
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు నిరాకరించడానికి, సరైన చదువు లేకనో లేక వయస్సో, ఎత్తో ఇలా మరెన్నో కారణాలు మనం ఇప్పటి వరకు చూశాము. కానీ కేవలం తన ఇంటి పేరు కారణంగా అసోంకి చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌సీఎల్) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉద్యోగానికి కనీసం దరఖాస్తుకూడా చేయలేక పోయింది. (భారత అమ్ములపొదిలో మరో అద్భుతం)
అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంక చూతియా(Priyanka Chutia)(ఇంగ్లీష్‌లో Chutia అని రాసినా ‘సుటియా’ అని ఉచ్చరిస్తారు) అగ్రికల్చరల్ ఎకానమిక్స్, వ్యవసాయ నిర్వహణలో మాస్టర్స్ చేసింది. ఆమె అసోంలో అత్యంత పురాతనమైన చూతియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇంటిపేరు చూతియా అవ్వడంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేయడానికి ప్రయత్నించినా పోర్టల్ తిరస్కరిస్తూనే ఉంది. (మూడు అంతస్తులుగా అయోధ్య రామ మందిర నిర్మాణం)
ఈ సమస్యను పరిష్కరించడానికి గత వారం ప్రియాంక చూతియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. తన ఇంటి పేరుతో దరఖాస్తు చేస్తుంటే సరైన పదాలను ఉపయోగించమని ఎర్రర్ మెసేజ్ వస్తూనే ఉంది. ఇది తప్పుడు పదం కాదు, మా కమ్యునిటీకి సంబంధించిన పదం. దరఖాస్తు చేస్తున్నప్పుడు మా ఇంటి పేరు వాడితే, సరైన నామకరణ పదాలను వాడాలని ఎర్రర్ మెసేజ్ రావడం చూసి తీవ్ర అసహనానికి గురయ్యాను అని ప్రియాంక చూతియా పేర్కొంది. (ప్రతి నెలా రూ. 40 వేలు పంపేవాడు.. నాకు నమ్మకం ఉంది!)
ప్రియాంక చుతియా చివరకు తన సమస్యను ఎన్‌ఎస్‌సిఎల్ దృష్టికి తీసుకెళ్లడంతో చివరకు ఆమె దరఖాస్తును అంగీకరించారు. ఈ విషయ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. చూతియా అనేది హిందీ భాషలో ఓ బూతు పదం. దీంతో సదరు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆ పదాన్ని రిజక్టెడ్ లిస్ట్‌లో పెట్టారు. ‘అభ్యర్థుల పేరు వడపోతకు వాడే కోడ్‌ను సరి చేసి సమస్యను పరిష్కరించాము’ అని ఎన్‌ఎస్‌సిఎల్‌లోని టెక్నికల్ హెల్ప్ డెస్క్ పేర్కొంది.
ఇంటిపేరు బూతు అని తప్పుగా అర్ధం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. చూతియా పేరుతో ఉన్న వేలాది మంది ఖాతాలను ఫేస్‌బుక్ బ్లాక్ చేసిందని ఆల్ అసోం చూతియా స్టూడెంట్స్ యూనియన్(ఏఏసీఎస్‌యూ) గతంలో ఆరోపించింది.