![Nutritionist Explains Why You're Unable To Lose Weight](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/muk1.jpg.webp?itok=tkgONo8t)
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..
పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ.
కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులు
బరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.
అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్‌లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు.
హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట.
దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట.
పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు.
అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.
(చదవండి: యంగ్ లుక్ మంచిదే!)
Comments
Please login to add a commentAdd a comment