Alia Bhatt And Ranbir Kapoor Marriage: Ranbir Ex-Girlfriends Likely To Attend His Wedding - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor Marriage: రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లికి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌? వాళ్లెవరంటే..

Apr 8 2022 11:43 AM | Updated on Apr 8 2022 1:20 PM

Ex Girl Friends To Attend Ranbir Kapoor Alia Bhatt Wedding Event - Sakshi

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా బట్‌  వివాహానికి  సంబంధించి కొద్ది రోజులుగా బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వీరి పెళ్లికి ఏప్రిల్‌17న ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.

డెస్టినేషన్ వెడ్డింగ్‌ కాకుండా కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ వెడ్డింగ్‌కి రణ్‌బీర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ కూడా రాబోతున్నారట. స్టార్‌ హీరోయిన్స్‌ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లతో రణ్‌బీర్‌ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీళ్లు విడిపోయారు.

మరి తాజాగా ఆలియా -రణ్‌బీర్‌ల పెళ్లికి ఆహ్వానించిన గెస్ట్‌ లిస్ట్‌లో రణ్‌బీర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ పేర్లు ఉండటం​ మరింత ఆసక్తిగా మారింది. మరి ఇందులో ఇంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement