Hindu tradition
-
తమిళనాడు అబ్బాయి.. ఇథియోపియా అమ్మాయి
తమిళనాడు: ఇథియోపియా అమ్మాయితో సేలం అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ వేడుక మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. సేలం జిల్లా అత్తార్ సమీపంలోని కల్పగనూర్ గ్రామానికి చెందిన సెల్లదురై కుట్టి మార్క్స్(32), ముంబై యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. తనతో పనిచేసిన ఇథియోపియన్ అసోసియేట్ ప్రొఫెసర్ రియార్ మెన్బారే అక్లీలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులను సంప్రదించారు. సెల్లదురై కుట్టిమార్క్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో పెత్తనాయకన్పాళయంలోని హిందూ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక జరిగింది. బంధువుల సమక్షంలో చెల్లదురై కుట్టి మార్క్స్, మెన్బారే అక్లీ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
తమిళనాడు అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!
వేలూరు: తమిళనాడు అబ్బాయి.. దక్షిణ కొరియా అమ్మాయి.. వివాహం బుధవారం వాణియంబాడిలో ఘనంగా జరిగింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వెల్లకుట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ కొయంబత్తూరులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం కొరియాలోని ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దక్షణ కొరియాలో బూసాన్ ప్రావిన్స్‌కు చెందిన సెంగ్వాన్మున్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబ సభ్యులు భారతీయ సంప్రదాయం పద్ధతిలో వివాహం చేసుకోవా లని నిర్ణయించడంతో దక్షిణ కొరియాకు చెందిన సెంగ్వాన్మున్ కుటుంబ సభ్యులు గత వారం భారతదేశానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వానియంబాడిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ప్రవీణ్ కుమార్, సెంగ్వాన్మున్ల వివాహం వైభవంగా జరిగింది. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా! -
హలాల్ V/s జట్కా.. మాంసం అమ్మకాల్లో కొత్త ట్రెండ్
సాక్షి, బెంగళూరు: హలాల్ కట్ వివాదం నేపథ్యంలో ఉగాది సందర్భంగా జట్కా కట్ మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. ఆదివారం నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా మాంసం దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. హిందూ సంఘాలు హలాల్ కట్ పట్ల గత కొద్దిరోజులుగా వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలాచోట్ల హలాల్ కట్ మాంసం విక్రయాలు తగ్గినట్లు సమాచారం. దొడ్డ తాలూకాలో జట్కాకట్, గ్రామీణ ప్రాంతాల్లో కుప్ప మాంసానికి డిమాండు ఎక్కువైంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ హిందువులు జట్కా కట్ కోసం ఎగబడ్డారు. దేవనహళ్లి, రామనగర జిల్లాలో కూడా హలాల్ కట్ మాంసం దుకాణాలకు వ్యాపారం తగ్గిందని సమాచారం. ఆరా తీసి కొనుగోళ్లు అనేక చోట్ల మాంసం దుకాణాల ముందు హలాల్, జట్కా మాటలు వినిపించాయి. నగర, గ్రామీణ ప్రాంతాల్లో మాంసం దుకాణాల్లో ఎక్కువగా జట్కా మాంసం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. బెంగళూరు నగరంలో మైసూరురోడ్డు, యశవంతపుర రోడ్డు, కోరమంగల, కంఠీరవ స్టేడియం సమీపంతో పాటు నగరంలో చాలాచోట్ల హలాల్ కట్ మాంసం దుకాణాలవద్ద రద్దీ తక్కువగా కనిపించింది. కొన్ని మాంసం దుకాణాల్లో హలాల్ కట్ , జట్కా కట్ అని బోర్డులు పెట్టి విక్రయించారు. నగరంలో మైసూరు రోడ్డులోని పాపణ్ణ మటల్ స్టాల్లో మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. చాలా చోట్ల కుప్పలు వేసి విక్రయించిన మాంసం కోసం ప్రజలు ఎగబడ్డారు. స్థానికులే జీవాలను కోసి విక్రయించారు. తక్కువ ధరకు ఈ మాంసం అమ్మడంతో కొనడానికి ఎగబడ్డారు. ఏ పద్ధతైనా ఓకే: మంత్రి ఈశ్వరప్ప హలాల్– జట్కా వివాదాన్ని కొందరు వ్యక్తులు, పార్టీలు సృష్టించారు, ప్రజలు దీని ఫలితాన్ని అనుభవిస్తున్నారని మంత్రి కేఎస్.ఈశ్వరప్ప అన్నారు. ఆదివారం కార్కళలో మాట్లాడుతూ ముస్లింలు హలాల్ చేయాలంటే చేయనీయండి, హిందూవులు జట్కా చేయాలంటే చేయనివ్వండి అని చెప్పారు. ఈ విషయం సమాజంలో విషబీజాలు నాటే కుతంత్రం జరుగుతోందన్నారు. -
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు
సాక్షి, బాన్సువాడ: గంగాజమునా తెహజీబ్ తెలంగాణది. పాలునీళ్లలా కలిసిపోయే సంస్కృతి ఈ ప్రాంతం సొంతం. అది మరోసారి రుజువయ్యిందీ పెళ్లితో. దత్తత తీసుకున్న హిందూ యువతికి.. హిందూ సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి కన్యాదానం చేశారీ ముస్లిం దంపతులు. బాన్సువాడలో ఆదివారం జరిగిన ఈ వివాహంలో మరో విశేషం కూడా ఉంది. అది కులాంతరం కావడం. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం బాన్సువాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఇర్ఫానా బాను, పదేళ్లకిందట జిల్లాలోని తాడ్వాయి గురుకుల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఓ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చందన అనే బాలికను ఆమె బంధువులు గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానాబాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నా.. చందనను దత్తత తీసుకున్నారు. గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లేవారు. ఆమె ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో డీఎంఎల్టీ (ల్యాబ్ టెక్నీషియన్) కోర్సు చేయించారు. అది కూడా పూర్తి కావడంతో.. పెళ్లి విషయాన్ని ఇతర టీచర్లతో పంచుకున్నారు. చదవండి: ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు అలా ఓ టీచర్ నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డితో సంబంధం కుదిర్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి.. ఇర్ఫానాబాను భర్త షేక్ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగారు. అన్ని లాంఛనాలతో ఘనంగా పెండ్లి చేశారు. కట్నం, ఇతర పెట్టిపోతలకు ఇర్ఫానా బానుతో పాటు గురుకులంలోని కొందరు టీచర్లు సహకారం అందించారు. అలాగే వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారు. ఇర్ఫానాబాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి ఆశీర్వదించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మహ్మద్ ఎజాస్తో ఇతరులు తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నాకు మూడో బిడ్డ చందన చందనను ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాను. డీఎంఎల్‌టి వరకు చదివించి పెళ్ళి చేస్తున్నాను. మా సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే నేడు పెళ్ళి జరుగుతోంది. మానవత్వానికి మతం అడ్డుకాదు. నాకు ఇద్దరు కూతుర్లు. చందన నా మూడో కూతురు. – ఇర్ఫానాబాను, ప్రిన్సిపాల్, గురుకులం, బోర్లం -
భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు
గౌహతి : హిందూ వివాహ బంధానికి సంబంధించి గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన మహిళ సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతులకు గాజలు ధరించడానికి ఇష్టపడకపోతే ఆ మహిళ తన భర్తతో పెళ్లిని తిరస్కరించినట్టేనని వాఖ్యానించింది. ఓ విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విధమైన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఓ జంటకు 2012 ఫిబ్రవరిలో వివాహం అయింది. అయితే పెళ్లైనా నెల రోజులకే కుటుంబంతో కాకుండా విడిగా ఉందామని భార్య తన భర్తపై ఒత్తిడి తెచ్చారు. తనకు ఉమ్మడి కుంటుబంలో జీవించడం ఇష్టం లేదని తెలిపారు. అయితే అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో 2013లో ఆమె భర్త ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు. అయితే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై ఆమె గృహ హింస కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన గౌహతి హైకోర్టు భార్య దాఖలు చేసిన పిటిషన్లో నిజం లేదని తేల్చింది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య విహహ సంప్రదాయాన్ని పాటించడం లేదని.. బొట్టు పెట్టుకోవడం లేదని, గాజులు ధరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య విడిగా ఉండటం వల్ల సంతానం కూడా కలగలేదని చెప్పాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అతడు గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన గౌహతి హైకోర్టు ఈ నెల 19న తీర్పు వెలువరించింది. పెళ్లైన హిందూ మహిళలు సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతికి గాజులు వేసుకోవడం ఇష్టపడకపోతే ఆ పెళ్లిని నిరాకరించినట్టే అవుతుందని తెలిపింది. అలాగే ఆ భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఇటువంటి పరిస్థితుల్లో కూడా భర్తను భార్యతో కలిసి ఉండమని చెప్పడం అతడిని హింసించడమే అవుతుందని వాఖ్యానించింది. -
మసీదులో హిందూ పెళ్లి
అలప్పుజ : కేరళలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదులో ఆదివారం హిందూ పెళ్లి జరిగింది. మసీదు ఆవరణలో హిందూ పూజారి ఆధ్వర్యంలో అంజు, శరత్‌లు ఏకమయ్యారు. ఈ పెళ్లికి వారి బంధుమిత్రులతో పాటు మసీదు పెద్దలు హాజరవడం విశేషం. పెళ్లి అనంతరం శాకాహార విందు సైతం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురి తల్లి మసీదు పెద్దల సహాయం అర్థించడంతో ఈ పెళ్లి సాకారమైంది. పెళ్లికి మసీదు పెద్దలు 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు. 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు మసీదు కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమ్మూట్టిల్ చెప్పారు. ఈ పెళ్లిపై ఫేస్బుక్ వేదికగా కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి గుర్తుగా ఈ పెళ్లి నిలుస్తోందన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పేరుతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పెళ్లి ఆదర్శనీయమైనదని చెప్పారు. -
ముస్లిం ఇంట ‘మాంగల్యం తంతునానేన..’
శుభలేఖ నుంచి విందు వరకు అన్నీ హైందవం ప్రకారమే రంపయర్రంపాలెం (గోకవరం): హిందూ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగిన ఓ ముస్లిం తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. ఆ ఇంట ‘మాంగల్యం తంతునానేన..’ వేద మంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరపు వారిని, కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి జరిపించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైఎస్సార్సీపీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ)కి చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే మిక్కిలి మక్కువ. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది. ఇందుకు పెళ్లికుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించాడు. పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయూనుసారం ‘జానక్యాః..’ అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించడం, విందును కూడా పూర్తిగా శాకాహారంతో ఏర్పాటు చేయడం విశేషం. పెళ్లి అనంతరం వధూవరుల తలంబ్రాల ముచ్చట బంధుమిత్రులకు కన్నులపండువలా జరిగింది. కాగా తన గ్రామానికి చెందిన పదిమంది హిందూ అవివాహిత యువతులకు రూ. 10 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను పెళ్లి పందిరిలో రఫీ.. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. హిందూ సంప్రదాయం, వేద మంత్రాలపై తనకు చిన్ననాటి నుంచి నమ్మకమని, అందుకే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించానని రఫీ తెలిపారు. -
కౌబాయ్
హైందవ సంప్రదాయంలో గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.. పూజిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో.. ఎల్లలు దాటి సంచరిస్తున్న జూలియన్ కిర్పాల్ బ్లెస్ కూడా ఆవును అమితంగా ప్రేమిస్తారు. గో సంరక్షణ ప్రాధాన్యం తెలియజేస్తూనే.. సేవాగుణం గొప్పదనాన్ని చాటుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కిర్పాల్.. తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, వాటికి ప్రచారం కల్పిస్తూ.. 12 ఏళ్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ ప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చిన అతన్ని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. - కోన సుధాకర్ రెడ్డి ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు. ఒకటి- సేవాగుణం, రెండు- ఆధ్యాత్మికత. ఈ రెండూ ఉన్న చోట ధర్మం నిలబడుతుంది. ఇది మెట్ట వేదాంతం కాదు. జీవిత సత్యం. ఈ నిజం నాకు అవగతమై పన్నెండేళ్లు అవుతోంది. అప్పట్నుంచి నేను నమ్మిన సిద్ధాంతాన్ని పది మందికీ పరిచయం చేస్తున్నా. దైవంగా పూజించే గోవును చంపడాన్ని నేను నేరంగా భావిస్తాను. ఒక్క ఆవునే కాదు.. ఏ మూగజీవాన్నీ చంపడం, వాటి మాంసం భుజించడాన్ని నేను సమర్థించను. నేనే కాదు అమెరికాలోని మా కుటుంబం నాన్‌వెజ్ పూర్తిగా మానేసింది. శాకాహారం ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలా చేయగలుగుతుంది. కొన్నాళ్ల కిందట అమెరికాలోని విస్టన్ వ్యాలీ మీడియం కరెక్షనల్ జైలులోని ఖైదీలకు పూర్తిగా శాకాహారం అందించడం మొదలుపెట్టాం. కొన్నాళ్లకు ఆ ఖైదీల మానసిక ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించింది. నేనే బండి లాగాను.. కర్మభూమిగా భాసిల్లుతున్న భారతదేశం సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక దిక్సూచి వంటిది. భారతదేశం గొప్పదనం గురించి పుస్తకాల్లో చదివాక.. ఈ దేశానికి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకున్నాను. ఆ క ల మూడుసార్లు నెరవేరింది. ఇప్పటికే భారత్‌లో రెండుసార్లు పర్యటించాను. ఇది మూడోసారి. ఢిల్లీ, చెన్నై, పాండిచ్చేరి, హైదరాబాద్‌తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా చూశాను. ఈ ప్రయాణంలో ఎన్నో గోశాలలు సందర్శించాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఆవులకు వైద్యం అందించడం చూశాను. ఢిల్లీలో ఉండగా.. ఎద్దుతో నడిపించే బండిని చూశాను. తట్టుకోలేకపోయాను. వెంటనే దాన్ని విడిపించి నేనే బండి లాగాను. పశువులతో పని చేయించుకోవడం తప్పు కాదు. కాని, వాటిపై మోయలేని భారాన్ని మోపడం సరికాదు. ఇలాగే సాగుతా.. మానవ మనుగడకు పర్యావరణం ప్రధాన వనరు. పర్యావరణాన్ని రక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. నేను ఎంచుకున్న సేవా పథంలో పర్యావరణ పరిరక్షణే మొదటి అంశం. దీనిపై కూడా నాకు తోచినంతలో పది మందికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే.. వయసు 48. పెద్దగా చదువుకోలేదు. అమెరికాలో రియల్ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఆరు నెలల కిందట ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం కుటుంబ సభ్యులే నాకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ.. సమాజ హితం కోరుతూ ఇలా ముందుకు సాగుతాను. రెండు నెలలుగా.. ఆరు నెలల కిందట ఇండియా టూర్‌కు వచ్చిన కిర్పాల్.. రెండు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఓ వైపు తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే తెలుగు భాషా, సంస్కృతులపై అధ్యయనం చేస్తున్నాడు. రవీంద్ర భారతికి కిర్పాల్ నిత్య అతిథి. సామాజిక దృక్పథం ఉన్న నాటకాలు, ప్రదర్శనలు చూసి ఆహా.. ఓహో.. అని చప్పట్లు చరచడమే కాదు.. వాటి విశేషాలను ప్రచారం చేస్తుంటాడు. -
ఎంఎస్ నారాయణకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: అశ్రునయనాల నడుమ సినీ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ అంత్యక్రియలు శనివారం ఎర్రగడ్డ ఇఎస్ఐ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఎం.ఎస్ అంతిమయాత్ర వెంకటగిరి హైలం కాలనీ నుంచి కొనసాగింది. ఆయన అంత్యక్రియలకు పలువురు సినీ నటులతోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా ఎం.ఎస్. తనయుడు విక్రమ్ చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియల్లో నటులు శ్రీకాంత్, శివాజీరాజా, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందూరు అబ్బాయి.. చైనా అమ్మాయి
నిజామాబాద్ కల్చరల్ : ఇందూరు అబ్బాయి, చైనా అమ్మాయి హిందూ సంప్రదాయ ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు వివాహం చేసుకున్నారు. వీరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో నిజామాబాద్ నగర శివారులోని శ్రీభారతి గార్డెన్స్‌లో పెళ్లి జరిగింది. వరుడు నగరంలోని గాజుల్‌పేటలో నివసించే పీడబ్ల్యూడీ ఉద్యోగి ముదగనపల్లి గంగాధర్ తనయుడు డాక్టర్ వంశీకృష్ణ (సాఫ్ట్వేర్ ఇంజనీర్). వధువు చైనాలోని షాంఘై నగరానికి చెందిన మింగ్‌ల్యాంగ్ (మిషా)(సాఫ్ట్వేర్ ఇంజనీర్). 2005లో వంశీకృష్ణ హైదరాబాద్‌లో ఇంటర్ చదివి, ఆ తర్వాత చైనాలో ఎంబీబీఎస్ చేశారు. కొన్నేళ్లు ప్రాక్టీస్ చేశాక సాఫ్ట్‌వేర్‌రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం షాం ఘైలో 3జీ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ సీఈఓగా కొనసాగుతున్నారు. అదే కంపెనీలో మింగ్‌ల్యాంగ్(మిషా) ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెళ్లి వేడుకకు బంధువులంతా హాజరయ్యారు. వీరు చైనా వెళ్లాక అక్క డి సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటారని బంధువులు తెలిపారు. -
'మా అమ్మాయి పెళ్లి ఇంకా కాలేదు'
తన కూతురు అమలాపాల్, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ అలువా సమీపంలోని ఓ చర్చిలో కేవలం ప్రార్థనలు చేసేందుకు వెళ్లారే తప్ప ఇంకా వాళ్లకు పెళ్లి కాలేదని అమలాపాల్ తండ్రి పాల్ వర్గీస్ స్పష్టం చేశారు. వరపుజ ఆర్చిడయాసిస్కు ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా రాశారు. చర్చిలో వాళ్లు కేవలం ప్రార్థనలు చేశారే తప్ప పెళ్లికి సంబంధించిన తంతు ఏమీ జరగలేదన్నారు. అయితే, మీడియాలోని ఓ వర్గంలో మాత్రం వాళ్లిద్దరికీ పెళ్లి అయిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చిందని పాల్ వర్గీస్ తెలిపారు. క్రిస్టియన్ కాని వ్యక్తితో అమలాపాల్ పెళ్లిని చర్చిలోపల ఎలా అనుమతిస్తారంటూ భక్తులలో ఒక వర్గం తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడంతో ఆయనీ స్పష్టత ఇచ్చారు. కేవలం ఆమె హీరోయిన్ కావడం వల్లే ఇంత గొడవ జరిగిందని చెప్పారు. అమల, విజయ్ ఇద్దరికీ చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కానుంది. -
వరుని మెడలో తాళి కట్టిన వధువు
ప్యారిస్(చెన్నై), న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు తాళికట్టడం మనకు తెలుసు. అయితే, ఈ సంప్రదాయానికి భిన్నంగా తమిళనాడులోని తిరువాయూరు జిల్లాలో పెళ్లి కుమార్తే.. పెళ్లి కుమారుని మెడలో మూడు ముళ్లువేసి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కమ్యూనిస్టు భావాలు గల సోము కుమార్తె వాసంతికి శ్రీరంగానికి చెందిన సతీష్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. దీంతో ఇరువురికీ ఆదివారం మారియమ్మన్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. వరుడు సతీష్, వధువు వాసంతి మెడలో తాళి కట్టాడు. అనంతరం మండపంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో స్త్రీ, పురుషులు సమానమేనన్న అంశాన్ని గట్టిగా నమ్మే వాసంతి, వరుడు సతీష్ మెడలో తాళి కట్టింది. దీన్ని చూసి వివాహ వేడుకకు వచ్చిన వారందరూ ముక్కుమీద వేలేసుకున్నా తర్వాత తేరుకుని వాసంతి నిర్ణయాన్ని అభినందించారు.