virataparvam
-
కూలిన విరాటపర్వం శంకరన్న ఇల్లు..
కరీంనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేసిన దొంత మార్కండేయ ఉరఫ్ శంకరన్న ఇల్లు గురువారం కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శంకరన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో 1993 జనవరి 25న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించారు.మూడు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఆకర్షితుడై పార్టీలోచేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శి స్థాయిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
వెన్నెల ప్రేమకథ
-
విరాటపర్వం: ఒళ్లు గగుర్పొడిచే విప్లవ సాంగ్ విన్నారా?
రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆదివారం విప్లవ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. ఛలో ఛలో ఛలో అంటూ జనాలను ఉద్యమానికి ఉత్తేజితులను చేస్తూ విప్లవ శంఖం ఊదుతోందీ సాంగ్. దొరోని తలుపుకు తాళంలా, గడీల ముంగట కుక్కల్లా? ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు? మన బతుకులు మారేదెన్నాళ్లు.. అన్న చరణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. జీలుకర శ్రీనివాస్ రాసిన ఈ పాటను సురేశ్ బొబ్బిలి అద్భుతంగా పాడాడు. Revolutions never go backward ✊🏾🔥#ChaloChalo - The Warrior Song from #VirataParvam out now▶️ https://t.co/h8A7Pq3fIXIN CINEMAS JUNE 17 🔥@Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @LahariMusic @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/T6m5fQw7WH— Rana Daggubati (@RanaDaggubati) June 12, 2022 చదవండి: ఒక లోతైన సముద్రంలోకి తోసేసిన ఫీలింగ్ కలిగింది: రానా -
పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు, కానీ..: సాయిపల్లవి
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమెకు అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నేచులర్ బ్యూటీ. ఫిదా మూవీతో హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటిచంని చిత్రం విరాట పర్వం. ఇందులో రానా జోడిగా జతకట్టింది సాయి పల్లవి. ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో తాను ఇంట్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండటంతో తెలుగబ్బాయి చూసి పెళ్లి చేసుకుంటావా? అని ఇంట్లో అంటుంటారంది. చదువుతున్న సమయంలో తనకు 23 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని, 30 ఏళ్ల వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారనినుకున్నానని చెప్పింది. ఇక సినిమాల్లో గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యారని, హీరోయిన్ అంటే పోట్టి బట్టలు వేసుకుంటారు.. అదే గ్లామర్.. మీరెందుకు వాటికి వ్యతిరేకం అని అడగ్గా.. అలాంటిదేం లేదని, పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదంది. కానీ ఎదుటి వారు చూసే చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫీడెన్స్ వస్తుందంటూ చెప్పుకొచ్చింది. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి -
రిపీట్ చేయడం ఇష్టం ఉండదు
‘‘ఒక యాక్టర్‌గా అన్ని రకాల జానర్స్ చేయాలనుకుంటాను.. అయితే ఒకసారి చేసిన జానర్‌ను రిపీట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓ మంచి కథను చెప్పాలంటే హీరోగానే చెప్పాల్సిన అవసరం లేదు.. బలమైన పాత్రలతో కూడా చెప్పొచ్చు’’ అని హీరో రానా అన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రానా పంచుకున్న విశేషాలు... సమయాన్ని రీ క్రియేట్ చేయడం ఒక్క సినిమాకే సాధ్యం. ‘విరాటపర్వం’ చిత్రం 1990 సమయంలో జరిగే కథ. ఈ చిత్రంలో రవన్న అనే ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపిస్తాను. డాక్టర్ అయిన రవన్న అప్పటి సామాజిక పరిస్థితులు, అతని జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల కారణంగా ఉద్యమకారుడిగా మారతాడు. ఈ పాత్రకి ప్రత్యేకంగా ఎవర్నీ స్ఫూర్తిగా తీసుకోలేదు. కానీ, చెగువేరా వంటి నాయకుల ప్రభావం రవన్న పాత్రలో కనిపిస్తుంది. రొటీన్ లవ్‌స్టోరీ కాదు ఒక లోతైన సముద్రంలోకి తోసేస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ‘విరాటపర్వం’ కథ విన్నప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది. మనసుకు అంత బరువుగా అనిపించింది. సీరియస్ టోన్‌తో చెప్పాల్సిన నిజాయితీ కథ ఇది. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేని రవన్న పాత్రలోకి వెన్నెల (సాయిపల్లవి పాత్ర పేరు) వస్తుంది. ఆ సమయంలో ఓ ఉద్యమకారుడిగా లక్ష్యం కోసం పనిచేయాలా? లేక ప్రేమికుడిగా గెలవాలా? అనే మోరల్ డైలమాలో పడతాడు రవన్న. రొటీన్ లవ్‌స్టోరీ చిత్రాలు నాకు ఇష్టం ఉండవు. ‘విరాటపర్వం’ చేశాక గొప్ప ప్రేమకథ చేశాననే ఫీలింగ్ కలిగింది. ఇందులోని లవ్‌స్టోరీని ఆడియన్స్ హాయిగా కాదు.. కాస్త భయాన్ని ఫీలవుతూ చూస్తారు. మహిళలు కంటతడి పెట్టుకుంటారు రవన్న, వెన్నెల పాత్రలే కాదు.. సినిమాలో ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళుతుంది. ప్రియమణి, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, నందితా దాస్.. ఇలా ప్రతి పాత్ర బలంగానే ఉంటుంది. సినిమా చూశాక అబ్బాయిలు వావ్ అని ఆశ్చర్యపోతే.. మహిళలు మాత్రం కంటతడి పెట్టుకుంటారు. అందుకే ఇది మహిళల చిత్రం. రవన్న పాత్రలో ఎవరైనా నటించగలరేమో తెలియదు కానీ వెన్నెల పాత్రను మాత్రం సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు.. ఆమె అద్భుతంగా నటించారు.‘విరాటపర్వం’లాంటి సినిమాలను తెలుగులోనే చేయాలి. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఒక భాషకు చెందిన సాహిత్యం మరో భాషలో కుదరకపోవచ్చు. అందుకే ‘విరాటపర్వం’ సినిమాని పాన్ ఇండియాగా అనుకోలేదు. అయినా పాన్ ఇండియా అప్పీల్ కథలో ఉండాలి కానీ మనం పాన్ ఇండియా చేయాలని చేస్తే కుదరదేమో!. కథే నిర్ణయించాలి. అయితే ‘విరాటపర్వం’ సినిమాను మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో డబ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం నేను తొలిసారి ఓ పాట పాడాను. సురేశ్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆ డైరెక్షన్లోకి వెళ్లలేదు సినిమాలు శాశ్వతం.. మనం తాత్కాలికం. అందుకే ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నేను కొత్తరకమైన సినిమాలు చేయాలనుకుంటాను. చిన్నాన్న(వెంకటేశ్)గారికి మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది.. అందుకే నేను ఆ డైరెక్షన్లోకి వెళ్లలేదు. చిన్నాన్నతో కలిసి నేను చేసిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. నేను చేయనున్న ‘హిరణ్య కశ్యప’ మార్చిలో స్టార్ట్ అవుతుంది. కొత్త చిత్రాలపై త్వరలో చెబుతా. -
విరాటపర్వం రానా ఎందుకు చేస్తానన్నారో అర్థం కాలేదు: డైరెక్టర్
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి. మీ రెండో సినిమాగా ఇంత బరువైన కథ చేయడానికి కారణం ? నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు నేను ఎలాంటి సినిమా తీయాలనే ఒక విజన్‌ను ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే విరాటపర్వం. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను, చెప్పాను తప్పితే ఇది బరువైనదా? క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు. లెఫ్ట్ నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల సహజంగానే కొంత ప్రోగ్రసివ్ ఐడియాలజీ వుంటుంది. అంతేకానీ లెఫ్ట్ , రైట్ అని కాదు. విరాటపర్వం, వెన్నెల పాత్రలకు ప్రేరణ ఉందా ? వుంది. యదార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం. లెఫ్ట్ ప్రభావం బాగా తగ్గిపోయింది. వాళ్ళ ఐడియాలజీ గురించి ఒక జనరేషన్‌కు సరిగ్గా అవగాహన కూడా లేదు కదా.. ఇలాంటి సందర్భంలో ఈ కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలని అనుకున్నారు ? లెఫ్ట్, రైటు అనేది అప్రస్తుతం. నేపథ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది. సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చాయని విన్నాం ? కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు సినిమాని బలంగా నమ్మారు. ఇది భారీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాల్సిన సినిమా. ప్రేమకి నక్సలిజంకి ఎలా ముడిపెట్టారు? విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విసృతతంగా అర్ధం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి, వ్యక్తి మధ్య వుండే ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు ? జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప త్యాగం చేయలేం. ఇది వెన్నెల కథ అని చెబుతున్నారు కదా.. మరి రానా లాంటి హీరోని ఈ కథ కోసం ఎలా ఒప్పించారు? రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి కథ చెప్పాను. సురేష్ బాబు గారు 'రానాకి లైన్ నచ్చింది చెప్తావా' అన్నారు. రానా గారికి చెప్పాను. కథ విన్న తర్వాత రానా గారు చేస్తా అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్ధం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశారు. ఈ కథని ఎవరిని దృష్టిలో పెట్టి రాసుకున్నారు ? ట్రైలర్లో సాయి పల్లవి బ్యాగ్ పట్టుకొని జమ్మిగుంట అనే బోర్డ్ కనిపిస్తున్న ఊరు నుంచి నడుస్తూ వస్తుంది. జమ్మిగుంట మా పక్క వూరు. నేను కథ రాస్తున్నపుడు అదే ఇమేజ్‌లో సాయి పల్లవి కలలోకి వస్తుండేది. అప్పటివరకూ సాయి పల్లవిని నేను కలిసింది లేదు. కానీ సాయి పల్లవి ఆ పాత్రలో కనిపిస్తుండేది. ఐతే హీరో ఎవరనేది మొదట అనుకోలేదు. కథ వినగానే సాయి పల్లవి గారి రియాక్షన్ ఏంటి ? సాయి పల్లవి గారికి పది నిమిషాలు కథ చెప్పాను. పది నిమిషాల తర్వాత ఓకే చేశారు. సాయి పల్లవే కాదు సురేష్ బాబు గారు మిగతా అందరూ సింగల్ సిట్టింగ్‌లోనే కథని ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ వుంది. 90లో చిత్రీకరించారు కదా.. షూటింగ్ లో ఎదురైన సవాళ్లు ఏంటి ? విరాటపర్వం షూటింగ్ ఒక సవాలే. సినిమాని సహజంగా తీయాలని రిమోట్ ఏరియాల్లో షాట్ ప్లాన్ చేశాం. కానీ ఎక్కడికి వెళ్ళినా సెల్ టవర్స్, సెల్ ఫోన్ కామన్‌గా కనిపించేది. గ్రాఫిక్స్‌లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఒక రెండు సినిమాలు పడాల్సిన కష్టం ఈ సినిమా కోసం పడ్డారు. ఈ క్రెడిట్ అంతా మా నిర్మాతలకే దక్కుతుంది. విరాటపర్వంలో అన్ని వాస్తవాలు వుంటాయా ? 1992లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుక రాజకీయ కారణాలు వుండటం వల్ల ఈ కథను జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. ఐతే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్షన్ వుంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు. ఈ సినిమా ముగింపు ఎలా వుంటుంది ? ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రం కోసం నందిత దాస్, జారినా వహాబ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చారు కదా .. ఇది ఎవరి ఛాయిస్ ? ఛాయిస్ నాదే. అయితే అంత పెద్ద స్టార్ కాస్ట్ రావడానికి కారణం మాత్రం మా నిర్మాతలే. నిర్మాతల సహకారం వలనే అంత పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చి సినిమాని ఇంత గొప్పగా చేయగలిగాను. సినిమాని అద్భుతంగా తీశానని నమ్మకంగా ఉన్నానంటే కారణం నిర్మాతలే. వారే నా బలం. విరాటపర్వం టైటిల్ ఆలోచన ఎలా వుంది? మహా భారతంలో విరాటపర్వం అనేది అండర్ గ్రౌండ్ స్టొరీ. అందులో వున్న కుట్రలు రాజకీయాలు ఫిలాసఫీ ఈ చిత్రానికి సరిపోతుందని ఆ టైటిల్ పెట్టాం. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ రావడం కాస్త తగ్గించారు కదా.. విరాటపర్వం ప్రేక్షకులని థియేటర్ లోకి తీసుకొస్తుందని భావిస్తున్నారా ? విరాటపర్వం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక నిజాయితీ గల కథ చెబుతున్నాం. ఇది గొప్ప ప్రేమ కథ. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. విక్రమ్, మేజర్ సినిమాలతో వాతావరణం సెటిల్ డౌన్ అయ్యింది. విరాటపర్వంకి ఇది మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా. రానా గారు వుండగా ఇది సాయి పల్లవి సినిమా అని ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి ? ఇది సాయి పల్లవి సినిమా కాబట్టే. ఇది వెన్నెల అనే అమ్మాయి కథ. రానా గారు ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీతో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీగా తీసుకువెళితే ఆదరిస్తారని చెప్పారు. అలాగని మొత్తం వెన్నెల పాత్రే వుండదు. చంద్రుడు లేకుండా వెన్నెల వుండదు కదా.. రానా గారి పాత్ర కూడా చాలా ముఖ్యం. మైదానం ప్రాజెక్ట్ ఎక్కడి వరకూ వచ్చింది ? అది 'ఆహా' కి చేస్తున్నాం. ఇది చలం రాసిన నవలకి మనదైన వ్యాఖ్యానంతో వుంటుంది . దీనికి షో రన్నర్ గా చేస్తున్నా. కవిత్వం అప్పుడప్పుడు రాస్తుంటా. అయితే నా మెయిన్ ఎమోషన్ సినిమానే. చదవండి: ఒక్క టీ షర్ట్‌కు రూ.40 వేలు, నీ టేస్ట్ ఏడ్చినట్లుంది అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు -
గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయటం థ్రిల్లింగ్‌గా ఉంది: సాయిపల్లవి
ప్రజలను అలరించే కథ, కథనంతో విరాట పర్వం సినిమా రూపొందిందని సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. విరాట పర్వం అందమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సినిమాలో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని చెప్పారు. మంచి కథ ఉంటే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనని రానా స్పష్టం చేశారు. తన తాత దగ్గుబాటి రామానాయుడు జన్మదినం రోజున విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పల్లెటూరి యువతిగా నటించానని, గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయటం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చుండూరి మాట్లాడుతూ.. 1990లో జరిగిన ఓ యువతి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. – గుణదల (విజయవాడ తూర్పు) చదవండి: (విరాటపర్వం ట్రైలర్: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా) -
విజయవాడలో సందడి చేసిన విరాటపర్వం మూవీ టీం
-
పండగే పండగ.. జూన్‌లో సినిమాల జాతర!
మొన్నటిదాకా భారీ బడ్జెట్ సినిమాలు దుమ్ములేపాయి. కరోనాతో వెలవెలబోయిన థియేటర్లకు జనాలను రప్పిస్తూ తిరిగి కళకళలాడేలా చేశాయి. దీంతో అప్పటిదాకా రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బోల్తా కూడా కొట్టాయి. మరికొన్ని అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్నాయి. ఇదే హుషారుతో జూన్ నెల కూడా బోలెడన్ని సినిమాలతో రెడీ అయింది. ఇప్పటికే జూన్ 3న సౌత్‌లో రిలీజైన రెండు సినిమాలు మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మంచి హిట్లుగా నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఏమేం సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం.. జూన్ 10న 'అంటే సుందరానికీ', 'సురాపానం, జరిగిన కథ', '777 చార్లీ', 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' సినిమాలు రిలీజవుతున్నాయి. 17వ తేదీన 'గాడ్సే', 'విరాటపర్వం', కన్నడ డబ్బింగ్ మూవీ 'కే3', కీర్తి సురేశ్ 'వాశి', 'కిరోసిన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు. జూన్ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ 23న 'కొండా', 24న 'సమ్మతమే', '7 డేస్ 6 నైట్స్', 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', '10th క్లాస్ డైరీస్', 'సదా నన్ను నడిపే', 'సాఫ్ట్వేర్ బ్లూస్' సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న మూవీస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు జై కొడతారనేది చూడాలి. చదవండి: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం నాకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి సల్మాన్ కంటతడి -
విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అపశ్రుతి
సాక్షి, కర్నూలు: విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలులో ఆదివారం సాయంత్రం డీఎస్ఏ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. దీంతో విరాట పర్వం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేదికకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. హీరోహీరోయిన్లు రానా, సాయిపల్లవి రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. చదవండి: విరాటపర్వం ట్రైలర్: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా హోటల్‌కు తీసుకెళ్లి ముద్దులతో ముంచెత్తాడు, అప్పుడే.. -
విరాటపర్వం ట్రైలర్: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాపటర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఆదివారం (జూన్ 5న) ట్రైలర్ రిలీజైంది. రానా కామ్రేడ్ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా కనిపించారు. 'చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎదిగినాడు..' అంటూ రానా మాటలు వినిపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. అతడు రాసే పుస్తకాలను చదివి హీరోతో తెలియకుండానే ప్రేమలో పడుతుంది సాయిపల్లవి. పుస్తకం రాశినోడును చూడాలనుందంటూ అమ్మవారి దగ్గర మొద పెట్టుకుంటుంది హీరోయిన్. అలా అడిగిందో రవన్న దళం ఊర్లో దిగుతుంది. అందులో లీడర్ రానాను చూసి మురిసిపోయింది సాయి. అంతేకాదు, ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్‌గా మారుతుంది. కానీ ప్రజాసేవలో మునిగిపోయిన హీరోకు ప్రేమ అంటే గిట్టనట్లే కనిపిస్తున్నాడు. మరి అతడు వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా? వీరి ప్రేమ ఏ తీరాన్ని చేరిందనేది ఆసక్తికరంగా మారింది. 'నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా', 'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది' అన్న డైలాగ్స్ బాగున్నాయి. ఇక నక్సలైట్ల వల్ల ఏమన్న ఉపయోగం ఉందా? అని ఓ పోలీసు అడగ్గా.. 'మా ఊర్ల ఆడోళ్ల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు, మా అన్నలు వచ్చిర్రు' అని నక్సలైట్ల మంచితనాన్ని గురించి చెప్పాడు రాహుల్ రామకృష్ణ. ట్రైలర్ చూస్తుంటే వెండి తెరపై ఓ చిన్నపాటి యుద్ధమే చేయనున్నట్లు కనిపిస్తోంది. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. నవీన్ చంద్ర సీనియర్ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. చదవండి 👇 ఛీ, దరిద్రమంటూ నెటిజన్ ఓవరాక్షన్, కౌంటరిచ్చిన రానా వర్జినా? అన్న ప్రశ్నకు సుశాంత్ ఏమని ఆన్సరిచ్చాడంటే? -
'మీరు టాలీవుడ్లో ఉండాల్సింది కాదు' బంగారం అంటూ రానా రిప్లై
రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమా కూడా ప్రమోషన్స్ స్పీడు పెంచింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో పాటు వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా! అయితే ఆ పోస్టర్లో కేవలం సాయిపల్లవి మాత్రమే కనిపించేలా రానా ఫొటోను కనబడకుండా కట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. 'ఛీ, దరిద్రం.. సొంత బ్యానర్లోనే ఫేస్ కట్ చేశారు. ఇంకా బయట వాళ్లు వేలెత్తి చూపించడంలో తప్పేముందిలే. ఆ సినిమాలో, ఈ సినిమాలో తక్కువ నిడివి ఉండే పాత్రలు చేయడం, అందరికీ లోకువ అయిపోవడం రానా స్టైల్' అని కామెంట్ చేశాడు. దీనికి హీరో స్పందిస్తూ 'మనం తగ్గి కథని హీరోయిన్ను ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్.. సొంత బ్యానర్ కదా, గొప్ప పనులు ఇక్కడే చేయొచ్చు' అని కౌంటరిచ్చాడు. అతడి తిక్క భలే కుదిర్చాడు అంటూ అభిమానులు రానాను ప్రశంసిస్తున్నారు. ఇక సాయిపల్లవి కోసమే సినిమా తీశాంరా బాబూ అని ప్రమోషన్ వీడియోలో చెప్పాడు రానా. దీనిపై హీరోయిన్ అభిమాని ఒకరు స్పందిస్తూ 'తెలుగు ఇండస్ట్రీ ఇంత ప్రోగ్రెసివ్ మాటలని తట్టుకోలేదు. మీరు మలయాళంలోనో, తమిళ ఇండస్ట్రీలోనో ఉండాల్సింది. అప్పుడు మీకు మరింత గుర్తింపు వచ్చి ఉండేది' అని ట్వీట్ చేసింది. దీనికి రానా రిప్లై ఇస్తూ.. 'తెలుగు ఇండస్ట్రీ అంత ప్రోగ్రెసివ్ ప్లేస్ ఏది లేదు బంగారం. ఇండియా అంతా చూసి వచ్చాను. మాకు హీరో లవ్ కొంచెం ఎక్కువ అంతే' అని స్వీట్‌గా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే విరాటపర్వం సినిమా ట్రైలర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. Telugu industry antha progressive place edhi ledhu bangaram :) India antha chusi vacchanu: maku hero love koncham ekkuva anthe 🤗 — Rana Daggubati (@RanaDaggubati) June 4, 2022 Manam taggi Kathani heroine nee evelvate chayadam lo kickeee veru brother….sontha banner kada….Great things ekkade cheyocchu :) — Rana Daggubati (@RanaDaggubati) June 3, 2022 All fans assemble.. 💥 Meet the team of #VirataParvam at the Trailer Launch event in Kurnool on June 5th 💥#VirataParvamOnJune17th@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @LahariMusic pic.twitter.com/QncwY6XVb1 — SLV Cinemas (@SLVCinemasOffl) June 4, 2022 చదవండి: సాయిపల్లవి కోసమే సినిమా తీశాం, నేనూ ఆమె అభిమానినే చై కోసం స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన సమంత! -
నేనూ సాయిపల్లవి ఫ్యానే, జూన్ 5న రెడీగా ఉండండి: రానా
Virata Parvam Trailer Release Date: నిజమే, విరాటపర్వం సినిమా నుంచి టీజర్ వచ్చి ఏడాదవుతుంది. అన్ని సినిమాలు అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోయినా ఈ మూవీ మాత్రం అదేమీ పట్టనట్టుగా ఉండిపోయింది. ఏడాది నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అభిమానుల సహనానికి అన్నిరకాలుగా పరీక్ష పెట్టింది. కానీ ఇప్పుడిప్పుడే విరాటపర్వంలోనూ కదలిక మొదలైంది. ఇటీవలే సినిమా జూన్ 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఓ వీడియో వదిలారు. ఇందులో ప్రమోషన్స్ ఏవి?, సాయిపల్లవిని చూడటానికి వెయిటింగ్ అని హీరోయిన్ అభిమాని రానాను నిలదీశాడు. దానికి హీరో స్పందిస్తూ.. 'నేను కూడా సాయిపల్లవి అభిమానినే.. సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశాం.. ఆమె ఫ్యాన్స్ కోసం కర్నూలులో జూన్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై సాయిపల్లవి స్పందిస్తూ.. 'ఇక్కడ అంత సీన్ లేదండి. ప్రజల ప్రేమను పొందుతున్న నేనే చాలా అదృష్టవంతురాలిని. కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా' అని ట్విటర్లో రాసుకొచ్చింది. కాగా రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీలో ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. Ikkada anthe scene ledhandi 🙊 Nene chaala lucky, ppl have been extremely kind and sweet. I’m the one who’s excited to see them all at Kurnool❤️ https://t.co/MGdixjovwm — Sai Pallavi (@Sai_Pallavi92) June 4, 2022 చదవండి: కమల్ హాసన్ 'విక్రమ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
కామ్రేడ్ భారతక్క ఎంతో కీలకం: రానా దగ్గుబాటి
Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అలాగే కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. నేడు (జూన్ 3) పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పాడు రానా దగ్గుబాటి. ఇంతకుముందు విడుదల చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్‌ను పంచుకుంటూ ట్వీట్ చేశాడు రానా. ఈ ట్వీట్లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రెడ్ భారతక్క కూడా అంతే కీలకం.' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్ చేశారు. సురేశ్ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్ సింగర్ వరం ఆలపించిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. చదవండి: కేసీఆర్ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani pic.twitter.com/aUOOR3kJYD — Rana Daggubati (@RanaDaggubati) June 4, 2020 -
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్‌లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్‌చరణ్–శంకర్‌గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ఐటెం సాంగ్స్‌పై సాయి పల్లవి స్పందన, ఏం చెప్పిందంటే..
Sai Pallavi Interesting Comments On Item Songs: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నాచులర్ బ్యూటీ. మొదటి నుంచి నటిగా తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకున్న సాయి పల్లవి గ్లామర్ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరమనే సంగతి తెలిసిందే. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టింది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ఇక త్వరలోనే విరాట పర్యం చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఐటెం, స్పెషల్ సాంగ్‌లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ వంటి తరహా పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్ అడగ్గా.. ఖచ్చితంగా చేయను అని మరు క్షణమే బదులిచ్చింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. ‘ఐటెం సాంగ్స్ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాను. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అందుకే స్పెషల్ సాంగ్‌లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రేమపై తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదు’ అని సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. చివరగా శ్యామ్ సింగరాయ్‌లో కనిపించిన సాయి పల్లవి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాకు సంతకం చేయలేదని తెలుస్తోంది. ఇక రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి
Makers Announce Virata Parvam Release Date: ఎట్టకేలకు విరాట పర్వం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కానీ ఈ చిత్రం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అంతేకాదు రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత లేకపోడంతో మూవీ రిలీజ్‌పై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పెడుతూ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. Witness the epic tale of LOVE and REVOLUTION on the Big Screens this monsoon ♥️#VirataParvam Grand Theatrical Release worldwide on July 1st 🔥#VirataParvamOnJuly1st@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/GRHcbzSSQ4 — VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) May 6, 2022 -
ఎట్టకేలకు కదిలిన విరాటపర్వం, రిలీజ్‌డేట్ ప్రకటించనున్న మేకర్స్
రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తైంది. చిన్నాపెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు రెడీ అవుతున్నా విరాటపర్వం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నెలలు గడుస్తున్నా ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో విరాటపర్వం ఓటీటీలోకి రాబోతుందంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది విరాటపర్వం చిత్రయూనిట్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో విరాటపర్వం హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. #VirataParvam Trending India wide 💥💥 Grand Release Date Announcement Today at 5 PM 🔥@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/9qt4mpy86Y — VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) May 6, 2022 చదవండి: -
పెళ్లి పీటలెక్కబోతున్న సాయి పల్లవి?
సాయి పల్లవి.. ఈ నేచురల్ బ్యూటీ స్క్రీన్ పై కనిపిస్తే చాలు టాలీవుడ్ లో సెన్సేషన్ మొదలవుతుంది.రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు ఆ సెన్సేషన్ ను చూపించాయి కూడా. అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయి పల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ‘విరాటపర్వం’ అనే ఒకే ఒక చిత్రం మాత్రమే ఉంది. రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. (చదవండి: ఆహాలో మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) విరాటపర్వం రిలీజ్ తర్వాత సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతుందట. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పల్లవి సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండాలి అనుకుంటోందట. అందుకే మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తోందని చెబుతున్నారు. అంతేకాని తొందరపడి మూవీస్ కమిట్ కావొద్దని పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించింది. నటిగా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేయాలనుకుంటోందట.అందుకే సినిమా కొత్త సినిమాలను ప్రకటించలేదు. రాబోయే చిత్రంలో తన రోల్ లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్‌ని మించి ఉండాలని పల్లవి కోరుకుంటోంది. మరి సాయి పల్లవి నిజంగానే మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తుందో.. లేదా పెళ్లి కోసమే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంలేదో తెలియాలంటే.. ఆమె ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోట్లు సంపాదించే హీరోయిన్, కూలీగా మారింది.. ఫోటో వైరల్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంత సింపుల్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. సాదా సీదా యువతిలాగే వ్యవహరిస్తుంది. ఆమే స్నేహితుల జాబితాలో కూడా ఎక్కువగా మధ్యతరగతికి చెందిన వారే ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలనే తత్వం సాయి పల్లవిది. అందుకే ఆమెలో స్టార్ హీరోయిన్ అనే గర్వం కొంచెం కూడా కనిపించదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోనే అందుకు నిదర్శనం. ఉగాది పర్వదినాన్ని సినీ ప్రముఖులు అంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటే.. సాయి పల్లవి మాత్రం మట్టి మనుషులతో కలిసి పొలం దగ్గర ఉగాది వేడుకలు జరుపుకుంది. అంతేకాదు కూలీగా మారి వ్యవసాయ పనులు చేసింది. ఆడవాళ్లు అంతా పొలం పనుల్లో ఉండగా అదే తరహాలో సాయిపల్లవి కూడా రెడీ అయి, వారితో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు సాయి పల్లవిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నీకంటే అందంగా ఎవరూ ఉండరంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి సినిమా విషయాలకొస్తే.. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఆమె రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి.. పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
విరాటపర్వం ఓటీటీ రిలీజ్‌కు భారీ డీల్!
స్టార్ హీరో రానా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడూ పూర్తయింది. గతేడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో విరాటపర్వం థియేటర్లలోకి వచ్చేదెప్పుడన్న ప్రశ్న ఎదురవుతోంది. అసలు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో విరాటపర్వం ఓటీటీలోకి రాబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మాతలకు దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. రూ.41 కోట్లు డిజిటల్ రిలీజ్ కోసం, రూ.9 కోట్లు శాటిలైట్ హక్కుల కోసం అందజేస్తామని సదరు ఓటీటీ సంస్థ ముందుకొచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. గతంలోనూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ఊహాగానాలు వెలువడగా అవన్నీ వట్టి పుకార్లుగా కొట్టిపారేశాడు డైరెక్టర్. మరి ఈ ఓటీటీ డీల్‌పై దర్శకుడు ఏమని స్పందిస్తాడో చూడాలి! కాగా విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. చదవండి: చేదు అనుభవాన్ని వెల్లడించిన నటి, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు -
సాయిపల్లవి ఇప్పుడు ఎక్కడ ఉంది? నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై నో అప్డేట్?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఎక్కడా గ్లామర్ పాత్రల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమా సినిమాకు తన నటనను మెరుగు పరుచుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఇక ఇటీవలె శ్యామ్ సింగరాయ్‌లో దేవదాసి పాత్రలో నటించి ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. అయితే ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో విరాటపర్వం మినహా మరే సినిమా లేదు. దీంతో అసలు సాయిపల్లవి ఇప్పుడేం చేస్తుంది అన్న సందేహం మొదలైంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత ఆమె సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ హఠాత్తుగా కనిపించకపోవడం, సినిమా అప్డేట్స్ ఏవీ ఇవ్వకపోవడంతో అసలు ఏం జరిగిందనే అనుమానం మొదలైంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పాత్ర నచ్చకపోతే సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే సినిమాలు చేయట్లేదేమో అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. -
రానా బర్త్‌డే స్పెషల్: 'విరాటపర్వం' నుంచి స్పెషల్ వీడియో..
Voice of Ravana Video From Rana Virata Parvam Movie Released: రానా దగ్గుబాటి,సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మంగళవారం(డిసెండర్14)న రానా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ''మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే" అంటూ వీడియో ప్రారంభం అవుతుంది. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.దాదాపు షూటింగ్ పూర్తియిన ఈ సినిమా ట్రైలర్ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రానా బర్త్‌డే సందర్భంగా సాయిపల్లవి సహా పలువురు ప్రముఖుల నుంచి రానాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Happy Birthday @RanaDaggubati Garu 🌸 You’ll never cease to amaze us with the roles you pick and the vision you have for cinema! Here it is,The voice of Ravanna! https://t.co/EtTaVVFrW7@venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns #DiwakarMani @dancinemaniac #SureshBobbili — Sai Pallavi (@Sai_Pallavi92) December 14, 2021 -
ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం
Rana Daggubati Respond On Virata Parvam Movie Rumours: హీరో రానా వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన రుమర్స్‌పై ఘాటుగా స్పందిస్తుంటాడు. తాజాగా రానాకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవల తను నటించిన ‘విరాట పర్వం’ మూవీ గురించి ఓ వెబ్సైట్ రాసిన కథనంపై రానా స్పందించాడు. అంతేగాక ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ సదరు వెబ్‌సైట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్: సామ్ ఆసక్తికర వీడియో ఇంతకి రానాకు కొపం తెప్పించిన ఆ విషయం ఏంటంటే.. ‘విరాట పర్వం’ చిత్రం డైరెక్టర్‌కు, సంగీత దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఇంతకాలం పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారని రాసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త గుప్పుమంది. ఇక అది చూసిన రానా ట్విట్ చేస్తూ.. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే రానా ట్వీట్ చేసిన అనంతరం దీనిని సదరు వెబ్సైట్ డిలిట్ చేయడం గమనార్హం. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే.. కాగా రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. డిసెంబర్లో ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్‌లో డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. -
Virata Parvam: ఓటీటీలో విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
విలక్షణ నటుడు రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై డైరెక్టర్ వేణు ఊడుగుల స్పందించాడు. విరాటపర్వం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూదపడ్డాయని, పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. -
వెనక్కు తగ్గిన రానా.. విరాటపర్వం వాయిదా
విభిన్నమైన పాత్రలను చేసేందుకు ఏమాత్రం వెనకాడని హీరో రానా దగ్గుబాటి. హిట్టూఫట్టు అని లెక్కలేసుకోకుండా జనాలకు మంచి కథలందించాలని చూసే ఈ హీరో ప్రస్తుతం విరాటపర్వంతో, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. వీటితోపాటు సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కరోనా దెబ్బకు కకావికలమైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ వంటి పలు చిత్రాలు వాయిదా బాట పట్టగా తాజాగా విరాటపర్వం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. ఈ మేరకు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశాడు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: 1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం స్టోరీ టెల్లింగ్ బాగుంది: చిరంజీవి -
ఉగాది స్పెషల్ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్
ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం.. ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021 ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Ugadi wishes to you and your family ! Stay safe ... take care #Lovestory@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula pic.twitter.com/lkpmupZ1TM — chaitanya akkineni (@chay_akkineni) April 13, 2021 నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 పండగ రోజు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్ 3 యూనిట్ సభ్యులు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. #HappyUgadi from Team #Thimmarusu.. Get ready for an entertaining thriller in theatres from May 21!@ActorSatyadev#PriyankaJawalkar @actorbrahmaji @ActorAnkith@smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1 @vamsikaka @SricharanPakala @MangoMusicLabel pic.twitter.com/yNTva0xdSW — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్‌ను రిలీజ్ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది. Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. Ugadi wishes from the team of #VirataParvam pic.twitter.com/LVfzsevt8W — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2021 సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది. Baadshah @KicchaSudeep’s #K3Kotikokkadu Team Wishing everyone a #HappyUgadi Dubbing works are on full Swing, Release in Kannada&Telugu simultaneously!@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @anandaudioTolly @Mymoviebazaar pic.twitter.com/o73wH0tMz4 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు సుదీప్. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!!#TuckJagadish #HappyUgadi@NameisNani @riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/HfT4JUHdRK — BARaju (@baraju_SuperHit) April 13, 2021 ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది టక్ జగదీష్ టీమ్. ఇందులో నేచురల్ స్టార్ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు. ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము! Team #Seetimaarr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 @actorrahman @TarunRajArora pic.twitter.com/iVQZxg1qlb — Sampath Nandi (@IamSampathNandi) April 13, 2021 గోపీచంద్ సిటీమార్ నుంచి మాస్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఐదుగురు ఆడవాళ్లు బైక్ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఇది ఊరమాస్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT — Mohan Babu M (@themohanbabu) April 13, 2021 సన్ ఆఫ్ ఇండియా నుంచి మోహన్‌బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్ నిర్మిస్తున్నాడు. Thrilling Trilingual flick #Seethayanam movie Team wishes everyone a Happy Ugadi Here's the brand New Poster @akshith_sk @AnahitaBhooshan @DirPrabhakar #RohanBharadwaj #LalithaRajyalakshmi @padmanabhmusic @ColorCloudsEnt @LahariMusic @PulagamOfficial pic.twitter.com/ejlUqOaiML — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సీతాయణం నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఉగాది శుభాకాంక్షలు 'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1 #MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి.. సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Team #AndarubagundaliAnduloNenundali Wishes a Very Happy Ugadi ,Filled With laughter, joy and fulfilment! #HappyUgadi#Ali & @ItsActorNaresh #Mouryaani 🎬 : #SripuramKiran 🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/DBvbsaIIIV — BARaju (@baraju_SuperHit) April 13, 2021 అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!! Team #GullyRowdy wishes you A very Happy & safe Ugadi.#HappyUgadi@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/hHWtPiOcvZ — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! - #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥 Team #Black wishes everyone a Happy UGADI 🎋 Written & Directed : #GBKrishna Producer : #MahankaliDiwakar Music : #SureshBobbili DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x — BARaju (@baraju_SuperHit) April 13, 2021 #HappyUgadi from Team #HouseArrest!! 🎧 #FreeBirds ▶️ https://t.co/y9EjBrWr3L#HouseArrestOnMay7th@Sekhar_Dreamz @anuprubens @boselyricist @Chaitanyaniran @Niran_Reddy @AsrinReddy @Actorysr @IamSaptagiri @ChotaKPrasad @Yuvadop @Primeshowtweets @ARMusic2021 pic.twitter.com/cuNUpXyP1n — BARaju (@baraju_SuperHit) April 13, 2021 -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్ షాక్!
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు సిసినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వొద్దని హైదరాబాద్ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ రెండు సినిమాలు నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నవే. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత మావోయిస్టులపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.ఈ నేపథ్యలో నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ వస్తున్న ‘ఆచార్య’, ‘విరాటపర్వం’ చిత్రాలకు అనుమతి ఇవ్వొదన్ని యాంటీ టెర్రరిజం ఫోరమ్ తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు రాకుండా చూడాలని కోరింది. తమ విజ్ఞప్తిని కాదని సినిమాలను విడుదల చేస్తే... కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆచార్య, విరాటపర్వం చిత్రాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చిరు, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న ఈ సినిమా విడుదలకానుంది. ఇక రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పెతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం
70 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు రానా. వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఇష్టపడే ఈ హీరో 1940 బ్యాక్‌డ్రాప్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఈ కథ ఎవరు చెప్పారంటే వెంకీ. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు వెంకీ. 1940 నాటి నేపథ్యంలో వెంకీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఇటీవల రానాకు వినిపించారని సమాచారం. రానాకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఇదిలా ఉంటే... ప్రస్తుతం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 30న విడుదల కానుంది. -
ఏప్రిల్‌లో సందడి చేసే సినిమాలివే..
ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడానికే సినిమా. వినోదానికి ప్రతిఫలంగా నాలుగు కాసులు వస్తాయి కనుకనే ఏటా వేలాది సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో కొన్ని హిట్ ట్రాక్ ఎక్కితే, మరికొన్ని మాత్రం ఏకంగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొడతాయి. కానీ గతేడాది మాత్రం కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల థియేటర్లో బొమ్మ ఆడక సగటు ప్రేక్షకుడికి వినోదం కరువైంది. తర్వాత థియేటర్లు రీఓపెన్ అయినా కరోనా టెన్షన్‌తో జనాలు సినిమాలను ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేశారు సినీప్రియులు. కంటెంట్ బాగుంటే భయాలన్నీ పక్కనపెట్టి థియేటర్‌కు కదిలివస్తామని చెప్తున్నారు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు పలు సినిమాలను ఆదరించారు. అభిమానించారు. దీంతో నిర్మాతలు కూడా తమతమ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ ఉన్న ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.. మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో కొంత నిరాశలో ఉన్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. దీంతో ఈసారి లవ్‌స్టోరీ కాకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎంచుకున్నాడు. సాల్మన్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న వైల్డ్‌డాగ్ మూవీ ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 2న మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ హీరో కార్తీ నటించిన సుల్తాన్ అదే రోజు తెలుగులోనూ విడుదలవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా వకీల్‌సాబ్. ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వారం రోజులకే అంటే ఏప్రిల్ 16న నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఏప్రిల్ 30న సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో ఏప్రిల్ 2న రిలీజ్ అవుతోంది. ఇక కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన యువరత్న ఏప్రిల్ 1న విడుదల కానుంది. సునీల్ డిటెక్టివ్‌గా నటించిన కనబడుట లేదు ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో సంచలన నటి కంగనా రనౌత్ నటించింది. చదవండి: టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. 8 హిట్ సినిమాలు ఇవే -
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్!
ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు. ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. చదవండి : బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్ డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
స్టోరీ టెల్లింగ్ బాగుంది
‘‘ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు.. దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి...’ అంటూ ‘విరాటపర్వం’ టీజర్ విడుదలైంది. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ట్యాగ్‌లైన్ . డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసి, ‘స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంది.. చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతికి విడుదల చేసిన రానా–సాయిపల్లవి జంట పోస్టర్‌కి కూడా సూపర్బ్ రెస్పా¯Œ ్స వచ్చింది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు?
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. వాస్తవ కథకు దగ్గరగా, ఎంతో రియలిస్టిక్‌గా టీజర్ ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 1990ల నాటి విప్లవ కథ ఆథారంగా సినిమా తెరకెక్కుతుంది. టీజర్ ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు.'ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్ని నాళ్లు?తారతమ్య గోడలనే పికిలించగ ఎన్నినాళ్లు?దున్నేటోడి వెన్ను విడిచి భూస్వాములు ధనికులైరి' అనే రానా కవిత్వంతో టీజర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో రానా.. డాక్టర్ రవి శంకర్ నుంచి రవన్న అలియాస్ అరణ్యగా ఎందుకు మారాడనేదే స్టోరీ. అరణ్యను ఇష్టపడే వెన్నెల పాత్రల సాయి పల్లవి నటించింది. అతని కవిత్వానికి ప్రేరణ చెంది నక్సలైట్‌గా మారే అమాయక యువతి పాత్రలో సాయి పల్లవి నటించింది. ఇక ఈ చిత్రంలో భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునన్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. Happy to launch #VirataParvamTeaser. It looks raw and realistic. Great storytelling by @venuudugulafilm. My best wishes to @RanaDaggubati and @Sai_Pallavi92. Good luck to the entire team @SLVCinemasOffl @SureshProdns. https://t.co/hkcQInKwQz — Chiranjeevi Konidela (@KChiruTweets) March 18, 2021 చదవండి : (వుమెన్స్ డే: రానా స్పెషల్ వీడియో) (అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!) -
వుమెన్స్ డే: రానా స్పెషల్ వీడియో
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగు డైరెక్ట్ చేస్తున్నారు. 'రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్' అనేది ట్యాగ్‌లైన్. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నివాళి అర్పిస్తూ చిత్ర బృందం ‘విరాట పర్వం’ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘విరాట పర్వం’లోని కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ మహిళల వ్యక్తిత్వాలను వివరిస్తూ హీరో రానా వాయిస్‌తో ఓ వీడియోని విడుదల చేశారు. ‘చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమేనని నమ్మిన వ్యక్తత్వం తనది. మహా సంక్షభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాటపట్టిన అనేకమంది వీరుల తల్లులకు వీళ్లు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం.. రెడ్ సెల్యూట్ టు ఆల్ గ్లోరియస్ ఉమెన్స్` అంటూ రానా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి తన రెడ్ సెల్యూట్‌ని ప్రకటించారు. చదవండి: వైరలవుతున్న సమంత డ్యాన్స్ వీడియో ఈ వీడియోలో సాయి పల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ కనిపిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారతక్క అనే నక్సల్ పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. Red Salute to all the glorious woman out there ✊ - Team #VirataParvam ▶️ https://t.co/3UZg0IL3q7#WomenInVirataParvam @Sai_Pallavi92 @nanditadas #Priyamani #EaswariRao #ZarinaWahab @RanaDaggubati @venuudugulafilm @dancinemaniac #SureshBobbili @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/QXUiAVNI8L — Rana Daggubati (@RanaDaggubati) March 8, 2021 చదవండి : ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు రానాతో సాయిపల్లవి కోలు.. కోలు... -
రానాతో సాయిపల్లవి కోలు.. కోలు...
‘కోలు కోలు..’ అంటూ సాయిపల్లవి హుషారుగా స్టెప్పేశారు. రానా సరసన నటిస్తున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవిపై తీసిన సోలో సాంగ్ ఇది. వేణు ఊడుగుల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కోలు కోలు..’ అనే లిరికల్ వీడియో సాంగ్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ పాటకు సంబంధించిన సాయిపల్లవి పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: విజయ్‌కుమార్ చాగంటి. -
‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో డా. రవి శంకర్ అలియాస్ నక్సలైట్ నాయకుడు కామ్రేడ్ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. చదవండి: కామ్రేడ్ రవన్న వస్తున్నాడు.. ‘రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ అఫ్ లవ్ అనే క్యాప్షన్ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకోంటుంది. ఇటీవల ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రానా అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్తను అందించింది. ఏప్రిల్ 30 న విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
సినీ పండగ కళ
సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. ► రవితేజ డబుల్ యాక్షన్ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ► 2019లో ‘ఎఫ్2’కి సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి ఈ తోడల్లుళ్ల ఫుల్ టార్గెట్ డబ్బు సంపాదనే అట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ► విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు చేశారు. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ చిన్ దర్శకుడు. ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ► ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మారారు అఖిల్. పూజా హెగ్డే జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. ► సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతీ శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి విలన్. బుచ్చిబాబు సన దర్శకుడు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలయింది. ► రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ► మాఫియా నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకుడు. ఈ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించనున్నారు. సుదీప్ లుక్‌ను విడుదల చేశారు. ► బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకుడు. సంక్రాంతికి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► ‘వెయ్యి అబద్ధాలు ఫేమ్ ఎస్తేర్ ముఖ్య పాత్రలో ‘హీరోయిన్’ అనే సినిమా ప్రకటించారు. తిరుపతి ఎస్ఆర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎస్తేర్ శృంగార తారగా నటించనున్నారు. ► వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’ పోస్టర్ విడుదలయింది. ► -
కామ్రేడ్ రవన్న
‘‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న’’ అంటూ ‘విరాటపర్వం’ చిత్రంలోని వీడియో గ్లింప్స్‌ను సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ అఫ్ లవ్ అనే క్యాప్షన్ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా రానా కనిపించనున్నారు. వీడియోలో ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం’? అని కామ్రేడ్ ప్రశ్నిస్తే ‘దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం’ అంటూ నినాదాలు చేయడం కనిపిస్తుంది. పోస్టర్‌పై మొదట సాయిపల్లవి పేరు, తర్వాత రానా దగ్గుబాటి పేరును ప్రస్తావించటంపై సాయిపల్లవి స్పందిస్తూ – ‘‘ఇందులో హీరోయిన్‌ది కూడా పవర్ ఫుల్ పాత్ర అని, మొదట తన పేరు వేయాలని సూచించిన రానా లాంటి మంచి వ్యక్తితో స్క్రీన్ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
కామ్రేడ్ రవన్నగా రానా విశ్వరూపం
సాక్షి, హైదరాబాద్: హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ లో క్రామేడ్ రవన్న ప్రీలుక్‌ను సోమవారం పరిచయం చేసింది చిత్ర యూనిట్. వేణు ఉడుగుల దర్శకత్వంలో 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్ అలియాస్ నక్సలైట్ నాయకుడు కామ్రేడ్ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నారు. (రానా బర్త్‌డే, మూవీ ఫస్ట్ లుక్) ‘‘సత్యా న్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. ఒకదేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది’’ అంటూ రవన్న ప్రాతను పరిచయం చేశారు. అలాగే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అనే నినాదం వినిపించడం విశేషం. ఈ మూవీలో కీలక పాత్రలు పోషస్తున్న హీరోయిన్ సాయిపల్లవి, ప్రియమణి లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అలాగే రానా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన రానా రవన్న ప్రీ లుక్ ఆసక్తికరంగా మారింది. సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. "మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం." అనే సందేశంతో ప్రియమణి లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Presenting to you Comrade 'Ravanna' from #ViraataParvam. Here's the first glimpse 🔥 👉 https://t.co/iPsmyk7nDM Thank you guys for this!!@Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac #Priyamani @Naveenc212 @SLVCinemasOffl @SureshProdns. — Rana Daggubati (@RanaDaggubati) December 14, 2020 -
రానా బర్త్‌డే, మూవీ ఫస్ట్ లుక్.. సందడి
సాక్షి, హైదరాబాద్: వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి అప్ కమింగ్ మూవీ ‘విరాటపర్వం’ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రాణా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీస్ చేసింది చిత్రయూనిట్. మరోవైపు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేనా రానా స్పెషల్ డీపీని రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలనుంచి, ఫాన్స్దాకా సోషల్ మీడియాలో రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాల వెల్లువ జోరుగా కొనసాగుతోంది. కాగా బ్లాక్‌బస్టర్ బాహుబలి మూవీ లోని బల్లాలదేవతో తనప్రత్యేకతను ప్రపంచ వ్యాప్తంగా చాటుకున్న రానా ప్రస్తుతం విరాట పర్వం సినిమాతో మరోసారి భారీ హైప్ క్రియేట్ చేస్తున్నసంగతి తెలిసిందే. మరి కొద్ది నిమిషాలలో మూవీకి సంబంధించి టీజర్ కూడా రానుంది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాదికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing @RanaDaggubati a Happy Birthday. Happy to announce #ViraataParvam Audio on @LahariMusic#HBDRanaDaggubati@Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac #Priyamani @Naveenc212 @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/z5LvChn2i0 — Lahari Music (@LahariMusic) December 14, 2020 Proud to launch the birthday CDP created by @RanaDaggubati s darling fans ... my brother , my friend and my inspiration ... and I know you’re just getting started 🔥🙏 #HBDRanaDaggubati pic.twitter.com/z2oEX7hZNL — Samantha Akkineni (@Samanthaprabhu2) December 13, 2020 Happy Birthday Fireeeeeee 🔥 Btw ... couldn’t find a pic of us in recent times . I can’t post the old ones 😂😉 @RanaDaggubati #HBDranadaggubati #bestie pic.twitter.com/R6i8KvUPjU — Allu Arjun (@alluarjun) December 13, 2020 Happy birthday dearest @RanaDaggubati, I always love your passion towards cinema. Wishing you the best for 2 amazing projects #Aranya and #ViraataParvam. 👍 Stay blessed 😍#HBDRanaDaggubati pic.twitter.com/br1y1j4KxZ — Bobby (@dirbobby) December 14, 2020 -
ఆఖరి పర్వం
‘విరాటపర్వం’ చివరి దశకు వచ్చేసింది. కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్యమకారుల పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్‌ను వికారాబాద్ అడవుల్లో›పూర్తి చేస్తున్నారు. రానా, సాయిపల్లవి మరియు ముఖ్య తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చిత్రబృందం మొత్తం వికారాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది. -
విరాటపర్వం మళ్లీ ఆరంభం
రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. -
సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో హీరోయిన్గా సుందరమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ విషయానికి వస్తే...రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి. -
హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్ భారతక్క’
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియమణి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గురువారం ప్రియమణి బర్త్ డే సందర్భంగా ‘విరాటపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘కామ్రేడ్ భారతక్క’గా కనిపించనున్న ప్రియమణి.. పాత్రకు తగ్గ దుస్తులు, భుజాన తుపాకీతో పోస్టర్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఏదో సాధించిన విజయం ముఖంపై చిరునవ్వు రూపంలో ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు ప్రియమణిని ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం’ అంటూ చిత్ర బృందం తెలిపింది. ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, ప్రియమణిలతో పాటు నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 pic.twitter.com/NXzrXI0s2Z — Suresh Productions (@SureshProdns) June 4, 2020 -
విరాటపర్వం: సాయిపల్లవి నక్సలైట్ కాదు!
దగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. విలక్షణమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం విడుదలై చేసిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా సాయి పల్లవి కనిపించింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అమరవీరుల స్థూపం వద్ద సాయిపల్లవి చేతిలో పెన్ను, పక్కన సంచి ఉండటంతో ఆమె ఈ సినిమాలో నక్సలైట్ లేక రిపోర్టర్ కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి పోషించే పాత్ర నక్సలైట్ లేక రిపోర్టర్ కాదని ప్రజలను చైతన్య పరిచే ప్రజా గాయకురాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విప్లవ నాయకుడు క్యారెక్టర్లో కనిపించే రానా పట్ల ఆకర్షితురాలైన ప్రజా గాయకురాలిగా సాయి పల్లవి పాత్ర ఉండనుందని సమాచారం. ఇక ప్రజా గాయకురాలి పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని లీకువీరులు అంటున్నారు. అయితే సాయిపల్లవి పాత్ర గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్ తదితరులు నటిస్తున్నారు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రషూటింగ్ వాయిదా పడింది. చదవండి: శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’ -
అమరవీరుల స్థూపం వద్ద సాయిపల్లవి
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్స్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తన అందమైన నటనకు ఆకర్షించబడని ప్రేక్షకులుండరు. భానుమతిగా ఫిదాతో పరిచయం అయిన సాయి పల్లవి తన సినిమాలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ కెరియర్ ని లీడ్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నాగచైనత్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’ సినిమాలో టిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. (చదవండి : మే 9.. సినీ అభిమానులకు పండగ రోజు) నక్సలైట్‌గా సాయిపల్లవి..! వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి హీరో హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ ఇది. ఇందులో రానా పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్‌గా లేదా ఓ పాత్రికేయురాలి పాత్రలో నటించినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే ఆమె విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చుంది. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే’అని డైరెక్టర్ వేణు విశ్లేశించిన తీరు ఆకట్టుకుంటుంది. (చదవండి: ‘ఆకాశవాణి’ నుంచి జక్కన్న తనయుడు ఔట్?) వర్షంలో ఆడుతున్న సాయిపల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు లవ్ స్టోరీ తో సిద్దం అవుతుంది సాయిపల్లవి. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ క్రేజ్ లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. లవ్ స్టోరీ కి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ తర్వాత అప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్. శేఖర్ కమ్ముల సినిమాలలో కథానాయికలు ఎంత హుందాగా ఉంటారో అందరికీ తెలిసిందే.. భావోద్వేగాలతో నిండుకున్న ప్రేమకథలతో సెల్యులాయిడ్ పై శేఖర్ చేసే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ అయ్యేటట్టు కనిపిస్తోంది.హీరోయిన్ సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ లో సాయి పల్లవి మరింత అందంగా కనిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తుంది.‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేరాఫ్ కేరళ అడవులు
కేరళ అడవుల్లోకి మకాం మార్చారు రానా దగ్గుబాటి. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారని తెలిసింది. తన కొత్త చిత్రం ‘విరాట పర్వం’ షూటింగ్ కోసమే ఈ కేరళ మకాం. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: డాని సాంచెజ్–లోపెజ్. -
స్పెషల్ ట్రైనింగ్
పోలీసాఫీసర్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు రానా. ‘విరాటపర్వం’ సినిమా కోసమే ఈ ట్రైనింగ్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీలో రానా పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. పోలీసాఫీసర్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం మీద ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ దగ్గర రానా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. పోలీస్ లుక్ కరెక్ట్‌గా రావడం కోసం స్పెషల్ డైట్ ప్లాన్‌ను కూడా ఫాలో అవుతున్నారట రానా. అలాగే ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కొత్త ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల వికారాబాద్ ఫారెస్ట్‌లో జరిగిన షూటింగ్లో రానాతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
రానా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్
-
పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్
దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా... విరాటపర్వం ఫస్ట్‌గ్లింప్స్ విడుదలైంది. ముఖానికి ఎర్రటి వస్త్రం కట్టుకుని తీక్షణంగా చూస్తున్న రానా లుక్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రానా పోలీసు అధికారిగా కనిపిస్తుండగా... గాయకురాలిగా ఉండి, అనూహ్య పరిణామాల మధ్య నక్సల్ ఉద్యమంలో చేరే ఓ యువతి పాత్రను సాయి పల్లవి పోషిస్తున్నారు. వీరితో పాటు నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రానా పుట్టినరోజు సందర్భంగా అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘నువ్వు చేసే ప్రతీ పనిలో విజయవంతం కావాలి. హ్యాపీ బర్త్‌డే రానా’ అని ప్రిన్స్ మహేష్‌బాబు ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందనగా.. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో అతడి పాత్రను ఉటంకిస్తూ.. ‘థ్యాంక్యూ చీఫ్’ అంటూ రానా బదులిచ్చాడు. మహేష్‌తో పాటు హీరో రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా ఇతర సెలబ్రిటీలు రానాకు విషెస్ చెప్పారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సైతం రానాకు శుభాకాంక్షలతో పాటుగా.. ఫస్ట్‌లుక్ సూపర్‌గా ఉందంటూ అభినందనలు తెలిపాడు. And here is the first glimpse of my next #Virataparvam !! #RevolutionisanactofLove with @SLVCinemasOffl @SureshProdns @venuudugulafilm @Sai_Pallavi92 pic.twitter.com/3huc3xeRs4 — Rana Daggubati (@RanaDaggubati) December 13, 2019 Happy birthday, @RanaDaggubati! Wishing you success in everything you do. Have an incredible year ahead 🤗🤗 pic.twitter.com/lS7Mi1LZDC — Mahesh Babu (@urstrulyMahesh) December 14, 2019 Congratulations Rana!!! @RanaDaggubati ! This looks super exciting 👍👍👍👍👍👍👍 https://t.co/hxEYLWrlCB — Karan Johar (@karanjohar) December 14, 2019 -
సింగర్ టు నక్సలైట్!
తుపాకీతో ఎలా కాల్చాలి? బాంబులు ఎలా వేయాలి? అని ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట సాయి పల్లవి. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా ‘విరాట పర్వం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. గాయకురాలిగా ఉండి, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య నక్సల్ ఉద్యమంలో చేరే ఓ యువతి పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి. నక్సలైట్ల బాడీ లాంగ్వేజ్, వేషధారణ, కూంబింగ్ ఆపరేషన్స్ వంటి విషయాల్లో అవగాహన కోసం ఓ మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారట సాయి పల్లవి. ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు రానా. ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్ కీలక పాత్రధారులు. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం వరంగల్, మెదక్, కరీంనగర్లో ప్లాన్ చేశారు. -
‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’
స్టార్ వారసుడు, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి తాజా లుక్ మరోసారి అభిమానులను కలవరపరుస్తోంది. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ రానా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా నటుడిగా, హోస్ట్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక విజువల్ వండర్ బాహుబలి సినిమాతో రానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భల్లాలదేవగా నటించిన రానాకు అభిమానులు నీరాజనాలు పట్టారు. అయితే బాహుబలి తర్వాత మాత్రం రానా కెరీర్ స్పీడ్ తగ్గింది. ప్రస్తుతం విరాటపర్వం, హాథీ మేరే సాథీ సినిమాలతో బిజీగా ఉన్న రానా ఆరోగ్యం బాగా లేదనే వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. రానాకు అమెరికాలో కిడ్నీ మార్పిడి జరిగిందని, ఆయన తల్లి రానాకు కిడ్నీ దానం చేశారంటూ వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ విషయాలపై స్పందించిన రానా.. తాను ఆరోగ్యంగా ఉన్నానని పదే పదే చెప్పినా ఇలాంటి రూమర్లు ప్రచారం అవుతున్నాయని.. తనకు ఇదో బోరింగ్ టాపిక్‌గా మారిందని అసహనం వ్యక్తం చేశాడు. అయితే మంగళవారం రానా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో మరోసారి అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ బ్యాంకుకు సంబంధించిన మిలీనియా కార్డు గురించి చెబుతూ..‘ మిలీనియల్స్ జీవనశైలి సులభంగా ఉంటుందని ఎవరు చెప్పారు. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియాతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అంటూ కార్డు పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోపై స్పందించిన రానా అభిమానులు.. అన్నా అసలు ఏమైంది. ఇలా ఉన్నావేంటి. మా కోసమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మాకు బలంగా ఉన్న భల్లాలదేవ కావాలి. ఇలా ఎముకల గూడులా కనిపిస్తే తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram Who says a man's lifestyle is affordable? Especially when you’re a Millennial. But I’ve now got a clear winner for life, #HDFCBankMillennia - A card that pays you to spend. So that football night with friends and lots of pizza? You’re In. Those Shoes? You’re Buying Them. To get your HDFC Bank Millennia Card DM @hdfcbank, cause it’s your life…#SpendItWell Powered by @mastercardindia A post shared by Rana Daggubati (@ranadaggubati) on Sep 30, 2019 at 2:29am PDT -
‘విరాటపర్వం’లో నందితా దాస్
నీది నాదీ ఒకే కథ చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంగా ‘విరాటపర్వం’ను ఎంచుకున్నాడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర షూటింగ్‌ను ప్రారంభించింది యూనిట్. ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు టబును ఎంచుకున్నట్లు, ఆమె కాదన్నాక ఆ క్యారెక్టర్‌ను ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ దగ్గరకు వచ్చిందనే వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే వాటిపై స్పందిస్తూ.. ఒకరి వదులుకున్న పాత్ర మరొకరు చేస్తే తప్పేంటి? నాకు కథ నచ్చింది, నా పాత్ర నచ్చింది అందుకే చేస్తున్నానటంటూ తేల్చిచెప్పింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్న నందితా దాస్ మాట్లాడుతూ.. ‘ చాలా కాలం తరువాత తెలుగు మాట్లాడుతున్నా.. కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి సెట్లోకి వచ్చాక అంతా బాగుంది. నాకు ఎంతో దగ్గరైన పాత్ర ఇది. ఇక్కడి బృందం ప్రొఫెషనల్‌గానే కాకుండా ఎంతో స్నేహంగా ఉంది. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది. రానా కోసం నేను ఎదురుచూస్తున్నా’ను అంటూ తెలిపింది. -
రానా సినిమా నుంచి టబు అవుట్!
బిజీ షెడ్యూల్లో డేట్స్ సర్దుబాటు చేయలేక సీనియర్ నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మహేష్ సరిలేరు నీకెవ్వరు నుంచి జగపతి బాబు, బన్నీ, త్రివిక్రమ్ సినిమా నుంచి రావూ రమేష్‌లు తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు టబును తీసుకున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట. దీంతో విరాటపర్వం టీం ఆ పాత్రకు నందిత దాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
‘విరాటపర్వం’లో మొదటి ఘట్టం పూర్తి
చేసే ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునే నటీనటులు రానా, సాయి పల్లవి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి చేస్తోన్న చిత్రమే విరాటపర్వం. తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టేసింది చిత్రబృందం. తెలంగాణలోని ఓ గ్రామంలో చిత్రయూనిట్ చేస్తోన్న ఫస్ట్ షెడ్యుల్ పూర్తైనట్లు సమాచారం. ధరిపల్లి అనే గ్రామంలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో షెడ్యుల్‌ను ప్రారంభించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్ మణి కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
‘విరాటపర్వం’ చిత్రం ప్రారంభం
-
విరాటపర్వం ఆరంభం
అజ్ఞాతవాసం కోసం పూర్వం విరాటరాజు కొలువులో పాండవులు కొలువు దీరి కార్యసిద్ధులయ్యారు. ఇప్పుడు వెండితెరపై రానా ‘విరాటపర్వం’ మొదలైంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా నటించనున్న ‘విరాటపర్వం’ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నటుడు వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరిలు దర్శకుడు వేణు ఉడుగులకు స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, దర్శకులు చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్ మణి కెమెరామేన్. -
‘విరాటపర్వం’ మొదలైంది!
‘నీదినాది ఒకే కథ’ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండో సినిమాను ప్రారంభించాడు. మరోసారి ప్రయోగాత్మక శైలినే ఎంచుకున్న వేణు.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్‌ను అందించారు. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకాలపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్, డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, సాయిపల్లవి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, డైరెక్టర్స్ చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. -
నా జీవితాన్నే మార్చేసింది : రానా
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి... కలెక్షన్ల వర్షం కురిపించింది బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో .. ఆ సినిమాలోని నటీనటులు అంతే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో హీరో ప్రభాస్‌తో పాటు స్టార్ వారసుడు రానా దగ్గుబాటి కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న రానా.. భల్లాలదేవ పాత్రతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కాగా బాహుబలి: ద కన్‌క్లూజన్ విడుదలై ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రానా ఆనందం వ్యక్తం చేశాడు. ‘ రెండేళ్ల క్రితం ఇదే రోజు నా జీవితాన్ని మార్చివేసింది. చిరస్థాయిగా నిలిచిపోయే భారతీయ సినిమా బాహుబలి’ అంటూ బాహుబలి 2 పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో రీట్వీట్లు, లైకులతో బాహుబలి అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదే విధంగా బాహుబలి తర్వాత రానా ఇతర సినిమాల విడుదల జాప్యంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు బ్రో అంటూ రానాను ప్రశ్నిస్తున్నారు. ఇక కొద్ది రోజులు క్రితం రానా ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రానా తండ్రి సురేష్ బాబు కూడా రానా చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించాడు. తాజాగా రానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్ మరోసారి చర్చకు దారి తీస్తోంది. బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం హాథీ మేరే సాథీ, విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న రానా ఆ సినిమాల కోసం ఇలా బరువు తగ్గాడా? లేక హెల్త్ ప్రాబ్లం కారణంగా తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. Two years this day changed my life and Indian cinema forever!! #Baahubali pic.twitter.com/XezO0D42I4 — Rana Daggubati (@RanaDaggubati) April 28, 2019 -
రానాకి ఏమైంది..?
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన స్టార్ వారసుడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో అన్న ఇమేజ్‌లో ఫిక్స్ అవ్వకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. బాహుబలి సినిమాతో రానా ఇమేజ్ తారా స్థాయికి చేరింది. కానీ బాహుబలి తరువాత రానా స్పీడు తగ్గించేశాడు. కొద్ది రోజులు క్రితం రానా ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వార్తలు వినిపించాయి. రానా తండ్రి సురేష్ బాబు కూడా రానా చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించారు. తాజాగా రానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్ మరోసారి చర్చకు దారి తీస్తోంది. బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం హాథీ మేరే సాథీ, విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న రానా ఆ సినిమాల కోసం ఇలా బరువు తగ్గాడా? లేక హెల్త్ ప్రాబ్లం కారణంగా తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. -
విరాటపర్వం: సురేంద్రనాథ్ వ్యాఖ్యానం
వింటే భారతం వినాలి. అయితే ఎవరి నోట వినాలి? ఎవరు యోగ్యులో, ఎవరు పండితులో, ఎవరు మహాభారత హృదయ ప్రవేశం ఎరగినవారో, ఎవరు అందలి మాయను, మర్మాన్ని, మహా దర్శనాన్ని విడమర్చి సాక్షాత్కారింపచేయగలరో వారి నోటి గుండా వినాలి. అప్పుడే ఆ రుచి తెలుస్తుంది. సాంప్రతి సురేంద్రనాథ్ భారతాన్ని ఔపోసన పట్టారు. మహా భారత వ్యాఖ్యాతగా వాసికెక్కారు. ముంబైలోని తెలుగు కుటుంబాలు గత మూడు నాలుగేళ్లుగా ప్రతి ఆదివారం ఆయన ద్వారా మహాభారత వ్యాఖ్యానం చెప్పించుకుని ఆ పంచమవేదాన్ని ప్రీతిపాత్రం చేసుకుంటున్నాయి. అంతే కాదు ఆ వ్యాఖ్యానాలను పుస్తకాలుగా కూడా వెలువరించబూనుకున్నాయి. ఆ వరుసలో మొదటగా వచ్చిందే ఈ విరాటపర్వం. వ్యాసభారతం- అంటే మూలం ఆధారంగా సాగుతున్న ఈ వ్యాఖ్యానం వల్ల కాలక్రమంలో వచ్చిన అనేకానేక భారతాల వల్ల వాటిలో చోటు చేసుకున్న ప్రక్షిప్తాల వల్ల ఏర్పడిన కొన్ని అయోమయాలు సందేహాలు దురభిప్రాయాలు దూరం చేసుకోవచ్చు. ఇందులోని కొన్ని వ్యాఖ్యానాలు- ముఖ్యంగా ద్రౌపది గాంభీర్యం, కీచుకుని ఆరాటం, సుదేష్ణ ఓదార్పు, ఉప కీచకుల శోకం వంటివి చదివి తీరదగ్గవి. రసోభ్యుదయోల్లాసి- విరాటపర్వం- మొదటిభాగం సాంప్రతి సురేంద్రనాథ్ వ్యాఖ్యానం; వెల: రూ.100; ప్రతులకు: 040-27832081, 98480 60579