
ప్రజలను అలరించే కథ, కథనంతో విరాట పర్వం సినిమా రూపొందిందని సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. విరాట పర్వం అందమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
ఈ సినిమాలో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని చెప్పారు. మంచి కథ ఉంటే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనని రానా స్పష్టం చేశారు. తన తాత దగ్గుబాటి రామానాయుడు జన్మదినం రోజున విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పల్లెటూరి యువతిగా నటించానని, గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయటం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చుండూరి మాట్లాడుతూ.. 1990లో జరిగిన ఓ యువతి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
– గుణదల (విజయవాడ తూర్పు)
చదవండి: (విరాటపర్వం ట్రైలర్: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా)
Comments
Please login to add a commentAdd a comment