
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.
⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.
⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్‌లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్‌గా అదే ఆమె మొదటి సినిమా.
⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.
⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్‌ను తిరస్కరించింది.
⇒ బన్‌తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.
⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.
⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.
⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్‌లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment