chemistry
-
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
క్లాస్ రూంలో దారుణం.. లెక్చరర్ ప్రాణం తీసిన ఇంటర్ విద్యార్ధి
విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్‌ను రన్ చేస్తున్నారు.అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెట్ చెప్పేందుకు క్లాస్‌కు వచ్చాడు. అనంతరం క్లాస్ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్ డ్రెస్‌తో క్లాస్‌కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్‌ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.దీంతో అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్ రాజేష్‌పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రిపీట్టే...
ఒక సినిమాలో హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే మళ్లీ ఆ జంటను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఆ జంటకి మ్యాచ్ అయ్యే కథ దొరకాలి.. ఆ కథకు ఈ ఇద్దరినే హీరో–హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్‌కి రావాలి. ఇలా కొన్ని జంటలకు కథ కుదిరింది.ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుండనే ఆలోచన డైరెక్టర్‌కీ వచ్చింది. ‘రిపీట్టే..’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ జంటలు చేస్తున్న చిత్రాల గురించి... ► ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో రామ్‌చరణ్–హీరోయిన్ కియారా అద్వానీ ‘గేమ్ చేంజర్’ కోసం రెండోసారి జోడీ కట్టారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ‘భరత్ అనే నేను’ (2018) సినిమాతో కియారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ (2019) లో రామ్‌చరణ్‌కి జోడీగా నటించారామె. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ ఇద్దరూ జత కట్టిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ΄÷లిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూ΄పొందుతోంది. ► ‘లవ్‌స్టోరి’ (2021)తో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని చూపించారు హీరో నాగచైతన్య–హీరోయిన్ సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూ΄పొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట రెండేళ్లకు రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య– డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా రూ΄పొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. చైతు–సాయిపల్లవి తొలిసారి జత కట్టిన ‘లవ్‌స్టోరి’లానే తాజా చిత్రం కూడా ప్రేమ ప్రధానాంశంగా సాగుతుంది. ► ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తర్వాత నితిన్–రష్మికా మందన్నా రెండోసారి నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ (2020) చిత్రంలో నితిన్– రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి నితిన్–రష్మిక డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే రష్మిక తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా నితిన్–రష్మిక–వెంకీ కుడుముల.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా రెండో సినిమా రూ΄పొందుతోందని చెప్పొచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రష్మికా మందన్న తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక΄ోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశం అందుకున్నారని టాక్. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ► ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్పై రూ΄పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘వీడీ 12’ ్రపాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ . దీంతో చిత్ర యూనిట్ రష్మికా మందన్నాని సంప్రదించగా... ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విజయ్–రష్మిక కలిసి నటించనున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. అయితే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ని శ్రీ లీల భర్తీ చేశారని, విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటే ఈ ్రపాజెక్ట్లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చారనే వార్తలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ► ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో కల్యాణ్ రామ్–హీరోయిన్ సంయుక్తా మీనన్ ‘డెవిల్’ సినిమా కోసం రెండోసారి జోడీ కట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బింబిసార’ (2022). ఈ చిత్రవిజయంతో హిట్ పెయిర్ అనిపించుకున్న కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ తాజాగా ‘డెవిల్’లో నటిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. ఇలా రిపీట్ అవుతున్న జంటలు ఇంకొన్ని ఉన్నాయి. -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
విజయ్ సమంత కెమిస్ట్రీ..మళ్లీ అదే ఫార్ములా..
-
ప్లాస్టిక్‌కి చెక్‌పెట్టేలా... నీటిని ఫిల్టర్ చేసే చేప
మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి. ఇప్పుడూ ఆ ప్లాస్టిక్‌ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే...తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్‌ని ఏరేసి ఫిల్టర్ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్‌లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్ ఎలియనోర్ మాకింతోష్ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు. ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్ డాక్టర్ రాబర్ట్ సిడాల్ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్పాప్కి ఉన్న మెష్ ద్వారా ఫిల్గర్ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్‌ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు. (చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ) -
ఆమెతో సహా ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్
స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్ బెర్టోజి, బ్యారీ షార్ప్‌లెస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన మోర్టన్ మెల్డల్‌లకు సంయుక్తంగా ప్రైజ్‌ను ప్రకటించింది కమిటీ. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్టాక్‌హోమ్(స్వీడన్) రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మేర ప్రకటన చేసింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీళ్లు చేసిన కృషికిగానూ నోబెల్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. షార్ప్‌లెస్‌కు ఇది రెండో నోబెల్ ప్రైజ్. 2001లో ఆయన రసాయన శాస్త్రంలోనే నోబెల్ అందుకున్నారు. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4 — The Nobel Prize (@NobelPrize) October 5, 2022 -
రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2021 గాను నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడ్ష్ అకాడమీ బుధవారం రోజున ప్రకటించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్కు డేవిడ్ డబ్ల్యుసీ మెక్‌మిలన్‌కు రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ వరించింది. ‘అసమాన ఆర్గానో కటాలిసిస్’ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి నోబెల్ పురస్కారం దక్కింది. బెంజిమిన్ లిస్ట్, మెక్‌మిలన్‌ల ఆవిష్కరణతో ఫార్మాసూటికల్ పరిశోధనలపై భారీగా ప్రభావం చూపనుంది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కు బెంజమిన్ లిస్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మెక్‌మిలన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి రాయల్ స్వీడిష్ అకాడమీ వైద్య, భౌతిక రంగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. BREAKING NEWS: The 2021 #NobelPrize in Chemistry has been awarded to Benjamin List and David W.C. MacMillan “for the development of asymmetric organocatalysis.” pic.twitter.com/SzTJ2Chtge — The Nobel Prize (@NobelPrize) October 6, 2021 చదవండి: భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..! -
రసాయనం సులభం.. గణితం కష్టం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 4వ సెషన్ తొలిరోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది వీటికి దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70 వేల మంది వరకు ఉన్నారు. మొదటి రోజు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాల నిపుణులు అభిప్రాయపడ్డారు. రసాయన శాస్త్రం ప్రశ్నలు ఇంతకు ముందుకంటే కొంత సులువుగా ఉన్నాయన్నారు. భౌతిక శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా.. గణితం ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. రసాయన శాస్త్రం ప్రశ్నల్లో.. ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. భౌతిక శాస్త్రంలో మోడ్రన్ ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ వంటి అంశాల ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇంటర్ ఫస్టియర్ కంటే సెకండియర్లోని అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మ్యాథ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ సెకండియర్ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కాలిక్యులస్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని చెప్పారు. -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే నీట్‌ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్‌పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్‌లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్‌ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్‌కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్‌తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్‌కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
-
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ బి.గూడెనఫ్, స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ అవార్డ్‌ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది. వీరు అభివృద్ధి చేసిన లిథియం ఆయాన్ బ్యాటరీలు పోర్టబుల్ టెక్నాలజీ విప్లవానికి కారణమయ్యాయి. -
ఎన్నికల లెక్కలపై కెమిస్ట్రీ గెలుపు
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు. అదో దురభిప్రాయం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్‌లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు. రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.. బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు. నెహ్రూకి నివాళి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. -
ఈసారి కెమిస్ర్టీ వర్కవుట్ అయింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి అంకెల కంటే కెమిస్ర్టీ (భావోద్వేగాలు)యే పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీని హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన పార్టీగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నామని అయినా తమ పార్టీ హిందీ బెల్ట్‌కే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రభుత్వాలు లేదా తమ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో బీజేపీని కేవలం హిందీ రాష్ట్రాల పార్టీగా పరిగణించడం పట్ల మోదీ ఆక్షేపించారు. -
డార్లింగ్ గారు
అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్మెట్లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. ఇన్స్టిట్యూట్కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు. డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్‌లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్‌లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్‌గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్‌కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్‌గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!! నవ్వుల కెమిస్ట్రీ! అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఎక్స్పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్‌లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్‌గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు! – డి.వి.తులసి, విజయవాడ – నక్కా రాజశేఖర్, కఠెవరం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. -
పరిణామ సిద్ధాంత అన్వయానికి నోబెల్
స్టాక్‌హోం: జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురికి ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు. ‘నోబెల్ గ్రహీతలు డార్విన్ సిద్ధాంతాన్ని మానవాళికి గొప్ప మేలుచేసే కార్యసాధనకు ఉపయోగించారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ‘వారు డార్విన్ సూత్రాలను ప్రయోగశాలలో అమలుపరిచారు. వేయి రెట్ల వేగంతో జీవ పరిణామ క్రమాన్ని ప్రదర్శించి కొత్త ప్రొటీన్లను సృష్టించారు’ అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చీఫ్ క్లాయిస్ గుస్తాఫసన్ వ్యాఖ్యానించారు. పరిణామవాదం.. శక్తిమంత ఇంజనీరింగ్ జీవ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీని వల్ల విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు వీలు కలిగింది. ఫలితంగా, చెరకు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తిచేస్తు న్నారు. శీతల వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేసే డిటర్జెంట్ల తయారీకి కూడా ఆమె పరిశోధన దోహదపడింది. ‘ఈ భూమ్మీద అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన వస్తువులను పరిణామ సిద్ధాంతం సృష్టించింది. ఎలా తయారుచేయాలో ఎవరికీ తెలియని విషయా లను కూడా దీని ద్వారా నిజం చేయొచ్చు. ఈ ప్రపంచంలో పరిణామ క్రమం అనేది అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్ పద్ధతి. గ్యాసోలిన్ ఉత్పత్తికి భూమి నుంచి ఇంధనాన్ని తోడాల్సిన పనిలేదు. మొక్కల్లో నిల్వ ఉండే సూర్యరశ్మి చాలు’ అని ఆర్నాల్డ్ ఓ సందర్భంలో చెప్పారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్నాల్డ్ (67) కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్‌తో కొత్త ప్రొటీన్లు తయారుచేయొచ్చని స్మిత్, వింటర్ రుజువుచేశారు. వీరి ప్రయోగాల ఫలితంగా కీళ్ల నొప్పులు, సోరియాసిస్, పేగు వాతం తదితర వ్యాధులకు ఔషధాలు కనుగొన్నారు. స్మిత్ ఎంఆర్సీ మాలిక్యులర్ బయోలజీ లేబొరేటరీలో పరిశోధకులుగా పనిచేస్తున్నారు. -
తనంతటివాడు
అతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సైన్స్ అంటే ఇష్టం. ఒక రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ హెమ్ప్రీ డేవీ ఉపన్యాసం వినేందుకు వెళ్లాడు. డేవీని కలిశాడు. ‘మీ ప్రయోగశాలలో ఏదయినా ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అన్నాడు. డేవీ అతని ఉబలాటాన్ని గమనించి, తన ప్రయోగశాలలో చేర్చుకున్నాడు. ఒకరోజు రాత్రి డేవీ తన ల్యాబ్‌లో ఏదో ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు అత్యవసరంగా బయటకు వెళ్లవలసిన పని పడింది. దాంతో ఆయన ‘నేను ఈ ద్రావణంతో కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అందుకు దీన్ని చేతితో కదుపుతూ ఉండాలి. నీవు దీనిని నేను వచ్చేంతవరకూ కదుపుతూ ఉండు. నేను త్వరగానే వస్తా’ అని చెప్పి బయటికి వెళ్లాడు. ఆ కుర్రాడు ఆ ద్రావణాన్ని కదిపే పని ప్రారంభించాడు. అలా గంటలు గడిచిపోతున్నా, విసుగూ విరామం లేకుండా అతను ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా వచ్చాడు డేవీ. ఏకాగ్రతతో తన పనిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్న తన యువ శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆజ్ఞాపాలన, ఉత్సాహం గల ఈ కుర్రాడు పెద్దయ్యాక ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని గ్రహించి, మరింత వాత్సల్యంతో అతనికి పాఠాలు చెబుతూ, తనంతటివాడిగా తయారు చేశాడు. డేవీ అంచనా వమ్ము కాలేదు. ఆ కుర్రాడు అనతికాలంలోనే డైనమో ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగాడు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, చిరస్మరణీయుడయ్యాడు. అతనే మైఖేల్ ఫారడే. – డి.వి.ఆర్. -
‘జేఈఈలో కెమిస్ట్రీ, మ్యాథ్స్ కఠినం’
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్–1, మాథ్స్ పేపర్–2లు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన పరీక్షలో పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే మాథ్స్ కాస్త సులువుగా ఉందంటున్నారు. ఫిజిక్స్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2లో మాథ్స్ ప్రశ్నలు కఠినంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కీ ని ఈ నెల 29 నుంచి అందుబాటులో ఉంచుతామని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ఫలితాలు వచ్చేనెల 10న ప్రకటిస్తామని పేర్కొంది. -
నోబెల్ గ్రహీతకు ఎంత కష్టం..!
చికాగో : నోబెల్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఐయిచి నెగిషి రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం రోడ్డుపై అర్థించాల్సిన బాధకరమైన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య సుమైరా నెగిషి(80) దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన గంటలపాటు సాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకుంది. సోమవారం ఇంటి నుంచి కారులో బయలుదేరిన నెగిషి దంపతులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం ఇంటి నుంచి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో నెగిషి దంపతులను గుర్తించారు. కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం విమానాశ్రయానికి బయలుదేరిన నెగిషి దంపతుల ఆచూకీ తెలియకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు వృద్ధుడైన నెగిషి గాయాలతో సహాయం కోసం అర్థిస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో పోలీసులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. నెగిషి కనిపించిన ప్రదేశానికి సమీపంలోని ఓ గుంతలో వారి కారు పడిపోయి ఉంది. జపాన్‌కు చెందిన నెగిషి 1960లో స్కాలర్‌షిప్‌పై అమెరికాకు వచ్చారు. ఇండియానాలోని పుర్డ్యూ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కెమిస్ట్రీలో ఆయన చేసిన పరిశోధనలకు గానూ 2010లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఆయన్ను వరించింది. -
భవిష్యత్ రసాయన శాస్త్రానిదే
భానుగుడి (కాకినాడ) : భవిష్యత్ అంతా రసాయన శాస్రా్తనిదేనని, ఔషధాల వినియోగం దగ్గర్నుంచి, పర్యావరణ విజ్ఞానం వరకూ అన్నీ ఈ శాస్త్రంతో ముడిపడి ఉందని పలువురు రసాయన శాస్త్రవేత్తలు అన్నారు. పీఆర్జీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు ‘రసాయన, ఔషధ, పర్యావరణ విజ్ఞాన శాస్రా్తల సాంకేతిక అంశాల్లోని పరిశోధనలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ సదస్సుకు అధ్య క్షత వహించారు. భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ వర్సిటీ మాజీ వీసీ, కర్బన రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.పెరియస్వామి మాట్లాడుతూ కర్బన లోహ సమ్మేళన, సంశ్లేషణ అనువర్తనాలను విశ్లేషించారు. తీరంలో ఔషధాల వెలికితీత, నీటి నుంచి ఫ్లోరి¯ŒS తొలగింపు అంశాలపై చేసిన పరిశోధనలను ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వైఎల్‌ఎ¯ŒS మూర్తి సమర్పించారు. హోప్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సిలాజ్ చార్లెస్, ప్రొఫెసర్ మాచిరాజు, వెంకీ ఫార్మా డైరెక్టర్ శివరామ కృష్ణ, ఉస్మానియా ప్రొఫెసర్ శారద, సల్గ పరి«శోధన అధిపతి డాక్టర్ ఎస్ఎ సల్గా, కళాశాల యూజీసీ కో ఆర్డినేటర్ డాక్టర్ హరిరామ్‌ప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైడీ రామారావు, వరప్రసాద్, మల్లికార్జున శర్మ, రామమూర్తి, ఈరంకి శర్మ పాల్గొన్నారు. -
రసాయన శాస్త్రంపై వచ్చే నెల జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ఆర్ట్స్ కళాశాల రసాయనశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో జనవరి 30, 31 తేదీల్లో ’మానవ ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణలో రసాయనశాస్త్రం పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు సోమవారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి, రసాయనశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డీఎఎస్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ వి.సలీంబాషా, తదితరులు పాల్గొన్నారు. పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనాపత్రాలు సమర్పించి సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి. తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
నయనతో కెమిస్ట్రీ కుదిరింది
నయనతారతో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు సియాన్ విక్ర మ్. ఈయన కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంతకైనా సిద్ధపడే ఈ నట పిపాసి ఈ చిత్రంలో మరో రెండు వైవిధ్యభరిత పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబుతమీన్స్ తన తమీన్స్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. విక్రమ్‌కు జంటగా తొలిసారిగా క్రేజీ నటి నయనతార జత కట్టిన ఈ చిత్రంలో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. అరిమాతంబి చి త్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలో గల సత్యం సినిమా థియేటర్లో జరిగింది.నటుడు శివకార్తికేయన్, మలయాళ యువ నటుడు నివీన్‌బాలి విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి, నటి లిజి, గీతరచయిత మదన్‌కార్గీ పాల్గొన్నారు. అభిమానులను అలరించాలనే.. విక్రమ్ మాట్లాడుతూ పత్రి చిత్రాన్ని అభిమానులను అలరించాలన్న ఆలోచనతోనే అంగీకరిస్తుంటానన్నారు. ఇరుముగన్ గురించి ఇప్పుడు తానేమీ చెప్పనని చిత్రం చూసిన తరువాత అదే మాట్లాడుతుందని అన్నారు. ఇరుముగన్ చిత్రం కోసం తాను తొమ్మిది నెలలు వేచి ఉన్నానని తెలిపారు.దర్శకుడు అంతగా వెయిట్ చేశారని, నిజానికి ఆయనకు ఒక పెద్ద హీరో చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, దాన్ని ఆయన అంగీకరించవచ్చునని అన్నారు. ద్విపాత్రాభినయం కథా చిత్రం కోసం తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నానన్నారు. ఇక చిత్ర నిర్మాత శిబు తమాన్స్ గురించి చెప్పేతీరాలన్నారు.ఆయన తాను నటించిన చాలా చిత్రాలను కేరళలో డిస్ట్రిబ్యూషన్ చేశారని తెలిపారు. నయన్‌తో నటించడం గొప్ప అనుభవం తాను, నటి నయనతార కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదన్నారు. నయనతార చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. ఆమెతో నటించడం గొప్ప అనుభవం అని.. తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇక నటి నిత్యామీనన్ కూడా అంతేనన్నారు. ఇక హరీష్‌జయరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని,ఆయన తనకు చాలా మంచి పాటల్ని అందించారని విక్రమ్ పేర్కొన్నారు. విక్రమ్ హిజ్రాగా నటించలేదు విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రలో రా అధికారిగా కనిపించనున్నారు. మరో పాత్ర హిజ్రా అనే ప్రచారం జరుగుతోం ది. అయితే దీనిపై దర్శకుడు ఆనంద్ శంకర్ స్ప ష్టం చేస్తూ హిజ్రాను కెమికెల్ ప్రాసెస్ ద్వారా ఆ డగాగానీ మగగా గానీ మార్చవచ్చునని చిత్ర ంలో చెప్పామన్నారు. అయితే ఇందులో విక్రమ్ హిజ్రాగా నటించలేదన్నారు. కాగా రెండో పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఉం టుందన్నా రు. ఈ గెటప్ విక్రమ్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు హరి మాట్లాడుతూ విక్రమ్‌ది తనది హిట్ కాంబినేషన్ అన్నారు. తాము కలిసి పని చేసిన సామి చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యిందని,ఆ చిత్రానికి సీక్వెల్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. -
‘కెమిస్ట్రీ’తోనే అధిక సమయం
- ఎక్కువ ప్రశ్నలు సమస్యాపూరకంగా రావడంతో రాయలేకపోయామన్న విద్యార్థులు - పరీక్షకు 90.76 శాతం హాజరు - ప్రాథమిక కీ విడుదల, 12 వరకు అభ్యంతరాల స్వీకరణ, 14న ర్యాంకులు సాక్షి, హైదరాబాద్ : కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే అధిక సమయం పట్టడంతో మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాయలేకపోయామని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు ఫిజిక్స్‌లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు రావడం, బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉండటం ఎక్కువ సమయం తీసుకున్నాయని అన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76% మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,964 మంది హాజరయ్యారు. 5,189 మంది గైర్హాజరయ్యారు. ఒక్క హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ప్రశ్నల విషయానికి వస్తే సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. కీని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) ఉంచింది. ఈ నెల 12 మధ్యాహ్నం 2 గంటల వరకు కీపై అభ్యంతరాలను (keyobjectionstseamcet2016@gmail.com) మెయిల్ ద్వారా స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈ నెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, డీఎంఈ డాక్టర్ రమణి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.