స్లిమ్, వెయిట్ లాస్ కోసం తిండి తగ్గిస్తున్న నగరవాసి
ఆరోగ్యంపై ప్రభావం పోషకాహారం మస్ట్
హెచ్చరిస్తున్న నిపుణులు
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు
ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మితంగా తింటున్నారు..
నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్‌నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి.
ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు..
చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్‌లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్‌మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి.
ఆ ఆలోచన చేయవద్దు
డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్‌లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది.
– బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్
సుమారు 30 కేజీలు బరువు తగ్గాను
అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్.
– వై.నిషిత, కూకట్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment