marraige
-
పెళ్లైన విషయాన్ని దాచి యువతితో ఆస్పత్రి మేనేజర్ ప్రేమ
మదనపల్లె: కుటుంబ పోషణ కోసం ఆస్పత్రిలో నర్సుగా చేరిన ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్‌తో పాటు బెదిరించినందుకు మరో ఇద్దరు వైద్యులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ సింగన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి (25) నర్సింగ్ పూర్తిచేసి ఉపాధి కోసం మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అదే ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడైన రాజేష్ రెడ్డి(30) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆమె గర్భవతి కాగా, మాయమాటలు చెప్పి తిరుపతికి తీసుకువెళ్లి గత ఏడాది ఆగస్టులో అబార్షన్ చేయించాడు. తర్వాత కొంతకాలానికి రాజేష్‌రెడ్డి వివాహితుడనే విషయం తెలుసుకున్న యువతి తనకు ఎందుకు మోసం చేశావని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే చట్టపరంగా పోలీసులను ఆశ్రయిస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెద్దమనుషుల సహాయంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోగా, తనకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని లేకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్పింది. దీంతో ఆస్పత్రి యజమాని, వైద్యుడైన రవికుమార్‌రెడ్డి ఆమెను నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఉద్యోగంలో తొలగించి బయటకు పంపేశాడు. ఇ దే విషయంలో అంగళ్లుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రా యుడు యువతిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తన కు న్యాయం జరగదని నిర్ధారించుకుని, బాధిత యువతి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. విచారించిన సీఐ ఎరీషావలీ, యువతిని మోసం చేసిన రాజేష్ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు రవికుమార్‌రెడ్డి, ఆర్ఎంపీ వైద్యుడు రాయుడులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నాన్న.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..
కాజీపేట రూరల్: పెళ్లి (marriage)చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే(Kazipet Junction Railway) యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు.మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానామడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హసన్‌పూర్‌లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్‌తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. -
వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురు
బాలీవుడ్ లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ మనవడు, నటుడు అదార్ జైన్, అలేఖా అద్వానీని హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12న గోవాలో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ జంట మరోసారి(ఫిబ్రవరి 21, శుక్రవారం) హిందూ వివాహంతో తమ ప్రేమను చాటుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రణ్‌బీర్ కపూర్ అలియా, సైఫ్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా, నీతూ కపూర్‌తో పాటు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, అనిల్ అంబానీ, టీనాజంట, సీనియర్ నటి రేఖ, అగస్త్య నందా వేదిక సందడి చేశారు.వధువు అలేఖా అద్వానీ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తయారు చేసిన ఎథ్నిక్ మాస్టర్ పీస్‌లో అందంగా ముస్తాబైంది. రెడ్ వెల్వెట్ లెహెంగాపై వాటర్‌ఫాల్ స్టైల్ గిల్డెడ్ డబ్కా ఎంబ్రాయిడరీతో రూపొందించారు. దీనికి జతగా గోల్డ్ జర్దోజీ ఎంబ్రాయిడరీతో హాఫ్-స్లీవ్డ్ వెలోర్ క్రాప్డ్ బ్లౌజ్ మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా డబుల్ మ్యాచింగ్ క్రిమ్సన్ ఆర్గాన్జా దుపట్టాలో అలేఖా అందంగా మెరిసింది. ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌గా పోల్కి కుందన్స్ పచ్చలు పొదిగిన నెక్లెస్ మాంగ్ టీకా ఆభరణాలను ధరించింది. వరుడు ఆదర్ జైన్ ఐవరీకలర్ షేర్వానీ, ఎటాచ్డ్ దుపట్టా, క్లాసిక్ వైట్ స్ట్రెయిట్ ఎథ్నిక్ ప్యాంటు, తలపాగా ధరించారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే, పచ్చల లేయర్డ్ నెక్లెస్ ,తలపాగామీద ఎమరాల్డ్ స్టేట్మెంట్ గోల్డ్ నగలతో రాజసంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక తర్వాత ఆదర్ తన భార్య అలేఖ అద్వానీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.దీంతో అలేఖా సిగ్గుల మొగ్గే అయింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించారు. -
గుండ్రాంపల్లి అబ్బాయి.. ఇండోనేషియా అమ్మాయి
చిట్యాల (నల్గొండ): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు ఇండోనేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. సీమ సాలయ్య–యాదమ్మ ప్రథమ కుమారుడు నాగరాజు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు పనిచేస్తున్న కంపెనీలోనే ఇండోనేషియాలో రిజ్కి నన్డా సఫిట్రి అనే యువతి కూడా పనిచేస్తోంది. వీరిద్దరికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రిజ్కి నన్డా సఫిట్రిని నాగరాజుకు ఇండియాకు పిలిపించాడు. నాగరాజు స్వగ్రామం గుండ్రాంపల్లిలో శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
వధువు బంగారు నగలు మాయం.. బ్యూటీషియన్‌పై కేసు
పామిడి: ఫంక్షన్ హాలులో వధువు బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. ప్రత్యామ్నాయ నగలు అలంకరించి పెళ్లి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారును రికవరీ చేశారు. వధువును అలంకరించేందుకు వచ్చిన బ్యూటీషియనే దొంగ అని గుర్తించారు. వివరాల్లోకెళితే.... రామరాజుపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి కుమార్తె పెళ్లి పామిడిలోని కోగటం ఫంక్షన్‌హాలులో జరిగింది. గురువారం రాత్రి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం తలంబ్రాలు. వధువుకు సంబంధించిన 28 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. నగల మాయంపై పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ఆరా తీస్తే బాధపడతారేమోనని వధువు కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ నగలతో అలంకరించి పెళ్లి ఘట్టం ముగించారు. తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన వధువు తండ్రిని గమనించిన స్నేహితులు రెక్కల చిన్న నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామరాజుపల్లికి చెందిన రామశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన సీఐ యుగంధర్ తన సిబ్బందితో ఫంక్షన్ హాలుకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు. దీంతో పెళ్లి కుమార్తె గదిని పరిశీలించారు. అక్కడ పైకప్పు పీఓపీ కొంత గ్యాప్ కనిపించింది. అక్కడేముందని చూడగా రెండు ఖాళీ నగల బాక్సులు కిందపడ్డాయి. ఇక్కడే ఏదో జరిగిందని అర్థమైంది. గదిలో ఎవరెవరు ఉన్నారు. ఎవరెవరు వచ్చి వెళ్లారు అని సీఐ ఆరా తీశారు. మేకప్ చేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన బ్యూటీషియన్ తీరుపై అనుమానం కలగడంతో.. ఆమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. తానే నగలు తస్కరించానని, వాటిని వాష్‌రూమ్‌లో ఫ్లష్‌ట్యాంకులో దాచి పెట్టిన నగలను చూపించింది. అనంతరం బ్యూటీషియన్‌పై సీఐ కేసు నమోదు చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారు నగలను రికవరీ చేసిన సీఐకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు. -
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు
పుట్టపర్తి టౌన్: అవ్వతాత చేస్తున్న బలవంతపు పెళ్లి ప్రయత్నాల నుంచి తనను కాపాడి ఉన్నత చదువులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్న వద్ద ఓ విద్యార్థిని మొరపెట్టుకుంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్య వేదికలో ఎస్పీని కనగానపల్లికి చెందిన విద్యార్థిని సాయి కలసి వినతి పత్రాన్ని అందజేసింది. బాధితురాలు తెలిపిన మేరకు... కనగానపల్లికి చెందిన చెన్నప్నకు ముగ్గురు కుమార్తెలున్నారు. తండ్రి అవిటివాడు కావడంతో తాత పాపన్న, అవ్వ వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అక్కచెళ్లెళ్లు చదువులు కొనసాగించారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన సాయి... ఇంటర్లో 950 మార్కులతో టాపర్‌గా నిలిచింది. డిగ్రీ కళాశాలలో చేరాలని అనుకుంటుండగా అవ్వ, తాత, ఇతర కుటుంబసభ్యులు తన సర్టిఫికెట్లు లాక్కొని బలవంతంగా బంధువుల అబ్బాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తల్లిదండ్రలు సైతం ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారు. సర్టిఫికెట్లు ఇప్పించి తన విద్యాభ్యాసానికి మార్గం సుగమమం చేయడంతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఎస్పీని బాధితురాలు వేడుకుంది. స్పందించిన ఎస్పీ తక్షణమే సంబంధిత పీఎస్ సీఐతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!
అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది. -
అనుష్క పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన స్వీటి
నాలుగు పదుల వయసు దాటినా సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల శాతం చాలానే ఉంది. అలాంటి వారిలో త్రిష, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున పలు కథనాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. తెలుగులో కథానాయకిగా రంగప్రవేశం చేసిన బెంగళూరు బ్యూటీ ఈమె. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకట్టి పాపులర్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. అలాంటిది సడన్‌గా సైజ్ జీరో చిత్రంలోని పాత్ర కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక కెరీర్ గాడి తప్పింది. చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఘాడీ అనే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క చాలా వదంతులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారానికి గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ప్రేమను అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా ఓ దుబామ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి అనుష్క సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆపై ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌తో ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఆమె ధ్రువపరచలేదన్నది గమనార్హం. ఈ వదంతులపై స్పందించిన అనుష్క తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో తాను ఎప్పుడూ బాధపడిందిలేదన్నారు. అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు. వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అది నేరం కాదని.. భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం చేయొద్దని అన్నారు. ఆ టైం వస్తే అందరికీ తెలియజేస్తానని అనుష్క పేర్కొన్నారు. -
అఫీషియల్: నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత ధూళిపాళ్ల మెరిసింది. తమ కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున పరిచయం కూడా చేశారు.తాజాాగా వీరి పెళ్లి తేదీపై నాగార్జున కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై స్పందించారు. అదే రోజున వివాహం జరగనుందని అక్కినేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లి తేదీపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారా? లేదంటే కొత్త సంవత్సరంలో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందా? అని నెటిజన్స్‌తో పాటు అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్ శతజయంతి వేడుకల్లో శోభిత కనిపించడంతో మరోసారి పెళ్లి తేదీపై మరోసారి ఆరా తీశారు.పెళ్లి తేదీపై రూమర్స్...గత కొద్ది రోజులుగా ఈ జంట ఈ ఏడాది డిసెంబర్లోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. చై- శోభిత డిసెంబర్ మొదటి వారంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్‌లోనూ టాక్ వినిపించింది. వచ్చే డిసెంబరు 4న వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అందరూ అనుకున్నట్లుగానే పెళ్లి తేదీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది. (ఇది చదవండి: రామ్‌చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు )మొదలైన పెళ్లి పనులు..ఇటీవల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించింది. శోభిత ఇంట్లో తన తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండేల్తో చైతూ బిజీ..కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా?
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్, డిసెంబర్లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు
గొల్లపల్లి: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ మల్లేశం, లత దంపతుల కొడుకు శ్రీనివాస్.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బాసవేని శంకరయ్య, సుశీల దంపతుల కుమారుడు (ట్రాన్స్‌జెండర్) అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నాళ్లు గల్ఫ్ వెళ్లాడు. స్వగ్రామానికి రాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజే చప్పుళ్ల మధ్య ట్రాన్స్జెండర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. -
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. తాళి కట్టించిన బంధువులు
గన్నవరంరూరల్: మండలంలోని సూరంపల్లి గ్రామంలో ఓ యువకుడిని శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు బంధించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన ఆ యువకుడు తల్లి లేని ఓ బాలికను ప్రేమ పేరిట వలలో వేసుకుని, రాత్రి వేళ ఇంటికి రాగా, బాలిక బంధువుల యువకుడిని నిలదీసి తాళ్లతో కట్టివేశారు. ఈ విషయం తెలిసి ఆ యువకుడి బంధువులు ఆ ప్రదేశానికి చేరుకోవటంతో అర్ధరాత్రి కలకలం రేగింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో మరింత చర్చకు దారి తీసింది. అనంతరం గ్రామస్తులు ఆ జంటకు పెళ్లి చేశారు. గన్నవరం పోలీసులకు తెలియడంతో ఆదివారం వారిని స్టేషన్‌కు రప్పించారు. ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. బాలిక మైనర్ కావటంతో ప్రజ్వల హోమ్‌కు పంపినట్లు చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట బాలిక, యువకుడిని హాజరుపరుస్తామన్నారు. -
పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లో బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.రహస్య గోరఖ్‌తో పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్ చేశారు. మా జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఇవీ చూసిన అభిమానులు తమ హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. రాజావారు రాణిగారు సినిమాతో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ "క" లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియావ్యాప్తంగా రిలీజ్ కానుంది. We Need all your blessings ❤️🙏 pic.twitter.com/3ibTFUuJp0— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024 -
ప్యారిస్ ఒలింపిక్స్ : రొమాంటిక్ లవ్ ప్రపోజల్, వైరల్ వీడియో
సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు."I’ll love you forever! Will you marry me?""Yes! I do!" OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng SiweiThen her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు -
పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్.. హీరోయిన్ అదిరిపోయే రిప్లై!
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చియన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గతంలో ఎప్పుడు చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇవాళ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎక్స్ వేదికగా అభిమానులతో ఆస్క్ మాళవిక అనే సెషన్ నిర్వహించారు. ఇందులో చాలామంది ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఓ నెటిజన్ ఏకంగా మాళవిక పెళ్లి గురించి ఆరా తీశారు. మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మాళవిక స్పందిస్తూ.. నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు? అంటూ గట్టిగానే రిప్లై ఇచ్చేసింది. మరికొందరు తంగలాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. తంగలాన్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అ Why you in a rush to see me married? :( https://t.co/epaOAhywvs— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2024 -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్.. శ్యామలా దేవి ఏమన్నారంటే?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల మార్కును దాటేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే ఈ సినిమాను మొదటి రోజే వీక్షించిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణం రాజు సతీమణి) ఆనందం వ్యక్తం చేసింది. బుజ్జి కారులో కూర్చుని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలా దేవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ప్రభాస్‌కు పెళ్లికాదని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటలపై ఆమె స్పందించింది.శ్యామలా దేవి మాట్లాడుతూ..' గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావన్నారు. ఇప్పుడు కల్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కితో తలకిందులయ్యాయి. ప్రభాస్ పెళ్లి కూడా అంతే. కోట్లాది అభిమానుల కోసం ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది. కానీ సరైన సమయం రావాలి కదా. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది' అని అన్నారు. కాగా.. గతంలోనూ ప్రభాస్ పెళ్లి రూమర్స్‌పై శ్యామలా దేవి స్పందించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు
రామడుగు(చొప్పదండి): అమ్మాయిది శ్రీలంక.. అబ్బాయిది రామడుగు మండలంలోని పందికుంటపల్లి. దేశాలు వేరైనప్పటికీ ప్రేమ అనే బంధం ఇరువురినీ ఒక్కటి చేసింది. పందికుంటపలి్లకి చెందిన కట్కం సురేందర్ ఉద్యోగం చేయడానికి లండన్ వెళ్లాడు. తాను పని చేస్తున్న ఆఫీస్‌లో శ్రీలంక దేశానికి చెందిన జానుషికతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో తమ కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఏడడుగులు వేశారు. వివాహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా
-
డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్ స్టోరీ
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు. అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
నిర్మాతను పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ!
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిని వివాహాల సంవత్సరంగా పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు చాలామంది పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా.. త్వరలోనే కృతి కర్బందా, మీరా చోప్రా కూడా వెడ్డింగ్‌కు సిద్ధమయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. నిర్మాతను పెళ్లాడిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ నటి సుఖ్మణి సదానా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సన్నీ గిల్‌ను మార్చి 3, 2024 పెళ్లాడారు. అమృత్‌సర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు మూడూ రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లయిన విషయాన్ని కాస్తా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ నటి పోస్ట్ చేసింది. కాగా.. సుఖ్మణి సదానా సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో నటించింది. అంతే కాకుండా జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. వీటితో పాటు తాండవ్, ఉడాన్ పటోలాస్, తనవ్, మన్మర్జియాన్ లాంటి షోలలో కూడా కనిపించారు. View this post on Instagram A post shared by Sukhmani Sadana (@sukhmanisadana) -
పెళ్లి ఇంట బాణసంచా మంట
నరసరావుపేట టౌన్: వివాహ వేడుక కోసం తెచ్చిన బాణ సంచా పేలి ఆటోతో పాటు రెండు వాహనాలు, పెళ్లి పందిరి దగ్ధమైన సంఘటన నరసరావుపేటలో జరిగింది. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయ డంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అరండల్ పేటలో ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. అరండల్ పేట అన్నపూర్ణమ్మ హాస్పటల్ వీధిలో వివాహ ఊరేగింపుగా వెళ్లేందుకు ఆటోలో బాణ సంచాను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. ఊరేగింపు మొదలవ్వగానే నిర్వాహకులు టపాసులు పేల్చారు. అందులోనుంచి చెలరేగిన నిప్పురవ్వలు ఆటోలో ఉన్న బాణ సంచాపై పడటంతో మంటలు చెలరేగాయి. ఒకేసారి బాణ సంచా అంతా పేలటంతో పెద్దస్థాయిలో శబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగు తీశారు. కొద్దిసేపటి తర్వాత అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఆటో నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న పెళ్లి పందిరికి అంటుకోవటంతో పందిరి పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా సమీపంలోని స్కూటీ, తోపుడు బండి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, పరిస్థితిని సమీక్షించారు. -
పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
దిల్ రాజు ఇంట పెళ్లి వేడుక.. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం!
ఇటీవల ఎక్కువగా సినీతారల పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొత్త ఏడాదిలోనూ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది.గతేడాది సైతం పలువురు టాలీవుడ్ ప్రముఖులు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. 2023లో పెళ్లి చేసుకున్న వారిలో మంచుమనోజ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయారు. తన పెళ్లికి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా? ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడే. తాజాగా నిర్మాత దిల్‌రాజుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే నెలలోనే ఆశిష్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కాగా.. ఆశిష్ ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందే 2022లో రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. Dil Raju and Shirish personally invited Man of Masses NTR @Tarak9999 for the joyous occasion of Shirish's son, @AshishVoffl 's wedding. pic.twitter.com/5lX1Gw5O90 — Vamsi Kaka (@vamsikaka) January 31, 2024 -
వివాహ చట్టబద్ధతకు సర్కారు పెద్ద పీట
రాయవరం: పెళ్లంటే నూరేళ్ల పంట అని నమ్మే మన సమాజంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఆ వివాహానికి రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధత అవసరం. వివాహాన్ని చట్టబద్ధం చేయాలనే అంశం చాలామందికి తెలియదు. వివాహానికి చట్టబద్ధత లేకుంటే భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో మాన్యువల్‌గా ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో ఇలా.. గతంలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాన్యువల్‌గా నమోదయ్యేవి. వివాహానికి సంబంధించిన ఫొటోలు, ఆధార్ కార్డులు సమర్పించి, ముగ్గురు సాక్షులతో దరఖాస్తు పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చేవారు. వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు పూర్తయితే వివాహానికి చట్టబద్ధత ఇస్తారు. వివాహ శుభలేఖ, పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్ కార్డులు, పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ధ్రువీకరణ పత్రం లేదా మరేదైనా వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులతో సంతకాలు చేయించిన దరఖాస్తును ఇవ్వాలి. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ విధానం అమలవుతోంది. తగిన ఫీజు చెల్లించి.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజిస్ట్రేషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో రెండు ఆప్షన్లు ఉంటాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఈ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ కావాలి. తర్వాత ఆన్లైన్లోనే దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ కార్డులు, ఫొటోలు, పదవ తరగతి ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లించాలి. తర్వాత ఆన్లైన్ దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్‌కు ఇస్తే వారు పరిశీలించి సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయ్యాక వివాహ ధ్రువీకరణ పత్రం ఆన్లైన్లో వస్తుంది. సబ్ రిజిస్ట్రార్ సాధారణ సంతకం కాకుండా డిజిటల్ సంతకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రుసుం సైతం సులభతరంగా చెల్లించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్ అథంటిఫికేషన్ ఆన్లైన్లో పొందే చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక వివాహాలకు మరో విధంగా: హిందూ వివాహ పద్ధతిలో జరగని వాటిని ప్రత్యేక వివాహాలుగా పరిగణిస్తారు. ప్రత్యేక వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం మరోలా ఉంటుంది. నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలుసుకునేందుకు నెల రోజుల పాటు నోటీసులో ఉంచుతారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ముమ్మిడివరంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటుగా, ఆలమూరు, అల్లవరం, అంబాజీపేట, అమలాపురం, ఆత్రేయపురం, ద్రాక్షారామ, ఐ.పోలవరం, కొత్తపేట, మలికిపురం, మామిడికుదురు, మండపేట, ముమ్మిడివరం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. జిల్లాలో ద్రాక్షారామ, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, రాజోలు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకు సరాసరిన 100 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరిగినట్లు సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. -
విడాకులు తీసుకున్నారా? మరి పెళ్లి ఫోటోల సంగతేంటి?
ఫొటోలు బాగా తీసే స్టూడియోలున్నట్లే.. ఫొటో హార్డ్ కాపీలను చిత్తు చిత్తుగా చించేసే స్టూడియో కూడా ఉంది.. రష్యాలో! పెళ్లి ఫెయిలై.. విడాకులు తీసుకున్న చాలామంది దంపతులు తమ పెళ్లి ఫొటో హార్డ్ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్ అడ్డొచ్చి, బయట పడేస్తే ఆ ఫొటోలను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంటుందని భయపడి.. ఇలా రకరకాల కారణాలతో వాటిని ఏమీ చేయలేక.. అలాగని ఇంట్లో పెట్టుకోనూలేక సతమతమవుతుంటారు. ఆ బాధను అర్థం చేసుకున్న లియు బైలు అనే వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటే చేశాడు ‘వెడ్డింగ్ ఫొటోస్ ష్రెడింగ్ బిజనెస్’ స్టూడియోతో! డైవోర్స్ తీసుకున్న కపుల్స్ తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో కప్పేసి.. వాటిని ష్రెడింగ్ మెషిన్లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఆ ఫుటేజ్‌ని క్లయింట్‌కు పంపుతాడు. ఇప్పుడు ఇతని స్టూడియోకి విపరీతమైన గిరాకీ పెరిగి మూడు ఫొటోలు ఆరు రూబుళ్లుగా బిజినెస్ సాగుతోందట. -
వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!
ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings) -
పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం హీరోయిన్.. వరుడు ఎవరంటే?
ముంగారు పర్మ సినిమాతో శాండల్‌వుడ్‌లో ఫేమస్ అయిన నటి పూజా గాంధీ. ఆమె త్వరలోనే పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించి పూజా గాంధీ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కాగా.. దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పూజా. అయితే పూజా గాంధీకి విజయ్ స్వయంగా కన్నడ నేర్పించారట. బెంగాలీ అమ్మాయి అయినా పూజా సినిమా రంగంలోకి రావడానికి బెంగళూరు వచ్చినప్పుడు విజయ్ ఆమెకు కన్నడ మాట్లాడటం నేర్పించాడని అంటున్నారు. విజయ్ సహకారంతోనే పూజా గాంధీ కన్నడ నేర్చుకుని సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం వల్లే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారని శాండల్‌వుడ్ లేటేస్ట్ టాక్. కాగా.. ముంగారు వర్మ సినిమాలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో కలిసి పూజా గాంధీ నటించింది. ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించింది, శాండల్‌వుడ్‌లో ఫేమస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. కాని అనివార్య కారణాలతో నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే వీరి బంధం విడిపోయింది. అంతకుముందే సినిమా డిస్ట్రిబ్యూటర్ కిరణ్‌ను పూజా గాంధీ పెళ్లి చేసుకున్నారనేది వార్త బయటకొచ్చింది. పూజా గాంధీ కెరీర్... పూజా గాంధీ ప్రధానంగా కన్నడ, తమిళ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఖత్రోన్ కీ ఖిలాడీ, దుష్మణి, తమోకే సలామ్, కొక్కి వంటి చిత్రాల్లో కనిపించారు. 2006లో మాన్సూన్ రైన్ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిలన్, కృష్ణ, మన్మథ చిత్రాల్లో నటించారు. తమిళంలో తోతల్ పో మలరం, వైతేశ్వరన్ చిత్రాల్లో నటించారు. కన్నడలో పాయా, హనీ హనీ, యాక్సిడెంట్, కామన్న కొడుకులు, నీ టాటా నా బిర్లా, తాజ్ మహల్, కొడగన్నా కోలి నుంగిట్టా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. -
మూడు రోజుల్లో పెళ్లి.. వరుని ఇంట్లో వధువు మృతి
కర్ణాటక: పెళ్లిపత్రికలు పంచారు, వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది, ఇంతలోనే ఘోరం జరిగింది. తాలూకాలోని టీబీ డ్యాం వద్ద మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి అనుమానాస్పదరీతిలో శవమైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు..టీబీ డ్యాం నివాసి ఐశ్వర్య (26) అనే యువతి వరుని ఇంట్లో విగతజీవిగా మారింది. వివరాలు.. అశోక్ (27), ఐశ్వర్య ఇద్దరు టీబీ డ్యాం వాసులు కాగా ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేర్వేరు కులాల వారు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పలు షరతుల ప్రకారం వివాహానికి సిద్ధమయ్యారు. తమ సంప్రదాయ ప్రకారం పెళ్లాడదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడని, తమ తరఫు నుంచి ఎవరూ రావద్దని చెప్పారని అమ్మాయి బంధువులు తెలిపారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుందని హఠాత్తుగా కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు. ఇది హత్యే: యువతి తండ్రి వారితో మనకు పొసగదని, ఈ పెళ్లి వద్దు అని మా కూతురికి చెప్పాం. ఆమె చాలా దృఢమైన మనస్సు గలది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, యువకుడి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి సుబ్రమణి మాట్లాడుతూ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి వద్దని నేను వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, 15వ తేదీన ఆమె అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాము. 16వ తేదీన అశోక్ ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. అంతకుముందే వారు రెండు ఆస్పత్రులకు ఆమెను తీసుకెళ్లారు. ఎలా చనిపోయిందో తెలియదు అని వాపోయారు. అశోక్ కుటుంబమే హత్య చేసిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వరున్ని అరెస్టు చేశారు. -
ప్రియుడి కోసం పాక్ చెక్కేసిన అంజూ..మళ్లీ వార్తల్లోకి, స్టోరీ ఏంటంటే?
ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజూ అలియాస్ ఫాతిమా గుర్తుందా. ఈ ఫాతిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ పాక్‌లోని మారుమూల గ్రామానికి వెళ్లి ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ త్వరలోనే భారతదేశానికి రానుంది. అంజూ తన పిల్లల్ని కలిసేందుకే భారత్ వెళ్లేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోందని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుందని నస్రుల్లా చెప్పారు. తాము ఇస్లామాబాద్‌లో విదేశీ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యమైనప్పటికీ, అది రాగానే అంజూ భారత్ వెళుతుందని నస్రుల్లా తెలిపారు. భారత్‌లో ఉన్న తన పిల్లల్ని కలిసిన తర్వాత ఆమె తిరిగి పాకిస్తాన్‌కు వస్తుందన్నారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్) కాగా ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లింది అంజూ. అయితే తమది ప్రేమలేదు దోమా లేదు..పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ముందు చెప్పినప్పటికీ ఆ తరువాత ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారడం తెలిసిందే. ఆగస్టులో ఈమె వీసానుమరో ఏడాది పాటు పొడిగించింది. అయితే నస్రుల్లాతో ప్రేమ, పెళ్లికి ముందే అంజూకి రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. 20 ఏళ్లకు పైగా చిత్రసీమలో తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నటి త్రిష స్పందించింది. చేతినిండా సౌత్ ఇండియాలోని అగ్ర హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఆమె దూసుకుపోతున్న సమయంలో తనపై పెళ్లి పుకారు దావానలంలా వ్యాపిస్తున్న వేళ, దానికి ముగింపు పలుకుతూ త్రిష చేసిన బోల్డ్ ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) ప్రియమైన 'మీరు మీతో పాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. శాంతంగా ఉండండి. ఇంతటితో ఈ పుకార్లు ఆపండి. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా హీరో విజయ్‌కి చెందిన లియో సినిమా ప్రమోషన్ కీప్ కామ్‌గా ప్రమోట్ అవుతుండటంతో, నటి త్రిష కూడా అదే పదాలను ఉపయోగించి ఈ ట్వీట్ చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఇది విజయ్, అతని బృందానికి వార్నింగ్? ఇస్తున్నావ్ కదా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ) వరుసగా విజయ్, అజిత్ సినిమాల్లో త్రిష రొమాన్స్ చేయనుంది. ఇది ఎవరికో నచ్చకనే ఆమెపై ఇలాంటి కుట్రలు చేస్తూ.. పుకార్లు పుట్టిస్తున్నారని ప్రచారం జరగుతుంది. గత కొన్ని నెలలుగా త్రిషపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో ఓపిక పట్టిన నటి త్రిష ఇప్పుడు ఎవరినో ఒకరి టీమ్‌ను తను గుర్తించిన తర్వాతే ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. DEAR “YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM”, “KEEP CALM AND STOP RUMOURING” CHEERS! — Trish (@trishtrashers) September 21, 2023 -
రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది రెండో సారి పెళ్లి పీటలు ఎక్కాడు. మంగళవారం(సెప్టెంబర్19)న కరాచీలో తన భార్య అన్షా ఆఫ్రిదిని షాహీన్ మరోసారి నిఖా చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే షాహీన్ బీజీ షెడ్యూల్ వల్ల అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరిద్దరి వివాహం జరిగింది. దీంతో మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్-అన్షా భావించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిఖా మరోసారి జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సహచర ఆటగాళ్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అన్షా ఎవరో కాదు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూతురే. ఇక రెండో సారి పెళ్లి చేసుకోవడంపై అఫ్రిది స్పందించాడు. "అల్లా మనల్ని జంటగా సృష్టిస్తాడు. మరొక మనిషిని ప్రేమించేలా చేస్తాడు. ఇస్లాం ప్రకారం త్వరగా వివాహం చేసుకోండి. మీ భాగస్వామితో జీవితాన్ని ఆనందించండి. హరామ్(డేటింగ్) సంబంధాలకు దూరంగా ఉండండి" అంటూ అఫ్రిది ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఇక షాహీన్ ఆసియాకప్-2023లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా అఫ్రిది నిలిచాడు. ఓవరాల్‌గా 5 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 10 వికెట్టు పడగొట్టాడు. మళ్లీ వన్డే ప్రపంచకప్‌తో షాహీన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. చదవండి: #Nasir Hossain: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ALLAH Pak creates us in pairs and grants us love in our hearts to love another human being. Get married fast according to Islam and enjoy life with your partner and stay away from haram relationships pic.twitter.com/NNyyyshjCW — Shaheen Shah Afridi (@iShaheenAfridi_) September 19, 2023 -
ఇద్దరబ్బాయిలకు పెళ్లి
కర్ణాటక: ఈ ఏడాదిలో వానలు లేకపోవడంతో గ్రామస్తులు వినూత్నంగా ఇద్దరు మగపిల్లలకు పెళ్లిచేసి వరుణ దేవుడు కరుణించాలని పూజలు చేశారు. ఈ విచిత్ర సంఘటన చింతామణి తాలూకాలోని హిరేకట్టిగానహళ్లి గ్రామంలో జరిగింది. ఈ మాదిరిగా పెళ్లిళ్లు చేస్తే వర్షాలు పడతాయని నమ్మకం. దీంతో ఆ గ్రామానికి చెందిన శివానందకు వరుడు, నాగప్ప అనే బాలునికి వధువు తరహాలో సింగారించి మూడుముళ్ల వేడుక జరిపించారు. కాగా, వరుణుడు కొండెక్కడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేసిన పంటలు ఎండిపోయాయి, చెరువులు, వాగుల్లో నీరు కరువై పశుగ్రాసం, పశువులకు నీళ్లు కరువయ్యాయి. ప్రజలకు మంచినీటికి కూడా కొరత ఏర్పడింది. -
10 రోజుల్లో పెళ్లి.. వధూవరులకు షాక్ ఇచ్చిన పెంపుడు కుక్క
ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఇప్పటివరకు సినిమాల్లో, నిజజీవితంలోనూ చూశాం. కొన్ని ప్రత్యేకమైన కారణాలు, అనుకోని ట్విస్ట్‌ల కారణంగా ఇలా జరుగుతుంటాయి. అయితే ఓ పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఆ వరుడు కుక్క చేసిన పనికి తల పట్టుకున్నాడు. ఇంతకీ ఆ పెంపుడు కుక్క ఏం చేసింది? పెళ్లి ఆగిపోయిందా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. ఈ వేడుకను కలకాలం గుర్తించుకునేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇప్పుడైతే చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అమెరికాలోని ఓ జంట కూడా తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో ఉండగానే వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదరింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తో పాటూ పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. కొన్ని పెళ్లి పనులు మిగిలి ఉండగా వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ఆగస్టు 31న ఇటలీలో తన పెళ్లి జరగనుందని, ఇలాంటి సమయంలో తన కుక్క చేసిన పనికి ఏం చేయాలో తెలియడం లేదని, ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా అభ్యర్థించాడు. లేదంటే తాను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్లిపోతారని అధికారులకు మొర పెట్టుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆగస్టు 31న జరగాల్సిన వాళ్ల వివాహం జరుగుతుందా? అధికారులు చూపించిన ఆ ప్రత్యామ్నాయం ఏంటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!
బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నిత్యామీనన్‌కు మంచి గుర్తింపు ఉంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. దీంతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారట. (ఇదీ చదవండి; బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) అంతేకాకుండా తనకు 35 ఏళ్లు వచ్చాయని ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని వారు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా నిత్యామీనన్ పెళ్లి విషయంపై చాలా వార్తలే వచ్చాయి. కానీ వాటిని ఆమె వెంటనే కొట్టిపారేసేది కూడా. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్ అవుతుంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని తెలుపుతున్నారట. (ఇదీ చదవండి: అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) ఆమె పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటూనే పేరు మాత్రం వారు రివీల్ చేయడం లేదట. గతంలో తన పెళ్లి విషయంపై ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే నిత్యా ఈసారి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తన పెళ్లి వార్త నిజమేనని, త్వరలో ఆమె అధికారికంగా ప్రకటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిత్యామీనన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరోసారి భారీగా ట్రెండ్ అవుతుంది. -
40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'పొన్నియిన్ సెల్వన్' నుంచి వచ్చిన రెండు భాగాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. మొదట 'లేస.. లేసా' అనే తమిళ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ సంచలన నటి అక్కడ 'సామి' చిత్రంతో కమర్షియల్ సినిమాల హీరోయిన్ లిస్టులో చేరిపోయారు. (ఇదీ చదవండి: మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు) ఆ తర్వాత వరుసగా సౌత్ ఇండియా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర నటి స్థాయికి ఎదిగారు. అలా 20 ఏళ్ల తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్'లో యువరాణి కుందవైగా కనిపించి మరోసారి తన సత్తాను చాటిన త్రిష సమీప కాలంలో తన 40వ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు . కాగా నటిగా కెరియర్ సక్సెస్ బాటలో పయనిస్తున్న వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ ఆమెను త్రిషపై ప్రేమ వదంతులు చాలానే దొర్లుతున్నాయి. ఒకసారి ఈమె పెళ్లి విషయంలో నిశ్చితార్థం వరకు వెళ్లి ఆపై ముందుకు సాగలేదు. ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) ఇటీవల ఒక భేటీలో ఈమె పెళ్లి బంధంపై స్పందిస్తూ తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని కొద్ది ఏళ్లకే విడాకులు గురించి మాట్లాడుకోవడం తన చెవికి చేరిందన్నారు. అందుకే తనతో జీవితాంతం సంతోషంగా కలిసి పయనించే వ్యక్తి తారసపడితేనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా త్రిష ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్‌లో వరుసగా తాను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లినట్లుందా..? అంటూ నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు. కాగా ప్రస్తుతం త్రిష నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటించిన చిత్రం ఇది. తాజాగా అజిత్‌తో విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్‌ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్‌కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్‌మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్‌స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్‌నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్‌కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
తమిళనాడు అబ్బాయి.. ఇథియోపియా అమ్మాయి
తమిళనాడు: ఇథియోపియా అమ్మాయితో సేలం అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ వేడుక మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. సేలం జిల్లా అత్తార్ సమీపంలోని కల్పగనూర్ గ్రామానికి చెందిన సెల్లదురై కుట్టి మార్క్స్(32), ముంబై యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. తనతో పనిచేసిన ఇథియోపియన్ అసోసియేట్ ప్రొఫెసర్ రియార్ మెన్బారే అక్లీలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులను సంప్రదించారు. సెల్లదురై కుట్టిమార్క్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో పెత్తనాయకన్పాళయంలోని హిందూ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక జరిగింది. బంధువుల సమక్షంలో చెల్లదురై కుట్టి మార్క్స్, మెన్బారే అక్లీ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
సన్నాయి మేళంలో రాణిస్తున్న మండపేట మహిళలు
మండపేట: హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. శుభకార్యాలు, వేడుకలకు సన్నాయి మేళం తప్పనిసరి. నాదస్వరం పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. అందుకు భిన్నంగా మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన మహిళా కళాకారులు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఈ గ్రామంలో ఏకంగా పది మందికి పైగా మహిళా కళాకారులుండగా.. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఏడిదలోని వెంటూరి సాహెబ్ కుటుంబం డోలు, సన్నాయి వాయిద్యానికి ప్రసిద్ధి. తమ ఇంట ఈ కళకు 80 ఏళ్ల క్రితం ఆయనే ఆజ్యం పోశారు. సాహెబ్ తదనంతరం ఆయన కుమారులు, మనవలు, మునిమనవలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీతారలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చి గ్రామానికి గుర్తింపు తెచ్చారు. ఎంతోమంది కళాభిమానులు వీరి నైపుణ్యానికి మెచ్చి గండపెండేరాలు, సింహతలాటాలు, బంగారు కడియాలతో సత్కరించారు. గత ఐదు తరాల్లో 25 మందికి పైగా సాహెబ్ కుటుంబీకులు నాదస్వర కళను నేర్చుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో మేము సైతం అంటూ ఆ ఇంట మహిళలు వాయిద్య కళలో రాణిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణ సన్నాయి మేళంలో వాయిద్య పరికరాలు డోలు, సన్నాయి, చిన్న హార్మోనియం (శ్రుతి బాక్స్), తాళం ఉంటాయి. ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకూ సభ్యులుంటారు. సాధారణంగా పురుష కళాకారులే ఆయా వాయిద్యాలను వాయిస్తూంటారు. అయితే ఏడిద సన్నాయి మేళంలో మహిళా వాయిద్య కళాకారులు ప్రత్యేక ఆకర్షణ. గ్రామంలోని సాహెబ్ కుటుంబానికి చెందిన మూడు సన్నాయి మేళం బృందాలుండగా.. వీటిలో పది మందికి పైగా మహిళా కళాకారులే ఉండటం గమనార్హం. సాహెబ్, తర్వాత ఆయన తనయులు, మనవలు ఎంతో మందికి డోలు, సన్నాయి వాయించడంలో శిక్షణ ఇస్తున్నారు. వారితో పాటు తమ ఇంట్లోని ఆడపిల్లలకు కూడా నేర్పిస్తూంటారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సన్నాయి మేళంలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. మగవారితో సమానంగా డోలు, సన్నాయి అలవోకగా వాయిస్తూ వివిధ వేడుకలకు మరింత శోభను తీసుకువస్తున్నారు. కుటుంబ పోషణలో చేదోడువాదోడవుతున్నారు. అంతా ఒకటే కుటుంబం ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడకు బృందంలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి వీరు వెళ్తూంటారు. గత పదేళ్లలో ఉభయ రాష్ట్రాలతో పాటు రాజాస్తాన్‌లో వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన వివాహాది శుభకార్యాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మండపేట, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వేడుక జరిగినా మహిళలతో డోలు, సన్నాయి మేళం ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో మహిళా వాయిద్య కళాకారుల ప్రాధాన్యం పెరిగింది. చదువుతో పాటు తమ ఇంట ఆడపిల్లలకు వాయిద్య కళలో శిక్షణ ఇస్తూంటామని కళాకారుడు వెంటూరి మీరా సాహెబ్ (చిన్న) తెలిపారు. సరదాగా చేసిన సాధనే ఉపాధి అయ్యింది నా చిన్నతనంలో ఏడిదలో మా తండ్రి సత్యనారాయణ చాలా మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు. వారితో పాటు నేనూ సరదాగా సన్నాయి వాయిద్యం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ విద్యే మాకు మంచి గుర్తింపు తెచ్చింది. కుటుంబ పోషణకు ఆసరా అవుతోంది. – డి.సీతారత్నం, వాయిద్య కళాకారిణి, మండపేట ఎంతో గౌరవంగా చూస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలు, శుభకార్యాల్లోను, సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వివిధ వేడుకల్లోను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. ఆయా చోట్ల నిర్వాహకులు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంటారు. – వెంటూరి రమాదేవి, వాయిద్య కళాకారిణి, ఏడిద గ్రామానికి గుర్తింపు తెచ్చారు డోలు, సన్నాయి కళలో వెంటూరి సాహెబ్ కుటుంబం రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ప్రత్యేకంగా పురుషులతో సమానంగా మహిళలు ఈ కళను నేర్చుకుని కుటుంబ పోషణలో భాగస్వాములు కావడం అభినందనీయం. – బూరిగ ఆశీర్వాదం,సర్పంచ్, ఏడిద -
ప్రేమకు రోగాలు అడ్డుకావని నిరూపించారు
తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్ఆర్ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు. -
''అంత తొందరేంటో''? వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు
డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకోకపోవడం గ్రేట్ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
పెళ్లి ఆగిపోయిందని బలవన్మరణం
కొరుక్కుపేట: పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుదుచ్చేరిలోని లియోనూర్ సమీపంలోని బంగోర్ గంగయమ్మన్ కోయిల్ వీధికి చెందిన విమల కుమారుడు భాస్కరన్ (28) పుదువాయిలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి రెండు వారాల క్రితం నిశ్చితార్థం అయింది. ఇంతలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భాస్కరనన్ ఆదివారం రాత్రి కందియాంగుప్పం రైల్వేగేటు సమీపంలో నడుచుకుంటూ వెళ్లి విల్లుపురం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ఎదురు వెళ్లాడు. రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రైలు ఆపి అతడిని ఎక్కించుకుని చినబాబుముట్రం స్టేషన్లో దించారు. జిప్‌మార్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు జిప్మర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విల్లుపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేరేవాళ్ల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. అది అక్కడి సంప్రదాయం
ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా ఇది అక్కడి ఆచారమట. పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ► మన దేశంలో బీహార్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే ‘రాక్షస వివాహం‘. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. ► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ►ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు. ► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట. -
ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మితో లవ్‌ట్రాక్ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. వీరిద్దరి జోడికి టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మిలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. కానీ వీరిద్దరిపైన వచ్చినన్ని పెళ్లి పుకార్లు మరే నటులపై వచ్చి ఉండవు. (ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ) వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఆమెతోనే సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం కూడా వారి దగ్గరి బంధువుల మధ్య జరిగిందని తెలుస్తోంది. దీంతో రష్మీ- సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు. గత రెండురోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న సుధీర్ స్పందించకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంటన్నా..? రష్మీతో రీల్ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు. కాబట్టి అదే రియల్ చేస్తారు అనుకున్నాం అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ.. సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్‌తో ప్రేమా, పెళ్లిపై గతంలో రష్మి ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య ఉండేది ఎలాంటి బంధం అని గతంలో రష్మిని అడగ్గా.. 'మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది' అని రష్మి తెలిపారు. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
అమ్మాయిలు ఏ వయసులో పెళ్లిచేసుకోవాలి? 30 దాటితే ప్రెగ్నెన్సీ కష్టమేనా?
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. ఈ సామెత వచ్చింది కూడా పెళ్లి గురించే. ఒకప్పుడు అంటే ఆడపిల్లలకు 18ఏళ్లు రాగానే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి విషయంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఆలోచన ధోరణి కూడి మారింది. అసలు లైఫ్‌లో పెళ్లి అంత ముఖ్యం కాదు.. చేసుకోవాలని లేదు అని ఈ కాలం యువత అనుకుంటున్నారట. ఆరోగ్యరీత్యా ఆడపిల్లలు ఏ వయసులో పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి సరైన సమయం? 30తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తోంది. దాంతో పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలు తీసుకోవడానికి తొందరపడట్లేదు. అనేకంటే సిద్ధంగా ఉండట్లేదు అనొచ్చేమో! అందుకే 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీతో వచ్చే అమ్మాయిలను ఎక్కువగా చూస్తున్నాం. ఎర్లీ మ్యారెజెస్లో ఇంకో రకమైన సమస్యలను చూస్తున్నాం. కాబట్టి పెళ్లికి ఏది సరైన వయసు అని చెప్పడం కాస్త కష్టమే. అయితే ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28–32 ఏళ్ల మధ్య వయసును బెస్ట్ ఏజ్‌గా చెప్పాయి కొన్ని అధ్యయనాలు. ఈ వయసుకల్లా అటు వృత్తిపరంగా స్థిరపడడమే కాక పెళ్లి, పిల్లలు వంటి నిర్ణయాలు తీసుకునేందుకు మానసికంగానూ సంసిద్ధత వచ్చేస్తుంది. శారీరక ఆరోగ్యమూ సహకరిస్తుంది. ఎమోషనల్గానూ బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయిల్లో.. నేచురల్, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామందిలో మారిన జీవన శైలి వల్ల అండాల నాణ్యతా తగ్గిపోతుంది. ఏఎమ్‌హెచ్ అనే పరీక్షతో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లల్ని కనడమూ ఆలస్యమవుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి 28–30 ఏళ్ల మధ్య వయసులో పెళ్లి ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ తగ్గుతాయి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
కాబోయే మెగా కోడలు.. ఆ విషయంపై తెగ వెతికేస్తున్నారు!
టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఓ వైపు సినిమాల్లో మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ ఏడాదిలో తను ప్రేమించిన మెగాహీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడనుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 9న నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అందువల్ల ఆమె పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సందర్భంలో కొందరు నెటిజన్లు మాత్రం లావణ్య క్యాస్ట్ కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. సెలబ్రిటీల బయోడేటాను తెలుసుకునేందేకు చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఈ బ్యూటీ వచ్చి చేరింది. లావణ్య క్యాస్ట్ ఏంటి? అని నెటిజన్లు వెతకడంతో ఆమె పేరు గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ అయిపోయింది. (ఇదీ చదవండి: అతనొక స్టార్ కమెడియన్.. అలా చేస్తారనుకోలేదు: ప్రగతి) ఉత్తర ప్రదేశ్, ఫైజాబాద్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించిన ఈ అమ్మడు.. డెహ్రడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది కాగా, తల్లి రిటైర్డ్ టీచర్. తనకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. తమ కుటుంబంలో క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యత ఉండదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది లావణ్య. 'మనం చేసే పనుల వల్ల మాత్రమే గొప్ప వాళ్లం అవుతాం. అంతేకాని కులం వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు' అని గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇవే మాటలను మెగా ఫ్యాన్స్ నెటిజన్లకు గుర్తు చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెబుతూ.. మెగా కుటుంబంలో కూడా క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వరు అని వారు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ క్యాస్ట్ గోల ఏంటి? అని తప్పుబడుతున్నారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్!) -
డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి
టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో విభిన్నమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. పలు వీడియోలతో తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఆమె వర్క్ అవుట్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లికి ముందు తాను అనుభవించిన కష్టాల గురించి ప్రగతి చెప్పు కొచ్చింది. (ఇదీచదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) ఇంట్లో ఊరికే తింటున్నావ్ అనేలా తన అమ్మ చేసిన కామెంట్లు నచ్చేవి కావని ఆమె తెలిపింది. దాంతో పిజ్జా షాపులో పని చేశానని ఆమె పేర్కొంది. అంతే కాకుండా డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని ప్రగతి తెలిపింది. నేను ఆ సమయంలో లడ్డూలా ఉండే దానిని, అందువల్ల ఒక యాడ్ చేయమని కొందరు అడిగారని తెలిపింది. అలా మోడలింగ్‌లోకి వచ్చాక హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయానని చెప్పు కొచ్చింది. ఆ సమయంలో హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుని 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొంత కాలానికి తన భర్తతో విభేదాలు రావడం వల్ల విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
పెళ్లి ఆపాలని ప్రియురాలు ఫిర్యాదు
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గవరపాలెంలో శనివారం జరిగిన వివాహ వేడుకలో హడావిడి నెలకొంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒక ఎన్ఆర్ఐ యువకుడు మోసం చేశాడని యువతి పోలీస్ ఉన్నతాధికారులకు డయల్ 100 నంబరుకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె అక్కడ నుంచి శనివారం అర్ధరాత్రి బయలుదేరింది. ఇంతలో ఆ యువతి అక్కను వెంటబెట్టుకుని అనకాపల్లి పట్టణ ఎస్సై దివాకర్ గవరపాలెంలోని వివాహ వేడుక వద్దకు వెళ్లారు. అక్కడ సదరు యువతితో పెళ్లికొడుకు కలసి తీసుకున్న ఫొటోలను చూపించి పెళ్లిని ఆపడానికి ప్రయత్నించారు. అయితే పెళ్లికొడుకు బంధువులు ఫిర్యాదు చేసిన యువతి ఉండాలని చెప్పి యథావిధిగా పెళ్లి జరిపారు. ఈ విషయమై పోలీసులను అడగగా.. యువతి వస్తే గాని కేసు నమోదు చేయలేమని అన్నట్లు సమాచారం. -
త్వరలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి? కూతురు వయసున్న ఆమెతో..
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
లేటు మ్యారేజీలతో రెండో సంతానం అసాధ్యమవుతోంది
పెళ్లి సంబంధం కుదరడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. పరిచయ వేదికలు, పేరయ్యలు, బంధువర్గమంతా గాలించినా సరైన జోడీ కుదరక నానా తంటాలు పడుతున్నారు. అమ్మాయికి గరిష్టంగా 25 ఏళ్లకైనా కావాల్సిన పెళ్లి వాయిదాల పర్వంతో 30 దాటుతోంది. లేటు మ్యారేజీల వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈడూజోడు కుదిరి పాతికేళ్ల వయసు దాటకుండా పెళ్లయితే ఆరోగ్య వంతులైన పిల్లలు పుడతారు. కానీ అబ్బాయికి 35, అమ్మాయికి 30 దాటాక పిల్లలు కనడం అతి పెద్ద ఇబ్బంది అయ్యింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకప్పుడు వధూవరుల ఎంపికలో పెద్ద పట్టింపులు లేవు. ఇప్పుడేమో పట్టిపట్టి చూస్తున్నారు. జాతకాలు కలవాలి. చదువు, ఉద్యోగంలో అమ్మాయిల స్థాయిని చూస్తున్నారు. అన్నీ కుదిరినా జాతకం కుదరకపోతే చివరి నిమిషంలో సంబంధం రద్దు చేసుకుంటున్నారు. ఒకవేళ జాతకం కుదిరినా అబ్బాయి తరఫు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నా.. మంచి ఉద్యోగం ఉండి ఆస్తి లేకపోయినా అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు తదనంతరమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏటా 55 వేలకు పైగా పెళ్లిళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుండగా.. అందులో 30 శాతం లేటు మ్యారేజీలే. ఇందులో ఎక్కువగా స్థాయికి తగ్గట్టు సంబంధాలు కుదరకపోవడమే. అన్నిటికీ మించి లేటు మ్యారేజీల కారణంగా హార్మోన్ల సమతుల్యత లోపించి రకరకాల గర్భకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మగవాళ్లలో సైతం ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా యుక్తవయసులోనే డయాబెటిక్, హైపర్‌టెన్షన్ సమస్యలు ఎదుర్కొని లైంగిక సమస్యలతో సంతానానికి నోచుకోలేకపోతున్నారు. అసలే సమస్యలు.. ఆపై గ్యాప్ పెళ్లిళ్లు కావడమే జాప్యం జరుగుతూ ఉంటే వీరిలో 70 శాతం మంది వెంటనే బిడ్డలు పుట్టకుండా ఓరల్పిల్స్ తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో 40 ఏళ్లు సమీపిస్తున్న వేళ తొలి కాన్పు అవుతోంది. ఇక రెండో కాన్పునకు అవకాశమే లేకుండా పోతోంది. ఈ కారణాలతో జిల్లాలో జనన రేటు గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక జంట సగటున ఇద్దరిని కనాలి..అలాంటి ఈ రేషియో 1.7కు పడిపోయింది. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది. రెండో బిడ్డకు ఇబ్బంది 28 ఏళ్ల లోపు పిల్లలు పుట్టడం పూర్తి కావాలి. కానీ పెళ్లే 30 ఏళ్ల తర్వాత అంటే మొదటి బిడ్డకే ఆగిపోవాల్సి వస్తుంది. చాలామంది పెళ్లవగానే రెండుమూడేళ్లు బిడ్డలు పుట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వివాహం లేటు వయసులో చేసుకోవడం వల్ల ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి)లో సమస్యలు తలెత్తుతున్నాయి. యుక్తవయసులో పెళ్లి చేసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. – డాక్టర్ వినూత్న, గైనకాలజిస్ట్ విలాస జీవితం.. జాతకాల పిచ్చి బాగా డబ్బుండాలి.. ప్యాకేజీ ఉండాలి.. విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ ఇప్పుడు కీలకమయ్యాయి. వీటికి తోడు జాతకాల పిచ్చి ఎక్కువైంది. ఇవన్నీ సరిపోయే అబ్బాయి లేదా అమ్మాయి కావాలంటే ఏళ్ల తరబడి వెతకాల్సిందే. దీంతో వివాహం తీవ్ర జాప్యం అవుతోంది. జీవితంలో సెటిల్ కావడం అనే అర్థమే మారిపోయింది. –సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగి -
లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్?
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పనున్నాడట. హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్‌తేజ్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. వచ్చే నెల జూన్‌లోనే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య-వరుణ్‌లు తమ రిలేషన్‌షిప్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు సమాచారం. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇక రీసెంట్‌గానే నాగబాబు సైతం వరుణ్‌తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, దీనిపై స్వయంగా వరుణ్ అనౌన్స్మెంట్ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పెళ్లికి ముందురోజు పరీక్షకు హాజరు
పెద్దపల్లి: పెళ్లికి ఒక్క రోజు ముందు బయటకు వెళ్లడం కష్టమైనప్పటికీ చదువుకోవాలన్న పట్టుదల ఆ అమ్మాయిని పరీక్ష హాల్‌కు నడిపించింది. పెళ్లి కొడుకు సహకారం అందించాడు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతవాడకు చెందిన ఈర్నాల పద్మావతి కోరుట్లలో బీఎస్పీ (బీజడ్సీ) సెకండియర్ చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగనుంది. మూడు రోజుల ముందుగానే పెళ్లి కూతుర్ని చేయడం వంటి కా ర్యక్రమాలు నిర్వహించారు. గురువారం పరీ క్షకు హాజరైంది. శుక్రవారం కూడా మరో పరీక్ష ఉందని, పెళ్లి కార్యక్రమం ముగియగానే భర్తతో వెళ్లి పరీక్ష రాస్తానని పద్మావతి తెలిపింది. -
వరుసకు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో...
సాక్షి, తిరుపతి: తమకు ఇష్టంలేని పెళ్లి చేస్తారేమోనని వరుసకు అక్కాచెల్లైళ్లెన ఇద్దరు యువతులు ఆదివారం కూల్‌డ్రింక్‌లో విషపుగుళికలు కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వీరిలో ఒకరు నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాజికండ్రిగ గ్రామంలోని స్వర్ణముఖి నది కాజ్ వద్ద చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ నరసింహరావు తెలిపిన వివరాల మేరకు.. ఓజిలి మండల, కొత్తపేట గ్రామానికి చెందిన ముమ్మడి సుబ్బయ్య, కస్తూరమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సుప్రియకు వివాహంకాగా రెండో కుమార్తె రజిత నాయుడుపేట పట్టణంలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ... కొత్తపేటలో వలంటీర్‌గా పనిచేస్తోంది. ఇదిలావుండగా.. కొత్తపేట మాజీ సర్పంచ్ బట్టా సురేష్, వీరమ్మ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర, కుమార్తె నీరజ ఉన్నారు. నీరజ బీటెక్ చదివి ఇంట్లోనే ఉంటోంది. రజిత, నీరజ ఇద్దరూ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. వరుసకు అక్కాచెల్లెళ్లు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని వీరికి సంబంధాలు చూస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని అక్కాచెల్లెళ్లు క్షణికావేశానికి లోనయ్యారు. ఆదివారం స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటామని చెప్పి నాయుడుపేట వైపు వచ్చారు. వారి వెంట విషపు గుళికలు ఉన్న డబ్బాతోపాటు కూల్‌డ్రింక్ తెచ్చుకున్నారు. తిమ్మాజికండ్రిగ గ్రామ సమీపంలో స్వర్ణముఖి నది కాజ్ వే వద్ద ఇద్దరు కూల్‌డ్రింక్‌లో విషపు గుళికలు కలుపుకుని సేవించి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. వారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే స్వర్ణముఖి కాజ్ వే సమీపంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న ఇద్దరు యువతులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. చికిత్స పొందుతూ రజిత(21) మృతువాత పడింది. నీరజ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. రజిత మృతి పట్ల ఓజిలి ఎస్ఐ ఆదిలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
కల్యాణ ఘడియలు
నిర్మల్‌చైన్‌గేట్: శుభముహూర్తాలు వచ్చేశాయి. గురు మూఢం కారణంగా ఏప్రిల్ నెలలో పెళ్లిళ్లకు శుభముహుర్తాలు లేవు. ఈనెల 3న బుధవారం నుంచి పెళ్లి భాజాభజంత్రీలు మోగనున్నాయి. జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడనున్నాయి. పెళ్లి మండపాలు ముస్తాబవుతున్నాయి. శుభలేఖల ప్రింటింగ్ పనులు పూర్తి కాగా, వంటవారు, భాజాభజంత్రీల వారు, పురోహితులు అంతా సిద్ధమవుతున్నారు. రద్దీగా దుకాణాలు ఈనెల 3 నుంచి పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఫంక్షన్ హాళ్లు ముందస్తుగా బుక్ అయ్యాయి. ఈసారి అధికంగా ముహూర్తాలు ఉండటంతో నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు మొత్తం 25 రంగాల వారికి చేతినిండా ఉపాధి ఉండనుంది. వేద బ్రాహ్మణులు, బ్యాండ్ మేళం, సౌండ్ సిస్టమ్, లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్, వంటలు చేసేవారు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రాఫర్లు, వ్యాపారులు తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండునెలల్లో మంచి రోజులు ఏప్రిల్‌లో ముహూర్తాలు లేవు. మే, జూన్ నెలలో 23 మంచిరోజుల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. జులైలో మంచి రోజులు లేవు. ఆగస్టు 19 నుంచి మంచి రోజులు ప్రారంభమై డిసెంబర్ 31 వరకు ఉన్నాయి. – పట్వారీ శ్రీనివాస్, ఆలయ పూజారి శుభముహూర్తాలు ఇలా.. ఈనెల 3 నుంచి వరుసగా 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 21, 26, 27, 28, 30, 31, జూన్‌లో 1, 3, 7, 8, 9, 10, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో శుభకార్యాలు జరగనున్నాయి. జూన్ 19 నుంచి ఆషాఢమాసం మొదలై, జులై మొత్తం అధిక శ్రావణం కావడంతో ఆగస్టు 18 వరకు ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 19న మంచిరోజులు ప్రారంభమై డిసెంబర్ 31 వరకు ఉన్నాయి. -
రూ.25 లక్షల ప్యాకేజీ.. సాఫ్ట్వేర్ ఉద్యోగం.. అయినా పెళ్లికి ఇది సరిపోదు..
పెళ్లి సంబంధం కుదరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. సంపాదన ఏడాది ప్యాకేజీ ఎంత అన్నదీ కీలకంగా చూస్తున్నారు. ‘ప్యాకేజీ’ నచ్చితేనే అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు ఓకే చేస్తున్నారు. లేకుంటే మరో ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పెళ్లి చూపులు కూడా సరికొత్త రూపు దాలుస్తున్నాయి. వధువు ఇంట జరగాల్సిన పెళ్లి చూపులకు హోటళ్లు.. ఇతర ప్రదేశాలు వేదికగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన దీప్తి డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇదే జిల్లాకు చెందిన అబ్బాయి రాకేష్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే వీరిద్దరి పెళ్లిచూపులు అయ్యాయి. వచ్చే నెల ఇండియాలో పెళ్లి జరగబోతోంది. ►గుంతకల్లుకుచెందిన సురేష్‌కు నాలుగైదు సంబంధాలు వచ్చినా.. కుదరలేదు. కారణమేంటంటే.. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లయినా పెద్ద కుటుంబం కదా ఇంతమందికి పెట్టుపోతలు కష్టమని అమ్మాయి తరఫు వారు వెనక్కు తగ్గుతున్నారు. ►ఆస్తులు, అంతస్తులు.. ముందు పది తరాలు, వెనుక పది తరాలు.. బలమూ బలగమూ ఇవి ఉంటే చాలు గతంలో అమ్మాయికి ఎలాంటి ఢోకా లేదని పెళ్లి కుదుర్చుకునే వారు. రానురాను కాలం మారింది. ఆస్తులేమోగానీ బలమూ బలగానికి చోటు లేదు. ఇప్పుడంతా ‘ప్యాకేజీ’లే. నెలజీతం ఎవరూ అడగడం లేదు. వార్షిక ప్యాకేజీ (యాన్యువల్ ప్యాకేజీ)ని బట్టి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. ప్యాకేజీ లేకపోతే వందెకరాల భూస్వామి కొడుక్కు కూడా పిల్లనిస్తామని వచ్చేవారు లేరు. అదే హైదరాబాద్.. బెంగళూరుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అమ్మాయిలకు అయితే డిమాండ్ బాగుంది. అమ్మాయిల ప్యాకేజీల పైనా ఆరా.. అబ్బాయికి ఏడాదికి రూ.25 లక్షలు ప్యాకేజీ అయినంత మాత్రాన పదో తరగతి చదివిన అమ్మాయిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు, అదీ మంచి ప్యాకేజీతో వేతనం ఉన్న వారికి త్వరగా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల విషయంలో కట్న కానుకలు రెండో ప్రాధాన్యత అంశంగా మారింది. కానుకల విషయంలో వెసులుబాటూ కలుగుతోంది. డాక్యుమెంట్లు చూపించండి ఆస్తులు, డబ్బే ఇప్పుడు పెళ్లిళ్లను కుదురుస్తున్నట్టుంది. ఆస్తులున్నట్టు చెబితే డాక్యుమెంట్లు అడుగుతున్న వారూ లేకపోలేదు. ఉమ్మడి ఆస్తులకు లెక్కచెప్పండి.. నీ వాటా ఎంత వస్తుంది, ఎప్పుడు పంచుకుంటున్నారు..మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంటుంది. ఇలాంటివన్నీ అడుగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విదేశాల్లోనే వివాహ బంధాలు అమెరికా, కెనడాల్లో స్థిరపడిన అబ్బాయిలు, అమ్మాయిలు.. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో అక్కడే పెళ్లిచూపులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడి తల్లిదండ్రులు ఆస్తులు, ఇళ్లు, డబ్బు వగైరాలు ఆరా తీసి ఓకే చేస్తున్నారు. ఇలా అయితే ప్రత్యేకంగా హెచ్1 వీసాలు, డిపెండెంట్ వీసాలు అక్కర్లేదని అక్కడికక్కడే సంబంధం వెతుక్కుంటున్నారు. ఆడపడుచులు..అన్నదమ్ములు ఉంటే.. ఉమ్మడి కుటుంబమంటే పెళ్లి చూపులకు కూడా మొగ్గుచూపని పరిస్థితి నెలకొంది. చివరకు అబ్బాయి తరఫున ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నా ఇలాంటి వాటికి అమ్మాయి తరఫు వాళ్లు మక్కువ చూపడం లేదు. ‘ఇంతమందికి మా అమ్మాయి సేవలు చేయలేదు’ అని ముఖాన్నే చెప్పేస్తున్నారు. పెళ్లవగానే అబ్బాయి వేరు కాపురం పెడితేనే వస్తామనే అమ్మాయిలూ లేకపోలేదు. హోటళ్లలోనే పెళ్లిచూపులు కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లి చూపులు ఇంటివద్ద చేయడం లేదు. ఎక్కువ సంబంధాలు వచ్చి వెనక్కు వెళుతున్నాయన్న వంక చూపిస్తారని..హోటళ్లలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇరువురూ మాట అనుకోవడం.. హోటల్‌కు రావడం కాఫీ తాగుతూ అబ్బాయి.. అమ్మాయి మాట్లాడుకోవడం. ఇదీ పెళ్లిచూపుల తంతు. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కాఫీతోనే పెళ్లిచూపులు ముగుస్తున్నాయి. ‘ప్యాకేజీ’కే ప్రాధాన్యం రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులంతా ఏడాది వేతనాని (యాన్యువల్ సాలరీ ప్యాకేజీ)కే ప్రాధాన్యమిస్తున్నారు. ఈడు జోడు, జాతకాలు, ఇతరత్రాలు అన్నీ గొప్ప సంపాదన ముందు తక్కువే అని వధూవరులు భావిస్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి కెరియర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు – బత్తలపల్లి సత్య రంగారావు, వధూవరుల పరిచయ వేదిక పిల్లల అభిప్రాయాలదే చెల్లుబాటు మేము పాతికేళ్లుగా వివాహాలు చేయిస్తున్నాం. ముందు రోజుల్లో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఆలోచించకుండా ఒప్పుకునేవారు. ఇప్పుడు పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వివాహాది సంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. అతి స్వేచ్ఛ వల్ల కూడా చాలా వివాహ బాంధవ్యాలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. –గరుడాద్రి సురేష్ శర్మ, పురోహితులు -
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుడిగాలి సుధీర్?
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మీతో లవ్‌ట్రాక్ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇకమూడు పదుల వయసు దాటినా ఇంతవరకు పెళ్లి ఊసెత్తని సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని సమాచారం. ఇంట్లో తల్లిదండ్రుల కోరిక మేరకు సుధీర్ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలోనూ సుధీర్ పెళ్లి విషయంలో పలు కథనాలు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
తొలిసారి మనోజ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన మౌనిక రెడ్డి
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో తమ బంధాన్ని పదిల పర్చుకున్నారు. ఇక మనోజ్ తొలిసారిగా తన భార్య మౌనికను ఓ టాక్ షోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తమ ప్రేమ, పెళ్లి వరకు సాగిన మానసిక సంఘర్షణలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే మౌనిక రెడ్డి తొలిసారిగా భర్త మంచు మనోజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనోజ్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మౌనిక పెళ్లి ఫోటోలను ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా ఓ టాక్ షోకి హాజరైన నేపథ్యంలో ఇద్దరూ దిగిన ఫోటోను తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో పంచుకుంది. ఇక ఇందులో మౌనిక సెలబ్రిటీ స్టైలిస్ట్ సబ్యసాచి శారీను ధరించింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భార్యతో క్యూట్ వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది.ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే వీరి పెళ్లయి నేటికి సరిగ్గా నెలరోజులవుతుంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి ఓ క్యూట్ వీడియోను పంచుకున్నారు మనోజ్. దీనికి 'ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు' అంటూ క్యాప్షన్ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల విషయంలోనూ జోరు పెంచారు మనోజ్. -
పెళ్లిపీటలు ఎక్కబోతున్న దేవీశ్రీ ప్రసాద్? వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆయన మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్ ఉందని తెలుస్తుంది. కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. గతంలోనూ దేవీ ఓ హీరోయిన్‌తో పీకలదాకా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లిన వాళ్ల రిలేషన్ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. -
వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక
కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె నటిస్తున్న చిత్రాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ప్రేమ వ్యవహారం గురించి కావచ్చు. నటి మేనక, నిర్మాత సురేష్ ల వారసురాలు కీర్తి సురేష్. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్‌తో జత కట్టిన రజనీమురుగన్ మంచి విజయాన్ని అందించింది. అలా కథానాయకిగా స్థిరపడి పోయిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే, నటనకు అవకాశం ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. దాంతోపాటు ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లోనూ తరచూ చిక్కుకుంటోంది. కీర్తీ సురేష్ పెళ్లి అని, ఓ వ్యాపార వేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయాలపై కీర్తీ సురేష్ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తొలి సారిగా ఆమె తల్లి మేనక స్పందించారు. ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధం అవుతోందనీ గాసిప్స్ చాలానే వస్తున్నాయని. అయితే కీర్తీ. ఎవరిని ప్రేమించినా ఆ విషయాలు తమకు చెబుతుందని, దాన్ని తాము బహిరంగంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. అయితే కీర్తీ ఎవరినీ ప్రేమించడం లేదని, ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అనీ చెప్పారు. కీర్తీ సురేష్ గురించి వదంతులు దొర్లుతున్నాయంటే, ఆమె నటిగా ఎదుగుతోందని అర్థం అని మేనక పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో కీర్తీసురేష్ బిజీగా ఉంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. -
నరేష్-పవిత్రా లోకేశ్‌ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! కనిపెట్టేసిన నెటిజన్లు
సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్‌కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్‌లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు. మరోవైపు.. సూపర్‌స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
అందుకే హీరోయిన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు: కృతిసనన్
'వన్ నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కృతిసనన్. తొలి సినిమా తెలుగులో చేసినా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది ఈ భామ. ప్రభాస్‌తో డేటింగ్ రూమర్స్‌తో బాగా పాపులర్ అయిన కృతిసనన్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పెళ్లిళ్లపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కృతి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు త్వరగా పెళ్లిళ్లు కావనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. వాస్తవానికి చాలామంది.. హీరోయిన్స్‌ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నటించడం అనేది వాళ్ల వృత్తిలో భాగమేనని ఇప్పటికీ అంగీకరించడం లేదు. నా కెరీర్ ఆరంభంలో నాఫ్రెండ్స్ నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ విన్నాను. హీరోయిన్స్‌ను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు అని చెప్పి నన్ను భయపెట్టాలని చూశారు. కానీ నేను వాటిని అంత సీరియస్‌గా తీసుకోకుండా హీరోయిన్గా సక్సెస్ కావడంపైనే దృష్టిపెట్టాను. ఇప్పుడు నేను కోరుకున్న కెరీర్లో రాణిస్తున్నాను' అంటూ పేర్కొంది. -
పెళ్లి తర్వాత భార్య మౌనికతో మంచు మనోజ్.. ఫోటో వైరల్
మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి వార్తలు తెరమీదకి రాగా, వాటినే నిజం చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్ మౌనిక మెడలో మూడుముళ్లు వేశాడు. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారి భార్యభర్తలయ్యారు. మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లిపనులు దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మీ ఆ ఫోటోలను షేర్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్-మౌనికల పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో మౌనిక కొడుకు ధైరవ్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మనోజ్-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. -
పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి
మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా -
సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా
మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈరోజు(శుక్రవారం)8.30 నిమిషాలకు వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే పెళ్లి వేడకు జరగనుంది. ఇప్పటికే మనోజ్ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య ఫోటోను షేర్ చేస్తూ.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ పెళ్లిపై ప్రకటన చేశాడు. ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంసభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. చాలాకాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి కూడా మనోజ్ హాజరయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆమెనే మనువాడబోతుండం విశేషం. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకోగా మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. కొంతకాలంగా మనోజ్- మౌనికలు రిలేషన్లో ఉండగా ఇప్పుడు పెల్లిబంధంతో ఒక్కటి కానున్నారు. -
జబర్దస్థ్ కమెడియన్‌ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్‌తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
కి‘లేడి’.. సోషల్ మీడియాలో గాలం.. 15 మందిని పెళ్లి చేసుకొని..
చెన్నై: ఓ మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందిని వివాహం చేసుకుని మోసం చేసింది. ఈ ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది.. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని వాణియంపాళయం గ్రామానికి చెందిన అరుల్‌రాజ్ (25) చెరుకు కార్మికుడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం సాఫీగా సాగింది. అరుల్‌రాజ్ చెరుకు చెట్లు నరికే పనుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు.. ఆ సమయంలో ఆ మహిళ తన బంధువుల వద్దకు వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిపోయేది. ఈక్రమంలో 3 నెలల క్రితం అరుల్‌రాజ్ తన చెల్లెలు పెళ్లి కోసం 7 సవర్ల నగలు, రూ.90 వేల నగదు ఇంట్లో ఉంచాడు. ఈ డబ్బును తీసుకుని అరుల్‌రాజ్ భార్య వెళ్లిపోయింది. ఎన్ని రోజులకూ రాకపోవడంతో గతంలో ఆమె చిరునామాకు వెళ్లి ఆరాతీశాడు. అయితే అది నకిలీ అడ్రస్ అని తేలింది. ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ కూడా వేరొకరిదని తేలింది. దీంతో అరుల్‌రాజ్ బన్రూటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అరుల్‌రాజ్‌ను వివాహం చేసుకున్న మహిళ వేలూరు, కోయంబత్తూరు, తిరువణ్ణామలై, ఈరోడ్‌కు చెందిన 15మంది యువకులను వివాహం చేసుకుని మోసగించినట్లు తేలింది. సోషల్ మీడియా ద్వారా యువకులతో పరిచయం పెంచుకోవడం, ఆ తరువాత పెళ్లి చేసుకుని వారి నగదు, నగలతో ఉడాయించడం ఆమెకు అలవాటని స్పష్టమైంది. ఆమెను వివాహం చేసుకున్న వారు కూడా గతంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ మహిళ కోసంగాలిస్తున్నారు. చదవండి: పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో -
మళ్లీ పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా (ఫొటోలు)
-
పెళ్లి వీడియోను షేర్ చేసిన సిద్-కియారా.. నెట్టింట వైరల్
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హొత్రలు ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలెస్‌లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పెళ్లి వీడియోను షేర్ చేసుకున్నారు. వేదికపైకి 'షేర్షా' సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ వచ్చిన కియారా సిద్దార్థ్‌ను చూస్తూ మురిసిపోయింది. పెళ్లి కాస్ట్యూమ్‌లో అద్భుతంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఇక కియారా లేత గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోగా, సిద్దార్థ్ క్రీమ్ షేర్వాణీలో కనిపించాడు. కాగా షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
ఆ హీరోతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్!.. రాయల్ వెడ్డింగ్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్ జెట్‌లో వీరు రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హొత్రా సహా సిద్-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్‌కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
రిసార్ట్ ఓనర్‌తో కీర్తి సురేష్ ప్రేమ వివాహం? క్లారిటీ ఇచ్చిన మహానటి
మహానటి చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న హిరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత ఆ స్థాయి కథా పాత్రలో నటించలేదనే చెప్పాలి. కమర్షియల్‌గా కొన్ని చిత్రాలు ఉన్నా, ఇటీవల అవి కూడా లేకుండాపోయాయి. ఈ చిన్నది కథానాయకిగా పరిచయమై దశాబ్దం అవుతోంది. చిన్నతనంలో బాలనటిగా కొన్ని చిత్రాలు చేసినా, 2013లో కథానాయకిగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లోనూ అవకాశాలు రావడంతో స్టార్‌గా ఎదిగింది. ఆ మధ్య బాలీవుడ్లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ తన స్కూల్ మేట్‌ను 13 ఏళ్లుగా ప్రేమిస్తోందని, అతను కేరళలో రిసార్ట్ ఓనర్ అని, వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు, దీంతో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు కొద్దికాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై కీర్తి సురేష్ స్పందింంది. తన ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. కాగా ప్రస్తుతం ఈమె తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా చిరంజీవికి చెల్లెలిగా బోళాశంకర్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. మరోవైపు జయం రవి సరసన సైరన్ చిత్రంతో పాటు రివాల్వర్ రిటా వంటి చిత్రాల్లో బిజీగా ఉంది. -
కేజీఎఫ్ విలన్‌ను పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
'పిల్ల జమీందార్' హీరోయిన్ హరిప్రియ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా నటించిన వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడుడుగులు వేసింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ బ్యూటీ హరిప్రియకు తెలుగు పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి నటించింది.మరోవైపు వశిష్ట సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by 𝐻𝒶𝓇𝒾𝒫𝓇𝓇𝒾𝓎𝒶 𝐹𝒸 (@hariprriyafc) -
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటీ కాబోతున్నారు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈనెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. -
అమెరికా వెళ్తున్న కూతురికి అలీ దంపతుల వీడ్కోలు (ఫొటోలు)
-
Sharwanand : హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్! పెళ్లి ఎప్పుడంటే..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఆమెతో శర్వానంద్ ఏడడుగులు వేయనున్నారట. ఇప్పటికే పెళ్లి, నిశ్చితార్థం డేట్ కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈనెల26న శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరనున్నట్లు సన్నిహితవర్గాలనుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలో శర్వానంద్ పెళ్లిచేసుకునే అమ్మాయి ఎవరా అన్న ఆరాతీయగా, ఆమె మాజీ మంత్రి మనువరాలు అని తెలుస్తోంది. దీన్నిబట్టి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి శర్వానంద్ అల్లుడు కాబోతున్నాడట. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగనుందట. ఇక పెళ్లి ఏప్రిల్‌లో ఉంటుందని.. శర్వా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. -
కూతురి పెళ్లికి మలీదా చేసిన అలీ భార్య జుబేదా (ఫొటోలు)
-
తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి? ఆమె ఎవరో తెలుసా?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకడైన హీరో శర్వనంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతోన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమెది రెడ్డి సామాజిక వర్గమని, తెలంగాణకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా శర్వా ఆమెతో ప్రేమలో ఉన్నట్లు టాక్. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారట. దీనికి సంబంధించిన శర్వానంద్ స్వయంగా అనౌన్స్మెంట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవలె బాలయ్య అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్థావన రాగా, ప్రభాస్ తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన శర్వా ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుండటం విశేషం. -
ఆ వ్యక్తిని కలవడం అద్భుతం.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా : శ్రీజ
మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ కొణిదెల కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్‌లో రకరకాల రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. భర్త కల్యాణ్ దేవ్‌తో ఆమె వైవాహిక జీవితంపై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ మరింత అనుమానాలకు తావిస్తుంది. న్యూఇయర్ సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్‌ని షేర్చేస్తూ.. ''డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశేలా చేశావ్. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమిస్తూ, కేరింగ్‌గా చూసుకుంటూ, కష్టసుఖాల్లో నాకు తోడుంటే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడే వ్యక్తి.. తనను కలుసుకోవడం అద్భుతం. కొత్త ప్రయాణం మొదలవుతుంది'' అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్గాకూతురి బర్త్‌డేను సైతం శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఈ క్రమంలో 'కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నా' అంటూ శ్రీజ వెల్లడించడం అటు మెగా అభిమానులతో పాటు నెటిజన్లలోనూ ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
పెళ్లి తర్వాత కూతుర్ని కలిసిన అలీ దంపతులు..ఫోటోలు వైరల్
-
నరేష్‌కు కలిసిరాని మూడు పెళ్లిళ్లు.. త్వరలోనే నాలుగో పెళ్లి
నటుడు నరేష్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను షేర్ చేయగా పవిత్రా-నరేష్‌ల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గతంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చాయి. మొదటగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లిచేసుకున్నాడు.వీరి కొడుకే హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి కాపురం వీరిబంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో ఆమెకు దూరంగా ఉన్న నరేష్ కొన్నాళ్లుగా పవిత్రాలోకేశ్తో సహజీవనం చేస్తున్నారు. ఇటీవలె ఓ హోటల్ రూమ్‌లో నరేష్-పవిత్రా లోకేశ్‌లను నరేష్ మూడోభార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది కూడా. సీన్‌కట్ చేస్తే.. ఇప్పుడు 62ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు నరేష్. -
కమెడియన్ అలీ కూతురి అప్పగింతల (ఫొటోలు)
-
బిగ్‌బాస్ లేడీ టైగర్ ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో
బిగ్‌బాస్ సీజన్-6కి లేడీ టైగర్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా నెగిటివ్ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. హౌస్ మొత్తం టార్గెట్ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఫినాలేలో టాప్-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. -
అంగరంగ వైభవంగా అలీ కూతురు పెళ్లి.. వైరల్‌గా ఫొటోలు
-
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్‌గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
'కేరింత' మూవీ నటి సుకృతి అంబటి పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కిన 'కేరింత' హీరోయిన్.. ఫోటోలు వైరల్
'కేరింత' సినిమా నటి సుకృతి అలియాస్ భావనా పెళ్లిపీటలు ఎక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడింది. బంధువులు, కుటుంసభ్యుల సమక్షంలో సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయైన సుకృతి చేసింది ఒక్క సినిమా అయినా తన నటనతో మెప్పించింది.సుకృతి కంటే భావన గానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సుమంత అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నూకరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌గా సుకృతి నటన ఆకట్టుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ కేరింత సినిమా తర్వాత సుకృతి సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలె ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సైతం పంచుకుంది. View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అయితే నటి అంజలి విషయంలో ఇది తారుమారైంది. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ బ్యూటీ. మొదట్లో తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. కట్రదు తమిళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఆ తర్వాత అంగాడి తెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చదవండి: అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వరించాయి. దీంతో గుర్తింపు పొందిన అంజలి కొన్ని వివాదాస్పద సంఘటనల్లో చిక్కుకుని హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మధ్యలో ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తూ బిజీగానే ఉన్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలిని నటుడు జయ్‌తో కలుపుతూ ప్రచారం జరిగింది. కాగా ఇటీవల అంజలి నటించిన వెబ్ సిరీస్ ఫాల్ ఓటీటీలో విడుదలైంది. చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు దీని ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి మీడియాతో ముచ్చటించారు. ప్రేమ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ బదిలిస్తూ తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని, అమెరికాలో నివాసం ఉంటున్నట్టు ఇప్పటికే రకరకాల ప్రచారం జరిగిందన్నారు. నిజానికి అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెబుతానని అంజలి పేర్కొన్నారు. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ నటి, వరుడు ఎవరంటే..!
షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనిక రెడ్డి. షణ్ముఖ్ జశ్వంత్ ‘సూర్య’ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా చేసి రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం ఆమె లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఓ వైపు వెండితెరపై నటింగా, మరో వైఫు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తన ప్రియుడు సందీప్ అనే వ్యక్తితో ఏడడుగులు వేయబోతోంది. చదవండి: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా? ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అంతేకాదు తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. అంతేకాదు పెళ్లి తేదీ కూడా ప్రకటించింది. డిసెంబర్ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగునున్నట్లు మౌనిక తెలిపింది. కాగా మొదట స్నేహితులుగా పరిచమైన వీరద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటీనటుల నుంచి ఫాలోవర్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) -
ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు వేశారు. జైపూర్‌లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు.. ఎన్జీఓలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథ పిల్లలను కూడా పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు హన్సిక. అలాగే వివాహం జరుగుతున్న ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు ఆదివారం ఆమె విందు ఏర్పాటు చేయించారు. దీనిపై అటు ఫ్యాన్స్, నెటిజన్లు హన్సికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్‌పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
హీరోయిన్ కీర్తి సురేష్‌కు వరుడిని చూసిన పేరెంట్స్
తమిళ సినిమా: టాప్ హీరోయిన్ల గురించి ఏదో ఒక సంచల వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల ప్రేమ, సహజీవనం గురించి మొదట్లో ఇలాంటి వార్తలే గుప్పుమన్నాయి. మొదట్లో వాటిని ఈ జంట పెద్దగా ధ్రువీకరించకపోయినా ఆ తర్వాత అదే నిజమైంది. చాలామంది హీరోయిన్లు మొదట్లో అలాంటి వార్తలను కొట్టిపారేసినా ఆ తర్వాత అవును మేము ప్రేమించుకుంటున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా క్రేజీ నటి కీర్తి సురేష్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ బ్యూటీ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు వరుడిని కూడా చూసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. వివాహానంతరం కీర్తీ సురేష్ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఆ మధ్య పెళ్లికి ముందు నయనతార గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే నయనతార మాత్రం పెళ్లయిన తర్వాత కూడా కొత్త చిత్రాలను ఒప్పుకుంటూ బిజీగా ఉంది. మరి నటి కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవుతుందన్న వార్తల్లో నిజమెంత అన్నది కాలమే తేలుస్తుంది. -
హీరోయిన్‌తో ప్రేమ.. బయటపెట్టిన స్టార్ హీరో కొడుకు
కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవలె ఈ జంట అధికారికంగా ప్రకటించింది కూడా. మరో నాలుగు రోజుల్లో(నవంబర్ 28)న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తమ ప్రేమకథను రివీల్ చేశారు ఈ క్యూట్ కపుల్. చెన్నై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. తాను ప్రపోజ్ చేస్తే మంజిమా వెంటనే ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత అంగీకరించిందని తెలిపాడు. 'మా ప్రేమకథ అంత గొప్పదేం కాదు. జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు మనం మంచి మనిషిగా ఎదుగుతాం అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమా. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. నేనెప్పుడైనా నిరాశకు గురైనా తను నా వెంటే ఉండేది. ఇక దేవరట్టం సినిమా షూటింగ్ సమయంలోనే మేం స్నేహితులుగా మారాం. ఆ తర్వాత ఏడాదికి తనతో రిలేషన్ కొనసాగించాలనిపించింది. వెంటనే ఆమెకు ప్రపోజ్ చేశా. కానీ మంజిమా రెండు రోజులు సమయం తీసుకున్న తర్వాత నా ప్రేమకు అంగీకారం చెప్పింది. అలా కుటుంబసభ్యుల అంగీకారంతో నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పేర్కొన్నారు. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం గౌతమ్ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. -
బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నవంబర్ 20న ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక బిజినెస్ విమెన్ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఆమె ఇంటీరియర్ డిజైన్ కంపెనీ రన్ చేస్తోంది. బిజినెస్ విమెన్‌గా అనూష అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే నాగశౌర్య చేసుకున్న అనూష ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అంత ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని చేసుకున్న నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష శెట్టి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనూష తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. బిజినెస్‌లో ఆయన బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు అనూష కూడా తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో చురుగ్గా ఉంటుందట. మరోవైపు సొంతంగా పెట్టుకున్న ఇంటిరియర్ బిజినెస్ కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని వినికిడి. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అతని చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్ జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? -
పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే
బిగ్‌బాస్ సీజన్-6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే భర్త ఫోటోను కూడా ఆడియెన్స్‌కు రివీల్ చేసింది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇటీవలె బిగ్‌బాస్-6లో కూడా పాల్గొంది. ఇక ఈ షో ఎంట్రీ సమయంలో కూడా ‘బిగ్‌బాస్'కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పి వచ్చాను’ అని కూడా వెల్లడించింది. అప్పుడు చెప్పినట్లే బిగ్‌బాస్ జర్నీ అనంతరం నేహా పెళ్లి చేసుకోబోతుంది. తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అయిన అనిల్ అనే వ్యక్తినే అతి త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు నేహా తెలిపింది. View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) -
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇంట్లో పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. నేడు(ఆదివారం) కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. బెంగళూరులో ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో వధూవరులిద్దరూ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన నాగశౌర్య కుటుంబం అనంతరం కాక్టైల్ పార్టీను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూషకు రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా నిశ్చయించిన సమయం ప్రకారం.. నేడు ఉదయం 11.25గంటలకు హీరో శౌర్య వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. Lovely Clicks from the Pre Wedding Ceremony of the Adorable Couple #NagaShaurya & #AnushaShetty 👩🏻❤️👨🏻💕🤩 LINK : https://t.co/SBmJWuYpOZ#NagaShauryaWedsAnushaShetty 💍@IamNagashaurya #KrackFlicks #tollywood #telugucinema — Krack Flicks (@KrackFlicks) November 20, 2022 -
పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త
సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే,కెరీర్లోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్ కపూర్ పెళ్లైన తొలిరాత్రే సర్ప్రైజ్ చేశాడట. కాస్ట్లీ అండ్ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్‌గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్‌లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ గిఫ్ట్ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
అనూషశెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం!.. ఇంతకీ ఆమె ఎవరంటే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2019-2020లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
49ఏళ్ల వయసులో నటుడితో మలైకా రెండో పెళ్లి!.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్‌లో మలైకా-అర్జున్‌ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అర్జున్-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్‌తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ లెహంగాలో పాలక్ మెరిసిపోతుండగా, మిథూన్ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
తప్పుగా చిత్రీకరించాడు, యాసిడ్ పోస్తానని బెదిరించాడు : నోయెల్ మాజీ భార్య
'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్నానంటోంది ఎస్తర్. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆమె మరోసారి నోయెల్‌పై కామెంట్స్ చేసింది. అతనితో విడిపోయాక నాపై నెగిటివ్ ప్రచారం చేశాడు. విడాకుల తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నోయెల్ ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అప్పుడు అర్థమయ్యింది. నేనేదే తప్పు చేసినట్లుగా చిత్రీకరించాడు. దీంతో సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఒకతను అయితే నువ్వు హైదరాబాద్‌కి వస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. మంచితనం అనే ముసుగులో నోయెల్ సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. కానీ నిజం ఏంటన్నది నాకు తెలుసు కదా.. పెళ్లయిన 16రోజులకే అతని నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే విడాకులు తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చొంది. -
హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్‌ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్లోఊ ఇద్దరూ పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్‌కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్‌ఫ్రెండ్ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్‌ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న హన్సిక?
'దేశ ముదురు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హన్సిక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రియుడు సోహెల్ ఖతురియాతో వచ్చే నెలలోనే ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన హన్సిక కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత హన్సిక నటనకు గుడ్‌బై చెప్పనుందా లేదా కంటిన్యూ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన హన్సిక పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేసింది. పని చాలా విలువైనదని, వివాహం తర్వాత కూడా హీరోయిన్గా కొనసాగుతానని పేర్కొంది. హన్సిక చివరగా ‘మహా’అనే చిత్రంలో నటించింది. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన హీరోయిన్!
మేజర్, గూఢచారి సినిమాలతో అలరించిన నటి శోభిత ధూళిపాల. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓ వ్యక్తితో చేతిలో చెయ్యేసి పెళ్లి కూతురిలా అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అని క్యాప్షన్ ఇవ్వడంతో నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందా అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇవి పెళ్లికి సంబంధించి ఓ యాడ్ షూట్లో భాగంగా తీసిన ఫోటోలట. ఈ క్రమంలో శోభిత అభిమాని ఒకరు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
పెళ్లి పీటలు ఎక్కనున్న హన్సిక.. వరుడు ఎవరో తెలిసిపోయింది
హీరోయిన్ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు తెలుస్తోంది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్4న వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైనట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందట. ఇక హన్సిక ప్రియుడు సోహాల్ కతూరియా విషయానికి వస్తే.. ముంబైలోని బడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. చాలాకాలం నుంచి హన్సికకు అతనితో మంచి అనుబంధం ఉందట. అంతేకాకుండా అతని కంపెనీలోనూ హన్సిక షేర్స్ ఉన్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతకాలంగా డేటింగ్లో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్యాలెస్‌లో జరగనున్న పెళ్లి వేడుక కోసం ఇప్పటికే గదులు కూడా బుక్ చేసినట్లు సమాచారం. -
ఓ ఇంటివాడైన నటుడు హరీష్ కల్యాణ్.. ఫోటోలు వైరల్
యువ నటుడు హరీష్ కల్యాణ్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. ప్యార్కాదల్ ఇష్క్, ఇస్పేట్, రాజావుమ్ ఇదియే రాణీవుమ్, ధారాళ ప్రభు తదితర చిత్రాల ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరీష్ కల్యాణ్. ఈయన తెలుగులోనూ జెర్సీ చిత్రంలో అతిథి పాత్రలో నటించి, అక్కడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం నూరు కోటి వానవిల్లో హీరోగా నటించి, పూర్తి చేశారు. తాజాగా డీజిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. ఇలా నటుడిగా బిజీగా ఉన్న హరీష్ కల్యాణ్ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెన్నైకి చెందిన నర్మదా ఉదయ్‌కుమార్‌తో హరీష్ కల్యాణ్‌కు శుక్రవారం ఉదయం స్థానిక తిరువేర్కాడులోని కల్యాణ్ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తమది పెద్దలు కుదుర్చిన వివాహం అని నటుడు కల్యాణ్ మీడియాకు తెలిపారు. -
అతడితో పెళ్లి.. స్పందించిన 'కొమురం పులి' హీరోయిన్
కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భామ నిఖీషా పటేల్. ఈ సినిమా నిరాశపచడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి విదేశాల్లో సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తనకు నచ్చలేదంటూ వార్తల్లో నిలిచింది. రీసెంట్గా ఓ విదేశియుడితో ప్రేమలో ఉన్నానంటూ వెల్లడించింది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఓ వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫోటోను సైతం షేర్ చేయడంతో నిఖీషా పటేల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఓ ఫోటోను డిలీట్ చేసిన ఆమె తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. -
హీరోయిన్‌తో మెగా అల్లుడు కల్యాణ్ ఫోటో వైరల్
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కల్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ హీరోయిన్‌తో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వర్ణిక రాథోర్ అనే హీరోయిన్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నా లైఫ్‌ను మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్‌తో ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో కల్యాణ్ దేవ్ మాటల వెనకున్న అర్థమేంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఆయన మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చిన నేఫథ్యంలో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె కల్యాణ్ దేవ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యిందని, ఈ క్రమంలోనే ఫోటో బయటికొచ్చిందని తెలుస్తుంది. -
రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే!..ఈ ఇద్దరూ సమయం దొరికితే చాలు ఒక్కచోట చేరిపోతారు.అలా వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ లవ్ బర్డ్స్ పెళ్లిపీటలు ఎక్కనున్నారని బీటౌన్ టాక్. 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చకచకా పూర్తి చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారట. కేవలం బంధువులు, సన్నిహితులు సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. అయితే ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సిద్దార్థ్.. తాను ఎంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎలాగైనా అది బయటికొస్తుందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. -
విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు.. త్రిష షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి మెప్పించింది. ఐశ్వర్యరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ప్రమోషన్స్‌లోనూ ఐష్‌ను డామినేట్ చేసేలా త్రిష ఎంతో అందంగా కనిపించింది. ఈ క్రమంలో త్రిష పెళ్లి విషయం మరోసారి తెరమీదకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై త్రిష మాట్లాడుతూ.. 'నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. కానీ వాళ్లు అడిగే విధానం నాకు అస్సలు నచ్చదు. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడగడం ఓకే కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగతం. పెళ్లెప్పుడు అంటే చెప్పలేదు. ఎందుకంటే నాతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తొ దొరకాలి. నా ఫ్రెండ్స్, సన్నిహితుల్లో చాలామంది పెళ్లి చేసుకొని సంతృప్తిగా లేరు. పిల్లల కోసమో, కుటుంబం కోసమో కలిసుంటున్నారు. ఇంకొంత మంది ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. అలా మధ్యలో ముగిసిపోయే బంధాలు నాకు వద్దు. అందుకే నా పెళ్లి ఆలస్యం అవుతోంది' అంటూ త్రిష చెప్పుకొచ్చింది. -
యాంకర్ ప్రదీప్ పెళ్లి అయిపోయిందా? ఆయన ఏమన్నాడంటే..
తెలుగు టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇటీవలె ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు. ఇదిలా ఉండగా కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, పొలిటికల్ లీడర్ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ షోలో భాగంగా తనని తాను ఇంటర్వ్యూ చేసుకున్న ప్రదీప్ ఊతపదం ఏంటని అడగ్గా.. నీ యంకమ్మ అని సమాధానమిచ్చాడు. మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి కాకపోయిన పిల్లల్ని కంటాను అంటూ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా? ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకపోతే పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది. చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలుపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయిన నేను పిల్లల్ని కంటాను. అది టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని మా అమ్మకి చెబితే తాను కూడా ఓకే చెప్పింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. -
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?
నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. -
పెళ్లి కాకుండానే గర్భం దాల్చొచ్చు : హీరోయిన్ టబు
సీనియర్ హీరోయిన్ టబుకి 50ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన టబు పెళ్లి, పిల్లలపై బోల్డ్ కామెంట్స్ చేసింది. 'నాకు కూడా తల్లినవ్వాలనుంది. అయితే దీనికి పెళ్లిచేసుకోవాల్సిన అవరసం లేదు. పెళ్లికాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం ఉంది. పెళ్ళి కాకపోతే చచ్చిపోం, తల్లి కాకపోయినా చచ్చిపోం. ప్రస్తుతం కెరీర్, యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్లి, పిల్లలకి వయసుతో సంబంధం లేదు' అంటూ పేర్కొంది. తన మనసుకి నచ్చినవాడు ఇంకా దొరకలేదని, మహిళల్ని అన్ని విధాలుగా గౌరవించేవాడు తనకు దొరికితే పెళ్లిచేసుకుంటానంటూ టబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తతం టబు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల హరీష్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన రోషి (రోషిణి) అనే అమ్మాయితో ఆదివారం వెంకటాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మల హరీష్ ఐదేళ్ల క్రితం ఉపాధికోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడికే ఉపాధికోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రిషి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు ఇష్టపడి నాలుగేళ్ల కింద జోర్డాన్‌లోనే పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కింద హరీష్ ఇంటికి వచ్చాడు. కోవిడ్ వల్ల తిరిగి జోర్డాన్ వెళ్లలేకపోయాడు. పాస్‌పోర్డు రెన్యూవల్ ఉండడం, కోవిడ్ పరిస్థితుల వల్ల అమ్మాయి కూడా వేల్పూర్‌కు రాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో నెలరోజుల కింద రోషి వేల్పూర్‌లోని హరీష్ వద్దకు చేరింది. దీంతో తమ సమక్షంలో పెళ్లి జరిపాలని హరీష్ తల్లిదండ్రులు గుమ్మల యాదగిరి, కమల, బంధువులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబీకులు, బంధుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. -
ఇండస్ట్రీలో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా : నిత్యామీనన్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన నిత్యామీనన్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత.. 'కాలు బాలేక రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు' అని తెలిపింది. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడగ్గా..'తను నాకు మంచి ఫ్రెండ్. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందిస్తూ..నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..''నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. కావాలనే తప్పుగా ప్రచారం చేశారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు’’ అన్నారు.చదవండి: అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత -
ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్.. ఫోటోలు వైరల్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జున్ కనుంగో తన చిన్ననాటి స్నేహితురాలు కార్లా డెన్నిస్‌ను పెళ్లాడాడు.ముంబైలోని తాజ్ హోటల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల మధ్య నిన్న(ఆగస్టు10)న వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లిలో అర్జున్ తెల్లని షేర్వానీ ధరించగా, వధువు కార్లా రెడ్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. ఇటీవలె వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రియురాలితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నానంటూ సింగర్ అర్జున్ ఫోటోలు షేర్ చేశారు. ఇక గురువారం ముంబైలోని కరణ్ జోహార్ రెస్టారెంట్ న్యూమాలో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్, బాబీ డియోల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. View this post on Instagram A post shared by Arjun Kanungo (@arjunkanungo) View this post on Instagram A post shared by ❣️🄼🄰🄷🄸😍🄰🅁🄹🅄🄽😍🄿🅁🄰🄽🄰🅈❣️ (@maharjunay) -
పెళ్లి క్యాన్సిల్? ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ పూర్ణ
హీరోయిన్ పూర్ణ గత కొన్నిరోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పూర్ణ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ ఆసిఫ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్ ఆన్సర్ తాజాగా ఈ వార్తలపై నటి పూర్ణ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భర్తతో సన్నిహితంగా కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎప్పటికీ నావాడు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్లు 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరుద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సుసానేకు ఇది రెండో వివాహం. వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.అయితే వివాహ వేడుక, తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు,పార్టీలకూ జంటగానే హాజరయ్యేవారు. అంతేకాకుండా బర్త్‌డే లాంటి స్పెషల్ డేస్‌లోనూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమను వ్యక్తపరిచేవారు. అయితే ఇప్పుడీ జంట పెళ్లిపీటలెక్కుతుందని వార్తలు రావడంతో మరి హృతిక్- సబా అజాద్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్..
Actress Madhu Shalini Married To Tamil Hero Gokul Anand In Hyderabad: ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది లేడీ సూపర్ స్టార్ నయన తార. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పుస్తకాన్ని తెరిచింది. సైలెంట్‌గా వివాహం చేసుకుని అభిమానులుక సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. ఇటీవల '9 అవర్స్' వెబ్ సిరీస్‌తో అలరించిన మధు శాలిని. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమ వివాహ వేడుక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ నటించారు. ఈ మూవీ టైమ్‌లోనే ఇద్దరి మధ్య చిగురించిన స్నేహ్నం.. ప్రేమగా, తర్వాత వివాహం బంధంగా మారిందని సమచారం. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అందం మధు శాలిని. తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్ (ఓ సాంగ్), వాడు-వీడు, గోపాల గోపాల వంటి తదితర చిత్రాల్లో నటించింది. అలాగే గోకుల్ అరడజను తమిళ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. చదవండి: కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. Thank you for all the love we’ve received. We look forward to the new chapter of our lives with hope and gratitude in our hearts. Love MADHU SHALINI & GOKUL ♥️ pic.twitter.com/6YLREAZo8L — MADHU SHALINI (@iamMadhuShalini) June 17, 2022 -
పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన కియారా, ఏమన్నదంటే..
Kiara Advani Intresting Comments On Marraige: భరత్ అనే నేను మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతి పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నటించిన భూల్ భులయ్యా-2’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే తన తదుపరి మూవీ జగ్ జగ్ జియో చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా వరుణ్ ధావన్ సరసన నటించింది. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కియారాకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్అవుతారని ఓ విలేఖరి ప్రశ్నించగా దీనిపై కియారా ఆసక్తిగా స్పందించింది. ‘పెళ్లి చేసుకోకపోయిన నేను బాగానే సెటిల్ అయ్యాను. సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పని చేస్తున్నా. బాగా సంపాదిస్తున్నా. హ్యాపీగా ఉన్నాను. సెటిల్ అవ్వడమంటే ఇదే కదా’ అంటూ కియారా సమాధానం ఇచ్చింది. కాగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా కొంతకాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్న క్రమంలో కియారా పెళ్లిపై ఇలా స్పందించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా కియార ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ15లో నటిస్తోంది. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి -
పెళ్లిని ప్రభాస్-అనుష్కలతో ముడిపెట్టిన అడివి శేష్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ మేజర్. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్3న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను జోరు పెంచింది చిత్ర బృందం. అయితే ఈ ప్రమోషన్స్‌లో అడివి శేష్ పెళ్లి టాపిక్ హైలైట్‌గా మారింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లెప్పుడు అని శేష్‌ను ప్రశ్నించగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో నాకన్నా మ్యారేజ్ కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అనుష్క, ప్రభాస్‌ల పెళ్లి ఇంకా కాలేదు. వారి పెళ్లిళ్లు అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. శేష్ కామెంట్స్‌తో మరోసారి ప్రభాస్-అనుష్కల పెళ్లి తెరపైకి వచ్చింది. -
ఆది-నిక్కీల అన్‌సీన్ పెళ్లి ఫోటోలు చూశారా?
Aadhi Pinisetty and Nikki Galrani Wedding Pics: యంగ్ హీరో ఆది పినిశెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హీరోయిన్ నిక్కీ గల్రానీతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆది పినిశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అందించండి' అంటూ ఆది తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు ప్రముఖులు, సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమికులయ్యారు. పెద్దల సమక్షంలో ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. #నాది(నిక్కీ-ఆది)ల పేరుతో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది. ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..? -
ప్రపంచానికి తెలియక ముందు.. రష్మిక ఇలా ఉండేదట
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారామె. అయితే తాజాగా రష్మిక తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరవడం కోసం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారామె. సాంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కుమార్తెతో కలిసి దిగిన పలు ఫోటోలను రష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. 'ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ రాగిని పెళ్లి. ఉదయం 4గంటలకు ఫ్లైట్ క్యాన్సిల్ కావడం, ఆ తర్వాత కూడా 4-5సార్లు ఫ్లైట్ ఆలస్యం కావడంతో పెళ్లికి హాజరు కాలేనేమో అనుకున్నా. కానీ దేవుని దయ వల్ల ఎట్టకేలకు పెళ్లికి వచ్చేశాను. ఇక ఈ గ్యంగ్లోనే నేను పెరిగాను. 17ఏళ్లుగా వీళ్లు నాకు తెలుసు. ఇప్పటికీ వీళ్లలో ఏమాత్రం మార్పు లేదు. వీళ్లంతా నా వాళ్లు. చాలాకాలం తర్వాత వీళ్లను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలాగే ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు' అంటూ రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అందుకే నాకింకా పెళ్లి కావట్లేదు : కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా తన పెళ్లిపై కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలె కాంట్రవర్సీ లాకప్ షోను కంప్లీట్ చేసిన కంగనా త్వరలోనే ధాకడ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. చదవండి: షారుక్ ఖాన్‌తో విభేదాలపై స్పందించిన కాజోల్ భర్త మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కంగనా సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు నిజజీవితంలో కూడా టామ్ బాయ్ మాదిరే ఉంటారా అని ప్రశ్నించగా.. 'నిజజీవితంలో నేను ఎవరిని కొట్టాను చూపించండి.. మీరు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు. నేను ఊరికే అందరితో గొడవ పడతానేమో అని జనాలు అనుకుంటున్నారు' అంటూ నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలోఎ వైరల్‌గా మారాయి. చదవండి: 'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత -
లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
టెన్నిస్ స్టార్‌తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్‌బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్‌ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్‌ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్‌తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్‌తో రిలేషన్షిప్లో ఉంది. -
పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ కూతురు, ఫోటోలు వైరల్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహజాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మే5న ఆమె పెళ్లి జరిగింది. రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోను స్వయంగా ఖతీజా షేర్ చేస్తూ.. మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈరోజు కోసం ఎంతో ఎదురుచూశాను అంటూ పోస్ట్ చేసింది. రెహమాన్ కూడా నూతన జంటను దీవించాలంటూ ఫోటోను షేర్ చేశారు. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు
Father of a bride married her daughter to one of his relatives: ప్రతి ఒక్కరి జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ విషయాన్ని చాలా తేలిగ్గ తీసుకుని మద్యం మత్తులో చిందులేస్తూ ఉన్నాడు ఇక్కడొక వ్యక్తి. ముహుర్త సమయానికి చేరుకోకపోవడంతో వరుడికి ఊహించిన షాక్ ఇచ్చాడు పెళ్లి కూతురు తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లితండ్రులు పెళ్లికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్లి మండపం వద్ద వరుడు రాక కోసం పెళ్లి కూతురు తరుఫు బంధువులంతా వేచి చూస్తున్నారు. ముహుర్తం సాయంత్రం నాలుగు గంటలకు ఐతే ఎనిమిదవుతున్న రాకపోయేసరికి వధువు తండ్రి బంధువులను సంప్రదించి వేరే వ్యక్తితో తన కుమార్తె వివాహం జరిపించాడు. ఇంతలో తాగుతు మండపానికి చేరిన వరుడు, అతని స్నేహితులు ఈ తంతు చూసి గొడవకు దిగారు. దీంతో వధువు తల్లిదండ్రులు ముహుర్త సమయానికి రాలేక పోవడంతోనే మా బంధువుల్లోని వ్యక్తితో వివాహం జరిపించామని తెగేసి చెప్పాడంతో చేసేదిలేక అవమానంతో వెనుదిరిగారు వరుడు తరుఫువారు. (చదవండి: సృష్టించిన వాడినే అంతం చేసేందుకు యత్నించిన మైక్రోవేవ్) -
Tina Dabi: ఆమెది మళ్లీ లవ్ మ్యారేజ్!
అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండే వివాహంతో శుక్రవారం ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. టీనా, ప్రదీప్‌ల మ్యారేజ్ మరాఠీ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ కార్యక్రమంలో టీనా తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2015 ఐఏఎస్ బ్యాచ్‌లో టాపర్ అయిన టీనా దాబీ, డాక్టర్ ప్రదీప్ గవాండే (2013 ఐఏఎస్ బ్యాచ్) మే 2021లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ జంట ప్రేమ మొదట స్నేహంతో ప్రారంభమైంది. టీనా, ప్రదీప్ కలిసి పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీనా దాబి తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు మార్చిలో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త, రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని వెల్లడించింది. దుమారం రేపిన మొదటి వివాహం.. తర్వాత విడాకులు.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. అయితే రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. -
పెళ్లిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుటుంబసభ్యులే కాదు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనూ ప్రతీసారి ఆయనకు ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఇటీవలె రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ పెళ్లిటాపిక్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమ విషయంలో తన అంచనాలు చాలాసార్లు తప్పాయని స్వయంగా ప్రభాస్ పేర్కొన్నాడు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌కు మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎక్కడికి వెళ్లినా పెళ్లి టాపిక్ వస్తుందని అసహనానికి గురయ్యారా అని యాంకర్ అడగ్గా.. 'లేదు. నా పెళ్లి గురించి ప్రేక్షకులు అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు. ఇది సాధారణ ప్రశ్నే. నాపెళ్లి గురించి వారు ఎంతగా ఆలోచిస్తున్నారో అని అనుకుంటాను. వారి స్థానంలో ఉంటే నేను కూడా అలాగే ఆందోళన చెందేవాడిని' అంటూ ప్రభాస్ కూల్‌గా బదులిచ్చారు. అయితే మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఏమైనా ప్లాన్ చేశారా అని అడగ్గా.. దీనికి నా వద్ద సమాధానం దొరికినప్పుడు తప్పకుండా అందరికి చెబుతాను అంటూ నవ్వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
లీకైన ఆలియా-రణ్‌బీర్ పెళ్లి అన్‌సీన్ వీడియో
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చదవండి: రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్ అందులో వధువు ఆలియా రణ్‌బీర్ మెడలో వరమాల వేయడానికి ప్రయత్నిస్తుండగా.. రణ్‌బీర్ బంధువులు అతన్ని ఆలియాకు అందకుండా పైకి ఎత్తుకున్నారు. అలా సరదాగా కాసేపు ఆట పట్టించి కిందకి దింపారు. ఆ తర్వాత స్వయంగా రణ్‌బీర్ మోకాళ్లపై కూర్చొని ఆలియా చేత్తో వరమాల వేయించుకున్నాడు. అనంతరం ఆలియా పెదవులపై ముద్దుపెట్టాడు. దీనికి సంబందించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా, కాసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చేసిన ఆలియా భట్ The whole Varmala ceremony🥺💜#RanbirKapoorAliaBhattWedding #RanbirAliaWedding pic.twitter.com/ddkN6apmwQ — 𝓢𝓪𝓷𝓪🌸 // Team Groom✨ (@TypoQueeenie) April 14, 2022 -
ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చేసిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఏప్రిల్ 14న కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్ ఇదిలా ఉండగా ఆలియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అప్డేట్స్తో పాటు తనకు సంబంధించిన ప్రత్యేక సందర్భాలను ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో వివాహం అనంతరం ఆలియా తన ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్‌ని మార్చేసింది. పెళ్లి ఫోటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రణ్‌బీర్ కూడా త్వరలోనే నెట్టింట అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: Alia Bhatt: ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే.. -
'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్ చేసిన ఆలియా
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబై, బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే వివాహాం అనంతరం తొలి ఫోటోను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'మా కుటుంబం, స్నేహితుల సమక్షంలో మాకెంతో ఇష్టమైన ప్రదేశంలోనే మేం పెళ్లి చేసుకున్నాం. గత ఐదేళ్లుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి జంటగా మరెన్నో జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆలియా ఆనందం వ్యక్తం చేసింది. నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ సహా తదితరులు పెళ్లింట సందడి చేశారు. కాగా ఆలియా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
భార్యభర్తలుగా ఆలియా-రణ్‌బీర్.. తొలిసారి మీడియా ముందుకు
ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్ ఈ వేడుకకు వేదికైంది. ఇక పెళ్లి విషయంలో మొదటి నుంచి అత్యంత గోప్యత పాటించిన ఈ జంట ఎట్టకేలకు తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికగా వివాహానికి సంబంధించిన అత్యంత మధురమైన ఫోటోలను ఆలియా పంచుకుంది. ఇక అనంతరం తొలిసారిగా భార్యాభర్తలుగా ఆలియా-రణ్‌బీర్‌లు మీడియా ముందుకు వచ్చారు.ఎంతో ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం వెనుతిరిగే క్రమంలో రణ్‌బీర్ ఆలియాను స్వయంగా ఎత్తుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలియా-రణ్‌బీర్‌లను చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Actors Alia Bhatt and Ranbir Kapoor make their first public appearance after tying the knot in Mumbai, today. pic.twitter.com/yQP5bTDnvM — ANI (@ANI) April 14, 2022 -
ఇట్స్ అఫీషియల్: ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లయిపోయింది
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని 'వాస్తు'లో గ్రాండ్‌గా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా నూతన జంట రణ్‌బీర్-ఆలియాల పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. చాలా గోప్యంగా పెళ్లి వేడుకలకు ఏర్పాటు చేసిన కపూర్ అండ్ భట్ కుటుంబం వివాహం జరిగేంత వరకు ఒక్క ఫోటోని కూడా లీక్ కానివ్వలేదు. అయితే అభిమానుల కోసం మరికాసేపట్లో ఆలియా -రణ్‌బీర్‌లు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేయనున్నారు. ఈ ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కొత్తజంటకు బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. -
ఎట్టకేలకు రణ్‌బీర్-అలియా పెళ్లిపై నోరువిప్పిన నీతూ కపూర్, వీడియో వైరల్
Finally Ranbir Mother Neetu Confirms Marriage Date, Place: బాలీవుడ్ లవ్‌బర్ట్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్లు నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 3 గంటలకు ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ ప్రేమ జంట వివాహం బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. విక్కీ కౌశల్, కత్రీనా మాదిరిగా తమ పెళ్లి విషయంలో రణ్‌బీర్-అలియాలు గోప్యత పాటిస్తూ వస్తున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో రణ్‌బీర్ సోదరి రిద్ధిమా, తల్లి నీతూ కపూర్లు వీరి పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. ఈ రోజు వీరిద్దరి పెళ్లి జరనుగున్నట్లు మీడియాతో వారు వెల్లడించారు. చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వరింధర్ చావ్లా షేర్ చేశాడు. ఈ వీడియోలో రిద్ధిమా, నీతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చి కనిపించారు. అయితే వారిద్దరు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని కనిపించారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడంటూ మీడియా వారిని ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు సంకోచించారు. అయినప్పటికీ మీడియా వారిని రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలకు ఈ రోజు పెళ్లి అని రిద్ధిమా చెప్పగా.. రణ్‌బీర్ నివాసం వాస్తులోనే ఈ వేడుక జరుగనుందని నీతూ కపూర్ నోరువిప్పారు. ఇలా చివరకు అలియా-రణ్‌బీర్ పెళ్లిపై సస్పెన్స్ వీడింది. కాగా పెళ్లి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం రణ్‌బీర్–ఆలియా ముందుగా పితృపూజ చేశారట. చదవండి: జూ. ఎన్టీఆర్ తల్లి శాలినిపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ మొదలుపెట్టారు. బుధవారం రాత్రి సంగీత్ ఫంక్షన్ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక నేడు(ఏప్రిల్ 14) దాదాపు 50 మంది ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిలో భాగంగా రణ్‌బీర్ అలియాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. వజ్రాల బ్యాండ్... ఆలియా కోసం రణబీర్ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారు చేయించారట. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్ అది. పెళ్లిలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్ ధరించనున్నారు. కాగా కపూర్ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్ బహూకరించనున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)