచేసే తీపి పొంగల్, రాగితో చంటిపిల్ల అనుబంధ ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు. జొన్నలతో చంటి పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని తయారు చేసుకొనే విధానాన్ని, ఆ మిశ్రమాన్ని శుభ్రమైన పొడి డబ్బాలో ఎలా నిల్వ చేసుకోవచ్చో కళ్లకు కట్టారు. గోధుమలు, శనగపప్పు, పంచదారతో చంటిపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని వివరించారు. వీటితోపాటు గోధుమ పాయసం, గోధుమ రవ్వతో కిచిడీ, రాగిలడ్డు, గోధుమ శనగపిండి లడ్డు తయారు చేసుకొనే విధానం, అందులోని పోషక విలువలను వివరించారు. ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ అవగాహన సదస్సు మూడు గంటలపాటు కొనసాగింది. కళ్లకు కట్టినట్లు చెప్పారు అధికారులు తయారుచేసి చూపించిన ఈ పదార్థాలు మేము ఇళ్లలో కూడా తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కళ్లకు కట్టినట్లు తెలిపారు. నిత్యం మనం వాడుకొనే సరుకులే అయినా వాటిలో ఇన్ని రకాల పోషకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా పేదలైనా నిత్యం తమ ఇంట్లో దొరికే వస్తువులతోనే వీటిని తయారుచేసి బిడ్డను ఆరోగ్యంగా తీర్చిదిద్దవచ్చు. - సరోజ, నందినగర్ ఇంట్లోనే తయారు చేసుకుంటా పోషక విలువలతో కూడిన అదనపు ఆహారం ఇవ్వడంతో బిడ్డకు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఈ అవగాహన సదస్సులో తెలుసుకున్నాను. చక్కని మానసిక ఆరోగ్యంతో మేధోసంపత్తి పెరిగి పిల్లలు చక్కగా చదువుకోవడానికి దోహద పడుతుంది. నేను మా ఇంట్లో ఉన్న బియ్యం, గోధుమలు, పప్పులు, బెల్లం తదితర పదార్థాలు ఉపయోగించి అనుబంధ ఆహారాన్ని తయారు చేసి బిడ్డకు పెడతాను. - నవ్యశ్రీ, బంజారాహిల్స్ బస్తీ మహిళలకు వివరిస్తున్నాం తల్లులకు పిల్లల పోషకాహార పద్ధతులపై సమాచారం, ప్రత్యక్ష సహకారం లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. సమాజంలోని తల్లికి ఆస్పత్రుల నుంచి ఇంటి వరకు సరైన పోషకాహార పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. పోషకాహారం లేకపోతే పిల్లలు మరణానికి గురవుతారు. సరైన పోషకాహార పద్ధతులను విశదీకరించేందుకు మేము పౌష్టికాహార నిపుణులతో బస్తీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. - నటరాజశేఖర్, పర్యవేక్షణాధికారి, ఆహారం, పోషక విషయాల బోర్డు -
గుడ్డు గగనమే!
అంగన్వాడీ కేంద్రాలకు నిలిచిన సరఫరా బాలలకు అందని పౌష్టికాహారం కొయ్యూరు: చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా గుడ్డు సరఫరా చేస్తోంది. మన్యంలో బాలింతలు, గర్భిణులకు కూడా ఇందిరమ్మ అమృతహస్తం పథకంలో గుడ్లు అందజేస్తోంది. అయితే ఎం.భీమవరం పరిధిలోని ఎనిమిది అంగన్వాడీల్లో పరిస్థితి అందుకు భిన్నం. మండపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి గూడెంకొత్తవీధి మండలంలోని పందిరాయి కొత్తగూడెం నుంచి వెళ్లాలి. ఈ కేంద్రానికి సరఫరా కావాల్సిన గుడ్లు తూర్పు గోదావరి జిల్లా వై.రామవరంలో దించుతారు. అక్కడనుంచి కొండలు, గుట్టలు మీదుగా తీసుకురావడం వల్ల పగిలిపోతున్నాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లడంతో చివరి 10 శాతం గుడ్లు కూడా మిగలడం లేదు. వై.రామవరంకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదలకం కొత్తూరు, 30 కిలోమీటర్ల దూరంలోని పుట్టకోటది అదే పరిస్థితి. పోతవరం, ఎం.భీమవరం,చీడికోట, వాలుగూడెం అంగన్వాడీ కేంద్రాలకు వై.రామవరం నుంచి తీసుకువెళ్లాలి. ఈ గ్రామం 17 కిలోమీటర్ల దూరంలోని కొండలపై ఉంది. అక్కడికి గుడ్లు తరలించేసరికి పగిలిపోతున్నాయి. ఇలాచేస్తే మేలు: తూర్పు గోదావరి జిల్లాలో మారేడుమిల్లి మండలం నుంచి పోతవరం గ్రామానికి రహదారి మెరుగ్గానే ఉంటుంది. ఇక్కడ అధికారులు అక్కడ అధికారులతో మాట్లాడి అటు వైపు నుంచి గుడ్లు సరఫరా చేయకగలిగితే అందరికీ గుడ్లు అందే అవకాశం ఉంటుంది. పిల్లలకు పెట్టలేకపోతున్నాం వై.రామవరం నుంచి గుడ్లు తీసుకువస్తుంటే గుడ్లన్ని పగలిపోతున్నాయి. వంద గుడ్లు తెస్తే వాటిలో 90వరకు పగిలిపోతున్నాయి. దీంతో పిల్లలకు గుడ్లు పెట్టలేకపోతున్నాం. - గొలిసింగి దేవామణి, ఎం.భీమవరం అంగన్వాడీ వర్కర్ ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి నుంచి గుడ్లు తరలించే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.పోతవరం వరకు గుడ్లు పంపించే అంశాన్ని పరిశీలిస్తాం. - ప్రసన్న వెంకటేష్, పాడేరు సబ్ కలెక్టర్ -
పాలు కావాలి
- 200 అంగన్వాడీలలో ఇబ్బందులు - రవాణా చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టర్ - అమలు కాని టెట్రాప్యాక్ పథకం - గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం ఇందూరు: మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రారంభించిన ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకం అమలుకు కావాల్సిన అన్ని సరుకులు సక్రమంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నా, పాల విషయంలో మాత్రం సమస్య తలెత్తింది. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్న విజయ డెయిరీ కొన్ని ప్రాజెక్టులకు పాలు సరఫరా చేయలేకపోతోంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, తదితర ప్రాజెక్టుల పరిధిలోని సగం అంగన్వాడీలకు పాలు సరఫరా కావండలేదు. పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో సరఫరా చేయలేకపోతున్నామని డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారని సీడీపీఓలు, ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు. దూర ప్రాంతాల అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు రవాణా చార్జీల భారం ఎక్కువ కావడం కూడా ఇందుకు కారణమని తెలిసింది. ఘనంగా ప్రారంభం గత జనవరి పదిన ఈ పథకం ప్రారంభమైంది. మొదటగా అన్ని ప్రాజెక్టులకు సక్రమంగానే పాలను సరఫరా చేసిన డెయిరీ నిర్వాహకులు, కొన్ని రోజుల తరువాత నిలిపివేశారు. మూడు ప్రాజెక్టులలో దాదాపు 200 అంగన్వాడీలకు పాలు సరఫరా కావడం లేదు. సోమవారం ఏకంగా అర్బన్ ప్రాజెక్టులో ఉన్న 151 అంగన్వాడీలకు పాలు రాలేదు. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. వారు కేంద్రాలలో కేవలం భోజనం చేసి వెళుతున్నారు. పాలు ఎందుకివ్వడం లేదని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని కేంద్రలలో స్థానికంగా పాలు లభ్యమైతే కొనుక్కొచ్చి అందజేస్తున్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలంటే గర్భవతిగా ఉన్న సమ యంలో కడుపునిండా ఆహారం ఉండాలి. విటమిన్లు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు తాగితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వారికి కేంద్రాలలో రోజూ 200 మిల్లీలీటర్ల పాలు తప్పసరిగా అందజేస్తారు. తరువాత బాలింతలు కూడా పాలు తాగాల్సి ఉంటుంది. వారికి ఇవి బలాన్నివ్వడంతోపాటు పాలు ఎక్కువగా రావడానికి పాలు తోడ్పడుతాయి. టెట్రాప్యాక్ పాలు ఎక్కడ? మారుమూల ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు రోజూ పాలను సరఫరా చేయడం కష్టమవుతుందని భావించి, దూర ప్రాంత అంగన్వాడీలకు టెట్రాప్యాక్ల ద్వారా పాలను అందజేయాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు నిలువ ఉండే విధంగా టెట్రాప్యాక్ పాలు ఉంటాయి. అంటే, వారానికి ఒకసారి పాలను అందజేస్తారు. ఈ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. -
భయం.. భయం
నగరంలో విస్తరిస్తోన్న థైరాయిడ్ వాతావరణ కాలుష్యం, పౌష్టికాహార లోపమే కారణం మూడోవంతు బాధితులు మహిళలే ఇందులో హైపోథైరాయిడే అధికం సర్వేలో వెల్లడైన వాస్తవాలు థైరాయిడ్.. ఇప్పుడీ సమస్య గ్రేటర్ నగరాన్ని వణికిస్తోంది. నగర వాసులు తమకు తెలియకుండానే థైరాయిడ్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం.. హార్మోన్లలో సమతుల్యత లోపించడం, పౌష్టికాహార లోపం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో మూడోవంతు మంది మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. నగరంలో హైపోథైరాయిడిజం బాధితులే అధికం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితేనే అన్ని విధాలా మేలంటున్నారు వైద్య నిపుణులు. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న థైరాయిడ్‌పై ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతా ల్లో మాత్రమే కన్పించే థైరాయిడ్ తాజాగా మెట్రో నగరాలకూ విస్తరించింది. పౌష్టికాహారం, అయోడిన్ లోపం.. వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్లో నేడు అనేకమంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో థైరాయిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ వారు నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యం కలిగిం చే అంశాలు వెలుగు చూ శాయి. సర్వే ప్రకారం 18 ఏళ్లుపైబడిన వారిలో జాతీయ స్థాయిలో సగటున 10.95% మంది హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సగటున హైదరాబాద్‌లో 8.88% మంది ఉండగా ఇందులో మూడోవంతు బాధితులు మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. ఉత్తరాదిన కోల్‌కత.. దక్షిణాన హైదరాబాద్ 2012-13లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చెన్నై, హైదరాబాద్‌లో సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన నగరాల్లో థైరాయిడ్ హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధికంగా ఉత్తర భారత దేశంలోని కోల్‌కతలో 21.6 శాతం, దేశ రాజధాని న్యూఢిల్లీలో 11.07 శాతం, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా, దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్టు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలాజీ విభాగం వైద్యుడు డాక్టర్ రాకేష్సహాయ్ స్పష్టం చేశారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమంటున్నారు. కాలుష్యం వల్లే... శరీరంలో అయోడిన్ మూలక లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల అనేకమంది దీని బారిన పడుతున్నట్టు తేలింది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంతవరకు కాపాడుకోవచ్చు.- డాక్టర్ రాకేష్ సహాయ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి హైపో థైరాయిడిజం లక్షణాలు హైపర్ థైరాయిడిజం లక్షణాలు హైపో థైరాయిడ్‌ను సులభంగా గుర్తించవచ్చు - హైపర్ థైరాయిడ్‌ను కూడా గుర్తించవచ్చు బరువు పెరగడం - బరువు తగ్గడం జుట్టు రాలిపోతుంది - విపరీతమైన చమట చర్మం పొడిబారుతుంది - గుండె వేగంగా కొట్టుకోవడం విపరీతమైన అలసట - టెన్షన్(ఆందోళన), చేతులు వణకడం మహిళల్లో రుతుచక్ర క్రమం తప్పడం - గుర్తించడంలో రోగులే కాదు వైద్యులు కూడా పొరపాటు పడవచ్చు సంతాన లేమి - టీఎస్‌హెచ్ టెస్టు చేస్తే ఉందో లేదో తెలుస్తుంది థైరాయిడ్ అంటే..? థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతోపాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు అధికంగా ఉన్నారు. -
అందానికి ఉల్లి తోడు!
సౌందర్య పోషణలో కురులదే కీలకపాత్ర. అందులోనూ స్త్రీలకు ఒత్తై తలకట్టు అందాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం కూడా. తలవెంట్రుకలు రాలిపోయే సమస్యతో బాధపడేవారి పాలిట ఉల్లి మంచి మందు. అంతేకాదు, కొందరికి పేను కొరుకుడు వల్ల తలపై అక్కడక్కడ పాయలు పాయలుగా జుట్టు ఊడిపోయి, అసహ్యంగా కనపడుతుంది. అటువంటివారు ఉల్లిపాయను మెత్తగా చితక్కొట్టి లేదా మిక్సీలో వేసి రసం తీసి నెత్తిమీద వెంట్రుకలు పలుచగా ఉన్న చోట రాసుకుంటే నిద్రాణంగా ఉన్న వెంట్రుకల కుదుళ్లు చైతన్యవంతమై, తిరిగి అక్కడ జుట్టు మొలుస్తుందట. ఉల్లిలో ఉండే సల్ఫర్ జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రపరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఉల్లిపాయను బాగా దంచి, రసం తీసి, కొబ్బరినూనెలో లేదా ఇతర కేశవర్థక తైలాలలో కలిపి తలకు రాసుకున్నా మంచి ఫలితమే. చుండ్రుతో బాధపడేవారు ఉల్లిరసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించి, అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే అందం ద్విగుణీకృతం అవుతుంది... నిజం! ఉల్లితోడు! అన్నట్టు ఉల్లికి ఆడ, మగ తేడా ఏమీ లేదు. మగవాళ్లు కూడా ఉల్లిరసం రాసుకోవచ్చు. -
రుచి లేని ‘మధ్యాహ్న’ భోజనం
* కొండెక్కిన కూరగాయలు * కానరాని కోడిగుడ్లు * విద్యార్థులకు అందని పౌష్టికాహారం విజయనగరం అర్బన్ : ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను ప్రభావం పాఠశాలల మధ్యాహ్న భోజనం, వసతిగృహాలపై బాగా పడింది. కూరగాయల కొరత నేటికీ వెంటాడుతోంది. తుపాను ధాటికి కూరగాయల పంటలు నాశనమవడంతో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. తుపాను తర్వాత రెండు రోజుల పాటు దాతలిచ్చిన కూరగాయలు సరఫరా చేసిన అధికారులు తర్వాత మిన్నకుండిపోయారు. ఉత్పత్తి కొరత పూడ్చడం, ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పాఠశాలల్లో, వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 3,437 పాఠశాలల్లో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అదే విధంగా వివిధ సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 8 వేల మంది వరకు విద్యార్థులున్నారు. ధరలు పెరిగిపోవడంతో వల్ల రుచికరమైన విద్యార్ధులకు నాణ్యమైన భోజననం అందని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘మధ్యాహ్న భోజన పథకం’లో నాణ్యత లోపిస్తోంది. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం, వచ్చిన బిల్లులు గిట్టుబాటు కాకపోవడంతో నిర్వాహకులు కూడా నాణ్యత లేని భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. వసతిగృహాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఉండేందుకు గత ఏడాది వసతిగృహాల్లో మెనూ మార్చారు. అన్నం, సాంబారుతో పాటు ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అటు హాస్టళ్లలో ‘మెనూ’ చిక్కిపోయింది. పౌష్టికాహారం సంగతి పక్కనపెడితే పప్పన్నం కూడా సరిగా పెట్టలేని పరిస్థితి. ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 30 రూపాయలకు తక్కువ లేకుండా ఉన్నాయి. దీంతో రుచికరమైన ఆహారం అందించడం మధ్యాహ్నభోజన నిర్వాహకులకు, వార్టెన్లకు ఇబ్బందిగా మారింది. ధరల పెరుగుదల సాకుతో ఇంకొంతమంది వార్డెన్లు కోడిగుడ్లను ఇవ్వడం మానేశారు. స్కూళ్లలో వారానికి రెండు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. ఈ మేరకు పలు ప్రాంతాల నుంచి కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ధరలు తగ్గాలి... లేదా భత్యం పెంచాలి - కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజెన్సీలకు ఇచ్చే భత్యం పెంచడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే నాణ్యమైన భోజనం సాధ్యమని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. గత విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్న కూరగాయల ధరలకు ఇప్పటికి 70 శాతం పెరిగింది. - ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రోజుకు రూ.4, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.4.65 చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ఐదు రూపాయలకు సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 గ్రాముల అన్నం(బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుంది), 150 గ్రాముల కూరలను ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు సార్లు గుడ్డు పెట్టాలి. - కోడిగుడ్డు ధర నాలుగు రూపాయలకు పైబడి ఉంది. మరి అలాంటప్పుడు నాలుగు రూపాయలకు భోజనం ఎలా పెట్టాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. - భోజన పథకం అమలుకు వంట గ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు. వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తగిలింది. జిల్లాలో 59 హాస్టళ్లు ఉన్నాయి. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లోనూ గుడ్లు అందించాలి. అలాగే రోజూ కాయగూర, పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ వసతి గృహంలో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు. -
వన్ డే ఫుల్ మీల్స్
అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు హన్మకొండ చౌరస్తా :మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఇందిరమ్మ అమృతహస్తం పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో పాలు, గుడ్లతోపాటు భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకాన్ని విస్తరింప జేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో లబ్ధిదారులకు మందిని ఎన్నుకునే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒక్క పూట భోజనం (వన్డే ఫుల్ మీల్స్) అందేలా ఏర్పాట్లు చేస్తోంది. మేరకు నవంబర్ 26న జీఓ నంబర్ 12ను జారీ చేసింది. అంతేకాదు... పథకం అమలుకు కావాల్సిన బడ్జెట్ ను ఈ నెల ఒకటో తేదీనే విడుదల చేయడంతోపాటు కావాల్సిన ఏర్పాట్లు చేయూలని తాజాగా మరోసారి ఆదేశించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 18 ప్రాజెక్టుల పరిధిలోని 2,40,340 మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు క్కొక్కరికి ప్రతి నెల 16 నుంచి 25 కోడిగుడ్లు అందుతుండగా... కొత్త పథకం ద్వారా నెలకు 30 గుడ్లు, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక పూట కూరగాయల భోజనం అందజేయనున్నారు. అరుుతే.. ఈ పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఒక్కో అంగన్వాడీ సెంటర్లో 20కి తక్కువ కాకుండా లబ్ధిదారులు ఉంటారు. జీఓ 12 ప్రకారం ప్రతి రోజు లబ్ధిదారులకు అన్నం, కూరలు వండడంతోపాటు పాలు వేడి చేసి అందించాలి. గుడ్లను ఉడక బెట్టి అంగన్వాడీ కేంద్రాల వద్దే వారికి వడ్డించాలి. ఈ నేపథ్యంలో ఇందుకు కావాల్సిన వంట సామగ్రి తప్పనిసరి. జిల్లాలో అమృతహస్తం అమలవుతున్న ప్రాజెక్టులను మినహాయిస్తే మిగతా అన్ని ప్రాజెక్టులకు వంట సామగ్రి, బియ్యం సరుకులను అందజేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక శాతం కేంద్రాలకు గ్యాస్ సిలిండర్ నుంచి తినే కంచాల వరకు సమకూర్చాలి. ఇవన్నీ జరగలాంటే ముందుగా ఏ సెంటర్లో పాత్రలు ఉన్నాయి... గ్యాస్ ఎక్కడ లేదు... ఏ సెంటర్లో ఏ సామగ్రి అవసరమో గుర్తించాలి. ఆ దిశగా నమోదుకు తీసుకోవాల్సిన చర్యలు శూన్యం. అదేవిధంగా జిల్లాలో కొన్ని సెంటర్లలో వర్కర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ సెంటర్ల పరిధిలోప్రస్తుతం పక్క సెంటర్ల అంగన్వాడీ వర్కర్లను ఇన్చార్ట్లుగా నియమించి నడిపిస్తున్నారు. ఇప్పుడు అందరికీ వంట వండడం వీలు కాదని వర్కర్లే స్వయంగా చెబుతున్నారు. సామర్థ్యానికి మించిన పనులతో ఇప్పటికే సతమతమవుతున్న తమకు ‘వన్డే మీల్స్’ మరింత భారంగా మారనుందని వాపోతున్నారు. ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే వసతులు కల్పిండమే కాకుడా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అద్దె భవనాల్లో ఉంటున్న సెంటర్లలో ఇప్పటికీ నీటి వసతి, కూర్చునే వసతులు లేవు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. అంగన్వాడీ కేంద్రాల్లో గణాంకాలు 1-3సం. పిల్లలు 87,682 3-6 సం. పిల్లలు 88,299 గర్భిణులు 30,914 బాలింతలు 33,445 -
ఇదో ‘గుడ్డు’ పుఠాణి
* పక్కదారి పడుతున్న పౌష్టికాహారం * పిల్లలు, తల్లుల నోళ్లు కొడుతున్న అక్రమార్కులు * నెలకు 16 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 12తో సరి * కింది నుంచి ఉన్నతస్థాయి వరకూ కుమ్మక్కు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన గుడ్ల పంపిణీలో గూడు పుఠాణి జరుగుతోంది. వారం వారం ఇవ్వాల్సిన గుడ్లలో కోత పెడుతూ, సొమ్ములు బొక్కుతుంటే.. చర్యలు తీసుకోవలసిన స్త్రీ శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకొంటున్నారు. జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 5,143 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిసి 3,19,436 మంది ఉన్నారు. వీరిలో ఆరు నెలల నుంచి మూడేళ్ల్ల లోపు చిన్నారులు 1,46,780 మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 85,935 మంది కాగా గర్భిణులు 86,721 మంది ఉన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 49 లక్షల గుడ్లు సరఫరా చేయాలి. వాటిని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు లబ్ధిదారులకు అందజేస్తుంటారు. గుడ్ల పంపిణీ విషయమై కాకినాడ రూరల్ మండలంలోని స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, తమ్మవరంతో పాటు మురళీధర్నగర్ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ‘సాక్షి’ ఆరా తీయగా గుడ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని స్థానికులు చెప్పారు. ఒక్కో కోడిగుడ్డు 50 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. అయితే కేంద్రాలకు 30 గ్రాముల లోపు ఉండే గుడ్లు కూడా వస్తున్నాయన్నారు. నాలుగు కాదు.. మూడు విడతలే ఒక్కో అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులకు (50 నుంచి 60 మంది ఉంటారని అంచనా) వారానికి 200 నుంచి 240 గుడ్లు పంపిణీ చేయాలి. ఒక లబ్ధిదారుకు వారంలో నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం) నాలుగు గుడ్లు పంపిణీ చేయాలి. ఈ పథకం ప్రారంభమైన మొదట్లో నెలలో 15 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా చేసేవారు. తర్వాత మారిన విధానం ప్రకారం ఒక అంగన్వాడీ కేంద్రం పరిధిలోని 60 మందికి వారానికి నాలుగు వంతున 240 గుడ్లు, నెల మొత్తంలో 960 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా కేవలం మూడు విడతలతోనే సరిపెట్టేస్తున్నారు. ఐసీడీఎస్ సిబ్బంది పై నుంచి క్షేత్రస్థాయి వరకు నిర్వాహకులతో మిలాఖతవడంతోనే ఈ బాగోతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. జిల్లాలోని 5,143 కేంద్రాలలో మూడొంతులు అంటే సుమారు 3,800 కేంద్రాల్లో గుడ్ల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో నెలలో 9 లక్షల పైచిలుకు గుడ్లు దారి మళ్లుతున్నాయి. ఈ అవకతవకలకు తోడు సరఫరా చేసే వారు ఒక వారం రవాణా చార్జీలు కూడా వెనకేసుకుంటున్నారు. గుడ్ల సరఫరా తగ్గింపుపై అంగన్వాడీ కార్యకర్తలకు, స్థానికులకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తమపైన ఉన్న పర్యవేక్షకులకు చెబుతున్నా వచ్చిన వాటితో సరిపెట్టుకోండంటున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లు మూడు వారాలే ఇస్తున్నారు.. నెలకు 16 కోడిగుడ్లు ఇస్తారని అంగన్వాడీ కార్యకర్తల సమావేశాల్లో అధికారులు చెబుతున్నా తమకు మూడు వారాలకు 12 గుడ్లు మాత్రమే ఇస్తున్నారని కాకినాడ రూరల్ మండలం స్వామినగర్‌కు చెందిన కర్రి వెంకటలక్ష్మి వాపోయింది. పిల్లలకు కూడా అలాగే పెడుతున్నారంది. కొన్నిసార్లు ఇచ్చే గుడ్లు అతిచిన్నవిగా ఉంటున్నాయని నిరసించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. గుడ్ల సరఫరాలో అవకతవకలు తమ దృష్టికి కూడా వచ్చాయని, పలు గ్రామాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు చెప్పారు. సక్రమంగా గుడ్లు సరఫరా జరిగేలా చూస్తామన్నారు. -
ఇక అన్ని ప్రాజెక్టుల్లో ‘అమృత హస్తం’!
ఇందూరు : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇక అందరికీ సమానంగా అందనుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా అందించే పరిపుష్టమైన పౌష్టికాహారాన్ని జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం పది సీడీపీఓ ప్రాజెక్టుల ద్వారా 2711 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు ప్రాజెక్టులైన బోధన్, బాన్సువాడ, మద్నూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, భీమ్‌గల్ ప్రాజెక్టుల్లో మాత్రమే అమృత హస్తం పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. మిగతా నాలుగు ప్రాజెక్టుల్లో అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయడం లేదో కూడా అధికారులకు అర్థం కాలేదు. ఆరు ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పోపు దినుసులు, కూరగాయల భోజనం, ఐరన్ మాత్రలు, ఇతరాత్రవి అందేవి. జిల్లాలో పది ప్రాజెక్టులకు గాను ఆరు ప్రాజెక్టుల్లో పథకం అమలు కావడం, మిగతా ప్రాజెక్టుల్లో ఎందుకు అమలు కావడం లేదని జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములును రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో అమలు జరగుతుందని తెలిపారు. ఒక ప్రాజెక్టు వారికి అలా, మరో ప్రాజెక్టు వారికి ఇలా అమలు చేయడం సరికాదని తారతమ్యం లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు అమలు కాని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాజెక్టుల్లో కూడా పథకాన్ని అమలు చేసి పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేయాలని తీర్మానిం చారు. దీని మార్గదర్శకాలు, విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. డిసెంబర్ నెల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా కొత్తగా నాలుగు ప్రాజెక్టుల్లో పథకం అమలు కానున్న సందర్భంగా వాటి పరిధిలో ఉన్న దాదాపు 1050 అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి రోజు గుడ్డు.. జిల్లాలోని పది ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అమృత హస్తం కావడం ఒక విశేషమైతే, పౌష్టికాహారాన్ని పెంచడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇది వరకు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నెలకు 25 గుడ్లు అందించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్యను ప్రతి రోజు అంటే నెల రోజుల పాటు గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ నెల నుంచి అదనంగా గుడ్లు సరఫరా కానున్నాయి. -
అంగన్వాడీ కేంద్రాల్లో విచారణ
వేముల: మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల పని తీరుపై అధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో గర్భవతులు, బాలింతల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. పులివెందుల ఐసీడీఎస్ సీడీపీవో సావిత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24నుంచి జూన్12 వరకు అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయకున్నా.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు రికార్డులలో నమోదు చేశారు. ఇందులో సీడీపీవో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విచారణ కోసం కర్నూలుకు చెందిన ఆర్జేడీ శారదను నియమించారు. ఆమె బుధవారం చాగలేరు, చింతలజూటూరు, పెద్దజూటూరు, సిద్ధంరెడ్డిపల్లె, రాచకుంటపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో గ్రామంలో ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భవతులు, కేంద్రాలలోని ఇద్దరు చిన్నపిల్లల తల్లిదడ్రులను విచారించారు. అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా.. గుడ్డు ఇస్తున్నారా.. పాలు ఇస్తున్నారా.. అలాగే కేంద్రంలో చిన్నపిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అనే విషయాలను వారినుంచి సేకరించారు. కమిషనర్‌కు నివేదిక : మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో జరిపిన విచారణలో వెలుగు చూసిన విషయాలను నివేదిక రూపంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని ఆర్జేడీ శారద తెలిపారు. చాగలేరు గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలోని రిజిష్టర్లను పరిశీలించామన్నారు. అలాగే రిజిష్టర్‌లో సంతకాలు, వేలిముద్రలను పరిశీలించామన్నారు. అంతేకాక గర్భవతులు, బాలింతలు చెప్పిన వివరాలను నమోదు చేశామన్నారు. -
కేశ సమస్యలకు హోమియో చికిత్స
చక్కని ఒత్తై జుట్టు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు..! అలా నిగనిగలాడే అందమైన జుట్టు మన దైనందిన జీవితంలో తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారం, తాగే నీరు, నివసించే ప్రదేశం, వాతావరణ మార్పులు, మానసిక, శారీరక సంబంధ సమస్యలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శరీరానికీ అనుగుణంగా మార్చుకుంటూ... పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు, వ్యాయామం, యోగా మెడిటేషన్, రోజుకు కనీసం ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర వల్ల చాలా వరకు కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు ఊడిపోవడానికి హార్మోన్ సమస్యలు, సర్జరీ, కేన్సర్, దానికి ఇచ్చే కీమోథెరపీ తదితర కారణాలుంటాయి. అధిక మొత్తంలో వెంట్రుకలు ఊడటం, లేదంటే తలలో కొన్ని భాగాల్లో (ప్యాచెస్) మాత్రమే ఊడిపోవడాన్ని హెయిర్ లాస్ అనవచ్చు. సాధారణంగా రోజుకు 60- 70 వెంట్రుకలు సగటు మధ్యవయస్సు వారికి ఊడవచ్చు. ఈ కేశ సంబంధ సమస్యలు రెండు రకాలు 1. పురుష సంబంధ బట్టతల: ముందు నుంచి వెనుకకు పొయ్యే వెంట్రుకల సమూహం. ముఖ్యంగా 25% మంది పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. 30 ఏళ్ల వయసు వారికి ఇది రావచ్చు. 2. స్త్రీ సంబంధ బట్టతల: వంశపారంపర్యంగా వయసు, హార్మోన్ల లోపాలు, పీరియడ్స్ ఆగిపోవడం, తల ముందు భాగంలో అలాగే ఉండి... మిగిలిన మొత్తం భాగంలో పలుచబడుతుంది. కారణాలు 1.అలోఫేషియా ఏరియేటా. చిన్నచిన్న ద్వీపకల్పాలుగా వెంట్రుకలూడతాయి. ముఖ్యంగా తలలో, గడ్డం భాగం, కనుబొమ్మలు, కంటిపాపలు. 2.ఆటో ఇమ్యూన్ డిసీజ్. 3.కాలిన గాయాలు. 4.సిఫిలిస్ 5.మందులు, కొన్ని రకాల యాంటీబయోటిక్స్. 6.మానసిక ఒత్తిడులు, శారీరక అధిక శ్రమ. 7. ఎక్కువగా షాంపూలు వాడటం. 8. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్. 9. థైరాయిడ్, గర్భనిరోధక మాత్రలు వాడటం. 10. కాన్పు తర్వాత 11. వెంట్రుకలు లాగుట (హెయిర్ పుల్లింగ్) 12. రేడియేషన్ (కేన్సర్ కేసులలో) తర్వాత 13. చర్మ సంబంధ తల వ్యాధులు 14. ఓవరీ ట్యూమర్స్, ఎడ్రెనల్ గ్రంథి కంతులు. కారణాన్నిబట్టి చికిత్స ప్రతిరోజూ చికిత్సకు వచ్చే వాళ్లలో ముఖ్యంగా స్త్రీలు దీని గురించి బాగా చింతపడుతూ ఉంటారు. హోమియోలో వ్యాధి కారణాన్ని బట్టి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. గర్భవతిగా ఉన్నపుడు, కాన్పు తర్వాత వచ్చే హార్మోన్ సమస్యలను సరిచేయటం, పోషకాహార సమస్యలు, ఏదైనా విటమిన్, రక్తహీనత సరిచేసే మందులతో పాటు నేట్రంమూర్, పల్సటిల్లా, ఆర్నికా, జబొరాండి, సెపియా తదితర మందులు బాగా పనిచేస్తాయి. వీటిని డాక్టరు సలహా మేరకు తీసుకోవాలి. అడ్రస్... డా॥మురళి అంకిరెడ్డి ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి సికింద్రాబాద్, కొత్తపేట, కూకట్పల్లి, నేరేడ్మెట్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, హన్మకొండ - కర్ణాటక ఫోన్ : 90300 92040 www.starhomeo.com -
ఒళ్లు బరువు?కళ్లు తెరువు!
స్థూలకాయం సమస్య తీవ్రంగా మారింది. ప్రజల జీవనశైలిపై దాని ప్రభావాలు విపరీతంగా ఉంటూ ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలకు అది కారణమవుతోంది. ఉదాహరణకు స్థూలకాయం చాలామందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాససంబంధమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ శతాబ్దానికి అదో పెద్ద విపత్తుగా మారిందనడం అతిశయోక్తి కాదు. భారత్‌లో కనీసం ఆరు శాతం ప్రజలు స్థూలకాయం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్థూలకాయం సమస్య ఎంత విపరీతంగా పెరుగుతోందో, భారత్‌లోనూ అదే తరహాలో అధికమవుతోంది. దేశంలోనే కాదు... తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ 18 శాతం పురుషుల్లో, 23 శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నెల 26న ప్రపంచ స్థూలకాయం దినం సందర్భంగా ఈ సమస్య తీవ్రతనూ, అది తెచ్చే ఆరోగ్యఅనర్థాలపై అవగాహన కోసం ఈ కథనం. స్థూలకాయం అంటే...? ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారి, బరువు పెరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలమానం ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి బరువును కిలోల్లో తీసుకుని, దాన్ని ఆ వ్యక్తి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి భాగించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు, ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ.x 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను ఈకింద ఉన్న ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు అన్నది నిర్ణయిస్తారు. ఇది ఇలా... వర్గీకరణ బీఎంఐ (కిలోలు / మీ. స్క్వేర్) ------------------------------------------------------- తక్కువ బరువు 18.5 కంటే తక్కువ సాధారణ బరువు 18.5 నుంచి 22.9 వరకు అధిక బరువు 23 నుంచి 24.9 వరకు స్థూలకాయానికి ముందు 25 నుంచి 29.9 వరకు ఒబేస్ క్లాస్ 1 30.0 నుంచి 34.9 వరకు ఒబేస్ క్లాస్ 2 35.0 నుంచి 39.9 వరకు ఒబేస్ క్లాస్ 3 40 కంటే ఎక్కువ ------------------------------------------------------ స్థూలకాయానికి కారణాలు జన్యుపరమైనవి : కొందరిలో జన్యుపరమైన కారణాలతో హార్మోన్ల పనితీరు అధికమై అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది.. ఈ క్యాలరీల వల్ల కొవ్వు పేరుకుపోవచ్చు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం : తగినంత శరీరక శ్రమ లేపోవడం వల్ల శరీరం తగినన్ని క్యాలరీలను కోల్పోక వాటిని నిత్యం నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది. అనారోగ్యకరమైన తినే అలవాట్లు : ఈ రోజుల్లో మనలో చాలామంది అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం వల్ల బరువు పెరుగుతున్నారు. మహిళల విషయంలో గర్భధారణ కూడా : గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు బిడ్డ పుట్టాక కూడా తాము పెరిగిన బరువును కోల్పోరు. ఇది అనర్థాలకు కారణం కావచ్చు. నిద్రలేమి : సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడి, క్రమంగా అది బరువు పెరగడానికి దోహదం చేస్తుంటుంది. కొన్ని రకాల మందులు : యాంటీడిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ నియంత్రణకు వాడే మందులు, మానసిక వ్యాధులకు వాడే మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ స్థూలకాయానికి దారితీయవచ్చు. కొన్ని రకాల వ్యాధులు : ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణం కావచ్చు. ఉదాహరణకు ప్రెడర్-విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల్లో అది స్థూలకాయానికి దారితీయవచ్చు. బరువు తగ్గడానికి అనువైన మార్గాలు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. అవి... ఆరోగ్యకరమైన జీవన శైలి : మనం నిత్యజీవితంలో ఆచరించే ఆహార, వ్యాయామ విధానాల ద్వారానే బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. వాటిని ఆచరిస్తూ మన మీద మనకు ఉన్న నమ్మకంతో ‘మనం చేయగలం’ అనుకుంటూ బరువు తగ్గడం. మందులతో/వైద్య ప్రక్రియలతో... ఆరోగ్యకరమైన రీతిలో మనం రోజూ అనుసరించే మామూలు మార్గాల్లోనే అధిక బరువు సమస్యను అధిగమించకపోతే... ఒక్కోసారి పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, డాక్టర్ల సాయంతో బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అది రెండు రకాలుగా జరగవచ్చు. అవి... 1. అధిక బరువు తగ్గడానికి అవసరమైన వైద్య విధానాలు ఆచరించడం / మందులను వాడటం 2. స్థూలకాయం వల్ల వచ్చిన ఆరోగ్యసమస్యలకు మందులు వాడటం. అధిక బరువు / స్థూలకాయం ఉన్నవారికి వైద్యపరమైన జాగ్రత్తలతో మందులు వాడుతున్నప్పుడు వైద్యప్రక్రియ మూడు రకాలుగా ఉంటుంది. అది... అధికబరువు / స్థూలకాయం ద్వారా వచ్చిన ఆరోగ్య సమస్యను తగ్గించేందుకు మందులు వాడటం. ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం. ఏవైనా తినడానికి సంబంధించిన సమస్య (ఈటింగ్ డిజార్డర్) ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. ఇలా ఈ మూడు మార్గాలను కలగలపిన ఆరోగ్య ప్రణాళిక ద్వారా పేషెంట్ బరువును నియంత్రిస్తూ ఉండటం వంటివి చేస్తారు. స్థూలకాయాన్ని తగ్గించడానికి అవసరమైన శస్త్రచికిత్స మార్గాలు : స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలు ఒక్కోసారి రోగికి ప్రాణాపాయానికి దారితీసేలా ఉంటే అప్పుడు సంప్రదాయ విధానాల ద్వారా బరువు తగ్గించడానికి బదులు డాక్టర్లు శస్త్రచికిత్స ప్రక్రియలను అనుసరించడానికి మొగ్గుచూపువచ్చు. అయితే ఇది అందరి విషయంలోనూ జరగదు. ఇలా ఒక లావుగా ఉన్న వ్యక్తి బరువు తగ్గించడానికి శస్త్రచికిత్సను సూచించడం కొన్ని పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఆ పరిస్థితులేమిటంటే... రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం. ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... రోగి పురుషుడైతే అతడి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉండటం / అదే స్త్రీ అయితే ఆమె బరువు సాధారణ బరువు కంటే 35 కిలోలు అధికంగా ఉండటం. ఒక వ్యక్తికి తన బీఎంఐ విలువ 35 - 40 మధ్యన ఉంటే అతడికి స్థూలకాయం వల్ల వచ్చే అనర్థాలైన టైప్-2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం. స్థూలకాయం వల్ల రోగికి ప్రాణాపాయం ఉంటే... అతడి స్థూలకాయాన్ని తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స వల్ల అతడికి, బరువు పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలనుంచే కొంత ఉపశమనం కలగవచ్చు. అవి... రక్తంలోని చక్కెర పాళ్లు తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం, గురకను తగ్గించడం, గుండెపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించడం, రక్తంలోని ఒక రకం కొవ్వులైన కొలెస్ట్రాల్ పాళ్లనూ తగ్గించడం వంటివి. అయితే అంతమాత్రాన ప్రాణాపాయం కలిగించేటంతగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతి సందర్భంలోనూ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాకపోవచ్చు. రోగి వ్యక్తిగత పరిస్థితితో పాటు అనేక అంశాలను గమనించి ఈ తరహా శస్త్రచికిత్సను చేయాల్సి ఉంటుంది. రోగి బరువు తగ్గించడానికి చేసే శస్త్రచికిత్సను ‘బేరియాట్రిక్ సర్జరీ’ అంటారు. ఇలా చేసే శస్త్రచికిత్సలు మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1. మాల్ అబ్సార్ప్టివ్ 2. రెస్ట్రిక్టివ్ 3. పై రెండు అంశాలనూ కలగలిపిన శస్త్రచికిత్సలు. 1. మాల్ ఆబ్సార్ప్టివ్ తరహా శస్త్రచికిత్స : ఈ తరహా శస్త్రచికిత్స వల్ల రెస్ట్రిక్టివ్ తరహా కంటే ఎక్కువగా బరువు తగ్గుతారు. ఈ తరహా శస్త్రచికిత్సలో భోజనం స్వతహాగా జీర్ణమయ్యే మార్గం నుంచి ఆ ఆహారాన్ని ఇతర మార్గానికి మళ్లిస్తారు. అందువల్ల ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపు, చిన్నపేగుల్లోని మార్గంలో చాలా తక్కువగా ప్రయాణిస్తుంది. అందుకే ఈ తరహా చికిత్సను ‘‘గ్యాస్ట్రిక్ బైపాస్’’ అని కూడా వ్యవహరిస్తారు. 2. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ : ఇందులో ఆహారం ప్రయణించే మార్గాన్ని బై-పాస్ చేయకుండా పేగుల్లో జీర్ణమయ్యే ఆహారపు మార్గాన్ని శస్త్రచికిత్స మార్గాల ద్వారా కుదిస్తారు. ఉదా: కడుపు సైజును గణనీయంగా తగ్గించడం. దీని వల్ల కడుపులో పట్టే ఆహారపు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీన్నే ‘స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ’ ప్రక్రియ అంటారు. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్లు ఎంతో కొంత మేరకు కడుపు కుదించడం జరుగుతుంది కాబట్టి బేరియాట్రిక్ సర్జరీలలోని ఈ ప్రక్రియ అన్నిట్లోనూ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. అదే మెటబాలిక్ తరహా సిండ్రోమ్‌లు ఉన్నవారి పరిస్థితిని మెరుగుపరచడానికి మాల్ అబ్సార్ప్టివ్ ప్రొసీజర్లను అనుసరిస్తూ ఉంటారు. రకరకాల గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్సలు రూక్స్ ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్ (ఆర్జీబీ) : ఇది గ్యాస్ట్రిక్ బై-పాస్ ప్రక్రియలన్నింటిలోనూ చాలా సాధారణంగా చేసే శస్త్రచికిత్స. ఇందులో రెస్ట్రిక్టివ్, మాల్అబ్సార్ప్టివ్... కలగలసి ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత రోగి తన బరువులో మూడింట రెండు వంతుల బరువును తగ్గించవచ్చు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై-పాస్ చేస్తూ నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచి రూపొందేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో చిన్నపేగుల ఆకృతి ‘వై’ అక్షరంలా ఉంటుంది. ఇలా చేసే శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా రెండో భాగమైన జిజినమ్ అనే చోట పేగుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే భాగాల్లో ఆహారం ఇంకకుండా పోతుంది. ఫలితంగా ఆహారంలోని అదనపు క్యాలరీలు శరీరంలోకి రావు. గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స వల్ల వచ్చే రిస్క్‌లు అయితే గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యే నిడివిని తగ్గించడం వల్ల తగినంత ఆహారం, పోషకాలు రక్తంలోకి ఇంకవు. ఫలితంగా అనీమియా (రక్తహీనత) రావచ్చు. అంతేకాదు... కీలకమైన ఐరన్, విటమిన్ బి12 వంటివి శరీరానికి తగినంతగా అందకపోవచ్చు. ఫలితంగా ఒక్కోసారి ఈ శస్త్రచికిత్స తర్వాత ఆస్టియోపోరోసిస్ వంటి పరిస్థితులూ రావచ్చు. డంపింగ్ సిండ్రోమ్ అనే మరో కండిషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రొసిజర్ ఇది. ఇందులో రోగికి వికారం, చెమటలు పట్టడం, స్పృహతప్పిపడిపోవడం, బలహీనంగా మారడం, నీళ్లవిరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటి రిస్క్‌లు ఉన్నప్పుడు మరో అదనపు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో కడుపును మూడింట రెండు వంతుల కుదిస్తారు. సంచి లాంటి కడుపు భాగాన్ని ఒక అరటిపండు ఆకృతికి పరిమితమయ్యేలా తగ్గిస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను అనుసరిస్తే మళ్లీ కోల్పోయిన కడుపు భాగాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ తర్వాత స్థూలకాయంతో బాధపడే రోగి 6 నుంచి 12 నెలల వ్యవధిలోనే తన బరువులో 70 శాతాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. ఇంతగా కడుపును కుదించడం వల్ల... ఆహారాన్ని చాలా చిన్న మోతాదుకు తగ్గించాల్సి ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీపై అపోహలు బరువును తగ్గించడానికి చేసే బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజల్లో ఎన్నో అపోహలూ... వివాదాలూ ఉన్నాయి. వాటిలో మొదటిది... బరువును తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని సులభమైన మందులు ఉండగా రోగికి శస్త్రచికిత్స అనవసరం. కానీ వాస్తవం ఏమిటంటే... రోగి బరువును ఠక్కున తగ్గించే మ్యాజిక్ మందు అంటూ ఏదీ లేదు. ఇలా ఉందని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. రెండో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగికి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ తరహా సర్జరీ మృత్యువుకూ దారి తీయవచ్చు. అయితే ఇది పూర్తిగా తప్పు. నిజానికి సర్జరీ చేయకపోవడం వల్లనే అతడి బరువు అతడిని కబళించే పరిస్థితుల్లోనే డాక్టర్లు రోగులకు ఈ తరహా సర్జరీలను సిఫార్సు చేస్తారు. మూడో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగి తన మామూలు ఆహారాన్ని తీసుకోలేడు. వాస్తవం ఏమిటంటే... సర్జరీ తర్వాత కూడా రోగి తన సాధారణ ఆహారాన్నే తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే తక్కువ మోతాదుల్లో డాక్టర్లు సూచించిన విధంగా. తక్షణ ప్రాణాపాయ ప్రమాదం ఉన్న రోగులు మినహా మిగతా వారు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్గాలతో బరువు తగ్గడం ఎంతో మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం... శస్త్రచికిత్స తర్వాత రోగి ఘనాహారం తీసుకోవడం ప్రారంభించాక... ఆహారాన్ని బాగా, చాలాసేపు, నింపాదిగా నమిలాకే మింగాలి. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణమయ్యే పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా తగ్గిస్తారు కాబట్టే ఈ జాగ్రత్త. ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే ఒక్కోసారి అది వెంటనే వాంతి అయ్యేందుకు దోహదపడవచ్చు. లేదా డంపింగ్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చు / తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, అన్నం తర్వాత తీసుకునే పాయసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. చాలా కొద్ది పరిమాణంలోనే వాటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్ లేదా హైక్యాలరీ సప్లిమెంట్స్ ఉండే పానీయాలు, మిల్క్‌షేక్‌లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా మానేయాలి. మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఆహారానికి, ఆహారానికి మధ్య తీసుకునే చిరుతిండ్లను గణనీయంగా తగ్గించాలి. స్థూలకాయం వల్ల అనర్థాలు స్థూలకాయం ఒక పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. నడుస్తున్నప్పుడు తమ భారాన్ని తమ శరీరమే భరించలేకపోవచ్చు. తమ శరీర బరువు వల్ల సరిగా శ్వాసతీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండెజబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. బేరియా ట్రిక్ శస్త్రచికిత్స తర్వాత జీవితంఎలా ఉంటుంది? మన జీవనంలోని నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికే ఈ తరహా శస్త్రచికిత్సలు. ఒంటి బరువు తగ్గడం వల్ల రోగి కదలికలు చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరంగా అనిపించడం చాలా సాధారణం. అయితే రోగి కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. -
రణ్‌బీర్‌తో అయితే ఓకే!
తన యోగా వీడియోతో శిల్పాశెట్టి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా తన అందం తరిగిపోకుండా ఉండటానికి కారణం యోగానే అంటారు శిల్పాశెట్టి. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో తాను మరో అడుగు వేస్తున్నట్లు, న్యూట్రిషన్, ఫిట్నెస్ అంశాలపై ఓ పుస్తకం రాయనున్నట్లు ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శిల్పా ప్రకటించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘బరువు తగ్గాలనుకునేవారు పాటించాల్సిన నియమాలే ఈ పుస్తకంలో ప్రధానాంశం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు కడుపు మాడ్చుకుంటుంటారు. నేను ఆ పద్ధతికి వ్యతిరేకిని. నిజంగా వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఉపవాసాలు చేయక్కర్లేదు. క్రమ పద్ధతిలో పౌష్టికాహారం తీసుకుంటే చాలు. బరువు తగ్గాలనుకునేవారికి ముఖ్యంగా కావాల్సింది ఆశావహ దృక్పథం, దృఢ సంకల్పం. ఈ రెండూ ఉంటే బరువు తగ్గడం పెద్ద విషయం కాదు. నా పుస్తకంలో ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి’’ అని శిల్పా తెలిపారు. ‘‘ఈ వయసులో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. మళ్లీ హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు కదా?’’ అని అడగ్గా -‘‘రణ్బీర్కపూర్కి జోడీగా అయితే చెప్పండి... నటించేస్తా’’ అంటూ సరదాగా ఓ చమక్కు విసిరారు శిల్పాశెట్టి. -
అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన మంత్రి
సాక్షి, బళ్లారి: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, కన్నడ సంస్కృతీ శాఖ మంత్రి ఉమాశ్రీ బళ్లారి నగరం, తాలూకాలోని అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేసే పలు గోడౌన్లను పరిశీలించారు. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి బళ్లారికి విచ్చేసి బళ్లారి తాలూకాలోని మోకా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కాసేపు గడిపి వివరాలు సేకరించారు. అటెండెన్స్ జాబితాలో ఉన్న ప్రకారం చిన్నారులు ఉన్నారో లేదో లెక్కకట్టారు. చిన్నారులకు మెనూ ప్రకారం అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. గర్భిణులకు అందించే పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాలకు సం బంధించిన వారు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల వద్ద చిన్నారుల నుంచి నేరుగా వివరాలు సేకరించిన తర్వాత పౌష్టికాహారం అందించే గోడౌన్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. మోకా, బళ్లారి నగరంలోని హవంబావి వద్ద ఉన్న గోడౌన్లను పరిశీలించి మంత్రి అవాక్కయ్యా రు. గోడౌన్ల నిండా వేరుశనగ, పెసర, శనగ బేడలు, బెల్లం తదితరాలు ప్యాకెట్లలో ఉంచి నేరుగా అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు కళ్లారా చూశారు. ఇలా అంగన్వాడీ కేంద్రాలకు నెల కా దు రెండు నెలలు కాదు ఏకంగా మూ డు సంవత్సరాల నుంచి ఇదే తరహాలో సరఫరా చేస్తున్నారని, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ద్వారా తెలుసుకుని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు పొడి చేయకుండా గింజలు నేరుగా సరఫరా చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెసలు, శనగలు, గోధుమలు, బెల్లం, వేరుశనగ విత్తనాలు బాగా పిండి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తే పౌష్టికాహారం అందించినట్లు అవుతుందని గుర్తు చేశారు. మూడు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా పని చేస్తూ, ఇప్పుడు తాను పరిశీలించిన తర్వాత చేస్తామంటున్నారంటూ మండిపడ్డారు. చిన్నారులు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి అన్ని రకాలుగా పౌష్టికాహార పదార్థాలు సరఫరా చేస్తుంటే ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావ డం లేదని మండిపడ్డారు. వెంటనే సంబంధిత సీడీపీఓలు సోమశేఖర్, కృష్ణమ్మలను ఇద్దరినీ సస్పెండ్ చేయాలని బెంగళూరు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా కబురు పంపారు. అలాగే జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ కలాదగికి నోటీసులు జారీ చేయాలని సక్రమంగా జవాబు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ సర్కిల్లోని బాలికల రిమాండ్ హోంను సందర్శించి అక్కడ బాలికలతో వివరాలు సేకరించారు. సౌకర్యాలు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకుని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని, పెళ్లి ఈడు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. -
ఆవరణ పచ్చగా..అందరూ మెచ్చగా
మిరుదొడ్డి: బాలుర వసతిగృహంలో అడుగు పెడితేచాలు.. వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. పర్యావరణంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే అన్ని రకాల కూరగాయల మొక్కలతో దర్శనమిచ్చే కిచెన్ గార్డెన్ చూడ ముచ్చట గొలుపుతోంది. మిరుదొడ్డి మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్ ఎ. రాములు, నైట్‌వాచ్‌మన్ చిన్న ఎల్లయ్యల ప్రత్యేక చొరవతో రకరకాల కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్కెట్లో అధిక ధరలకు కొనడం భారమవుతుండటంతో వసతీ గృహం ఆవరణలో ఉన్న నీటి వసతితో టమాటా, బెండ, దొండ, బీర, చిక్కుడు, కాకర, సోర, వంగ, కొత్తిమీర, కరివేపాకు, మునగ, మిరప, ఆకు కూరలు పండిస్తున్నారు. వివిధ కూరగాయల తోటలతో వసతిగృహం పచ్చదనాన్ని సంతరించుకుంది. వసతిగృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ మేనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంపైనే కాకుంగా విద్యాభ్యాసంలోనూ శ్రద్ధ తీసుకుంటున్న వెల్ఫేర్ ఆఫీసర్ రాములుతో పాటు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. -
స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అధికారులకు మంత్రి పీతల సుజాత ఆదేశాలు విశాఖ రూరల్: వచ్చే ఏడాదికల్లా మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, గనులు, భూగర్భ వనరుల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న లక్ష్యంతో నిరుపేదలకు అంగ న్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సరఫరాలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేంద్రాల్లో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేయాలని, సరఫరాలో ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అంగన్వాడీలకు భవనాలు: మంత్రి అయ్యన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్విహంచనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 2500 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, 1700 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ వై.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ పి.అనసూయ, పీడీ ఎ.ఇ.రాబర్ట్స్, ఏపీడీ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో సంక్షేమ వసతి గృహాలు
మిరుదొడ్డి: బాలుర వసతిగృహంలో అడుగు పెడితేచాలు.. వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. పర్యావరణంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే అన్ని రకాల కూరగాయల మొక్కలతో దర్శనమిచ్చే కిచెన్ గార్డెన్ చూడ ముచ్చట గొలుపుతోంది. మిరుదొడ్డి మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్ ఎ. రాములు, నైట్‌వాచ్‌మన్ చిన్న ఎల్లయ్యల ప్రత్యేక చొరవతో రకరకాల కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్కెట్లో అధిక ధరలకు కొనడం భారమవుతుండటంతో వసతీ గృహం ఆవరణలో ఉన్న నీటి వసతితో టమాటా, బెండ, దొండ, బీర, చిక్కుడు, కాకర, సోర, వంగ, కొత్తిమీర, కరివేపాకు, మునగ, మిరప, ఆకు కూరలు పండిస్తున్నారు. వివిధ కూరగాయల తోటలతో వసతిగృహం పచ్చదనాన్ని సంతరించుకుంది. వసతిగృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ మేనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంపైనే కాకుంగా విద్యాభ్యాసంలోనూ శ్రద్ధ తీసుకుంటున్న వెల్ఫేర్ ఆఫీసర్ రాములుతో పాటు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. -
అక్రమాల పాతరకు యత్నం
ఆత్మకూరు: ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పెద్ద స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. రెండు నెలలకు సరిపడా ఆహారం, సరుకులు ఈ ప్రాజెక్ట్ గొడౌన్‌కు సరఫరా కాగా అందులో నెల సరుకులనే అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసి మిగిలిన సరుకులను ఓ ప్రైవేటు వ్యాపారికి నిలువునా అమ్మేశారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ సరుకులను అన్లోడ్ చేసే సమయంలో గోడౌన్ వద్ద ప్రాజెక్ట్ అధికారులకు బదులు ఈ ప్రైవేటు వ్యక్తి పట్టుబడటంతో వ్యవహారం వెలుగుచూసింది. సరుకుల్లో తేడాను గుర్తించారు. దీనిపై స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి విచారణ ప్రారంభించడంతో అవినీతి భాగోతం బయటపడుతోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ప్రాజెక్ట్ అధికారులు అడ్డదారులు వెతుకుతున్నారు. తనిఖీలు ఎక్కెడెక్కడంటే..? ప్రాజెక్ట్ పరిధిలోని ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో తనిఖీలు జరిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం లేని ఏడు మంది సీడీపీఓలను పంపి అంగన్వాడీ కేంద్రాలను సామూహికంగా తనిఖీ చేయించారు. సరుకులకు సంబంధించిన రికార్డు పరిశీలిస్తే సరఫరాలో చోటు చేసుకున్న సరుకుల కోత బట్టబయలైంది. కారకులెవరు ? అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన సరుకులు నల్లబజారుపాలు కావడానికి కారణం ప్రాజెక్ట్‌లోని సూపర్వైజర్గా విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. అంతా తానై షాడో సీడీపీఓగా వ్యవహరించడమేనని అటు తనిఖీ అధికారులు, ఇటు కొందరు సూపర్వైజర్లు బాహాటంగానే వాఖ్యానిస్తున్నారు. ఇప్పుడేం జరుగుతోందంటే....? విచారణలో వెల్లడైన అక్రమాలను కప్పిపుచ్చేందుకు సీడీపీఓ, షాడో సీడీపీఓతో పాటు కొందరు సూపర్వైజర్లు వారికి అనుకూలమైన కార్యకర్తలను పావులుగా వినియోగిస్తున్నారని సమాచారం. వీరిని రకరకాలుగా బెదిరింపులకు గురిచేస్తూ తమకు అనుకూలంగా చెప్పాలని ప్రలోభపెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి రెండు నెలల సరుకు కేంద్రాలకు పంపిణీ చేసినట్టు చెప్పాలని కొందరు సూపర్వైజర్ల ద్వారా హుకుం జారీ చేయిస్తున్నారు. ఈ కుంభకోణం నుంచి బయటవేయమని అధికారపార్టీ నేతలను ఆశ్రయించారు. -
అమృతమా..విషమా?
యద్దనపూడి: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పేరుతో ఆరు నెలల వయస్సు నుంచి మూడేళ్లలోపు పేద పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తోంది. అయితే అధికారుల అలక్ష్యంతో గడువు మించిపోయిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వైనం యద్దనపూడి మండలం పూనూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది. యద్దనపూడి మండలం పూనూరు సెక్టార్‌లోని 224 అంగన్వాడీ కేంద్రం పరిధిలో మంగళ, బుధవారాల్లో బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటి గడువు జులై 21వ తేదీతో ముగిసిపోయింది. గడువు తీరిన ఆహారం తింటే అది విషంగా మారుతుందని తెలిసినా పసిపిల్లలకు వాటిని పంపిణీ చేయడంలో ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్
ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చెడిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని తపిస్తారు. వ్యాధి నయం చేయడం కన్నా నివారించడం మంచిదని మనందరకీ తెలుసు. కానీ అది ఎలా సాధ్యపడుతుందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నిర్ణయించే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ద్వారా ఏర్పడే విధ్వంసమే ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’. దాదాపు అన్ని రకాల లైఫ్ స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్ కు మూల కారణం ఇదే. హై బీపీ, హార్ట్ డిసీజెస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ఫ్రీ రాడికల్స్ విధ్వంసమే హేతువు. అత్యుత్తమమైన పోషకాలు (హై క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్స్) నిండిన ఆహారం, సరైన మోతాదులో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ విధ్వంసాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. యాంటీఆక్సిడెంట్స్ కన్నా ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అలాగే కొనసాగితే అనేక రకాల లైఫ్‌స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్‌కు దారితీస్తుంది. మన శరీరంలో కణజాల స్థాయిలో జరిగే యుద్ధంలో దెబ్బతిన్న, వ్యాధిగ్రస్తమైన కణజాలాన్ని బాగు చేయలేక సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ ఓడిపోతుంది. శరీరం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ను మాత్రమే తయారు చేస్తుంది. మనలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి పోరాడి గెలవడానికి అవి సరిపోవడం లేదు. ఎందుకంటే తినే ఆహారం ముఖ్యంగా పండ్లు, కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఫలితంగా సంభవించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నిర్మూలించాలంటే జీవన శైలిలో అత్యంత కీలక మార్పులు తీసుకురావడం కన్నా మరో మార్గం లేదు. క్రమబద్ధమైన వ్యాయామం, సేంద్రియ ఆహారం ముఖ్యం. మనలోని సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ బలపడి దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేసుకుని ఉత్సాహకరమైన ఆరోగ్యం అందించే మార్గమే ‘కణజాల పోషణ’(సెల్యులార్ నూట్రిషన్). ఇదే నిజమైన నివారణ ఔషధం. అందుకే చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి సిద్ధమైన, సమృద్ధికరమైన పోషక విలువలు కలిగిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చింది అంతర్జాతీయ సంస్థ డీఎన్జీ గ్రూప్ ‘ప్రో యంగ్ ఇంటర్నేషనల్.’ వ్యాధి లక్షణాలు బయట పడకముందే గుర్తించి నాణ్యమైన పోషకాలను అందించడం ద్వారా వ్యాధులను నిర్మూలించడంలో తమ న్యూట్రిషన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రో యంగ్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దశరథరామిరెడ్డి నలబోలు తెలిపారు. వందశాతం ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ను అందించే సహజసిద్ధమైన పోషకాహారానికి పెట్టింది పేరు ప్రో యంగ్ ఇంటర్నేషనల్. శరీరానికి ఉన్నత ప్రమాణాలు గల పోషకాన్ని అందిస్తూ తద్వారా యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వీరి ఉత్పత్తులు సాటిలేనివి. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే ఔషధ వృక్షాల నుంచి ప్రో యంగ్ ఉత్పత్తులు తయారవుతాయి. ది కింగ్ ఆఫ్ హెర్బ్స్ గా భావించే ‘గానోడెర్మా లూసిడమ్’ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎంత పెద్ద అనారోగ్యాన్నైనా తిప్పికొట్టే శక్తిని శరీరానికి ఇస్తుంది. గింకో బిలోబా రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచి గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుంది. ఇంకా పనాక్స్ జిన్సెంగ్, నోనీ వంటి ఆరోగ్యభాగ్యం అందించే పోషకాహార ఉత్పత్తులతోపాటు పూర్తిగా పండ్లతో తయారు చేసిన, సౌందర్య సాధనాలు ప్రో యంగ్‌లో లభిస్తాయి. మరెందుకు ఆలస్యం ప్రో యంగ్ ఉత్పత్తులతో మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. -
అర‘కూర’ భోజనం!
బోర్డుకే పరిమితమైన మెనూ బొండాపల్లి పాఠశాలలో విద్యార్థులకు రుచించని వంటకాలు స్కూలులో మౌలిక సదుపాయాల కొరత పెదబయలు : ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులు పౌష్ఠికాహారంతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో కాస్త ఖరీదైన మెనూ అమలుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అయితే మారుమూల ఆశ్రమాల్లో ఇది అమలు కావడం లేదు. మండలంలోని బొండాపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆదివారం నాటి పరిస్థితి ఇందుకు అద్దం పట్టింది. ఇక్కడ మెనూ ప్రకారం మధ్యాహ్నం శాఖహార బిర్యాని, బంగాళదుంప కూర, అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, పండు పెట్టాల్సి ఉండగా, బిర్యానీ ఊసే లేదు. బంగాళదుంప కూడా సాంబారును తలపించింది. ఇక సాంబారుకు బదులు రసం పెట్టారు. రోజూ ఇలానే రుచీపచీ లేని వంటకాలు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. వారానికి కేవలం నాలుగు రోజులే గుడ్డు పెడుతున్నారని చెప్పారు. పైగా తరచూ విద్యార్థులు ఇక్కడ వడ్డించుకోవాల్సిన పరిస్థితులున్నాయని ఆరోపించారు. హాస్టల్లో అన్నీ సమస్యలే! పాఠశాలలో మూడు వారాల నుంచి విద్యుత్ సదుపాయం లేదని, కిరోసిన్ దీపాల వెలుగులోనే చదువుకుంటున్నామని, ఇన్వర్టురు కూడా పనిచేయలేదని, హెచ్ఎం అందుబాటులో ఉండడం లేద ని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, బోరు నీరు వంటకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. ఇక్కడున్న 180 మంది విద్యార్థులూ సమీప గెడ్డకు వెల్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నామనితెలిపారు. సుప్రీంకోర్టు కమిటీ పర్యటిస్తున్న తరుణంలో ఈ పాఠశాలలో మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురాలేదని పేర్కొన్నారు. కాగా చాలా ఆశ్రమాల్లో ఇదే పరిస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ, గిరిజజన సంక్షేమాధికారులు ఏజెన్సీవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటా సరైన ఆహారం అందక విద్యార్థులు రక్తహీనత వంటి వ్యాధులకు గురికావాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సక్రమంగానే మెనూ అయితే బొడాపల్లి ఆశ్రమంలో మెనూ బాగానే అమలు చేస్తున్నామని, తాను అందుబాటులోనే ఉంటున్నానని హెచ్ఎం బాలరాజు వివరణ ఇచ్చారు. మం డల ఉపగిరిజన సంక్షేమాధికారి బి. సూ ర్యనారాయణను సంప్రదించగా విచారణ నిర్వహించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. -
ఉద్యోగం ఒక చోట.. నివాసం మరో చోట
ఇందూరు: అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగంలో చేర్చుకు నే సమయంలోనే వారు స్థానికంగా నివాసముంటున్నా రా లేదా అని పరిశీలిస్తారు. స్థానికంగా ఉంటేనే ఉద్యోగంలో చేర్చుకుంటారు. కానీ, జిల్లాలో కొంత మంది కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ విధులను విస్మరిస్తున్నారు. సొంతూళ్లలోనే ఉంటూ, దూర ప్రాంతాల లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీంతో వారు సక్రమంగా విధులకు హాజరు కాలేకపోతున్నారు. అంగన్వాడీలు సక్రమంగా నడవకపోవడం, అయాలతో కేంద్రాలను నడిపించడం, ఫలితంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందటం లేదనే విషయం ఐసీడీఎస్ అధికారుల వరకు వచ్చింది. స్పందించిన ఐ సీడీఎస్ పీడీ రాములు స్థానికంగా ఉండని అంగన్వాడీ కార్యకర్తల వివరాలను ప్రాజెక్టు కార్యాలయాల నుంచి తెప్పించుకున్నారు. జిల్లాలో మొత్తం మినీ, మెయిన్ కలిపి 2,700 అంగన్వాడీ కేంద్రాలుండగా, దాదాపు 400కు పైగా కార్యకర్తలు ఇతర ప్రాంతాలలో ఉంటున్నారని తేలింది. నెల రోజులలో అంగన్వాడీ కేంద్రం ఉన్న ఊరిలో, పట్టణంలో కచ్చితంగా నివాసం ఉండాలని, లేదా చర్యలు తీసుకుంటామని వారందరికీ హెచ్చరిక జారీ చేశారు. కానీ ఈ హెచ్చరికలను ఎవరూ లెక్కచేయలేదు. గతంలో కలెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న కూడా స్థానికేతర అంగన్వాడీ కార్యకర్తల వివరాలు తనకు అందజేయాలని ఐసీడీఎస్ పీడీ రాములును ఆదేశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో ఉండే సీడీపీఓలు, సూపర్వైజర్లు సమాచారం అందించడంలో తీవ్ర నిర్ల క్ష్యం చేశారు. ఎంత మంది స్థానికంగా ఉండటంలేదన్న వివరాలను పక్కాగా రాబట్టలేకపోయారు. గతంలో సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 400 మంది కార్యక్తలున్నట్లు అధికారులు చెబుతున్నారు. చర్యలు తీసుకుని ఉంటే హెచ్చరికలు చేసినప్పటికీ నివాసం మార్చుకోనివారిపై గట్టి చర్యలు తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అధికారులు ఈ విషయంపై అంతగా దృష్టిపెట్టకపోవడ ంతోనే కార్యకర్తలు జంకడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన ఐసీడీఎస్ ఆర్జేడీ రాజ్యలక్ష్మి కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నా, జిల్లా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు. -
అనాథల ఆక్రందన
సాక్షి, ముంబై: ప్రభుత్వ అనాథ శరణాలయాల్లోని చిన్నారుల పౌష్టికాహారం కోసం కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతున్నా, వారికి కనీస పరిమాణంలో పోషక పదార్థాలు దొరకడం కూడా కష్టమేనని తేలింది. మహారాష్ర్టతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో 52 శాతం మంది అనాథ చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. వీరికి పారిశుద్ధ్యం, మంచి దుస్తులు కూడా కరువేనని వెల్లడయింది. ఉదాహరణకు.. పుణేలోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్న తొమ్మిది ఏళ్ల శివం బరువు కేవలం 15 కిలోలు మాత్రమే. వైద్య ప్రమాణాల ప్రకారం ఈ వయస్సు బాలుడు కనీసం 28 కిలోల వరకు బరువు ఉండాలి. శివం గత మూడేళ్లుగా పుణేలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ (సీసీఐ)లో ఉంటున్నాడు. ఇతడి మాదిరిగానే రాష్ర్టంలో వేలాది మంది అనాథబాలలకు పోషకాహారం అందుబాటులో లేకపోవడం తో ఎదుగుదల లోపించడం, అనారోగ్యం బారిన పడడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశాలో సేవలు అందిస్తున్న ‘క్యాథలిక్ ఫర్ సోషల్ యాక్షన్’ (సీఎస్ఏ) అనే సామాజిక సేవాసంస్థ అనాథ చిన్నారుల జీవితాలపై నిర్వహించిన అధ్యయనం ద్వారా పైవిషయాలు బయటికి వచ్చాయి. ఆరు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న 1,412 మంది అనాథలపై ఈ సర్వే నిర్వహించినట్టు సీఎస్ఏ వర్గాలు తెలిపాయి. వీరిలో 26 శాతం మంది మధ్యస్తంగా పోషకాహారం లోపంతో ఉన్నారని గుర్తించగా, మరో 26 శాతం మంది బాలలు స్వల్పంగా పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన పదార్థాలు అందిచకుంటే ఏ సమయంలోనైనా తీవ్ర అనారోగ్యానికి గురికావొచ్చని సీఎస్ఏ డెరైక్టర్ సిడ్నీరోచా అభిప్రాయపడ్డారు. అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న అత్యధిక చిన్నారులకు తండ్రి లేదా తల్లి (సింగిల్ పేరెంట్) మాత్రమే ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉండి కూడా పిల్లలను పోషించలేక ఇక్కడ వదిలేసిన వారూ ఉన్నారని తేలింది. శివం తండ్రి ఓ తాగుబోతు కాగా, తల్లి కూలీ పని చేస్తుంటుంది. దీంతో ఈ దంపతులు తమ కొడుకుని పోషించే స్తోమత లేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్లారు. ‘డబ్బులు లేక శివం ఎన్నోసార్లు పస్తులు ఉన్నాడు. ఇతనికి మూడు పూటల సరైన భోజనం అందజేస్తే శరీరం ఎదిగే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎదుగుదలలో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు’ అని రోచా అన్నారు. చాలీచాలని నిధులు.. మహారాష్ట్రలోని చాలా అనాథ శరణాలయాలకు సమగ్ర శిశుసంరక్షణ పథకం కింద నిధులు అందుతున్నాయి. అంతేగాక ఈ ఏడాది నుంచి ప్రతి చిన్నారిపై వెచ్చించాల్సిన ఖర్చు మొత్తాన్ని కూడా రూ.650 నుంచి రూ.రెండు వేలకు పెంచినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా వుండగా అనాథ శరణాలయాల నిర్వాహకులు మాత్రం తమకు ఈ నిధులను సక్రమంగా అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. పెంచిన మొత్తాలను కూడా విడుదల చేయడం లేదని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిశుసంరక్షణ పథకానికి రూ.62.7 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా సరఫరా చేస్తున్న వాటిలో పోషక పదార్థాలు ఉండడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లో పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వడం లేదని సీఎస్ఏ సమన్వయకర్త అనుపమ్ శుభదర్శన్ పేర్కొన్నారు. అనాథ పిల్లల్లో పరిశుభ్రత, మంచి అలవాట్లు లోపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ‘చాలా మంది పిల్లలకు రెండు లేదా మూడు జోళ్ల దుస్తులు మాత్రమే ఉంటున్నాయి. దుస్తులు సరిగ్గా లేని వాళ్లు తడి బట్టలనే తొడుక్కోవడంతో చర్మ వ్యాధులు సోకుతున్నాయి. అంతేకాకుండా వీరి ఒంటిపై తెల్లటి మచ్చలు కూడా వస్తున్నాయి’ అని వివరించారు. -
పౌష్టికాహారం, రక్షిత తాగునీరే కీలకం
విద్యారణ్యపురి : పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూనే పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరముందని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ విద్యావతి అన్నారు. వీటికి దూరమైతే వైరస్లు శరీరంలోకి చేరి వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘మైక్రో బయాలజీ అనాలిసిస్ ద్వారా తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణ’ అంశంపై మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ముగింపు సమావేశంలో విద్యావతి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సూక్ష్మ జీవశాస్త్రంలోని ముఖ్యభావనలను ఆమె తెలియజేస్తూ తీసుకునే ఆహారం, నీరు కలుషితమైతే వ్యాధులకు కారణమవుతుందన్నారు. అయి తే, అమెరికా వంటి వర్దమాన దేశాల్లో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని ఆమె తెలిపారు. కాగా, పట్టణ ప్రాంతాల పిల్లల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో కలుషిత నీటిని తట్టుకునేలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకుల కోసం ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ ని, ఇందులో కేవలం ఇంటర్నెట్నే నమ్మడం వలన మౌలిక అంశాలపై పట్టు రావడం లేదని తెలిపారు. ఈ మేరకు పుస్తక పఠనాన్ని మించిన అధ్యయన పద్ధతి లేదని విద్యావతి దిశానిర్దేశం చేశారు. అపరిశుభ్రతతోనే వ్యాధులు వర్క్‌షాప్‌కు హాజరైన వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ సూక్ష్మజీవంలోని తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణలో మౌలికాంశాలను వివరించారు. మన దేశంతో పాటు ఆఫ్రికా దేశాలు వివిధ వ్యాధులకు ఆశ్రయంగా మారుతున్నాయని.. వీటన్నింటికీ ప్రధాన కారణం అపరిశుభ్రతేనని పేర్కొన్నారు. కేయూ మైక్రో బయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ ద్వారా కేడీసీలోని మైక్రో బయాలజీ విభాగం సమాజానికి కావాల్సిన కనీస విజ్ఞానాన్ని చేరవేయడంలో విజయవంతమైందని తెలిపారు. ఇంకా కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ కె.సదాశివరెడ్డి, డాక్టర్ సోమిరెడ్డి, డాక్టర్ ఎన్వీఎన్.చారి, డాక్టర్ జీవనచంద్ర, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మీసత్యవతి, డాక్టర్ జాన్‌వెస్లీ, ఆర్.విజయ్‌భాస్కర్, డాక్టర్ వి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. సదస్సు చివరలో ప్రొఫెసర్ విద్యావతిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.