ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌ | Priyamani Sirivennela Movie Trailer Released | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

Published Mon, Jul 22 2019 7:51 PM | Last Updated on Mon, Jul 22 2019 7:53 PM

Priyamani Sirivennela Movie Trailer Released - Sakshi

హారర్‌ మూవీస్‌ ఎప్పుడూ వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కథనాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే.. సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హారర్‌ చిత్రాలకు ఏ సీజన్‌తో పని ఉండదు.. కాస్త పాజిటివ్‌ టాక్‌ వస్తే హిట్‌ గ్యారంటీ. అందుకే మన వాళ్లు హారర్‌ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది.

మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని (రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలు), ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరివెన్నెల ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ అయింది. ఈ ట్రైలర్‌లో డైలాగ్స్‌ హైలెట్‌గా నిలిచాయి. కమల్‌ బోహ్రా, ఏఎన్‌బి కోఆర్డినేటర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్‌ పులిజాల తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement