క్లాస్‌ రూంలో దారుణం.. లెక్చరర్‌ ప్రాణం తీసిన ఇంటర్‌ విద్యార్ధి | Assam Student Stabs Teacher To Death | Sakshi
Sakshi News home page

క్లాస్‌ రూంలో దారుణం.. లెక్చరర్‌ ప్రాణం తీసిన ఇంటర్‌ విద్యార్ధి

Published Sun, Jul 7 2024 4:50 PM | Last Updated on Sun, Jul 7 2024 4:50 PM

Assam Student Stabs Teacher To Death

విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్‌ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.

అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో రాజేష్‌‌ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్‌ను రన్‌ చేస్తున్నారు.

అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కెమిస్ట్రీ సబ్జెట్‌ చెప్పేందుకు క్లాస్‌కు వచ్చాడు. అనంతరం క్లాస్‌ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.

ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్‌ డ్రెస్‌తో క్లాస్‌కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్‌ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్‌ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.

దీంతో  అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్‌ రాజేష్‌పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. 

విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్‌ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement