రానా దగ్గుబాటి
కేరళ అడవుల్లోకి మకాం మార్చారు రానా దగ్గుబాటి. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారని తెలిసింది. తన కొత్త చిత్రం ‘విరాట పర్వం’ షూటింగ్ కోసమే ఈ కేరళ మకాం. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: డాని సాంచెజ్–లోపెజ్.
Comments
Please login to add a commentAdd a comment