Viral Video: Ranbir Kapoor Kneels In Front Of Alia Bhatt During Varmala, Kisses Her Later - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor-Alia Bhatt Marriage: లీకైన ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి అన్‌సీన్‌ వీడియో

Apr 15 2022 1:55 PM | Updated on Apr 15 2022 2:37 PM

Ranbir Kapoor Kneels In Front Of Alia Bhatt During Varmala, Kisses Her Later - Sakshi

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చదవండి: రణ్‌బీర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్‌

అందులో వధువు ఆలియా రణ్‌బీర్‌ మెడలో వరమాల వేయడానికి ప్రయత్నిస్తుండగా.. రణ్‌బీర్‌ బంధువులు అతన్ని ఆలియాకు అందకుండా పైకి ఎత్తుకున్నారు. అలా సరదాగా కాసేపు ఆట పట్టించి కిందకి దింపారు. ఆ తర్వాత స్వయంగా రణ్‌బీర్‌ మోకాళ్లపై కూర్చొని ఆలియా చేత్తో వరమాల వేయించుకున్నాడు.

అనంతరం ఆలియా పెదవులపై ముద్దుపెట్టాడు. దీనికి సంబందించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా, కాసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ పిక్‌ మార్చేసిన ఆలియా భట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement