Hair fall
-
రెండు నెలలకోసారి స్టెరాయిడ్.. జుట్టంతా ఊడిపోతోందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్‌తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్ చేశారు. జన్యుపరంగా బ్రయాన్‌కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్‌పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది. అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్‌లైట్ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు. ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్‌లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, బ్రయాన్ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్ . (చదవండి: 'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!) -
జుట్టు రాలడం.. బరువు తగ్గడం జింక్ లోపం కావచ్చు!
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.గాయాలు నయం కాకపోవడం..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.బరువు తగ్గడం..జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.జుట్టు రాలడం..జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.తరచూ జలుబు..జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.చూపు మసక బారడం..ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.అయోమయం..మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.సంతానోత్పత్తిపై ప్రభావం..జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.రోగనిరోధక శక్తి బలహీనం..శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.ఇలా నివారించాలి..జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..?? -
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్ చెప్పవచ్చని మీకు తెలుసా? సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.తమలపాకు నీటితో జుట్టును కడగాలితల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది. తమలపాకు,నెయ్యి హెయిర్ మాస్క్తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మసాజ్తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.తమలపాకులతో చేసిన నూనెజుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు. తమలపాకులను తినండిఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఇలా చేయండి!
'ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.' ఇలా చేయండి.. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే... ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టును కడిగితే సిల్కీగా అవుతుంది. తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. ఇవి చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..? -
జుట్టు బాగా రాలుతుందా? ఉసిరి, క్యారెట్‌తో ఇలా చేస్తే..
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉసిరి ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్ ఇ , విటమిన్ ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది. క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్ జ్యూస్ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి. -
జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా? ఇకపై నో టెన్షన్
జుట్టు రాలిపోవడం.. నిర్జీవంగా మారిపోవడం.. ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్యారమే ఈ ఎల్ఈడీ హెయిర్ గ్రోత్ థెరపీ కోంబ్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే తలకు రిలాక్సింగ్ మసాజర్లానూ పని చేస్తుంది. 3 రకాల వైబ్రేషన్ మసాజ్ ఆప్షన్స్‌తో ఇది రూపొందింది. ఈ ఎల్ఈడీ లైట్లు రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్.. జుట్టు దృఢత్వానికి, పెరుగుదలకు ఉపయోగపడితే.. బ్లూ కలర్ .. స్కాల్ప్ ఇరిటేషన్, ఆయిల్ కంట్రోల్ వంటివి సరిచేస్తుంది. దీనిలోని 49 హెడ్ మసాజ్ బ్రిసల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచే చికిత్సను అందిస్తుంటాయి. మసాజ్‌ని ప్రారంభించడానికి ఎమ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. లైట్ మోడ్‌ని ఆన్ చేయడానికి లైట్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. అవసరమైన కలర్ ఎంపికతో నచ్చే మసాజ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఈ డివైస్‌ను అచ్చం సాధారణ దువ్వెనలా ఉపయోగించుకోవచ్చు. మెడ, చెవి వెనుకవైపు నుంచి జుట్టును దువ్వుకున్నప్పుడు ఈ మసాజర్‌తో మంచి ఫలితాలుంటాయి. దీన్ని స్త్రీ, పురుషులు ఇరువురూ వాడుకోవచ్చు. అన్ని రకాల ఆయిల్స్ అప్లై చేసుకుని కూడా ఈ మసాజర్‌ను వినియోగించుకోవచ్చు.ఈ ఎల్ఈడీ దువ్వెన.. పోర్టబుల్ అండ్ లైట్ వెయిట్. చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గానూ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేయడానికి కాటన్ లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కావడంతో.. ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర సుమారుగా రెండువేల రూపాయలు. -
అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్‌లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్‌పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!
హెయిర్ కేర్ జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్త వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుక పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టింన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది. (చదవండి: నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?) -
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. జుట్టు రాలడం తగ్గిపోతుంది
జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్తూ వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుకూ పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టించిన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళాదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకూడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది. -
జుట్టు రాలుతోందా? సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..
వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం ΄పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సాధనాలను, కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినా, సరైన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ►ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ►జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. ►ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం ఉత్తమం. ►ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన విషపదార్థాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి జుట్టును కా΄ాడుకోవాలనుకునేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మేలు. ►తేనె, పెరుగు హెయిర్ మాస్క్‌తో సులభంగా ఉపశమనం లభిస్తుంది: ►ప్రస్తుతం చాలామందిలో జుట్టు చివరి భాగాల్లో చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటినే స్పి›్లట్ ఎండ్స్ అంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట΄ాటు అలా వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత జుట్టును తక్కువ గాఢత గల షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. వేసవిలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు ►అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మికి గురికావడం వల్ల జుట్టు చిట్లడం, పల్చబడడం జరుగుతుంది. ►స్విమ్మింగ్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎందుకంటే పూల్ నీటిలో ఉండే క్లోరిన్ జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపి జుట్టు రాలేలా చేస్తుంది. ►వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం అనేది సర్వసాధారణం. ►వేడి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుందని అంటారు, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, తాత్కాలికంగా జుట్టు రాలిపోతుంది. అలోవెరా జెల్ అలోవెరా జెల్‌ను జుట్టు మీద అప్లై చేయడం చాలా మంచిది. దానివల్ల జుట్టు మెరవడంతోబాటు మృదువుగా కూడా మారుతుంది. అంతేకాదు, చుండ్రు లేదా జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల జుట్టు లోపలి భాగంలో బలపడుతుంది. కొబ్బరి పాలతో మసాజ్ జుట్టు రాలడానికి శీఘ్ర రెమెడీ కొబ్బరి ΄ాలతో తలకు సున్నితంగా మసాజ్ చేయడం. ఆ తర్వాత తలకు వెచ్చని టవల్ చుట్టడం. రెగ్యులర్ హెయిర్ వాష్, కండిషనింగ్‌తో ఈ చిట్కాను అనుసరించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది. -
Beauty: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా చేయండి
కురులు ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరకుంటుందనడంలో సందేహం లేదు. కానీ కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలడం సహా చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ►కొబ్బరి నూనె, ఆముదం సమపాళ్లల్లో తీసుకుని చక్కగా కలపాలి. ►ఈ నూనెను మాడుకు, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. ►రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ►వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఆముదంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుకు అంది చుండ్రు రానివ్వకుండా చేస్తాయి. ►కురులలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ►పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉండి జుట్టురాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇవి తింటే ఆరోగ్యకరమైన కేశాలు ►బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కురుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ►రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. ►బ్రకోలి, పాలకూర, కాకరకాయ, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ►తులసి, పుదీనా, సొరకాయల జ్యూస్.. బెల్లం, తులసి ఆకులతో చేసిన టీ కూడా జుట్టుకు పోషణ అందిస్తుంది. చదవండి: Breast Cancer Screening: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు! ఇంకా వీరికి -
అయోమయమా.. జట్టు రాలుతుందా..? అయితే ఈ కారణమే కావచ్చు..!
ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. బరువు తగ్గడం.. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలిపోవడం.. జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు. తరచూ జలుబు.. జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది. చూపు మసక బారడం.. ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది. గందరగోళం.. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి. సంతానోత్పత్తిపై ప్రభావం.. జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం.. శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు. ఇలా నివారించాలి.. జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. -
Hair Fall: జుట్టు రాలకుండా ఉండాలంటే..?
జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కోని యువత ఇంచుమించు ఇటీవల కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ఐరన్, విటమిన్ – సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. జుట్టు రాలిపోకుండా చేసే వాటిలో ఐరన్ కీలకమైనది. మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలో.. కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. విటమిన్–సి కోసం: ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్: గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారం లో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది. జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితోపాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలిసి వారి సలహా మేరకు మందులు, పోషకాలు తీసుకోవడం మంచిది. -
మందులు... జుట్టుపై వాటి దుష్ప్రభావాలు!
మనకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాల కోసం రకరకాల మందులు వాడుతుంటాం. వాటిల్లో కొన్నింటి దుష్ప్రభావాల వల్ల కొందరిలో జుట్టు రాలడం మామూలే. జుట్టు రాల్చే మందులు ∙మొటిమలకు వాడేవి, ∙కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు, ∙కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ∙నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు, ∙రక్తాన్ని పలచబార్చేవి ∙యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్ ∙కీమోథెరపీ మందులు. ∙మూర్చ చికిత్సలో వాడే మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ∙వేగంగా మూడ్స్ మారిపోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, ∙నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు, ∙స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు. ఇవి వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి జుట్టును రాలేలా చేస్తాయి. వెంట్రుక దశలు వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి. టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో దాదాపు 100 రోజుల పాటు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ చాలాకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ సమయంలో పీకితే వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది. కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, పెరుగుదల ఏమాత్రం ఉండదు. అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. మనం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి. టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతిలోకి వెళ్తుంది. దాంతో జుట్టు మొలవడం ఆలస్యం అవుతుంది. అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలుతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి. మందుల వల్ల జుట్టు రాలుతుంటే... ∙సాధారణంగా మందులు మానేయగానే జుట్టు మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. ∙ ప్రత్యామ్నాయ మందులు వాడటం. ∙జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ∙కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం. ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందరా... అలాగే ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది. -
చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?
చలికాలంలో గాలిలోని తేమ తక్కువ. ఈ కారణంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. మరీ ఎక్కువ ఇబ్బందిపెట్టే సమస్య జుట్టు రాలడం సమస్య . విపరీతైమన చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. హెయిర్ అంతా పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతుంది. సో... ఈ వింటర్లో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది తెలుసా? మరి జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? వింటర్లో అందరినీ వేధించే సమస్య హెయిర్‌లాస్, విపరీతమైన చుండ్రు. దీంతోపాటు జుట్టుచిట్టిపోవడం, పొడిగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసిందే. చర్మంగానీ, జుట్టుకానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కానీ చలికాలంలో చాలా తక్కువ నీటిని తాగుతాం ఈ కారణంగా సమస్యలు మరింత విజృంభిస్తాయి. తల పొడిబారిపోతుంది. తేమలేక జుట్టు రాలి పోతుంటుంది. చుండ్రు చేరుతుంది. ఆ ఇరిటేషన్, దురద బాగా వేధిస్తుంది. మరి చుండ్రును ఎదుర్కోవాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే పోషకాహారంతో పాటు, తాజా కూరలు, పండ్లు, తీసుకోవాలి. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనవి విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి. అంతేకాదు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగినంత న్యూటియంట్స్ శరీరానికి అందవు. ఫలితంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీంతో సహజమైన, మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జంక్ ఫుడ్‌కి నో చెప్పాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డీ, నూట్రిషనల్ ఈస్ట్, బ్రస్సెల్ మొలకలు, బయోటిన్, అవకాడో, సీఫుడ్ ద్వారా లభించే సిలీనియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అవసరం. విటమిటన్ డీ ఎంత పుష్కలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు. విటమిన్ డీ ని డైరెక్టు సన్ ద్వారా గానీ, సప్లిమెంట్ రూపంలో గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ తీసుకోవాలి. మరోవైపు జుట్టు, చర్మం కాంతివంతంగా ఉండటంలో విటమిన్ డి- బయోటిన్ ది కీలకమైన పాత్ర. కార్బోహైడ్రేట్, లిపిడ్ జీవక్రియలో ప్రత్యేక పాత్ర విటమిన్ హెచ్ లేదా బయోటిన్ది అని చెప్పొచ్చు. బయోటిన్ లోపిస్తే జుట్టు, గోర్లు, చర్మం కాంతి విహీనంగా మారిపోతాయి. జుట్టు పెళుసుగా మారుతుంది, గోర్లు ఎక్స్ఫోలియేట్ అవుతాయి. చలికి తట్టుకోలేక వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటాం. నిజానికి ఇది చాలా పెద్దపొరపాటు. వేడి నీటితో జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు హడావిడిగా దువ్వుకూడదు. తడిగా ఉన్నజుట్టు బలహీనంగా ఉండి, సులువుగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు. పల్చటి, మెత్తటి కాటన్ క్లాత్‌తో జుట్టును ఆర బెట్టుకోవడం మంచిది. దీంతోపాటు ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తల స్నానానికిముందు శుద్ధమైన కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే కుదుళ్లు గట్టిపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ మిశ్రమం, అలోవేరా, ఉల్లిపాయ రసం, కరివేపాకులు వేసి మరగించిన నూనె, బియ్యం గంజి, మందార ఆకుల మిశ్రమాన్ని స్కాల్ఫ్‌కి పట్టేలా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఈజీగా దొరికే రైస్ వాటర్‌లో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు జుట్టుకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఉండే షాంపూలకు దూరంగా ఉండండి. ఆర్గానిక్, లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుందా?
-
హెయిర్ ఫాల్ నివారణ కోసం కొత్త చికిత్సలు
జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద ఒకటి రెండు వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లూ ఒళ్లూ ఎక్కడచూసినా జుట్టే(హెయిర్ లాస్) కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అసౌకర్యంగా ఉంటూ, చెమట కంపు కొట్టే విగ్గులు, లేదా టోపీ, స్కార్ఫ్‌తో తలను దాచుకోవడం తప్పదా? నొప్పి పుట్టించే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ వాడాలా? లేక హెయిర్ లాస్ చికిత్సలే మేలా? అందుబాటులో ఉన్న పరిష్కారాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు. ట్రాన్స్‌ప్లాంట్... హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది ఒక సర్జికల్ ప్రక్రియ. దానిలో ముఖ్యంగా నెత్తిమీద ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం నుంచి తీసిన వెంట్రుకలను హెయిర్‌లాస్ అయిన చోట నాటుతారు. దీనిలో కొన్ని నెలలపాటు, కొంత ఇబ్బంది కరమైన, బాధాకరమైన సెషన్లను భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన చోట రక్తస్రావంతో పాటూ పొక్కుకట్టడం, ముఖం ఉబ్బడం, ఇన్పెక్షన్, వాపు, తలనొప్పి, నాటిన చోట మచ్చలు లాంటి సైడ్ ఎపెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పిఆర్సీ.. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ(పీఆర్పీ) అనేది ఒక కాలం చెల్లిన చికిత్సా ప్రక్రియ. దీనిలో నెత్తి మీది చర్మం ఫోలికల్స్‌ను పెంచడానికి, స్వయంగా రోగి రక్తంలో ఉన్న సహజ పెరుగుదల కారకాలను ఉపయోగిస్తారు. రోగి రక్తాన్ని తీసి రిచ్ ప్లాస్మాను వేరు చేయడానికి దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్‌లో తిప్పుతారు. దీనిలో ఒక చికిత్స సెషన్‌కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే 8 నుంచి 12 ఎంఎల్ పీఆర్పీ అవసరం అవుతుంది. పీఆర్పీని సూదుల సాయంతో నెత్తిమీదున్న చర్మం లోలోపలి పొరల్లో ఇంజెక్ట్ చేస్తారు. ఒక్కో పీఆర్పీ సెషన్‌కు రూ.10 వేల నుంచి, రూ.12 వేలకు పైగా ఖర్చు అవుతుంది. పీఆర్పీ ఫలితాల్లో వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంజెక్షన్, చికిత్స పద్ధతిలో ప్రామాణీకరణ అనేది ఉండదు. ఆరు నెలల చికిత్స తర్వాత జుట్టు చిక్కదనంలో కేవలం 19.29 శాతం పెరుగుదలను చూపించే పీఆర్పీ ఫలితాలకు మూడు నెలల సమయం పడుతుంది. ఈ ఫలితాలు కొనసాగేలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ కూడా అవసరమవుతుంది. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు)లో..పీఆర్పీ చికిత్సలో సున్నితత్వం, ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, నెత్తిమీద చర్మం బిగుతుగా కావడం, తలనొప్పి, మచ్చ కణజాలం ఏర్పడడం, ఇంజెక్షన్ వేసిన చోట కాల్షియం పేరుకుని గట్టిపడడం లాంటి సాధారణ సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. నాన్‌సర్జికల్ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్.. సంప్రదాయ చికిత్సలకు ఇవి కొత్త ఒరవడి అని చెప్పాలి. ఇవి సురక్షితమైన, సులభమైన, అత్యంత ప్రభావవంతమైన, సర్జరీ అవసరం లేని చికిత్సలుగా ఇప్పుడు బాలీవుడ్, హీరోలు సైతం హెయిర్ ఫాల్ సమస్యను అదుపు చేయడానికి దీనిని ఎంచుకుంటున్నారు. ఇది అమెరికా పేటెంట్ పొందిన, మొక్కల నుంచి ఉత్పన్నమైన సహజమైన కాయకల్ప చికిత్స. ఒక తరహా జుట్టు రాలడానికి పీసీఓఎస్ కారణం అయితే, కీమోథెరపీ, సెబొర్రిక్ డెర్మటైటిస్, అలోపీసియా అరీయాటా వల్ల అలోపీషియా వస్తుంది. పురుషులు, మహిళల్లో ఆండ్రోజెనెటిక్ అలోపీషియా చికిత్సకు ఇది చాలా సమర్థవంతమైనదని నిరూపితమైనది. ఒక దశాబ్దం పాటు విస్తృత పరిశోధనలు, అధ్యయనం తర్వాత డాక్టర్ దేబరాజ్ షోమే, డాక్టర్ రింకీ కపూర్ QR 678@హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ ను కమర్షియల్ మార్కెట్‌కు పరిచయం చేశారు. విటమిన్లు, మినరల్స్, గ్రోత్ పెప్టైడ్స్ కలిసున్న ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ నెత్తిమీది చర్మం ఫోలికల్స్‌ను తిరిగి నింపుతాయి, ఆరోగ్యకరమైన, దట్టమైన జుట్టు పెరగడానికి కారణమయ్యే జుట్టు ఫోలికల్స్‌కు రక్త సరఫరాను పెంచుతాయి. నెత్తిమీద బట్టతల ఉన్న ప్రాంతాలను ఇది గుర్తించాక మొత్తం ప్రక్రియకు దాదాపు 30 సెకన్లు పడుతుంది. నొప్పిలేకుండా ఉండే ఈ సెషన్స్ 8 నుంచి 12 నెలల పాటు ప్రతి నెలా రిపీట్ అవుతాయి. ప్రముఖ అమెరికా జర్నళ్లలో ఈ ట్రీట్ మెంట్ గురించి ప్రచురించిన ప్రకారం... ఈ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. జుట్టు సాంద్రత, మందం పెరగడం వల్ల ఆండ్రోజెనెటిక్ అలోపీసియా కారణంగా, జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య వంతులైన పురుషులు, మహిళళపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో 83 శాతం పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే హెయిర్ షాఫ్ట్ డయామీటర్ లాంటి వాటితో బాధపడే రోగుల్లో ఆరు నెలల చికిత్స ముగిసిన తర్వాత 100 శాతం పెరుగుదల కనిపించింది. హెయిర్ లాస్ ఎదుర్కుంటున్న పీసీఓఎస్ రోగుల్లో 80 శాతం జుట్టు నిరంతరం మళ్లీ పెరుగుతూ ఉండేలా అత్యంత ప్రభావవంతమైన ఫలితాలు ఇచ్చింది. ఒక ఏడాది పాటు నిర్వహించిన గ్లోబల్ అసెస్ మెంటులో సగటు హెయిర్ కౌంట్‌లో 12.71 శాతం పెరుగుదల గమనించారు.ఈ చికిత్సకు రోజుకు రూ.200 ఖర్చవుతుంది. కేవలం 8 సెషన్ల చికిత్సలోనే జుట్టు పెరుగుదల ఉంటుందని, లేదంటే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా,నే రూ.12,000 విలువైన రెండు అదనపు సెషన్లు సేవలు అందుకోవచ్చునని డాక్టర్ దేబ్రాజ్ షోమ్, డాక్టర్ రింకీకపూర్ భరోసా ఇస్తున్నారు. చదవండి: పేను కొరుకుడు అంటే ఏంటో తెలుసా? -
చుండ్రు...ఆహారపరమైన జాగ్రత్తలు
చుండ్రు సమస్య ఉన్నవారు మాంసాహారం తక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవి కొంతమేర చుండ్రు సమస్యను ప్రేరేపించేందుకు అవకాశం ఉంది. ఇక చుండ్రును అరిట్టేందుకు ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతో పాటు అన్నిరకాల కాయగూరలు, తాజా పండ్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడంలో దోహదపడతాయి. తద్వారా చుండ్రు సమస్యకు చెక్ చెప్పొచ్చు. అలాగే చుండ్రు ఉన్నవారు రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగి, చర్మం బిగుతుగా మారి చర్మ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇవే ఆహార నియమాలు ఆరోగ్యవంతులకూ చుండ్రు రాకుండా నివారిస్తాయి . -
జుట్టు సమస్యకు రవీనా టండన్ చిట్కాలివే ..
ముంబై: పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందిన బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఓ చిట్కా చెప్పింది. ప్రస్తుత ప్రపంచంలో జుట్టు రాలడమనేది అతి పెద్ద సమస్య. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాగా రవీనా వరుసగా బ్యూటీ సిరీస్ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు. ప్రస్తుతం జట్టు సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కా చెప్పారు. ఎన్ని కెమికల్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని, కొద్ది రోజుల తర్వాత జుట్టు సమస్యతో బాధపడుతుంటారని రవీనా తెలిపింది. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని పేర్కొంది. జట్టు రాలడాన్ని నివారించే రవీనా ఉసురికాయ(ఆమ్లా) మిశ్రమం: మొదట ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. కాగా బయట ఉన్న ఉసురి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు మర్దన చేశాక, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రపరచాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే త్వరలోనే షాంపో వాడకాన్ని తగ్గించవచ్చని రవీనా టండన్ తెలిపింది. (చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు) -
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్‌లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
జుట్టు రాలుతోంది... ఆపేదెలా?
నా వయసు 26 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. రోజూ తలదువ్వుకునేప్పుడు పోగులు పోగులుగా దువ్వెనలోకి జుట్టు వస్తోంటే చాలా ఆందోళనగా ఉంటోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు దయచేసి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. అలాగే రాలిపోయిన జుట్టు మళ్లీ పెరిగి, తలకట్టు ఒత్తుగా చేసుకునేందుకు మార్గాలు / చికిత్సలు ఉంటే వివరించండి.– సుష్మా, సికింద్రాబాద్ ప్రతిరోజూ కొన్ని జుట్టు స్ట్రాండ్స్ రాలిపోవడం చాలా సహజమైన (నేచురల్) విషయమే. జుట్టు జీవితచక్రంలో... అది ఒక దశ వరకు పెరగడం, ఆ తర్వాత రాలిపోవడం, అటుపై జుట్టు అంకురం కొంతకాలం విశ్రాంతి తీసుకొని, మళ్లీ అందులోంచి కొత్త వెంట్రుక (స్ట్రాండ్) పెరగడం అన్నది నిరంతరం జరిగే ప్రక్రియ. మనందరిలోనూ అంటే ఆరోగ్యకరమైన మనిషి విషయంలోనూ ప్రతిరోజూ 60 – 100 వెంట్రుకలు (స్ట్రాండ్స్) రాలిపోతూ ఉంటాయి. ఇవన్నీ మళ్లీ వస్తూ ఉంటాయి కూడా. అయితే దాని కంటే ఎక్కువగా రాలిపోతూ... రాలేవాటి కంటే పెరిగేవి తగ్గుతూ పోతుంటే మాత్రం కాస్తంత ఆలోచించాల్సిందే. జుట్టు రాలేందుకు కారణాలు... ⇔ చాలా తీవ్రమైన శారీరక/మానసిక ఒత్తిడులు ఉన్నా లేదా తీవ్రంగా జబ్బు పడ్డా కొందరిలో అది జుట్టు రాలిపోయేందుకు దారితీస్తుంది. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. ⇔ మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం ఓ కారణం. ⇔ సమతుల పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొందరిలో జుట్టు రాలుతుంది. ⇔ ఇంకొందరిలో హార్మోన్ల లోపం జుట్టు రాలడానికి కారణమవుతుంది. సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిలల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిపాటి పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది. ఒక్కోసారి ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల జుటు రాలుతుంది. మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా పేర్కొంటుంటారు. ఉదాహరణకు... ∙పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మన మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి ∙లైకెన్ ప్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇంకొందరిలో రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం మామూలే. ⇔ రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి విపరీతంగా వెలువడుతున్న కాలుష్యాల కారణంగా వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడం ఎలా? జుట్టు రాలడం అన్నది ఏ కారణాల వల్ల జరుగుతోందో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే ఏదైనా జబ్బు కారణంగా ఇలా జరుగుతుంటే... ఆ జబ్బును నయం చేసుకుంటే (అండర్లైయింగ్ కారణానికి చికిత్స తీసుకుంటే) జుట్టు రాలడం తగ్గుతుంది. వీటన్నింటినీ గుర్తించి త్వరగా మందులు వాడితే రాలిన జుట్టు మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొందరు మహిళల్లోనూ బట్టతల మహిళలకు బట్టతల రాదని కొందరు అనుకుంటారు. కానీ అరుదుగా మహిళల్లోనూ బట్టతల వస్తుంది. దీన్ని ‘ప్యాటర్న్ హెయిర్‌లాస్’ అంటారు. ఇలాంటి మహిళల్లో క్రమంగా వారి పాపిట మెల్లమెల్లగా వెడల్పుగా అవుతుండటం కనిపిస్తుంది. దీంతో మహిళల్లోని బట్టతల వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు. ఇలాంటివారు వైద్యులను కలిస్తే బట్టతలను చాలావరకు నివారించవచ్చు. ఇక మిగతా వారు తమ జుట్టు రాలే సమస్యల కోసం కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకున్న తర్వాత కూడా జుట్టు ఇంకా రాలుతుంటే అప్పుడు మాత్రం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. వెంట్రుకలను కాపాడుకునే పద్ధతులు ⇔ వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదర్థాలు, తాజా పండ్లు తీసుకోవాలి. ⇔ క్రమం తప్పకుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు. సాధారణంగా వారంలో రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. (ఐడియల్.) ⇔ అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హాట్ పెట్టుకోవడం చేయాలి. ⇔ ఒకసారి వైద్య నిపుణులను సంప్రదించి, హార్మోన్ లోపాల వల్ల ఈ సమస్య వచ్చిందా అన్నది తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఆ సమస్యను చక్కదిద్దగానే జుట్టు రాలడం ఆగిపోతుంది.-డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్