తమిళనాడు: ఇథియోపియా అమ్మాయితో సేలం అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ వేడుక మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. సేలం జిల్లా అత్తార్ సమీపంలోని కల్పగనూర్ గ్రామానికి చెందిన సెల్లదురై కుట్టి మార్క్స్(32), ముంబై యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేస్తున్నారు.
తనతో పనిచేసిన ఇథియోపియన్ అసోసియేట్ ప్రొఫెసర్ రియార్ మెన్‌బారే అక్లీలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులను సంప్రదించారు. సెల్లదురై కుట్టిమార్క్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో పెత్తనాయకన్‌పాళయంలోని హిందూ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక జరిగింది. బంధువుల సమక్షంలో చెల్లదురై కుట్టి మార్క్స్, మెన్‌బారే అక్లీ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment