లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇటీవల లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో మరో కొత్త పని కోసం వెతుకున్నారు. ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఓ ఉద్యోగం కావాలా? దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు టెలివిజన్ చూడటం ఇష్టం అయితే చాలు. కేవలం టీవీ చూడటమే ఒక ఉద్యోగం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా అలాగే ఒక టెక్ సంస్థ టెలివిజన్ చూడటాన్ని ఆనందించే వారి కోసం వెతుకుతోంది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మీకు కేవలం మంచి రచనా శైలితోపాటు ఇంగ్లీష్‌లో నైపుణ్యం ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఎక్కువ ఫీజులు, ఆన్‌లైన్ చదువులు.. నో జాబ్స్!)
ఉద్యోగం ఏంటి..
ఈ ఉద్యోగాన్ని టెక్ టెస్టర్ అని పిలుస్తారు. దీనిలో టీవీలు, కెమెరాలు, స్మార్ట్ పరికరాలు, హెడ్‌ఫోన్లు, హెమ్ సిస్టమ్స్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై అభిప్రాయం అందించాలి. ఆన్‌బై అందిస్తున్న ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే.. ప్రతి నెల ప్రొడక్ట్ పేజీని అభివృద్ధి పరచడానికి కొన్ని ఉత్పత్తులను అందజేస్తారు. వాటి డిజైన్‌ను, పని తీరును, మన్నికను, సౌండ్, డబ్బుకు తగిన విలువను కలిగి ఉన్నాయో లేదో పరీక్షించాలి. అనంతరం దానికి సంబంధించిన 200 పదాల సమీక్ష రాయాల్సి ఉంటుంది.(పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ)
జీతం ఎంత
గంటకు 3,281 రూపాయల చొప్పున పొందవచ్చు. వారానికి కనీసం 20 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి వారం మీరు 65,600 వేల రూపాయలు సంపాదించవచ్చు. (1.25 కోట్ల ఉద్యోగాలు.. యోగి సర్కారు భేష్!)
కస్టమర్లకు ఖచ్చితమైన సమాచారం, మంచి అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌ను అందిస్తున్నామని ఆన్‌బై వ్యవస్థాపకుడు ని కాస్ పాటన్ కోట్ తెలిపారు. ఇందుకు సాంకేతిక నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వినియోగదారులకు తమ వస్తువులకు సంబంధించి లోతైన సమాచారాన్ని అందించగలమని పేర్కొన్నారు. తమ మొదటి టెక్ టెస్టర్ అందుకు సహకరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. పనిచేసే వ్యక్తికి ఎలక్ట్రానిక్ వస్తువులపై అవగాహన ఉండాలని, ప్రతిరోజు ఓ ఔత్సాహికుడిగా పనిచేయాలని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిసి ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment