Priyamani
-
మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళీ దర్శకుల తర్వాత ఎవరైనా! ఎందుకంటే చాలా సాధారణంగా అనిపించే విషయాల్ని స్టోరీలుగా మలచి అదిరిపోయే థ్రిల్లర్ చిత్రాలు తీస్తుంటారు. 'దృశ్యం' నుంచి మొదలుపెడితే కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కిష్కింద కాండం' వరకు లిస్ట్ చాలా పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మూవీ చేరింది. ఫిబ్రవరి 20న కేరళలోని థియేటర్లలో రిలీజైన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రస్తుతానికి రూ.30 కోట్ల మేర కలెక్షన్స్ కూడా సాధించింది. ఎంతలా మెప్పించకపోతే ఇప్పుడు దీన్ని డబ్బింగ్ చేసి తెలుగులోకి కూడా తీసుకొస్తారు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' పేరుతోనే మార్చి 7న.. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ సంస్థ ఆ పని చేస్తుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ప్రియమణి.. కీలక పాత్రలో నటించింది.సినిమా కథ విషయానికొస్తే.. సీఐగా పనిచేసే హరీశ్ శంకర్ చాలా స్ట్రిక్ట్. తన టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఓసారి నకిలీ బంగారు ఆభరణాల కేసుని దర్యాప్తు చేస్తున్న టైంలో సె*క్స్, డ్ర*గ్ రాకెట్ కేసులు బయటపడతాయి. దీంతో ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నకిలీ ఆభరణాల కేసుకు.. డ్రగ్స్ కి సంబంధమేంటనేది మిగతా స్టోరీ. కట్టిపడే సస్సెన్స్ తో చివరి వరకు ఈ సినిమా థ్రిల్ చేస్తుందట. మరి తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో?(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు) -
నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి
ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు. అది కేవలం హృదయాల్ని తాకుతుంది. మనసుల్ని ఒక్కటి చేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను కాదనుకుని మనసు మాట విని పెళ్లి చేసుకున్నవారికి సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటునే ఉన్నానంటోంది హీరోయిన్ ప్రియమణి (Priya Mani Raj). ఈమె 2017లో ప్రియుడు ముస్తఫ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తనపై ట్రోలింగ్ జరుగుతూనే ఉందని చెప్తోంది.సంతోషాన్ని పంచుకుందామనుకుంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. నేను నా సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాను. అలా నా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఓ రోజు సోషల్ మీడియాలో వెల్లడించాను. విచిత్రంగా చాలామందికి మా జంటపై విపరీతమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతడు నన్ను మతం మార్పిడికి ఒత్తిడి తెస్తాడని ఏవేవో ఊహించుకుని మాపై విషం కక్కారు. జనాలు ఎంతదూరం వెళ్లారంటే.. రేపు మాకు పుట్టబోయే పిల్లలు ఐసిస్‌లో చేరతారని కామెంట్లు చేశారు.ఇప్పటికీ అంతే..నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అయినంతమాత్రాన మీ నోటికి ఏదొస్తే అది అనేస్తారా? అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా విమర్శిస్తారా? ఆ ట్రోలింగ్ వల్ల రెండు, మూడు రోజులపాటు నేను మనిషిని కాలేకపోయాను. ఇప్పటికీ నా భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తే చాలు.. పదిలో తొమ్మిది కామెంట్లు మతం లేదా కులం గురించే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియమణి చివరగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ మూవీ చేస్తోంది. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తోంది.చదవండి: OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్ -
చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. బాలిలో విష్ణుప్రియ చిల్!
చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో చిల్ అవుతోన్న బిగ్‌బాస్ భామ విష్ణుప్రియ..పెళ్లి కూతురిలా ముస్తాబైన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్..మాల్దీవుస్లోనే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..బీచ్‌లో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి సురేఖవాణి..గ్రీన్ శారీలో ప్రియమణి పోజులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
పింక్ శారీలో ప్రియమణి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటోలులు
-
ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ: హీరోయిన్
హీరోహీరోయిన్లుకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. పలానా పాత్ర చేయాలని.. అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలు.. చిన్న పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అవుతారు. అలా ఓ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అన్ని వదిలేసి ఆయన మూవీ కోసం ఎదురు చూస్తాను అంటోంది సీనియర్ నటి ప్రియమణి(Priyamani ). అంతేకాదు ఆయన సినిమాలో నటించేందుకు చేసు కూడా కోసుకుంటాను అని చెబుతోంది. ఇంతకీ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే..?ఫోన్ వస్తే చాలు.. దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. అందులో కచ్చితంగా మణిరత్నం(Mani Ratnam) పేరు ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన తెరకెక్కించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్ మూవీస్. ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మణిరత్నం ఫేవరేట్ డైరెక్టర్. వారిని తెరపై అందంగా, డిఫరెంట్‌గా చూపించే డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన సినిమాలో చాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు. కమిట్ అయిన సినిమాలను వదిలేసి మరీ.. మణిరత్నం సినిమాల్లో నటిస్తారు. ప్రియమణికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. గతంలో మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్లో బిజీ బిజీఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియమణి.. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. -
'ది ఫ్యామిలీ మ్యాన్-3' గురించి గుడ్ న్యూస్
ఓటీటీలో భారీ విజయం అందుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఓటీటీలో భారీగా ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్’ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ షూటింగ్ పనులను గతేడాదిలో ప్రారంభించారు. అయితే, తాజాగా ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్3’ గురించి ఒక శుభవార్తను మేకర్స్ పంచుకున్నారు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. అందుకు సంబంధించి వారు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజ్ అండ్ డీకేతో పాటు మనోజ్ బాజ్‌పాయ్,గుల్‌పనాగ్, ప్రియమణి, సమంత పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో వారు పంచుకున్నారు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కూడా మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, విడుదల తేదీని ప్రకటించలేదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. It's a wrap on Season 3 of The Family Man! Thank you to the wonderful crew and cast for going through with the toughest shoot yet! ❤️#TFM #TheFamilyMan3 pic.twitter.com/WXogsICE6v— Raj & DK (@rajndk) January 23, 2025 -
ఓటీటీలోనే టాప్ వెబ్ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన
ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం తర్వలో విడుదల కానుంది. 2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు దర్శకులు చూపించారు.'ఫ్యామిలీ మ్యాన్ 3'లో మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయినట్లు మనోజ్ తాజాగా ప్రకటించారు. ఈమేరకు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. విజయవంతంగా మూడో సీజన్ షూటింగ్ ముగిసిందని తెలిపిన ఆయన త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. అయితే, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించలేదు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
అందమైన చీరలో ప్రియమణి, స్టన్నింగ్ లుక్స్
-
హీరోలతో పోటీ పడుతున్న సూపర్ లేడీస్.. ఇప్పుడిదే ట్రెండ్
సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతీకారం కేసు పెడదామంటే..‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివశక్తిగా... తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బంగారు బొమ్మ ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డబుల్ ధమాకా హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహిళల పరదా పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. ఓ భక్తురాలి కథ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్ఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త థ్రిల్లర్ మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు. కుమారి ఖండం నేపథ్యంలో..హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హత్యలు చేసిందెవరు? ప్రియమణి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి
ప్రస్తుత జనరేషన్లో సినిమా సెలబ్రిటీలకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. సినిమా, వ్యక్తిగత జీవితం.. ఏదైనా సరే ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోల దగ్గర చిన్న నటుల వరకు ఈ బాధ తప్పట్లేదు. తాజాగా తాను చాన్నాళ్ల అనుభవిస్తున్న బాధ గురించి హీరోయిన్ ప్రియమణి బయటపెట్టింది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో చెప్పింది.(ఇదీ చదవండి: నటి వనితా విజయకుమార్ నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది)'ముస్తాఫా రాజ్ నాకా చాలాకాలంగా తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని నన్ను ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ల మాటల వల్ల మాత్రం చాలా బాధపడ్డాను. కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. కానీ ఈ విషయంలో నన్ను ఎక్కువగా టార్గెట్ చేశారు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది.కన్నడకు చెందిన ప్రియమణి.. 2003 నుంచి ఇండస్ట్రీలో ఉంది. మధ్యలో కెరీర్ ఇక అయిపోయిందని అన్నారు. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ, మరోవైపు షారుక్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
ఫెస్టివ్ సీజన్లో చీరలే ప్రత్యేకం: నటి పిల్లుమణి చీరందం (ఫోటోలు)
-
సన్నీ లియోన్ షాకింగ్ లుక్.. 'క్యూజీ' ట్రైలర్ రిలీజ్
సన్నీ లియోన్, ప్రియమణి, జాకీష్రాఫ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'క్యూజీ గ్యాంగ్ వార్'. ఈనెల 30న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదగా ఇది లాంచ్ అయింది.(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి)ట్రైలర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులు ఎవరినీ గుర్తుపట్టలేం అన్నంతగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించారు. అలానే విజువల్స్ చూస్తుంటే గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా గుర్తొచ్చింది. మరి ఈ సినిమా కూడా అంత సెన్సేషన్ సృష్టించి హిట్ అవ్వాలని ట్రైలర్ ఆవిష్కరణకు విచ్చేసిన నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) -
తెలుగులో సన్నీ లియోన్, ప్రియమణి ‘క్యూజీ’
జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్యూజీ. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఎం. వేణుగోపాల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ మాట్లాడుతూ..క్యూజీ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. . ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో ప్రియమణి స్టన్నింగ్స్ లుక్స్ (ఫోటోలు)
-
ఫ్రెండ్సిప్ డే రోజు సినీ తారలు పంచుకున్న ఫోటోలు
గ్రీన్ కలర్ చీరలో తలుక్కుమంటున్న మీనాక్షీ చౌదరిసింబా సినిమా ప్రమోషన్లో ట్రెండీగా మెరిసిన సీనియర్ నటి కస్తూరిగ్లామర్ ఫోటోలతో హీట్ పెంచుతున్న షాలిని పాండే View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kasthuri Rasigan (@kasthurirasigan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
వైట్ శారీలో నటి ప్రియమణి కిల్లింగ్ లుక్స్... (ఫొటోలు)
-
మాటల్లేవ్ అంటున్న ప్రియమణి కిల్లింగ్ లుక్స్ చూశారా? (ఫొటోలు)
-
ప్రియమణికి వయసుతో పాటు అందం పెరుగుతుందా ఏంటి? (ఫొటోలు)
-
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి
సాధారణంగా 40 ఏళ్లకు చేరువైతే హీరోయిన్లకు ఛాన్సులు తగ్గిపోతాయి. ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ప్రియమణికి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్ గా వరస అవకాశాలు వస్తున్నాయి. అలా ప్రస్తుతం బిజీగా ఉంది. రీసెంట్ గానే 'మైదాన్' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) సినిమాకు సంబంధించిన పలు ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియమణికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎదురైన ట్రోల్స్ గురించి మాట్లాడింది. తనతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చింది. 'నిజం చెప్పాలంటే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. నా తల్లిదండ్రులు దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ నా భర్త మాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఇలాంటి అండర్ స్టాండింగ్ ఉన్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టమని చెప్పాలి. ఆయనకు పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇకపోతే 2017లో ప్రియమణి.. ముస్తాఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: నయనతార తీసిన సినిమాకు సీఏఐబీ అవార్డ్) -
#Maidaan: రియల్ హీరో రహీం సాబ్.. స్కూల్ టీచర్ నుంచి కోచ్ దాకా!
స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ రవీంద్రనాథ్ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్ అబ్దుల్ రహీం కథ. భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు ఏమిటి?.. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు. ముప్పై ఏళ్ల వయసులో కమార్ క్లబ్, యూరోపియన్ క్లబ్ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కోచ్గా మారారు. రహీం సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్ క్లబ్ మూడు డ్యూరాండ్, ఐదు రోవర్స్ కప్‌లు గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు కోచ్‌గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది. స్వర్ణ యుగం 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్ రన్ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా రహీం సాబ్ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. రహీం గైడెన్స్‌లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి పసిడి పతకం సాధించింది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్ తంగరాజ్ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్‌బాల్ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు. బ్రిటిష్ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు 1958, 1962 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్ ఉన్నంతకాలం భారత్ ఫుట్‌బాల్ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రహీం సాబ్.. 1963లో కాన్సర్ బారిన పడ్డారు. ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అదే ఏడాది జూన్‌లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్ ఫుట్‌బాల్ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్ సాబ్ తనతో పాటు ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. గుర్తింపు దక్కని యోధుడు భారత ఫుట్‌బాల్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్‌కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! ఎంతో మందిని మేటి ఫుట్బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్ కొడుకు సయ్యద్ షాహిద్ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మైదాన్ సినిమాతో నేటి తరానికి తెలిసేలా సయ్యద్ అబ్దుల్ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. -
Priyamani: చీరలో మైమరిపిస్తున్న సీనియర్ హీరోయిన్ (ఫోటోలు)
-
ఆ విషయం వాళ్లనే అడగాలి: ప్రియమణి హాట్ కామెంట్స్
మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగిన నటి ప్రియమణి. ముఖ్యంగా కోలీవుడ్‌లో భారతీరాజా, బాలుమహేంద్ర వంటి టా ప్ దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న లక్కీ బ్యూటీ ఆమె. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగు పాత్రలో పరకాయ ప్రవే శం చేసి జాతీయ ఉత్త మ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ చి త్రం తరువాత గ్లామర్ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియమణి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్డున వంటి స్టార్ హీరోల సరసన నటించారు. కానీ కోలీవుడ్‌లో అలాంటి స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదు. నిజం చెప్పాలంటే ఈమె తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. కాగా ఆ మధ్య పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన ప్రియమణి చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ పాత్రల్లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. కాగా చాలా కాలం క్రితమే బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియమణి మళ్లీ ఇటీవల హిందీ చిత్రాల అవకాశాలు పొందడం విశేషం. గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన షారూఖ్ ఖాన్ హీరోగా నటించి నిర్మించిన జవాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా అజయ్‌దేవ్‌గన్ సరసన మైదాన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రియమణి బదులిస్తూ తాను ఎవరినీ తప్పు పట్టలేనన్నారు. తనకు అవకాశం ఇస్తే నటనలో వారిని డామెనేట్ చేస్తానని కొందరు తనతో చెప్పారన్నారు. అయితే అందులో నిజం లేదన్నది తనకు తెలుసన్నారు. నిజం చెప్పాలంటే టాప్ హీరోలతో జత కట్టే అవకాశాలు రాకపోవడానికి కారణం తనకూ తెలియదన్నారు. ఆ విషయం గురించి ఆ హీరోలు, నిర్మాతలనే అడగాలని నటి ప్రియమణి పేర్కొన్నారు. -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరి..ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
అలాంటి లుక్‌లో హన్సిక పోజులు... ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరీ హోయలు... గ్రీన్ డ్రెస్‌లో ప్రియమణి లుక్స్.. బీచ్‌లో తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఎల్లో డ్రెస్‌లో ఫరియా అబ్దుల్లా పోజులు.. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్!
అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిత్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే బోనీ కపూర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. "ప్రియమణి లాంటి అందరికీ బాగా తెలిసిన హీరోయిన్‌తో అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. బోనీ కపూర్ జీ మీరేమైనా ఇండియాలో హార్వే వైన్స్టెయిన్ అనుకుంటున్నారా? లేదా ఆ బహుమతిని తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాగా.. బోనీ కపూర్ మహిళలతో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మొదటిసారి కాదని నెటిజన్లు అంటున్నారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై చేతులు వేసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు కూడా నెటిజన్లు విమర్శలు చేశారు. అంతే కాదు ఓ కార్యక్రమంలో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు -
తెలుగులో స్టార్ హీరోల పక్కన ప్రియమణికి నో ఛాన్స్.. ఎందుకంటే?
అందాల ప్రియమణి.. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. కానీ పెద్ద హీరోలతో ఒకటీరెండు చిత్రాలు మినహా ఎక్కువగా నటించలేదు. మీడియం రేంజ్ హీరోలతోనే ఎక్కువ మూవీస్ చేసిన ఈమె తెలుగు, తమిళ భాషల్లో బడా స్టార్ హీరోలతో జతకట్టనేలేదు. ఇన్నేళ్ల కెరీర్లో స్టార్ హీరోల సరసన నటించకుండా ఉండిపోవడానికి కారణమేంటన్న ప్రశ్న ప్రియమణికి తరచూ ఎదురవుతుంది. మైదాన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడా ఇదే ప్రశ్న ఎదురైంది. నా డామినేషన్ ఎక్కువ! దీనికి ప్రియమణి స్పందిస్తూ.. 'టాప్ లిస్టులో ఉండే హీరోలకు జోడీగా నన్నెందుకు తీసుకోరనేది నాకూ అర్థం కాదు. ఇప్పటికీ దాని సమాధానం నా దగ్గర లేదు. ఈ ప్రశ్న దర్శకనిర్మాతలను అడిగితే బాగుంటుంది. అయినా ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. చాలామంది దగ్గర నేను విన్నదేంటంటే.. నన్ను సినిమాలో తీసుకుంటే నా పక్కన ఉన్నవాళ్లు కనబడకుండా డామినేట్ చేస్తానట! వారి పాత్రలను తినేస్తానట! అందుకనే స్టార్ హీరోకు జోడీగా లేదా వారి సినిమాల్లో నన్ను తీసుకోవడానికి ఆసక్తి చూపించరని చెప్తుంటారు. సగం తెలిసినవాళ్లే, అయినా.. ఏదో అలా అంటారు కానీ, ఇది నిజం కాదులెండి.. సరైన కారణమేంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. అయినా ఏం పర్లేదు.. నేను చేస్తున్న పాత్రలతో సంతృప్తిగానే ఉన్నాను. అయితే నెంబర్ 1 హీరోలతో నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాళ్లతో పనిచేయకపోవడం వల్ల అవన్నీ మిస్ అయిపోతున్నానపిస్తుంది. దాదాపు సగం మంది స్టార్ హీరోలు నాకు పరిచయస్థులే..కనిపిస్తే హాయ్, బాయ్ అనైనా పలకరించుకుంటాం. వారి సినిమాల్లో నన్ను ఎందుకు సెలక్ట్ చేయట్లేదని కొన్నిసార్లు బాధగానూ అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది. చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
ఆ ఆలయానికి ఎవరూ ఊహించని కానుకను అందించిన ప్రియమణి
కేరళ త్రిసూర్ దగ్గరలో ఉన్న కొచ్చిలో 'త్రిక్కయిల్ మహాదేవ ఆలయం' ఉంది. అక్కడి ఆలయం కోసం ఒక ఏనుగును కానుకగా సినీ నటి ప్రియమణి అందించారు. కానీ అది రోబోటిక్ ఏనుగు కావడం గమనార్హం. ఆమె రోబోటిక్ ఏనుగును ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే.. కేరళ, తమిళనాడులోని పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారి కట్టినతర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళ్తూఉంటాయి. కొన్నిసార్లయితే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. 15 ఏళ్ల కాలంలో కేరళలో బందీ అయిన ఏనుగులు 526 మందిని చంపాయని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. దీంతో అక్కడి పూజారులు రోబొటిక్ ఏనుగులు ప్రవేశపెట్టాలని పలుమార్లు కోరారు. అందుకు బడ్జెట్ ఎక్కువ కానున్నడంతో వారి ప్రతిపాదన ఆగిపోయింది. కానీ సంవత్సరం క్రితం పెటా ఇండియా సభ్యుల అధ్వర్యం ద్వారా ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు అందించారు. ఇప్పుడు తాజాగా కొచ్చిలోని త్రిక్కయిల్ మహాదేవ ఆలయానికి హీరోయిన్ ప్రియమణి కూడా ఒక ఏనుగును కానుకగా అందించి తన మంచి మనసును చాటుకుంది. ఇండియాలో ఒక ఆలయంలో రోబోటిక్ ఏనుగులను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ప్రియమణి అందించిన ఏనుగుకు 'మహదేవన్' అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ.. 'బీటా సంస్థతో కలిసి రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వివాహ వేడుకల్లో అలంకరణకు మాత్రమే వినియోగించే ఈ యాంత్రిక ఏనుగులను ఇప్పుడు ఆలయాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం వల్ల ప్రాణాలతో ఉన్న ఏనుగులను హింసించడం తగ్గుతుందని ఆమె తెలిపింది. అంతే కాకుండా వాటి నుంచి పలువురి ప్రాణాలను కూడా రక్షించవచ్చు.' అని ఆమె తెలిపింది. పదిన్నర అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉన్న ఈ యాంత్రిక ఏనుగు నలుగురిని తీసుకెళ్లగలదు. ఏనుగు తల, కళ్లు, నోరు, చెవులు, తోక అన్నీ విద్యుత్తుతో పనిచేస్తాయి. హిందూ ఆచారాల ప్రకారం ఉత్సవాల్లో ఏనుగులు, ఇతర జంతువులను ఉపయోగించకూడదని దేవస్థానం ఇచ్చిన పిలుపుతో పెటా ఇండియా సంస్థ వారు ప్రియమణి సాయంతో ఈ రోబోటిక్ ఏనుగును దేవాలయానికి బహుమతిగా అందించింది. -
ఓటీటీకి వంద కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కొత్త ఏడాదిలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్టికల్ 370 ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. -
ప్రియమణి గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? (ఫొటోలు)
-
Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె!
'ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..' ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది. ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే. ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’. ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
శారీలో రంగమ్మత్త క్యూట్ లుక్స్.. క్రేజీ అవుట్‌ఫిట్‌లో సమంత పోజులు!
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్.. అలాంటి అవుట్‌ఫిట్‌లో సమంత క్రేజీ లుక్స్.. శారీలో రంగమ్మత్త అలాంటి పోజులు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
కేతిక శర్మ, ప్రగ్యా జైస్వాల్ ఔట్ ఫిట్ ఫోటోలు వైరల్
► మేము మళ్లీ అక్కడికి వెళ్తున్నాం అంటూ పోజులు ఇచ్చిన కేతిక షర్మ ► పెళ్లిలో ఔట్ ఫిట్ పిక్స్‌తో భూమి ఫడ్నుకర్ ► ఆర్టికల్ 360 విజయంలో ప్రియమణి ► వైట్ శారీలో మౌనీరాయ్ ► యాదాద్రిలో శ్రీముఖి ► కలర్‌ఫుల్ శారీలో పూజా హెగ్డే View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
సోకులతో సెగలు రేపుతున్న ఐశ్వర్య.. అలాంటి క్రేజీ లుక్‌తో శోభిత!
వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కీర్తి సురేశ్ క్యూట్‌నెస్ ముఖం చూపించకుండా ఫన్నీ పోస్ట్ పెట్టిన రష్మిక బాడీకి అతుక్కుపోయే డ్రస్‌తో మెంటలెక్కిస్తున్న ఐశ్వర్య కుర్చీపై కూర్చుని అలాంటి పోజులిచ్చిన హీరోయిన్ శోభిత బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న ముద్దుగుమ్మ రిచా పనయ్ సూపర్ హీరోల కోటు గురించి ప్రియమణి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తమిళ యంగ్ హీరోయిన్ చీరకట్టు పోజులు.. మరింత క్యూట్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?
హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసింది గానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంది. దీంతో ఈమె పనైపోయిందనుకున్నారు. కానీ బంతిని గట్టిగా బౌన్స్ అయింది. ఓటీటీ, సహాయ పాత్రల్లో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడైన ఖరీదైన కారు కొనుగోలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రియమణి.. తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో నటిగా ఈమె కెరీర్ మొదలవగా.. తెలుగులో బోలెడన్ని చిత్రాలు చేసింది. మధ్యలో తమిళ, మలయాళంలోనూ నటించింది. 2012-13 మధ్యలో ఈమెకు ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అనుకున్నారు. దీంతో టీవీ షోలు చేస్తూ వచ్చింది. 2017లో ముస్తాఫా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అలా పెళ్లి చేసుకుని గృహిణి అయిన తర్వాత ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఛాన్సులు వరసపెట్టి వచ్చాయి. 'భామా కలాపం' లాంటి సినిమాల్లో హీరోయిన్గా.. జవాన్, నెరు, కస్టడీ తదితర చిత్రాల్లో ప్రాధాన్యమున్న సహాయ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా అనుకోని విధంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ప్రియమణి.. తాజాగా ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ధర రూ.74 లక్షల వరకు ఉంది. ఇప్పటికే కొన్ని కాస్ట్ లీ కార్స్ ఈమె దగ్గర ఉండగా.. ఇప్పుడీ కారు ప్రియమణి గ్యారేజీలో చేరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
హిందీ సెలబ్రిటీల బండారం రివీల్
-
బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి
నటి ప్రియమణి చాలామందికి తెలియని సీక్రెట్ బయటపెట్టింది. బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి జరుగుతున్న ఓ పని వెనక అసలేం జరుగుతుందో మొత్తం బయటపెట్టింది. ఓర్ని అసలు సంగతి ఇదా అని అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ప్రియమణి ఏం చెప్పింది? హిందీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ప్రియమణి.. హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు అంత పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. పలు షోల్లో జడ్జిగా చేస్తూ వచ్చింది. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఈమె ఫేట్ మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఇలా ఓ వైపు మూవీస్‌లో ముఖ్య పాత్రలు చేస్తూ జోరు మీదుంది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) ఈ మధ్య కాలంలో జవాన్, నెరు, భామా కలాపం 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లు ఇస్తూ బిజీగా ఉంది. అలా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ. బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ బండారం బయటపెట్టింది. చాలామంది హిందీ హీరోయిన్లు.. జిమ్, విమానాశ్రయం, హోటల్ దగ్గర కనిపిస్తుంటే చాలామంది ఫొటోగ్రాఫర్లు వీళ్ల వెంట పడుతుంటారు కదా. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి చేయించుంకుంటారని ప్రియమణి చెప్పింది. 'జవాన్' చేసిన తర్వాత ముంబయికి వెళ్తే.. ఓ ఏజెన్సీ వ్యక్తి నాకు కూడా పపరాజీ కల్చర్‌కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే ఛార్ట్ పంపించాడని చెప్పింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న తెలుగు యువ నటి.. ఫొటో వైరల్) -
బిగ్, స్మాల్, ఓటీటీ స్క్రీన్ ఏదైనా ప్రియమణి కనిపిస్తే చాలు!
-
తెలుగులో పెద్ద హీరోలతో ఎందుకు చేయడం లేదు
-
నా భర్తకు నాకు మధ్య ఒప్పందం ఏంటంటే..?
-
అప్పుడు రాముడు.. ఇప్పుడు ప్రధానిగా.. అందరి కళ్లు అతనిపైనే!
బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'ఆర్టికల్ 370'. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు అంశమే తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో యామి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముని పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ఆయన కనిపించారు. చాలా మంది అభిమానులు ట్రైలర్లో ప్రధాని మోడీగా కనిపించిన అరుణ్ గోవిల్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో కనిపించిన కిరణ్ కర్మాకర్‌ని నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. #ArunGovil as Modi Ji in Upcoming movie #Article370 #YamiGautam पहचान गए तो एक लाइक तो बनता है pic.twitter.com/A4mfbLCF6r — 📍 (@ghatnachakr) February 8, 2024 Symbolism galore. Arun Govil who played Lord Ram playing PM Modi. Trailer looks quite amazing. Looks like a high octane action drama. If things work out can be a great hit. Yami is too good an actress. #Article370 https://t.co/n9pUvpyXYn — Ujjawal Pratap Singh (@pratap_pablo) February 8, 2024 -
భామ కలాపం 2 చేయడానికి కారణం ఏంటంటే..!
-
నాకు ఏడు భాషలు వచ్చు అందుకే అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి
-
'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'నెరు' కథేంటి? సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్.. ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్‌గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మల్ని విజిల్ వేసేలా చేస్తాయి. ఎవరెవరు ఎలా చేశారు? ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్‌గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్‌గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఫిల్మిటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి సురేష్, వివేకానందం కలిసి నిర్మించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించగా... ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రమ్స్ శివమణి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'కొటేషన్ గ్యాంగ్' అనే ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) చెన్నైలోని ఓ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. కేరళలో కొటేష న్ గ్యాంగ్ ఉన్నారనే వార్త పేపర్లో చదివానని, దాన్ని బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథతో ఈ సినిమా తీశానని డైరెక్టర్ వివేక్ చెప్పుకొచ్చారు. చెన్నై, ముంబై, కశ్మీర్లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బు కోసం ఎలాంటి పనైనా ఆలోచించకుండా చేసే కూలీ ముఠా ఇతివృత్తమే కొటేషన్ గ్యాంగ్ చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ప్రియమణి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) -
ప్రియమణి అందాల విందు..(ఫోటోలు)
-
స్లిమ్‌గా హీరోయిన్ ప్రియమణి.. షాకవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
ప్రియమణిపై మరో రూమర్స్.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియమణి పేరు చెప్పగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే సినిమా యమదొంగ అందులో జూ.ఎన్టీఆర్‌తో ఆమె అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా పలుమార్లు సినిమాల విషయంలో కూడా రూమర్లు వస్తూనే ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ అభిమానులను షాకింగ్‌కు గురిచేస్తూ ఆమె గురించి మరో రూమర్ వచ్చింది. (ఇదీ చదవండి: 29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే) ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దానిని మేకర్స్ కూడా ఖండించలేదు. దీంతో అదే నిజం అని దాదాపు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇందులో తారక్‌కు తల్లిగా ప్రియమణి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో జంటగా నటించిన ఈ జోడీ ఇప్పుడు 'దేవర'లో తల్లీకొడుకులుగా నటిస్తున్నారనే రూమర్స్ రావడంతో ఇదే నిజమేనా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి కాసింత వ్యతిరేకత కూడా వస్తుంది. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలదు. గతంలో కూడా అల్లు అర్జున్ 'పుష్ప-2'లో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. కానీ బన్నీతో సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'జవాన్' లో ప్రియమణి నటించడమే కాకుండా అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. -
ప్రియమణి ని నేను చాలా ఏడిపిస్తే : శ్రీకాంత్ అడ్డాల
-
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్‌తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
పుష్ప-2లో ప్రియమణి.. ఆ వార్తలపై స్పందించిన నటి!
టాలీవుడ్ స్టార్ నటి ప్రియమణి ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ ఏడాది నాగచైతన్య మూవీ కస్టడీలోనూ కీలక పాత్రలో మెరిశారు. అయితే కొద్ది రోజులుగా ప్రియమణి బన్నీ చిత్రంలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై ప్రియమణి స్పందించారు. (ఇది చదవండి: ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?) తనపై వస్తున్న వార్తలు చూసి ఆశ్చర్యానికి గురైనట్లు ప్రియమణి తెలిపారు. పుష్ప-2 నటించట్లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై వస్తున్న రూమర్స్ చూసి వెంటనే మేనేజరుకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. అయితే అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో మూవీలో నటిస్తానని పేర్కొన్నారు. కాగా.. పుష్ప చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఆయన భార్యగా ప్రియమణి నటిస్తున్నారని కొద్ది రోజులుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) -
దుమ్ము రేపుతున్న ‘జవాన్’ మేకింగ్ వీడియో
పటాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రతి నాయకుడుగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్ ఖాన్‌కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. -
Jawan: లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్‌తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న చిత్రం జవాన్. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్లో ఉండే 1000 డ్యాన్సర్స్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం ఈ పాట స్పెషల్. ఇందులో ప్రియమణి మరోసారి కింగ్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న కనెక్షన్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్‌లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్ 'జవాన్' చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్ సీన్లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) 'నేను స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది. 2021లో ZEE5లో వచ్చిన 'హిస్ స్టోరీ' వెబ్ సీరిస్‌లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) 2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్ సీన్స్‌లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది. ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది. -
అతన్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో పరుత్తివీరన చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా తెలుగులో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, జగపతిబాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య నటించిన ఫ్యామిలీమెన్ వెబ్‌సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వివాహానంతరం నటనకు చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ అయ్యారు. ప్రియమణి ముస్తఫారాజా అనే వ్యాపారవేత్తను 2017లో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగళూరులో రిజిస్టర్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం సినిమాలో, టీవీ కార్యక్రమాలతో బిజీగా వున్న ప్రియమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వివాహానంతరం పలు విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలువురు విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం మతం మారారా, ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లిచేసుకున్నారు? మీది లవ్ జీహాద్ అని, మీ పిల్లలు జీహాదీయులుగా పుడతారా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించే వారన్నారు. అలాంటి వారందరికీ తాను చెప్పేది ఒకటేనన్నారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కొంచెం బుద్ధితో ఆలోచించాలని హితవు పలికారు. ఇకపోతే తాను, తన భర్త చాలా సంతోషంగా ఉన్నామంటూ విడాకులపై స్పష్టత ఇచ్చారు. కరోనా సమయంలో తాను బరువు తగ్గినా విమర్శిస్తున్నారని, అంతకుముందు లావుగా ఉన్న విమర్శించే వారని అందుకే తాను అలాంటి వాటిని పట్టించుకోవడం మానేసానని పేర్కొన్నారు. -
నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్
సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్‌కు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు. ట్రోల్స్‌పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అన్నారు. ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్‌లో కనిపించనున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) -
పింక్ లో ప్రియమణి.. బ్లూ డ్రెస్‌లో వర్ష..తారల అందాలు
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి నీలి రంగు డ్రెస్‌లో వర్ష పరువాల విందు వొకేషన్ మూడ్ అంటూ సముద్రం ఒడ్డున బోటుపై ఫోటోకి పోజులు ఇచ్చాడు బుల్లితెర నటుడు రవికృష్ణ View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
ట్రెండీ లుక్‌లో ప్రణీత ఫోజులు.. సమ్మర్లో చిల్ అవుతోన్న ఇస్మార్ట్ శంకర్ భామ
ట్రెండీ లుక్‌లో అత్తారింటికి దారేది భామ ప్రణీత సన్ని లియోన్ ట్రెండీ అవుట్ ఫిట్ లుక్స్ ఫ్యాషన్ డ్రెస్‌లో ప్రియమణి ఫోజులు చిల్ అవుతూ సమ్మర్‌ను ఎంజాయ్ చేస్తోన్న నభా నటేశ్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
ప్రమాణం చేసి మరీ నిజాలు చెప్పిన ప్రియమణి
-
రెండేళ్ల తర్వాత విడుదల కాబోతున్న అజయ్ దేవగన్ మూవీ!
ఎట్టకేలకు అజయ్ దేవగన్, ప్రియమణి చిత్రం ‘మైదాన్’ విడుదలకు సిద్ధమైంది. రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పులుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 23న విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ఫుట్‌బాల్ కోజ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోజ్గా కనిపించనున్నాడు. నటి ప్రియమణి కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జోయ్ గుప్తా నిర్మించిన చిత్రం ఇది. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలను మైదాన్‌లో చూపించనున్నాడు దర్శకుడు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
ప్రియమణి 'కొటేషన్ గ్యాంగ్' టీజర్ చూశారా?
నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కొటేషన్ గ్యాంగ్. ఇందులో బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, సన్నీలియోన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మినెటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈయన దర్శకుడు బాల శిష్యుడు. డ్రమ్స్ శివమణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. 'కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ కథే ఈ సినిమా. చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. అయితే ఈ మూడింటికి ఒక లింకు ఉంటుంది. మొదట చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావించాం. అయితే షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్ ఆఫ్ కంటెంట్ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని భావించాం. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో కొటేషన్ గ్యాంగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర టీజర్ చూడగానే తాను ఆశ్చర్యపోయి దీనికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు డ్రమ్స్ శివమణి చెప్పారు. చదవండి: రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్ -
చివరి షెడ్యూల్ షురూ
‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్, సమర్పణ: పవన్ కుమార్. -
ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'విస్మయ'
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం "నన్న ప్రకార" అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను 'విస్మయ' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటోంది. విస్మయ చిత్రంలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్ కిషోర్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. దర్శకుడు వినయ్ బాలాజీకి ఇది మొదటి చిత్రమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం అన్ని హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్‌గా పని చేశారు. -
పదేళ్ల తర్వాత.. కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న ప్రియమణి
తమిళసినిమా: పరుత్తివీరన్ చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న నటి ప్రియమణి. తెలుగులోనూ కథానాయకిగా రాణించిన ఈమె వివాహనంతరం నటనకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇటీవల సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన ప్రియమణి తెలుగులో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో కన్నడం, తమిళ భాషల్లో డీఆర్ 56 అనే చిత్రంలో నటించారు. హరిహరా పిక్చర్స్ పతాకంపై ప్రవీణ్‌రెడ్డి నిర్మించి కథానాయకుడిగా నటించారు. రాజేష్ ఆనంద్ లీలా దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీ తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా దీన్ని తమిళం, తెలుగు భాషల్లో శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రియమణి మాట్లాడారు. తాను చారులత చిత్రం తరువాత తమిళంలో నటించిన చిత్రం డీఆర్ 56 అని తెలిపారు. 10 ఏళ్ల తరువాత కోలీవుడ్‌కు రీ ఎంట్రీ అవుతున్నట్లు చెప్పారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా ఆశ్చర్యపోయానన్నారు. పలు ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనలతో తయారు చేసిన కథ కావడమేనన్నారు. ఈ కథను చెప్పినట్లుగా తెరకెక్కిస్తే మంచి సక్సెస్ అవుతుందని దర్శకుడికి చెప్పానన్నారు. అదే విధంగా చిత్రం వచ్చిందని చెప్పారు. ఇది మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందన్నారు. సమాజానికి అవసరం అయిన సందేశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. తాను ఇందులో సీబీఐ అధికారిణిగా నటించినట్లు చెప్పారు. చిత్రంలో కుక్క కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. చిత్రంలో ప్రియమణి అద్భుతంగా నటించారని నిర్మాత బాలాజీ పేర్కొన్నారు. -
ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం డాక్టర్ 56. రాజేష్ ఆనందలీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వదిలారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి ఈ సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
Priyamani: ముఖ్యమంత్రిగా ప్రియమణి
టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం(తమిళం, తెలుగు)లో ప్రియమణి ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఆమె మొదట తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగి పాత్రలో గ్రామీణ యువతిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తర్వాత పలు తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహానంతరం హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు. తెలుగులో వచ్చిన నారప్ప చిత్రంలో వెంకటేష్‌కు జంటగా వైవిధ్య భరిత పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి నటిస్తోంది. దీనికి కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభు కథ, దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈయన ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, సంపత్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటి ప్రియమణి రాజకీయ నాయకురాలుగా అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకునేలా చిత్రకథ ఉంటుందని సమాచారం. ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే ఎలాంటి మంచి పనులు చేయగలరు అని చెప్పేలా ప్రియమణి పాత్ర ఉంటుందని తెలిసింది. చదవండి: (ప్రేమికులైనా, దంపతులైనా ఆ పని మాత్రం చేయకండి) -
సమంత బాటలో.. విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ హీరోయిన్?
ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. టాలీవుడ్లో చై-సామ్‌ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో హీరోయిన్ ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్‌తో విడిపోతున్నట్లు కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇప్పటికే ప్రియమణి టీం ఈ వార్తలను కొట్టిపారేసినా సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది. రీసెంట్గా 'రాకెట్రీ' సినిమా సక్సెస్ మీట్ పార్టీకి కూడా ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముస్తాఫాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకే అయేషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. ఒకనొక సమయంలో ముస్తాఫాపై అయేషా ఆరోపణలు చేసినా ప్రియమణి ఆ సమయంలో భర్తకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇన్‌స్టా ఐడీ భర్త పేరుతో కలిపి.. ప్రియమణి రాజ్ అనే ఉంది. దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకి ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి. View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) -
ప్రియమణి తమిళ చిత్రం 'డీఆర్ 56' రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళసినిమా: కోలీవుడ్‌లో పరుత్తివీరన్ త్రంతో నటిగా సత్తా చాటిన నటి ప్రియమణి. ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటిం తరువాత టాలీవుడ్‌లోనూ ప్రముఖ కథానాయకిగా రాణించారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం డీఆర్ 56. శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ ఏఎన్ బాలాజీ సమర్పణలో హరిహర పిక్చర్స్ సంస్థ తమిళం, కన్నడం భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, నిర్మాణ బాధ్యతలను ప్రవీణ్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. రాజేష్ ఆనంద్ లీలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి ప్రియమణి సీబీఐ అధికారిగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇతర ముఖ్య పాత్రలను ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, ఎతిరాజ్, వీణా పొన్నప్పా, మంజునాథ్, స్వాతి తదితరులు పోషిస్తున్నారు. రమేష్ శ్రీ తిలక్ ఛాయాగ్రహణం నోబిన్బాల్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుత ఇది సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సమాజంలో జరుగుతున్న పలు ఘటనల ఆధారంగా రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు. వివాహానంతరం ప్రియమణి నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదేనన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం, మలయాళ కథా చిత్రం ఇదని చెప్పారు. వివాహానంతరం ప్రియమణి నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే నన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
చైతూ22 కోసం కీలక పాత్రలో కనిపించనున్న ఆ హీరోయిన్
నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రియమణి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా మరోవైపు చై నటించిన ధూత వెబ్‌సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. Team #NC22 is privileged to welcome the National Award Winning Actress and a terrific performer #Priyamani On Board ❤️🔥💫@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @srkathiir @SS_Screens #VP11 pic.twitter.com/dGULxsU79G — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
పొలిటికల్ డ్రామా షురూ
వెండితెరపై పొలిటికల్ టర్న్ తీసుకున్నారు శర్వానంద్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్ : విరాటపర్వం నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు దర్శకత్వం : వేణు ఊడుగుల సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది : జూన్ 17, 2022 టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి..ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుకు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరంగల్‌కు చెందిన మహిళ సరళ(సినిమాలో వెన్నెల అని పేరు మార్చారు)ను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను కథగా తీసుకోని మంచి సంబాషణలతో అద్భుతంగా విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించాడు. సరళ హత్య విషయంలో తప్పు పోలీసులదా? లేదా నక్సలైట్లదా? అనే అంశాన్ని దర్శకుడు ఎంతో సున్నితంగా,ఎమోషనల్‌గా తెరపై చూపించాడు. ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ’ అంటూ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తన తండ్రిపై పోలీసులు దాడి చేసినప్పుడు.. వారితో వెన్నెల వాగ్వాదం చేయడం ఆకట్టుకుంటుంది. ఇక రవన్నగా రానా ఎంట్రీ అయితే అదిరిపోతుంది. రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించినా.. సాయి పల్లవి తనదైన నటనతో బోర్ కొట్టించకుండా చేసింది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం..ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్ పెగుతుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే కంటతడి పెట్టిస్తుంది. చేయని తప్పుకు వెన్నెల బలైపోయిందనే బాధతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు. దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వస్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది’, 'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. వెన్నెల పాత్రని రాసుకున్నప్పుడే సాయి పల్లవి ఊహించుకున్నానని సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు చెప్పాడు. ఆయన ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే.. యాక్షన్ సీన్స్‌లో విజిల్స్ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రీక్లైమాక్స్‌లో ప్రియమణి, నవీన్ చంద్రల కారణంగానే కథ మలుపు తిరుగుతుంది. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోతాయి.రాహుల్ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కర్నూలు : విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కామ్రేడ్ భారతక్క ఎంతో కీలకం: రానా దగ్గుబాటి
Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అలాగే కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. నేడు (జూన్ 3) పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పాడు రానా దగ్గుబాటి. ఇంతకుముందు విడుదల చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్‌ను పంచుకుంటూ ట్వీట్ చేశాడు రానా. ఈ ట్వీట్లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రెడ్ భారతక్క కూడా అంతే కీలకం.' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్ చేశారు. సురేశ్ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్ సింగర్ వరం ఆలపించిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. చదవండి: కేసీఆర్ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani pic.twitter.com/aUOOR3kJYD — Rana Daggubati (@RanaDaggubati) June 4, 2020 -
స్పెషల్ హీరోయిన్.. సో స్పెషల్
హీరోయిన్ అంటేనే సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ ఇక ‘స్పెషల్ హీరోయిన్’ అంటే ఇంకా స్పెషల్.. అంతే కదా..ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ రోల్ చేస్తే సో స్పెషల్‌గా ఉంటుంది కదా. రానున్న సినిమాల్లో కొందరు స్టార్ హీరోయిన్లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఈ హీరోయిన్లు ఆ సినిమాలకు ‘స్పెషల్ హీరోయిన్’ అనొచ్చు. ఇక ఈ స్పెషల్ రోల్స్ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కొవొస్తున్నా నయనతార స్పీడు ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ఫిల్మŠస్తో కెరీర్లో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి ‘గాడ్‌ఫాదర్’ చిత్రం కోసం నయనతార స్పెషల్ హీరోయిన్గా మారారు. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ‘గాడ్‌ఫాదర్’ తెలుగు రీమేక్. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు నయనతార. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘బోళాశంకర్’. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తారు కీర్తీ సురేశ్. అయితే కీర్తి ఇలా స్పెషల్ రోల్ చేయడం ఇది తొలిసారి కాదు. ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా పాత్రకు కీర్తీ సురేశ్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో కీలక పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. రామ్‌చరణ్‌కు జోడీగా స్పెషల్ హీరోయిన్గా పూజా హెగ్డే నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇంకోవైపు క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నా ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్ గా రష్మికా మందన్నా వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. అయినప్పటికీ ‘సీతారామం’ చిత్రంలో స్పెషల్ రోల్ అంగీకరించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీతారామం’. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించే దుల్కర్‌ను, సీత పాత్రధారి మృణాళినీ ఠాకూర్లను కలిపే కశ్మీర్ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా డబుల్ స్పెషల్‌గా కనిపించనున్నారు హీరోయిన్ సోనాల్ చౌహాన్. ప్రస్తుతం నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సోనాల్ ‘ఎఫ్ 3’లో ఓ కీ రోల్ చేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది మే 27న ‘ఎఫ్ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ‘ఆదిపురు‹Ù’ చిత్రంలోనూ ఓ స్పెషల్ రోల్ చేశారు సోనాల్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ‘బొమ్మరిల్లు’ హీరోయిన్ హాసిని.. అదేనండీ.. జెనీలియాను మర్చిపోవడం అంత ఈజీ కాదు. నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న తర్వాత తెలుగు సినిమాలకు జెనీలియా కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవలే రీ ఎంట్రీ షురూ చేశారు. భర్త రితేష్‌తో కలిసి మరాఠిలో ‘వేద్’, హిందీలో ‘మిస్టర్ మమ్మీ’ సినిమాలు చేస్తున్నారు జెనీలియా. అంతే కాదండోయ్.. దాదాపు పదేళ్ల తర్వాత ఓ ద్విభాషా (కన్నడం, తెలుగు) చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరిటీ (వ్యాపారవేత్త గాలి జనార్థన్ కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో జెనీలియా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లేడీ ఓరియంటెడ్... ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రియమణి. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘విరాటపర్వం’లో ప్రియమణి ఓ స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భరతక్క పాత్రలో ప్రియమణి కనిపిస్తారు. మరోవైపు హిందీలో ఆమె మూడు నాలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ‘అద్భుతం’ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శివానీ రాజశేఖర్ ‘శేఖర్’ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. ఆమె తండ్రి రాజశేఖర్ టైటిల్ రోల్లో, తల్లి జీవితా రాజశేఖర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ఇది. ఇక ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన శివాతి్మక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కంచిన ’రంగ మార్తండా’ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా స్పెషల్ హీరోయిన్స్ జాబితాలో ఇంకా వరలక్ష్మీ శరత్‌కుమార్, నివేదా పేతురాజ్, అనిఖా సురేంద్రన్‌లతో పాటు మరికొంత మంది హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. -
అలాంటివి అస్సలు భరించలేకపోయేదాన్ని: ప్రియమణి
నచ్చితే పొగడటం, నచ్చకపోతే తిట్టిపోయడం నెటిజన్లకు అలవాటే. సోషల్ మీడియా వచ్చాక విమర్శలు మరీ హద్దుదాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. వారి ఆకృతి నుంచి డ్రెస్సింగ్, మాట తీరు, ప్రవర్తన.. ఇలా అన్నిరకాలుగా విమర్శిస్తున్నారు. కొందరు ఈ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకపోయినా మరికొందరు మాత్రం ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్లిస్తుంటారు. తాజాగా హీరోయిన్ ప్రియమణి ఈ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. 'చాలామంది సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అనేసే హక్కు ఉందని ఫీలవుతారు. నిజానికి నా మీద వచ్చే మీమ్స్ చూసి నవ్వుకునేదాన్ని. కానీ కొన్ని హద్దు మీరుతూ ఇష్టారీతిన చేసే కామెంట్లు చూసి భరించలేకపోయేదాన్ని. అలాంటప్పుడు వెంటనే వాళ్లను బ్లాక్ చేసేదాన్ని. ఎందుకంటే సోషల్ మీడియానే జీవితం కాదు, అది కేవలం లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. అభిమానులు నన్ను ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా మరేం పర్వాలేదు' అని చెప్పుకొచ్చింది. శరీరాకృతి గురించి మాట్లాడుతూ.. 'పెద్దపెద్ద వర్కవుట్స్ చేయాలని నేనెప్పుడూ చెప్పను. మీరు ప్లస్ సైజ్‌లో(లావుగా) ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఖాళీగా ఫోన్లు చూస్తూ కూర్చునే బదులు మనకు ఏదవసరమో అది చేస్తే బాగుంటుంది. ఆ సమయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉపయోగిస్తే బెటర్. చిన్నచిన్న వర్కవుట్స్ లేదా ఇంటిపనులు చేసినా సరిపోతుంది' అని పేర్కొంది ప్రియమణి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి -
ప్రియమణి ‘భామాకలాపం’ ఫోటోలు
-
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను
‘‘సినిమాల్లో మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాంగ్స్, డ్యాన్స్, రొమాన్స్ మాత్రమే కాదు.. కథ పరంగా సినిమాల్లోని మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది చాలా మంచి విషయం’’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘‘భామాకలాపం’కు మంచి స్పందన లభిస్తోంది’’ అని ప్రియమణి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియమణి చెప్పిన విశేషాలు. ► ‘భామా కలాపం’ కథను దర్శకుడు అభిమన్యు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. నాకెలా చెప్పారో అలానే తీశారు. స్ట్రయిట్ ఫార్వార్డ్, బోల్డ్, ఫైర్ బ్రాండ్... ఇలాంటి క్యారెక్టర్స్ చేశాను కానీ అనుపమలాంటి పాత్రను ఇప్పటివరకూ చేయలేదు. రియల్ లైఫ్‌లో నేను అనుపమ అంత అమాయకంగా ఉండనని నా బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది మధ్యతరగతి గృహిణులను స్ఫూర్తిగా తీసుకుని నేనీ పాత్ర చేశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులు మెచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ► సినిమాలో అనుపమ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కానీ రియల్ లైఫ్‌లో నేనంతగా జోక్యం చేసుకోను. నాలుగేళ్లుగా నా పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా నాకు తెలియదు.. ఈ మధ్యే తెలిసింది. వ్యక్తిగతంగా కూడా తోటివారి జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోను. ► నా భర్త (ముస్తఫా) ‘భామాకలాపం’ చూసి, అభినందించారు. ‘అనుపమ పాత్ర బాగా చేశావ్. చీరలో అందంగా కనిపిస్తున్నావు. కామెడీ పాత్రలకు బాగా సూట్ అవుతావనిపిస్తోంది. ఇలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేయి’ అన్నారు. ఇంకా కొత్త కొత్త పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయాలని ఉంది. ► తెలుగులో ‘విరాటపర్వం’, హిందీలో అజయ్ దేవగన్ ‘మైదాన్’, కన్నడలో డాక్టరు 56, తమిళంలో ‘కొటేషన్ గ్యాంగ్’, ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్.. ఇలా నావి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘భామా కలాపం’లో అనుపమ వంట బాగా చేస్తుంది. నిజజీవితంలో వంటలో నా ప్రావీణ్యత జీరో. తింటాను.. కానీ వంట చేయలేను. నా భర్త వండుతారు. నేను తింటాను. ఆయన నాకు ఇది చేసిపెట్టు అని అడగలేదు. నాకూ చేయాలనిపించలేదు. సో.. నేను వెరీ వెరీ లక్కీ. నాకోసం ప్రేమతో ఆయన చేసిన హోమ్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
సౌత్ స్టార్ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. యమదొంగ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తొలి చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్ద గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో ఆడపదడపా చిత్రాలు చేసుకుంటునే వ్యాపారవేత్త ముస్తాఫా రాజును పెళ్లాడింది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో తన నటనకు జాతీయ అవార్డును కూడ అందుకుంది. అప్పటీ నుంచి వరస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ప్రియమణి ఫుల్ బిజీ అయిపోయింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఆమె తాజాగా ‘భామాకలాపం’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలో ఇది ఆహాలో విడుదల కానుంది. ఇలా సైలెంట్‌గా తన పని తను చూసుకుంటూ, సినిమాలు చేసుకుంటున్న ప్రియమణిని తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తుంటారు. ఆంటీ అంటూ విమరించడమే కాక ఒకనోక సమంలో తనని బాడీ షేమింగ్ కూడా చేశారు. వీటికి ఆమె గతంలో ఘాటూగానే సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం’ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్‌పై స్పందించింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి అయిన తర్వాత కెరీయర్ పరంగా ఇప్పుడు బిజీ అయ్యాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వెబ్ సిరీస్, సినిమాలు వరుసగా చేస్తున్నాను. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మోడల్ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. 2006 నుంచి 2012 వరకు చాలా బిజీగా ఉన్నాను. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ముఖ్యం. అందుకని పని తగ్గించుకుని ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. అప్పుడు టీవీ షోస్ చేస్తూ వెళ్లాను. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లనే టీవీ షోలు చేస్తుందని కొంతమంది కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ చూడను .. కామెంట్లు చదవను .. వాటి గురించి అసలు పట్టించుకోను. ఎందుకంటే ప్రతి కామెంట్‌కు రియాక్ట్ కాలేము కదా? అంటూ చెప్పకొచ్చింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, ఏదైన ఉంటే నా ఫ్యామిలీ, భర్తకు సమాధానం చెప్పుకుంటాని, వేరే వాళ్లకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ట్రోలర్స్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. -
భామా కలాపం ట్రైలర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ (ఫోటోలు)
-
ఆమె ఏ భాషకైనా సరిపోతారు: విజయ్ దేవరకొండ
‘‘ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘భామా కలాపం’ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రియమణి నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రదర్శకుడు భరత్ కమ్మ ఈ షోకి రన్నర్. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి∙‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ‘భామా కలాపం’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు.. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘భామా కలాపం’లో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ప్రియమణి. ‘‘మేము అనుకున్న దాని కంటే అభిమన్యు బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఏడాది క్రితం సరదాగా రాసుకున్న కథ ఇక్కడివరకు రావడం హ్యాపీ’’ అన్నారు అభిమన్యు తాడిమేటి. -
'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్‌గా కనిపించింది'
'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియమణి. సినిమాలు, వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈ నటి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. హీరోయిన్లు గ్లామర్ పాత్రలే చేయాలన్న దానికి కాలం చెల్లింది. పొట్టి బట్టలు వేసుకుని హీరో పక్కన నటిస్తే చాలనుకునే రోజులు పోయాయి. సినిమాలో కథానాయికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందాన్ని మాత్రమే కాకుండా టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలొస్తున్నాయి. సమంత ఓ బేబీ, నయనతార నేట్రికన్, మాయ సినిమాలను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. కాలంతో పాటు ప్రేక్షకుల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. సమంత చేసిన 'ఊ అంటావా ఉఊ అంటావా..' పాట దేశమంతా మార్మోగిపోతోంది. నాకే కాదు నా భర్తకు కూడా ఆ పాటలో సామ్ హాట్‌గా కనిపించింది. ఇప్పటికే చాలామంది ఈ పాటను డౌన్లోడ్ చేసుకుని రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది ప్రియమణి. -
'డేంజరస్ వైఫ్'గా ప్రియమణి.. 'భామాకలాపం' టీజర్ రిలీజ్
'ఎవరే అతగాడు' సినిమాతో వెండితెరకు పరిచయమై అనేక చిత్రాలతో అలరించింది ప్రియమణి. అనంతరం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియమణి వెబ్ సిరీస్, రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ప్రియమణి నటించిన కొత్త సినిమా 'భామాకలాపం'. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. ఇదివరకు విడుదల చేసిన ప్రియమణి పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలను పట్టుకుని గృహిణీగా ఆ పోస్టర్లో కనువిందు చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆదివారం విడుదల చేసింది. టీజర్లో పక్కింటి జరిగే విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపే గృహిణీగా ప్రియమణి కనిపించింది. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు.. కానీ పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు అంటూ ప్రియమణి చెప్పే డైలాగ్ చాలా మంది గృహిణీలకు నచ్చేవిధంగా ఉంది. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ ఎండింగ్లో 'చాలా డేంజరస్ హౌస్ వైఫ్రా' అని చెప్పడం ఆకట్టుకుంది. -
ప్రియమణి కొత్త రూపం.. 'భామా కలాపం'
Priyamani Telugu Movie Bhama Kalapam In AHA: 2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైంది ప్రియమణి. తర్వాత ఫ్యామిలీ హీరో జగపతి బాబు నటించిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ'తో ఇక చెరిగిపోని ముద్ర వేసుకుంది ప్రియమణి. అనంతరం అనేక సినిమాల్లో నటించిన ఈ కేరళ బ్యూటీ తెలుగులో కొంతకాలం కనుమరుగైపోయింది. ఇటీవల ఎంతో పాపులర్ అయిన హిందీ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'తో ఆకట్టకుంది. ఇదే కాకుండా ప్రముఖ తెలుగు రియాల్టీ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు మళ్లీ చేరువైంది. తాజాగా ప్రియమణి కొత్త రూపం ఎత్తింది. 'భామా కలాపం' అనే వెబ్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తానేంటో చూపించనుంది. అభిమన్యు తాడిమేటి కథ, దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి టైటిల్ రోల్లో అలరించనుంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలు పట్టుకుని ఆకట్టుకుంటోంది. గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూనే తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కుందో ఈ సినిమా ద్వారా చూపించనున్నట్లు సమాచారం. She is your friendly neighbour, but she has many stories and secrets to tell. 💁🏻#Priyamani is here with #BhamaKalapamOnAHA, a fascinating comedy thriller. Premieres soon Stay Tuned! #ADeliciousHomeCookedThriller@SVCCDigital @sudheer_ed @bharatkamma @editorviplav @justin_tunes pic.twitter.com/uvR9YdppT0 — ahavideoIN (@ahavideoIN) January 12, 2022 ఇదీ చదవండి: తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్‌గా తమన్ ! -
‘డీ గ్లామరస్’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ
హీరోయిన్ అంటే అమాయకంగా ఉండి.. హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్ హీరోయిన్’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్ కనబడింది. ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం. ‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్ పరేశాన్ అయ్యారు. కెరీర్ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్ చేసినవన్నీ గ్లామరస్ రోల్సే కాబట్టి ‘గ్లామరస్ హీరోయిన్’ అనే స్టాంప్ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని రకుల్ నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. రకుల్ కంటే సీనియర్ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ. గ్లామర్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్ రోల్స్ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి. 2022లోనూ... 2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్ తార, దాదాపు డీ–గ్లామరస్ రోల్స్ చేసే నందితా దాస్ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే సాయిపల్లవి డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ. సాయిపల్లవి మీద గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్. కీర్తికి గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. -
ప్రియమణిపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
Allu Arjun Shocking Comments On Actress Priyamani: ప్రియమణిపై ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ప్రముఖ డ్యాన్స్ షోకు అతిథిగా వచ్చిన బన్నీ ఆ షో జడ్జిలో ఒకరైన ప్రియమణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ షో హోస్ట్ ప్రదీప్ అల్లు అర్జున్‌తో ప్రియమణి, పూర్ణలను చూపిస్తూ ఈ బ్యూటిఫుల్ లేడి జడ్జిలకు ఓ స్సెషాలిటీ ఉంది సార్ అనగానే.. ఏంటది అంటాడు బన్నీ. చదవండి: రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్! వెంటనే ప్రదీప్ డాన్స్ బాగా చేసిన వాళ్ళకు ప్రియమణి గారు హగ్ ఇస్తారని, అదే పూర్ణ గారైతే డాన్స్ బాగా చేస్తే బుగ్గ కోరుకుతారనగానే అల్లు అర్జున్.. ఇంకా బాగా చేస్తే ఇంకేం చేస్తారో అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అలా పూర్ణపై బన్నీ టక్కున కౌంటర్ వేయగానే షోలో ఒక్కసారిగా నవ్వులు పండాయి. ఆ తర్వాత బన్నీతో ప్రియమణి మీతో వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది బన్నీ అనగానే మీరు అసలు అలా అనుకోవదని, ఇప్పటికీ ఇంకా చాన్స్ ఉందన్నాడు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన మీతో ఎప్పుడైనా వర్క్ చేస్తానని, పైగా ఇప్పుడు ఇంకా సన్నబడి హాట్‌గా తయారయ్యారంటూ బన్నీ అనడంతో ప్రియమణితో సహా అక్కడి వారంతా నోళ్లు వెళ్లబెడతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియమణిపై సరదాగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కాగా బన్నీ పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల సమంతతో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ ట్రీజ్ను విడుదల చేశారు మేకర్స్. ఇక పుష్ప దీ రైజ్ పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
కాజల్ ప్లెస్‌లో త్రిష.. సాయేషా స్థానంలో ప్రగ్యా.. చివరి క్షణంలో మారిన తారలు
‘యస్... ఈ సినిమా చేస్తా’... హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘అయ్యో... కుదరడం లేదండీ’... కొన్నాళ్లకు రెడ్ సిగ్నల్ పడింది. మళ్లీ కొత్త హీరోయిన్ వేటలో పడింది సినిమా యూనిట్. ఈ మధ్యకాలంలో ఇలా తారుమారు అయిన తారల జాబితా చాలానే ఉంది. ఒకరు తప్పుకుంటే.. ఇంకొకరికి ఆ చాన్స్ దక్కింది. ఆ ‘తారమారె’ విశేషాలు తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ‘ఆచార్య’ తొలి ప్రియురాలు త్రిషే. 2016లో వచ్చిన ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మరోసారి ‘ఆచార్య’ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకోవడం, ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ రీప్లేస్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ‘ఆచార్య’ చిత్రంలో త్రిష ప్లేస్‌ను కాజల్ రీప్లేస్ చేస్తే కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోల్‌ను త్రిష రీప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ‘భారతీయుడు 2’ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆ పాత్రకు త్రిషను సంప్రదించారట చిత్రదర్శకుడు శంకర్. ‘భారతీయుడు 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తాజా చిత్రాలు ‘పొన్నియిన్ సెల్వన్’, ‘రాంగీ’ (ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది)లో త్రిష నటించారు. సో.. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధం, కమల్‌తో సినిమా కాబట్టి ‘భారతీయుడు 2’కి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగూ ‘భారతీయుడు 2’ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి... ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర నుంచి ఐశ్వర్యా రాజేశ్ కొన్ని కారణాల వల్ల∙తప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మాటకొస్తే ‘భారతీయుడు 2’ సినిమాయే కాదు.. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’లో రానా భార్య పాత్ర ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు ఐశ్వర్యా రాజేశ్. దాంతో రానా భార్యగా సంయుక్తా మీనన్ సీన్లోకి వచ్చారు. ఇక 2015లో ‘అఖిల్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన సాయేషా సైగల్ చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకున్న చిత్రం బాలకృష్ణ ‘అఖండ’. అయితే ఆర్యను పెళ్లి చేసుకున్న సాయేషా తల్లయ్యారు. దాంతో ఆమె ప్లేస్‌ను ప్రగ్యా జైస్వాల్ రీప్లేస్ చేశారు. ఇంకా నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర అమలాపాల్‌కు దక్కిందన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు హిందీకి వెళితే.. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో కథానాయికగా నటించడానికి ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు కీర్తీ సురేశ్. ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇదిలా ఉంటే.. తొలి హిందీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఓ తమిళ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నారు నయనతార. అయితే షారుక్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ కారణంగా యువరాజ్ దయాలన్స్ దర్శకత్వంలో అంగీకరించిన తమిళ సినిమాకు డేట్స్ కేటాయించలేక నయనతార వదులుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటించే అవకాశం శ్రద్ధా శ్రీనాథ్ సొంతమైనట్లు టాక్. వీరే కాదు.. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రీప్లేస్ అయిన తారలు ఇంకొందరు ఉన్నారు. -
విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
Priyamani Break Silences Divorce Rumours: నటి ప్రియమణి.. భర్త ముస్తాఫా రాజ్నుంచి కొంత కాలంగా దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.చదవండి: రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తాఫాల మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రియమణి తన విడాకులకు సంబంధించిన రూమర్స్‌కు చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను పంచుకుంది. దీంతో విడాకుల రూమర్స్‌పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లయ్యింది. చదవండి:పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
లంగా ఓణిలో రష్మి, బ్లాక్ డ్రెస్‌లో కాజల్..వయ్యారాలు ఒలకబోస్తున్న తారలు
లంగా ఓణీలో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతోంది బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతుంది కాజల్ గర్వంగా ఉండండి కాని ఆహంకారం చూపొద్దంటుంది ప్రియమణి ప్రపంచంలో కొంచెం మంచిని పోయండి అంటుంది బోల్డ్ బ్యూటీ లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
సెట్స్‌పైకి అట్లీ-షారుక్ మూవీ, షూటింగ్లో పాల్గొన్న నయన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఈ మూవీ సెట్స్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా పూణేలో జరిగే షూటింగ్ కోసం శుక్రవారం నయతార, ప్రియమణిలు పమయనమైనట్లు సమాచారం. పుణే ఎయిర్పోర్ట్ నుంచి వారిద్దరూ బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమించాయి. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఈ మూవీలో షారుక్ డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. నయనతార, ప్రియమణిలు కథానాయికలు. ఇదిలా ఉండగా గతంలో ప్రియమణి, షారుక్‌తో చెన్నై ఎక్స్ప్రస్లో స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నయనతారకు మాత్రం బాలీవుడ్లో ఇది తొలి చిత్రం. ఈ మూవీతో డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. -
ముస్తఫా మొదటి భార్య ఆరోపణలు... ప్రియమణి స్పందన
నటి ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ఆయన తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, చాలా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని(సెక్యూర్ రిలేషన్షిప్) అని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియాతో ప్రియమణి మాట్లాడుతూ.. తన వివాహంపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పింది. ‘ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి అడిగితే.. మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటీకి ఇద్దరం ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్, బాయ్ అయినా చెపుకుంటాం. ఆయన ఫ్రీగా ఉంటే నాతో చాట్ చేస్తాడు. నేను కూడా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉంటే అతనికి ఫోన్ చేస్తా. ఇలా ప్రతి రోజు మేం మాట్లాడుకుంటునే ఉంటాం. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. కాగా.. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. భేదాభిప్రాయాలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు. -
ప్రియమణితో నా భర్త పెళ్లి చెల్లదు గాక చెల్లదు
Priyamani, Mustafa Raj Marriage: ముస్తఫా రాజ్.. నటి ప్రియమణితో పెళ్లయ్యేనాటికి ఇతడికో భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ముస్తఫా 2017లో ప్రముఖ నటి ప్రియమణిని పెళ్లాడాడు. రెండో పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లల కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. అయితే తన భర్త పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందు వాపోయింది. దీంతో ఈ ఆరోపణలను ముస్తఫా తోసిపుచ్చాడు. 'నా మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు?' అని ప్రశ్నించాడు. మరోవైపు ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని పేర్కొంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇది అక్రమం కిందకే వస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? వీలైతే మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకోవాలని చూస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప మరో దిక్కు లేదు. కానీ ఇప్పుడతడు తన సమయాన్ని నాకు వ్యతిరేకంగా వాడాలని చూస్తున్నాడు' అని ఆయేషా అభిప్రాయపడింది. మరి ఈ వ్యవహారంపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇదిలా వుంటే ప్రియమణి ఇటీవలే నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'నారప్ప' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించి ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తోన్న ప్రియమణి దక్షిణాదిన టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించింది. -
‘నారప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : నారప్ప జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాణ సంస్థ : సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ నిర్మాతలు : సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను కథ: వెట్రిమారన్ దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది : జూలై(20), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) టాలీవుడ్లో రీమేక్ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేశ్. ఒక విధంగా చెప్పాలంటే ఇతర భాషల్లో ఒక సినిమా హిట్ అయిందంటే.. ఆ మూవీని వెంకీమామ తెలుగులో రీమేక్ చేస్తారా? అనే చర్చలు మొదలవుతాయి. వెంకటేశ్ నేరుగా చేసిన సినిమాలకు సమానంగా రీమేక్ మూవీలు చేశాడని చెప్పొచ్చు. అపజయాలతో కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయన్ని నిలబెట్టింది కూడా రీమేక్‌లే కావడం విశేషం. అయితే.. ఇతర భాషల్లో హిట్టైన ప్రతి సినిమాను వెంకీ రీమేక్ చేయడు. తనకు సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్. ఆయన తాజాగా రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ఈ ఏడాది మే 14న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంగళవారం(జూలై 20) ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘నారప్ప’ ఏ మేరకు అందుకున్నాడు? ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘అసురన్’ రీమేక్ వెంకీకి ప్లస్సా.. మైనస్సా? రివ్యూలో చూద్దాం. కథ అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప(వెంకటేశ్) కుటుంబానికి, పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి పండుస్వామికి భూ తగాదా చోటుచేసుకుంటుంది. నారప్పకు చెందిన మూడు ఎకరాల భూమిని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు పండుస్వామి. అతని ప్రయత్నాలను తిప్పికొడతాడు నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తీక్ రత్నం). పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. అంతేకాదు ఒక సందర్భంలో పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు. అయినా కూడా నారప్ప ఎదురుతిరగడు. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) జీర్ణించుకోలేకపోతుంది. నిత్యం కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తల్లి బాధ చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప(రాఖీ) పండుస్వామిని చంపేస్తాడు. దీంతో సిన్నప్ప ప్రాణాలను కాపాడేందుకు నారప్ప కుటుంబం గ్రామాన్ని వదిలివెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి? తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సహనంగా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ‘నారప్ప’గా అదరగొట్టేశాడు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా అద్భుతంగా నటించాడు. వెంకీ డైలాగులు, స్టైల్, మేనరిజమ్, లుక్స్ అన్నీఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్ కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా కుమారుడు చనిపోయిన సీన్, గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్లలో జీవించేశాడు. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్ర ఆమెది. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం మెప్పించాడు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా తనదైన ముద్ర వేశాడు. లాయర్ పాత్రలో రావు రమేశ్, బసవయ్య పాత్రలో రాజీవ్ కనకాల ఎప్పటిమాదిరే జీవించేశారు. అమ్ము అభిరామి, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ తెలుగు రీమేకే ‘నారప్ప’. అయితే ఒక భాషలో హిట్ అయిన చిత్రం.. ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సర్వసాధారణం. మూలకథని తీసుకొని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేస్తారు. నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లలేదు. కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి అంతా కాపీ పేస్ట్ చేసినవే. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంతమేర సఫలం అయ్యాడు. ఒకప్పుడు నిమ్న-అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ లాంటి డైలాగ్‌తో సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. అసలు అసురన్‌తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం నారప్ప తప్పకుండా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించే సినిమానే. అయితే ఓటీటీల పుణ్యమాని అసురన్ మూవీని చాలా మందే చూశారు. సో నారప్పని అసురన్‌తో తప్పకుండా పోల్చి చూస్తారు. మొదటిసారి చూసే ప్రేక్షకులను మాత్రం ‘నారప్ప’ పక్కా థ్రిల్ చేస్తాడు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఓ నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప'..
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడదులైన నారప్ప ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప..నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.ఇందులో వెంకటేశ్ యువకుడిలా కనిపిస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ప్రియమణి నటించారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. -
అమ్మను కావడానికి ఇంకా టైమ్ ఉంది.. ప్రియమణి క్లారిటీ
పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ► ‘నారప్ప’ అంటే కెరీర్ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్ కూడా ఉంది... ‘పరుత్తువీరన్’లో విలేజ్ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్‌తో వర్క్ చేయడం అంటే నాకు ఒక బోనస్. తెలుగు సినిమా కాబట్టి డబుల్ బోనస్. ► ఉన్నదానికంటే బ్రైట్‌గా కనబడటానికి మేకప్ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్ అయిన స్కిన్‌తో కనబడాల్సి రావడం గురించి.. ‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్‌గానే కనబడాలి. ట్యాన్ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్‌లైట్ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్ టోన్‌ని డార్క్ చేయించాం. మామూలుగా బ్రైట్‌గా కనిపించడానికి మేకప్ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్‌గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ). ► తమిళ ‘అసురన్’కి రీమేక్‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది... రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ. ► రొటీన్‌కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి? అన్నీ కాటన్ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్ స్టాఫ్ ‘ఏంటి మేడమ్.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్వాళ్లు. ఈ క్యారెక్టర్‌కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్ స్టయిల్ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్ ఫ్రెష్‌గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్ చేసేసేవారు (నవ్వుతూ). ► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్ ప్లాన్స్’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు? నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్‌గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను. ► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా? ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే. ► సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు..? (నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుంది. ► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు? ఆయన యూఎస్‌లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్‌లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్‌ని పట్టగలిగారా? రెగ్యులర్ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్కి నాకు కొంచెం టైమ్ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్‌ని పికప్ చేయగలిగాను. ► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్? ఉంది. ఆ సీన్ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ఉంది. అది నాకు పెద్ద సవాల్‌లా అనిపించింది. ఫిజికల్‌గా ఛాలెంజ్ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. -
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. వెంకీ సార్ అలా అనడం హ్యాపీ వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను. 99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను. తనని చూస్తే నాకు గర్వం విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే. అతను నా లక్కీ చార్మ్ నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు. మైండ్‌సెట్ మారింది! òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. -
‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3.. ఈ సారి చైనా టార్గెట్
మనోజ్ బాజ్‌పాయ్, సమంత అక్కినేని, ప్రియమణి కీలక పాత్రలో దర్శకులు రాజ్నిడిమోరు- కృష్ణ డీకేలు తాజాగా తెరకెక్కించిన వెబ్ సీరిస్ ‘ప్యామిలీ మ్యాన్ 2. ఇటీవల ఆమెజాన్ ప్రైమ్‌లో ల విడుదలైన ఈ సిరీస్ కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక వెబ్ సిరీస్‌కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా?.. ఒక్కరోజులోనే కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టె సత్తా ఉంటుందా? సినిమాలను మించిన పారితోషికం అందుకునే సీన్ ఉందా అని ప్రశ్నించే వారందరికి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ఒక సమాధానంగా నిలిచింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ సిరీస్‌ను.. అంతే రేంజ్లో వివాదాలు కూడా చూట్టుముట్టాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సీరిస్ కాంట్రవర్సీల కారణంగా మూడు నెలలు ఆలస్యంగా విడుదలైంది. అయినా కానీ ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన వెబ్ సిరీస్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే తొలి సీజన్ 2018లో విడుదల కాగా రెండవ సీజన్‌ను రూపొందించడానికి దర్శకుడు మూడేళ్ల సమయం తీసుకున్నాడు. కానీ ఈ సారి అంత ఆలస్యం చేయకుండా వెంటనే సీజన్ 3 కోసం కథను సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ ఇండియా- పాకిస్తాన్ టెర్రరిజం చూట్టూ కథ సాగగా, సెకండ్ సీజన్ ఇండియా-శ్రీలంక టెర్రరిజం చూట్టూ కథ అల్లుకుంది. అయితే 3వ సీజన్ కోసం దర్శకుడు చైనాను టార్గెట్ చేయనున్నాడని వినికిడి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ 3 ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండో సీజన్ చివర్లో ఒక చైనీస్ వ్యక్తి కంప్యూటర్లో ఏదో చైనా భాషలో టైప్ చేస్తూ కనిపిస్తాడు. దీన్ని బట్టి మూడో భాగం అంతా ఇండియా-చైనా నేపథ్యంలో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్లో కూడా మనోజ్ బాజ్‌పాయ్ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా?
ఈ మధ్య వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరిగింది. పెద్దగా కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో సినీప్రియులు సిరీస్‌ల మీద పడ్డారు. కొత్తగా ఏ వెబ్ సిరీస్ వచ్చినా చూసేవరకు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంత, మనోజ్ బాజ్పాయ్ల నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇదిలా వుంటే ఇందులోని నటీనటులకు ఎంతమేరకు పారితోషికం ముట్టిందనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత కంటే మనోజ్ బాజ్‌పాయ్‌కు ఎక్కువ ముట్టిందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రలో కనిపించిన మనోజ్ మొత్తం ఎపిసోడ్లకు కలిపి రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. రాజీ పాత్రతో రిలీజ్‌కు ముందే సిరీస్మీద బజ్ క్రియేట్ చేసిన సామ్ రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌కు భార్యగా నటించిన ప్రియమణి రూ.80 లక్షల మేర పారితోషికం పుచ్చుకున్నట్లు టాక్. ఇక షరీఫ్ హష్మీ రూ.65 లక్షలు, దర్శన్ కుమార్ ఒక కోటి, ఆశ్లేష ఠాకూర్ అర కోటి, శరద్ కేల్కర్ రూ.1.6 కోటి, సన్నీ హిందూజ రూ.60 లక్షల మేర అందుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. చదవండి: నేను మనసుపడ్డ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?: సమంత వెబ్ సిరీస్: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది : ప్రియమణి
యమదొంగ సినిమాతో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఆమె కన్నడ, మలయాళ చిత్రాలను దృష్టిపెట్టి అక్కడ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రియమణి మళ్లీ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేసారి రెండు బడా చిత్రాల్లో అవకాశాలు ఆమెను వరించాయి. రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన ప్రియమణి, వెంకటేశ్ సరసన నారప్ప సినిమాలోనూ నటించింది. ఇందులో వెంకటేశ్ భార్యగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాలు తన కెరీర్లో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులుగా నిలిచిపోతాయని పేర్కొంది. ఇక వెంకటేశ్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడు సార్లు వచ్చిందని, పలు కారణాల చివరి నిమిషంలో చేజారిపోయాయని తెలిపింది. ఇన్నాళ్లకు వెంకటేశ్‌తో నటించాలనే తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తుంది. నారప్ప, విరాటపర్వం రెండు సినిమాల్లో తాను పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వస్తుందని చెప్పింది. చీరకట్టులో ప్రియమణి అందాలు చదవండి : ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే! నాకు గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియదు : హీరోయిన్ -
సోషల్ హల్చల్ : చాలా మిస్ అయ్యానన్న బన్నీ.. బాధ పడొద్దన్న నమిత
అల్లు అర్జున్‌కి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పిల్లలను చాలా మిస్ అయ్యానంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. మీకు కరోనా లక్షణాలున్నాయా.. బాధపడొద్దు.. ఉచితంగా సలహాలు తీసుకోవచ్చునంటూ ఓ వీడియోని షేర్ చేసింది హీరోయిన్ నమిత ప్రీ ఆక్సిజన్ అంటూ పర్వతాలపై దిగిన ఓ ఫోటోని షేర్ చేశాడు బిగ్‌బాస్ ఫేమ్, హీరో అభిజిత్ లాక్డౌన్ ఫేస్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది లావణ్య త్రిపాఠి ప్రకృతితో ఒక్క మూలన జీవించడం నా కొరిక అంటూ పచ్చని పార్క్‌లో దిగిన ఓ ఫోటోని పంచుకుంది హీరోయిన్ మీరా చోప్రా Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much 🖤 pic.twitter.com/ubrBGI2mER — Allu Arjun (@alluarjun) May 12, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
సోషల్ హల్చల్: రకుల్ సూక్తులు, ప్రియమణి పరువాలు
♦ స్నేహితుడి పెళ్లిలో మడోన్నా సెబాస్టియన్ సందడి ♦ లాంగ్డ్రెస్లో సింగర్ గీతామాధురి క్యూట్ లుక్ ♦ ఆల్వేస్ బీ హ్యాపీ అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ సిగ్గుతో ముడుచుకుపోయిన మోనాల్ గజ్జర్ ♦ కొట్టేస్తాను అన్నట్లుగా చూస్తున్న మంచు లక్ష్మీ ♦ కొత్త లుక్‌లో ప్రియమణి ♦ సెల్ఫీలు షేర్ చేసిన లక్ష్మీరాయ్ ♦ ఇలా బ్యాలెన్స్ చేయండంటున్న ఊర్వశి రౌతేలా ♦ 3 లుక్స్.. ఏది బాగుందని అడుగుతోన్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి
ప్రియమణి.. అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుథి వీరన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున, ఎన్టీఆర్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సరసన నటించింది.హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది. మూవీస్‌తో పలు వెబ్ సీరీస్లలో కూడా నటిస్తుంది.వీటితో పాటు పాటు బుల్లితెరపై ఓ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా కూడా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దు గుమ్మ..ఇటీవల తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్‌లో ఉండే ఫోటోలని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతంది. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించగా.. ఓ నెటిజన్ మాత్రం బిత్తిరి ప్రశ్న అడిగి అభాసుపాలయ్యాడు. మీ న్యూడ్ ఫోటో షేర్ చేయండంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియమణి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. నా కంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లి గానీ అలాంటి ఫోటో అడిగి షేర్ చేయండి.. అప్పుడు నేను కూడా పెడతా’అని జవాబిచ్చింది. ప్రియమణి సమాధానం చూసి ఆ నెటిజన్ షేమ్‌గా ఫీలై.. క్షమాపణలు కోరాడు. కాగా, ప్రియమణి ఇచ్చిన సమాధానంపై పలువులు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సరైనా సమాధానం ఇచ్చావంటూ మెచ్చుకుంటున్నారు. చదవండి: వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్ రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
నారప్ప పూర్తప్ప!
నారప్ప ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మే 14వరకూ ఆగాల్సిందే. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్.థాను, సురేశ్ బాబు నిర్మించారు. ప్రియమణి కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మే 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు వెంకటేశ్. మణిశర్మ సంగీత దర్శకుడు. -
రిలీజ్ డేట్ ఫిక్స్: నారప్ప వచ్చేది అప్పుడే!
సినీ ప్రపంచానికి మత ప్రాంతీయ బేధాలుండవు. కథ, కాన్సెప్ట్ బాగుంటే చాలు రీమేక్‌లకు రెడీ అయిపోతారు దర్శక హీరోలు. అలా తమిళంలో హిట్ అయిన బోలెడు సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమను పలకరించి హిట్టు కొట్టాయి. ఈ క్రమంలో 2019లో తమిళనాట రిలీజై ఘన విజయం సాధించిన 'అసురన్' చిత్రాన్ని నారప్పగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ నారప్పగా నటిస్తుండగా, ఆయన భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. వీరి కొడుకుగా 'కేరాఫ్ కంచరపాలెం' నటుడు కార్తీక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రావు రమేశ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కొత్త బంగారు లోకం'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌లో డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవికి థియేటర్లలో సందడి చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ మాట నిలబెట్టుకుంది. మే 14న వేట మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైందని వెల్లడించింది. మరోవైపు వెంకటేశ్ అనిల్ రావిపూడి ఎఫ్3లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 27 థియేటర్లలో నవ్వులు పూయించేందుకు రెడీగా ఉంది. దీని తరువాత వెంకటేశ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో కలిసి మరో ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పారు. గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో లెక్చరర్ పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. (చదవండి: ఎఫ్3 రిలీజ్ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే) -
2020 అదృష్టంలా అనిపించింది
‘‘2020 సంవత్సరం అందరికీ చాలా కష్టంగా గడిచింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్.. ఇలాంటి విషయాలు పక్కన పెడితే ఫ్యామిలీ టైమ్‌ని చాలా మిస్ అయిన నాలాంటివాళ్లకు ఓ అదృష్టంలా అనిపించింది’’ అన్నారు ప్రియమణి. గడచిన సంవత్సరం గురించి, లాక్డౌన్ ఎలా సాగింది? అనే విషయాల గురించి ప్రియమణి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ టైమ్ కాస్త దొరికితే బావుండు అని ఆలోచిస్తున్న వాళ్లందరికీ లాక్ డౌన్ రూపంలో దేవుడు వరం ఇచ్చినట్టు అనిపించింది. నాకు ఫ్యామిలీతో చాలా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. అలానే చాలా సాధారణమైన జీవితం గడిపే వీలు దొరికింది. కూరగాయలు, వంట సామాన్లు కొనుక్కోవడం, ఇంట్లోనే సినిమాలు చూడటం, ఇంట్లో కావాల్సినంత సమయం గడిపిన తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రావడం హ్యాపీగా అనిపించింది. మళ్లీ అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అయితే అంతా నార్మల్ అవడానికి మరో ఏడాది పట్టేలా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌తో ‘నారప్ప’, హిందీలో అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’ సినిమాలు చేస్తున్నారు ప్రియమణి. -
‘నారప్ప’ కొత్త పోస్టర్ : సరికొత్త లుక్‌లో వెంకీ, ప్రియమణి
వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి సరికొత్త లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. వెంకటేశ్, ప్రియమణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు.ఈ చిత్రంతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ సినిమా వేసవి కానుకగా అభిమానులను అలరించనుందని తెలిపారు. Team #Narappa wishes you a Happy Sankranthi ! See you in theatres this summer !! @VenkyMama #Priyamani @theVcreations #SrikanthAddala #Narappa pic.twitter.com/nB970Nsy9J — Suresh Productions (@SureshProdns) January 14, 2021 -
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ని లాక్ డౌన్ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. -
నాన్‌స్టాప్ నారప్ప
వికారాబాద్ అడవుల్లోకి ఎంటరయ్యారు నారప్ప. నెక్ట్స్ పదిహేను రోజులు అక్కడే మకాం అని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభం అయింది. పదిహేను రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయా లనుకుంటున్నారు. -
ఆఖరి పర్వం
‘విరాటపర్వం’ చివరి దశకు వచ్చేసింది. కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్యమకారుల పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్‌ను వికారాబాద్ అడవుల్లో›పూర్తి చేస్తున్నారు. రానా, సాయిపల్లవి మరియు ముఖ్య తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చిత్రబృందం మొత్తం వికారాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది. -
తరుణ్, ప్రియమణి ప్రేమాయణం: పెళ్లి చేసుకోవాలని
చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమే. కలిసి ఫోటోలకు పోజులిచ్చినా.. అనుకోకుండా ఎక్కడైన తారసపడినా వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా ఎంతో మంది నటీనటులపై అలాంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశాయి, చేస్తున్నాయి. అయితే ఒకప్పటి టాలీవుడ్ జోడీపై ఇటీవల ఓ విషయం బయటకొచ్చింది. నవ వసంతం సినిమాలో జంటగా నటించిన హీరో తరుణ్, ప్రియమణి మధ్య ప్రేమాయణం నడిచిందనేదే ఆ వార్త సందేశం. 2005లో ఈ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తమ కుమారుడిని వివాహం చేసుకోవాలని తరుణ్ తల్లి అడిగినట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. ‘నవ వసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్‌కు నాకు పరిచయం ఏర్పడింది. తను మంచి కోస్టార్. చాలా సహాయంగా ఉంటాడు. అతని ప్రవర్తన చాలా తనకు దగ్గర చేసింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయంతోనే చాలా సార్లు లంచ్, డిన్నర్‌కు వెళ్లాం కూడా. సెలబ్రెటీస్‌పై సాధారణంగా వచ్చినట్లే తమపై కూడా ఎన్నో పుకార్లు వచ్చాయి. మేమిద్దం ప్రేమలో ఉన్నట్లు కథలుకథలుగా చర్చించుకునేవారు. ఈ విషయం కాస్తా తరుణ్ ఇంట్లో తెలిసింది. ఓ రోజు షూటింగ్లో తరుణ్ వాళ్ల అమ్మ రోజా రమణి వచ్చి కాసేపు నాతో మాట్లాడారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలిసిందని, నీకు ఇష్టమైతే తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని రోజా రమణి కోరారు. ఆమె మాటలు నన్ను ఒక్కసారిగా షాక్కింగ్‌కు గురిచేశాయి’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. అయితే తరుణ్‌కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేని, తమని పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆమెతో చెప్పినట్లు వివరించింది. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వార్తలు రావడం సహజమేనని పేర్కొంది. కాగా చాలా కాలంగా వెండితెరకు దూరమైన తరుణ్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెరపై ఇప్పటికీ మెరుస్తున్న ప్రియమణి 2017లో ముస్తాఫ్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. వెంకటేశ్ హీరోగా నటిస్తున్న నారప్ప మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. -
సైనైడ్‌లో...
జాతీయ పురస్కారగ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సైనైడ్’. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు సిద్ధిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు నటించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు వేరే అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే అవార్డులు అందుకున్న రంగాయన రఘు కూడా నటించనున్నారు. అదే విధంగా మణికంఠన్ ఆచారి, శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ కూడా మా చిత్రంలో నటించనున్నారు’’ అన్నారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం: జార్జ్ జోసెఫ్, సంగీతం: డాక్టర్ గోపాల శంకర్. -
ఫ్లాష్‌బ్యాక్ నారప్ప
వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. చిత్రనిర్మాతలు డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ– ‘నారప్ప’ సినిమా లాక్‌డౌన్‌కు ముందే 60 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ మధ్యే షూటింగ్‌ను హైదరాబాద్‌లో పునః ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలతో పాటు కై్లమాక్స్ను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం సినిమా పూర్తవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్. -
విరాటపర్వం మళ్లీ ఆరంభం
రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. -
ప్రియమణి.. సంచలనాత్మక సైనైడ్
జాతీయ అవార్డుగ్రహీత ప్రియమణి నటించనున్న తాజా చిత్రం ‘సైనైడ్’. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మిడిల్ ఈస్ట్ సినిమా పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించనుండగా, హిందీలో యశ్ పాల్ శర్మ నటించనున్నారు. రాజేష్ టచ్‌రివర్ మాట్లాడుతూ.. ‘‘సైనైడ్ ఇచ్చి 20మంది యువతులను హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రియమణి ఇందులో పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారు’’ అన్నారు. ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సదాత్ సైనూద్దీన్, సంగీతం: జార్జ్ జోసెఫ్. -
నారప్ప మళ్లీ మొదలప్ప
తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. నారప్పగా టైటిల్ రోల్లో వెంకటేశ్ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే చిత్రమిది. ఇందులో వెంకటేశ్ రైతుగా కనిపిస్తారు. లాక్డౌన్ ముందు చాలా శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. లాక్డౌన్ వల్ల సుమారు ఆర్నెల్లు చిత్రీకరణకు గ్యాప్ వచ్చింది. అక్టోబర్‌లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ‘నారప్ప’ చిత్రబృందం ఉందని టాక్. అక్టోబర్‌లో ప్రారంభించి సినిమా మొత్తాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలన్నది ఆలోచనట. ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. -
కిలాడీ లేడీ ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధూన్’. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. అయితే మొదటి నుంచి టబు పోషించిన పాత్రకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు అంత స్పెషాలిటీ ఏంటీ అంటే? నెగటివ్ షేడ్స్ ఉండటమే. కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర కావడమే అందుకు ప్రధాన కారణం. మొదట టబూయే ఆ పాత్ర మళ్లీ చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార ఆ పాత్ర చేయబోతున్నారని ఓ వార్త. తాజాగా ఈ పాత్రకు ప్రియమణి లేదా శ్రియను తీసుకోవాలనుకుంటున్నారట చిత్రబృందం. మరి ఈ కిలాడీ లేడీ పాత్ర చేసే ఛాన్స్ ఎవరికొస్తుందో వేచి చూడాలి. -
క్రేజీ రైడ్‌కి రెడీయా?
ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు సమంత. తాజాగా తనలోని విలనీ యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో రాజ్, డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. ఈ షోకి విపరీతమైన స్పందన లభించింది. సెకండ్ సీజన్లో సమంత కూడా భాగమయ్యారు. ఇందులో విలన్ పాత్రలో నటించారు సమంత. ఆమెది టెర్రరిస్ట్ పాత్ర అని తెలిసింది. షూటింగ్ పూర్తయింది. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను గురువారం మొదలుపెట్టారు సమంత. ‘‘ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2’కు డబ్బింగ్ ప్రారంభించాను. సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులందరూ రెడీగా ఉండండి. మిమ్మల్నందర్నీ ఓ క్రేజీ రైడ్‌కు తీసుకెళ్లనుంది మా ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్. ఇలాంటి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజ్, డీకే’’ అన్నారు సమంత. త్వరలోనే అమేజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
యస్.. పోలీస్
రౌడీలను రప్ఫాడించడానికి త్రిష రెడీ అవుతున్నారు. ఎదుటి వ్యక్తి ఎలాంటివాడైనా అన్యాయం చేస్తే లాకప్‌లో లాక్ చేసేస్తారు. ఎందుకంటే ఆమె పోలీసాఫీసర్ కాబట్టి. దాదాపు 17 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన త్రిష ఇప్పటివరకూ పోలీస్ పాత్ర చేయలేదు. ఇప్పుడు ‘కుట్రపయిర్చి’ అనే తమిళ చిత్రంలో ఆ పాత్ర చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ‘పోలీస్‌గా చేయడానికి యస్’ అని కథ వినగానే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అసలు సిసలైన పోలీసాఫీసర్‌గా ఒదిగిపోవడానికి త్రిష ప్రస్తుతం రియల్ లైఫ్ పోలీస్‌లను గమనిస్తున్నారట. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
కేరాఫ్ నారప్ప
‘నారప్ప’ తనయుడిగా మారారు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాలో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ‘నారప్ప’ పెద్ద కొడుకు ముని కన్నా పాత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం నటిస్తున్నట్లు చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పైగా ఆదివారం కార్తీక్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రంలోని మున్నాకన్నా లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా తమిళ హిట్ మూవీ ‘అసురన్’(2019) చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. -
సరోజ్ ఖాన్ మృతి తీరని లోటు: గుణశేఖర్
‘‘ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి భారతీయ సినిమాకే తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘ఓ మారియా.. ఓ మారియా..., అబ్బబ్బా ముద్దు..’ పాటలకు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుణశేఖర్ గుర్తు చేసుకుంటూ– ‘‘1998లో వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమా కోసం సరోజ్ ఖాన్‌గారితో కలిసి పనిచేశా. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటను సరోజ్ ఖాన్‌గారితో చేద్దామనుకుంటున్నానని నిర్మాత అశ్వినీదత్ గారికి చెప్పగానే, నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారు. అప్పటికి ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చిరంజీవిగారి సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ఒప్పుకున్నారామె. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫర్స్ తాలూకు ఎఫర్ట్‌ని తన డ్యాన్స్ మూమెంట్స్‌తో వందరెట్లు ఎక్కువ చేస్తారు. నేను, మణిశర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట వినగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని సరోజ్ ఖాన్‌గారు అడిగారు. మణిశర్మ అనే అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. ఆ రిథమ్స్ నచ్చి, తను భవిష్యత్తులో పెద్ద సంగీత దర్శకుడు అవుతాడన్నారు. పాటల కోసం తోట తరణిగారు వేసిన సెట్‌ని బాగా లైక్ చేశారు. ‘చూడాలని ఉంది’ నా నాలుగో సినిమా. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌గారితో సినిమా అంటే అదొక అచీవ్మెంట్. క్యాస్టింగ్, కెమెరా, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్రద్ధని ఆమె మెచ్చుకొని నన్ను చాలా ప్రోత్సహించారు. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటని మా టీమ్ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ పాటను ప్రేక్షకులు మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాటకి సరోజ్ ఖాన్‌గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా అంతే బాగా క్యాప్చర్ చేస్తారు. దాంతో ‘అబ్బబ్బా ముద్దు..’ పాటను కూడా ఆమెతోనే కొరియోగ్రఫీ చేయించాం. ఆ పాటలో సౌందర్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌కి, చిరంజీవిగారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మరోసారి అంతే గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటికే లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిన సరోజ్ ఖాన్‌గారు కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది’’ అన్నారు. ప్రముఖ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తపరిచారు ► ఒక శకం ముగిసింది. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్తతరం వారికి ఆమె ప్రతిభ ఓ ప్రేరణలా ఉంటుంది. – మహేశ్‌బాబు ► ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ ఇక లేరు. ఆమె నా తొలి కొరియోగ్రాఫర్ (చిరంజీవి ‘డాడీ’లో అల్లు అర్జున్ ఓ డ్యాన్స్ సీక్వెన్స్‌లో కనిపిస్తారు). ఎంతో విలువైన ఓ వజ్రంలాంటి వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది. – అల్లు అర్జున్ ► ఎంతో సునాయాసంగా డ్యాన్స్ చేయగల గొప్ప ప్రతిభావంతురాలు సరోజ్ ఖాన్‌గారు. ‘మేరా పతీ సిర్ఫ్ మేరా హై’ చిత్రంలో ఆమెతో కలిసి పని చేశాను. తన ఊహల్లోని విజువల్స్‌లోకి యాక్టర్స్‌ను తీసుకెళ్లగల ఆమె శైలి గొప్పది. – రాధికా శరత్‌కుమార్ ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను చేసిన, నాకు నచ్చిన, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ఎన్నో పాటల వెనక దాగి ఉన్న ఓ లెజెండ్ సరోజ్ మేడమ్. ఇండస్ట్రీకి ఆమె చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది. – వేదిక ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త విని నా హృదయం బద్దలైంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. – తమన్నా ► సరోజ్‌ఖాన్ జీతో కలిసి పనిచేయడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాను. – ప్రియమణి ► సినిమాలోని పాత్ర కోసం ఒక డ్యాన్సర్‌గా డ్యాన్స్‌లో మునిగి ఎలా మైమరచిపోవాలో నాకు గంటలకొద్దీ పాఠాలు చెప్పారామె. సినిమా పరిశ్రమలో నా తొలి గురువు సరోజ్ ఖాన్. నన్నెంతో ప్రేమగా చూసుకున్న ఆమె నాకెంతో ప్రత్యేకం. ఆమె ఆత్మకు అల్లా దీవెనలు ఉండాలి. – షారుక్ ఖాన్ ► సరోజ్ ఖాన్ మనతో లేరనే చేదు వార్తతో శుక్రవారం నిద్రలేచాను. ఆమె శిక్షణలో చాలా ఈజీగా ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చని నిరూపించారు. సరోజ్ ఖాన్ మరణం బాలీవుడ్ చిత్రపరిశ్రమకు తీరని లోటు. – అక్షయ్‌కుమార్ ► ఒక చరిత్ర అంతరించిపోయింది. సరోజ్ ఖాన్ మరణం వ్యక్తిగతంగా నాకు చాలా పెద్ద నష్టం. మన ముక్తా ఆర్ట్స్ (సుభాష్ నిర్మాణ సంస్థ) ఫ్యామిలీ అంతా నువ్వే ఉన్నావు. మాధురీ దీక్షిత్, మీనాక్షీ శేషాద్రి, మనీషా కొయిరాల, ఐశ్వర్యా రాయ్‌లు స్టార్స్‌గా ఎదగటానికి నాతో పాటు నువ్వు ఎప్పుడూ ఉన్నావు. డ్యాన్స్ ఉన్నంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమలో బతికే ఉంటావు. – సుభాష్ ఘాయ్ ► సరోజ్‌జీ.. నాతో పాటు ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పరిశ్రమలోకి వచ్చాం. మీ డ్యాన్స్ నైపుణ్యానికి అభినందనలు. – ఫరాఖాన్ ► నిద్ర లేవటంతోనే ఇంతటి హృదయవిదారకమైన బాధను మోయాల్సి వస్తుందనుకోలేదు. మీ మరణవార్త విని తట్టుకోలేకపోయాను. మీకు మీరే ఒక శిక్షణాలయం లాంటివారు. మన డ్యాన్సర్స్ అందరికీ మీ మరణం చాలా పెద్ద లాస్. మీ శిష్యుల్లో ఒకడిగా, మీతోపాటు డ్యాన్సర్‌గా, మీతో కొరియోగ్రాఫర్‌గా, మీరు కొరియోగ్రాఫర్‌గా నేను డైరెక్టర్‌గా మిమ్మల్ని డైరెక్ట్ చేయటం.. ఇవన్నీ నా జీవితంలో జరిగిన అద్భుతాలు. డ్యాన్స్ చేసేటప్పుడు మీ కళ్లల్లో కనబడిన మెరుపు వృత్తిపట్ల మీకున్న ప్రేమను తెలియజేసేది. మీ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అందుకే మిమ్మల్ని, మీ జ్ఞాపకాలను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. – రెమో డిసౌజా ► డ్యాన్స్‌లో నా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించటానికి నాకెంతో సాయం చేసిన సరోజ్ ఖాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఓ అగ్రశ్రేణి ప్రతిభాశాలిని భారతీయ సినిమా పరిశ్రమ కోల్పోయింది. – మాధురీ దీక్షిత్ ► మీతో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. అది నా అదృష్టం. మీరు లేని లోటుని భర్తీ చేసే బలాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – జెనీలియా ► మీ డ్యాన్స్ డైరెక్షన్లో డ్యాన్స్ చేయటం ప్రతి ఒక్క నటి కల. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాను సరోజ్‌జీ. – కాజల్ అగర్వాల్ ► ‘చూడమ్మా.. నీకేం కావాలో అది సాధించాలంటే దాని మీద దృష్టి సారించి నీ ప్రతిభను మొత్తం ప్రదర్శించు’’ అని ఓ సందర్భంలో మీరు (సరోజ్ ఖాన్) నాతో అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – హన్సిక ► దేవుడా.. ఈ ఏడాది ఇక ఏ విషాద వార్తనూ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. మీ కొరియోగ్రఫీలో ఒక్క పాట అయినా చెయ్యాలని కలలు కనేదాన్ని. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – రకుల్‌ప్రీత్ సింగ్ -
సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో హీరోయిన్గా సుందరమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ విషయానికి వస్తే...రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి. -
హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్ భారతక్క’
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియమణి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గురువారం ప్రియమణి బర్త్ డే సందర్భంగా ‘విరాటపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘కామ్రేడ్ భారతక్క’గా కనిపించనున్న ప్రియమణి.. పాత్రకు తగ్గ దుస్తులు, భుజాన తుపాకీతో పోస్టర్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఏదో సాధించిన విజయం ముఖంపై చిరునవ్వు రూపంలో ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు ప్రియమణిని ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం’ అంటూ చిత్ర బృందం తెలిపింది. ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, ప్రియమణిలతో పాటు నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 pic.twitter.com/NXzrXI0s2Z — Suresh Productions (@SureshProdns) June 4, 2020 -
మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్‌ను ఇప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. -
ఆర్మీ ఆఫీసర్ భార్యగా..
‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో నటించి, డిజిటల్ వ్యూయర్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు నటి ప్రియమణి. ఇప్పుడు ‘అతీత్’ అనే మరో వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ భార్య జాన్వీగా కనిపించనున్నారు ప్రియమణి. యుద్ధంలో పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ చనిపోయినట్లు ప్రకటిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఆ ఆర్మీ ఆఫీసర్ తన భార్య, కూతురితో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుని వారి వద్దకు వస్తాడు. అప్పుడు ఆ తల్లీకూతుళ్ల పరిస్థితి ఏంటి? అసలు ఆ ఆర్మీ ఆఫీసర్ చనిపోయినట్లు ప్రకటన రావడం వెనక దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని సమాచారం. ‘‘ఈ వెబ్ సిరీస్ కొన్ని హార్రర్ అంశాలతో కూడుకున్న సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో నాతో పాటు రాజీవ్ ఖండేల్వాల్, సంజయ్ సూరి నటిస్తున్నారు. తనూజ్ భ్రమర్ దర్శకత్వం వహిస్తున్నారు’’ అని పేర్కొన్నారు ప్రియమణి. ‘ది ఫ్యామిలీ మేన్’ సెకండ్ సీజన్లోనూ కనిపించనున్నారట ప్రియమణి. అలాగే ప్రస్తుతం బాలీవుడ్లో అజయ్ దేవగన్ సరసన ‘మైదాన్’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు ప్రియమణి. ఈ విషయం గురించి ప్రియమణి మాట్లాడుతూ– ‘‘అజయ్ సార్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ వారికి నేను కొత్తగా కనిపిస్తాను. 2013లో షారుక్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఓ డ్యాన్స్ నంబర్ చేశాను. ఆ తర్వాత నాకు బాలీవుడ్ నుంచి స్పెషల్ సాంగ్స్ చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను చేయలేదు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుక్ కాబట్టే చేశాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్ ‘నారప్ప’, రానా ‘విరాటపర్వం’, ‘సిరివెన్నెల’ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ‘డాక్టర్ 56’లో కూడా నటిస్తున్నారు ప్రియమణి. లాక్డౌన్ వల్ల ఈ చిత్రాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. -
మ్యాచ్ వాయిదా
‘మైదాన్’ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లో తయారైన టీమ్ ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడిందని తెలిసింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఈ సినిమాలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తున్నారు అజయ్. తొలుత ఈ సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అజయ్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. -
కురుమలైలోనారప్ప
తమిళనాడులో ఫైట్ చేస్తున్నారు ‘నారప్ప’. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రంలో ప్రియమణి, అమలాపాల్ కథానా యికలుగా నటిస్తున్నారని తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని పాల్తూరు గ్రామంలో ఇటీవల ‘నారప్ప’ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని కురుమలైలో జరుగుతోంది. స్టంట్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి అనంతపురంలో ‘నారప్ప’ చిత్రీకరణ మొదలవుతుంది. ‘నారప్ప’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ. -
నవంబరులో మైదాన్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇందులో ప్రియమణి కథానాయిక. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని అజయ్ లుక్స్‌ను గురువారం విడుదల చేశారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ (1950–1963) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ‘మైదాన్’ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్‌కి చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబరు 27న ఈ చిత్రం విడుదల కానుంది. -
రెబల్‌స్టార్ సామ్!
డిజిటల్ ప్లాట్ఫామ్లో తొలి అడుగును విజయవంతంగా ముగించారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించారామె. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ తొలి సీజన్‌కు గత ఏడాది డిజిటల్ ఎంటర్టైన్ మీడియమ్‌లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్‌లు కీలక పాత్ర పోషించారు. రెండో సీజన్లో సమంత ఓ లీడ్ చేశారు. ఆమె పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ– ‘‘ది ఫ్యామిలీమేన్’ సీజన్ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది. అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకేలకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మేము యాక్షన్ అని చెప్పిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు (సమంత) మలచుకున్న విధానం అద్భుతం. ఇప్పుడు ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో మీరూ ఒకరు. ఈ పాత్ర మీ కంఫర్ట్ జోన్లోది కాకపోయినప్పటికీ అద్భుతంగా నటించారు’’ అని సమంతను ఉద్దేశించి రాజ్ అండ్ డీకే అన్నారు. అది మాత్రమే కాదు.. ‘రెబల్‌స్టార్ సామ్!’ అని కేక్‌పై రాయించి సెట్లో కట్ చేయించారు యూనిట్. మరోవైపు సమంత ఓ టాక్ షో కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. -
వెంకీ నారప్ప
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటిస్తారని తెలిసింది. డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. తొలి షెడ్యూల్ అనంతపురంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో తన క్యారెక్టర్ లుక్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై దృష్టి పెట్టారు వెంకీ. -
వెరైటీ టైటిల్.. కొత్త గెటప్‌తో వెంకీ
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే హీరో విక్టరీ వెంకటేష్. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో.. మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్ సినిమా టైటిల్ ఇదే అంటూ గుబురు గడ్డంతో ఉన్న వెంకటేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ కొత్త సినిమా టైటిల్ ‘ నారప్ప’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, సినిమా టైటిల్‌పై చిత్ర బృదం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
కేరాఫ్ కేరళ అడవులు
కేరళ అడవుల్లోకి మకాం మార్చారు రానా దగ్గుబాటి. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారని తెలిసింది. తన కొత్త చిత్రం ‘విరాట పర్వం’ షూటింగ్ కోసమే ఈ కేరళ మకాం. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: డాని సాంచెజ్–లోపెజ్. -
ఆ చిత్రంలో కీర్తి స్థానంలో ప్రియమణి
దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి లక్కీ చాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. భారత ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. జీ స్టూడియోస్, బోని కపూర్ మైదాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కీర్తి డ్రాప్ అయ్యారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బరువుగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో కీర్తి పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నిర్మాతలు ప్రియమణిని సంప్రదించగా.. ఆమె కూడా ఆసక్తి కనబరిచినట్టుగా సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తున్నారు. -
అనంతపురంలో అసురన్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
నటిగా పరిచయమై 17 ఏళ్లు.. ఆ కోరిక తీరలేదు
సినిమా: ఆ కోరిక తీరలేదంటోంది నటి ప్రియమణి. తమిళ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముత్తళగి(పరుత్తివీరన్ చిత్రంలోని పాత్ర) ఈ భామ. కేరళా చిన్నది తమిళం, తెలుగు భాషల్లోనూ కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పరుత్తివీరన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ప్రియమణి వివాహానంతరం నటనకు దూరమైంది. సినిమాలకు దూరం అయినా, బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇటీవల వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో వెండితెరకూ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇలా రియాలటీ షోలు, వెబ్ సిరీస్, సినిమాలు అంటూ మళ్లీ బిజీ అయిపోయింది. తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన అసురన్ చిత్ర తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ సరసన నటించే అవకాశం ప్రియమణినే వరించింది. ఈ సందర్భంగా ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటిగా పరిచయమై 17 ఏళ్లు అయిందని చెప్పింది. ఈ పయనాన్ని ఒక్కోసారి వెనక్కు తిరిగి చూసుకుంటే సంతోషం కలుగుతోందని అంది. ఈ కొత్త సంవత్సరం నటిగా తనకు ఇంకా బాగుంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. ప్రస్తుతం ది ఫ్యామిలీమెన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని, ఇందులో సుచిత్రా తివారి అనే పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ముంబాయిలో నివసించే తమిళ అమ్మాయి పాత్ర అనగానే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ప్రస్తుతం సీజన్ 2 చిత్రీకరణ జరుగుతోందని, ఇందులో నటి సమంత కూడా పాల్గొననున్నట్లు తెలిపింది. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని సన్నివేశాల్లో తనను పోల్చుకునేలా సన్నివేశాలు ఉన్నాయంది. భార్యాభర్తల మధ్య చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయని చెప్పింది. నిజ జీవితంలో తనకు తన భర్తకు జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయని అంది. తానే కాదు అందరూ కనెక్ట్ అయ్యేల యధార్థ సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పింది. తన డ్రీమ్ రోల్ ఏమిటని చాలా మంది అడుగుతున్నారని, పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ చేసిన నీలంబరి పాత్ర మాదిరి ఒక నెగిటివ్ పాత్రనే తన డ్రీమ్‌రోల్ అని చెప్పింది. తన వాయిస్ నెగిటివ్ పాత్రలకు బాగుంటుందని చాలా మంది చెబుతుంటారని పేర్కొంది. అలాంటి పూర్తి స్థాయి ప్రతినాయకి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తాను ప్రారంభ దశలోనే భారతీరాజా, బాలుమహేంద్ర వంటి లెజెండ్రీ దర్శకుల చిత్రాల్లో నటించానంది. అయితే ఇక్కడ తనకుంటూ ఒక స్థానం లభించలేదన్న బాధ ఉందా? అంటే కచ్చితంగా ఉందనే చెబుతానంది. తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటిచాలన్న తన కోరిక తీరలేదని చెప్పింది. ఆ ఆశ ఇప్పటికీ ఉందని అంది. కాగా తమిళంలో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోందని, అయితే అది ఇప్పుటికి న్యూస్‌గానే ఉందని, ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పింది. ఆ చిత్రంలో తాను నటిస్తున్నానా? లేదా? అన్నది ఆ చిత్ర వర్గాల నుంచే ప్రకటన రావాలని ప్రియమణి పేర్కొంది. -
జోడీ కుదిరిందా?
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్ నటించిన సూపర్‌హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కళైపులి యస్. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్‌లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. -
శశికళ పాత్రలో ప్రియమణి !
హైదరాబాద్ : కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ తలైవిలో జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు సమాచారం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో శశికళ పాత్ర ఎవరికి దక్కుతుందనేది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. శశికళ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతారని భావించిన దర్శకుడు విజయ్ ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవిలో పాన్ ఇండియా అప్పీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రియమణి ఎంట్రీ కలిసివస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది. కాగా ప్రియమణి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా, ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సిరివెన్నెల మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శశికళ పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవీ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో జయలలితకు సంబంధించిన ప్రధానపాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత జీవితంలో ముఖ్య వ్యక్తి శశికళ. ఆమె పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కంగనా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో కంగనా లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. తలైవీ చిత్రానికి హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్ జోసన్ కాలిన్స్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో జయలలిత సినీ పరిశ్రమకి రాకముందు, సినీ పరిశ్రమలో మంచి నటిగా రాణిస్తున్న సమయంలో, రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగనా సందడి చేయనున్నారు. ఈ చిత్రం కోసం కంగనా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా.. ఈ సినిమాలో అరవిందస్వామి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, లెజెండరీ ఎంజీ రామచంద్రన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండరీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. -
ఆ హీరోయిన్లకే భారీ రెమ్యునరేషన్ : ప్రియమణి
పారితోషకం విషయంలో బాలీవుడ్ హిరోయిన్లకి, సౌత్ హీరోయిన్లకి చాలా తేడా ఉంటుంది. బాలీవుడ్లో ఒక్క సినిమాకి వచ్చే రెమ్యునరేషన్.. సౌత్‌లో రెండు, మూడు సినిమాలు చేసిన రావు. వందల కోట్ల వసూలు చేసిన సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కూడా పారితోషికం విషయంలో అసంతృప్తిగానే ఉంటున్నారనే అందరికి తెలిసిందే. హీరోలతో పాటు కష్టపడే హీరోయిన్స్ కు ఎందుకు తక్కువ పారితోషికం అంటూ కొందరు ఈమద్య బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికాలు భారీగానే ఉన్నా వారు కూడా తమకు హీరోల స్థాయిలో పారితోషికాలు రావడం లేదంటూ మాట్లాడుతున్నారు. ఈ విషయమై తాజాగా సౌత్ హాట్ బ్యూటీ ప్రియమణి స్పందించింది. తమ టాలెంట్ కి తగిన పారితోషికం దక్కడం లేదని చాలామంది హీరోయిన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అని ఓ ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రియమణి ఊహించని సమాధానం ఇచ్చింది. ‘బాలీవుడ్ విషయం పక్కన పెడితే... సౌత్‌లో మాత్రం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితి నయనతార .. అనుష్క .. సమంతలకు మాత్రమే ఉంది. వాళ్లకి గల డిమాండ్ ను బట్టి తమకి ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకుంటున్నారు. ఇతర హీరోయిన్స్‌కి పారితోషికం డిమాండ్ చేసే అవకాశమే లేదు. అతి కొద్ది మంది మాత్రమే తమకు రావాల్సిన పారితోషికాలను నిర్మాతల నుండి ఖచ్చితంగా వసూలు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వారిలో చాలా మంది కూడా నిర్మాతల వద్ద పారితోషికం విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని ప్రియమణి అభిప్రాయపడింది. హీరోయిన్ గా తెలుగు.. తమిళంలో పలు చిత్రాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే ఈమె నటించిన 'ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నటనకు గాను ప్రియమణి ప్రశంసలు దక్కించుకుంది. -
‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్న ఈ తరుణంలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తున్న సిరివెన్నెల చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. హారర్ మూవీగా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే వినాయకుడి పాటను నిర్మాతలు విడుదల చేశారు. శ్రీరామ్ తపస్వి రాసిన ఈ పాటను ప్రణతి రావు, రామ్సీ, హరి గుంటా శ్రోతల హృదయాలకు హత్తుకునేలా ఆలపించారు. ఈ సినిమాకు కమ్రాన్ స్వరాలు సమకూర్చాడు. మహానటి ఫేమ్ బేబి సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ బోహ్రా, ఏ ఎన్ భాషా, అరిపక రామసీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్
హారర్ మూవీస్ ఎప్పుడూ వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కథనాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే.. సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హారర్ చిత్రాలకు ఏ సీజన్‌తో పని ఉండదు.. కాస్త పాజిటివ్ టాక్ వస్తే హిట్ గ్యారంటీ. అందుకే మన వాళ్లు హారర్ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది. మహానటి ఫేమ్ బేబి సాయి తేజస్విని (రాజేంద్ర ప్రసాద్ మనవరాలు), ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరివెన్నెల ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. కమల్ బోహ్రా, ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్ పులిజాల తెరకెక్కిస్తున్నారు. -
పిల్లల సక్సెస్ చూసినప్పుడే ఆనందం
‘‘మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్) నవ్వించేవారు.. నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావ్. ‘మహానటి’ చిత్రంతో నటన మొదలుపెట్టావు. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు. కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మించిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘నిర్మాతల్లో ఒకరైన బాషాకి రాఘవేంద్రరావు తెలుసు.. రాజమౌళి తెలుసు... అందరితోనూ పని చేశాడు. నా సినిమాలకు చాలా వరకు ఆయనే నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం లేకపోతే సినిమానే లేదు. సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్.. ఇలా ఏ పాత్రకైనా ప్రియమణి సరిపోతుంది’’ అన్నారు. నటుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన కీరవాణిగారిని, ఆర్.పి. పట్నాయక్.. ఇంకా ఇంత మంచి మహానుభావులను ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. మా మనవరాలు గురించి నేను చెప్పకూడదు.. ప్రేక్షకులే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. తేజస్విని బాగా నటించింది’’ అన్నారు ప్రియమణి. ‘‘నేను చేసిన ‘అనగనగా ఓ దుర్గ’ చిత్రం చూసి బాషాగారు కథ చెప్పమన్నప్పుడు ‘సిరివెన్నెల’ కథ చెప్పాను. బాషాగారికి, బోరాగారికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అన్నారు ఓం ప్రకాష్. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని బాషా, కమల్ బోరా అన్నారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, ఆర్.పి. పట్నాయక్, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
‘సిరివెన్నెల’ పాటకు లెజెండరీ సింగర్స్ ప్రశంసలు
పెళ్ళి తరువాత ప్రముఖ నటి ప్రియమణి నటిస్తున్న చిత్రం సిరివెన్నెల. శాంతి టెలిఫిల్మ్స్ సమర్పణలో ఎ.ఎన్.బి కొఆర్డినేటర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుని ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుటుంది. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ని ఇటీవలే బాలీవుడ్ స్టార్ డైరక్టర్ నీరజ్ పాండే చేతుల మీదుగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కమ్రాన్ సంగీతం అందించిన పాటను క్రేజీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ తన సోషల్‌మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఆయన విడుదల చేసిన సాంగ్‌కి లెజండరి సింగర్స్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం , శంకర్ మహదేవ్‌లు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సంగీత ప్రియులందరికి నమస్కారాలు.. ఇప్పుడే ఒకే పాట వున్నాను. శాంతి టెలిఫిల్మ్స్ సమర్పణ లో ఎ.ఎన్.బి కొఆర్డినేటర్స్ నిర్మిస్తున్న సినిమా సిరివెన్నెల సినిమాలోనిది. మా బాషా, కమల్ బోరా సంయుక్తంగా నిర్మించారు. జై జై గణేషా అనే పాట చాలా చక్కగా వుంది. ముఖ్యంగా పాత సిరివెన్నెల నాకు చాలా ఇష్టమైన సినిమా.. అలాగే ఈ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకోవాలని కొరుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్ పాడిన ప్రణతి రావు చాలా చాలా బాగా పాడింది.. చివరలో వాయిస్ కలిపిన రాంసి, హరిగుంట.. సాహిత్యాన్ని అందించిన శ్రీరామ్ తపస్వికి సంగీతం అందించిన కమ్రాన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చక్కటి తెలుగు పదాలతో తెలుగు పాట, అందులోను గణేశ నామ స్మరణతో మొదలయ్యిన ఈ పాట సినిమా విజయానికి నాంది కావాలని కొరుకుంటున్నాను. అందరూ బాగుండాలి సర్వేజనా సుఖినో భవంతు’ అన్నారు. శంకర్ మహదేవ్ మాట్లాడుతూ.. ‘జై జై గణేశ అనే మొదలయ్యే ఈ పాట చాలా బాగుంది. నిర్మాత బాషా గారు నిర్మించిన సిరివెన్నెల చిత్రం నుండి మెదటి సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్, ఈ సాంగ్ విజయం సాధించాలి. అలాగే సినిమా కూడా చాలా మంచి విజయాన్ని అందుకొవాలనికి కొరుకుంటున్నాను’ అన్నారు. -
ప్రియమణి.. ‘అభి’మతం ఒకటే
కాషాయ వర్ణం అందమే అందం. ఆకుపచ్చ సౌందర్యమే సౌందర్యం.గుడిలో గంట మంగళప్రదమైన తరంగాలు సృష్టిస్తుంది.‘అల్లాహో అక్బర్’... అని పిలిచే అజాన్ మనసుకు శాంతినిస్తుంది.పావురాలు గోపుర కలశం పైనా.. మినార్ చంద్రవంక పైనా వాలుతాయి.మతాలు ఏమైనా మనుషులంతా ఒక్కటే.ప్రియమణి పుట్టింటి మతం వేరు. అత్తింటి మతం వేరు.పెళ్లయ్యాక రెండు మతాల పండుగలు ఆ ఇంట జరుగుతున్నాయి. ఈ రంజాన్ మాసంలో భర్త ఉపవాసాలకు తన వంతు ఆధ్యాత్మిక తోడు అందిస్తున్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో మీ అత్తగారింట్లో పాటించే ఆచారాల గురించి చెబుతారా? ప్రియమణి: అత్తామామలు ప్రస్తుతం ఇక్కడ లేరు. వాళ్లు యు.ఎస్‌లో ఉన్నారు. నేను, మా ఆయన (ముస్తఫా) మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఆయన మాత్రం ‘రోజా’ (ఉపవాసం) పాటిస్తున్నారు. 30 రోజులుగా ఫాస్టింగ్ ఉంటున్నారు. రోజూ వాళ్ల కమ్యూనిటీ హాల్‌కి వెళ్లి సాయంత్రం ఉపవాసం విరమించుకుని, ఇంటికి వస్తున్నారు. ఉదయాన్నే నాలుగున్నరకు లేచి నమాజ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఉపవాసం మొదలుపెడతారు. మా పెళ్లయ్యాక వచ్చిన రెండో రంజాన్ ఇది. తెల్లవారుజాము నిద్ర లేవడం, నమాజు చేసుకుని ఉపవాసం మొదలుపెట్టడం, పనులు చేసుకోవడం, సాయంత్రం 5–6.30 మధ్యలో వాళ్ల కమ్యునిటీ హాల్‌కు వెళ్లడం, ఫాస్టింగ్ని బ్రేక్ చేసి రాత్రికి 8.30కి ఇంటికి తిరిగి రావడం. రాత్రి ఇద్దరం కలసి డిన్నర్ చేస్తాం. ఈ మాసంలో మా ఆయన రోజువారి జీవితం ఇలా ఉంటుంది. ఫాస్టింగ్ (ఉపవాసం) చేయడం చాలా కష్టం కదా? అది కూడా రోజంతా నీళ్లు తాగకుండా, లాలాజలం కూడా మింగకుండా అంటే చాలా చాలా కష్టం... నా భర్త అని మాత్రమే కాదు... ఫాస్టింగ్ ఉండే ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్. ఎంతో మనో నిబ్బరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. బహుశా దైవ ఆరాధనలో ఉన్నాం అన్న భావనే ఆ శక్తి ఇస్తుందనుకుంటా. నిత్యం ‘రోజా’ మొదలెట్టాక కొద్ది సమయం గడిచాక ‘ఇవాళ రోజా ఉండగలను’ అని అనిపించి సంకల్పం చెప్పుకుంటారు. ఈ సంకల్పం చెప్పుకోని ముందు ఏవైనా అవాంతరాలు వస్తే రోజాను బ్రేక్ చేయవచ్చు. కాని సంకల్పం చెప్పుకున్నాక ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాణం పోతున్నా సరే రోజాను బ్రేక్ చేయకూడదు. ఇవాళ రోజా ఉంటున్న కోట్లాది మంది నిత్యం సంకల్పం చెప్పుకుంటున్నవాళ్లే. ఇంత ఎండల్లో ఎంత ఇబ్బంది ఉన్నా వారు ఇఫ్తార్ సమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టక ఉపవాసం ఉండటం చాలా గొప్ప. ఇది దైవం నుంచి శక్తి పొందడమే అని అనుకుంటాను. ఈ మాసంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందట కదా? నాకు తెలిసి ఈద్‌కి వారం పదిరోజులు ముందు ఏదైనా అడిగితే జరుగుతుందని నమ్ముతారు. అది వాళ్ల మత సంప్రదాయం. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఆ నమ్మకానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. దేవుడి ధ్యానంలో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడు న్యాయమైన కోరికలను భగవంతుడు తీరుస్తాడని అనుకోవచ్చు. అన్ని మతాలకూ ఇది వర్తిస్తుంది. మీరు హిందువు. మరి ఇస్లామ్ సంప్రదాయం గురించి మీకు ముందే తెలుసా? మ్యారేజ్ అయిన తర్వాతే తెలుసుకున్నారా? నాకు ముందే తెలుసు. నాకు ముస్లిమ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. మా స్కూల్లో చాలా మంది స్కూల్‌మేట్స్ ముస్లిమ్లే. అయితే పెళ్లయిన తర్వాతే ఇంకా డెప్త్‌గా తెలిసింది. ముస్లిమ్లలో కమ్యూనిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతి పాటిస్తారు. మా భర్త వాళ్లు ‘బొహ్రా’ ముస్లిమ్‌లు. వీళ్ల పద్ధతి ఎలా ఉంటుందంటే.. హైదరాబాద్, బెంగళూరు.. వేరే చోటుకి ట్రావెల్ చేశారంటే ఆ ప్రాంతాల్లో వాళ్ల రక్తసంబంధీకులు ఉంటేనే ఉపవాసం ఉంటారు. లేదంటే చేయరు. ముస్లిమ్‌లు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంటారు. ముస్తఫాగారు క్రమం తప్పకుండా చేస్తుంటారా? అలా ఏం లేదనుకుంటా. వీలుండి చేసే వాళ్లు చేస్తుంటారు. మా అత్తా మావయ్య మూడు సార్లకు తగ్గకుండా నమాజ్ చేస్తుంటారు. ఉదయం, మ«ధ్యాహ్నం, సాయంత్రం చేస్తుంటారు. ఇది కేవలం నా ఫ్యామిలీ గురించి చెబుతున్నాను. అందరి గురించి కాదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుదురుతుందా? నమాజ్ చేయాలంటే మనం ఉన్న చోటు అందుకు అనువుగా ఉండాలేమో? ముస్తఫా అయితే దగ్గర్లో ఉన్న మసీద్ లేదా కమ్యూనిటీ హాల్, రిలేటివ్స్ ఇంటికి వెళతారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు చుట్టాలుంటే వాళ్ల ఇంట్లో చేస్తారు. కాని శుభ్రమైన చోటు ఉంటే ఎక్కడైనా సరే నమాజు వేళలో ఒక వస్త్రం పరుచుకుని నమాజు చేసుకోవచ్చని చెబుతారు. రంజాన్‌కు సంబంధించిన బాధ్యత కలిగిన విషయం ఏంటంటే ‘జకాత్’ (దానం). దాని గురించి? కేవలం రంజాన్ సమయంలో మాత్రమే కాదు అన్ని సమయాల్లో మేం చారిటీ చేస్తుంటాం. అయితే రంజాన్ నెలలో ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాం. చిన్నపిల్లలకు ఫుడ్ ఇస్తాం. చదువుకోవడానికి సహాయం చేస్తాం. పెద్దవాళ్లకి హెల్ప్ చేస్తుంటాం. ఆహారం సమకూర్చడం, ఆర్థిక సహాయం, బట్టలివ్వడం... ఇలా ఏదంటే అది చేసేస్తాం. చాలా తృప్తిగా ఉంటుంది. రంజాన్ వంటకాల్లో మీకు నచ్చిన వంటకం ఏది? ముంబైలో ‘భేండి బజార్’ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ దొరికే స్వీట్స్ చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో ఆ బజార్లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తారు. ఈ సీజన్లో తప్ప వేరే సమయాల్లో అలాంటి స్వీట్స్ దొరకవు. ముస్లిమ్‌లకు శుక్రవారాలు ముఖ్యమైనవి. ఆ రోజున నా భర్త పొద్దునే మసీద్‌కు వెళ్లి నమాజ్ ముగించుకుని అక్కడికెళ్లి ఎక్కువ స్వీట్స్ తీసుకు వస్తారు. ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత స్వీట్స్ తింటాం. ఈ సీజన్లో అక్కణ్ణుంచి స్వీట్స్ తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. అవి ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగే అక్కడ తయారు చేసే ఫలూదా చాలా టేస్టీగా ఉంటుంది. ఫలూదాని అక్కడ ‘మాహిమ్’ అంటారు. ఇంట్లో ఒకరు ఉపవాసం ఉంటే పక్కవాళ్లకి తినడం ఇబ్బందిగా ఉంటుందా? అలా ఏం లేదండి. నేను నా ఆహారాన్ని స్కిప్ చేయను. మనం తింటున్నామని వాళ్ల ఫాస్టింగ్‌కి భంగం కలగదు. వాళ్ల ఆలోచన ఫుడ్ వైపు వెళ్లదు. నేనైతే అంత సిన్సియర్‌గా ఫాస్టింగ్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. అందుకే వాళ్ల విల్ పవర్‌కి నిజంగా హ్యాట్సాఫ్. సినిమా స్టార్స్‌కి కొత్త బట్టలంటే పెద్ద విషయం కాదు. కానీ ఈద్ టైమ్‌లో కొత్త బట్టలు కొనుక్కుంటారా? ఫాస్టింగ్ ఉంటున్న రోజుల్లో షాపింగ్ చేయం. ఈద్ సెలబ్రేట్ చేసుకునే ముందు రోజు మాత్రం బట్టలు కొనుక్కుంటాం. నేను సల్వార్లు కొనుక్కుంటాను. పెళ్లయిన వాళ్లనందరినీ అందరూ కామన్‌గా అడిగేదే.. పిల్లలు ఎప్పుడు ? ఇప్పుడైతే లేదు (నవ్వుతూ). పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? రిలేషన్షిప్ స్టేటస్ మారింది అంతకుమించి ఏమీ లేదు. పెళ్లికి ముందు ఒక ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు రెండు ఫ్యామిలీలు. బాధ్యత ఇంకాస్త పెరిగింది. ఎప్పుడైనా నమాజ్ చేశారా ? లేదు. అత్తింటివాళ్లు మతం మార్చుకోమని అడగలేదా? అస్సలు లేదు. పెళ్లికి ముందే మేం ఒకరి కోసం మరొకరు మారాలని అనుకోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని అనుకున్నాం. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యాం. మా పెద్దవాళ్లు దానికి అంగీకరించారు. మా అత్తామామలైతే ‘ఇన్నేళ్లుగా ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా.. సడన్‌గా మార్పు అంటే కష్టం. ఇన్నేళ్లూ ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి’ అన్నారు. మా అత్తమామయ్యలు చాలా బ్రాడ్ మైండెడ్. అర్థం చేసుకున్నారు. మా అమ్మానాన్న కూడా మాలో మార్పు కోరుకోలేదు. మతాలు ఏవైనా సాటి మనిషి పట్ల మానవత్వంతో ఉండటమే మా అభిమతం. అందరి అభిమతం అదే కావాలి. అప్పుడే అందరం బాగుంటాం. ఇక íసినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సిరివెన్నెల’ చేస్తున్నారు. ఇంకేమైనా చేస్తున్నారా? కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను. అమేజాన్ ప్రైమ్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలో ఈ సిరీస్ సీజన్ 2 కూడా స్టార్ట్ కాబోతోంది. తెలుగులో ‘ఢీ’ టీవీ షో చేస్తున్నాను. అలాగే మలయాళంలో కూడా టీవీ షోలు చేస్తున్నా. వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బావుంది. సినిమా షూటింగ్‌లానే ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుంది. రోజుకు 6–7 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ అని నేను నమ్ముతాను. ఫైనల్లీ.. సినిమాలు, సిరీస్‌లు, షోలతో బిజీ స్టార్‌గానే కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది? ఐయామ్ గ్లాడ్. రోజులు మారుతున్నాయి. చాలా మంది అంటుంటారు పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. నేను 18–19 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. సడన్‌గా ఇప్పుడు ఆపేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేస్తాను. మా అత్తమామలు, హస్బెండ్ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంటారు. నువ్వు వర్క్ చేయి... ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మాకే ఏదోలా అనిపిస్తుంటుంది అంటారు. అంత సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకేం కావాలి. అయితే సినిమాలలో పాత్రలు ఆఫర్ చేసేటప్పుడు పెళ్లయిన హీరోయిన్లను కేవలం కొన్ని పాత్రలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఆ విధానం మారుతున్నట్టుగా కనిపిస్తుంది. – డి.జి. భవాని ప్రేమకు కుల మతాలు ఉండవు. మనసులు కలిస్తే చాలు. ప్రియమణి, ముస్తఫా రాజ్‌ల మనసులు కలిశాయి. అయితే ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి అనుకున్నారు. హిందు–ముస్లింల మధ్య పెళ్లి. తమిళ, ఉర్దూ భాషల మధ్య పెళ్లి. ఏమవుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. కాని రెండు కుటుంబాల వాళ్లు అంగీకరించారు. అబ్బాయి తరపువారు ‘నువ్వు ముస్లిం అమ్మాయిగా మారితేనే’ అని ప్రియమణికి కండీషన్ పెట్టలేదు. అమ్మాయి తరపువారు ‘నువ్వు హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవుతావా’ అని ముస్తఫాని అడగలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముస్తఫా ముంబైలో ఈవెంట్స్ మేనేజర్. మంచి పలుకుబడి ఉంది. నటిగా దక్షిణ, ఉత్తరాదిన ప్రియమణి ఫేమస్. 2017 అగస్ట్ 23న వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ‘మా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది’ అన్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో భర్త ఆచరిస్తున్న నియమాల గురించి ‘సాక్షి’తో చెప్పారు. ఇండస్ట్రీలో ఉండే పోటీ వల్ల ఒత్తిడికి గురవుతుంటారా? మీ సక్సెస్ మంత్ర? లేదు. నాకెప్పుడూ స్ట్రెస్ అనిపించలేదు. ఎందుకంటే పోటీ అవసరం అని నా ఫీలింగ్. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా సక్సెస్ మంత్ర ఏంటంటే ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’. ఇవాళ కాకపోయినా ఏదో రోజు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతాను. దక్కుతుందో లేదో అని సందేహించి కష్టపడటం మానేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే మిగిలిపోతాం. -
నట విశ్వరూపం
‘పెళ్లైనకొత్తలో, యమదొంగ, రగడ, శంభో శివ శంభో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కన్నడ బ్యూటీ ప్రియమణి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సిరివెన్నెల’. వివాహం తర్వాత ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బీ కో ఆర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ పతాకాలపై కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ప్రియమణి కెరీర్లో ఈ చిత్రం విభిన్నమైనదిగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రియమణిగారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరి వెన్నెల’ కథ బాగా నచ్చడం, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. ఆమె నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. ‘సిరివెన్నెల’ టైటిల్ మా సినిమాకు కరెక్ట్‌గా సరిపోయింది. శివరాత్రికి విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు నీరజ్ పాండే విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఎన్‌బీ కోఆర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ, సాంగ్స్ కంపోజింగ్: ‘మంత్ర’ ఆనంద్, కమ్రాన్, కెమెరా: కల్యాణ్ సమి. -
స్క్రీన్ టెస్ట్
కొన్ని పాటలు పదే పదే పాడుకోవాలనేలా ఉంటాయి. ఎప్పటికీ వెంటాడుతుంటాయి. వాటినే ‘ఎవర్ గ్రీన్ సాంగ్స్’ అంటాం. ఆ పాత పాటలు రీమిక్స్ రూపంలో వస్తే.. అప్పటికే ఆ పాటలను ఎంజాయ్ చేసినవారికి ఆనందాన్నివ్వడంతో పాటు కొత్త తరానికి కూడా ఆ ట్యూన్స్ దగ్గరైపోతాయి. అలాంటి ఫేమస్ పాటలను కొన్నింటిని గుర్తుచేస్తూ ‘రీమిక్స్’పై ఈ వారం స్పెషల్ క్విజ్... 1. ‘రాముడు కాదు కృష్ణుడు’.. 1983లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం. ఆ చిత్రంలోని ‘ఒక లైలా కోసం, తిరిగాను లోకం’ అనే సూపర్‌హిట్ సాంగ్ రీమిక్స్‌లో నాగచైతన్య నటించారు. ఆ పాటలోని మొదటి లైన్‌ను తన సినిమా పేరుగా పెట్టుకున్నారు చైతన్య. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్‌ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) నిధీ అగర్వాల్ డి) లావణ్యా త్రిపాఠి 2. ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంలోని ‘వానా వానా వెల్లువాయె, కొండాకోన తుళ్లిపోయె...’ అప్పట్లో పెద్ద హిట్. తండ్రి చిరంజీవి చేసిన ఆ పాట రీమిక్స్‌లో తమన్నాతో కలిసి ‘రచ్చ’ చిత్రంలో స్టెప్పులేశారు రామ్‌చరణ్. అప్పట్లో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? ఎ) వాణీ విశ్వనాథ్ బి) విజయశాంతి సి) రాధిక డి) రాధ 3. ఆత్రేయ స్వరపరచిన ‘ఓ బంగరు రంగుల చిలక పలకవే.. ఓ అల్లరి చూపుల రాజా ఏమని..’ పాట చలం హీరోగా నటించిన ‘తోటరాముడు’ చిత్రంలోనిది. కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో మరోసారి ఆ పాటను వినిపించాడు. ఆ సినిమాలో కృష్ణభగవాన్ సరసన హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) రమ్యకృష్ణ సి) నగ్మా డి) రవళి 4. ‘ఆర్య–2’ చిత్రంలోని ఐటెమ్ సాంగ్ ‘రింగ రింగ రింగ రింగ రింగ రింగారే’ పాట హిందీలో రీమిక్స్ నటించిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) షారుక్ ఖాన్ డి) సల్మాన్ ఖాన్ 5. ‘గల గల పారుతున్న గోదారిలా...’ ఈ పాట మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ చిత్రంలోనిది. కృష్ణ నటించిన ఓ సినిమాలోని పాట ఇది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) గౌరి బి) సాక్షి సి) పండంటి కాపురం డి) అల్లూరి సీతారామరాజు 6. 1977లో యన్టీఆర్ నటించిన ‘యమగోల’ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా, వొళ్లంతా తిమ్మిరెక్కిందా...’ను రీమిక్స్ చేసిన దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) కొరటాల శివ 7. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే..’ అంటూ సిల్వర్‌స్క్రీన్‌పై స్టెప్పులేసిన హీరో పవన్‌కళ్యాణ్. ఆయన సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) రాశి బి) రేణూదేశాయ్ సి) శ్రియ డి) భూమికా చావ్లా 8. ‘ఆకుచాటు పిందె తడిసే...’ అంటూ ‘వేటగాడు’ చిత్రంలో తన అందాలను ఆరబోశారు అందాల తార శ్రీదేవి. అదే ట్యూన్‌ను గుర్తు చేస్తూ ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అని జూనియర్ యన్టీఆర్ ‘అల్లరి రాముడు’ చిత్రంలో ఏ హీరోయిన్‌తో చిందేశారో గుర్తుందా? ఎ) ఆర్తీ అగర్వాల్ బి) సదా సి) కీర్తీ చావ్లా డి) అంకిత 9. కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ చిత్రంలోని ‘ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ పాటను రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకున్న హీరో ఎవరో తెలుసా? ఎ) నితిన్ బి) నిఖిల్ సి) నవదీప్ డి) ‘అల్లరి’ నరేశ్ 10. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేల కలుసుకో...’ అనే పాట చాలా ఫేమస్. ఆ పాటను తన ఆల్బమ్‌కి పేరుగా పెట్టుకున్న ప్రముఖ గాయని పేరేంటో కనుక్కోండి? ఎ) చిత్ర బి) స్మిత సి) గీతామాధురి డి) శ్రావణ భార్గవి 11. ‘దం^è వే మేనత్త కూతురా... వడ్లు దంచవే నా గుండెలదరా... దంచు దంచు బాగా దంచు’ అనే పాట ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రంలోనిది. మళ్లీ ఆ పాటను హీరో నాని ‘రైడ్’ చిత్రంలో యూజ్ చేశారు. ‘రైడ్’ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా? ఎ) హేమచంద్ర బి) సాయికార్తీక్ సి) భీమ్స్ డి) శేఖర్ చంద్ర 12. నాగార్జున హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రంలోని ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) నాని బి) సుమంత్ సి) శర్వానంద్ డి) కల్యాణ్‌రామ్ 13. ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో..’ అనే పాట ఏ హీరో కోసం మళ్లీ తయారయ్యిందో లె లుసా? (క్లూ: ‘ఆటాడుకుందాం రా’ అనే చిత్రం కోసం ఈ పాట మళ్లీ తయారయ్యింది) ఎ) రానా బి) నాగచైతన్య సి) అఖిల్ డి) సుశాంత్ 14. ‘విష్ణు’ చిత్రంతో హీరోగా మంచు విష్ణు కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో యన్టీఆర్, సావిత్రి నటించిన ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ..’ పాటను రీమిక్స్ చేశారు విష్ణు. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మిస్సమ్మ బి) మాయాబజారు సి) దేవత డి) గుండమ్మ కథ 15. ‘ము, ము, ము, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా...’ పాట అక్కినేని హీరోగా నటించిన ‘అదృష్టవంతులు’ చిత్రంలోనిది. ఆ పాటను హీరో నాగార్జున సినిమాలో వాడారు. నాగార్జున సరసన హీరోయిన్గా నటించిన ఆ భామ ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) మీనా సి) ప్రియమణి డి) మమతా మోహన్‌దాస్ 16. ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు, నేను రోమియోగా మారినది లగాయతు..’ పాట 1993లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చింది. 2018లో ‘సవ్యసాచి’ సినిమాలో ఆ పాట రీమిక్స్‌కు నాగచైతన్య, నిధీ అగర్వాల్ కాలు కదిపారు. 1993లో సినిమాకు, 2018లో సినిమాకు సంగీత దర్శకుడు ఒక్కరే. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? ఎ) ఇళయరాజా బి) యం.యం. కీరవాణి సి) మణిశర్మ డి) కోటి 17. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘పచ్చనికాపురం’. ఈ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘వెన్నెలైనా చీకటైనా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు శిరీష్ బి) సునీల్ సి) సుధీర్‌బాబు డి) తరుణ్ 18. ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ పాట ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రంలోనిది. ‘అందం ఇందోళం, అధరం తాంబూలం’ పాట ‘యమకింకరుడు’ చిత్రంలోనిది. ఈ రెండు పాటలు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లోనివే. ఆ పాటలను రీమిక్స్ చేసిన హీరో ఎవరు? ఎ) వరుణ్ తేజ్ బి) అల్లు అర్జున్ సి) సాయిధరమ్ తేజ్ డి) రామ్‌చరణ్ 19. ‘ఇప్పటికింకా నా వయసు 26లే, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్లికి తయ్యారే..’ పాట కృష్ణభగవాస్, రఘుబాబు హీరోలుగా నటించిన కామెడీ సినిమాలోనిది. ఆ సినిమాలో వాళ్లిద్దరూ ఏ హీరోయిన్ను ఉద్ధేశించి ఈ పాట పాడుకున్నారో తెలుసా? ఎ) సౌందర్య బి) రజని సి) రంభ డి) సంఘవి 20. ‘ఆర్య’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ‘ఆ అంటే అమలాపురం’ పెద్ద హిట్. ఆ పాటను హిందీ చిత్రం ‘మాగ్జిమమ్’ కోసం వాడారు. హిందీలో ఈ ఐటెమ్ సాంగ్‌కు కాలు కదిపిన భామ ఎవరు? ఎ) కత్రినాౖ కెఫ్ బి) కరీనా కపూర్ సి) మలైకా అరోరా డి) హజెల్ కీచ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) ఎ 4) డి 5) ఎ 6) సి 7) డి 8) ఎ 9) డి 10) బి 11) ఎ 12) బి 13) డి 14)ఎ 15) డి 16) బి 17) సి 18) సి 19) సి 20) డి నిర్వహణ: శివ మల్లాల -
సరికొత్త సిరివెన్నెల
‘పెళ్లైన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ప్రియమణి. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైన ఆమె ప్రస్తుతం ‘సిరివెన్నెల’ అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కో ఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని బుధవారం ప్రియమణి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారు ‘సిరివెన్నెల’ అనే గొప్ప సినిమా తీశారు. అయితే మా సినిమా థ్రిల్లర్, హారర్ జోనర్ అయినప్పటికీ కథకు సరిగ్గా సరిపోతుంది కాబట్టి ‘సిరివెన్నెల’ అని టైటిల్ పెట్టాం. టాకీపార్ట్ పూర్తయ్యింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రియమణిగారు కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత తెలుగుసినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి ‘సిరివెన్నెల’ కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కథలో అతీంద్రియ శక్తులకి సంబంధించిన విషయాలు నేర్చుకునే ప్రాసెస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ థ్రిల్లింగ్‌గా చెప్పారు’’ అన్నారు. ‘‘కీరవాణిగారి దగ్గర నేను ‘బాహుబలి 2’ సినిమా వరకు మేనేజర్‌గా పని చేసాను. మా నిర్మాత కమల్‌గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఇది మా తొలి సినిమా అయినా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒకరైన బాషా అన్నారు. -
మీటూని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు
‘‘ప్రస్తుతం నడుసున్న ‘మీటూ’ ఉద్యమం చాలా నిజమైనది. ఇలాంటి ఉద్యమాలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతుంటాయి’’ అని అన్నారు ప్రియమణి. ‘మీటూ’ ఉద్యమం గురించి ప్రియమణి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. అలానే మిగతా స్త్రీలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇలా ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాట్లాడగలిగితే ఇలాంటి విషయాల మీద మిగతావారిలో అవగాహన తీసుకురావచ్చు. పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పొచ్చు. అలాగే ‘మీటూ’లాంటి మంచి కార్యక్రమాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. మీటూ అనేది ఓ జెన్యూన్ ప్లాట్‌ఫారమ్. పబ్లిసిటీ కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు’’ అని పేర్కొన్నారామె. -
లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే!
ఈ సన్నివేశం సినిమాల్లో బాగా చూసి ఉంటారు.హీరోయిన్ వెళ్లిపోతుంటే హీరో చూస్తుంటాడు.ఫ్రెండ్‌తో చెబుతాడు – అమ్మాయి తిరిగి చూసిందంటే లవ్‌లో పడినట్లే అని.అమ్మాయి తిరిగి చూస్తుంది. ఆడియన్స్ కూడా హీరోలాంటి వాళ్లే.ఏ హీరోయిన్ తిరిగి వచ్చినా..ఏ హీరో రిటర్న్ ఇచ్చినా లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీతో పాటు రీఎంట్రీ కూడా ఉంటుంది. చనిపోయాడనుకున్న హీరో సెకండ్‌హాఫ్‌లో బతికి కనిపించినట్టే తెరమరుగైపోయారనుకున్న తారలు ఒక్కసారిగా మళ్లీ స్క్రీన్ మీద తళుక్కుమని మెరవడానికి వస్తారు. ఒక్కోసారి ఎంట్రీలోని ఇమేజ్ కన్నా రీఎంట్రీలోని క్రేజ్ వారిని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి వంటి మెగాస్టారే బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చినప్పుడు.. పెళ్లి, బాధ్యతలు, సరైన పాత్రలు రాకపోవడం వంటి కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నవారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముంది? సీనియర్ నటి జయప్రదతో పాటు ఇలియానా, లయ, ప్రియమణి, సంగీత, భాగ్యశ్రీ, హీరో ఆర్యన్ రాజేశ్ తదితరులు టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. టేక్‌కి రెడీ అంటున్నారు. జయప్రదం ‘ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం’.. అన్న జయప్రద ఆ తర్వాత దశ తిరిగి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నారు. 1970ల చివరలో 1980లలో ఆమె స్టార్ హీరోయిన్. అయితే ఇక్కడ కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లిపోయి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు. ఆ తర్వాత కొత్తతరం రావడం, రాజకీయాల్లో బిజీ కావడం తదితర కారణాల వల్ల తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం జరగలేదు. ‘సాగర సంగమం’, ‘దేవత’ వంటి మంచి సినిమాలు చేసిన జయప్రద తెలుగు సినిమాలో మళ్లీ కనిపిస్తే ప్రేక్షకులకు అదే పెద్ద ఆనందం.పి.వాసు దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘మహారథి’లో కీలక పాత్రలో నటించిన ఆమె 11ఏళ్ల తర్వాత ‘శరభ’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్.నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆమెను తెలుగులో బిజీ చేస్తుందని ఆశిద్దాం. సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే ‘సువర్ణ సుందరి’ అనే మరో తెలుగు చిత్రంలోనూ జయప్రద ముఖ్యమైన పాత్ర చేశారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా రెండు సినిమాలతో జయప్రదంగా ఆమె రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందం. గోవా బ్యూటీ వచ్చేశారు ‘దేవదాసు’ ఆ వెంటనే ‘పోకిరి’ సినిమాతో యూత్ గుండె గోడల మీద పోస్టర్ గర్ల్‌గా నిలిచారు ఇలియానా. ఆ తర్వాత మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ .. వంటి హీరోలందరితో జోడీ కట్టారు. ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. టాలీవుడ్లో అతి తక్కువ టైమ్‌లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్గా ఆమెకు పేరుంది.2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌కి బై చెప్పి ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయారామె. ఆరేళ్ల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటొని’ (అఅఆ)తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారైన ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఈ నెల 16న రిలీజైంది. ఇలియానా టాలీవుడ్‌కి వచ్చిన 12ఏళ్లలో తొలిసారి ‘అఅఆ’కి డబ్బింగ్ చెప్పారు.ఈ రీఎంట్రీతో ఆమె మరిన్ని సినిమాలు చేస్తారని చెప్పవచ్చు. ప్రియమైన వెన్నెల ప్రియమణి తెలుగు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హుషారైన బాడీ లాంగ్వేజ్‌తో, అందమైన చిరునవ్వు, యాక్టింగ్ టాలెంట్‌తో ముఖ్యమైన హీరోలతో పని చేసిన ప్రియమణి ఎక్కువ కాలం తెలుగు మీద ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ఎక్కువ సమయం హీరోయిన్గా నిలవలేదనీ చెప్పాలి. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను సుడిగాలిలా చుట్టి ఖాళీ అయిన ఈ నటి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుక్ ఖాన్‌తో ఐటమ్ సాంగ్ చేసి తానున్నట్టు రిఫ్రెష్ బటన్ నొక్కారు. 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మైనే ఫిర్ ఆగయీ భాగ్యశ్రీని చూసి కనీసం అరకోటి మంది అబ్బాయిలైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు ‘మైనే ప్యార్ కియా’ సమయంలో. అయితే ఆమె సినిమాల్లో కంటిన్యూ కాకుండా హిమాలయ్ను భర్తగా చేసుకుని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో ‘ఓంకారమ్’, ‘రాణా’ సినిమాల్లో ఆమె నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998లో వచ్చిన ‘రాణా’ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ 20ఏళ్ల తర్వాత ‘2 స్టేట్స్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. టాలీవుడ్ కే పాస్ మై ఫిర్ ఆగయీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగ్యశ్రీ. తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలి పాత్రలో లయ నటించారనడం కంటే జీవించారనడం కరెక్టేమో. 1992లో అక్కినేని కుటుంబరావ్ దర్శకత్వంలో వచ్చిన ‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా మారారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి, అలరించారు. ‘మనోహరం, ‘ప్రేమించు’ చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2010లో ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయిపోయారు. చాలా రోజులుగా లయ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు లయ. ఈ చిత్రంతోనే లయ కూతురు శ్లోక బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఒకే సినిమాతో తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ .. ప్రేక్షకులకు డబుల్ ధమాకాయే కదా! ఆరేళ్ల తర్వాత హాయ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘హాయ్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హాయ్ చెప్పారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేశారు.రామకృష్ణ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు. ఆరేళ్ల తర్వాత తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ (రామ్‌చరణ్) సోదరుని పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. పద్మావతి వస్తున్నారహో... సంగీత మంచి డాన్సర్, నటి. ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలోని ‘పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే.. దగ దగ ముద్దొస్తున్నావే’ పాట ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. 1999లో ‘ఆశల సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘సంక్రాంతి’ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వచ్చిన ‘కారా మజాకా’ చిత్రంలో నటించిన సంగీత ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు. 8 ఏళ్ల విరామం తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారామె. ‘‘తెలుగులో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్.. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు సంగీత. పాతికేళ్ల తర్వాత టాలీవుడ్‌కి... ‘సాక్షి’, ‘మగాడు’, ‘దోషి..నిర్దోషి’, ‘20వ శతాబ్దం’... తదితర చిత్రాలతో 1990వ దశకంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని టాలీవుడ్‌కి దూరంగా ఉండిపోయారు. 25ఏళ్ల తర్వాత ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా అడివి శేష్, శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న ‘2 స్టేట్స్’ సినిమాలో లిజీ ఓ కీలక పాత్ర చేసేందుకు అంగీకరించారని వార్త. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ 11 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించారు. ఇక 1980లో ‘మా భూమి’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిచంద్ చిరంజీవితో ‘మంచు పల్లకీ’తో పాటు అనేక చిత్రాల్లో నటించారు. 1989లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదాయన. 27ఏళ్ల తర్వాత ‘ఫిదా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. దాంతో ‘మంచుపల్లకీ’ తర్వాత 36 ఏళ్లకు చిరంజీవి, సాయిచంద్ కలిసి నటించినట్టవుతుంది ఈ సినిమాతో. – ఇన్పుట్స్: డేరంగుల జగన్ -
సిరివెన్నెల
తెలుగు తెరపై ప్రియమణి కనిపించి రెండేళ్లయింది. ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే ఏ తెలుగు చిత్రంలో నటించలేదు. గతేడాది ముస్తఫా రాజ్‌ని పెళ్లాడిన ప్రియమణి కెరీర్‌పై కూడా బాగానే ఫోకస్ చేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత ఈ సినిమా నిర్మించనున్నారు. తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్‌ని ప్రియమణి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి మా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శక–నిర్మాతలు చెప్పారు. సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, ‘రాకెట్’ రాఘవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.