assam
-
దేవజిత్ సైకియా ఆకస్మిక రాజీనామా
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.క్రికెట్‌తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్‌కీపర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. -
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్‌ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్‌ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్‌పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్‌లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్‌మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
అస్సాంలో కమలం హ్యాట్రిక్.. ?
అస్సాంలో బీజేపీ హావా కొనసాగుతుంది. రికార్డు స్థాయి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. మైనార్టీల శాతం అధికంగా ఉన్న రాష్ట్రంలో బంపర్ మోజారిటీ దిశగా సాగుతుంది. అయితే బీజేపీకి ఇంత భారీ విజయం దక్కడం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ రాజకీయ ఎత్తుగడలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.హిమంత మార్క్ పాలనఅసోంలో ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలను బాగా ఆకర్షించాయి. 'అరుణోదోయ్' ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్దఎత్తున మైలేజ్ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసిందిదానితో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా "భూమిపుత్రులకు రక్షణ" అనే నినాదంతో ఆయన ప్రచారం సాగించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ, స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం స్థానికంగా ఎంతో కలిసివచ్చింది. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది.మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ విజయం ఎలా సాధ్యమైంది?హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అస్సాం రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చింది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్థానాల సంఖ్య తగ్గింది. ఫలితంగా, స్థానిక అస్సామీ జనాభా ప్రభావం ఉన్న స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది. గతంలో కాంగ్రెస్, AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) కలిసి పోటీ చేసేవి. కానీ ఈసారి విడివిడిగా లేదా బలహీనమైన కూటములతో పోటీ చేయడం వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోయి బీజేపీకి మేలు జరిగింది.దానితో పాటు తిరుగుబాటు దారుల సమస్య అధికంగా ఉండడంతో ఆ సమస్య ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగింది.రాష్ట్రంలోని వివిధ హిందూ వర్గాలను (అస్సామీ, బెంగాలీ, గిరిజనులు) బీజేపీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగింది.హిమంత బిశ్వశర్మ నేపథ్యం2015 వరకూ జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగిన హిమంత బిశ్వశర్మ హస్తంతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. చేరిన ఏడాదికే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాగా తన ఎత్తులతో 15 ఏళ్లుగా బీజేపీ కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు. దీంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటకు బీటలు వారింది. అయితే ఆసమయంలో సర్బానంద సోనోవాలా ముఖ్యమంత్రి కాగా అతని క్యాబినెట్లో హిమంత మంత్రిగా పనిచేశారు.అనంతరం 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ సారి కమలనాథులు హిమంతకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హిమంత అభివృద్ధే లక్షంగా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు నడిపారు. హిమంత నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీ భారీ మెజారీటీతో అధికారం దిశగా దూసుకుపోతుంది. -
అస్సాం : ఘన విజయం దిశగా బీజేపీ కూటమి
బీజీపీకి నాలుగు సీట్లుట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది. అస్సాంలో ఇప్పటివరకు బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ 94 సీట్లలో ఆధిక్యంలో ఉంది.గౌహతి సెంట్రల్లో, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ)కి చెందిన జెన్ జెడ్ అభ్యర్థి కుంకీ చౌదరి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ గుప్తాపై గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించే దిశగా హిమంత బిస్వా శర్మ ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది.జోర్హాట్ స్థానంలో గౌరవ్ గోగోయ్ ఓటమి, బీజేపీకి చెందిన హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో ఓడిపోయారు. మ్యాజిక్ ఫిగర్ దాటిన BJP నేతృత్వంలోని కూటమి80 స్థానాల్లో ఆధిక్యంతో, అసాంలో BJP నేతృత్వంలోని కూటమి 64 స్థానాల మెజారిటీ మార్కును అధిగమించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.జలుక్బరీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆధిక్యంలో ఉండగా, జోర్హాట్లో కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్ ముందంజలో ఉన్నారు. దిస్పూర్లో ప్రద్యుత్ బోర్డోలోయ్ ముందంజలో ఉన్నారు బిహ్‌పురియాలో భూపేన్ బోరా ముందంజలో ఉన్నరుశివసాగర్లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారుఖోవాంగ్లో లూరింజ్యోతి గొగోయ్ ముందంజలో ఉన్నారు జాగీ రోడ్లో పిజూష్ హజారికా ముందంజలో ఉన్నారువిజయం మాదే : అఖిల్ గోగోయ్ శివసాగర్‌లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు48 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ముందంజజోర్హాట్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ముందంజ, 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మొత్తం 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యంబీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ ఖాతా తెరిచిన కాంగ్రెస్ ప్రాథమిక సరళి ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, AIUDF , కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అస్సాంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 722 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈశాన్య రాష్రం అస్సాంలో అధికారి పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ మరోసారి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీదారులుగా, బీజేపీ, అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) భాగస్వామ్యంతో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి, అలాగే INC, అసోం జాతీయ పరిషత్ (AJP), రైజోర్ దళ్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC), CPI (M) మరియు CPI (ML) పార్టీలతో కూడిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నిలిచాయి.చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కూటమి 88 నుండి 101 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ కూటమి 22 నుండి 36 స్థానాలను గెలుచుకోవచ్చని, కాగా AIUDF 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్‌ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్‌కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్‌దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్‌లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్‌లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
ఎగ్జిట్ పల్స్.. అంచనాలు తారుమారు
-
అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారం
డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలుఏజీపీ 1-2 స్థానాలుసీపీఐ(ఎం) 0-1 స్థానాలుఐఎన్డీ0-2 స్థానాలుఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది. -
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అధికారం ఆ పార్టీలదే
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్స్ పోల్స్‌ను విడుదల చేశాయి. తమిళనాడు (మొత్తం: 234)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్డీఎంకే: 125 – 145ఏడీఎఎంకే: 65 – 80టీవీకే (విజయ్): 18 – 24ఇతరులు : 2 – 6కేరళ (మొత్తం: 140)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్యూడీఎఫ్: 75 – 85ఎల్డీఎఫ్: 55 – 65బీజేపీ: 0 – 3ఇతరులు : 0అసోం (మొత్తం: 126)ఏజెన్సీ: యాక్సిస్ మై ఇండియాబీజేపీ: 88 – 101కాంగ్రెస్: 15 – 36ఏఐయూడీఎఫ్: 0ఇతరులు: 0 – 3పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్టీఎంసీ: 177 – 187బీజేపీ: 95 – 110కాంగ్రెస్: 1 – 3వాపక్షాలు: 0 – 1పుదుచ్చేరి (మొత్తం: 30)ఏజెన్సీ: పీపుల్స్ పల్స్ఎన్ఆర్సీ: 16 – 19కాంగ్రెస్: 10 – 12ఇతరులు: 1 – 2 అస్సాంలో బీజేపీ సునామీఅస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మ నేతృత్వంలోని ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీ 88-100 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24-36 సీట్లతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది. పశ్చిమ బెంగాల్రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.తమిళనాడు234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో టీవీకే విజయ్, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి.కేరళంఎప్పటిలాగే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని చూపడం కష్టం. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.అసోం85 శాతం పైగా పోలింగ్ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ, ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.పుదుచ్చేరి89 శాతం పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బలంగా నిలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ–బీజేపీ మధ్య పోటీ, కేరళలో ఎల్డిఎఫ్–యూడిఎఫ్ మధ్య పోటీ కనిపిస్తోంది. -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహతి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. గురువారం ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కేసు నేపథ్యం ఏప్రిల్ 5న గువాహటిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించినది. ఆ సమయంలో పవన్ ఖేరా.. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు ప్రదర్శించారు. అయితే..ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రింకీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన ప్రదర్శించింది ఫేక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు. ఈ కేసు అసోం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు జరిపారు.అయితే ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి(సనత్ నగర్) పోటీ చేసిందని.. తనకు ఆధార్ కూడా ఇక్కడే ఉందని.. కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఈలోపు..అసోం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ముందస్తు బెయిల్ కోసం గువాహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు ఉన్నాయని.. తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గువాహతి కోర్టునే ఆశ్రయించమని చెప్పింది. తాజాగా.. ఇవాళ(ఏప్రిల్ 24న) గువాహతి హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో పవన్ ఖేరా అరెస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాత్రం.. “అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని.. ఎక్కడున్నా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవాలని” అంటున్నారు. -
అస్సాంలో అటవీ కార్యాలయంలో స్థానికుల విధ్వంసం
గువాహటి: అస్సాం రాష్ట్రం చిరంగ్ జిల్లా రునిఖాటా అటవీ రేంజ్ కార్యాలయంపై మూకదాడి జరిగింది. స్థానికులు కార్యాలయంలో ఫర్నీచర్‌ను, ఆవరణలోని వాహనాలను తగులబెట్టడంతోపాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. రిజర్వు ఫారెస్ట్ ఆక్రమణదారులను అదుపులోకి తీసుకోవడమే వారి ఆగ్రహానికి కారణం. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భూటాన్ సరిహద్దులకు అతి సమీపంలో రిపు చిరంగ్ రిజర్వు ఫారెస్ట్‌లోని చెట్లను నరికి, ఆక్రమణకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అటవీ అధికారులు గురువారం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వదిలేశారు. అయితే, తమ వారిని కొట్టారంటూ శుక్రవారం ఉదయం రాళ్లు విసురుతూ, కర్రలు చేబూని ఒక గుంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడున్న ఫర్నీచర్‌ను విరగ్గొట్టి, నిప్పుపెట్టారు. ఆ పక్కనే ఉన్న ఉద్యోగుల నివాసాల్లోనూ విధ్వంసం సృష్టించారు. ఆవరణలోని వాహనాలను తగులబెట్టారు. అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, అదనపు పోలీసు బలగాలను అధికారులు రప్పించారు. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన వారిని లాఠీచార్జితో చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు, అటవీ అధికారులతోపాటు నిరసనకారులు గాయపడ్డారు. మూకదాడితో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ కార్యాలయంలోని ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందంటూ వచ్చిన వార్తలపై విచారణ చేపట్టామన్నారు. -
పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్ తప్పదా?
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్‌పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది(ఏప్రిల్ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్‌కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్ 15న). అదే సమయంలో..గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్ యాంటీసిపేటరీ బెయిల్‌పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్నా? లేక ఉగ్రవాదినా? అని పవన్ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్‌కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్ ఖేరాను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.లొంగిపోతే మంచిదిసుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు. -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
ఓటెత్తిన కేరళ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్‌లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం. అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్‌కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.పుదుచ్చేరిలో 89.87%పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్‌లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్‌సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు. అస్సాంలో 85% మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్‌లో ఓటేశారు. జోర్హాత్లోని డీసీబీ స్కూల్ బూత్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు. ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు. -
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం
-
అస్సాం, కేరళలో నేడే పోలింగ్
అస్సాం, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా వాటితో పాటే జరగనుంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కేరళ, పుదుచ్చేరిల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. మూడు చోట్లా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.కేరళలో కూటముల పోరుకేరళలో సీపీఎం సారథ్యంలోని పాలక ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. రాష్ట్రంలో ఒక పార్టీ, లేదా కూటమి వరుసగా రెండోసారి నెగ్గడం అదే తొలిసారి. ఎల్డీఎఫ్ ఆశలకు గండికొట్టి ఈ సారి ఎలాగైనా విజయం సా ధించాలని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాల్లో ముక్కోణపు పోరు నెలకొంది.ప్రచార హోరుమూడు కూటములూ నెల రోజులకు పైగా హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గురువారం జరిగే పోలింగ్‌లో 2.71 కోట్ల మంది ఓటర్లు వాటి భాగ్యరేఖలను తేల్చనున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టార్ ప్రచారకులుగా నిలిచారు. యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్ కూటమికి మాత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంతా తానై ప్రచార ప్రక్రియను ముందుండి నడిపించారు. సుపరిపాలన, అభివృద్ధి ఈసారి కూడా తమను ఒడ్డుకు చేరుస్తాయని ఎల్డీఎఫ్ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఆ కూటమిని భయపెడు తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమ విజయం ఖాయమని యూడీఎఫ్ విశ్వసిస్తోంది. సీపీఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ తాము చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆ కూటమి భావిస్తోంది. కొన్నేళ్లుగా కేరళలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ, ఈసారి దాన్ని ఎలాగైనా సీట్ల రూపంలోకి మార్చాలని పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కలిసొస్తుందని నమ్ముతోంది. – తిరువనంతపురంఅస్సాంలో హోరాహోరీఅస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు హోరాహోరి తలపడ్డాయి. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ఆ పార్టీ ఆశలకు గండి కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డింది. రెండు పార్టీలూ ఎప్పట్లాగే పలు ప్రాంతీయ పక్షాలతో జట్టు కట్టి బరిలోకి దిగాయి. హిమంత దూకుడు: బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా రెండేసిసార్లు ప్రచారంలో పాల్గొన్నా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, దూకుడైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కూడా ఎక్కువగా పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్పైనే ఆధారపడింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా 99 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. దాని భాగస్వాముల్లో రైజోర్ దళ్ 13, ఏజేపీ 10, సీపీఎం 3, ఏపీహెచ్ఎల్సీ 2 చోట్ల పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. భాగస్వాములు ఏజీపీ 26, బీపీఎఫ్ 11 చోట్ల బరిలో దిగాయి. పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు ఇరు కూటములకూ తలనొప్పిగా మారాయి. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం విశేషం! రాష్ట్రవ్యాప్తంగా 59 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. జాలూక్బారీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించాలని సీఎం హిమంత ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడైన పీసీసీ చీఫ్ గౌరవ్ జోర్హాట్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో 6.42 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు! – గువాహటిపుదుచ్చేరిలో టీవీకే ఉనికి చాటేనా?పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. దానికి పోటీగా విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమితో పాటు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా తొలిసారి బరిలో దిగింది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరుపైనే ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని డీఎంకే, కాంగ్రెస్ భావిస్తున్నాయి. వాటిలో విజయ్ పార్టీ ఎవరికి నష్టం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ జాతీయవాది సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. – చెన్నై -
అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం
గౌహతి: అస్సాం ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు 40 ఏళ్ల నాటి ‘అస్సాం ఒప్పందం’ ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఇప్పటికీ ఆ ఒప్పందమే అస్సాం ఎన్నికల తలరాతను శాసిస్తోంది?‘అస్సాం ఒప్పందం’ 1985 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ), ఏఏజీఎస్‌పీల మధ్య కుదిరింది. మార్చి 25, 1971 తర్వాత రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించి, బహిష్కరించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అయితే 40 ఏళ్లు గడుస్తున్నా ఏ ప్రభుత్వమూ దీనిని చిత్తశుద్ధితో అమలు చేయలేదని, సరిహద్దుల గుండా చొరబాట్లను అడ్డుకోకపోవడం వల్ల అస్సామీల ఉనికికే ముప్పు వాటిల్లుతోందని ఏఏఎస్‌యూ తీవ్రంగా విమర్శిస్తోంది.అస్సాం ప్రజల గుర్తింపును కాపాడే జస్టిస్ బిప్లబ్ కుమార్ శర్మ కమిటీ (క్లాజ్ 6) సిఫార్సులను అమలు చేసేందుకు అడుగులు వేశామని రాష్ట్ర మంత్రి అతుల్ బోరా చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. బీజేపీ సర్కారు కావాలనే ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) మండిపడుతున్నాయి. 2014కి ముందు ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. తీరా అధికారంలోకి వచ్చాక 1971 తర్వాత వచ్చిన అక్రమ బంగ్లాదేశీయులకు సీఏఏ ద్వారా స్వాగతం పలుకుతోందని ఏజేపీ ఆరోపిస్తోంది.ఈ వివాదంపై 2024 అక్టోబర్ 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ, మార్చి 25, 1971ని సరైన కట్-ఆఫ్ తేదీగా తేల్చింది. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా అస్సాంలో మాత్రమే ఉన్న ‘డీ-ఓటర్ (పౌరసత్వంపై అనుమానం ఉన్నవారు) విధానాన్ని 1997లో ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. భారత పౌరులుగా సరైన ఆధారాలు చూపించలేని వారి పేర్ల ముందు ‘డి’ అని చేరుస్తారు. ఫారినర్స్ ట్రిబ్యునల్స్, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించడం లేదా పౌరులుగా గుర్తించడం జరుగుతుంది.2026, ఏప్రిల్ 9న ఒకే విడతలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ కూటమి (ఎన్డీఏ), కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనున్న ఈ ఎన్నికల్లో.. ఎవరి రాజకీయ భవితవ్యాన్ని ఈ ‘అస్సాం ఒప్పందం’ ఏ తీరుగా మారుస్తుందో వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ గద్దె దిగాలంటూ నిరసనలు -
అస్సాం, కేరళలో ప్రచారానికి తెర
తిరువనంతపురం/గువాహటి/చెన్నై: కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ మైకులు మూగబోయాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనుంది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మంగళవారం చివరి రోజు కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారంతో హోరెత్తించాయి. సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషందాకా ప్రయత్నించాయి. కేరళలోనైతే కొన్ని చోట్ల అభ్యర్థులు క్రేన్లపైకి ఎక్కి మరీ ప్రసంగాలు చేశారు! హోరాహోరీ పోరు కేరళలో మూడు కూటములు బరిలో ఉన్నా పోరు ప్రధానంగా సీపీఎం సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. నెల రోజులపాటు పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించగా కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా స్టార్ ప్రచారకులుగా నిలిచారు.ఎల్డీఎఫ్ కూటమి ప్రచారం ప్రధానంగా సీఎం విజయన్‌పైనే ఆధారపడి సాగింది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ఈసారి ప్రాధాన్యమివ్వడం విశేషం. అస్సాంలో ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎప్పట్లాగే అవి రెండూ పలు ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ నుంచి రాహుల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ, అమిత్ షా పుదుచ్చేరిలో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఎన్నికలు పాలక ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రచారం కొత్త పుంతలు ప్రచారంలో పలువురు నేతలు కొత్త పుంతలు తొక్కారు. కేరళలో పుత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఛండీ ఒమెన్ నియోజకవర్గమంతటినీ పలుమార్లు సైకిల్‌పై చుట్టేశారు. ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ప్రచారం కొనసాగించిన తీరు రాహుల్ తదితర నేతలను ఆకర్షించింది. పాలక్కాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ పిషరోడీ గోడలపై రోబోలతో రాతలు రాయించారు. -
‘ప్రాంతీయ’ వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ‘ఐక్య’మంత్రం 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్ గొగోయ్ సారథ్యంలోని రైజోర్ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్జ్యోతి గొగోయ్ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్‌ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్ నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓట్ల బదిలీపైనే ఆశలు ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ‘హిమంత’కోట పదిలమేనా? గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు. -
మొదటి విడత రేసులో మొగ్గెవరికి?
మళ్లీ అధికారం మాదే అని అసోమ్‌లో బీజేపీ నేతృత్వపు ‘ఎన్యీడీఏ’ ధీమాగా ఉంటే, కేరళంలో కమ్యూనిస్టు నేతృత్వపు ‘లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్’ (ఎల్డీఎఫ్) ఆపసోపాలు పడుతోంది. రెండు చోట్ల అవే కూటములు రెండో పర్యాయం అధికారంలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి మరో ప్రభుత్వం నడుస్తున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలక కూటమే ముందంజలో ఉంది. ఈ నెల 9న పోలింగ్ జరగాల్సి ఉన్న ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. తమిళనాడు (ఏప్రిల్ 23), పశ్చిమ బెంగాల్ (ఏప్రిల్ 23, 29)లలో ప్రచారహోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధాంతాలు, నిబద్ధతల కన్నా ‘పొలిటికల్ న్యారేటివ్స్’ ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల తుది ఫలితాలు తేలేది మాత్రం మే 4న ఓట్ల లెక్కింపు తర్వాతే!ఎక్కడో 4 వేల కిలోమీటర్ల దూరంలోని పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ దక్షిణ ధ్రువపు కేరళం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? 30 లక్షల మంది మలయాళీలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉండటం, అత్యధికులు తరచూ స్వస్థలాలకు వస్తూ–పోతూ ఉండే స్వభావ రీత్యా ఎన్నికల్ని వారు ప్రభావితం చేస్తుంటారు. దేశ ఈశాన్యపు శీర్షాన ఉన్న అసోమ్ రాష్ట్రంలో 2023లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన, ఫలితంగా తగ్గిన ముస్లిం ఆధిపత్య నియోజక వర్గాల సంఖ్య ఎన్ని కల సరళిని ప్రభావితం చేయనుంది. మూడు భౌగోళిక ముక్కలుగా ఉన్న పుదుచ్చేరికి ‘రాష్ట్ర హోదా కల్పించడమ’నే డిమాండ్ ప్రస్తుత ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశ ముంది. ఓడినా, గెలిచినా చరిత్రే!సంపూర్ణ చదువరుల రాష్ట్రం కేరళంలో ప్రతిసారీ విపక్షాలను గెలిపించే జనం నైజం వల్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ (యునైటెడ్ డెమా క్రటిక్ ఫ్రంట్) ఒకటి తర్వాత మరొకటి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. కానీ, 2021 ఎన్నికల్లో పాలక ఎల్డీఎఫ్ అధికారం తిరిగి నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. మూడోసారి గెలిస్తే, కేరళంలో కొత్త చరిత్రే! లోగడ పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలుండేవి. ఓడిపోతే, దేశంలో ఎక్కడా కమ్యూ నిస్టు సర్కారు లేని పరిస్థితి వస్తుంది. 2021 ఎన్నికల తర్వాత యూడీఎఫ్ పుంజుకోవడం ఎల్డీఎఫ్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయిదేళ్లలో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 4 చోట్ల గెలిచిన యూడీఎఫ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి (18/20) ఫలితాలు పొందింది. 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో 565/941పంచాయతీల్లో నెగ్గి కమ్యూనిస్టులకు షాకిచ్చింది. మరోవైపు బీజేపీ పుంజుకోవడమూ ఎల్డీఎఫ్ను కలవరపరు స్తోంది. 2016, 2021 ఎన్నికల్లో 11 శాతం ఓటువాటా పొందిన బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం (త్రిస్సూర్–సురేశ్ గోపి) గెలవడంతో పాటు 11 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 98 చోట్ల పోటీ చేస్తున్నా, 15 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి, వనరులన్నీ కేంద్రీకృతపరచి ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై లోగడ ఎప్పుడూ లేనంత అవినీతి ఆరోపణలు, తిరుగుబాట్లు, దన్నుగా ఉండే కులాలు, ఉపకులాల్లో చీలికలు ఎల్డీఎఫ్ నాయకత్వా నికి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ పంచాయతీ ఉంది. అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ కు జనాదరణ ఉంటే, పార్టీ అధిష్ఠానంలో ముఖ్యుడైన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేశ్ చెన్నితల రేపటి సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత, మాజీ ఎంపీలైన ప్రియాంక, రాహుల్ గాంధీ యూడీఎఫ్ ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. వారి బాట లోనే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లి, ఎల్డీఎఫ్కు బీజేపీ దన్నుగా ఉందని చేస్తున్న విమర్శ వారికిక్కడ కమ్యూనిస్టులతో పొత్తుకేమీ ఇబ్బంది రాదా అన్నది ప్రశ్న!స్థిరీకరణ బాటలో...అధికారాన్ని సుస్థిరపరచుకునే అన్ని ఎత్తుగడల్నీ అసోమ్‌లో బీజేపీ అనుసరిస్తోంది. వరుసగా మూడోసారి అధికారం నిలుపుకొనే దిశగా సాగుతోంది. బీజేపీ ఏజీపీ, బీపీఎఫ్ తదితరులతో కూడిన ‘నార్త్ ఈస్ట్ డెమాక్రటిక్ అలయెన్ ్స’ (ఎన్ ఈడీఏ) ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్‌పోల్ సర్వే (2) ప్రకారం, ఈ కూటమికి 39 శాతం ఓటువాటా లభించనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎఎస్ఎమ్’ 36.5 శాతం పొందే అవకాశాలున్నాయి. వ్యత్యాసం రెండున్నర శాతమే అయినా అధికార కూటమి పక్షాల మధ్య చక్కని సమన్వయం వల్ల సీట్ల సంఖ్య కాంగ్రెస్ మీద రెట్టింపు కన్నా ఎక్కువ బీజేపీకి సొంతంగానే లభించే సూచనలున్నాయి. కాంగ్రెస్ కూటమి ముస్లిం ఓటర్ల సానుకూలతపై ఆధారపడ నుంది. అందుకే, 2023 నియోజకవర్గాల పునర్విభజనలో ముస్లిం ఆధిపత్యమున్న నియోజకవర్గాల సంఖ్యను 29 నుంచి 21కి ప్రభుత్వం నియంత్రించింది. అసోమ్‌లోనే కాక ఈశాన్య భారతంలో బీజేపీని వృద్ధి చేస్తున్న ‘వ్యవహార దక్షుడి’గా పేరుబడ్డ సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వం వహిస్తున్న తొలి ఎన్నికలివి. 2021 ఎన్నికల్లో పార్టీని నాటి సీఎం శర్బానంద సోనోవాల్ నడిపారు. ప్రభుత్వంపై అవినీతి, అక్రమ మైనింగ్‌కు ప్రోత్సాహం, డ్రగ్స్‌పై ఉదాసీనత వంటి ఆరోపణలున్నాయి. 40 లక్షల మంది మహిళల అకౌంట్లలోకి రూ.9 వేల చొప్పున, ఏకంగా 3,600 కోట్లను మార్చి 10న ముఖ్యమంత్రి బట్వాడా చేశారు. ‘అరుణోదయ్’ స్కీమ్ కింద మొత్తం రూ.17,000 కోట్లు మహిళలకు పంపిణీ చేసినట్టు ఆయనే చెప్పారు. విభజన రాజకీయాలనే కీలకం చేస్తూ, ‘వలసదారుల్ని వదిలించుకుందాం’ అని పిలుపునిచ్చారు. విపక్షాల సీఎం అభ్యర్థిగా ఉన్న గౌరవ్ గొగోయ్ మూడు పర్యాయాలు కాంగ్రెస్ సీఎంగా ఉన్న తరుణ్ గొగోయ్ తనయుడు. కాంగ్రెస్ నుంచి బిశ్వశర్మ నిష్క్రమణకు కారణమైన ఆయన ఒంటెత్తు ‘వైఖరి’లో ఇప్పటికీ మార్పు లేదు.రాష్ట్ర హోదా దక్కేనా?పూర్వపు ఫ్రెంచ్ కాలనీ అయిన పుదుచ్చేరి భౌగోళిక స్వరూపం మూడు ముక్కలుగా ఉంది. తమిళనాడు పక్కనున్న ప్రధాన భూభాగంతో పాటు కాకినాడ సమీపంలోని ‘యానాం’, కేరళ సమీ పంలోని ‘నెహం’ కలిసి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ నుంచే విడిపోయిన ఎన్.రంగస్వామి, ‘ఎన్.ఆర్. కాంగ్రెస్’ ఏర్పరచి, బీజేపీ పొత్తుతో ముఖ్యమంత్రయ్యారు. నిరాడంబరంగా ఉండే రంగస్వామి జనంలో కలిసిపోయి, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ, అది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమనీ ప్రచారం చేస్తున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న సభలో కనీసం 14 గెలిచినా మ్యాజిక్ నంబర్ (17)ను (గవ ర్నర్ నామినేటెడ్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి) దాటుతారు కనుక ప్రభుత్వం వారిదే! విపక్ష ‘ఇండియా గుంపు’లో ఆఖరు నిమిషం వరకు సీట్ల పంపకాల్లో స్పర్థలున్నాయి. డీఎంకే బలమైన పక్షం (6 ఎమ్మెల్యేలు) అయినా 14 చోట్ల పోటీ చేస్తుంటే, ఇద్దరే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానంకైవసం చేసుకున్న కాంగ్రెస్, అప్పుడు మెజారిటీ (28/30) స్థానాల్లో తమకు ఆధిక్యం దక్కిందనే వాదనతో పొత్తుల్లో ఎక్కువ స్థానాలు పొందింది. నియోజకవర్గానికి 30–35 వేల ఓట్లే కావడంతో చిన్న రాజకీయ పరిణామం కూడా స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో గెలుపోట ముల్ని ప్రభావితం చేయొచ్చు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
‘మీ వ్యాఖ్యలకు నవ్వొస్తుంది.. పబ్లిక్‌గా నిరూపిస్తే పోలా?’
దిస్పూర్: తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై అస్సాం సీఎం హిమాంత్ బిశ్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ స్పందించారు. వారికి వ్యాఖ్యలను చూస్తే నవ్వొస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు రాజకీయ దురద్దేశంతో మాత్రమే చేశారనే విషయం అర్ధమైందని, అందుకే మీ ఆరోపణలు చూసి నవ్వొస్తుందన్నారు. మీ ఉత్కంఠకు తానే సమాధానమిస్తానంటూ ట్వీట్ చేశారు రింకీ భుయాన్ శర్మ. ఆ మూడు పాస్‌పోర్టుల సాయంతో భారత బయట పలు వ్యాపారాలు చేస్తున్నానంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ఎంతో ఉత్కంఠతో, ఆతృతతో తనపై వ్యాఖ్యలు చేశారని, వాస్తవాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలన్నారు. ‘మీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా. వాస్తవాలు ఉంటే బయటపెట్టండి. ఎన్నికల స్టంట్స్ చేయొద్దు. నాకు కానీ, నా పిల్లలు కానీ భారత బయట ఎక్కడా ఆస్తులు, వ్యాపారాలు లేవు. మీరు నిరూపించి చూపించండి’ అంటూ సవాల్ చేశారు. తనకు పాకిస్తాన్ బ్యాంక్‌లతో కూడా సంబంధాలున్నాయని కూడా కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ‘ అవేంటో చూపించి మాట్లాడండి. ఎందుకో అంత ఆతృత.. పబ్లిక్ నిరూపిస్తే పోతుంది కదా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.I’ll save you the suspense and answer these laughable questions myself, @GauravGogoiAsm.Here it is: Neither I, nor my children, nor my husband have any business interests or assets in Dubai or anywhere outside India.Now your turn. Can you disclose whether your wife has or has… https://t.co/1R364UxzOX— Riniki Bhuyan Sharma (@rinikibsharma) April 6, 2026 -
Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!
అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న కారణంగా అస్సాంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు అది 40 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో అత్యధిక జనాభా ముస్లింలదే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో 126 స్థానాలకుగాను 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు. అయితే జనాభాతో పోలిస్తే అస్సాంలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. బీజేపీ ప్రకటించిన 90 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.అత్యధికం ఆ పార్టీ నుంచే..పార్టీల వారీగా చూస్తే, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అత్యధికంగా 87 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏజీపీ 46 శాతం మందిని బరిలోకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ 32 శాతం, కాంగ్రెస్ 18 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి. పొత్తుల విషయానికొస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని అస్సాం మహాజోత్ (ఏఎస్ఎం) 128 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఇందులో 22 మంది ముస్లింలు (17 శాతం) ఉన్నారు. మరోవైపు నార్త్ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి 127 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే.. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ముస్లింలు (10 శాతం) ఉండడం గమనార్హం.అయితే జనాభాపరంగా దిగువ అస్సాంతో పాటు బరాక్ వ్యాలీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. గౌరీపూర్, జలేశ్వర్, చమారియా, చెంగా నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలోని 126 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేరు. ఈ నియోజకవర్గాలు ప్రధానంగా ఉత్తర అస్సాం, బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్నాయి. దిబ్రూగఢ్‌లోని టిన్సుకియా నుంచి తముల్‌పూర్‌లోని కోక్రాఝర్ వరకు ముస్లిం అభ్యర్థులు లేకపోవడంతో ఇక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లు ఎవరికి పడనున్నాయనేది ఆసక్తిగా మారింది.స్వతంత్రులతో తలనొప్పి!జనాభా పరంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముస్లింలు తక్కువగా ఉండడం.. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది (34 శాతం) ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల ఓట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది.అస్సాం జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. దీంతో ఏప్రిల్ 9న జరగనున్న ఓటింగ్‌లో ముస్లింలు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే అస్సాంలో అభ్యర్థుల భవితవ్యం ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉంది.చదవండి: ‘విజయ్’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు? -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్‌తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్‌కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
మూలవాసులకు ఎస్టీ కేటగిరీ
గువాహటి: మూలవాసులుగా గుర్తించిన ఆరు తెగలకు ఎస్టీ హోదా, పాలన, ఆరోగ్యం, పారిశ్రామికీకరణ తదితర 11 రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత..కీలకాంశాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా బోకాజాన్లో ‘రైజోర్ ఇష్టాహార్’పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో యాంటీ కరప్షన్ కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ సంస్థలకు భారీ భూకేటాయింపులపై సిట్‌తో దర్యాప్తు, పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు తప్పనిసరి చేయడం వంటి హామీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ఐదు గ్యారంటీలకు ఇవి అదనం. → అస్సాంలోని మొరాన్, మొటోక్, చుటియా, టై–అహోం, కొచ్–రాజ్»ొంగ్షిలతోపాటు తేయాకు తోటల్లో పనిచేసే గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించడం. → టీ పరిశ్రమను ప్రధాన పరిశ్రమగా గుర్తించడం. టీ వర్కర్లకు పరిశ్రమల్లో మాదిరిగా కనీసం వేతనాలు, ఇతర ప్రయోజనాలను కల్పించడం. → బీటీసీ, కేఏఏసీ, దిమా హసావో కౌన్సిళ్లను ఆర్థికంగా మరింత చేయూతనివ్వడం, మరిన్ని అధికారాలను కల్పించడం, గిరిజన తెగలకు తిరిగి పునరావాసం కల్పించడం. → ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిపే శ్వేతపత్రం విడుదల, ఆస్పత్రులు, స్కూళ్లలో ఖాళీల భర్తీ వంటి ఐదు కార్యక్రమాల అమలు. → పూర్తి అధికారాలతో స్వతంత్ర అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటు. పంచాయతీ రాజ్ సంస్థలకు వార్షిక గ్రాంట్ల విడుదల, జవాబుదారీతనం పెంపు. పోలీసు యంత్రాంగంలో సంస్కరణలు. జిల్లా ఆస్పత్రుల హోదా పెంపు, డిజిటల్ క్లాస్‌రూంల ఏర్పాటు. → ఐదేళ్లలో మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడం. అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటైజ్ చేయడం. అందరికీ ఆరోగ్యం, స్కూళ్లలో వంద శాతం హాజరీ, ఉద్యోగిత పెంపు, ఆదాయం రెట్టింపు వంటివి అమలు. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్‌ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్‌కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్‌కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్‌లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్‌కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
హిమంత.. అస్సాం మామ
డాక్టర్ హిమంత బిశ్వ శర్మ. అస్సాం రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకుని, తదనుగుణంగా తనను తాను మలచుకున్న నేత. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. స్వయం కృషితో ఈశాన్య భారత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు హిమంత. అస్సామీలు ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకునేంతటి ప్రజాదరణ ఆయన సొంతం...!ఎన్ఈడీఏ రూపశిల్పి1991 నాటి సంగతి. యువతను తిరిగి కాంగ్రెస్కేసి ఆకర్షించగల యువ నాయకుని కోసం నాటి ముఖ్య మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు హితేశ్వర్ సైకియా ప్రయత్నిస్తున్న రోజులు. హిమంత బిశ్వ శర్మ ఆయన కంట పడ్డారు. అలా కాంగ్రెస్‌లో చేరారు. ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. జాలుక్బారి అసెంబ్లీ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 1996లో తొలిసారి అక్కడ ఓడినా కుంగిపోలేదు. 2001లో అస్సాం గణ పరిషత్ సీనియర్ నాయకుడు భృగుకుమార్ ఫుకాన్‌ను ఓడించి సత్తా చాటారు. ఏడాదికే మంత్రి పదవి సాధించారు. జాలుక్బారి నుంచి వరుసగా ఐదు పర్యాయాలుగా అత్యధిక మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. దశాబ్దాల పాటు అస్సాం కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా, సీఎం తరుణ్ గొగొయ్ కుడిచేయిగా కొనసాగారు. అలా 24 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవలందించిన హిమంత, అధిష్టానంతో విభేదాల కారణంగా 2014లో పార్టీకి రాజీనామా చేశారు. 2015లో బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేని ఆ పార్టీకి అక్కడ పెద్ద దిక్కుగా మారారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్ఈడీఏ)కి రూపకల్పన చేసి ఆ ప్రాంతంలో బీజేపీ తలరాతను మార్చేశారు. అస్సాంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టారు.కేబినెట్ ఆన్ వీల్స్గువాహటిలోని కాటన్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలిన ఏడో నేతగా హిమంత నిలిచారు. ఆయన నాయకత్వంలో అస్సాం అశాంతి నుంచి బయటపడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి అస్సాం సీఎంగా హిమంత నిలిచారు. తెల్లవారుజాము వేళ కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడం ఆయన స్టైల్. సీఈఓ తరహా పనితీరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామీణ జిల్లాల్లో అధికారిక సమావేశాలు నిర్వహిస్తూ ‘కేబినెట్ ఆన్ వీల్స్’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.వివాదాలు, మరకలు→ మియా (బెంగాలీ మాట్లాడే ముస్లిం)లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని హిమంత ప్రకటించడం వివాదాస్పదమైంది→ వలసదారులపై హిమంత రైఫిల్ ఎక్కుపె ట్టినట్టుగా చిత్రించిన ‘పాయింట్ బ్లాంక్’ వీడియో అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఫిర్యాదులు చేశారు. వామపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. హిమంత మాత్రం అది ఫేక్ అని కొట్టిపారేశారు.→ ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని మదర్సాలనూ సాధారణ పాఠశాలలుగా మార్చాలన్న హిమంత నిర్ణయంపై భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి.→ ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ప్రభుత్వ, అటవీ భూముల నుంచి వేలాది మందిని వెళ్లగొట్టారు. వారిలో బెంగాలీ మా ట్లాడే ముస్లింలే అధికంగా ఉండటంతో, వారిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకున్నా రని ఆరోపణలొచ్చాయి.వ్యక్తిగత జీవితంహిమంత 1969 ఫిబ్రవరి 1న జోర్హాట్లో జన్మించారు. తండ్రి కైలాశ్‌నాథ్ శర్మ సాహితీవేత్త. అలా హిమంత పుస్తకాలు, మేధో చర్చల నడుమ పెరిగారు. పాఠశాల విద్యార్థిగానే ఆదివాసీల హక్కుల ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. గువాహటి కాటన్ వర్సిటీ విద్యార్థి సంఘానికి మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే చదువులోనూ రాణించారు. పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కావడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు గువాహటి హైకోర్టులో ఐదేళ్లు సొలిసిటర్గా కూడా పనిచేశారు. హిమంత భార్య రినికి భుయాన్ శర్మ రాష్ట్రంలో మీడియా టైకూన్‌గా పేరొందారు. వారికి కొడుకు, కూతురున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అస్సాంలో మూడోసారి.. మేమే!
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదార్ల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధెమా జీ జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్ జిల్లాలోని బెహాలీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మెజార్టీ ప్రజల ను మైనార్టిలుగా మార్చేసి, చొరబాటుదార్లను శాశ్వతంగా ఓటుబ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదార్ల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయతి్నంచిందని గుర్తుచేశారు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీయే అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదార్లను కాపాడుతామంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసినట్టుగానే నేడు కాంగ్రెస్ సైతం సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.భ్రష్టాచార్ కీ జనని కాంగ్రెస్ ‘‘ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలి. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)కి వందోసారి కూడా ఓటమి తప్పదు. యువతకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాం. అస్సాంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడి వనరుతోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం. అది అవినీతికి తల్లిలాంటిది(భ్రష్టాచార్ కీ జనని). అస్సాం ఆత్మగౌరవాన్ని, భద్రతను కాపాడే విషయంలో రాజీపడింది’’ అని మోదీ ధ్వజమెత్తారు.ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం ‘‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తాం. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణలు కల్పిస్తాం. అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుతాం. రాష్ట్రంలో పదేళ్ల బీజేపీ పాలన సేవ, సుశాసన్కు బాటలు వేసింది. తేయాకు సాగుకు ప్రసిద్ధి పొందిన అస్సాం నేడు సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మారడం సంతోషంగా ఉంది’’అని మోదీ ఉద్ఘాటించారు. తేయాకు తోటలో కార్మికుడిగా మోదీ అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. 19 మంది మహిళా కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. స్వయంగా తోటలోకి దిగి తేయాకు తెంపి, సంప్రదాయ బుట్టలోకి సేకరించారు. తేయాకు తోటలో పనిచేయడం మర్చిపోలేని అనుభవమని మోదీ పేర్కొన్నారు. తన జీవితం ఛాయ్‌తో ముడిపడి ఉందన్నారు. టీ చెట్ల నుంచి తేయాకు ఎలా తెంచాలన్నది మహిళలను చూసి నేర్చుకున్నానని తెలిపారు. మహిళలతో మాట్లాడారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. అలాగే వంటల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళను తన గురువుగా మోదీ అభివరి్ణంచారు. మరో మహిళ పాట పాడి వినిపించారు. తేయాకు అస్సాం అత్మ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇక్కడ సాగవుతున్న టీ ప్రపంచమంతటా సరఫరా అవుతోందని వివరించారు. టీ కార్మికుల శ్రమ, పట్టుదల అస్సాంకు గర్వకారణమని స్పష్టంచేశారు. -
అస్సాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
అస్సాంలో తమను గెలిపిస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ పేర్కొంది. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్ర మించిన భూములను విడిపించి స్థానికులకు అందజేస్తాం. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తాం’’అని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 31 హామీలతో కూడిన బీజేపీ ‘సంకల్పపత్ర’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం గువాహటిలో విడుదల చేశారు. ఇక అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..అరుణోదయ్ పథకం లబ్ధిదారులైన మహిళలకు ఆర్థిక సాయం ప్రస్తుత రూ.1,250 నుంచి క్రమంగా రూ.3,000కు పెంపుగిరిజనులతో సహా అర్హులైన తేయాకు కార్మికులందరికీ భూ పట్టాలు. రూ.500 చొప్పున వేతన పెంపు. అక్రమ చొరబాటుదారులకు దేశ బహిష్కరణ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుతో అస్సామీల నాగరికత, వారసత్వం, హక్కుల పరిరక్షణ మిషన్ వసుంధర’లో భాగంగా చొరబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రతి అంగుళం భూమికీ విముక్తి. వాటిపై అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు.చదవండి: బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్! -
అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ!
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఏప్రిల్ 9న జరగనున్న 126 అసెంబ్లీ స్థానాల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.49 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హేమాహేమీలు తలపడుతున్న ఈ స్థానాలే అస్సాంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆ కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక విశ్లేషణ..జోర్హాట్: దిగ్గజాల మధ్య హోరాహోరీఎగువ అస్సాంలోని జోర్హాట్ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్థానంగా నిలిచింది. ఇక్కడ బీజేపీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హితంద్ర నాథ్ గోస్వామి.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో తలపడుతున్నారు. 2016 నుంచి ఇక్కడ బీజేపీదే హవా.. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్లో గౌరవ్ గొగోయ్‌కు 12,130 ఓట్ల ఆధిక్యం లభించింది. నియోజకవర్గ పునర్విభజన తర్వాత మహిళా ఓటర్ల ప్రాబల్యం ఈ పోరును ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా మార్చేసింది.శివసాగర్: ప్రాంతీయత వర్సెస్ జాతీయ శక్తిచారిత్రక శివసాగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ 2021లో జైలు నుంచే పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈసారి ఆయనను ఢీకొట్టేందుకు బీజేపీ నుంచి కుశాల్ దోవారీ, మిత్రపక్షం అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ప్రదీప్ హజారికా బరిలో ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల మధ్యే ఇక్కడ ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ జరగడం అఖిల్ గొగోయ్‌కు కలిసి వస్తుందా లేక ఓట్లు చీలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.బిహ్పురియా: ఫిరాయింపుల సెగబిహ్పురియాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ (రామ్) భుయాన్ రంగంలో ఉన్నారు. ఆయన స్థానిక నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక సమస్యలను అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో అంతర్గత అసమ్మతి భూపేన్ బోరాకు సవాల్‌గా మారింది.జలుక్బారీ: ముఖ్యమంత్రి కోటముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన శక్తిని మరోసారి నిరూపించుకోవడానికి జలుక్బారీ నుంచి ఆరోసారి బరిలోకి దిగుతున్నారు. 2021లో లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన హిమంతకు ఇక్కడ ఎదురులేదనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ ఆయనను ఢీకొంటున్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటికీ, పట్టణ ఓటర్లు హిమంత వైపే మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి.దిస్పూర్: రాజధాని పోరులో ‘రెబల్’ సెగరాష్ట్ర రాజధాని దిస్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మెగా డ్రామాను తలపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ప్రద్యుత్ బోర్డోలోయ్ ఇక్కడి అభ్యర్థి. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి పోటీ చేస్తున్నారు. అయితే, టికెట్ దక్కని బీజేపీ సీనియర్ నేత జయంత కుమార్ దాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం బీజేపీకి తలనొప్పిగా మారింది. 2.43 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గం అస్సాం పట్టణ ఓటర్ల నాడిని ప్రతిబింబిస్తుంది.గౌహతి సెంట్రల్: అనుభవం వర్సెస్ యువతకొత్తగా ఏర్పడిన గౌహతి సెంట్రల్లో తరం మారుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ గుప్తాతో 27 ఏళ్ల యువ నాయకురాలు, అస్సాం జాతీయ పరిషత్ (AJP) అభ్యర్థి కుంకీ చౌదరి తలపడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వర్సెస్ యువత ఉపాధి అనే నినాదాల మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.తముల్పూర్: మిత్రుల మధ్య యుద్ధంబోడోలాండ్ రీజియన్‌లోని తముల్పూర్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన బీజేపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఇక్కడ నేరుగా తలపడుతున్నాయి. బీజేపీ నుంచి బిస్వజిత్ దైమరీ, యూపీపీఎల్ అధినేత ప్రమోద్ బోరో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో రఫీ దైమరీ బరిలో ఉండటంతో, బోడో ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ -
చొరబాటు.. ఎన్నికల అంశం కాదు
న్యూఢిల్లీ: అస్సాంను సమస్యగా పరిణమించిన చొరబాటు అంశాన్ని కేవలం ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లు అనేవి దేశ పౌరుల గుర్తింపునకు, జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టుగా తయారవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. మరో పది రోజుల్లో అస్సాంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో ‘మేరా బూత్, సబ్సే మజ్బూత్ సంవాద్’కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ‘‘అస్సాంలో తొలిసారిగా ఓటేసే యువ ఓటర్లు రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థ పాలనలను ఒకసారి గుర్తుచేసుకోండి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేసినా మీరు చేసే ఈ తప్పు రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథం నుంచి పక్కకు తప్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టేలా బీజేపీ కార్యకర్తలు బాగా శ్రమించాలి. చొరబాట్లు అనేవి కేవలం ఎన్నికల అంశం కానేకాదు. అస్సాం రాష్ట్ర గుర్తింపు పరిరక్షణకు సంబంధించిన అంశమిది. చొరబాటుదారులు అక్రమంగా భూములను లాక్కునేలా కాంగ్రెస్ ప్రోత్సహించింది. చొరబాటుదారులు ఒక్కసారి రాష్ట్రంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారంటే అక్కడి చిరువ్యాపారాలను తమపరంచేసుకుంటారు. దాంతో స్థానికుల జీవనోపాధి కష్టమవుతోంది. ఆక్రమణను కాంగ్రెస్ ప్రోత్సహిస్తే బీజేపీ వాటిని అడ్డుకుంది. ఈశాన్య భారతంలో కేంద్రప్రభుత్వం శాంతిస్థాపన కోసం వేర్వేరు సంస్థలతో 12 శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. అదే కాంగ్రెస్ ఒప్పందాలను కాగితాలకే పరిమితంచేసింది. కేవలం ఆర్భాటం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కి ప్రజలను తప్పుదోవపట్టించింది. కాంగ్రెస్‌పాలనలో అస్సాం హింసతో రగిలిపోయింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు శాంతిస్థాపనకు శతథా కృషిచేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క శాంతి ఒప్పందం అమలుకునోచుకోలేదు. దీంతో యువత అశాంతితో రగిలిపోయారు. నాడు బోడోల్యాండ్‌లో కర్ఫ్యూలు కన్పించేవి. బాంబుమోతలు విన్పించేవి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు శాంతి, సుస్థిరత సాధించాయి. ఒకప్పుడు హింసను చవిచూసి నేడు శాంతిపథంలో దూసుకెళ్తున్న అస్సాం దేశానికే ఒక ఆదర్శదాయకం’’అని అన్నారు. ‘‘అస్సాం బీజేపీ కార్యకర్తలందరికీ ఇదే నా ఆహా్వనం. నేను కూడా మీలాగా కార్యకర్తనే. నాపై మోపిన బాధ్యతను నెరవేర్చా. నేడు ఏఐతో వచ్చే ఆడియో, వీడియో సందేశాలపై అప్రమత్తంగా ఉండండి. మీ అందరి వద్దా నమో యాప్ ఉండాలి. నారీశక్తి కోసం పార్టీ చేపట్టే చర్యల సమగ్ర వివరాలు యాప్ ద్వారా తెల్సుకుని ఓటర్లకు అవగాహన పెంచండి’’అని మోదీ సూచించారు. -
అస్సాంలో పేలుళ్లు.. ఇద్దరు మృతి
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోర్హాట్ జిల్లాలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జోర్హాట్ పట్టణంలోని రాజా మైదాన్ ప్రాంతంలో. పాత ఇనుము సామాగ్రిని ఒక వ్యక్తి తన ఇంటివద్ద సుత్తితో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నూర్ మహమ్మద్ (45), మహమ్మద్ ఇక్బాల్ (8) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. షెహనాజ్ బేగం (12), నూర్జహాన్ బేగంలకు తీవ్రగాయాలయ్యాయి.పేలుడు దాటికి పెద్దఎత్తున శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటీన అక్కడ గూమిగూడారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించినప్పటికీ తదుపరి విచారణలో అది గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని తేలింది. అయితే పేలుడు ఎలా సంభవించిందనే అంశం విచారణ చేపడుతున్నారు. కాగా ఈ ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అక్కడ పేలుడు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. -
Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్!
అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.దెబ్బతీసిన స్నేహం..ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. -
గౌరవ్ గొగొయ్ నామినేషన్
జోర్హాత్: లోక్‌సభ సభ్యుడు, అస్సాం కాంగెస్ర్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సోమవారం జోర్హాట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జోర్హాట్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో అట్టహాసంగా జిల్లా కమిషనర్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. గొగొయ్ మద్దతుదారులతోపాటు కాంగ్రెస్ కూటమిలోని ఆరుపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోర్హాట్ ఎంపీగా ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా గొగోయ్ కొనసాగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నామినేషన్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ అస్సాం రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు దీనినో అవకాశంగా భావిస్తున్నానన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని, రాజకీయాలను శుద్ధి చేసేందుకు తనతో చేతులు కలపాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు. పార్టీ ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొన్న వారికే పథకాలను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ మహిళలను అవమానిస్తోందని గొగొయ్ విమర్శించారు. జోర్హాట్ స్థానం నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్రనాథ్ గోస్వామితో గొగొయ్ తలపడనున్నారు. గోస్వామి 1991 నుంచి ఏజీపీ తరఫున, అనంతరం 2016 నుంచి బీజేపీ తరఫున వరుసగా ఐదు పర్యాయాలు జోర్హాట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.టికెట్ దక్కకపోవడమే కారణమా?2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహంనందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.సీఎం చర్చలు విఫలం?నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్‌లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది. -
అస్సాంలో బీజేపీ దూకుడు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), రభా హసోంగ్ జతా మంచ్ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్‌కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్ మరోసారి వామపక్షాలు, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్‌ను కుంగదీస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ భూపేన్ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్‌లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్‌ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్
గువాహటి: అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విపక్ష కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు.ఈ సందర్భంగా లేఖలో..‘తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నా’ అని ప్రద్యుత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా ప్రద్యుత్‌ను రాజకీయంగా మభ్యపెట్టారు. అదీ కాకుండా ఆయనకు కుటుంబ విబేధాలు ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ ఏప్రిల్ 9న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మార్గేరీటీ స్థానం కాంగ్రెస్ తరఫున పోటీపడుతున్నారు. కాగా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఎన్నికల బాజా!
ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి. 2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు. అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది. మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు. సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌లో బాగా ఆశలున్నాయి. 2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి. ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్‌సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు. -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
పార్లమెంట్ మెట్లపై మీరు టీ తాగి, పకోడీ తిని..: అమిత్ షా
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్‌కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.“ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్ షా అన్నారు.ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది? మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. -
ఈశాన్యంలో శాంతి వీచికలు
గువాహటి: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ అశాంతి అంతమై, అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో రూ.19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కింద దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు.కోక్రాఝార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాజధాని గువాహటి నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రధానమంత్రి కోక్రాఝార్‌కు చేరుకోలేకపోయారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో అస్సాంలో నూతన అధ్యాయం మొదలైందని, ఇక్కడ పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ భద్రతను పణంగా పెట్టిందని, స్థానికుల భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నా అస్సాంలో తేయాకు తోటల కార్మికులకు జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దినట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భూములపై వారికి హక్కులు కల్పించామని, పట్టాలు అందజేశామని అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మూడు కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్మికురాలికి మోదీ పాదాభివందనం చేశారు. కార్మికులకు న్యాయం చేసినందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు. అస్సాం కార్మికులు పండించిన తేయాకు గుజరాత్‌కు వస్తోందని, అక్కడ ఆ తేయాకుతో తేనీరు తయారు చేసి విక్రయించానని తెలిపారు. ఛాయ్‌వాలాగా పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. భూమి పట్టాలు ఇవ్వడం ద్వారా తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణం ప్రేమ దుకాణం(మొహబ్బత్ కీ దుకాణ్) తెరిచామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం(ఝూటే వైదో కీ దుకాణ్) తెరిచిందని విమర్శించారు. అక్కడ ఒక అబద్ధానికి మరో నాలుగు సూపర్ అబద్ధాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఏనాడూ లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. -
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్‌లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026 -
ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
ఢిల్లీ: అసోంలో గల్లంతైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(మార్చి 5, గురువారం) అసోంలోని జోర్హాత్ వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సేపటికే, 7.42 గంటల సమయానికి విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ తెలిపింది. అన్వేషణ, సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించామని పేర్కొంది.అయితే, విమానంలోని పైలట్ల పరిస్థితిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. సుఖోయ్–30ఎంకేఐ రెండు సీట్లుండే బహుళ ప్రయోజన లాంగ్ రేంజ్ యుద్ధ విమానం. రష్యాకు చెందిన సుఖోయ్ కంపెనీ దీనిని అభివృద్ధి పర్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ వీటిని ఐఏఎఫ్ కోసం ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దళంలో 260కిపైగా ఎస్‌యూ–30ఎంకేఐలు సేవలందిస్తున్నాయి. The Su-30MKI which was on a training mission, crashed in the area of Karbi Anglong, Assam, approx 60 km from Jorhat. Search operations are underway.@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@indiannavy https://t.co/64Ii5V2fiZ— Indian Air Force (@IAF_MCC) March 5, 2026 -
అసోంలో సుఖోయ్ యుద్ధం విమానం గల్లంతు
దిస్పూర్: అసోంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతైంది. ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం రాడార్ నుంచి లింక్‌లు తెగిపోయి అదృశ్యమైంది. ఈ యుద్ధ విమానం పైలట్ సైతం గల్లంతు కావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తక్షణ గాలింపు చర్యలు చేపట్టింది. ఈ రోజు(గురువారం, మార్చి 5వ తేదీ) రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతు కావడంతో కలవరం మొదలైంది. ఈ యుద్ధ విమానం కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్‌యూ-30MKI భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన బహుళ శ్రేణి యుద్ధ విమానం. ఈ ప్రమాదం వాయుసేన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైలట్ అదృశ్యం కావడం వల్ల రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి. -
లక్షల వేతనం కాదనుకుని తోలుబొమ్మలాట..!
కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద స్థాయిలో వెలిగిన మహిళ... లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తోలుబొమ్మలాటనే కెరీర్‌గా ఎంచుకుంటుందా? మహానగరాలను కాదనుకొని మారుమూల పల్లెల్లోకి వెళుతుందా? ‘అవును’ అని చెప్పడానికి కచ్చితమైన సమాధానం... కలిత అసోంలోని హజో అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ద్రిషన కలిత చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాటను చూస్తూ పెరిగింది. అసోంలో ‘పుటోల నాస్’ అని పిలవబడే తోలుబొమ్మలాట తరతరాలుగా మగవాళ్లకే పరిమితం అయింది. ‘తోలుబొమ్మలాట మగవాళ్లు మాత్రమే ఆడాలి’ అనే సంప్రదాయాన్ని కలిత బ్రేక్ చేసింది. ‘తోలుబొమ్మలాట నేర్చుకోవడం కష్టమే. అయితే నాకు ఉన్న ఆసక్తి కారణంగా కష్టమైనా సరే....ప్రతి అంశం గురించి వివరంగా నేర్చుకున్నాను’ అంటుంది కలిత. ఆరేళ్ల వయసు నుంచే అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడే కలిత దిల్లీలో కార్పొరేట్ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమెకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తి ఇవ్వలేదు.తన మాతృరాష్ట్రం కోసం ఏదైనా చేయాలనిపించి సామాజిక మార్పు కోసం తోలుబొమ్మలాటను ఉపయోగించుకోవాలి’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన కలిత తనలాంటి తోలుబొమ్మలాట అభిమానులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. ‘ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు తగాదా పడుతుంటారు. అయితే ఆ ప్రభావం పిల్లలపై ఎంత ప్రతికూలంగా పడుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు’ అంటున్న కవిత తోలుబొమ్మలాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం మొదలు పెట్టింది. మరోవైపు అసోం అపురూప జానపద కథలను ఈతరం పిల్లలకి తోలుబొమ్మలాట ద్వారా పరిచయం చేయడం ప్రారంభించింది. జానపదానికి సామాజిక అంశం జోడించింది.కలిత బలం... మహిళలు. ఎన్నో గ్రామాల్లోని మహిళలు కలితకు అభిమానులుగా మారారు. తమ గ్రామాలలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఒక గ్రామానికి చేరుకోగానే కలిత బృందం చేసే పని....ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల గురించి తెలుసుకోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా తోలుబొమ్మలాటను మార్చేది కలిత.మద్యపానం వల్ల జరిగే నష్టం నుంచి అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాల వరకు ఎన్నో అంశాలపై మారుమూల పల్లెల్లో సైతం తోలుబొమ్మలాట ద్వారా ప్రచారం చేస్తోంది కలిత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. పనిచేస్తున్న చోట ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయి. వారి సమస్యలను తోలుబొమ్మలాట ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం తోలుబొమ్మలాట మాత్రమే కాకుండా తన థియేటర్ గ్రూప్ ద్వారా రకరకాల సామాజిక అంశాలపై స్ట్రీట్ ప్లేలు, స్కిట్స్ ప్రదర్శిస్తోంది. యువత కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ అందరి చేతా శభాష్ అని అనిపించుకుంటోంది.(చదవండి: టెర్రస్.. కామన్ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది! ) -
బీజేపీలో చేరిన భూపేన్ బోరా
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆదివారం అధికార బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకీయా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బోరాకు కీలక పదవి లభించింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. కాంగ్రెస్ నేతలు సంజూ బోరా, రాజేశ్‌కుమార్ జోషీ, కంగన్ దాస్, గగన్‌చంద్ర బోరాతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భూపేన్ కుమార్ బోరా ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా సమర్పించారు. రాహుల్ గాంధీ సహా పలు సీనియర్ నేతలు బోరాతో మాట్లాడి బుజ్జగించినా ఆయన మనసు మార్చుకోలేదు. అస్సాంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
ఐదేళ్లలో తరిమేస్తాం
గువాహటి: దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఐదేళ్లలోపు దేశం నుంచి తరిమేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అస్సాంలోని రాష్ట్ర పోలీసుల 10వ బెటాలియన్ కోసం రూ.270 కోట్లతో నిర్మించతలపెట్టిన కొత్త ప్రాంగణానికి అమిత్ షా శంకుస్థాపనచేశారు. తర్వాత 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో జరపడం ఇదే తొలిసారి. ‘‘అక్రమ వలసదారుల పేర్లు కేవలం ఓటర్ల జాబితాలో తీసేయడమేకాదు అసలు వాళ్లు దేశంలో ఉండకుండా చేస్తాం. అందరినీ స్వదేశాలకు సాగనంపుతాం. వచ్చే ఐదేళ్లలో దీనిని చేసి చూపిస్తాం. గిరిజనుల ప్రాంతంలో చొరబాటుదారుల దురాక్రమణ చెర నుంచి వందల ఎకరాల భూములకు విముక్తి కల్పించాం. అలా విముక్తి పొందిన ఈ 347 ఎకరాల భూమిలోనే కొత్త బెటాలియన్ క్యాంపస్‌ను నిర్మించుకోబోతున్నాం. చొరబాటుదారులను ఏరిపారేస్తామని గతంలో రాహుల్‌గాంధీ పెద్ద ప్రతిజ్ఞలుచేశారు. అవన్నీ అబద్ధాలు. చొరబాటుదారులే కాంగ్రెస్ పారీ్టకి పెద్ద ఓటుగా తయారయ్యారు. చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ఆందోళనలు చేస్తున్నారు. ఆరోపణల బాంబులు ఒకదానివెంట మరోటి విసురుతున్నారు. అవి కనీసం బాణా సంచా అంతటి స్థాయిలో అయినా పేలట్లేవు’’అని అమిత్ షా ఎద్దేవాచేశారు. కీలకపాత్ర పోషించిన మన బలగాలు ‘‘జమ్మూకశీ్మర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలు కీలకపాత్ర పోషించాయి. రాళ్లు రువ్వే ఘటనలు ఆగిపోయాయి. ఇక మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషం ఘటనలను తగ్గించడంలోనూ సీఆర్పీఎఫ్ అద్భుతంగా పనిచేసింది. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్నువిరిచారు. 12 రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అసంఖ్యాక జిల్లాల్లో విస్తరించిన నక్సలిజంను సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూకటి వేళ్లతో పెకిలిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ బలం కారణంగానే మార్చి నెల 31వ తేదీకల్లా దేశం నుంచి నక్సలిజాన్ని శాశ్వతంగా సమూలంగా తుడిచేస్తానని చెప్పగల్గుతున్నా. సీఆర్పీఎఫ్ 86 ఏళ్ల చరిత్రలో సీఆర్పీఎఫ్ రైజింగ్–డే వేడుకలు ఈశాన్య రాష్ట్రాల్లో జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రతి ఒక్కరు, దేశం గర్వించదగ్గ విషయం’’అని షా అన్నారు. -
సరిహద్దు గ్రామాల ప్రగతికి పెద్దపీట
నథాన్పూర్: వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్(వీవీపీ) రెండో దశను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్సాంలోని చాచర్ జిల్లాలో ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దును తనిఖీ చేశారు. ఆయన శుక్రవారం అస్సాంలో పర్యటించారు. వీవీపీ ప్రారం¿ోత్సవంలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో వలసలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. మనదేశంలోకి అక్రమ చొరబాట్లను సహించబోమని పునరుద్ఘాటించారు. దేశంలో సరిహద్దు గ్రామాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వీవీపీ రెండో దశలో భాగంగా 1,954 సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 17 రాష్ట్రాల్లో ఈ గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రగతితో ప్రజలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాలు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. చొరబాట్లను అడ్డుకున్నాం అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దులను ఇష్టారాజ్యంగా తెరిచారని, పొరుగుదేశం నుంచి చొరబాట్లు విచ్చలవిడిగా జరిగాయని అమిత్ షా ధ్వజమెత్తారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత చొరబాట్లకు అడ్డుకట్ట పడిందని స్పష్టంచేశారు. అస్సాంకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో నిత్యం 14 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. సరిహద్దు గ్రామాలను గతంలో దేశంలోనే చివరి గ్రామాలుగా పరిగణించేవారని గుర్తుచేశారు. అప్పట్లో అవి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని అన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని స్పష్టంచేశారు. సరిహద్దు గ్రామాలు కూడా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. వీవీపీ రెండో దశలో భాగంగా అస్సాంలో రూ.6,900 కోట్లతో 140 గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని తేలి్చచెప్పారు. రాష్ట్రంలో వరదల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని అమిత్ షా గుర్తుచేశారు. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అస్సాంకు కేవలం రూ.1.28 లక్షల కోట్లు మాత్రమే ఇచి్చందని ఆక్షేపించారు. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అస్సాంకు ఏకంగా రూ.15 లక్షల కోట్లు ఇచి్చందని స్పష్టంచేశారు. మరోవైపు అమిత్ షా బంగ్లాదేశ్ సరిహద్దును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వద్ద మర్రి మొక్క నాటారు. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బీఎస్ఎఫ్ క్యాంపులో అమర జవాన్ల స్మారకం వద్ద నివాళులరి్పంచారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్ 29 నుంచి అమిత్ షా అస్సాంలో పర్యటించడం ఇది మూడోసారి. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్నాయి. -
‘భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమని, అయితే ఒక నాయకుడి భార్యను, పిల్లలను ఇటువంటి వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన రాజకీయమని ఆమె మండిపడ్డారు.గౌరవ్ గొగోయ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదని ప్రియాంక పేర్కొన్నారు. రాజకీయ నేతలు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు అభివృద్ధి, సానుకూలతను కోరుకునే వారైతే, మరొకరు కేవలం విభజన రాజకీయాలకు పాల్పడతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. గౌరవ్ గొగోయ్ ఎప్పుడూ సానుకూల రాజకీయాలనే నమ్ముకున్నారని, అందుకే ఆయనపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అయితే అస్సాం ప్రజలకు అంతా తెలుసని, గొగోయ్ ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ నేతలు ఈ స్థాయికి దిగజారుతున్నారని ఆమె విమర్శించారు.ముఖ్యమంత్రి అనవసర విమర్శలు మానుకుని రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ప్రియాంక గాంధీ హితవు పలికారు. అస్సాం యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోందని, ప్రజలను నమ్మించి మోసం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయంగా మారిందని ఆమె ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.గౌహతి శివార్లలోని సోనాపూర్ వద్ద గాయకుడు జుబీన్ గార్గ్ స్మారక చిహ్నం ‘జుబీన్ క్షేత్ర’ను సందర్శించి ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని, తన జీవితాంతం ప్రేమ అనే సందేశాన్ని సమాజానికి అందించారని కొనియాడారు. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశం పవిత్రమైనదని, అటువంటి స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, తాను కేవలం ఒక సామాన్యురాలిగా గౌరవప్రదంగా నివాళులర్పించడానికి మాత్రమే వచ్చానని ఆమె స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ‘ప్యాక్స్ సిలికా’లోకి భారత్.. ఇక ఏఐలో మనదే హవా.. -
4 రాష్ట్రాల ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి మధ్యలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు మంగళవారం ఈ మేరకు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం అసెంబ్లీల గడువు మేలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్‌లో ముగియనున్నాయి.వాటన్నిటికీ వచ్చే ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్చిలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడంతో పాటు ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఈసీ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. సర్ ప్రక్రియ అనంతరం అస్సాం, పుదుచ్చేరిల్లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ఇప్పటికే విడుదల చేసింది.తమిళనాడులో బుధవారం, కేరళలో ఫిబ్రవరి 21న, కీలకమైన పశి్చమబెంగాల్లో 28న ఓటర్ల జాబితాలు వెలువడనున్నాయి. 2021లో పశి్చమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా 8 విడతల్లో జరిగాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విడతల్లో పోలింగ్ జరిగిన ఎన్నికలుగా అవి రికార్డులకెక్కాయి! ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో, తీవ్రవాద ప్రభావిత అస్సాంలో 2 విడతల్లో పోలింగ్ జరిగింది.అస్సాంలో ఈసీ పర్యటన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన ఈసీ బృందం మంగళవారం రెండో రోజు కూడా అస్సాంలో పర్యటించింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది. -
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం
అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. -
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్‌వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్‌ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..) -
ఈఎల్ఎఫ్పై ల్యాండైన మోదీ
గువాహటి/మోరాన్: ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే–రన్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మోరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)పై వాయుసేనకు చెందిన సీ–130జె రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతదేశానికి తొలి ఈఎల్ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రావడం నిజంగా గరి్వంచదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాకృతిక విపత్తులు తదితర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వెలిబుచ్చారు.అబ్బురపరిచిన ఏరియల్ షో మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, రాష్ట్ర మంత్రులు తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సీ–130జె హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్ఎఫ్కు చేరుకున్నారు. రన్‌వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు చేరుకున్నారు. అనంతరం ఈఎల్ఎఫ్పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను వీక్షించారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ షో ఆహూతులకు కనువిందు చేసింది. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈఎల్ఎఫ్పై కచి్చతత్వంతో ల్యాండింగ్, టేకాఫ్‌తో పాటు పలు విన్యాసాలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వాటిని వీక్షించారు. తొలుత సుఖోయ్ –30 ఎంకేఐ, దాని వెనకే రఫేల్ ఈఎల్ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత ఏఎన్–32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాలు ప్రదర్శించింది. తర్వాత మూడేసి చొప్పున తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలతో అలరించాయి. విపత్తుల వేళ చేపట్టే సహాయక చర్యల సన్నద్ధతను ప్రత్యేకంగా తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్) కళ్లకు కట్టాయి. అనంతరం ప్రధాని గువాహటి చేరుకున్నారు.ఎన్నోవిధాలుగా కీలకం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్ఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నోవిధాలుగా అత్యంత కీలకమైనది. ఈ ఈఎల్ఎఫ్ చైనాకు 300 కి.మీ., మయన్మార్‌కు కేవలం 200 కి.మీ. దూరంలో ఉంటుంది. 4.2 కి.మీ. పొడవైన ఈ హైవే–రన్‌వేను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక, పౌర అవసరాలు రెండింటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరాలకు తక్షణ సదుపాయంగా ఈఎల్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారి–37పై నిర్మించిన ఈఎల్ఎఫ్పై అన్నిరకాల యుద్ధ, రవాణా విమానాలనూ సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్తో పాటు పలు భారీ రవాణా విమానాలు కూడా దీనిపై విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించాయి. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానాలు కూడా దీనిపై సునాయాసంగా దిగవచ్చు. భారత్‌లో తొలి ఈఎల్ఎఫ్ రాజస్తాన్‌లోని బార్మేర్ జిల్లాలో 2021లో నిర్మితమైంది. అనంతరం మధ్య, ఉత్తర భారతంలో కూడా పలు ఈఎల్‌ఎఫ్‌లు అందుబాటులోకి వచ్చాయి. -
హైవేయే రన్‌వేగా మారితే?
-
అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం
దిస్పూర్: ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై.. మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ల్యాండయ్యింది. అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని తిలకించారు. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ రహదారిపై రఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాల ల్యాండింగ్ ప్రదర్శన చేయవచ్చు.దానితో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్‌కు ఇది ఉపయోగపడుతుంది. ఈశాన్య భారతంలో ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య ప్రాంతాలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భాస్కర వర్మ సేతు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. దాని తర్వాత దాదాపు రూ. 5,450 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి హిమంత బిశ్వశర్మతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. -
చైనా సరిహద్దు సమీపాన రన్‌వేగా హైవే!
న్యూఢిల్లీ: హైవేయే రన్‌వేగా మారితే? ఆ అద్భుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూపుదిద్దుకుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. పొడవైన ప్రాంతం అత్యాధునిక రన్‌వేగా కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి ‘హైవే–రన్‌వే’లను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)గా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతంలో తొట్టతొలి ఈఎల్ఎఫ్గా రికార్డులకెక్కింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ సమీపంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మోరాన్ బైపాస్ సమీపంలోని ఈఎల్ఎఫ్పై దిగుతారు. అనంతరం అక్కడ జరిగే మెగా ఎయిర్ షోను ఆయన తిలకిస్తారు. రఫేల్, సుఖోయ్‌లతో పాటు వాయుసేనకు చెందిన మొత్తం 16 యుద్ధ విమానాలు ఈఎల్ఎఫ్పై ల్యాండవడమే గాక పలు విన్యాసాలతో అలరించనున్నాయి. అనంతరం మోదీ అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల కుమార్ భాస్కర్‌వర్మ సేతు, కామపూర్ జిల్లాలో నేషనల్ డేటా సెంటర్, ఐఐటీ–గువాహటి తదితరాలు వీటిలో ఉన్నాయి. చైనాకు దగ్గర్లో... చైనా సరిహద్దుకు కేవలం 150 కి.మీ. సమీపంలో నిర్మించిన ఈ ఈఎల్ఎఫ్ రక్షణ అవసరాల దృష్ట్యా భారత్‌కు చాలా ముఖ్యమైనది. విపత్తు, ఎమర్జెన్సీ సమయాల్లో సాధారణ, యుద్ధ విమానాల రాకపోకలకు ఇది వీలు కలి్పస్తుంది. భారత వాయుసేన సహకారంతో దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలే గాక సీ–17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ రవాణా విమానాల ల్యాండింగ్‌కు కూడా అనువుగా దీన్ని రూపొందించారు. 40 టన్నుల బరువున్న యుద్ద విమానాలతో పాటు 74 టన్నుల బరువుండే రవాణా విమానాలు సైతం దీనిపై సులువుగా దిగగలవు. దేశ పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఈఎల్‌ఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. -
కొనసాగుతున్న భారత్ బంద్.. ఈ రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలు నేడు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ నిపుణులు మద్దతు పలుకుతున్నారు. పారిశ్రామికరంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో చాలా చోట్ల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఒడిశా, కేరళలో.. బంద్ ప్రభావం ఒడిశా, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపిస్తోంది. ఒడిశాలో దాదాపు పూర్తిస్థాయి షట్‌డౌన్ వాతావరణం నెలకొంది. హోల్‌సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు స్తంభించాయి. కేరళలో కార్మిక యూనియన్ల బలం ఎక్కువగా ఉండటంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. అస్సాంలో కూడా పట్టణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కూడా పాఠశాలల మూసివేతపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే నిరసనల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పరిధిలోని కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి, ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించుకున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, ఇతర అత్యవసర వైద్య సేవలకు బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటివరకు సేవల నిలిపివేతపై ఎటువంటి వార్తలు అందలేదు. -
అస్సాంలో 2.43 లక్షల ఓట్ల తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయింది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రచురించింది. 2.43 లక్షల ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఓటర్లకు స్థానం కల్పించారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే 0.97 శాతం ఓటర్లు తగ్గిపోయినట్లు అస్సాం చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) ఒక ప్రకటనలో వెల్లడించారు.తుది జాబితాలో 1.25 కోట్ల మంది పురుషులు, 1.24 కోట్ల మంది మహిళలున్నారు. గత ఏడాది డిసెంబర్ 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.52 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఉన్నారు. అస్సాంలో మరికొన్ని నెలల్లో తాజా జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అర్హుల పేర్లు గల్లంతైతే దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. -
వివాదంలో సీఎం హిమంత.. పాయింట్ బ్లాక్‌లో తుపాకీతో..
దిస్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ముస్లింలను తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియోను హిమంత షేర్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ విషయంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్వ ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిం వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి వివాద చర్యలకు దిగారు. అసోం బీజేపీ ట్విట్టర్ పేజీలో హిమంత.. ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ముస్లింలను పాయింట్ బ్లాక్‌లో తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉంది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ వీడియోపై ప్రతిపక్షాల, సోషల్ మీడియా నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే వీడియోను డిలీజ్ చేసింది. మరోవైపు.. ఈ చర్యతో ఆయనను అరెస్ట్ చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు.అంతేకాకుండగా.. సీఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజ్‌ను ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. రైఫిల్ తూటాలు, పుర్రె టోపీలు, గడ్డాలు ఉన్న పురుషుల చిత్రాలను తాకుతున్నట్టు వీడియోలో కన్పించింది. కనికరం లేదు, మీరు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లలేదు? వంటి అస్సామీ టెక్స్ మెసేజ్‌లు కూడా ఉన్నాయి. -
ఏడు జిల్లాల్లో చొరబాటుదార్లదే మెజార్టీ
గౌహతి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదార్లు విచ్చలవిడిగా ప్రవేశించారని, రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో ప్రతికూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం నుంచి చొరబాటుదార్లను బయటకు పంపించి, స్థానికులను రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శుక్రవారం అస్సాం రాష్ట్రం ధెమాజీ జిల్లాలో మిసింగ్ తెగ ప్రజల యువజన వేడుక ముగింపు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దిబ్రూగఢ్‌లో పర్యటించారు. రూ.1,715 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.చొరబాటుదార్ల నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఇక్కడ చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడు జిల్లాల్లో వారే మెజార్టీగా ఉన్నారని చెప్పారు. ఈ ధోరణి మారాలంటే బీజేపీని గెలిపించాలని స్పష్టంచేశారు. అస్సాంలో జనాభా స్థితిగతులను పూర్వస్థితికి తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి మరింత బలం ఇవ్వాలి ‘‘చొరబాట్లు ఆగాలని ప్రజలు నిజంగా కోరుకుంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మరింత బలం ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 1.26 లక్షల ఎకరాల భూములను చొరబాటుదార్ల నుంచి కాపాడింది. మిసింగ్ తెగ ప్రజలు కష్టజీవులు. శ్రమించడం వారి సంస్కృతిలోనే ఉంది. ఎగువ అస్సాంలోకి చొరబాటుదార్లు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనను నిర్మించింది. దీనివల్ల దిబ్రూగఢ్, ధెమాజీ మధ్య అనుసంధానం పెరిగింది. భారతదేశ ప్రగతికి ఈ వంతెన ఒక ప్రతీకగా నిలుస్తోంది. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కానీ, బోగిబీల్ వంతెన నిర్మాణం పూర్తిచేయలేదు. నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు విశ్వాసం కనబర్చారు. అందుకే వంతెన నిర్మాణం నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తయ్యింది’’ అన్నారు.రాహుల్ అవమానించడం దారుణం ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానించడం దారుణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేసిన ‘గమోసా’ను ధరించడానికి రాహుల్ నిరాకరించారు. దేశ విదేశీ ప్రముఖులు ఆ కండువాను గౌరవపూర్వకంగా ధరిస్తే రాహుల్ మాత్రం ధరించకుండా అగౌరవపర్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని కించపరిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదు. అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తుపాకులు, తూటాలు, ఘర్షణలు, మరణాలు తప్ప అస్సాంకు కాంగ్రెస్ ఇచ్చిందేమిటో చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. అందుకోసం చొరబాట్లను ఆయుధంగా ఉపయోగించుకుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లకు అడ్డుకట్ట పడింది. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి, కచ్చితంగా వెనక్కి పంపిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అస్సాం తేయాకు పరిశ్రమకు, కారి్మకులకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు తేయాకు ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి, శాంతి, రక్షణ, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కావాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలి. చొరబాట్లు, వరదల నుంచి అస్సాంను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు సమానమే‘‘కాంగ్రెస్ పాలనలో గిరిజన తెగలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొన్నారు. సొంత గుర్తింపును కాపాడుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి భద్రత లభిస్తోంది. పారామిలటరీ దళాల్లో నియామకాల విషయంలో గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తాం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉంది. వేర్వేరు సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతదేశ సంస్కృతి మరింత వికసిస్తుంది. దేశంలో అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలకు సమాన హక్కులున్నాయి. అవన్నీ సమానమే’’ అని అమిత్ షా చెప్పారు. -
అసామాన్య పద్మాలు
జీవితంలో పెను సవాళ్లు నడవాలనుకున్న మార్గంలో ఎదురుగాలులు... అయినా వాళ్లు ఆగలేదు... ముందుకు సాగారు. సవాళ్లను సోపానాలుగా చేసుకున్నారు. అందుకే వారికి నేడు జాతీయ గౌరవంగా ‘పద్మశ్రీ’ దక్కింది. అస్సాం గాయని పోఖిలా లెఖ్తెపి, యాసిడ్ ఆటాక్‌ను ఎదుర్కొని ప్రొఫెసర్‌గా స్ఫూర్తినిస్తున్న మంగళా కపూర్ల జీవన విశేషాలు.పోఖిలా లెఖ్తెపి కొండ మీద తేనె పాటకొండలకు పాటలు తెలుసు. కొండలు పాడతాయి. కాని వాటిని గొంతులో నింపుకుని జనానికి పంచేవారే కావాలి. అలాంటి కొండ మీద తేనె పాటే పోఖిలా లెఖ్తెపి. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా ‘స్వరాల రాణి’గా పేరుగాంచిన పోఖిలా లెఖ్తెపికి ‘పద్మశ్రీ’ ప్రకటించడం కొంచెం ఆలస్యమైనట్టే. ఆ మాటకొస్తే ఈ 72 ఏళ్ల జానపద గాయనికి ఈ గౌరవాలు, సత్కారాలు ఏమీ పట్టవు. పాట పాడటమే ఆమెకు తెలుసు. పాట వినిపించడమే ఆమె జీవితం.తండ్రి వద్ద పాటలు నేర్చుకొని..అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్ టిముంగ్ గ్రామంలో పోఖిలా జన్మించారు. తండ్రి ముఖిమ్ లేక్తే, తల్లి బాస్డే టిముపి బాగా పాడతారు. ముఖిమ్ లేక్తే ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే నాటకాలలో సంగీతం అందించేవారు. అలా పోఖిలా చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితురాలైంది. బడిలో ప్రతి శనివారం పాటల పోటీ తండ్రి వద్ద పాటలు నేర్చుకుని పాడితే ప్రెయిజులన్నీ ఆమెకే. ఆ ఉత్సాహంతో తనే సొంతంగా పాటలను స్వరపరచడం ప్రారంభించారు. 1976లో డిఫులో జరిగిన కర్బీ యువజనోత్సవంలో పాడినప్పుడు మొత్తం అస్సాంకు ఆమె పాట తెలిసింది. 1978 నాటికి ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆకాశవాణి గౌహతిలోని కర్బీ శాఖ డైరెక్టర్ ఆమెకు రేడియోలో పాడే అవకాశాన్ని కల్పించారు. కర్బీ భాషలో కొత్త శైలి...పోఖిలా పాడే సమయానికి కర్బీ భాషలో ఆధునిక పాటలు లేవు. పోఖిలా కర్బీ భాషలో మొదటి క్యాసెట్ ‘కాంగ్హోన్’ విడుదల చేశారు. అనంతరం జుబీన్ గార్గ్ సహా అస్సాంకు చెందిన పలువురు కళాకారులతో కలిసి ఆమె పాటలు పాడారు. ఇప్పటి వరకు 300కి పైగా పాటలు పాడారు. కర్బీ పాటలకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ తీసుకురావడంలో ఆమె కృషి విశేషమైనది. కర్బీ సంగీతానికి ఆమె చేసిన సేవకు గాను 2011లో హిల్స్ ఐడల్ ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ బిరుదుతో సత్కరించింది. 2023 అస్సాం ప్రభుత్వం ఆమెకు శిల్పి అవార్డుతోపాటు శిల్పి పెన్ష¯Œ ను ప్రదానం చేసింది. 2024లో అస్సాంలో మూడో అత్యున్నత ΄ûర పురస్కారమైన ‘అస్సాం గౌరవ్’ అవార్డును అందించింది. కర్బీ ఆంగ్లాంగ్ వంటి మారుమూల ప్రాంతానికి చెందిన తనలాంటి గాయనిని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం సంతోషకరమైన విషయం అని ఆమె అంటున్నారు.మంగళా కపూర్ యాసిడ్ దాడిని పాటతో ఓడించారుయాసిడ్ దాడి పిరికివాళ్ల చర్య. దానిని ఎదుర్కొని ఎదగడం స్థైర్యవంతుల లక్షణం. ప్రయాణం ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు గొప్ప ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టారు మంగళా కపూర్. సంగీత సాధన చేసి సంగీత విద్వాంసురాలిగా మారారు. ‘పద్మశ్రీ’ వరకూ ఎదిగారు. ఇది అసాధారణ కథ. స్ఫూర్తి గాథ.గ్వాలియర్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయని మంగళా కపూర్ 1965లో యాసిడ్ దాడి ఎదుర్కొన్నారు. అప్పటి వరకూ అద్భుతమైన తన కంఠంతో ఆమె ‘కాశీ లతా మంగేష్కర్’గా గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఎన్నో కలలు కంటూ ఉండగా యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరు సంవత్సరాలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అయినా కుంగిపోలేదు. ఆ సమయంలో కూడా చదువును కొనసాగించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత విద్య పూర్తి చేశారు. అక్కడే ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. మంగళా కపూర్ సంగీతం ప్రొఫెసర్ మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఆమెకు అనేక అవార్డులు వరించాయి. రాజ్యసభ ఆమెకు ‘రోల్ మోడల్’ అవార్డును ప్రదానం చేసింది. ఆమె జీవితం ఆధారంగా 2025లో మరాఠీ చిత్రం ‘మంగళ’ నిర్మించారు. సంగీతం, విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకు రాగలమని మంగళా కపూర్ అంటున్నారు. -
మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..
ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.వసంతాన్ని ఆహ్వానిస్తూ..ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.ప్రధాని ప్రశంసఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.The stage is all set, the performers are pumped up.#BagurumbaDwhou - just a few hours to go! pic.twitter.com/PfSiC6CQLy— Himanta Biswa Sarma (@himantabiswa) January 17, 2026 (Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!) -
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్
సింగపూర్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జూబీన్ గార్గ్‌ది హత్య కాదని సహజమరణమేనని సింగపూర్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. గతేడాది జుబీన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా యాట్ పార్టీకి ఒకరోజు ముందు స్విమ్మింగ్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, జుబీన్ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై భారత్‌లోని అస్సాం పోలీసులు,సీఐడీ విభాగం పలువురిని అదుపులోకి తీసుకుంది. సింగపూర్ పోలీసులు సైతం కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, కేసు దర్యాప్తు పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు కరోనర్ కోర్టుకు రిపోర్టును అందించారు.రిపోర్టులో ‘యాట్ పార్టీకి ముందు రోజు జూబీన్ స్విమ్మింగ్‌కి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. స్విమ్మింగ్‌కు ముందు లైఫ్ జాకెట్ ధరించారు. కానీ స్విమ్మింగ్ వెళ్లిన తర్వాత లైఫ్ జాకెట్‌ను వద్దన్నారు. రెండు సార్లు లైఫ్ జాకెట్ ధరించాలని నిర్వాహకులు కోరారు. అందుకు జుబీన్ తిరస్కరించారని, స్విమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టుకు తెలిపారు. -
స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ జ్యుడీషియల్ కోర్ట్ కాంప్లెక్స్‌ను గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ కోర్ట్ కాంప్లెక్స్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..మౌలిక సదుపా యాల కల్పనను వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది అందరికీ మేలు చేస్తుందని, కేవలం కొందరి సౌలభ్యం కోసం ఆధునీకరణను ఆపకూడదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలియకనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. గౌహతిలోని రంగమహల్‌లో రూపుదిద్దుకునే ఈ సముదాయం భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతికత, ఈ–కోర్టులు, లాయర్లు, కక్షిదారుల కోసం మెరుగైన వసతులు ఉంటాయని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయాధికారిగా, ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువ న్యాయవాదుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని జస్టిస్ సూర్య కాంత్ నొక్కి చెప్పారు. యువ లాయర్లు సమర్థంగా పనిచేయడానికి మెరుగైన లైబ్రరీలు, ఇంటర్నెట్ సదుపాయం, అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతోపాటు సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌహతి నగరం నడిబొడ్డున ఉన్న హైకోర్టును 25 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతానికి తరలించడాన్ని బార్ కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది.కాంప్లెక్స్ ప్రత్యేకతలుఅస్సాంలోని గౌహతి ఉత్తర ప్రాంత కామ్ రూప్ జిల్లాలో 49 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.479 కోట్ల ఈ సముదాయం ఏర్పాటు కానుంది. ఇందులో, గౌహతి హైకోర్టుతోపాటు జిల్లా కోర్టు భవనాలు, హైకోర్టు కార్యాలయం, బార్ అసోసియేషన్ భవనం ఉంటాయి. గౌహతి హైకోర్టు అస్సాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగా ల్యాండ్లకు కూడా హైకో ర్టుగా పనిచేస్తుంది. ఈ సముదాయంలో 900 వరకు కార్లు, 400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. సముదాయంలోని అన్ని భవనాలను కలుపుతూ వంతెనలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. -
ఢిల్లీనే మించిన బర్నీహాట్!
న్యూఢిల్లీ: కాలుష్యం విషయంలో మన దేశంలో నంబర్‌వన్ నగరం ఏదంటే అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధానే. కానీ అసోంలోని బర్నీహాట్ పట్టణం ఢిల్లీని కూడా తలదన్నింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచి రికార్డు సృష్టించింది. ఢిల్లీ, గాజియాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 190 నగరాలు, పట్టణాలు పీఎం10 కాలుష్య సూచీ వార్షిక సురక్షిత పరిమితిని దాటేయడం ఆందోళన కలిగించే అంశం. ఇక పీఎం2.5 వార్షిక పరిమితిని మించిన నగరాల సంఖ్య అయితే ఏకంగా 1,747గా నమోదైంది! పీఎం10 వాయు నాణ్యత సూచీలో మాత్రం ఢిల్లీయే దేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది! సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తాజా విశ్లేషణ ఈ మేరకు తేల్చింది. తర్వాతి స్థానంలో గాజియాబాద్, గ్రేటర్ నోయిడా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 44 శాతం నగరాలు దీర్ఘకాలంగా వాయు కాలుష్యంతో సతమతం అవుతున్నట్టు అది వివరించింది. కొవిడ్‌తో సర్వం పడకేసిన 2020ని మినహాయిస్తే గత ఐదేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతూ వస్తున్నట్టు వెల్లడించింది.ఎన్సీఏపీ ప్రభావం అంతంతే...కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద కవరైన నగరాలు దేశవ్యాప్తంగా కేవలం 4 శాతం మాత్రమే కావడం నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతోందని సీఆర్ఈఏ వివరించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో 2019లో కేంద్రం ఎన్‌సీఏపీని తెరపైకి తెచ్చింది. దీనికి రూ.13,415 కోట్లు కేటాయించింది. అందులో మూడొంతులకు పైగా నిధులను వ్యయం చేసింది కూడా. అయినా ఇప్పటివరకైతే ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. పైగా, ప్రస్తుతం ఎన్సీఏపీ కింద కవరవుతున్న నగరాలు, పట్టణాల సంఖ్య కేవలం 130 మాత్రమే. వాటిలో కూడా 28 నగరాల్లో ఇప్పటికీ కనీసం సరైన సంఖ్యలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. పీఎం10 స్థాయిలను కనీసం 40 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని కేవలం 23 నగరాలే చేరుకున్నాయి. మరో 23 నగరాల్లోనైతే పీఎం10 స్థాయిలు 2019తో పోలిస్తే ఇప్పుడు బాగా పెరగడం గమనార్హం. ‘‘28 నగరాల్లో కాలుష్యం 21–40 శాతం తగ్గింది. 26 నగరాల్లో ఇది 20 శాతం కంటే తక్కువే’’అని నివేదిక వెల్లడించింది.వామ్మో యూపీ!దేశవ్యాప్తంగా 4,041 నగరాలు, పట్టణాల్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలను ఉపగ్రహ డేటా ఆధారంగా సీఆర్ఈఏ మదింపు వేసింది. వాటిలో చాలా నగరాలు కాలుష్యాన్ని అభిలషణీయ స్థాయికి తగ్గించడంలో ఘోరంగా విఫలమైనట్టు గుర్తించింది. పీఎం2.5 సూచీపరంగా 416 కలుషిత నగరాలతో ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. అవి కాలుష్యానికి చిరునామాగా మారినట్టు సీఆర్ఈఏ తేల్చింది. తర్వాతి స్థానాల్లో రాజస్తాన్ (158), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143), పంజాబ్, బిహార్ (136), పశ్చిమబెంగాల్ (124) నిలిచాయి. ఇక పీఎం10 సూచీపరంగా చూస్తే 18 అత్యంత కలుషిత నగరాలతో రాజస్తాన్ తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూపీ (10), మధ్యప్రదేశ్ (5), బిహార్(4), ఒడిశా (4) ఉన్నాయి.గతేడాది ప్రపంచంలోనే టాప్బర్నీహాట్. అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉండే ఓ పారిశ్రామిక పట్టణం. మితిమీరిన కాలుష్యంతో గతేడాది నుంచీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 2024లోనైతే ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత పట్టణంగా రికార్డుకెక్కింది. ఈ ఏడాది కూడా ఢిల్లీని తోసిరాజని దేశంలో అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు పీఎం2.5 స్థాయి 100 ఎంజీగా తేలింది. గతేడాది ఇది 128.2 ఎంజీగా నమోదవడం విశేషం. అడ్డూ అదుపూ లేని విచ్చలవిడి పారిశ్రామికీకరణే బర్నీహాట్ కాలుష్యానికి ప్రధాన కారణం. ఇక్కడ ఇనుము ఉక్కు, సిమెంట్ ఫ్యాక్టరీలు, డిస్టిలరీల వంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. భారీ స్థాయిలో ఇవి విడుదల చేసే విష వాయువుల వల్ల బర్నీహాట్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలు ఆకాశాన్నంటుతుంటాయి. పైగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రధాన రవాణా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ వాహన కాలుష్యమూ విపరీతంగా ఉంటుంది. -
ధైర్యానికి కేరాఫ్ ఆమె..! ఏకంగా 24 దేశాలు..
అనారోగ్యం అంటే ఎవ్వరైనా హడలిపోతాం. ఎలా బయటపడతాం అనే బెంగ వచ్చేస్తుంది. దీనికి తోడు విధి పెట్టే భయంకరమైన పరీక్షలకు అల్లాడిపోతుంటాం. అలాంటి వాటన్నింటిని జయించి..ఎందరికో మార్గదర్శకురాలిగా మారారు మినాతి బోర్‌ఠాకూర్. కేన్సర్‌కి గట్టి కౌంటిరిచ్చేలా సాగుతున్నా ఆమె ప్రయాణం ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తి కూడా.అసోంలోని గువాహటికి చెందిన మినాతి బోర్ఠాకూర్కి చిన్న వయసులోనే పెళ్లి, ముగ్గురు పిల్లలు. అయితే ఆ ముగ్గురి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ తట్టుకోవడం అంత సులభం కాలేదామెకు. దాన్నుంచి బయటపడేందుకు చదువుపై ధ్యాస పెట్టారామె. అలా చదువుకున్న కాటన్ కాలేజ్‌లోనే ప్రొఫెసర్‌గా చేసి ఫిలాసఫీ విభాగానికి హెడ్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో రిసెర్చ్ పేపర్లు రాస్తుండేవారు. అయితే ఒకరోజు ఉన్నటుండి కడుపునొప్పి రావడం మొదలైంది. మొదట్లో సాధరమైనదిగా కొట్టిపారేసింది. కానీ రాను రాను తీవ్రమై తట్టుకోలేని స్టేజ్‌కి వచ్చేశారు. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా..కేన్సర్ అని తేలింది. అది కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్కి పాకింది. అసలు బతకడమే కష్టమన్నారు వైద్యులు. అయితే భర్త బిహారి బోర్‌ఠాకూర్ ఆమె చేత కేన్సర్ జయించిన వారి జీవితాల పుస్తకాలను చదివించేవారు. వాళ్ల స్ఫూర్తితో పట్టుదలగా ట్రీట్మెంట్ తీసుకుని..కేన్సర్‌ని నుంచి బయటపడ్డారు. అయితే మినాతికి కేన్సర్ నుంచి బయటపడటం ఎంత కష్టమో తెలుసు, అందుకనే ఉద్యోగం కొనసాగిస్తూనే కేన్సర్ బాధితులకు ఉచితంగా కౌన్సిలింగ్ వంటి ఇతర సామాలు అందిచడం మొదలుపెట్టారామె. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్, మెడిటేషన్ సెంటర్‌నీ ఏర్పాటు చేశారు. అలాగే తన కేన్సర్ చికిత్స అనుభవాలను ‘మోర్ ఒషూకోర్ ఎబోసర్: ఎజోన్ క్యాన్సర్ రోగిర్ ఒబిగోటా’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. మరోసారి కేన్సర్ తిరగబెట్టడంతో..2009... అనారోగ్యానికి గురైన భర్తకి సేవలు చేస్తున్నారు మినాతి. విపరీతమైన నడుము నొప్పి. పరీక్ష చేయించుకుంటే మళ్లీ కేన్సర్ తిరగబెట్టిందన్నారు వైద్యులు. ఈసారి పెల్విక్, వెన్నెముక ప్రాంతాల్లో వచ్చింది. అయితే మినాతి అస్సలు భయపడలేదు. కానీ ఆమె భర్త తీవ్ర ఆందోళనకు లోనయ్యి గుండెపోటుతో మరణించారు. వ్యాధి కన్నా విధి పెట్టిన క్షోభకు అల్లాడిపోయారామె. దాంతో మినాతి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. అప్పుడు తనలాంటి వాళ్ల గురించి ఆలోచించడం ప్రారంబించాక..ఆమెలో తెలియని ఆరాటం, తపన మొదలయ్యాయి. అలాగ మళ్లీ కేన్సర్‌పై పోరాడేందుకు రెడీ అయ్యారు మినాతి. అయితే ఈసారి కూడా మినాతినే కేన్సర్‌పై గెలిచారు. ఇక ఈసారి కేన్సర్ జర్నీని కూడా ‘కొలిజా కైతే బిందిలే జి చోరాయే గాన్ గాయే’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అంతేగాదు కేన్సర్ బాధితులకు అండగా ఉండేలా.. డైట్, న్యూట్రిషన్, ప్రాణాయామం, ధైర్యంగా సమస్యతో పోరాడటం... ఇలా ఎన్నో అంశాల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆమె సేవలు భారత్‌కే పరిమితం కాలేదు. శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 24 దేశాలకు విస్తరించారు. పైగా ఆమె శరీరాన్ని గుహవాటి మెడికల్ కాలేజ్‌కి కేన్సర్ పరిశోధనలకు రాసిచ్చారామె. అంతేకాదండోయ్ ఆమె పుస్తకాలు కూడా ఎన్నో భాషల్లోకి తర్జుమా అయ్యి ఎందరో కేన్సర్ భాధితుల్లో అపారమైన ధైర్యాన్ని నింపుతున్నాయి. 79 ఏళ్ల వయసుకి చేరినా.. మినాతి కేన్సర్ సహాయ సేవ కార్యక్రమాలను ఆపలేదు. ఇంకా చేతనైనంతగా ఏదో చేయాలనే ఆమె ఆరాటం ఆకాంక్ష అజరామరం, స్ఫూర్తి కూడా..! View this post on Instagram A post shared by 🧿 Snayusneham Physio🧿 (@snayusneham_physio) (చదవండి: ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..! అమెరికన్ బుడ్డోడి ఘనత) -
అసోంలో భూకంపం..
ఈశాన్య భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రంతో పాటు మెఘాలయ, అరుణాచలప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావం స్పష్టంగా కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈ భూకంపం జనవరి 5, 2026న ఉదయం 04:17:40 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం అసోంలోని మోరీగావ్ (Morigaon) ప్రాంతంగా గుర్తించారు. భూకంపం భూమి అడుగున సుమారు 50 కిలోమీటర్ల లోతులోసంభవించింది. ఖచ్చితమైన స్థానం అక్షాంశం 26.37 N , రేఖాంశం 92.29 E వద్దగా నమోదు చేశారు. అసోం, మెఘాలయ, అరుణాచలప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా ప్రజలు భయానికి గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున వచ్చిన ఈ ప్రకంపనలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ భూకంపం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలను ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసినప్పటికీ, పెద్దగా నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. -
ప్రియాంకపై కాంగ్రెస్ గంపెడాశలు.. ’అస్సాం’ అప్పగిస్తూ..
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను నియమించింది. ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆమెకు లభించిన మొట్టమొదటి సంస్థాగత బాధ్యత ఇదే కావడం గమనార్హం.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాల రాలేదు. ఈ నేపధ్యంలో సరికొత్త పంథాను ఏర్పరురుచుకుని అస్సాంలో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను ప్రియాంకా గాంధీకి అప్పగించింది. అస్సాంతో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఏఐసీసీ చైర్పర్సన్లను ప్రకటించింది. కేరళ బాధ్యతలను రాజ్యసభ మాజీ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీకి అప్పగించగా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఛత్తీస్‌గఢ్ మాజీ డిప్యూటీ సీఎం టి.ఎస్. సింగ్ దేవ్ నేతృత్వం వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బి.కె. హరిప్రసాద్‌ను పార్టీ నియమించింది. అభ్యర్థుల వడపోతలో పారదర్శకత, గెలుపు గుర్రాల అన్వేషణే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో 2026 మార్చి-ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అస్సాం అసెంబ్లీ గడువు 2026 మే 20తో ముగియనుండటంతో, అక్కడ మొత్తం 126 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. అయితే ఎన్డీఏను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐయూడీఎఫ్ తదితర ప్రాంతీయ శక్తులతో కలిసి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ రాక అస్సాం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కూడా 294 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ ఇప్పటికే దూకుడుగా ప్రచారం ప్రారంభించింది.ఇది కూడా చదవండి: వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ -
అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ
ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడిరచింది. 2025 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్‌ను తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసి వస్తోందని సర్వేలో వెల్లడయ్యింది.వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అస్సాంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. ఈ సర్వే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, పొలిటికల్ ఎనలిస్ట్ డా. రాజన్ పాండే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ‘‘ఈ ట్రాకర్ పోల్ ప్రస్తుత సమయంలో అస్సాం ఓటర్ల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. అధికార ప్రయోజనాలకే పరిమితం కాకుండా విభిన్న వర్గాలతో బీజేపీకి బలమైన అనుసంధానం ఏర్పడినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏఐయుడీఎఫ్, యూపీపీఎల్ వంటి పార్టీలు మనుగడకే పోరాడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది’’.బీజేపీకి స్పష్టమైన ఆధిక్యంపీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ 69-74 సీట్లతో అగ్రస్థానంలో నిలవనుంది. కాంగ్రెస్‌కు 25-29 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు 8-11 సీట్లు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)కు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. ఏఐయుడీఎఫ్ 0-2, యూపీపీఎల్ 0-2, రైజర్ దళ్ 1-2, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) 0-1, సీపీఐ(ఎం) 0-1, స్వతంత్రులు/ఇతరులు 0-1 గెలిచే అవకాశం ఉంది.మ్యాజిక్ ఫిగర్ 64 సీట్ల మెజారిటీకి ఎన్డీఏ చాలా ఆధిక్యంలో నిలుస్తోంది. బీజేపీ మూడోసారి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో సాధించిన మూడు వరుస విజయాల సరసన నిలుస్తుంది. బీజేపీ తన కోర్ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే కొత్త వర్గాల్లోకి విస్తరించగలగడమే దీనికి కారణమని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది.ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 39%, కాంగ్రెస్‌కు 37% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతంలో తేడా తక్కువే ఉన్నప్పటికీ... అస్సాంలోని ఉత్కంఠ ఎన్నికల వాతావరణంలో ఇది సీట్ల పరంగా గణనీయమైన తేడాకు కారణం కావొచ్చు. ఇతర పార్టీల ఓట్ షేర్లు చూస్తే... ఏజీపీ 7%, బీపీఎఫ్ 5.5%, యూపీపీఎల్ 1.2%, ఏఐయుడీఎఫ్ 2.5%, రైజర్ దళ్ 0.9%, ఏజేపీ 0.7%, సీపీఐ(ఎం) 0.8%, ఇతరులు 5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగిందని, అయితే డీలిమిటేషన్, ఎన్డీఏ సామాజిక కూటములు, బలహీన ప్రతిపక్ష భాగస్వాములు కారణంగా తన ఓటు బ్యాంకును సీట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడుతోందని ఈ సర్వేలో వెల్లడయ్యింది.కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?తదుపరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు 30% మద్దతుతో స్వల్ప ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు 28%, కాంగ్రెస్ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్‌కు 27% ఓటర్లు మద్దతిచ్చారు. దేబబ్రత సైకియా 3%, హగ్రామా మోహిలారి 1%, అతుల్ బోరా 1%, దిలీప్ సైకియా 1%, బద్రుద్దీన్ అజ్మల్ 1%, అఖిల్ గోగోయ్ 1% తో వెనకంజలో ఉన్నారు. 7% మంది ఓటర్లు తాము ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. గౌరవ్ గోగోయ్ వ్యక్తిగత ప్రజాదరణ, సీఎం రేసులో ముందంజలో ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారలేదు. హిమంత బిశ్వ శర్మ స్వల్ప ఆధిక్యానికి మహిళా ఓటర్ల బలమైన మద్దతు తోడైంది. గిరిజనులు, పురుషులు ఎక్కువమంది సోనోవాల్ వైపు మొగ్గు చూపించారు.బీజేపీకే మద్దతుఅస్సాం రాష్ట్ర అభివ ృద్ధికి ఏ పార్టీ మంచిదన్న ప్రశ్నకు 48% బీజేపీకి, 38% కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు 55% బీజేపీ గెలుస్తుందని భావించగా, కాంగ్రెస్‌కు 40% మంది మద్దతు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్నకు 55% బీజేపీకి అనుకూలంగా, 45% వ్యతిరేకంగా స్పందించారు.అభివృద్ధి, సంక్షేమం, వివిధ వర్గాల మద్దతు, సీఎం ఎంపిక, పార్టీ ప్రదర్శన, వయస్సు, లింగ పరమైన అంశాల్లో బీజేపీ సమగ్ర ఆధిక్యం కనిపించింది. 2021 నుంచి జరిగిన మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ఉపఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ రావడం ఆ పార్టీని మరింత బలోపేతం చేశాయి. గిరిజనులు, ఓబీసీల్లో కూడా మద్దతు సంపాదించి, ఎన్డీఏ తన పరిధిని మరింత విస్తరించింది.కాంగ్రెస్‌కు లభించిన స్వల్ప మద్దతు కూడా ప్రధానంగా బరాక్ వ్యాలీ, లోయర్ అస్సాంలో ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు మారడం వల్లనే అని సర్వేలో తేలింది. వ్యాపార ప్రయోజనాలు, వివాదాస్పద కూటములపై అభిప్రాయాలతో ఏఐయుడీఎఫ్ రాజకీయంగా ఒంటరిగా మారింది. ఏజీపీ బీజేపీపై ఆధారపడుతోంది. కూటమి లేకుండా దాని పునాదులు క్షీణిస్తున్నాయి. యూపీపీఎల్ ఇటీవల బీటీఏడీ ఎన్నికల్లో బలహీన ప్రదర్శనతో మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. బోడో ఓటర్లు తిరిగి బీపీఎఫ్ వైపు మళ్లారు. బీజేపీ-బీపీఎఫ్ పునఃసమ్మేళనం బీటీఏడీ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్‌కు దారులు వేస్తున్నాయి. రైజర్ దళ్, ఏజేపీ వంటి చిన్న పార్టీలు పరిమిత ప్రభావంతోనే ఉన్నాయి.ఏ కులం ఎటువైపు?కులాల పరంగా చూస్తే... అస్సామీలు ప్రధానంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. అహోములు సివసాగర్, జోర్హాట్ వంటి కొద్ది ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇతర ఓబీసీలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. సీఏఏ తర్వాత హిందూ బెంగాలీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు అధికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఏఐయుడీఎఫ్ను తిరస్కరిస్తున్నారు. గిరిజనుల్లో ఎన్డీఏ పట్ల ఆకర్షణ రోజురోజుకు పెరుగుతుండగా... బోడోలు బీపీఎఫ్-బీజేపీకి, మిసింగ్స్, కార్బీలు, డిమాసాలు తదితరులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల కొంతవరకు టీ తోటల సమూహాలు బీజేపీతోనే ఉన్నప్పటికీ, వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.ప్రాంతాల వారీ విశ్లేషణబరాక్ వ్యాలీ (13 సీట్లు): డీలిమిటేషన్ తర్వాత ముస్లిం ప్రభావం తగ్గడంతో ఎన్డీఏకు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పర్ అస్సాం: ఎన్డీఏ ఆధిక్యంగా ఉండగా, ప్రతిపక్షానికి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. మిడిల్ అస్సాం: గిరిజన ప్రాంతాల్లో ఎన్డీఏ బలంగా ఉందిబీ కొన్ని జిల్లాల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడుతున్నాయి. లోయర్ అస్సాం: డీలిమిటేషన్ ఎన్డీఏకు అనుకూలంగా మారడంతో బీజేపీ-బీపీఎఫ్ బీటీఏడీ కలిసి స్వీప్ చేసే అవకాశం ఉంది.డీలిమిటేషన్ ` ప్రతిపక్ష సమస్యలు2023 డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ చర్యతో ముస్లిం ఓట్లను చీల్చడం సులభమైంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, అభ్యర్థుల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఏఐయుడీఎఫ్ పతనం కొనసాగుతోంది. బీజేపీ సంస్థాగత బలం, సంక్షేమ లబ్ధిదారుల వర్గం దాని స్థితిని మరింత బలపరుస్తున్నాయి. హింస, ప్రముఖుల మరణాలు, ఎస్టీ డిమాండ్లు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బీజేపీ నెరిటివ్ ని దెబ్బతీయలేకపోయాయి. సంక్షేమంపై ఉన్న భావనలే పైచేయిగా నిలిచాయి. బీజేపీ బలంగా పాతుకుపోవడంతో వరుసగా మూడో విజయాన్ని సాధించే అవకాశాలు సుగమయ్యాయి.సర్వే విధానంక్షేత్రస్థాయి రాజకీయ, ఎన్నికల పరిశోధనలో అనుభవం కలిగి ఉన్న పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, ‘‘పర్పసివ్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్’’ మోడల్‌తో 45 రోజులపాటు అస్సాం వ్యాప్తంగా విస్త ృతంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. అప్పర్ అస్సాం, బరాక్ వ్యాలీ, మధ్య అస్సాం, లోయర్ అస్సాం అనే నాలుగు ప్రధాన ప్రాంతాలు, రాష్ట్రంలోని ఐదు పరిపాలనా విభాగాలు, మొత్తం 35 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. రాబోయే శాసనసభ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో పీపుల్స్ పల్స్ రీసర్చర్లు అస్సాంలో 5,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.20 మందితో పీపుల్స్ పల్స్ బ ృందాన్ని ప్రతి గ్రూపులో నలుగురు రీసర్చర్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించాం. అదనంగా ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమగ్ర వివరాలు సేకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 నుంచి 4 రోజులు గడుపుతూ అన్ని వర్గాల ప్రజలను కలిశారు. 126 నియోజకవర్గాల్లో ప్రతి చోట 40-45 నమూనాలను ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా సేకరించారు. మొత్తం 5,000 మంది నుంచి సమాచారం సేకరించి, కులం, మతం, వయస్సును పరిగణలోకి తీసుకుంటూ పురుషులు-మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రతిబింబించేలా ఈ నమూనా రూపొందించాం.ప్రతి గ్రూపులో ఒకరు నియమిత ప్రశ్నావళితో ఇంటర్వ్యూలు నిర్వహించగా, మిగిలిన ముగ్గురు స్వేఛగాే సంభాషణలు సాగిస్తూ మూడ్ సర్వే నిర్వహించారు. రోజుకు సగటున 15-20 గ్రూపులను ఇంటర్వ్యూ చేయగా, ప్రతి సెషన్ 25-30 నిమిషాలు కొనసాగింది. ఎన్నికలను ప్రభావితం చేసే ప్రజా సమస్యలు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేత ృత్వంలోని ఎన్డీఏ పాలనపై అభిప్రాయాలు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయాలు, అలాగే ఏజీపీ, బీపీఎఫ్, ఏఐయుడీఎఫ్, రైజర్ దళ్, ఏజేపీ, యూపీపీఎల్, సీపీఐ(ఎం) తదితర పార్టీలపై అభిప్రాయాలు సేకరించారు. రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, సెఫాలిజిస్టుల సంప్రదించి ఈ సర్వే ఫలితాలను ధ ృవీకరించాం. ఇది మరికొన్ని నెలల్ల జరగబోయే 2026 ఎన్నికలకు ముందు తొలి ట్రాకర్ పోల్ కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో రౌండ్ నిర్వహిస్తాం.- దిలీప్‌రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ. -
ఫియర్లెస్ వుమెన్ పోలీస్ ఆఫీసర్..!
అస్సాం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అక్కడ తీవ్రవాదులతో పొంచి ఉన్న ముప్పు... అడవుల్లో ఉగ్రవాదుల ఆవాసాలు... బోడోల నుంచి దాడులు.. బంగ్లాదేశీ వలసదారుల సమస్యలు... వారి మధ్య హింస... పోరు... ఇలా పెను సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ పని చేసే అధికారుల తీరు ఎలా ఉంటుందనే ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలతో సతమతమవుతున్న ఆ రాష్ట్రంలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి తనదైన శైలిలో వారిని ఎదుర్కొని... దేశం ముందు ఓ రోల్ మోడల్‌గా నిలిచింది. అస్సాం రాష్ట్రానికే చెందిన ఆ మహిళ ఆ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందింది. తన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బాగా గుర్తించిన ఆమె ఆ సమస్యలను నివారించడంలో చూపిన ధైర్య సాహసాలు.... దేశంలో ఎంతో మంది మహిళలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించి....ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా.... ఐరన్ లేడీగా... మరో కిరణ్బేడీగా పేరొందిన ఐపీఎస్ అధికారి సంజుక్తా పరాశర్.... గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంజుక్తా పరాశర్.... 1979 అక్టోబరు 3న అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్‌లో జన్మించారు. ఆమె తల్లి మీనాదేవి అస్సాం హెల్త్ సర్వీసెస్ లో పనిచేస్తుండగా.... తండ్రి దులాల్ చంద్ర బారువా నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేశారు. గౌహతిలో హోలీ చైల్డ్ ఆర్మీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తయిన తరువాత....న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ ఫర్ విమెన్‌లో పొలిటికల్ సైన్స్ ఆనర్స్‌లో డిగ్రీ, జవహర్ లాలా్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఇంటర్నల్ రిలేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జెఎన్‌యూలోనే అమెరికన్ విదేశాంగ విధానంలో ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. 2006లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఆలిండియా 85వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ అవకాశమున్నా... ఐపీఎస్‌ను ఎంచుకుని... శిక్షణ పొందిన తర్వాత అస్సాం- మేఘాలయా కేడర్‌కు తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పోస్టింగ్ సాధించారు. 2008లో అస్సాం, మాకుమ్ జిల్లాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా తొలి పోస్టింగ్ తీసుకున్నారు. పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభించారు. AK-47 తుపాకీ చేత బట్టి నేరుగా అడవుల్లోకి వెళ్లారు. కిందిస్థాయి సిబ్బందిపై పూర్తిగా వదిలేయకుండా ప్రతి దాడిలో నేరుగా పాల్గొని కేవలం 15 నెలల వ్యవధిలో 16 ఎన్కౌంటర్లు చేశారు. 64 అరెస్టులు.... భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బోడోస్, బంగ్లాదేశీ వలసదారుల మధ్య హింసను నియంత్రించడాన్ని ఓ సవాలుగా తీసుకుని ఉగ్రవాదులను పరుగులు పెట్టించింది. ఉగ్రవాద మూలాల్ని మట్టబెట్టినప్పటికీ... ఇప్పటికీ అస్సాంలో అసాంఘిక శక్తుల్లో ఆమె పేరు వినగానే వణుకు పుడుతుంది. దీంతో ఐపీఎస్‌లో చేరగానే ఫీల్డ్ ఆపరేషన్లలో నేరుగా పాల్గొన్న అరుదైన మహిళాధికారిగా గుర్తింపు పొందారు. ఆమె ధైర్యం, క్రమశిక్షణ, నిబద్ధతతను గుర్తించిన తోటి అధికారులు... సిబ్బంది ఆమెను 'ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని పిలుస్తారు. ఆమె కెరీర్లో విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహించడం... 15 నెలల్లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం... పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు అమెరికన్ విదేశాంగ విధానంలో పీహెచ్డీ చేసిన ఆమెకు అంతర్జాతీయ సంబంధాలపై ఆమెకు ఉన్న ఆసక్తి... అవగాహనను ప్రతిబింబిస్తుంది. సంజుక్త పరాశర్ కథ ఒక ప్రేరణాత్మక గాథగా... విద్య, ధైర్యం.... కర్తవ్యనిబద్ధతతో ఒక మహిళా అధికారి ఎలా ఉగ్రవాదులపై పోరాడి ప్రజలలో భద్రతా భావన కలిగించగలదో చూపిస్తూ అస్సాంలో కథనాలు ప్రచురితం కాగా... పలు టీవీ ఛానెళ్లలో ఆమె గురించి చర్చలు... విద్యాలయాల్లో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ విద్యా బోధనలు జరిగాయి. ఆమె ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వాలు ఆమె శౌర్యానికి రాష్ట్రపతి పోలీస్ పతకం... విశిష్ఠ సేవలకు గానూ పోలీసు పతకం... మహిళా సాధికారతకు గాను రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తన సేవలు... ధైర్య సాహసాలతో ఆమె తన తోటి అధికారులు, కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా మారారు. ముఖ్యంగా మహిళలకు మాత్రం ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. అస్సాం రాష్ట్రానికి చెందిన 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పురు గుప్తాను ఆమె 2008లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. విధుల నిర్వహణలో భాగంగా భార్యా భర్తలు నెలల వ్యవధి దూరంగా ఉన్నప్పటికీ... వారి కుమారుణ్ని సంజుక్త తల్లి చూసుకుంటుందంటే తన కుటుంబాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రెండు నెలలకు ఓ సారి తల్లితో..., టిన్సుకియాలో డిప్యూటి కమిషనర్‌గా ఉన్న భర్తతో, కుమారుడితో కలిసి కొన్ని రోజులు ఉండి తిరిగి తన విధి నిర్వహణకు అంకితమవడం ఆమె అంకిత భావం, స్ఫూర్తిని చాటుతోంది. ఆమె తన ఐపిఎస్ కెరీర్లో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఉగ్రవాద పోరులో ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. భర్త, తల్లి, కుమారుడు ఉన్న ఆమెను చంపేస్తామని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని ఉగ్రవాదులు, బోడోల బెదిరింపులు వచ్చినా డోంట్ కేర్ అంటూ ఎక్కడా జంకకుండా, అధైర్య పడకుండా తన ఆపరేషన్లను సక్సెస్ చేశారు. ప్రస్తుతం సంజుక్తా పరాశర్ న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డిఐజిగా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రొఫార్మా ప్రమోషన్ ఇవ్వడంతో ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2017 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆమెకు ఈత, జిమ్నాస్టిక్స్ ల అభిరుచులున్నాయి.-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
2026లో తొలి సూర్యోదయం.. ఢిల్లీ నుంచి పూరీ వరకూ..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలంతా సరికొత్త ఆశలు, ఉత్సాహం, భక్తి భావాల మధ్య 2026కు ఘనంగా స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అస్సాంలోని గౌహతిలో ఆవిష్కృతమైన ఈ ఏడాది తొలి సూర్యోదయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆకాశంలో పరుచుకున్న తొలి కిరణాలు ఒక సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలిచాయి. దీనికి సంబంధించిన విజువల్స్‌ను ఏఎన్ఐ (ఏఎన్ఐ) షేర్ చేసింది. ఆధ్యాత్మిక ప్రార్థనలు, వేడుకల కోలాహలం మధ్య దేశ ప్రజలు నూతన ప్రయాణాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. ఏ ప్రాంతంలో వేడుకలు ఎలా జరిగాయనే వివరాల్లోకి వెళితే.. #WATCH | Assam | First sunrise of 2026 as seen from Guwahati pic.twitter.com/43vidO5R46— ANI (@ANI) January 1, 2026దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు 20,000 మంది పోలీసుల పహారా కొనసాగుతోంది. నిఘాను మరింతగా పెంచి, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను పోలీసులు అరికట్టారు. మంచు కురుస్తున్న కశ్మీర్ లోయలో పర్యాటకుల సందడి నెలకొంది. గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జరిగిన వేడుకలు కొత్త ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.#WATCH | Odisha | First sunrise of 2026 as seen from Puri pic.twitter.com/zjbIPss7FY— ANI (@ANI) January 1, 2026దేశంలోని మెట్రో నగరాల్లో పటిష్టమైన నిఘా నీడలో వేడుకలు జరిగాయి. ముంబై మహానగరంలో మెరైన్ డ్రైవ్, జుహు బీచ్ వంటి ప్రాంతాల్లో 17,000 మందికి పైగా సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. మహిళలు, పిల్లల రక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బెంగళూరులో కూడా 20,000 మంది పోలీసుల కాపలా మధ్య నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పౌరులు సంయమనం పాటిస్తూ, ఉత్సవాల్లో పాల్గొనేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.#WATCH | Fireworks illuminate the night sky in Goa and people welcome #NewYear2026 pic.twitter.com/ZToByiyYxM— ANI (@ANI) December 31, 2025ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో కొత్త ఏడాది వేడుకలు భక్తి భావంతో మొదలయ్యాయి. ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌లో 1,001 దీపాలను వెలిగించి, నిర్వహించిన గంగా హారతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలో కూడా వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహించి నూతన ఏడాదిని ప్రారంభించారు.తూర్పు తీరాన ఉన్న పూరీ క్షేత్రం భక్త జన సంద్రంలా మారింది. జగన్నాథుని ఆశీస్సుల కోసం దాదాపు 3.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ప్రతీక్ సింగ్ నేతృత్వంలో 2,100 మంది సిబ్బందితో కూడిన 70 ప్లాటూన్ల బలగాలను ఆలయ పరిసరాల్లో మోహరించారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడమే కాకుండా, సముద్ర తీరంలో భక్తుల రక్షణ కోసం 300 మంది లైఫ్‌గార్డులను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా.. #WATCH | Dubai, UAE | Mesmerising fireworks, and a light and sound show illuminate the Burj Khalifa as the world rings in #NewYear2026 Source: Emaar pic.twitter.com/ir9rJHlp4k— ANI (@ANI) December 31, 2025 #WATCH | Varanasi, UP | Morning prayers being performed at Kashi Vishwanath Temple on the first day of #NewYear2026 Source: Kashi Vishwanath Temple Trust pic.twitter.com/q42QbqIlht— ANI (@ANI) January 1, 2026 -
11 మంది ఉగ్రవాదుల అరెస్ట్
అసోంలో ఉగ్రవాదుల భారీ కుట్రను అధికారులు భగ్నం చేశారు. అసోం, త్రిపురలో దాడులకు స్కెచ్ వేసిన 11 మంది ఉగ్రవాదులను సోమవారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుస్తోందని భారీదాడులకు వీరు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఉగ్రవాదుల వద్ద జిహదీ సాహిత్యంలో పాటు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..కాగా ఇటీవల ఢిల్లీ ఎర్రకోట బాంబు దాడుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. అనుమానిత ప్రాంతాలలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడంతో పలువురిని అరెస్ట్ చేసింది. కాగా గత నెల 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో దాదాపు 13 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. -
వాళ్లను తరిమేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్‌దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్లకు షా నివాళులరి్పంచారు. తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్‌ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు. -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్‌కు ఒక ఇన్‌ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్‌కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్‌పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్‌కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్‌లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో ఏఏఎస్‌యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్‌కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్పేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్‌లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -హెచ్.కమలాపతిరావు -
అస్సాంలో 10.56 లక్షల పేర్లు తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 10.56 లక్షల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా 93,021 డి–ఓటర్లు(డౌట్ఫుల్ఓటర్స్) ఉన్నట్లు గుర్తించింది. మరణించడం, వలసవెళ్లడం, బహుళ ఎంట్రీలు వంటి కారణాలతో 10,56,291 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. పౌరసత్వం లేకున్నా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారిని డి–ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి ఓటు వేసే హక్కు ఇవ్వడం లేదు. -
ఏనుగుల పాలిట యమపాశాలు రైలు పట్టాలు..
-
చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ
కలబురగి (కర్ణాటక): అస్సాంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే ఆదివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు పునాదులు వేస్తున్నప్పుడు, అస్సాంను తూర్పు పాకిస్థాన్‌లో కలిపేందుకు కుట్ర పన్నారని, ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయిందని మోదీ ఆరోపించారు. కేవలం గోపీనాథ్ బార్డోలోయ్ మాత్రమే సొంత పార్టీని ఎదిరించి అస్సాం అస్తిత్వాన్ని కాపాడారని ప్రధాని స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. దీనిపై ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి రక్షణ కల్పించడంలో విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మీరు విఫలమైన ప్రతిసారీ విపక్షాలపై బురద చల్లడం తగదు. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’.. అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేయడంపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాడి వంటిదన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, ధనవంతులకు బానిసలుగా మార్చడానికే మోదీ ఈ చట్టాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేపడతామని ఖర్గే హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన మూకదాడి ఘటనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం వెంటనే ఆ దేశంతో మాట్లాడి హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి’.. అని ఆయన డిమాండ్ చేశారు. -
దేశ వ్యతిరేకి!
నామ్ రూప్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ పార్టీ తలమునకలుగా ఉందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓటు బ్యాంకు తప్ప దానికి మరేమీ పట్టదు.ఎలాగైనా అధికారాన్ని ఒడిసిపట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం‘ అని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న అసోంలో దిబ్రుగడ్ జిల్లాలోని నామ్ రూప్ లో రూ.10,601 కోట్లతో నిర్మించిన భారీ ఎరువుల కర్మాగారాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దునుమాడారు. ‘‘ఆ రాష్ట్రంపై దానిది ఎప్పుడూ సవతి ప్రేమే. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, ప్రతిష్ఠ కాంగ్రెస్‌కు ఏనాడూ పట్టలేదు. వాటి పరిరక్షణకు పాటుపడుతున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అనే విషం బారినుంచి అస్సాంను కాపాడాల్సిన అవసరముంది . ఈ విషయంలో బీజేపీ ఒక కవచంలా నిలుస్తుంది‘ అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల హింసాకాండకు శాశ్వతంగా తెర దించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. నాటి అహోం రాజా వంశ పాలనలో ఉన్నంత శక్తిమంతంగా అసోంను తీర్చిదిద్ది తీరుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మోదీ చెప్పారు.ద్రోహాలను కడుగుతున్నాందేశానికి కాంగ్రెస్ ఎన్ని ద్రోహాలు చేసిందో లెక్కే లేదని మోదీ అన్నారు. దాంతో, 12 ఏళ్లుగా తమ సర్కారు ఎంతగా సరిచేస్తున్నా, ఇంకా చక్కదిద్దాల్సిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘అసోం ఆణిముత్యం భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటిస్తే బాహాటంగా వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ ది! ’ఆడిపాడే వారికి మోదీ భారతరత్న ఇస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేసి అస్సామీల మనసులకు తీరని గాయం చేసింది‘ అని మండిపడ్డారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ విభాగం ఏర్పాటు చేసినా వ్యతిరేకించిన కాంగ్రెస్ ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలు క్రమంగా సా చేస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. సభకు మహిళలు భారీగా తరలిరావడం హర్షణీయమని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను భేటీ అయినపుడు ఆయనకు అసోం బ్లాక్ టీ పొడి కానుకగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.స్టూడెంట్స్‌తో బోటు షికారుప్రధాని మోదీ ఆదివారం ఉదయం అసోంలో బ్రహ్మపుత్రా నదిలో బోటు షికారు చేశారు. వినూత్నంగా క్రూయిజ్ షిప్ లో విద్యార్థులతో గంటపాటు పరీక్షా పే చర్చా కార్యక్రమం జరిపారు. పలు స్కూళ్లకు చెందిన 25 మంది స్టూడెంట్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు గువాహ తిలో అసోం ఆందోళన అమర వీరుల స్తూపం వద్ద మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన స్వహిద్ సమరక్ ఉద్యమంలో 860 మందికి పైగా అసువులు బాశారు. ఇందుకు గుర్తు నిర్మించిన స్వహిద్ సమరక్ క్షేత్ర వద్ద వెలిగే నిత్య ప్రమిదకు మోదీ ప్రణమిల్లారు. ఆయన రెండు రోజుల అసోం పర్యటన ఆదివారంతో ముగిసింది. -
ఏనుగుల మందను ఢీ కొట్టి.. అస్సాంలో రైలు ప్రమాదం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల మందను ఢీ కొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మృతి చెందినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ గాయాలు కూడా కాలేదు.సైరాంగ్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) అర్ధరాత్రి 2గం. సమయంలో హొజాయ్ జిల్లా పరిధిలో వెళ్తోంది. ఆ సమయంలో పట్టాలు దాటుతున్న ఏనుగుల మందను రైలు ఢీకొట్టింది. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏనుగు గాయపడింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల మందలు ఇలా పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటాయి. అయితే.. తాజాగా ఘటన జరిగిన హోజాయ్ జిల్లా ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
మట్టితో... ఫేస్‌మాస్క్‌లు
సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్‌తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు. అలాంటి మాస్కులకు అస్సాంలోని మాజూలీ ప్రసిద్ధిగాంచింది. శ్రీమంత శంకరదేవుల వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన సంప్రదాయ మాస్క్‌లు ప్రసిద్ధికెక్కాయి. ఈ మాస్కుల తయారీ కళ 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. వారసత్వ కళగా ఉన్న ఈ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం వారధిగా నిలిచింది. మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఈడీపీ)లో భాగంగా కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధిబాట పట్టించింది. వారి వారసత్వ కళను ప్రోత్సహించి వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటు చేసింది. కళాకారుల కుటుంబాల్లోని మహిళలతో స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ)గా ఏర్పాటు చేసింది. పదిహేను మంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇలా రెండు బృందాలు ఈ మాస్కులను తయారు చేస్తున్నాయి. సహజసిద్ధ రంగులతో తయారు చేసే ఈ మాస్కులను బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయించడమే కాకుండా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టింది. వీటికి గతేడాది మార్చిలో జీఐ ట్యాగింగ్(భౌగోళిక గుర్తింపు)ను ప్రభుత్వం ఇచ్చింది.సహజసిద్ధ సరుకుతో...అస్సాం రాష్ట్రంలోని మాజూలీ ద్వీపంలోని కళాకారులు ఈ ఫేస్ మాస్కులను తయారు చేస్తున్నారు. వెదురు కర్ర ముక్కలు, బ్రహ్మపుత్ర నదీలో లభించే బంక మట్టి, ఆవుపేడ, జూట్, పేపర్, కాటన్‌తో ఈ మాస్కులు తయారు చేస్తారు. ముందుగా తయారు చేసే ముఖ ఆకృతిని వెదురు ముక్కలతో ఫ్రేమ్ మాదిరి తయారు చేసి వాటికి బంకమట్టి, ఎండిన ఆవుపేడ పొడి కలిపిన మిశ్రమంతో ఆ ఫ్రేమ్‌పైన పూతలా అద్దుతారు. ఈ ప్రక్రియలో జూట్, పేపర్, కాటన్‌ను అనువైన రీతిలో వినియోగిస్తారు. ఈ నమూనా పూర్తిగా ఎండిన తర్వాత వాటికి అవసరమైన రంగులు అద్దుతారు. ప్రస్తుతం సూరత్ నుంచి దిగుమతి చేసుకునే రంగులను వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వినియోగం ఖరీదవుతుందని, త్వరలో ఈ రంగులను స్థానికంగా తయారు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వీటినే వినియోగిస్తామని వాటిని తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ మాస్కులు మూడు రకాల పరిమాణంలో ఉంటాయి. మొదటి రకం కేవలం మొహాన్ని మాత్రమే కవర్ చేస్తుండగా... రెండో రకం నటుడి శరీరంలో మెజార్టీ భాగాన్ని కవర్ చేస్తుంది. మూడో రకం మాత్రం అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేస్తారు. ఈ కళను పరిరక్షించి ఆధునీకరించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హేమ్చంద్ర గోస్వామి కృషి చేశారు. ప్రస్తుతం వీటిని నాటకాల్లో మాత్రమే వినియోగించకుండా పర్యాటకుల జ్ఞాపికలుగానూ, అలంకరణ వస్తువులగానూ వినియోగిస్తున్నారు.మార్కెట్లో ఇలా...కళాకారులు తయారు చేసే మాస్కులపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఒక్కో మాస్కుపైన రూ.100 పెట్టుబడి పెడితే చాలు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మహిళలు తయారు చేసే ఒక్కో మాస్కు కనీస ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. ఫేస్ మాస్క్ పరిమాణం ఆధారంగా వీటి ధర రూ.3వేల వరకు ఉంటుంది. ఈ మాస్కుల తయారీ ద్వారా మహిళా సంఘానికి నెలకు కనీసం రూ.50 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ తయారీ ప్రక్రియ ప్రారంభదశలో ఉండగా... రానున్న ఏడాదిలో ఆర్థిక స్థితి భారీగా వృద్ధి సాధిస్తుందని, ఈమేరకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మాజూలీ నుంచి– చిలుకూరి అయ్యప్ప, సాక్షి, (చదవండి: 'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్) -
పర్యాటకుల స్వర్గధామం.. కాజీరంగా
కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్... పర్యాటకులకిది గమ్యస్థానమే కాదు.. జీవవైవిధ్యానికి అతి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్ ఇదే. ఇలా చెప్పుకుంటూ పోతే కాజీరంగాకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పార్క్ అసోంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో నీటి గలగలలు వినసొంపుగా ఉంటాయి. కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య దృశ్యాలు కనువిందు చేస్తాయి. కాజీరంగా దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ జాతీయ పార్క్‌ను ఎన్‌హెచ్–37 మధ్యగా చీల్చుతుంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ తేయాకు తోటలు పరుచుకుని ఎంతో అహ్లాదకరంగా, ఎటుచూసినా పచ్చని దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కన ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. – కాజీరంగా నుంచి సాక్షి ప్రతినిధికాజీరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలలతోనే కనిపిస్తుంది. భారీ, ఎత్తైన గడ్డిపొదలతో ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. ఈ అడవిలో పెద్దసంఖ్యలో అడవి పందులు కూడా ఉన్నాయి. చిత్తడి నేలలు ఒక ఎత్తయితే.. చాలాచోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్‌లోని కొన్నిరోజులు మినహాయిస్తే... ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ పార్క్‌లోకి సందర్శకులను అక్టోబర్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించరు. బ్రహ్మపుత్ర నది పోటెత్తినప్పుడు, భారీ వర్షాలతో ఈ అడవిలోనూ వరదలు సంభవిస్తాయి. ఆయా సమయాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడటం, గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంతో ఈ పార్కు స్వరూపం కూడా మారుతుంటుంది. ఈ పార్కులో మానవప్రమేయం చాలా తక్కువ. ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడ్డ పరిస్థితులను అస్సాం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మారింది. వేట చాలావరకు తగ్గింది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండాం ప్రకృతి పరిరక్షణకు నిదర్శనంగా మారింది. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అనే సందేశాన్ని కాజీరంగా గట్టిగా వినిపిస్తోంది.» 1905లో పార్లమెంటులో నోటిఫికేషన్ ద్వారా కాజీరంగాను రిజర్వ్ ఫారెస్టుగా నిర్ధారించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది. » 1916లో కాజీరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. » 1937లో పర్యాటకులు/సందర్శకులకు అనుమతిచ్చారు. » 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. » 1974లో జాతీయ పార్కుగా నోటిఫై చేశారు. » 1985లో అంతర్జాతీయ చారిత్రక సంస్థగా యునెస్కో గుర్తించింది. » 2007లో దీన్ని టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేశారు. » 2018లో కాజీరంగాను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఖరారు చేశారు. » 2022లో స్మగ్లింగ్/వేట రహితంగా ప్రకటించారు. » 2024లో జాతీయ పార్కుగా పేరొంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాజీరంగానేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్‌లోని జంతు సంపద (2022 పశుగణన లెక్కల ప్రకారం)...2,613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 104 రాయల్ బెంగాల్ టైగర్1,129 చిత్తడి జింకలు553 పక్షి జాతులు550 వృక్ష జాతులు1,200+ ఏనుగులు 2,565 అడవి దున్నలుప్రత్యేకతలుప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నది ఇక్కడే. 1966లో ఇక్కడ 366 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా... ఇప్పుడు వాటి సంఖ్య 2,613కి చేరింది. వచ్చేఏడాది వైల్డ్‌లైఫ్ సెన్సెస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేషనల్ పార్కులో అత్యధిక రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడవిదున్నల సంఖ్య కూడా ఇక్కడే అత్యధికంగా ఉంది. ఏనుగుల సంఖ్యతో పాటు చిత్తడి జింకలు సైతం ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 25 రకాల అంతర్జాతీయ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తుంటాయి.» జంతువుల దాడిలో పదేళ్లలో 19 మంది మృత్యువాత పడ్డారు. 2014, 2015, 2016లో మరణాలు నమోదు కానప్పటికీ... ఆ తర్వాత ఏటా సగటున 3 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంది. » కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రానికి ఏటా టికెట్ల రూపంలో రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ఏటా సగటున రూ.10 నుంచి రూ.12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం కాగా... 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. » ఈ అటవీ సంరక్షణలో 367 మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తో పాటు అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీ సర్లు, ఫారెస్ట్ గార్డ్లు తదితర కేటగిరీల్లో ఉద్యోగులున్నారు. » కాజీరంగా జాతీయ పార్క్‌ను నాలుగేళ్లుగా ఏటా సగటున 3 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో 5 శాతం విదేశీ సందర్శకులే కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1.31 లక్షలు కాగా.. ఇందులో విదేశీ పర్యాటకులు 8 వేలు. పదేళ్లలో ఈ పర్యాటకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. » ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎలి ఫెంట్ సఫారీ చేయొచ్చు. ఉదయం7.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు జీపు సఫారీకి అనుమతిస్తారు. » పార్కులో ప్రవేశానికి దేశ పౌరులకు రూ.100, విదేశీయులకు రూ.650 చొప్పున రుసుము చెల్లించాలి. ఏనుగుపై సఫారీకి విదేశీయులకు రూ.2 వేలు, దేశ పౌరులు రూ.1,200 చెల్లించాలి. » జీపు సఫారీకి రూ.2,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్‌ఫిల్మ్ తదితరాలకు వేరువేరు ఫీజులుంటాయి. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది. » సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్‌హౌస్‌లు, సందర్శనకు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..! నలుగురిపై వేటు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు ప్లేయర్లను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్‌లగా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.దీంతో వారిపై ఏసీఎ సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఈ నలుగురు.. సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంట. ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ ధ్రువీకరించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నలుగురిపై గువహతిలోని క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమైంది. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజన్లో అస్సాం తరపున రెండు మ్యాచ్‌లు ఆడారు. మిగితా ప్లేయర్లు దేశీయ క్రికెట్లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట -
‘వారికి రూ. లక్ష ఇచ్చినా నాకు ఓటెయ్యరు’
అస్సాంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయరన్నారు. వారికి ఓటుకు రూ.లక్ష ఇచ్చినా తనను ఎన్నుకోవడానికి మెుగ్గుచూపరన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ఇటీవల బిహార్‌లో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడి సీఎం నితీశ్ కుమార్ ప్రవేశ్ పెట్టిన విధంగా మీరెమైనా అస్సాంలో పథకాలు తీసుకొస్తారా అని సీఎంను ప్రశ్ని్ంచారు. దానికి సీఎం బదులిస్తూ "నేను రూ.10 వేలు కాదు రూ.లక్ష ఇచ్చినా ఆ రాష్ట్ర ముస్లింలు నాకు ఓటెయ్యరు. వారు కావాలంటే నా కిడ్నీని దానంగా ఇస్తా కానీ వారు నాకు ఓటెయ్యరు" అని అన్నారు. ప్రస్తుతం ఓట్లనేవి పథకాలు, అభివృద్ధి బట్టి కాకుండా ఐడీయాలజీ ప్రకారం వేస్తున్నారని హిమంత్ అన్నారు.అస్సాంలోకి చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారని హిమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 38 శాతం ఉన్న ముస్లింల జనాభా 2027 వరకూ 40 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 1961 నుంచి ఆ కమ్యూనిటీ దశాబ్ధ జనాభా వృద్ధిరేటు 4-5శాతం నిరంతరాయంగా పెరుగుతూ ఉందని అన్నారు. ఒకవేళ ముస్లింల జనాభా రాష్ట్రంలో 50శాతం దాటితే వేరే మతాల ప్రజలు రాష్ట్రంలో నివసించలేరని హిమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ముస్లిం ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందన్నారు. -
మనసు దోచే ముగా..!
పట్టు చీరలంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి కంచి, ఇక్కత్, గద్వాల్, బనారస్, ధర్మవరం, ఉప్పాడ... బనారస్ మినహాయిస్తే మిగిలినవన్నీ తెలుగు రాష్ట్రాలు, సమీప ప్రాంతాల్లో తయారయ్యేవే. దేశీయ మార్కెట్లో వీటి పరపతి అంతా ఇంతా కాదు. అయితే ఇంతకు మించి పరపతి సాధించిన మరో రకమే ముగా సిల్క్. ‘గోల్డన్ సిల్క్ ఆఫ్ అస్సాం’గా పేరుగాంచిన ముగా పట్టు చీరలు అస్సాం రాష్ట్రంలోని సువాల్కుచి కేంద్రంగా తయారవుతున్నాయి. అస్సాంలో తయారై అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ముగా చీరలు దేశంలో తయారయ్యే అత్యంత ఖరీదైన చీరల్లో ముందు వరుసలో ఉన్నాయి. జీఐ ట్యాగింగ్‌తో నాణ్యత గుర్తింపు ఉన్న ఈ చీరలకు జపాన్ , జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల మార్కెట్లో బోలెడంత క్రేజ్. మనకు తెలిసిన కంచి, బనారస్ పట్టు చీరల్లో మేలిమిరకం చీరలు రూ.25 వేల నుంచి లభ్యమైతే ముగా పట్టు చీరలు మాత్రం కనిష్టంగా రూ.50 వేలు ఉంటే... డిజైన్ బట్టి చీర ధర రూ.5 లక్షల వరకు ఉంది. ఈ చీరల మన్నిక కూడా వందేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ చీరలకు దేశీయంగా మార్కెట్ ఉన్నప్పటికీ... వీటి ధర మాత్రం సంపన్న వర్గాలు మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఉంది. అయితే ఈ చీరలకు జపాన్ , యూరప్ మార్కెట్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా అతినీలలోహిత కిరణాలకు రక్షగా ఈ పట్టు చీర ఉంటుందనే నమ్మకం అక్కడి మార్కెట్‌ను భారీగా పెంచింది. అంత ఖరీదైన చీరలు తయారు చేస్తున్నా కార్మికులకు మాత్రం అరకొర ఆదాయమే!సువాల్కుచిలో వేలాది మగ్గాలు...అస్సాం రాష్ట్రంలోని పాలస్బరి, బొకాఖత్, బర్పేట, నల్బరీ, ధుబ్రి జిల్లాల్లోనూ ఈ చీరల తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మగ్గాలు, డిజిటల్ మగ్గాలు మాత్రం సువాల్కుచిలో మాత్రమే చూస్తాం. ఇక్కడ పట్టు పురుగుల నుంచి దారం తీయడం, ఆ దారాన్ని ప్రాసెస్ చేసి చీర తయారీకి అనువైన విధంగా మార్చేవరకు అవసరమైన ప్రక్రియంతా ఇక్కడ జరుగుతుంది. ముగా పట్టు పురుగు కకూన్ (గూడు/కవచం) నుంచి పట్టు దారాన్ని తీస్తారు. ఒక కిలో పట్టు గూళ్ల ధర ప్రస్తుత మార్కెట్లో రూ.45 వేలుగా ఉంది. ఇందులో దాదాపు 5వేల గూళ్లు ఉంటాయి. వీటిని ప్రాసెస్ చేస్తే ఒకటిన్నర చీరలకు సరిపడా దారం తయారవుతుంది. ఒక్కో చీర తయారైన తర్వాత సగటున 700 గ్రాములుంటుంది. డిజైన్ , జరీ వినియోగాన్ని బట్టి చీర బరువు మారుతుంది. ఒక చీర తయారీకి గాను దారం ప్రాసెస్ నుంచి చివరి వరకు సగటున నెల రోజుల నుంచి 3 నెలల సమయం పడుతుందని, డిజైన్ ను బట్టి తయారీకి మరింత సమయం కూడా పడుతుందని నేత కార్మికులు చెబుతున్నారు.యూవీ రక్షణకు ప్రత్యేకంముగా చీరలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీలతో పాటు జపాన్ లోనూ ఈ పట్టు చీరలు, వస్త్రాలకు డిమాండ్ ఉంది. దీంతో అస్సాంలో ఉత్పత్తి అయ్యే ముగా వస్త్రాల్లో 80 శాతం పైగా ఎగుమతి చేస్తామని సువాల్కుచి వ్యాపారి హీరాలాల్ వివరించారు. ముగా పట్టు అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ స్తుందని, వీటిని గొడుగులుగా కూడా తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాటితోపాటు ఆభరణాలు కూడా తయారు చేస్తున్నామన్నారు.రసాయనాలు లేవు..→ అత్యంత ఖరీదైన చీర... మార్కెట్లో ఈ రకానికి బ్రాండింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. నార్త్ ఈస్ట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఈహెచ్హెచ్డీసీ)ఆధ్వర్యంలో ఈ చీరలకు జీఐ (జీయోగ్రాఫికల్ ఇండికేషన్ ) ట్యాంగింగ్ చేస్తున్నారు. జీఐ ట్యాగ్ ఉన్న చీరలు మాత్రమే మన్నికైనవనే సంకేతాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు.→ జీఐ ట్యాగింగ్ కోసం సువాల్కుచిలోని ఎన్ ఈహెచ్హెచ్డీసీలో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు రకాల పరీక్షలు చేసి చీర వాస్తవికతను నిర్ధారిస్తారు. ఒక్కో చీర పరిశీలించి జీయో ట్యాగ్ వేసినందుకు అక్కడ రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ల్యాబ్‌లో దాదాపు 30 లక్షల పరీక్షలు జరిపినట్లు ఎన్ ఈహెచ్హెచ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ మారా కోచో తెలిపారు.→ దేశంలోనే అత్యంత విలువైన చీరల తయారీలో కీలక ప్రాత పోషిస్తున్న నేత కార్మికులు, కూలీలు మాత్రం ఆర్థికంగా బక్కచిక్కి ఉన్నారు. వీరికి రోజుకు సగటున రూ.400 మేర కూలి చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ చీరలకు విదేశాల్లో మార్కెట్ ఉండడంతో నేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్న చీరలను వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మాత్రమే అధిక లాభాలను గడిస్తున్నారు. → ముగా దారం సహజంగా బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. సూర్యకాంతి పడినప్పుడు ఈ మెరుపు మరింత ప్రకాశవంతమవుతుంది. దారం వయసుతో పాటు మెరుపు పెరుగుతుంది. ఇతర పట్టు రకాలు కాలక్రమంలో మసకబారితే, ముగా పట్టు మాత్రం కడిగిన కొద్దీ, ధరించిన కొద్దీ బంగారంలా మరింత మెరుస్తుంది. ప్రపంచంలోని అన్ని సహజ పట్టు రకాల్లో ముగా పట్టు ఎక్కువ బలమైందిగా పేరొందింది.→ సోము–సోలు చెట్లు తగ్గిపోవడం వల్ల ముగా పట్టు పురుగుల సంఖ్య తగ్గుతోంది. ఈ పురుగులు అత్యంత సున్నితమైనవి కావడంతో వాతావరణంలో మార్పులు జరిగినా, కనీసం పురుగుమందులూ, ఇతర పొగ వాసన తగిలిన వెంటనే ఈ ముగా పట్టు పురుగులు వెంటనే చనిపోతాయి. ప్రస్తుతం ముగా పట్టు పరిశ్రమకు ఇదే అతిపెద్ద సవాలు. మరోవైపు ముగా చీరలు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. పాలిస్టర్, టస్సర్ మిక్స్ వెరైటీలు మరో సవాలు.→ ముగా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ‘ముగా మిషన్’ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతకారులకు శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సువాల్కుచిలో ‘ముగా సిల్క్ విలేజ్’ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. సువాల్కుచి నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి -
లోయలో పడ్డ బస్సు.. 18 మంది కూలీల దుర్మరణం
అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు వెయ్యి అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విషయం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద సోమవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్-చాక్లా మధ్య 40 నెంబర్ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి.. రెండు రోజుల తర్వాత లోయ నుంచి బయటకు వచ్చి సమీపంలోని ‘బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్స్’ (బీఆర్టీఎఫ్) లేబర్ క్యాంప్‌నకు చేరుకున్నాడు. మృత్యుంజయుడైన ఆ వ్యక్తిని బుధేశ్వర్ దీప్‌గా నిర్ధారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసింది. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. తీన్సుకియా నుంచి 22 మంది టీ ఎస్టేట్ పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. A truck carrying 22 labourers reportedly fell into a deep gorge between Hayuliang and Chakla, in the remote Chaglagam circle under Anjaw district. A rescue operation is currently underway, and efforts are on to contact authorities to know more about the incident. pic.twitter.com/rPGLnVvVXP— DD News Arunachal (@DDNewsArunachal) December 11, 2025 -
6 కులాలకు ఎస్టీ హోదా
గువాహటి/కోఖ్రాజార్: అసోంలో కులాల కుంపటి రాజుకుంటోంది. ఆరు ప్రధాన కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై ఏర్పాటైన మంత్రుల బృందం తమ మధ్యంతర నివేదికను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. గిరిజన మంత్రి రానిజ్ పెగు నివేదికలు ప్రవేశపెట్టారు. అహోం, చుటియా, మొరాన్, మతక్, కోచ్–రాజ్ భోంగ్సి, తేయాకు గిరిజనులు (ఆదివాసీలు) ఈ జాబితాలో ఉన్నారు. వీరు ఎప్పటినుంచో ఎస్టీ హోదా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత గిరిజన సమూహాలకు ఎలాంటి నష్టమూ కలగకుండా వీరికి కూడా ఆ ప్రయోజనాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు మంత్రి పెగు సభకు వివరించారు. అందుకు సంబంధించిన వివరాలు, గణాంకాలతో పాటు తలపెట్టిన మార్పుచేర్పులు తదితరాలను మంత్రి సభ ముందుంచారు. ఆరు బోర కులాలకు ఎస్టీ హోదాపై మంత్రుల బృందం సమర్పించిన మధ్యంతర నివేదికపై అసోం గిరిజన విద్యార్థి లోకం మండిపడింది. బోడోలాండ్ ప్రాదేశిక మండలి భవనానికి నిప్పు పెట్టి నిరసన తెలిపింది. వర్సిటీ నుంచి 6 కి.మీ. దూరంలోని బోడోలాండ్ ప్రాదేశిక మండలి దాకా స్టూడెంట్స్ మార్చి చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టుకుని లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దాంతో అదనపు పోలీసు బలగాలని రప్పించి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఆందోళనల్లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, పలు ఇతర అనుబంధ గిరిజన యూనియన్లు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలో పాల్గొని హోరెత్తించాయి. వీరంతా ఇదే అంశంపై గురువారం కూడా రోడ్డెక్కాయి. -
Zubeen Garg: సింగర్ కేసులో సంచలన ప్రకటన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని.. అదొక హత్య అని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అస్సామీస్తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబీన్ సెప్టెంబర్ 19వ తేదీన సింగపూర్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కల్చర్‌ను ఖండాంతరాలు దాటించిన గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయించింది హిమంత ప్రభుత్వం. జుబిన్ గర్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని.. నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని హిమంత తెలిపారు. నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. డిసెంబర్లో హత్య కేసులో ఛార్జ్‌షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు మాత్రం మృతిలో ఎలాంటి అనుమానాలు లేవనే అంటున్నారు. ఈ నెల మొదట్లో జుబిన్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం, టాక్సాలజీ నివేదికలను అస్సాం పోలీసులకు పంపించారు కూడా. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్‌ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. మరోవైపు.. జుబిన్ బ్యాండ్‌మేట్ శేఖర్జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషనర్ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానాలు వయక్తం చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ గమనించానని.. అయినా కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని.. తీరికగా వైద్యం అందించారని ఆరోపించారు. ఈ వాంగ్మూలంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
లంచ్‌కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడేందుకు భారత్‌కు రానుంది. తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే నవంబర్ 22 నుంచి 25 వరకు గౌహతి వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది.సాధారణంగా రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్ మ్యాచ్‌లలో మొదటి సెషన్ తర్వాత లంచ్, రెండో సెషన్ తర్వాత టీ బ్రేక్ తీసుకుంటారు. కానీ భారత్-సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో మాత్రం ఆటగాళ్లు తొలుత టీ బ్రేక్.. ఆ తర్వాత లంచ్ విరామానికి వెళ్లనున్నారు. నార్త్ ఈస్ట్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా ఉండటం కారణంగా.. రెడ్ బాల్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆటగాళ్లు లంచ్‌కు ముందు టీ బ్రేక్ తీసుకోనున్నారు.చరిత్రలో తొలిసారి..ఒక టెస్టు మ్యాచ్ ఆర్డర్ చాలా సింపుల్. తొలుత టాస్, ఆ తర్వాత ఆట ప్రారంభం, లంచ్ బ్రేక్, టీ బ్రేక్, స్టంప్స్. కానీ గౌహతీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగనుంది.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. బర్సపారా స్టేడియంలో ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాధారణ సమయం కంటే అరగంట ముందుగా మొదలు కానుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగుతుంది. తరువాత 20 నిమిషాల టీ విరామం ఉంటుంది.రెండవ సెషన్ ఉదయం 11:20 నుండి మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆటగాళ్ళు 40 నిమిషాల భోజన విరామం తీసుకుంటారు. చివరి సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రోజులోని 90 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అంపైర్లు ప్రయత్నించనున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఈ షెడ్యూల్ మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్!? -
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం
రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్‌లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్‌లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్‌లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్‌లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్‌లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు.. 91 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ బౌలర్లు చరిత్ర సృష్టించారు. అర్జున్ శర్మ, మోహిత్ జాంగ్రా హ్యాట్రిక్లతో విజృంభించారు. సుదీర్ఘ చరిత్ర గల రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అస్సాం... తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.ప్రద్యున్ సైకియా (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు పడగొట్టగా... మోహిత్ జాంగ్రా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం సర్వీసెస్ 29.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. ఇర్ఫాన్ ఖాన్ (51) హాఫ్ సెంచరీ సాధించగా... అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 5 వికెట్లు, రాహుల్ సింగ్ 4 వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 21 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. మొత్తంగా ఈ పోరులో తొలి రోజే 25 వికెట్లు నేలకూలాయి.చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ.. -
లవ్ జిహాద్‌పై చట్టం తెస్తాం
నాగోమ్ (అస్సాం): అస్సాంలో త్వరలో లవ్‌జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు. అస్సాంకే ప్రత్యేకతను తెచ్చిపెట్టిన శాస్త్రాల (వైష్ణవ సాంస్కృతిక కేంద్రాలు) పరిరక్షణతోపాటు టీ తోటల్లో పనిచేసే ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించే చట్టాలు కూడా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను రూపొందించి, కేబినెట్ ఆమోదించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు తెలిపారు. -
మనిషిలా మాత్రమే జీవిస్తా
గువాహటి: అసోంలోని గువాహటిలో గాయకుడు జుబీన్ గార్గ్‌కు దహన సంస్కారాలు జరిపి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు.. ‘ఇకపై కేవలం మనుషులా మాత్రమే జీవిస్తా. కులమతాల ప్రస్తావన వదిలేస్తా’అంటూ తన జంధ్యాన్ని తెంపి, చెత్తలో పడేశాడు. సన్ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు.. ఇకపై గార్గ్ నడిచిన బాటలోనే నడుస్తానని తెలిపాడు. కులమతాల అడ్డుగోడలను పగులగొట్టాలన్నాడు. ‘పుట్టుకతో నా కులం బ్రాహ్మణ. ఇప్పుడిక నాకు కులం, మతం అంటూ ఏదీ లేదు’అంటూ తన దుస్తుల్లోపలున్న జంధ్య తీసి, మీడియా చూస్తుండగానే తెంచి చెత్తలోకి వేశాడు. నా సోదరుడు జుబీన్ సాక్షిగా చెబుతున్నా. జంధ్యం మళ్లీ ధరించను. ఇటీవల సోషల్ మీడియాలో హిందూముస్లింలకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా వస్తున్నాయి. హిందువుల్లోనూ చాలా కులాలున్నాయి. శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు. ఇలాంటి ఆచారాలు, విశ్వాసాలు ఎన్నో. అందుకే జబీన్ దా సాక్షిగా వాటన్నిటినీ వదిలేస్తున్నా. ఆరేళ్ల నా కుమారుడికి కూడా జంధ్య వేయను. మనుషుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. మానవత్వం అన్నిటికీ మించింది’అని పేర్కొన్నాడు. కాగా, బ్రాహ్మణ కుటుంబంలో జి»ొన్ బొర్తాకుర్ పేరుతో జని్మంచిన జుబీన్ గార్డ్ కూడా తనకు కులం–మతం లేదంటూ ప్రకటించుకున్నారు. జంధ్యాన్ని దోమ తెర కట్టేందుకు తాడు మాదిరిగా వాడుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు. -
జుబీన్గార్గ్ మృతి కేసు...బంధువైన డీఎస్పీ అరెస్టు
గువాహటి: ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన సమీప బంధువు, పోలీస్ డీఎస్పీ సందీపన్గార్గ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేసినట్లు సీఐడీ డీజీపీ మున్నాప్రసాద్ గుప్తా తెలిపారు. సందీపన్‌ను కామపుర మెట్రోపాలిటన్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సీజేఎం) ముందు హాజరుపర్చగా, ఆయనకు న్యాయమూర్తి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్టు మున్నాప్రసాద్ వెల్లడించారు. సందీపన్తో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మతోపాటు జుబీన్ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు శేఖర్జ్యోతి గోస్వామి, అమృత్‌ప్రభ మహంతను అరెస్టు చేశారు. జుబీన్ సింగపూర్‌లో గత నెల 19న సముద్రంలో మునిగి మరణించిన సమయంలో ఈ ఐదుగురు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2022లో అస్సాం పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన సందీపన్గార్గ్.. ఈడబ్ల్యూఎస్ కోటాలో డీఎస్పీగా ఎంపికయ్యారు. -
అసోం బోడోల్యాండ్ కౌన్సిల్ చీఫ్‌గా మొహిలరీ
కొక్రాఝర్: అసోం రాష్ట్రంలోని బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్(సీఈఎం)గా హగ్రమ మొహిలరీ ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఈఎంగా మాజీ మంత్రి రిహొన్ డైమరీ కూడా ప్రమాణం చేశారు. కొక్రాఝర్‌లోని బోడోల్యాండ్ సెక్రటేరియట్ ఫీల్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటా ప్రమాణం చేయించారు. గవర్నర్ ఎల్పీ ఆచార్య, సీఎం హిమంత బిశ్వ శర్మ, పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మొహిలరీ ఈ పదవీ బాధ్యతలను చేపట్టడం ఇది నాలుగోసారి. సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 40 సీట్లకుగాను 28 సీట్లను సొంతం చేసుకుంది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్) బీజేపీలు కలిసి ఏడింటిని, ఇతరులు ఐదు సీట్లను గెలుచుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్తగా ఎన్నికైన బీపీఎఫ్ సభ్యులు డోట్మాలోని బోడో నేత బొడొఫా ఉపేందన్రాథ్ బ్రహ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 2020 జనవరి 27వ తేదీన ఢిల్లీలో జరిగిన తాజా బోడో ఒప్పందం అనంతరం జరిగిన రెండో ఎన్నికలివి. మొదటి దఫా ఎన్నికల్లో బీపీఎఫ్ 17 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, గణ సురక్ష పరిషత్, బీజేపీ, యూపీపీఎల్ కలిసి బోడో కౌన్సిల్ ఏర్పాటు చేశాయి. కాగా, అసోం బోడోల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ చీఫ్‌గా ప్రమాణం చేసిన హగ్రమ మొహిలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రం, అసోం ప్రభుత్వం బీటీసీ కౌన్సిల్‌కు పూర్తి మద్దతు కొనసాగిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. బీటీసీ ఏం చేస్తుందంటే..కొక్రాఝర్, చిరంగ్, బక్సా, ఉదల్‌గిరి, తముల్పూర్ జిల్లాలను కలిపి ఏర్పాటైందే బీటీసీ. సుమారు 9 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించిన ఉన్న బోడోలు మెజారిటీగా కలిగిన ఈ ప్రాంతంపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను బీటీసీ కలిగి ఉంటుంది. 1993లో జరిగిన ఒప్పందం ప్రకారం, బోడోలాండ్ భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన పరిపాలనా విభాగం. -
జుబీన్ గార్గ్ సతీమణి సంచలన ఆరోపణలు.. మరో ఇద్దరు అరెస్ట్
ఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ సతీమణి గరిమా సైకియా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. లైఫ్ జాకెట్ లేకుండా తన భర్తను నీటిలోకి ఎందుకు దింపారని ప్రశ్నించారు. అతను నీరసంగా ఉన్న సమయంలో నీటి వద్దకు ఎందుకు తీసుకెళ్లారని పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. జుబీన్ కేసులో మరో ఇద్దరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. జుబీన్ సతీమణి గరిమా తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జుబీన్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను బట్టి ఆరోజు ఆయన చాలా అలసిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. జుబీన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందకు పలుమార్లు మూర్ఛ కూడా వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. వైద్యులు అతన్ని నీటి దగ్గరకు వెళ్లవద్దని సూచించారు. అతన్ని ఎప్పుడూ డ్రైవ్ చేయడానికి కూడా అనుమతించలేదు. అయినప్పటికీ, అతన్ని బోటులో జరుగుతున్న పార్టీకి ఎందుకు తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టడానికి ఎలా అనుమతించారు. ఎవరూ అతన్ని ఎందుకు సరిగ్గా చూసుకోలేదు?. వైద్య సహాయం లేదా భద్రతా సహాయం ఎందుకు లేదు? అతను నా భర్త మాత్రమే కాదు. అస్సాం హృదయ స్పందన. ఆయన విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం క్షమించరానిది. జుబీన్‌తో నేను చివరిసారిగా సెప్టెంబర్ 18న మాట్లాడాను. బోటులో పార్టీ గురించి ఆయన నాతో ఏమీ చెప్పలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.Zubeen was not just my husband—he was a legendary artist, the heartbeat of millions. He was lovingly called the heartthrob of Assam, and even of North East India: Garima Saikia Garg, Zubeen Garg's wife#ZubeenDaForever #ZubeenGarg #NewsTrack | @MaryaShakil pic.twitter.com/UMfVWryrxV— IndiaToday (@IndiaToday) October 2, 2025మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్టు చేశారు. గార్గ్‌కు అత్యంత సన్నిహితులైన వీరు ఆయన మరణ సమయంలో సింగపూర్‌లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకొన్నామని, విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో పేర్కొన్నారు. అంతకు ముందు.. నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. -
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్‌లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్‌ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్‌ను అనుసరించింది. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్‌పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
శోకసంద్రంలో సింగర్ భార్య: ఆ తప్పిదమే ప్రాణాలు తీసింది!
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మికమరణం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.సింగపూర్‌లో శుక్రవారం జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. అయితే జుబీన్మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లనే అతని చనిపోయినట్టు తెలిపారు. జుబీన్ గార్గ్‌ను లైఫ్‌గార్డులు లైఫ్ జాకెట్ ధరించమని కోరినా వినలేదని, ఈ విషయాన్ని జుబీన్ సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తనకు చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించారు. యాచ్ సిబ్బంది , గార్డులు గార్గ్ దానిని ధరించాలని పట్టుబట్టారు. గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించాడు, కానీ కొన్ని సెకన్ల తర్వాత, దాని సైజ్ సరిపోకపోవడంతో అతనికి ఈత కొట్టడం కష్టంగా ఉందని పేర్కొంటూ దానిని తీసివేసాడట. దీంతో గార్గ్‌తో సహా 18 మంది స్కూబా డైవింగ్ వెళ్లారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించని జుబీన్మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాడు. లైఫ్‌గార్డ్‌లు వెంటనే CPR ఇచ్చి, గార్గ్‌ను సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారని,అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. గాయకుడితో పాటు వచ్చిన వారిని సింగపూర్ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గార్గ్ భార్యకు, కుటుంబానికి సంతాపం తెలిపారు. জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025కన్నీరుమున్నీరుగా భార్యసంగీత పరిశ్రమకు జుబీన్ అందించిన సేవలు, కృషి సాటిలేనిది. హిందీ, బెంగాలీ , అస్సామీ భాషలలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జుబీన్ అభిమాని అయిన గరిమా 2002లో అతణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రమాదంలో జరగకపోయి ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అకాల మరణం అభిమానుల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. జుబీన్ భార్య గరిమా సైకియా శోకం వర్ణనాతీతం. ఆయన పెంపుడుకుక్క కూడా విషణ్ణ వదనంతో కనిపించింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో అభిమానులను మరింత విషాదంలోకి నెట్టేశాయి. -
సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత
గౌహతి: ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్(52) కన్నుమూశారు. సింగపూర్‌లో శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు సహచరులు సీపీయూ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ జుబీన్ తుదిశ్వాస విడిచినట్లు నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్కానూ మహంత వెల్లడించారు. ‘యా అలీ’గా ప్రసిద్ధుడైన జుబీన్ గార్గ్ ఈ వేడుకలో పాల్గొనడం కోసమే బుధవారం ఇండియా నుంచి సింగపూర్ చేరుకున్నారు. స్థానికంగా స్థిరపడిన అస్సాం ప్రజలతో కలిసి స్కూబా డైవింగ్ కోసం పడవలో బయలుదేరారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రారంభమైన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మూడు రోజులపాటు జరగాల్సి ఉండగా, జుబీన్ గార్గ్ మృతి నేపథ్యంలో ఈ వేడుకలు రద్దు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. జుబీన్ గార్గ్‌కు భార్య ఉన్నారు. ఆయన 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించడం గమనార్హం. అస్సామీ భాషలో తన పాటలతో అలరించారు. అనామిక, మోనోర్ నిజానోత్, మాయ, ఆశా, ముజాలిర్ ఎజోనీ సువాలీ తదితర అల్బమ్లు విడుదల చేశారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు. గదర్, దిల్ సే, డోలీ సజా కే రఖ్నా, ఫిజా, కాంటే, జిందగీ తదితర హిందీ చిత్రాల్లో ఆయన తన గళం వినిపించారు. అస్సాం సంస్కృతికి ప్రతీకగా నిలిచారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పలు సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగస్వామి అయ్యారు. కళాగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకున్నారు. గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగంలో ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్లాఘించారు. జుబీన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. జుబీన్ మృతికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
అస్సాం రైఫిల్స్‌పై దాడి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్ సబాల్ లెయ్కై సమీపంలో పారామిలటరీ దళం ‘అస్సాం రైఫిల్స్’ వాహన శ్రేణిపై గుర్తుతెలియని వ్యక్తులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని మణిపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి 33 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంలో బిష్ణుపూర్‌కు బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 5.50 గంటలకు వాహనాన్ని సాయుధ దుండగులు చుట్టుముట్టి కాల్పులు జరిపి, తక్షణమే అక్కడి నుంచి పరారయ్యారు. ఇంఫాల్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిని నాయక్ సుబేదార్ శ్యామ్ గురూంగ్, రైఫిల్‌మేన్ కేశాప్గా గుర్తించారు. గాయపడినవారిని సమీపంలోని ‘రిమ్స్’కు తరలించారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. దాదాపు ఐదుగురు వ్యక్తులు తమపై కాల్పులు జరిపారని గాయపడిన జవాన్ ఎన్.నాంగ్థాన్ చెప్పాడు. ప్రధాన రహదారిపై చుట్టుపక్కల జనం ఉండడంతో తాము అప్రమత్తంగా వ్యవహరించామని, వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించలేకపోయామని వెల్లడించాడు. మాజీ సీఎం ఎన్.బీరేన్‌సింగ్ ‘రిమ్స్’లో బాధితులను పరామర్శించారు. గాయపడిన జవాన్లు మణిపూర్, అస్సాం, సిక్కిం, మేఘాలయా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మోదీ వచ్చి వెళ్లిన వారం రోజులకే.. భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారమే మణిపూర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి కారణం ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. తీవ్రవాద సంస్థలు ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇది మణిపూర్‌పై దాడి: బీరేన్ సింగ్ అస్సాం రైఫిల్స్‌పై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన హింసాకాండ అని పేర్కొన్నారు. ఈ మేరకు మణిపూర్ రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు జవాన్లు మృతిచెందడం పట్ల గవర్నర్ విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్రూరమైన దాడులను సహించే ప్రసక్తే లేదని, దుండగులను శిక్షించడం ఖాయమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. తాజా దాడి పట్ల మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది సాక్షాత్తూ మణిపూర్‌పై జరిగిన క్రూరమైన దాడిగా అభివర్ణించారు. అస్సాం రైఫిల్స్ సిబ్బంది ప్రాణత్యాగం ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. వారిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించక తప్పదని తేల్చిచెప్పారు. రెండేళ్లుగా ఘర్షణలు మణిపూర్‌లో రెండు ప్రధానమైన జాతులైన కుకీలు, మైతేయీల మధ్య 2023 మే నెల నుంచి ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 260 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 13 పోలీసు స్టేషన్ల పరిధిలో మినహా రాష్ట్రమంతటా సైనిక దళాల(ప్రత్యేక అధికారాల) చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) అమల్లో ఉంది. శుక్రవారం కాల్పులు జరిగిన నంబోల్ ఏరియాలో ఈ చట్టం అమల్లో లేదు. శుక్రవారం ఉదయం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించారు. ఓ కేసులో 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినందుకు ఆందోళనకు దిగారు. అస్సాం రైఫిల్స్‌పై దాడికి స్థానిక తీవ్రవాద సంస్థలే కారణం కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్‌కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్‌గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్‌నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
అసోం మహిళా అధికారి ఇంట్లో నోట్ల కట్టలు..
-
ఆమె ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల విలువున్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. భారీ అవినీతి ఆరోపణల నడుమ.. చీఫ్‌మినిస్టర్ స్పెషల్ విజిలెన్స్ సెల్ బృందం సోమవారం గువాహతిలోని నుపూర్ బోరా(28) నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే అధికారికంగా రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్ చేశారు. అలాగే.. బార్పేటలో ఉన్న అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆమెను అరెస్ట్ చేసి అవినీతి భాగోతం మీద ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించింది. గోలాఘట్‌కు చెందిన నుపుర్ బోరా.. 2019లో అస్సాం సివిల్స్ సర్వీస్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయిమరి జిల్లా కంరూప్‌లో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక.. నుపూర్ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. నుపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మరోపక్క.. కేఎంఎస్ఎస్(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్పేట రెవెన్యూ సర్కిల్లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అబియోగాలు ఉన్నాయి. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్‌ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది. -
చొరబాటుదారులకు మద్దతా?
గౌహతి: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి, నుమాలీగఢ్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు ‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్‌ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్‌కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి. ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం. ‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే. దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.ఆ గరళం గొంతులో దాచుకుంటా నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి. మోదీకి బహుమతిగా పెయింటింగ్లుఅస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్‌లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్‌లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
అస్సాంలో భూకంపం
దిస్పూర్: అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం అస్సాంలో 5.71 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని జీఎఫ్జెడ్ తెలిపింది.అస్సాంలోని గౌహతిలో సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర బెంగాల్,పొరుగున ఉన్న భూటాన్ వరకు సంభవించాయి. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. తూర్పు హిమాలయ సింటాక్సిస్‌లో యురేషియన్, సుండా ప్లేట్ల కలయిక వద్ద అస్సాం ఉంది. కాబట్టే అస్సాంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని రోజుల తర్వాత ఇవాళ మరోసారి భూమి కంపించడం గమనార్హం. -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్‌తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్‌ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
దేశంలోనే తొలి మహిళా మావటి..!
సాధారణంగా గజరాజులను మచ్చిక చేసుకునేది మగవారే. ఆ వృత్తిలో కొనసాగేది కూడా పురుషులే. కానీ అలాంటి వృతిలో ఓ మహిళ కొనసాగడమే గాక, ఎన్నో ఏగులను సంరక్షించి ఎన్నో అవార్డులే కాదు, రాష్ట్రపతిచే సత్కారం కూడా పొందారామె. అంతేగాదు ఆమెను హస్తి కన్య లేదా ఏనుగుల కుమార్తె అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె దేశంలోనే తొలి మహిళా మావటి. ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. ఆమెనే అస్సాంకు చెందని పర్బతి బారువా. ఐదు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, సంరక్షించడానికి అంకితం చేసింది. చారిత్రాత్మకంగా పురుషులే కొనసాగుతున్న వృత్తిలోకి వచ్చి సత్తా చాటడమే గాక ఏళ్లనాటి మూసధోరణిని చేధించారామె. మహిళ మావాటిగా ఆమె ప్రస్థానం కేవలం అసామాన్య ధైర్యసాహాసాలకు సంబంధించినదే కాదు, ఏనుగుల పట్ల భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాన్ని ఆధ్యాత్మిక గౌరవానికి, జ్ఞానానికి చిహ్నం కూడా.ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..మార్చి 14, 1953న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించిన పర్బతి. గౌరీపూర్ చివరి పాలకుడు దివంగత ప్రకృతిష్ చంద్ర బారువా కుమార్తె. ఆమె తండ్రి వేటగాడు, ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో మంచి నిపుణుడు కూడా. అలా ఆమెకు ఏనుగులను మచ్చిక చేసుకోవడం వంశపారంపర్యంగా అబ్బిన విద్యగా పేర్కొనవచ్చు. ఆమె గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. అయినా ఆమె అటు విద్యారంగం, ఇటు ప్రజాసేవను కాకుండా వంశపారంపర్య అభిరుచి వైపుకే మగ్గడం విశేషం.14 ఏళ్లకే ఆ నైపుణ్యం..ఇక పర్బతి 14 ఏళ్ల ప్రాయంలోనే అస్సాంలోని కొచుగావ్ అడవి ఏనుగును మంచిక చేసుకుని దాని బాగోగులు చూసుకునేది. అలా 1975 నుంచి 1978 వరకు సంప్రదాయ అస్సామీ టెక్నిక్ షికార్ని ఉపయోగించి ఏకంగా 14 అడవి ఏనుగులను విజయవంతంగా మచ్చిక చేసుకుందామె. ఇక్కడ ఏనుగులను ట్రాంక్విలైజర్లతో అపస్మారక స్థితికి తీసుకువచ్చి మచ్చిక చేసుకోరు. లాస్సో పద్ధతిలో ఒక విధమైన తాడుతో బంధించి మచ్చిక చేసుకుంటారు.మచ్చిక చేయడం, కేర్‌టేకర్‌గా..అలా ఆమె అస్సాం, పశ్చిమ ెబెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో పనిచేసింది. అక్కడ మవాటిగా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ామానవులు-ఏనుగుల సంఘర్షణకు అడ్డుకట్ట వేయడం, గాయపడిన ఏనుగులు లేదా అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు ఔషధ మూలికలతో చికిత్స అందించడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఏనుగులు మానవులకంటే మంచివా అని ప్రశ్నించగా..నూటికి నూరు శాతం ఏనుగులే మంచివని నిర్మొహమాటంగా చెప్పేశారామె. అవి కూడా మానవుల మాదిరిగానే ప్రత్యేక మనస్తత్వంతో ఉంటాయట. కొన్ని అత్యంత సహనంగా, మరికొన్ని తెలివిగా, లీడర్లుగా ఉంటాయట. వాటి సహనం హద్దు దాటిపోతేనే విజృంభిస్తాయట. అవి తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ హాని చేయదని అన్నారామె.అంతర్జాతీయంగా ఆమె సేవలు..ఆమె నైపుణ్యాలు, సేవలు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఆమె 2001లో బ్యాంకాక్ నుంచి తమిళనాడు, జల్దపారా, ఉత్తర బెంగాల్‌లోని వర్క్‌షాప్‌ల వరకు ఏనుగులపై ప్రపంచ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఆసియాటిక్ ఏనుగుల స్థితిపై పరిశోధనకుగానూ సహాయసహకారాలు అందించింది. ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్‌లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.సత్కారాలు, అవార్డులు..ఆమె అవిశ్రాంత కృషికి, పర్బతి బారువాను అనేక అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ (1989).అస్సాం ప్రభుత్వం ప్రదానం చేసే గౌరవ చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ ఆఫ్ అస్సాం (2003).అస్సాం అత్యున్నత పౌర గౌరవం అసోం గౌరవ్ అవార్డు (2023) నేచర్స్ వారియర్ జ్యూరీ అవార్డు (2023)తో సహా వన్యప్రాణులు, పరిరక్షణ సమూహాలకు సంబంధించిన జీవితకాల సాధన గుర్తింపులు.2024లో పర్బతి ఏనుగుల సంక్షేమానికి ఆమె చేసిన కృషికి గాను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.(చదవండి: Weight loss story: మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!) -
‘18 ఏళ్ల వారికి ఆధార్ ఆపేస్తున్నాం’
గువాహటి: అసోంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్ కార్డుల జారీని అక్టోబర్ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు.అయితే, ఇప్పటి వరకు ఆధార్ పొందని 18 ఏళ్లు పైబడిన వారికి నెల గడువు ఇస్తున్నామని, ఈలోగా వారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీలకు మాత్రం మరో ఏడాది వరకు ఆధార్ జారీ చేస్తారని వివరించారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి గుర్తించి, వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు మతం వంటి ప్రాతిపదికలేవీ లేవని స్పష్టం చేశారు. ఇక, ఆధార్ నమోదుకు ఎటువంటి వయో పరిమితి లేదని, అప్పుడే పుట్టిన శిశువుకు సైతం ఆధార్ నమోదు చేయించవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది. -
భర్తను కడతేర్చిన భార్య.. పోలీసులే షాకయ్యేలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు. గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్‌ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.ఢికొట్టి..ఆపై పారిపోయి..ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది. నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం తీసిన నిజాయితీ.. విచారణకు సీఎం ఆదేశం
దిస్పూర్: విధి నిర్వహణలో నిజాయితీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణం తీసింది. ప్రాజెక్ట్‌లు పూర్తి కానప్పటికీ.. పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాధితురాల్ని ఆమె సీనియర్ ఉద్యోగులు వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల్ని వివరిస్తూ ఓ లేఖను రాసింది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నా పని ఒత్తిడి కారణంగా నేను ఈ చర్య తీసుకుంటున్నాను. ఆఫీసులో నాకు అండగా ఎవరూ లేరు. పూర్తిగా అలసిపోయాను నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు’అని సూసైడ్ నోట్లో రాశారు.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా, ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్‌లో పనిచేస్తున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డిఓ) అమీనుల్ ఇస్లాంలను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన. ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట. ఎదురైన ఇబ్బందులు..విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్‌లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్‌లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు. ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్‌లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్‌పోస్ట్‌లు దాటి కాబూల్‌కి వెళ్లినట్లు తెలిపారు. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట. అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్‌కి పయనమైనట్లు తెలిపారు. ఓ పెనువిషాదంలో..2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్‌గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్‌పైనే చుట్టొచ్చారు.(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్‌గా..) -
భర్తను కడతేర్చి.. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి..
గౌహతి: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలను అంతమొందిస్తున్న భార్యలకు సంబంధించిన ఉదంతాలు విరివిగా వినిపిస్తున్నాయి. తాజాగా అసోంలోని గౌహతిలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు భర్త హత్యకు దారితీసింది.గౌహతి పోలీసులు భర్తను హత్యచేసిన భార్యను అదుపులోకి తీసుకున్న దరిమిలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నిందితురాలు రహిమా ఖాతున్(38), ఆమె భర్త సబియాల్ రెహమాన్ (40)తో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. సబియాల్ రెహమాన్ స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 26న అతను తన పని ముగించుకుని, పాండు ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం.. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో తలెత్తిన ఇంటి గొడవ దాడులకు దిగేవరకూ కొనసాగిందని రహీమా చెప్పింది. ఈ నేపధ్యంలోనే భర్త హతమయ్యాడని పేర్కొంది. కాగా భర్త మృతదేహాన్ని ఆమె ఇంటి ఆవరణలో ఐదు అడుగుల లోతున గొయ్యి తవ్వి, దానిలో పూడ్చిపెట్టిందని సమాచారం. ఆ జంటకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా రెహమాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విచారణలో నిందితురాలు తొలుత తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని తెలిపింది. తరువాత మాటమార్చి, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్బరి పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. మర్నాడు పోలీసులు రహిమా ఖాతున్ను విచారించగా తమ దంపతుల గొడవల్లో భర్త మరణించాడని చెప్పింది. ఆ తర్వాత తాను భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.ఫోరెన్సిక్ నిపుణులు, మేజిస్ట్రేట్‌తో కూడిన పోలీసు బృందం వారి ఇంటి ఆవరణలోని గొయ్యిలో నుంచి కుళ్లిపోయిన మృతదేహ అవశేషాలను వెలికి తీసింది. రహీమా ఒక్కర్తే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ స్వయంగా ఇంత పెద్ద గొయ్యిని తవ్వే అవకాశం లేదని, ఇతరుల ప్రమేయం ఉండవచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. -
ప్రియుడితో భార్య జంప్.. పాల స్నానంతో భర్త సంబరాలు
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు. -
ప్రియురాలిని రూమ్‌లో లాక్ చేసి.. ఆపై ప్రియుడు..
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది. కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్‌జ్యోతి తలుక్దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్‌లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్‌లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారువీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. -
అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!) -
అస్సాం ట్రిప్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. (ఫోటోలు)
-
అసోంలో తగ్గని వరద తీవ్రత
గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. -
బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
గువాహటి: పహల్లాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారత్ అనేక చర్యలను చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌ను పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో భారత్ పలు ఆంక్షల్ని అమలు చేసింది. అందులో పాకిస్తాన్ జాతీయుల్ని తక్షణమే దేశం విడిచి వెళ్లాపోవాలనే ఆంక్షలతో పాటు సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలుపుదల చేసింది. ఆపై ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది భారత్. అయితే సింధూ జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. సింధూ జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్‌కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్. బ్రహ్మపుత్రా నదీ జలాలను భారత్‌కు చైనా నిలిపివేస్తే అంటూ కొత్త రాగం అందుకుంది. అసలు బ్రహ్మపుత్రా నదికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండానే భారత్‌ను బెదిరించాలనే యత్నం చేసిందిదీనికి భారత్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సా ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అసలు పాకిస్తాన్ చేసిన ఆరోపణలు అర్థంపర్థంలేనివిగా కొట్టిపారేశారు. అదే సమయంలో అసలు బ్రహ్మపుత్రా నదీ చైనా భూభాగంలో 30 నుంచి 35 శాతం మాత్రం ఉందని, ఇక మిగిలిని 65 శాతం నుంచి 70 శాతం భారత్‌లో ఉందన్నారు. బ్రహ్మపుత్రా నదీ గురించి వాస్తవ కోణంలో ఆలోచిస్తే ప్రధానంగా మంచు కరగడం, టిబెటన్ పీఠభూమిపై పరిమిత వర్షపాతం ద్వారా నదీ జలాలు పెరగడం అనేది ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం లేదనీ, ఒకవేళ అలా చేసినా భారత్‌కు మేలు చేసినట్లే అవుతుందన్నారు. అస్సాంలో వరదలు కారణంగా ప్రతీ ఏడాది నిరాశ్రయులయ్యే వారు వేలలో ఉంటున్నారని హిమాంతా బిశ్వా శర్మ చమత్కరించారు. సాధారణంగా భారత్-చైనా సరిహద్దు(టుటింగ్)లో బ్రహ్మపుత్రా నదీ పరిమాణం సెకనుకు 2,000 నుంచి 3,000 వేల క్యూబిక్ మీటర్లు ఉంటుందని, అస్సాంలో వర్షాకాలంలో వచ్చేసరికి 15 వేల క్యూబిక్‌ల నుంచి 20 వేల క్యూబిక్‌ల ఆ నది పరిమాణం ఉంటుందన్నారు. ఇది బ్రహ్మపుత్రా నదీ ప్రవాహంలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. "బ్రహ్మపుత్ర నది అనేది ఎవరో ఒకరిచే నియంత్రించబడదు అనేది పాక్ తెలుసుకుంటే మంచిదన్నారు. What If China Stops Brahmaputra Water to India?A Response to Pakistan’s New Scare NarrativeAfter India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:“What if China stops the Brahmaputra’s water to India?”…— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025 -
ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..
గౌహతి: అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొదటి రోజున రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన సిల్చార్(Silchar)లో 24 గంటల్లో ఏకంగా 415.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. జూన్ 1న సిల్చార్‌లో కురిసిన వర్షపాతం 132 ఏళ్ల కిత్రం నాటి 290.3 మి.మీ వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఎగువకు వీస్తున్న గాలి ప్రభావం, అల్ప స్థాయి ద్రోణుల కలయిక ఈ అస్థిర వాతావరణానికి కారణంగా నిలుస్తోంది. 2022లో సిల్చార్ వరదల్లో చిక్కుకుంది. నాడు పట్టణంలోని 90 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. కాగా గత మూడు రోజుల్లో అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది మృతిచెందారు.గడచిన ఐదు రోజుల్లో మేఘాలయ అంతటా భారీ వర్షపాతం నమోదైంది. మేఘాలయలోని 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. మణిపూర్‌లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన వరదల కారణంగా 19 వేల మందికి పైగా ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: ‘స్పైడర్స్ వెబ్’ సక్సెస్: దాడుల వివరాలు షేర్ చేసిన జెలెన్స్కీ -
బ్రిటన్ గాట్ టాలెంట్ పోటీలో రన్నరప్‌గా అసోం చిన్నారి
గువాహటి: అసోంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా చెత్రీ ప్రఖ్యాత ‘బ్రిటన్ గాట్ టాలెంట్ (బీజీటీ)’ రియాలిటీ డ్యాన్స్ పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచింది. కొండప్రాంత కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బాలిక ప్రపంచ వేదికపై సత్తా చాటడం విశేషం. ఈమె ప్రతిభను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మెచ్చుకున్నారు. ఆమె ప్రదర్శన బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్ నది వరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిందని, తమను గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో బ్రిటిష్ మెజీíÙయన్ హ్యారీ మౌల్డింగ్ విజేతగా నిలిచాడు. ఎల్ఈడీ డ్యాన్స్ గ్రూప్ రెండో స్థానంలో నిలిచింది. బీజీటీ ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలు బినితాయేనని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బినితా స్వగ్రామం పేరు టల్బాలిజన్. తండ్రి అమర్ చెత్రీ ఊళ్లో చిన్న కోళ్లఫారం నడుపుతుంటారు. బినితా ప్రిపరేషన్ కోసం కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ రూ.5 లక్షలు సాయంగా అందజేసింది. -
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే.. -
గౌహతి నీట మునక.. అంతటా రెడ్ అలర్ట్
గౌహతి: అస్సోంలోని గౌహతి(Guwahati)లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఫలితంగా నగరంలో జనజీవనం స్థంభించిపోయింది. చాంద్‌మరి, హతిగావ్, సిజుబారి, రుక్మినిగావ్, బెల్టోలా, నబిన్ నగర్, రాజ్‌గఢ్ తదితర ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలు, సంభవిస్తున్న వరదలు రహదారులను ముంచెత్తుతున్నాయి. In view of artificial floods caused by heavy rains across the city, GMC’s teams and pumps have swung into action.Sharing visuals from Harabala Path where pumps are working at full capacity to drain floodwaters.Our Guwahati, Our Responsibility!Guwahati Municipal Corporation… pic.twitter.com/se4C7u8DjH— Guwahati Municipal Corporation (@gmc_guwahati) May 30, 2025నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, శిథిలమైన రోడ్లు పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా విధిస్తున్న విద్యుత్ నిలిపివేతలు గౌహతివాసులను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నడుము లోతు వరకూ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్(Traffic) పూర్తిగా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)రబ్బరు పడవలను ఉపయోగిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జల రవాణా శాఖ గౌహతి, ఉత్తర గౌహతి మధ్య అన్ని ఫెర్రీ సేవలను నిలిపివేసింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 31 వరకు అస్సాం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని, గంటకు 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్డీఎంఏ) కొండచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అధికారులను అక్కడి ప్రజలను అప్రమత్తం చేసింది. Relentless rains have caused artificial floods in various places. In continuation of this, today we visited Anil Nagar, Nabinnagar, Lakhimi Path, Satsang Vihar & Bhangagarh to assess the ground situation.@gmc_guwahati teams are working round the clock on water drainage! pic.twitter.com/Icy1NXUSpW— Mrigen Sarania (@mrigen_sarania) May 30, 2025ఇది కూడా చదవండి: గుంతలో పడిన కారు.. ఐదుగురు మృతి -
ఆయుధాల పందేరం!
రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవటం మొదలెట్టి 75 ఏళ్లవుతుండగా మన పాలకుల విపరీత పోకడలు దాన్ని కాస్తా భ్రష్టుపట్టించే దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని సరిహద్దులకు సమీపంగా వుండే మారుమూల ప్రాంతాల్లోని స్థానిక తెగలకూ, నివాసితులకూ ఆయుధాల లైసెన్స్లుమంజూరు చేయాలని అస్సాం మంత్రివర్గం బుధవారం నిర్ణయించటం ఆ కోవలోనిదే. సరిహద్దు ఆవలి నుంచి చొరబడి బెదిరింపులకు దిగేవారి నుంచి రక్షణ కోసం, వ్యక్తిగత భద్రత కోసం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెబుతున్నారు. ‘జాతి, నేల, స్థానికత’ కాపాడటం కోసమే ఇలా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్ పొడవునావుండే రెండు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల వాసులకు ఈ ఆయుధాల లైసెన్స్‌లు లభిస్తా యని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాలన్నిటా ముస్లింల జనాభా ఎక్కువ. ఇప్పుడు జనం చేతికి తుపాకులందితే మత ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా తుపాకులు మాట్లాడటం మొదలవుతుంది. ఇది ప్రభుత్వానికి మంచిదేనా? 1985 నుంచీ ఆ ప్రాంతాలవారు ఈ లైసెన్స్‌ల కోసం డిమాండ్ చేస్తుంటే గత ప్రభుత్వాలేవీ సాహసించలేదని, వాటికి ధైర్యంలేదని శర్మ వివరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది తమకు రక్షణ, భద్రత కల్పిస్తాయని, మౌలిక సదుపాయల కల్పనపై శ్రద్ధ పెడతాయని, తమ బతుకులు మెరుగుపరచటానికి అవసరమైన పథకాలు రూపొందిస్తాయని ఆశించబట్టే! ఇంతకూ ‘ధైర్యం లేని’ గత ప్రభుత్వాల్లో తాను మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలున్నట్టేనా? ఆ కాలాల్లోని ప్రభుత్వాలకు ‘ధైర్యం’ కలిగించేందుకు తాను చేసిందేమిటి? తాను విఫలమైన పక్షంలో దానిపై నిలదీయకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయినట్టు? దాదాపు పాతికేళ్లుగా శర్మ రాజకీయాల్లో వుంటున్నారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్ నుంచి తప్పుకోవటానికి కూడా కారణం ఆ సర్కార్‌కు ధైర్యం లేదని కాదు. తన రాజకీయ ఎదుగుదలకు అప్పటి సీఎం తరుణ్ గొగోయ్ అడ్డంకిగా మారటం! దీన్నంతటినీ రాహుల్‌గాంధీని కలిసి మొరపెట్టుకోవాలని శర్మతీవ్రంగా ప్రయత్నించారు. కానీ జనాదరణగల యువ నాయకుల కన్నా పీఠాధిపత్యం నెరపే వృద్ధ తరం నేతలకే పెద్దపీట వేసే సంస్కృతిగల కాంగ్రెస్‌లో అది సాధ్యపడలేదు. నేపథ్యం ఏమైనా బీజేపీలో శర్మ బాగా రాణించారు. ఏనాటినుంచో ఆ పార్టీలో వున్న నేతలను తలదన్నే విధంగా ప్రకటనలిచ్చి వివాదాస్పదుడూ అయ్యారు. అందువల్ల పార్టీలో ఆయన పట్టు పెరిగింది గనుకే 2021లో బీజేపీ అధిష్ఠానం శర్మను అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కానీ గత ప్రభుత్వాలు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వకపోవటానికి వాటికి ధైర్యం లేకపోబట్టే అని ఆయన దేని ఆధారంగా నిర్ణయానికొచ్చారో చెప్పలేదు. శర్మ చెబుతున్న ప్రకారం ఆ ప్రభుత్వాలు సాహసించలేక పోబట్టి చాలామంది స్థానిక తెగలవారు బయటి వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగి భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. అక్కణ్ణించి వలసలు పోవాల్సి వచ్చింది. మరి ప్రభుత్వాల వైఖరి వల్ల జనం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆయన మౌనంగా మిగిలిపోవటం ఎందువల్ల?హిమంత గ్రహించాల్సిన విషయం ఒకటుంది. గతంలో ప్రజల నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వాలు ఆయుధ లైసెన్సులివ్వకపోవటానికి కారణం ధైర్యం లోపించి కాదు. అది అనైతికమూ, రాజ్యాంగ విరుద్ధమూ అని విశ్వసించటం వల్ల! అమెరికాలో పౌరులెవరైనా ఆయు ధాలు కొనుక్కోవచ్చు. అందుకు కొన్ని నిబంధనలున్నా ఆచరణలో అవి ఏమవుతున్నాయో అక్కడ తరచు జరిగే ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. అక్కడ సగటున 100 మంది పౌరులకూ 120.5 తుపాకులున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు తుపాకీ మరణాలు 30,000 మించాయి. అకారణంగా లేదా భయపడి తరచు అవతలివారిని చంపుతున్న ఉదంతాలు ఎక్కువ. ఆ దేశంలో కూడా హిమంత ప్రభుత్వం ఏకరువు పెడుతున్న నిబంధల వంటివే వున్నాయి. మానసికంగా సక్ర మంగా వుండి అవతలివారి నుంచి ప్రాణభయం ఉన్న 21 ఏళ్లు పైబడినవారందరికీ లైసెన్సులిస్తా మని హిమంత చెబుతున్నారు. ఏదైనా కేసులో శిక్షపడినా, శాంతికి దోహదపడతామని గతంలో ప్రభుత్వానికి బాండు రాసిచ్చినా అనర్హులవుతారట. అంతేగాక మానసికంగా, శారీరకంగా సరైన స్థితిలో వున్నవారికే లైసెన్సులు జారీచేస్తారట. ఒకసారంటూ కళ్లెం వదిలాక ఇవన్నీ నిజాయతీగా, చిత్తశుద్ధిగా అమలవుతాయా? అనుమానమే!అస్సాం మొదటినుంచీ సమస్యాత్మక రాష్ట్రం. అక్రమంగా చొరబడిన విదేశీయులను వెనక్కిపంపాలంటూ ఉవ్వెత్తున లేచిన విద్యార్థి ఉద్యమం, అటుతర్వాత ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థల ఆగడాలు తెలియంది కాదు. నిత్యం అపహరణలు, డబ్బు దండుకోవటం, హత్యలు ఒకప్పుడు చాలా అధికం. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు, పోలీసులు ఉల్ఫా ఆటకట్టించాక అవి చాలావరకూ తగ్గిపోయాయి. ఇప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తుంటారు. సమస్య వుందనుకుంటే మరింతమందిని నియమించి, పటిష్ఠమైన పర్యవేక్షణ అమలు చేయటం పెద్ద కష్టం కాదు. అందుకు భిన్నంగా లైసెన్సులిస్తామంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కాదా? ఇలాంటి కారణాల వల్లే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో సుప్రీంకోర్టు సల్వాజుడుంను రద్దుచేసింది. పైగా అస్సాంకు భారీయెత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెబుతూ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి విధానం అమలు చేయటం సరైందేనా? హిమంత ఆలోచించాలి. -
పర్యాటకులపై రైనో దాడియత్నం.. వీడియో వైరల్
దిబ్రూగఢ్: సరదాగా నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లిన పర్యాటకలకు ఊహించని పరిణామం ఎదురైంది. పర్యాటకులు పార్కులో సంచరిస్తున్న సమయంలో ఓ ఖడ్గమృగం వారి వాహనంపైకి దూసుకెళ్లింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో, అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అసోంలోని మానస్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకచోట ఆగిన పర్యాటకులు.. అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఖడ్గమృగం.. పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా.. పర్యాటకులు ఉన్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు, వెనక్కు లాగుతూ.. వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం ఇలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అనంతరం, కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. In Manas National Park in Assam, this furious rhino has attacked a tourist vehicle no less than five times.Each day, rhino charges at the mere sight of humans.The reason behind its anger toward people remains a mystery. pic.twitter.com/mE3V6TT04z— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) May 29, 2025 -
ఆ చిన్నారి ప్రతిభకి బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఫిదా..!
బ్రిటన్స్ గాట్ టాలెంట్ (బీజీటీ) అనేది బ్రిటన్ టెలివిజన్ టాలెంట్ షో. ఈ వేదికపై తమ ప్రతిభను చూపించుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది యువత. ఈ ప్రపంచ వేదికపై ఫేమస్ అయిన ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ షోకి ఉన్న ఆదరణ, క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ షోలో మన భారతదేశం నుంచి చాలామంది తమ టాలెంట్ చూపించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. అయితే ఈ సీజన్ ఎపిసోడ్లోలో ఈశాన్య భారతదేశం నుంచి తొమ్మిదేళ్ల బినితా చెట్రి ఫైనల్‌కి చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టాలెంట్ షో సెమీ ఫెనల్స్లో బినితా అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక బినితాకి అధిక ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఇన్‌స్టాలో ఆ చిన్నారి బినితా.."ఆ ప్రోగ్రామ్ తాలుకా ఫోటోలను షేర్ చేస్తూ..ప్రతి క్షణం గొప్పగా ఉంది. మీ అందరి సపోర్టు లేకుండా ఇదంతా చేయలేను." అని పోస్టులో రాసుకొచ్చింది. కాగా, అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇవ్వాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తన తండ్రితో కలిసి యూకేకి వెళ్లింది. అక్కడ ప్రదర్శన ఇచ్చే ముందు జడ్డీలతో ఇచ్చిన సంభాషణలో అమాయకంగా మాట్లాడిన ఆ చిన్నారి మాటలు అందర్నీ విస్మయానికి గురి చేశాయి. ఈ పోటీలో గెలిచి.. పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనేది తన కోరికని అత్యంత అమాయకంగా చెప్పడం విశేషం.ఆ ముద్దు మాటలు అందరి మనసులను దోచుకున్నాయి. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెట్రీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆమె ప్రతిభను ప్రశంసించారు. "యూకేలో అస్సాం ప్రతిభ ప్రకాశిస్తోంది. ఈ లిటిల్ బినితా న్యాయనిర్ణేతలు అందరూ ఆహా అనేలా శక్తిమంతమైన ప్రదర్శన ఇచ్చింది.ఆ చిన్నారి కచ్చితంగా తదుపరి రౌండ్‌కి వెళ్తుంది. అలాగే ఆమె కోరుకున్నట్లుగా పింక్ ప్రిన్సెస్ ఇంటిని కొనుగోలు చేయగలదని ఆశిస్తున్నా. "అని పోస్టులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి హిమంత. ఇక చెట్రి తదుపరి పోటీలో దాదాపు తొమ్మిది మంది ఫైనలిస్ట్‌లో పోటీ పడనుంది. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
బంగ్లాకు రెండు ‘చికెన్ నెక్‌లు’: మ్యాప్ షేర్ చేసిన అస్సాం సీఎం శర్మ
గౌహతి: బంగ్లాదేశ్‌ను ఈశాన్య రాష్ట్రాలలో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్(Chicken Neck Corridor)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన ‘చికెన్ నెక్’లు ఉన్నాయని, అవి మరింత దుర్భలమైనవని శర్మ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గల ‘చికెన్స్ నెక్’ గురించి ముహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యల దరిమిలా సీఎం శర్మ ఈ విధంగా స్పందించారు.బంగ్లాదేశ్(Bangladesh)లోని మొదటి ‘చికెన్ నెక్’ దఖిన్ దినాజ్‌పూర్ అని, ఇది నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ అని పేర్కొన్నారు. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే రంగ్‌పూర్ డివిజన్‌ను బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేయవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఈ రహదారిని చూపించే మ్యాప్‌ను ఆయన పంచుకున్నారు. రెండవది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని శర్మ తెలిపారు. భారతదేశానికున్న చికెన్ నెక్ కంటే చిన్నగా ఉన్న ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక లింక్ అని ఆయన చిట్టగాంగ్ -ఢాకాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.భారతదేశంలోని సిలిగురి కారిడార్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లోనూ రెండు ఇరుకైన కారిడార్లు ఉన్నాయని సీఎం అన్నారు. కొంతమంది మరచిపోయిన భౌగోళిక వాస్తవాలను తాను గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. గత మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు విస్తరించడాన్ని ఆహ్వానిస్తూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’(Seven Sisters’) అని అంటారని, ఇవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితంగా ఉన్నాయని, అక్కడి వారికి సముద్ర తీరాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలు లేవని యూనస్ వ్యాఖ్యానించారు. అందుకే మేమే వారికి రక్షకులం అని వ్యాఖ్యానించారు. ఇది బంగ్లాదేశ్‌కు పలు అవకాశాలను అందిస్తుందని, చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించడంలో ఇది అనుకూలంగా ఉంటుందని యూనస్ పేర్కొన్నారు.దీనిపై స్పందించిన సీఎం శర్మ ఈ ప్రకటనను అభ్యంతరకరమైనదిగా, తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యూనస్ ప్రకటన దరిమిలా చికెన్స్ నెక్ కారిడార్ కింద, చుట్టూ మరింత బలమైన రైల్వే , రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసమని పేర్కొన్నారు. అలాగే చికెన్స్ నెక్‌ను దాటేందుకు, ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని సీఎం అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ యూనిస్ చేసిన ప్రకటనలను తేలికగా తీసుకోకూడదని, వారి వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయని సీఎం శర్మ పేర్కొన్నారు. కాగా బారతదేశంలోని ఈ‘చికెన్ నెక్’ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. ఇరుకుగా ఉన్న కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని భౌగోళిక ఆకారం కారణంగా దీనిని ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. ఈ మార్గానికి ఉత్తరాన నేపాల్, భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి.ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే.. -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
తల్లే హంతకురాలు.. కొడుకుని ముక్కలు ముక్కులుగా నరికి.. సూట్‌కేస్‌లో కుక్కి
గౌహతి: ఓ అమ్మ పేగు బంధాన్ని తెంచుకుంది. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించిన ఆ తల్లి ప్రియుడి మోజులో పడి తన పదేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా కడతేర్చింది. కఠినాత్ములను సైతం కంటతడి పెట్టించే ఈ ఘటన అస్సాం రాష్ట్రం గౌహతిలో చోటు చేసుకుంది.గౌహతికి చెందిన దీపాలి రాజ్బోంగ్షి ఓ క్లీనిక్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమారుడు 10ఏళ్ల మృణ్మోయ్ బర్మన్ నవోదయ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో దీపాలి గౌహతి పోలీసుల్ని ఆశ్రయించింది. ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణం సమీపంలో అనుమానాస్పద సూట్‌కేస్ గురించి సమాచారం అందింది. స్క్రాప్ దుకాణం యజమాని ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూశారు. అంతే సూట్‌కేస్ లోపల ముక్కులు, ముక్కులగా ఉన్న మానవ శరీర భాగాల్ని చూసి కంగుతిన్నారు. ఫోరెన్సిక్ టీంను సైతం కేసులో ఇన్వాల్వ్ చేశారు.ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో సూట్‌కేస్‌లో ఉన్నది బాలుడి శరీర భాగాలేనని నిర్ధారించారు. మరి బాలుడిని ఎవరు హత్య చేశారు? బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే దిశగా ఆరా తీశారు. ముందుగా బాలుడి కుటుంబంలో గొడవలే హత్యకు దారి తీశాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విచారించారు.అయితే విచారణలో తల్లి తీరుపై పోలీసులకు అనుమానం వేసింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఓ ప్రభుత్వ సంస్థలో తాత్కాలికంగా ప్యూన్‌గా పనిచేస్తున్న ప్రియుడు జ్యోతిర్మయి హలై కలిసి కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసిందని తేల్చారు.కొంతకాలం క్రితం దీపాలికి, జ్యోతిర్మయి హలైల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని దీపాలి నిశ్చయించుకుంది. రెండు నెలల క్రితం తన భర్తకు విడాకులిచ్చింది. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న కొడుకును కడతేర్చింది. చివరికి కటకటాలపాలైంది. -
'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి
ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారతీయ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టాప్‌లో ఉంటుంది. అయితే, సీజన్- 3లో నటించిన నటుడు రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సాం గర్భంగ అటవీప్రాంతంలోని జలపాతం వద్దకు రోహిత్ బస్ఫోర్ వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ హత్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కుమారుడితో గొడవ పడ్డారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్‌ను ట్రిప్‌కు వెళ్దాం అంటూ జిమ్ యజమాని అమర్దీప్ ఆహ్వానం మేరకే వెళ్లాడని వారు పోలీసులకు తెలిపారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే తమ కుమారుడిని హత్య చేశారని వారు చెబుతున్నారు. గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపైనే కాకుండా తల, ముఖం ఇతర భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ బస్ఫోర్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ త్వరలో విడుదల కానుంది. -
‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’
దిస్పూర్: అస్సాం రాష్ట్రంలో అక్రమ బొగ్గు మైనింగ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేల్(ఈడీ) దాడులు చేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది రాష్ట్ర అంశాలను వదిలి వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది.అక్రమ బొగ్గు మైనింగ్ మీ కనుసన్నల్లోనే..‘అస్సాం బొగ్గు మైనింగ్ లో ఈడీ రూ. 1.58 కోట్లు సీజ్ చేసింది. తప్పుడు పత్రాలతో 1200 టన్నుల అక్రమ బొగ్గు మైనింగ్ ప్రతీరోజూ జరుగుతుంది. ఇదంతా సీఎం హిమాంత బిశ్వా కనుసన్నల్లోనే జరుగుతుంది’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ.మీ పిల్లలకు భారత పౌరసత్వం లేదు.. ఎందుకు?‘ ఏం మాట్లాడుతున్నావ్ గొగోయ్. మీ భార్య ఎలిజిబెత్ కోల్ బర్న్ గొగోయ్ పాకిస్తాన్ ఎన్జీవో సంస్థ నుంచి శాలరీ తీసుకోవడం నిజం కాదా.. మీ పిల్లలకు భారత పౌరసత్వం కూడా లేదు’ అంటూ మండిపడ్డారు సీఎం హిమాంత బిశ్వా శర్మ.దేనికైనా రెడీదీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తన భార్య పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటుందని, పిల్లలకు భారత పౌరసత్వం లేదనే వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇలా ఇరువురి నేతల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ⸻Questions for the Hon’ble Member of Parliament from the Congress Party:1.Did you visit Pakistan for a continuous period of 15 days? If so, could you kindly clarify the purpose of your visit?https://t.co/a83u47Zq6L it true that your wife continues to receive a salary from a…— Himanta Biswa Sarma (@himantabiswa) April 27, 2025 Questions for the Hon’ble Chief Minister of Assam1) Will you resign if you fail to prove your allegations of me and my wife being agents of an enemy country ?2) Will you take questions on your own children and wife ?3) Will the state police arrest those linked to coal mafia… https://t.co/KEhs4h9M1R— Gaurav Gogoi (@GauravGogoiAsm) April 27, 2025 -
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
గువాహటి: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రెటిక్ ఫ్రంట్((AIUDF) ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని నోరు జారిన ఎమ్మెల్యే అనిముల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అమినుల్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 152/196/197(1)/113(3)/352/353 నమెదు చేసిన పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. బుధవారం అమినుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడంతో సుమోటో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ‘ ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు పోలీసులు.పాక్ కు సపోర్ట్ గా నిలిస్తే కఠిన చర్యలు: సీఎంఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం రాష్ట్ర సీఎం హిమాంతా బిశ్వా శర్మ స్పష్టం చేశారు. ఇందులో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంచితే, ఎమ్మెల్యే అమినుల్ వ్యాఖ్యలతో తమకు ఏమీ సంబంధం లేదని అంటోంది ఏఐడీయూఎఫ్. ఈ విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, అమినుల్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని ఏఐడీయూఎఫ్ చీఫ్ మౌలానా బదరుద్దీన్ తెలిపారు. -
ఈ బల్లులు అమ్మితే.. ఏడేళ్ల జైలు శిక్ష?
రెండు తలల పాము, ఆకర్షించే చెంబు, ‘ఇదొక కదిలే యత్రం.. ఇది చదివే మంత్రం’, రైస్ పుల్లింగ్, యాంటిక్ పీస్‌లు అంటూ జనాన్ని బురిడీ కొట్టించి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న గ్యాంగ్ లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ తరహా మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ అలవాటు పడ్డ ప్రాణం దాన్ని ఎలా వదలుకుంటుంది అన్నట్లు కొందరు దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.అవి అరుదైనవి అని చెబుతూ, వాటికి మంత్ర శక్తి ఉందని చెబుతూ, ఇది ఉంటే మీరు కోట్లకు పడగలెత్త వచ్చు అంటూ అమాయక ప్రజల్ని మోసానికి గురి చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.. గత దశాబ్ద కాలంలో ఈ తరహా మోసాలు చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు వెర్రి తలలు వేసుకుని వీటిని కొనుగోలు చేస్తూ భారీగా మోసపోతూనే ఉన్నారు. ఇదే తరహాలో అరుదైన బల్లులను అమ్మబోయి ఒక గ్యాంగ్ పోలీస్ లకు పట్టుబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగర్హ్ లో అరుదైన బల్లి జాతిగా పేర్కొనబడే టోకే గెక్కో కు చెందిన 11 బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ముఠాగా ఏర్పడిన కొందరు వీటిని అమ్మడానికి యత్నించే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో వారిని వలవేసి చాకచక్యంగా పట్టుకున్నారు. వీటిని అమ్మే ముగ్గురు స్మగ్లర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 60 లక్షలకు బేరం పెట్టుకుని వీటిని అమ్మడానికి యత్నించే సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతరించిపోతున్న బల్లి జాతిగా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టంలో పేర్కొనడంతో దీన్ని పట్టుకోవడం, అమ్మడం నేరం కిందకు వస్తుంది.నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్షఈ బల్లులను అమ్మకానికి పెట్టడం తీవ్ర నేరం కనుక, ఒకవేళ వారు నేరం చేసినట్లు రుజువైతే ఏడేళ్ల వరకూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అత్యంత అరుదుగా కనిపించే ఈ బల్లులు.. భారత్ లో మాత్రం అస్సాం, అరుణాచల్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తూ ఆగ్నేసియాలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వీటికి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉండటంతో అక్కడకు దొడ్డిదారిన తరలిస్తూ ఉంటారు.ఈ స్మగ్లింగ్ కు పాల్పడిన వారు దేబాశిస్ దోహుతియా(34), మనాష్ దోహుతియా(28), దిపాంకర్(40)లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ బల్లులను వారు అరుణాచల్ ప్రదేశ్ నుండి తెచ్చినట్లు సిట్ విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక్కో బల్లిని రూ. 60 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.ఇదొక అరుదైన బల్లి జాతిటోకే గెక్కో అనేది పశ్చిమాసియా ప్రాంతంలో కనిపించే అరుదైన బల్లి జాతి. ఇది పెద్దవిగా ఉండటమే కాదు.. వివిధ రంగుల్లో ఉంటాయి. ఇవి రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. దీన్ని చాలా చోట్ల అదృష్టంగా భావిస్తూ ఉండటంతో వాటికి డిమాండ్ లక్షల్లో ఉంటుంది. -
లవ్లీనా సహా అసోం బాక్సర్లను ఆడన్విట్లేదు: బీఎఫ్ఐ అధ్యక్షుడు
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్... సస్పెన్షన్‌కు గురైన మాజీ కార్యదర్శి హేమంత కలితాపై కొత్త ఆరోపణలు చేశారు. అసోంకు చెందిన హేమంత తమ రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బాక్సర్లను జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌లో ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బొర్గొహైన్‌తో పాటు ఇతర బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన ఆదేశించారంటూ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్ గురువారం ప్రారంభం కానుంది. ‘ఇందులో ఆడేందుకు లవ్లీనా సిద్ధమైంది. అయితే వారు పాల్గొనకుండా చూడాలని హేమంత అధికారులకు ఫోన్లు చేశారు.ఎన్నో ట్రైన్, ఫ్లయిట్ టికెట్లు రద్దు చేశారు. సహజంగానే తమ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి స్థితిలో లవ్లీనాలాంటి బాక్సర్లు పునరాలోచనలో పడ్డారు’ అని ఆయన వెల్లడించారు. దీనిని హేమంత కలితా కొట్టిపారేశారు. తాను ఏ ప్లేయర్‌ను ఆపలేదని, దానికి తనకు సంబంధం లేదన్న హేమంత...టోర్నీ కోసం ప్రకటించిన తేదీల పట్ల అసంతృప్తితో వివిధ రాష్ట్ర సంఘాలు తప్పుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దు: కోర్టు ఆదేశాలు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వివిధ రాష్ట్ర సంఘాల నుంచి ఎన్నికైన వారికి మాత్రమే ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉందంటూ బీఎఫ్ఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది.ఫలితాల ప్రకటన తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28 బీఎఫ్ఐ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 7న జారీ చేసిన నియమావళిలో తాజా నిబంధనలు ఉన్నాయి. అయితే దీనిని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌ను తమ ప్రతినిధిగా ఓటు వేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ బాక్సింగ్ సంఘం ప్రతిపాదించగా... ఆయన ఎంపికైన వ్యక్తి కాదంటూ రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారు. తాజా అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బీఎఫ్ఐని కోర్టు ఆదేశించింది. -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్‌ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్‌తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.శనివారం మంత్రి అమిత్ షా గోలాఘాట్ జిల్లా దెర్గావ్లోని లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్ నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు. -
Earthquake: అస్సాంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే..
గౌహతి: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూమి కంపించింది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 2:25 గంటలకు 5.0 తీవ్రతతో భూ ప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి. ఇది సంభవించినప్పుడు చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ ప్రకంపనలు వారిని నిద్ర నుంచి మేల్కొలిపి, ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తేలా చేశాయి.భూకంప కేంద్రం అస్సాం(Assam)లోని మోరిగావ్‌లో ఉన్నట్లు గుర్తించారు. గౌహతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మోరిగావ్‌లో 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. An earthquake with a magnitude of 5.0 on the Richter Scale hit Morigaon, Assam at 2.25 am today(Source - National Center for Seismology) pic.twitter.com/iowhZjOJHk— ANI (@ANI) February 26, 2025ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంతో పాటు, మేఘాలయ(Meghalaya), పశ్చిమ బెంగాల్, బీహార్ వరకు భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం భూకంపాల పరంగా ఈశాన్య భారతదేశం జోన్- 5లోకి వస్తుంది. ఇటువంటి జోన్ 5లో తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
అస్సాంలో నూతన శకం
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర భూమి అస్సాంలో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి, సౌభాగ్యంలో ఈశాన్య భారతదేశం కీలక పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు. ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ఈశాన్య రాష్ట్రాలు పూర్తి శక్తిసామర్థ్యాలు ప్రదర్శించబోతున్నాయని పేర్కొన్నారు. అస్సాం రాజధాని గౌహతిలో మంగళవారం ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0’ పేరిట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సదస్సును మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రెండు రెట్లు వృద్ధిచెంది, రూ.6 లక్షల కోట్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ వేగం వల్ల వచ్చే ఫలితాలేమిటో ప్రత్యక్షంగా చూస్తు న్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటకీ ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని, ఆర్థిక నిపుణులు సైతం ఈ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారని తెలి పారు. ఈ శతాబ్దంలో రాబోయే 25 ఏళ్ల ప్రగతి కోసం సుదీర్ఘ దార్శనికతతో పని చేస్తున్నామని చెప్పారు.నైపుణ్యాలు, నవీన ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్న మన యువతపై ప్రపంచ దేశాలు ఎనలేని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సప్లై చైన్లను బలోపేతం చేశామని, ప్రపంచ దేశాలతో స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. తూర్పు ఆసియాతో మనకు బలమైన అనుసంధానం ఉందని, ఇండియా–మిడిల్ ఈ స్టు–యూరప్ ఎకనామిక్ కారిడార్‌తో నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీలో ముందంజ సెమీకండక్లర్ల తయారీ రంగంలో మన దేశం ముందుకు దూసుకెళ్తుండడం శుభ పరిణామం అని ప్రధానమంత్రి తెలిపారు. సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణల కోసం ఐఐటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ ఈ దశాబ్దం ఆఖరు నాటికి 500 బిలియన్ డాలర్లకు(రూ.43.59 లక్షల కోట్లు) చేరనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి మరో 500 గిగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2030 నాటికి వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని 5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఉ్రత్పేరకంగా నిలిచేలా నేడు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి చెప్పారు. సులభతర వాణిజ్యాన్ని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణల సంస్కృతికి ఊతం ఇవ్వడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. స్టార్టప్‌లు, తయారీ రంగ పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం అద్భుతమైన విధానాలు ప్రవేశపెట్టామని తెలియజేశారు. సంస్థాగత సంస్కరణలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలన్నీ కలిసి మన దేశాభ్యుదయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..) -
గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్ -
కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేక నినాదాలు.. క్రికెట్ బ్యాట్లతో దాడి
గౌహతి: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్తోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ క్షేమంగా బయటపడగా, ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందిస్తూ ఎంపీ రకిబుల్‌కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.అస్సాంలోని నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్పై దాడి జరిగింది. రకీబుల్ హుస్సైన్ అస్సాంలో దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుపోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని గునమారీ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. గుర్తుపట్టకుండా ముఖాలకు నల్లరంగు వ్రస్తాలు కప్పుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపీకి రక్షణగా నిల్చున్నారు. అయినా దుండుగులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేయడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ముష్కరులు వీరంగం సృష్టించారు.ఈ క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించడంతో వారంతా పారిపోయారు. అనంతరం ఎంపీ రకీబుల్ యథావిధిగా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీపై దాడి ఘటనపై అస్సాం కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముష్కర మూకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ గురువారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఎంపీ రకీబుల్కు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక, రకీబుల్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనపై దాడికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. బీజేపీ పాలనలో తమకు రక్షణ లేకుండాపోయిందని అస్సాం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీనియర్‌నేత గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. గూండారాజ్ సంస్కృతి నుంచి రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారని చెప్పారు. Brutal attack on @INCAssam MP Shri @rakibul_inc and his son Shri Tanzil Hussain, who faught recently concluded by-election as a MLA Candidate from Samuguri Constituency is highly condemnable. pic.twitter.com/XPzmF3MQ44— Gautam Bhattacharjee (@GautamB58738095) February 20, 2025 -
కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ తండవానికి ముల్లోకాలూ వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటున్నాయి. ఇందులో 18 ముఖ్యమైనవాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య.ఇక్కడ అమ్మవారు మహిళల జననాంగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు సంబంధించి సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఆలయాన్ని ఏటా నాలుగు రోజులపాటు మూసి ఉంచుతారు.ఏటా ఆషాఢ మాసంలో ఏడో రోజు నుంచి పదోరోజు వరకు అమ్మవారు ఋతుస్రావం లో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ 2025లో జూన్ 22 నుంచి 25 వరకు ఆలయం తలుపులు మూసేసి ఉంచుతారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబుబాచీ మేళా పేరిట భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నాలుగు రోజులు ఆలయ గర్భ గుడిని తెల్లని వస్త్రాలతో .. అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రాలతో కప్పి ఉంచుతారు. నాలుగో రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రాలు కాస్తా ఎర్రబారతాయి..అంతేకాకుండా. అమ్మవారి ప్రతిరూపం ( జననాంగం) వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది.ఎర్రని వస్త్రం మహా ప్రసాదంఆ రోజుల్లో ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో.. పూజా మందిరంలోనుంచుకుంటే శుభాలు కలుగుతాయని.. మహిళల ఆరోగ్యం బాగుంటుందని భక్తుల విశ్వాసం.పాంచ్ బలిఅమ్మవారి ఆలయంలో ఇంకో విశిష్టమైన బలి పూజ. జరుగుతుంది. పాంచ్ బలి.. అంటే కామాఖ్యకు ఐదు రకాల పదార్థాలను అర్పిస్తారు. ఎనుబోతు.. మేక.. బాతు ఈ మూడింటిని ఆలయంలో బలి ఇస్తారు..వీటితోబాటు బూడిద గుమ్మడి కాయను. చెరుకు గడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఐదింటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభీష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచలం.. వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకుని స్వామికి దూడలు సమర్పించినట్లు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకలు సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతుంటాయి. ఉచిత దర్శనం కోసం కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. లేదా పరిమిత సంఖ్యలో ఇచ్చే రూ.500 టికెట్ల కోసం వేకువజామున లైన్లో ఉంటే తెల్లవారేసరికి ఆ టిక్కెట్ తీసుకుని రెండు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. దీంతోబాటు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే కొండపై ఉండే ఉమానంద శివాలయాన్ని లాంచీలో వెళ్ళి చూసి రావడం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. గౌహతికి దేశంలోని అన్ని మూలల నుంచి రైళ్లు.. విమాన సౌకర్యాలు ఉన్నాయి. హోటళ్లు.. లాడ్జిలు.. టాక్సీలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.-కామాఖ్య నుంచి సిమ్మాదిరప్పన్న -
‘నా భార్య పాక్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్‌ని’
డిస్పూర్ : అవునా? నా భార్య పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్‌ను’అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం హేమంత్ బిశ్వశర్మలో కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా నాపై, నా కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఎంపీ సతీమణికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలు, యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారిని బ్రెయిన్‌వాష్ చేయడం, తీవ్రవాదం వైపు మళ్లించడం, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలనేది’ ఆ ట్వీట్లోని సారాశాం.In 2015, the Pakistani High Commissioner to India, Mr. Abdul Basit, invited a first-term Member of Parliament (MP) and his startup, Policy for Youth, to discuss India-Pakistan relations at the Pakistan High Commission in New Delhi. Notably, this MP was not a member of the…— Himanta Biswa Sarma (@himantabiswa) February 13, 2025హిమంత్ బిశ్వశర్మ ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. హిమంత బిశ్వశర్మ, ఆయన పార్టీ (బీజేపీ)లోని ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. నా భార్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే, నేను ఇండియన్ రా ఏజెంట్‌ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు (గౌవర్ గోగోయ్ పార్లమెంట్) జోర్హాట్ పార్లమెంట్ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.అదే సమయంలో అస్సాం సీఎం హిమంత శర్మపై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా హిమంత భిశ్వశర్మ తన పదవిని కోల్పోతానేమోనన్న భయం వెంటాడుతోంది. ఆ భయం బీజేపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే భయపడి, నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేసి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని గొగోయ్ ఆరోపించారు. 👉చదవండి : ‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ -
‘రణ్వీర్ అలహాబాదియా’పై అస్సాం సీఎం కీలక ట్వీట్
గువహతి:ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో అశ్లీల వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఎఫ్ఐఆర్లో రణ్వీర్ అలహాబాదియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్లో పాల్గొన్న ప్యానెలిస్టుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిపారు.Today @GuwahatiPol has registered an FIR against against certain Youtubers and social Influencers, namely 1. Shri Ashish Chanchlani2. Shri Jaspreet Singh3. Shri Apoorva Makhija4. Shri Ranveer Allahbadia5. Shri Samay Raina and othersfor promoting obscenity and engaging in…— Himanta Biswa Sarma (@himantabiswa) February 10, 2025 అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికే రణ్‌వీర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసు దర్యాప్తులో భాగంగా షో జరిగిన సెట్లోకి కూడా పోలీసులు వెళ్లి పరిశీలించారు. రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణ్‌వీర్‌పై దుమ్మెత్తిపోశారు.రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా జాతీయ మనావహక్కుల సంఘం ఇప్పటికే యూట్యూబ్‌ను కోరింది. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రణ్వీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. -
ఫేర్వెల్ పార్టీలో పిల్లల రచ్చ
-
చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు
సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో గురువారం అసోంతో రాజ్‌కోట్ వేదికగా రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్ దేశాయ్, చిరాగ్ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.144వ సిక్సర్ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా బ్యాట్ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్‌కు ఇది 144వ సిక్సర్.ఆల్‌టైమ్ రికార్డుఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్ రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్ జాక్సన్ నమన్ ఓజాను అధిగమించాడు.పటిష్ట స్థితిలో సౌరాష్ట్రఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్ పుజారా 95, అర్పిత్ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్ జాక్సన్.. టీమిండియా యువ సంచలనం రియాన్ పరాగ్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం గమనార్హం.అద్బుతమైన రికార్డులు ఉన్నాఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్ జాక్సన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్, ఛతేశ్వర్ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు షెల్డన్ జాక్సన్ ఖాతాలో 21 ఫస్ట్‌క్లాస్ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.ఇటీవలే గుడ్బైఅంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్ 588 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్ జాక్సన్ ఇటీవలే వైట్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 86 మ్యాచ్‌లు ఆడిన షెల్డన్ జాక్సన్ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం
యాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో అస్సాం సత్రియా సంస్కృతిని ప్రదర్శించనున్నారు. మజులిలోని ఔనియాతి సత్రం నుంచి 40 మంది సభ్యుల బృందం సాంప్రదాయ సత్రియా నృత్యం, సంగీతం, నాటకాన్ని ప్రదర్శిస్తుంది, ఇది రాష్ట్ర ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రత్యేకమైన విండోను అందిస్తుంది. ఈ ప్రదర్శనలలో శ్రీమంత శంకరదేవుని భక్తి నాటకం రామ్ విజయ్ భావోనా, దిహా నామ్ (సామూహిక గానం), సాంప్రదాయ బోర్గీత్, ఖోల్, సింబల్స్, ఫ్లూట్, వయోలిన్, దోతర వంటి వాయిద్యాలతో కూడిన నృత్యం ఉంటుంది. ఈ బృందం పురుష (పారశిక్ భాంగి), స్త్రీ (స్త్రీ భాంగి) నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. 2000 సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సత్రియాను 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవుడు నృత్యం, నాటకం, సంగీతం ద్వారా శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి భక్తి మార్గంగా ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ప్రదర్శనలు సత్రియాకు కేంద్రంగా ఉన్న గొప్ప కథ చెప్పడం, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఔనియాతి సత్రం సత్రాధికార్ పీతాంబర్ దేవ్ గోస్వామి, అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిష్టాత్మక వేదికపై ప్రాతినిధ్యం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బృందం జనవరి 31 నుండి ఫిబ్రవరి 10, 2025 వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటుంది. భగవత్ పఠనాన్ని నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం అస్సాంకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే పవిత్ర కుంభమేళాలో ప్రపంచ ప్రేక్షకులతో దాని సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!) -
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్‌కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్‌కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది.


