అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం! | Katrina Kaif continues to stay at Kat-Ranbir's 'love nest' | Sakshi
Sakshi News home page

అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!

Published Mon, May 30 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!

అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!

రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్‌పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్‌లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు.

దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్‌ని డూప్స్‌తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్‌ని డూప్‌తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట.

ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్‌తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement