ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్ చేశారు.
జన్యుపరంగా బ్రయాన్‌కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్‌పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది.
అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్‌లైట్ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు.
ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్‌లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
కాగా, బ్రయాన్ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్ .
(చదవండి: 'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment