ఇందూరు అబ్బాయి.. చైనా అమ్మాయి | nizamabad boy china girl marriage | Sakshi
Sakshi News home page

ఇందూరు అబ్బాయి.. చైనా అమ్మాయి

Published Thu, Dec 18 2014 1:40 PM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

ఇందూరు అబ్బాయి.. చైనా అమ్మాయి - Sakshi

ఇందూరు అబ్బాయి.. చైనా అమ్మాయి

నిజామాబాద్ కల్చరల్ : ఇందూరు అబ్బాయి, చైనా అమ్మాయి హిందూ సంప్రదాయ ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు వివాహం చేసుకున్నారు. వీరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో నిజామాబాద్ నగర శివారులోని శ్రీభారతి గార్డెన్స్‌లో పెళ్లి జరిగింది. వరుడు నగరంలోని గాజుల్‌పేటలో నివసించే పీడబ్ల్యూడీ ఉద్యోగి ముదగనపల్లి గంగాధర్ తనయుడు డాక్టర్ వంశీకృష్ణ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్).

వధువు చైనాలోని షాంఘై నగరానికి చెందిన మింగ్‌ల్యాంగ్ (మిషా)(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్). 2005లో వంశీకృష్ణ హైదరాబాద్‌లో ఇంటర్ చదివి, ఆ తర్వాత చైనాలో ఎంబీబీఎస్ చేశారు. కొన్నేళ్లు ప్రాక్టీస్ చేశాక సాఫ్ట్‌వేర్‌రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం షాం ఘైలో 3జీ నెట్‌వర్క్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ సీఈఓగా కొనసాగుతున్నారు. అదే కంపెనీలో మింగ్‌ల్యాంగ్(మిషా) ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెళ్లి వేడుకకు బంధువులంతా హాజరయ్యారు. వీరు చైనా వెళ్లాక అక్క డి సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటారని బంధువులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement