
చుండ్రు సమస్య ఉన్నవారు మాంసాహారం తక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవి కొంతమేర చుండ్రు సమస్యను ప్రేరేపించేందుకు అవకాశం ఉంది. ఇక చుండ్రును అరిట్టేందుకు ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతో పాటు అన్నిరకాల కాయగూరలు, తాజా పండ్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడంలో దోహదపడతాయి. తద్వారా చుండ్రు సమస్యకు చెక్ చెప్పొచ్చు. అలాగే చుండ్రు ఉన్నవారు రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగి, చర్మం బిగుతుగా మారి చర్మ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇవే ఆహార నియమాలు ఆరోగ్యవంతులకూ చుండ్రు రాకుండా నివారిస్తాయి .
Comments
Please login to add a commentAdd a comment