job application
-
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
ఏడో తరగతి కొలువుకు పీజీ అభ్యర్థుల ఎంపిక!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది కేవలం ఓ సబార్డినేట్ పోస్టు.. సూటిగా చెప్పాలంటే ఆఫీస్ బాయ్ ఉద్యోగం. ఈ పోస్టుకు అర్హత ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్. పదో తరగతి పాస్ అయినా.. అంతకుమించి విద్యార్హతలు ఉన్నా.. వారు అనర్హులు. కానీ విచిత్రంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ చేసిన అభ్యర్థులే కావడం గమనార్హం. దరఖాస్తు చేసుకోవడమే కాదు, పరీక్ష రాసి పాసై ఎంపికయ్యారు. ఇక్కడే వివాదం చెలరేగుతోంది. ఈ ఏడాది జూన్ 23న కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో గోల్మాల్ శీర్షికన ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది? రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లోని దాదాపు 686 ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ పోస్టుల భర్తీకి 2019 జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి జిల్లాలవారీగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో ఆదిలాబాద్‌లో 40, కరీంనగర్ 96, ఖమ్మం 78, మహబూబ్‌నగర్ 79, మెదక్ 86, నిజామాబాద్ 80, నల్లగొండ 64, రంగారెడ్డి 45, వరంగల్ 47, హైదరాబాద్‌లోని వివిధ కోర్టుల్లో 71 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి అర్హులు కారని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి 2019 నవంబర్‌లో అభ్యర్థులంతా ఆన్లైన్లో పరీక్ష రాశారు. 2021 జూలైలో ఎంపికైన అభ్యర్థుల్లో 1:3 ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్, అనంతరం ఇంటర్వ్యూలకు పిలిచారు. ప్రైవేటులో ఉన్నతోద్యోగులే.. ఈ విషయంలో వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 395 మందిలో 195 మంది ఓవర్ క్వాలిఫైడ్‌గా గుర్తించి వారిని పక్కనబెట్టారు. మిగిలిన వారికి 2022 ఫిబ్రవరిలో తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి 93 మందితో తుది జాబితా ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని పదో తరగతి ఫెయిలైన అభ్యర్థులు ఆరోపించారు. ఇదే విషయాన్ని జూన్ 23న ‘సాక్షి’ కరీంనగర్ ఎడిషన్‌లో బయటపెట్టింది. దీనిపై స్పందించిన కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది తాము అనర్హులమని అంగీకరించారు. ఇప్పటికే కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ దర్యాప్తులో ఓవర్ క్వాలిఫైడ్‌గా తేలిన వారి జాబితా సిద్ధమైంది. వారంతా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం గమనార్హం. ఎందుకు చిక్కడం లేదు..? ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు తమ నిజమైన అర్హతలు దాచి దరఖాస్తు చేస్తే.. మరికొందరు ఏకంగా కొన్ని స్కూళ్లలో చదవకపోయినా.. చదివినట్లు నకిలీ సర్టి ఫికెట్లు సృష్టించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్య ర్థుల్లో 90% మంది తెలుగు మీడియం విద్యార్థులు. 2000 సంవత్సరం తరువాత చాలామటుకు ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్లు మూతబడ్డాయి. ఆ స్కూళ్ల రికార్డులు లభించకపోవడంతో ఎవరు ఏ స్కూలు విద్యార్థులో నిర్ధా రించడంలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఎంపికైన చాలామందిలో ఓవర్‌క్వాలిఫైడ్ అభ్యర్థులున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఇవే పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, వారికి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఐడీలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో హుస్నాబాద్ నుంచి ఎంపికైన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడంటూ హుజూరాబాద్‌కు చెందిన కత్తి రమేశ్ అనే వ్యక్తి సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోంది. -
పోలీసు పోస్టులకు 12.7 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన వివిధ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లోని సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ హోదాతో ఉన్న 17 వేల పైచిలుకు పోస్టులకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మొత్తం ఉద్యోగాలకు ఏడు లక్షల మంది అభ్యర్థులు 12.7 లక్షల దరఖాస్తులను దాఖలు చేసినట్టు రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సారి దాదాపు 1.3 లక్షల మంది మహిళా అభ్యర్థులు 2.8 లక్షల దరఖాస్తులు దాఖలు చేసినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
గ్రూప్–1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు ఊరటనిచ్చిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఊరటనిచ్చింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌ను వెబ్సైట్లో అప్లోడ్ చేయకున్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 31తో గ్రూప్–1 దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా టీఎస్పీఎస్సీ తాజా నిర్ణయంతో దరఖాస్తుల సమర్పణ జోరందుకుంది. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మెజారిటీ అభ్యర్థుల స్థానికతలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గతంలో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన కమిషన్... ఈ మేరకు మార్పులు చేసుకోవాలని సూచిం చింది. దీంతో ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్న బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఈ నిబంధన చాలా మంది అభ్యర్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విమర్శలు వచ్చాయి. పలువురు అభ్యర్థులు బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వివరాలు సమర్పిస్తే..: ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ లేదా నూతన ఓటీఆర్ నమోదు సమయంలో అభ్యర్థులు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకు న్న పాఠశాల, ప్రాంతం వివరాలను వెబ్సైట్లో ఎంట్రీ చేస్తే చాలు. ఆ తర్వాత గ్రూప్–1 దరఖాస్తును సమర్పించే వీలుంటుంది. అయితే ఇప్పుడు నమోదు చేసిన వివరాలకు సంబంధించిన అసలైన ధ్రువ పత్రాలను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో మాత్రం తప్పకుండా చూపించాలి. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపకుంటే అభ్యర్థిని ప్రాథమిక జాబితా నుంచి తొలగించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అదేవిధంగా నమోదు చేసిన వివరాలు సరైనవి కాకుంటే అభ్యర్థిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసే అధికారం సైతం కమిషన్‌కు ఉంది. అందువల్ల అభ్యర్థులు సరైన వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. -
అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా?
లండన్: ఉద్యోగం సాధించడంలో రెజ్యూమ్ ఎంతో కీలకమైంది. అభ్యర్థి ఉద్యోగం కోసం.. కంపెనీ మెయిల్స్, లింక్డ్ ఇన్, నౌకరీ డాట్ కామ్.. రకరకాల మాధ్యమాలతో కంపెనీలకు తమ రెజ్యుమ్‌ను పంపుతుంటారు. ఒక వ్యక్తి రెజ్యూమ్ చూసి.. అతని పట్ల కంపెనీలు కొంత అవగాహనకు వస్తాయి. రెజ్యూమ్‌లలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వారు సాధించిన అంశాలు దానిలో పొందుపరుస్తూ ఉంటారు. అయితే, చాలా కంపెనీలు వాటిని వ్యక్తికరించడంలో కొంత సృజనాత్మకతను కొరుకుంటాయి. అయితే, ఇక్కడ యూకేకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు.. యూకే కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఇన్స్టాంట్ ప్రింట్ ఉద్యోగం కోసం.. తన రెజ్యూమ్ ప్రింట్‌ను సదరు కంపెనీ పార్కింగ్ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క కారుకు అంటించాడు. అయితే, యార్క్‌షైర్ కు చెందిన ప్రిటింగ్ హౌస్ కంపెనీలో చేరడానికి అతను.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీలో సదరు వ్యక్తి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఆనోట.. ఈనోట.. చివరకు ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన సదరు వ్యక్తి ఉద్యోగం పట్ల చూపిన ఆసక్తికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత.. అతడిని కంపెనీవారు కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. దీనిపై కంపెనీ మేనేజర్ స్పందించారు. ‘సదరు వ్యక్తి పార్కింగ్ ఉన్న కార్లకు రెజ్యూమ్‌ను అతికించిడం కిటికీలో నుంచి చూసినట్లు వాసెల్ అనే మేనేజర్ తెలిపారు’. అయితే, ఆ ఉద్యోగానికి 140 అప్లికేషన్లు వచ్చినట్లు కంపెనీ మేనేజర్ తెలిపారు. జోనాథన్ స్విఫ్ట్ ను ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication - Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI — instantprint (@instantprintuk) January 18, 2022 చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
విద్య, ఉద్యోగ సమాచారం
టీఎస్ ఈసెట్–2021 ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్సీహెచ్ఈ).. టీఎస్ ఈసెట్–2021 నోలిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2021–22 విద్యాసంవత్సారానికి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ(జేఎన్టీయూ) నిర్వహిస్తోంది. ► తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) 2021. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 22.03.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021 ► టీఎస్ ఈసెట్ పరీక్ష తేది: 01.07.2021 ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in ఎన్ఐఈఎస్బీయూడీలో వివిధ ఖాళీలు భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్(ఎన్ఐఈఎస్బీయూడీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: అడ్వైజర్–01, సీనియర్ కన్సల్టెంట్–01, కన్సల్టెంట్–02, రీసెర్చ్ అసోసియేట్–02, కోఆర్డినేటర్–01. ► అడ్వైజర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. ► సీనియర్ కన్సల్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. ► కన్సల్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఫిల్/పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో ఆరేళ్ల అనుభవం ఉండాలి. ► రీసెర్చ్ అసోసియేట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ► కోఆర్డినేటర్: అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: application.niesbud@gmail.com ► దరఖాస్తులకు చివరి తేది: 29.03.2021 ► వెబ్సైట్: www.niesbud.nic.in టీజీసెట్–2021- ఐదో తరగతిలో ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, విద్యాశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ►అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ►ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.04.2021 ► ప్రవేశ పరీక్ష తేది: 30.05.2021 ► వెబ్సైట్: http://tgcet.cgg.gov.in నిక్మార్, పుణెలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్).. 2021 విద్యా సంవత్సరానికి సంబం«ధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ► ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీ. ► పీజీ కోర్సు వివరాలు: ► కాలవ్యవధి: రేండేళ్లు/ఏడాది. ► విభాగాలు: ► అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(పీజీపీ–ఏసీఎం). ► ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్(పీజీపీ–పీఈఎం). ► రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(పీజీపీ–ఆర్యూఐఎం). ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్(పీజీపీ–ఐఎఫ్డీఎం). ► మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్స్ట్రక్షన్ బిజినెస్(పీజీపీ–ఎంఎఫ్ఓసీబీ). ► క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్(పీజీపీ–క్యూఎస్సీఎం). ► హెల్త్, సేఫ్టీ అండ్ ఇన్విరాన్మెంట్ మేనేజ్మెంట్(పీజీపీ–హెచ్ఎస్ఈఎం). ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎంపిక విధానం: నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌సీఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎన్‌సీఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికి విద్యార్థులు తమ ఇంటి నుంచి హాజరుకావచ్చు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌సీఏటీ) 180 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 72 మార్కులకు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 36 మార్కులకు, వెర్బల్ అండ్ జనరల్ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు, రేటింగ్ ఆఫ్ అప్లికేషన్‌కు 70 మార్కులకు ఉంటుంది. ► పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 29, 30 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్–అడ్మిషన్స్, ఎన్‌ఐసీఎంఏఆర్, 25/1, బాలేవడి, ఎన్.ఐ.ఎ.పోస్ట్ ఆఫీస్, పూణె –411045 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.04.2021 ► వెబ్సైట్: https://www.nicmar.ac.in తెలంగాణ పీజీఈసెట్–2021 తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ).. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే పీజీఈసెట్–2021కు దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్)–2021 ► కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితరాలు, ► అర్హత: బీఈ/బీటెక్/బీఫార్మసీ/బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ► పరీక్ష సమయం: రెండు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021 ► ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021 ► వెబ్సైట్: http://www.tsche.ac.in -
ఇంటిపేరు ‘చూతియా’.. దరఖాస్తు నిరాకరణ
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు నిరాకరించడానికి, సరైన చదువు లేకనో లేక వయస్సో, ఎత్తో ఇలా మరెన్నో కారణాలు మనం ఇప్పటి వరకు చూశాము. కానీ కేవలం తన ఇంటి పేరు కారణంగా అసోంకి చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎస్సీఎల్) ఆన్లైన్ పోర్టల్‌లో ఉద్యోగానికి కనీసం దరఖాస్తుకూడా చేయలేక పోయింది. (భారత అమ్ములపొదిలో మరో అద్భుతం) అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంక చూతియా(Priyanka Chutia)(ఇంగ్లీష్‌లో Chutia అని రాసినా ‘సుటియా’ అని ఉచ్చరిస్తారు) అగ్రికల్చరల్ ఎకానమిక్స్, వ్యవసాయ నిర్వహణలో మాస్టర్స్ చేసింది. ఆమె అసోంలో అత్యంత పురాతనమైన చూతియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇంటిపేరు చూతియా అవ్వడంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేయడానికి ప్రయత్నించినా పోర్టల్ తిరస్కరిస్తూనే ఉంది. (మూడు అంతస్తులుగా అయోధ్య రామ మందిర నిర్మాణం) ఈ సమస్యను పరిష్కరించడానికి గత వారం ప్రియాంక చూతియా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన ఇంటి పేరుతో దరఖాస్తు చేస్తుంటే సరైన పదాలను ఉపయోగించమని ఎర్రర్ మెసేజ్ వస్తూనే ఉంది. ఇది తప్పుడు పదం కాదు, మా కమ్యునిటీకి సంబంధించిన పదం. దరఖాస్తు చేస్తున్నప్పుడు మా ఇంటి పేరు వాడితే, సరైన నామకరణ పదాలను వాడాలని ఎర్రర్ మెసేజ్ రావడం చూసి తీవ్ర అసహనానికి గురయ్యాను అని ప్రియాంక చూతియా పేర్కొంది. (ప్రతి నెలా రూ. 40 వేలు పంపేవాడు.. నాకు నమ్మకం ఉంది!) ప్రియాంక చుతియా చివరకు తన సమస్యను ఎన్ఎస్సిఎల్ దృష్టికి తీసుకెళ్లడంతో చివరకు ఆమె దరఖాస్తును అంగీకరించారు. ఈ విషయ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. చూతియా అనేది హిందీ భాషలో ఓ బూతు పదం. దీంతో సదరు ఆన్లైన్ పోర్టల్‌లో ఆ పదాన్ని రిజక్టెడ్ లిస్ట్‌లో పెట్టారు. ‘అభ్యర్థుల పేరు వడపోతకు వాడే కోడ్‌ను సరి చేసి సమస్యను పరిష్కరించాము’ అని ఎన్ఎస్సిఎల్లోని టెక్నికల్ హెల్ప్ డెస్క్ పేర్కొంది. ఇంటిపేరు బూతు అని తప్పుగా అర్ధం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. చూతియా పేరుతో ఉన్న వేలాది మంది ఖాతాలను ఫేస్బుక్ బ్లాక్ చేసిందని ఆల్ అసోం చూతియా స్టూడెంట్స్ యూనియన్(ఏఏసీఎస్యూ) గతంలో ఆరోపించింది. -
టీవీ చూస్తూ 65 వేలు సంపాదించొచ్చు!
లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో మరో కొత్త పని కోసం వెతుకున్నారు. ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఓ ఉద్యోగం కావాలా? దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు టెలివిజన్ చూడటం ఇష్టం అయితే చాలు. కేవలం టీవీ చూడటమే ఒక ఉద్యోగం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా అలాగే ఒక టెక్ సంస్థ టెలివిజన్ చూడటాన్ని ఆనందించే వారి కోసం వెతుకుతోంది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మీకు కేవలం మంచి రచనా శైలితోపాటు ఇంగ్లీష్‌లో నైపుణ్యం ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఎక్కువ ఫీజులు, ఆన్లైన్ చదువులు.. నో జాబ్స్!) ఉద్యోగం ఏంటి.. ఈ ఉద్యోగాన్ని టెక్ టెస్టర్ అని పిలుస్తారు. దీనిలో టీవీలు, కెమెరాలు, స్మార్ట్ పరికరాలు, హెడ్ఫోన్లు, హెమ్ సిస్టమ్స్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై అభిప్రాయం అందించాలి. ఆన్బై అందిస్తున్న ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే.. ప్రతి నెల ప్రొడక్ట్ పేజీని అభివృద్ధి పరచడానికి కొన్ని ఉత్పత్తులను అందజేస్తారు. వాటి డిజైన్‌ను, పని తీరును, మన్నికను, సౌండ్, డబ్బుకు తగిన విలువను కలిగి ఉన్నాయో లేదో పరీక్షించాలి. అనంతరం దానికి సంబంధించిన 200 పదాల సమీక్ష రాయాల్సి ఉంటుంది.(పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ) జీతం ఎంత గంటకు 3,281 రూపాయల చొప్పున పొందవచ్చు. వారానికి కనీసం 20 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి వారం మీరు 65,600 వేల రూపాయలు సంపాదించవచ్చు. (1.25 కోట్ల ఉద్యోగాలు.. యోగి సర్కారు భేష్!) కస్టమర్లకు ఖచ్చితమైన సమాచారం, మంచి అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌ను అందిస్తున్నామని ఆన్బై వ్యవస్థాపకుడు ని కాస్ పాటన్ కోట్ తెలిపారు. ఇందుకు సాంకేతిక నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వినియోగదారులకు తమ వస్తువులకు సంబంధించి లోతైన సమాచారాన్ని అందించగలమని పేర్కొన్నారు. తమ మొదటి టెక్ టెస్టర్ అందుకు సహకరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. పనిచేసే వ్యక్తికి ఎలక్ట్రానిక్ వస్తువులపై అవగాహన ఉండాలని, ప్రతిరోజు ఓ ఔత్సాహికుడిగా పనిచేయాలని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిసి ఉండాలన్నారు. -
వేలానికి స్టీవ్ జాబ్స్ అప్లికేషన్
ఆపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగానికి చేసుకున్న దరఖాస్తు ఒకటి వేలానికి రాబోతుంది. దీని ధర 50,000 డాలర్లు పలుకుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో ఇది సుమారు రూ.32 లక్షలు. ఈ దరఖాస్తు 1973 నాటిదని తెలుస్తోంది. పేరు స్టీవ్ జాబ్స్ అని, రీడ్ కాలేజీ అడ్రస్‌తో ఈ అప్లికేషన్ ఉంది. బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ దీన్ని వేలానికి ఉంచుతోంది. మార్చి 8 నుంచి 15 మధ్యలో ఈ వేలం నిర్వహించనుంది. అయితే, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నది ఈ అప్లికేషన్లో లేదు. ప్రత్యేక నైపుణ్యాల సెక్షన్ కింద స్టీవ్ జాబ్స్, టెక్ లేదా డిజైన్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. మూడేళ్ల అనంతరం స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు స్టీవ్ వొజ్నాయిక్ ఆపిల్ కంపెనీని స్థాపించారు. స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా 2011లో 56 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఆపిల్, స్టీవ్ జాబ్స్ పేరుతో ఉన్న ఇటాలియన్ క్లోతింగ్ కంపెనీకి వ్యతిరేకంగా సాగించిన న్యాయపోరాటంలో ఓడిపోయింది. -
గూగుల్ లో ఉద్యోగానికి ఏడేళ్ల బాలిక
-
గూగుల్ లో ఉద్యోగానికి ఏడేళ్ల బాలిక
టెక్ ఉత్సాహాకులు ఎక్కువగా ఇష్టపడేది గూగుల్‌లో ఉద్యోగం చేయడం. కానీ దానిలో జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమో. అలాంటి ఉద్యోగం కోసం ఓ ఏడేళ్ల యూకే బాలిక క్లో బ్రిడ్జ్‌వాటర్ దరఖాస్తు చేసుకుంది. తనకు గూగుల్‌లో ఉద్యోగం చేయాలని ఉందని పేర్కొంటూ డైరెక్ట్‌గా కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్కే అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె ఆసక్తికి మురిసిపోయిన సుందర్ పిచాయ్ ఆ లేఖకు తిరిగి వెంటనే సమాధానం సైతం పంపారు. కష్టపడి చదవి, తన కలలను సాకారం చేసుకోవాలని, స్కూలింగ్ అయిపోగానే వెంటనే అధికారికంగా జాబ్ అప్లికేషన్ పంపించాలని ప్రోత్సహించారు. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టుల ప్రకారం క్లోకు ఇటీవలే ఆదర్శవంతమైన గూగుల్‌లో పని చేయాలని ఆసక్తి కలిగిందట. గూగుల్‌లో ఏదో రోజు ఉద్యోగం సంపాదిస్తానని వాళ్ల డాడీకి కూడా తెలిపింది. కూతురి కోరికకు ఎంతో ముచ్చటపడిన క్లో డాడీ బ్రిడ్జ్ వాటర్, ఆమె గూగుల్‌కు ఉద్యోగ అప్లికేషన్‌ను పంపేలా సాయపడ్డారు. తనకు కంప్యూటర్లు, రోబోట్స్, టాబ్లెట్స్ అంటే చాలా ఇష్టమని, స్కూల్లో కూడా మంచి విద్యార్థినని పేర్కొంటూ క్లో ఉద్యోగ అప్లికేషన్‌ను గూగుల్ సీఈవోకు పంపింది. గూగుల్‌లో వర్క్ చేయడమే కాకుండా, చాకోలెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం, ఒలింపిక్స్‌లో స్విమ్ చేయాలనే ఆసక్తిని పిచాయ్‌కు రాసిన లేఖలో వెల్లడించింది. ఈ లేఖను అందుకున్న సుందర్ పిచాయ్, వెంటనే తిరిగి సమాధానం పంపారు. గూగుల్‌లో ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, రోబోట్స్, కంప్యూటర్లను ఇష్టపడటం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. టెక్నాలజీ గురించి నీవు మరింత నేర్చుకుంటావని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. క్లో తన డ్రీమ్స్‌ను చేరుకోవాలని ఆశీర్వదించారు. స్కూలింగ్ పూర్తవగానే గూగుల్‌లో ఉద్యోగానికి అప్లై చేయమని ప్రోత్సహించారు. -
దరఖాస్తు చేశారా?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ (ఐసీపీఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో, జనరల్ ఫెలో, సీనియర్ ఫెలోస్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 16 నేషనల్ కెమికల్ లేబొరేటరీ (ఎన్సీఎల్)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 20 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్లోసిస్ (ఎన్ఐఆర్టీ)లో సైంటిస్ట్ సీ, బీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బీ.. పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 20 తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫీల్డ్ సూపర్ జర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 21