ఆఖరి పర్వం | Virataparvam shooting almost completed | Sakshi
Sakshi News home page

ఆఖరి పర్వం

Published Tue, Nov 24 2020 5:47 AM | Last Updated on Tue, Nov 24 2020 5:47 AM

Virataparvam shooting almost completed - Sakshi

‘విరాటపర్వం’ చివరి దశకు వచ్చేసింది. కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్యమకారుల పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్‌ను వికారాబాద్‌ అడవుల్లో›పూర్తి చేస్తున్నారు. రానా, సాయిపల్లవి మరియు ముఖ్య తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చిత్రబృందం మొత్తం వికారాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement