tech
-
Millionaire Bryan Johnson: డైట్లో గరం మసాలా, స్టీల్ డబ్బాల్లో..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత తనపై చేసుకుంటున్న ప్రయోగాలు ఫలితాల గురించి కూడా నెటిజన్లతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటారు. వాటిలో కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. అయితే బ్రయాన్ తన డైట్లో భారత ఆహార పదార్థాల గొప్పతనం వాటి ప్రయోజనాల గురించి గతంలో షేర్ చేసుకున్నారు. తాజాగా భారతీయులు కూరలకు సువాసనతో కూడిన ఘమఘమలు అందించేందుకు ఉపయోగించే గరం మసాలాని కూడా తన డైట్లో చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు. తరుచుగా మన ముంబైలో గాలి నాణ్యత బాగాలేదని ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందంటూ విచారం వ్యక్తం చేసే బ్రయాన్ మన భారతీయ వంటకాల గొప్పదనాన్ని మాత్రం మెచ్చుకుంటూనే ఉంటారు. వాటిలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు కూడా. కానీ ఈసారి బ్రయాన్ మన భారతీయులు ప్రయాణాల్లో ఉపయోగించే టిఫిన్ డబ్బాల్లోనే ఆహారం నిల్వ చేయడం విశేషం. అలాగే భారతీయులు ఉపయోగించే గరం మసాలను కాల్చిన యాపిల్, క్యారెట్లతో కూడిన బటర నట్ స్క్వాష్ సూప్‌లో ఉపయోగించినట్లు వెల్లడించారు. ఇక ఆ రెసిపీ తయారీ విధానాన్నికూడా సవివరంగా వెల్లడించారు. అలాగే తన సూపర్‌ఫుడ్ స్మూతీ బ్లాక్‌బీన్ అండ్ మష్రూమ్ బౌల్ విత్ చిక్పీ రైస్‌లో ఏమి జోడించి తింటారో కూడా తెలిపారు. వీటితోపాటు మెటల్ కంటైనర్లలో(స్టీల్ డబ్బాల్లో) నిల్వ చేసిన తన ఫుడ్ ఫోటోలను కూడా షేర్ చేశారు. అవి చూడగానే భారతీయుల మాదిరిగా స్టీడబ్బాలు, టిఫిన్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన అందరికి ఆరోగ్యంపై స్ప్రుహ కలుగుతోందని, అందువల్లే ఫాస్ట్‌ఫుడ్ నుంచి ఆరోగ్యకరమైన భారతీయ ఆహార విధానాల వైపు దృష్టిపెడుతున్నారంటూ పెట్టిన పోస్టు నెటిజన్లందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదీ ఏమైన వృద్ధాప్యాన్ని తరిమికొట్టే ప్రయోగాలకు పేరుగాంచిన బ్రయాన్ జాన్సన్ సైతం మన భారతీయులు ఆహార సంస్కృతిని గౌరవించడం, వాటి ప్రయోజనాల గురించి ఆయన నోట వినడం చూస్తుంటే మన పెద్దలు ఆనాడే ఆరోగ్యం పట్ల ఎంత జాగుకరతతో వ్యవహరించారో అనిపిస్తోంది కదూ. ఇప్పటిది కాదు ఆరోగ్య స్ప్రుహ ఆనాడే మన పూర్వీకులు దానిపై దృష్టిపెట్లి మనకు ఔషధ గుణాలు కలిగిన వాటిని పరిచయం చేసి ఉపయోగించేలా చేశారు కదూ..!. What I'm eating for the next few days: Blueprint Superfood Smoothie •½ cup strawberries•½ cup blueberries•¼ cup pomegranate arils•½ cup dark cherries, pitted•1 cup almond milk•1 tablespoon flax seeds•5-6 macadamia nuts•1 teaspoon chia seeds•1 teaspoon… pic.twitter.com/YWfX1zR6hc— Bryan Johnson /dd (@bryan_johnson) February 18, 2025 (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
కొవిడ్-19 మహమ్మారికి ముందు టాప్ ఐటీ సంస్థల్లో వేతన ఇంక్రిమెంట్లు రెండంకెలమేర వృద్ధి చెందేవి. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో వేతన పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతన పెంపును అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. నివేదికల ప్రకారం వేతన పెంపు 4% నుంచి 8% వరకు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల సవరించిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. ఈ మేరకు త్వరలో వారికి లేఖలు అందుతాయని కొందరు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులోగా ఉద్యోగులకు వేతన సవరణలకు సంబంధించిన లేఖలు జారీ చేయాలని మరో టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలుటీసీఎస్ జీతాల పెంపు, వేరియబుల్ చెల్లింపులను 2024 ప్రారంభంలో ప్రకటించిన రిటర్న్-టు-ఆఫీస్ (ఆర్టీఓ) ఆదేశానికి ఉద్యోగులు కట్టుబడి ఉండటానికి ముడిపెట్టింది. దానిప్రకారం ఆర్టీఓ పాలసీని పాటించిన ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. టీసీఎస్ ఏకీకృత నికర లాభంలో 11.95% పెరుగుదలను నివేదించినప్పటికీ మొత్తంగా స్వల్ప వేతన పెంపు మాత్రమే ఉందనే వాదనలొస్తున్నాయి. కంపెనీ నికరలాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.12,380 కోట్లకు చేరుకుంది. నికర అమ్మకాలు రూ.60,583 కోట్ల నుంచి 5.59 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు పెరిగాయి.ఇదీ చదవండి: లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లుఉద్యోగులు ఏమంటున్నారంటే..వేతన పెంపు సానుకూల పరిణామమే అయినప్పటికీ కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు క్రమంగా తగ్గుముఖం పట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతంగా ఉన్న సగటు వేతన పెరుగుదల 2024 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతంగా ఉంది. ఏదేమైనా ఆర్టీఓ పాలసీని పాటించేవారికి అధిక ప్రోత్సాహకాలు ఉంటాయనే వాదనలుండడంపట్ల ఉద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది. -
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
ఏఐకి కీలక మార్కెట్ భారత్
కాలిఫోర్నియా: కృత్రిమ మేథ (AI development) విషయంలో భారత్ తమకు కీలక మార్కెట్‌గా ఉందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రెసిడెంట్(Samsung President) టీఎం రోహ్ తెలిపారు. తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్25లో ఏఐ ఫీచర్లను పొందుపర్చడంలో బెంగళూరు, నోయిడాలోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాలు ముఖ్యపాత్ర పోషించినట్లు చెప్పారు. ఎస్25లోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ జెమినీ లైవ్ ఫీచర్లో కొరియన్, ఇంగ్లీష్ భాషలతో పాటు హిందీని కూడా చేర్చినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మౌలిక వసతులకు భారీ నిధులుత్వరలో మరిన్ని భాషలను కూడా చేర్చనున్నామని, ఈ ప్రక్రియలోను భారత ఆర్అండ్డీ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని చెప్పారు. ఇవి ఇతర గెలాక్సీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా పని చేస్తున్నట్లు రోహ్ వివరించారు. ఈ నేపథ్యంలో పరిశోధన కేంద్రాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. దక్షిణ కొరియా వెలుపల తమకు అతి పెద్ద ఆర్అండ్డీ కేంద్రాలు భారత్‌లోనే ఉన్నట్లు రోహ్ చెప్పారు. పరిశ్రమ ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచి ఏఐ ఫోన్ల వైపు మళ్లుతోందన్నారు. ఎస్25 మోడల్స్‌కి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను జోడించేందుకు కొన్ని దేశాల్లోని టెలికం సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు. -
స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.టెక్ సంస్థల వాదనలుఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.టెలికాం ఆపరేటర్ల వాదనలుస్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానంప్రభుత్వ వైఖరి..టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం!
భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్‌లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో భారత్ జాబ్ మార్కెట్ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో 43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.భారత్‌లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్ఏ 18 శాతంగా ఉంది.రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.భారత్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌తో సమానంగా బ్రెజిల్లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు. -
ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం..!
అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేందుకు కోట్లకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగత తెలిసంది. దీన్ని బ్లూప్రింట్ ప్రాజెక్ట్ పేరుతో యువకుడిలా కనిపించే ప్రయోగాలకు నాందిపలికారు. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాను చేస్తున్న ప్రయోగం సక్సస్ అయితే నిత్య యవ్వనంగా ఉండలనే మనిషి కోరిక నేరవేరడం తోపాటు దీర్ఘాయవును పొందేలా ఆరోగ్యంగా ఉండటం ఎలా అనేదానికి మార్గం సుగమం అవుతుందనేది బ్రయాన్ కోరిక. ఆయన కారణంగానే అందరిలోనూ భవిష్యత్తు ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నేపథ్యంలో ఆయన ఏ చిన్న ట్వీట్ చేసినా, ఎవ్వరితో సమావేశమైనా హాట్‌టాపిక్ అవుతుంది. తాజాగా బ్రయాన్ ముంబై సందర్శన తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అక్కడ బ్రయాన్ లిటిల్ నెస్ట్ కమ్యూనిటీలో శ్లోకా అంబానీ, ఆనంద్ పిరమల్, సోనమ్ కపూర్ అహుజా వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారితో భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు గురించి చర్చించారు. అలాగే జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. ఇక బ్రయాన్ భారతదేశం పర్యటనలో వాయు కాలుష్యం గురించి మాట్లాడారు. దీన్ని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా అభివర్ణించారు. ముంభైలో ఉన్న పేలవమైన గాలి నాణ్యత గురించి షేర్ చేసుకున్నారు. ఈ కాలుష్యం ప్రభావం పడకుండా N95 మాస్క్‌లు, HEPA ఫిల్టర్లను ఉపయోగించాలని సూచించారు. ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉందని తన కళ్లు, గొంతు కూడా మండుతున్నాయని వాపోయారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ ఆరోగ్యకరమైన గాలి లభించే వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, బ్రయాన్ భారత్ పర్యటన సమావేశాలు దీర్ఘాయువుపై ప్రపంచ ఆసక్తిని గురించి నొక్కి చెబుతున్నాయి. అలాగే భారత్‌లోని హెల్త్ సంబంధితన వెల్నెస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను కూడా హైలెట్ చేసింది. Great speaking with the Little Nest community about the future of health and longevity. Big thanks to Shloka Ambani, Anand Piramal and Sonam Kapoor Ahuja for hosting me. pic.twitter.com/i2O2vbrWQC— Bryan Johnson /dd (@bryan_johnson) December 4, 2024 (చదవండి: ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!) -
చావు ఏ రోజో చెప్పే ఏఐ!
టెక్నాలజీ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. కృత్రిమమేధ పరిధి పెరుగుతోంది. కిచెన్‌లో రిఫ్రిజిరేటర్, టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్.. వంటి అన్ని విభాగాల్లోకి ఏఐ ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం. దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పని అయ్యేలా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు మరింత విభిన్నంగా ఆలోచించి మనిషి మరణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు అందించి మరణానికి మరెంత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నారు. ఈమేరకు మార్కెట్లో కొత్తగా యాప్‌లో వెలుస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.మరణ తేదీ అంచనా..‘డెత్ క్లాక్’ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ దాదాపు 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. 5.3 కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తుంది. వినియోగదారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు.. వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది.ఇదీ చదవండి: ‘మస్క్ ఒక విలన్.. అందుకే రాజీనామా’సమయం వృథా చేయడం దేనికి..మరణం ఎప్పడైనా, ఎలాగైనా సంభవించవచ్చు. మన పరిధిలోలేని దాని గురించి ఆలోచించి సమయం వృథా చేయడం కంటే.. మరణం తథ్యం అనే వాస్తవాన్ని జీర్ణించుకుని జీవితంలో చేయాల్సిన కార్యాలు, మంచి పనులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఏదైనా జరిగి మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే టర్మ్ పాలసీను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిపాలైతే ఆరోగ్యబీమా ఆదుకుంటుందని సూచిస్తున్నారు. -
‘డిజిటల్ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’
డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు. -
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఎంఆర్ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్‌వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్‌లో కూర్చొమని అన్నారు.ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్‌ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు. అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024 (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్‌ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్ చేశారు. జన్యుపరంగా బ్రయాన్‌కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్‌పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది. అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్‌లైట్ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు. ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్‌లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, బ్రయాన్ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్ . (చదవండి: 'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!) -
ఏఐపై అతిగా ఆధారపడొద్దు: శక్తికాంత దాస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్‌దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!డిజిటలీకరణతో మనీ ట్రాన్స్ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
స్పీడ్ విజన్ కెమెరాలతో రైలు ప్రమాద కుట్రలకు చెక్
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్‌లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్లు ట్రాక్‌పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది. ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా? -
టెక్ మిలియనీర్ హెల్తీ స్కిన్ చిట్కాలు..!
అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. నిత్య యవ్వనంగా ఉండేందుకు కోట్లు ఖర్చుపెడుతున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల ఈ టెక్ మిలియనీర్ తన జీవ సంబంధ వయసును తిప్పికొట్టి 18 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా కనిపించాలని సప్లిమెంట్లతో కూడిన కఠిన ఆహార నియమావళిని అనుసరించేవాడు. దీన్ని తన బ్లూప్రింట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా ప్రయోగానికి పూనకున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాజగా ఆయన తన వయసు రీత్యా చర్మంలో వచ్చే మార్పులను అందుకు తీసుకోవాల్సిన చిట్కాలను గురించి వివరించాడు. అందుకోసం తాను ఏం చేస్తున్నాడో కూడా వివరించాడు. అవేంటంటే..బ్రయాన్ జాన్సన్ 46 ఏళ్ల వయసులో చర్మ సంరక్షణ గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల వృధాప్య లక్షణాలు వచ్చి తన చర్మం ఎలా ముడతలు పడినట్లయ్యిందో తెలిపారు. అంతేగాదు తన జీవ సంబంధమైన వయసుని తిప్పికొట్టి చర్మం కాంతిగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టడం అత్యంత అవసరమని అన్నారు. వడదెబ్బ, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన బాడీ క్రీమ్‌లు వాడకపోవడం తదితర కారణాల వల్ల చర్మం తొందరగా ఆకర్షణీయతో కోల్పోతుందన్నారు. ఫలితంగా వయసు పెద్దగా కనిపించేలా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తన చర్మం మెరుగుపడి 37 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు కూడా షేర్ చేశారు. వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తదితరాలే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని అన్నారు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్లు వంటి ఉపయోగించి చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పారు. అందుకోసం తాను అనుసరిస్తున్న కఠిన ఆహార నియమావళి గురించి తెలిపారు. అలాగే ఉదయం, రాత్రి వేళలు తప్పనిసరిగా ముఖం కడగడం, మినరల్ సన్‌స్క్రీన్‌ను పూయడం, మాయిశ్చరైజర్లను వాడటం వంటివి చేస్తానని అన్నారు. చర్మం ఆరోగ్యం కోసం నియాసినామైడ్, విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, ప్రిస్క్రిప్షన్ ట్రెటినోయిన్ వంటి నిర్దిష్ట క్రీముల వినియోగాన్ని కూడా వివరించారు. ప్రతి ఒక్కటి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నష్టాన్ని నివారిస్తాయని చెప్పారు. అలాగే చర్మసంరక్షణ ఉత్పత్తులో తరుచుగా కనిపించే ఎండోక్రైన్ డిస్రప్టర్లు మంచివి కావని, ఇది వన్యప్రాణులు, మానవుల ఆరోగ్యానికి హానికరమైనవని చెప్పుకొచ్చారు. తన చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా టిక్సెల్, సోఫ్వేవ్, యు స్కల్ప్ట్రా వంటి చికిత్సలను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. దీంతోపాటు రెడ్‌లైట్ థెరపీ, మచ్చలు లేని చర్మం కోసం అక్యుటేన్ మైక్రోడోసింగ్ వంటి వాడకం గురించి కూడా చెప్పారు జాన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.My daily protocol:Face wash morning & night.+ Sunscreen (mineral)+ Moisturize (Body and Face)+ Creams - can start with the basics such as niacinamide (morning and night), vitamin C (morning), hyaluronic acid (as desired), and tretinoin (at night, an Rx). pic.twitter.com/Qpl6hd7yc2— Bryan Johnson /dd (@bryan_johnson) September 26, 2024 (చదవండి: పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?) -
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్ కానేకాదు..
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.బ్రష్‌లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా! -
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్‌కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్‌ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్! ఎలా అంటే?
మారుతున్న టెక్నాలజీ పరంగా.. మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి. అందులో ఎన్నోరకాల పరికరాలను చూసుంటాం. మోకాళ్ల నొప్పులను, వినికడి లోపాలను సరిచేసేటువంటి వీటిని మీరెప్పుడైనా వాడటంగానీ, చూడటంగానీ చేశారా..! అవేంటో మరి చూద్దామా..మోకాలి నొప్పులకు చెక్!ఆటలాడేటప్పుడు గాయాలు కావడం వల్ల కొందరు మోకాలి నొప్పుల బారినపడుతుంటారు. ఇంకొందరు కీళ్ల అరుగుదల వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పులు తగ్గడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కాపడాలు పెట్టించుకుంటుంటారు. వీటి వల్ల వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే! మోకాలి నొప్పుల నుంచి సత్వర ఉపశమనం కలిగించేందుకు అమెరికన్ కంపెనీ ‘నీ ఫ్లో’ హెల్మెట్ ఆకారంలో ఉన్న ఈ మసాజర్‌ను రూపొందించింది.ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. మోకాలికి దీనిని బిగించి కట్టుకుని, దీనికి ఉన్న స్విచ్‌ను ఆన్ చేసుకుంటే చాలు– దీని లోపలి వైపు నుంచి కాంతి, వేడి వెలువడటమే కాకుండా, లయబద్ధంగా వెలువడే ప్రకంపనలు మోకాలి కీళ్లకు కండరాలకు మర్దన చేస్తాయి. దీని వల్ల వాపు, నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే కీళ్ల కదలికలు త్వరగా చురుకుదనాన్ని పుంజుకుంటాయి. ‘నీ ఫ్లో’ మసాజర్ మోకాలి ఉపరితలానికి మాత్రమే కాకుండా, లోపలి భాగాలకు కూడా ఫిజియో థెరపీ అందిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,775) మాత్రమే!కళ్లకు జోడు.. చెవులకు తోడు..ఇది కళ్లజోడులా కనిపిస్తుంది. అలాగని కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వినికిడి సమస్యలు ఉన్నవారి చెవులకు తోడు కూడా. అంటే, ఇది స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ అన్నమాట! జర్మన్ కంపెనీ ‘ఆడియా అకాస్టిక్’ ఈ స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్‌ను ‘బ్రకాఫ్’ బ్రాండ్ పేరుతో ‘స్పెక్టకిల్ ఎయిడ్’గా రూపొందించింది.దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు రెండూ ఉన్నవారికి ఇదొక వరమనే చెప్పాలి. ఇందులోని కళ్లద్దాలు దృష్టిని స్పష్టం చేస్తాయి. కళ్లజోడు చెవులకు పెట్టుకునే భాగంలో చివరివైపు ఉన్న హియరింగ్ ఎయిడ్ శబ్దాలను స్పష్టంగా వినేందుకు దోహదపడుతుంది. మిగిలిన హియరింగ్ ఎయిడ్ పరికరాల మాదిరిగా దీనిని చెవి లోపల పెట్టుకోనవసరం లేదు. మామూలు కళ్లజోడు తొడుక్కున్నట్లే పెట్టుకుంటే సరిపోతుంది.దృష్టి లోపాలు లేకుండా వినికిడి సమస్యలు మాత్రమే ఉన్నవారు జీరో పవర్ గ్లాసెస్‌తో తీసుకుని, దీనిని తొడుక్కుంటే చాలు. కోరుకున్నంత ధ్వనిలో శబ్దాన్ని వినేందుకు వీలుగా ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ధర 495 పౌండ్ల (రూ. 51,593) నుంచి ప్రారంభం. ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ మోడల్స్ బట్టి కొంత ఎక్కువ కూడా ఉంటుంది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్‌ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్‌ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్‌లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్‌తో పరుగులు తీసే కారు.. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్‌లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్‌యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్‌లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్‌కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
టెక్ టాక్: ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్‌కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్‌లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్‌లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్‌లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్‌తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్‌లో భారత ఫిల్టర్ కాఫీ -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్‌ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
మళ్లీ టెక్ ‘లేఆఫ్’.. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్ : టెక్ ‘లేఆఫ్స్’మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరి తొలి రెండువారాల్లోనే 58 టెక్ కంపెనీలు 7,785 మంది ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్–ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజాగా స్పష్టం చేసింది. టెక్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఈ లేఆఫ్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే..రాబోయే రోజులు కూడా భారత ఐటీ వృత్తినిపుణులు, టెకీలకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడి ఇంకా మూడు వారాలు కూడా దాటకుండానే వేలాది మంది టెక్ స్టార్టప్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురికాగా, రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయపడుతున్నారు. ‘జెనరేటివ్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్షంగా కారణమని వారంటున్నారు. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా.... ► గూగుల్... డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్‌లలో వందలాదిమంది ► అమెజాన్ సంస్థలోని అమెజాన్ ఆడిబుల్ తమ వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం ► అమెజాన్ ప్రైమ్ వీడియోలో వందలాదిమంది ఉద్యోగులు ► అమెజాన్ ట్విచ్ తన వర్క్‌ఫోర్స్‌లో 35 శాతం అంటే 500 మంది ► సోషల్ చాట్, మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ 17 శాతం ఉద్యోగులను అంటే 170 మంది ► వీడియోగేమ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్వేర్ తన ఉద్యోగుల్లో 25 శాతం అంటే 1,800 మంది ► ఐటీ కంపెనీ జిరాక్స్ తన వర్క్‌ఫోర్స్‌ను 15 శాతం అంటే 3000మంది ► యూఎస్‌కు చెందిన ప్రాప్‌టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ గూగుల్ మీట్లో రెండు నిమిషాల్లోనే తన 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదంతా ఇదే పరిస్థితి ఉండొచ్చు భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం/వాయిదా పడడంతో ఆ ప్రభావం ఇక్కడి ఐటీ పరిశ్రమపై పడింది. యూఎస్ వడ్డీరేట్ల పెరుగుదల, పరిశ్రమపై చాట్ జీపీటీ వంటి కృత్రిమమేథ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయిల్ వ్యవహారం, ఎర్రసముద్రంలో హైతీ తీవ్రవాదుల దాడులు వంటివి కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికా డాలర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు రావాల్సిన నూతన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరోనా కాలంలో భారీగా ప్రాజెక్టులు వస్తాయని కంపెనీలు ఊహించి పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేశాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరిట పెద్దసంఖ్యలో లేఆఫ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 2020–21 నుంచే యూఎస్ ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఈ విధంగా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చునని భావించింది. అయితే మూడేళ్లుగా ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా ఇలాంటి చర్యలే కొనసాగాయి. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా కూడా ప్రస్తుత పరిస్థితులే కొనసాగే అవకాశాలున్నాయి. – ఎన్.లావణ్యకుమార్, స్మార్ట్‌స్టెప్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు లేఆఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌కు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈ ప్రకంపనలు భారత్ టెక్, ఐటీ ఇండస్ట్రీపై కూడా పడడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది..ఎలాంటి చిక్కులు, అడ్డంకులు సృష్టిస్తుందనేది చూడాలి. ఆర్థికంగా ఎదురయ్యే పరిస్థితులు, మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితరాలతో మనదేశంలోనూ పెద్ద కంపెనీ లేఆఫ్స్‌కు దిగడం మొదలుపెట్టాయి. గ్లోబల్ ఐటీ వర్క్‌ఫోర్స్‌కు భారత్ అందిస్తున్న భాగస్వామ్యం ముఖ్యమైనది కావడంతో లేఆఫ్స్‌తో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఐటీరంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ ప్రభావాలు, పరిణామాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ దిగ్గజాలు, వృత్తినిపుణులు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే లేఆఫ్స్ అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. – కార్తీక్ డాలే, డేటాస్కిల్స్ సంస్థ ఫౌండర్ -
స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్! ఆటకు సాంకేతికతను జోడించి..
ఆటలు, సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు విషయాలు కాదు. సాంకేతికత సహాయంతో ఆటల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు... అనే లక్ష్యంతో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా ‘స్తూప స్టోర్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది మేఘా గంభీర్. ఎలాంటి ప్లాన్ లేకుండానే పెద్ద కార్పొరేట్ కంపెనీలో తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది మేఘా గంభీర్. అదే సమయంలో ఆమె భర్త, టేబుల్ టెన్నిస్ కోచ్ దీపక్ మాలిక్ ‘టెక్నాలజీ సహాయంతో ట్రైనీల పెర్ఫార్మెన్స్ను ఎలా మెరుగుపరచవచ్చు...’ అనే అంశంపై ఆలోచిస్తున్నాడు. మేఘకు వెంటనే స్టార్టప్ ఐడియా తట్టింది. డేటా, ఎనలటిక్స్ సహాయంతో ప్లేయర్స్ తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి రెండు సంవత్సరాల క్రితం ‘స్తూప స్పోర్ట్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. దీనికిముందు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, పెప్సికో... మొదలైన కంపెనీలలో పదిహేను సంవత్సరాల పాటు టెక్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. మేఘకు ఆటలు అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆటలలో నిపుణుౖలైన ఎంతోమందితో మాట్లాడిన తరువాత తన స్టార్టప్ ఐడియాను పట్టాలకెక్కించింది. డేటాను కాప్చర్ చేసే ఆటోమేటెడ్ ఇంజిన్‌ను తయారు చేయడానికి సంవత్సరానికి పైగా టైమ్ పట్టింది. ఆటలో ప్రతి కోణాన్ని విశ్లేషించుకునేలా కోర్టులో 8–10 కెమెరా సెటప్‌కు రూపకల్పన చేశారు. కంపెనీకి సంబంధించి ప్రత్యేక టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి పదిహేనుకు పైగా గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు. ‘టెక్నాలజీ వైపు నుంచి స్పోర్ట్స్ ఎనలటిక్స్ వైపు మేఘ రావడానికి కారణం ఏమిటి?’ జవాబు ఆమె మాటల్లోనే... ‘ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పటికీ నేను చేస్తున్న ఉద్యోగంతో సంతోషంతో లేను. ఉద్యోగం కాకుండా నెక్ట్స్ ఏమిటి... అని ఆలోచించడానికి గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నా భర్త వల్ల స్టార్టప్ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్‌లో నా కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేస్తే మంచి స్పందన వచ్చింది. జూనియర్స్, యూత్, సీనియర్స్... ఇలా రకరకాల విభాగాలు ఆటలో ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు, ప్రతి ప్లేయర్‌కు సంబంధించిన సమాచారాన్ని కాప్చర్ చేయడం కోచ్‌లకు కష్టం అవుతుంది. ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించడానికి వారి దగ్గర తగిన సమాచారం ఉండాలి. ఒక ప్లేయర్ టోర్నమెంట్‌కు సంబంధించి అయిదు లేదా పది మ్యాచ్‌లు చూడాల్సి వస్తే డేటా రాయడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఎనలటిక్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్‌ను తీసుకువచ్చాం. దీనిద్వారా ప్లేయర్స్ తమ మ్యాచ్ వీడియోలను అప్లోడ్ చేసి విశ్లేషణ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు. ఇదే సమయంలో కామెంటర్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్స్ రూపొందించాం. టేబుల్ టెన్నిస్‌తో మొదలుపెట్టాం. బ్యాడ్మింటన్లాంటి ఇతర ఆటల్లోకి కూడా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాం’ అంటుంది మేఘా గంభీర్. నాణ్యతతో కూడిన వర్చువల్ కోచింగ్, ప్లేయర్స్‌కు ఉపయోగపడే సెన్సర్–బేస్డ్ టెక్నాలజీపై ప్రత్యేక కృష్టి పెట్టింది కంపెనీ. యూరప్ మార్కెట్లో పట్టు సంపాదించిన ‘స్తూప’ ఆసియా, యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంది. ‘మహిళా స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్లు తక్కువగా కనిపిస్తారు. చాలామంది లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫుడ్‌లాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను విజయం సాధించడానికి కారణం చక్కని సలహాలు ఇచ్చిన అనుభవజ్ఞులు, విషయ నిపుణులు, ప్లేయర్స్, కోచ్‌ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్’ అంటుంది మేఘా గంభీర్. (చదవండి: ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! వెడ్డింగ్ విత్ టికెట్!) -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్‌లో భాగంగా తనే ఏజ్‌ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్‌ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్‌ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్‌గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్‌లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్‌లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్‌ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్‌పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
ఆసక్తే అతడి శక్తి! అదే టాప్ డిజిటల్ స్టార్‌గా మార్చింది!
తెలుసుకోవాలనే ఆసక్తి ఆ తరువాత శక్తిగా మారుతుంది. శక్తిమంతులు ఊరకే ఉంటారా! కొత్త ద్వారాలు తెరుస్తారు. గర్వ పడేలా ఘన విజయాలు సాధిస్తారు. ఢిల్లీకి చెందిన జే కపూర్ టెక్నో యూనివర్శిటీలలో చదువుకోలేదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అంటూ గ్యాడ్జెట్ల పుట్టుపుర్వోత్తరాల గురించి ఆసక్తి చూపించేవాడు. ఆ ఆసక్తి అంతులేని శక్తిని ఇచ్చింది. ‘డిజిటల్ స్టార్’ హోదాలో హుందాగా కూర్చోబెట్టింది. తాజాగా... ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు జే కపూర్... మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తితే జే కపూర్‌ను వెదుక్కుంటూ వచ్చే వాళ్లు ఫ్రెండ్స్. నిమిషాల వ్యవధిలోనే వాళ్లు పట్టుకొచ్చిన సమస్యకు పరిష్కారం చూపేవాడు కపూర్. కొంతకాలం తరువాత సుపరిచితులే కాదు అపరిచితులు కూడా కపూర్‌ను వెదుక్కుంటూ రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ‘తరచుగా ఎదురయ్యే కొన్ని సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు’ పేరుతో ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. అలా డిజిటల్ ప్రపంచంలో తొలి అడుగు వేశాడు. 2011లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అయితే చాలామంది యూట్యూబర్లకు ఎదురైనట్లే ఖరీదైన కెమెరా ఎక్విప్మెంట్స్ కొనడానికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఎలాగో కష్టపడి తనకు కావాల్సిన సాంకేతిక పరికరాలు సమకూర్చుకున్నాడు. లేటెస్ట్ టిప్స్, ట్రిక్స్, ట్యుటోరియల్స్, ట్రెండింగ్ టాపిక్స్‌తో తన యూట్యూబ్ చానల్ దూసుకుపోయింది. సక్సెస్‌కు ‘ఐడియా అండ్ రిసెర్చ్’ ముఖ్యమైనవి అంటాడు కపూర్. ట్విట్టర్ నుంచి దినపత్రికలలో వచ్చే ఆర్టికల్స్ వరకు ఎక్కడో ఒక చోట తనకు ఐడియా దొరుకుతుంది. ఆ తరువాత అన్ని కోణాల్లో దాని మీద రీసెర్చి మొదలుపెడతాడు. ‘కొన్నిసార్లు మూడు గంటల్లో చేసిన వీడియోలకు లక్షలాది వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు రోజుల తరబడి చేసిన వీడియోలు ఫ్లాప్ అవుతుంటాయి’ నవ్వుతూ అంటాడు కపూర్. 19 సంవత్సరాల వయసులోనే మన దేశంలోని ‘టాప్ 6 టెక్ యూట్యూబర్స్’లో ఒకరిగా నిలిచిన జే కపూర్ ఆండ్రాయిడ్ డెవలపర్ కూడా. ‘ఫ్లాష్ సేల్ హెల్పర్’ అతడి తొలి యాప్. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఉపయోగపడే ‘వోల్ట్ చెకర్’ యాప్ క్రియేట్ చేశాడు. ‘విజయం సాధించాలనే దృష్టితో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు అదేపనిగా చదవడం నుంచి కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం వరకు ఎన్నో చేస్తుంటాం. అయితే మన జయాపజయాలను నిర్ణయించేది మాత్రం మన కష్టమే’ అంటాడు జే కపూర్. టెక్ ఇన్ఫ్లూయెన్సర్గా సుపరిచితుడైన కపూర్ ‘మనీ మిసెక్ట్స్’ పేరుతో చేసే వీడియోలతో ఫైనాన్స్ ఇన్ఫ్లూయెన్సర్గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. కష్టం కనిపిస్తేనే విజయం కనిపిస్తుంది. స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. స్ఫూర్తి తీసుకోవడానికి పెద్దగా కష్టం అక్కర్లేదు. అయితే ఆ స్ఫూర్తిని మన విజయంగా మలుచుకోవడానికి మాత్రం బాగా కష్టపడాలి. కష్టం కనబడని చోట విజయం కూడా కనిపించదు. – జే కపూర్ (చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!) -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్‌కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ఇజ్రాయెల్ ‘స్టార్టప్ నేషన్’ ఎందుకయ్యింది? టెక్ దిగ్గజాల దృష్టిని ఎలా ఆకర్షించింది?
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కొనసాగుతోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా వందలాది మంది పౌరులను కోల్పోయింది. ప్రపంచానికి సాంకేతికతతో సహా వివిధ ఉత్పత్తులను విక్రయించే ఇజ్రాయెల్ ఇప్పుడు కష్టాల కొలిమిలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా హమాస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దీన్ని స్టార్టప్ కంట్రీ అని కూడా అంటారు. ఇంతటి ఘనమైన పేరు ఇజ్రాయెల్‌కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను అమితంగా ప్రోత్సహించింది. స్టార్టప్‌లకు నిధులను సమకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలకు తగిన మద్దతును అందిస్తుంది. ఇటువంటి స్నేహ పూర్వక వాతావరణం కారణంగానే దేశంలో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరిగింది. 1990లలో ఇజ్రాయెల్.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో హైటెక్ విప్లవాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ స్టార్టప్‌లు టెల్ అవీవ్ సాంకేతిక కేంద్రం నుండి జెరూసలేం వరకు విస్తరించాయి. దక్షిణ ఎడారి నగరమైన బీర్-షేవాలో కూడా ఇజ్రాయెల్ స్టార్టప్‌లు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్టార్టప్‌ల భాగస్వామ్యం కారణంగా ఇజ్రాయెల్.. ‘స్టార్టప్ నేషన్’ హోదాను దక్కించుకుంది. స్టార్టప్ దేశంగా మారిన ఇజ్రాయెల్ ఆర్థికంగా మరింత బలోపేతంగా మారింది. ఇక్కడి స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థలోకి $4.8 బిలియన్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇందులో 85 శాతం విదేశీ పెట్టుబడిదారులు ఉండటం విశేషం. ఇజ్రాయెల్ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.3 శాతం పరిశోధన, అభివృద్ధి రంగాలకు కేటాయిస్తోంది. గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల పరిశోధనా కేంద్రాలు ఇజ్రాయెల్‌లోనే ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్‌లోని పలు స్టార్టప్‌లు హెల్త్ టెక్, మొబైల్ యాప్‌లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్‌లను కలిగిన దేశంగా పేరుగాంచింది. ఈ దేశంలో ప్రతి 1,400 మందికి ఒక స్టార్టప్ ఉంది. అంటే దేశంలోని ప్రతి 1,400 మంది పౌరులలో కనీసం ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు లేదా సహ వ్యవస్థాపకుడు కనిపిస్తారు. ఇజ్రాయిలీలు పరిశోధన ఆవిష్కరణలకు పెట్టిందిపేరుగా నిలిచారు. ఈ దేశంలో 3,000కు మించిన హై-టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్మికులు సగటును అత్యధిక వేతనం పొందుతున్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? -
అగ్రి - టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్‌పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్‌ఎస్‌జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్‌ఎస్‌జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్‌లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్‌లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్‌కు డిఫైనింగ్ మార్క్‌ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్‌గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్‌లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్‌ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కొత్త ఒరవడి సృష్టించింది!
సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్‌కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె. ‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్‌లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య. భారీ మూల్యం చెల్లించాం ‘‘నన్ను హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్‌లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్‌లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది. చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా. సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్‌ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్‌లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ. ఫాలో అప్ సర్వీస్ వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్‌లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్‌ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది. నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్‌లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్‌కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది. -
China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!
ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన లేజర్లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్లు సూపర్ సోనిక్ మిసైల్లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది. ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం, చెంచుపల్లి గ్రామానికి చెందిన మేకల లిఖిత్ నవనీత్ (24) పోచారం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్నేహితుడు మచ్చ నవీన్‌తో కలిసి దిల్‌శుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వారిరువురు బైక్‌పై హాస్టల్ నుంచి పోచారానికి వెళుతుండగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడ్డారు. బస్సు వెనక చక్రాలు లిఖిత్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లిఖిత్ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్ చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరు మేకల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!) -
‘వైజాగ్ టెక్ సమ్మిట్ 2023’: భారీ పెట్టుబడులే లక్ష్యం
విశాఖపట్నం మరో ప్రపంచస్థాయి సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసంధానంతో పల్సస్ గ్రూపు సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 నిర్వహణకి సన్నాహాలు మొదలయ్యాయి. ``వైజాగ్ టెక్ సమ్మిట్ 2023``పేరుతో ఫిబ్రవరి 16, 17తేదీలలో నిర్వహించనున్న సమ్మిట్ కి గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు, మేధావులు హాజరు కానున్నారు. పల్సస్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ఇప్పటివరకూ 3,000లకు పైగా అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో వైజాగ్ టెక్ సమ్మిట్ బాధ్యతలు స్వీకరించారు. డిజిటల్, మెడికల్, టెక్ ఈవెంట్లను దిగ్విజయంగా నిర్వహించిన పల్సస్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో పల్సస్ గ్రూపు గ్లోబల్ నెట్వర్క్ ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చిన సంస్థలు-మేధావులు జ్ఞానాన్ని పంచుకోవడానికి, తాజా అంశాలను చర్చించడానికి, ఫ్యూచర్ టెక్నాలజీని ప్రదర్శించడానికి వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 వేదిక కానుంది. వర్చువల్, ఫిజికల్ ఈవెంట్ వేదికల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. ఫిబ్రవరి 16, 17తేదీలలో రెండు రోజులపాటు 3 సెషన్లలో 25 మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ప్రసంగిస్తారు. మనదేశంతోపాటు వివిధ దేశాల నుంచి ఇప్పటికే కంపెనీలు స్థాపించి విజయవంతంగా నడుపుతున్న ప్రతినిధులు వెయ్యి మందికి పైగా హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ టెక్ కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మార్గాన్ని చూపేందుకు సమర్థవంతమైన వేదిక కానుంది. వైజాగ్ టెక్ సమ్మిట్‌ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీకి అనుసంధానం అయ్యే అవకాశం దక్కనుంది. పరిశ్రమ ప్రముఖులు, తయారీదారులు, కీలక నిర్ణయాధికారులతో ఫేస్ టైమ్ పొందవచ్చు. వినూత్నమైన సాంకేతికతలను పరిచయం సంస్థల దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడొచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రపంచస్థాయి సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలోనే మొట్టమొదటిది కానుంది. సమ్మిట్ నిర్వహణకి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఈవెంట్లు జరుగుతాయి. నవంబర్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇన్వెస్టర్ల రోడ్ షో, స్టార్టప్ మీట్-అప్లు, CEO కాన్‌క్లేవ్‌లతో ప్రారంభం కానుంది. 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో మెగా ఈవెంట్ నిర్వహణతో టెక్ సమ్మిట్ ముగియనుంది. పోస్టర్ ఆవిష్కరణ వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 ఈవెంట్ పోస్టర్‌ను గురువారం ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జొనాథన్ హీమర్, మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ, న్యూ ఢిల్లీ, యుఎస్ కాన్సులేట్ ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ ఆండ్రూ ఎడ్లెఫ్‌సెన్ హైదరాబాద్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం కిరణ్ కుమార్ రెడ్డి సలికిరెడ్డి, గ్రూప్ సీఈఓ, APEITA, జనరల్ మేనేజర్ APEITA, సాయి అరవింద్, డాక్టర్ శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్ గ్రూప్, వైస్ చైర్మన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ EOUs, SEZs, (govt of india) శ్రీకాంత్ బాడిగ, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సి నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ; CH. రాజగోపాల్ చౌదరి, ఛైర్మన్, దేవి ఫిషరీస్ లిమిటెడ్; సౌరభ్ జైన్, హెడ్ ఏరోస్పేస్, ఎయిర్పోర్ట్ సిటీ బిజినెస్, GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్; M. మురళీధర్, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్; K. గణేష్ సుబుధి, CFO, K Rraheja IT పార్క్స్; ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఎస్, అనంత్ ఇన్ఫో పార్క్, హైటెక్ సిటీ సీఎండీ సుబ్బారావు పావులూరి పాల్గొన్నారు. ప్రపంచ ఇన్వెస్టర్ రోడ్ షోలు, 'సీఈవో సమావేశాల షెడ్యూల్ ♦ 29 నవంబర్ 2022, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్ ♦ 01 డిసెంబర్ 2022, హోటల్ స్వాస్తి ప్రీమియం, భువనేశ్వర్ ♦ 11 డిసెంబర్ 2022, విశాఖపట్నం, ఈవెంట్ ప్రెస్ మీట్ ♦ 17 డిసెంబర్-ITC మౌర్య- ఢిల్లీ ♦ 21 డిసెంబర్ - ఐటీసీ గ్రేడేనియా- బెంగళూరు ♦ 28 డిసెంబర్ - ఐటీసీ కోహినూర్- హైదరాబాద్ ♦ 07 జనవరి 2023- ITC మరాఠా- ముంబై ♦ 11 జనవరి 2023- ITC చోళ- చెన్నై ♦ 28 జనవరి 2023 - రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్-లండన్ ♦ 31 జనవరి 2023- WTO టవర్- దుబాయ్ ♦ 02, 04, 06, ఫిబ్రవరి 2023 ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు -
‘కేక’ 57 మిలియన్ డాలర్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది. -
షూస్‌ను పదికాలాలు కాపాడే డివైజ్, ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం పాదరక్షలకు రక్షణ సాధనం. ఖరీదైన షూస్‌ను పదిలంగా పదికాలాలు కాపాడుకోవడం కష్టమే! అయితే, ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు. బహుళజాతి సంస్థ ‘నెసుగర్’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్–డీయాడరైజర్. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే, ఇందులోని ఓజోన్ స్టెరిలైజేషన్ మోడ్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, షూస్లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం. -
40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం
ముంబై: దేశీయంగా తొలి స్టార్టప్ స్టూడియో జెన్ఎక్స్ వెంచర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అంకుర సంస్థ సండే టెక్ వెల్లడించింది. 40 ఏళ్లు పైబడి, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తోడ్పాటు అందించేందుకు తొలుత 2 మిలియన్ డాలర్ల నిధితో దీన్ని నెలకొల్పినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫ్ జార్జి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కెరియర్ మధ్యలో ఉన్న చాలా మంది మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని, ఎంట్రప్రెన్యూర్షిప్ బాట పడుతున్నారని జార్జి పేర్కొన్నారు. స్టార్టప్ వెంచర్లలో సహ వ్యవస్థాపకులుగా ఉండటంతో పాటు వాటిని ప్రారంభ దశ నుంచి నిర్మించడంలో స్టార్టప్ స్టూడియోల ముఖ్య పాత్ర పోషిస్తాయి. 1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్) తరం ప్రస్తుతం 40–50 ఏళ్ల వయస్సులో ఉన్నారని, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే ఇలాంటి సీనియర్ ప్రొఫెషనల్స్‌కు తోడ్పాటు అందించే సరైన వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలోనే తాము జెన్ఎక్స్ వెంచర్స్‌ను తలపెట్టామని జార్జి పేర్కొన్నారు. -
యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఆ సంస్థ ఉద్యోగులు భారీ షాకిచ్చారు. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెచ్చిన కొత్తపాలసీని 75శాతం మంది ఉద్యోగులు తిరస్కరించారు. ఇప్పుడీ ఉద్యోగుల నిర్ణయం టిమ్ కుక్ ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా కారణంగా రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇతర రంగాలతో పాటు టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని ఆఫీస్‌లో కార్యకలాపాల్ని ముమ్మరం చేశాయి. దీంతో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఆయా టెక్ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఇతర టెక్ దిగ్గజాలు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టగా..తాజాగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం మే23 నుంచి ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్ రావాలని మెయిల్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆ మెయిల్ పై యాపిల్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు రిజైన్ చేస్తాం. కానీ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించేది లేమంటూ రహస్యంగా నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్‌గా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని 'బ్లైండ్' అనే సంస్థ వెలుగులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో పేరు రహస్యంగా ఉంచిన ఓ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ బ్లైండ్ భాగస్వామ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు యాపిల్‌కు చెందిన 652 మంది ఉద్యోగల సమస్యలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా యాపిల్ ఉద్యోగుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. " 2020 నుంచి ఇప్పటి వరకు (గత నెల ఏప్రిల్) వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆఫీస్ రావాలని అంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లలేం. సుదీర్ఘ కాలంగా ఇంట్లో ఉంటూనే ప్రొడక్టివ్‌గా పనిచేస్తున్నాం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమని వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టారు. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని తప్పని సరిచేస్తే మా ఉద్యోగులకు రాజీనామా చేస్తాం. వర్క్ కంఫర్ట్ ఉన్న మరో సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తామంటూ " బ్లైండ్ చేసిన అభిప్రాయ సేకరణలో 56శాతం ఉద్యోగులు తెలిపారు. మరో 75 శాతం మంది ఉద్యోగులు వ్యతిరేకించారు. వెర్జ్ సైతం ప్రముఖ అమెరికన్ టెక్ బ్లాగ్ ది వెర్జ్ ఇప్పటికే యాపిల్ ఉద్యోగుల అసంతృప్తిపై పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. గత డిసెంబర్ నెలలో పలు దేశాలకు చెందిన యాపిల్ స్టోర్ ఉద్యోగులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నివేదికల్లో పేర్కొంది. ముఖ్యంగా యాపిల్ సంస్థలో గంటల వ్యవధి పనిచేసే ఉద్యోగులపై పన్ను విధించడంపై అసంతృప్తిలో ఉన్నట్లు గుర్తు చేసింది. అట్లాంటాలోని యాపిల్ స్టోర్ ఉద్యోగులు..తమకు యాపిల్ సంస్థ పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ఇటీవల యూనియన్ ఎన్నికల్ని నిర్వహించాలని పట్టుబడిన విషయాన్ని ప్రస్తావించింది. చదవండి👉చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్! -
'కీచక బాస్' 5 వేల మంది మహిళలపై లైంగిక వేధింపులు..!
ప్రముఖ టెక్ బిలియనీర్ మైఖేల్ గోగున్ మరోసారి చిక్కల్లో పడ్డారు. తన సొంత సంస్థలో పనిచేసే నలుగురు మాజీ ఉద్యోగులు 135 పేజీల ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని వాపోయారు. తమని వేధించినందుకు కోర్ట్ న్యాయం చేయాలని, 800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ దావా వేశారు. ఈ దావాపై న్యూయార్క్ పోస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మైఖేల్ గోగున్ 1996 నుంచి 2016 మధ్య కాలంలో సెక్వోయా క్యాపిటల్‌కు చెందిన నాయకత్వం వహించారు. ఆ సమయంలో మైఖేల్ గోగున్ 54 కంపెనీ పెట్టుబడులను కలిపి 64 బిలియన్ల కంటె ఎక్కువ మార్కెట్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో 2016లో ఆయనపై లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలపై సెక్వోయా క్యాపిటల్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఆ తర్వాత సొంతంగా అమింటర్ గ్రూప్ ను స్థాపించాడు. అహర్నిశలు కష్టపడి కంపెనీకి మంచి ఫలితాల్ని రాబట్టారు. అమింటర్ పనితీరుతో టెక్ కంపెనీలు యాపిల్, సిస్కో, గూగుల్, యూట్యూబ్,పేపాల్,ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలే నిధులు కోసం మైఖేల్ గోగున్ చుట్టూ క్యూ కట్టేవి. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గోగున్ మైఖేల్ గోగున్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వారు. ముఖ్యంగా మహిళల్ని వేధిస్తున్నారనే ఆరోపణలు ఆయనకు అప్రతిష్టని తెచ్చి పెట్టాయి. తాజాగా గోగున్ చెందిన సంస్థలో పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగులు అతనిపై $800 మిలియన్ల దావా వేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..135 పేజీల ఫిర్యాదులో మోంటానాలోని వైట్ ఫిష్ పట్టణానికి చెందిన హోటల్స్‌కు తీసుకెళ్లి మహిళల్ని వేధించేవారని బాధితులు పేర్కొన్నారు. గోగున్ 5,000 కంటే ఎక్కువ మంది మహిళల్ని వేధించాడని ఆరోపించారు. ఆ ఆకృత్యాలు జరిగే సమయంలో సైలెంట్‌గా ఉండేందుకు బాధితులకు పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చేవాడని పేర్కొన్నారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్ట్‌కు విన్నవించారు. కాగా, ప్రస్తుతం ఈ దావాపై విచారణ కొనసాగుతుండగా..త్వరలో కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు వెలువడనుంది. చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు -
టెక్ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే
Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే... హరిత విప్లవం... 1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి. మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్ పియరీ పాల్ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్ ల్యాబ్స్ తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు. చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా క్షీర విప్లవం... స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్ యూరప్ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లో కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైంది. 1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్ కురియన్ గుజరాత్‌లోని ఆనంద్‌కు రావడం, అమూల్ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్‌తో పాటు అమూల్‌లో పనిచేసిన హెచ్.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్–19తో సతమతమవుతున్న సమయంలో భారత్ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! చదవండి : సిరులిచ్చే.. సోయగాల చేపలు! ఉపగ్రహాలు, సమాచార విప్లవం... 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఛైర్మన్‌గా విక్రమ్ సారాభాయ్ సమాచార ప్రసారాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది. దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్‌ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ తయారీల్లో... మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్‌లో మూడో వంతు భారత్‌లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే సోవియెట్ యూనియన్ సాయంతో హైదరాబాద్‌లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఏర్పాటు జరిగింది. నేషనల్ కెమికల్స్ లాబొరేటరీ, రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. సి–డాట్‌తో టెలికామ్ రంగంలో పెనుమార్పులు... స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్ స్విచ్ తయారవడంతో టెలికామ్ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ టెక్నాలజీ సీ–డాట్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు! రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఐబీఎం, ఐసీఎల్... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్‌కు తెచ్చి అధిక ధరలకు లీజ్‌కు ఇచ్చేవి ఈ కంపెనీలు. నేషనల్ శాంపిల్ సర్వే, అణురియాక్టర్ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్ యంత్రాల అవసరమైతే భారత్‌కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు.. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. ∙గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు, జోరును కొనసాగిస్తున్న బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బ్యాంక్,ఆటో,మెటర్ల షేర్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దేశీయ మార్కెట్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మార్కెట్లు ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరిగాయి. దీంతో బుధవారం మార్కెట్ 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 32.99 పాయింట్లతో(0.8%) 54,599.50 ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 20.20 పాయింట్లు (0.12%) పెరిగి 16,300 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది టాటాస్టీల్, ఎన్టీపీసీ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజూకి లాభాల్లో ఉండగా టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, నెస్టల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కార్‌ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పోరేషన్ సబ్స్క్రిప్షన్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి, -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ?
ఇలా మీకు చాలాసార్లు జరిగి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్‌కో, లేదంటే లాంగ్ డ్రైవింగ్‌కి వెళ్లే సమయంలో ఎఫ్ఎమ్ లో మీకు నచ్చిన పాట ప్లే అవుతుంది. అరే ఈ పాటేదో బాగుందే. ఆ ఆల్బమ్ ను కొనుక్కోని మరోసారి వినాలని'అనుకుంటారు. కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే మీకు ఆ సాంగ్ లిరిక్ తెలియదు. ఏ ఆల్బమ్ లోని పాటో గుర్తించలేరు. కానీ ఈ చిన్న టిప్స్‌తో మీకు నచ్చిన సాంగ్స్ ను చిటికెలో కనిపెట్టేయోచ్చు. ఆ సాంగ్ పేరేంటో? లిరిక్స్ ఏంటో తెలియదా? మీకు ఇష్టమైన సాంగ్ గురించి గూగుల్ లో మీకు నచ్చిన విధంగా సెర్చ్ చేస్తుంటారు. ఆ పాటకు సంబంధించిన ఆల్బమ్ పేరు, పాడింది ఎవరో ఒక క్లూ దొరకుతుంది. మరి ప్రత్యేకంగా మీకు నచ్చిన సాంగ్ ను ఎలా గుర్తించాలి. సింపుల్. 1. షాజామ్: షాజామ్ అనే ఫ్రీ మొబైల్ అప్లికేషన్ ను మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ అనంతరం ఆడియో సోర్స్ లో ట్యాగ్ బటన్ క్లిక్ చేస్తే మీకు మీకు నచ్చిన సాంగ్ ప్లే అవుతుంది. కాకపోతే ఈ సదుపాయం కేవలం ప్రీ రికార్డ్ సాంగ్స్ కు మాత్రమే ఉంది. లైవ్ సాంగ్స్ కు అనుమతిలేదు. ఇక అన్ లిమిటెడ్ కావాలనుకుంటే నెలకు రూ.900పే చేయాల్సి వస్తుంది. 2. మ్యూజిక్ ఐడియా : అనే యాప్ ను ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ పాడితే .. వెంటనే ఆ పాట ప్లే అవుతుంది. పెయిడ్ వెర్షన్ కింద నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. 3. వాయిస్ తో సాంగ్ ను గుర్తించడం ఎలా? మిడోమీ : ముందుగా ఫ్రీ వెర్షన్లో ఉన్న మిడోమీ అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్ సెట్ తగిలించుకొని యాప్ లో 'అన్నోన్' అనే ఆప్షన్ క్లిక్ చేసి పాట పాడితే.. మీరు పాడిన పాట ఏ ఆల్బమ్, ఏ సినిమాలోనిదో ఇట్టే చెప్పేస్తుంది. 4. ఆడియో ట్యాగ్ : ఆడియో ట్యాగ్ లో మీకు నచ్చిన సాంగ్‌ను సిస్టమ్‌లో రికార్డ్ చేసి ఉంటే ఆడియో ట్యాగ్ యాప్ లో అప్ లోడ్ చేయాలి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే మీకు నచ్చిన సాంగ్, ఆ సాంగ్ కు సంబంధించిన వివరాలు ఆడియో డేటా బేస్ లో డిస్ప్లే అవుతాయి. చదవండి: Facebook: కొత్త ఫీచర్ గురించి తెలుసా?! -
చిన్న మెసేజ్ పంపించాలన్నా హైరానా..!
పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవడం ఒకప్పటి మాట. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఇప్పటి జనరేషన్ వాళ్లు ఏదైనా ఇట్టే పట్టేస్తున్నారు. అంతేగాకుండా టెక్నాలజీ పట్ల కనీస అవగాహన లేని ముసలి వాళ్లకు సైతం నేర్పించేస్తున్నారు. ఈ కోవకు చెందిన అమ్మాయే చెన్నైకు చెందిన ‘తాన్వి అర్వింద్’. 14 ఏళ్ల తాన్వి.. అవ్వాతాతలకు ఆన్లైన్లో టెక్నాలజీ పాఠాలు చెబుతోంది. అది 2018.. తాన్వి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు.. వేసవి సెలవులకు బెంగళూరులోని వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్లింది. ఆ సయంలో వాళ్ల గ్రాండ్ పేరెంట్స్..స్మార్ట్‌ఫోన్ వాడడానికి ఇబ్బంది పడడం గమనించింది. చిన్నపాటి మెసెజ్ పంపించాలన్నా వాళ్లు తెగ హైరానా పడడం దగ్గరగా చూసి, స్మార్ట్‌ఫోన్ ఎలా వాడాలో అర్థమయ్యేలా ఓపిగ్గా నేర్పించింది. ఈ ఏడాదిలోనే తాన్వి యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ అకాడమీ(వైఈఏ) నిర్వహించే 25 రోజుల ఈవెంట్‌కు వెళ్లింది. ఈవెంట్లో తను నేర్చుకున్న అంశాల ఆధారంగా సీనియర్ సిటిజన్స్‌కు స్మార్ట్‌ఫోన్స్ ఎలా వాడాలో నేర్పించే ఆన్లైన్ క్లాస్‌లు ప్రారంభించాలనుకుంది. అనుకుందే తడవుగా ‘టెక్‌ఎడ్యుకేషన్’ (TechEdEn)-పేరుతో క్లాస్‌లు ప్రారంభించింది. ఆన్లైన్లోనే గాక తాన్వి వాళ్ల సిస్టర్‌తో కలిసి క్లైంట్ల ఇళ్లకు కూడా వెళ్లి నేర్పించేది. తాన్వి క్లాసుల్లో ముఖ్యంగా మెస్సేజ్‌లు ఎలా పంపాలి? యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, వీడియోలు స్ట్రీమ్ చేయడం వంటివి నేర్పిస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాస్‌ల ద్వారా 25 మందికి, ఇంటికి వెళ్లి చెప్పడం ద్వారా 68 మందికి క్లాస్‌లు చెప్పింది. కాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ద్వారా తన టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు ప్రచారం కల్పిస్తున్నానని, ఇంకా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వడంలేదని తాన్వి చెప్పింది. నేను నేర్పించేది టెక్నాలజీ తెలియని వాళ్లకు గనుక వాళ్లు సోషల్ మీడియా, ఇంటర్నెట్గాని చూడరు. అందువల్ల ప్రచారం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే తెలిసిన వారి ద్వారా తన టెక్ ఎడ్యుకేషన్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తాన్వి చెప్పుకొచ్చింది. -
టీవీ చూస్తూ 65 వేలు సంపాదించొచ్చు!
లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో మరో కొత్త పని కోసం వెతుకున్నారు. ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఓ ఉద్యోగం కావాలా? దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు టెలివిజన్ చూడటం ఇష్టం అయితే చాలు. కేవలం టీవీ చూడటమే ఒక ఉద్యోగం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా అలాగే ఒక టెక్ సంస్థ టెలివిజన్ చూడటాన్ని ఆనందించే వారి కోసం వెతుకుతోంది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మీకు కేవలం మంచి రచనా శైలితోపాటు ఇంగ్లీష్‌లో నైపుణ్యం ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఎక్కువ ఫీజులు, ఆన్లైన్ చదువులు.. నో జాబ్స్!) ఉద్యోగం ఏంటి.. ఈ ఉద్యోగాన్ని టెక్ టెస్టర్ అని పిలుస్తారు. దీనిలో టీవీలు, కెమెరాలు, స్మార్ట్ పరికరాలు, హెడ్ఫోన్లు, హెమ్ సిస్టమ్స్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై అభిప్రాయం అందించాలి. ఆన్బై అందిస్తున్న ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే.. ప్రతి నెల ప్రొడక్ట్ పేజీని అభివృద్ధి పరచడానికి కొన్ని ఉత్పత్తులను అందజేస్తారు. వాటి డిజైన్‌ను, పని తీరును, మన్నికను, సౌండ్, డబ్బుకు తగిన విలువను కలిగి ఉన్నాయో లేదో పరీక్షించాలి. అనంతరం దానికి సంబంధించిన 200 పదాల సమీక్ష రాయాల్సి ఉంటుంది.(పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ) జీతం ఎంత గంటకు 3,281 రూపాయల చొప్పున పొందవచ్చు. వారానికి కనీసం 20 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి వారం మీరు 65,600 వేల రూపాయలు సంపాదించవచ్చు. (1.25 కోట్ల ఉద్యోగాలు.. యోగి సర్కారు భేష్!) కస్టమర్లకు ఖచ్చితమైన సమాచారం, మంచి అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌ను అందిస్తున్నామని ఆన్బై వ్యవస్థాపకుడు ని కాస్ పాటన్ కోట్ తెలిపారు. ఇందుకు సాంకేతిక నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వినియోగదారులకు తమ వస్తువులకు సంబంధించి లోతైన సమాచారాన్ని అందించగలమని పేర్కొన్నారు. తమ మొదటి టెక్ టెస్టర్ అందుకు సహకరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. పనిచేసే వ్యక్తికి ఎలక్ట్రానిక్ వస్తువులపై అవగాహన ఉండాలని, ప్రతిరోజు ఓ ఔత్సాహికుడిగా పనిచేయాలని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిసి ఉండాలన్నారు. -
అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు
టెక్ దిగ్గజం అమెజాన్‌లో భారీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ విభాగాల్లో రెండు వేలమంది ఉద్యోగులను నియమించుకోనున్నామని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. మొత్తం 2వేల ఉద్యోగాల్లో 50శాతం టెక్, 50శాతం నాన్‌టెక్ విభాగాల్లో ఉన్నట్టు అమెజాన్ హెచ్ఆర్ డైరెక్టర్ దీప్తివర్మ తెలిపారు. అమెజాన్.కాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.ఇన్‌తోపాటు డివైసెస్ డివిజన్ సహా దేశంలోని పలు విభాగాల్లో వీరిని ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఈ మేరకు అమెజాన్ జాబ్స్ వెబ్సైట్లో బెంగళూరులో 587, హైదరాబాద్‌లో 374 ఖాళీలున్నట్టు వివరాలు పొందుపరిచారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్ -బిజినెస్ క్వాలిటీ, వెండార్ ఆపరేషన్స్ అసోసియేట్, మేనేజర్, రిస్క్ ఇన్వెస్టిగేషన్స్, క్వాలిటీ అస్యూరెన్స్ టెక్నీషియన్, అమెజాన్ యాప్‌స్టోర్, బిజినెస్ ఎనలిస్ట్, అసోసియేట్ సైట్ మెర్చాండైజర్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ తదితర ఉద్యోగాలకు నూతనంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. -
8 శాతం వృద్ధి సాధ్యమే- నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఎనిమిది శాతం దాటుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపారంలో పారదర్శక ప్రక్రియలు, టెక్నాలజీ రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశ 8 శాతం వృద్ధికి సహాయం చేస్తుందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు కూడా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం, సీఐఐ సంయుక్తంగా గురువారం ఏర్పాటు చేసిన *ఇండియా ఎకానమిక్ సమ్మిట్ 2016' ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 8 శాతం వృద్ధి) సాధించడం సాధ్యమేనని, ఆ నిబద్ధతతోనే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. అవినీతిని తొలగించి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం టెక్నాలని ఉపయోగిస్తోందని తెలిపారు. వస్తు సేవల పన్ను, జామ్ (జన్ ధన్, ఆధార్,మొబైల్), పెట్టుబడుల వృద్ధి, ప్రోత్సాహం ద్వారా వ్యాపార నిర్వహణ అనే మూడు ప్రధాన అంశాలపై తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాంలో కేంద్రానికి,రాష్ట్రాలకు మధ్య ఉన్న విబేధాలను, కష్టాలను తొలగించేందుకు పనిచేయాలన్నారు. దీనికి కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న మూడు నాలుగు నెలల్లో వారితో కలిసి పనిచేసిన ఈ అవరోధాలన్నింటినీ అధిగమించనున్నామన్నరు. విదేశీ పెట్టుబడులు దేశానికి తరలి వస్తున్నాయని నిర్మల తెలిపారు. కానీ వాటిని అర్థవంతమైన పెట్టుబడులుగా , ఉద్యోగాలను వేగంగా సృష్టించేలా చేసుకోవాలని సీతారామన్ అన్నారు. పెండింగ్‌లో పనులకు తమ దగ్గర సమగ్ర ఎజెండా ఉందనీ, కానీ లక్ష్య సాధనలో ఇంకా చేయాల్సి ఉందనీ తెలిపారు. ప్రపంచ వృద్ధిలో దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలు కీలక శక్తులుగా పనిచేయనున్నాయని ఆమె జోస్యం చెప్పారు. -
ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!
యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి 12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. -
ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం
* పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధి చెందండి * యాపిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో మేలైన వస్తూత్పత్తి సంస్థగా యాపిల్ కంపెనీ పేరొందినట్లే... పారిశ్రామిక విధానానికి తెలంగాణ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు యాపిల్ ముందు కొచ్చినందుకు హర్షం వెలిబుచ్చారు. ‘‘హైదరాబాద్ విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులతో ముందుకురావటం ఆనందకరం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కలసికట్టుగా అభివృద్ధి చెందేందుకు దోహదపడండి..’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్ సంస్థ మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు ఆయన బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఆటంకాలేమీ లేకుండా, నిర్ణీత సమయంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలను తాము అమలుపరుస్తున్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రపంచ ఐటీ రంగ దిగ్గజాలైన ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించుకున్నాయి. వాటికి యాపిల్ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశ, దశ ప్రపంచ దిగ్గజమైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాకతో రూఢీ అయ్యాయి. ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని సీఎం అన్నారు. యాపిల్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ ఆనందంతో సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, యాపిల్ సంస్థ అధికారులు, డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి దాకా ఐటీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన సస్పెన్స్‌కు టిమ్ కుక్ రాకతో తెరపడిందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించారు. -
కేటీఆర్ రేర్ సెల్ఫీ ఏంటో తెలుసా?
హైదరాబాద్ : తెలంగాణా ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు చివరికి ఆ బిగ్ న్యూస్ ను రివీల్ చేశారు. గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అంటూ ఊరించిన మంత్రి భాగ్యనగరంలో యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభంకావడమే బిగ్ న్యూస్ అని తేల్చేశారు. హైదరాబాద్ లో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం పట్ల ఐటీ శాఖా మంత్రి ఆనందంలోమునిగి తేలుతున్నారు. భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం హైదరాబాద్ లోని వేవ్ రాక్ భవనంలో టెక్ సెంటర్ ను ప్రారంభించగా, మంత్రి కేటీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేటీఆర్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి, తండ్రి, కేసీఆర్ సహా, టిమ్ కుక్ తో తీసుకున్న అరుదైన సెల్ఫీని మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రెంజీ ఔట్ సైడ్ వేవ్ రాక్ అంటూ మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతోపాటు యాపిల్ సంస్థ ఎంబ్లమ్ 'యాపిల్' ను తమ పార్టీ గులాబీ రంగుతో పూర్తిగా నింపేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా తరువాత అతి పెద్ద డెపలప్ మెట్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక అయిందని ట్విట్ చేశారు. గత ఏడాది మేనెలలో గూగుల్ వస్తే.. ఇపుడు యాపిల్ హైదరాబాద్ కు తరలి వచ్చిందని కమెంట్ చేశారు. ప్రపంచంలో అతి విలువైన దిగ్గజ టెక్ కంపెనీలు అయిందింటిలో యాపిల్ తో కలిపి నాలుగు కంపెనీలు( గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్) కార్యాలయాను స్థాపించడం విశేషమని, ఇది హైదరాబాద్ కు గర్వకారణమని కేటీర్ అన్నారు. కాగా యాపిల్ ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించే చర్యలో భాగంగా టిమ్ కుమ్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత ఆయన ఈ ఉదయం భాగ్యనగరం చేరుకున్నారు. యాపిల్ సంస్థతో ప్రభుత్వంఎంవోయూ కుదుర్చుకున్న తరువాత గురువారం మీకో పెద్ద వార్త చెబుతా అని ట్వీట్ చేయడంతో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. -
ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల పట్ల పెరుగుతున్న మోజును దృష్టిలో పెట్టుకొని ఇందులో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది ఫేస్బుక్. ప్రస్తుతం మనకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన వారితో సెల్ఫీ తీసుకోవాలంటే నచ్చిన వారిని తీసుకొని ఆ నచ్చిన ప్రాంతానికి భౌతికంగా వెళ్లాల్సిందే. ఇకముందు అలాంటి అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీ దిగవచ్చు. నచ్చిన వారు కూడా మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్కనే ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఉదాహరణకు భారత్‌లో ఒకరుండి, లండన్‌లో ఒకరుండి, ఇద్దరు కలసి అమెరికాలో ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఫేస్బుక్ ఇటీవలనే మార్కెట్లోకి విడుదల చేసిన వర్చువల్ రియాలిటీ యాప్, హెడ్‌సెట్‌ను ఉపయోగించి ఇలాంటి సెల్ఫీలను సాధించవచ్చని ఫేస్బుక్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన వార్షిక సమావేశ వేదికపై ప్రదర్శించి చూపింది. అందులో ఇద్దరు వీఆర్ హెడ్ సెట్ కలిగిన వారు సిలికాన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉండి, లండన్ వంతెనపై ఉన్నట్లుగా సెల్ఫీ దిగారు. అయితే ఆ ఛాయా చిత్రం మాత్రం ఆర్టిస్ట్ వేసిన రేఖా చిత్రంగానే కనిపించింది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఇది భవిష్యత్ రియాలిటీకి నేడు పునాది వేయడమేనని ఫేస్బుక్ డెవలపర్ వివరించారు. వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం ఎలా సాధ్యమైందో, అలాగే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు వీడియో కాల్‌ను లింక్ చేయడం ద్వారా అసలైన చిత్రాల్లాగా సెల్ఫీలు ఉండేలా చేయవచ్చని చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. -
మహిళలకోసం ప్రత్యేక టెక్ పార్క్!
బెంగళూరుః మహిళాభివృద్ధే ధ్యేయంగా కర్ణాటక రాష్ట్రం మరో అడుగు ముందుకేసింది. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే సంవత్సరాల్లో మహిళా భాగస్వామ్యంతో మంచి ఫలితాలను పొందేందుకు టెక్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. మహిళా వ్యాపారస్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచస్థాయి సంస్థలను రూపొందించేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము పురుషులకన్నా ఏమాత్రం తక్కువ కాదంటూ పునరుద్ఘాటించేందుకు మహిళలకు ప్రభుత్వం మరో అవకాశం అందుబాటులోకి తెచ్చింది. కర్నాటక కనకపురా తాలూకా హరోహల్లిలో మహిళలకోసం ప్రభుత్వం మొదటి టెక్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పార్క్ ప్రత్యేకంగా మహిళలద్వారా ఏర్పాటు కానుంది. ఈ ఉమ్మడి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. టెక్ పార్క్ నిర్మాణం ప్రారంభమౌతుందన్న వార్త అందడంతో టెక్ పార్క్ లో తమ కంపెనీలను, షాప్ లను ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు మహిళా వ్యాపారవేత్తలనుంచి రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమలశాఖకు సుమారు 50 కు పైగా ధరఖాస్తులు అందాయి. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రతిపాదిత కంపెనీల్లో 135 కోట్ల రూపాయల పెట్టుబడులతో పార్క్ ప్రారంభం కానుంది. సుమారు 2,800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ వెంచర్ ప్రారంభమౌతోంది. ఇందుకోసం కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే 300 ఎకరాల భూమిని కూడ కేటాయించింది. ఇప్పటివరకూ మహిళలకోసం ప్రత్యేకంగా ఎక్కడా లేని ప్రోత్సాహకాలు, మినహాయింపులతో టెక్ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఫ్లాట్ ఫాం కల్పిస్తోందని వాణిజ్య పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కె. రత్నప్రభ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నాటికల్లా పార్క్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇది మహిళలకు ఓ బంగారు అవకాశం అని ఆమె అన్నారు. దీనికి వచ్చిన స్పందనను బట్టి ప్రభుత్వం మైసూర్, హుబ్లీ, ధర్వాడ, బెలంగవి, బళ్ళారి ల్లో కూడ పార్కులను నిర్మించేందుకు యోచిస్తోందని తెలిపారు. మహిళా వ్యాపారవేత్తల సంఘాలు ప్ర్తత్యేకంగా తమ ఆలోచనలను చర్చించుకునేందుకు వీలుగా ఓ వాట్సాప్ గ్రూప్ ను కూడ సృష్టించారు. అనేక బ్యాంకులు కూడ వారికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వాల్‌మార్ట్, టయోటా వంటి పెద్ద సంస్థలు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక ప్రోత్సాహకాలను, మినహాయింపులను మహిళా వ్యాపార వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని, పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు కావాలని రత్న ప్రభ సూచించారు.