Actress Sai Pallavi In Marriage Plans Rumours Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi Marriage: సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందా?

Published Sun, May 1 2022 4:48 PM | Last Updated on Sun, May 1 2022 5:27 PM

Sai Pallavi Plans To Marriage, News Goes Viral - Sakshi

సాయి పల్లవి.. ఈ నేచురల్‌ బ్యూటీ  స్క్రీన్ పై కనిపిస్తే చాలు టాలీవుడ్ లో సెన్సేషన్ మొదలవుతుంది.రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు ఆ సెన్సేషన్ ను చూపించాయి కూడా. అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయి పల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది.

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ‘విరాటపర్వం’ అనే ఒకే ఒక చిత్రం మాత్రమే ఉంది. రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు.షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

(చదవండి: ఆహాలో మరో సూపర్‌ హిట్‌ మలయాళ చిత్రం, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

విరాటపర్వం రిలీజ్‌ తర్వాత సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతుందట. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పల్లవి సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండాలి అనుకుంటోందట. అందుకే మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్‌ చేస్తోందని చెబుతున్నారు. అంతేకాని తొందరపడి మూవీస్‌ కమిట్‌ కావొద్దని పల్లవి ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించింది. నటిగా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేయాలనుకుంటోందట.అందుకే సినిమా కొత్త సినిమాలను ప్రకటించలేదు. రాబోయే చిత్రంలో తన రోల్‌ లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్‌ని  మించి ఉండాలని పల్లవి కోరుకుంటోంది. మరి సాయి పల్లవి నిజంగానే మంచి పాత్ర కోసం వెయిట్‌ చేస్తుందో.. లేదా పెళ్లి కోసమే కొత్త ప్రాజెక్ట్స్‌ ఒప్పుకోవడంలేదో తెలియాలంటే..  ఆమె ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement